హన్మకొండ : గెజిటెడ్ అధికారుల సంఘాల్లో సభ్యత్వాలు తీసుకోవద్దని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి సూచించారు. గెజిటెడ్ అధికారులు ఏర్పాటు చేసుకున్న సంఘాల్లో సభ్యత్వాలు స్వీకరిస్తున్నారని, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఆయా సంఘాలకు దూరంగా ఉండాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి నాయబ్ తహసీల్దార్ వరకు ఒక సంఘం, రికార్డు అసిస్టెంట్ నుంచి తహసీల్దార్ వరకు అని మరో సంఘం అంటున్నాయని ఆయా సంఘాల్లో నాన్ గెజి టెడ్ ఉద్యోగులకు ఏ జిల్లాలోనైనా జిల్లా అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శి పదవి ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేవలం సంఖ్యా బలానికి మాత్రమే నాన్ గెజి టెడ్ ఉద్యోగులను వాడుకుంటున్నారని తెలిపారు.
నాన్ గెజిటెడ్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు రవి
Comments
Please login to add a commentAdd a comment