దర్శిపర్రులో జోరుగా గుండాట
పెంటపాడు: నూతన వత్సవరం పురస్కరించుకొని దర్శిపర్రు గ్రామంలో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో గుండాట, పేకాటలు జోరందుకున్నాయి. రాత్రి సమయాలలో కాకుండా పట్టపగలే ఇవి జరగడం విశేషం. జనవరి 1 నుంచి గ్రామ దేవత పుంతలో ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు 5 రోజలు పాటు జరుగుతాయి. దానిలో భాగంగా అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం నాటికి మూడు రోజలు ముగిశాయి. అమ్మవారి గుడికి సమీపంలో జెడ్పీ స్కూలు వద్ద గుండాటలు జోరుగా సాగాయి. వీటిని అడ్డుకోవాల్సిన, ఉత్సవ కమిటీ పెద్దలు, పోలీసులు చోద్యం చూస్తూ ఉండి పోయారు.
Comments
Please login to add a commentAdd a comment