ఆలస్యం వద్దు.. వేగం పెంచండి
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఆ పనుల్లో వేగం పెంచి పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ట్రైసిటీకి సుమారు రూ.5,215.78 కోట్లు ప్రకటించారు. ఇందులో ప్రధానమైనది అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కాగా, మామునూరులో ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్, భద్రకాళి చెరువు, ఆలయ అభివృద్ధి తదితర పనులున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి పనుల వేగం మరింత పెంచేందుకు రెవెన్యూ, హౌసింగ్ శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో జిల్లా మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పొంగులేటి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి పాదించిన ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన తయారు చేయాలని సూచించారు. వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని, భద్రకాళి చెరువు శుద్ధీకరణపనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి, మైనింగ్‌శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్‌లు డాక్టర్ సత్య శారద, పి.ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.
సరిపడా నిధులొచ్చాయి.. డీపీఆర్‌లు సిద్ధం చేయండి
నేషనల్ హైవేలకు కనెక్టయ్యేలా
ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్‌లు
మామునూరు, భద్రకాళి చెరువు
పనుల్లో స్పీడ్ పెంచండి
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
‘గ్రేటర్’పై మంత్రి కొండా సురేఖ,
వేం నరేందర్, అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment