అంధుల జీవితాల్లో అక్షరాల వెలుగులు
తెలుగు మాస్టారుగా ప్రశంసలు
కై కలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గాజుల సురేష్ అంధుడు. నరసాపురం అంధుల పాఠశాలలో పది వరకు చదివారు. ఇంటర్, డిగ్రీ, బీఈడీ హైదరాబాదులో చేశారు. ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. తెలుగు మాస్టారుగా చక్కటి పేరు తెచ్చుకున్నారు. తాటిపాక హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న అంధురాలు సుజాతను వివాహం చేసుకున్నారు. బ్రెయిలీ లిపితోనే ఈ స్థాయికి చేరానని సురేష్ చెబుతుంటారు.
●
రాష్ట్రపతి నుంచి అవార్డు
అన్నింటా మేటి అన్న పదానికి నిలువెత్తు నిదర్శం కై కలూరుకు చెందిన అంధురాలు జ్యోత్స్న ఫణిజా. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రస్తుతం సీనియర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె నరసాపురం అంధుల పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లీషులో లిటరేచర్ చేశారు. టీవీ ఛానల్స్ నిర్వహించిన పాటల పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు. పుస్తకాలు రాశారు. మారథాన్ పోటీలలో విజయం సాధించారు. కంప్యూటర్ నాలెడ్జ్‌లో దిట్ట. రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. బ్రెయిలీ చేసిన కృషి ఎంతో మందికి దారి చూపిందని జోత్స్న చెబుతారు.
కై కలూరు: అంధత్వం చదువును దూరం చేయకుండా.. ఆ చదువులు వారి జీవితాల్లో వెలుగులు నింపేలా లూయిస్ బ్రెయిలీ కనిపెట్టిన లిపి ఒక అద్భుతం. ఎందరో అంధులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ బ్రెయిలీ లిపి మార్గం చూపింది. కంటి చూపు లేకపోయినా బ్రెయిలీ లిపితో కలెక్టర్ల స్థాయికి ఎదిగారు. విద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇలా అనేక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఏటా జనవరి 4న బ్రెయిలీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జిల్లా భవిత కేంద్రాల్లో బ్రెయిలీ లిపిపై శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అంధుల కోసం ప్రత్యేక పాఠశాలలు
పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటర్ వరకు చదువుతున్న వారిలో 329 మంది విద్యార్థులకు దృష్టి లోపం, మరో 221 మందికి అంధత్వం ఉంది. మన రాష్ట్రంలో నరసాపురం, భీమవరం, విశాఖపట్నం, రాజమండ్రి, నరసారావుపేట, గరివిడి, బొబ్బిలి వంటి ప్రాంతాల్లో అంధుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పదో తరగతి వరకు బ్రెయిలీ లిపిలో బోధిస్తారు. భవిత సెంటర్లు, ఉన్నత పాఠశాలల్లో బ్రెయిలీలో శిక్షణ పొందిన టీచర్లు బోధిస్తున్నారు.
ప్రభుత్వమే పుస్తకాలు అందించాలి
బ్రెయిలీ లిపి పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేయాలని పలువురు అంధులు కోరుతున్నారు. గుంటూరులో బ్రెయిలీ ప్రెస్ ఉపయోగంలో లేదు. అనంతపురం, హైదరాబాదు, బెంగుళూరు నుంచి ఆయా సబ్జెక్టుల పుస్తకాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తరఫున బ్రెయిలీ ప్రెస్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా పుస్తకాలు అందించాలని కోరుతున్నారు. తెలంగాణ జిల్లా మహబూబాబాద్‌లో ఇంటర్, హైదరాబాదు చిన్న జీయర్ కాలేజీలో డిగ్రీ వరకు బ్రెయిలీ లిపిలో బోధన చేస్తున్నారు.
నేడు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
ఉద్యోగాల్లో సత్తా చాటుతున్న అంధులు
రెండేళ్లు శ్రమించి బ్రెయిలీ లిపి రూపకల్పన
లూయిస్ బ్రెయిలీ 1829లో ఫ్రాన్స్‌లో జన్మించాడు. చిన్న వయసులోనే చూపు కోల్పోయాడు. అక్షరం, సంఖ్య సూచించడానికి ఆరు చుక్కలను ఉపయోగించి స్పర్శ ద్వారా గుర్తించేలా కోడ్ కనుగొన్నారు. దీనిని సాధించడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. అతి చిన్న వయసులోనే లూయిస్ మరణించాడు. ఆయన మరణాంతరం ఇది విశేషంగా అమలులోకి వచ్చింది. ప్రస్తుతం బ్రెయిలీ కోడ్ ద్వారా గణితం, సంగీతం, కంప్యూటర్ ప్రొగ్రాం చదవడం, రాయడం చేయవచ్చు. అంధుల కోసం ఎన్‌వీడీఏ, జాష్ వంటి స్క్రీన్ రీడర్స్, అండ్రాయిడ్ ఫోన్‌లో టాక్ బ్యాక్ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment