AP Special
-
వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ పోస్టుల భర్తీ కొనసాగుతుండగానే మరోవైపు 253 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 234 పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. 7 వరకు దరఖాస్తులకు అవకాశం కాగా ఎన్హెచ్ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్ వైద్య పోస్టులకు http://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ వర్గాలకు చెందినవారు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మైదాన ప్రాంతాల్లో అయితే నెలకు రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు 7416664387/8309725712 నంబర్లను సంప్రదించవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్‌ను సైతం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా బోర్డుకు అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ కొనసాగుతోంది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్/కర్నూలు(హాస్పిటల్): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారికి శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలకు గుంటూరు జీజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తాగడం వల్ల ఏర్పడిన ఈ రాళ్లను జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగించారు. సుమారు రూ.1.50 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. బాలిక ఛాతీలో కణితి తొలగింపు కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మ(15)కు ఛాతీలో గుండె పక్కన గడ్డ వచ్చింది. గుండె వెనుక భాగంలో న్యూరో ఫైబ్రోమా అని పిలిచే ఈ గడ్డ నరాల నుంచి వస్తోందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంది. ఇలా చేస్తే బాలిక కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఆ బాలిక పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉన్నందున వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ తొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించినట్లు కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్‌లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్‌లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
'కడప గడ్డపై ఓ కపట నాటకం' తెరపైకి సౌభాగ్యమ్మ!
అడుగడుగునా రాక్షసత్వం కనిపించే అత్యంత విస్తృతమైన నాటకమిది. పాత్రలు ఎవరైనా.. ఆడించేది మాత్రం చంద్రబాబు నాయుడు, ఆయన కోసం పనిచేసే మనుషులే!!. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అయినా... ఆయన మనుషులు అన్నిచోట్లా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు... ఇలా ఎక్కడ ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే. కాకపోతే ఎంతమంది ఎన్ని చేసినా... జనం మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవటం ఆయనకు చేత కావటం లేదు. ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోవటం అసాధ్యమని భావించటంతో.. విషప్రచారమే లక్ష్యంగా జగన్‌పైకి సొంత కుటుంబీకులనే పంపటానికి కుట్రపన్నారు. కడప కేంద్రంగా... కుట్రలన్నిటికీ కేంద్రస్థానం లాంటి భయంకరమైన కూహకానికి తెరతీశారు. (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : ఇడుపులపాయలో రెండ్రోజుల కిందట షర్మిల–సునీత కలిశారు. దానికి ఎల్లో మీడియా ఎందుకు అంత ప్రాధాన్యమిచ్చింది? హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా కలిసే ఈ అక్కచెల్లెళ్లిద్దరూ ఒకరినొకరు ఇడుపుల పాయలో కలిస్తే అంత ప్రాధాన్యమెందుకు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించటమనేది ఇక్కడ దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే... బీజేపీకి తప్పుడు సంకేతాలు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు వ్యతిరేకంగా మారవచ్చని సునీత భయం. దీంతో... ఆమె తల్లి సౌభాగ్యమ్మను తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే బీజేపీలోని సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటి టీడీపీ నేతలే ఈ కేసులో ఆమెకు ఆర్థికంగా, న్యాయపరంగా సహకరించటంతో పాటు రికమెండేషన్లు, పైరవీల్లోనూ సాయం చేస్తున్నారు. ఇక తెలుగుదేశంలో చేరిపోతే... బాబు నాయుడితో, ఏబీఎన్ రాధాకృష్ణతో, వివేకాను అనైతికంగా ఓడించిన బీటెక్ రవితో తమ సత్సంబంధాలు బాహాటంగా బయటపడిపోతాయని... ఇన్నాళ్లూ కేసును వెనకనుంచి నడిపింది వీరేనన్న సత్యం వెల్లడయిపోతుందని భయం. దీంతో బాబు ప్లాన్ ప్రకారం... సునీత తల్లి సౌభాగ్యమ్మను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టేటట్లుగా, దానికి కాంగ్రెస్, టీడీపీ నూరు శాతం మద్దతిచ్చేట్లుగా వీరి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఇలా చేస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డిపై వీలైనంత బురద జల్లవచ్చని, కుటుంబంలోని వ్యక్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారనే ముసుగులో కుటుంబీకుల మద్దతు అడగవచ్చనేది వారి ఆలోచన. పైపెచ్చు కుటుంబంలోని వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా... మద్దతివ్వకుండా ఆమెపై అభ్యర్థిని నిలబెట్టారనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పైనా దు్రష్పచారం చేయాలనేది వారి కుట్ర. ఇది కుట్ర అని అడుగడుగునా తెలిసిపోతున్నా... పాత్రధారులు మాత్రం బాబు నాయుడి ఉచ్చులో పడి ఆయన చెప్పినట్లు చేసుకుంటూ పోతుండటమే అన్నిటికన్నా విచిత్రం. వివేకా హత్య జరిగిన నాటి నుంచి వరసగా మారుతున్న పరిణామాలు... దీన్లోని లోతైన కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతాయి. మీ నాన్నను చంపింది నేనే! అని చెప్పినా... ఇతను వివేకా మాజీ డ్రైవరు. వివేకాను తానే గొడ్డలితో నరికి నరికి కిరాతకంగా చంపానని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి న వ్యక్తి. రూ.500, వెయ్యి అప్పులు తెచ్చుకుని గాలికి తిరిగే ఈ దస్తగిరి ఆర్థిక పరిస్థితి... వివేకా కేసులో అప్రూవర్‌గా మారాక ఒక్కసారిగా టర్న్ అయింది. కార్లలో డ్రై వరును పెట్టుకుని తిరిగే స్థితికి వచ్చేశాడు. వివిధ కోర్టుల్లో ఈయనపై ఉన్న కేసుల కోసం లాయర్లను సునీత, చంద్రబాబు, బీటెక్ రవి పెడుతున్నారంటే ఈ కుట్రను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ముందస్తు బెయిలు కోసం కోర్టులో దరఖాస్తు చేశాడు. తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని స్వయంగా చెప్పిన దస్తగిరి బెయిలుకు.. వివేకా కుమార్తెగా సునీత ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. వీళ్ల మధ్య ఉన్న ఎంత గాఢమైన లోపాయికారీ ఒప్పందం ఉందో తెలియటానికి ఇది చాలదూ!!. నాన్నను అనైతికంగా ఓడించినా... క్రికెట్ బెట్టింగుల్లో స్థానికంగా చిరపరిచితుడు. బెట్టింగుల్లో పోలీసులకూ దొరికాడు. 2017లో టీడీపీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కడపలో పోటీ చేసి.. వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన వైఎస్ వివేకాను అనైతికంగా ఓడించాడు. చాలినంత మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీల మద్దతు లేకపోయినా... నాటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి సాయంతో వాళ్లను రకరకాలుగా ప్రలోభపెట్టాడు. కొందరిని బెదిరించి లోబరచుకుని తనకు బలం లేకున్నా వివేకాను ఓడించగలిగాడు. తండ్రిని దుర్మార్గపు పద్ధతుల్లో ఓడించిన ఈ వ్యక్తి... ఇపుడు సునీత దంపతులకు అత్యంత సన్నిహితుడంటే ఏమనుకోవాలి? కేసు గురించి, కేసుద్వారా పొందాల్సిన రాజకీయ ప్రయోజనాల గురించీ వీరు నిత్యం సంప్రతింపులు జరుపుకొనే స్థాయిలో ఉన్నారంటే ఏమనుకోవాలి? ఈ కేసులో అవినాశ్‌పై బురద జల్లాలనుకున్న ప్రతిసారీ... మాట్లాడేది రవి. మాట్లాడించేది సునీత దంపతులు. బీటెక్ రవి తీవ్రమైన విమర్శలు చేయటం... దాన్ని ఎల్లో మీడియా విస్తతంగా ప్రచారం చేయటం... తరవాత చంద్రబాబు సహా టీడీపీ వాళ్లు ఇవే అంశాల్ని మాట్లాడటం వీళ్ల మోడెస్ ఆపరాండీ. బాబు శిష్యుల కలయిక దేనికోసం? కనెక్షన్ అనొచ్చు... రిలేషన్ అనొచ్చు. చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, సునీత, షర్మిల అందరూ ఇందులో భాగమే. ఆ రాష్ట్రమూ కాదు... ఆ పార్టీ కూడా కాదు. కానీ రేవంత్‌రెడ్డిని బీటెక్ రవి వెళ్లి కలిశాడంటే ఏమిటర్థం? అప్పటిదాకా తెలంగాణలోనే చావో రేవో అన్న షర్మిల... ఆ తరవాత కాంగ్రెస్‌లో చేరి నేరుగా ఏపీకి వచ్చి ఈ రకమైన మంత్రాంగం నడుపుతున్నారంటే ఏమనుకోవాలి? అయినా ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన. మూడు నెలల తరవాత మరో ప్రభుత్వం వచ్చింది. పోలీసులూ వారే... దర్యాప్తు మొదలుపెట్టిందీ వారే. ఇంత స్పష్టంగా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాలతో లేఖ, ఫోన్ దాచిపెడితే వారిని ఎందుకు విచారించలేదు? రాజకీయాలకు, విమర్శలకు ఈ సంఘటనను వాడుకుని... అసలు కేసును నీరుగార్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం కాదా? అసలు ఇన్ని కుట్రలు చేసే బదులు బాబు నేరుగా టీడీపీ టికెట్టే ఇవ్వవచ్చు కదా? అపుడు ప్రజల్లో ఎవరి బలం ఎంత ఉందో తెలిసిపోతుందిగా? కుట్రలకు, కుతంత్రాలకు విలువ ఉందో... లేక మంచి చేసిన ప్రభుత్వానికి విలువ ఉందో తేలిపోతుందిగా? ఏమంటావ్ బాబూ!!? మొదట చూశారు... కుమార్తెకు చెప్పారు వివేకా మృతదేహాన్ని మొదట చూసింది ఆయన పీఏ కృష్ణారెడ్డే. అక్కడే రక్తపు మరకలతో ఉన్న లేఖను, వివేకా మొబైల్ ఫోన్‌ను ఈయన తీసుకున్నాడు. అదే విషయాన్ని సునీతకు ఫోన్లో చెప్పాడు. సునీతతో పాటు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డికి (ఈయన సునీత భర్త రాజశేఖరరెడ్డికి, సౌభాగ్యమ్మకు సొంత సోదరుడు) కూడా చెప్పాడు. ఈ విషయం కాల్ రికార్డ్స్‌లోనూ వెల్లడయింది. వివేకా గురించి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగానే... ఆ లేఖను, వివేకా ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని కృష్ణారెడ్డిని ఆయన ఆదేశించారు. దీంతో ఆయన తదుపరి వచ్చి న బంధువులకు గానీ, పోలీసులకు గానీ ఎవ్వరికీ దీన్ని చూపించలేదు. ఆ లేఖను చూపించి ఉంటే...దాన్లోని రక్తాన్ని చూసైనా ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారు కాదేమో. కానీ నర్రెడ్డి ఆదేశాలతో ఆయన ఎవ్వరికీ దీన్ని చూపించలేదు... చెప్పలేదు. ఈ విషయాన్ని సునీతే పోలీసుల దగ్గర అంగీకరించారు. అలా ఎందుకు చెప్పారని అడిగితే... కృష్ణా రెడ్డికి ప్రాణభయం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పామన్నారు. లేఖ రాసింది తన తండ్రేనని, చేతిరాత ఆయనదేనని కూడా సునీత పోలీసు డీజీపీ ఎదుట అంగీకరించారు. నిజానికి రక్తంతో రాసిన ఆ లేఖను ఎవరు చూసినా... అది సహజ మరణం కాదని తేలిగ్గా అర్థమవుతుంది. పోలీసులకో, అక్కడికి వచ్చి న వారికో వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉంటే... అక్కడి వ్యవహారం మరోలా ఉండేది. ఇది చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు జరిగిన హత్య. అప్పటి పోలీసులు గానీ, సీబీఐ గానీ ఎందుకు ఈ లేఖ, ఫోన్ చూపించలేదని... ఫోన్లో నుంచి వివేకా– ఆయన రెండో భార్య షమీమ్ సంభాషణల్ని ఎందుకు డిలీట్ చేశారని, సునీతను దూషిస్తూ షమీమ్ లేవనెత్తిన అంశాలను ఎందుకు డిలీట్ చేశారని విచారించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలు ఆ కోణాన్నే పట్టించుకోలేదెందుకో..!!. ఈ హత్యలో ఎల్లో మీడియా చేస్తున్న మరో దు్రష్పచారమేంటంటే... ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందే అక్కడకు చేరుకున్నారనేది. నిజానికి అవినాశ్ అక్కడకు చేరేసరికే జనం పోగై ఉన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనుకనే ఇలా జరిగిందని తనతో నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి చెప్పినట్లు స్వయంగా నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అదే శివప్రకాశ్ రెడ్డి అవినాశ్కూ ఫోన్ చేసి, ‘‘బావ చనిపోయారు. అర్జెంటుగా అక్కడకు వెళ్లు’’ అన్నారు. దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికని అప్పుడే బయల్దేరిన అవినాశ్‌రెడ్డి.. వెంటనే యూ టర్న్ తీసుకుని అక్కడకు చేరుకున్నారు. ఆయన ఫోన్ చెయ్యకుండా ఉంటే అవినాశ్‌కు విషయం తెలిసేదే కాదు. ఆయన అక్కడకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయి ఉండేవారు. బావ చనిపోయారు.. వెళ్లమని చెప్పిన నర్రెడ్డి శివప్రసాద్... ఎలా చనిపోయారనేది కానీ, లెటర్– ఫోన్ సంగతి కానీ చెప్పలేదు. ఇదంతా ఒక్క స్కెచ్ ప్రకారం జరిగిందనటానికి ఇంతకన్నా ఏం కావాలి? ఆస్తి కోసం సునీతతో విభేదాలు వివేకా మరణించిన నాడు షమీమ్‌కు, వివేకాకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజుల్లో చాలా అంశాలున్నాయి. ముఖ్యంగా సునీత గురించి జరిగిన ఎస్ఎంఎస్/సంభాషణలన్నీ ఆ తరవాత డిలీట్ చేసేశారు. ఎందుకు చేశారనేది దర్యాప్తు చేయనేలేదు. వివేకాకు, షమీమ్‌కు ఒక కుమారుడు ఉన్నాడనే అంశాన్ని సైతం రహస్యంగానే దాచిపెట్టారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకాను ఆయన కుమార్తె, అల్లుడు, బావమరిది ఏ రకంగా హింస పెట్టారు... చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఎలా నిర్వీర్యం చేశారో స్పష్టంగా చెప్పారు. దస్తగిరి తాను వివేకాను చంపటానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతికినట్లు సాక్షులు చెప్పారు. కానీ దర్యాప్తులో ఆ అంశాలకు విలువే ఇవ్వలేదు. అంతేకాదు. తొలుత ఛార్జిషీట్లో వివేకాకు, ఏ1గా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డికి ఆర్థికపరమైన వివాదాలున్నాయని, వివేకాకు ఏ2 సునీల్ యాదవ్ తల్లితోను, ఏ3 ఉమామహేశ్వరరెడ్డి భార్యతోను అక్రమ సంబంధాలున్నాయని స్పష్టంగా ఉన్నప్పటికీ... ఆ కోణాన్ని తరువాతి ఛార్జిషీట్లలో పూర్తిగా తొక్కిపట్టేశారు. దూరం 700 మీటర్లే అవినాశ్, వివేకా ఇళ్ల మధ్య ఉన్న దూరం ఏరియల్ డిస్టెన్స్ అయితే 250 మీటర్లు. రోడ్డు మార్గాన అయితే 700 మీటర్లు. గూగుల్ టేకవుట్ పేరు చెప్పి వివేకా ఇంట్లో ఉన్న ఒక మనిషిని అవినాశ్ ఇంటికి వచ్చినట్లు ఎలా నిర్ధారిస్తారు? ఆ రోజు ఉదయం అవినాశ్ ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగుకు బయలుదేరి పులివెందుల రింగ్రోడ్లోకి ప్రవేశించిన వెంటనే నర్రెడ్డి శివప్రసాద్ ఫోన్ చేసి వివేకా మరణం గురించి చెప్పారు. వెంటనే ఆయన యూ–టర్న్ తీసుకుని తనతో ఉన్న 3 వాహనాలతో సహా వివేకా ఇంటికి వెళ్లారు. ఫోన్ వచ్చి న రెండు నిమిషాల్లోనే ఎలా వచ్చారనేది సీబీఐ ప్రశ్న. నిజానికి రింగ్‌రోడ్డు (కృష్ణాలయం) నుంచి వివేకా ఇంటికి రెండు నిమిషాలు చాలు. పైపెచ్చు ఉదయాన్నే రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా!. -
రాష్ట్రం భూమి ఇచ్చినా.. రైల్వేజోన్‌పై కేంద్రందే కిరికిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్‌కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరీ పెడుతోంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమా వేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసేందుకు యత్నించారు. రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చేందుకు సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కల్గించింది. ఎందుకంటే.. కేంద్రమంత్రి చెప్పిన 52 ఎకరాలకు, రైల్వేజోన్ వ్యవ హారానికి అసలు ప్రత్యక్ష సంబంధమేలేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ 52 ఎకరాలను రైల్వేకు అప్పగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలిలా ఉంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వేజోన్‌పై అవాస్తవాలు వల్లెవేశారు. కేవలం ఒ డిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ యన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్ట మవుతోంది. అసలు ఈ రైల్వేజోన్ అంశంపై వాస్తవాలు ఏమిటంటే.. ► విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టంగా పేర్కొంది. ► రాష్టప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి గతేడాది రూ.170 కోట్లు కూడా కేటాయించింది. ► రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా ల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసు కువచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచర ణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్రం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ► ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందునే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన డం హాస్యాస్పదం. ఎందుకంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా రైల్వేశాఖకు భూమి కేటాయించాలని ఆయన చెబుతున్నారు. కానీ, విశాఖలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరింది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు సంగతి అది. ► 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అంతకుముందటి రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాలి. అందుకోసం 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని కూడా డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. ► వాస్తవానికి రైల్వేకు కేటాయించాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలపై వివాదం ఏర్పడింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రయత్నిస్తే అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య సున్నితంగా మారడంతో రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింది. అప్పట్లో కూడా రైల్వేశాఖ ఆ విషయంపై పట్టుబట్టలేదు. ► ఇక భూమి సమస్యతోనే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వేశాఖ ఇప్పటివరకు చెప్పనేలేదు. రైల్వేజోన్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనేలేదు. రెల్వేకు 52 ఎకరాలు అప్పగింత.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసింది. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నెంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65తో ఉన్న 52 ఎకరాలను రైల్వేశాఖకు అప్పగించారు. ఈ మేరకు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సీఎం శ్రీకాంత్ వర్మ ఈ ఏడాది జనవరి 2నే విశాఖలోని ఈస్ట్‌కోస్ట్ డీఆర్ఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదని రైల్వేమంత్రి వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఢిల్లీలోని పచ్చమీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ప్రభావితమైన ఆయన అవాస్తవాలు మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దుచేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల తోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమ య్యాయి. ఎందుకంటే.. విజయవాడ నుంచి విశాఖ 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివి జన్ను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీలో వెస్ట్ ఫైట్: నోరు జారిన జలీల్ ఖాన్!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ వార్ ముదురుతోంది. టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో నోరు జారారాయన. విజయవాడ వెస్ట్‌లో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వార్ ముదురుతోంది. మైనారిటీలకు టికెట్‌ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు ఆయన నోరు జారారు. టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ అన్నారు. ఆ వెంటనే సవరించుకుని.. మైనారిటీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ఆపై ఓ అడుగు ముందుకేసి వెస్ట్ టికెట్ తనదేనని.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంపైనే పవన్ కల్యాన్‌ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని చెప్పుకొచ్చారు. ఇక.. చంద్రబాబుకు దరఖాస్తు సమర్పిస్తానంటూ గురువారం బుద్దా వెంకన్న విజయవాడలో గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్లి విజయవాడ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ టికెట్ గనుక ఇవ్వడం కుదరకుంటే.. అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో బుద్దా వెంకన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కోరేందుకు జనసేన సైతం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుద్దా వెంకన్న ర్యాలీ పరిణామాలను ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏకపక్షంగా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందో అనే ఆందోళనతో పవన కల్యాణ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. -
మన్యం మిరియాలు అ‘ధర’హో..!
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజన రైతుల నుంచి 100 మెట్రిక్ టన్నుల మిరియాలను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలం నుంచి 10 టన్నులు కొనుగోలు చేయాలని తెలిపారు. మిరియాల పంటను సాగుచేస్తున్న గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కిలో రూ.500 మద్దతు ధరతో నాణ్యమైన మిరియాలను కొనుగోలు చేస్తామన్నారు. తక్కువ ధరతో దళారీలకు అమ్ముకుని మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిరియాల ఉత్పత్తిలో గిరిజన రైతులు తగిన నాణ్యత పాటించాలని, ఎండిన మిరియాలలో తేమశాతం తక్కువుగా ఉండాలన్నారు. వచ్చేనెల 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు కాఫీ లైజన్ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి మిరియాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాల నిల్వలకు గాను గిరిజన రైతులకు ఉచితంగా గోనెసంచులను పంపిణీ చేస్తామన్నారు.10వేల ఎకరాల్లో కాఫీ తోటల కన్సాలిడేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మిరియాల నూర్పిడికి యంత్రాల వినియోగం స్పైసెస్ బోర్డు విస్తరణ అధికారి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు పాదుల నుంచి సేకరించిన మిరియాల నూర్పిడిలో యంత్రపరికరాలను వినియోగించాలన్నారు. కంకుల నుంచి మిరియాలను వేరుచేసేందుకు కాళ్లతో తొక్కడం వల్ల బ్యాక్టిరీయా చేరి నాణ్యత తగ్గే పరిస్థితి ఉందన్నారు. పచ్చిమిరియాలను ఒక నిమిషం వేడినీటిలో ముంచి తీసిన తరువాత ఎండబెడితే గింజ నల్లగా ఉండి మంచి ధర వస్తుందని చెప్పారు. తేమ 10 శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్, కేంద్ర కాఫీబోర్డు డీడీ రమేష్,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్‌వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్‌కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..!
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదంటారు పెద్దలు. శ్రీ పావన ఇండస్ట్రీస్ అధినేత ‘విస్తరి’(భోజన ప్లేట్ల) వ్యాపారంతోనే జీవితాన్ని ‘విస్తరి’ంచుకుంటున్నారు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతోపాటు, జగన్ ప్రభుత్వం తీసుకున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ చర్యలు వీరి వ్యాపారానికి ఊతమిచ్చాయి. ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఇతోధికంగా సాయపడుతూ, వ్యాపారంలో రాణించాలనుకునే పలువురు ఔత్సాహిక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప కార్పొరేషన్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎఈ) ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవే ట్ లిమిడెట్(ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్, బొల్లవరం వద్ద శ్రీ పావన ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. 2019లో షెడ్ కన్స్ట్రక్షన్కు రూ.50 లక్షలు, మెషినరీకి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటితో విస్తర్ల(భోజన ప్లేట్ల) తయారీ పరిశ్రమను పోరెడ్డి సందీప్ స్థాపించారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ధైర్యం పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలే తమకు ధైర్యాన్నిచ్చాయని సందీప్ చెప్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 లక్షలు రాయితీ ఇచ్చింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన కరెంట్, నీరు, ఇతర అనుమతులకు సింగిల్ విండో విధానం అమలుతో శ్రమ, కాలయాపన తగ్గింది. ఈ చర్యలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పేపర్ ప్లేట్లు, కప్పులకు డిమాండ్ పెరిగింది. స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లు అయితే వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదముంది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరోవైపు ప్లాస్టిక్ అంత వేగంగా భూమిలో కలిసిపోదు. అదే చేతిలో ఉంచుకొని తినే పేపర్ ప్లేట్లు(బఫే ప్లేట్లు), కూర్చొబెట్టి వడ్డించేవి(సిటింగ్ పేపర్ ప్లేట్లు) తినగానే పడేస్తాం. కడగాల్సిన శ్రమ ఉండదు. ఇవి పేపర్‌తో తయారు చేసినవి కావడంతో భూమిలో త్వరగా కలిసిపోతాయి. ప్రభుత్వ చర్యలతో ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఏర్పడింది. ముడిసరుకు సరఫరా, ప్లేట్ల తయారీ శ్రీ పావన ఇండస్ట్రీస్‌లో క్రాఫ్ట్ పేపర్ రోల్స్, గమ్, ఫిల్మ్ తెచ్చి కారగేషన్ మిషన్‌లో వాటిని అతికించడం ద్వారా పేపర్ షీట్లు తయారు చేస్తున్నారు. వాటిని పేపర్ ప్లేట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా చేస్తున్నారు. అందులోనే ఆరు మెషీన్ల ద్వారా వీరు కూడా వివిధ రకాల పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 20 మంది స్థానిక మహిళలు, మరో 20 మంది ఇతర రా ష్ట్రాలకు చెందిన వారు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే భోజన ప్లేటు హోల్‌సేల్‌గా రూ.1.50, బహిరంగ మార్కెట్లో రూ.2.50కు విక్రయిస్తున్నారు. భారీ స్థాయిలో పేపర్ షీట్లు, ప్లేట్లు తయారు చేయడంతో వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటోంది. నీడ పట్టున ఉంటూనే సంపాదన పావన ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందు ఏ పనీ లేక ఇంటిదగ్గరే ఉండేదాన్ని. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఇందులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. నా కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు, నా ఖర్చులకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాలాంటి పది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. నీడ పట్టునే ఉండి ఈ మాత్రం సంపాదించడం సంతోషమే కదా..! – భారతి, ప్రొద్దుటూరు ఉన్న ఊర్లోనే ఉపాధి ఈ పరిశ్రమలో నేను మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15 వేలకు పైగానే సంపాదించుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరు ఏ పని చేయాలో చెప్పడం, ముడి సరుకు రప్పించడం, తయారు చేసిన ప్లేట్లను ప్రాంతాల వారీగా సప్లై చేయడం తదితర విషయాలను చూసుకుంటాను. పెద్దగా శారీరక శ్రమ ఉండదు. ఉన్న ఊర్లోనే గౌరవ ప్రదమైన జీతం వస్తోంది. – శశిధర్, మేనేజర్, ప్రొద్దుటూరు -
మెగా డీఎస్సీ జోష్
విశాఖ విద్య: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ నిర్వహణకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. విద్యాశాఖ వర్గాలు, నిరుద్యోగ అభ్యర్థుల్లో బుధవారం దీనిపై సర్వత్రా చర్చ సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ వస్తోందని నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి. వీటిలో క్యాడర్ వారీగా ఎన్ని ఉన్నాయనే దానిపై అభ్యర్థులు ఆరా తీశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన నియామకాల ప్రక్రియ ఉండటంతో ఉపాధ్యాయ కొలువు దక్కించుకునేందుకు అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమశాఖ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీలో ఖాళీలను గుర్తించారు. పట్టుదలతో సిద్ధమవుతున్నా.. డీఎడ్ పూర్తి చేశాను. డీఎస్సీ ప్రిపరేషన్ కోసమని నర్సీపట్నం ప్రాంతం నుంచి నా భర్తతో కలసి విశాఖ నగరానికి వచ్చాం. ఎలాగైనా డీఎస్సీలో పోస్టు దక్కించుకోవాలనే పట్టుదలతో సిద్ధమవుతున్నాను. అనుకున్నట్లుగానే మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదించటం సంతోషంగా ఉంది. – సింగంపల్లి వెంకట లక్ష్మి, కల్యాణలోవ, అనకాపల్లి జిల్లా కాలేజీలకు క్రేజ్ పెరుగుతుంది డీఎస్సీ నోటిఫికేషన్లు తరచూ ఉంటే, బీఈడీ, డీఎడ్ శిక్షణా కళాశాలలకు ఆదరణ ఉంటుంది. ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా మెగా డీఎస్సీ ఉంటుందని అంతా ఊహించినదే. నిరుద్యోగ అభ్యర్థులు కూడా అదే నమ్మకంతో ప్రిపరేషన్లో ఉన్నారు. మొత్తానికి అంతా శుభసూచికమే. – గొట్టేట రవి, సీనియర్ ఫ్యాకలీ్ట, ప్రభుత్వ డైట్ కాలేజీ, భీమునిపట్నం సీఎం మాట నిలుబెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నట్లుగానే డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారు. దీని వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై కూడా భారం తగ్గుతుంది. నోటిఫికేషన్ నాటికి ఇంకాస్తా పోస్టులు పెరుగుతాయనే నమ్మకం ఉంది. – చొక్కాకుల సూర్యనారాయణ, వైఎస్సార్ టీఎఫ్ అధ్యక్షుడు, విశాఖ జిల్లా సంతోషంగా ఉంది మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదించటం సంతోషంగా ఉంది. డీఎడ్ చేసి గతంలో డీఎస్సీ రాశాను. ప్రస్తుతం బీఈడీ మాథ్య్ మెథడాలజీతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ప్రయతి్నస్తున్నాను. టీచర్ పోస్టు సాధించాలని 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. పోస్టుల సంఖ్య పెంచితే బాగుండేది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందనే నమ్మకం ఉంది. –కొమ్ము సూర్యకళ, ముడిదాం, విజయనగరం జిల్లా -
బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చాం నా భర్త కూలి పని చేస్తుంటాడు. పని లేనప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళ్తుంటాడు. మాకు ఇద్దరు అమ్మాయిలు. మాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా అని ఎంతో సతమతం అయ్యాం. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు సంక్షేమ పథకాలు వరమయ్యాయి. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున మూడు విడతల్లో రూ.56,250 వచ్చింది. పెద్ద కుమార్తెకు గతంలోనే పెళ్లయింది. చిన్నమ్మాయికి ఈ మధ్యే పెళ్లి చేశాం. పెళ్లికి ముందు ఆ పాపకు అమ్మఒడి ద్వారా రెండేళ్లపాటు రూ.15 వేల చొప్పున లబ్ధి చేకూరింది. పెళ్లిచేసే సమయంలో బంధువులు, వలంటీర్లు జగనన్న ప్రభుత్వంలో కళ్యాణమస్తు ద్వారా సాయం లభిస్తుందని చెప్పారు. దీంతో కల్యాణమస్తుకు దరఖêస్తు చేశాం. పెళ్లయిన మూడు నెలల్లోనే కల్యాణమస్తు ద్వారా రూ.లక్ష వచ్చింది. ఆ మొత్తంతో పెళ్లికి చేసిన అప్పు తీర్చేశాం. త్వరలో టిడ్కో ఇల్లు చేతికి రానుంది. ప్రస్తుతం హాయిగా జీవిస్తున్నాం. ఇంతలా ఆదుకున్న జగనన్న ప్రభుత్వం పదికాలాల పాటు చల్లగా ఉండాలి. – గెడ్డం రత్నం, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా (తోట రాంబాబు, విలేకరి, పాలకొల్లు సెంట్రల్) మా బతుకులు బాగుపడ్డాయి మాది చాలా పేద కుటుంబం. కూలి పని ద్వారా నా భర్త భాస్కరరావు తెచ్చే ఆదాయంతోనే కుటుంబ పోషణ సాగుతోంది. వచ్చిన అరకొర ఆదాయంతో బాపట్ల జిల్లా చినగంజాం జిల్లా సొపిరాలకు చెందిన మాకు.. ఉన్న ఒక్క కుమారుడిని బాగా చదివించగలమా.. అన్న భయం వెంటాడేది. అలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి రూ.15 వేలు చొప్పున నా ఖాతాలో నగదు జమ చేశారు. ఆ మొత్తంతో పిల్లాడిని చక్కగా చదివించుకోగలిగాం. ఈ ఏడాదే బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన పథకం వర్తించింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాకు ఇప్పటి వరకు రూ.2 లక్షలు అందింది. జగనన్న కాలనీలో మాకు స్థలం మంజూరు చేశారు. ఇల్లు కూడా మంజూరైంది. త్వరలో నిర్మాణ పనులు చేపడతాం. మా పరిస్థితి ఇప్పుడు బాగా మెరుగు పడింది. మమ్మల్ని ఈ పరిస్థితికి చేర్చిన ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – పర్వతరెడ్డి శివపార్వతి, సొపిరాల (పల్లపోలు శ్రీనివాసరావు, విలేకరి, చినగంజాం) ఇంటికల సాకారమైంది రోజూ పనికి వెళ్తే తప్ప మాకు పూట గడిచేది కాదు. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గొట్లగట్టులో ఇల్లు కట్టుకోవాలనేది మా చిరకాల కోరిక. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో స్థలం మంజూరు చేయాలని ఎన్నోమార్లు విజ్ఞాపన పత్రాలు అందించాం. కానీ మంజూరు కాలేదు. స్థానిక నాయకులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా మాపై జాలి చూపలేదు. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం నియమించిన వలంటీర్ మా దగ్గరకు వచ్చి ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పారు. సచివాలయంలో దరఖాస్తు చేశాము. నెల రోజులు గడవక ముందే నా పేరున స్థలం, ఇల్లు మంజూరైందని సమాచారం వచ్చింది. నా సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఇల్లు మంజూరు పత్రాన్ని స్వయంగా నాకు అందించారు. వెంటనే ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి మేము కొంత డబ్బు జమ చేసుకుని సొంతంగా ఇల్లు నిరి్మంచుకున్నాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాకు ఏటా రూ.18,750 వంతున అందుతోంది. నా కుమారుడికి చదువుకు అమ్మ ఒడి పథకం ఏటా రూ.15 వేలు ఇస్తున్నారు. ఇన్ని విధాలుగా మేలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ మరచిపోము. – సుంకేసుల కళావతి, గొట్లగట్టు (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల) -
చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన పొగిడారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనని ఆలపాటి అన్నారు. దీంతో సభతో పాటు ఒక్కసారిగా చంద్రబాబు అవాక్కయ్యారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. ఇదీ చదవండి: జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు -
యువత ‘భద్రత’లో ఏపీ నంబర్ వన్
గుంటూరు ఎడ్యుకేషన్: నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తున్నదని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో సంస్కరణలు–యువతకు సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్ అధ్యక్షత వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్, కె.రామమోహనరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ డిగ్రీ కోర్సులతో యువతకు ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. ఆ.. సంస్కరణలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో నవరత్నాల వంటి తొమ్మిది కార్యక్రమాలను రూపొందించిన సీఎం వైఎస్ జగన్ ఎంతో నిబద్ధతతో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్ షిప్ విధానంలో విద్యార్థులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతో విద్యార్థులు తమలోని సామర్థాన్ని, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకుని ముందుకు వెళుతున్నారని చెప్పారు. రూ.32కోట్లు వెచి్చంచి రాష్ట్రంలోని 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందించడం గొప్ప విషయమన్నారు. బీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కౌసల్యాదేవి, ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ఎం.కుసుమకుమారి, జీఏ షాలిని, బి.విజయకుమార్, అధ్యాపకులు ఎం.రత్నరాజు, సీహెచ్ అనిత, ఎన్జే సాల్మన్‌బాబు మాట్లాడారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతకు దిశా, దశ నిర్దేశనం ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు యువతకు దిశా, దశ చూపుతున్నాయి. నైపుణ్యాలు లేనిదే సమాజంలో రాణించలేరనే సదుద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా రాణించగల స్థైర్యాన్ని కల్పించడం అభినందనీయం. – కేఎఫ్ పరదేశిబాబు, ఏసీ కళాశాల కరస్పాండెంట్ ఎన్ఈపీ అమల్లో ఏపీ అగ్రస్థానం.. జాతీయ నూతన విద్యా విధానం–2020 అమల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. విజ్ఞానం, నైపుణ్యం, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. – డాక్టర్ కె.మోజెస్, ప్రిన్సిపాల్, ఏసీ కళాశాల ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ఉన్నత విద్యారంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలతో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పరిశ్రమలను విద్యాసంస్థలకు అనుసంధానం చేయడంలో సఫలీకృతమైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతరానికి అందిస్తోంది. – పి.మల్లికార్జునప్రసాద్, ప్రిన్సిపాల్, హిందూ కళాశాల ఊహకందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ సెల్‌ఫోన్‌తో మొదౖలెన ఆధునిక సాంకేతికత.. ఇంటర్నెట్తో వేగం పుంజుకుని ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం లేనిదే విద్యార్థులు రాణించలేరు. ఉన్నత విద్య దశలోనే పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. – డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పీజీ కోర్సుల డీన్, ఏసీ కళాశాల -
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడే తీర్పు.?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారణ జరిపారు. నిన్న స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ చదవండి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
భళా.. బాల మేధావులు
సాక్షి, అమరావతి: విజయవాడలో నిర్వహిస్తున్న ‘సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్’ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అత్యుత్తమ ప్రదర్శనలను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలకు ఇక్కడ అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 30 నమూనాలు సైతం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. తమ వయసు విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను తిలకించి, ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకే.. సైన్స్ రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, భూమి/అంతరిక పరిజ్ఞానం, పర్యావరణం, ఇంజినీరింగ్, అగ్రి, బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అంశాలకు చోటు కల్పించామన్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని వివరించారు. తక్కువ ఖర్చు.. ఆదాయం హెచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న కె.హేమమాధురి, పి.పావని చిత్తూరు జిల్లా పెదపంజానిలోని మహత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ రైతుకు మేలు చేసే సమగ్ర వ్యవసాయ (ఇంటిగ్రేటెడ్ పారి్మంగ్) విధానాన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూనే.. ఎరువుల ఖర్చు లేకుండా అదనపు ఆదాయంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అనర్గళంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఇంగ్లిష్ ప్రావీణ్యం ప్రదర్శిస్తూ.. సదరన్ సైన్స్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆపదలో ఆదుకునే తుపాకీ సైనికులు, ఫారెస్ట్ సిబ్బంది, అగ్నిమాపకదళ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఒక్కోసారి దారి తప్పడమో, మంచులో కూరుకుపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వారున్న చోటును తెలిసేలా అద్భుతమైన తుపాకిని రూపొందించాడు మంగుళూరుకు చెందిన విద్యార్థి పి.తేజస్. ఓ వైపు శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతోపాటు సైనికుడి ఉనికిని తన బృందానికి చేరవేసేలా సెన్సార్‌ను బిగించాడు. ఇది బయటి వారికి సిగ్నల్స్‌ను పంపించి ఆచూకీ చెబుతుంది. తేజస్ తయారు చేసిన తుపాకి ఒక్కసారి వినియోగానికి రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. మంటల్లో కాలిపోతున్న ఎత్తయిన భవనాల్లోకి ఈ తుపాకి ద్వారా ఆక్సిజన్ బాల్స్‌ను ఫైర్ చేసి మంటలను సైతం ఆర్పేయవచ్చు. -
ఏసీబీ కోర్టులో నేడు స్కిల్ కేసు విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవర్‌గా మారిన ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. షా పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్కిల్ స్కామ్ లో ఏ-2 ముద్దాయి మాజీ లక్ష్మీ నారాయణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్ష్మీనారాయణ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అప్రూవర్‌గా మారతానని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ పేరుతో చంద్రబాబు న్యాయవాదులు పలుమార్లు సమయం కోరారు. కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ చంద్రబాబు తరపున న్యాయవాదులు ఇవ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపున న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22న ఏసీబీ కోర్టులో విచారణ జరిపగా, కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు కోరారు. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలకు పాల్పడుతున్నారు. -
చంద్రబాబుకు మతిభ్రమించింది
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఇతరులపై బురద జల్లడం మాని ముందు ఆయన పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉన్నవి, లేనివి కల్పించి, వైఎస్సార్సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయోగం చేస్తున్నారని, చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ మార్గాని చంద్రబాబుకు చిప్ అరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. సోమవారం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏనాడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న బాబు జైలు కిటికీల్లోనుంచైనా అభివృద్ధి చూడాలి కదా... అని వ్యంగ్యాస్త్రం సంధించారు. లోకేశ్‌ను రాజమహేంద్రవరంలో పోటీకి దింపితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిలో బాబు తన హయాంలో సగం చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మార్గాని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. -
డోన్.. టీడీపీ వికెట్ డౌన్
సాక్షి, నంద్యాల: డోన్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎవరికి వారు తాము సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అభ్యర్థిని ఓడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉన్న డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కొంత పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్ పోటీ చేసి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇన్చార్జిగా తప్పించి కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం నియమించింది. కొంతకాలం తర్వాత ప్రభాకర్‌ను కూడా తప్పించి కేఈ వర్గానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఆయన నియామకాన్ని కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అతడికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. బీసీ ప్రోద్బలంతోనే గ్రూపు రాజకీయాలు నంద్యాల జిల్లా టీడీపీకి బీసీ జనార్దన్‌రెడ్డి పెద్ద దిక్కుగా మారారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో మిగిలిన నాయకులు బీసీ నిర్ణయాలకు అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. తమకు చెప్పకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా సుబ్బారెడ్డిని ప్రకటించడం వెనక బీసీ జనార్దన్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు కేఈ, కోట్ల వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. బీసీ ప్రోద్బలంతోనే సుబ్బారెడ్డి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని మండిపడుతున్నాయి. నువ్వొస్తే మర్యాదగా ఉండదు గత ఆదివారం పత్తికొండలో జరిగిన ‘రా.. కదిలిరా’ సభకు బీసీ జనార్దన్‌రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డికి మినహా మిగిలిన నంద్యాల జిల్లా నాయకులకు ఆహ్వానం అందింది. ఒకవేళ ఆహ్వానం లేకున్నా సభకు వస్తే మర్యాద దక్కదని పత్తికొండ టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక ఇద్దరు నేతలు సభకు హాజరుకాలేదు. సభ ముగిశాక చంద్రబాబు అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంతృప్తితో ఉన్న నాయకులను పిలిచి మాట్లాడారు. కానీ, డోన్ పంచాయితీని మాత్రం ఆయన పట్టించుకోలేదు. ఇన్చార్జిగా ఉన్న సుబ్బారెడ్డికి సహకరించాలని అటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కానీ ఇటు కేఈ కుటుంబానికి కానీ చంద్రబాబు సూచించకపోవడంతో ఈ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే సహకరిస్తాం డోన్ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే తాము సహకరిస్తామని కేఈ కుటుంబం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో డోన్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. దాదాపు రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డోన్ బరిలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. ఎమ్మిగనూరు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినా చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ చేసేదేమీ లేక ఓడిపోయే డోన్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా భారీ ఖర్చు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లుగా టీడీపీ కార్యక్రమాలను ధర్మవరం సుబ్బారెడ్డి చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన తన అనుచరుల వద్దే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ తనకే టికెట్ ఇస్తామని చెప్పడంతోనే తాను ఖర్చు చేశానని, ఇప్పుడు టికెట్ విషయంలో మీన మీషాలు లెక్కిస్తుండడంతో ఏంచేయాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేయడం సుబ్బారెడ్డి వంతైంది. మరోవైపు చంద్రబాబు ఖాతాలో మరో వికెట్ పడిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం. -
బడుగుల ‘విజయ గీతిక’
సాక్షి ప్రతినిధి, గుంటూరు/చిలకలూరిపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన అభివృద్ధిని, సాధికారతను బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేనోళ్ల వినిపించారు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో విజయగీతిక వినిపించారు. ఈ యాత్రకు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలివచ్చారు. తాము సాధించిన అభివృద్ధిని వివరించారు. జై జగన్ అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. వారికి పట్టణ ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు నేతృత్వంలో నూతన వ్యవసాయ మార్కెట్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు ఈ యాత్ర జరిగింది. పట్టణంతోపాటు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో కళా మందిర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభ జనసంద్రాన్ని తలపించింది. ఈ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన పలువురు నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆరి్థకంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్న వైనాన్ని వివరించారు. ఆ సమయంలో సభకు హాజరైన ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. సామాజిక న్యాయ సారథి సీఎం వైఎస్ జగన్ : మంత్రి విడదల రజిని ముఖ్యమంత్రి వైఎస్ జనగ్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ సారథిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలబెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను ఈ వర్గాలకు అందిస్తూ సాధికారత దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. చిలకలూరిపేటలో తొలిసారి బీసీ మహిళని నిలబెట్టి ఏ రాజకీయపార్టీ ఎన్నడూ చేయని సాహసాన్ని జగనన్న చేశారన్నారు. ఈ స్థానాన్ని గెలుపొందడంతోపాటు బీసీ మహిళకు వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారని గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఓసీకి రిజర్వు అయితే మైనారిటీకి చైర్మన్ ఇచ్చామని, మార్కెట్ యార్డును ఎస్సీలకు రెండుసార్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలిపారు. అన్ని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, దీనికి చిలకలూరిపేటే నిదర్శనమన్నారు. రూ. 2 వేల కోట్లతో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.900 కోట్లతో నిరి్మస్తున్న బైపాస్ త్వరలో పూర్తవుతుందన్నారు. పట్టణానికి మంచినీరందించేందుకు రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని తెచ్చామన్నారు. ఎస్సీ భవన్, బీసీ భవన్, కాపు కమ్యూనిటీ హాల్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. కోటి రూపాయలు సొంత నిధులతో షాదీఖానా కట్టించామన్నారు. కార్పొరేట్ స్థాయిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంగ్లిష్ మీడియంతో బడుగుల ఉన్నతి: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టి బడుగుల ఉన్నతికి బాటలు వేశారని చెప్పారు. సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఈ సమాజంలో అణచివేతకు గురైన వారందరూ చదువుకుని పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదుగుతారని వివరించారు. అన్ని పదవుల్లో పెద్దపీట వేస్తున్నారు: ఎమ్మెల్యే ముస్తఫా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో సీఎం జగన్ ఒక్కరేనని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చెప్పారు. ఈ వర్గాలను ఇంతలా అభివృద్ధి చేసిన సీఎంలు ఎవరూ లేరన్నారు. అన్ని పదవుల్లోనూ ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. బాబు కల్లపోల్లి మాటలు నమ్మొద్దు: ఎమ్మెల్సీ ఏసురత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. ఈ రాష్ట్రానికి ఏ మేలూ చేయని చంద్రబాబునాయుడు కల్లపోల్లి మాటలు చెబుతూ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని చెప్పారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి అమలు చేయలేదన్నారు. బాబు 14 ఏళ్ల పాలనలో కేంద్రం 14 లక్షల గృహాలు మంజూరు చేస్తే, పది వందలు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్ 31 లక్షల మందికి గృహ వసతి కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కొడుకులా ఆదుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. యాచన మాని గౌరవంగా బతుకుతున్నా.. మాది పేద కుటుంబం. విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ దళితవాడలో నేను, మా ఆయన కూలి పనులు చేసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు చిన్న వయసులో ఉన్నçప్పుడే మా ఆయన చనిపోయారు. ఆయన వారసత్వంగా వచ్చిన అరకొర ఆస్తితో వాళ్లను పెంచి, పెద్దచేసి పెళ్లుళ్లు చేశాను. వాళ్లకు భారం కాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు తెరువుకోసం యాచన ప్రారంభించా. అప్పట్లో పింఛన్ వచ్చినా.. ఏ మూలకూ సరిపోయేదికాదు. దానికోసం కూడా ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. పడిగాపులు పడాల్సిన దుస్థితి. నాలుగేళ్ల కిందటి వరకు సిగ్గు విడిచి చుట్టుపక్కల గుడులు, గోపురాల ముంగిట యాచించేదాన్ని. వచ్చిన చిల్లరతో బతికేదాన్ని. జగన్‌బాబు వచ్చాక పింఛన్ పెంచారు. ఇంటికే వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. ఇప్పుడు రూ.3 వేలకు పెంచారు. పొదుపు సంఘాల్లో ఉన్న మా కూతుళ్లు ఇద్దరూ వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల ద్వారా అందుతున్న సొమ్ముతో కూరగాయలు అమ్ముకొని బతుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి సాయంతో మనవరాళ్లు స్కూళ్లలో ఇంగ్లిష్ చదువులు చదువుతున్నారు. జగన్‌బాబు ఇచ్చిన పింఛన్‌తో యాచన మానుకొని గౌరవంగా బతుకుతున్నాను. – బత్తిన అప్పమ్మ, వాడాడ (గొట్టాపు త్రినాథరావు, విలేకరి, విజయనగరం అర్బన్) నిలదొక్కుకుంటున్నాం.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. నేను, మా ఆయన ఏడేళ్ల క్రితం వరకు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. మాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. మా స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకబద్రకు వచ్చిన తర్వాత బతుకు భారంగా మారింది. ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాం. నేను స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో మూడేళ్ల క్రితం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నా. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా లభించిన రూ.36 వేలతో నేను, నా భర్త కలిసి హోటల్ ప్రారంభించాం. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్తకు, నాకు తీవ్ర గాయాలు కావడంతో హోటల్ మూతబడింది. ఏడాది నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరోమారు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 వంతున రెండు విడతలుగా అందిన సొమ్ముతో రెండు ఆవులను కొనుగోలు చేశాం. ఇప్పుడు వాటి పాలను రోజు వారీ అమ్ముతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. మా జీవితానికి ఢోకా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకే మా లాంటి పేదలంతా హాయిగా జీవనం సాగిస్తున్నారు. – పొట్నూరు గీత, అరకబద్ర (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) కొడుకులా ఆదుకున్నారు పిల్లలు లేని మాకు వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే అండగా నిలిచింది. మాది శ్రీకాకుళం. వయసు మీద పడడంతో ఏపనీ చేయలేని స్థితిలో నా భార్య లక్ష్మితో కలిసి ఆరేళ్ల క్రితం విశాఖ వచ్చాము. ఇక్కడ ఆరిలోవ ఆపరేషన్కాలనీలో మా సమీప బంధువు కల్యాణి ఇంట్లో ఉంటున్నాం. ఆమె మమ్మల్ని ఆదరాభిమానంతో చూసుకుంటోంది. ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఈ నెల నుంచి పింఛను డబ్బులు పెరిగాయని వలంటీరు లీలాకృష్ణ మా ఇంటికి వచ్చి రూ.3 వేలు అందించారు. మాకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మా ఇద్దరికీ కంటి చూపు మందగించడంతో ఇబ్బంది పడేవాళ్లం. గత నెల 21న ఆరిలోవలో జగనన్న కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. ఆ శిబిరానికి వెళ్లి్న మాకు పరీక్షలు చేసిన డాక్టరు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అదే నెల 23న మా ఇద్దరికీ కంటి ఆపరేషన్ ఉచితంగా చేశారు. దీంతో పాటు నా భార్య లక్ష్మికి చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వచ్చింది. మూడేళ్ల క్రితం ఆమెకు పొట్టలో భరించరాని నొప్పి రావడంతో కేజీహెచ్‌లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేశారు. అనేక విధాలుగా సహాయం అందిస్తూ పిల్లలులేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు. – రోణంకి చిరంజీవులు, విశాఖ (మీసాల కామేశ్వరరావు, విలేకరి, ఆరిలోవ) -
Fact Check: ఇంత వక్రీకరణా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే అజెండాగా పెట్టుకున్న ఈనాడు రామోజీరావు తన మార్కు దిగజారుడు పాత్రికేయాన్ని మరోసారి చూపించారు. పల్నాడు జిల్లాలో ఓ మత్స్యకారుని అనుమానాస్పద మృతికి కూడా వక్రభాష్యం చెబుతూ పోలీసు శాఖపై విష ప్రచారం చేశారు. పోలీసుల వేధింపులతోనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నారని నిరాధార కథనాన్ని ప్రచురించి పాఠకులను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్‌కే వెళ్లని వ్యక్తిని ఎస్సై ఎలా వేధింపులకు గురిచేస్తాడని, వేధింపులకు గురైన వ్యక్తి చేపల వేటకు వెళ్తాడా అన్న కనీస జ్ఞానం కూడా ఈనాడుకు లేదు. అందుకే ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తికి చెందిన మత్స్యకారుడు చౌడిపల్లి దుర్గారావు గతంలో అక్రమ మద్యం కేసులో నిందితుడు. ఆయన తన నాటు పడవలో మరికొందరితో కలిసి తెలంగాణ నుంచి పడవలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు, మరో నిందితుడు పరారయ్యారు. అక్రమ మద్యం కేసులో దుర్గారావును ఐదో నిందితుడు (ఏ5)గా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దుర్గారావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఆదివారంతో సహా ప్రతి రోజూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, గత 3 ఆదివారాలు ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టలేదు. గత ఆదివారంనాడు (జనవరి 28న) కూడా పోలీస్ స్టేషన్‌కు రాకుండా చేపల వేట కోసం కృష్ణా నదిలోకి వెళ్లాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుర్గారావు మృతదేహాన్ని ఆయన బావమరిది బ్రహ్మాజీ తీసుకువచ్చారు. మృతిపై భిన్న వాదనలు దుర్గారావు మృతి పట్ల ప్రత్యక్ష సాక్షులు భిన్నమైన వాదనలు వినిపించడం గమనార్హం. మొదట కృష్ణా నది ఒడ్డున దుర్గారావు మృతదేహాన్ని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాసేపటికే దుర్గారావు మృతదేహాన్ని కృష్ణా నది నుంచి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఆయన మెడకు ఉరివేసుకుని నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కాగా నది నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ కెమెరాలతో తీసిన వీడియోలో ఆయన మెడకు ఎలాంటి తాడూ లేదు. కానీ కాసేపటికి దుర్గారావు మెడ చుట్టూ తాడు బిగించి ఉన్నట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. దీనిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గారావు మెడకు మొదట పసుపు రంగు తాడు లేదని, తరువాతే చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నేర చరిత్ర ఉన్న టీడీపీ నేతలు రెడ్యా నాయక్, వజ్ర నాయక్ మృతుడి కుటుంబ సభ్యులను ప్రభావితం చేసి వెల్దుర్తి ఎస్సై శ్రీహరి వేధింపుల వల్లే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు చేయించారు. సోదరులైన వారిద్దరిపై పలు క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. వారిద్దరే దుర్గారావు కుటుంబ సభ్యులతో జాతీయ రహదారిపై ధర్నా చేయించారు. వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరిస్తూ ఈనాడు పోలీసులపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించడం గమనార్హం. ఇవి వాస్తవాలు కాగా, ఎస్సై వేధింపుల వల్లే దుర్గారావు మృతి చెందాడని వక్రీకరిస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దుర్గారావు అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్‌కే వెళ్లలేదు. అతన్ని పోలీసులు వేధింపులకు గురిచేస్తే మానసిక వ్యధతో ఉన్న వ్యక్తి పడవలో చేపల వేటకు వెళ్లగలడా? ఈ కనీస జ్ఞానం తప్పుడు కథనం రాసే వారికి ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు... దర్యాప్తు దుర్గారావు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన ఎలా మృతి చెందారనే విషయంపై ప్రత్యక్ష సాక్షులే పరస్పర భిన్నమైన కారణాలు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక రావల్సి ఉంది. మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు శాఖాపరమైన దర్యాప్తు కూడా చేపట్టారు. వెల్దుర్తి ఎస్సై శ్రీహరికి మెమో జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని మాచర్ల సీఐ షమీముల్లాను ఆదేశించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
సాక్షి, అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ నేపథ్యం.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వైఎస్సార్సీపీ వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరువాత వారు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో.. వీరిపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యపై కూడా శాసన మండలిలో చీఫ్‌విప్ అయిన మేరిగ మురళీధర్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ విచారణ చేపట్టారు. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఫిరాయింపుదారులకు ఇటీవల నోటీసులిచ్చారు. ఈనెల 29న విచారణ జరుపుతానని అందులో పేర్కొన్నారు. కానీ, ఈ నోటీసులను రద్దుచేయాలని కోరుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురు, ఎమ్మెల్సీ సోమవారం అత్యవసరంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు మరింత గడువునిచ్చేలా స్పీకర్, చైర్మన్లను ఆదేశించాలని, అలాగే విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రసాదరావు ఫిర్యాదుపై స్పీకర్ తమకు నోటీసులిచ్చి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నెల 8న ఆదేశించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలని ఆ నలుగురు కోరడంతో ఈ నెల 26 వరకు స్పీకర్ గడువునిచ్చారన్నారు. తిరిగి ఈనెల 24న స్పీకర్‌కు లేఖ రాసి, వివరణకు నాలుగు వారాల గుడువునివ్వాలని కోరామన్నారు. అయితే, స్పీకర్ తమ అభ్యర్థనను తిరస్కరించి, ఈ నెల 29న విచారణ జరుపుతామని చెప్పారన్నారు. స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిమిషంలోనైనా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని, అందువల్ల అనర్హత పిటిషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయాలని ఆయనతో పాటు ఎమ్మెల్సీ న్యాయవాది కోర్టును కోరారు. ఫిరాయింపుదారులను విచారించిన స్పీకర్ మరోవైపు.. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభలోని తన కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురిని స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. నోటీసులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు ఎలా విరుద్ధం? అనంతరం.. అసెంబ్లీ తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ గానీ, మండలి చైర్మన్‌గానీ ఓ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. అందువల్ల వారి నిర్ణయాలను అధికరణ 226 కింద కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదన్నారు. కాలయాపన చేయాలన్న ఉద్దేశంతోనే వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లు గడువు కోరుతున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు వారి వారి విధులు, బాధ్యతలున్నాయని, ఒక వ్యవస్థలోకి మరొకరు చొరబడటానికి వీల్లేదన్నారు. చట్టం నిర్ధేశించిన మేరకే స్పీకర్, చైర్మన్ నోటీసులిచ్చి వివరణ కోరారన్నారు. వివరణ కోరకుండా ఉత్తర్వులిస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందే తప్ప, నోటీసులు ఇచ్చి వివరణ కోరడం ఎలా విరుద్ధమవుతుందని ప్రశ్నించారు. స్పీకర్, మండలిౖ చైర్మన్ తుది ఉత్తర్వులు జారీచేయడానికి ముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపమైనవని మెట్టా చంద్రశేఖర్‌రావు వివరించారు. ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని తేల్చిచెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు. -
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
కరెంటు చార్జీలు పెరగవు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త! 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్‌లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్‌లనే కొనసాగిస్తున్నట్లు మూడు డిస్కమ్‌లు తెలిపాయి. సోమవారం విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలిరోజు 17 మంది అభిప్రాయాలు తెలియచేశారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సెక్రటరీ డి.రమణయ్యశెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన డిస్కమ్‌లకు ‘ఏ’ గ్రేడ్: జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి డిస్కమ్‌లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాం. దేశవ్యాప్తంగా 2022–23 వినియోగదారుల సేవల్లో ఏడు డిస్కమ్‌లకు ఏ గ్రేడ్ రేటింగ్ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కమ్‌లే కావడం గర్వకారణం. రాష్ట్రంలో దాదాపు 1.8 కోట్ల వినియోగదారులకు సంబంధించి కేవలం 220 ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. డిస్కమ్‌లకు 50 శాతం పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉండగా అధిక భాగం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా సమకూరుతోంది. కోవిడ్ తర్వాత మార్కెట్ ధరలు అసాధారణంగా పెరిగాయి. కొన్నిసార్లు యూనిట్ రూ.10 సీలింగ్ రేట్‌కు కూడా విద్యుత్ లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది యూనిట్ రూ.16 సీలింగ్ రేటుగా విక్రయించిన సందర్భాలున్నాయి. డిస్కమ్‌లకు చెల్లింపులను హేతుబద్ధం చేస్తూ మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ పాలసీని ఆమోదించాం. ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినియోగదారులకు పూర్తి పారదర్శంగా సేవలందించేందుకు ఈఆర్సీ నిరంతరం శ్రమిస్తోంది. వినియోగదారులపై భారం లేదు: పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఈపీడీసీఎల్ పరిధిలో 2017–18లో 18,351 మిలియన్ యూనిట్లు విద్యుత్ అమ్మకాలు జరగగా ప్రస్తుతం 27,864 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2017–18లో పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉండగా ప్రస్తుతం 5.31 శాతానికి తగ్గాయి. సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.21,161.86 కోట్లుగా అంచనా వేశాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం మోపకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లకు ప్రస్తుతం ఉన్న స్టేషన్ల నిర్వహణ రాయితీని ఎత్తివేయాలని, రైల్వేకు అందిస్తున్న విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచాలని నిర్ణయించాం. గ్రీన్ పవర్ టారిఫ్ ప్రీమియం అన్ని కేటగిరీల వినియోగదారులకు 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదించాం. దీని ద్వారా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా 2023–24లో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేస్తాం. 2024–25లో ఏపీఈపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం రూ.17,854.16 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం రూ.100.44 కోట్లు ► ప్రతిపాదిత ఫుల్ కాస్ట్ రికవరీ నుంచి ఆదాయం– రూ.3207.27 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.21,161.86 కోట్లు ► సమగ్ర అంచనా వ్యయం– రూ.21,161.86 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు సున్నా. పాత టారిఫ్‌లే: కె.సంతోషరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎస్పీడీసీఎల్ పరిధిలో పంపిణీ నష్టాలను 26.84 శాతం నుంచి గతేడాది నవంబర్ నాటికి 8.21 శాతం తగ్గించాం. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ 2004–05లో రూ.334 కోట్లు నుంచి 2023–24లో రూ.5195.98 కోట్లకు పెరిగింది. నవరత్నాల పథకంలో భాగంగా వ్యవసాయ, ఆక్వా రైతులు, బడుగు బలహీనవర్గాలకు చెందిన 19,26,467 మంది వినియోగదారులకు రూ.4,605.31 కోట్లను రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ టారిఫ్ షెడ్యూల్‌ని 2024–25లోనూ కొనసాగిస్తాం. రెండు మూడు స్వల్ప మార్పులున్నా అవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. 2024–25 ఏపీఎస్పీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.15,175.75 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం– రూ.7521.03 కోట్లు ► క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.142.46 కోట్లు ► ఆర్ఈసీ నుంచి ఆదాయం– రూ.20 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.22,859.24 కోట్లు ► సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.22859.24 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా భారం లేకుండా ప్రతిపాదనలు: కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్ పరిధిలో కొత్తగా రూ.172 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు 54 వరకూ నిర్మాణ పనులు చేపట్టగా 43 సబ్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌వీడీఎస్ పథకం ద్వారా డిస్కమ్ పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1696.59 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం లేకుండా ప్రతిపాదనలు రూపొందించాం. 2024–25 ఏపీసీపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.9090.61 కోట్లు టారిఫ్ కాని ఆదాయం – రూన.392.52 కోట్లు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.21.53 కోట్లు ప్రతిపాదిత టారిఫ్ ద్వారా ఆదాయం అంచనా– రూ.50.73 కోట్లు ఫుల్‌కాస్ట్ రికవరీ టారిఫ్ నుంచి ఆదాయం– రూ.2996.53 కోట్లు ప్రస్తుత టారిఫ్ వద్ద రెవిన్యూ లోటు– రూ. –3047.26 కోట్లు సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.12,551.92 కోట్లు ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా ► రూ.15,729 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు: కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ జెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ మూడు డిస్కమ్‌ల పరిధిలో ఏపీ ట్రాన్స్‌కో నాలుగో నియంత్రణ కాలంలో మంచి విజయాలను నమోదు చేసింది. 2018–19లో 3.10 శాతం సరఫరా నష్టాలుండగా 2023–24 నాటికి 2.75 శాతానికి తగ్గింది. వచ్చే ఐదేళ్లలో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ ఐదేళ్ల కాలంలో ఉత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీ అవార్డు, ఫాల్కన్ మీడియా, ఎనర్జియా ఫౌండేషన్ నేషనల్ అవార్డు 2023 ద్వారా టాప్ స్టేట్ యుటిలిటీ అవార్డు సొంతం చేసుకున్నాం. రాబోయే ఐదేళ్లలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 400 కేవీ సబ్స్టేషన్లు 7, 220 కేవీ సబ్స్టేషన్లు 23, 132 కేవీ సబ్స్టేషన్లు 41 నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రానున్న ఐదేళ్లకు గాను రూ.15,729.4 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు తయారు చేశాం. -
గంటా రాజీనామా వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లతో పాటు గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను, ఇతర ఆధారాలను తమ ముందుంచాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని గంటా శ్రీనివాసరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. తన రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ఈనెల 23న జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ శాసనసభ సెక్రటరీ జనరల్ అదే రోజు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం విచారణ జరిపారు. గంటా వ్యాజ్యానికి విచారణార్హతే లేదు.. గంటా తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, 2021లో సమర్పించిన రాజీనామాను స్పీకర్ మూడేళ్ల తరువాత ఆమోదించారన్నారు. రాజీనామా ఉపసంహరణకు గంటా ఎలాంటి లేఖ ఇవ్వలేదని అంగీకరించారు. రాజీనామాను ఆమోదించడం వెనుక దురుద్దేశాలున్నాయి కాబట్టే, స్పీకర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజీనామా ఆమోదించారని, ఆ ఎన్నికల్లో గంటా ఓటు కీలకమని ఆయన వివరించారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేసినప్పుడు, దానిని జారీ చేసిన సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చాలని, అయితే ఈ పిటిషన్లో సెక్రటరీ జనరల్‌ను ప్రతివాదిగా చేర్చలేదన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యాజ్యాలు ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. విధి విధానాల ప్రకారమే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలిపారు. తరువాత అసెంబ్లీ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. స్పీకర్ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకునే రాజీనామాను ఆమోదించారన్నారు. శాసనసభ్యుడిగా కొనసాగాలన్న ఉద్దేశం గంటాకు ఉంటే, ఈ మూడేళ్లలో తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉండాల్సిందని, ఈ పని చేయకుండా ఆయనను ఎవరూ ఆపలేదని వివరించారు. రాజీనామాను ఆమోదించే విషయంలో నిర్ధిష్టంగా ఎలాంటి నిబంధనలు లేవన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని రిట్ ద్వారా ప్రశ్నించడానికి వీల్లేదని తెలిపారు.