US Presidential Election 2024: Live Updates, Latest News, Results And More
Sakshi News home page

Us elections 2024

ప్రధాన వార్తలు

Democrat asks Biden to resign, appoint Harris as first female US President1
చివరి వారాల్లో అధ్యక్ష పీఠంపై కమల?

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్‌ స్థానికత సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్‌ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్‌ తెరమీదకొచ్చింది. చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్‌కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్‌ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్‌ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్‌ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు. ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్‌కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్‌ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి. చివరి రోజుల్లో బైడెన్‌ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగ మాజీ డైరెక్టర్‌ జమాల్‌ సైమన్స్‌ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్‌తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్‌కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్‌ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్‌ దిగిపోయి హారిస్‌కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్‌ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు. ట్రంప్‌తో ముఖాముఖి డిబేట్‌కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్‌ అభ్యర్థి. డిబేట్‌లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్‌ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్‌ను రేస్‌ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్‌ డెమొక్రాట్ల లాబీయింగ్‌ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు. 25వ సవరణ ఏం చెప్తోంది?అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్‌ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్‌ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్‌ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచారు. ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్‌ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్‌ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్‌ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్‌ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌ పాపులర్‌ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్‌ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

financial crisis: Trump urges his supporters to donate to Democrats help them2
డెమొక్రాట్లను ఆదుకోండి

వాషింగ్టన్‌: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్‌ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్‌ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్‌ క్యాంపెయిన్‌ ప్రధాన ఫండ్‌రైజర్‌ అజయ్‌ జైన్‌ భూటోరియా చెప్పారు. BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024ట్రంప్‌కు బైడెన్‌ ఆతిథ్యం ట్రంప్‌తో దేశాధ్యక్షుడు బైడెన్‌ సమావేశమవుతారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. బైడెన్‌ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్‌ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్‌హౌస్‌ ప్రెస్‌సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌ కూడా వైట్‌హౌస్‌కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్‌ కొత్త స్టాఫ్‌ చీఫ్‌ సూజీ వైల్స్‌తో బైడెన్‌ స్టాఫ్‌ చీఫ్‌ జెఫ్‌ జియెంట్స్‌ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్‌కు ట్రంప్‌ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్‌ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్‌హౌస్‌ ఆనవాయితీగా వస్తోంది. చదవండి: ట్రంప్‌ రాజకీయం.. ఇండియన్‌ అమెరికన్‌ నేత నిక్కీ హేలీకి బిగ్‌ షాక్‌

Nancy Pelosi blames Joe Biden for election loss as finger pointing intensifies3
బైడెన్‌ వల్లే ఓడిపోయాం

వాషింగ్టన్‌: ఎన్నికల ఫలితాలపై డెమొక్రాట్లలో ఆగ్రహం వెల్లువవుతోంది. పార్టీ హారిస్, బైడెన్‌ అనుకూల వర్గాలుగా చీలిపోయింది. ఓటమికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ఆయన పోటీ నుంచి తొందరగా తప్పుకొని ఉంటే డెమొక్రాట్లు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారన్నారు. అయితే ఓటమికి హారిస్‌ సాకులు చెబుతున్నారని బైడెన్‌ మాజీ సహాయకుడు ఆక్సియోస్‌ చెప్పారు. గెలవకుండానే ఒక బిలియన్‌ డాలర్లు ఎలా ఖర్చుచేశారని ప్రశ్నించారు. జో బైడెన్‌ను బయటకు నెట్టడానికి మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సలహాదారులు పార్టిలో అంతర్గత కుమ్ములాటలను బహిరంగంగా ప్రోత్సహించారని ఆరోపించారు. బైడెన్‌ను గద్దె దించడానికి కుట్ర పన్నిన వారే ఎన్నికల్లో ఓటమికి కారణమని డెమొక్రాట్‌ సెనేటర్‌ జాన్‌ ఫెటర్మన్‌ ఆరోపించారు.

Trump Wins Arizona Sweeps All 7 Swing States In US Elections 4
అరిజోనాలోనూ ట్రంప్‌ గెలుపు.. ఖాతాలో 312 ఎలక్టోరల్‌ ఓట్లు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్‌ రిజలల్ట్స్‌ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్‌ ఓట్లను ట్రంప్‌ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్‌ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌కు 226 ఎలక్టోరల్‌ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు ‍స్వింగ్‌ స్టేట్స్‌ను ట్రంప్‌ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్‌ 2020లో బైడెన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్‌ స్టేట్స్‌ను ట్రంప్‌ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్‌ జరిగిన నవంబర్‌‌ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్‌ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ట్రంప్‌ మార్కు కనిపించేనా..

Donald Trump about 2. 0 foreign policy5
ట్రంప్‌ మార్కు కనిపించేనా!

దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్‌’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్‌ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్‌ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్‌ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్‌ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్‌ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్‌ రెండింటిపైనా ట్రంప్‌ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్‌ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్‌ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్‌ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్‌ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్‌ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్‌»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్‌ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో ట్రంప్‌ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్‌»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్‌ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్‌ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్‌ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్‌ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్‌ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్‌ వైరస్‌’గా ట్రంప్‌ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్‌ సర్కారు కూడా చైనాపై ట్రంప్‌ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్‌ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్‌ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్‌ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్‌ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

USA Elections Results 2024: 4B movement picks up steam in US after election6
USA Elections Results 2024: ఆ నాలుగు వద్దు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్‌ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓట్లతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు. ట్రంప్‌కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు! ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ‘4బీ’ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆ మగవాళ్లను దూరంగా పెడతాం. వారితో శృంగారం, పెళ్లి, పిల్లలను కనడం వంటి సంబంధాలేవీ పెట్టుకోబోం’’అని కరాఖండిగా చెబుతుండటం విశేషం! దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ట్రంప్‌ విజయం తర్వాత బాగా ట్రెండింగ్‌గా మారింది. ట్రంప్‌ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదమంటే ఆయనకు పడదని డెమొక్రటిక్‌ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్‌ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరుపెట్టారు. తమ బాధను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతోపాటు 4బీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పొడవునా మహిళల హక్కులపై ట్రంప్, హారిస్‌ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం సాగింది. 4బీ ఉద్యమం దానికి కొనసాగింపని చెబుతున్నారు. ఇది మహిళల విముక్తి పోరాటమంటూ పోస్టు పెడు తున్నారు. ‘‘తరాలుగా సాగుతున్న పురుషాధిక్యత, అణచివేతపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం’’ అంటున్నారు. 4బీ పోరాటం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పోస్టులు, లైక్‌లు, షేరింగ్‌లతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రాడికల్‌ ఫెమినిస్ట్‌ ఉద్యమం నానాటికీ బలం పుంజుకోంటుంది. ఏమిటీ 4బీ ఉద్యమం?ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ’ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4బీ ఉద్యమం మొదలైంది. ఓ మహిళ తన ఆర్ట్‌ క్లాస్‌లో భాగంగా నగ్నంగా ఉన్న పురుషున్ని ఫొటో తీసినందుకు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీనిపై మహిళల ఆగ్రహావేశాలు 4బీ ఉద్యమానికి దారితీశాయి. బీ అంటే కొరియా భాషలో సంక్షిప్తంగా నో (వద్దని) చెప్పడం. పురుషులతో డేటింగ్, పెళ్లి, శృంగారం, పిల్లలను కనడం. ప్రధానంగా ఈ నాలుగింటికి నో చెప్పడమే 4బీ ఉద్యమం. దీన్ని అణచివేసేందుకు కొరియా ప్రభుత్వం ప్రయతి్నంచింది. స్త్రీ పురుషుల ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి ఉద్యమాలు దెబ్బతీస్తాయని అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌ 2021లో చెప్పారు. ఇప్పుడక్కడ 4బీ గొడవ కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రజలపై దాని ప్రభావం ఇంకా బలంగానే ఉంది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. 4బీ ఉద్యమమే దీనికి ప్రధాన కారణమని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అభిప్రాయపడింది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

USA: Military officials reportedly discuss to handle illegal orders from Trump7
ట్రంప్‌ ఎన్నికపై సైన్యంలో రుసరుసలు!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. దీంతో అమెరికా రక్షణ శాఖలో కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. విదేశాల నుంచి సామూహిక వలసలను కఠినంగా అణచివేస్తానని, అక్రమ వలసదార్లపై కచ్చితంగా చర్యలుంటాయని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వలసలను కట్టడి చేయడానికి సైనిక దళాల సేవలు వాడుకుంటామని చెప్పారు. దేశంలో తన వ్యతిరేక గళాలపైనా ఆయన విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థులకు వేధింపులు తప్పవన్న ప్రచారం సాగుతోంది. దేశంలో చట్టాల పటిష్ట అమలుకు యాక్టివ్‌–డ్యూటీ దళాలను రంగంలోకి దించుతానని ట్రంప్‌ చెప్పారు. సైన్యంలో తిష్టవేసిన అవినీతిపరులను ఏరిపారేస్తానని ప్రకటించారు. తన ప్రభుత్వంలో విధే యులకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. సొ ంత ఇంటి(స్వదేశం) లోని శత్రువులపైకి సైన్యాన్ని పంపిస్తానని చెప్పారు. మరోవైపు తన అవసరాల కోసం సైన్యాన్ని వాడుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన దుందుడుకు చర్యలను సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా వారితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు సైనిక జనరల్స్‌ బలహీనులు, అసమర్థులు అని ట్రంప్‌ విమర్శించారు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన తీరుపై అమెరికా సైన్యంలో చర్చ మొదలైంది. ఒకవేళ ట్రంప్‌ వివాదాస్పద ఆదేశాలు ఇస్తే ఏం చేయాలి? ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై ఇటీవల పెంటగాన్‌ అధికారులు సమావేశమైన చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనధికారికంగానే జరిగింది. ట్రంప్‌ ఆదేశాలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటే సున్నితంగా తిరస్కరించడమే మేలని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. ట్రంప్‌ మళ్లీ ఎన్నిక కావడం సైన్యంలో చాలామందికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. చట్టానికే విధేయులం.. అమెరికా అధ్యక్షుడంటే సమస్త సైనిక దళాలకు సుప్రీం కమాండర్‌. ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌పై సైన్యంలో స్పష్టమైన విముఖత కనిపిస్తోంది. ట్రంప్‌ వర్సెస్‌ అమెరికా మిలటరీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ట్రంప్‌తో సైన్యానికి ఉన్న గత అనుభవాలే ఇందుకు కారణం. ఆయన మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణశాఖను ప్రక్షాళన చేస్తారని అంచనా వేస్తున్నారు. తన విధేయులకు పెద్దపీట వేయడంతోపాటు తనను వ్యతిరేకించేవారిని లూప్‌లైన్‌లోకి పంపిస్తారని చెబుతున్నారు. అన్ని రకాల ప్రతికూల పరిణామాలకు సిద్ధమవుతున్నామని ట్రంప్‌ వ్యతిరేక అధికారులు కొందరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి హోదాలో ఆయన చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇస్తే వ్యతిరేకిస్తామని, ఎదురు తిరుగుతామని కొందరు పేర్కొంటున్నారు. తాము కేవలం చట్టానికి మాత్రమే విధేయులమని, ట్రంప్‌నకు గానీ, ఆయన ఇచ్చే చట్టవిరుద్ధ ఆదేశాలకు గానీ కాదని ఓ అధికారి స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Donald Trump wins Nevada in presidential race8
ట్రంప్‌దే నెవడా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన ట్రంప్‌ తన మెజారిటీని మరింత పెంచుకుంటున్నారు. ఏడు కీలక స్వింగ్‌ రాష్ట్రాల్లో ఒకటైన నెవడాను కూడా శనివారం తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి 6 ఎలక్టోరల్‌ ఓట్లతో కలిపి ఆయన మొత్తం ఓట్లు 301కి పెరిగాయి. నెవడా 20 ఏళ్ల తర్వాత డెమొక్రాట్ల చేజారడం విశేషం. 11 ఓట్లున్న అరిజోనాలో ఫలితం వెలువడాల్సి ఉంది. అక్కడా 83 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ట్రంప్‌ 5 శాతానికి పైగా ఆధిక్యంలో ఉన్నారు. హారిస్‌కు 226 ఓట్లుకు రావడం తెలిసిందే. రిపబ్లికన్లు నాలుగేళ్ల తర్వాత సెనేట్‌లో కూడా మెజారిటీ సాధించడం తెలిసిందే. వారికి 52 సీట్లు రాగా డెమొక్రాట్లు 44కే పరిమితమయ్యారు. 2 సీట్లు స్వతంత్రులకు దక్కగా మరో రెండింట్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ల ఆధిపత్యమే సాగుతోంది. 435 స్థానాలకు గాను ఇప్పటిదాకా రిపబ్లికన్లు 212 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 సీట్లు వస్తే వారు మెజారిటీ మార్కు చేరుకుంటారు. డెమొక్రాట్లకు 200 స్థానాలు దక్కాయి.

Musk Likely To Play Big Role In Trump Second Term As American President9
ట్రంప్‌ పాలనలో మస్క్‌కు కీలక పాత్ర..!

వాషింగ్టన్‌:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయంలో బిలియనీర్‌, టెస్లా అధినేత ఇలాన్‌ మస్క్‌ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రచారానికి ఆర్థికంగా అండదండలందించడమే కాకుండా ట్రంప్‌ తరపున మస్క్ నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ పాలనా వ్యవహారాల్లో మస్క్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మరింత బలపర్చేలా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడుతుండగా వారిద్దరి సంభాషణలో మస్క్‌ కూడా చేరినట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలోనే ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా కూడా మారాయి. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్‌ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో ట్రంప్‌ ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.జెలెన్‌స్కీతో మాట్లాడాల్సిందిగా మస్క్‌ను ట్రంప్‌ కోరినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో మస్క్‌ కొద్దిసేపు మాట్లాడారని కథనాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ అధ్యక్ష పేషీలో మస్క్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట.. అధ్యక్షుడిగా ఎన్నికైనందునే

US Court Pauses 2020 Election Subversion Case Against Trump10
ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట..! అధ్యక్షుడిగా ఎన్నికైనందునే..

వాషింగ్టన్‌:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌నకు అన్ని క్రిమినల్‌ కేసుల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్‌ ప్రయత్నించిన కేసు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. వాషింగ్టన్‌ కోర్టులో ప్రస్తుతం నడుస్తున్న ఈ కేసులో విచారణ డెడ్‌లైన్‌లన్నింటినీ పక్కన పెడుతున్నట్లు జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్‌ ప్రాసిక్యూటర్ల విజ్ఞప్తి మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు జడ్జి తెలిపారు.ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున.. అధ్యక్షుడిని క్రిమినల్‌ కేసుల్లో ప్రాసిక్యూట్‌ చేయడం కుదరనందునే విచారణను వాయిదా వేయాలని ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. దీంతో ట్రంప్‌పై కేసు విచారణ డెడ్‌లైన్‌లను పక్కన పెడుతున్నట్లు జడ్జి ఆదేశాలిచ్చారు. కాగా శృంగార తార స్టార్మీ డేనియల్‌కు సంబంధించి హ‌ష్‌ మనీ కేసులో ట్రంప్‌కు ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమెరికా నుంచి వెళ్లిపోతా.. మస్క్‌ కుమార్తె

Advertisement