కరాటే, కర్రసాము పోటీల్లో ప్రతిభ
భీమవరం అర్బన్: గత నెల డిసెంబర్ 29 నుంచి 31 వరకు తమిళనాడులోని కొయంబత్తూరులో జరిగిన కర్రసాము, కరాటే పోటీలలో భీమవరం, నరసాపురం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డు సృష్టించారని కరాటే శిక్షకుడు జె.విజయ భాస్కర్ తెలిపారు. మండలంలోని చినఅమిరంలోని కరాటే ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. పోటీల్లో భీమవరం నుంచి కరాటే విద్యార్థులు టి.సాత్విక్, బి.రిషిక్, కె.అభిలాష్, ఎస్.జాతిన్, పి.జాన్సిలాల్ నారాయణ, నరసాపురం విద్యార్థులు సీహెచ్ ఎస్తేరు రాణి, సీహెచ్ కుషల్ హరిహరన్, అబ్దుల్, ఎమ్.చైతన్యలు పాల్గొని కర్రసాములో ఏకధాటిగా గంట సేపు తమ ప్రతిభను చాటి రికార్డు సృష్టించి మెడల్స్ సాధించారన్నారు. కర్రసాము, కరాటేలో ప్రతిభ సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment