AP Special
-
2,002 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2,001.8 ఎకరాల్లో బల్‌్కడ్రగ్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఈ బల్‌్కడ్రగ్ పార్కును ఈపీసీ విధానంలో నిర్మించడానికి ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రూ.1,234.75 కోట్లతో బల్‌్కడ్రగ్ పార్కును డిజైన్ చేసి అభివృద్ధి చేసే విధంగా ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 2001.8 ఎకరాల్లో.. 139.07 ఎకరాల్లో ఉన్న చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ధి చేసిన పార్కులో 1,009.85 ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు, 595.4 ఎకరాల్లో ఏపీఐ–డీఐఎస్ సింథసిస్, 414.1 ఎకరాల్లో ఫెర్మిటేషన్స్, 150 ఎకరాలు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. మార్చి 18 నాటికి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తిచేసి పనులు అప్పగించనున్నారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్‌్కడ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే.. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ఈ పార్కును కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత కాకినాడ వద్ద నిర్మించడానికి ప్రయత్నం చేయగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలన్న నిబంధన మేరకు నక్కపల్లి వద్ద పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఫార్మాహబ్‌గా ఏపీ ఈ బల్‌్కడ్రగ్ పార్కుతో రాష్ట్రం ఫార్మాహబ్‌గా ఎదగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే 100కు పైగా ఫార్మా కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. వీటిద్వారా 27,360 మందికి ప్రత్యక్షంగా ఉపాధికి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం దేశీయ ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం 16 శాతం వాటాతో మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.41,500 కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు వస్తుండగా.. అందులో రూ.8,300 కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2,400 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఇప్పటికే మైలాన్, ఫైజర్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో వంటి 60కి పైగా దిగ్గజసంస్థలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ బల్‌్కడ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వైద్య విద్యలో నవశకం
సొంతూరిలోనే మెడిసిన్.. మాది నంద్యాల. సీఎం జగన్ నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో కౌన్సెలింగ్‌లో మొదటి ప్రయారిటీ ఇచ్చా. అక్కడే సీటు వచ్చింది. ఉంటున్న ఊళ్లోనే ఎంబీబీఎస్ చదవడం నా అదృష్టం. కొత్త వైద్య కళాశాలల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో తాముంటున్న చోట వైద్య విద్య చదవాలన్న నాలాంటి విద్యార్థుల కలలను ప్రభుత్వం నెరవేరుస్తోంది. – వినయ్ కుమార్‌రెడ్డి, వైద్య విద్యార్థి, నంద్యాల వైద్య కళాశాల సాక్షి, అమరావతి: ఇప్పుడు వైద్య సేవలే కాదు.. వైద్య విద్య కూడా మనకు చేరువైంది. ఒకపక్క ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మరోపక్క మన విద్యార్థుల వైద్య విద్య కలలను సైతం సాకారం చేశారు. కోట్లుంటేనే డాక్టర్ కోటు సాధ్యమనే నానుడిని తొలగిస్తూ ఒకేసారి పెద్ద ఎత్తున వైద్య కాలేజీల ఏర్పాటుతో మెడికల్ మిరాకిల్ చేశారు! స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల సంఖ్య 11. గత నాలుగున్నరేళ్ల కృషి ఫలితంగా కొత్తగా సాకారమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఏకంగా 17. వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యమిస్తోందో చెప్పేందుకు ఇది చాలు! ‘పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ రెండింటినీ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది..’ ఈ సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మనిషి ప్రాణం విలువ తెలిసిన మనసున్న పాలకుడిగా ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నారు. గత సర్కారు హయాంలో నరకానికి నకళ్లుగా మారిన ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చడానికి రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యులను రప్పించి మారుమూల ప్రాంతాలవారికీ వ్యయ ప్రయాసలు లేకుండా ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికీ సంపూర్ణ వైద్య భరోసా కల్పిస్తున్నారు. ఇక అందిన ద్రాక్ష.. అందని ద్రాక్ష లాంటి వైద్య విద్యను పేద, మధ్య తరగతి విద్యార్థులకు చేరువచేస్తూ రూ.8,480 కోట్లతో రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తున్నారు. ఇప్పటికే 5 కొత్త మెడికల్ కళాశాలలను ప్రారంభించగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు ఆరంభం కానున్నాయి. మిగిలిన 7 కాలేజీలను 2025–26లో ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. కొత్త మెడికల్ కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు చేపట్టి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాల ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు 96 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలు 11 మాత్రమే. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ప్రజారోగ్యం పట్ల సీఎం జగన్ నిబద్ధత, దార్శనికతకు నిదర్శనం. రెండు రకాల లాభాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఇప్పటివరకు జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా నిపుణులైన వైద్యుల సేవలు పేద ప్రజలకు అందనున్నాయి. ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తై బయటకు వచ్చే సమయానికి ప్రతి కొత్త వైద్య కళాశాలలో 600 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. గత ఏడాది ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలకు అనుసంధానంగా నడిచే బోధనాస్పత్రుల్లో కిడ్నీ, న్యూరో, కార్డియాలజీ, క్యాన్సర్ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు ఏర్పాటు కావడంతో వైద్యం, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల ఏర్పాటుతో వివిధ రకాల వ్యాధులు, జబ్బులపై పరిశోధన జరుగుతుంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం హౌస్ సర్జన్లుగా అందుబాటులోకి వస్తారు. వీరు 24/7 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటంతో రోగులకు నిరంతరాయంగా సేవలు అందుతాయి. అంతేకాకుండా ఐదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా వస్తాయి. వీటి ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలోనే పెద్దాస్పత్రులు సమకూరడంతో ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన శ్రమ, ఖర్చు ఉండదు. నాడు ప్రైవేట్‌కు పట్టం.. నాకంటే విజనరీ ఎవరున్నారు? అంటూ తరచూ బుకాయించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగినా కూడా విద్య, వైద్య రంగాల అభివృద్ధికి చేసిన కృషి శూన్యం. 2014 నుంచి నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని కూడా ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలనూ తేలేదు. కనీసం ఆ ప్రయత్నమూ చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రైవేట్ వైద్య కళాశాలలను ప్రోత్సహించారు. ‘ప్రభుత్వ రంగంలో కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ.350 కోట్లు అవుతుంది. ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాలి. మేం ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటును ప్రోత్సహిస్తాం’ అని చంద్రబాబు సర్కారులో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగాలు.. ఉపాధి కొత్త మెడికల్ కాలేజీల రాకతో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రతి చోటా అత్యాధునిక బోధనాస్పత్రి, వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది పోస్టులను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం ద్వారా ఉద్యోగాలు లభిస్తాయి. నిర్మాణం, ఇతర రంగాలపై ఆధారపడిన వారికి ఉపాధి సమకూరుతుంది. విప్లవాత్మక నిర్ణయం 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ప్రభుత్వ రంగ కళాశాలలు రెట్టింపవుతాయి. ఇది ప్రజారోగ్య పరిరక్షణలో విప్లవాత్మక నిర్ణయం. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. గిరిజన జనాభా అత్యధికంగా ఉండే పాడేరు ప్రాంతంలో సీఎం జగన్ కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తుండటం హర్షించదగ్గ విషయం. – డాక్టర్ బాబ్జీ, వీసీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పక్క జిల్లాలోనే సీటు.. మాది శ్రీకాకుళం. పొరుగు జిల్లాలోని వైద్య కళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేవడంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. నాకు పక్క జిల్లాలోనే సీటు వచ్చింది. మా కాలేజీలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు. కార్పొరేట్ కళాశాలలకంటే మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. – బడగాల మనస్వని, వైద్య విద్యార్థిని, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం -
తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ..
పుట్టపర్తి: శివారులో ఇటీవల ప్రారంభమైన ఓ హోటల్‌కు 3 రోజుల క్రితం తమ చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వెళ్లారు. పలు వంటకాలు ఆర్డర్ చేసి తిన్నారు. రుచికరంగా లేవని హోటల్ నిర్వాహకులకు చెబితే.. మాట్లాడే సమయం లేదు, బిల్లు కట్టి వెళ్లాలంటూ దబాయించారు. తీరా ఇంటికెళ్లిన తర్వాత అందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. హిందూపురం: బస్టాండు పక్కనే ఉన్న హోటల్లో నాలుగు రోజుల క్రితం ఇద్దరు స్నేహితులు భోజనం చేశారు. అన్నం సరిగా ఉడకలేదని అక్కడికి సిబ్బందికి చెబితే... ఇప్పుడే చేశాం, అలాగే ఉంటుందని సమాధానమిచ్చారు. దీంతో చేసేదిలేక స్నేహితులు తిన్నారు. ఇంటికెళ్లాక విరేచనాలు ప్రారంభమయ్యాయి. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాక కాస్త ఉపశమనం లభించింది. సాక్షి, పుట్టపర్తి: చూడచక్కనైన బోర్డులు పెట్టి ఆకర్షిస్తారు. పసందైన వంటకాల మెనూతో నోరూరిస్తారు. లోపలికి వెళ్లగానే ఘుమఘుమలాడే వాసనలతో మైమరిపింపచేస్తారు. అన్నీ ఫ్రెష్వే అంటూ వడ్డించేస్తారు. కానీ, తిన్నాకే తెలుస్తుంది. మన కళ్లు మనల్ని ఎంతలా మోసం చేశాయో!. ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాకే అర్థం అవుతుంది.. ఆ హోటల్‌కి వెళ్లి ఎంతపెద్ద తప్పు చేశామో!. కల్తీతో కల్లోలం.. జిల్లా వ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కల్తీ ఆహారం వీరవిహారం చేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. రుచికరంగా ఉండేందుకు ఏవి పడితే అవి కలిపేయడం తిన్న వారి ప్రాణాలమీదికొస్తోంది. మరోవైపు నిల్వ ఉంచి వడ్డిస్తున్న వంటకాల ప్రభావం తక్షణమే కనిపిస్తోంది. ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులబాట పడుతున్న బాధితుల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ.. మారిన జీవనశైలిలో భాగంగా చాలామంది హోటళ్లలో తినడానికి అలవాటుపడ్డారు. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఉదయంపూట ఒకేసారి వందల మందికి సరిపడా వంటకాలు తయారు చేసి ఉంచుతున్నారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్ల ఆధారంగా అప్పటికప్పుడు మరోసారి వేడి చేసి ఇస్తున్నారు. అమ్ముడు పోకుండా మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో ఉంచి మరుసటి రోజు అంటగడుతున్నారు. చుక్కలు చూపుతున్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం.. చాలా హోటళ్లలో ఆహారం తిన్నాక బిల్లులు ఇవ్వడం లేదు. తెల్ల కాగితాలపై రాసి పంపిస్తున్నారు. మరుసటి రోజు కస్టమర్లు గొడవకు దిగినా.. మా హోటల్లో తినలేదంటూ దబాయిస్తున్నారు. తినే సమయంలోనూ ఆహారం బాగుండటం లేదని ప్రశ్నించినా హోటల్ నిర్వాహకులు తిరగబడు తున్నారు. బిల్లు ఇచ్చేది లేదు.. డబ్బు కట్టి వెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారు. తూతూమంత్రపు చర్యలతో సరి..! కల్తీ హోటళ్లపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. తూతూమంత్రపు తనిఖీలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సరిపెడుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా విఫలమవుతున్నారు. దీంతో చాలామంది ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలీక మిన్నకుండిపోతున్నారు. ఇదే అదనుగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఫిర్యాదు చేసుకోవాలంటూ రుబాబు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రతి నెలా మాకు విధించిన లక్ష్యం మేరకు తనిఖీలు చేస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసి ళ్లు తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలకు ఆదేశిస్తున్నాం. కల్తీ ఆహారం, నిల్వ ఉంచిన ఆహారం వడ్డించే హోటళ్లపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – రామచంద్ర, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి -
fact check: అయినవారికి కాదు రామోజీ.. అర్హతలున్నవారికే టెండర్లు
సాక్షి, అమరావతి: పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అన్నట్టు పదే పదే ఒక అబద్ధాన్ని తన విషపుత్రిక ఈనాడులో అచ్చేయడం, ప్రభుత్వంపై యధారీతిన దు్రష్పచారం చేయడం లక్ష్యంగా మరోసారి రామోజీరావు చెలరేగిపోయారు. ఇందులో భాగంగానే శనివారం ఈనాడులో ‘అయినవారి కోసం.. ‘అన్న’ స్మార్ట్ టెండర్’ అంటూ ఒక విష కథనాన్ని అచ్చేశారు. ఇందులో ఒక్క అక్షరమైనా నిజం లేకుండా.. ప్రభుత్వంపైన ఇష్టారీతిన బురదజిమ్మారు.అన్ని అర్హతలున్నవారికే పారదర్శకంగా టెండర్లు అప్పగిస్తున్నా.. టెండరుదారులు ఎక్కువ మొత్తం కోట్ చేస్తే మళ్లీ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినా రామోజీకి మాత్రం ఇదంతా బూటకంలా కనిపిస్తోంది. అందుకే తనకు కావాల్సినవారికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల టెండర్లను కట్టబెట్టిందంటూ పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. ఈ నేపథ్యంలో ఈనాడు విషకథనంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు పృధ్వీతేజ్, సంతోషరావు వివరణ ఇచ్చారు.ఈనాడు కథనంలో అణువంతైనా నిజం లేదని.. ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టడం లేదని అర్హతలు ఉన్నవారికే పారదర్శకంగా టెండర్లు దక్కుతున్నాయని తేల్చిచెప్పారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మార్గదర్శకాలకు అనుగుణంగానే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని కుండబద్దలు కొట్టారు. పైగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పృధ్వితేజ్, సంతోషరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ–పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే డిస్కంలు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో 12.08 లక్షల ప్రీ–పెయిడ్ మీటర్లను అమరుస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలో 15.78 లక్షల ప్రీపెయిడ్ మీటర్లు పెడుతున్నారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 9.97 లక్షల ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం డిస్కంలు టెండర్లను ఆహా్వనిస్తూ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో ప్రకటన జారీ చేశాయి. టెండరు ప్రక్రియను ఏపీ–ఈ ప్రొక్యూర్మెంట్, జెమ్ పోర్టల్ ద్వారా చేపట్టారు. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా గుత్తేదారులు ఎవరైనా ఐచ్చికంగా పాల్గొనవచ్చు. టెండర్ల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఈ టెండర్ల ఎంపిక ప్రక్రియలో గుత్తేదారులను తొలగించడానికి విద్యుత్ సంస్థలకు ఎటువంటి అధికారాలు కూడా ఉండవు. మొదటి దశలో ఇలాదక్షిణ ప్రాంతం డిస్కం పరిధిలో మొదటి విడతలో 8.75 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, త్రీ–ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య ప్రాంత డిస్కం పరిధిలో 8.32 లక్షల మీటర్లను, తూర్పు ప్రాంత డిస్కంలో 7.24 లక్షల మీటర్లను అమర్చుతున్నారు. అయితే ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.17.41 అధికంగా మొత్తం కలిపి రూ.95.99 అదాని సంస్థకు చెల్లిస్తున్నట్లు ఈనాడు తన కథనంలో అబద్ధాలను అచ్చేసింది. నిజానికి.. ఒక్కో సింగిల్ ఫేజ్ మీటర్‌కు నెలకు రూ.86.32 చొప్పున, త్రీ–ఫేజ్ మీటర్‌కు రూ.176.02 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు దక్షిణ ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ–ఫేజ్ మీటర్లకు రూ.419.50 కోట్లను చెల్లించాలి.ఇందులో రూ.118.12 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో సంస్థకు అందిస్తుంది. అలాగే మధ్య ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ–ఫేజ్ మీటర్లకు రూ.178.96 కోట్లను చెల్లించాలి. ఇందులో రూ.74.91 కోట్లను కేంద్రం ఇస్తుంది. ఇక తూర్పు ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.543.85 కోట్లు, త్రీ–ఫేజ్ మీటర్లకు రూ.250.27 కోట్లను చెల్లించాలి. ఇందులో కేంద్రం గ్రాంటుగా రూ.82 కోట్లు వస్తుంది.ఈ చెల్లింపులన్నింటికీ 93 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఇలాగే రెండో దశలోనూ ఆయా డిస్కంల పరిధిలో మీటర్లను అమరుస్తారు. వీటికి సైతం కేంద్రం గ్రాంటును అందిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకు పనులను అప్పగించామని సీఎండీలు స్పష్టం చేశారు. -
టెలిమెడిసిన్‌లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 4.92 కోట్ల సేవలందించినట్లు ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో తెలిపింది. అంటే.. దేశం మొత్తం అందించిన టెలిమెడిసిన్ సేవల్లో ఒక్క ఏపీలోనే 24.4 శాతం అందించారు. అలాగే, మరేఇతర రాష్ట్రం కూడా నాలుగు కోట్లకు పైబడి ఈ సేవలందించలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత తమిళనాడు 3.02 కోట్లు.. ఆ తరువాత పశి్చమ బెంగాల్ 2.94 కోట్ల సేవలందించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ఈ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ రోగులకు సులభంగా స్పెషలిస్టుల సేవలు ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్దపెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో టెలిమెడిసిన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ–సంజీవని టెలిమెడిసిన్ కార్యకలాపాలపై చిన్న వీడియోలు, బ్రోచర్లు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఈ–సంజీవని టెలిమెడిసిన్ సేవలు ప్రస్తుతం 13 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరణలో అమలుచేసి చూపిస్తోంది. ఫలితంగా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు.. ఈ టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హబ్‌లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఏ మందులు వాడాలో తెలియజేస్తున్నారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా సేవలు.. ఇక స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలను పొందుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేనివారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్ ఫేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించారు. ఈ ఆశా వర్కర్లు రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తారు. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సలహాలు, సూచనలను పొందుతున్నారు. ఈ సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నందువల్లే రాష్ట్రంలో అత్యధికంగా టెలిమెడిసిన్ సేవలందించడం సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
కిరాయిలు ఇవ్వకుంటే ఎలా బాబూ!
హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు సభకు ఆటోల్లో ప్రజలను తరలించిన డ్రైవర్లకు కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. టీడీపీ నేతల తీరును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బాకురులో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. బాకూరు, ఉప్ప, చీకుమద్దుల, అండిభ, పంచాయతీల పరిధిలోని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. గతల నెల 20న అరకులో జరిగిన ‘రా కదలి రా’ సభకు జనాలను తరలించేందుకు ఒక్కొక్క ఆటోకు రూ.2,500 ఇస్తామని నేతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే, ముందుగా కొంతమందికి మాత్రమే రూ.500 అడ్వాన్స్ ఇచ్చారని, మరికొందరికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఒకేసారి ఇస్తామంటూ ఆటోలను సభకు తరలించారని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. బాకురు, అండిభ యూనియన్ల పరిధిలో సుమారు 60 ఆటోలు, ఉప్ప ప్రాంత యూనియన్ నుంచి సుమారు 50 ఆటోలను మొత్తం 110 ఆటోల్లో ప్రజలను సభకు తీసుకువెళ్లామని వాపోయారు. సభ జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తమకు కిరాయిలు చెల్లించకుండా టీడీపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. సభ జరిగే రోజు తమ ప్రాంతంలో సంత ఉంటుందని చంద్రబాబు సభకు వెళ్లకుండా అక్కడే టికెట్ సరీ్వసు చేసుకుంటే సుమారు రూ.3వేల వరకు సంపాదించుకుని ఉండేవారమని వారు లబోదిబోమంటున్నారు. కిరాయిలు ఇవ్వకపోతే ఓట్ల కోసం తమ గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఊరుకునేది లేదు.. రోజు మా కుటుంబ పోషణ నిమిత్తం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కిరాయి డబ్బులు ఇస్తామని చంద్రబాబు సభకు తీసుకువెళ్లారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నారు. కిరాయి డబ్బులు చెల్లించకపోతే ఊరుకొనేది లేదు. – దూసురు వెంకట రమణ,ఆటో యూనియన్ అధ్యక్షుడు, అండిభ, హుకుంపేట మండలం మా పొట్ట కొడితే ఎలా? నాది పేద కుటుంబం. అమ్మా నాన్న కూలి చేస్తేనే తప్ప కడుపు నిండదు. రోజు ఎంతో కష్టపడితే గాని నాలుగు వేళ్లు నోటికి వెళ్లవు. ఆటో ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. సభలకు జనాలను తరలించేటప్పుడు అడ్వాన్సులు అడిగితే అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామంటూ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. – సంతోష్, ఆటో డ్రైవర్, చట్రాయిపుట్టు -
నేడు ఏలూరులో ‘సిద్ధం’ సభ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు/దెందులూరు: జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేసూ్తనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తర కోస్తా (ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు)లోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ కానుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు. యుద్ధ ప్రాతిపదికన సభా వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీరు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆరి్డనేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, వడ్డీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ డి.మేరి ప్రశాంతి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఫేక్ ఐడీలతో టీడీపీ పోస్టింగ్‌లు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: తెర వెనుక టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి! కుట్రపూరితంగా పోస్టింగ్‌లు చేస్తూ బురద చల్లేందుకు ఎల్లో గ్యాంగ్ చేసిన యత్నాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నివాసి వర్రా రాఘవరెడ్డి దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జనవరి 26వతేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్ ఐడీ సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన ఆయన 28న పులివెందుల ఎస్ఐ అరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏపీ పీసీపీ చీఫ్ షర్మిలను అసభ్యంగా దూషిస్తూ ఫేక్ ఐడీ ద్వారా పోస్టులు చేస్తున్నారని, ఫేక్ ఐడీని ట్రేస్ చేయాలని రాఘవరెడ్డి కోరారు. ఇదే విషయంపై జనవరి 31న వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారని వర్రా రాఘవరెడ్డి పేరుతో ఉన్న ఫేక్ ఐడీ వివరాలను హైదరాబాద్ పోలీసులకు అందచేశారు. తన పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు ఫేస్బుక్లో పోస్టు చేయడం వెనుక ఐ– టీడీపీ శ్రేణులున్నాయని వర్రా రాఘవరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులను ముందే పసిగట్టిన తాను ఇప్పటికే ఏపీ పోలీసులను విచారించాలని కోరినట్లు తెలిపారు. బెదిరింపులు పెరిగాయి: సునీత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తనకు ప్రాణహాని ఉందంటూ శుక్రవారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇద్దరినీ చంపేస్తాం..’ అనే అర్థం వచ్చేలా గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్ ద్వారా పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఈ తరహా బెదిరింపులు ఎక్కువయ్యాయని, పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్‌లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
3 రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది. 2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో) కోటిపల్లి – నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు విజయవాడ–గూడూరు మూడో లైన్ 500 కోట్లు కాజీపేట – విజయవాడ మూడో లైన్ 310 కోట్లు విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు 209.8 కోట్లు అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి: 407 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, హైలెవల్ ప్లాట్‌ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు -
బాబు.. ఓ ‘పిల్స్’ ఫ్యాక్టరీ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు వందలాది తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ‘పిల్స్’ (ప్రజాప్రయోజన వ్యాజ్యాలు) ఫ్యాక్టరీని నడుపుతూ దేశంలో ఏ ప్రభుత్వంపైనా లేనన్ని కేసులు ఈ అభివృద్ధి నిరోధక శక్తులు వేశాయని, వారు తమ స్వార్థం కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా దు ర్వినియోగపరుస్తున్నారని వారు దుయ్యబట్టారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారారని ఆరోపించారు. ‘జగన్ పాలన–న్యాయవాదుల స్పందన’ అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న న్యాయవాదులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిపై ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం రూపొందించిన నివేదిక ముఖ్యాంశాల పోస్టర్లను అవిష్కరించిన అనంతరం వారు తమ మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే.. చంద్రబాబు ఫ్యాక్టరీ నుంచే ‘పిల్స్’.. న్యాయ వ్యవస్థలోని కొందరు కక్షపూరితంగా వ్యవరించారు. జస్టిస్ రాకేష్‌కుమార్ పదవీ విరమణచేసే రోజు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, తర్వాత అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఉన్న ఆయనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే, జగన్‌పై ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ బట్టు దేవానంద్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించారు. చంద్రబాబు ఒక ‘పిల్ ఫ్యాక్టరీ’ని తయారుచేసి జగన్ ప్రభుత్వంపై సొంత ఖర్చులతో పిల్స్ వేయిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్లడం అభినందనీయం. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ వారికి స్థలాలిచ్చి బీసీలకు ఇవ్వకుండా కోర్టు స్టేనా!? అమరావతిలో బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టు స్టే ఇచ్చింది. కానీ, అదే అమరావతిలో న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు స్థలాలు కేటాయించారు. ఇదేం న్యాయం? పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి సీఎం జగన్ మంచి పనిచేశారు. విదేశీ విద్య పథకంతో సామాన్యులను చదివిస్తున్నారు. 75 ఏళ్లలో ఎవరూ ఇలాంటి పనిచేయలేదు. దేశంలోనే బెస్ట్ సీఎం జగన్. – బి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు, ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కేసులు లేకపోతే మరింత అభివృద్ధి.. ఇన్ఫ్రా రంగంలో రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రతి పక్షాలు, ఒక వర్గం మీడియా పురోగతి ఏమీలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్విసెస్ ఇండియా లిమిటెడ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు రూ.70 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుండగా.. అందులో రూ.6.75 లక్షల కోట్ల విలువైన పనులు ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయి. అలాగే, జగన్ ప్రభుత్వంలో ఆరు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పది హార్బర్లు, నాలుగు పోర్టులు, మూడు ఇండ్రస్టియల్ కారిడార్లు, రెండు మేజర్ ఎయిర్‌పోర్టులు, 31 చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఇంత పెద్దఎత్తున ఇన్ఫ్రా డెవలప్మెంట్ మరే రాష్ట్రంలోనూ జరగడంలేదు. – వెంకట్ మేడపాటి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ.. ఇటీవల ప్రధాని మోదీ∙కూడా స్వార్థపూరిత ప్రజాహిత వ్యాజ్యాలపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో పారిశ్రామిక రంగంలో 16.36 శాతం, స ర్విస్ సెక్టార్లో 20 శాతం, వ్యవసాయ రంగంలో 13 శాతం వృద్ధిని మన రాష్ట్రం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా సుమారు రూ.20 లక్షల కోట్లు పేదలకు నేరుగా బదిలీ చేయగా, ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు బదిలీచేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. – నారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు, నవరత్నాలు అమలు కమిటీ స్వార్థశక్తుల చేతుల్లో ‘పిల్’ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తరచుగా కోర్టులు జోక్యం చేసుకోవడంవల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. సామాన్యుల కోసం పిల్ సదుపాయం కలి్పస్తే అది స్వార్థశక్తుల చేతిలో ఆయుధంగా మారింది. అనవసరమైన కోర్టు కేసులు లేకపోతే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఉండేది. – నరహరశెట్టి శ్రీహరి, సీనియర్ న్యాయవాది విద్యలో కేరళను దాటేస్తున్నాం.. రాష్ట్రంలో పిలిచి ఉద్యోగాలిస్తున్నారు.. పోర్టులు కడుతున్నారు.. విద్యా వ్యవస్థలో కేరళను దాటి ఏపీ మొదటి స్థానానికి వెళ్తోంది. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పరోక్షంగా న్యాయవాదుల కుటుంబాలు బాగుపడుతున్నాయి. జూనియర్ లాయర్లకు రూ.5వేలు గతంలో ఎవరూ ఇవ్వలేదు. – ధనలక్ష్మి, న్యాయవాది ఈ సర్కారును మళ్లీ గెలిపించుకోవాలి.. విద్యావ్యవస్థలో సీఎం జగన్ ప్రక్షాళన తీసుకొచ్చారు. బడుగులు తెలుగు మీడియంలోనే చదవాలన్నట్లు గత ప్రభుత్వాలు చేశాయి. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలి. – బి. సౌమ్య, న్యాయవాది ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ సీఎం జగన్ నెరవేర్చారు. లాయర్లు, ఆటోడ్రైవర్ల దగ్గర్నుంచి పారిశ్రామికవేత్తల వరకూ, అన్ని వర్గాల వారికీ ఆరి్థక చేయూతనిస్తున్నారు. అలాంటి సీఎంను మళ్లీ మనందరం మద్దతిచ్చి గెలిపించుకోవాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది సంక్షేమ పాలనను లాయర్లు అందరికీ చెప్పాలి.. రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పాలన గురించి న్యాయవాదులు తమ వద్దకు వచి్చన ప్రతి ఒక్కరికీ చెప్పి, వాళ్లకు జరిగిన మేలు గురించి గుర్తుచేయాలి. వారి ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. – జంగా జయలక్ష్మి, సీనియర్ న్యాయవాది లాయర్లకు జగన్ తప్ప ఎవరూ మంచి చేయలేదు.. గతంలో న్యాయవాదులను వాడుకోవడం తప్ప ఏ ప్రభుత్వం మంచి చేయలేదు. జగన్ సీఎం అయ్యాక రూ.100 కోట్లు ఇస్తామన్నారు. అన్నట్లుగానే ఇచ్చారు. నవరత్నాలు అనే పదాన్ని ఎక్కడ చదివారోగానీ ఆ పేరుతో అందరికీ మంచి చేస్తున్నారు. అవి నిలబడాలంటే జగన్ మళ్లీ గెలవాలి. – రమణి, సీనియర్ న్యాయవాది మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లొద్దు.. పధా్నలుగు సంవత్సరాల వనవాసం నుంచి బయటకు వచ్చినట్లుంది జగన్ పాలన. మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే న్యాయవాదులంతా కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్రంలో చెడ్డ వారంతా చంద్రబాబుకి మద్దతిస్తున్నారు. మంచివాళ్లు జగన్‌ని కోరుకుంటున్నారు. – జీవనజ్యోతి, న్యాయవాది రాష్ట్రంలో అద్భుత ప్రగతి.. జగన్ ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే వెంటనే కేసులు వేసి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. ప్రజాహిత వ్యాజ్యం అనేది సామాన్యుల న్యాయం కోసం రూపొందిస్తే వాటిని పెత్తందారులు హస్తగతం చేసుకున్నారు. 24 నెలల కరోనా కాలం తర్వాత మిగిలిన మూడేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. 2023–24లో 17 శాతం స్ధూల జాతీయోత్పత్తి వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్ధానంలో ఉంది. – చిన్నం రామకృష్ణ, న్యాయవాది -
సీనియర్లతో బాబు దొంగాట
సాక్షి, అమరావతి: ఎవరితోనైనా దొంగాటలు ఆడగల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. సొంత పార్టీలోని సీనియర్ నేతలకు టికెట్లు ఎగ్గొట్టడానికీ తొండాట ఆడుతున్నారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మరోసారి పావుగా చంద్రబాబు వాడుకుంటున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు చెప్పగానే తలాడించే పవన్.. ఇప్పుడూ అదే పని చేశారు. 2014 ఎన్నికల తర్వాత తనను తిట్టారంటూ పలువురు టీడీపీ సీనియర్ నేతల పేర్లతో పవన్‌తో ఓ జాబితా తయారు చేయించి, వారికి సీట్లిస్తే జనసేన ఓట్ల బదలాయింపు జరగదని ఓ మాట చెప్పించారు. దానినే ప్రచారం చేయించారు. పవన్ ఒత్తిడి ఉందని, పొత్తులో ఇలా ఒకట్రెండు అంశాల్లో సర్దుకుపోకతప్పదంటూ చంద్రబాబు పార్టీ నేతల అమాయకత్వం ఒలకబోసి, తాను అనుకున్న పలువురికి టిక్కెట్లు ఎగ్గొడుతున్నట్లు పార్టీలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ ఇచ్చిన ఈ జాబితాలో సీనియర్లు చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, మరో నలుగురు ఉన్నారు. వారికి సిట్లిస్తే జనసేన నుంచి ఓట్ల బదలాయింపు జరగదని పవన్‌తో చంద్రబాబు చెప్పించారు. ఈ నాయకుల విషయంలో తన మాట వినాల్సిందేనని పవన్ కోరినట్లు ప్రచారం చేశారు. పొత్తులో భాగంగా ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్లు ప్రచారం చేశారు. జనసేనతో పొత్తు కొనసాగాలంటే ఒకట్రెండు అంశాల్లో పవన్ చెప్పినట్లు వినక తప్పడంలేదంటూ నేతల ముందు చంద్రబాబు అమాయకత్వం ఒలకబోశారు. ఇలా ఏడుగురు నేతలకు చంద్రబాబు సీట్లు నిరాకరించారు. ఈ ముగ్గురికీ ఇలా చంద్రబాబు తొండాటలో టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టిక్కెట్ కోల్పోతున్నారు. దెందులూరు సీటును ఈసారి ప్రభాకర్‌కి కాకుండా వేరొకరికి ఇవ్వడానికి బాబు నిర్ణయించారు. 2014 ఎన్నికల తర్వాత జనసేన సహకారంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందనే వాదనను ప్రభాకర్ తిప్పికొట్టారు. అసలు జనసేనకు బలం ఎక్కడుందని ప్రశ్నించారు. పవన్‌పై వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు. దీన్ని సాకుగా చూపి, పవన్ ముసుగులో ప్రభాకర్‌కి బాబు మొండి చేయి చూపించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పవన్‌పై గతంలో విమర్శలు చేశారన్న సాకుతో ఆయనకూ మొండి చేయి చూపించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన ఖాతాలో వేశారు. తద్వారా బుచ్చయ్య చౌదరిని పక్కకు తప్పిస్తున్నారు. మరో టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడూ గతంలో పవన్‌పై వెటకారంగా మాట్లాడారు. ఆయన కుమారుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పవన్‌ను ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారు. ఈ కారణాన్ని చూపించి, అయ్యన్న కుటుంబాన్ని పవన్‌తో చెప్పించిన జాబితాలో చేర్చారు. అనకాపల్లి ఎంపీ సీటు తన కుమారుడికి ఇవ్వాలని అయ్యన్న కోరగా, ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేశారు. ఇలా ఆయన్నపాత్రుడుని, ఆయన కుమారుడిని రాజకీయంగా దెబ్బ తీశారు. ఇంకా మరికొందరికి కూడా పవన్ ముసుగులో దెబ్బేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. నేరుగా చెప్పడానికి భయపడి.. వాస్తవంగా సీనియర్ నేతలు, రాజకీయంగా పట్టు ఉన్న అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ వంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కానీ, నియోజకవర్గంలో వారిని కాదని వేరొకరికి టిక్కెట్టు ఇస్తే, వచ్చే కాసిని ఓట్లు కూడా పోతాయని, ఇంతకాలం రాజకీయం, అధికారం ముసుగులో తన నేతృత్వంలో జరిగిన అక్రమాలన్నింటినీ వారు బయటపెడతారన్న ఆందోళన చంద్రబాబులో ఉంది. ఈ భయంతోనే పవన్‌ను వాడుకొని వారికి మొండి చేయి చూపిస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. -
నాదెండ్ల బుకాయింపు.. రామోజీ దరువు!
సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట! చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్ధాలు వల్లిస్తే రాజగురువు రామోజీ తాటికాయంత అక్షరాలతో ముద్రించి మురిసిపోయారు! సలహాదారుల పేరుతో 89 మందిని నియమించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.680 కోట్లు వ్యయం చేసిందని.. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే రూ.140 కోట్లు చెల్లించారంటూ నాదెండ్ల గాలి కబుర్లు చెప్పారు.అసలు ప్రభుత్వం నియమించిందే 46 మంది సలహాదారులైతే మిగతావారంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు? నాదెండ్ల ఆరోపణల్లో నిజం లేదని ఇక్కడే తేలిపోతోంది. నెలకు రూ.లక్షన్నర లోపే జీతభత్యాల రూపంలో చెల్లిస్తుండగా ఏకంగా రూ.వందల కోట్లు ఇస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచురించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏ హోదాలో సలహాదారులను నియమిస్తోంది? వారికి వేతనాలు, భత్యాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలు జీవోల రూపంలో పారదర్శకంగానే ఉన్నా గోప్యంగా దాచిపెడుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడుతోంది. 2023–24లో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం బడ్జెట్ కేటాయింపులే రూ.29.61 కోట్లు అయినప్పుడు ఒక్క సలహాదారులకే రూ.వందల కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. ♦ రాష్ట్రప్రభుత్వం ఐదు కేటగిరీలుగా సలహాదారులను నియమిస్తోంది. కేటగిరీ ‘ఎస్’ కింద నియమితులైన వారికి క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. వారికి సిబ్బంది కానీ జీతభత్యాలు కానీ ఉండవు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులకు క్యాబినెట్ మంత్రులతో సమానంగా వసతులు క ల్పిస్తారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎలాంటి గౌరవ వేతనాలు లేకుండా సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ♦చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని డిజైన్ల పేరుతో ప్రచార ఆర్భాటం కోసం కన్సల్టెన్సీలు, సలహాదారులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని గుమ్మరించారు. నార్మన్ ఫోస్టర్, సుర్బానా జురాంగ్ తదితర కన్సల్టెన్సీ సంస్థలు ఈ జాబితాలోనే ఉన్నాయి.పోలవరం సందర్శన పేరుతో చంద్రన్నకు జయము జయము అంటూ సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించేందుకు డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో షూటింగ్‌లను తలపిస్తూ సినీ దర్శకుడితో డ్రోన్లతో చిత్రీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతోపాటు అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న రామోజీగానీ నాదెండ్లగానీ అప్పుడు నోరెత్తితే ఒట్టు!.ఫేక్ ప్రచారంఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న టీడీపీకి ఈసారి కూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమని, శాశ్వత సమాధి తప్పదని వైఎస్సార్సీపీ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొంది. సలహాదారులకు రూ.వందల కోట్లు చెల్లిస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను వల్లిస్తున్నారని మండిపడింది. -
మద్యంకుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. చీకటి జీవోలతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా రూ.1,300 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన తీరుపై కీలక ఆధారాలు సేకరించింది. దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120 (బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నోట్ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టురట్టు: రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరుపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్‌కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు. అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. మరోపక్క డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, అప్పటివరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండిపడిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఈ మొత్తం బాగోతంపై గురించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇక నిందితుల విచారణే మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు ఉపక్రమిస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంది. ప్రధానంగా నోట్‌ఫైళ్లు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధంగా నోట్‌ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత కూడా బార్ల యజమానుల పేరిట వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చిన పన్నాగాన్ని ఛేదించనుంది. అందుకోసం త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. నిందితుల విచారణకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. వారికీ నోటీసులు జారీ చేయనుంది. మద్యం కంపెనీల ప్రతినిధులతోపాటు కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధపడుతోంది. ఆ విచారణ ద్వారా గుర్తించిన అంశాలను సమీక్షించిన తరువాత కేసు దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈ లోపే పోలింగ్ స్టేషన్లు, మౌలిక వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 5వ తేదీకల్లా ర్యాంపుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులనే తప్పనిసరిగా నియమించాలని, సకాలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లోనూవెబ్ టెలికాస్టింగ్ జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని చెప్పారు. సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లలతో పాటు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వెబ్ కాస్టింగ్‌పై తాత్కాలిక నివేదికను వెంటనే పంపాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 50 శాతం పోలింగ్ స్టేషన్లు వెబ్ టెలీకాస్టింగ్‌లో కవర్ అవ్వాలని, ఇది పోలింగ్ స్టేషన్‌కే పరిమితం కాకుండా చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలు కూడా కవర్ అవ్వాలని తెలిపారు. ప్రాంతాలవారీగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్ కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే సోమవారానికల్లా ఎన్నికల నిర్వహణ ముసాయిదా పంపాలి ప్రతి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ముసాయిదా ప్రతిని వచ్చే సోమవారానికల్లా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీల సమన్వయంతో అక్రమ నగదు, లిక్కరు, ఇతర నిషేధిత సామగ్రి రవాణాపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే కాకుండా జిల్లాల్లోనూ అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఇందుకు సంబందించిన నివేదికలను తమకు సకాలంలో పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు ఎస్.మల్లిబాబు, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సమన్వయకర్తల నియామకం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/ఏలూరు/రాజమహేంద్రవరం సిటీ/నెల్లూరు: రాష్ట్రంలో మరో ఆరు శాసనసభ, నాలుగు లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ప్రజాబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం పాటిస్తూ... ఆరో జాబితా తయారు చేసినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. గత ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా... ఈ సారి బీసీ వర్గానికి చెందిన మహిళా అడ్వొకేట్ గూడూరి ఉమాబాలను ఎంపిక చేశారు. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్(బీసీ)ను, గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరుకు సిటింగ్ ఎంపీ ఎన్.రెడ్డప్పను ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో మైలవరం శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఈ సారి సర్నాల తిరుపతిరావు యాదవ్(బీసీ)ను నియమించారు. గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఇప్పుడు మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. మార్కాపురానికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరుకు ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, గంగాధరనెల్లూరు(ఎస్సీ)కు డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, నెల్లూరు సిటీకి ఎండీ ఖలీల్‌ను నియమించారు. వీరి నియామకంతో ఇప్పటివరకూ 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను కొత్తగా నియమించినట్టయింది. ఇప్పటిదాకా ప్రకటించిన శాసనసభ స్థానాల సమన్వయకర్తల్లో 21 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 18 మంది బీసీలు, ఐదుగురు మైనార్టీలు, 16 మంది ఓసీలకు చెందిన వారు ఉన్నారు. 16 లోక్‌సభ స్థానాలకు నియమించిన సమన్వయకర్తల్లో బీసీలు తొమ్మిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీలు నలుగురు ఉన్నారు. ఈసారి వెలువరించిన జాబితాలో ఐదుగురు కొత్తవారు ఉండటం గమనార్హం. గుంటూరు లోక్‌సభకు వెంకటరమణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపికైన ఉమ్మారెడ్డి వెంకటరమణ వాస్తవానికి తొలిసారిగా బరిలో నిలవనున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి చీఫ్ విప్‌గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఈయన పెద్దకుమారుడు. 1961లో జన్మించిన ఈయన మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాధ్యతలు చూస్తున్నారు. నర్సాపురం నుంచి తొలి బీసీ మహిళ నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా తొలిసారిగా బీసీ మహిళను ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలైన గూడూరి ఉమాబాల పేరెన్నిక గన్న న్యాయవాది. న్యాయవాద విద్యలో బంగారు పతకం సాధించిన ఆమె న్యాయవాదిగా ఉంటూనే 1995 నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2001లో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఐఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకాతిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యురాలుగా కూడా వ్యవహరించారు. ప్రజల నాడి పట్టగల డాక్టర్ శ్రీనివాస్ రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్వగ్రామం నరసాపురం. ఎంబీబీఎస్, డీఎల్ఓ (ఈఎన్టీ), ఎండీ (పల్మానాలజీ) ఎఫ్‌సీసీపీ అభ్యసించిన ఈయన విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో శ్వాసకోశ నిపుణులుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ ఐఎంఏ సెక్రటరీగా, రాజమహేంద్రవరం ఏపీఎన్ఏ సెక్రటరీ ప్రెసిడెంట్‌గా, ఉమ్మడి తూర్పు గోదావరి ఇండియన్ చెస్ట్ సొసైటీ సభ్యునిగా వ్యవహరించారు. ఈయన భార్య గూడూరి రాధిక అడ్వొకేట్‌గా మాజీ కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన 8 నెలల క్రితం వైఎస్సార్సీపీలో చేరారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. అనంతరం ఆయన స్థానంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను నియమించి, ఈయన్ను రాజమహేంద్రవరం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. మృదు స్వభావిగా, వైద్యునిగా మంచి ఆదరణ పొందారు. జెడ్పీటీసీకి నియోజకవర్గ బాధ్యతలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సర్నాల తిరుపతిరావు(బీసీ–యాదవ) ప్రస్తుతం జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2013నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి డిప్యూటీమేయర్ నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన ఎండీ ఖలీల్ ప్రస్తుతం నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు నగరం 43వ డివిజన్ పరిధిలోని జెండావీధి ప్రాంతంలోగల కంతర్షావలీ దర్గా సమీపంలో నివసిస్తున్న మహ్మద్‌గౌస్, మహ్మద్‌జుబేదాబేగం దంపతుల ఏడుగురి సంతానంలో ఈయన చివరివాడు. డీవైఎఫ్ఐలో కొంతకాలం పనిచేసి, తరువాత సీపీఎంలో సభ్యుడిగా చేరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఆయనకు అభిమానిగా మారారు. వైఎస్సార్ మరణం అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. 2013, 2021లో కార్పొరేటర్‌గా పోటీచేసి విజయం సాధించారు. -
