ట్రిపుల్ ఐటీలో టెక్ హ్యాకథాన్ పోటీలు
నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆర్జీయూకేటీ స్థాయి ఫేజ్–2 టెక్ హ్యాకథాన్ పోటీలను శుక్రవారం ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య ఎం.విజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణ, ఆచరణాత్మక సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించడానికి ఇలాంటి ఈవెంట్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి హ్యాకథాన్ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇన్వెంటిజ్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు మన్నె ఇంద్రజిత్ మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనడానికి ఈ తరం విద్యార్థులు చేస్తున్న కృషిని అభినందించారు. వినూత్న మొబైల్ అప్లికేషన్ల తయారీ ఈ హ్యాకథాన్ పోటీల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ డీ శ్రావణి, సెంట్రల్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ పీ శ్యామ్, డీన్ అకడమిక్స్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై కేసు
భీమవరం : భీమవరం వన్‌టౌన్ పరిధిలో శుక్రవారం బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 2న గునుపూడికి చెందిన బాలిక పట్ల జామి రవి, పోతునూరి వినమ్, జామి దుర్గారావు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు వారిని పశ్నించారు. రవి, వినమ్, దుర్గారావులు తమను కొట్టి గాయపరిచారంటూ బాలిక చిన్నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక చిన్నాన్న పాత గొడవలు పురస్కరించుకుని కొట్టి గాయపరిచాడని దుర్గారావు కూడా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
30 కాసుల బంగారం చోరీ
భీమవరం: భీమవరం రెండో పట్టణ పరిధిలో శుక్రవారం తాళంవేసి ఉన్న ఇంట్లో 30 కాసుల బంగారం చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండో పట్టణ పరిధి అడ్డవంతెన సమీపంలోని కె.రాంబాబు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి గత నెల డిసెంబర్ 20న హైదరాబాద్ వెళ్లారు. జనవరి 2న తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో వెంటనే బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. 30 కాసుల బంగారం, 50 వేల నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు కె.రాంబాబు ఫిర్యాదు చేశారు. సీఐ జి.కాళీచరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment