AP Special
-
‘మహిళా సమ్మాన్ సేవింగ్స్’లో ఏపీ సత్తా
సాక్షి, అమరావతి: మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్నాటక రాష్ట్రాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలు, బాలికల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన చిన్న పొదుపు పథకం ఇది. పోస్టాఫీసులతో పాటు నిర్దేశించిన బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశ వ్యాప్తంగా 24,13,500 మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఖతాలుండగా.. ఏపీ 1.35 లక్షల ఖాతాలతో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మహిళా సేవింగ్ సర్టిఫికెట్ అనేది ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. స్థిరంగా రెండేళ్ల పాటు మహిళలు, బాలికల పేర్న గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం అయినందున దీనికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిని ఆడపిల్ల లేదా మహిళల పేర్న మాత్రమే చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఖాతా తెరిచినప్పటి నుంచి కనీసం మూడు నెలల తర్వాత ఒక మహిళ లేదా ఆడపిల్ల సంరక్షకుడు రెండో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను తెరవొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. అంటే ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత ఖాతాదారుడికి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఏడాది తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఉంది. ప్రయోజనాలు.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలో రూ.2,00,000 పెట్టుబడి పెడితే ఏడాదికి 7.5 శాతం వడ్డీ పొందుతారు. మొదటి సంవత్సరంలో, అసలు మొత్తంపై రూ.15,000 వడ్డీని పొందుతారు. రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీని పొందుతారు. -
ఐబీకి దగ్గరగా ఏపీ విద్యా విధానాలు
సంబేపల్లె: ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తోన్న విద్యా విధానాలు ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబీ)కి దగ్గరగా ఉన్నాయని ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమల్లోకి రానున్న దృష్ట్యా అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు వెండిగీన్ (అమెరికా) ఎరిక్ బాబర్ (ఇంగ్లండ్) సందర్శించారు. వీరు నాడు–నేడు ద్వారా సమకూరిన తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల గురించి ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అమలవుతోన్న విద్యా విధానం, విద్యార్థుల అభ్యసన విధానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఎలా దోహదపడుతున్నాయనేది పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లను చూసి వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నారు. బైజూస్ ట్యాబ్స్, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా తాము ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నామో విద్యార్థులు వీరికి వివరించారు. అంతర్జాతీయ ప్రతినిధులు పాఠశాలలోని జగనన్న గోరుముద్దను తిన్నారు. పాఠశాలలో డిజిటల్ విద్య, ద్విభాష పాఠ్యపుస్తకాలు, లైబ్రరీ, యూనిఫామ్, భౌతిక, జీవనశాస్త్ర ప్రయోగశాలను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రధానోపాధ్యాయుడిని అభినందించారు. ఎస్సీఈఆర్టీ అధ్యాపకుడు గిరిబాబు యాదవ్ మాట్లాడుతూ 2035కి పదోతరగతికి, 2037కి 12వ తరగతికి ఐబీ సిలబస్‌ను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు ఐబీ కరిక్యులం అంతర్జాతీయ ప్రతినిధులు ఏపీలోని పలు పాఠశాలలను సందర్శిస్తున్నారని చెప్పారు. -
ఏపీ ఆక్వా చట్టాలు దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఆక్వారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, చట్టాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేంద్రం కితాబునిచ్చింది. రాష్ట్రంలో ఆక్వారంగం బలోపేతం కోసం అవసరమైన తోడ్పాటు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, నీతి ఆయోగ్ సీఈవో పీవీఆర్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ జాతీయ సలహాదారు నీలం పటేల్ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు న్యూఢిల్లీ వెళ్లిన ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం శుక్రవారం వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆక్వారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందుచూపుతో అడుగులు వేస్తున్నారని, ఈ రంగంలో తెచ్చిన సంస్కరణలు నిజంగా ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్‌లో ఆక్వారంగం మరింత పుంజుకునేందుకు ఇవి ఎంతో దోహద పడతాయన్నారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా సాగు గుర్తింపు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆన్లైన్ ద్వారా లైసెన్సుల జారీ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. జాతీయ స్థాయిలో ఆచరించతగ్గ కార్యక్రమాలని చెప్పారు. ఏపీ ఆక్వా కార్యక్రమాలను ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించినపుడు స్వయంగా చూశామన్నారు. 15 రోజులకోసారి సమీక్ష రాష్ట్రంలో ఆక్వా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం కేంద్రమంత్రికి, నీతి ఆయోగ్ సీఈవోకు వివరించారు. ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నం.1 స్థానంలో ఉందన్నారు. ఈ రంగం బలోపేతం కోసం సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తున్నారని అన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన అప్సడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చారని, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం ఏపీ సీడ్, ఫీడ్ యాక్టులను తీసుకొచ్చారని చెప్పారు. ప్రతీ 15 రోజులకోసారి అప్సడా ఆధ్వర్యంలో రైతులు, ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఇప్పటి వరకు రూ. 3,420 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించిందన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో మాట్లాడుతూ.. ఏపీలో జాతీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, తాము అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపితే ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
పేద పిల్లల కోసమే ‘జగన్నాథ’ రథం: పామర్రులో సీఎం జగన్
సాక్షి,కృష్ణాజిల్లా: చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి సీఎం జగన్ విడుదల చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యాదీవెన అని తెలిపారు. ‘రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మంది పిల్లలు 9 లక్షల 44వేల 666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతోంది. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్‌కు అర్హులుగా చేసేందుకు ఆదాయపరిమితిని 2 లక్షల దాకా పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం. గతంలో ఇంతే ఫీజులు కడుతాం.. ఇంత కంటే ఎక్కువ కట్టం.. మీ చావులు మీరు చావండి అన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నాం. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలలుగా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నాం. 57 నెలల్లో 29 లక్షల మందికి రూ.12 వేల కోట్లు.. అక్టోబర్,నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించిన రూ.708 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి ఈ వేదిక నుంచి నేరుగా పంపిస్తున్నాం. వీటితో కలుపుకుని గత 57 నెలలలో 29 లక్షల 60 వేల మందికి రూ.12వేల609 కోట్ల రూపాయలను విద్యా దీవెన కింద జమ చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4275 కోట్లు చెల్లించాం. ఈ ఏప్రిల్‌లో విడుదల చేయనున్న నిధులను కూడా కలిపితే రెండు పథకాల మీద పెట్టిన మొత్తం రూ.18 వేల కోట్ల రూపాయలు అని చెప్పేందుకు గర్వపడుతున్నా. ఒక్క విద్యారంగంలో స్కీములకే ఐదేళ్లలో రూ.73 వేల కోట్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాం. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం. పేదింటి పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీ సీఈవోలుగా చేయాలని, పేదల తలరాతలుగా మారాలని ఈ 57 నెలల కాలంలో అడుగులు వేస్తూ వచ్చాం. మేం చేసిన మార్పుల వల్ల విద్యా విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలి. 3 ఏళ్ల పిల్లల నుంచి 23 ఏళ్లలోపు పిల్లలు శతమానంభవతి అనే విధంగా మరో 100 ఏళ్లు జీవించాల్సిన జనరేషన్. ఈ జనరేషన్ పోటీపడేది ప్రపంచస్థాయిలో. గత 30 ఏళ్లలో చదువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే సరిపోదు. ప్రస్తుతం క్వాలిటీ చదువులు కావాలి. ఇది గమనించాను కాబట్టే పెద్ద పెద్ద స్థానాల్లో పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాం. ఒకటవ తరగతిలో మనం వేసే విత్తనం 15 ఏళ్లలో చెట్టవుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుండేలా పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలని కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెడితే ఉన్నత చదువుల దాకా గొప్ప మార్పులు తీసుకువచ్చాం. నాడు నేడుతో ప్రభుత్వ బడులను ప్రక్షాళన చేశాం. ఇంగ్లీష్ మీడియంతో పాటు స్కూళ్లలో సీబీఎస్, ఐబీ సిలబస్ తీసుకువచ్చాం. ఇంగ్లీష్ మీడియం అంటే యుద్ధమే చేస్తున్నారు.. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకు రావాలని ఆరాట పడితే చంద్రబాబు, రామోజీరావు, పవన్‌కళ్యాణ్‌తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లెవ్వరి పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదు. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం నానా యాగీ చేసి మన మీద యుద్ధమే చేస్తున్నారు. పెత్తందారులైన వారికో ధర్మమట.. మీకో ధర్మమట.. వారికో బడులట.. మనకో బడులట.. వారి పిల్లలకు ఒక చదువుట.. మనకు ఒక చదువులట.. పెత్తందారులు వారట.. పనివాళ్లం మనమట.. పరిశ్రమలు వారివట.. కార్మికులం మనమట. వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. పిల్లలకు జగన్ ట్యాబులిస్తే మాత్రం ఏవేవో చూస్తూ వారు చెడిపోతున్నారని యాగీ చేస్తారు. మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలన్న వారి మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. విద్యారంగంలో పెత్తందారులకు పేదలకు మధ్య క్లాస్ వార్ జరుగుతోంది. డబ్బులున్నవాళ్లకు, డబ్బు లేని వాళ్లకు ఒక యుద్ధం జరగుతోంది. మీ అన్నగా మీ తరపున విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చాం. ఈ అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పేదల పిల్లలు, పేదలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోంది.. చంద్రబాబు ఆయన మనుషులు, పెత్తందారుల భావజాలాల మీద తిరుగుబాటుగానే విదేశీ విద్యాలయాల్లోని కోర్సులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. మూడవ తరగతిలోనే మన ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. మూడవ తరగతిలోనే టోఫెల్ ఓరియెంటేషన్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. బై లింగ్విల్ టెక్స్ట్ బుక్స్ తీసుకువచ్చాం. బైజూస్ కంటెంట్‌ను పేద పిల్లకు అందించాం. పిల్లలు డిజిటల్ యుగాన్ని శాసించాలని 8వ తరగతిలోనే పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. నాడునేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ప్రతి ఏటా అమ్మ ఒడి కింద తల్లులకు ప్రోత్సాహం కింద రూ.15వేల రూపాయలు ఇస్తున్నాం. స్కూలుకు వెళ్లే పిల్లలకు గోరుముద్ద కింత పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన కాలేజీ పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది మన కళ్లతో మనమే చూశాం. ఇదంతా ఈ 57 నెలల్లోనే కనిపిస్తోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఈ 57 నెలల్లోనే వంద శాతం ఫీజులు, వసతి ఖర్చులు చెల్లిస్తున్నాం. విదేశీ యూనివర్సిటీల్లో ఒక్కొక్కరికి రూ.కోటి 25 లక్షల ఫీజు.. ప్రపంచస్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలకు రూ.కోటి 25 లక్షల దాకా ఫీజులు కడుతున్నాం. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువచ్చి జాబ్ ఓరియెంటెడ్‌గా మార్చాం. సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులు తీసుకువచ్చాం. చదువుల్లోకి ఏఐ, ఎంఎల్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ తీసుకువచ్చాం. మన కాలేజీల్లో డిగ్రీలు చదవడం వల్ల మనకు ఇబ్బందులు రాకూడదని సబ్జెక్ట్‌లో మార్పులు తీసుకువచ్చి ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చాం. మన కరిక్యులమ్‌లో భాగంగా ఎంఐటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకమనిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు తీసుకువచ్చాం. విదేశీ విద్యాలయాల వల్లే చదువులు చెప్పి వాల్లే సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. పేదరికం సంకెళ్లను పేద పిల్లలు తెంచుకోవాలనే విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చాం. దీంతో వచ్చే పది పదేహేనేళ్లలో ఎంఎన్సీలలో ఉద్యోగాలు వచ్చి బతుకులు, తలరాతలు మారతాయి. చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా చేసి ఆయన చేసిన మంచి ఏమిటో చేయాలని ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ బడికి చంద్రబాబు చేసిన మంచేమిటని అడిగితే ఎవరికీ ఏదీ గుర్తుకు రాదు. పేదపిల్లలు, వారి చదువుల కోసం చెబితే ఏదీ గుర్తుకు రాదు. ఆయన చేసిన చెడు మాత్రం గుర్తుకు వస్తుంది. ప్రభుత్వ బడిని నీరుగార్చింది చంద్రబాబే.. ప్రభుత్వ బడిని నీరుగార్చించి చంద్రబాబునాయుడు. తన కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్యలను పోషించింది చంద్రబాబునాయుడు. పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో అనేదానిపై కనీసం ధ్యాస పెట్టిన పాపాన చంద్రబాబునాయుడు పోలేదు. నాడు,నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, కరిక్యులమ్లలో మార్పులు బాబు హయాంలో ఏవీ లేవు. 14 ఏళ్లు సీఎంగా చేసినపుడు రైతులకు, గ్రామాలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లలకు చంద్రబాబు మంచి చేసిన పాపాన పోలేదు. ఈరోజు మారీచులతో మేం యుద్ధం చేస్తున్నాం. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టమేమిటో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పిల్లల చదువులుండవు, ఇంఘ్లీష్ మీడియం ఉండదు. పిల్లలను పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య శ్రీ ఉండవు. వ్యవసాయం గాలికిపోతుంది. రైతన్న చిన్నాభిన్నమవుతాడు. వాళ్లు చెప్పేఅబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెప్తారు. మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారో ఆలోచన చేయండి. మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరు సైనికుల్లా ఉండండి’ అని సీఎం జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్, ఉన్నతాధికారులు, కలెక్టర్ పాల్గొన్నారు. -
‘ అన్నా.. అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లారు. అయితే విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సీఎం జగన్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులై ఉన్న సమయంలో ఇద్దరు విద్యాదీవెన లబ్ధిదారులు తమ అనుభవాలను అమూల్యమైన ప్రసంగం ద్వారా పంచుకున్నారు. ‘ మీరు సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం’ అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్ తర్వాత నాన్నకు హార్ట్ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్ సీట్ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్‌కు వెళ్ళకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇచ్చారు, మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ. - శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యాదీవెన లబ్ధిదారు ‘అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’ మాదొక పేద కుటుంబం.. మా నాన్నగారు ప్రైవేటు ఉద్యోగి. మా నాన్న గారి జీతం మీద మా ఇల్లు నడుస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను..ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అదే కాలేజ్‌కి వెళ్లినప్పుడు చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలి అనుకున్నాను. కానీ అప్పుడు మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు మీరొచ్చారన్నా.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వచ్చారు అన్నా. విద్యా దీవెన పథకం ద్వారా నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నారన్నా. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తాను చెల్లి అంటూ మీరు మరో అడుగు వేశారన్నా. మీ దీవెనలతోనే నేను ఎక్కడైతే చదవాలని అనుకున్నానో అక్కడే చదవుతున్నాను అన్నా. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లీష్ రైటర్ టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు, మీరు కూడా టెన్‌థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ. -దిల్షాద్, విద్యాదీవెన లబ్ధిదారు -
రైతుల పాలిట ‘కలప’తరువులా సర్కారు నిర్ణయం
సాక్షి, అమరావతి: జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు, ఇతర కాగితపు గుజ్జు కలప సాగుదారులకు మరింత మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అటవీ శాఖ పరిధిలోని యూకలిప్టస్, సరుగుడు తోటల వేలం పాటలను ప్రభుత్వం నిలిపివేసింది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు. రైతుల ప్రయోజనార్థం వేలం వాయిదా వేయాలని కోరగా.. అటవీ శాఖకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తక్షణమే వేలాన్ని నిలిపివేస్తూ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తమ అభ్యర్థనకు మంత్రులు కాకాణి, పెద్దిరెడ్డి స్పందించిన తీరు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రస్తుతం పలుకుతున్న ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో సుబాబుల్ టన్ను ధర రూ.5 వేలు, యూకలిప్టస్ ధర రూ.6 వేలకు పైగా పలికే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది రాష్ట్రంలో 1,04,985 మంది రైతులు 3,28,954 ఎకరాల్లో సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. ఏటా రూ.35 లక్షల టన్నులకుపైగా దిగుబడులొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టన్ను సుబాబుల్ రూ.4,200, యూకలిప్టస్ రూ.4,400గా ధర నిర్ణయించగా.. ఏనాడూ ఈ ధర లభించిన దాఖలాలు లేవు. గతంలో కంపెనీలు కోరుకున్న చోటకు తీసుకొస్తే కాని కొనుగోలు చేసేవారు కాదు. కటింగ్, డీ బార్కింగ్, లోడింగ్, వే బ్రిడ్జి, రవాణా చార్జీల రూపంలో టన్నుకు రూ.800కు పైగా రైతులకు ఖర్చయ్యేది. కంపెనీలు చెల్లించే మొత్తంలో ఖర్చులు పోనూ రైతులకు టన్నుకు రూ.వెయ్యి మిగలడం కష్టంగా ఉండేది. గతంలో సరైన మార్కెటింగ్ సౌకర్యాల్లేక నష్టాలను చవిచూసిన ఈ రైతులకు గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. రైతు క్షేత్రం నుంచే కొనుగోలు ప్రభుత్వ కృషి ఫలితంగా రైతు క్షేత్రం వద్దే కొనుగోలు చేసేందుకు 20కు పైగా కంపెనీలు ముందుకొచ్చాయి. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కంపెనీలు సైతం ఏపీకి క్యూ కట్టాయి. ఈ పంట ద్వారా నమోదు చేయడమేకాకుండా, దళారీలకు చెక్‌పెట్టేలా క్రయ విక్రయాలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షించడం, ట్రేడర్లను ఎంచుకునే వెసులుబాటు కూడా రైతులకే కల్పించడం, నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడం, ఇరువురి అంగీకారంతో నిర్ధేశించిన తేదీన కోత కోయించి కలపను రైతు క్షేత్రం నుంచే తీసుకెళ్లడం వంటి చర్యల ఫలితంగా గతం కంటే మెరుగైన ధరలను రైతులు పొందగలిగారు. రైతుల అభ్యర్థనతో వేలం పాటలకు బ్రేకు ప్రస్తుతం రైతు క్షేత్రం వద్దే టన్ను సుబాబుల్‌కు రూ.4,500–రూ.4,800, యూకలిప్టస్‌కు రూ.5,000–రూ.5,500 మధ్య ధర లభిస్తోంది. ప్రస్తుతం రైతుకు దక్కే ధరలను స్థిరీకరించడమే కాకుండా మరింత పెరిగేలా చర్యలు చేపట్టింది. అటవీ శాఖ పరిధిలో 7,500 హెక్టార్లలో సుబాబుల్, యూకలిప్టస్ తోటలకు శుక్రవారం వేలం పాటలు నిర్వహించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. మరో 2 నెలల్లో పంట కోతకొచ్చే దశలో వేలం నిర్వహిస్తే తమకు ఆశించిన ధర దక్కదని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం వేలం పాటల్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. క్షణం ఆలోచించకుండా ఆదేశాలు గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కలప గుజ్జు రైతులకు గడచిన ఐదేళ్లుగా మంచి ధర లభించేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా రైతు క్షేత్రం వద్దే టన్నుకు రూ.4,500కు పైగా ధర లభిస్తోంది. రైతుల అభ్యర్థన మేరకు వేలం పాటల్ని నిలిపి వేయాలని కోరగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్షణం కూడా ఆలోచించకుండా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతు క్షేత్రం వద్ద కలపగుజ్జు ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి -
వ్యవసాయంలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ స్థాయిలో నెలకొల్పిన వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) వ్యవస్థ రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. రైతులకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా అన్నదాతలకు చేరువ చేస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయ అధికారులూ క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలుగా సహాయ పడుతున్నారు. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టి, సమర్ధంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర పథకాలపైనా పూర్తి స్థాయిలో అవగాహన పెరగడానికి దోహదపడింది. ఈ పథకాలను ఏపీ రైతులు సమర్ధంగా వినియోగించుకుంటున్నారు. పథకాల అమలు, రైతులకు అవగాహన కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాలపై రైతుల అవగాహనపై నాబార్డు నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. ప్రధానంగా రుణాలు, బీమా, నిల్వ, మార్కెటింగ్‌పై రైతుల్లో అవగాహన, రైతులకు పథకాల అనుకూలత తదితర అంశాలపై నాబార్డు సర్వే నిర్వహించి, నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల పట్ల దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు అత్యధిక అవగాహన ఉందని ఈ సర్వే తెలిపింది. రైతులకు సీఎం జగన్ ఇచ్చిన ‘భరోసా’ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం పట్ల రైతుల్లో సానుకూలత నెలకొందని, వారికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉందని సర్వే పేర్కొంది. కిసాన్ క్రెడిట్ కార్డు (కెసీసీ)ల పట్ల ఏపీ రైతుల్లో అత్యధికంగా 86 శాతం అవగాహన ఉందని, మహారాష్ట్రలో కేవలం 27 శాతమే అవగాహన ఉందని తెలిపింది. ఆంధ్రఫ్రదేశ్ రైతుల్లో పంటల బీమా పథకాల పట్ల అత్యధిక అవగాహన ఉందని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమేనని పేర్కొంది. దీంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల పట్ల కూడా ఏపీ రైతుల్లో పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చెప్పింది. పంటల బీమా పథకంపై ఏపీ రైతుల్లో 83 శాతం, రాజస్థాన్ రైతుల్లో 66 శాతం అవగాహన ఉందని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు ఏపీనే ఆదర్శం వివిధ పథకాలు, పంటల బీమా అమలు, అవగాహనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇతర రాష్ట్రాలకు ఓ మంచి ఉదాహరణ అని నాబార్డు తెలిపింది. ఏపీలో ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారి ఉన్నారు. ఆ అధికారి ప్రతి నెలా రైతులకు సంబంధించిన పథకాలపై సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు భరోసా కేంద్రాల వారీగా గ్రామ స్థాయిలో వలంటీర్లు ప్రతి గ్రామంలో సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ రైతులకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వివిధ పథకాలపై రైతులతో దరఖాస్తులు చేయించడం, పునరుద్ధరణ, సమస్యలు, క్లెయిమ్స్ పరిష్కారాల్లో వలంటీర్లు సహకరిస్తున్నారు. అలాగే ఈ–క్రాప్ పోర్టల్–అప్లికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో రైతులు, పంటలు మొదలైన వాటి గురించి సమాచారం ఉంటుంది. పంటల బీమా, క్లెయిమ్‌ల సమాచారం పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. రైతులు సాగు కోసం చేసిన వ్యయం, క్లెయిమ్ మొత్తాన్ని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు క్లెయిమ్ మొత్తాన్ని బదిలీ చేస్తోంది. ఇది ఈ–యాప్‌తో సాధ్యమవుతోంది అని నాబార్డు తెలిపింది. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం, పథకాలను వినియోగించుకోవడంలో రైతుల్లో అవగాహన చాలా బాగుందని, ఇది రైతు భరోసా కేంద్రాల ఫలితమేనని నాబార్డు సర్వే వివరించింది. -
పోతుందనుకున్న ప్రాణం నిలబడింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పోతుందనుకున్న ప్రాణం నిలబడింది మాది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సెలూన్ షాపు నడుపుకుంటున్నా. నాకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నాలుగేళ్ల కిందట ఉదర సంబంధిత అనారోగ్యంతో మంచం పట్టాను. చికిత్స చేయించుకుందామంటే ఆరి్థక పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటి దీన పరిస్థితిలో జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 2,64,626 విలువైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించి ప్రాణం నిలబెట్టింది. శస్త్రచికిత్స అనంతరం మందుల ఖర్చులు, రవాణా ఖర్చులకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా రూ.28,900 నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సెలూన్ షాపు ఉండటంతో జగనన్న చేదోడు కింద ఏటా రూ.10,000 వంతున అందింది. షాపునకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. నా భార్యకు వైఎస్సార్ ఆసరా కింద రూ.20,848, పెద్ద కొడుకు పవన్సాయికి విద్యా దీవెన కింద రూ.12,000, చిన్న కొడుకు ఆదిత్యసాయికి అమ్మఒడి కింద రూ.30,000 వచ్చాయి. టీడీపీ ప్రభుత్వ పాలనలో మాకు ఎలాంటి లబ్ధి కలగలేదు. నా ప్రాణం నిలబెట్టిన, మా కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన సీఎం జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – అజ్జాడ సింహాచలం, కురుపాం (కె.చంద్రమౌళి, విలేకరి, కురుపాం) సర్కారు సాయంతో హాయిగా జీవనం నాకు ఐదుగురు సంతానం. అందరికీ వివాహాలు చేశా. ఎవరి బతుకులు వాళ్లు బతుకున్నారు. నా భర్త చనిపోయి నాలుగేళ్లయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా బిడ్డలపై ఆధారపడకుండా ధైర్యంగా బతుకుతున్నా. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో జీవిస్తున్నా. ఒంటరిగా బతుకుతున్నానన్న బాధ ఏ రోజూ కలగలేదు. ప్రతినెలా వితంతు పింఛన్ అందుకుంటున్నా. ఈ సొమ్ము నా నెలవారీ ఖర్చుకు సరిపోతుంది. వైఎస్సార్ ఆసరా కింద రూ.30,144 రుణమాఫీ సొమ్ముని నా ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 వంతున అందింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.4,898 జమయ్యింది. చిత్తశుద్ధితో నాలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – కాకరపర్తి మంగాయమ్మ, పశివేదల (జి.వి.వి.సత్యనారాయణ,విలేకరి, కొవ్వూరు) ఒంటరి బతుక్కి ప్రభుత్వం అండ భర్తను కోల్పోయి, పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు జగనన్న ప్రభుత్వం అడుగడుగునా చేదోడుగా నిలిచింది. నా భర్త సుబ్బారావు పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం గ్రామంలో టైలరింగ్ వృత్తి చేసుకుంటూ ఆడ పిల్లలిద్దర్ని పెంచి, పెద్దచేసి పెళ్లి చేశా. కొడుకు పృధ్విని పీజీ వరకు చదివించా. నాకు వితంతు పింఛన్ మంజూరైంది. అప్పుడు రూ.200 ఇచ్చేవారు. తర్వాత రూ.2 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే పనులు మానేసి, పంచాయతీ ఆఫీసు వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. పింఛన్ కోసం కూలి పనుల్ని వదులుకున్న రోజులూ ఉన్నాయి. జగనన్న ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.3 వేలకు పెరిగింది. వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికొచ్చి మరీ పింఛన్ డబ్బులు అందిస్తున్నారు. మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.15 వేలు లబ్ధి కలిగింది. టైలర్లకు ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమవుతోంది. వైఎస్సార్ ఆసరా ద్వారా ఏటా రూ.3 వేలు చొప్పున అందింది. ప్రభుత్వం అందిస్తున్న సాయం, కుట్టు మిషన్ ద్వారా వస్తున్న ఆదాయంతో ఆనందంగా బతుకుతున్నా. మాలాంటి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. – మేరువ బుజ్జమ్మ, సిద్దవటం (పాలెం శ్రీనివాసబాబు, విలేకరి, సిద్దవటం) -
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
నిర్వాసితులకు వారున్న కాలనీల్లోనే ఓటుహక్కు
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు వారు నివాసం ఉండే ఆర్అండ్ ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించినా తట్టుకోలేని ‘ఈనాడు’ అబద్ధాలు, అసత్యాలతో కూడిన కథనాన్ని బుధవారం అచ్చేసింది. అధికారులు ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారమే ఓట్లు మార్పు చేస్తే ఏదో మహా పాపం జరిగిపోయినట్టు పతాక శీర్షికలో ‘ఈ అరాచకం అనంతం’ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలో ఉన్న గిరిజనేతరులకు గోకవరం మండలంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు కృష్ణునిపాలెం సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి 1,282 కుటుంబాలకు పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఈనాడు కథనం పూర్తి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. అంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే.. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో నివసిస్తున్న 2,475 మంది ఓటర్లను జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చినట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తొయ్యేరులోని 237, 238, 239 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈ ఓటర్లందరినీ రెండేళ్ల క్రితం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసేందుకు అప్పటి దేవీపట్నం తహసీల్దార్ సిఫారసు చేశారన్నారు. ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఓట్లను మార్చే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితోనే ఓట్లు మార్పు జరిగిందని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌కు, అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్లి.. తిరిగి జిల్లా కలెక్టర్‌కు అనుమతులు వచ్చాకే ఓట్ల మార్పు సాధ్యపడుతుందని వివరించారు. నిబంధనల ప్రకారమే.. రెండేళ్ల క్రితమే నిర్వాసితుల ఓట్లు మార్చితే ఇప్పుడు ఈనాడు పత్రిక అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించామన్నారు. దొంగ ఓట్లు, వేరే రాష్ట్రాల వారి ఓట్లేమీ చేర్చలేదు కదా అని నిలదీశారు. ఓటు మార్చడంలో తప్పేముంది?పోలవరం ముంపులో తొయ్యేరు గ్రామం మునిగిపోయింది. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్లు నిర్మించారు. శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే నివాసం ఉండాలి. ఈ నేపథ్యంలో ఓటును ఇక్కడకు మార్చడంలో తప్పేముంది? కాలనీలోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. –నండూరి సీతారామ్, కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీ ఓటు మార్పు వల్ల ఇబ్బందేమీ లేదు.. కాలనీకి వచ్చాక 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మేమున్న కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించారు. ఓట్లు మార్చడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా మా ఓటు హక్కును వినియోగించుకుంటాం. –దేవరపల్లి వీరబాబు, కృష్ణునిపాలెం ఆర్అండ్ ఆర్ కాలనీ -
చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే
సాక్షి, అమరావతి: ఎవరైనా ఓ మాట చెబితే దానికో హేతుబద్ధత ఉండాలి. కానీ, రామోజీ మాటలకు రోత పద్ధతే తప్ప హేతుబద్దత ఉండదు. ఇందుకు చక్కెర కర్మాగారాలపై ఈనాడు ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. అసలు రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను నమిలి, పీల్చి పిప్పి చేసిందే రామోజీ ప్రియ మిత్రుడు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎందరో చెరుకు రైతులు కుదేలైపోయారు. వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తర్వాత సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చీరాగానే వీటి పునరుద్ధరణకు ఉప సంఘం వేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించారు. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. క్రషింగ్ సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు ఉత్పత్తి లేకపోవడంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించారు. రైతులకు ఇంతలా మంచి జరిగితే తట్టుకోలేని విపక్షాలు కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నాయి. ఈ వాస్తవాలను విస్మరించి ఈనాడు పత్రికలో ‘‘తీపి మాటలు చెప్పి పీల్చి పిప్పి’ అంటూ రామోజీ మరో రోత కథ అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టారు వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణుగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో వాటిని నిర్వీర్యం చేసి 2003–04లోనే మూత పడేలా చేశారు. ఫలితంగా పదింటికి తొమ్మిది మూతపడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూత పడ్డాయి. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్‌లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఎన్జే షుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి చేరాయి. ఇదంతా బాబు చేసిన పాపాల ఫలితమే. ఆరోపణ: రైతులను ఆదుకోని వైఎస్సార్సీపీ సర్కారు? వాస్తవం: బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 72.86 కోట్లు చెల్లించింది. మరొక వైపు ఉప సంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయ రాయ కర్మాగారాల పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకని పరిస్థితి నెలకొంది. సగటున రోజుకు 17,750 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఈ కర్మాగారాలకు కనీసం 4 నెలలకు 23.09 లక్షల టన్నుల చెరుకు అవసరం కాగా, రూ.2.80 లక్షల టన్నులకు మించి లభించడంలేదు. పైగా వీటిలోని యంత్ర పరికరాలన్నీ మూలపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ముడిì సరుకు లేకుండా వందల కోట్లు ఖర్చుపెట్టి ఆధునికీకరించడం వలన ఫలితమేమిటో రామోజీకే తెలియాలి. ఆరోపణ: చెరుకు రైతులకుప్రోత్సాహం కరువు వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం చెరుకు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తోంది. ఓ వైపు రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు.. వైఎస్సార్ రైతు భరోసా కింద చెరుకు రైతులకు సైతం ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. పంట నష్ట పరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తోంది. కూలీల కొరత, పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఫలితంగా ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరుకు.. ప్రస్తుతం (2023–24)లో 41 వేల హెక్టార్లకు పడిపోయి, 23.65 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఆరోపణ: రూ.2 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం? వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరుకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని భావించింది. కర్మాగారాల ఆస్తులు, స్థలాలపై లీజుకు తీసుకునే సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం. అయితే, మూతపడిన చక్కెర కర్మాగారాల వ్యవహారంపై కోర్టులో స్టే ఉన్నందున ప్రభుత్వ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అలాంటప్పుడు వేల కోట్ల విలువైన వీటిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారో రామోజీనే చెప్పాలి. -
బాబు పథకాలపై 11కు పైగా ప్రశ్నలు
సాక్షి, అమరావతి 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ‘పేదరికంపై గెలుపు’ ఈ క్రింది వానిలో సాధారణ వేదిక? 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది? 3. చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు? 4. ‘పసుపు కుంకుమ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గానికి ఒకసారి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది? 5. చంద్రన్న పెళ్లి కానుక పథకం క్రింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి (రూ.లలో)... ఏంటి ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా? గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన గ్రూప్–2లో అడిగిన ప్రశ్నలు. ఈ ఐదు ప్రశ్నలే కాదు నాటి గ్రూప్–2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై మొత్తం 11 ప్రశ్నలు ఇచ్చారు. ముఖ్యంగా 137 నుంచి 142 వరకు వరుసగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. చివరకు చంద్రబాబు తెచ్చిన అట్టర్ ఫ్లాప్ పథకం పసుపు–కుంకుమపైన కూడా ప్రశ్న ఇచ్చారు. అయితే ప్రభుత్వ పథకాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వడమేంటి అని నాడు ఎల్లో మీడియా ప్రశ్నిస్తే ఒట్టు. ఎందుకంటే నాడు అధికారంలో ఉంది.. ఎల్లో మీడియాకు కావాల్సిన చంద్రబాబు. దీంతో గ్రూప్–2లో 11 ప్రశ్నలు ఇచ్చినా ఎల్లో మీడియా ఇదేంటి అని నిలదీసింది లేదు. ఇక ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన గ్రూప్–2లో ఒక పదం మాత్రమే ఇస్తే అది ఎల్లో మీడియాకు పెద్ద పాపంలా కనిపించింది. అందుకే గ్రూప్స్‌లో జగనన్న భజనేనా అంటూ విష కథనాన్ని అచ్చేసింది. ఒక్క పదానికే ఎల్లో మీడియా రచ్చరచ్చ తాజాగా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో ‘మెంటల్ ఎబిలిటీ’ విభాగంలో ఒక సమస్యను పరిష్కరించేందుకు ఓ పేరాను ఇచ్చారు. అందులో ‘ఆడుదాం ఆంధ్ర’ అనే పదం మాత్రమే పేర్కొన్నారు. సదరు పేరాను చదివి 123–125 వరకు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంతకుమించి ‘ఈ పథకం ఎప్పుడు పెట్టారు?, ఈ పథకం ఏ తేదీన ప్రారంభించారు?’ అనే ప్రశ్నలు లేవు. అయినా సరే ‘ఆడుదాం ఆంధ్ర’ అనే ఒక్క పదమే ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. అలాగే 108వ ప్రశ్న.. ‘ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జతచేయబడింది?’లో భాగంగా ఇచ్చిన ‘చేదోడు’ పదం కూడా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. దీంతో తట్టుకోలేక గ్రూప్–2 పరీక్షలోనూ జగనన్న భజన చేస్తున్నారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. కాగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధిక మంది అభ్యర్థులు రాసిన పరీక్షగా గ్రూప్–2 ప్రిలిమ్స్ చరిత్ర సృష్టించింది. మంచి స్టాండర్డ్స్‌తో పరీక్ష నిర్వహించిందనే ప్రశంసలు ఏపీపీఎస్సీకి దక్కాయి. దీన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా చివరకు గ్రూప్–2 పరీక్షపైన కూడా విషం చిమ్మడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
పల్లె ముంగిట కొత్త ‘పద్దు’
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్‌లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్‌లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిని గ్రామ బడ్జెట్లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు. మూడొంతుల పంచాయతీల్లో పూర్తి ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్‌ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. -
ఎస్వీ వర్సిటీలో నుంచి రహదారులు వద్దు
సాక్షి, అమరావతి: తిరుమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో నుంచి రహదారులు నిర్మాణం చేపట్టేందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. వర్సిటీలో నుంచి రోడ్లు ఏర్పాటుకు అభ్యంతరం లేదని వీసీ చెప్పడాన్ని తప్పుబట్టింది. వర్సిటీలో నుంచి రహదారి నిర్మాణాలను చేపట్టవద్దని ఆదేశిస్తూ ఇలాంటి విషయానికి అంగీకారం తెలిపే ముందు విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించాలని వీసీకి హితవు పలికింది. తిరుమల వెళ్లే వారి కోసం వర్సిటీలో నుంచి రోడ్డు వేయడం సరికాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం జిల్లా సింగూపురం పంచాయతీ పరిధిలోని చెరువును స్థానిక సర్పంచ్ కబ్జా చేసి పూడ్చేస్తున్నారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకుని, దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సింగుపురంలోని చెరువును సర్పంచ్ ఆదిత్య నాయుడు కబ్జా చేసి పూడ్చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగుపురం ఎంపీటీసీ బగ్గు అప్పారావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో రూ.8వేల కోట్లను జమ చేస్తా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించబోమని కేంద్రం ప్రకటిస్తే పలువురు బిలీనియర్లతో పాటు తన వంతు కింద నెల రోజుల్లో రూ.8 వేల కోట్లను జమ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టుకు నివేదించారు. విదేశాల నుంచి నిధులు స్వీకరించేందుకు వీలుగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతాను కేంద్రం అనుమతిస్తే, ఆ నిధులను అందులో జమ చేస్తానన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములను విక్రయించకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్ గుహనాథన్ నరేందర్, న్యాపతి విజయ్‌ల ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన దాఖలైన పిల్లను పాల్ వ్యాజ్యంతో జత చేసే విషయంలో సీజే నుంచి పాలనాపరమైన ఆదేశాలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. యంత్ర సామగ్రిని జప్తు చేయండి విశాఖ జిల్లా భీమునిపట్నం సముద్ర తీరం సమీపంలో చేపడుతోన్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలో చేపడుతోన్న ఈ నిర్మాణాలకు ఎలా అనుమతులిస్తారని అధికారులను ప్రశ్నించింది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అవి అక్రమ నిర్మాణాలవుతాయని, నిర్మాణ ప్రదేశంలో ఉన్న యంత్ర సామాగ్రిని తక్షణమే జప్తు చేయాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నివేదికివ్వాలని ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్‌ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్‌డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
గురివింద ప్రయాసే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం నుంచి రాళ్లేస్తున్న రాజ గురివింద ప్రవాసాంధ్రులకు బీమా రక్షణ కరువైందంటూ కన్నీళ్లు పెట్టారు! చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో బీమా క్లెయిమ్‌గా నలుగురు బాధిత కుటుంబాలకు చెల్లించిన మొత్తం రెండంటే రెండు లక్షల లోపే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 28 లక్షల మందికి రూ.42 లక్షలకుపైగా క్లెయిమ్ పరిహారం అందచేసింది. మరో రూ.25 లక్షల మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ప్రవాసుల భద్రత, డబ్బు విషయంలో వెనుకాడే ప్రభుత్వమైతే సొంత ఖర్చులతో విపత్తు వేళ ఆగమేఘాలపై వారిని స్వస్థలాలకు తరలిస్తుందా? బీమా ప్రీమియం స్వల్ప మొత్తంలోనే రూ.ఐదారు వందలు లోపే ఉంటుంది. అయితే ప్రవాసాంధ్రుల్లో చాలా మంది విదేశాల్లో తాము పని చేస్తున్న చోట్ల బీమా కవరేజీని పొందుతున్నందున ప్రవాసాంధ్ర బీమా భరోసాను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అనే రీతిలో రోత కథనాలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందాన్ని పొందడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 2.5 లక్షల మందికి ఏపీ ఎన్ఆర్టీఎస్ సేవలు ఏపీ ఎన్ఆర్టీఎస్ గత నాలుగేళ్లలో 2,55,000 మంది ప్రవాసాంధ్రులకు వివిధ సేవలతో సాయాన్ని అందించింది. 24/7 ద్వారా ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవాసాంధ్రుల బీమా పథకం క్లెయిమ్ కింద కేవలం నలుగురికి రూ.2 లక్షల లోపే అందించగా ఇప్పుడు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం 28 మందికి పరిహారంగా రూ.42,05,604 చెల్లించింది. రూ.25,53,700 విలువైన మరో పది క్లెయిమ్‌లు పురోగతిలో ఉన్నాయి. బీమానే కాకుండా అంబులెన్సు, ఎక్స్‌గ్రేషియా, రీ పాట్రియేషన్ ద్వారా అధిక సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందారు. అనారోగ్య బాధితులతోపాటు మృతుల భౌతిక కాయాలను విమానాశ్రయాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు 1,077 అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఇందుకోసం రూ.1.93 కోట్లకు పైగా వెచ్చించింది. ప్రమాదవశాత్తు విదేశాల్లో మరణించిన 489 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.2.44 కోట్లకుపైగా చెల్లించింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న 4,622 మందిని రీపాట్రియేషన్తో స్వస్థలాలకు క్షేమంగా తరలించింది. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ ♦ దాదాపు 20 లక్షల మంది ప్రవాసాంధ్రుల్లో గత సర్కారు కేవలం 16,713 మందికి (ఒక్క శాతం) మాత్రమే బీమా కల్పిస్తే అది చాలా గొప్పంటూ డప్పు కొట్టిన రామోజీకి కరోనా విపత్తులో వేల మంది ప్రవాసులను ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా మాతృభూమికి తరలించిన విషయం తెలుసా? ఉక్రెయిన్ యుద్థం లాంటి సందర్భాల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి డబ్బుకు వెనుకాడకుండా ప్రవాసులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచి్చంది. ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించి 50 వేల మంది వలస కార్మికులను రాష్ట్రానికి క్షేమంగా తరలించింది. ♦ బీమా రక్షణ అనేది స్వచ్ఛందం. అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అవసరమైన వారు ముందుకొచ్చి తీసుకుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా తదితర చోట్ల తాము పని చేస్తున్న సంస్థల్లో బీమా ప్రయోజనాలు అందుతున్నందున ప్రవాసులు ప్రభుత్వ పథకంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఇది కూడా ప్రభుత్వ తప్పిదమేనా రామోజీ? ♦కోవిడ్ విపత్తు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లక్షల మంది ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చేశారు. బీమా సౌకర్యం లేని వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు వివరిస్తూ అందులో చేర్చేందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. తద్వారా గత ప్రభుత్వ హయాం కంటే మెరుగ్గా 33,596 మందికిపైగా బీమా ప్రయోజనాన్ని పొందారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికులకు మూడేళ్లకు కేవలం రూ.550 ప్రీమియం అంటే రోజుకు సుమారు 50 పైసలకే అందిస్తున్నా అది కూడా భారమే అంటూ రాగాలు తీయడం వారిని అవమానించడం కాదా? ♦ ఎలా చూసినా గత సర్కారు రెండేళ్లలో ప్రవాసాంధ్రులకు అందించిన ప్రయోజనం కంటే గత నాలుగేళ్లుగా చేకూరిన లబ్ధి 10 రెట్లు అధికంగా ఉంది. -
Fact Check: కుప్పం ప్ర'జల నవ్వుల'పై కుళ్లు రాతలు!
సాక్షి, తిరుపతి: ముప్పైఐదు ఏళ్లుగా తనను ఎన్నుకుంటున్న కుప్పం వాసుల కష్టాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోయినా కరువు సీమలో కనకధారలు కురిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కేవలం 57 నెలల కాలంలోనే కృష్ణాజలాలను అందించి అక్కడి ప్రజల పెదవులపై చిరునవ్వులు చిందేలా చేశారు. దీనిని తట్టుకోలేని ఈనాడు రామోజీ కుళ్లు రాతలతో విషం చిమ్మారు. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్టు కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా నీరు రాలేదంటూ కథనం ప్రచురించింది. నిస్సిగ్గుగా ‘కుప్పం ఫక్కున నవ్వింది’ అంటూ ఏడుపుగొట్టు రాతలు రాసి రాక్షసానందం పొందింది. నాటి లీలలు గుర్తున్నాయా బాబూ అండ్ రామోజీ! కుప్పానికి కృష్ణాజలాలు అందించే 207.800 కి.మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మీదుగా 123.641 కి.మీ ప్రవహించి కుప్పం పట్టణం సమీపంలో పరమసముద్రం దగ్గర కలుస్తుంది. ఈ పని అంచనా విలువ రూ.468.53 కోట్లుగా నిర్ణయించారు. రూ.460.881కోట్లతో చేపట్టేలా హైదరాబాద్‌కు చెందిన ఆర్కే హెచ్‌ఈఎస్–కోయా సంస్థతో 2016 జనవరి 4న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఎం అండ్ సీడీ పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్టు చేతులు దులుపుకుంది. ప్రశ్నించాల్సిన అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు వంతపాడింది. నాడు ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌కు ఎయిర్ రిలీఫ్ వాల్యూమ్‌లు, స్కోర్ ఛాంబర్లూ నాసిరకంవి అమర్చారు. 2019 ఫిబ్రవరిలో కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. కానీ ఆ పైప్‌లైన్ పలు చోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం నీటి విడుదలను ఆపివేసింది. ప్రభుత్వ నిబంధల ప్రకారం కెనాల్ డిజైన్, ఎస్ఎల్ఆర్బీ, డీఎల్ఆర్బీ, పైప్ కల్వర్ట్ క్రాస్ వర్క్‌లు ప్రణాళికాబద్ధంగా చేయడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలింది. దీంతోపాటు రోడ్డు క్రాసింగ్ వద్ద, డ్రెయినేజీ కాలువల వద్ద పైప్‌లైన్ పనుల్లో నాణ్యతాలోపం వల్ల నీరు కలుషితమైంది. ఇవేమీ గుర్తులేని బాబు, రామోజీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ చెబితే చేస్తారంతే.. సీఎం జగన్ 2022 సెప్టెంబర్ 22న కుప్పంలో పర్యటించినప్పుడు బ్రాంచ్ కెనాల్ పనులపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెండింగ్ పనులు పూర్తిచేసి త్వరలో కృష్ణాజ లాలను తీసు కువస్తానని సీఎం మాట ఇచ్చారు. వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీకి పనులను రద్దు చేసి హైదరా బాద్‌కు చెందిన ప్రముఖ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను అప్పగించింది. సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల ప్రకారం గతంలో వేసిన నాసిరకం ఎయిర్ రిలీఫ్ వాల్యూ మ్ల స్థానంలో 500 ఎంఎం సామర్థ్యంగల ఎ యిర్ వాల్యూమ్లను ఏర్పాటు చేయాలని సూ చించింది. రోడ్డు క్రాసింగ్, డ్రెయి నేజ్, ప్రధాన కాలువలు వద్ద వేసే పైప్‌లైన్ పను లను నాణ్యంగా చేపట్టేలా పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తిచేసింది. శ్రీశైలం నుంచి 676 కి.మీ. పొడువున, 733 మీటర్ల ఎత్తులో 27 ప్రాంతాల్లో లిఫ్టింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కృష్ణా జలాలతో నిండిన 2 చెరువులు మూడు రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు. మరుసటి రోజు (మంగళవారం) శాంతిపురం మండలం వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. అంతకు ముందే అధికారులు ట్రయల్ రన్లో భాగంగా నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక అధికారికంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారులు ట్రయల్ రన్ కోసం విడుదల చేసిన నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి సమీపంలో ఉన్న వంతెన దాటి నీరు ముందుకు సాగింది. ఆ సమయంలో స్థానికులు పూజలు కూడా చేశారు. వెంకటేష్‌పురం వద్ద శెట్టివానిగుంట చెరువుకు ఉన్న పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నానికి చెరువు కృష్ణా జలాలతో నిండిపోయింది. ఈ చెరువు నిండిపోయిందని, నీటిని మల్లించాలని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తరువాతే అధికారులు ఆ నీటిని రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద ఉన్న మద్దికుంట చెరువుకు మళ్లించారు. నీటిని మళ్లించటంతో ఆ కాలువపై నీటి ప్రవాహం ఉండదు. దీన్ని టీడీపీ, డ్రామోజీ, ఎల్లో మీడియా బూతద్దంలో చూపించటం ప్రారంభించాయి. కట్టుకథలు వల్లెవేశాయి. దీనిపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. ఈనాడులో ప్రచురించిన కథనం పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర జలవ నరులశాఖ పేర్కొంది. సీఎం గేటు ప్రారంభించిన ప్రాంతంలో తాత్కాలికంగా అమర్చిన స్విచ్‌లు, డెకరేషన్లనే తొలగించామంది. కృష్ణానీటితో 2 చెరువులు నిండాయని వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇలా.. ► పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కిమీ వరకు హంద్రీనీవా కాలువ తవ్వారు. ► 5.కి.మీ పశు పత్తురు వద్ద లిఫ్ట్ ఏర్పాటు.. 39వ కి.మీ. కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు ► వి.కోట మండలం ఆదిరేపల్లి 54.కి.మీ. వద్ద లిఫ్ట్‌లు ► కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్ళు, 6500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు ► 4 లక్షలు జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు ► అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ 300 క్యూసెక్కుల నీరు హంద్రీనీవా కాలువలు ద్వారా తరలింపు -
చంద్రబాబు కూల్చిన ఆలయాల్లో నేడు విగ్రహ ప్రతిష్ట
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): గత చంద్రబాబు ప్రభుత్వం కూల్చిన ఏడు ఆలయాల్లో గురువారం ప్రాణప్రతిష్టను నిర్వహించనున్నారు. ఉదయం 11.24 గంటలకు దుర్గగుడి ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ట, కలశస్థాపన జరగనుంది. ప్రాణ, శిఖర ప్రతిష్టలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడు ఆలయాలను ఏకంగా రూ.2.5 కోట్లతో పునర్నిర్మించింది. 2016లో కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో ఏడు ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం కూల్చిన ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించారు. అంతేకాకుండా 2021 జనవరి 8న ఆయా ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయాల నిర్మాణం శరవేగంగా జరిగేలా నాటి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణతోపాటు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌తో పాటు పునర్నిర్మించిన ఆలయాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దేవతామూర్తులకు ధాన్య, పూజాధివాసాలు కాగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత మెట్ల మార్గంలోని వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయాల పున ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆయా దేవతామూర్తుల విగ్రహాలతోపాటు సీతమ్మ వారి పాదాల సమీపంలోని దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారి పున:ప్రతిష్ట జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానాచార్య శివప్రసాద్‌శర్మ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాదివాసం, శయనాధివాసం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు. నేడు ప్రాణప్రతిష్ట జరిగే ఆలయాలివే.. శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి వారి ఆలయం వ్యయం రూ.45 లక్షలు సీతమ్మ వారి పాదాలు వ్యయం రూ.10 లక్షలు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం –కృష్ణలంక వ్యయం రూ.15 లక్షలు వీరబాబు దేవస్థానం (తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద) వ్యయం రూ.15 లక్షలు వేణుగోపాలస్వామి వారి దేవాలయం (విజయవాడ గోశాల వద్ద) వ్యయం రూ.68 లక్షలు బొడ్డు బొమ్మ (రథం సెంటర్) వ్యయం రూ.23 లక్షలు శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయం, అమ్మవారి తొలి మెట్లు –ఇంద్రకీలాద్రి వ్యయం రూ.29 లక్షలు -
బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు.. జగన్ రియల్ పెట్టుబడులు
చంద్రబాబు పాలన ఓ కంప్యూటర్.. అందులో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు, లోగోలు.. వాటి గ్రాఫిక్స్.. ఓ వంద అంకెలు, నలభై గీతలు.. వంద అబద్ధాలు. అన్నీ భూతద్దంలో చూపిస్తారు. వినడానికి, గ్రాఫిక్స్ చూడటానికి అబ్బో అనిపిస్తాయి. వాస్తవంగా వచ్చే పెట్టుబడులు సున్నా. పెట్టుబడులన్నీ కాగితాలకు, కంప్యూటర్లకే పరిమితం. సీఎం వైఎస్ జగన్ పాలన చంద్రబాబు గ్రాఫిక్స్ లాంటి టక్కుటమారాలేమీ ఉండవు. అంతా వాస్తవికత. వచ్చే పెట్టుబడులే కాగితాల్లో కనిపిస్తాయి. అవే ప్రజలకు చేరతాయి. వాస్తవంగా నూరు శాతం పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. కాగితాల్లో ఉన్న పెట్టుబడులే పరిశ్రమలుగా రూపుదిద్దుకొని ప్రజల ముందు నిలుస్తాయి. – సాక్షి, అమరావతి అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే గడిచిన నాలుగున్నర ఏళ్లలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. ఈ విషయం వెల్లడించింది స్వయానా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఆ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండ్రస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014–18 మధ్య కాలంలో (చంద్రబాబు పాలన) రాష్ట్రంలోకి వాస్తవంగా వచ్చి న పెట్టుబడులతో పోలిస్తే 2019 నుంచి 2023 జూన్ వరకు (వైఎస్ జగన్ పాలన) వచ్చి న పెట్టుబడులు 226.9 శాతం అధికంగా వచ్చాయి. 2014–18 క్యాలండర్ ఇయర్ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాస్తవ రూపంలోకి వచ్చి ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే. ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రూ.1,00,103 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి ఏటా హాడావుడి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చెప్పిన వార్తల్లో వాస్తవం ఏమాత్రం లేదని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో వివిధ పెట్టుబడుల సదస్సుల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి నట్లు ఉత్తుత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న విషయం సుస్పష్టమైంది. తరలి వస్తున్న దిగ్గజ సంస్థలు చంద్రబాబుకు భిన్నంగా వైఎస్ జగన్ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు చేయకుండా పరిశ్రమలకు అన్ని విధాలా చేయూతనిస్తున్నారు. సీఎం జగన్ సహకారం అందించడంతో రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, హెచ్‌యూఎల్, బ్లూస్టార్, డైకిన్, ఇన్ఫోసిస్ వంటి అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. కానీ విశాఖ పెట్టుబడుల సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేశాయి. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇదంతా వైఎస్ జగన్ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి. -
మాటకు మించి సాయం
సాక్షి, అమరావతి: అన్నదాతల కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ప్రతి అడుగూ రైతులు, రైతు కూలీలు బాగుండాలని మనసా వాచా కర్మణా వేస్తూ వచ్చామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ విత్తనం నుంచి పంట విక్రయం వరకూ అన్ని విధాలుగా చేయి పట్టుకుని నడిపించామ న్నారు. ప్రతీ పథకాన్ని పేద రైతు కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చి సంక్షేమ ఫలాలన్నీ అందించామని, రాష్ట్రంలో ఐదేళ్లుగా మాత్రమే ఇలా జరుగుతోందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నలకు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వం ఇదేనని, భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా వరుసగా ఐదో ఏడాది మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు 10.79 లక్షల మందికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.215.98 కోట్లు కలిపి మొత్తం 64.37 లక్షల మంది ఖాతాలకు రూ.1,294.34 కోట్లను బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. హామీ కంటే మిన్నగా.. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తా మని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రూ.12,500 బదులు ఏటా రూ. 13,500 చొప్పున అందచేశాం. రూ.50 వేలకు బ దులు ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 67,500 చొప్పున లబ్ధి చేకూర్చాం. హామీకి మించి ప్రతి రైతు కుటుంబానికి రూ.17,500 చొప్పున అదనంగా అందచేశాం. తద్వారా ఏటా మూడు విడ తల్లో రూ.13,500 చొప్పున ఈ ఐదేళ్లలో మొత్తం రూ.67,500 రైతన్నల చేతుల్లో పెట్టినట్లైంది. ఇవాళ జమ చేస్తున్న పెట్టుబడి సాయంతో కలిపి ఐదేళ్లలో 53.58 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.34,288 కోట్లు పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయంగా అందించాం. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీని కూడా వర్తింపజేస్తూ రూ.లక్ష వరకు పంట రుణాలను అందిస్తున్న కార్యక్రమం కూడా మన ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. పంట రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే బ్యాంకులకు రైతులపై నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది. దీన్ని ప్రోత్సహిస్తూ రైతన్నలు వడ్డీ సొమ్మును బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్లీ ఆ వడ్డీ రాయితీ డబ్బులను క్రమం తప్పకుండా అన్నదాతలకు తిరిగి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నదీ ఈ ప్రభుత్వ హయాంలోనే. బ్యాంకులకు కట్టిన వడ్డీని తిరిగి వెనక్కి ఇవ్వడం వల్ల రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందుతాయి. ఆ డబ్బులు వారికి వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల కింద ఉపయోగపడతాయి. దీన్ని ప్రోత్సహిస్తూ ప్రతి రైతుకు సహాయం చేస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి 84.67 లక్షల మంది అన్నదాతలకు సున్నా వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.2,051 కోట్లు అందించాం. నాణ్యమైన వ్యవసాయ విద్యుత్తు.. 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చే కార్యక్రమం ఈ 57 నెలల్లోనే జరుగుతోంది. మనం అధికారంలోకి రాకముందు ఇలా పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే నాడు ఫీడర్లకు ఆ సామర్థ్యమే లేదు. మన ప్రభు త్వం వచ్చిన తర్వాత రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాం. పగటి పూట 9 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రతి రైతన్నకు రూ.45 వే ల వర‡కు మేలు చేశాం. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉచిత పంటల బీమా.. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతులు పండించే ప్రతి ఎకరాను ఈ– క్రాప్ చేస్తూ నోటిఫై చేసిన ప్రతి పంట, సాగైన ప్రతి ఎకరా ఇన్సూరెన్స్ కవరేజీలోకి తెచ్చాం. రైతన్నల తరపున ప్రీమియం డబ్బులను పూర్తిగా రాష్ట్రమే కడుతున్న ప్రభుత్వం మనదే. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతోంది. మునుపెన్నడూ ఇలా జరగలేదు. ఇంతకుముందు రైతన్నకు బీమా ప్రీమియం ఉందన్న సంగతి కూడా తెలిసేది కాదు. కొందరు రైతులకు మాత్రమే క్రాప్ లోన్ ఇచ్చిన సమయంలో బ్యాంకులు బీమా ప్రీమియం సొమ్ముని కట్ చేసుకుని వర్తింప చేసిన పరిస్థితి ఉండేది. రైతులు బ్యాంకులకు వెళ్లకుంటే రుణాలు రాని పరిస్థితి. తద్వారా వారికి ఇన్సూరెన్స్ గురించి తెలియక చెల్లించలేకపోయేవారు. అలా వారు నష్టపోతున్న పరిస్థితులకు పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్న పంట వేసిన వెంటనే ఆటోమేటిక్‌గా గ్రామ సచివాలయంలో ఈ– క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ కలి్పస్తూ వారి తరపున ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్న పరిస్థితి తొలిసారిగా మన ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. ఆక్వాకు తోడుగా.. పాడికి అండగా గతంలో ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంట్ ఇచ్చి వారిని అదుకున్న పరిస్థితి లేదు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ అందించి వారిని కూడా చేయిపట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటున్న పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చాకే ఏర్పడ్డాయి. ఆక్వా, పాడి రైతుల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చాం. చివరికి పాలసేకరణలో కూడా గతంలో లేనివిధంగా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు ఈ 57 నెలల కాలంలోనే సేకరణ ధరలు పెరిగాయి. దీనికి కారణం మనం చేపట్టిన పాలవెల్లువ అనే కార్యక్రమమే. సహకార రంగంలో దేశంలోనే అతి పెద్దదైన అమూల్ లాంటి సంస్ధను రాష్ట్రానికి తీసుకొచ్చాం. తద్వారా స్థానికంగా పోటీని సృష్టించాం. అమూల్ రేట్లు పెంచింది కాబట్టి మిగిలిన వారు కూడా పెంచక తప్పని పరిస్థితిని తీసుకొచ్చాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. దాదాపు 100 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో మన భూముల సర్వే జరిగింది. రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు, సర్వేలు జరగకపోవడం వల్ల ప్రతి గ్రామంలోనూ భూ వివాదాలు తలెత్తాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సమగ్ర భూసర్వే చేపట్టాం. రికార్డులన్నీ అప్డేట్ చేసి ఏకంగా రిజి్రస్టేషన్ ప్రక్రియను గ్రామస్ధాయిలో సచివాలయాల పరిధిలోకి తెచ్చిన గొప్ప మార్పు కూడా ఈ 57 నెలల్లోనే సాకారమైంది. దాదాపు 34.72 లక్షల ఎకరాలపై రైతులు, పేదలకు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఏకంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గతానికి, ఈ 57 నెలల కాలానికి మధ్య తేడాను గమనించండి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఆర్బీకే మనతో కనెక్ట్ అయి ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కాబట్టి వారందరికీ ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. పెట్టుబడికి భరోసా.. చిన్న రైతుకు 80% ఖర్చులు కవర్ రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు భూమి కలిగిన రైతులు 50% మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన వారు 70% ఉన్నారు. సాగు పెట్టుబడి కోసం తీసుకునే రుణాలపై వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి వారిది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటే నడ్డీ విరిగే వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. మన ప్రభుత్వం రైతన్నలకు ఆ అవస్థలను తొలగించి రైతు భరోసాతో ఆదుకుంటోంది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించే సాయంతో అర హెక్టారు లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు 80% పెట్టుబడి ఖర్చులు కవర్ అవుతుండగా హెక్టారు లోపు పొలం ఉన్నవారికి 70% ఖర్చులు పథకంతో కవర్ అవుతున్నాయి. నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఈ ఐదేళ్లలో వచ్చిన మరో గొప్ప మార్పు ఏమిటంటే ఎక్కడైనా రైతన్నలకు వరదలు లాంటి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం దాన్ని తన కష్టంగానే భావించింది. ఏ సీజన్లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందించే కార్యక్రమం కూడా మొట్ట మొదటిసారిగా ఈ 57 నెలలుగా జరుగుతోంది. ఇదో విప్లవాత్మకమైన మార్పు. నష్టపోయిన రైతులు మళ్లీ సీజన్లో పంటలు వేసుకునే పరిస్థితుల్లోకి రావాలి. అలా జరగాలంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఆయా సీజన్ ముగిసేలోగా చేతికిస్తేనే పెట్టుబడి కోసం వారికి ఉపయోగపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలిచిన ప్రభుత్వం మనది. ఇలాంటి ఆలోచనలు మనం ప్రభుత్వంలోనే జరిగాయి. పంటలకు ‘మద్దతు’.. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పి పంటలను కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు సైతం మనం కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్లో మద్దతు ధర తగ్గినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతున్నది కూడా మన ప్రభుత్వంలోనే. మాఫీ పేరుతో బాబు మోసాలు.. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఎలా మోసగించారో గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని పబ్లిసిటీ చేసి ఆ తరువాత వంచనకు పాల్పడ్డారు. చివరికి ఆ రూ.87,612 కోట్లపై సున్నావడ్డీని కూడా ఎగ్గొట్టాడు. ఐదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్లు ఆ వడ్డీలకే అవుతుంది. ఆయన ఎగ్గొట్టిన సున్నా వడ్డీ బకాయిలను కూడా మనమే ఇచ్చాం. ఐదేళ్లలో ఒక్క వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారానే రైతుల చేతుల్లో రూ.34,288 వేల కోట్లు పెట్టాం. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.65 కోట్లు వెచ్చించాం. ఇలా పథకాల ద్వారా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయం కోసం ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది. ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికంగా పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మనసు, పాలన బాగున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న సీఎం జగన్ దేశం గర్వించేలా పలు సంస్కరణలు తెచ్చారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ, కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో పుట్టి (850 కేజీలు) రూ.18,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ. 12 వేల నుంచి రూ.13 వేలకు పడిపోయింది. కానీ ఇవాళ పుట్టి రూ.23,500 నుంచి రూ.24 వేలు పలుకుతోంది. ఇది ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి పంట మాది.. బీమా మీది నాకు 3.38 ఎకరాలున్నా గతంలో బీడుగా ఉండేది. గత నాలుగేళ్లుగా పంటలు పండిస్తున్నాం. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.67,500 ఇచ్చారు. మేం పంట వేస్తే మీరు బీమా చెల్లిస్తున్నారు. సున్నా వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు వ్యవ సాయ పనిముట్లు అందజేసి ఆదుకున్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాల్లో పడి గాపులు కాశాం. ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్బీకేల ద్వారా మా ఇంటికే పంపిస్తున్నారు. గతంలో పాలు కర్ణాటకలో విక్రయించగా ఇప్పుడు మా గ్రామంలోనే అమూల్ కేంద్రంలో మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. మీద్వారా మా కుటుంబం రూ.3,42,152 మేర లబ్ధి పొందింది. మీరు మళ్లీ సీఎం కావాలి. –ఎన్. బాబు, రైతు, అనంతపురం జిల్లా రైతుల కోరిక.. మళ్లీ మీరే నాలుగెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. గతంలో ధర్నాలు చేస్తే కానీ విత్తనాలు దొరికేవి కాదు. నేడు ఆర్బీకేల ద్వారా అన్నీ గ్రామంలోనే అందిస్తున్నారు. ఈ–క్రాప్ ద్వారా పంట రుణాలు, వడ్డీ రాయితీ అందిస్తున్నారు. గతంలో కరువుతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదు. పైసా భారం పడకుండా ఉచితంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ–క్రాప్ విధానాన్ని చూడలేదు. మన దగ్గర చక్కగా అమలవుతోంది. నేను మూడెకరాల్లో 78 బస్తాల ధాన్యాన్ని పండిస్తే రూ.1,56,000 నేరుగా నా ఖాతాలో జమ చేశారు. పిల్లలకు విద్యాదీవెన అందింది. నా భార్యకు అనారోగ్యం వస్తే వైజాగ్ అపోలో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.1,48,000 చెల్లించింది. పైగా కోలుకోవడానికి ఆసరాతో రూ.4,750 జమ చేశారు. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాము. –వై.శ్రీనివాసరావు, రైతు, గజపతినగరం, విజయనగరం జిల్లా వ్యవసాయం సుసంపన్నం పుస్తకావిష్కరణ ఐదేళ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం పురోగతిపై ‘వ్యవసాయం సుసంపన్నం–రాష్ట్రానికి సౌభాగ్యం’ పేరిట వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు ఐ.తిరుపాల్‌రెడ్డి, పి.శివప్రసాద్‌రెడ్డి, సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేము టీడీపీ.. అయినా పథకాలు ఆగలేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మేము టీడీపీ.. అయినా పథకాలు ఆగలేదు మాది రాజకీయ కుటుంబం. తెలుగుదేశం పార్టీకి చెందిన నేను 2007 నుంచి 2012 వరకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొణిశ సర్పంచ్‌గా పని చేశాను. మా ఆయన సత్యనారాయణ రేషన్‌డీలర్‌గా కొనసాగుతున్నారు. మాకు కొద్దిపాటి వ్యవసాయ భూమి కూడా ఉంది. అందులో పంటలు సాగు చేసుకుంటున్నాం. ఇప్పటికీ మేము టీడీపీ సానుభూతి పరులమే అయినా మాకు అర్హత ఉందంటూ అన్ని ప్రభుత్వ పథకాలూ వర్తింపచేశారు. మా పార్టీ పాలనలో కనీసం ఇల్లు కూడా మంజూరు కాలేదు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 వంతున వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద నాకు ఇప్పటి వరకు రూ.18,200, మా పాప డిగ్రీ చదివినపుడు విద్యాదీవెన కింద రూ.6,500 వచ్చింది. మాకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సాయం కూడా అందింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు మంజూరవుతున్నాయి. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నారనడానికి మేమే ఉదాహరణ. – శీరంరెడ్డి లక్ష్మి, కొణిశ (పాండ్రంకి అప్పలనాయుడు, విలేకరి, గజపతినగరం రూరల్) పది మందికి ఉపాధి కల్పిస్తున్నా.. మాది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరు బిడ్డల్ని పోషించుకుంటూ.. వారిని చదివించేందుకు ఎంతో కష్టపడేవాళ్లం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎగువ రెడ్డివారిపల్లెలో కుటుంబ పోషణ కోసం 2008 నుంచి ఇంట్లోనే మగ్గం నేస్తున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సమకూరిన సుమారు రూ.8 లక్షల రుణంతో పాటు మరో రూ.2 లక్షలు సమకూర్చుకుని చంద్రగిరిలో శారీ రోలింగ్ సెంటర్ ప్రారంభించా. మొదట విడత ఆసరా డబ్బులతో మరో మగ్గంపై పని ప్రారంభించా. రెండో విడత ఆసరాతో టైలరింగ్, మూడో విడత ఆసరాతో శారీ రోలింగ్ యంత్రాలు ఏర్పాటు చేశా. నాలుగో విడత ఆసరా డబ్బులతో శారీ బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నా. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్‌లో మాత్రమే శారీ బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తిరుపతి ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం నా వ్యాపారం ద్వారా మరో పది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నా. ఆసరా ద్వారా వచ్చిన రూ.1.04 లక్షలు, డ్వాక్రా రుణం రూ.5.25 లక్షలు, సున్నా వడ్డీ కింద వచ్చిన రూ.20 వేలతో వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాం. నా ఇద్దరు పిల్లల చదువులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అందించారు. వారు డిగ్రీ పూర్తి చేసుకుని, వ్యాపారంలో నాకు చేదోడుగా నిలిచారు. మా జీవితంలో వెలుగులు నింపిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – ఎస్.మునికుమారి, ఎగువ రెడ్డివారిపల్లి (భూమిరెడ్డి నరేష్ కుమార్, విలేకరి, చంద్రగిరి) కష్టాల నుంచి గట్టెక్కాం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం నాది. నేను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడిని. మేం వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండికొవ్వూరులో భార్య వెంకటసుబ్బమ్మ, ముగ్గురు ఆడపిల్లలతో ఉంటున్నాం. 2019కి ముందు మాకు ఎలాంటి ప్రభుత్వ సాయం అందలేదు. నేను సంపాదించి తెస్తేనే నాలుగువేళ్లు నోట్లోకెళ్లేవి. ప్రస్తుతం ఆటో నడుపుతూ కుటుంబ పోషణ, పిల్లల చదువులు నెట్టుకొస్తున్నా. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. జగనన్న సాయంతో పాటు నేను కూడబెట్టిన సొమ్ముతో పెద్ద కూతురు మనీషకు పెళ్లి చేశా. రెండో పాప అంజలి డిగ్రీ సెకెండియర్, చిన్నపాప జ్యోత్స్న ఓపెన్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నారు. వాహన మిత్ర ద్వారా నాకు ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. రైతు భరోసా కింద రూ.40 వేలు లబ్ధి కలిగింది. మా పాపకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.30 వేలు అందాయి. రెండో పాపకు విద్యా దీవెన పథకంలో రూ.13 వేలు, వసతి దీవెన కింద రూ.10 వేలు బ్యాంక్ ఖాతాలో జమయింది. నా భార్యకు సున్నా వడ్డీ ద్వారా రూ.10 వేలు లబ్ధి చేకూరింది. జగనన్న కాలనీలో ఇల్లు కూడా మంజూరైంది. అప్పటికే నేను కొత్తగా ఇల్లు కట్టుకుని ఉండటంతో వేరే వారికి ఇవ్వండని మనస్ఫూర్తిగా చెప్పేశా. ఇద్దరు బిడ్డల చదువు జగనన్న ప్రభుత్వమే చూసుకుంటోంది. జగనన్న ఉండగా మాకేం చింతలేదు. ఆయన మేలు ఎప్పటికీ మరచి పోలేం. – గిత్తోళ్ల రామాంజనేయులు, గండికొవ్వూరు (ఇందుకూరు మురళీధర్, విలేకరి, చక్రాయపేట) -
Fact check: ముదిరింది ఎండే కాదు..ఈనాడు పచ్చ పైత్యం కూడా
సాక్షి, అమరావతి: ఎండలు మండుతున్నాయో లేదో ఏసీ గదుల్లో కూర్చునే రామోజీకేం తెలుస్తుంది. ఒకసారి కళ్లు తెరిచి రోడ్డు మీదకు వస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి. కానీ ఎండ కన్నెరుగని డ్రామోజీ ‘ఎండలు ముదరక ముందే ఎడా పెడా కోతలు’ శీర్షికన ఈనాడులో అడ్డగోలుగా ఓ అబద్దాన్ని అచ్చేశారు. ఈ అసత్య కథనంపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్రంలో ఏదైనా సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల సమయంలో వచ్చే స్వల్ప విద్యుత్ అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా చూపిస్తూ తరచూ కథనాలు ప్రచురించడం ఈనాడు దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇలాంటి నీతిమాలిన పాత్రికేయం ఆ పత్రిక పతనానికి నాంది అని దుయ్యబట్టాయి. వాస్తవాలేమిటో వివరించాయి. ఈనాడు ఆరోపణ: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం రైతులు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామం రైతులు ఆందోళన చేశారు. వాస్తవం: పార్వతీపురం మన్యం జిల్లా యర్రసామంతవలస 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఏర్పడ్డ విద్యుత్ అంతరాయం, ప్రకాశం జిల్లా ఉమా మహేశ్వరపురం 33/11 కేవి సబ్ స్టేషన్, అద్దంకి దగ్గర గుండ్లకమ్మ వంతెన సమీపంలో 33 కేవీ కుంకుపాడు లైన్ మరమ్మతుల వల్ల తలెత్తిన అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా ఈనాడు ప్రచురించింది. అది అవాస్తవం. నిజానికి ఈ రెండు చోట్లా ప్రత్యామ్నాయంగా ఏపీ ట్రాన్స్‌కో హై వోల్టేజ్ సబ్ స్టేషన్ లైన్ల ద్వారా విద్యుత్ అందించడం కూడా జరిగింది. వ్యవసాయ వినియోగదారులకు పగటి పూట విద్యుత్ సరఫరాకు అధికారులు గతంలోనే చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా సమస్యలు తలెత్తినా వెంటనే నివారించేందుకు సబ్‌స్టేషన్, లైన్ల సామర్థ్యం పెంపుదల పనులు జరుగుతున్నాయి. ఇంక ఆందోళన చేయాల్సిన అవసరమేముంది? అదంతా కేవలం రామోజీ మార్కు సృష్టి మాత్రమే. ఈనాడు ఆరోపణ: రైతులకు పగటిపూట అంతరాయం లేకుండా 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పిన సర్కారు.. వేసవి ఆరంభంలోనే చేతులెత్తేసింది. ముందస్తు ప్రణాళికల్లో విఫలమైంది. వాస్తవం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ను విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి. ఇందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్తును ఎటువంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ ఎడాది రబీ సీజను నుండి సోలార్ విద్యుత్‌ను వ్యవసాయానికి ప్రత్యేకంగా సరఫరా చేయనున్నాయి. గడిచిన పది రోజుల్లో ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు ఏమాత్రం కొరత లేకుండా విద్యుత్ అందిస్తున్నాయి. -
సర్కారు ‘చేయూత’తో సాఫీగా జీవనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సర్కారు ‘చేయూత’తో సాఫీగా జీవనం మాకున్న ఎకరం పొలంలో వరిసాగు చేసేవాళ్లం. ఐదేళ్ల క్రితం సంభవించిన వరుస తుపాన్లు.. చీడ, పీడల వల్ల పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాం. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. నేను కస్తూర్భా స్వయం శక్తి సంఘంలో ఉండటంతో మా సీఎఫ్ సలహా మేరకు బ్యాంకు ద్వారా రూ.50 వేలు తీసుకొని ఆటో కొనుక్కుని దానినే జీవనాధారంగా చేసుకున్నాం. దానివల్ల కూడా కష్టాలు తీరలేదు. ఈ లోగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున మూడు పర్యాయాలు వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద రూ.5 వేలు చొప్పున నాలుగు పర్యాయాలు అందింది. ఆ మొత్తంతో సాగుకు పనికి రాని ఎకరా భూమిపై పెట్టుబడి పెట్టాం. నిత్య పంటగా కాయగూరలు పండించడం ప్రారంభించాం. ఇప్పుడు కాయగూరల సాగు ఆశాజనకంగా ఉండటంతో నెలవారీ మంచి ఆదాయం వస్తోంది. మా ఆయనకు వాహనమిత్ర ద్వారా ఏటా రూ.పది వేలు వంతున అందుతోంది. మా అమ్మాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తోంది. ఇప్పుడు మా కుటుంబమంతా సంతోషంగా ఉంది. కుటుంబానికి అండగా ఉన్న సీఎం జగనన్న రుణం తీర్చుకోలేనిది. – కొల్ల లక్ష్మి, కొళిగాం (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) ఉచితంగా ఉన్నత విద్య మా నాన్న కరీముల్లా స్వర్ణకారుడు. అమ్మ సాధారణ గృహిణి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం భగత్‌సింగ్ కాలనీలో ఉంటున్న మా నాన్నకు వచ్చే అరకొర ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. ఇక ముగ్గురు పిల్లల చదువులు సాగించడం ఎలా అని నిత్యం మదన పడుతుండేవారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మా సమస్య పరిష్కారమైంది. నేను రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం ఈసీఈ చదువుతున్నాను. చెల్లి సనా కూడా అదే కాలేజీలో డిప్లమో అనంతరం బీటెక్ రెండో సంవత్సరంలో చేరింది. నా తమ్ముడు మహమ్మద్ తాహిర్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) పథకం ద్వారా నాకు నాలుగేళ్లకు రూ.1.87 లక్షలు మా అమ్మ బ్యాంక్ ఖాతాలో జమ అయింది. నా చెల్లికి కూడా మొదటి ఇన్స్టాల్మెంట్ కింద డబ్బు వచ్చింది. నా తమ్ముడికి అమ్మఒడి సొమ్ము ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. ఇప్పుడు మా అమ్మ, నాన్నకు మా చదువుల గురించి బెంగ లేదు. మా భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – సీఎఎస్ అబ్దుల్ రెహమాన్, ప్రొద్దుటూరు (వీరారెడ్డి, విలేకరి, ప్రొద్దుటూరు) సంక్షేమ పథకాలతో చింతలేని జీవితం బతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్నా. దాని ద్వారా వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు వాహనానికి మరమ్మతులు తప్పనిసరి. ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఇంకా కేసుల సంగతి సరేసరి. ఇలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం తప్పనిసరి అయ్యేది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కె.శివడ గ్రామానికి చెందిన నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. ఈ ప్రభుత్వ సాయంతో ఏటా ఇన్సూరెన్స్, ఆటో రిపేర్లు చేయించుకుంటున్నా. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో నా భార్య సురేఖకు వలంటీర్‌గా ఉన్న ఊళ్లోనే ఉపాధి లభించింది. నా భార్యకు, మా అమ్మ సావిత్రికి ‘వైఎస్సార్ ఆసరా పథకం’ ద్వారా ఏటా చెరో రూ.1200 చొప్పున లభించింది. ఇద్దరు పిల్లలూ చదువుకుంటున్నారు. ఏటా అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందుతోంది. మా అమ్మ సావిత్రికి వితంతు పింఛన్ అందుతోంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో మా జీవనం సాఫీగా సాగుతోంది. – నిమ్మల వెంకటరావు, కె.శివడ (జి.పెంటయ్య, విలేకరి, గుమ్మలక్ష్మీపురం) -
fact check: ఉన్నత విద్యపై ఉన్మాద రాతలు
సాక్షి, అమరావతి: ‘‘డబ్బులుండే వాళ్లకే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవాలంటే ఏ విధంగా చదువుకోవాలో మీరే ఆలోచించుకోవాలి. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. ఎక్కడ చూసినా కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారానే మంచి విద్యా సంస్థలు వచ్చాయి. కార్పొరేట్లు తమ భుజస్కందాలపై విద్యా సంస్థలను పెట్టుకోవాలి’’. ..ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయా రామోజీ!? స్వయంగా మీ పార్ట్నర్, మీ ఆత్మబంధువు చంద్రబాబు నోట జాలువారిన ఆణిముత్యాలు. విభజన ఆంధ్రప్రదేశ్‌ను ఉద్ధరిస్తానంటూ మాయమాటలు చెప్పి సీఎం సీటుపై కూర్చున్న వ్యక్తి నేతృత్వంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు బీజంపడిన రోజులవి. చంద్రబాబు చెప్పినట్లే తన ఐదేళ్ల పాలనలో ఉన్నత విద్య పేరుతో కార్పొరేట్లకు దోచిపెట్టారు. హాజరు పట్టికలో తప్ప తరగతి గదుల్లో పాఠాలు చెప్పని విద్యా సంస్థలకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దోచిపెట్టారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు అరకొర ఫీజు రీయింబర్స్మెంట్.. అది కూడా సకాలంలో చెల్లించకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఇదంతా జగమెరిగిన సత్యం. రామోజీ దివ్యదృష్టికి మాత్రం ఇది కనిపించకపోవడంలో ఆశ్చర్యంలేదు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదింటి బిడ్డలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంటే పెత్తందారి మనస్తత్వంతో రామోజీ ఆత్మ ఓర్వలేకపోతోంది. నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ‘ఉన్నత విద్య పేదలకు మిథ్య’ అంటూ సోమవారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో అభూతకల్పనను సృష్టించే ప్రయత్నం చేసి బొక్కబోర్లాపడింది. ఈనాడు కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. ఆరోపణ: పేదలకు కొరకరాని కొయ్యగా ఉన్నత విద్య.. వాస్తవం: చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లు చెల్లిస్తోంది. విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఇచ్చింది కేవలం రూ.35 వేలలోపు మాత్రమే. అదే సీఎం జగన్ ప్రభుత్వం గరిష్టంగా ఒక్కో విద్యార్థికి రూ.3 లక్షల వరకు చెల్లిస్తూ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లిస్తోంది. టీడీపీ ఐదేళ్లలో రూ.12,141 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. చివరికి గద్దె దిగుతూ 2019లో చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు పెట్టిన బకాయి అక్షరాల రూ.1,778 కోట్లు. ఇది కూడా చెల్లించింది సీఎం జగన్ ప్రభుత్వమే. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలుకాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. అప్పట్లో కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్‌టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి నెలకొంది. అదే ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంటే విద్యార్థులపై ఏ విధంగా భారం పడుతోందో రాజగురువు రామోజీనే చెప్పాలి. ఆరోపణ: ఉన్నత విద్యలో తగ్గిన జీఈఆర్ నిష్పత్తి.. వాస్తవం: రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఉన్నత విద్యలో భాగంగా యూజీ, పీజీ, పీహెచ్డీ, సర్టిఫికేషన్ కోర్సుల్లో ప్రవేశాలు స్థిరంగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో 2017–18లో 16.97 లక్షలు ఉంటే ఇప్పుడు 2021–22 నాటికి 19.29 లక్షలకు పెరిగాయి. అంతకుముందు.. ఏడాది కంటే ఇది స్వల్పంగా తగ్గింది. దీనికి కారణం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యధికంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడమే. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇంటర్న్‌షిప్, కరిక్యులమ్‌లో విప్లవాత్మక మార్పులతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేస్తున్నారు. అందుకు చంద్రబాబు హయాంలో గరిష్టంగా 35వేలు క్యాంపస్ ఎంపికలు నమోదైతే.. సీఎం జగన్ హయాంలో 1.80 లక్షలకు పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీలోనే 60వేలకు పైగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పీజీకి వెళ్లేవారు సహజంగానే తగ్గుతారు. కానీ, ఉద్యోగం చేస్తూ వివిధ రూపాల్లో చాలామంది తమ ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. కానీ, కనికట్టు విద్యలో ఆరితేరిన ఈనాడుకు ఇదంతా కనిపించదు. ఆరోపణ: ప్రభుత్వ కళాశాలలు లేనిచోట పేద విద్యార్థులకు ఇబ్బందులు.. వాస్తవం: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉన్నతస్థాయి ప్రమాణాలతో విద్యను అందించే మహా యజ్ఞాన్ని సీఎం జగన్ తలపెట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేస్తూనే.. ప్రైవేటు కళాశాలల్లో పేదింటి బిడ్డలు చదువుకునేందుకు వీలుగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. కానీ, ఈనాడు, ఎల్లో మీడియా వంటి దుష్టశక్తులు అసత్య కథనాలతో నిత్యం ఈ యజ్ఞంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఎయిడెడ్ కళాశాలల అంగీకారం మేరకే వాటిని ప్రభుత్వం టేకోవర్ చేస్తోంది. ఈ ప్రతిపాదనల్లో చాలా ఎయిడెడ్ కళాశాలలు ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు ఇష్టపడ్డాయి. ఇలా 600 మంది టీచింగ్, 800 మందికి పైగా నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వానికి ఇచ్చేశాయి. వీళ్లందరూ ఆయా ప్రభుత్వ కళాశాలల్లో బోధనలో నిమగ్నమయ్యారు. అంటే ప్రభుత్వ కళాశాలల్లో టీచింగ్ సామర్థ్యం పెరిగినట్లే కదా? ఆరోపణ: ప్రభుత్వ కళాశాలల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. వాస్తవం: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొత్త ఒరవడిలో పయనిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో దాదాపు 18వేల మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు దక్కాయి. ఇది మొత్తం అడ్మిషన్లలో 65 శాతానికి పైగా ఉండటం విశేషం. 2020 నుంచి 15 కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వచ్చాయి. ఐదు ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని అరకులో వంద శాతం అడ్మిషన్లు నమోదయ్యాయి. పాడేరులో 99, చింతపల్లిలో 97, గుమ్మలక్ష్మీపురం 92 శాతం ప్రవేశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు 2019 నాటికి కేవలం 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే నాక్ సర్టిఫికేషన్ ఉంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 61కి చేరడం ‘ప్రభుత్వ చదువుల అభివృద్ధికి’ నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో మొత్తం 168 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే ఏప్రిల్ నాటికి 100 కళాశాలలకు న్యాక్ గుర్తింపుతో కొత్త విద్యా సంవత్సరంలోకి విద్యార్థులను ఆహ్వానించనున్నాయి. ఆరోపణ: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్లడంతో ఆర్థిక భారం.. వాస్తవం: ప్రభుత్వం పూర్తిఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు జగనన్న వసతి దీవెనను ఎటువంటి పక్షపాతం లేకుండా అందిస్తోంది. గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య శ్లాబ్ పెట్టి మరీ ఇచ్చేవారు. కానీ, సీఎం జగన్ పాలనలో శ్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాల వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధిచేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. తద్వారా ప్రతిభగల విద్యార్థులు వర్సిటీల్లో ఉచితంగానే పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. -
Watch Live : కుప్పంకు కృష్ణా జలాలిచ్చిన సీఎం జగన్
కుప్పంకు కృష్ణా జలాలు అందాయి. తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ... కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ... సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు. కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగం మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దేవుడి దయతో ప్రజలందరిక చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం జరుపుకొంటున్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకొంటున్నాం. కొండలు, గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల శ్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి 540 మీటర్ల ఎత్తు అంటే 1600 అడుగుల ఎత్తు.. పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది. 2022, సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు.. ఆరోజునేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాటిచ్చాను. చంద్రబాబు హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి, దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆ నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నా. కృష్ణా జలాలను తీసుకు రావడమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. ఈరోజు మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో 1 టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవలింగ్ ఆపరేషన్స్ పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిపోయింది. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పాలారు ప్రాజెక్టుకు సంబంధించి .6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు తెచ్చాడు. వచ్చే టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులూ పూర్తి చేసి మీకు అందిస్తాడు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. మీరందరూ చూశారు. కొత్త కాదు. 14 ఏళ్లు ఈ పెద్దమనిషి సీఎంగా కూడా చేశాడు. మూడుసార్లు సీఎం అయ్యాడు. 35 సంవత్సరాల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడంటే, కుప్పానికే నీరు తీసుకొనిరాలేదు అంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. దాన్ని నీరుపారే కాల్వగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చేవారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత ముడుపులు పుచ్చుకోవాలనే అంశంపైనే చంద్రబాబు రీసెర్చ్ చేశాడు. ఇక్కడి ప్రజలకు గానీ, పక్కనే ఉన్న పలమనేరులో ఉన్న 2 లక్షలమంది ప్రజలకు గానీ వీరికి మంచి నీళ్లు ఎలా అందించాలి, సాగునీరు ఎలా అందించాలన్న అంశంపై కనీసం ఆయన దృష్టి కూడా లేదంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. కుప్పం, పలమనేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తిచేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన చంద్రబాబు.. అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. 561 కోట్లకు పెంచుకుంటూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వారికి, బినామీలకు పనులు అప్పజెప్పాడు. 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు చంద్రబాబు. కుప్పం, పలమనేరులో 4 లక్షల ప్రజలకు నీరందే కాలవ కాకుండా చంద్రబాబు జేబులోకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపెట్టుకున్నాడంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా? ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నా. ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీజగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూర్ సీఎంసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి రాకుండా, పలమనేరు ప్రజలకు రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు, చంద్రబాబు పార్టనర్. వీళ్లిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఆ కాలేజీని చిత్తూరులో పున:ప్రారంభించేట్టటుగా చేసింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో మరో రెండు విద్యత్తు సబ్ స్టేషన్లు నిర్మించింది ఎవరంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్సులు నిర్మిస్తోంది ఎవరంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్లు ఇచ్చి పనులు జరిగిస్తున్నది ఎవరంటే మీ జగన్. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు వస్తుంటాయి. పులివెందులను, కడపను తిడతాడు. చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడూ కూడా ఇక్కడి ప్రజల్ని గానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడూ మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నది మీ బిడ్డ. పులివెందులలో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా.. పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేసిన కుప్పంలో ఉన్న పేదలందరికీ ఓ మాట చెబుతున్నా.. మీరందరూ నావాళ్లే. బాబుకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి ప్రజలకు మనసు చూపాం. మంచి చేశాం. ఇదే కుప్పాన్ని తీసుకోండి. నేను చెప్పే ఈ అంశాలన్నా ఒక్కసారి టైమ్ తీసుకొని ఆలోచన చేయండి. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు అందుకున్న కుటుంబాలు.. అక్షరాలా ఏకంగా 82,039. అంటే 93.29 శాతం కుటుంబాలు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు. మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇదీ కాదా? అని అడుతున్నా. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది. ఇందులో కుప్పం నియోజకవర్గంలోని నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం అక్షరాలా 1400 కోట్లు. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్నీ అడుగుతున్నా. ఇక్కడున్న మిమ్మల్నందరినీ అడుగుతున్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. 10 సంవత్సరాల మీ బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ కావాలని అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించినది అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలోకి వచ్చిందా? చూసుకోమని అడుగుతున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్ మెంట్ లో చూడండి. ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో కనిపిస్తుంది. మరి ఎవరిది మనసున్న పాలన? ఎవరికది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా. గతంలో మాదిరిగా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూల్లో నిలబడాల్సిన పని లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెలా ఇచ్చే పెన్షన్ నే తీసుకుంటే చంద్రబాబు హయాంలో వాలంటీర్ వ్యవస్థే లేదు. అరకొర పెన్షన్ రూ.1000 కుప్పంలో కేవలం 31 వేల మందికి ఇచ్చిన పరిస్థితులు. మీ బిడ్డ ప్రభుత్వంలో 57 నెలల్లో ఏకంగా 1000 పెన్షన్ ను 3 వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30 వేల మందికి ఇస్తుంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 45374 మంది ఇదే కుప్పంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. చంద్రబాబు 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు హయాంలో 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల నుంచి ఈరోజు ఏకంగా 507 కోట్లు నా అవ్వాతాతలకు, వికలాంగ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, వింతువులకు ఈరోజు మీ బిడ్డ ఇస్తున్నాడు. మనందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసాగా ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా రూ.214 కోట్లు నేరుగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో రైతన్నలకు ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏరోజూ జరగలేదు. రైతు భరోసానే లేదు. ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మన గ్రామ స్థాయిలో ఆర్బీకేలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. కుప్పంలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్లు 93 కనిపిస్తాయి. వాలంటీర్ వ్యవస్థ, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్. ఏకంగా 76 విలేజ్ క్లినిక్స్ కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తున్నాయి. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే సచివాలయాల్లో పని చేస్తున్న మన పిల్లలు 942 మంది. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు వీటిలో పని చేస్తున్న పిల్లలు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. ఇవన్నీ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదు కేవలం 57 నెలల మీ బిడ్డ పాలనలోనే జరుగుతోంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు దగా చేస్తే, 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు. అక్కచెల్లెమ్మల జీవితాలు చిన్నాభిన్నమైన పరిస్థితి గతంలో ఉంటే మనందరి ప్రభుత్వం వైయస్సార్ ఆసరా కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్లు ఇస్తే, ఒక్క కుప్పంలోనే అక్షరాలా 44,888 మంది అక్కచెల్లెమ్మలకు 172 కోట్లు ఇచ్చాం. మనందరి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది మరో 30 కోట్లు. దీని వల్ల 6055 సంఘాలకు మంచి జరిగిస్తూ 59662 మంది అక్కచెల్లెమ్మలకు మరో 30 కోట్లు ఇచ్చి తోడుగా నిలబడింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. చంద్రబాబు హయాంలో చదివించే తల్లులకు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మ ఒడి ద్వారా కుప్పం నియోజకవర్గంలో చదివించే తల్లులు 35951 మందిని ప్రోత్సహిస్తూ ఇచ్చినది అక్షరాలా రూ.155 కోట్లు. కుప్పంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15721 పట్టాలిచ్చాం. ఈనెలలోనే మరో 15 వేల ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ మొత్తం 30755 ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. బాబు హయాంలో కుప్పంలో ఇళ్లు మంజూరు చేసింది పేదలకు కేవలం 3547 మాత్రమే. అందులో కట్టింది కేవలం 2968 మాత్రమే. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాలా 7898 ఇళ్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4871 ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబు హయాంలో 45-60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం ఆయన చేసింది ఒక సున్నా. మీ బిడ్డ హయాంలో ఈ 45-60 సంవత్సరాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వైయస్సార్ చేయూత ద్వారా కుప్పంలో ఏకంగా 19921 మందికి మంచి జరిగిస్తూ వారి కుటుంబాల ఖాతాల్లోకి పంపింది 85 కోట్లు. వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి. నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని.. పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 108, 104 వాహనాలు కుయ్ కుయ్ కుయ్ అని తిరుగుతున్నాయంటే కేవలం మీ అన్న పాలనలోనే. ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయంటే మనసున్న మన పాలనలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చాడు. కుప్పంలో 7002 మందికి అందించిన సాయం 28 కోట్లు అయితే, మీ బిడ్డ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని మెరుగుపర్చి 1000 ప్రొసీజర్లను 3350కి తీసుకుపోయి విస్తరింపజేసి, ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ వీటి ద్వారా ఏకంగా కుప్పంలోనే 17552 మందికి మంచి జరిగిస్తూ 64 కోట్లు నేరుగా ఇచ్చాం. పేదవాడి కోసం, పిల్లల చదువుల కోసం బాబు ఏరోజూ ఆరాటపడలేదు. అరకొర ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కేవలం 8459 మందికి మాత్రమే రూ.27 కోట్లు. మనందరి ప్రభుత్వం 57 నెలల కాలంలోనే ప్రతి పిల్లాడికీ 100 శాతం పూర్తి ఫీజురీయింబర్ష్ మెంట్ ఇస్తూ 12093 మందికి విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చెల్లించిన సొమ్ము అక్షరాలా రూ.61 కోట్లు. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే ఇచ్చే అరకొర సొమ్ముకూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు, తనకు కాని వారు అని ఎలా విభజించాడో నేను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికీ జల్లెడ పడుతూ ఏ ఒక్కరికీ మిస్ కాకుండా ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పెట్టడం జరిగింది. ఇంత పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ అందుతున్న పరిస్థితులు మన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మూడు సార్లు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదంటే ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, కుప్పం నియోజకవర్గానికి అర్హుడేనా? ఆలోచన చేయండి. బాబు ఎలాంటి వాడో తెలుసుకున్న చంద్రగిరి ప్రజలు.. చంద్రగిరిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసి పోటీ చేస్తే 1983లోనే ఏకంగా 17 వేల ఓట్లతో ప్రజలు ఓడగొట్టారు. ఆ తర్వాత ఈ పెద్దమనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ, తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యం ఏలుతున్నాడు. కనీసం ఇక్కడ ఒక ఇల్లయినా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం మీతో పని కావాలి. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా ఏరోజూ రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో నిలదీయాల్సిన అవసరం ఉంది. సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు. పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచైనా ఉందా? ఒక్క స్కీమైనా ఉందా అని అడిగితే మాట్లాడడు. ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు. సామాజికవర్గాలకు మీరు చేసిన న్యాయం ఏంటని అడిగితే చివరకు కుప్పంలో కూడా బీసీ ఎమ్మెల్యేను పెట్టని తీరు చూస్తే సామాజిక న్యాయం ఎక్కడ చేశారని అడిగితే అదీ మాట్లాడడు. పేద ఇంటికి వెళ్దాం. ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం. 14 ఏళ్లు మీరు చేసిన మంచి ఏంటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని గట్టిగా నిలదీస్తే అదీ మాట్లాడడు. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా.. అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారని అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇదీ బాబు మార్క్ రాజకీయం. చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నా. భరత్ ను, మన బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 సంవత్సరాల్లో మంచి చేశాం. భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాట ఇస్తున్నా. ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా? 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు. ఏరోజైనా ఏ మంచీ చేయని ఈ వ్యక్తి రంగు రంగుల మేనిఫెస్టోతో ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడో ఈ వ్యక్తిని నమ్మగలమా. 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం చూశారు. మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ మంచి జరిగిన ప్రతి విషయం కూడా ఇంకో వంద మందితో చెప్పి ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ పూనుకోవాలని విన్నవిస్తున్నా. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.