నీడనిచ్చిన కుప్పాన్నికూడా.. చప్పరించేసారు
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన రెక్కల కష్టంతో నిర్మించిన పార్టీని, అధికారాన్ని గుంజుకోవడాన్ని ఏమంటారు? మోసం.. ద్రోహం.. వంచన అనే కదా! నోట్ల కట్టలతో దొంగ ఓట్లతో మూడు దశాబ్దాలుగా నెగ్గుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ప్రజలకు చుక్క నీళ్లు ఇవ్వకుండా ఖజానాను దోచేసిన మనిషిని నమ్మక ద్రోహి అనే కదా అంటారు! రాజకీయ అరంగేట్రంలోనే చంద్రబాబు ఫోర్ ట్వంటీ వేషాలు వేయడంతో సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి ప్రజలు తరిమికొట్టారు. గత్యంతరం లేక వలస వెళ్లిన కుప్పంలోనూ ఆయన అవే వేషాలు వేశారు! ఏడుసార్లు తనను గెలిపించిన కుప్పాన్ని తన కమీషన్ల కోసం తాకట్టు పెట్టి.. నీళ్లివ్వకుండా ఎండగట్టారు! సాక్షి, అమరావతి: కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను తరలించి సాగు, తాగునీరు అందిస్తానని నమ్మబలికిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆ ముసుగులో ఖజానాను దోచేసి పనులు చేయలేక చేతులెత్తేసి నయవంచనకు పాల్పడ్డారు! తన కమీషన్ల కోసం సొంత నియోజకవర్గం కుప్పంను తాకట్టుపెట్టి నీచ రాజకీయం చేస్తున్నారు. బాబు ఇలా మోసం చేస్తే, 2022 సెప్టెంబర్ 23న కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మేలు చేస్తున్నారు. పూర్తయిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ నెలలోనే సీఎం జగన్ ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇప్పటికే రామకుప్పం మండలం వరకూ కృష్ణా జలాలను తరలించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులు నింపి సమృద్ధిగా సాగు, తాగునీరు అందించనున్నారు. పురిటిగడ్డకు ద్రోహం సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రబాబు నాడు టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడి చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ దెబ్బకు 1985 ఎన్నికల్లో పోటీ చేయడానికే జంకిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ పంచన చేరి 1989లో తమిళనాడు, కర్ణాటక, రాష్ట్ర సరిహద్దుల్లోని కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. అప్పటి నుంచి గూండాయిజం, నోట్ల కట్టలు, దొంగ ఓట్లతో నెగ్గుకొస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం లో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతిలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు, తాగునీరు అందిస్తానని చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో చిత్తూరు జిల్లా పెద్దపంపాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు (పంప్ హౌస్‌లు) దశల్లో ఎత్తిపోసి 123.641 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని నమ్మించారు. అంచనాల్లోనే రూ.120 కోట్ల లూటీ! కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను 123.641 కి.మీ. పొడవున తవ్వేందుకు 98,85,140 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 3,84,457 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. 2015–16 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టిపనికి రూ.89, క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనికి రూ.3 వేలు చొప్పున వ్యయం అవుతుంది. ఈ లెక్కన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మట్టి, కాంక్రీట్ పనులకు రూ.203.11 కోట్లు ఖర్చు అవుతుంది. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్మైన్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. 2015–16 ధరల ప్రకారం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.293.11 కోట్ల వ్యయం అవుతుంది. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015 మేలో అంచనాలు రూపొందించారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే టెండర్ల దశలోనే రూ.120 కోట్ల మేర పెంచేసినట్లు స్పష్టమవుతోంది. కడప టీడీపీ అధ్యక్షుడికి కానుక.. అంచనా వ్యయం పెంచేసిన పనులను కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టి రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. ఆ మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.413 కోట్లు అంచనా విలువగా నిర్ణయించి 2015 ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు పెట్టారు. టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక(ఎక్సెస్) ధరకు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఒకే షెడ్యూలు (సింగిల్ బిడ్) దాఖలైతే ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ పిలవాలి. కానీ చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆర్కే ఇన్ఫ్రాకు 4 శాతం అధిక ధరకు రూ.430.26 కోట్లకు పనులు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.43 కోట్లు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి వాటిని బాబు జేబులో వేసేశారు. సీఎం రమేష్ పేచీతో చెరిసగం.. శ్రీనివాసరెడ్డికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చుతూ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కట్టబెట్టడంపై అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేచీ పెట్టారు. తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ఒత్తిడి చేయడంతో దిగివచ్చి న చంద్రబాబు చీకటి పంచాయితీ చేశారు. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు 50 శాతం పనులు, మిగతా 50 శాతం పనులు సీఎం రమే‹Ùకు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్కు సబ్ కాంట్రాక్టు కింద ఇవ్వాలని ఆదేశించారు. ప్రధాన కాంట్రాక్టర్‌పై వేటు.. ‘సబ్’కే మొత్తం చెరి సగం పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్ క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీ లబ్ధి పొందుతూ వచ్చారు. వారి వద్ద నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు కమీషన్లు వసూలు చేసుకుంటూ వచ్చారని టీడీపీ నేతలే అప్పట్లో ఆరోపించారు. తనతోపాటు శ్రీనివాసరెడ్డి భారీ ఎత్తున లబ్ధి పొందుతుండటాన్ని సహించలేని సీఎం రమేష్ మొత్తం పనులను తనకే కట్టబెట్టాలని మరోసారి పేచీకి దిగారు. దీంతో పనులన్నీ రిత్విక్ ప్రాజెక్టŠస్కే కట్టబెట్టాలని జలవనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డిపై వేటు వేసి సీఎం రమేష్‌కు చెందిన రితి్వక్ ప్రాజెక్టŠస్కే మొత్తం పనులు అప్పగించేశారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. సీఎం జగన్ అధికారం చేపట్టాక ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కుప్పంను మున్సిపాల్టీని చేశారు. కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. మున్సిపాల్టీతోపాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ యుద్ధప్రాతిపదికన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేయించారు. ఇప్పటికే కుప్పం బ్రాంచ్ కెనాల్ 74 కి.మీ. వరకూ అంటే రామకుప్పం మండలం మనేంద్రం గ్రామం వరకూ కెనాల్ నీటిని తరలించారు. చెరువులను నింపి సాగు, తాగునీరు అందించనున్నారు. రూ.460.88 కోట్లు నీళ్ల పాలు.. కుప్పం బ్రాంచ్ కెనాల్లో సీఎం రమేష్ సంస్థకు రూ.460.88 కోట్లను 2019 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. నాసిరకమైన పైపులు వేయడం వల్ల వర్షపునీటికే పగిలిపోయాయి. దీన్ని బట్టి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో సీఎం రమేశ్ తో కలిసి చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారో విశదం చేసుకోవచ్చు. వరుసగా ఏడు సార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీళ్లు కూడా అందించకుండా చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు. పాలార్‌కు మోకాలడ్డు కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా కుప్పం మండలం గణేశపురం వద్ద పాలారు నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.55 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ పనులను 2005లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రిజర్వాయర్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల మందికి తాగునీరు అందించేలా పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే కుప్పం నియోజకవర్గంలో తనకు రాజకీయంగా ఉనికి లేకుండా పోతుందని ఆందోళన చెందిన చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. పాలారు రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, దాని నిర్మాణాన్ని నిలిపివేసేలా ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వంతో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. పాలార్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అప్పట్లో ఆ పనులు ఆగిపోయాయి. -
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
రామోజీకి షాక్.. మార్గదర్శికి సుప్రీంకోర్టు ఝలక్
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, మార్గదర్శికి సంబంధించిన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలు.. ఆంధ్రప్రదేశ్‌లోనే మార్గదర్శి చిట్‌ఫండ్స్ నేరాలకు పాల్పడింది. ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదు. ఏపీలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏటా రూ.3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తోంది. సీఐడీ పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలి. ఈ కేసుల్లో 150 మంది సాక్షుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీకి ఆధారం కాదు. ఏపీ హైకోర్టు న్యాయపరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోని చెప్పింది. ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన న్యాయస్థానం. కేసులో దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చేస్తోంది. మార్గదర్శిపై ఏపీ సీఐడీ దర్యాపు.. మార్గదర్శి చిట్‌ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే, అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు?. రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్‌గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్‌వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్‌భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్‌భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ►ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ►ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. ►మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు. ►ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు ►విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు ►రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. ►చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. ►చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. ►పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ►ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే.. 288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ►ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
టీడీపీ తరఫున లోకేశ్ పిటిషన్ ఎలా వేశారు?
సాక్షి, హైదరాబాద్: ‘వ్యూహం చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కమిటీ జారీ చేసిన యు సర్టిఫికెట్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. ఇక్కడకు అప్పీల్ వచ్చింది.. సమాచారం ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కోరడం ఆమోదయోగ్యం కాదు..’ అంటూ టీడీపీ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడి(అచ్నెన్నాయుడు, ఏపీ) అనుమతి లేకుండా పిటిషన్ వేయడానికి రిట్ పిటిషనర్(లోకేశ్)కు ఏం అధికారం ఉందని ప్రశ్నించింది. ‘విచారణకు సిద్ధమై రావాలి కదా.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు వెల్లడించండి. పార్టీ నిబంధనల ప్రకారం ఏపీ అధ్యక్షుడి అనుమతి ఎందుకు తీసుకోలేదు?’ అని మండిపడింది. శుక్రవారం వరకు సమయం కావాలని టీడీపీ న్యాయవాదులు అడగడాన్ని తప్పుబట్టింది. వ్యూహం చిత్రానికి సీబీఎఫ్సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిర్మాత తరఫున సీనియర్ న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, చిత్ర విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
వరదాపురం సూరి ఓవర్ యాక్షన్
ధర్మవరం: రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి ధర్మవరం పట్టణంలో గురువారం హైడ్రామాకు తెరలేపారు. రహదారి అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ అనుచరులను రెచ్చగొడుతూ నానా యాగి చేశారు. గత ఎన్నికల్లో వరదాపురం సూరి ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ధర్మవరం టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాదరణలో అత్యంత బలవంతుడైన కేతిరెడ్డిని ఢీకొట్టే సత్తా తనకు మాత్రమే ఉందని కలరింగ్ ఇచ్చేందుకు ఫీట్లు చేస్తున్నారు. టెండర్లు పూర్తయిన విషయం తెలుసుకుని డ్రామా 2019లో అప్పటి ఎమ్మెల్యే సూరి రూ.28 కోట్లతో ధర్మవరం పట్టణంలో రోడ్డు వేశారు. రోడ్డు పనులు అత్యంత నాసిరకంగా చేయడంతో పదినెలలు గడవకముందే శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించి రూ.4 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రహదారిని నిరి్మంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 5న జీఓ విడుదల చేశారు. ఈ క్రమంలో అధికారులు జనవరి 18న టెండర్ ప్రక్రియ సైతం పూర్తిచేశారు. గురువారం రోడ్డు పనులు ఎమ్మెల్యే కేతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్నాయి. కానీ వరదాపురం సూరి రాజకీయ లబ్ధి కోసం హంగామా చేశారు. తన సొంత నిధులతో రోడ్డు వేస్తానని అనుమతి ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను కోరగా, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలుమార్లు అధికారులను కలుస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే గురువారం రోడ్డు పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో వరదాపురం సూరి హైడ్రామాకు తెరలేపారు. ఉదయాన్నే మార్కెట్‌యార్డుకు రెండు టిప్పర్లు తీసుకువచ్చి పనులు చేస్తామంటూ అనుచర గణంతో బైఠాయించారు. డీఎస్పీ టీ. శ్రీనివాసులు, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు సూరి వద్దకు వెళ్లి రోడ్డు పనులకు ఆటంకం కల్గించవద్దని ఎంత సర్ది చెప్పినా వినకుండా పోలీసులపైకి దౌర్జన్యం చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పట్టణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకం కల్గిస్తూ రహదారిపై ధర్నా, పోలీసులపై దౌర్జన్యం తదితర కారణాలతో వరదాపురం సూరితో పాటు అనుచరులు 29 మందిని పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐపీసీ 143, 145, 188, 341, రెడ్‌విత్ 149 కింద కేసులు పెట్టారు. సూరికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ టీ. శ్రీనివాసులు తెలిపారు. -
పచ్చపార్టీలో కేసుల టెన్షన్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దౌర్జన్యానికి దిగారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీలతోపాటు మిగిలిన అధికారులను దుర్భాషలాడారు. అంతేకాకుండా తెగించిన పచ్చ ముఠా మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అనుచరులు కామినేని జనార్దన్, చల్లగుండ్ల కృష్ణ, నడింపల్లి హనుమాన్‌ప్రసాద్, ఎస్.ఏ.రజాక్, మిన్నేకంటి రవి, అడుసుమల్లి వెంకట శ్రీనివాసరావు, పత్తిపాటి సురేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చల్లగుండ్ల కృష్ణ, ఎమ్మెల్యే ఏలూరిని మినహా మిగిలిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌చేసి బుధవారం అద్దంకి కోర్టులో హాజరు పర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎమ్మెల్యే ఏలూరితోపాటు చల్లగుండ్ల కృష్ణ పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. ఏలూరి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయతి్నస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఆందోళనలో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఏలూరి అక్రమాలకు దన్నుగా నిలిచిన పుణ్యానికి పోలీసు కేసులు పెట్టించుకొని ఆయన కంపెనీ ఉద్యోగులు, అనుచరులు లబోదిబోమంటున్నారు. నోవా అగ్రిటెక్ మాటున నల్లధనంతో ఎన్నికల్లో దొంగ ఓట్లు, ఓట్ల కొనుగోలు ఇతర అక్రమాలకు పాల్పడ్డారు. గ్రానైట్ అక్రమ రవాణాపై ఫిర్యాదులతో తనిఖీకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే ఆదేశాలతో దాడులు చేసి కేసులు పెట్టించుకోవాల్సి రావడంతో గ్రానైట్ వ్యాపారులు, అనుచరులు లబోదిబోమంటున్నారు. గొడవ పడింది సాక్షాత్తూ మైనింగ్, విజిలెన్స్ అధికారులతో కావడంతో ఇక నుంచి రాయల్టీ, జీఎస్టీలు లేకుండా గ్రానైట్ రవాణా వ్యాపారం ఎలా చేయాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు. చేసేది అక్రమ రవాణా కావడంతో మైనింగ్ అధికారుల కన్ను దాడిచేసిన తమపైనే ఉంటుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులతో పెట్టుకుని అందరినీ ఇబ్బందులకు గురిచేశారంటూ మిగిలిన గ్రానైట్ వ్యాపారులు ఏలూరికి మద్దతు పలికిన వ్యాపారులను చీవాట్లు పెడుతున్నారు. ఏ–1గా ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యే ఏలూరి రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లధనంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు బయటపడటంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన కంపెనీ ఉద్యోగులు పలువురిపై కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కార్యాలయంలో గత నెల 24న జీఎస్టీకి సంబంధించి రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్( ఏపీఎస్ డీఆర్ఐ) అధికారులు జరిపిన తనిఖీల్లో అక్రమాలకు సంబంధించి వివరాలున్న డైరీలు బయటపడ్డాయి. ఏలూరి పెద్దఎత్తున నల్లధనాన్ని వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని భావించిన అధికారులు ఎమ్మెల్యే, కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ–1 గా ఉన్నారు. ఆయనతోపాటు కంపెనీ ఉద్యోగులు పుల్లెల అజయ్‌బాబు, అప్పారావు, బాజిబాబు, సాయిగణేశ్లపైనా ఇంకొల్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం నోటీసులు ఇచ్చి వీరిని విచారించనున్నారు. తొలుత పట్టుబడ్డ డైరీని స్వా«దీనం చేసుకొని దాంట్లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు విచారణలో ముందుకెళ్లనున్నారు. బయటపడుతున్న అక్రమాల చిట్టా ఎన్నికల వేళ ఏలూరి అక్రమాలు వెలుగు చూడటంపై ముఖ్యంగా టీడీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. ఏలూరి అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటç³డటం నష్టం చేకూరుస్తుందని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలే దొంగ ఓట్ల పుణ్యమాని గత రెండు ఎన్నికల్లో అతితక్కువ మెజార్టీతో బయట పడ్డామని, ఈసారి నియోజకవర్గంలో 12 వేలకు పైగా దొంగ ఓట్లు తొలగింపుతో గెలిచే పరిస్థితి లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రామోజీ... కళ్లు కనిపించడం లేదా? మేం బతికే ఉన్నాం
ఉన్నవి లేనట్టు... లేనివి ఉన్నట్టు పచ్చ పత్రిక అడ్డగోలు రాతలతో భ్రమింపజేస్తోంది. ఓటర్ల జాబితాలో ఉన్నవారు చనిపోయినట్టు చిత్రీకరిస్తోంది. ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకలేనని నిర్ధారించేస్తోంది. ఎలాగోలా చంద్రబాబునాయుడును గద్దెనెక్కించడమే తమ లక్ష్యంగా దిగువస్థాయి నుంచి రామోజీ వరకూ అడ్డగోలు రాతలతో జనాన్ని తప్పుదారి పట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేసింది. – సాక్షి, నంద్యాల అక్రమాలకు తెరతీసిన టీడీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఓటర్ల అక్రమాలకు తెరలేపారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ సాయంతో గంపగుత్తంగా ఓటు హక్కు కోసం ఫారం–6లు నమోదు చేశారు. ఓటర్ జాబితాలో అనర్హులను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఫారం–7లను బూత్ స్థాయి అధికారులకు, ఎలక్ట్రోరల్ రిజి్రస్టేషన్ అధికారుల కార్యాలయాల్లో అందజేశారు. దురుద్దేశంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వచ్ఛమైన తుది ఓటరు జాబితా రూపొందించారు. అయితే ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతూ విషం కక్కుతోంది. పచ్చ పత్రిక పిచ్చి రాతలు పాణ్యం: పచ్చ పత్రిక విషపూరిత రాతలతో జనాన్ని పిచ్చెక్కిస్తోంది. లేనిపోని రాతలతో తప్పుదారి పట్టిస్తోంది. పాణ్యం నియోజకవర్గంలోని 131వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఆర్.జయరామ్, అతని భార్య ఆర్.రేణుకలకు ఓటు హక్కు ఉంది. వీరు అద్దె ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత సొంతింట్లోకి మారిన తర్వాత ఆర్.జయరామ్ మరణించారు. 131 బూత్‌లో ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని ఆర్.రేణుక ఫారం–7 ద్వారా అభ్యర్థించారు. పరిశీలించిన బీఎల్ఓలు ఆమె ఓటు(ఎన్‌కేడీ నంబర్ 2458899)ను జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం 130 పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు నమోదైంది. అయితే భర్తతో పాటు భార్యకు కూడా 131లో ఓటు హక్కు తొలగించారని రాశారు. వాస్తవానికి ఆమె అభీష్టం మేరకే 131 బూత్‌లో భర్త ఓటు తొలగించి ఆమె ఓటును మార్చడం గమనార్హం. -
కొవ్వూరు టీడీపీలో ఇరు వర్గాల కొరకొర
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్‌పై అసమ్మతి రగులుతోంది. టీడీపీలోని ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గంలో వారి సానుభూతిపరులను ఏకం చేస్తున్నాయి. రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్‌కు అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తామని, తమ అభిప్రాయాన్ని కాదని అవకాశం కల్పిస్తే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈమేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరులో ఈ రెండు వర్గాల నాయకులు గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘జవహర్ వద్దు – టీడీపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిణామం కొవ్వూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ముప్పిడిని బరిలోకి దింపే యోచన కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు ఈ రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి పోటీని అంగీకరించారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు భరోసాతో ముప్పిడి రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు. నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. గతంలో జవహర్‌తో ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సన్నిహితంగా మెలిగారు. ఆ సాన్నిహిత్యంతో ఆయన ఆర్థికంగా ఎదిగినట్లు చెబుతారు. అనంతరం వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలతో చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబు వర్గాన్ని వ్యతిరేకించడంతో ఆయన కూడా వ్యతిరేక కూటమి కట్టారు. ఫ్లెక్సీల వివాదం తమ పంతం నెగ్గించుకోడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో వ్యక్తుల పేర్లకు బదులు గ్రామ టీడీపీ నేతలు అని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు. జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు జవహర్‌కు వ్యతిరేకంగా తాజాగా మరో నినాదాన్ని తెర పైకి తీసుకువచ్చారు. ‘జవహర్ వద్దు.. టీడీపీ ముద్దు’ అని ప్రచారం చేస్తున్నారు. గురువారం ఓచోట ఆత్మీయ సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. జవహర్‌ను కొవ్వూరు అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని ఆరోపించారు. నియోజకవర్గ నాయకులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. జవహర్ వైపే అధినేత మొగ్గు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటికి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు వర్గాలూ టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం వ్యతిరేకమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఈ వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
దేశంలో టాప్–10లో ఏపీ డిస్కంలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నాయి. తాజాగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ప్రకటించిన టాప్ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్ సాధించాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, కె.సంతోషరావులు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రోజువారీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతల్లేకుండా అందిస్తూ ఏపీ రికార్డులు సృష్టిస్తోంది. దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్‌ను అందిస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన వినియోగదారుల సేవా రేటింగ్ 2022–23 నివేదిక ప్రకారం.. జాతీయ సగటు విద్యుత్ సరఫరా పట్టణ ప్రాంతాల్లో 23.59 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 21.26 గంటలుగా ఉంది. కానీ మన రాష్ట్రంలో పట్టణాల్లో 23.85 గంటలు, గ్రామాల్లో 23.49 గంటల పాటు సరఫరా అందిస్తున్నారు. జాతీయ సగటు అంతరాయ సూచికతో పోల్చితే మన డిస్కంలలో సగానికంటే తక్కువగా ఫీడర్ అంతరాయాలు నమోదవుతున్నాయి. సేవలకు దక్కిన గుర్తింపు ఏడాదిలో ఈ జాతీయ సగటు అంతరాయ సూచిక 200.15 కాగా, ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఎస్పీడీసీఎల్)లో 42, ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్)లో 79.68, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీసీపీడీసీఎల్)లో 103.86 చొప్పున పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఫీడర్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీ) వైఫల్యం రేటు 2.01 శాతం మాత్రమే ఉంది. దీని జాతీయ సగటు 5.81 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంతే కాకుండా 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో 5.31 శాతానికి తగ్గాయి. కొత్త సర్వీసులకు వంద శాతం మీటరింగ్ పూర్తి చేయడంతో పాటు రిపేర్ వచ్చిన వాటి స్థానంలో త్వరితగతిన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మాన్యువల్ జోక్యం లేకుండా ఇన్ఫ్రారెడ్(ఐఆర్) పోర్ట్ ద్వారా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీస్తున్నారు. అలాగే వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు బిల్లింగ్ హెచ్చరికలు పంపిస్తూ ఆలస్య చెల్లింపుల జరిమానాలు పడకుండా వారిని అప్రమత్తం చేయడం వంటి చర్యలను కేంద్రం తన అధ్యయనంలో పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్, విశ్వసనీయత, రెవెన్యూ కనెక్షన్లలో చేసిన కృషి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకున్న చర్యలు, మీటరింగ్, బిల్లింగ్, తప్పులను సరిదిద్దడం, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఈ క్రమంలో సాధించిన విజయాల ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏపీ డిస్కంలకు టాప్ టెన్‌లో స్థానం కల్పించింది.