TS Special
-
సీఎంతో వంశీచంద్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన వంశీ.. చాలా సేపు ఆయనతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమంతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహా రాలపై చర్చ జరిగిందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. గత 22 రోజుల ప్రభుత్వ పాల న తీరు, అధికారుల నియామకంలో పారదర్శ కత, ప్రజాపాలన నిర్వహణపై సీఎంకు వంశీ అభినందనలు తెలిపారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు.. నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ సభకు హాజరై వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయానికి రాలేదు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్న రేవంత్.. సీఎంవో అధికా రులతో భేటీ అయ్యారు. తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమ య్యారు. అయితే, ఏఐసీసీ పక్షాన వంశీచంద్‌రెడ్డి సీఎం రేవంత్‌ను కలవడం, అది కూడా చాలా సేపు ఈ భేటీ జరగడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహా గానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్, భట్టి విక్రమార్కలు పీసీసీ అధ్యక్ష ఎన్నికపై పార్టీ పెద్దలతో చర్చించారన్న వార్తల నేపథ్యంలో వంశీచంద్‌రెడ్డి తాజాగా రేవంత్‌ను కలవడం చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం చర్చకు వచ్చి ఉంటుందని, ఏఐసీసీ పక్షాన ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం తీసుకుని వంశీ, రేవంత్‌ను కలసి ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్య క్షుడి ఎంపికపై కూడా ఇరువురు నేతలు చర్చించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
TS: కరోనా కేసులపై దొంగ లెక్కలు?
హైదరాబాద్, సాక్షి: దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే.. మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్, తాజాగా మంచిర్యాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ, అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు!. కరోనా వైరస్‌లో జేఎన్.1 వేరియెంట్.. వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. చలికాలం.. ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు.. ఆఖరికి కరోనా బులిటెన్‌ను విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజలుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనేం చేయడం లేదు. అధికారుల్ని అడిగితే.. ప్రభుత్వమే ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. రెండ్రోజులకొకసారి విడుదల చేస్తారని చెప్పినా.. అందులోనూ స్పష్టత లేదు. మరీ ఇంత తక్కువా? రెండు రోజుల కిందట బులిటెన్‌ను పరిశీలిస్తే.. 1,333 టెస్ట్‌లు చేయగా అందులో ఎనిమిది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలిందట. మొత్తంగా.. ఆ రోజునాటికి యాక్టివ్ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ.. రెండు కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే.. జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. వింటర్ సీజన్.. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్నవాళ్లు.. పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవాళ్ల లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శా బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైరస్ విజృంభించే అవకాశాలున్న సమయంలో రాష్ట్రంలో కొవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్
Updates: ఈఎన్సీ చీఫ్ మురళీధర్ కామెంట్లు.. ► మేడిగడ్డ బ్యారేజ్‌లో మొత్తం నాలుగు పిల్లర్లు 18,19,20,21 కుంగినాయి ► 20వ పిల్లర్ ఎక్కువగా 1.256 మీటర్ల మేర కుంగింది ► మూడు పిల్లర్లు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది ► ఆ పిల్లర్లు తొలగించడం కష్టతరంగా మారింది ► ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఈ పిల్లర్లల మీదే ఆధారపడి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ► కిందికి పోయినా వాటర్‌ను పైకి లిఫ్ట్ చేయడం ఏం పిచ్చి డిజైన్ ► వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు ► ఇంజనీరింగ్ అధికారులు వాస్తవాలు బయట పెట్టాలి ► అసెంబుల్డ్ మోటార్లతో వేల కోట్ల డబ్బు దోచుకున్నారు ► అప్పటి పాలకులు చెప్పినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు తలూపారు ► మీ మాట వినకపోతే లీవ్ పెట్టి వెళ్లి పోవాల్సింది ► ఎకరానికి 12 వేల ఖర్చు వస్తుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు ► ప్రజల్లో చర్చ జరుగుతుందే నేను అడుగుతున్నా ► 152 మీటర్ల వరకు ప్రాజెక్టు ఎత్తు ఉండేలా నిర్మాణం ఉండాలని మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది. ► కేసీఆర్ తన మార్క్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ► డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్‌తో వేసి ఉంటే ఈ రోజు బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యేవి కాదు. ► సీకెండ్ ఫైల్ ఫేలవ్వడం వల్లే బ్యారేజ్‌లు దెబ్బతిన్నాయి. ► ప్రాజెక్టు నిర్మాణంలో అప్ స్టీన్ కటాఫ్, డౌన్ స్టీన్ కటాఫ్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ► ప్రమాదం ఉందని 2022 ఎప్రిల్ 28న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖలు రాసాడు.. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. ► టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్... సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ► వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్‌ల నిర్మాణం ఎలా చేసారు ► బ్యారేజ్‌లో ఇసక తీయాల్సిన అవసరం ఏమోచ్చింది.. తీసిన ఇసుకను ఏం చేసారు ► మునిగిపోయిన పంప్‌ల స్థానంలో కొత్త వాటి కోసం బడ్జెట్ అలకేషన్ చేయాలని మళ్ళీ ఫైల్‌ను ఫైనాన్స్ డిపార్టుమెంట్లో పెట్టారు ► 3 టీఏంసీ లిఫ్ట్ కోసం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా ఎలా కాంటాక్ట్ ఇచ్చారు ► కాళేశ్వరంకు మీడియాను ఎందుకు నియంత్రించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా కాంగ్రెస్ అభిప్రాయం ఒకటే ► 38 వెల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయకట్టు ప్రణాళిక రూపొందించడం జరిగింది ► కానీ ప్రభుత్వం మారడం వల్ల ప్లాన్ మార్చి మేడి గడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ► ఒక బ్యారేజ్ తుమ్మిడి హాట్టి దగ్గర అనుకున్నాం కానీ.. అన్నారం, సుందిల్ల ఇలా ఎక్కువ ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల వ్యాయం పెరిగింది ► ఆనాడు 38 వెల కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఎకరాల కు 80 వేల కోట్లు ఖర్చు చేశారు ► ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు.. అద్భుతం అన్నారు. ► కానీ మేడిగడ్డ డ్యామేజ్ కావడం దురదృష్టం ► అక్టోబర్ 21 నాడు ప్రాజెక్టు పెద్ద శబ్దంతో కుంగడం జరిగింది ► కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరు మెదపలేదు ► ఎక్కడ రివ్యూ చేయలేదు,స్టేట్ మెంట్ ఇవ్వలేదు ► మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మొత్తం విషయంపై జ్యుడిషియల్ విచారణ చేపడతాం అని చెప్పాం చేపడతాం ► అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కోవడానికి ఈ రోజు రావడం జరిగింది ► అధికారులతో రివ్యూ తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తాం ► CWC అప్రోవల్ చేసింది రూ. 80 వెల కోట్లు కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లు పెరిగింది. ► 38 వెల కోట్లు ప్రాజెక్ట్ ఈరోజు వరకు సుమారు 95 వేల కోట్ల ఖర్చు జరిగింది. ► కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ► మేడి గడ్డ ఒక్కటే కాదు అన్నారం, కూడా నష్టం జరిగింది.. సుందిల్లను కూడా పరిశీలించాలి ► మూడు బ్యారేజీల రిపేర్‌కు అయ్యే ఖర్చు ప్రజల మీద భారమే అవుతుంది ► కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా ► పైగా ప్రజలపైన వడ్డీలు పడుతున్నాయి ► కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణ చేయబోతున్నాం ► ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగింది ► డిజైన్ , నిర్మాణం ఫెయిల్ అయ్యాయి ► ENC మరోసారి రిటన్‌గా నివేదిక ఇవ్వాలి ► తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం ► మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► అన్నారం, మేడిగడ్డ, సుంధిళ్ళ బ్యారేజ్లే కాళేశ్వరంకు కీలకం ► అందులో అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యాయి ► బాంబు దాడులను తట్టుకునే విధంగా ప్రాజెక్టుల ను నిర్మిస్తారు ► అలాంటిది మేడిగడ్డ బ్యారేజ్ బాంబు దాడి వల్ల డ్యామేజ్ అయిందని ఎలా భావిస్తున్నారు ► ఇరిగేషన్ శాఖ లో 8 నుంచి 9 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ► గత ప్రభుత్వం మాకు పెండింగ్ బిల్లులు వదిలిపెట్టి వెల్లింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉండే కీలక అంశాలు ► గోదావరిలో వాటర్ ఎంత లభ్యం అవుతుంది ► ప్రాణహితకు కాళేశ్వరంకు మధ్య తేడా ఏంటి? ► రీ డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? ► ప్రాణహిత ద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండేది ► కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత నీరు ఇచ్చారు ► ఇప్పటి వరకు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎంత? ► మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి? ► మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీకి ఇప్పుడు ఏం చేయాలి? మేడిగడ్డకు మంత్రుల బృందం ► హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్‌కు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరింది ► మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ► మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేకా వెంకట స్వామి. ► మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ►అక్టోబర్ 21న మెడగడ్డ పిల్లర్ కుంగిపోయింది. ►నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 7వరకు కేసిఆర్ సీఎంగా ఉన్నారు ►కానీ కాళేశ్వరంపై ఒక్కసారి మాట్లాడలేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన ►అన్ని విషయాలు నిర్దారణ చేస్తాం.నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తాం ►మూడేళ్లలో ఈ ప్రోజెక్ట్ కుంగటం సిగ్గు చేటు. ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి ►లక్ష కోట్ల ప్రోజెక్ట్ లో ఇంత భారీ అవినీతి జరిగింది ► మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన సమయం నుంచి బ్యారేజ్ చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పిన మంత్రులు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరనున్నారు. అధికారులు బ్యారేజ్‌కు ఇరువైపులా బారికేడ్లతో మూసివేశారు. దీంతో మంత్రుల మేడిగడ్డ పర్యటన ఉత్కంఠగా మారింది. జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటారు. అనంతరం E-IN-C ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు. -
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 28న థియరీ పరీక్షలు మొదలవుతాయని తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటికన్నా ముందు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. రెండో శనివారం, ఆదివారం కూడా రెండు సెషన్స్‌లో ప్రాక్టికల్స్ ఉంటాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో సెషన్ ఉంటుందని బోర్డ్ తెలిపింది. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఎన్విరాన్మెంట్ పరీక్ష ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. -
కాళేశ్వరం ఖర్చు రూ.93,872.07 కోట్లు ..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రూ.19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశారు. మొత్తం రూ.1,27,872.28 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటివరకు రూ.93,872.07 కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ద్వారా సమీకరించిన రూ.61,665.20 కోట్ల రుణాలతోపాటు రూ. 32,206.87 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందులో ఉన్నాయి. కాళేశ్వరం కింద 18,64,970 ఎకరాల మిగులు ఆయకట్టును 2028–29 నాటికి అభివృద్ధి చేసేందుకు గత ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై మంత్రుల బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు అర్ధంతరంగా విరమించుకున్నారు? ఆ ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచి్చంది? వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, నిధుల సమీకరణ, విద్యుత్ అవసరాల విషయంలో రెండు ప్రాజెక్టుల మధ్య తేడాలేంటి? మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో తలెత్తిన లోపాలు, సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? అన్న అంశాలతో నీటిపారుదల శాఖ పీపీటీని సిద్ధం చేసింది. వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు ఇప్పటివరకు తీసుకున్న రుణంలో అసలు రూ.4,696.33 కోట్లు మాత్రమే చెల్లించగా, గత ఐదేళ్లలో వడ్డీలు రూ.16,201.94 కోట్లు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి రూ.21,157.87 కోట్లు చెల్లించా రు. కాళేశ్వరం కార్పొరేషన్లో భాగమైనపాలమూరు–రంగారెడ్డికి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్రూ.7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గత మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించగా, అసలు చెల్లింపులు ఇంకా మొదలుకాలేదు. 17.08 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ స్టేజ్–1కి సంబంధించిన పాత ఆయకట్టుతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్–2, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పాత ఆయకట్టుకు 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లలో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించారు. దీంతో మొత్తం 17,08,230 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించినట్టు నీటిపారుదల శాఖ మంత్రులకు నివేదించనుంది. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా 456 చెరువులను నింపగా, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ–1, 2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించగా, వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ 2020–21 రబీ నుంచి 2023–24 ఖరీఫ్ వరకు కుందెల్లి వాగు, హల్దివాగు, 66 చెక్‌డ్యామ్‌ల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు. -
డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చి రద్దీ పెరగడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ట్రామ్ తరహాలో రెండు కోచ్‌లుగా ఉండే వెస్టిబ్యూల్, డబుల్ డెక్కర్ బస్సు లు నగరం వెలుపల నడపడం, ప్రస్తుతం నడు స్తున్న బస్సులు కాకుండా 12 మీటర్ల పొడవుండే భారీ వెడల్పాటి బస్సులు కొనుగోలు చేయడం తదితర అంశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య గతంలో కంటే దాదాపు 10 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగి మొత్తం ప్రయాణికుల సంఖ్య 40 లక్షలు దాటింది. సోమ వారాల్లో అయితే ఇది 50 లక్షలను మించుతోంది. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతం నమోదవుతోంది. మరోవైపు పురుషులకు చోటుండటం లేదు. ఈ నేపథ్యంలో పెరిగిన రద్దీని సులభంగా తట్టుకుని ఈ పథకాన్ని సజావుగా అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలని పేర్కొంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్న ఆ కమిటీ ప్రతినిధులు మరో రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారు. అందులోని సిఫారసులకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకోనుంది. నగరంలోనా? వెలుపలా? ప్రస్తుతం ఆర్టీసీలో 9,300 బస్సులున్నాయి. వీటిల్లో 3 వేలకు పైగా పాతబడి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 4 వేల వరకు బస్సులు కొనాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ బస్సులకు బదులు పెద్ద బస్సులు కొంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆర్టీసీ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వాడుతున్న 11 మీటర్ల పొడవు బస్సులకు బదులు 12 మీటర్ల బస్సులు కొంటే అదనంగా నాలుగు సీట్లు కలిసి వస్తాయి. వెడల్పు ఎక్కువగా ఉండటంతో నిలబడే స్థలం పెరుగుతుంది. ఇక ఒకదాని వెనక మరొకటిగా రెండు కోచ్‌లతో ఉండే వెస్టిబ్యూల్ బస్సులు కొంటే ఒకేసారి ఎక్కువమందిని తరలించే వీలుంటుంది. డబుల్ డెక్కర్‌లో కూడా ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటిని నగరం వెలుపల విశాలమైన రోడ్లు ఉండే ప్రాంతాల్లో తిప్పే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ నగరంలో అయితే ఏయే రూట్లు ఇందుకు యోగ్యంగా ఉంటాయో కూడా గుర్తిస్తున్నారు. 4 వేల బస్సులకు 10 వేల మంది సిబ్బంది కావాలి ఒక బస్సుకు సగటున 2.6 చొప్పున సిబ్బంది. అవసరమన్నది ఆర్టీసీ లెక్క. కొత్తగా 4 వేల బస్సులు కొంటే 10 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఒకవేళ అద్దె ప్రాతిపదికన బస్సులు తీసు కుంటే సిబ్బంది సంఖ్య అంత అవసరం ఉండదు. కాగా సిబ్బంది పెంపు ఎలా ఉండాలన్న అంశంపై ఓ కమిటీ నివేదిక సిద్ధం చేస్తోంది. అదే సమయంలో బస్సుల నిర్వహణపైనా సంస్థ దృష్టి సారించింది. షాక్ అబ్జార్బర్స్‌గా పనిచేసే కమాన్ పట్టీలు, టైర్లు, బ్రేక్ లైనర్స్ మన్నిక పెంచేందుకు ఏం చేయాలి? నిర్వహణ వ్యయం, అవసరమైన మెకానిక్‌లు తదితర అంశాలను మరో కమిటీ పరిశీలిస్తోంది. బస్స్టేషన్లు, ప్లాట్ ఫామ్స్‌పై దృష్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అన్నింటిలో టికెట్ జారీ యంత్రాలు వాడుతు న్నారు. వీటి చార్జింగ్కు ఇబ్బంది పడకుండా టిమ్స్‌ను బస్సుల్లోనే చార్జ్ చేసే సాంకేతికత సమకూర్చుకోవచ్చా? స్మార్ట్ కార్డుల జారీ, విచారణ కేంద్రాలలో ట్యాబ్స్ వినియోగం లాంటి అంశాలపై ఇంకో కమిటీ దృష్టి పెట్టింది. అదే సమయంలో పెరుగుతున్న బస్సులకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెంచటం, తదనుగుణంగా బస్టాండ్లు, బస్స్టేషన్లను విస్తరించటం, బస్టాండ్లలో వసతుల కల్పన, పెరిగిన దొంగల బెడదను అరికట్టేందుకు భద్రత పెంపు, మహిళా ప్రయాణికులకు టాయిలెట్లు, మంచినీటి వసతిని మెరుగుపరచటం లాంటి వాటిపై ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది. -
ఇవి కాంగ్రెస్ అనుకూల ఫలితాలు కావు
సాక్షి, హైదరాబాద్, ఇబ్రహీంపట్నం రూరల్: ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చినవి కావనీ, అవి కేవలం కేసీఆర్ సర్కార్, నాటి అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని బీజే పీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ వంటిదేమీ పనిచేయలేదని, బీఆర్ఎస్కు వ్యతిరేక తీర్పుతో తెలంగాణ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందినట్టు అయ్యిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు ఇది అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ అంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మాత్రమే కనిపించే వారని, అందుకే ప్రజలు తిప్పికొట్టి ఫాంహౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ కంటే కాంగ్రెస్ ఏమీ తక్కువ కాదనీ, కాంగ్రెస్ దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఇప్పటికే మునిగిన పడవ కాగా, కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని, ప్రసుతమున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. రా్రష్ఠంలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీసీవర్గాల అభ్యున్నతికి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ బీసీ సీఎం నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. మోదీకి పది ఎంపీ సీట్లు బహుమతిగా ఇవ్వండి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 10 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 35% ఓటింగ్ సాధించి పది ఎంపీ సీట్లు గెలిచేలా కృషి చేస్తామంటూ పార్టీ మండల అధ్యక్షులు ఆపై రాష్ట్రస్థాయి వరకు నాయకులందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిస్తే ఐదేళ్లలో 8 స్థానాలకు పెరిగామని, 8 స్థానాల నుంచి మళ్లీ వచ్చే అసెంబ్లీ నాటికి 95 స్థానాలకు బీజేపీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే వరకు వస్తూనే ఉంటా ’’గురువారం నేను హైదరాబాద్‌కు వస్తున్నపుడు ఇద్దరు జర్నలిస్టులు మళ్లీ తెలంగాణకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా మళ్లీ మళ్లీ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువసార్లు వెళ్తాను’’అని వారికి సమాధానం ఇచ్చానని అమిత్ షా చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నాయకులు, కేడర్‌లో నిరాశ రావడం సహజమేనని, ఐతే బీజేపీ ఎన్నికల కోసమే పోరాడే పార్టీ కాదని, దేశం కోసం, భరతమాత కోసం పోరాడే పార్టీ అని స్పష్టం చేస్తున్నానని చెప్పారు. ’’1950నాటి నుంచి బీజేపీ ఎన్నో ఎన్నికల్లో పోటీచేసింది, అనేకసార్లు డిపాజిట్లు కూడా కోల్పోయింది, రెండుసీట్ల నుంచి 300కు పైగా సీట్లతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చరిత్రను సొంతం చేసుకుంది.. నాడు వచ్చిన ఫలితాలతో నిరాశ చెంది ఉంటే ఈ స్థాయి ఫలితాలు సాధించగలిగే వాళ్లమా’’అని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లోనూ 300కు పైగా సీట్లు సాధించి వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. ఆ సంకల్పం తీసుకోండి ’’గుజరాత్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు జరిగిన ఎన్నికల్లో 9% ఓట్లు సాధించింది.. ఆ తర్వాత మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారానికి వచ్చింది.. దాంతో పోలిస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వచ్చినందున, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడా మూడింట 2వంతుల మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి’’అని అమిత్‌షా పిలుపునిచ్చారు. పీఎంగా మోదీ.. రాహుల్..మీకు ఎవరు కావాలి? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థులుగా మోదీ, రాహుల్‌గాంధీ ఉంటే ఎవరు ప్రధాని కావాలి అంటూ అమిత్ షా అడగ్గా.. మోదీ.. మోదీ అని శ్రేణులు బిగ్గరగా అరిచి మరీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోదీ గెలుపు చారిత్రక అవసరమని, ప్రజల్లోకి వెళ్లి మళ్లీ మోదీని గెలిపిద్దామని కోరుతూ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ బలపరుస్తూ మాట్లాడగా దానిని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపిస్తాంః కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపిస్తామని చెప్పారు. కచ్చితంగా డబుల్ డిజిట్ సంఖ్యలో ఎంపీలను గె లుస్తామని చెప్పారు. జాతీయ ప్రధానకార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, జాతీ య ఉపాధ్యక్షురాలు పార్లమెంటరీ బో ర్టు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు అర్వింద్ ధర్మపురి, సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక వాయిదా ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాయల్ శంకర్, రామారావు పాటిల్, జైపాల్‌రెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబును రాష్ట్ర నేతలు అమిత్ షాకు పరిచయం చేశారు. వారిని ఆయన అభినందించారు. ఐతే సమావేశానంతరం అమిత్‌షా సమక్షంలో సమావేశం నిర్వహించి బీజేఎల్పినేతను ఎన్నుకోవాల్సి ఉండగా సమయాభావం వల్ల జరగలేదు. మరోసారి వచ్చినప్పుడు నిర్ణయిద్దామని రాష్ట్ర పార్టీనేతలకు చెప్పిన అమిత్ షా గురువారం రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యరు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా చార్మినార్/దూద్‌బౌలి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం మధ్యాహ్నం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జరిగిన సామూహిక పూజ హారతిలో ఆయన పాల్గొన్నారు. -
స్టాఫ్‌నర్స్ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మేంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్‌నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినట్లు ఆయన వివరించారు. శనివారం (30వ తేదీ) నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ఎక్కడంటే.. ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 120/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికె ట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్ పీడీఎఫ్‌ను వెంట తీసుకొని రావాలి. ఎవరెవరు ఏయే సర్టిఫికెట్లు తేవాలంటే.. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఏఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసే వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్ తీసుకురావాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకొని రావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజినల్ జాబితా ఎంపిక జాబితా కాదని గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన వారిలో అనర్హులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు. నిర్ణీత రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయం... ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ నిర్వహిస్తారు. ప్రతీ సెషన్లో 400 నుంచి 500 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ మేర కు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మొదటి సెషన్: ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు రెండో సెషన్: మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మూడో సెషన్: మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు -
మేలో ఎంసెట్?
సాక్షి, హైదరాబాద్ః ఇంటర్ పరీక్షల తేదీలు వెల్లడవ్వడంతో ఎంసెట్‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్ష జరిపారు. సాధారణంగా ఎంసెట్ పరీక్షల తేదీలను ఇంటర్, జేఈఈ మెయిన్స్ తేదీలను బట్టి నిర్ణయిస్తారు. ఇంటర్ పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయి. జేఈఈ ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మే నెలలో ఎంసెట్ నిర్వహణ సరైన సమయంగా అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది జేఎన్టీయూహెచ్కు ఎంసెట్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది కూడా ఇదే యూనివర్సిటీకి ఇచ్చే వీలుంది. అయితే, ఎంసెట్ కన్వీనర్ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సీజీజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటారు. జాతీయ, రాష్ట్ర పరీక్షల తేదీలను గుర్తించి, ఎంసెట్ తేదీలను ఖరారు చేయడానికి ఇది తోడ్పడుతుంది. టెన్త్‌పై మరోసారి సమీక్ష గతేడాది ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య దాదాపు 20 శాతం పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎంసెట్ ప్రశ్న పత్రాం కూర్పుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్న తాధికారులు చర్చించారు. ఇదే క్రమంలో పదవ తరగతి పరీక్షలపైనా ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలు స్తోంది. మార్చితో ఇంటర్ పరీక్షలు ముగియడంతో ఇదే నెల ఆఖరు వారంలో లేదా ఏప్రిల్ మొదటి వా రంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో మార్పులు, చేర్పులు చేయాలా అనే అంశంపై త్వరలో అధికారులు మరో దఫా సమీక్షించే వీలుంది. -
3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి. హైదరా బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. -
ఇదొక్కటే ‘ఆధారం’!
భైంసాటౌన్/భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌కార్డే ప్రధానంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డుల్లో ఏపీకి బదులు తెలంగాణ ఉండాలని, పేర్లలో ఏమైనా తేడాలుంటే సరి చేసుకోవాలనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొత్తగా ఆధార్ నమోదు, కార్డుల్లో సవరణల కోసం ఈ–సేవ ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈ–సేవ ఆధార్ కేంద్రం వద్ద అయితే గురువారం ఉదయం 5 గంటల నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక చెప్పులను వరుసలో ఉంచారు. రెండురోజులుగా కేంద్రం తెరువకముందే టోకెన్ల కోసం వేచి ఉంటున్నారు. ముథోల్, తానూర్, దిలావర్పూర్, కడెం మండల కేంద్రాల్లోని ఆధార్ ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేయడంతో ఈ సమస్య నెలకొందని ఈడీఎం నదీం పేర్కొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆధార్‌కార్డు అప్డేట్కు స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌లో ఒక్కటే కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లో రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. దీంతో మండల వాసులు తెల్లవారుజామున 3 గంటల నుంచే చలిలో ఇబ్బంది పడుతూ బ్యాంక్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో తాత్కాలికంగా మూతపడిన ఆధార్ కేంద్రాలను త్వరగా తెరిపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజ కవర్గంలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు చెక్‌పెట్టగా, ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆశావహులు పోటీపడుతున్నారు. చేవెళ్ల కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నా యి. ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా ఈ అసెంబ్లీ టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగపడిన పారిజాత నర్సింహారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి అతి సన్నిహితుడైన ఎలుగింటి మధుసూదన్‌రెడ్డి సహా మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు యతి్నస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్‌ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఆ ఆంతర్యం ఏమిటో? నియోజకవర్గాల పునరి్వభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి ఎన్నికల్లో దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి పోటీకి ఆ యన ఆసక్తి చూపలేదు. 2014లో ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కారుగుర్తుపై పోటీ చేసిన రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించిన వారు.. రెండోసారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. పోటీ చేసిన వారు ఓటమి పాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభా స్థానాలుండగా, ఆ పార్టీ అధిష్టానం కేవలం చేవెళ్ల లోక్‌సభ స్థానానికే అ భ్యరి్థని ప్రకటించడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. అనేక సవాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల అభ్యరి్థకి అండదండగా నిలిచినప్పటికీ.. కేవలం 268 ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను పక్కన పెట్టి.. ఆయన సొంతంగా పలు కార్యక్రమాలు చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ ఆయన గెలుపునకు కృషి చేస్తారా? అంటే అనుమానమే. దీనికి తోడు శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో బీజేపీ బలంగా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం జీఓ నంబర్ 111 ఎత్తి వేసినట్లు చెపుతున్నా.. సాంకేతికంగా ఇప్పటికీ జీఓ అమల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మళ్లీ నెగ్గుకొస్తారా? అంటే వేచి చూడాల్సిందే. -
HYD: నయాసాల్.. ‘మహా’ మాల్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మూఠా వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ శరత్ పవార్ వెల్లడించారు. ముగ్గురు నుంచి ఏడు లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు మహారాష్ట్ర నుండి తీసుకు వచ్చారని తెలిపారు. రూ.రెండు వేలకు ఒక గ్రాము కొని.. హైదరాబాద్‌లో ఏడువేలకు అమ్ముతున్నారని అన్నారు. నిందితులు మహారాష్ట్రలో జ్యో అనే నైజీరియన్ వద్ద నుంచి కొన్నట్టు ఒప్పుకున్నారని తెలిపారు. పరారీలో ఉన్న జ్యో కోసం పోలీసులు గాలిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ అమ్మే వారిపై.. కొనేవారిపై పోలీసుల నిఘా ఉందని డీసీపీ శరత్ పవార్ అన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తామని, డ్రగ్స్ సరాఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మత్తు పదార్థాల వినియోగంలో పంజాబ్‌లా తెలంగాణ మారకుండా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసులుదేనని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ అంతర్ రాష్ట్ర ముఠాలు విచ్చలవిడిగా నగరంలోకి డ్రగ్స్‌ను తీసుకురావటం గమనార్హం. చదవండి: TSRTC: ఉచిత ప్రయాణంపై ఓవరాక్షన్ -
TSRTC: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుంచి దింపేశారు. ఇక, ఈ ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై సజ్జనార్ స్పందిస్తూ..‘టీఎస్ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు. #TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX — V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023 -
శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు. ✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది. ✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి. ✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు. ✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది. ✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. ✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
జనవరి 1 నుంచి నుమాయిష్
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఒకేచోట అన్ని వస్తువులు.. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ.40.. ఎగ్జిబిషన్‌ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు కనువిందు చేస్తాం.. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం. – ఏనుగుల రాజేందర్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం. – బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్ కార్యదర్శి 33 సబ్ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు. – వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు -
మోస్ట్ వాంటెడ్‌గా నాడు తండ్రి.. నేడు కొడుకు
హైదరాబాద్: అప్పట్లో మహ్మద్ షకీల్ ఆమీర్ అలియాస్ బోధన్ షకీల్... ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్... హైదరాబాద్ పోలీసులు వాంటెడ్‌గా మారారు. 2007 నాటి నకిలీ పాస్పోర్ట్స్ కేసులో షకీల్, తాజాగా ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదం, తదనంతర నాటకీయ పరిణామాల కేసులో సాహిల్ నిందితులుగా ఉన్నారు. పదహారేళ్ళ క్రితం తండ్రి కోసం పరుగులు పెట్టిన సిటీ కాప్స్ ఇప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నారు. సాహిల్ దుబాయ్‌కి పారిపోవడంతో అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు గతేడాది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్ ఫైల్‌ను బయటకు తీస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టిన షకీల్... మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్‌పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్‌లో ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నగరంలో నమోదైన కేసులో బోధన్ షకీల్ నిందితుడిగా మారాడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్ కోసం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. కారు కేసులో కుమారుడి కోసం... నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ జరిగిన దాదాపు పదహారేళ్ల తర్వాత ‘బీఎండబ్ల్యూ కారు’ కేసు చోటు చేసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసు నుంచి సాహిల్‌ను తప్పించడానికి పోలీసులు ప్రయతి్నంచడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరారీలో ఉన్న సాహిల్ కోసం పంజగుట్టతో పాటు వెస్ట్‌జోన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తు అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. షకీల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నాటి కేసులోనూ గోల్మాల్ జరిగిందా? తాజాగా పంజగుట్ట పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కేసు గతేడాది నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు అశ్వతోష్ (రెండు నెలలు) మృతి చెందాడు. ఈ థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో సాహిల్‌పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రమాదానికి కారణమైన కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాపను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ ఉదంతం చాలా బాధాకరమంటూ జరిగిన విషయాన్ని తాను తన కజిన్‌తో మాట్లాడి తెలుసుకున్నానని షకీల్ పేర్కొన్నారు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. ఈ కేసులో పోలీసులు సైతం సాహిల్‌కు క్లీన్చిట్ ఇచ్చేశారు. తాజాగా పంజగుట్ట కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు నాటి జూబ్లీహిల్స్ కేసును తిరగదోడుతున్నారు. అప్పట్లో జరిగిన ప్రమాదంలోనూ సాహిల్ పాత్ర ఉందా? ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పశి్చమ మండల డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. -
ఆరు గ్యారంటీలకు ఈ నంబర్‌తో లింక్
హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ‘ఆధార్’ తప్పనిసరిగా కావడంతో కొత్తగా నమోదు, అప్డేషన్ కోసం ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభంగా ప్రక్రియ పూర్తి అయ్యేందుకు అప్డేషన్ చేయాల్సిందే. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆధార్ కేంద్రాల ఎదుట భారీ సంఖ్య జనం బారులు తీరుతున్నారు. వివాహం కావడం, ఇంటి పేరు, కేరాఫ్, చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్డేషన్ ఆవశ్యకత ఎదురైంది. తాజాగా ఆరు గ్యారంటీల నేపథ్యంలో ఆధార్ నవీకరించుకునేందుకు పోటెత్తుతున్నారు. అన్నింటికీ ఇదే ఆధారం.. అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమవుతోంది. పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల నుంచి విలాసవంతమైన భవంతుల్లో జీవించే సంపన్నుల వరకు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పకుండా కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే.. ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. అది బహుళ ప్రయోజనకారిగా మారి ప్రతిదానికీ ఆధారంతో పాటు అనుసంధానమవుతోంది. ప్రభుత్వ పనులైనా.. ప్రైవేటు పనులు ముందుకు సాగాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ప్రతి కుటుంబానికి నిత్యవసరమైన వంట గ్యాస్, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్లో అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజి్రస్టేషన్లు. ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డు, సామాజిక పింఛ¯న్, స్కాలర్ షిప్‌తో పాటు బ్యాంకింగ్, బీమా తదితర అన్నింటికీ ఆధార్ తప్పనిసరి. పన్నులు తదితర పనులకూ ఆధార్ అవసరమే.. అంచనా జనాభా కంటే.. విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో అంచనా జనాభా కంటే ఆధార్ నమోదు సంఖ్య దాటింది. ఇతర రాష్ట్రాలు నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారితో ఆధార్ నమోదు సంఖ్య ఎగబాకుతోంది. మహా నగరంలో ఏటా జనాభా వృద్ధి రేటు 8 నుంచి 12 శాతానికిపైగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి అంచనా జనాభా ప్రకారం 1.50 కోట్లకు చేరగా.. దానికి మించి ఆధార్ నంబర్లు సంఖ్య జారీ అయినట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మహానగరానికి వలస వస్తున్నవారిలో సుమారు 34 శాతం ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జనాభాకు అనుగుణంగా ఆధార్ నమోదు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా ఆధార్ నమోదు సంఖ్య బాగా ఎగబాకింది. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
నేడు పార్టీ నేతలతో అమిత్‌షా కీలక చర్చలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపైనా ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12.05కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి 12.20కి సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వస్తారు. 1.45 వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు నగర శివార్లలోని కొంగర కలాన్ శ్లోక కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. 2.10 నుంచి 3.00 గంటల వరకు బీజేపీ నేతలతో జరిగే తొలి విడత భేటీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తారు. పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, ఎన్నికైన 8 మంది ఎమ్మె ల్యేలతో గెలుపోటములను ప్రభావితం చేసిన అంశాలపై షా చర్చిస్తారు. 3 నుంచి 4.30 గంటల వరకు రెండో విడత భేటీలో లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ సన్నద్ధతపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పార్టీ మండల/డివిజన్ అధ్యక్షులు మొదలుకుని జాతీయ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నట్టు సమాచారం. అమిత్ షా సాయంత్రం 5కి తిరిగి హో టల్‌కు చేరుకుని 5.30 వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం ఆయన చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. -
మీ వాదనలనూ వింటాం
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసుల వాదనలనూ వింటామంటూ.. వారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. తుది విచారణలో భాగంగా అందరి వాదనలు వింటామంది. నిందితులు జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులు, మహమ్మద్ ఆరీఫ్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లలో తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని, తమ వాదనలు వినాలని కోరుతూ పోలీసులు, దిశ తండ్రితోపాటు మరికొందరు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302కు బదులు 307 కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. మళ్లీ ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని, అది వారి వృత్తితోపాటు వ్యక్తిగత జీవితంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘ఒకసారి దర్యాప్తు పూర్తయి నివేదిక సమర్పించాక మళ్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయమనే పరిధి, అధికారం మేజి్రస్టేట్‌కు ఉండదు. అయితే సీఆర్పీసీ సెక్షన్ 482, రాజ్యాంగంలోని అర్టికల్ 226 కింద విచక్షణాధికారం మేరకు కేసును కొట్టివేయడానికి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే పరిధి ఈ కోర్టుకు ఉంటుంది. పిటిషనర్లు సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. నిబంధనల మేరకు కోర్టు ముందుకొచ్చి న పిటిషన్‌ను వినాలి. అలాగే పారదర్శక విచారణ కోసం పోలీసుల వాదనలనూ వింటాం’అని చెప్పింది. -
‘ప్రజాపాలన’లో నిర్లక్ష్యం వద్దు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం నుంచి వచ్చే నెల 6వరకు అమలు చేయనున్న ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవ హారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన అమలు విషయంలో నిర్లక్ష్యం వద్దని రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు మిగతా శాఖల భాగస్వామ్యంతో పదిరోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. రేపు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తాం.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను శుక్రవారం పరిశీలిస్తామని, వంతెన కుంగిన ఘటనను పరిశీలించి విచారణ చేపట్టి అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు, హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. -
TS: రేషన్‌కార్డులిస్తూనే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: ‘తెల్ల రేషన్‌కార్డు లేకుంటే ప్రజాపాలన కింద పథకం రావడం కష్టం. అందువల్ల కొత్త రేషన్‌కార్డులు కూడా ఇస్తాం. రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా ముందుకు వెళుతుంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు రేషన్‌కార్డులు లేనివారు ఇచ్చినా తీసుకుంటాం. ప్రజాపాలనలో సంబంధిత దరఖాస్తుతో పాటు ఇతర విజ్ఞాపనలను కూడా స్వీకరిస్తాం. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రేషన్‌కార్డు, భూముల వారసత్వ బదిలీ, ఇతర ఏం సమస్యలున్నా దరఖాస్తు తీసుకుంటాం..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని చె ప్పారు. పథకాలు కావాల్సిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. యువ వికాసం కింద విద్యా భరోసా కార్డుల జారీ కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లోనే కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించా రు. ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 8 పనిదినాల్లో గ్రామాలు, మున్సిపల్ వార్డులు, పట్టణాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని అత్యంత నిరుపేదలు, నిస్సహాయులకు సహాయం అందించడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమం లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల చెంతకు పాలన ‘సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి సచివాలయం లేదా ప్రజాభవన్‌లో జరిపే ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడం పేదలకు అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఒకరోజు ముందే వచ్చి రాత్రబస ఇక్కడే చేస్తున్నారు. గత ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల వద్దకు చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు పేరుకుపోయి ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రజావాణి కోసం ప్రజాభవన్‌కు రప్పించుకోవడం కాకుండా, గతంలో గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారి గ్రామాలకే పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లిన భావన కలుగుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని, సమస్యలు పరిష్కరిస్తుందనే విశ్వాసం ఏర్పడుతుంది. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే దాదాపుగా 24 వేల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. భూసమస్యలు, ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే అధికం. వీలున్న విజ్ఞాపనలన్నింటినీ పరిష్కరిస్తాం ఈ ప్రజావాణి దరఖాస్తులన్నిటికీ ఒక నంబర్ ఇచ్చి డిజిటలైజ్ చేస్తున్నాం. వాటిని సంబంధిత శాఖలకు, అధికారులకు పంపిస్తున్నాం. ఒక ఐఏఎస్ అధికారి, సిబ్బందితో ఇందుకు వ్యవస్థను ఏర్పాటు చేశాం. విజ్ఞాపన పత్రం పురోగతిని, అది ఎక్కడో ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ సిస్టం పెట్టాం. పరిష్కారానికి వీలు ఉన్నవన్నీ పరిష్కరిస్తాం. వీలు లేనప్పుడు దరఖాస్తుదారులకు కారణాలు తెలియజేస్తాం..’ అని సీఎం చెప్పారు. అర్హులెవరో తెలుసుకోవడానికే దరఖాస్తులు ‘మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే నిజమైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. అప్పుడు లక్ష్యం పెట్టుకుని, దానిని చేరడానికి అహరి్నశలు కృషి చేయగలం. ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని పరిష్కరించాం, ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉందనేది తెలుస్తుంది. జనాభా అధికంగా ఉండే గ్రామాల్లో ఎక్కువ కౌంటర్లు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుబందు సీలింగ్‌పై అసెంబ్లీ చర్చ రైతుబంధుపై సీలింగ్ విధించే అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అందరి సమ్మతితో నిర్ణయం తీసుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని ముందే ఊహించి వారికి ఆర్థిక సహాయం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలూ సేకరిస్తాం. తబ్లిగీ జమాత్ సమావేశాలకు 2006 నుంచి ప్రభుత్వం సాయం చేస్తోంది. ఆ సమావేశాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది..’ అని రేవంత్ తెలిపారు. తర్వాత కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు ‘గ్రామసభల్లో దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు తమకు పథకాలు వర్తించవని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ తర్వాత కూడా నిజమైన లబ్ధిదారులు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. హైదరాబాద్‌లో దరఖాస్తును ఉర్దూలో కూడా ఇస్తాం. గ్రామాల్లో ఉదయం 8–12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2–6 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. పట్టణాల్లో ఉదయం 10–5 గంటల వరకు అందజేయవచ్చు. డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టిన మా ప్రభుత్వం జనవరి 7లోపే లబ్ధిదారుల సమారాన్ని సేకరిస్తుంది..’ అని చెప్పారు. గవర్నర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం ‘సచివాలయంలో లోపల పత్రికా సమావేశం పెట్టుకోగలమని, ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి కూర్చోగలుగుతామని జర్నలిస్టులు భావించి ఉండకపోవచ్చు. అప్పట్లో పోలీసులు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులమైనా రాలేక మేం అటు నుంచి అటే వెళ్లిపోయాం. ఇకపై సీఎం, మంత్రులు ఇదే హాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మేము స్వేచ్ఛనిస్తాం, మీరు (జర్నలిస్టులు) దురి్వనియోగం చేయకుండా సహకరించాలి. జర్నలిస్టుల సమస్యలూ చాలా కాలంగా పేరుకుపోయాయి. త్వరలో దృష్టి పెడ్తాం. ఆందోళన వద్దు. మాకు హిడెన్ ఎజెండా లేదు. మాపై కేసులు లేవు. లూట్మార్ చేసిన వారిలాగా మాఫీల కోసం వంగాల్సిన అవసరం లేదు. ప్రధానికి దరఖాస్తు ఇచ్చాం. రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్‌తో సత్సంబంధాలు ఇలాగే కొనసాగిస్తాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
బహదూర్‌పురా: 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్‌పురా పీఎస్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో సోమవారం ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకీని బహదూర్‌పురా పోలీసులు కనుగొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసుల అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ.. పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తెలంగాణలో ఈ ఏడాది తొలి కోవిడ్ మరణం!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు.. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మృతులను 60 ఏళ్ల వ్యక్తితోపాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు. తెలంగాణలోనూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 54 పాజిటివ్ చేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్ట్‌లు పెంచారు, -
జీరో టికెట్‌పై కండక్టర్ల కన్నింగ్ ప్లాన్.. చర్యలకు TSRTC రెడీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరో టికెట్ విషయంతో కొందరు కండక్టర్లు అత్యుత్యాహం చూపిస్తున్నారు. ఎక్కువ మందిని తీసుకెళ్తున్నామని చూపించుకోవడానికి లెక్కలు పెంచుతూ ఇష్టారీతిన టికెట్స్ కొడుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులు దృష్టికి చేరడంలో దీనిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్‌కార్డు చూపించి టికెట్ ఎస్ఆర్ నగర్ వరకూ టికెట్ ఇవ్వమని కోరారు. అయితే, బస్సు కండక్టర్ మాత్రం ఆమెకు.. కోఠి వరకూ జీరో టికెట్ ఇచ్చారు. దీంతో, టికెట్‌పై అదేంటని ప్రయాణికురాలు ప్రశ్నించగా.. మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా? అని అన్నాడు. అదే బస్సుల్లో సదరు కండక్టర్ మరొకరికి కూడా ఇలాగే టికెట్ ఇచ్చినట్టు తేలింది. కాగా, విషయాన్ని సదరు ప్రయాణికులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్‌జోన్ అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో, యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. అయినా కండక్టర్లలో మార్పు రావడంలేదు. అయితే.. అంతకుముందు నుంచి కూడా 2850 బస్సులులే ఉండగా.. ప్రయాణికులు మాత్రం రెట్టింపు అయ్యారు. గతంలో 11లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 18లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్‌ప్రెస్, 45 సీట్ల ఆర్డినరీ బస్సుల్లో వందమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. అందుకే కొంతమంది జీరో టిక్కెట్లు జారీ చేసి లెక్కలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం! 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు. ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు. మహబూబ్ నగర్ నుండి తాండూరు… pic.twitter.com/Ht6fnPZP4q — Telugu Scribe (@TeluguScribe) December 24, 2023 ఇటీవల ఓ పల్లెవెలుగులో కండక్టర్ కూడా ఇలాగే చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా కండక్టర్ జీరో టికెట్ కొడుతున్నారని సదరు ప్రయాణికుడు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.