కార్యకర్తలను కాపాడుకుంటా
రాయపర్తి: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త ఎండీ మల్సూరు మృతిచెందాడు. మంజూరైన పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా రూ.2 లక్షలను ఆయన కుటుంబానికి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం అందించారు. అనంతరం దయాకర్రావు మాట్లాడుతూ ఇటీవల దేవరుప్పులలో నష్టపోయిన రైతుకు రూ.5 లక్షలు, పాలకుర్తిలో చనిపోయిన శ్రీను కుటుంబానికి రూ.3 లక్షలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అందించినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment