పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం..
పాలమూరు నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయం ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు నష్టం చేస్తుంది. ఇప్పటికే శ్రీశైలం, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి పథకాల్లో ఎంతో మంది రైతులు భూములు కోల్పోయారు. ఏదుల–డిండి మళ్లీ ఆ రైతులను ముంచుతుంది. వెనుకబడ్డ మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాల సాగునీటి హక్కును హరిస్తుంది. రైతుల మధ్య వైరానికి దారితీస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన ముందుకు పడకుండా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి చొరవ తీసుకున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయన మళ్లీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిండికి పాలమూరు నీటి తరలింపును ఒప్పుకోం. – రాఘవాచారి,
పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment