దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడిలోకి
భీమడోలు: తిరుపతి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో కారు డ్రైవర్ మృతిచెందాడు. జాతీయ రహదారిపై భీమడోలు మండలం అంబర్‌పేట పంచాయతీ శివారు కొండ్రెడ్డినగర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గుబ్బ తిరుపతి స్వామి(56) మృతి చెందాడు. ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన గుబ్బ తిరుపతి స్వామి కారులో గంటా గోవింద్ కుటుంబానికి చెందిన అమలావతి, అలేఖ్య, లక్ష్మీ, సందీప్, అవినాష్ ఈనెల ఒకటిన తిరుపతి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కొండ్రెడ్డినగర్ వద్ద ట్రాలీ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఇది గమనించని కారు డ్రైవర్ గుబ్బ తిరుపతి స్వామి అతివేగంగా వెనుక నుంచి లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయాలైన తిరుపతి స్వామి(56)ని హైవే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదంలో తీవ్రగాయాలైన గంటా అమలావతిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిలిగిన ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి అల్లుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment