బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న అనుజ్ఞారెడ్డి వర్గీయులు
సమష్టిగా ముందుకెళ్తాం :
అశ్వత్ధామారెడ్డి
వనపర్తి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ తనను ప్రకటించడంతో పార్టీలోని సీనియర్ నాయకులు మనస్తాపానికి గురయ్యారని, వారిని కలిసి మాట్లాడుతున్నానని అశ్వత్థామారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను అరికట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. దేశంలో ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించి గెలుపొందారని.. నియోజకవర్గ ప్రజల కష్టాలు సైతం బీజేపీ అధికారంలోకి వస్తేనే తీరుతాయని వివరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. రాజవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, సుమిత్ర, కోశాధికారి బాశెట్టి శ్రీను, సర్వేశ్వర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము, బుచ్చిబాబుగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ పెద్దిరాజు, నాయకులు దేవేందర్, రమేష్, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వనపర్తిటౌన్: బీజేపీ అభ్యర్థిగా అశ్వత్థామారెడ్డిని ప్రకటించడం సరైంది కాదని బీజేపీ, బీజేవైఎం నాయకులు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న అనుజ్ఞారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు అశ్వత్థామారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థితో అనుజ్ఞారెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. అధిష్టానం పునరాలోచించాలని కోరారు.
బీసీలకు అన్యాయం : బి. కృష్ణ
వనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అశ్వత్థామారెడ్డి బరిలో ఉంటే 3 వేల ఓట్లు కూడా పడవని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏనాడు వనపర్తిలో జెండా పట్టని అశ్వత్థామారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. బీసీ అయిన తనకు అవకాశం దక్కుతుందని అందరూ ఆశించారని, అధిష్టానం అవకాశం ఇస్తామని.. క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాలని చెప్పి చివరి నిమిషంలో అనూహ్యంగా అశ్వత్థామారెడ్డి పేరు ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేస్తానని, బీసీలకు కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.పరశురాం, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి జ్యోతి, కౌన్సిలర్ రమాదేవి పాల్గొన్నారు.
బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన
అశ్వత్థామారెడ్డికి టికెట్ సరికాదంటూ నినాదాలు
Comments
Please login to add a commentAdd a comment