AP Special
-
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్‌తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
YSRCP: జనక్షేత్రంలో జేజేలు
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.4.21 లక్షల కోట్లను డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రాష్ట్ర ప్రజలకు అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమంతో పలుకరించింది. సుపరిపాలనతో ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదిస్తూ ప్రజలు ప్రతి అడుగులోనూ వెన్నంటే నిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన భీమిలి సభ సీఎం జగన్‌కు జనామోదం ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. సముద్రంలా ఉప్పొంగిన జన వాహిని సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికింది. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు లక్షల మందిని సమీకరించాలని ఆదేశించినా ఏ సభ చూసినా పట్టుమని 10 – 15 వేల మంది కూడా రాకపోవడంతో బేజారెత్తుతున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాభీష్టం అలా ఉన్నప్పుడు తామేం చేయగలమని పార్టీ నేతలు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 15 సభలకు వచ్చిన జనం మొత్తం అంతా కలిపినా కూడా సీఎం జగన్ తాజాగా పాల్గొన్న ఒక్క భీమిలి సభతో పోలిస్తే సగం మంది కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి కలగడం సాధారణం! కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్నిక ఏదైనా సరే ఏకపక్షంగానే ఫలితాలు వెలువడటం ప్రజాభీష్టానికి తార్కాణంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజురోజుకూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఇటీవల టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గత 56 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పే వైఎస్సార్సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరగడానికి దారి తీస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవైపు సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతుండటం, వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రతి నియోజకవర్గంలోనూ జనం పోటెత్తుతుండటం.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలకు జనం మొహం చాటేస్తుండటాన్ని బట్టి చూస్తే 2019కి మించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యంత భారీ విజయాన్ని సాధించడం ఖాయమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబద్ధతతో పెరుగుతున్న విశ్వసనీయత.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన వాటితోపాటు తాను స్వయంగా గుర్తించిన సమస్యలను క్రోడీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో ఇంత ఘనవిజయం సాధించిన పార్టీ మరొకటి లేదు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ నిబద్ధత చాటుకుంటూ ఇప్పటికే 99.5 శాతం హామీలను నెరవేర్చారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఇప్పటిదాకా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.21 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రజలకు మరెవరూ మేలు చేసిన దాఖలాలు లేవు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. వలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. విద్య, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నడూ ఇచ్చిన మాటకు కట్టుబడని నైజం కలిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది. విశ్వసనీయతకు పట్టం.. టీడీపీ చరిత్రలో 2019 ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల.్లో పోటీ చేసేందుకు ఆపార్టీకి అభ్యర్థులు సైతం దొరకని దుస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళన చెందిన చంద్రబాబు నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. 2021 ఫిబ్రవరిలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు 10,299 పంచాయతీల్లో (80 శాతం) గెలుపొందారు. టీడీపీని 2,166, జనసేనను 157 పంచాయతీలకు ప్రజలు పరిమితం చేశారు. ► ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కంటే మరింత ఘోర పరాభవం తప్పదని పసిగట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చి నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి కుట్రలకు పాల్పడినా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ► మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. వైఎస్సార్సీపీకి చారిత్రక విజయాన్ని అందించారు. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న, ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన 23 నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. ► తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ స్థానాలకు 2021లో, ఆత్మకూరు శాసనసభ స్థానానికి 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ► సీఎం జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారనేందుకు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ సాధించిన వరుస ఘనవిజయాలే తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ► ఇటీవల జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రజా తీర్పు పేరుతో నిర్వహించిన సర్వేలో 1.16 కోట్ల కుటుంబాలు (80 శాతం కుటుంబాల ప్రజలు) మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది. -
టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: టీడీపీ ఎన్నికల అక్రమాలపై పోలీసు శాఖ కొరఢా ఝళిపించింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం తదితర అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో కేసు నమోదు చేసింది. ఏ1గా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు ఆయన చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ నెల 24న గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీలో నిర్వహించిన సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతించాలని పోలీసులు పర్చూరు మున్సిప్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల వినతిని పరిశీలించిన కోర్టు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారించేందుకు సోమవారం అనుమతి ఇచ్చింది. దాంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 123 (1), ఐపీసీ సెక్షన్ 171(ఇ) రెడ్ విత్ 120(బి), సీఆర్పీసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరితోపాటు పరారీలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు, ఆ కంపెనీకి చెందిన మరో ముగ్గురు ఉద్యోగులు, మరికొందరిని నిందితులుగా చేర్చారు. డీఆర్ఐ సోదాల్లో బయటపడిన అక్రమాలు జీఎస్టీ ఎగవేతను గుర్తించేందుకు గుంటూరులో ఉన్న ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు ఈనెల 24న సోదాలు నిర్వహించడంతో ఆయన పాల్పడ్డ ఎన్నికల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కార్యాలయంలో లభించిన ఓ డైరీలో కీలక విషయాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తెప్పించడం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించడం.. అందుకోసం ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసిన నగదు వివరాలు అన్నీ పోలింగ్ బూత్‌లవారీగా నమోదు చేసి ఉన్నాయి. ఆ మేరకు ఖర్చు చేసిన నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే వివరాలు ఏవీ కంపెనీ రికార్డుల్లో లేవు. అంటే షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా నిధులు తరలించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టమైంది. దాంతో డీఆర్ఐ అధికారులు ఈ అంశాన్ని ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ ప్రధాన కార్యాలయాలకు నివేదించారు. ఎన్నికల అక్రమాలపై బాపట్ల పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి, తదితరులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు బాపట్ల న్యాయస్థానాన్ని అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రజాస్వామ్యవాదుల హర్షం గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఏలూరిపై కేసు నమోదు కావడం పర్చూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేపై కేసు నమోదుకావడం పట్ల ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరిని పోలీసులు విచారించే క్రమంలో అవసరమైతే ఆయనను అరెస్ట్‌చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. తొలి నుంచీ అక్రమాలే.. నోవా అగ్రిటెక్ స్థాపించినప్పటి నుంచి ఏలూరి సాంబశివరావు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కంపెనీ తయారు చేసే నాసిరకం బయో మందులతో రైతులకు నష్టాలు మిగిలాయన్న ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో ఆ మందులను పెద్ద ఎత్తున విక్రయించి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయలు ఏలూరి దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు–చెట్టు కింద చెరువులు తవ్వాలని ఏలూరి పట్టుబట్టారు. దీనిని దళితులు వ్యతిరేకించారు. దళితులు– ఏలూరికి మధ్య గొడవ అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. మార్టూరు మండలంలో 250కి పైగా గ్రానైట్ పరిశ్రమలు ఉండగా ఇందులో 90 శాతం మంది యజమానులు ఒకే సామాజికవర్గం వారే ఉన్నారు. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే బయటకు తరలిపోతుంది. ఇందుకు ఎమ్మెల్యే ఏలూరి సహకరిస్తుండటంతో ఆయనకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్ట చెబుతున్నారని తెలుస్తోంది. మరోపక్క ఎన్ఆర్ఐలు పంపించే నల్లధనాన్ని సైతం ఏలూరి ఎన్నికల అక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి 15 వేలకుపైగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇటీవల సదరు దొంగ ఓట్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. డైరీ వెల్లడించిన ఎన్నికల అక్రమాలు.. ► పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ► మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ. 3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ. ► నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ. ► ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ. 15 లక్షలు పంపిణీ. ► పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ► ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. పర్చూరు ఎన్నికల అక్రమాల నిందితులు.. ఏ1: ఏలూరి సాంబశివరావు, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏ2: పుల్లెల అజయ్ బాబు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ3: అప్పారావు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ4: బాజి బాబు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ5: సాయి గణేశ్, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ6: ఇతరులు అక్రమాలపై లోతుగా విచారిస్తాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోవా అగ్రిటెక్ అక్రమాల వ్యవహారాన్ని లోతుగా విచారించాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు కంపెనీ ఉద్యోగులను విచారించాలి. ఇందుకోసం వారిపై కేసులు నమోదు చేశాం. ఈ మేరకు పర్చూరు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి తీసుకొని సోమవారం ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశాం. – వకుల్ జింధాల్, ఎస్పీ, బాపట్ల జిల్లా. -
నలనల్లని రేడు కొండల్లో కొలువైనాడు
చుట్టూ ఎత్తైన కొండలు.. పక్కనే పారుతున్న సీతవాగు.. దాని మీద నుంచి వస్తున్న చల్లని గాలి.. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత మధ్య ఐ.పోలవరం కొండల్లో దివ్యమంగళ రూపంలో కనులపండువగా దర్శనమిస్తున్న కోనేటిరాయుడిని చూసినంతనే భక్తులు అలౌకికానందం పొందుతున్నారు. తిరుమలలో తనివి తీరా స్వామిని దర్శించలేని వారు అదే తరహాలో కొలువైన చూడచక్కని శ్రీనివాసుడిని కనులారా కావలసినంత సేపు చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఈ ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రంపచోడవరం: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరం వద్ద సీతపల్లి వాగు పక్కన కొండపై వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించింది. గత ఏడాది మేలో అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆలయాన్ని ప్రారంభించారు. టీటీడీ ప్రధాన అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉండడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు... తిరుమలలో మాదిరిగా ఇక్కడ ప్రతి రోజు స్వామి వారికి అన్ని సేవలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. సుమారు అరగంట పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఎనిమిది గంటల వరకు సర్వదర్శనం. తరువాత ప్రాతః కాల ఆరాధన (మొదటి నైవేద్యం), సహస్రనామార్చన 9.30 వరకు నిర్వహిస్తారు. సర్వదర్శనం 12 గంటల వరకు ఉంటుంది. శుద్ధి, మధ్యాహ్న కాల ఆరాధన (రెండవ నైవేద్యం), అష్టోత్తర శతనామార్చన ఒంటి గంట వరకు జరుగుతాయి. ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సర్వ దర్శనం ఉంటుంది. సాయంత్రం మూడో నైవేద్యం, అష్టోత్తర శతనామార్చన ఏడు గంటల వరకు నిర్వహిస్తారు. తరువాత 45 నిమిషాల పాటు సర్వదర్శనం భక్తులకు అవకాశం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఏకాంత సేవతో స్వామి సేవలు ముగుస్తాయి. ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు స్వామి నేత్ర దర్శనం, శుక్రవారం అభిషేకం, ఆదివారం గరుడాళ్వార్‌కు అభిషేకం జరుగుతాయి. నవంబరు, డిసెంబరు, జనవరి నెలలకు సంబంధించి స్వామి హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ఆదాయం రూ. 5 లక్షలు వచ్చింది. ప్రతి రోజు స్వామి సేవలకు టీటీడీ ఆలయ అర్చకులను నియమించింది. తిరుమలలో దర్శించుకున్నట్టే.. స్వామి దర్శనం నేత్ర పర్వంగా ఉంది. తిరుపతిలో వేంకటేశ్వరస్వామిని చూసినట్టే ఉంది. కొండల నడుమ ఎంతో సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. వచ్చిన భక్తులకు అన్నసమారాధన కోసం నా వంతు సహాయం చేస్తున్నాను. – గురు ప్రసాద్, రాజమహేంద్రవరం మూడు రోజులు అన్నసమారాధన వారంలో మూడు రోజుల పాటు భక్తుల సహకారంతో ఆలయం వద్ద అన్నసమారాధన నిర్వహిస్తున్నాం. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛందంగా పనులు నిర్వహిస్తున్నాం. – నల్లమిల్లి వెంకటరామారెడ్డి, ధర్మప్రచార సేవా భక్త మండలి కోఆర్డినేటర్ -
ప్రవాసాంధ్రుల నేస్తం ఏపీఎన్ఆర్టీఎస్
సాక్షి, కడప డెస్క్: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ (ఏపీ ఎన్ఆర్టీఎస్) ప్రవాసాంధ్రులకు ప్రియమైన నేస్తంగా మారింది. 2018లో ఏర్పడిన ఈ సంస్థ ఈ ఆరేళ్ల కాలంలో గల్ఫ్ దేశాలైన కువైట్, ఖత్తర్, సౌదీ అరేబియా, దుబాయ్‌లలో ఇబ్బందులు పడుతున్న ప్రవాసాంధ్రులకు అండగా నిలించింది. వారి అవసరాలు తీర్చింది. గతంలో ఈ సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా, అధ్యక్షులుగా ఎస్.వెంకట్ మేడపాటి ఉండేవారు. ప్రస్తుతం గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషాను నియమించారు. గల్ఫ్‌దేశాల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడినా, మరణించినా, వైకల్యం పొందినా అక్కున చేర్చుకుని వారికి ఆపన్నహస్తం అందిస్తోంది. పాస్‌పోర్టు పోగొట్టుకుని వీసా గడువు తీరిపోయి కేసులతో సతమతమవుతున్న వారిని గుర్తించి సాయం చేసి స్వదేశానికి రావడానికి ఎయిర్ టిక్కెట్లతోపాటు ఇమిగ్రేషన్ జరిమాన, దారి ఖర్చులను కూడా ఇప్పిస్తున్నారు. టెంపుల్ దర్శన్ పేరుతో రాష్ట్రంలో ప్రసిద్ధ దర్శనీయ దేవాలయాలకు బ్రేక్ దర్శనం చేయిస్తున్నారు. ప్రవాసాంధ్రుల సమస్యలను గుర్తించడానికి 24 గంటలు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి గ్రీవెన్సెస్ స్వీకరిస్తున్నారు. ఏపీఎన్ఆర్ఐ సెల్ ద్వారా వివాహ సమస్యలు, ఏజెంట్లు మోసం చేయడం, కోర్టు కేసులు వంటి వాటిని పరిష్కరిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతోపాటు యూఎస్ఏ, యూకేలకు వెళ్లే వారికి ఆన్లైన్ ఐటీ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. విదేశాల్లో ఉంటూ సొంత ఊరిని అభివృద్ధి చేయాలనుకునే వారి కోసం మై గ్రాంట్ రీసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సహకరిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు లీగల్‌గా, భద్రతగా వెళ్లడం ఎలా? ఏయే దశల్లో మోసాలు జరుగుతున్నాయనేదానిపై విదేశాలకు ఎక్కువగా వెళుతున్న ప్రాంతాల్లో సేఫ్ మైగ్రేషన్ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లో చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం స్టూడెంట్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారు ఏ కోర్సుల్లో చేరదలుచుకున్నారు? డాక్యుమెంటేషన్, వీసీ గైడ్ లైన్స్ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. విద్యావంతులైన ఎన్ఆర్ఐలను బృందాలుగా ఏర్పాటు చేసి ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించేందుకు దోహదపడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే 10వ తరగతి, ఇంటర్ విద్యార్థుల కోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేయిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనతోపాటు ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. యూఎస్ఏలోని డ్రిిస్టిక్ స్కూళ్లకు ఇక్కడి నుంచి 52 మంది టీచర్లను పంపించారు. గల్ఫ్‌లో మృతి చెందిన వారి మృతదేహాలను భారతదేశానికి తీసుకు రావడానికి థర్డ్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రవాసాంధ్ర భరోసా బీమా ద్వారా వలస కార్మికులకు తక్కువ ప్రీమియానికే రూ. 10 లక్షల బీమా, రూ. లక్ష వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ కల్పిస్తున్నారు. మహిళలు గర్భధారణ చేస్తే సాధారణ డెలివరీకి రూ. 35 వేలు, సిజేరియన్‌కు రూ. 50 వేలు అందేలా చర్యలు చేపడుతున్నారు. ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం రూ. 45 వేలు ఇప్పిస్తున్నారు. సీఎం సహకారం మరువలేనిది ఏపీఎన్ఆర్టీఎస్ స్థాంపించిన తర్వాత ఏడా దికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గల్ఫ్‌దేశాల్లో తెలుగువారు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తమ సంస్థకు ప్రోత్సా హం అందించారు. అనేక సమస్యలతో సతమతమవుతూ సరియైన వేతనాలు లేక మగ్గిపో తున్న వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసు కురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతో కృషి చేశారు. – ఎస్.వెంకట్ మేడపాటి, చైర్మన్, ఏపీ ఎన్ఆర్టీఎస్ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రవాసాంధ్రుల సమస్యలను గతంలో ఏప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారు పడుతున్న అవస్థలను తీర్చే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రవాసాంధ్రుల సమస్యలపై ప్రత్యేక చొరవ ప్రదర్శించారు. కోవిడ్ సమయంలో ఎంతో మందిని ప్రత్యేక విమా నాల ద్వారా ఇండియాకు రప్పించేందుకు కృషి చేశారు. పాస్‌పోర్టులు, వీసా లేకుండా ఉంటున్న వారిని, ఎవరూ లేక అనాథలుగా చనిపోయిన వారిని ఇండియాకు తీసుకురావడంలో ప్రభుత్వ సహకారం మరువలేనిది. –బీహెచ్ ఇలియాస్,డైరెక్టర్, ఏపీఎన్ఆర్టీఎస్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు తొలగిన అడ్డంకులు గల్ఫ్‌లో ఎన్ఆర్ఐలు గతంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీపీ) పొందాలంటే చాలా కష్టతరంగా ఉండేది. అందుకోసం పాస్‌పోర్టుతోపాటు వీసా, అగ్రిమెంట్ సమర్పిస్తే 45 రోజుల తర్వాతగానీ పీసీసీ వచ్చేది కాదు. ఆ లోపు వీసా టైం అయిపోవడమో, పాస్‌పోర్టు గడువు మీరిపోవడమో జరిగేది. ఏపీఎన్ఆర్టీఎస్ కేంద్ర ప్రభుత్వ పాస్‌పోర్టు అధికారులకు ఈ సమస్యలన్నీ వివరించి కేవలం పాస్పోర్టుతో దరఖాస్తు చేస్తే మరుసటి రోజే అపాయింట్మెంట్ లభించేలా కృషి చేశారు. వారంలోనే ఇప్పుడు పీసీసీ వచ్చేస్తోంది. ప్రతి శనివారం వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారంటే అది ఏపీఎన్ఆర్టీఎస్ ఘనతగానే చెప్పవచ్చు. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యులు ప్రభుత్వ అధికారులతో కలిసి సేవలందించారు. వివిధ దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారికి విమానాశ్రయాల్లో త్రాగునీరు, భోజనం, స్నాక్స్, జ్యూసులు ర్పాటు చేశారు. మరే రాష్ట్రంలోనూ ఈ తరహా సేవలు అందించలేదు. -
రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు డీజీ (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్)గా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను అదనపు డీజీ (రైల్వేస్)గా నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ (సీఐ) విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా బదిలీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
AP: ‘ప్రాజెక్ట్ జలధార’.. అద్భుత ఫలితాలు
సాక్షి, అనంతపురం : ఇటీవల నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ను జాతీయ అవార్డుతో సత్కరించింది. అనంతపురంలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ జలధార ద్వారా కరువు ప్రాంతాలలో అభివృద్ధికి దోహదపడినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో ’ప్రాజెక్ట్ జలధార’ ద్వారా ...ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోసాధించిన ఫలితాలను గురించి ఆనందన –కోకా–కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాలను పెంపొందించటంలో ఎన్నదగిన ఫలితాలను సాధించిందన్నారు. వివరాల్లోకి వెళితే... పెరిగిన భూగర్భజలసిరి... గ్రామీణాభివృద్ధి ఎన్జిఓ ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్ సహకారంతో ఆనందన – కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ’వాటర్ స్టీవార్డ్‌షిప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగమైన ప్రాజెక్ట్ ’జలధార’ ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తద్వారా అనంతపురంలో 5 చెక్ డ్యామ్స్‌ను కోడూరు– సుబ్బారావుపేట, ముద్దపల్లి– తిమ్మడిపల్లి , మధురేపల్లి – కందురుపర్తి నల్లపరెడ్డి పల్లి గ్రామాలలో 416 మిలియన్ లీటర్ల నీటి సేకరణ సామర్థ్యంతో నిర్మించారు.దీంతో భూగర్భజలాల పెంపుదల కారణంగా సాగు విస్తీర్ణంలో 35% పెరుగుదల నమోదయింది, తగ్గుతున్న నీటి కొరత... ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్య కూడా పరిష్కారమవుతోంది. భూగర్భ జలాలు పెరగటంతో పంట దిగుబడిలో కూడా గణనీయమైన రీతిలో 75% పెరుగుదల నమోదయింది. దానితో పాటే భూసారమూ పెరిగింది. ఒక సంవత్సరంలో రైతులు బహుళ పంటలు పండించడానికి ఇది వీలు కల్పించింది. అదనంగా, 82% మంది రైతులు పంటల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను గమనించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా 7 నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిర్వహణలో స్థానికుల ప్రమేయాన్ని కూడా పొందగలిగింది. ఇందులో 75 మంది పురుషులు, 17 మంది మహిళలు సహా 92 మంది సభ్యులు ఉన్నారు. నీటి–ఎద్దడి ఉన్న భూములలో భూగర్భ జలాలను పెంచటం, వాటర్షెడ్లను మెరుగుపరచడం ద్వారా కోకోకోలా ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆ కృషి ఫలితంగానే కంపెనీ వినియోగిస్తున్న నీటిలో 200% పైగా తిరిగి అందించగలిగింది. మంచి ఫలితాలు సాధించాం... అనంతపురంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో. భూమి నాణ్యత మెరుగుపరచి పంట దిగుబడిని, భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచగలిగాం. ఫలితంగా, నేడు రైతులు విభిన్న పంటలను పండిస్తున్నారు మా నీటి నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి తగిన శిక్షణ పొందాయి. ఇదీచదవండి.. వేడెక్కిన ఏపీ రాజకీయం -
నా కాళ్లపై నిలబడ్డా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. నా కాళ్లపై నిలబడ్డా మాది మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు లేకపోవడంతో అక్కే నాకు ప్రపంచం. అక్కకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అక్కకు చేదోడు, వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఆమె వద్దే ఉంటున్నా. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామానికి చెందిన స్వయం శక్తి సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్నాను. స్వయం శక్తి సంఘం బ్యాంకు లింకేజీ రుణం రూ.50 వేలు, స్త్రీనిధి ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకున్నా. ఈ సొమ్ముతో ఇంటి వద్దనే చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేసుకొని అక్క కుటుంబ సభ్యులతో కలసి అగరువత్తులు, ఫినాయిల్, కొవ్వొత్తులు తయారు చేస్తున్నాం. ఇంటి వద్దనే చిన్నపాటి స్టాల్‌ను ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నాం. మా అక్క కొడుకులు ఒడిశాలోని బరంపురం, ఇచ్ఛాపురం ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని అమ్ముకొస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం బాగానే ఉంది. ఆసరా పథకం ద్వారా నాకు ఏటా రూ.18,750 చొప్పున వచ్చిన సొమ్ముతో మాకున్న ఎకరంన్నర పంట పొలంలో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. మా ప్రాంతంలో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో విక్రయాలు బాగానే జరుగుతున్నాయి. మా సంఘం ద్వారా మరో రూ.75 వేలు రుణం తీసుకుని కాయగూరల పెంపకాన్ని విస్తరించబోతున్నా. ఈ నెల నుంచే ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్ వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చాలా సార్లు పింఛన్ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. మా వలంటీర్ స్వయంగా వచ్చి దరఖాస్తు చేయించి, మంజూరు చేయించింది. సీఎం జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – దేవాకి భడిత్యా, బిర్లంగి (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) కూలి పనులు మాని వ్యాపారం మా ఆయన విజయనగరం జిల్లా రాజాం మండలం గడిముడిదాం గ్రామంలో కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. మాకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వారిని చదివించాలంటే మాకు తలకు మించిన భారంగా మారింది. ఏదైనా వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చాలా వరకు మా సమస్యలు పరిష్కారమయ్యాయి. మా పిల్లలను బడికి పంపించడం వల్ల అమ్మ ఒడి పథకం వర్తించింది. దాని ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. నాకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏడాదికి రూ.8,200 చొప్పున వచ్చింది. ఆ మొత్తానికి స్త్రీ నిధి ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకుని సొంతంగా మా గ్రామంలో ఎరువుల వ్యాపారం ప్రారంభించాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 వచ్చింది. దానిని వ్యాపారానికి వినియోగించాను. ఇప్పుడు ప్రతి నెల రూ.6 వేలు వరకు ఆదాయం వస్తోంది. భార్యభర్తలిద్దరం కలిసి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు మేము గౌరవంగా బతుకుతున్నామంటే దానికి కారణం జగనన్న ప్రభుత్వమే. – ఏగిరెడ్డి లక్ష్మి, గడిముడిదాం (వావిలపల్లి వెంకట దుర్గారావు, విలేకరి, రాజాం) ప్రశాంతంగా జీవిస్తున్నాం మా ఆయన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రాయపురాజుపేటలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. సంపాదన అంతంత మాత్రమే. మాకు ఒక బాబు, పాప ఉన్నారు. కుటుంబ పోషణే కష్టమవుతుండేది. ఇక పిల్లల చదువులు భారంగానే అనిపించేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కుమార్తెకు 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున మూడేళ్ల పాటు రావడం ఎంతగానో ఉపకరించింది. ఇప్పుడు ఆమె డిగ్రీలో జాయిన్ అయ్యింది. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన కింద డిగ్రీ ఫీజుతో పాటు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఒక విడత రూ.10 వేలు వచ్చింది. మా కుమారుడు మహేష్ పాలిటెక్నిక్ చదివిన సమయంలో విద్యా దీవెన వచ్చింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండో సంవత్సరానికి రూ.40 వేలు ఫీజు, వసతి దీవెన పథకం సొమ్ము రూ.10 వేల వంతున రెండేళ్లుగా అందింది. నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నాను. ఆసరా పథకం సొమ్ము మా అకౌంట్లో పడింది. చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 వంతున వస్తోంది. మాకు కొంత భూమి ఉంది. రైతు భరోసా మొత్తం ఏటా రూ.13,500 పడింది. ఈ విధంగా జగనన్న ప్రభుత్వం మా కుటుంబాన్ని ఎంతగానో ఆర్థికంగా ఆదుకుంది. దీంతో మా ఇద్దరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడం మాకు కష్టం అనిపించలేదు. – కోరిబిల్లి వెంకటి, రాయపురాజుపేట (వేగి మహాలక్ష్మినాయుడు, విలేకరి, చోడవరం రూరల్) -
రూ.70లకు చేపతో భోజనం
శ్రీకాకుళం: ఒకప్పుడు రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న ఆమె వ్యాపారం.. నేడు చక్కటి షాపులోకి చేరింది. సముద్రంలోకి వేటకు వెళ్లి కష్టపడిన ఆమె భర్త.. నేడు ఇతర ప్రాంతాల నుంచి చేపలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. చదువుల కోసం ఇబ్బంది పడిన కుమార్తెలు.. సగర్వంగా నేడు కాలేజీకి వెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ వినూత్న విధానాలతో తీరిన వెతలకు, మారిన బతుకులకు బర్రి తోటమ్మ కు టుంబం ఓ నిదర్శనం. ఫిష్ ఆంధ్రా మొదలుకుని ఫీజు రీయింబర్స్మెంట్ వరకు సంక్షేమ పథకాలను వినియోగించుకుని చక్కటి బతుకు బాటను ఏర్పరచుకున్నారు. తోటమ్మది శ్రీకాకుళం రూరల్ మండలం చిన గనగళ్లపేట గ్రామం. ఈమె భర్త రామారావు సముద్రంలో చేపల వేటకు వెళ్లి వచ్చినప్పుడు సంపాదించిన మొత్తంతో కుటుంబమంతా జీవనం సాగించేది. కొన్నేళ్ల కిందట వీరు కుమార్తెల చదువుల కోసం శ్రీకాకుళం పట్టణానికి కుటుంబంతో పాటు వచ్చేశా రు. మండల వీధిలో నివాసం ఉంటూ జీవ నోపాధికి అరసవల్లి కూడలి వద్ద రోడ్డు పక్కన చేప లు విక్రయించేవారు. కుమార్తెలను చవివిస్తూ కుటుంబాన్ని పోషించటం కష్టంగా ఉండేది. సరిగ్గా అదే సమయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ కుటుంబం సమర్థంగా వినియోగించుకుంది. పిల్లలకు జగనన్న ఇస్తున్న ఫీ జు రీయింబర్స్మెంట్ వస్తోంది. భర్తకు ఏటా వేట విరామ సమయంలో భృతి అందడం మొదలైంది. వీటన్నంటికంటే ‘ఫిష్ ఆంధ్రా’ అవకాశాన్ని తోటమ్మ ఒడిసిపట్టుకున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం. వినూత్నంగా విస్తరణ మత్స్యకారుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభు త్వం అమలు చేసిన ఫిష్ ఆంధ్రా పథకం ఆ కుటుంబానికి వరంగా మారింది. అరసవల్లి కూడలి వద్ద మూడు నెలల కిందట ఫిష్ ఆంధ్రా షాపును నెలకొల్పి తాజా చేపల విక్రయాన్ని ప్రారంభించారు. రూ.2.2లక్షల బ్యాంకు రుణంతో షాపును ఏర్పాటు చేసుకున్నారు. దీనికి 40శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. వ్యాపారం రెట్టింపు కావటంతో వినూత్న తరహాలో విస్తరించారు. వారానికి అరటన్నుకు పైగా చేపలను విక్రయిస్తున్నారు. రూ.70లకు చేపతో భోజనం తోటమ్మకు కొత్త తరహా ఆలోచన రావటంతో రూ.70 లకే పూర్తి స్థాయిలో చేపల పులుసుతో పాటు చేప ముక్కతో భోజనం వడ్డించడం మొదలుపెట్టారు. వినియోగదారుల కోరిక మేరకు రొయ్యల కూర వండి సరఫరా చేస్తున్నారు. దీనికి కూడా ఆదరణ లభించడంతో సాయంత్రం సమయంలో ఫిష్, రొయ్యల వేపుడు విక్రయిస్తున్నారు. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫిష్, రొయ్యల బిరియానీ తయారు చేసి రూ.100 నుంచి రూ.150లకు విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇస్తే ఇంటి వద్దకే సరఫరా చేస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. సాఫీగా చదువులు తోటమ్మ కుమార్తెలు విజయలక్ష్మి, సుగుణలు వ్యా పారంలో తల్లికి సహకరిస్తూనే చదువుల్లో రాణిస్తున్నారు. భర్త రామారావు షాపులో విక్రయించేందుకు జిల్లాలోని పలువురు మత్స్య కారుల నుంచి చేపలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. -
రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేసూ్తనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. కాగా, 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ‘టెట్’ నిబంధనల సడలింపు.. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశముంటుంది. అలాగే.. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. -
ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ నిధులెందుకు?
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు వెచ్చిస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల కొరతతో ప్రాథమిక దశలోనే పలు నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపింది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు సంబంధించిన 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద ఇవ్వాల్సిన రూ. 394 కోట్లను విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని సూచించింది. రాష్ట్ర విభజన తరువాత న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేసింది. నిధుల విడుదల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు అడిషనల్ జనరల్ (ఏఎస్జీ) బి.నరసింహ శర్మ హై కోర్టుకు తెలిపారు. ఇందుకు కొంత గడువునిస్తే కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియచేస్తానన్నారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 4.82 కోట్లు మాత్రమే విడుదల కృష్ణాజిల్లా గన్నవరంలో పలు కోర్టుల కోసం భవన నిర్మాణాలను చేపట్టడం లేదని, పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడం లేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ, నిధుల కొరత వల్ల కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. 19 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం రూ. 656 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్రం వాటా రూ. 394 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 83.33 కోట్లు కోసం హైకోర్టు కేంద్రానికి లేఖ రాసిందన్నారు. కేంద్రం తరఫున ఏఎస్జీ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ, ఈ విషయాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళతానన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కేటాయించిన సొమ్ములో ఇంకా రూ. 14.44 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఈ మొత్తం విడుదల చేసినా కూడా ఇప్పటికే నిలిచిపోయిన 19 ప్రాజెక్టులు పూర్తి కావని తెలిపింది. అందువల్ల పూర్తిస్థాయి నిధుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఏఎస్జీకి స్పష్టం చేసింది. -
ప్రతి ఇంటా ఓ స్టార్ క్యాంపెయినర్
మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు. 10, 15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ, పెద్ద పెద్ద కంపెనీలలో రూ.లక్షల జీతాలు తీసుకునేందుకు బాటలు వేసే ఓటు. పేదవాడు బతకాలన్నా, పేదవాడికి మంచి జరగాలన్నా, మంచి భవిష్యత్తు ఉండాలన్నా.. నిర్ణయించే ఓటు. జరిగిన మంచి కొనసాగాలంటే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది. ఈ రోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చింది మీ బిడ్డే.. ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు. కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని మోసం చేస్తారు. కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పింది మాత్రం మీ బిడ్డ జగన్ మాత్రమే. చేయగలిగిందే చెబుతాడు. కానీ ఒకసారి చెప్పిన తర్వాత చేస్తాడంతే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మనందరి ప్రభుత్వ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరే నా సైనికులని, ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అవ్వ, తాత, రైతన్న.. ఇలా మంచి జరిగిన వారంతా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలిచేలా వారందరినీ సంసిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కనీసం వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని కోరారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ బిడ్డకు అబద్ధాలు, కుతంత్రాలు, కుట్రలు, మోసాలు తెలియదని స్పష్టం చేశారు. మీ బిడ్డ పొత్తులు, జిత్తులను నమ్ముకోలేదని చెప్పారు. ‘మీ బిడ్డ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని నమ్ముకోలేదు. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే’ అని అన్నారు. అందరికీ మంచి చేయాలన్న లక్ష్యంతోనే అడుగులు ముందుకు వేశానన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని కోరారు. ‘మీ బిడ్డ తరఫున మీరే సైనికులుగా నిలబడాలని చెప్పండి. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటకు రావాలని అడగండి’ అని పిలుపునిచ్చారు. ‘రూ.2.53 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వేశాం. ఎవరూ లంచాలు అడగ లేదు. వివక్ష చూప లేదు. మనం బటన్ నొక్కడంతో రాష్ట్రంలో 84 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామాల్లో 92 శాతం ఇళ్లకు మేలు జరుగుతోంది. ఇంత మంచి ప్రతి గ్రామంలో జరిగిందన్న విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కార్యకర్తలను గెలిపించే పార్టీ వైఎస్సార్సీపీ ► వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్పర్సన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టులలో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు. వీరితోపాటు ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానికి ఒక విషయం చెబుతున్నా.. ఇది ఒక జగన్ పార్టీ కాదు. ఇది మీ అందరి పార్టీ అని గుర్తుంచుకోండి. మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడు మాత్రమే. కార్యకర్తలను, నాయకులను అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో, రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా చేశాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లును నియమించిన ప్రభుత్వం మనది. మార్కెట్ యార్డులు, దేవాలయాల బోర్డుల్లో మొత్తంగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసే విషయంలో ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు ఇవ్వడం కేవలం మీ బిడ్డకే సాధ్యమైందని చెప్పడానికి గర్వపడుతున్నా. ► 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కాబట్టే.. వివక్ష, లంచాలు లేని పాలన ఇవ్వగలిగాం కాబట్టే.. ఇవాళ ఎవరైనా మన పార్టీ తరుఫున వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు.. ఏ పదవికి పోటీ చేసినా సాధారణ మెజారీ్టతో కాదు.. గొప్ప మెజారీ్టతో గెలిపించి ఆ స్థానాల్లో కూర్చో బెడతారు. వైఎస్సార్సీపీలో ఉన్న వారు, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలో ఇవ్వని అవకాశాలు ఇచ్చామని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబుకు ఓటేస్తామని అనగలరా? ► అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా దేశంతో మనం పోటీ పడుతున్నాం. వారి కోసం ఆసరా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత, లక్షాధికారులను చేయాలని 35 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం, ఇలా ఇంటింటికి మేలు చేసింది మీ బిడ్డ ప్రభుత్వం. 2014 ఎన్నికల ప్రణాళికలో రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. ప్రతి ఏటా సబ్సిడీపై 12 సిలిండర్లు ఇస్తామని మోసం చేశాడు. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తానని మోసం చేసిన చరిత్ర. సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేసి దుర్మార్గానికి పాల్పడిన చరిత్ర. ఇళ్ల పట్టాలు ఒక్కటి కూడా పేద కుటుంబానికి ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. అన్నింటిలోను మోసమే. ► ఇవన్నీ చూసినా తర్వాత, నిజాలు తెలిసిన తర్వాత.. ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి ఓటు వేయకుండా, తోడుగా నిలబడకుండా ఉండగలరా? చంద్రబాబుకు ఓటు వేస్తామని అనగలరా? కులం, మతం, పార్టీ చూడకుండా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లబ్ధి కలిగించాం. అక్కచెల్లెమ్మల గత 10 సంవత్సరాల బ్యాంకు ఖాతాలను చూస్తే ఎవరెంత మేలు చేశారో తెలుస్తుంది. కోవిడ్ కష్టాలు ఎన్ని వచ్చినా మీ బిడ్డ ఆ పేద వాడి ముఖంలోను, కుటుంబంలో చిరునవ్వులు చూడాలని ఆరాటపడ్డాడు. ఈ విషయాలన్నీ అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు చెప్పండి. ► గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారి కార్యకర్తలకే.. అదీ కొద్ది మందికే సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ స్థానంలో మనం చదువుకున్న పిల్లలను తీసుకువచ్చి వలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్లి లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని అందిస్తున్నాం. జగనన్న అన్నీ వలంటీర్ల చేతుల్లోనే పెట్టాడని కొందరు అనుకోవచ్చు. ఆ వలంటీర్లు ఎవరో కాదు. వారు కూడా మనల్ని, మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మనవారే. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో చెప్పాలి ∙ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోడానికి మాత్రమే కాదు. పేద కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు. ప్రతి పేదవాడి భవిష్యత్తు మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే మళ్లీ రావాలని చెప్పండి. విద్య, వైద్యం కోసం అప్పులు చేసే పరిస్థితి రాకూడదంటే మళ్లీ జగనే రావాలని వివరించండి. అక్కచెల్లెమ్మల సాధికారత కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని చెప్పండి. రైతు భరోసా, ఉచితంగా ఇన్సురెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకే వ్యవస్థ కొనసాగింపు.. ఇలా ఏది జరగాలన్నా జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని విడమరచి చెప్పండి. ►ఈ రోజు 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీం కొనసాగాలన్నా, భవిష్యత్తులో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్, డీబీటీ స్కీంల మంచి జరగాలన్న మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ప్రతిపక్షాలకు ఓటు వేయడమంటే దాని అర్థం, స్కీంలన్నీ వద్దు, రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే. లంచాలు, వివక్షతో కూడిన జన్మభూమి కమిటీల వ్యవస్థకు ఓటు వేయడమే. ఇలా ఏ మంచి చేయని, పొత్తు లేకపోతే పోటీ చేయలేని, పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగ్‌లు కొడుతుంటే ‘ఓటి కుండకు మోత ఎక్కువ.. ఉత్త గొడ్డుకు అరుపులెక్కువ. చేతకాని వాడికి మాటలెక్కువ’ అనే సామెతలు గుర్తుకొస్తున్నాయి. మేము సైతం.. ముఖ్యమంత్రి జగన్‌కు జైకొట్టిన పార్టీ శ్రేణులు సాక్షి, విశాఖపట్నం: సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ శ్రేణులు మేము సైతం కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమేనని నినదించాయి. లక్షల గొంతులు ఏకమై తమ సంఘీభావాన్ని తెలిపాయి. సంగివలసలో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం పార్టీ క్యాడర్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు, కులమతాలకతీతంగా జరిగిన మేళ్లను ఆయన సోదాహరణంగా వివరించిన తీరు వారిని మంత్రముగ్ధులను చేసింది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించేవే కాదు.. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్సార్సీపీ పాలనలో కొనసాగేందుకు దోహదపడేవన్న వాస్తవాన్ని అందరికీ చెప్పండి’ అంటూ సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి పార్టీ శ్రేణులను ఎంతగానో ఆలోచింపజేసింది. చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను సభలో కళ్లకు కట్టినట్టు వివరించిన తీరు ఆకట్టుకుంది. 2019కి ముందు, తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాల్లో వ్యత్యాసాలను గుర్తించాలని ప్రజలను కోరాలని సూచించారు. వలంటీర్ల వ్యవస్థతో పాటు నుంచి సచివాలయాల ద్వారా అవినీతి లేని సుపరిపాలన, ఆర్బీకేలు, విలేజి క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, నాడు–నేడు వంటి వాటి వల్ల చేకూరే ప్రయోజనాలు, హామీలో 99 శాతం అమలు చేసిన తీరును సోదాహరణంగా వివరించడంతో సభికులంతా అచ్చెరువొందారు. సభలో సరిగ్గా గంటా 17 నిమిషాల సేపు జరిగిన సీఎం ప్రసంగం ఆద్యంతం ఎంతో పరిణతితో సాగింది. భావితరాల భవిష్యత్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగడం ఎంత అవసరమో తేటతెల్లం చేసిందని భావిస్తున్నారు. సీఎం మాట్లాడే సమయంలో అప్పుడప్పుడూ ప్రజలు సీఎం.. సీఎం అంటూ అభివాదాలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో, ప్రతిపక్షాల కుట్రలను ఎలా తిప్పికొట్టాలో సవివరంగా వివరించడంతో వైఎస్సార్సీపీ మరోసారి విజయదుందుభి మోగించేందుకు కంకణం కట్టుకుంటామంటూ పార్టీ క్యాడరు, నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. పర్యటన సాగిందిలా..: సీఎం జగన్మోహనరెడ్డి శనివారం మధ్యాహ్నం 3:12 గంటలకు విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 3.26 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి సంగివలస వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి సభాస్థలి వద్దకు 3.55 గంటలకు చేరుకున్నారు. సాయంత్రం 4.10 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. అక్కడ నుంచి 10 నిమిషాల పాటు బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ నడిచారు. సభ పూర్తయిన తరువాత హెలికాఫ్టర్‌లో సాయంత్రం 5.55 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 6.07 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగు పయనమయ్యారు. -
Fact Check: నిద్ర 'కరువై' నీచపు రాతలు..
సాక్షి, అమరావతి: చంద్రబాబు మత్తులో రామోజీ కూరుకుపోయారు. ఆ మైకంలోనే ఆయన పగలూ రాత్రి అనే తేడా లేకుండా జోగుతున్నారు. తన విషపుత్రిక ఈనాడులో ఏం రాస్తున్నారు.. అందులో వాస్తవాలేమిటో తెలుసుకోలేనంత “స్పృహ’లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటుంటే రామోజీరావు మాత్రం చంద్రబాబు మైకంలో పడిపోయి నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే సీజన్లో ఏకంగా నాలుగుసార్లు సబ్సిడీ విత్తనాలు అదీ కూడా 40–80 శాతం సబ్సిడీపై అందించి అండగా నిలిస్తే ఈనాడుకు అది కన్పించలేదు. సీజన్ ముగియకుండానే కరువు మండలాలను ప్రకటించినా కన్పించలేదు. సాధ్యమైనంత ఎక్కువగా సాయపడాలన్న సంకల్పంతో పెట్టుబడి సాయాన్ని పెంచినా కన్పించలేదు. ఆఘమేఘాల మీద కరువుతో పాటు మిచాంగ్ తుపాను పంట నష్టం లెక్కతేల్చి పరిహారం పంపిణీకి ఏర్పాట్లుచేస్తుంటే అదీ కన్పించలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏదో విధంగా రైతులను గందరగోళపర్చాలన్న లక్ష్యంతో కాకిలెక్కలతో బురద రాతలు రాస్తూ ఈనాడు విషప్రచారం చేస్తోంది. తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం ఇక ఎప్పటికీ దక్కదేమోనన్న దుగ్థతో రోజూ నిద్ర కరువై నీచపు రాతలతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై పేట్రేగిపోతున్నారు. తాజాగా.. ‘ప్రభుత్వం మొద్దునిద్ర’ పోతోందంటూ శనివారం అచ్చేసిన కథనంలో అంశాలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. అడుగడుగునా రైతులకు అండగా.. నిజానికి.. వర్షాభావ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆ ప్రభావం రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో కన్పించింది. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 84.97 లక్షల ఎకరాలు కాగా.. వర్షాభావ పరిస్థితుల వలన ఖరీఫ్–2023 సీజన్లో 63.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 21.51 లక్షల ఎకరాల్లో సాగు తగ్గితే ఈనాడు మాత్రం పనిగట్టుకుని 31 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వలేదంటూ ఇష్టమొచ్చినట్లు రాసిపారేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో తొలుత 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. బెట్ట పరిస్థితుల వలన ఏటా వేసే పంట వేయలేని రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద పంటల విత్తనాలను 80 శాతం రాయితీపై ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా చేశారు. రూ.26.46 కోట్లు సబ్సిడీ భరించి 1.16 లక్షల మంది రైతులకు 30,977 క్వింటాళ్ళ వరి, కొర్ర, మినుము, పెసర, కంది, ఉలవలు, జొన్న, అలసంద, మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద రైతులకు వరి, ఇతర పంటలను సాగుచేయడానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను క్షేత్రస్థాయికి పంపి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించడమే కాక.. బెట్ట పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఫలితంగానే రాష్ట్రంలో 63.46 లక్షల ఎకరాలు పంటలు సాగయ్యాయి. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రెండో ముందస్తు అంచనా ప్రకారం రికార్డు స్థాయిలో 154.73 లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చాయి. తెలంగాణలో 31 జిల్లాల్లో వర్షాభావం.. రబీ సీజన్లో కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జనవరిలో నమోదైన వర్షపాతమే ఇందుకు నిదర్శనం. ఇక దేశవ్యాప్తంగా 327 జిల్లాల్లో చినుకు పడని పరిస్థితి నెలకొంటే.. 143 జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం, 73 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పొరుగునున్న తెలంగాణలో 33 జిల్లాలకుగాను 31 జిల్లాల్లో చుక్కనీరు కూడా పడని పరిస్థితి నెలకొంది. కానీ, ఏపీలో ఏడు జిల్లాల్లో అధిక లోటు వర్షపాతం నమోదు కాగా.. మరో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఐదు జిల్లాల్లో సాధారణ, అధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రబీలో రెండుసార్లు సబ్సిడీ విత్తనం.. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో పంటలు సాగుచేయలేని రైతులు ముందస్తు రబీకి సిద్ధంకావడంతో వారి కోసం ప్రత్యేకంగా 40 శాతం సబ్సిడీపై రైతులకు 3.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కొన్ని జిల్లాల్లో నారుమళ్లు, మరికొన్నిచోట్ల నాట్లు దెబ్బతిన్నాయి. ఇలా పంటలు దెబ్బతిన్న 16 జిల్లాల్లో రూ.65 కోట్లు ఖర్చుచేసి 85,645 క్వింటాళ్ల విత్తనాన్ని 80 శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా మరోసారి సరఫరా చేశారు. ఇప్పటికే 50వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుము, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను రూ.29.69 కోట్ల విలువైన రాయితీతో 61 వేల మంది రైతులకు అందజేశారు. ఫలితంగా.. రబీ 2023–24 సీజన్లో 55.27 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 32 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధాన పంటలైన వరి 19.5 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 10.50 లక్షల ఎకరాలలో వరినాట్లు వేశారు. ఇంకా పలు జిల్లాల్లో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి, 10 రోజుల్లో అవి పూర్తవుతాయి. మిగిలిన పంటలు కూడా సీజన్ ముగిసేలోపు నిర్ధేశించిన లక్ష్యం మేరకు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. త్వరలో కరువు, తుపాను సాయం పంపిణీ ఇక ఖరీఫ్–2023లో సంభవించిన కరువు ప్రభావాన్ని గుర్తించడమే కాదు.. సీజన్ ముగియకుండానే ఏడు జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తుది నివేదికల ఆధారంగా 14.07 లక్షల ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లుగా గుర్తించారు. 6.96 లక్షల మంది రైతులకు రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. మరోవైపు.. డిసెంబరులో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ప్రభావంతో 6.56 లక్షల ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 4.61 లక్షల రైతులకు రూ.442.36 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. కరువు, మిచాంగ్ తుపాను సాయాన్ని త్వరలో రైతుల ఖాతాలో జమచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. సాధారణంగా వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ప్రామాణికాల మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా వర్తించే విధంగా అర్హతలను నిర్ణయిస్తే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పంట సాగు పరిస్థితులను బట్టి ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు పంట నష్టపరిహారం నిర్ణయిస్తుంది. పెట్టుబడి రాయితీని లెక్కగట్టే విషయంలో దశాబ్దాలుగా సాగుతున్న విధానం ఇది. కేంద్రం కంటే మిన్నగా పెట్టుబడి సాయం.. కానీ.. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన పెట్టుబడి రాయితీ సొమ్ము కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో ఎకరానికి ఇచ్చే పెట్టుబడి రాయితీని భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇలా కేంద్రం కంటే మిన్నగా పెట్టుబడి రాయితీని అందిస్తున్న ఏకైక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి కేంద్రానికో లెక్క, రాష్ట్రానికో లెక్క అంటూ విషం కక్కడం ఈనాడుకే చెల్లింది. రూ.5,942 కోట్లు ఎగ్గొట్టిన బాబు.. రెయిన్ గన్లతో హంగామా చేసి రూ.కోట్లు దండుకుని వర్షాలు నేనే కురిపించా.. కరువును నేనే జయించా.. అంటూ ప్రచారార్భాటానికి ఒడిగట్టిన చంద్రబాబు హయాంలో రైతులకు రూ.5,942 కోట్లు ఎగ్గొట్టగా.. అందులో 24.80 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ రూ.2,558.07 కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా రామోజీ? కానీ, ఈ నాలుగున్నరేళ్లలో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందించడమే కాదు.. 54.50 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం అందించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. అయినా.. బాబు మత్తులో ఉన్న రామోజీ తీరు కుక్క తోక వంకరలాంటిదే. -
జంట జబ్బులను జయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్‌లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రమాదకర జబ్బుల బారినపడకుండా... దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్ ఎన్సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్‌వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్‌లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్‌లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4 శాతం ఉంటే.. అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఐదేళ్లలో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4 శాతం నమోదవ్వడం అంటే ప్రజల ఆదాయాలు పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సత్ఫలితాలిచ్చాయనడానికి డిపాజిట్లలో వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక నవరత్నాలు ద్వారా అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. అలాగే, బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎంఎస్ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారి ఆదాయాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వార్షిక సగటు క్రెడిట్ వృద్ధి 14.3 శాతం నమోదైంది. ► అలాగే, ఇచి్చన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. ► అంతేకాక.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలను ఇప్పిస్తోంది. ► వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నావడ్డీకే రుణాలు ఇప్పిస్తోంది. ► ఇక వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆరి్థక సాయం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► దీంతో ఈ వర్గాలన్నింటికీ బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇలా రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. -
మాకిక శాశ్వత చిరునామా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మాకిక శాశ్వత చిరునామా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మాది. నేను, మా ఆయన అవుగడ్డ శ్రీరామమూర్తి కలసి కూలి పని చేస్తే వచ్చే కొద్ది పాటి ఆదాయంపైనే కుటుంబ పోషణ సాగేది. సొంత ఇల్లు లేకపోవడంతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువ గ్రామంలోని అమ్మోళ్ల ఇంట్లో చిన్నపాటి ఇరుకు గదిలో ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవారం. పిల్లలు ఎదుగుతున్నా సొంత ఇల్లు లేదన్న మనోవేదన వెంటాడేది. గత ప్రభుత్వంలో ఇంటి కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. గ్రామ వలంటీర్, సచివాలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి «ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలం, ఇల్లు ఇస్తుందని చెప్పి, వారే దరఖాస్తు నింపి తీసుకెళ్లారు. వారి మాటలను తొలుత మేము నమ్మలేదు. కొన్ని రోజుల తర్వాత వలంటీర్ వచ్చి తారువలోని జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరైందని చెప్పారు. ఒకటిన్నర సెంటు స్థలంతో పాటు.. ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. మరికొంత సొమ్ము కలిపి ఇల్లు నిర్మించుకున్నాం. మూడు నెలల క్రితం గృహ ప్రవేశం చేశాం. ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిరుపేద కుటుంబానికి చెందిన మేము సొంతిల్లు నిర్మించుకుంటామని కలలో కూడా అనుకోలేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హాయిగా నివసిస్తున్నాం. పెద్దబ్బాయి ఇంటర్, రెండో అబ్బాయి 9వ తరగతి చదువుతున్నారు. ఏటా 15 వేలు చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా నగదు వస్తుండడంతో వారి చదువులపై బెంగ లేదు. మాకు ఈ ప్రభుత్వం శాశ్వత చిరునామా కల్పించింది. – అవుగడ్డ సుగుణ, తారువ (పక్కుర్తి గణేష్ , విలేకరి, దేవరాపల్లి) పేద బతుకులకు సర్కారు అండ మాది నిరుపేద కుటుంబం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. చాలా కాలం కిందటే మా ఆయన కాలం చేశారు. పిల్లలను ఎలా పెంచాలి, ఎలా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కుమిలిపోయేదాన్ని. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ భయం పోయింది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మా గ్రామంలో మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న నాకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఒక్కోవిడతలో రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం జమ చేసింది. దానిని సద్వినియోగం చేసుకుని, జగనన్న తోడు పథకం కింద రెండు విడతల్లో అందించిన రూ.20 వేలు, బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకుని ఆ డబ్బుతో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాం గ్రామంలో కిరాణా దుకాణం పెట్టుకున్నాను. నెలకు రూ.16 వేలు ఆదాయం వస్తోంది. ప్రతినెలా వితంతు పింఛన్ రూ.3 వేలు అందుతోంది. నా పెద్ద కూతురు టి.భవానీ ఇంజినీరింగ్, చిన్న కూతురు వరలక్ష్మి డిగ్రీ చదువు ప్రభుత్వ తోడ్పాటుతో పూర్తయింది. సీఎంగా జగన్మోహన్రెడ్డి లేకుంటే మా పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యేది. – తూమాడ శాంతమ్మ, గొల్లలములగాం (ఎమ్.సతీష్ కుమార్, విలేకరి, చీపురుపల్లి) మా పిల్లలను పనికి పంపట్లేదు మాఆయన మహ్మద్ మాబు హోటల్లో వంట మాస్టారుగా పని చేస్తున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామంలో జీవనం సాగిస్తున్నాం. ఆరి్థక ఇబ్బందులు వెంటాడడంతో మా కుమారుడు ఖాసిం ఒకటో తరగతి చదువుతున్న సమయంలో బడి మాని్పంచి నా భర్త తనతో పాటు పనికి తీసుకెళ్లాలని భావించాడు. అయితే నాలుగేళ్ల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించడంతో బడికి పంపుతున్నాం. మా గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నాం. నాలుగేళ్లుగా అమ్మఒడి డబ్బులతో పాటు ప్రతి ఏడాది విద్యాకానుక కింద స్కూల్లోనే బ్యాగు, పుస్తకాలు, బట్టలు, బూట్లు, నోట్సులు అన్నీ ఇస్తున్నారు. పాఠశాలలోనే చక్కటి మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఐదో తరగతిలోకి వచ్చాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి ద్వారా రూ.15 వేలు బ్యాంకులో వేస్తున్నారు. మా అబ్బాయిని ఇలాగే ఎక్కడా ఆపకుండా పెద్ద చదువులు చదివిస్తాం. మాలాంటి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – కరీమూన్, గనికపూడి (కె.శ్రీనివాసరావు, విలేకరి, గుంటూరు ఎడ్యుకేషన్) -
కాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్‌గా కాకినాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందులో భాగంగా కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. రూ.2,700 కోట్లతో ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేసే క్లోర్ ఆల్కాలి యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022, ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మంది ఉపాధి పొందుతుండగా.. యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 1,100 మందికి ఉపాధి కలి్పంచవచ్చు. దేశంలోనే అతిపెద్ద యూనిట్ బలభద్రపురంలో ఏర్పాటు కావడంతో ఈ ప్రత్యేక రసాయనాలు ముడి సరుకుగా తయారుచేసే అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకు కాకినాడ ప్రధాన హబ్‌గా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో కెమికల్స్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక యూనిట్లు రావడం ద్వారా కాకినాడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. తూర్పు తీరంలో ఇదే తొలి యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా ఏడు క్లోర్ ఆల్కాలి యూనిట్లు ఉండగా, తూర్పుతీర ప్రాంతంలో తొలి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో లాక్డౌన్ సమయంలో కూడా పనులు వేగంగా జరిగాయి. కీలక అనుమతులు తీసుకురావడంలో అధికారులు వేగంగా స్పందించడంతో రికార్డు సమయంలోనే ఉత్పత్తిని ప్రారంభించారు. ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా జర్మన్ టెక్నాలజీ సాయంతో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంతో ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించారు. ఎగుమతుల దిశగా.. మనం తినే అహార పదార్థాల నుంచి శుభ్రం చేయడానికి వినియోగించే ప్రతి వస్తువులోనూ కాస్టిక్ సోడా చాలా కీలకం. కాగిత పరిశ్రమ, టెక్స్టైల్స్, అల్యూమినియం, ఫార్మా, ఫెస్టిసైడ్స్, మంచినీటిని శుభ్రం చేయడం, స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఆయిల్ రిఫైనరీలు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ ఇలా అన్నింటా కాస్టిక్ సోడా ముఖ్యమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి కూడా కాస్టిక్ సోడానే వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రులు శుభ్రం చేసేందుకు, శానిటైజేషన్ వంటి వాటిల్లో ఈ యూనిట్లో తయారయ్యే సోడియం హైపో క్లోరైడ్ కీలకపాత్ర పోషించిందని ఆల్కలీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన దేశంలోప్రస్తుతం కాస్టిక్ సోడా డిమాండ్ 35.6 లక్షల టన్నులుండగా 2035 నాటికి అది 55 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాల మేరకు 2021 నాటికి దేశంలో వివిధ యూనిట్ల ద్వారా 47.63 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చాక ఈ కెమికల్స్‌ను పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ కీలకం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతిస్తూ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – ఏప్రిల్ 21, 2022న కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంబోత్సవంలో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా వారికి అప్పగించేందుకు ఈ చట్ట సవరణ చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది. పేదలు ఒక ఆస్తిలా ఆ స్థలాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆ స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసమే అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. కాగా, ఈ నెల 29వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసేందుకు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలను ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో నంబర్ 36 జారీ చేసింది. కన్వేయన్స్ డీడ్స్ ద్వారా పేదలకు భరోసా ఇంతకుముందు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై వారికి హక్కులు పొందడానికి 20 ఏళ్ల గడువు ఉండేది. దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 2021లోనే పదేళ్లకు తగ్గించింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి హక్కులు వస్తాయి. గతంలో ఉన్న విధానంలో లబ్ధిదారులకు హక్కులు రావాలంటే వారు లేదా వారి వారసులకు తహసీల్దార్లు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వడం, దాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిన తర్వాత హక్కులు కల్పించడం అంతా ఓ పెద్ద ప్రహసనం. అసైన్డ్ భూముల రికార్డులు సరిగా లేకపోవడం, అసైన్ చేసినప్పుడు ఇచ్చిన డి–పట్టాలు పోవడం వంటి రకరకాల కారణాలతో అసైన్డ్ ఇళ్ల పట్టాలపై హక్కులు పొందడం పేదలకు కష్టంగా మారిపోయింది. ఈ పరిస్థితిని నివారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇచ్చినప్పుడే పేదల పేరు మీద వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. రిజిస్టర్ అయిన వెంటనే వారికి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేయడం వల్ల పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కులు వస్తాయి. తహసీల్దార్ల నుంచి ఎన్వోసీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఆ స్థలాలు వారి పేరు రిజిస్టరై ఉండడం, కన్వేయన్స్ డీడ్లు కూడా ఇవ్వడంతో వాటిని ఆస్తిపత్రాలు (సేల్ డీడ్)గా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా వారి పేరు మీదే చేయడం ద్వారా మహిళలకు ప్రభుత్వం భరోసా ఇవ్వనుంది. -
సంగివలసలో సమరోత్సాహం
సాక్షి, విశాఖపట్నం: పెత్తందారులపై పేదల తరఫున పోరాటానికి సిద్ధమంటూ వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరించిన ఎన్నికల శంఖారావం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. గుంపులుగా వస్తున్న జెండాలు, పెత్తందారుల అజెండాలపై యుద్ధానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినిపించిన రణన్నినాదంతో భీమిలి నియోజకవర్గం సంగివలస సభా ప్రాంగణం జయహో జగన్ అంటూ ఉప్పెనలా ప్రతిధ్వనించింది. బంగాళాఖాతానికి ఎనిమిది కిలోమీటర్లలో దూరంలో ఉన్న ఆ ప్రాంతం శనివారం జన సాగరాన్ని తలపించింది. జై జగన్.. వైనాట్ 175 నినాదాలతో జాతీయ రహదారి దద్దరిల్లింది. సీఎం జగన్మోహన్రెడ్డి కార్యకర్తల చెంతకు వచ్చి వారికి అభివాదం చేస్తూ.. వారితో మమేకమై మనమంతా ఒకటిగా రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామంటూ ఇచ్చిన పిలుపునకు ఉత్తరాంధ్ర ఉవ్వెత్తున ఎగసిపడింది. కార్యకర్తల్లో ఉప్పొంగిన ఉత్సాహం చూస్తే.. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా.. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఖాయమని శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాబోయే ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన ‘సిద్ధం’ సభ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది. కౌరవ సైన్యంపై యుద్ధానికి మేము సైతం.. ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా.. అంటూ కార్యకర్తల్ని తనతో పాటు సమర సన్నద్ధం చేశారు. జగనన్న వెంటే.. మా పయనమని.. యుద్ధానికి సిద్ధమంటూ అధినేతతో లక్షల గొంతులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించాయి. కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్న జగనన్న రథసారథిగా.. ఆయనతో కలిసి సాగేందుకు కోట్లమంది కార్యకర్తలు ‘సిద్ధం’’గా ఉన్నామంటూ సంగివలస సభ చాటిచెప్పింది. దాదాపు గంటకు పైగా సాగిన అధినేత ప్రసంగం.. వేదికపై ఉన్న నాయకుల్లోనే కాదు.. తరలివచ్చిన లక్షలాది మంది పార్టీ కుటుంబ సభ్యుల్లోనూ ఎన్నికల సమరోత్సాహాన్ని నింపింది. వైఎస్ జగన్ ప్రసంగం వింటూ మైమరచిపోయిన కార్యకర్తలు.. ఇక తగ్గేదేలే.. మళ్లీ సీఎం కుర్చీపై జగనన్నని కూర్చోబెట్టేదాక శ్రమిస్తామంటూ నినదించారు. చంద్రబాబు అండ్ కోకి ఉన్నట్లుగా మనకు దుష్టచతుష్టయం లేదని.. ప్రతి ఒక్కరి దగ్గరా ఉన్న సెల్‌ఫోనే మన ఆయుధమంటూ జగన్ చెప్పిన వెంటనే పార్టీ కార్యకర్తలంతా సెల్‌ఫోన్ బయటకు తీసి జగన్‌కు చూపించారు. దుర్మార్గులపై పోరుకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ అధినేత పిడికిలి బిగించగానే.. లక్షలాది మంది పార్టీ శ్రేణులు పిడికిలి బిగిస్తూ మద్దతు పలికారు. పార్టీ శ్రేణులే కాదు.. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ తాము కూడా సిద్ధమంటూ చేతులు పైకెత్తి నినదించారు. తరలివచ్చిన ఉత్తరాంధ్ర పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా ఊహించిన దానికంటే లక్షల్లో కార్యకర్తలు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి జనాల్ని నట్టేట ముంచిన చంద్రబాబు మార్కు రాజకీయాల్ని ఎండగట్టిన వైఎస్ జగన్.. ఈ 56 నెలల పాలనలో రాష్ట్రంలోని ప్రతి పల్లె, మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. ఇది తమ బాధ్యతంటూ కార్యకర్తలు నినదించగా సభా స్థలి హోరెత్తింది. ఏ గ్రామానికి వెళ్లినా జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని.. ఇది జగనన్న పాలన అని ప్రజలకు చెప్పాలంటూ అధినేత చేసిన ప్రసంగానికి ముగ్ధులైన శ్రేణులు జోష్‌లో మునిగిపోయారు. ఉదయం నుంచే సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ప్రసంగం మొదలవుతుందని తెలిసినా.. ఉదయం 10 గంటల నుంచే సభా స్థలికి పార్టీ శ్రేణులు క్యూ కట్టాయి. రాత్రి 7 గంటల వరకూ ఏ ఒక్కరూ సంగివలస నుంచి బయటకు వెళ్లకుండా ప్రాంగణంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. సభా ప్రాంగణంపై నుంచే హెలిప్యాడ్ వైపు వెళ్లారు. ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు జై జగన్ అంటూ నినదించారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి అభివాదం చేయగానే.. సభా స్థలి దద్దరిల్లింది. సభాస్థలికి చేరుకోలేక వందలాది బస్సుల్లో వేల మంది పార్టీ శ్రేణులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. మరికొందరు బస్సుల్లోనే జగన్ ప్రసంగాన్ని వింటూ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ వేదిక నుంచి నేరుగా కార్యకర్తల మధ్యలోకి వచ్చి అభివాదం చేసేలా నిర్మించిన ర్యాంప్.. శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 5 నిమిషాల పాటు ప్రతి కార్యకర్తకూ అభివాదం చేస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ.. ర్యాంప్‌పై వైఎస్ జగన్ ముందుకు సాగారు. తమ వద్దకు వచ్చి పలకరించిన అధినేతని చూసిన ప్రతి కార్యకర్త మురిసిపోయాడు. జగనన్నా అంటూ పలకరిస్తూ.. జై జగన్ అని నినదించారు. ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్సీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ ప్రత్యేకంగా అవసరం లేదనీ.. ప్రతి లబ్ధిదారుడితో పాటు తామూ స్టార్ క్యాంపెయినర్లుగా మారుతామంటూ అధినేతకు శ్రేణులు హామీ ఇచ్చాయి. ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పూరించిన ఎన్నికల శంఖారావానికి తరలి వచ్చిన అశేష జనవాహిని చూసి ఇప్పటికే ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుట్టింది. ఇకపై వైఎస్సార్సీపీ కుటుంబం గురించి మాట్లాడాలంటే సంగివలస సభ గుర్తుకు తెచ్చుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారేమో. ప్రతి కార్యకర్తకు జగన్ భరోసా ఇచ్చారు. 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. – కంబాల జోగులు, ఎమ్మెల్యే, పాయకరావుపేట జగనన్న పవర్ చూపించాం సంగివలసలో మోగిన ఎన్నికల నగారాతో.. ప్రతిపక్ష పార్టీల ఓటమి ఖరారైపోయింది. రాబోయే ఎన్నికలకు ఉత్తరాంధ్ర నుంచి మేం సిద్ధమంటూ సభతో స్పష్టం చేశాం. జగనన్న పవర్ ఏంటో చూపించాం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహంతో దూసుకెళ్లేందుకు ఇదో గొప్ప సభ. పార్టీ శ్రేణుల్లోనే కాదు.. నాయకుల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల జోష్ నింపారు. ఇదే స్ఫూర్తితో ఈ 70 రోజులూ సైన్యంలా పనిచేస్తాం. – కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త, నెడ్ క్యాప్ చైర్మన్ భీమిలి సభ అద్భుతం ఇలాంటి సభ ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందో లేదో చెప్పలేం. ఇలాంటి సభ మళ్లీ నిర్వహించాలంటే అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన సభ ఇది. కేడర్‌కు మరింత ఉత్తేజాన్నిచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన దిశా నిర్దేశం నాయకుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపింది. వైఎస్సార్సీపీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారన్నదానిపై జగన్మోహన్రెడ్డి చెప్పిన విధానం కార్యకర్తలకు ఒక గైడ్ లాంటిది. దీన్ని అనుసరించి ప్రజల్లోకి మరింత వెళ్తాం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ ఎన్నికల జోష్ వచ్చేసింది సభ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఎన్నికల జోష్ వచ్చేసింది. సిద్ధం.. సిద్ధం.. అంటూ కార్యకర్తలంతా స్పందించారు. జగన్ చేసిన ప్రసంగం కేడర్ని ఆలోచింపజేసింది. ఆయన దిశానిర్దేశంతో ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు దోహదపడనుంది. రానున్న ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధిస్తాం.– రెడ్డి శాంతి, పాతపట్నం ఎమ్మెల్యే సంగివలస సభ సూపర్ సక్సెస్ సంగివలసలో సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు రవాణా ఏర్పాట్లు సరిపోక సభకు రాలేకపోయారు. కేవలం క్యాడర్ వస్తేనే ఇంత స్పందన ఉందంటే ఇక ప్రజలందరినీ తీసుకొస్తే ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారని చెప్పడానికి సంగివలస సమావేశం నిదర్శనం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే -
మూడొంతులకు పైగా కులగణన పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన ప్రక్రియ నాలుగింట మూడు వంతులకుపైగా పూర్తయింది. కులగణనను ఈ నెల 19 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా డేటా సేకరించింది. దీని ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కులగణన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి గత 8 రోజులుగా ప్రజల సామాజిక, ఆరి్థక స్థితిగతుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 1,33,65,550 కుటుంబాలకు సంబంధించిన 3.39 కోట్ల మంది వివరాలను నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 79.59 శాతం కుటుంబాల వివరాల నమోదు పూర్తవగా.. శనివారం 3.60 శాతం కుటుంబాల వివరాలను నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 86.71 శాతం కుటుంబాల వివరాల నమోదు పూర్తి కాగా, అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 71 శాతం పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. -
ఆలంబనగా.. ఆసరా
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహిళలు తాము పొందిన లబ్దికి కృతజ్ఞతగా అనేకచోట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. చంద్రబాబు మాటలతో తాము ఐదేళ్ల కిందట మోసపోయామని 2019 ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన మాట ప్రకారం నాలుగేళ్లుగా తమకు లబ్ది చేకూరుతోందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసరా సొమ్ముతో తమకాళ్లమీద తాము నిలబడేలా వ్యాపారాలు చేస్తున్నామని చెబుతున్నారు. – సాక్షి, నెట్వర్క్ దన్నుగా నిలిచిన ఆసరా సొమ్ము ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు భుక్యా శివమ్మ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం. ఐదేళ్ల క్రితం ఆమె భర్త కోటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యాడు. తీసుకున్న డ్వాక్రా రుణం అప్పు తీర్చలేక, కుటుంబ ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వైఎస్సార్ ఆసరా సొమ్ము రూ.12 వేలు జమయ్యాయి.వాటితో హైవే పక్కనున్న ఇంటి వద్ద హోటల్, టీ స్టాల్ పెట్టుకున్నారు. కుటుంబ ఖర్చులు, ఆమె భర్త వైద్య ఖర్చులు హోటల్ సంపాదనతోనే నెట్టుకొస్తున్నారు. ఆ తర్వాత ఆసరా సొమ్ము రూ.48 వేలు, జమయ్యాయి. అనంతరం వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.50 వేలు మంజూరయ్యాయి. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ ప«థకాలతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది. నాడు చేటు– నేడు ‘స్వీటు’ ఈమె పేరు పి.హైమావతి. అనంతపురం జిల్లా కణేకల్లు మండల కేంద్రం. శ్రీలక్ష్మి వెంకటేశ్వర డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతోంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో రూ.32,800 లబి్ధపొందింది. ఆ నిధులతో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి వద్దే తినుబండారాల తయారీ కేంద్రం (స్వీటు షాపు) ఏర్పాటు చేసుకుంది. ఇందులో ప్రతి పైసా వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లాంటి రుణాలు తీసుకుంది. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంది. ఇతరులకూ ఉపాధి కల్పిస్తోంది. పాడిగేదెలు కొన్నాం నాలుగు దఫాలుగా నా అకౌంట్లో పడిన ఆసరా డబ్బులతో మేము పాడి గేదెలు కొన్నాము. ప్రస్తుతం పాల వ్యాపారం చేస్తూ సంతోషంగా బతుకుతున్నాం. వైఎస్సార్ ఆసరా పథకంతో మా కుటుంబానికి ఎంతో ఆసరా వుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏనాడూ డ్వాక్రా మహిళల అభ్యున్నతి గురించి పట్టించుకోలేదు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత పొదుపు సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం ఆసరా నిధులు జమ చేస్తూనే ఉన్నారు. గతలో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితులు లేవు. – గర్నెపూడి ఇమాంజలీ, అంబేడ్కర్‌నగర్ కాలనీ, కారంచేడు, బాపట్ల జిల్లా ఆసరా సొమ్ముతో మేకలు కొన్నాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పొదుపు సంఘాలకు రుణమాఫీ 4 విడతలుగా అందించారు. నాకు 4 విడతలుగా మొత్తం రూ.44,800 నా వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు జమ అయింది. వ్యవసాయ పనులు చేసుకొని జీవనం సాగించే మా కుటుంబం జగనన్న సాయంతో మేకలు కొనుగోలు చేసి జీవిస్తున్నాము. వీటివల్ల ఆదాయం మెరుగైంది. మాట తç³్పకుండా మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేలా చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం. – చిట్టేటి పావని, తోటవీధి, ఆత్మకూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆసరా కొండంత అండ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇప్పటివరకు నాకు నాలుగు విడతలుగా ఆసరా మొత్తం జమ అయింది. సంవత్సరానికి రూ. 16 వేలు అందుతున్నాయి. డ్వాక్రా గ్రూపులో పది మంది మహిళలు ఉన్నారు. నేను కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. అన్ని విధాలుగా అండగా నిలిచిన జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. – పాలెం అరుణ, 48వ డివిజన్, కడప, వైఎస్సార్ జిల్లా -
ఉత్సాహంగా ఆసరా సంబరాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చెప్పినట్లుగానే 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళల పొదుపు సంఘాల్లో వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వం నేరుగా నిధులు జమచేసింది. మహిళల పేరిట బ్యాంకుల్లో అప్పు మొత్తం రూ. 25,570.80 కోట్లను ఆసరా పథకంలో భాగంగా నాలుగు విడతల్లో అందజేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఔదార్యానికి పొదుపు సంఘాల మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ నెల 23 నుంచి నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ కార్యక్రమం మొదలైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాటికి ఎస్ఎల్బీసీ గణాంకాల ప్రకారం 78,94,169 మంది మహిళల పేరిట రూ. 25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉన్నాయి. దీంతో వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వం 2020 సెపె్టంబరు 11న మొదట విడతగా రూ. 6,318.76 కోట్లు.. 2021 అక్టోబరు 7న రెండో విడతగా రూ.6,439.52 కోట్లు.. 2023 మార్చి 25న మూడో విడతగా రూ.6,417.69 కోట్లుచెల్లించింది. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది జనవరి 23 నుంచి నాలుగో విడత రూ. 6,394.83 కోట్లు మహిళల ఖాతాలో జమ చేస్తోంది. చంద్రబాబు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా మాఫీ చేయకుండా మోసం చేయడంతో మహిళలు డీలా పడిపోయారు. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మహిళలు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞలు చెబుతున్నారు. మండలాలు, మున్సిపల్ వార్డుల్లో సమావేశాలు పొదుపు సంఘాల మహిళలు సభలు నిర్వహించుకుని తమకు మంచి చేసే ఈ ప్రభుత్వానికే ఎప్పటికీ కృతజ్ఞలుగానే ఉంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఆసరా నాలుగో విడత పంపిణీని పండుగలా రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్దిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో 62 మండలాలు, 18 మున్సిపాలిటీల పరిధిలో ఆయా స్థానిక ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశాలు జరిగాయి. శనివారం 9 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో ఆయా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళా లబ్దిదారులతో కలిసి వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో డ్వాక్రా మహిళలకు రూ.14.57 కోట్ల విలువ చేసే ఆసరా నాలుగో విడత చెక్కు అందించడాన్ని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీ,నివాసరెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
చెట్టంత చేయూత
సాక్షి, అమలాపురం: వయసు మళ్లిన కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) పాత చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకునేందుకు ఆర్ అండ్ ఆర్ (రీ ప్లాంటింగ్ అండ్ రెజువెనేషన్) పథకంలో భాగంగా హెక్టారుకు రూ.53,500 చొప్పున అందించనుంది. ఈ సొమ్ముతో తోటల్లో దిగుబడి తక్కువగా వస్తున్న.. తెగుళ్లు అధికంగా సోకి దెబ్బతిన్న కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పాతుకునే వీలుంటుంది. కోనసీమలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇప్పుడున్న తోటల్లో మూడో వంతు తోటల వయసు 60 ఏళ్లకు పైబడింది. దేశవాళీ కొబ్బరి చెట్ల వయసు 60నుంచి వందేళ్లు ఉంటోంది. కానీ.. 60 ఏళ్లు దాటిన తరువాత వీటిలో దిగుబడి 40 శాతానికి పడిపోతోంది. అలాగే కొబ్బరి తోటలు సహజ సిద్ధమైన శక్తిని కోల్పోయి తెగుళ్లు, పురుగుల్ని తట్టుకోలేకపోతున్నాయి. వీటి స్థానంలో కొత్తవి వేసుకోవాల్సి ఉంది. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు, హైబ్రీడ్, పొట్టి రకాల చెట్లు వేసేందుకు ఇదే మంచి సమయం. దీనివల్ల దిగుబడి, కొబ్బరి కాయ సైజు పెరిగి ఉత్తరాది మార్కెట్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహం ఇలా.. కొత్త చెట్లను పాతుకునే విషయంలో కోనసీమ రైతులు పూర్తిగా వెనుకబడ్డారు. పాత చెట్లను యథాతథంగా ఉంచి.. పక్కనే కొత్త చెట్లు పాతుతుంటారు. ఇలా చేయడం వల్ల కొబ్బరి తోటలో చెట్ల సంఖ్య పెరిగి అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండటం లేదు. మరోవైపు దిగుబడి సైతం తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఆర్ అండ్ ఆర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద హెక్టారుకు 32 చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకోవాల్సి ఉంటుంది. చెట్టు తొలగింపు, ఆ ప్రాంతంలో మందులు వేసి భూమిని బాగు చేయడంతోపాటు కొత్త చెట్టు పాతుకోవాల్సి ఉంటుంది. హెక్టారుకు 32 చెట్లు తొలగింపునకు చెట్టుకు రూ.వెయ్యి చొప్పున రూ.32 వేలు, ఎరువులు, ఇతర వాటికి రూ.17,500 వినియోగిస్తారు. రూ.4 వేలను మొక్కలు నాటుకునేందుకు ఇస్తారు. చెట్టు పాతిన తరువాత రెండేళ్ల పాటు ఎరువులకు సైతం ఈ నిధులనే వినియోగించాల్సి ఉంటుంది. దిగుబడే కాదు.. కాయ సైజు తగ్గింది గతంలో ఎకరాకు సగటు దిగుబడి ప్రతి దింపులో 1,200 కాయలు వచ్చేవి. ఇప్పుడు 800 మించడం లేదు. ఏడాదికి ఆరు దింపులకు గాను సగటు 4,800 కాయలకు రూ.40,800 వరకూ వస్తుంటే.. దింపు కూలీకే రూ.9,600 వరకూ ఖర్చవుతోంది. తోటలకు పెట్టుబడులు సైతం పెరిగిపోయాయి. మరోవైపు పెద్ద వయసు చెట్లను తెగుళ్లు, పురుగులు ఆశించి నిలువునా గాయం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల కొబ్బరి దిగుబడితోపాటు కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. రైతులు కొత్త చెట్లను నాటాల్సిన అవసరం ఏర్పడింది. -
జన్మభూమి కమిటీపై అలుపెరగని పోరాటం
ద్వారకాతిరుమల: గత టీడీపీ జన్మభూమి కమిటీ నిర్వాకం కారణంగా వ్యవసాయ భూమిని కోల్పోయిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులూరివారిగూడెంకు చెందిన బంటుమిల్లి రామలక్ష్మి అలుపెరుగని న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. భూవివాద సమయంలో సంభవించిన తన భర్త మృతి ముమ్మాటికీ జన్మభూమి కమిటీ చేసిన హత్యేనని ఆమె జాతీయ ఎస్సీ కమిషన్ (న్యూఢిల్లీ)ను ఆశ్రయించారు. దాంతో సదరు కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ ఈనెల 18న ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. 1981లో పావులూరివారిగూడెంలో భూస్వామి దేవరపల్లి హనుమంతరావు వద్ద లాండ్ సీలింగ్‌లో అధికంగా ఉన్న 16.44 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఆ భూమిని నిరుపేదలైన 16 మందికి ఒక్కో ఎకరం చొప్పున, మరో వ్యక్తికి 44 సెంట్లు ఇచ్చారు. అందులో బంటుమిల్లి సుబ్బారావు ఎకరం భూమిని పొందారు. అయితే హనుమంతరావు తన వద్ద ప్రభుత్వం అధిక భూమిని సేకరించిందని హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు 2012లో 7.80 ఎకరాల భూమిని తిరిగి హనుమంతరావుకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా భూమిని కోల్పోయే లబ్ధిదారులకు మరోచోట భూమిని కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో హనుమంతరావుకు రెవెన్యూ అధికారులు భూమిని తిరిగి వెనక్కిచ్చారు గానీ, బాధితులకు ఏవిధమైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించలేదు. అడ్డగోలుగా జన్మభూమి కమిటీ నిర్ణయం ఇదిలా ఉంటే 2015 నవంబర్ 27న టీడీపీ జన్మభూమి కమిటీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పటికే సాగులో ఉన్న సుబ్బారావు ఎకరం భూమిలో అరెకరం నంబూరి సోమరాజు కుటుంబ సభ్యులకు కేటాయించారు. దాంతో అప్పటి నుంచి గ్రామంలో భూ వివాదాలు, కొట్లాటలు మొదలయ్యాయి. సుబ్బారావుకు హైకోర్టులో సైతం అనుకూలంగా తీర్పు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2021 ఫిబ్రవరి 17న వివాదాస్పద భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కొందరు సుబ్బారావుపై దాడి చేశారు. అదేరోజు అతడు మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య రామలక్ష్మి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు సుబ్బారావు మృతికి సంబంధించి పోలీసుల విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రామలక్ష్మి 2021 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. 2021 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో విచారణ చేపట్టింది. పోలీస్, రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022 డిసెంబర్ 22న భూమిని కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను కమిషన్ ఆదేశించింది. సుబ్బారావు మృతిపై పునఃవిచారణ చేపట్టాలని కూడా డీఎస్పీ పైడేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బాధితులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయించారు. కాగా పోలీసులు సమర్పించిన నివేదికపై సంతృప్తి చెందని కమిషన్ సుబ్బారావు మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ సంచలన తీర్పు ఈనెల 18న కమిషన్ చేపట్టిన విచారణకు డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఏలూరు ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, భీమడోలు సీఐ భీమేశ్వర రవికుమార్, ద్వారకాతిరుమల తహసీలా్దర్ పి.సతీష్, ఎస్సై టి.సుధీర్‌లు హాజరై, తమ నివేదికను సమర్పించారు. దీనిపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన కమిషన్ కేసు దర్యాప్తును సీబీ సీఐడీకి అప్పగిస్తూ సంచలన ఆదేశాలను జారీ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుని, నివేదికను సమర్పించాలని కమిషన్ మెంబర్ సుభాష్ రాంనాథ్ పార్ధీ ఆదేశించారు. న్యాయం జరుగుతుంది: జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రామలక్ష్మి తెలిపారు. నా భర్త సుబ్బారావు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అప్పటి గ్రామ రెవెన్యూ అధికారి వీర్రాజుకు తగిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తానన్నారు.