AP Special
-
ఇంతింతై.. ఆకాశమంతై..
సాక్షి, అమరావతి: ‘నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారు.. అన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు.. అన్నది ప్రశ్న.’ ప్రముఖ రచయిత్రి, తత్వవేత్త అయిన్ రైన్డ్ చెప్పిన ఈ మాటలకు అర్థం ఈ రోజు మన రాష్ట్రంలో కళ్లెదుటే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ కన్పిస్తున్న ఆత్మవిశ్వాసమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రచించిన ప్రణాళికను 58 నెలలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు. అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారత సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు. మహిళా రాజకీయ సాధికారతలో మనమే నంబర్ వన్ ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో.. స్త్రీవాద రచయిత చలం తన రచనల్లో.. ‘స్త్రీకి శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. మెదడు ఉంది.. జ్ఞానం ఇవ్వాలి.. హృదయం ఉంది.. అనుభవం ఇవ్వాలి..’ అని ఉన్నతంగా చెప్పారు. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె.. ముద్దారగ నేర్పించినన్..’ అన్నారో కవి. ఆచరణకొచ్చేసరికి అతివల మాటకు విలువిచ్చే నేతలెందరుంటారు? వారికి సమున్నతంగా రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించే నాయకులు ఎందరుంటారు? మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శబాటసారి. చరిత్రాత్మక చట్టం చేసి మరీ పదవులు నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయడం ఇదే తొలిసారి. ఆ చట్టంలో పేర్కొన్న దాని కంటే నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు పడతులకే ఇచ్చారు. మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 ప్రమద లోకానికే ఇచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టుల్లో 102 మహిళలకే ఇచ్చారు. 1,356 రాజకీయ నియామకాల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం తరుణీమణులకే కేటాయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించిన సీఎం వైఎస్ జగన్ ► రాష్ట్రంలో 13 జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. ► 26 జడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. ► 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం మహిళలకు ఇచ్చారు. ► మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే.. అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. ► 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది.. అంటే 64 శాతం మహిళలే ఛైర్ పర్సన్లు. ► ఈ మున్సిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది.. అంటే 55 శాతం ప్రమదలకే దక్కేట్లు చేశారు. ► సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం ముదితలే ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దాదాపు 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం వనితలనే నియమించారు. ఇంకా దాదాపు 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో.. 51 శాతం మహిళలే ఉన్నారు. -
ప్రగతి దిశగా బాలికా చదువు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల అంటే బాలికలకు గతంలో ఓ నరకం.. చదువుకుందామని ఆశ ఉన్నా సదుపాయాలు ఉండేవి కావు. కనీసం టాయిలెట్ కూడా లేని దుస్థితి. కౌమార దశ బాలికల పరిస్థితి మరీ దారుణం. దాంతో చాలామంది 8 లేదా 9 తరగతిలోనే చదువు మానేసేవారు. అత్యధిక బాలికల డ్రాప్ అవుట్స్ కూడా ఈ తరగతుల్లోనే ఉండేవి. ఈ సమస్యను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాలికలు చదువుల ఆకాంక్షను నెరవేర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను నాడు–నేడు ప్రాజెక్టులో 100 శాతం నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక గదిని అందుబాటులోకి తెచ్చింది. స్కూలు స్థాయిలోనే వారి ఆరోగ్యంపైనా దృష్టిపెట్టి, రక్తహీనత ఉన్న బాలికలకు ఫోలిక్ ఐరన్ మాత్రలను అందిస్తోంది. ఏటా కౌమర దశ బాలికలు 9.74 లక్షల మందికి ‘స్వేచ్ఛ’ పేరిట శానిటరీ న్యాప్కిన్స్ను ఇస్తోంది. ఈ తరహా సేవలు నూరుశాతం అందిస్తున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా గత నాలుగేళ్లుగా బడుల్లో బాలికల సంఖ్య పెరిగింది. ఉత్తీర్ణతలోనూ వారు ముందున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ సాధనలోనూ బాలురు కంటే బాలికలే ముందున్నారు. బాలికలకు నూరు శాతం సదుపాయాలు పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్స్‌కు ప్రధాన కారణం టాయిలెట్లు, గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా ఉండేవి. దాంతా విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బంది పడేవారు. టాయిలెట్ల సదుపాయం లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు ప్రాజెక్టు ప్రారంభించి ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సరఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 45,137 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటించింది. ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది. దీంతో పాటు బాలికల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. ‘స్వేచ్ఛ’గా చదువుకునేలా.. దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉండేది, పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్‌కు ఇదే కారణంగా ఉండేది. బాలికల డ్రాప్ అవుట్స్‌కు కారణమవుతున్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను బాలికలకు ఉచితంగా అందిస్తున్నారు. 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని 9,74,121 మంది కౌమార బాలికలకు వీటిని అందిస్తోంది. ఇప్పుడు బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. చదువుపై దృష్టి పెట్టడంతో ఫలితాల సాధనలోనూ బాలురను మించిపోయారు. అమ్మఒడి .. జగనన్న గోరుముద్ద చిన్నారుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అమ్మ ఒడి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.15 వేలు క్రమం తప్పకుండా ప్రభుత్వం అందజేస్తోంది. దీనివల్ల విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రోజుకొక మెనూతో మధ్యాహ్న భోజనం చక్కగా అమలవుతోంది. -
మహిళల రాజసం
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో.. స్త్రీవాద రచయిత చలం తన రచనల్లో.. ‘స్త్రీకి శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. ఆమెకు మెదడు ఉంది.. దానికి జ్ఞానం ఇవ్వాలి.. ఆమెకు హృదయం ఉంది.. దానికి అనుభవం ఇవ్వాలి..’ అని ఉన్నతంగా చెప్పారు. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె.. ముద్దారగ నేర్పించినన్..’ అన్నారో కవి. ఆచరణకొచ్చేసరికి అతివల మాటకు విలువిచ్చే నేతలెందరుంటారు? వారికి సమున్నతంగా రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించే నాయకులు ఎందరుంటారు?మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శ బాటసారి. ‘నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారు.. అన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు.. అన్నది ప్రశ్న.’ ప్రముఖ రచయిత్రి, తత్వవేత్త అయిన్ రైన్డ్ చెప్పిన ఈ మాటలకు అర్థం ఈ రోజు మన రాష్ట్రంలో కళ్లెదుటే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ కన్పిస్తున్న ఆత్మవిశ్వాసమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రచించిన ప్రణాళికను 58 నెలలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు. అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారత సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. ప్రధానంగా మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. - సాక్షి, అమరావతి కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు. ♦ రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. ♦ 26 జెడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. ♦ 12 మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చారు. ♦ మొత్తం మునిసిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే.. అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. ♦ 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది.. అంటే 64 శాతం మహిళలే ఛైర్పర్సన్లు. ♦ ఈ మునిసిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది.. అంటే 55 శాతం ప్రమదలకే దక్కేట్లు చేశారు. ♦ సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం ముదితలకే దక్కేలా చర్యలు తీసుకున్నారు. ♦ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దాదాపు 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం వనితలనే నియమించారు. ఇంకా దాదాపు 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో.. 51 శాతం వనితలే ఉన్నారు. చరిత్రాత్మక చట్టం చేసి మరీ పదవులు ♦ నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. ♦ దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయడం ఇదే తొలి సారి. ఆ చట్టంలో పేర్కొన్న దాని కంటే నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు పడతులకే ఇచ్చారు. ♦ మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 పదవులు ప్రమదాలోకానికే ఇచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చారు. అంటే మొత్తంగా 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం తరుణీమణులకే కేటాయించారు. -
బొర్రా గుహలకు మహర్దశ
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రూ. 29.88 కోట్లను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కాగా, 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నపురాయి ఖనిజంతో ఏర్పాటయిన మానవమెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లీబిడ్డ, రుషి, సాయిబాబా, తేనెపట్టులాంటి వివిధ ఆకృతులు చూపరులను కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రాగుహలను నిర్వహించేవారు. తరువాత పర్యాటకశాఖ విద్యుత్ సౌకర్యం కల్పించి, లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్‌పై కమిషన్ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటకశాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆదాయంలో కొంతమేర గుహల అభివృద్ధికి కేటాయించింది. మూడు విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన్ పథకంలో భాగంగా మంజూరు చేసిన రూ.29.88 కోట్లతో మూడు విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రైల్వేస్టేషన్ నుంచి కొండప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వరకు రోడ్డుమార్గంలోని దారిపొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటుగా పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రెండో విభాగంలో బొర్రాగుహలు ముఖద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తారు. మూడో విభాగంలో బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్ లెస్ టికెట్ విధానంలో అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్లైన్, పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇప్పటివరకు బొర్రా గుహల్లో 40 వరకు బెల్జియం లైట్లు ఉండగా, మరో 60 అదనంగా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకశాఖ ఈఈ రమణ మాట్లాడుతూ బొర్రాగుహల అభివృద్ధి పనులకు సంబంధించి, టెండర్ పూర్తి కాగానే పనులు మొదలు పెడతామని చెప్పారు. -
Fact Check: అడ్డగోలు అప్పులు దాచేసి ముష్టి లెక్కలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి స్వయంగా కేంద్రం ప్రభుత్వం లెక్కలేనన్ని సార్లు కీలక ప్రకటనలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా వివరణలూ ఇచ్చింది. అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ అట్టడుగునే ఉందనీ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు తేల్చి చెప్పింది. రాష్ట్ర అప్పులపై ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా వివరంగా చెప్పారు. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల – వైఎస్సార్సీపీ పాలనలో అప్పుల గురించి ప్రజెంటేషన్ ద్వారా స్పష్టంగా తెలియచేశారు. ఏపీ రుణాల గురించి నేరుగా కేంద్రం, ఆర్బీఐ చెబుతున్నా తలకెక్కదా? చట్టసభల్లో ప్రభుత్వాలు వెల్లడించిన గణాంకాలను కాదని తనకు తోచిన లెక్కలతో రామోజీ తప్పుడు రాతలు ఎలా రాస్తారు? రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో డప్పు కొట్టే గురివిందను ఏమనుకోవాలి? అసలు ఏ ప్రభుత్వాలకైనా తీసుకునే అప్పులను రహస్యంగా ఉంచడం సాధ్యం కాదనే ఇంగితం లేదా? పరిమితికి లోబడి తీసుకునే అప్పులను గ్రాఫిక్స్ ఆర్భాటాల కోసం కాకుండా వనరులను సృష్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చదువులను చక్కదిద్దేందుకు వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.73 వేల కోట్లకు పైచిలుకే! మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం పెత్తందారుల దృష్టిలో వృథానేనా? ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పెద్ద ఎత్తున సదుపాయాల కల్పన అనవసరమా? సుదూర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రం ఎదిగేందుకు ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు చేయడం వృథానా? రాజధాని గుదిబండ రూ.5 వేల కోట్లు! అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు భవిష్యత్‌లో తప్పనిసరి ఆర్థిక బాధ్యతలుగా పరిణమించాయని కాగ్ స్పష్టం చేసింది. అమరావతి బాండ్ల పేరుతో గత సర్కారు ఏకంగా 10 సంవత్సరాల కాలానికి అత్యధిక వడ్డీతో అప్పు చేసినట్లు పేర్కొంది. మార్కెట్ రుణాల ద్వారా రూ.5,013.60 కోట్లు సమీకరించగా వడ్డీలకే ఏకంగా రూ.4,827.14 కోట్లు చెల్లించాల్సి ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే 1,399.02 కోట్లు వడ్డీల కింద చెల్లించగా భవిష్యత్‌లో మరో రూ.3,428.12 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచ స్థాయి రాజధాని నిజం కాలేదు గానీ తప్పనిసరి ఆర్ధిక బాధ్యతలు మాత్రం మోయాల్సి వస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. 2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ సర్కారు పేలవమైన ఆర్థిక నిబద్ధత చూపిందని తప్పుబట్టింది. ♦ ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో 2022–23కి సంబంధించి కాగ్ అకౌంట్స్ సమర్పించింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, జీఎస్డీపీలో అప్పులు ఉన్నాయని అందులో స్పష్టం చేసింది. సొంత లెక్కలు కాకుండా కాగ్ అకౌంట్స్‌ను పరిశీలిస్తే రామోజీకి ఆ విషయాలు తెలుస్తాయి. ♦ అప్పుల కోసం సచివాలయం, ఇంకా కనిపించినవన్నీ తాకట్టు పెడుతున్నారంటూ రామోజీ పచ్చి అవాస్తవాలను కుమ్మరించారు. వాస్తవానికి రాజధాని అంటూ అమరావతి భూములను తాకట్టు పెట్టి బాండ్లు పేరుతో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసింది చంద్రబాబు సర్కారే. కాగ్ నివేదికే ఆ విషయాన్ని ఎండగట్టింది. గ్రాఫిక్స్ బండారాన్ని బయట పెట్టింది. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు అప్పుల నిర్వాకంతో ఇప్పుడు వడ్డీల చెల్లింపులు భారంగా మారాయి. అత్యధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పు తెచ్చిన పరిమాణానికి దాదాపు సమానంగా వడ్డీ కూడా ఉండటాన్ని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ♦ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.16 వేల కోట్లు వెచ్చించి ఉత్తమ మానవ వనరుల ద్వారా ఆస్తుల కల్పన చేయటాన్ని చూసి రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను రూ.16 వేల కోట్లతో నిర్మిస్తుంటే మంచం పట్టారు! రూ.24,000 కోట్లతో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమూ ఆయనకు మింగుడు పడటం లేదు! ఎందుకంటే తాను ద్వేషించే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే అనుకోవాలేమో! ♦ గత ఎన్నికల ముందు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి, గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ పేరుతో ఓటర్లను మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తే రామోజీ కిక్కురుమనలేదెందుకో? ♦ రాష్ట్ర అప్పులు బడ్జెట్ లోపల, బయట కలిపి ఏకంగా రూ.10.21 లక్షల కోట్లకు చేరాయంటూ పచ్చి అబద్ధాలను రామోజీ తన కరపత్రంలో గుమ్మరించారు. 2022–23 నాటికి కాగ్ అసెంబ్లీకి సమర్పించిన అకౌంట్స్ ప్రకారం బడ్టెట్ లోపల, బడ్జెట్ బయట రాష్ట్రం అప్పులు రూ.5.68 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. బడ్జెట్ లోపల అప్పులు రూ.4,29,526 కోట్లు కాగా బడ్జెట్ బయట అప్పులు రూ.1,38,875 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పులను శాసనసభకు సమర్పించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ పత్రం ద్వారా అందచేస్తూ ఎక్కడా దాపరికం లేకుండా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఎఫ్ఆర్బీఎ నిబంధనల కన్నా తక్కువగానే అప్పులున్నట్లు 2022–23 కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. -
‘చేయూత’ పండుగ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మనందరి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళా దినోత్సవం ముందు రోజు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మహిళా సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరొకటి లేదన్నారు. 45 – 60 ఏళ్ల వయసున్న మహిళలకు నాలుగో విడత ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అనకాపల్లి జిల్లాలోనే నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆర్థిక సాయంతో ఎదిగిన మహిళలంతా తమ విజయగాథలను వివరిస్తూ రానున్న 14 రోజుల పాటు సచివాలయాలవారీగా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు – దత్తపుత్రుడు గతంలో మేనిఫెస్టోలో అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదని మండిపడ్డారు. వారి పేరు చెబితే 8 రకాల మోసాలు, దగా గుర్తురాగా మన ప్రభుత్వం పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబును చూస్తే విశ్వసనీయతలేమి గుర్తుకొస్తుందని, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం తెచ్చేలా కార్లను మార్చినట్లు భార్యలను మార్చే వ్యవహారం గుర్తుకొస్తుందని విమర్శించారు. వారిని నమ్మితే కాటేసే పాముని నమ్మినట్టేనని, తినేసే పులిని ఇంటిని తెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ మేలు చేసిన మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపైనర్లుగా నిలిచి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని గురువారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో సీఎం జగన్ ప్రారంభించారు. ఆయన ఏమన్నారంటే.. 14 రోజులు పండుగ వాతావరణంలో.. మహిళా సాధికారతకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించే వైఎస్సార్ చేయూతలో ప్రజా ప్రతినిధులందరూ పాలుపంచుకుంటారు. అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి? అనే స్ఫూర్తిదాయక కధనాలను ప్రతి సచివాలయం, ప్రతి మండలంలో చర్చించుకునేలా తెలియచేయాలని ప్రతి అక్కనూ, చెల్లెమ్మనూ కోరుతున్నా. 45 ఏళ్లు పైబడిన అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు? వారికి తోడుగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదు. ఇంటిని నిలబెడుతూ.. ప్రతి అక్కచెల్లెమ్మ సొంత కాళ్లపై నిలబడేలా క్రమం తప్పకుండా చేయూత సాయంతోపాటు బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, హిందుస్తాన్న్ లీవర్ తదితర కంపెనీలతో అనుసంధానించి తోడ్పాటునిస్తున్నాం. ప్రభుత్వం ఏటా రూ.18,500 చొప్పున ఇస్తోంది కాబట్టి కంపెనీలు, బ్యాంకులు కూడా వారికి అండదండలు అందించాయి. 1.69 లక్షల మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు నిర్వహిస్తుండగా 85,630 మంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. 3,80,466 మంది గేదెలు, ఆవులు కొనుగోలు చేశారు. 1,34,514 మంది మేకలు కొనుగోలు చేశారు. 88,923 మంది ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తుండగా మరో 3,98,422 మంది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాల్లో ఉన్నారు. ఇంకో 2,59,997 మంది రకరకాల వ్యాపారాలతో సొంత కాళ్లపై నిలబడ్డారు. 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఏదో ఒక వ్యాపారం చేస్తూ నెలకు కనీసం రూ.6 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. నాలుగు విడతల్లో రూ.19,189 కోట్లు.. ఒక్క వైఎస్సార్ చేయూత పథకం ద్వారానే 58 నెలల వ్యవధిలో 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. వారికి ఒక మంచి తమ్ముడిగా, అన్నగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి రుణపడి ఉంటా. నవరత్నాల పథకాల ద్వారా మరో రూ.29,588 వేల కోట్ల మేర లబ్ధి పొందారు. ఇదే 33 లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలను చూస్తే మరో రూ.56,188 కోట్ల మేర కూడా మంచి జరిగింది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతతో గొప్పగా ఎదగాలని ప్రతి అడుగూ ముందుకు వేశాం. గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ వారికి రిజర్వేషన్ కల్పించిన తొలి ప్రభుత్వం ఇదే. గత ప్రభుత్వానికి ఇలా మేలు చేసిన చరిత్రే లేదు. అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నాం. వసతి దీవెన మొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ వారి ఖాతాలకే డబ్బులను జమ చేసి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. నాడు ఛిన్నాభిన్నం.. నేడు నెంబర్ వన్.. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మనం మళ్లీ ఊపిరి పోశాం. నాడు చంద్రబాబు రుణమాఫీ మోసానికి పొదుపు సంఘాలన్నీ ఏకంగా 18.36 శాతం ఎన్పీఏలు, ఔట్ స్టాండింగ్‌లుగా చిన్నాభిన్నమయ్యాయి. ఇవాళ ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే ఉన్నాయి. ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో మన పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచాయి. వైఎస్సార్ చేయూత ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఏకంగా రూ.19,190 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం అందించింది. కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదైతే ప్రతి అడుగులో అండగా నిలిచిన ఘనత మనది.గతానికి, ఇప్పటికి తేడా చూడమని కోరుతున్నా. మాట ఇచ్చిన చోటే... అత్యంత బాధ్యతగా వ్యవహరించే 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే వారే కాకుండా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్ఫూర్తిగా ఆలోచన చేశాం. క్రమం తప్పకుండా ఏటా రూ.18,750 చొప్పున వారి చేతిలో పెట్టి జీవనోపాధి మార్గాలు చూపిస్తూ ముందుకు సాగుతున్నాం. చేయూత ద్వారా మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయం చేస్తానని ఇదే జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో నాడు చెప్పా. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళి్టతో నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తూ ఇదే అనకాపల్లి జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు.. సొంతిల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందచేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఇది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చారా అంటే ఇచ్చింది సున్నా. తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం సచివాయాల్లో మహిళా పోలీసును నియమించాం. దిశ యాప్, భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలాంటి వ్యవస్థను తెచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలో ఏకంగా 50 శాతం వరకు మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే సేవలందిస్తున్నారు. పదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి.. చంద్రబాబు పాలనకు మన పాలనకు వ్యత్యాసం కళ్లకు కట్టినట్లు తెలియాలంటే గత పదేళ్లుగా మీ బ్యాంకు స్టేట్మెంట్లను తీసుకుని ఒక్కసారి పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మీ అకౌంటుకు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా? అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయో మీరే గమనించండి. లక్షాధికారులైన మహిళల జాబితాలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం కూడా చెప్పింది. మేనిఫెస్టోలో హామీలలో 99% అమలు చేసి మరోసారి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం మనదే. ఈ 58 నెలల కాలంలో మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరుతున్నా. చెడిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఆ పని చేయలేడు. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే సాధ్యం. బాబు – దత్తపుత్రుడు 8 మోసాలివిగో.. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది. 2014లో చంద్రబాబు – దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా? ► రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు. అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్‌మెంట్ వచ్చేది. ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు. ► ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు. ► మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ► ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. ► మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. ► పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు. ► బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. ► మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లు.. 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు. అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించారు. మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం. అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచడం మరో గజ మోసం. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా. -
Fact Check: వెలిగొండంత అక్కసు..
సాక్షి, అమరావతి: ఏ రోగానికైనా మందు ఉంటుందేమోగానీ ఈనాడు రామోజీని పీడిస్తున్న ‘కడుపుమంట’కు మాత్రం మందులేదు. నిత్యం ఆయన్ను దహించివేస్తున్న ఆ వ్యాధి రోజురోజుకూ ముదిరిపోతోంది. దాని నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశ కూడా కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఫలితంగా ఆయన రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో.. కొంతలో కొంతనైనా ఉపశమనంగా ఉంటుందని ఆయన రోజూ తన క్షుద్ర పత్రిక ఈనాడులో సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక అశుద్ధ కథనాన్ని వండివారుస్తూ ఉదయం తనివితీరా చూసుకుని తన బాధను చల్లార్చుకుంటున్నారు. తాజాగా.. వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను పూర్తిచేసిన సీఎం వైఎస్ జగన్ బుధవారం వాటిని జాతికి అంకితం చేయడాన్ని రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. చాలా పనులు మిగిలే ఉన్నాయని.. ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారమే లేదంటూ ‘వెలికొండంత పెండింగ్’ శీర్షికన తన ఆక్రోశాన్ని, కడుపులో పేరుకుపోయిన విషాన్ని గురువారం ఎప్పటిలాగే కక్కేశారు. నిజానికి.. వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ వడివడిగా పూర్తిచేస్తుండటంతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంత రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. దాంతో ఆ ప్రాంత రైతుల్లో సీఎం జగన్‌పై ఆదరణ మరింతగా పెరిగింది. ఇది చంద్రబాబు రాజకీయ ఉనికికే ప్రమాదకరంగా మారడంతో రామోజీరావుకు నిద్రపట్టడంలేదు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయనిలా నానా అవస్థలు పడుతున్నారు. వెలిగొండను పిండేసిన బాబు.. వాస్తవానికి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004, అక్టోబరు 27న వెలిగొండ ప్రాజెక్టుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తన హయాంలోనే రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. 37.587 కిమీల పొడవైన జంట సొరంగాల్లో 20.333 కి.మీ.ల పనులు.. ఆ ప్రాజెక్టులోనే అంతర్భాగమైన నల్లమలసాగర్‌ను పూర్తిచేశారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014–19మధ్య ఈ ప్రాజెక్టుకు రూ.1,385.81 కోట్లు వ్యయంచేసినా కేవలం 6.686 కి.మీ.ల మేర మాత్రమే జంట సొరంగాల పనులు చేశారు. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టడాన్ని ఇటీవల కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బయటపెట్టింది. వెలిగొండకు ఖర్చుచేసిన నిధులను చంద్రబాబు మింగేయడంవల్లే ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయాయి. యుద్ధప్రాతిపదికన సొరంగాలు పూర్తి ఇక సీఎం వైఎస్ జగన్ రూ.978.02 కోట్లు ఖర్చుచేసి.. అందులో ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుని వెలిగొండ జంట సొరంగాల్లో మిగిలిన 10.568 కి.మీ.ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, జాతికి అంకితం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రెండు మూడు నెలల్లోనే నల్లమలసాగర్‌కు కృష్ణాజలాలను తరలిస్తామని ఆయన చెప్పారు. వచ్చే జూలై, ఆగస్టులలో నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేలోగా రూ.1,200 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టంచేశారు. తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అలాగే, ప్రాజెక్టును మొత్తం ఒకేసారి పూర్తిచేసి ఆయకట్టు మొత్తానికి ఒకేసారి నీళ్లందించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడాలేవు. ఎక్కడైనా ప్రాజెక్టును దశలవారీగా పూర్తిచేస్తూ అయకట్టుకు నీళ్లందిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. వెలిగొండ ప్రాజెక్టులో కూడా మిగతా పనులను పూర్తిచేసి దశలవారీగా మొత్తం ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అసలు వెలిగొండ ఒక్కటే కాదు.. 2022 సెప్టెంబరు 6న నెల్లూరు, సంగం బ్యారేజ్‌లు.. 2023 సెప్టెంబరు 19న హంద్రీ–నీవాలో అంతర్భాగమైనమైన లక్కసాగరం ఎత్తిపోతల.. 2023 నవంబరు 30న గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్.. 2024 ఫిబ్రవరి 26న హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిచేసి, జాతికి అంకితం చేసినప్పుడు కూడా రాజగురువు ఇలాగే విషం చిమ్మారు. -
అగ్రిగోల్డ్ బూచి... ప్రత్తిపాటి భూముల లాలూచీ
సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్లగొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీలో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్ కంపెనీపై కేసు నమోదైంది. ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్మెంట్ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు. ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అటాచ్‌మెంట్‌కు అనుమతి ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్ శాఖ ఆమోదించి అటాచ్‌మెంట్‌కు అనుమతి జారీ చేసింది. -
ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నియమావళిని పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైఎస్సార్సీపీ), ఎ.రాజేంద్రప్రసాద్ (టీడీపీ), ఐ.కె.అన్నపూర్ణ (బీజేపీ), వె.వి.రావు (సీపీఐ–ఎం) పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ, వ్యయ పర్యవేక్షణ ఎంతో కీలకమైన అంశాలని చెప్పారు. ఈ అంశాలపై సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తరువాత వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మీనా వివరించిన నియమావళిలో ప్రధానాంశాలు.. ♦ ఎటువంటి బహిరంగ కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి పొందాలి ♦ పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే అన్ని కా>ర్యక్రమాలను పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తాం ♦ కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధం ♦ అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధం ♦ స్టార్ క్యాంపెయినర్లు రూ. లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదు ♦ పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్ చేస్తాం ♦ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది ♦ ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసన సభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగానీ లేదా ఆర్.బి.ఐ./ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులు అనుమతించం ♦ ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు ♦ నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తాం ♦ అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తాం ♦ ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది ♦ ప్రతి లోక్‌సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుంది ♦ ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాలి ♦ ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, బహుమతులు, లిక్కరు, ఇతర వస్తువులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తాం ♦ ఎన్నికల వ్యవయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించాలి ♦ రోజువారీ రిజిస్టరుతో పాటు నగదు, బ్యాంకు రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా నిర్వహించాలి -
‘పాట్’ అమలులో ఏపీ ఉత్తమం
సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో డీకార్బనైజేషన్ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పాట్ సైకిల్–1లో 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివాలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల సుమారు 31 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్ సైకిల్–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా పాట్ సైకిల్–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేశాయని చెప్పారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్టైల్స్, పవర్ప్లాంట్లు, ఎరువులు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, క్లోర్–ఆల్కల్ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోనసీమలో డ్రోన్ హబ్ ప్రారంభం
సాక్షి,అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ హాబ్ను కలెక్టర్ శుక్లా మంగళవారం ప్రారంభించారు. అమలాపురం స్టేడియంలో 21 ఫ్లయింగ్ డ్రోన్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..రూ.2 కోట్లతో దేవగుప్తం పీఏసీఎస్ 21 డ్రోన్లను కొనుగోలు చేసిందన్నారు. ఒక్కొక్క డ్రోన్ 6–8 నిమిషాల్లో ఒక ఎకరానికి స్ప్రేయింగ్ ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొనుగోలు చేసిన ఈ డ్రోన్స్‌ను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులో తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు స్పేయర్ ఎకరాకు రూ.వెయ్యి ఖర్చుతో పిచికారీ చేస్తున్నారని, డ్రోన్ టెక్నాలజీతో ఎకరాకు రూ.300 అవుతుందన్నారు. రైతులు బృందంగా ఏర్పడితే రూ.10 లక్షలు విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కొనుగోలు చేయవచ్చన్నారు. దేవగుప్తం పీఏసీఎస్ చైర్మన్, రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక డ్రోన్ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినా««ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: సిగ్గు ‘ఈడీ’సి రాతలా?
గురివింద చెబుతున్నట్లు గత చంద్రబాబు పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చి ఉంటే.. చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్‌ను ఎందుకు జుట్టు పట్టుకుని ఈడ్చినట్లు? అర్ధ రాత్రిళ్లు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వెనుక ప్రొక్లయినర్లతో ఎందుకు ఇసుక తవ్వకాలు సాగించినట్లు? వీటిని బట్టి బాబు అండ్ గ్యాంగ్ అందినకాడికి దోచుకున్నారని ఈ రాజగురివిందకు తెలీదా? ఈ లెక్కన ఈ ప్రభుత్వంలో ఇసుక విక్రయం వల్ల ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తోంది. మరోవైపు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపుతోంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ద్వారా నిఘా పెట్టింది. ఏకంగా 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఇదంతా కళ్లెదుటే అందరికీ కనిపిస్తున్నా.. రామోజీకి, పచ్చ మీడియాకు మాత్రం కనిపించదు. తమ చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ఎంతకైనా దిగజారుతామని, అవసరమైతే బట్టలిప్పుకుని దుష్ప్రచారం చేస్తామని అనునిత్యం చాటుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఎవరు నవ్విపోతే మాకేంటని నిస్సిగ్గుగా రోజూ రోత రాతలు రాయడం రామోజీకే చెల్లింది. సాక్షి, అమరావతి: మోకాలికి బోడిగుండుకి ముడి పెట్టడం ఎంత తిక్క తనమో ఏపీలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను తమిళనాడుతో పోల్చి అక్కసు వెళ్లగక్కడం అంతకంటే ఎక్కువ పిచ్చితనం. ఈ పిచ్చి రాతలనే నమ్ముకున్న రామోజీ అదే పనిగా ఇసుకపై తనకున్న పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఇసుక తవ్వకాలపై ఈడీ దృష్టి సారిస్తే, ఇక్కడ కూడా అలాగే జరగాలని కోరుకోవడం సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కక్ష కాకపోతే మరేమిటి?. ఇసుక తవ్వకాలు సక్రమంగా జరుగుతున్నా అక్కసుతో నిత్యం తాను బురద జల్లడమే కాకుండా ఏకంగా ఈడీ జోక్యం చేసుకోవాలని బరి తెగించి అడ్డగోలు రాతలు రాయడం గురువింద రామోజీకి చెల్లింది. నిజానికి ఈడీ దర్యాప్తు జరపాల్సింది డిపాజిటర్లను నిట్టనిలువునా ముంచిన రామోజీ సొంత సంస్థ మార్గదర్శిపైనే. మార్గదర్శికి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని సాక్షాత్తూ కోర్టులే స్పష్టం చేశాయి. వేల కోట్లు దోచేసి నంగనాచి రాతలు, దొంగ ఏడుపులు, నక్క తెలివి తేటలతో తప్పించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ భూకుంభకోణాలపై ఈడీగానీ, సీబీఐగానీ విచారణ చేస్తే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా నిజాలు బహిర్గతమవుతాయి. తన వెనుక ఉన్న ఈ అక్రమాలను దాచిపెట్టుకుని ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లడం రామోజీకి రోజువారీ ప్రక్రియగా మారిపోయింది. విష ప్రచారం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలనే ఆరాటం తప్ప నిజంగా ఇసుక తవ్వకాల వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో తెలిపే ఒక్క లైను ఈనాడు రాయలేకపోతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, ఇక్కడి ఇసుక విధానం, తమిళనాడులో ఇసుక విధానం, తవ్వకాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా రెండు రాష్ట్రాలను పోలుస్తూ ఈనాడు ప్రచురించిన కథనంలో అక్కసు మాత్రమే కనిపిస్తోంది. బాబు హయాంలో జేబుల్లోకి రూ.వేల కోట్లు వాస్తవానికి గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్ళింది. ఆ దోపిడీని నివారించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం రూ.765 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ సొమ్మును తిరిగి ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ డబ్బంతా చంద్రబాబు హయాంలో ఏమైంది? సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూ ప్రజా సంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లేలా చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇసుక కొనుగోలు చేయడానికి ప్రజలు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు. ఆ అరాచక విధానాన్ని రూపు మాపి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా నూతన ఇసుక పాలసీని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే వీలు కల్పించారు. టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలను ఏజెన్సీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో రూ.3825 కోట్ల ఆదాయం వస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తోంది. అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్షను విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి దాదాపు 18 వేల కేసులను ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. అంటే ఉచిత ఇసుక విధానం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఇటు పర్యావరణానికి విఘాతం ఏర్పడింది. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఆదాయం ఏమైంది ? ఈ ప్రభుత్వంలో ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న రూ.3,825 కోట్ల ఆదాయం గతంలో ఏమైంది? ఇంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోందని తెలిసినా ఎందుకు టెండర్లు పిలువలేదు? పారదర్శక విధానాలను ఎందుకు ఎంచుకోలేదు? అప్పుడు రామోజీరావు ఈ అక్రమాలపై ఈడీ విచారణ జరిపించాలని ఎందుకు కోరలేదు.? ప్రస్తుతం పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్ ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ తవ్వకాలు జరగడానికి అవకాశమే లేదు. దీనిపై పర్యవేక్షణకు నిఘా కోసం ఎస్ఈబిని ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు నిర్వహిస్తున్నారు. -
Fact check: సచివాలయంపై తా‘కట్టు కథ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎల్లో మీడియా చేసిన కుట్ర బట్టబయలయ్యింది. రాష్ట్ర తాత్కాలిక సచివాలయాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారంటూ... ఒక పత్రికలో రాసిన కథనాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖండించింది. ‘సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ ఒక పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్త అవాస్తమని, ఇది ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని, దానిని ఖండిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడానికి ఎల్లో మీడియా ప్రతీ రోజు ఏదో ఒక విష ప్రచారంతో భారీ కుట్రలకు తెరతీస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రతిష్టను మంటకలపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందులో భాగంగానే ‘సచివాలయం తాకట్టు’ అంటూ ఒక విష కథనాన్ని పకడ్బందీగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ‘తాకట్టులో సచివాలయం’ అంటూ ఎల్లో పత్రిక ఒక వార్తను ప్రచురించడం... దాన్ని తమ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం.. దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి జిల్లా స్థాయి నేతల వరకు మాట్లాడటం... తిరిగి ఆ వార్తను అన్ని పత్రికల్లో ప్రచురింపజేస్తూ... ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలు నిజం అని నమ్మే విధంగా చేయడానికి ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేసింది. కానీ ఆ వార్తను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖండించడంతో తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారం మరోసారి బట్టబయలయ్యింది. -
సమస్యల నుంచి గట్టెక్కించారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సమస్యల నుంచి గట్టెక్కించారు మాది చిన్నకారు రైతు కుటుంబం. మా ఆయన, నేను కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడేవాళ్లం. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం అత్తికొత్తూరు గ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని అందులో వ్యవసాయం చేసుకుంటూ ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నాం. ప్రతి ఏటా నష్టాలు చవిచూసేవాళ్లం. కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మహిళలకు అందించే సంక్షేమ పథకాలతో కుటుంబం ఆర్థికంగా స్థిర పడింది. నేను నేర్చుకొన్న టైలరింగ్ మమ్ములను ఆదుకుంది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి 10 వేల రూపాయల వంతున సాయం అందింది. ఆ మొత్తంతో బాలేరు సెంటర్లో టైలరింగ్ షాపు, బట్టల వ్యాపారం పెట్టుకొన్నా. నాకు వైఎస్సార్ ఆసరా కింద నాలుగేళ్లకు రూ. 18 వేలు, మా అత్త నెయ్యిగాపుల వెంకటమ్మకు వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వంతున అందడంతో ఆ మొత్తాన్ని బట్టల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టాం. మా పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటున్నారు. ఒకరికి అమ్మ ఒడి కింద ఏడాదికి రూ. 15 వేలు వంతున వస్తోంది. మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – నెయ్యిగాపుల రమణమ్మ, అత్తికొత్తూరు (టంకాల మోహనరావు, విలేకరి, భామిని) మా బిడ్డకు ప్రాణం పోశారు మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. మా ఇంటాయన వెంకటేష్ నాయక్ తాపీ పనులు చేస్తుంటారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన మాకు రాజునాయక్(14), ప్రణీత బాయి(8) అనే ఇద్దరు పిల్లలున్నారు. మా అబ్బాయి పుట్టిన ఆరు నెలలకే అస్వస్థతకు గురవ్వడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ప్రతి 20 రోజులకోసారి రక్తం ఎక్కించాలన్నారు. పూట గడవటమే కష్టంగా ఉన్న మాకు వైద్యం చేయించడం కత్తిమీద సాములా మారింది. ఒక్కసారి రక్తం ఎక్కించడానికి రూ.6 వేలు, టాబ్లెట్స్‌కి మరో రూ.4 వేలు ఖర్చయ్యేది. బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి వారు ముఖం చాటేసేవారు. గత ప్రభుత్వం స్పందించకపోవడంతో దాతల సాయంతో హైదరాబాద్, గుంటూరులో తొమ్మిదేళ్లు వైద్యం చేయించాం. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తలసేమియాతో బాధ పడుతున్న మా అబ్బాయికి నెలకు రూ.10 వేలు పింఛను మంజూరు చేశారు. గుంటూరు, నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం చేయించడంతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5 వేలు విలువ చేసే మందులు కూడా ఇస్తున్నారు. దీంతో అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. మా అబ్బాయికి బోన్‌మ్యారో శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. దీనికి రూ.25 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రభుత్వంలోనే ఆ చికిత్స కూడా జరుగుతుందని ఆశిస్తున్నా. మా అబ్బాయిని ఆదుకుంటున్న జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – భూలక్ష్మీబాయి, శ్రీనగర్ (వినుకొండ అజయ్‌కుమార్, విలేకరి, దాచేపల్లి) చింత తీరి హాయిగా జీవిస్తున్నాం మాది చేనేత కుటుంబం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉంటున్న మేము ఇంటిల్లిపాదీ కష్టపడినా రోజువారీ జీవనమే కష్టమయ్యేది. ఏ ప్రభుత్వం కూడా మమ్ములను ఆదుకోలేదు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా బతుకుల్లో మార్పులు వచ్చాయి. మా వృత్తికి సరైన గుర్తింపు లభించడంతోపాటు సంక్షేమ పథకాలతో పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మా ఇద్దరు కుమారుల్లో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందుతోంది. నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందింది. మా అమ్మ పద్మావతికి నెలకు రూ.3 వేల పింఛన్‌తో పాటు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున లబ్ధి చేకూరింది. జగనన్న లే అవుట్లో రూ.5 లక్షల విలువ చేసే స్థలంతో పాటు పక్కా గృహం కూడా మంజూరైంది. ఇటీవలే నా భార్య చూపు మందగించింది. ఆమెను జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. మమ్ములను ఇంత గొప్పగా ఆందుకుంటున్న జగనన్నకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. – నున్నా సురేష్, ఉరవకొండ (బళ్లారి సాదిక్, విలేకరి, ఉరవకొండ) -
ధర్మవరంలో పరిటాల, సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల-సూరి వర్గీయులు ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10-15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెనుకొండలో సోమవారం సాయంత్రం జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ధర్మవరం టీడీపీ టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి విదితమే. చదవండి: నర్రెడ్డి సునీత యాక్షన్.. చంద్రబాబు డైరెక్షన్ -
పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని
కృష్ణా: అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్‌ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసైనికులు.. అభిమానులకు ఉందని తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన జన సైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబు ఓట్లు కావాలి... కానీ సీట్లు ఇవ్వరు. మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్‌గా పెట్టుకోలేదు...175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం. కచ్చితంగా చెబుతున్నా పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే. ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ...వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు, నాదెండ్లను పవన్ కల్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్‌నే కూల్చిపడేసిన చంద్రబాబు, నాదెండ్ల వారికి పవన్ ఎంత?. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లిచ్చాడు. ... జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయి. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్‌కు సిగ్గుండాలి. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ ఫర్ అవ్వవు’ అని కొడాలి నాని అన్నారు. కృష్ణాజిల్లా: సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడని మండిపడ్డారు. ‘నేడు రాష్ట్ర అప్పులు రూ. 4లక్షల కోట్లు ఉంటే... రూ. 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా?. ప్రజలకు అవసరమైనప్పుడు... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం...ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది. చిల్లర రాజకీయ నాయకుడు.. చంద్రబాబు చేస్తేనే సంసారం’ అని కొడాలి నాని అన్నారు. -
చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్
సాక్షి, అమరావతి: అత్యధికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లను చేయి పట్టి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలన్నింటినీ గుర్తించి ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలందించడం, అవకాశాలను అంది పుచ్చుకుంటూ విస్తరించే విధంగా అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయించడం, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది. ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదుకు చర్యలు ఇప్పటికీ ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్ఎంఈలు 45 లక్షలకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని త్వరతగతిన గుర్తించి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేయించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎంఎస్ఎంఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 7.52 లక్షలు కాగా.. వీటిలో 1.6 లక్షల పరిశ్రమలు తయారీ రంగానికి చెందినవి కాగా 5.7 లక్షల యూనిట్లు సేవా రంగానికి చెందినవి. వీటిలో 96 శాతం యూనిట్లు అత్యధికంగా సూక్ష్మ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోళ్లు తప్పనిసరి రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విభాగాలు ఏటా చేసే కొనుగోళ్లలో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ యూనిట్ల నుంచే ఉండాలంటూ జీవోను జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలు మూతపడకుండా చేయూతనిచ్చే విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. అయినా.. కొన్ని ప్రభుత్వ విభాగాలు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నట్టు ప్రభుత్వ దృష్టికి రావడంతో రాష్ట్ర ఎంఎస్ఎంఈలను కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తే అటువంటి బిల్లులకు ఆమోదం తెలపవద్దంటూ ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు చాలా ప్రోత్సాహం లభిస్తుందని ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
పదో తరగతి హాల్‌టికెట్లు సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్‌తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
దస్తగిరి చెప్పేవన్ని అబద్ధాలే
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి.. ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు. దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. -
ఇదే కదా సుపరిపాలన
సాక్షి, విశాఖపట్నం : ‘ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. ప్రజలకవసరమైన అన్ని సేవలనూ అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. విలేజి/అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటుచేశారు. ఫ్యామిలీ డాక్టర్ సదుపాయాన్ని కల్పించారు. పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి చేశారు. ఇవేకాదు.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ఇంకెన్నో సంక్షేమ పథకాలను అవినీతికి ఆస్కారంలేకుండా అందజేస్తున్నారు. ఇదేకదా సుపరిపాలన అంటే?’.. అని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన ‘ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్’ అనే సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక 17 వైద్య కళాశాలలు వస్తే ఇప్పుడు 17 ఏర్పాటుకానున్నాయని.. ఇందులో ఐదింటి నిర్మాణం, అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, చేపట్టిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ప్రభుత్వోద్యోగుల జీతాలు ఇక్కడే ఎక్కువ.. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వోద్యోగుల జీతాలు ఏపీలోనే ఎక్కువని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పోలిస్తే 30 శాతం అధికమని ఆయన తెలిపారు. ఏపీలో 2014లో ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపులు రూ.18,709 కోట్లుంటే 2023–24లో అది రూ.57,222 కోట్లకు పెరిగిందన్నారు. ఏపీకంటే రెట్టింపు ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల జీతాలు రూ.48 వేల కోట్లేనని చెప్పారు. ఉద్యోగుల అలవెన్సులు, పెండింగ్ క్లియరెన్సుపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అజేయ కల్లాం తెలిపారు. 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు.. ఇక ఈ ఐదేళ్లలో 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయని, వీరిలో 1.35 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 13 వేల మందికే ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ ఊరూరా సచివాలయాలను ఏర్పాటుచేసి రాష్ట్రస్థాయి సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకొచ్చారన్నారు. ఈ వ్యవస్థలో జరుగుతున్న అద్భుతాలను చూసి తమిళనాడు, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలు అమలుకు సన్నాహాలు చేస్తున్నాయని.. పాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుజరుగుతోందన్నారు. అలాగే.. సుదీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలుచేస్తున్నారన్నారు. ఇప్పుడు మరో 12 రాష్ట్రాలు దీని అమలుకు ప్రయత్నిస్తున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఈ విషయంలో కొంతమంది న్యాయవాదులు సృష్టిస్తున్న ఆపోహలను నమ్మొద్దని ఆయన కోరారు. 31లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు.. ఇదిలా ఉంటే.. మరే రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, పథకాలు అందజేస్తున్న ఘనత ఒక్క మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు, ఐటీలు, పరిశ్రమలు వస్తున్నాయని.. మరే రాష్ట్రానికి రాని విధంగా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీలో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఇలాఅన్నిటా గత ప్రభుత్వాలకంటే ఎన్నో రెట్లు మెరుౖగెన సుపరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతోందని.. ఈ సుపరిపాలనపై ప్రజలే మంచి తీర్పునిస్తారన్నారు. ఈ సదస్సులో సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ బాలమోహన్‌దాస్, డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ సుధాకర్, కార్తీక్, పలువురు మేధావులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలే ఆలోచింపజేశాయి ‘1997లో ఏపీలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి ఆత్మహత్యలకు కారణాలపై అప్పటి ముఖ్య కార్యదర్శి జన్నత్ హుస్సేన్ నేతృత్వంలో జరిపిన దర్యాç³#్తలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతు పంట పెట్టుబడికి రూ.10 వేలు అప్పుచేస్తే రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తోందని, అప్పుల భారంతో పిల్లలను చదివించలేకపోతున్నారని, ఆరోగ్య సమస్యలకు రూ.వేలల్లో, పిల్లల పెళ్లిళ్లకు లక్షల్లో అప్పులు చేయాల్సి వస్తోందని, వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ఈ వాస్తవాలను మహానేత వైఎస్ గుర్తించారు. సీఎం అయ్యాక దీనిపై ఆలోచించి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటివి అమలుచేశారు’ అని అజేయ కల్లాం వివరించారు. -
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువతకు నైపుణ్య ‘భవిత’ రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ‘భవిత’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. భావి అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ స్కిల్ క్యాస్కేడింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బి.సురేష్ కుమార్ పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘భవిత’ను తీర్చిదిద్దినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 152 యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్‌గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ నిధులతో ఒక్కోటి రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనూ సీఎం ప్రారంభిస్తారు. 2023–24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్‌మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెర్మనీని నిర్వహించనున్నారు. 7న సీఎం అనకాపల్లి రాక సాక్షి, అనకాపల్లి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7న అనకాపల్లి రానున్నారు. వైఎస్సార్ చేయూత చివరి విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌లు సభా స్థలిని పరిశీలించారు. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్‌కు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మలసాల భరత్‌కుమార్ తదితరులున్నారు. -
చిన్నపాటి వ్యాపారంతో చింత తీరింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. చిన్నపాటి వ్యాపారంతో చింత తీరింది మాది నిరుపేద కుటుంబం. విజయనగరం గజపతినగరం మండలం కొణిశ గ్రామ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాం. కుటుంబంలో అందరం రోజు కూలీలమే. ప్రతి రోజూ కూలి లభించేది కాదు. దీంతో రోజు గడవడం కష్టంగా మారింది. మా ఆయన చేసిన కూలీకి వచ్చే డబ్బులు దుబారా చేసేవాడు. ఇంటికి సక్రమంగా ఇచ్చేవాడు కాదు. పిల్లలను పెంచడానికి ఇబ్బంది పడేదాన్ని. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేసుకోగానే ఏడాదికి రూ.పది వేలు వంతున వచ్చింది. దీనికి తోడు వైఎస్సార్ ఆసరా ద్వారా వచ్చిన రూ.12,500 కలిపి ఆ మొత్తంతో ఇంట్లోనే చిన్నపాటి పాన్ షాపు పెట్టుకున్నా. మా అబ్బాయి వినయ్ ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు. అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున మూడేళ్లుగా అందుతోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మామ గారికి పింఛన్ కూడా అందుతోంది. కుటుంబం ఆరి్ధకంగా నిలదొక్కుకుంది. మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – సాంబారిక మంగ, కొణిశ (పాండ్రంకి అప్పలనాయుడు, విలేకరి, గజపతినగరం రూరల్) అద్దె ఇంటి బాధ తప్పింది మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. నాకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు. విజయనగరం జిల్లా జి.సిగడాం మండలం, పెనసాం గ్రామంలో నివాసం. కుటుంబ పోషణ కోసం భార్యా, పిల్లలతో గుంటూరు వలస వెళ్లాను. అక్కడ రోజు వారీ వేతనదారుగా మిర్చి గోదాంలో పనికి చేరాను. రాబడి అంతంత మాత్రమే. అద్దె ఇళ్లలో ఉంటూ అవస్థలు పడ్డాం. ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ చేరుకున్నాం. ఇక్కడ కూడా అద్దె ఇళ్లలోనే నివాసం. కష్టపడిన సొమ్ము అద్దెకే సరిపోయేది. నా భార్య బొంతలు కుడుతూ ఆరి్థకంగా సహకరించినా.. ఎదుగుతున్న పిల్లలు, పెరుగుతున్న వారి అవసరాలు.. నిత్యం ఆందోళనగా ఉండేది. గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి పథకాలు అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది. అమ్మఒడి ఆదుకోవడంతో పిల్లలు బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరాయి. జగనన్న అర్బన్ కాలనీలో సెంటు స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆరి్థక సాయం అందింది. ఇక్కడ సొంత గృహాన్ని కట్టుకున్నాం. ఇటీవలే గృహ ప్రవేశం చేశాం. మమ్మల్ని చూసి నిట్టూర్చిన వారే.. నేడు భుజం తడుతున్నారు. – పిల్లల జగదీశ్వరావు, పాలకొండ (మారోజు కళ్యాణ్‌కుమార్, విలేకరి, పాలకొండ) ధైర్యంగా జీవిస్తున్నాం మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. భార్య, ఇద్దరు కూతుళ్లను పోషించుకునేందుకు నానా పాట్లు పడ్డాను. చివరకు బతుకు తెరువుకోసం కువైట్ వెళ్లాను. 2018లో పక్షవాతం రావడంతో సొంత ఊరైన వైఎస్సార్ జిల్లా చాపాడు గ్రామానికి తిరిగొచ్చేశా. ఉన్న కాస్త డబ్బులూ వైద్యానికే ఖర్చయిపోయాయి. జీవనోపాధి లేక, కుటుంబ పోషణకు ఎన్ని నిద్రలేని రాత్రుళ్లు గడిపానో భగవంతుడికే తెలుసు. 2019లో జగనన్న అధికారంలోకి వచ్చాక మా బాధలు తీరాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఆసరాగా నిలిచాయి. పెరాలసిస్ రోగిని కావడంతో ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.5 వేలు పింఛన్ అందుతోంది. రైతు భరోసా పథకంలో ఏటా రూ.13,500 మా బ్యాంకు ఖాతాలో జమవుతున్నాయి. నా భార్య మాబుఛాన్కు వైఎస్సార్ చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున అందింది. ఆసరా పథకంలో ఏటా రూ.7,200 బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. నా కుమార్తె కౌసర్‌భాను గ్రామ వలంటీర్‌గా చేస్తోంది. మరో కుమార్తె ముబారక్ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తోంది. ఉన్న కాస్త పొలంలో ఓపిక ఉన్నంత మేరకు వ్యవసాయం చేసుకుంటూ, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో కుటుంబాన్ని ధైర్యంగా పోషించుకోగలుగుతున్నా. మాలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – కొర్రపాటి అబ్దుల్ రసూల్, చాపాడు గ్రామం (శ్రీపతి సుబ్బయ్య, విలేకరి, చాపాడు) -
గ‘లీజు’ గురివింద!
సాక్షి, విశాఖపట్నం : పచ్చకామెర్ల బాధితులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది! అద్దె స్థలానికి ఎసరు పెట్టిన గురివిందకు.. అనుమతులున్న స్థలాలు అక్రమమే అనిపిస్తాయి! బంధువుల భూమినే కాజేసిన భూ రాబందుకు..సొంత భూమిలో ఎవరు నిర్మాణాలు చేపడుతున్నా గిట్టదు! అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసినట్లుగా.. తనను అక్కున చేర్చుకొని ఆదరించిన విశాఖపై బురద చల్లుతున్న ఈనాడు రామోజీ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు ఉలిక్కిపడి విషం చిమ్ముతున్నారు. ఇన్నాళ్లూ రుషికొండపై నానా యాగీ చేసిన ఈనాడు ఇప్పుడు అక్కడ భవనాలు ప్రారంభం కావడంతో మరో బురద జల్లుడు కార్యక్రమానికి తెగబడింది. అన్ని అనుమతులూ తీసుకుని ఓ దిగ్గజ సంస్థ సొంత భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే అదేదో నేరమన్నట్లుగా దిగజారుడు కథనాలను ప్రచురించింది. విశాఖ తీరానికి తూట్లు పొడుస్తున్నారంటూ రామోజీ శోకాలు పెట్టారు. విశాఖలో లక్షల ఎకరాల భూ రికార్డులను మాయం చేసిన చరిత్ర టీడీపీదే. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న ఘనత చంద్రబాబుదే. వాస్తవానికి భీమిలిలో కొంత భూమిని కొనుగోలు చేసిన దిగ్గజ సంస్థ అరబిందో సీఆర్‌జెడ్ నిబంధనలకు లోబడి అన్ని అనుమతులూ తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈనాడుకు మాత్రం అది దేశద్రోహంలా కనిపిస్తోంది. సంతకాలు ఫోర్జరీ.. పచ్చళ్లు అమ్ముకుంటూ వచ్చిన రామోజీని విశాఖ నగరం అక్కున చేర్చుకుంది. అయితే ఆయన తన వ్యాపార విస్తరణకు సహకరించిన నగరాన్నే మింగేసే వైట్ కాలర్ క్రిమినల్‌గా మారిపోయారు! కుటుంబ సభ్యుల్ని మోసగించిన వ్యక్తిగా... బంధువుల్ని కోర్టుల చుట్టూ తిప్పి వారి భూముల్ని కొల్లగొట్టిన వ్యాపారిగా.. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలకు మూలపురుషుడుగా రామోజీ మిగిలిపోయారు. విశాఖలో కబ్జాలకు, గలీజు దందాలకు ఆద్యుడిగా నిలిచారు. 1974లో విశాఖలోని సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్ల లీజుకు మంతెన ఆదిత్యవర్మ నుంచి లీజుకు తీసుకున్న రామోజీ గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తిరిగి కోర్టులో కేసు వేశారు. స్థలం యజమానికి తెలియకుండా కొంత భూమిని రోడ్డు విస్తరణకు అప్పగించి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి కొంత స్థలాన్ని పొందారు. రామోజీ దాన్ని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. లీజు స్థలాన్ని తన సొంతమని పేర్కొంటూ ప్రభుత్వానికి అప్పగించటం.. ప్రతిఫలంగా పొందిన స్థలాన్ని రామోజీ రిజిస్టర్ చేసుకుని మోసపూరితంగా వ్యవహరించడంతో యజమాని మంతెన ఆదిత్యవర్మ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీన్నుంచి తప్పించుకునేందుకు రామోజీ ఏకంగా విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను ఫోర్జరీ చేయడం గమనార్హం. ఫోర్జరీకి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు తేలడంతో న్యాయస్థానం రామోజీపై కేసు నమోదుకు ఆదేశించగా స్టే తెచ్చుకున్నారు. దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ ఫోర్జరీకి సంబంధించి రామోజీకి చీవాట్లు పెట్టడంతో బిల్డింగ్ కొట్టేద్దామన్న ప్రయత్నాలు విఫలమై గత్యంతరం లేక ఆ స్థలాన్ని యజమానికి అప్పగించారు. కబ్జా ‘కార్యాలయం’ కనిపించలేదా? దసపల్లా భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో కొంత భాగాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించేందుకు కేటాయించుకున్నారు. నగరం నడిబొడ్డున సర్వే నం 1196లో 2 వేల గజాల్ని కారుచౌకగా అప్పగించేశారు. ఇది చాలదన్నట్లుగా పక్కన ఉన్న కొండని సైతం తొలిచేసి 100 నుంచి 300 గజాల్ని ఆక్రమించేసి భవనాన్ని నిర్మించుకుంటే రామోజీ కళ్లు మూసుకున్నారు. మరోవైపు ఇల్లు నిర్మించుకునేందుకు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించిన నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ తన కలల సౌధాన్ని కట్టుకున్నారు. ఆ కబ్జా కాండ బయటకు రాకుండా రామోజీ అడ్డుపడ్డారు. దీన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడి భూ యజమానితో బేరసారాలకు దిగారు. విద్యాలయం పేరుతో విధ్వంసం.. టీడీపీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండు ఎకరాల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్శిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తుంటే విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తున్నారంటూ నాడు రామోజీ బురద చల్లేందుకు ప్రయత్నించారు. -
6న రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించి వారం తిరగకముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలు ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తూ ఐదేళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పైసా కూడా బకాయి పెట్టకూడదన్న సంకల్పంతో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేస్తోంది. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్‌లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాల (వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించి సీజన్ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితులతో 14,23,995.5 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. 22 జిల్లాల్లో మిచాంగ్ ప్రభావం మిచాంగ్ తుపాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. భారమైనా పెట్టుబడి రాయితీ పెంపు కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా దాన్ని రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్‌కు రూ.6800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని రూ.8500కు పెంచారు. నీటి పారుదల భూములైతే గతంలో రూ.13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని రూ.17 వేలకు పెంచారు. వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500 చొప్పున, మల్బరీకి రూ.4800 నుంచి రూ.6వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదేళ్లలో రూ.3,271 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 2023–24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈనెల 6వతేదీన రూ.1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల వల్ల వైద్యరంగంలో గొప్ప మార్పులు వచ్చాయని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఐఎంఏ ఏపీ స్టేట్ జోన్–3 రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం చేరువైందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుల ద్వారా 50 రోజుల్లోనే 60 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యం, ఆరోగ్యం విషయాల్లో మన రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. గతంలో వైద్య రంగానికి సంబంధించి మన రాష్ట్రం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల కంటే దిగువన ఉండేదని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా ఏపీ ముందు వరుసలో ఉందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణీందర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సమీకృత వైద్యాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందని, ఇది మంచిది కాదన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా పలువురు వైద్యులు చేసిన అరుదైన శస్త్రచికిత్సల గురించి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జీవీజీ మహేష్, డాక్టర్ త్యాగరాజరెడ్డి, డాక్టర్ ఇ.సాయిప్రసాద్, డాక్టర్ హేమలత, వసుధ, డాక్టర్ హరీ‹Ùకుమార్, అప్నా ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.