కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలపై ట్రయల్ రన్
కడప అర్బన్: కడప నగర శివారులోని డీటీసీ (జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం) మైదానంలో సోమవారం నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది కొంత మంది యువకులతో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు ఆదివారం ట్రయల్‌రన్ (రిహా ర్సల్) నిర్వహించారు. అదే విధంగా డీటీసీ మైదానంలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలా విధులు చేపట్టాలో దిశానిర్దేశం చేశా రు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి జన వరి 8 వరకు దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం చేసిన ఏర్పాట్లపై అదనపు ఎస్పీ ఆరా తీసి పరిశీలన చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment