AP Special
-
ఏపీ సర్కార్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం పర్యటించారు. ఓల్డ్ జీజీహెచ్‌లో రూ.25 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌కి, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి కేందమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘ప్రజల ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోదీ హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాం. గత తొమ్మిదేళ్లలో 350 కి పైగా కొత్త మెడికల్ కళాశాలలనుప్రదాని మోదీ నిర్మించారు. గ్రామీణ స్ధాయిలో హెల్త్ వెల్ నెస్ సెంటర్లని జిల్లా ఆసుపత్రులు, ఎయిమ్స్ లాంటి సంస్ధలతో అనుసంధానం చేశాం. గ్రామీణ ప్రాంతవాసులకు స్పెషలిస్ట్ సేవలు టెలీ కన్సల్టేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ప్రతీ రోజూ 4 లక్షల వరకు టెలీ కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం’’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
ఏపీలో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య: సీఎం జగన్
Updates: పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు: సీఎం జగన్ ►మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం ►ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయబోతున్నాం. ►ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం ►8 లక్షల 9 వేల 39 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను నేరుగా జమ చేయనున్నాం ►ఫైనలియర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్ స్టాల్ మెంట్‌గా చెల్లించాల్సిన ఫీజు కూడా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. ►ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది రూ.11,900 కోట్లు ►ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం ఇచ్చింది మరో రూ.4,275 కోట్లు ►పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు ►ఈరోజు వీళ్ల బతుకులు మారాలి. కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి ►2017-18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్‌లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం ►గత ప్రభుత్వ హయాంలో 12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నా ►చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్తి ►మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది ►దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం ►గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా ►నాడు-నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించాలి ►తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు, సీబీఎస్ ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం ►పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చిన పరిస్థితులు, సబ్జెక్ట్ టీచర్ ను తీసుకొచ్చిన పరిస్థితి. ►పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది ►బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం ►ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్‌లో మార్పులు చేశాం ►పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతోంది ►ఆన్ లైన్ వర్టికల్స్ ను కూడా డిగ్రీలో తీసుకురావడం జరిగింది ►10 నెలలపాటు ఇంటర్న్ షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి ►జాబ్ ఓరియెంటెడ్‌గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ►మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడి చదవాలనే తపనతో, అంతర్జాతీయంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్, లాంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యి, ఆన్ లైన్ లో కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ►మన పేద విద్యార్థి, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు. ►ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్ సబ్జెక్టులో ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం. ►ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీ నుంచి రాగలిగతితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు. ►జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి కోటి దాకా ఉన్నాయి. ►అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు ►ఈ పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, కోటీ 25 లక్షల దాకా మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం ►జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు ►వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్షిప్ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు ►ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో అక్షరాలా ఖర్చు చేసింది 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా ►ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నా జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల ►జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ►ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. ►పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ►గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ►కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ►అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో 7 రోజుగా కొనసాగనుంది. నిన్న వైకుంఠ ద్వార దర్శనంలో 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు.18,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.55 కోట్లు ఆదాయం వచ్చింది. ఆరు రోజుల్లో 3,95,983 మంది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆరు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 వరకు పది రోజులపాటు కొనసాగనున్నాయి. -
Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు అమ్మ.. ఆవు అనే పదాల దగ్గరే ఆగిపోవాలి గాని.. ఇంగ్లిష్ నేర్చుకోవడమేంటి? ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు చిరిగిన సంచీలో నాలుగు పుస్తకాలు పట్టుకుపోవాలే తప్ప.. కార్పొరేట్ పిల్లల్లా టై కట్టుకుని, బూట్లు వేసుకుని బడికి వెళ్లడమేంటి? మాలాంటి పెద్దల ఇంట్లో పిల్లలు వాడే ట్యాబ్‌లు.. డిజిటల్ విద్యను వారికి ఇవ్వడమేంటి? డబ్బున్న బాబులు మాత్రమే కొనుక్కునే ఐబీ కరిక్యులమ్ చదువులను ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నేర్పించడమేంటి? నిరుపేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు అండగా నిలుస్తూ.. ప్రభుత్వం వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం నేరమే అంటోంది ఎల్లో మీడియా. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్కరణలపై అవగాహనా రాహిత్యంతో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒకే తరహా సిలబస్ అమల్లో ఉన్నా.. పాఠశాలల్లో ఏ సిలబస్ అమల్లో ఉందో.. ఏ పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నారో తెలుసుకోకుండా విషపు కథలు అల్లుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా సిలబస్ అమల్లో ఉంది. ఎన్సీఈఆర్టీ టెక్ట్స్‌బుక్స్ మాత్రమే చదువుతున్నారు. ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసే పాఠశాలల్లో కూడా ఇవే టెక్ట్స్‌బుక్స్ ఉంటాయి. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐబీల్లో బోధన, పరీక్ష విధానాలు మాత్రమే మారుతాయి. ఎన్సీఈఆర్టీ బుక్స్‌ను మారిస్తే దేశంతో పాటు రాష్ట్రంలోనూ మారతాయిగాని, బోర్డు అనుబంధాన్ని బట్టి పుస్తకాలు మారవు. వర్తమాన కార్యాచరణపై దృష్టి ఆంధ్రప్రదేశ్‌లోని పాఠ్య పుస్తకాలు వర్తమాన కార్యాచరణ ఆధారిత పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించి రూపొందించారు. కొత్త పాఠ్య పుస్తకాల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను పొందడం, పునాది అక్షరాస్యతను ప్రోత్సహించడం, పదజాలం, ద్విభాషా నిర్మాణం, క్యూఆర్ కోడ్స్‌తో శక్తివంతం చేయడం, గణితం, పర్యావరణ శాస్త్రంలో ప్రపంచ ప్రమాణాలను అందించడం వంటి విభిన్న దృక్కోణాలను ప్రోత్సహించేలా తయారు చేశారు. కాబట్టి పాఠ్యపుస్తకాలు మారతాయి అనేది అపోహ మాత్రమే. మెరుగైన బోధన, అత్యున్నత మూల్యాంకనం అంశాల్లో మాత్రమే మార్పు ఉంటుంది. విద్యార్థికి ప్రపంచ పోకడలపై అవగాహన రాష్ట్రంలో ప్రతి బిడ్డను ప్రపంచంతో పోటీపడేలా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాంతో వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు బోధనలో మార్పు తెచ్చింది. విద్యార్థి కేంద్రీకృత బోధనాభ్యసనం ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన, విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించింది. డిజిటల్ మాధ్యమం ద్వారా బోధన అమలుచేస్తూ ఆశించిన ఫలితాలను సాధించింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంచేందుకు ‘ఇఫ్లూ’ వంటి ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ఎస్సీఈఆర్టీ కృషి చేస్తోంది. ప్రపంచంలో 11 వేల వర్సిటీలుఆమోదించిన టోఫెల్ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా సామర్థ్యాలను కొలిచేందుకు నిర్వహించే ఓ ప్రామాణిక పరీక్ష. ప్రపంచంలో దాదాపు 90 దేశాల్లోని 11 వేల కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ పరీక్షను ఆమోదించాయి. ప్రపంచంలో ఎక్కడైనా రాణించాలంటే ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించాలనే సదుద్దేశంతో 1947లో టోఫెల్ మొదలు పెట్టారు. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద లాభాపేక్షలేని విద్యా పరీక్ష అంచనా సంస్థ అయిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం మన విద్యార్థుల్లో ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల బలాలు, సవాళ్లను సూచిస్తూ.. వారు ఏ దశలో ఉన్నారో తెలుసుకోవచ్చు. టోఫెల్ జూనియర్ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసి, భవిష్యత్‌లో వారు టోఫెల్ పరీక్షను సునాయాసంగా ఎదుర్కొనేలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ఈటీఎస్ సహకారంతో ఎస్సీఈఆర్టీ ప్రతినెలా టోఫెల్ లెర్నింగ్ మెటీరియల్ విడుదల చేస్తోంది. లిక్విడ్ అనే సంస్థ ఉచితంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది. విద్యార్థులు 9వ తరగతిలో టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరవుతారు. దానికోసం మూడో తరగతి నుంచే విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వంపై ఆర్థిక భారం లేదు. టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. పిల్లలకు సమాజాన్ని అర్థం చేసుకునే విద్య ప్రభుత్వం రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలలను సీబీఎస్ఈకి అనుసంధానించింది. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయులను నియమించింది. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రపంచ సంక్లిష్టతను అర్థం చేసుకునేందుకు వీలు కల్పించే విద్యనందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) కరిక్యులంపై దృష్టి సారించింది. విద్యార్థులలో ప్రస్తుతమున్న కంఠస్థం, ధారణ, పరీక్ష సమయంలో పునశ్చరణ వంటి వాటికి భిన్నంగా ప్రాబ్లెమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జి ఫర్ లైఫ్ స్కిల్స్, ఫ్యూచర్ స్కిల్స్ వంటివి అందిస్తోంది. దీంతోపాటు సంగీతం, కళ, వ్యాపార పరిపాలన మొదలైన వాటికి సమాన ప్రాధాన్యతనిస్తూ, చక్కటి పాఠ్యాంశాలను అందించే ఐబీ బోర్డు పాఠ్యాంశాలను మన విద్యా విధానంతో అనుసంధానించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. దీనికోసం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి.. 2025 నాటికి ఐబీ కరిక్యులంను మన పాఠ్యప్రణాళికలో భాగం చేసేందుకు అడుగులు వేస్తోంది. విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబులను అందించింది. ఈ సంవత్సరం ట్యాబ్‌లలో సమస్యలను పరిష్కరించే డౌట్ క్లియరెన్స్ యాప్, విదేశీ భాషలు నేర్చుకునేందుకు డ్యుయోలింగో యాప్‌ను ఇన్స్టాల్ చేసింది. వీటిపై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతి డైట్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరమ్మతులు వస్తే సచివాలయాల్లో వాటిని బాగుచేసి ఇస్తోంది. అంతేకాక తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌ను అమర్చి డిజిటల్ కంటెంట్‌ను అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిలో సిలబస్‌లో భాగం కానున్న ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్టులు బోధించేందుకు పలు సంస్థల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేసింది. -
శాంతిభద్రతలు భేష్
పోలీసు యంత్రాంగం అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో విజయవంతమవుతోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా దిశ వ్యవస్థతో మహిళల భద్రతను పటిష్టపరచడం దేశానికే ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్, దిశ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థతో మహిళల భద్రతకు పూర్తి భరోసా కల్పి స్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి వినూత్న విధానాలతో నేరాల కట్టడి విజబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగం, వినూత్న విధానాలతో నేరాల కట్టడి సాధ్యమైంది. 2022 కంటే 2023లో రాష్ట్రంలో నేరాలు 8.13శాతం తగ్గాయి. 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా 2023లో 1,61,334 కేసులకు తగ్గాయి. హత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, మహిళలపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. హత్యలు, హత్యాయత్నం కేసులు 10శాతం, దోపిడీలు 28.57శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగతనాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయి. పోలీసు బీట్లు పునర్వ్యవస్థీకరించడం, నిరంతర పర్యవేక్షణ, అనుమానితుల వేలిముద్రల సేకరణ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వంటి విధానాలను పటిష్టంగా అమలు చేశాం. మహిళా భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి సత్ఫలితాలను సాధించాం. అసాంఘిక శక్తులపై నిఘా, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, మహిళా పోలీసుల సమర్థ వినియోగం, పీడీ యాక్ట్ ప్రయోగం, కన్విక్షన్ బేస్డ్ విధానాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగాం. పోలీసు శాఖకు చెందిన 4,92,142 కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించాం. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలోని 4వేల మంది రౌడీల్లో వెయ్యి మంది జైళ్లలో ఉన్నారు. ఈ ఏడాది 900 మంది రౌడీలకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించగలిగాం. మరో 200 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. మహిళలకు పటిష్ట భద్రత 2023లో రాష్ట్రంలో మహిళలపై నేరాలతోపాటు అన్ని రకాల నేరాలను గణనీయంగా తగ్గించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన పాత్ర పోషించింది. క్షేత్రస్థాయి వరకు పోలీసింగ్ వ్యవస్థను విస్తృత పరచడం, సమర్థ పర్యవేక్షణ, సున్నిత ప్రాంతాల జియో మ్యాపింగ్ వంటి విధానాలతో మహిళలకు పటిష్ట భద్రత. 2022లో కంటే 2023లో మహిళలపై అత్యాచార కేసులు 28.57శాతం, వరకట్న కేసులు 11.76శాతం, మహిళలపై ఇతర నేరాలు 14శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. సమర్థ పోలీసింగ్ విధానాలతో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు భారీగా తగ్గాయి. డ్రగ్స్, గంజాయి కట్టడి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. నాటుసారాపై ఉక్కుపాదం మోపాం. మూడేళ్లలో 5 లక్షల కేజీల గంజాయిని జప్తు చేశాం. గిరిజనులకు 2.52 లక్షల ఎకరాల్లో ప్రత్యమ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. విలేకరుల సమావేశంలో అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబ్రత బాగ్చి, డీఐజీ రాజశేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు. -
నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధింపును తప్పుబట్టడంతోపాటు కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. లోకేష్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో బెదిరించడం కలకలం రేపింది. గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతోపాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కు వాయిదా వేసింది. ఇవాళ రావాలని సీఐడీ అధికారులకు చెప్పిన లోకేశ్ వ్యక్తిగత సిబ్బంది ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన మేరకు లోకేశ్‌కు నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. ఆ సమయంలో లోకేశ్ నివాసంలో ఉన్నప్పటికీ బయటకు రాలేదు. అధికారులు చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేకపోయింది. నోటీసులు అందించేందుకు శుక్రవారం ఉదయం రావాలని లోకేశ్ వ్యక్తిగత సిబ్బంది చెప్పారు. దీంతో లోకేష్‌కు నేడు నోటీసులు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా.. యథేచ్ఛగా బరితెగించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన చంద్రబాబు ముఠా ఇప్పుడు మీ అంతు చూస్తామంటూ ఏకంగా ఉన్నతాధికారులకే తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. మా అవినీతినే బయటపెడతారా అంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అక్రమాలు, అవినీతితో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ముఠా కేసుల నుంచి తప్పించుకునేందుకు మరిన్ని వక్రమార్గాలు వెతుకుతోంది. ప్రధానంగా 950 ఎకరాల అసైన్డ్ భూముల బాగోతం ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో పచ్చ ముఠా ఠారెత్తిపోతోంది. ఈ కేసులో న్యాయస్థానాల్లో సమర్పించిన అధికారుల వాంగ్మూలాలను కూడా గుప్పిట పట్టి మరీ సాక్షులను బెదిరిస్తుండటం విస్మయపరుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకం అని తాము అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ అవినీతి దందాకు పాల్పడ్డారని.. అసైన్డ్ భూముల కేసులో కీలక అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు అంతా తానై అసైన్డ్ భూముల దందాకు ఎలా పాల్పడిందో సవివరంగా వెల్లడించారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండటంతో చంద్రబాబు ముఠా బెంబేలెత్తుతోంది. దీంతో ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ కుట్రలకు తెరతీశారు. సర్వం చేసింది చంద్రబాబే.. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు, నారాయణ అమరావతిలో 950 ఎకరాల అసైన్డ్ భూములను తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని అప్పటి సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్ దండే, సీఆర్yీ ఏ కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. ఆ మేరకు చట్ట నిబంధనలను ప్రస్తావిస్తూ నోట్ ఫైళ్లలో పేర్కొన్నారు. కానీ అసైన్డ్ భూములను ఎలాగైనా తమ హస్తగతం చేసుకోవాలని భావించిన అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను తమ సన్నిహితులు, బినామీలకు బదలాయించారు. ఎస్సీ, ఎస్టీ రైతులను భయపెట్టి.. అసైన్డ్ భూములపై కన్నేసిన చంద్రబాబు ముఠా కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని రంగంలోకి దించింది. సీఆర్డీఏ అధికారులను గ్రామాల్లోకి పంపించి అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రాజధాని కోసం తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ రైతులను బెదరగొట్టారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి ద్వారా తమ ఏజెంట్లను గ్రామాల్లోకి పంపారు. ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి కారుచౌకగా భూములను నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూముల కుంభకోణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులకు విస్మయకర వాస్తవాలు తెలిశాయి. తాము అభ్యంతరం తెలిపినప్పటికీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని ఉన్నతాధికారులు అజయ్ జైన్, కాంతిలాల్ దండే, చెరుకూరి శ్రీధర్ సీఐడీకి తెలిపారు. అంతేకాకుండా ఆ మేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కేసు విచారణలో వారి వాంగ్మూలాలు అత్యంత కీలకంగా మారాయి. అప్రూవర్‌గా మారతానన్న బ్రహ్మానందరెడ్డి మరోవైపు చంద్రబాబు ఒత్తిడితోనే ఎస్సీ, ఎస్టీ రైతులను మోసగించి అసైన్డ్ భూములు కొల్లగొట్టామని బ్రహ్మానందరెడ్డి కూడా అంగీకరించారు. ఆ మేరకు తాను అప్రూవర్‌గా మారి కేసు దర్యాప్తునకు సహకరించేందుకు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన వాంగ్మూలం కూడా అసైన్డ్ భూముల కేసు దర్యాప్తులో ప్రధాన పాత్ర పోషించనుంది. కేసును నీరుగార్చేందుకు రంగంలోకి బాబు ముఠా తమ భూబాగోతం బట్టబయలు అవుతుండటంతో చంద్రబాబు ముఠా బెంబేలెత్తింది. దీంతో కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు రంగంలోకి దిగింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఉన్నతాధికారులు అజయ్ జైన్, కాంతిలాల్ దండే, చెరుకూరి శ్రీధర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానందరెడ్డిలను లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగానే చంద్రబాబుపై కేసులో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని.. వారిని వదిలేది లేదని మీడియా ముఖంగా నారా లోకేశ్ హెచ్చరించడం గమనార్హం. అధికారుల పేర్లను రెడ్ డైరీలో రాశానని.. అధికారంలోకి వచ్చాక ఎవరినీ విడిచిపెట్టేది లేదని.. అంతు చూస్తానని బెదిరించడం లోకేశ్ బరితెగింపునకు నిదర్శనం. మరోవైపు ఏసీబీ న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను కూడా టీడీపీ పెద్దలు తీసుకోవడంతో ఈ వ్యవహారం సున్నితంగా మారింది. ఏకంగా అజయ్ జైన్, కాంతిలాల్ దండే, చెరుకూరి శ్రీధర్ వంటి ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ బెదిరింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఐఏఎస్ అధికారులనే టీడీపీ పెద్దలు బెదిరిస్తుంటే.. ఇక తమ పరిస్థితి ఏమిటని ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ రైతులు బెంబేలెత్తుతున్నారు. అలాగే అప్రూవర్‌గా మారతానని పిటిషన్ దాఖలు చేసిన బ్రహ్మానందరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తుండటంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. అధికారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చంద్రబాబు ముఠా బెదిరింపుల నేపథ్యంలో సీనియర్ అధికారి చెరుకూరి శ్రీధర్ విజ్ఞప్తిపై ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది. అజయ్ జైన్, కాంతిలాల్ దండేల పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి భద్రత పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరోవైపు ఈ వ్యవహారంపై సీఐడీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఉన్నతాధికారులు 164 సీఆర్పీసీ కింద ఇచ్చిన వాంగ్మూలాల కాపీలు బయటకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
Fact Check: తొందరపడి తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.27 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 18.84 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి వరకూ వరినాట్లు వేస్తారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే జనవరి 15 వరకు వేసుకోవచ్చన్నది ఆచార్య ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తల సూచన. సాధారణంగా ఖరీఫ్ వరికోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో జొన్న, నువ్వులు, కొర్ర పంటలను జనవరి నెలవరకు వేసుకోవచ్చు. ప్రాంతాల వారీగా చూస్తే కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో అపరాలు, మొక్కజొన్న, జొన్న, రాగి పంటలను డిసెంబర్ చివరి వరకూ వేయడం ఆనవాయితీ. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మినుములు, మేత మొక్కజొన్న, మేత జొన్న, మేత అలసంద డిసెంబర్ చివరి వరకూ విత్తుతారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా శనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న డిసెంబర్ చివరి వరకూ సాగు చేస్తారు. తిరుపతి జిల్లాలో మొక్క జొన్నకు ప్రత్యామ్నాయంగా సజ్జ, రాగి, కొర్ర పంటలను జనవరి 2వ వారం వరకు వేస్తారు. నెల్లూరు జిల్లాలో నువ్వులకు ప్రత్యామ్నాయంగా పెసర పంటను జనవరి 3వ వారం వరకు వేస్తారు. ఈ లెక్కన వచ్చే మూడు వారాల్లో వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, అపరాలు, సజ్జ పంటల విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంతలోనే రబీ విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు తగ్గిందంటూ ఓ కథనాన్ని ఈనాడు వండి వార్చింది. అడ్డగోలు రాతలు... అబద్ధాలు వండివార్చడం... ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పూనుకోవడం... ఇవి ఈనాడుకు అలవాటుగా మారింది. ఎంత చేస్తున్నా... ఏమీ చేయలేదన్నట్టు తప్పుడు కథనాలు అల్లడం రామోజీకి నిత్యకృత్య మైపోయింది. ఇప్పుడు తాజాగా రబీపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ మరో కట్టుకథ అచ్చేశారు. రబీ సీజన్ గడువు ఇంకా ముగిసి పోలేదు... ఇప్పటివరకూ పండిన పంటలపై ఇంకా లెక్క తేలలేదు. అయినా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందంటూ అడ్డగోలు రాతలు. రబీ సాగుపై ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదంటూ దొంగ ఏడుపులు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల రాయితీ విత్తనంపై సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందంటూ విషపు రాతలు. ‘రబీలోనూ సర్కార్ మొద్దు నిద్రే’ అంటూ వండివార్చిన ఈ అడ్డగోలు కథనంపై వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. నష్టపరిహారం పంపిణీకి చర్యలు ♦ ఖరీఫ్ పంట కాలంలో కరువు పరిస్థితులు, మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న çపంటలకు నష్టపరిహారం అందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ♦నష్టపోయిన రైతులకు మెరుగైన సాయం అందించాలన్న సంకల్పంతో నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీ కంటే మెరుగైన రీతిలో ఇచ్చేలా మార్పులు చేసింది. ♦ పంట నష్టం ప్రాధమిక అంచనా వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ల డంతో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక కూడా సమర్పించాయి. ♦ ఖరీఫ్ సీజన్లో ప్రకటించిన కరువు మండలాల పరిధిలో పంట దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు, కరువు, తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ♦ తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యం రంగు మారినా, పాడైనా, తేమ శాతంలో నిబంధనలను సడలించి మరీ కొనుగోలుచేసింది. ఇలా డిసెంబర్ 1 నుంచి 14 వరకు తుఫాన్ తర్వాత నిబంధనలు సడలించి 12.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ♦ వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా రైతులను గందరగోళ పర్చేలా బురద రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఎప్పటికప్పుడు సాగుపై సమీక్షలు ♦ఈ సీజన్లో సాగు పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి నవంబర్ 3న, 23న వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ♦ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన కార్యదర్శి నవంబర్ 8న, ముఖ్యకార్యదర్శి నవంబర్ 9, 25, డిసెంబర్ 15న, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవంబర్ 3, 17, 20, 29, డిసెంబర్ 18న సమీక్షించారు. ♦ శాస్త్రజ్ఞులు సిఫార్సు చేసిన ప్రత్యామ్నాయాలను రైతులు పాటించేందుకు వీలుగా నవంబర్ 10 నుంచి 28 వరకు జాయింట్ ఇరిగేషన్ – వ్యవసాయ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించారు. ♦ దెబ్బతిన్న నారు మళ్ళు, లేత దశలో వున్న రబీ పంటలకు తిరిగి విత్తుకునేందుకు 80 శాతం రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల (86వేల క్వింటాళ్లు) సరఫరాకు ఏర్పాటు చేశారు. ♦ ఇప్పటి వరకు 24 జిల్లాల్లోని అర్హులైన రైతులకు 31వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుములు, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.16.63 కోట్ల రాయితీ రూపంలో ప్రభుత్వం అందించింది. ♦ కానీ ఇవేవీ పట్టించుకోకుండా అసలు ప్రభుత్వం సమీక్షలే నిర్వక్షించలేదంటూ తప్పుడు ఆరోపణలు ఈనాడు చేసింది. ఖరీఫ్‌కు అనుకూలించని వర్షాలు ♦ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు తీవ్ర జాప్యం ఏర్పడింది. సెప్టెంబర్ చివరి వరకు పంటలు వేసుకోవడం వల్ల, పంట కోతలు ఇç³్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల రబీ పంటల సాగులోనూ ఆలస్యం అయింది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలకు 61.70 లక్షల ఎకరాల్లోనే వేశారు. అంటే 23. 24లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కానీ ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదంటూ ఈనాడు ఆరోపించింది. ♦ ఖరీఫ్ సాగు చేయ లేని చోట ప్రత్యామ్నాయంగా వరి, మొక్క జొన్నతో పాటు చిరుధాన్యాలు, అపరాలు సాగు చేసేందుకు ముందుకొచ్చిన 1.16 లక్షల మంది రైతులకు 80 శాతం సబ్సిడీపై 30,977 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.26.46 కోట్లు వెచ్చించారు. మరో వైపు రబీ ముందస్తు ప్రణాళికలో భాగంగా 2.70 లక్షల క్వింటాళ్ల శనగ, వేరుశనగ,వరి, మినుములు, పెసర పంటల విత్తనాలను సరఫరా చేశారు. -
శరవేగంగా బందరు పోర్టు పనులు
చిలకలపూడి(మచిలీపట్నం) : బందరు పోర్టు నిర్మాణ పనులు నిరంతరాయంగా శరవేగంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండల పరిధిలో జరుగుతున్న పోర్టు పనులను గురువారం ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొందరు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ దేవుడు సీఎం జగన్ రూపంలో పంపి పోర్టు నిర్మాణ పనులు జరిగేలా చేస్తున్నారని చెప్పారు. ఏడు నెలలుగా నిరంతరాయంగా పనులు జరుగుతున్నాయని, పోర్టుకు వచ్చేందుకు పక్కా రహదారి నిర్మాణం జరుగుతోందని ఇందుకోసం 90 శాతం భూమిని కూడా సేకరించినట్టు చెప్పారు. మిగిలిన భూమి మరో నెల రోజుల్లో సేకరించనున్నట్టు తెలిపారు. మెఘా ఇంజనీరింగ్ సంస్థ 25 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగుతోందన్నారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు పూర్తి చేసి జనవరి నుంచి డ్రెడ్జింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పోర్టు నిర్మాణాన్ని ఆరు నెలలు ముందుగానే పూర్తి చేసేలా మొక్కవోని దీక్షతో పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. నిర్మాణం ఆగకుండా, బిల్లులు పెండింగ్ లేకుండా సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ఉన్నారని వివరించారు. గతంలో పచ్చ పార్టీ పోర్టు పనుల ప్రారంభ నాటకం గతంలో చంద్రబాబు ప్రజలను మోసగించేలా పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఎమ్మెల్యే నాని గుర్తుచేశారు. నిర్లజ్జగా బరితెగించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏమీ చేయకుండా చివరిలో రైతు భూమిలో శంకుస్థాపన చేసి రూ.8.5 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. 22 గ్రామాల్లో 33 వేల ఎకరాలు బలవంతపు భూసేకరణ చేసేందుకు ప్రయత్నించారని, అనుమతులు, నిధుల్లేకుండా శంకుస్థాపన రాళ్లు వేసి ప్రజలను మోసగించారని గుర్తుచేశారు. మూలపేట పోర్టుతో శ్రీకాకుళం జిల్లాకు మహర్దశ టెక్కలి: రాష్ట్రంలోని తీరప్రాంతంలో రూ.16వేల కోట్లతో మూడు పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్టు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం మూలపేట తీరంలో నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులను గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం తీర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం ఉన్న 5 పోర్టులతో పాటు అదనంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తయితే సుమారు 75 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 320 మిలియన్ టన్నుల మేరకు ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే ఏప్రిల్ నాటికి మూలపేట పోర్టు నుంచి షిప్ ట్రయల్ రన్ చేయనున్నట్టు చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 2025 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు తిరిగేలా చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో మూలపేట ప్రాంతం విశాఖతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయన్నారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. 14 ఏళ్ల టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. -
విద్యుత్ రంగ అభివృద్ధికి రూ.13వేల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పరిధిలో దాదాపు రూ.13 వేల కోట్లను ‘ఆర్డీఎస్ఎస్’ ద్వారా వెచ్చిస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. విద్యుత్ సంస్థ (ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీసీఎల్, డిస్కం)ల డైరీల ఆవిష్కరణ, ‘ఏపీసీపీడీసీఎల్’ 4వ వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో కొత్తగా దాదాపు 484 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని, 10 శాతానికి తీసుకుచ్చామని వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణపట్నం 800 మెగావాట్ల యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్టీటీటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 99.7 శాతం ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యతతో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీఎస్పీడీడీఎల్ సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఇన్చార్జ్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ మాజీ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్ బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
మా జీవితాలు మారిపోయాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా జీవితాలు మారిపోయాయి మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న పేరు పల్లా రాము. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం గొల్లలపాలెం గ్రామంలో ఒకరికి ఎకరం, మరొకరికి అర ఎకరం పంట భూమి ఉంది. మేము కలిసే వ్యవసాయం చేసుకుంటాం. గతంలో పెట్టుబడి కోసం అప్పులు చేసి వడ్డీతో సహా తిరిగి కట్టేందుకు కూలి పనులకు వెళ్లేవాళ్లం. అయినప్పటికీ అప్పులు తీరక చాలా ఇబ్బందులు పడేవాళ్లం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడంతో మా జీవితాలు మారిపోయాయి. జలకళ పథకంలో భాగంగా సుమారు రూ.2 లక్షలు ఖర్చయ్యే బోరు బావిని ఉచితంగా తవ్వంచి మోటారు కూడా పెట్టించారు. నాలుగేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఇద్దరికీ విడివిడిగా రూ.13,500 వంతున అందిస్తున్నారు. దీంతో అప్పులు చేసే బాధ తప్పింది. బోరు వేశాక ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నాం. అర ఎకరంలో కాయగూరలు, ఆకుకూరలు పండించి తగరపువలస ప్రైవేట్ మార్కెట్లో విక్రయిస్తాం. టీడీపీ హయాంలో రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. దీనివల్ల ప్రైవేట్ వ్యాపారుల వద్ద నకిలీ విత్తనాలు, పురుగుల మందులు కొనుక్కుని మోసపోయేవాళ్లం. రైతుల నుంచి అప్పుడు పంటలు కొనుగోలు చేసేవారు కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు అందుబాటులో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయకుల ద్వారా మట్టి, విత్తనాల పరిశీలన, నియోజకవర్గానికో ప్రయోగశాల, పంట కొనుగోలు, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి సౌకర్యాలు కలి్పంచారు. వ్యవసాయాన్ని పండగలా మార్చారు. నా భార్య డ్వాక్రా గ్రూపులో ఉంది. ఆమె మూడేళ్లుగా సున్నా వడ్డీ పథకం కింద లబ్ధి పొందుతోంది. మా అన్న రాముకు పిల్లలు లేరు. నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి వివాహం చేశాము. రెండో అమ్మాయి ఇంటర్ వరకు చదివింది. బాబు 5వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి వస్తోంది. – పల్లా సన్యాసిరావు, గొల్లలపాలెం, భీమిలి మండలం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి తగరపువలస, విశాఖపట్నం జిల్లా) నీడనిచ్చిన మేలు మరువలేను నాకు భర్త లేడు. కొడుకును కూడా దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఆ కేసులో కోడలికి కోర్టు శిక్ష విధించడంతో ఆమె మాకు దూరమైంది. నెలల వయసులో ఉన్న నా మనవడు ఉపేంద్రను తీసుకుని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర పాలవలస గ్రామంలో అద్దె ఇంట్లో ఉండేదాన్ని. వ్యవసాయ కూలి పనులు చేసుకుని అతి కష్టమ్మీద బతుకీడ్చాను. నా కష్టం పగవారికి కూడా రాకూడదని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చింది. నా కొడుకే సీఎం రూపంలో వచ్చినట్టయింది. నేను ఇది కావాలి అని ఎవరినీ అడగలేదు. నవరత్నాల్లో భాగంగా ఇంటి పట్టా ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేశారు. దాంతో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాం. నాకు నీడనిచ్చి నిలబెట్టిన వారి మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ప్రతి నెలా ఒకటో తేదీనే మా వలంటీర్ పింఛన్ సొమ్ము పట్టుకుని మా ఇంటికి వచ్చి ఎంతో ఆప్యాయంగా చేతికి అందిస్తోంది. మనవడు ఆరో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు కూడా నా ఖాతాలో జమవుతున్నాయి. ఇప్పుడు ఇంటి అద్దె బెడద లేదు. పింఛన్ డబ్బులు, నెలనెలా వచ్చే రేషన్‌తో నా జీవనానికి ఇబ్బంది లేదు. అమ్మ ఒడి డబ్బులతో మనవడిని చదివిస్తున్నాను. వాడిని పెద్ద చదువులు చదివించగలనన్న నమ్మకం కలిగింది. – శిష్టు జయలక్ష్మి, బెలమరపాలవలస, పోలాకి మండలం (చింతు షణ్ముఖరావు, విలేకరి, పోలాకి) పండుటాకును కాపాడారు నాకు ఇద్దరు కుమార్తెలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన నేను కూలి పనులు చేసుకుని జీవించే దాన్ని. నా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లమానాన వాళ్లు బతుకుతున్నారు. ఇప్పుడు నా వయసు 80 ఏళ్లు. ఈ వయసులో ప్రభుత్వం అందించే పెన్షనే పెద్ద ఆధారం. ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛన్ రూ.2,750కు పెంచారు. వచ్చే నెల నుంచి మూడు వేలు ఇస్తారని వలంటీర్ చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెన్షన్ డబ్బులు కనీసం మందుల ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు. అదీ ఎప్పుడిస్తారో కూడా తెలిసేది కాదు. దానికోసం రోజూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాకుండా ఒకటో తేదీ ఉదయానికల్లా ఇంటికే వలంటీర్ తెచ్చి డబ్బులు ఇస్తున్నారు. ఎవరి మీదా ఆధార పడకుండా నా నెలవారీ ఖర్చులకు, మందుల ఖర్చులకు జగనన్న ఇచ్చిన పింఛన్ సొమ్ము సరిపోతోంది. నా మనుమరాళ్లకు కూడా అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. – ప్రగడ రత్నం, వృద్ధురాలు, ఏలేశ్వరం (కోరాడ శ్రీనివాసరావు, విలేకరి, ఏలేశ్వరం) -
ఉరకలేస్తున్న క్రీడోత్సాహం
సాక్షి నెట్వర్క్/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. 26 వేల మ్యాచ్‌లకు గాను 82 శాతం షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి. గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకాపల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు, వీక్షకులకు అవసరమైన వసతులను కల్పించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్రత్యేకంగా కామెంట్రీ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు. విక్రమార్కులై చెలరేగారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి. సివంగులై తలపడుతున్న యువతులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతులు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్‌లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివాలయాల స్థాయిలో 956 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్‌లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యువతులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. విజయం కోసం హోరాహోరీ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి. గురువారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్‌లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్‌లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి. -
కంకిపాడు జన కెరటం
కంకిపాడు: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార నినాదం గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో మార్మోగింది. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు అక్కచెల్లెమ్మలు, యువత, అవ్వాతాతలు జేజేలు పలికారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. బాబు, పవన్‌ను తరిమికొట్టండి దొంగలకు, చంద్రబాబు, పవన్‌లకు తేడా లేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. వీరిద్దరూ పిక్‌పాకెటర్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి జేబు దొంగలను ప్రజలు మూకుమ్మడిగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అసమానతలు జగనన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలెత్తుకు బతుకుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం లేకపోగా, అన్నీ అసమానతలు, అవమానాలు, వెలివేతలే మిగిలాయన్నారు. టీడీపీలో ముస్లింలకు స్థానమేది? ముస్లిం వర్గాలకు టీడీపీలో స్థానం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. వారికి కనీస గుర్తింపు కూడా మృగ్యమేనన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ముస్లింకు అయినా మంత్రి పదవి ఇచ్చారా.. అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పాలన అంతా చంద్రబాబు దోపిడీని సాగిస్తే.. జగనన్న సామాజిక న్యాయంతో అణగారిన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతున్నారని ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతి.. సామాజిక న్యాయంతో అణగారిన వర్గాలకు జగన్ రాజ్యాధికారం చేరువ చేశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం పాటుపడిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా.. అని సవాల్ విసిరారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని, సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులే కాదని, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యమే అని చాటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, సామినేని ఉదయభాను, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ, నియోజకవర్గ పరిశీలకులు బొప్పన భవకుమార్, మంగళగిరి పార్టీ ఇన్చార్జి గంజి చిరంజీవి, కమ్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్లు తుమ్మల చంద్రశేఖర్, అడపా శేషు, తదితరులు పాల్గొన్నారు. -
ధూళ్లిపాళ్ల నరేంద్రకు ఎమ్మెల్యే వెంకట రోశయ్య సవాల్
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ధూళ్ళిపాళ్ల నరేంద్ర దొంగలా తయారయ్యారని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు 45 ఎకరాల జడ్పీ భూముల్లో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారని విమర్శించారు. ఎలక్షన్లు వచ్చాయని ఉనికి కాపాడుకోవడానికి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నరేంద్రకు లేదని అన్నారు. అభివృద్ధి పైన చర్చకు రావాలని ధూళ్లిపాళ్ల నరేంద్రకు వెంకట రోశయ్య సవాల్ విసిరారు. 'వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ పాల్పడి ధూళ్లిపాళ్ల నరేంద్ర వేల కోట్లు దోచేశారు. గత ప్రభుత్వంలో పొన్నూరు, పెదకూరపాడు, మంగళగిరి నియోజకవర్గాల్లో గ్రావెల్, ఇసుకను ధూళ్ళిపాళ్ల నరేంద్ర, ఆయన తమ్ముడు సురేంద్ర అక్రమ మైనింగ్ చేశారు. రైతులకు రావాల్సిన బోనస్ ను కొట్టేశారు. చంద్రబాబు నాయుడు సహకార రంగాన్ని నాశనం చేస్తే ధూళ్ళిపాళ్ల నరేంద్ర రైతుల ఆస్తి సంఘం డైరీని దోచేశారు. ప్రభుత్వం గురించి గానీ జగన్మోహన్ రెడ్డి గురించి గానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా వారు చేయలేని పనులన్నీ ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ నాయకత్వంలో చేశాం.' అని వెంకట రోశయ్య అన్నారు. ఇదీ చదవండి: ‘బాబు-పవన్‌ల కుతంత్రాలు.. సీఎం జగన్‌కు తిరుగేలేదు’ -
'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్‌రా.. చెయ్!'
తాడిపత్రి అర్బన్, సాక్షి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. 'రేయ్.. అరెస్టు చెయ్.. నీయమ్మా.. ఖాకీ డ్రెస్సులేసుకుని సిగ్గులేదు.. రేయ్ నేను రెడీగున్నా.. అరెస్ట్ చెయ్.. చెయ్ రా చెయ్' అంటూ పోలీసులను దుర్భాషలాడారు. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించారు. రెండు రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ సుందరీకరణ పేరుతో సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు డెకరేషన్ బల్బులను ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ కమిషనర్ జి.రవిని అనుమతి కోరారు. తర్వాత మునిసిపల్ సిబ్బందితో కలసి దగ్గరుండి డెకరేషన్ లైట్లు వేయించడానికి బయలుదేరారు. అయితే స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలను పనిగట్టుకుని తొలగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్.. తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించాడు. ట్రైనీ డీఎస్సీ హేమంత్ కుమార్, ఎస్ఐలు రామకృష్ణ, గౌస్మహ్మద్లు అక్కడికి చేరుకుని మునిసిపల్ కమిషనర్‌తో మాట్లాడి జెండాలను తొలగింపజేస్తామంటూ హామీ ఇవ్వడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో వెంకటేష్‌ను టీడీపీ కౌన్సిలర్లు కలసి సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలు తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడమే కాకుండా.. అక్కడే బైఠాయించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని, అనవసరంగా రాద్దాంతం చేయకుండా మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్జీవో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకొచ్చారు. వచ్చీ రాగానే గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఎస్పీ ధరణీబాబు, రామకృష్ణ, గురుప్రసాద్‌రెడ్డి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. పోలీసులు సంయమనం పాటిస్తూ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు జీపును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమవగా నడిరోడ్డుపై పడుకుండిపోయాడు. పోలీసులు అతన్ని జీవులోకి ఎక్కించుకుని స్థానిక పుట్లూరు రోడ్డులో వదిలేయడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. జేసీపై కేసు నమోదు పోలీసులతో అనుచిత ప్రవర్తకు గానూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం.. విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడంపై జేసీతో పాటు ఆయన ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేశారు. -
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు 65,361 దర్శించుకున్నారు.20,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.91 కోట్లు ఆదాయం వచ్చింది. జనవరి 1 తేది వరకు వైకుంఠ ద్వార దర్శనం నేడు టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల పంపిణీ వివిధ దశల్లో చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మొదటి దఫా డిసెంబరు 28న 3,518 మందికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. రెండో దఫా జనవరి మొదటి వారంలో 1500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ చేపడతాం. మూడో దఫాలో ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి కొరకు కలెక్టరును కోరడం జరిగింది. దీని వలన 5 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. వీరికి కూడా ఫిబ్రవరిలో ఇళ్లస్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీంతో విశ్రాంత ఉద్యోగులకు, ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు అందించినట్టు అవుతుంది. ఈ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుండి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది ►2019లో మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశాం ►ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం ►గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు ►ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం ►మన రాకముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు ►ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని.. ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం ►ఒకటో తారీఖు అది ఆదివారమైనా, పండుగైనా సరే .. పొద్దునే వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం ►ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం: ►ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది ►రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►మూడో కార్యక్రమం వైఎస్సార్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ►నాలుగోది వైయస్సార్ చేయూత కార్యక్రమం.. ఇది ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది ►ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుంది ►అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో .. మరలా రీవెరిఫికేషన్ చేసి, వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది: ►ఈ కార్యక్రమం జరిగే లోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు ►66,34,742మందికి సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి ►మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది ►క్రెడిబులిటీకి అర్ధం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తోంది ►ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి ►పెన్షన్ల పెంపు కార్యక్రమం జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతుంది ►ఇందులో భాగంగా నేను కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ►అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ►ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ►ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ►8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుంది ►ఏయే మండలాల్లో ఏయే రోజుల్లో జరుగుతుందన్న దానిపై షెడ్యూలు చేసుకోవాలి పెన్షన్‌తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి ►ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఉత్సాహవంతులు, లైక్ మైండ్స్.. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి ►ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలి ►రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు ►వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నాం ►వాళ్ల కోసం పట్టించుకునే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలాంటి ఏర్పాటు గతంలో ఎప్పుడూ లేదు ►దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు ఎక్కడా ఇవ్వలేదు ►మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది ►ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో అందరికీ తెలిసిందే ►ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి ►ఈ పెన్షన్ కార్యక్రమం కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►కాని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలబడేందుకు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాం వైఎస్సార్ ఆసరా... ►2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి ►ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా సంఘాల్లో చేరిన పరిస్థితి ►18శాతం పైచిలుకు అక్కౌంట్లు అన్నీ కూడా అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి ►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం: ►మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం ►క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం ►అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి చేరాయి: ►అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉండి నడిపించిన ప్రభుత్వం మనది ►ఒక్క ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం ►మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం ►నాలుగో విడతగా.... చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు ఇస్తున్నాం ►జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ►ఇది కూడా జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది ►ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు ►మహిళల్లో సుస్థర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం ►ఇందులో భాగంగానే అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్ చేయించాం ►బ్యాంకులతో టై అప్ చేయించాం ►స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం: ►ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల్లో మహిళలు, మహిళా సంఘాల్లో అవగాహన కల్పించాలి ►ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం : ►మహిళా సంఘాలు తీర్మానాలు చేసుకుంటే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది: వీడియోల రూపంలో విజయ గాథలు ►పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి ►ఇలా పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తాం ►ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి: ►ఏ రకంగా ఈ పథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఈ పథకాల ద్వారా మహిళల్లో వచ్చిన మార్పులను ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఉత్తమమైన వాటికి సచివాలయాల స్ధాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతిగా ఇస్తాం ►ఫిబ్రవరి 15–16 ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తాం ►వాటితోపాటు లబ్ధిదారులపై రూపొందించివాటిలో ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ►ఆసరా కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి ►ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి వైఎస్సార్ చేయూత కార్యక్రమం... ►ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుంది ►గతంలో ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ►ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ►45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం ►26 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం ►ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు ►ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి ►చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందారు ►అదే విధంగా మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, వారికున్న అవకాశాలనుకూడా వివరించాలి ►ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి ►అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి జనవరి 19 – అంబేద్కర్ విగ్రహం ప్రారంభం. ►జనవరి 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం ►19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం ►సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి ►ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టి, అవగాహన కలిగించాలి ►ప్రతి సచివాలయం నుంచి 5 మందిని 19న జరిగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి ►ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో వాళ్లూ భాగస్వామ్యులయ్యేటట్టు చేయాలి ►గ్రామ స్థాయిలో మనం గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం ►గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం ►ఇదొక గొప్ప మార్పు ►దీనికి మద్ధతు తెలిపే కార్యక్రమాలు జరగాలి ►ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుంది -
AP: రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్..
ఏదైనా వాహనం నడపాలంటే ఆ యజమానికి తగిన శిక్షణ అవసరం. కనీస శిక్షణ, నిర్వహణపై అవగాహన లేకుండా వాహనం కొన్నా, మూలన పెట్టడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ఈనాడు రామోజీరావు కథనాలు అచ్చేసి ప్రజల మీదకు వదిలేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా డ్రోన్స్ ఎగురుతోందెక్కడ? అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ఓ కథనాన్ని ప్రచురించారు. సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్ లేకుండా డ్రోన్ యూనిట్లు ఏర్పాటు చేయడం కుదరదన్న విషయం అందరికీ తెలిసిందే.ఇందుకోసం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ డ్రోన్స్ కోసం ఎంపిక చేసిన రైతులకు, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోంది. మరో వైపు అధిక సామర్థ్యంతో కూడిన డ్రోన్స్ రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తొలుత పైలెట్ శిక్షణ పూర్తి చేయడం, తర్వాత డ్రోన్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు, మరీ ముఖ్యంగా ఎక్కువ సామర్థ్యం కలిగిన డ్రోన్స్‌ను రైతులకు అందించాలన్న సంకల్పంతో పటిష్ట ప్రణాళిక అమలుచేస్తోంది. రాష్ట్రంలో రైతు బాగుపడితే చూడలేని చంద్రబాబు, రామోజీ బ్యాచ్‌కి ప్రభుత్వ చర్యలు కంటగింపుగానే ఉంటాయి. అందుకే రామోజీ కుటిల రాతలు. అసలు ఈ కథనంలో వాస్తవం ఎంత.. ఈ నాలుగున్నరేళ్లలో ఈ ప్రభుత్వం యాంత్రీకరణకు ఏ స్థాయిలో పెద్ద పీట వేసిందో ఒక్కసారి పరిశీలిద్దాం.. సీఎం జగన్ పాలనలో ఎంపిక, కొనుగోలు, నిర్వహణ అంతా పారదర్శకమే ఆధునిక యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు సన్న, చిన్నకారు రైతుల ముంగిట తీసుకు రావడం ద్వారా సాగు వ్యయం తగ్గించి వారికి నికర ఆదాయం పెంచాలన్న సంకల్పంతో సీఎం జగన్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు సంఘటితంగా ఏర్పాటు చేసుకున్న గ్రూపులకే యంత్ర పరికరాలను అందించింది. ఇందులో దళారులెవరూ ఉండరు. 2021–22లో శ్రీకారం చుట్టిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా విత్తు నుంచి కోత వరకు గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు ఉపయోగపడేలా అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీకే, క్లస్టర్ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సంఘాల (సీహెచ్‌సీ)కు 40 శాతం సబ్సిడీతో ఈ యంత్రాలని సమకూర్చింది. ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షల విలువైనవి, క్లస్టర్ స్థాయిలో రూ.25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన పరికరాలను ఇచ్చింది. వీటి వ్యయంలో 40 శాతం సబ్సిడీ ఇవ్వగా, 10 శాతం సంబంధిత రైతు సంఘాలు సమకూర్చుకుంటే మిగిలిన 50 శాతం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పించింది. ఇప్పటివరకు రూ.1052.42 కోట్ల అంచనాతో 10,444 ఆర్బీకే, 492 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 6,362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్ హార్వెస్టర్లతో పాటు 31,356 ఇతర యంత్రాలను సమకూర్చింది. సబ్సిడీ మొత్తం రూ.366.25 కోట్లను నేరుగా సీహెచ్‌సీ రైతు సంఘాల ఖాతాల్లో జమ చేసింది. వీటి ఎంపిక, కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను రైతు సంఘాలకే అప్పగించింది. ఇందులో ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండదు. అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా పైసా అవినీతి ఉండదు. పైగా, మార్కెట్ అద్దె కంటే తక్కువ అద్దెకు వారి ప్రాంతంలో డిమాండ్ ఉన్న పరికరాలను సంఘాలే ఎంపిక చేసుకొంటాయి. అంతేకాదు.. నచ్చిన కంపెనీల నుంచి, నచ్చిన పరికరాలను కొనుక్కొనే స్వేచ్ఛనిచ్చింది. దీంతో రైతులు వారికి అవసరమైన యంత్రాలను నాణ్యత, మన్నికను పరిశీలించి మరీ కొనుక్కున్నారు. ప్రైవేటుగా యంత్ర పరికరాలకు వసూలు చేస్తున్న అద్దె కంటే తక్కువ అద్దెకు రైతులకు అందుబాటులో ఉంచారు. గ్రామంలోనే కాదు మండల స్థాయిలో ఎక్కడి నుంచైనా రైతుకు అవసరమైన యంత్రాలను బుక్ చేసుకున్న 15 రోజుల్లో పొందేందుకు వీలుగా వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ని తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా రైతు సంఘాల రుణాల చెల్లింపులను కూడా పర్యవేక్షిస్తున్నారు. 2021 జనవరి నుండి ఇప్పటి వరకు 26 జిల్లాల్లో 5.15 లక్షల మంది రైతులు ఈ కేంద్రాల ద్వారా యంత్ర సేవలు పొందారు. వీరు 14.68 లక్షల ఎకరాల్లో యంత్రాలను వినియోగించారు. అద్దె రూపంలో సీహెచ్‌సీలు ఇప్పటి వరకు రూ.87.64 కోట్లు ఆర్జించాయంటే ఏ స్థాయిలో పారదర్శకంగా ఈ కార్యక్రమం అమలవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్తశుద్ధితో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటుకు కసరత్తు రైతుల పెట్టుబడులను మరింతగా తగ్గించడమే లక్ష్యంగా ఆర్చీకే స్థాయిలో వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి విడతగా 2023–24లో 2వేల గ్రామాల్లో 40 శాతం రాయితీతో డ్రోన్లు ఏర్పాటు చేస్తోంది. వాణిజ్య పంటలు, ఒకే పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మండలాలను జిల్లాకు 3 చొప్పున ఎంపిక చేసింది. ఈ మండలాల్లో కనీసం 3 గ్రామాల్లో డ్రోన్స్‌తో కూడిన యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఐదారుగురు రైతులతో సంఘాలు (సీహెచ్‌సీ) కూడా ఏర్పాటు చేసింది. తొలుత ఈ సంఘాల్లోని ఎంపిక చేసిన రైతులను డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. వీరితోపాటు గ్రామ స్థాయిలో డ్రోన్ పైలెట్‌గా ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి 369 మంది రైతులకు, 160 మంది యువతకు మొత్తం 529 మందికి శిక్షణ ఇచ్చారు. మరోపక్క డ్రోన్ల ఎంపికకు కసరత్తు చేపట్టారు. పౌర విమానయాన శాఖ ధ్రువీకరణ పొందిన వివిధ కంపెనీల డ్రోన్ల పనితీరును వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పరీక్షించి రైతులకు ఉపయోగపడే వాటి ఎంపిక జరుగుతోంది. అధిక సామర్థ్యం కల్గిన డ్రోన్ల కోసమే.. కనీసం 10 లీటర్ల ట్యాంక్‌తో కూడిన డ్రోన్లు 10 నుంచి 22 నిముషాలు మాత్రమే ఎగురగలవని గుర్తించారు. వీటి కంటే మెరుగైన డ్రోన్స్‌ను రైతులకు అందించే సంకల్పంతో ఎక్కువ సమయం ఎగిరే డ్రోన్లను గుర్తించి అదే యూనిట్ ధరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా రైతులకు పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా సేవలందించే డ్రోన్లను తయారు చేసేందుకు వ్యవసాయ వర్శిటీకి చెందిన అప్సరా డ్రోన్ టెక్నాలజీ సెంటర్ ద్వారా పైలెట్ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా డ్రోన్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, వాస్తవాలను తెలుసుకోకుండా పనిగట్టుకొని రైతులను రెచ్చగొట్టేలా కుట్రపూరిత కథనాలు అచ్చేయడం ఈనాడుకే చెల్లింది. బాబు హయాంలో రైతు రథాల పేరిట అంతా దోపిడీయే చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు రథాల పేరిట వ్యవసాయ యాంత్రీకరణ ఓ ఫార్సుగా నడిచింది. ఈ పథకం కొంతమందికే పరిమితమయ్యేది. అందులోనూ అనేక అవకతవకలు, అవినీతే. 2014–2019 మధ్య కేవలం 3,584 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటిలో రైతులు తక్కువ, దళారులెక్కువ. వీటి ద్వారా రూ.239.16 కోట్ల సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేశారు. రుణ సహాయానికి రైతే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఏ కంపెనీ యంత్రం లేదా పరికరం ఏ డీలర్ వద్ద ఎంత రేటుకు కొనాలో కూడా టీడీపీ నేతలే నిర్ణయించేవారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా డీలర్లకే జమ చేసేవారు. టీడీపీ నేతలు, డీలర్లు కుమ్మక్కై మార్కెట్ రేటు కంటే 30 శాతం ఎక్కువకు అమ్మి, ఆ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. రైతు రథాల పేరిట రూ.100 కోట్లకుపైగా సబ్సిడీ సొమ్మును టీడీపీ నేతలు స్వాహా చేశారు. పైగా, రైతులకు నాసిరకం యంత్రాలు ఇచ్చారు. అవి నాలుగు రోజులకే మరమ్మతులకు గురైతే, రైతులే బాగు చేయించుకోవాల్సి వచ్చేది. -
1,555 కి.మీ. జలమార్గాల్లో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నట్టు ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ చెప్పారు. త్వరలోనే జలరవాణా, కార్గో రవాణాలో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) తీసుకొస్తామన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా బుధవారం విజయవాడలో వివిధ స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా రంగంలో జలరవాణా గ్రోత్ ఇంజన్‌గా మారుతోందన్నారు. కాలుష్యంతోపాటు ప్రతి కిలోమీటరుకు టన్ను సరుకు రవాణాలో రైలు కంటే 18 శాతం, రోడ్డు మార్గం కంటే 54 శాతం ఖర్చు తగ్గుందని చెప్పారు. ఈ క్రమంలోనే లాభదాయక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నదీమార్గాల సామర్థ్యాల పెంపుపై సాంకేతిక పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరితో పాటు సుమారు 57 చిన్న, పెద్ద నదులున్నాయన్నారు. వీటిద్వారా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖలోని కోస్టల్ షిప్పింగ్‌ను ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిల్లో దాదాపు 1,555 కిలోమీటర్ల పొడవైన 11 నదులు/కాలువలు సరకు రవాణాకు అనువైన జలమార్గాలుగా మారతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత జలరవాణాలో ఏటా 8 మిలియన్ టన్నుల సరుకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సీఈవో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీకి నేషనల్ వాటర్‌వేస్ (ఎన్‌డబ్ల్యూ)4 నంబరును కేటాయించగా.. దాదాపు 90 శాతం జలమార్గం ఏపీలోనే ఉందని చెప్పారు. కృష్ణానదిలో (వజీరాబాద్–విజయవాడ) 157 కిలోమీటర్లు, గోదావరిలో (భద్రాచలం–రాజమహేంద్రవరం) 171 కిలోమీటర్లు, కాకినాడ కెనాల్ (కాకినాడ పోర్టు– ధవళేశ్వరం) 50 కి.మీ., ఏలూరు కెనాల్ (రాజమహేంద్రవరం–విజయవాడ) 139 కి.మీ., కొమ్మమూరు కెనాల్ (విజయవాడ–పెదగంజాం) 113 కి.మీ., నార్త్ బకింగ్హమ్ కెనాల్ (పెదగంజాం–తడ) 258 కి.మీ. మేర ఏపీ జలమార్గం విస్తరించిందని వివరించారు. వీటితో పాటు ఎన్‌డబ్ల్యూ 79 కింద పెన్నానది (పోతిరెడ్డిపాలెం–కుడితిపాలెం/బంగాళాఖాతం) 32 కిలోమీటర్లు, ఎన్‌డబ్ల్యూ 104 కింద తుంగభద్ర నది (కిండి సింగవరం–జోహ్రాపురం) 58 కి.మీ. ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏడాదికి ఎనిమిది మిలియన్ టన్నుల అంతర్గత జలరవాణా జరుగుతోందన్నారు. సిమెంట్ పరిశ్రమల క్లస్టర్లలో భాగంగా ముక్త్యాల నుంచి మచిలీపట్టణం, కాకినాడ పోర్టుకు సరుకు రవాణా చేసేలా అనుసంధానం చేస్తున్నామన్నారు. కడప ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, పవర్ ప్లాంట్లకు పెన్నానది ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు జలమార్గం కలిసొస్తుందన్నారు. గండికోటలో క్రూజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కృష్ణానది తీరంలోని 8 ప్రముఖ ఆలయాల సందర్శనకు టెంపుల్ టూరిజం ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. తొలుత రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చ్యువల్‌గా మాట్లాడారు. సమావేశంలో జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, హెరిటేజ్ క్రూజ్ కోల్కత్తా ప్రతినిధి రాజ్‌సింగ్, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
కూత కుదిరింది.. ఆట అదిరింది
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో క్రీడా రంగానికి మహర్దశ వచ్చింది. గ్రామీణ, పట్టణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు.. మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ఐదు క్రీడాంశాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తోంది. యువత ఆరోగ్యాన్ని పెంపొందించే.. క్రీడా స్ఫూర్తి నింపే లక్ష్యంతో వాలీబాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్టుగా తలపడ్డారు. ఆయా క్రీడాంశాల్లో వేలాది జట్లు దుమ్ములేపాయి. యువతులు సైతం పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. షెడ్యూల్ ప్రకారం 26 జిల్లాల్లోని 8,549 గ్రామ, వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహించారు. దాదాపు 18 జిల్లాల్లో 50 శాతం నుంచి 73.85 శాతం సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 9,774 పోటీలను నిర్దేశిస్తే 8,594 పోటీలను దిగ్విజయంగా పూర్తి చేశారు. కొన్నిచోట్ల సమయాభావంతో పోటీలు మరుసటి రోజు షెడ్యూల్లోకి మార్చారు. అత్యధికంగా విశాఖపట్నంలో 95.37 శాతం, పశ్చిమ గోదావరిలో 94.95 శాతం, తూర్పు గోదావరిలో 92.93 శాతం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 90 శాతానికిపైగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరిపించారు. క్రీడాకారులు చెలరేగి ఆడుతుంటే.. రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకులు క్రీడాకారులను ప్రోత్సహించడం విశేషం. తొలిరోజు కంటే అత్యధికంగా 7.02 లక్షల మంది వీక్షకుల సంఖ్య నమోదయ్యింది. ఇందులో 4.80 లక్షల మంది పురుషులు, 2.20 లక్షల మంది మహిళలు పోటీలను నేరుగా తిలకించారు. మొత్తంగా 31,169 మ్యాచ్‌లలో 70 శాతం మ్యాచ్‌లు అనుకున్న సమయానికి పూర్తి చేశారు. ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా రెండో రోజూ ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్రా టోర్నీలు కొనసాగాయి. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ యువకులతో కబడ్డీ ఆడి అలరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బుధవారం వివిధ టోర్నమెంట్లు హోరాహోరీగా సాగాయి. సచివాలయ స్థాయిలో ఐదు క్రీడాంశాల్లో జరుగుతున్న పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు జిల్లాల్లోని 976 సచివాలయాల పరిధిలోని 485 మైదానాల్లో ఆటల పోటీలు సాగాయి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని సింహాచలం సచివాలయాల పరిధిలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో కబడ్డీ, క్రికెట్, ఖోఖో పోటీలు జరగ్గా.. చినవాల్తేరు జిమ్నాజియం గ్రౌండ్లో షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గాజువాక నియోజకవర్గ పరిధిలోని భెల్ (హెచ్‌పీవీపీ) క్రీడా మైదానంలో 8 జట్ల మధ్య సచివాలయ స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురంలో క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీల్లో యువ జట్లు ఉత్సాహంగా తమ ప్రతిభ చాటాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 515 సచివాలయాల్లో ఆడుదాం ఆంధ్రా రెండో రోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మామిడికుదురు మండలం మొగిలికుదురులో పోటీలను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లాలోని 511 సచివాలయాల పరిధిలో క్రీడాకారులు ఉల్లాసంగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని 400 మైదానాల్లో జరిగిన పోటీల్లో క్రీడాకారులు చురుగ్గా పాల్గొన్నారు. రాయలసీమలో రసవత్తరంగా.. రాయలసీమలో ఆడుదాం ఆంధ్రా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. చిత్తూరులో పోటీలను కలెక్టర్ షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పీవీకేఎన్ మైదానంలో పోటీలను జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 507 సచివాలయాల పరిధిలో 492 క్రీడా మైదానాల్లో పోటీలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల్లో 2,602 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉండగా.. 2,365 మ్యాచ్‌లు జరిగాయి. తిరుపతి జిల్లా పరిధిలో రెండో రోజు 1,552 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 1,151 మ్యాచ్‌లు జరిగాయి. పోటీలను తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా పరిధిలోని 672 సచివాలయాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. కోడుమూరు మండలం పెంచికలపాడులో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఒక్క కర్నూలు నగరంలోనే 30 క్రీడా మైదానాల్లో క్రికెట్, కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. కడప డీఎస్ఏ క్రీడా మైదానంలో పోటీలను డీఎస్డీవో కె.జగన్నాథరెడ్డి ప్రారంభించారు. సత్తా చాటుతున్న సెంట్రల్ ఆంధ్రా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు కోలాహలంగా సాగుగుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు, పెనుమంట్ర మండలాల్లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పోటీలను ప్రారంభించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఏలూరు జిల్లాలో 1,250 మ్యాచ్‌లు, పశ్చిమగోదావరి జిల్లాలోని 537 సచివాలయ పరిధిలో 880 మ్యాచ్‌లు నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయవాడ కృష్ణలంకలోని ఏపీ ఎస్ఆర్ఎంసీ హైస్కూల్ మైదానంలో రెండో రోజు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 1.20 లక్షల మంది భాగస్వాములవుతున్నారని కలెక్టర్ తెలిపారు. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలకు విశేష స్పందన లభిస్తోంది. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహించారు. గురజాలలోని జయంతి పాఠశాలలో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. కనిగిరి జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. తర్లుపాడు మండలంలో పోటీలను ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడారు. ఈనాడు కథనం పచ్చి అబద్ధం పీసీ పల్లి: ప్రకాశం జిల్లా పీసీ పల్లి పంచాయతీలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు స్థానిక మహిళలు లేక రుణాలు తీసుకునేందుకు బ్యాంక్‌కు వచ్చిన అయ్యవారిపల్లికి చెందిన పొదుపు మహిళలతో టెన్నికాయిట్ ఆడించారంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని వెంకటేశ్వర డ్వాక్రా గ్రూప్ మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈనాడులో ప్రచురించిన కథనమంతా అబద్ధమని మహిళలు తెలిపారు. పీసీపల్లి మండలం మురుగమ్మి పంచాయతీకి చెందిన వెంకటేశ్వర డ్వాక్రా గ్రూపునకు తామంతా రుణాల కోసం కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ చిలకమ్మ కలిసి మంగళవారం పీసీ పల్లిలోని బ్యాంక్‌కు వెళ్లామన్నారు. బ్యాంక్‌లో రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో సమీపంలోని పాఠశాలకు వెళ్లి ‘ఆడుదాం ఆంధ్రా’ తిలకించామన్నారు. అక్కడ పోటీల్లో పీసీ పల్లికి చెందిన తమ స్నేహితులు ఆటలాడుతుండటంతో విరామ సమయంలో వారితో ముచ్చటిస్తూ వారి చేతిలో ఉన్న ఆట వస్తువులను తీసుకుని సరదాగా వారితో కలసి ఆడామని చెప్పారు. అనంతరం బ్యాంకుకు వెళుతుంటే ఈనాడు విలేకరి వచ్చి మీది ఏ గ్రామం, ఏ పనిమీద వచ్చారని అడిగి ఫొటోలు తీసుకువెళ్లినట్టు చెప్పారు. గ్రూప్ లీడర్ సులోచన మాట్లాడుతూ.. రుణాల కోసం పీసీ పల్లి బ్యాంక్‌కు వెళ్లామని.. రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో స్కూల్లో జరిగే ఆటల పోటీలకు చూడటానికి వెళ్లామని చెప్పారు. తాము పోటీల్లో పాల్గొనలేదని.. కావాలనే పార్టీల మీద అక్కసుతో తమ ఫొటోలు తీసి తప్పుడు కథనం ప్రచురించారని తెలిపారు. -
వలంటీర్ల ఆగ్రహ జ్వాలల్లో పచ్చపత్రికల దహనం
నందవరం/హుకుంపేట/పెదకూరపాడు/కోళ్లపా లెం/కపిలేశ్వరపురం: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సేవాభావంతో నిరంతరం పనిచేస్తున్న వలంటీర్లు.. తమపై వస్తున్న తప్పుడు కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సమ్మె చేస్తామన్నామని, ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనడంలేదని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ప్రతుల్ని పలుచోట్ల దహనం చేశారు. పలు ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో నిరసన తెలిపారు. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5 చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు సమ్మె, నిరసనలు చేసే ఆలోచనలే లేవని ముక్తకంఠంతో నినదించారు. అసత్యవార్తలతో దెబ్బతీయలేరు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఇంటింటికి చేరవేస్తున్న తమపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ కర్నూలు జిల్లాలో వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండటంతో ఈ విధమైన అక్కసు వెళ్లగక్కుతున్నాయని చెప్పారు. తమకు ఎలాంటి సమ్మె, నిరసనలు చేసే ఉద్దేశం లేదని, అసత్యవార్తలతో వలంటీర్ల ఐక్యతను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. నందవరం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రామోజీ, రాధాకృష్ణ డౌన్‌డౌన్ అంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను దహనం చేశారు. నాగలదిన్నెలో గ్రామ సచివాలయం–1, 2 పరిధిలోను, సోమలగూడూరులోను వలంటీర్లు పచ్చపత్రికలను తగులబెట్టారు. ఇదంతా పచ్చమీడియా కుట్ర జీతాలు పెంచాలని వలంటీర్లు సమ్మె చేస్తున్నట్లు ఈనాడు పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని, ఇదంతా పచ్చమీడియా కుట్ర అని వలంటీర్ల అసోసియేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు, హుకుంపేట మండల శాఖ అధ్యక్షుడు మీసాల రవితేజ చెప్పారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన పత్రికలకు వ్యతిరేకంగా బుధవారం హుకుంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వలంటీర్ల అసొసియేషన్ సభ్యులు, పలువురు వలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న మేలును చూసి తట్టుకోలేకనే పచ్చమీడియా అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గుర్తింపు పొందిందన్నారు. గౌరవంతోపాటు ఉపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తే తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. వలంటీర్ల అసోసియేషన్ సభ్యులు ముసిరి భవానీశంకర్, గబ్బడ శ్రీను, అప్పలరాజు, శాంతికుమారి, భాగ్యశ్రీ పాల్గొన్నారు. వినూత్న నిరసన సమాజసేవే పరమావధిగా.. స్వచ్ఛందంగా సేవలందిస్తున్న తమపై ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాస్తోందని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పచాయతీ పరిధిలోని కోళ్లపాలేనికి చెందిన వలంటీర్లు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈనాడు మీడియా, టీవీ 5 ఎలక్ట్రానిక్ మీడియా తమను రెచ్చగొట్టే విధంగా తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సమ్మెలోకి వెళ్లడం లేదని, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొంటున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన హామీ మేరకు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు జెరూష, నాగవేణి, స్వప్న, రాణి, అలివేణి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు నీలా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలెవరూ నమ్మవద్దు వలంటీర్ వ్యవస్థ రూపశిల్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నట్టు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని వలంటీర్లు కోరారు. జీతాలను పెంచాలంటూ వలంటీర్లు ఆగ్రహంతో ఉన్నారని, రహదారులపై ఆందోళనలతో రగిలిపోతున్నారని సోషల్ మీడియాలోను, కొన్ని పత్రికల్లోను తప్పుడు వార్తలు వస్తున్నాయని చెప్పారు. తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను దహనం చేశారు. వలంటీర్ల ఐక్యతను దెబ్బతీయలేరు వలంటర్లను రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతోనే పచ్చమీడియా తప్పుడు వార్తలను ప్రచురిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ, వలంటీర్ వ్యవస్థలతో ప్రజలకు ప్రభుత్వసేవలు చేరువయ్యాయి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మా సేవలను జీర్ణించుకోలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఆ రెండు పత్రికలకు తగిన బుద్ధి చెబుతారు. వలంటీర్ల ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరు. మేమంతా సీఎం జగనన్నకు అండగా ఉంటాం. – భీమన్న, గ్రామ వలంటీరు, నందవరం మండలం, కర్నూలు జిల్లా విపక్షాల కుట్రలు విఫలం కొందరినైనా రెచ్చగొటి సమ్మెలోకి దించాలన్న విపక్షాల కుట్రలు విఫలమయ్యాయి. నిన్నటిదాక వలంటీర్లను సంఘవిద్రోహ శక్తులతో పోలుస్తూ ప్రతిపక్షాలు, పచ్చమీడియా విషప్రచారం చేశాయి. ఇప్పుడు వలంటీర్లపై లేనిపోని ప్రేమను కురిపించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వలంటీర్ల సోషల్ మీడియాలోకి పచ్చబ్యాచ్ దూరి అసత్య పోస్టులు పెడుతున్నారు. వలంటీర్లు అందరూ ఆడుదాం ఆంధ్రాలో పాల్గొంటున్నారు. అవాస్తవాలు చెప్పే వారిని శిక్షించాలి. – వెలితోటి చిన్నబాబు, పల్నాడు జిల్లా వలంటీర్ల యూనియన్ నాయకుడు -
‘నీటి’ మీద లెక్కలు
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో నీటి లభ్యతపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) లెక్కను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కొట్టిపారేస్తోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి–కావేరి అనుసంధానంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మధ్య ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వినియోగించుకున్న నికర జలాల్లో 177 టీఎంసీలు మిగులు ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క కట్టింది. సీడబ్ల్యూసీ దీనికి విరుద్ధంగా చెబుతోంది. గోదావరిలో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. దాంతో గోదావరిలో నీటి లభ్యతపై సంయుక్తంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలను కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. మహానది–గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 760 టీఎంసీల జలాలను కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటో? శ్రీరాం సాగర్ ప్రాజెక్టు – ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోగా.. ఇచ్చంపల్లి వద్ద నికర జలాల్లో 177 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కకట్టింది. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 105 టీఎంసీలు, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి ఆవిరి కింద కేటాయించిన 52 టీఎంసీలకు మిగులు జలాలు 177 టీఎంసీలు జత చేసి 334 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. దీన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడంలేదు. శ్రీరాం సాగర్ – ఇచ్చంపల్లి మధ్య 177 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు ఏ ప్రాతిపదికన లెక్కగట్టారని ఎన్‌డబ్ల్యూడీఏను ప్రశ్నించింది. గోదావరి బేసిన్లో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని పేర్కొంది. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకుంటే గోదావరి–కావేరి అనుసంధానం ప్రశ్నార్థకమవుతుందంది. శ్రీరాం సాగర్– ఇచ్చంపల్లి మధ్య వరద జలాల్లో మిగులు అనుమానమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. 50 శాతం లభ్యత.., గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల లభ్యత ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. -
AP: సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు మరింత చేయూతనివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రుల బృందం తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరింది. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. వారి క్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అనివార్య పరిస్థితి తీసుకురావద్దని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల ప్రయోజనం కోసం తీసుకున్న వివిధ నిర్ణయాలను పునరుద్ఘాటిస్తూ.. మరిన్ని సానుకూల నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. అందువల్ల సమ్మెను విరమించాలని కోరింది. టీడీపీ హయాంలో ఒక్కపైసా కూడా పెంచలేదు అంగన్వాడీలకు టీడీపీ హయాంలో 2016 ఏప్రిల్ 4న అంగన్వాడీ కార్యకర్తల జీతం రూ.4,200 నుంచి, రూ.7,000కు, మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు రూ.2,950 నుంచి రూ.4,500కు, అంగన్వాడీ సహాయకుల జీతాలు రూ.2,200 నుంచి రూ.4,500కు పెంచారని మంత్రుల బృందం గుర్తు చేసింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీల కష్టాలు చూసి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల జీతాలను పెంచిందని గుర్తు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్వాడీ సహాయకురాలికి, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించిందని వివరించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.11,500లకు, మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.7,000కు, అంగన్వాడీ సహాయకుల జీతాలను రూ.7,000కు పెంచిందన్నారు. మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.27.80 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రుల బృందం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తొలిసారిగా పదోన్నతులు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేసింది. ఈ పోస్టుల పరీక్షలు రాసేవారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది. దాంతో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కల్పించిందని వివరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా రూ.1,313 కోట్లు అందించిందని తెలిపింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ తదితర పథకాలతోపాటు వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. -
AP: చక్కదిద్దారు!
బ్లాక్ బోర్డుపై రాసేందుకు నాలుగు సుద్ధ ముక్కల కోసం కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీ స్క్రీన్స్, స్మార్ట్ టీవీలతో మన ప్రభుత్వ స్కూళ్లు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. పగిలిన గోడలు.. పెచ్చులూడే శ్లాబులు.. చెట్ల కింద వానాకాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. నాలుగంటే నాలుగేళ్లలోనే సాకారమైన మార్పులు ఇవన్నీ! సాక్షి, అమరావతి: చదువుకునేందుకు లక్షలు ధారపోయాల్సిన పరిస్థితి నుంచి పిల్లలు సర్కారు బడికొస్తే చాలు ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రోత్సహిస్తోందీ వైఎస్ జగన్ ప్రభుత్వం. మనసుంటే మార్పు వచ్చి తీరుతుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణల బాటతో మన విద్యా వ్యవస్థ 2019కి ముందు.. ఆ తర్వాత అని దేశమంతా చర్చించుకునేలా చేశారు. విద్యారంగంపై వెచ్చిస్తున్న వ్యయాన్ని భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పెట్టు పెట్టుబడిగా దృఢంగా విశ్వసించారు. కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ బోధన బాట పట్టించారు. అక్షరానికి అగ్రాసనం వేస్తూ పేదింటి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. నాడు – నేడు ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యమైంది. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి సంతృప్తిగా భుజించేలా రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నారు. ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్ల బడ్జెట్‌ను పిల్లల భోజనం కోసం కేటాయించింది. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు, మూడు రోజులు రాగిజావ, బెల్లం చిక్కీను అందచేస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను అత్యుత్తమ చర్యగా విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. సర్కారు స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే టోఫెల్ శిక్షణతో పాటు 2025–26 నుంచి ఐబీ సిలబస్‌ను సైతం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ.71 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్య సంస్కరణలను అమలు చేసింది. ‘మనబడి నాడు–నేడు’ ద్వారా మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులను సమకూర్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా మారుస్తూ నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20లోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది. నవరత్నాలు పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి 2022–23 వరకు రూ.25,809.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యా రంగ సంస్కరణల కొనసాగింపు, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివి ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. సదుపాయాలు.. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు ద్వారా శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 సదుపాయాలను కల్పించింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించారు. రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు వడివడిగా చేపట్టారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 33 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో విప్లవంగా నిలిచిపోయింది. డిజిటల్ శకం.. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ కంటెంట్ ఉచితంగా అందించేందుకు అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందిస్తుండడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ లాంటి వాటి ద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది. సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంతో అవసరం. అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం టోఫెల్ శిక్షణ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ బోధన అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాల సంస్కరణ.. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. మూస పద్ధతిలో ఉన్న పాఠాలను 2020–21 నుంచి సమూలంగా మార్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను అమలు చేస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలలను ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలుగా మార్చింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాన్ని తీర్చేలా భారీగా పదోన్నతులు కల్పించారు. బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణనిచ్చింది. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ.. మండలానికో కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను ప్రారంభించింది. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీపై శిక్షణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ లాంటి పది విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆర్టీ, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తున్నారు. ఐబీ దిశగా అడుగులు.. ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’ అన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధన ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఐబీ’ బోధనను ప్రభుత్వ స్కూళల్లోకి తెచ్చి పేద పిల్లలకు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేశారు. 2025 – 26 నుంచి ఐబీ బోధన ప్రవేశపెట్టి ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుతూ + 2 వరకు అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలకు సాన పెట్టడంతోపాటు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్థాయిలో ఉద్యోగాలుయ పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే ఇన్ని అద్భుతమైన సంస్కరణలు తవిద్యారంగంలో తేవడం చరిత్రాత్మకమని, ఇది ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా సాధికారత.. స్కూళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో పాటు ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాదులను నిర్మిస్తోంది. ఇప్పడు మన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉత్తమ విద్యతో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం సాధ్యమేనని బలంగా నమ్ముతున్నా. – ప్రొఫెసర్ కె.శ్రీరామమూర్తి, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తారు.. గతంలో నేను ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు పుస్తకాలు, యూనిఫారం లాంటివి డొనేట్ చేసేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక నోటు పుస్తకాల నుంచి యూనిఫారం, బూట్లు వరకు ఆ అవసరం లేకుండా అన్నీ ఉచితంగా అందిస్తోంది. స్వేచ్ఛ న్యాప్కిన్స్ ఇస్తున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. పిల్లలకు నేర్పే విధానం, నేర్చుకునే విధానం సంపూర్ణంగా మారింది. ప్రభుత్వ విద్యలో ఇదో గొప్ప సంస్కరణ. కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇన్ని వసతులు లేవు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు మరో 10 ఏళ్లలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. – డాక్టర్ రాజశేఖర్, గైనకాలజిస్ట్, కర్నూలు ఆ ఇబ్బందులు తొలగించారు.. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు లేకపోవడం బాలికలకు అతి పెద్ద సమస్య. ఈ ప్రభుత్వం ఆ సమస్యను దూరం చేసింది. బాలికలకు స్వేచ్ఛ పేరుతో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. నాడు–నేడుతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ శిక్షణ, రక్తహీనత నివారణకు బెల్లం చిక్కీతో పాటు ఐరన్ మాత్రలు ఇవ్వడం ప్రశంసనీయం. – వడిశెట్టి గాయత్రి, పీజీ లెక్చరర్, పిఠాపురం -
సంబరంలా.. ఆడుదాం ఆంధ్రా పోటీలు
సాక్షి, నెట్వర్క్: మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా పోటీలు తొలిరోజు అంబరాన్ని అంటే సంబరంతో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 6,174 చోట్ల షెడ్యూల్ ప్రకారం పోటీలను నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు ఐదు క్రీడాంశాల్లో కలిపి మొత్తం 33,722 పోటీలు జరిగాయి. సాంప్రదాయ క్రీడాంశాలైన యోగా, మారథాన్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 26 జిల్లాల్లోనూ 5 లక్షలకుపైగా ప్రేక్షకులు నేరుగా ఆడుదాం ఆంధ్రా పోటీలను వీక్షించినట్టు సమాచారం. దాదాపు 50 శాతం జిల్లాల్లో 100 శాతం, మిగిలిన జిల్లా్లల్లో 99 శాతం వరకు జట్ల కూర్పు పూర్తయింది. జనవరి 9లోగా గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలను పూర్తి చేసేలా రోజూ ప్రణాళిక ప్రకారం అధికార యంత్రాంగం పని చేస్తోంది. తుది నివేదిక ప్రకారం ఆడుదాం ఆంధ్రాకు 37.23 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. ఇందులో 23.48 లక్షల మంది పురుషులు, 13.75 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. వలంటీర్ల ద్వారా మాన్యువల్ స్కోరింగ్‌తో పాటు పారదర్శకత కోసం క్రిక్ క్లబ్ యాప్ ద్వారా ఆన్లైన్ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల మంది శిక్షణ పొందిన వలంటీర్లకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడల స్కోరింగ్‌కు ప్రత్యేక లాగిన్లు అందించారు. సచివాలయ స్థాయి పోటీల్లో విజేతలకు అందించేందుకు వీలుగా టీషర్టులు, టోపీలను వేగంగా సరఫరా చేస్తున్నారు. 17.10 లక్షల జతలకు గాను 8 లక్షలకు పైగా ఇప్పటికే జిల్లాలకు చేరాయి. కోస్తా.. వెల్లివిరిసిన ఆనందం.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలో పోటీలను కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ భరత్‌రామ్ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 511 సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ఆటల పోటీలకు 90 వేల మంది పురుషులు, 40 వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,16,171 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు, భీమవరంలో కలెక్టర్లు వె.ప్రసన్న వెంకటేష్, పి.ప్రశాంతిలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 1.43 లక్షల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 1.71 లక్షల మంది క్రీడల్లో పాల్గొనటానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో 5 ప్రధాన క్రీడలకు సంబంధించి 14,354 టీమ్‌లను సిద్ధం చేసి 7,198 మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 11 వేలకు పైగా జట్లు ఆడనున్నాయి. కృష్ణా జిల్లాలో వివిధ క్రీడల్లో 1.12 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల్లో 7 వేల జట్లు, మహిళల్లో 4వేల జట్లు ఉన్నాయి. పోటీల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ పతాకంతో 2 కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 3,280 అడుగుల పొడవున రూపొందించిన జాతీయ జెండాతో క్రీడాకారులు గాంధీనగర్ నుంచి చీమకుర్తిలోని ప్రభుత్వ హైస్కూలు క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. దర్శిలో జాతీయ పతాకంతో రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు జరిగాయి. ఉత్తరాంధ్రలో ఉరిమిన ఉత్సాహం.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో 11,500 జట్లు నమోదు చేసుకోగా.. 670 క్రీడా మైదానాలు సిద్ధం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 976 సచివాలయాల పరిధిలో 485 మైదానాల్లో ఐదు క్రీడాంశాల్లో ఆటల పోటీలు జరిగాయి. మొత్తం 2.07 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విజయనగరంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఆటల పోటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ పతక విజేత మత్స్య సంతోషి, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, స్కేటింగ్ క్రీడాకారుడు సాయితేజలను ఘనంగా సత్కరించారు. విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెంలో జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎంపీ సత్యవతి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 14,098 టీములు, అందులో 1.31 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. రాయలసీమ.. ఆటాడుకుందాం రా.. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,89,929 మంది, నంద్యాల జిల్లాలో 1.25 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 645, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పోటీలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 515 క్రీడామైదానాల్లో పోటీలు జరిగాయి. తిరుపతి జిల్లాలో పలు సచివాలయాల పరిధిలో క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ పోటీలు జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు.