విద్యుత్‌ ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ

Published Sat, Jan 4 2025 1:02 AM | Last Updated on Sat, Jan 4 2025 1:02 AM

-

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్‌ భవన్‌లో, జంగారెడ్డిగూడెం కార్యాలయంలో ఈ నెల 7, 8, 10వ తేదీల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ పీ సాల్మన్‌ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడ బృందావన్‌ కాలనీలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌, ఈ నెల 10న కర్నూలు కమిషన్‌ ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రత్యక్ష హాజరు ద్వారా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రతిరోజు అన్ని డిస్కంల టారిఫ్‌ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు వింటుందన్నారు. సందేహాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వినియోగదారులెవరైనా పాల్గొనవచ్చని, ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ కోసం స్థానిక విద్యుత్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ కార్యాలయంలో(ఎస్‌ఈ ఆఫీస్‌) లేదా ఏదైనా విద్యుత్‌ డివిజనల్‌ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement