గ్రామీణ క్రీడాకారులు రాణించాలి
చెన్నారావుపేట: మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి (డీవైఎస్‌ఓ) సత్యవాణి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హైస్కూల్‌లో బుధవారం రెండోరోజు మండలస్థాయి పోటీలు కొనసాగాయి. క్రీడలను డీవైఎస్‌ఓ సత్యవాణి పరిశీలించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని ఉల్లాసంగా క్రీడలు ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు నిచ్చేందుకు ఈ క్రీడలు దోహదపడుతాయని అన్నారు. ఇదేస్ఫూర్తితో జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. మండల క్రీడల ఇన్‌చార్జ్ వీరగోని స్వప్న మాట్లాడుతూ కబడ్డీ పురుషుల విభాగంలో మొదటి స్థానం ఉప్పరపల్లి, రెండోం స్థానంలో సిద్ధార్థ హైస్కూల్, కబడ్డీ మహిళల విభాగంలో మొదటి స్థానం అమీనాబాద్, రెండో స్థానం పాపయ్యపేట, వాలీబాల్ పురుషుల విభాగంలో మొదటి స్థానం అమృతండా, ద్వితీయ స్థానంలో సిద్ధార్థ హైస్కూల్, మహిళల విభాగంలో మొదటి స్థానం అమృతండా, ద్వితీయ విభాగం అమీనాబాద్, ఖోఖో పురుషుల విభాగంలో ప్రథమ స్థానం ఉప్పరపల్లి, ద్వితీయ స్థానం అమృతండా, మహిళల విభాగంలో ప్రథమ ఉప్పరపల్లి, ద్వితీయ స్థానంలో కేజీబీవీ నిలిచిందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీవాణి, సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి, హెచ్‌ఎం అండెం కర్ణాకర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు భిక్షపతి, రమేశ్, కమలమ్మ, మంజుల, నర్సింహలు పాల్గొన్నారు.
ప్రతిభను వెలికితీసేందుకే పోటీలు
నెక్కొండ: గ్రామీణ క్రీడాకార్లుల్లో ప్రతిభను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోందని జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి అన్నారు. మండల కేంద్రంలోని విద్యోదయ గురుకుల పాఠశాలలో రెండో రోజు బుధవారం కొనసాగిన క్రీడాపోటీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆమె పరిచయం చేసుకుని, మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సీఎం కప్ పోటీలు గొప్ప అవకాశమన్నారు. ప్రతి విద్యార్థి పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రశాంత వాతావరణంలో క్రీడలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, పరిశీలకుడు రవికుమార్, పీఈటీలు, గ్రామ కార్యదర్శులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా యువజన,
క్రీడల అధికారి సత్యవాణి
Comments
Please login to add a commentAdd a comment