బినామీ మస్తర్లకు చెక్..!
విజయనగరం ఫోర్ట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బినామీ మస్తర్లకు చెక్‌పెట్టేందుకు కేంద్రప్రభుత్వం హాజరు నిబంధనలను కఠినతరం చేసింది. ఎన్‌ఈఎంఎస్ ( నేషనల్ ఎలక్ట్రానిక్ మస్టర్ షీట్)ను తప్పనిసరి చేసింది. ప్రతిరోజు పనిచేసే చోట ఫొటో తీసి ఎన్‌ఈఎంఎస్‌ను ఆన్‌లైన్‌లో హాజరు వేయాలి. కొంతమంది ఉపాధి హామీ సిబ్బంది సెల్‌ఫోన్‌లు పనిచేయడం లేదని, సర్వర్ సమస్య ఉందని చెప్పి హాజరును సాధారణ పద్ధతిలో వేసేవారు. బినామీ మస్తర్లు వేసి నిధులు కై ంకర్యం చేసేవారు. ఇకపై ఎన్‌ఈఎంఎస్‌లో హాజరు వేసిన వారికి మాత్రమే వేతనాలు చెల్లిస్తారు. జిల్లాలో 3.45 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 6.05 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో రోజుకి సుమారు 60 వేల నుంచి 80 వేల మంది వరకు వేతనదారులు ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారు. వీరందరికీ ఇకపై ఎన్‌ఈఎంఎస్‌లోనే హాజరు వేయాలని, సాధారణ పద్ధతిలో వేస్తే పరిగణనలోకి తీసుకోమని డ్వామా పీడీ ఎస్.శారదాదేవి తెలిపారు.
● ఎన్‌ఈఎంఎస్ హాజరు తప్పనిసరి చేసిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment