ఎల్కతుర్తి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
రూ.
కోట్లలో
2020–21
వసూలైనవి
వరంగల్ అర్బన్: నల్లా, ఆస్తి పన్నుల వసూళ్లలో గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం అలక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏటేటా పేరుకుపోతున్న నల్లా, ఆస్తి పన్నుల బకాయిలు పెరిగిపోతున్నప్పటికీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు తమకేమీ పట్టదన్నట్లుగా చూస్తున్నారు. నాలుగేళ్లుగా పాత బకాయిలు (ఎరి యర్స్) కోట్లల్లో పేరుకుపోయాయి. గ్రేటర్ వరంగల్ పాలక వర్గం పెద్దలు, ఉన్నతాధికారులు కూడా ఈ బకాయిలపై నోరుమెదకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాత బకాయిలు రూ.38 కోట్లు
కొన్నేళ్లుగా నల్లా పాత బకాయిలు ఏళ్ల తరబడిగా పేరుకుపోతున్నాయి. మొత్తం రూ.41.55 కోట్లు బకాయిలు ఉండగా.. ఈ ఏడాది రూ.3.54 కోట్లు వసూలు చేశారు. ఇంకా.. రూ.38.01 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పాత, కొత్త బకాయిలు మొత్తం రానున్న మూడు నెలల్లో రూ. 56.95 కోట్లు రాబట్టాల్సి ఉంది.
బాధ్యతారాహిత్యం
నగరంలో తాగునీటి సరఫరా బాధ్యత ఇంజినీర్లదే. కొత్త నల్లా కనెక్షన్లు మంజూరు చేసి, కనెక్షన్ ఇస్తారు. అయితే పన్నులు వసూలు చేసే బాధ్యత బల్దియా విభాగానికి ఉందా?. దీంతోనే అసలు సమస్య వస్తోంది. నల్లా నీళ్లు రావడం లేదని ప్రజలు పన్ను కట్టేందుకు ఇష్టపడడం లేదని ఆర్‌ఐలు చెబుతున్నారు. ఈ కారణంగా ఏటేటా బకాయిలు పేరుకుపోతున్నాయి ఆస్తి, నీటి పన్నులను కలిపి డిమాండ్ నోటీసు జారీ చేస్తున్నారు. కానీ ఇంటి పన్ను వసూలుపై పెడుతున్న చొరవ నల్లా సొమ్ము వసూలు చేయడంపై పెట్టడం లేదు. ఏఈ, డీఈలు, ఈఈలు, చివరకు ఎస్‌ఈ స్థాయి అధికారి వరకు బకాయిలపై దృష్టిసారించడం లేదు.
న్యూస్‌రీల్
గ్రేటర్‌లో రూ.56.95 కోట్ల నల్లా బకాయిలు
నిద్ర మత్తులో అధికార యంత్రాంగం
కేవలం 14.84 శాతం వసూలు
నగర ప్రజలకు తాగునీరందించడం బల్దియాకు రోజు రోజుకూ భారమవుతోంది. జనాభా 12 లక్షలకు చేరింది. నల్లా కనెక్షన్ల సంఖ్య 1,77,804 ఉన్నాయి. తాగునీటి సరఫరా కోసం ఏడాదికి రూ. 30 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. డిమాండ్ మాత్రం రూ.25.32 కోట్లు ఉంది. అందులో కేవలం రూ.12 కోట్ల నుంచి 14 కోట్లు దాటడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 9 నెలలు పూర్తి కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు రూ.6.38 కోట్లు మాత్రమే వసూలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment