ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఎంజీఎం : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2024–25 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం బుధవారం రాత్రి నగరంలోని ఐఎంఏ హాల్‌లో వైభవంగా నిర్వహించారు. ముందుగా ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు దిలీప్ బాన్సలీ, రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకాంతరెడ్డి, ఎన్‌ఏటీసీఓఎన్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, కాళీప్రసాద్, శేషుమాధవ్‌తో పాటు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, నూతన కార్యవర్గ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ అన్వర్ దగ్గరి నుంచి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ నాగార్జునరెడ్డి అధ్యక్ష మెడల్‌ను స్వీకరించారు. అనంతరం డాక్టర్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వైద్యుడిగా ప్రభుత్వ విధులతోపాటు ఐఎంఏకు సైతం తన పూర్తి సహకారం అందిస్తానన్నారు. ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ ఐఎంఏ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు వైద్యులు, వైద్యవిద్యార్థులకు అండగా నిలుస్తూ మందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శి అజిత్ మహ్మద్, ఆర్థికశాఖ కార్యదర్శి శిరీష్‌కుమార్, ఉపాధ్యక్షులు శీరష, నరేశ్‌కుమార్, సంయుక్త కార్యదర్శులు స్వప్న చౌరన్, రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. వేడుకల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతి నిధులు ప్రవీన్, తెలుగు రామకృష్ణ, బందెల మోహ న్‌రావు, వద్దిరాజు రాకేశ్, హరి సంధ్యారాణి, సుదీప్, బాలాజీ, కస్తూరి ప్రమీల, పిల్లి సాంబశివరావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment