AP Special
-
సీటు లేక పాట్లు
సాక్షి, అమరావతి: సీట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడటంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. అలక పాన్పు ఎక్కిన నేతలను పిలిచి సర్దిచెబుతున్నారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బొడ్డు వెంకట రమణలతో విడివిడిగా చర్చలు జరిపారు. ► తొలి జాబితాలో సీటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు మరోసారి సూచించారు. తనను ఓడిపోయే చోటకు ఎందుకు పంపుతున్నారని గంటా ప్రశ్నించడంతో గెలుస్తావంటూ ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. గంటా ఇందుకు ససేమిరా అంటూ భీమిలి లేదా విశాఖ జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని కోరారు. జి.మాడుగుల, చోడవరం స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ► మైలవరం సీటు తనకే ఇవ్వాలని దేవినేని ఉమామహేశ్వరరావు కోరగా ఆ సీటు వసంత కృష్ణప్రసాద్‌కి ఇస్తున్నానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయం చూస్తానని దేవినేనికి సర్దిచెప్పారు. ఆయన పేరును పెనమలూరుకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ► తెనాలిని జనసేనకు కేటాయించడంతో సీటు గల్లంతైన మాజీ మంత్రి ఆలపాటి రాజాతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన్ను బుజ్జగించినట్లు తెలిసింది. అయితే గుంటూరు జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ► తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీటును ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తితో నిష్క్రమించారు. అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తానని పేర్కొనగా గోవింద్ అసంతృప్తిగా వెళ్లిపోయినట్లు సమాచారం. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 10 గంటల్లోనే దర్శనం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకోగా.. 23,656 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.09 కోట్లు. కాసేపట్లో టీటీడీ పాలకమండలి సమావేశం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆద్వర్యంలో అన్నమయ్య భవన్ లో సమావేశం కానున్న పాలకమండలి సభ్యులు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్న పాలకమండలి -
ఒంటరి బతుకుకు జగనన్న అండ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఒంటరి బతుకుకు జగనన్న అండ ఐదేళ్ల క్రితం మా ఆయన ఈరోతు యుధిష్టరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికే ఇద్దరు పిల్లలున్న మా కుటుంబం కష్టాల్లో పడింది. ఎలా బతకాలో తెలియక సతమతమయ్యాను. అప్పటికే నాకు టైలరింగ్ రావడంతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం సొలికిరి గ్రామంలో దుకాణం పెట్టుకున్నాను. దానిపై కాస్తో కూస్తో ఆదాయం వచ్చేది. కానీ అది భరోసానివ్వలేదు. గత చంద్రబాబు పాలనలో పింఛన్ కోసం ఎన్నోమార్లు దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కమిటీలు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నాయి. ఇంతలో దేవుడిలా జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. నా కుటుంబాన్ని ఆదుకున్నారు. నాకు వితంతు పింఛన్ వచ్చింది. టైలరింగ్ షాప్ నడుపుతున్న నాకు జగనన్న చేదోడు పధకం ద్వారా ఏడాదికి రూ. 10వేల వంతున మూడేళ్ళుగా అందుకొంటున్నాను. ఆ మొత్తంతో నా టైలరింగ్ షాప్‌ను, ప్యాన్సీ షాప్‌గా మార్చుకున్నాను. నా ఇద్దరు పిల్లలను ఎంపీపీ స్కూల్లో చదివిస్తున్నాను. అందులో ఒకరి పేరున అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు నా ఖాతాలో జమవుతున్నాయి. పిల్లల చదువుకు బెంగ లేకుండా పోయింది. నా ఒంటరి బతుకుకు జగనన్న అండ దొరికింది. ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి బయట పడ్డాను. దానికి కారణమైన జగనన్నకు రుణ పడి ఉంటాను. – ఈరోతు కాంచన, సొలికిరి (టంకాల మోహనరావు, విలేకరి, భామిని) ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకున్నాం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. నా భర్త, నేను కూలి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. ఆ సంపాదనతో ముగ్గురు పిల్లల పోషణ కష్టంగా మారింది. 2019 తర్వాత మా జీవితంలో వెలుగులు నిండాయి. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750లు చొప్పున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లకు రూ.63,012, జగనన్న తోడులో రూ.10 వేలు, సున్నా వడ్డీగా రూ.2,210, వడ్డీలేని రుణంగా రూ.50 వేలు, బ్యాంకు రుణంగా రూ.2 లక్షలు అందాయి. ఆ మొత్తంతో తిరుపతి నగరం బీటీఆర్ కాలనీలో చిల్లర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా నెలకు రూ.10వేల నుంచి రూ.13 వేల వరకు ఆదాయం వస్తోంది. పిల్లలు సైతం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం మా కుటుంబం సంతోషంగా ఉంది. జగనన్న సంక్షేమ పథకాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ జగనన్నే సీఎంగా రావాలి. – బి.వనజమ్మ, తిరుపతి (పోగూరి చంద్రబాబు, విలేకరి, తిరుపతి సిటీ) సర్కారు సాయంతో సాఫీగా జీవనం మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. టాక్సీడ్రైవర్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాం. అనుకోకుండా నాకు ప్రమాదం జరిగింది. దాంతో ఏ పనీ చేయలేకపోయాను. గత ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆసరా లభించలేదు. అప్పు చేసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో చిన్నపాటి ఎలక్ట్రికల్ దుకాణం పెట్టుకుని జీవనం ప్రారంభించాను. అయితే అంతంతమాత్రంగానే వ్యాపారం సాగడం వల్ల రేపటిగురించి ఎప్పుడూ భయంగానే ఉండేది. అదృష్టవశాత్తూ రాష్టంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడింది. నాకున్న ముగ్గురు కుమార్తెల చదువులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతోహాయిగా సాగిపోయాయి. పెద్దమ్మాయి కరీనా బీటెక్ పూర్తి చేసింది. రెండో అమ్మాయి షరీనా హారీ్టకల్చర్ మూడో ఏడాది చదువుతోంది. మూడో అమ్మాయి విలీనా బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రావడం వల్ల వారి చదువులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో కాలికి రూ.50 వేల విలువైన శస్త్ర చికిత్స ఉచితంగా జరిగింది. మా అమ్మకు రెండు కుంచాల భూమి ఉండడంతో రైతు భరోసా కింద రూ.7 వేలు వస్తోంది. నా భార్య మహాలక్ష్మికి వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వేలు వంతున అందింది. మా అమ్మ లలితమ్మకు పింఛన్ అందుతోంది. సీఎం జగన్ పాలనలో నా కుటుంబానికి అన్ని విధాలా మేలు జరిగింది. – నల్లి వెంకయ్యదాసు, మలికిపురం (తోట సత్యనారాయణ, విలేకరి, మలికిపురం) -
Fact Check: స్థిరాస్తులకు రక్షణ కల్పించినా ఏడుపేనా?
సామాన్యులకు మంచి జరిగితే తట్టుకోలేకపోతున్నారు. భూ యాజమాన్య హక్కులపై పటిష్ట చట్టం తీసుకొస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థ తీసుకొద్దామంటే అడ్డం పడుతున్నారు. దానిపై రెచ్చగొట్టేలా అబద్ధాల కథనాలు అచ్చేస్తున్నారు. ఇదీ రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు పనితీరు. అసలు హైదరాబాద్‌లో ఫిల్మ్సిటీకోసం వేలాది ఎకరాలు ఆక్రమించేసిన రామోజీ ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంటే దానివల్ల తీరిన నష్టమంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గగ్గోలు పెడుతున్నారు. కనీసం నలుగురు నవి్వపోతారన్న ఇంకితం కూడా లేకుండా ‘కోర్టులకూ కత్తెర... భూ హక్కులకు పాతర’ అంటూ ఓ వికృత కథనాన్ని వండి వార్చారు. సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ పేరిట వందల ఎకరాల పేదల భూములను లాక్కున్న రామోజీరావు ఏపీలో భూ హక్కుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. విశాఖ, విజయవాడలోనూ ఈనాడు కార్యాలయాల కోసం అత్యంత విలువైన భూములను లీజు పేరుతో కబ్జా చేసిన ఆయన భూ మాఫియా డాన్లకు ఏమాత్రం తీసిపోరు. అలాంటి వ్యక్తి ఏపీలో ప్రజల స్థిరాస్తులకు రక్షణ కల్పించే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అడ్డగోలుగా వక్రీకరించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందోనన్న భయంతో అభూతకల్పనలతోదుష్ప్రచారానికి దిగారు. ఒకవైపు ఈ చట్టాన్ని మేధావులు, భూ చట్టాల నిపుణులు ప్రశంసిస్తుంటే దీనివల్ల ఏదో నష్టం జరిగిపోతోందంటూ అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అన్నీ అభూత కల్పనలే... ఈ చట్టం ద్వారా కోర్టులకు కత్తెర పడుతోందని, అధికారులకే హక్కుల నిర్ణయాధికారం ఉంటుందనేది పచ్చి అబద్ధం. కోర్టుల పరిధి, నియంత్రణ ఎప్పటిలానే ఉంటుంది. రికా>ర్డ్ ఆఫ్ టైటిల్స్‌లో నమోదైన వివరాలు, కోర్టు అప్పీళ్లు, రివిజిన్ పిటిషన్లు ఉంటే వాటి గురించి టీఆర్ఓ(టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి)కి తెలపాల్సి వుంటుంది. ఏదైనా భూమికి సంబంధించి వివాదం ఏర్పడితే ఆ వివరాలను టీఆర్ఓకి తెలిపితే ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. కోర్టుల్లో పరిష్కారమయ్యాకే తుది వివరాలను అందులో పొందుపరుస్తారు. అంటే భూ యజమానులకు కచ్చితమైన టైటిల్ ఇవ్వడం, దానిపై ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుండడం హక్కులకు పాతర వేయడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. తుది నివేదిక మీ భూమి పోర్టల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నపుడు భూ హక్కులకు ఎందుకు ప్రమాదం ఉంటుందనేది ఎవరికైనా అర్థమవుతుంది. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ ప్రభుత్వం తీసుకొచి్చన ఈ చట్టంపై ఈనాడు వక్రీకరిస్తోంది. రీ సర్వే తర్వాతే హక్కుల నిర్థారణ.. ప్రస్తుతం ఉన్న ప్రజెంటివ్ టైటిల్ విధానంలో భూమి ఆ«దీనంలో ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదవకపోతే సంబంధిత యజమానికి ఇబ్బంది ఎదురవుతుంది. రీ సర్వేలో భూములపై ఉన్న వాస్తవ పరిస్థితిని సర్వే చేసి, వాటిని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేస్తున్నారు. ఆ తర్వాతే భూ యజమానుల హక్కులను నోటిఫై చేస్తారు. దానిపై రెండేళ్ల వరకు ఎలాంటి వివాదాలు రాకపోతే అప్పుడు ఆ భూమిపై వారికి పూర్తి హక్కు ఇస్తారు. ఆ హక్కుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల స్థిరాస్తులకు ఎసరు పెట్టడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. ► టీడీపీ హయాంలో వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల లక్షలాది ఎకరాలు ఆంక్షల జాబితాలో చేరిపోయాయి. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఆ భూముల యజమానులు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి తప్పులు ఈ విధానం ద్వారా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. ► ప్రస్తుతం భూములపై రికార్డుల పరంగా కచి్చతమైన హక్కులు లేకపోవడం వల్ల దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని భూకబ్జాదారులు మోసాలకు తెగబడుతున్నారు. భూమిపై ఒకలా, రికార్డుల్లో మరోలా హద్దులు ఉండడంతో భూ వివాదాలు ఏర్పడుతున్నాయి. టైట్లింగ్ చట్టం ప్రకారం రీ సర్వే చేస్తే జియో కోఆర్డినేట్స్ ద్వారా హక్కులు నిర్థారించవచ్చు. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకే... రీసర్వేలో అందరి సమక్షంలోనే ప్రతి భూ కమతం వివరాలు కొత్త టెక్నాలజీతో సర్వే చేసి, వారి దగ్గరున్న పత్రాలను పరిశీలించి కొత్త రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న అనేక రకాల రికార్డుల స్థానంలో ఇకపై ఈ ఒక్క రిజిస్టర్ ఉంటే సరిపోతుంది. అంతవరకు ఉన్న రికార్డులు కూడా చెల్లుబాటవుతాయి. కానీ వాటి అవసరం ఉండదు. ఒకవేళ అన్ని పత్రాలున్నా రికార్డుల్లో నమోదవకపోతే అప్పిలేట్ అథారిటీని సంప్రదించే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై భయభ్రాంతులకు గురిచేసేలా అడ్డగోలుగా ఈనాడులో అచ్చేశారు. ► ఒకసారి భూ హక్కు ఖరారయ్యాక రెండేళ్లలో అభ్యంతరాలు ఏమీ రాకుంటే అదే ఫైనల్ అవుతుంది. దీన్ని వక్రీకరించడం అన్యాయం. రీ సర్వేలో అభ్యంతరాలు లేని భూములు, వివాదాలున్న భూములు, వివిధ కోర్టు కేసుల్లో ఉన్న భూములు, తాకట్టు పెట్టిన భూములు సవివరంగా నమోదవుతాయి. ఎలాంటి వివాదాలు లేని భూములను రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో ఎక్కిస్తారు. ఆ తర్వాత కూడా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని దానిపై నిర్ణయం తీసుకుంటారు. తప్పుడు ప్రచారంతో పైశాచికానందం ► ఒక భూమితో సంబంధంలేని వ్యక్తి కేవలం వివాదం సృష్టించాలనే ఉద్దేశంతో సివిల్ కోర్టులో కేసు వేస్తే యజమాని కోర్టుల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. కొత్త చట్టంలో ఇలాంటి సమస్యలపై సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కాకుండా సహజ న్యాయ సూత్రాల ప్రకారం సంబంధిత రైతులు, సమీప రైతులు, గ్రామ పెద్దలందరి సమక్షంలో విచారణ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అయితే సివిల్ కోర్టుల అధికారాన్ని లాక్కుందనేది ఈనాడు తప్పుడు ప్రచారం. ► కోర్టు ఉత్తర్వులు వెంటనే తెలిస్తేనే రికార్డులు పారదర్శకంగా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత వివరాలే రికార్డుల్లో ఉంటే కోర్టు తీర్పు ద్వారా ఎలా న్యాయం జరుగుతుంది. న్యాయబద్ధంగా రికార్డులు ఉండడాలని కోరుకోవడం కోర్టు ఆదేశాలను సత్వరం పాటించకపోవడం కాదు కదా.. ► అప్పిలేట్ విధానంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తుది రికార్డు తయారయ్యే వరకూ ఏ స్థాయి కోర్టుల్లో వివాదాలున్నా వాటిని కోర్టు పరిధిలో ఉన్న భూమిగానే చూపుతారు. కోర్టుల తుది ఉత్తర్వుల ప్రకారమే రికార్డుల్లో పొందుపరుస్తారు. న్యాయ వ్యవస్థలకు ముకుతాడు వేసేలా ఈ చట్టం ఉందనడం ఈనాడు వక్రబుద్ధికి నిదర్శనం. వివరాల నమోదు ఎప్పటినుంచో ఉంది ► అప్పుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం అన్నది ఇప్పుడే కొత్తగా రాలేదు. వాటివల్ల ఇటు భూ యజమానులు, తాకట్టు పట్టుకున్న వారికీ ఇబ్బంది ఉండదు. దీనివల్ల ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు పారదర్శకంగా ఉంటాయి. ► 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ఎంతగా ప్రయతి్నంచినా తీసుకురాలేని ఈ చట్టాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడం సాహసమే. దానిని ప్రశంసించాల్సింది పోయిదుష్ప్రచారం చేయడం రామోజీ పైశాచిక చర్య. ► రెండేళ్ల సుదీర్ఘ కసరత్తు, కేంద్ర ప్రభుత్వ సూచనలు, రాష్ట్రపతి ఆమోదం తర్వాతే ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. రీ సర్వేలో రైతుల సమక్షంలోనే హద్దులు నిర్థారించి రికార్డులు అప్డేట్ చేయడం యజమానులకే మేలు. కానీ సొంత వారి కోసం రికార్డులు సృష్టిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. అధికారులపైనా ఈనాడు చిన్నచూపు ► బ్రిటీష్ కాలం నుంచి భూపరిపాలనా వ్యవస్థ అధికారుల చేతుల్లోనే ఉంది. ల్యాండ్ సీలింగ్, ఎస్టేట్ ఇనాం, అసైన్మెంట్, సర్వే, హద్దుల చట్టం, ఆర్ఓఆర్ వంటి చట్టాలన్నీ ప్రభుత్వంలోని అధికారులు చేసినవే. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకే భూపాలన అధికారాలు ఇచ్చారు. హక్కుల నిర్ధారణ, రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విభాగాలకు వందేళ్లకు పైగా అనుభవం ఉంది. అయితే వారికి ఎలాంటి నైపుణ్యం, అవగాహన లేదని చెప్పడం రామోజీ నీచబుద్ధికి నిదర్శనం. ► కన్‌క్లూజివ్ టైటిల్‌ని రాత్రికే రాత్రే ఇవ్వరు. రాత్రికి రాత్రే ఎవరి పేర్లూ మారిపోవు. రీ సర్వే పూర్తయ్యాక టైటిల్స్ ఇస్తారు. దీనికి రెండేళ్లు పడుతుంది. కానీ అధికార పార్టీ నేతలు రాత్రికి రాత్రి రైతుల భూములను ఇతరుల పేర్లకు మార్చేస్తారన్నది ప్రభుత్వంపై అక్కసే. ► ప్రస్తుతం మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే అభ్యంతరాలకు 15 రోజుల సమయం ఇస్తున్నారు. కొత్త చట్టంలో రెండేళ్లు అవకాశం ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే అప్పుడు కన్‌క్లూజివ్ టైటిల్ ఇస్తారు. దీన్ని వక్రీకరించడం ఈనాడుకే చెల్లింది. ► ప్రస్తుతం 1బీ, పాస్‌పుస్తకం, అడంగల్, రిజిస్ట్రేషన్ డీడ్ వంటి అనేక పత్రాలున్నాయి. ఈ చట్టం ప్రకారం వీటన్నింటి స్థానంలో ఒకే ఒక శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రికార్డులన్నీ పూర్తిగా అప్డేట్ అయి ఉంటాయి. వాటిని ఎవరూ తారుమారు చేసే అవకాశం ఉండదు. ఆన్లైన్లోనే సురక్షితంగా రికార్డులు ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. రైతుల వద్ద ఉన్న దస్తావేజులకు విలువ ఉండదనే తప్పుడు ప్రచారం తీసుకొచ్చారు. ► భూపరిపాలనా వ్యవస్థలో అధికారం, కండబలం, ధనబలం లాంటి అంశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటుండకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చారు. వివాదాల్లేని రీతిలో కన్‌క్లూజివ్ టైటిల్స్‌ను ఖరారు చేస్తారు. ఈ రికార్డులు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా సరే వారి భూమిపై ఏ విధమైన మార్పు జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్న వారికి, కండబలం ఉన్న వారి చేతుల్లోకి భూములు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నది రామోజీ వంకర బుద్ధికి నిదర్శనం. -
దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : రూ.5.13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వేగంగా విస్తరిస్తోంది. ఫైవ్‌స్టార్ హోటల్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్, స్పైసెస్ పార్క్, వైఎస్సార్ చేయూత వంటి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. గుంటూరు పట్టణంలో తొలి ఫైవ్‌స్టార్ హోటల్‌ను ఐటీసీ ఏర్పాటుచేసింది. సుమారు రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఈ ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించారు. జనవరి 12, 2022న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీసీ సీఎండీ సంజీవ్ పూరి మాట్లాడుతూ.. తమ వ్యాపార విస్తరణకు ఏపీ ఎంతో కీలకమని.. విశాఖ, విజయవాడతో పాటు ఆధ్యాత్మిక నగరాల్లో హోటళ్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రూ.200 కోట్లతో ఐటీసీ స్పైసెస్ పార్క్ మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను ఐటీసీ అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తున్నారు. సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పార్క్‌ను సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్, 2022లో ప్రారంభించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాక.. 5,500 మంది రైతు కుటుంబాలు ఈ పార్క్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటుచేసి, వేగంగా విస్తరించింది. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగుచేయిస్తోంది. ఈ పంటలను నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ‘చేయూత’లో భాగస్వామిగా.. ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన చేయూత పథకంలో ఐటీసీ ప్రధాన భాగస్వామిగా చేరింది. ఇందులో భాగంగా.. మహిళలు చేసే వ్యాపారాలు, మహిళా మార్ట్ల పేరుతో ఏర్పాటుచేస్తున్న సూపర్ మార్కెట్లకు ఐటీసీ ఉత్పత్తులను అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం ఐటీసీకి రాష్ట్రంతో సుదీర్ఘ అనుబంధముంది. మా నిర్ణయాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం బాగుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాం. త్వరలో మరో రూ.400 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్నాం. ముఖ్యమంత్రి విజన్‌తో రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్యక్రమంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగస్వామ్యం కావడంతో పాటు ఫుడ్ ప్రోసెసింగ్, ఆక్వారంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాం. – గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ సీఎండీ సంజీవ్ పూరి -
Fact Check: రామోజీ.. ఇసుకపై బురద రాతలు మానవా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రామోజీరావు వక్రరాతలు మానడంలేదు. నిత్యం తన ఈనాడు పత్రికలో ఇసుకపై బురద వార్తలు రాస్తూనే ఉన్నారు. తన గలీజుతనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు రామోజీరావు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తనకు చెప్పినట్లే కథనాలు అల్లేస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నమ్మేస్తారని అపోహ పడుతున్నారు. చంద్రబాబు హయాంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్దఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజలకు సులభంగా ఇసుక అందుతున్నా కూడా ప్రభుత్వంపై దు్రష్పచారానికి ఒడిగడుతున్నారు. నిజానికి ఇసుక తవ్వకాల్లో ఎన్జీటీ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఉన్నా.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలతో వాటిల్లో తవ్వకాలను నిలిపివేసింది. తర్వాత ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి అన్ని అనుమతుల కోసం గనుల శాఖ దరఖాస్తు చేసింది. అందులో భాగంగా ఇప్పటివరకు 61 ఓపెన్ రీచ్‌లకు అనుమతులు లభించాయి. మిగిలిన వాటికి మరో వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్న డీసిల్టింగ్ పాయింట్లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ‘ఉల్లంఘనలు నిజం’ అంటూ పతాక శీర్షికతో పచ్చి అబద్ధాలను ఈనాడు అచ్చేసింది. ఎన్జీటీకి 3 నెలలకోసారి నివేదిక ఇచ్చేలా చర్యలు ఇసుక విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్జీటీ నుంచి వచ్చిన సూచనలు, మార్గదర్శకాలతో దీన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు గనుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం తనిఖీలు న్యాయస్థానాల ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లతో కూడిన బృందాలు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఇటీవల పరిశీలించాయి. ఆయా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా అనే అంశాలను రికార్డు చేశాయి. ఈ నివేదికలను న్యాయస్థానాలకు సమర్పించారు. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ తీసుకున్న చర్యల కారణంగా అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇదే అంశాన్ని కలెక్టర్లు కూడా తమ నివేదికలో స్పష్టం చేశారు. ఈనాడు మాత్రం కలెక్టర్లు వచ్చి వెళ్లిన తరువాత ఇసుక తవ్వకాలు మళ్లీ జరుగుతున్నాయంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచురించింది. అదికూడా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలించి వెంటనే తవ్వకాలు ప్రారంభించారంటూ నిస్సిగ్గుగా రాసింది. ఒకవైపు ఇసుక రీచ్‌ల్లో అధికారిక తనిఖీలు జరుగుతూ ఉంటే, మరోవైపు ఎవరైనా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలిస్తారా? అసలు తవ్వకాలే జరగడం లేదని అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక ఇస్తే, రోజుకు రెండు వేల టన్నుల ఇసుక తవ్వుతున్నారంటూ, కంప్యూటరైజ్డ్ వే బిల్లులు లేకుండానే ఆ ఇసుకను రవాణా చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. పాత ఫోటోలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేసింది. జరగని రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ లేదంటూ, రీచ్‌ల్లో సీసీ కెమేరాలు లేవని, అడుగడుగునా ఉల్లంఘనలే జరుగుతున్నాయని గగ్గోలు పెట్టడం రామోజీ వక్రబుద్ధికి నిదర్శనం. ఆ పత్రికకు నిబద్ధత ఎక్కడిది? గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వర్షాల వల్ల ఇసుక తవ్వకాలు రీచ్‌ల్లో జరగలేదు. వేసవికాలంలో ముందుజాగ్రత్తగా సిద్ధం చేసిన ఇసుక డిపోల నుంచే ప్రజలకు విక్రయాలు జరిగాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ ఈనాడు పత్రిక దానిని అక్రమ ఇసుక తవ్వకాలు కిందనే నిర్ధారించడం ఆ పత్రికకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. బాధ్యతారహితంగా ఈనాడు ప్రచురించే ఇటువంటి కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, మైనింగ్ శాఖ -
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
సాక్షి, అమరావతి : అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్ట విరుద్ధంగా నిధులు అందించే కామథేనువు ‘మార్గదర్శి’ ఒట్టిపోయింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ‘మార్గదర్శి’ పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టంచేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టీపాటల ప్రైజ్‌మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మార్గదర్శి’ ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. రూ.4,880 కోట్లకు పైగా బకాయిలు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే, కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అమలుచేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. మరోవైపు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సీఐడీ విభాగం 2022, నవంబరులో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరడంలేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆ సంస్థలో మనీ టర్నోవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టీ గ్రూపుల చిట్టీపాటల మొత్తం (ప్రైజ్‌మనీ) చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్‌మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ► ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు నెలనెలా రూ.260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్లు వరకు చిట్టీ పాటల ప్రైజ్‌మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబరు నుంచి ఆ ప్రైజ్‌మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు రూ.2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ► అలాగే, మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరునెలల నుంచి రెండేళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దాదాపు రూ.4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంచనా వేశారు. కొర్రీలతో చందాదారులకు ముప్పుతిప్పలు ఇదిలా ఉంటే.. చిట్టీ పాటల ప్రైజ్‌మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ, తమ గల్లాపెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులను మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా.. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రశీదు డిపాజిట్‌గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండటం గమనార్హం. ఇలా అక్రమంగా రశీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ, సీఐడీ అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండడంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. చందాదారులకు సీఐడీ రక్షణ.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సీఐడీ నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు మోసపోకుండా, వారి చిట్టీల మొత్తం, డిపాజిట్లకు న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించేందుకు సీఐడీ ఉద్యుక్తమైంది. తద్వారా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులను ముంచేయకుండా సీఐడీ కార్యాచరణను చేపట్టింది. -
జాతీయ స్థాయిని మించి ఏపీ తలసరి వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022–23 వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహార, ఇతర వస్తువులతోపాటు ఆహారేతర వస్తువుల వినియోగం ఆధారంగా 2022–23 గృహ వినియోగ వ్యయ సర్వే కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న రాగులు, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఆహారేతర వస్తువులైన ల్యాప్‌టాప్, పీసీ, టాబ్లెట్, మొబైల్, సైకిల్, మోటార్ సైకిల్, స్కూటీ, స్కూల్ యూనిఫాం, స్కూల్ షూ తదితర వస్తువులను పరిగణనలోకి తీసుకుని నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని లెక్కించినట్టు సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో తలసరి వ్యయం ఇలా.. జాతీయ స్థాయిలో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,860 ఉండగా.. పట్టణాల్లో ఆ వ్యయం రూ.6,521 ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,996 ఉండగా.. పట్టణాల్లో రూ.6,877 ఉన్నట్టు సర్వే వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి వినియోగ వ్యయం రూ.4,959గా ఉంది. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.2,257 రూపాయలు ఉండగా.. పట్టణాల్లో రూ.4,557 ఉందని సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే ఛండీగఢ్‌లో గ్రామాల్లో అత్యధికంగా నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.7,467 ఉండగా.. పట్టణాల్లో రూ.12,577 ఉంది. అత్యల్పంగా లడ్హాక్లో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉండగా.. పట్టణాల్లో రూ.5,511 ఉందని సర్వే నివేదిక తెలిపింది. -
కుప్పానికి ‘కృష్ణా’ జలాలు
సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. అంచనాల్లోనే బాబు వంచన.. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను చేపట్టి.. సాగు, తాగునీరు అందిస్తానని కుప్పం ప్రజలకు 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు దశల్లో ఎత్తిపోసి.. 123.641 కిమీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని ప్రకటించారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు నీళ్లందించే పథకంలోనూ చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను 123.641 కిమీల పొడవున తవ్వేందుకు మట్టి, కాంక్రీట్ పనులకు రూ.203.11 కోట్లు వ్యయం అవుతుంది. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్మైన్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం ఈ పనుల విలువ రూ.293.11 కోట్లు. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015, మేలో అంచనాలు రూపొందించారు. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే.. టెండర్ల దశలోనే రూ.120 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. బినామీతో కలిసి యథేచ్ఛగా దోపీడీ.. ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను అప్పటి కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టి ఆ రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్‌వేసి 2015, ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు రూపొందించారు. దాంతో టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక (ఎక్సెస్) ధరకు కోట్‌చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే ఆ టెండర్‌ను రద్దుచేయాలి. కానీ.. చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆ టెండర్‌ను ఆమోదించి రూ.430.26 కోట్ల పనులను ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఆర్కే ఇన్ఫ్రాకు రూ.43 కోట్లు ఇచ్చేలా చక్రం తిప్పిన చంద్రబాబు.. వాటిని ఎవరి జేబులో వేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఈ పనులను శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టడంపై చంద్రబాబు బినామీ సీఎం రమేష్ అలకబూనారు. దీంతో50 శాతం పనులను సీఎం రమే‹Ùకు చెందిన రితి్వక్ ప్రాజెక్ట్స్‌కు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించారు. కానీ.. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డిని వెళ్లగొట్టి మొత్తం పనులను సీఎం రమే‹Ùకు చంద్రబాబు కట్టబెట్టారు. కానీ, రమేష్ మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీగా లబ్ధిపొందారు. దోచేసిన సొమ్ములో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వాటాలు పంపారని అప్పట్లో టీడీపీ వర్గాలే కోడై కూశాయి. చెప్పారంటే చేస్తాడంతే.. వరుసగా ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిపారు. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పంను మున్సిపాల్టీని చేయడంతోపాటు దీని కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను, పోలీసు సబ్ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. రూ.66 కోట్లతో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో.. 2022, సెపె్టంబరు 23న కుప్పంలో సీఎం జగన్ పర్యటించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేసి.. కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ పనులను 2023, డిసెంబరు 15 నాటికే పూర్తిచేయించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలను ఎత్తిపోయడం 2023, డిసెంబర్ 18న ప్రారంభించారు. పాలార్ రిజర్వాయర్‌కు శ్రీకారం.. కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా కుప్పం మండలం గణేశ్వరపురం వద్ద పాలార్ నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. రూ.214.81 కోట్లతో పాలార్ రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు శుక్రవారం పరిపాలనా అనుమతినిస్తూ జీఓ జారీచేశారు. ఇందులో రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే, డీపీఆర్ తయారీకి రూ.0.432 కోట్లు.. ముంపునకు గురయ్యే 90 ఎకరాల భూసేకరణకు, 258 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కలి్పంచడానికి, 357.06 ఎకరాల అటవీ భూమికి పరిహారం చెల్లించడానికి రూ.47.878 కోట్లు కేటాయించారు. దీంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా గుడిపల్లి మండలం యామిగానిపల్లి వద్ద 0.710 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించడం.. శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద 0.354 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి 2,500 ఎకరాలకు నీళ్లందించే పనులు చేపట్టడానికి రూ.535.435 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన జీఓ–100ను ఆదివారం రాత్రి జారీచేశారు. వాస్తవానికి.. పాలార్ రిజర్వాయర్‌కూ చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇది పూర్తయితే కుప్పంలో తనకు రాజకీయంగా ఉనికిలేకుండా పోతుందని ఆందోళనతో ఆయన తమిళనాడు సర్కారును ఉసిగొల్పి సుప్రీంకోర్టులో కేసులూ వేయించారు. కుప్పం నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం : పెద్దిరెడ్డి శాంతిపురం (చిత్తూరు జిల్లా) : కుప్పం ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కుప్పం కాలువ పనులను పూర్తిచేసి, సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. వీటితో కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం ఉద్దేశమన్నారు. ఎంపీ రెడ్డెప్ప, కలెక్టర్ షన్మోహన్, ఎమ్మెల్సీ భరత్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలతో కలిసి మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రూ.30 కోట్లు అధికంగా చెల్లింపు.. ఇక ఈ పనుల్లో సీఎం రమేష్ సంస్థకు రూ.460.88 కోట్లను 2019, ఏప్రిల్ నాటికి చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే.. కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. పనుల్లో నాసిరకమైన పైపులు వేయడంవల్ల వర్షపు నీటికి ఆ పైపులు పగిలిపోయాయి. -
ప్రశాంతంగా గ్రూప్–2 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 899 పోస్టుల భర్తీకి ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా 87.17 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68–70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థుల్లో ఏపీపీఎస్సీ పట్ల నమ్మకం పెరిగింది. దీంతో ప్రస్తుత గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను కూడా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారన్న నమ్మకంతో అభ్యర్థులు సీరియస్‌గా పరీక్షకు సిద్ధమయ్యారు. దీంతో పరీక్ష రాసినవారి సంఖ్య పెరిగింది. కాగా, గ్రూప్–2 ప్రిలిమ్స్ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ లేదా జూలైలో గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. -
టీడీపీ ఎంపీటీసీ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్
జరుగుమల్లి: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోమారు రుజువయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహనరావు (53) బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై అనేక ఆస్పత్రులకు తిరిగి దాదాపు రూ. 30 లక్షల వరకు ఖర్చుచేశారు. అయినా ఫలితం లేక గతేడాది నవంబర్‌లో మరణించారు. ధుఃఖంలో ఉన్న మోహనరావు కుటుంబానికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. మానవత్వంతో ఆదుకున్నారు మా పెదనాన్న గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్యానికి గురవడంతో పలు ఆస్పత్రులకు తిప్పి మా శక్తికి మించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాం. అయినా ఆయన మాకు దక్కలేదు. ఆ సమయంలో స్థానిక నాయకులు, మంత్రి సురేష్ పార్టీలు చూడకుండా మానవత్వంతో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు. – బత్తిన శరత్‌బాబు, మృతుని తమ్ముని కుమారుడు -
ఉద్యోగుల జేఏసీ ఆందోళన వాయిదా
సాక్షి, అమరావతి: తమకు రావాల్సిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నెల 27న ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ తలపెట్టిన ‘బీఆర్టీఎస్ మహా ఆందోళన’ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాబట్టి మధ్యంతర భృతి అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.70 కోట్లు, సీపీఎస్ ఉద్యోగులకు టీఏ, డీఏల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో రూ.100 కోట్లను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం స్పష్టం చేసినట్లు చెప్పారు. పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్ పెన్షన్‌లో మార్పులకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవాంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలాఖరునాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడాన్ని ఖండిస్తూ ఈ నెల 27వ తేదీన జిల్లాల్లో ఏపీ ఎన్జీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ కార్యదర్శి కేవీ శివారెడ్డి, జేఏసీలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఎగ్జామ్స్ విభాగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో 3,473 సెంటర్లను సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు ఉంటాయి. కాగా, 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ చేసుకున్నారు. వీరిలో గత ఏడాది పదో తరగతి ఫెయిలై తిరిగి ప్రవేశం పొందినవారు 1,02,528 మంది ఉన్నారు. ఓరియంటల్ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. కాగా, మొత్తం పదో తరగతి విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటలకు వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు అంటే ఉదయం 10గంటల వరకు అనుమతిస్తారు. మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను అధికారులు సిద్ధంచేశారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడ స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారులు సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమిస్తారు. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ‘క్యూఆర్ కోడ్’తో పేపర్ లీకులకు చెక్ పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్ట్రీస్‌కు అవకాశం లేకుండా ఈ ఏడాది ప్రశ్నపత్రాలను ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించారు. ప్రతి పేపర్‌పైనా, ప్రతి ప్రశ్నకు క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీంతో మాల్ ప్రా్రక్టీస్ చేసినా, పేపర్ లీక్ చేసినా ఆ పేపర్ ఏ జిల్లా, ఏ మండలం, ఏ సెంటర్లో ఏ విద్యార్థికి కేటాయించినది అనేది వెంటనే తెలిసిపోతుంది. మరోవైపు ఇన్విజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్–టీచింగ్ సిబ్బంది, ఏఎన్‌ఎంలతోపాటు పరీక్షల సరళిని పర్యవేక్షించే చీఫ్ ఇన్విజిలేటర్లు కూడా పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్ తీసుకువెళ్లకుండా నిషేధించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం ఎవరూ తీసుకువెళ్లకూడదని విద్యాశాఖ పరీక్షల విభాగం స్పష్టంచేసింది. వెబ్ లింక్ ద్వారా పేపర్ సాఫ్ట్ కాపీ మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వ్యాల్యూషన్ పూర్తిచేసి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. గతంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఫలితాలు తెలుసుకునేందుకు సంబంధిత పేపర్ ఇచ్చేవారు. ఈ ఏడాది అలాంటి వారికి వెబ్ లింక్ పంపించనున్నారు. సదరు లింక్‌ను ఓపెన్ చేస్తే పేపర్ సాఫ్ట్ కాపీని పొందేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. విద్యార్థులు పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి తమ ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా వెళ్లి, రావొచ్చు. ఈ సదుపాయం ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా కల్పించారు. -
‘మార్గదర్శి’ మోసాలపై సంఘటిత పోరు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం’ ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మార్గదర్శి బాధితుల సమస్యలను వివరించడానికి ఈ నెల 28వ తేదీ బుధవారం 11 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని.. రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ అన్నారు. వివరాలకు 99481 14455 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అక్రమ ఆర్థిక సామ్రాజ్యం.. ఆధారాలతో సహా బట్టబయలు కాగా, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆర్థిక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు..? ►ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు ►మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు ►ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు ►బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు ►చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు) ►ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు ఇదీ చదవండి: ‘బ్లాక్’ కోబ్రా -
రాబోయే రోజుల్లో విశాఖ నుంచే పరిపాలన: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం చాలా ప్రశాంతమైన నగరమని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా, విశాఖలో ఆదివారం ఉదయం ఫ్లోటింగ్ బ్రిడ్జిని సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు బీచ్‌ల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసింది. విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. విశాఖ నుంచి ప్రభుత్వం నడుస్తుంది. ఏపీ అభివృద్ది విషయంలో పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. పర్యాటక అభివృద్ధి ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణమే ఉదాహరణ. విశాఖ బీచ్‌లో కోటి అరవై లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తున్నాము అని కామెంట్స్ చేశారు. -
TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 72,175 మంది స్వామివారిని దర్శించుకోగా 29,543 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.74 కోట్లు కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 15 గంటల సమయం పడుతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
మొబైల్ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్
సాక్షి, అమరావతి:విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా దేశవ్యాప్తంగా 19.79 కోట్ల విద్యుత్ సర్వీసులు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్ లేదా స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది. ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంతమేర విద్యుత్ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ముందుగా చెల్లించి రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొబైల్‌కు మూడుసార్లు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలి. ప్రతి కస్టమర్‌కు రూ.300 అరువు ఇచ్చేలా.. ప్రతి వినియోగదారునికీ గరిష్టంగా రూ.300 క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు కల్పించాలి. ముందుగా చెల్లించిన రూ.1,000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.300 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి ఆ తరువాత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (డిస్కనెక్ట్) కేంద్రం సూచించింది. వినియోగదారులు మళ్లీ రీచార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేయాలని, వినియోగదారులు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్ అవసరం లేనప్పుడు మీటర్‌ను ఆఫ్ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొదలైన ప్రక్రియ విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ సర్వీసులకు, వాణిజ్య, పరిశ్రమలు, గృహæ విద్యుత్ సర్వీసులకు ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదటి విడతలో దక్షిణ డిస్కం పరిధిలో 6.19 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 2.56 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేయనుండగా.. మధ్య డిస్కం పరిధిలో 7.23 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.09 లక్షల త్రీ ఫేజ్ మీటర్లు అమర్చనున్నారు. తూర్పు డిస్కం పరిధిలో 6.09 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.15 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను అమర్చనున్నారు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదే. ఈ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార (టైం అప్డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకునే అవకాశం ఉంది. -
23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రం
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రోజు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముమ్మరం చేసింది. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటునకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 50 శాతం మేర అంటే 23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా 25 లోక్‌సభ నియోజకర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 23,090 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ స్ట్రీమింగ్ (ఆడియో, వీడియో, రికార్డు, వీక్షణ, సీసీటీవీ తదితర సేవలు అందించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే నెల 1వ తేదీలోగా ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేసింది. సాంకేతిక బిడ్‌ను వచ్చే నెల 2న, ఆర్థిక బిడ్‌ను వచ్చే నెల 3న తెరుస్తామని పేర్కొంది. ఎంపికైన బిడ్డర్ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏకకాలంలో జరిగే ఎన్నికల పోలింగ్ రోజు ప్రత్యక్ష వెబ్ ప్రసారాన్ని (ఆడియో–వీడియోతో కూడిన)టర్న్‌కీ ప్రాతిపదికన చేపట్టాలి. ఇందుకు అవసరమైన వెబ్ అధారిత వెబ్ స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు సంబంధిత వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. సురక్షిత క్లౌడ్ వాతావరణంలో సెటప్ చేసిన సర్వర్‌లోని ఆడియో–వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో సర్వర్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన స్థలాన్ని తప్ప ఎలాంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం అందించదు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజు తగిన సిబ్బందితో సహా లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయాలి. రికార్డు చేసిన బ్యాకప్‌ను సమర్పించాలి. అలాగే రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో 55 ఇంచుల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ రోజు ఒక్కో కార్యాలయంలో ఒక్కో సిబ్బంది ఉండాలి. మొత్తం 26 జిల్లాల ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో టీవీ స్క్రీన్స్‌ను అమర్చాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో రెండు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలి. నిరంతరాయంగా లైవ్ వెబ్ కాస్టింగ్ అందించడానికి అవసరమైన బ్యాటరీ బ్యాకప్ అందించాల్సి ఉంటుంది. -
బతుకు బండికి సర్కారే ఇంధనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. బతుకు బండికి సర్కారే ఇంధనం నేను దివ్యాంగుడిని. నాకు పదో తరగతి చదువుతున్న సమయంలో అంగ వైకల్యం ఏర్పడింది. విశాఖ కేజీహెచ్‌లో వైద్యం పొందడంతో ఆరోగ్యం బాగు పడింది. డిగ్రీ చదువుతున్న సమయంలో 2014లో మా బంధువుల అమ్మాయి పూర్ణమ్మతో వివాహం అయింది. మాకు పిల్లలు లేరు. కొన్నాళ్లు గడిచాక మళ్లీ రెండు కాళ్లకు అంగవైకల్యం ఏర్పడింది. దీంతో డిగ్రీ ద్వితీయ సంవత్సరంతో మానేశాను. మాలాంటి వారికి గతంలో ఏ ప్రభుత్వం అందించని సహాయం ఈ ప్రభుత్వ పాలనలో లభిస్తోంది. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం ఎం.నిట్టాపుట్టు గ్రామం. మాకున్న ఎకరం బంజరు భూమిలో వ్యవసాయం చేయగా వచ్చే తిండి గింజలతో, నా భార్య కూలి సొమ్ముతో గతంలో కష్టంగా జీవనం సాగించేవాళ్లం. నాకు 84 శాతం అంగవైకల్యం ఉందని వైద్యుల ధ్రువీకరణతో ఈ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ ఇంటికి వచ్చి ఆ మొత్తాన్ని అందిస్తున్నాడు. విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ ప్రభుత్వం రూ.లక్ష విలువ చేసే మూడు చక్రాల స్కూటీని మంజూరు చేసింది. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వస్తోంది. డ్వాక్రా సంఘంలో నా భార్య కొంత అప్పు తీసుకోగా సున్నా వడ్డీతో లబ్ధి చేకూరింది. మా నాన్నకు కూడా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ప్రభుత్వ సాయంతో మా జీవితం సాఫీగా సాగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వమే మా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – పరదాని జగన్నాథం, ఎం.నిట్టాపుట్టు (చుక్కల వెంకటరమణ, విలేకరి, జి.మాడుగుల) అనాథనైన నాకు పెద్ద దిక్కయ్యారు మా ఆయన సీతారాం పదేళ్ల క్రితం కన్ను మూశారు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకే మా నాన్న భీముడు, అమ్మ లచ్చమ్మ కూడా వరుసగా కాలం చేశారు. పిల్లలు లేని నేను అనాథగా మిగిలిపోయాను. బతుకు తెరువుకోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గులివిందలపేటలో చిన్నపాటి పనులు చేసుకునేదాన్ని. నిరుపేదరాలినైన నాకు మా గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ దయతో ఓ ఇంటిని సమకూర్చి అందులో ఉండమని చెప్పారు. ఇటీవల అనారోగ్యం కారణంగా పని చేయలేకపోతున్నాను. ముఖ్యమంత్రి జగనన్న ఇస్తున్న పింఛన్ నాకు ఇప్పుడు అండగా నిలిచింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీ ఉదయాన్నే మా వలంటీర్ ఆ మొత్తాన్ని నా చేతిలో పెడుతున్నారు. రేషన్ బియ్యం ఉచితంగా అందుతున్నాయి. నాకు అవసరమైన మందులు ప్రతి నెలా 104 వాహనం ద్వారా ఉచితంగా సమకూరుతున్నాయి. ఈ ప్రభుత్వం దయతోనే నా అన్న వారు ఎవరూ లేకపోయినా చీకూ చింతా లేకుండా జీవనం సాగిపోతోంది. ముఖ్యమంత్రి జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. – చింతాడ లక్ష్మి, గులివిందలపేట (అల్లు నరసింహారావు విలేకరి, కొత్తూరు) కష్టకాలంలో ‘ఆసరా’గా నిలిచారు మాది నిరుపేద కుటుంబం. నా భర్త వడివేలు కూరగాయల దుకాణంలో కూలీగా పని చేసేవాడు. కరోనా సమయంలో వ్యాపారాలు బంద్ కావడంతో పూట గడవక ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. రూ.12 వేలతో తిరుపతి జిల్లా కోటలోని మా కాలనీలోనే కూరగాయల బండి పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాం. తాజా కూరగాయలు అమ్ముతూ వ్యాపారాన్ని విస్తరించాం. జగనన్న తోడు పథకంలో అదనంగా మరో రూ.10 వేలు వచ్చాయి. ఆ డబ్బులను కూడా వ్యాపారానికి ఉపయోగించాం. దీంతో మా జీవితం గాడిలో పడింది. అప్పులు తీర్చుకుంటూ ఆరి్థకంగా నిలదొక్కుకున్నాం. వైఎస్సార్ ఆసరాలో నాలుగేళ్లు సాయం అందింది. హైసూ్కల్ చదువుతున్న మా అబ్బాయికి అమ్మఒడిలో ఏడాదికి రూ.15 వేలు వస్తోంది. జగనన్న లే అవుట్లో మాకు ఇంటి స్థలం కేటాయించారు. ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా బతుకుతున్నాం. మాలాంటి పేదవాళ్లకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – పేట పావని, కోట (యాకసిరి మధు, విలేకరి, కోట) -
తిరుపతి @894
సహజంగా ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సెలబ్రెటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఏనగరానికీ లేని పుట్టిన రోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం విశేషం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామ ఈశాన్యంలో (నాలుగుకాళ్ల మండపం) వద్ద పునాది వేసినట్లు చరిత్రలో నిరూపితమైంది. అద్వైత పురుషుడైన సమతామూర్తి పుణ్యఫలమే తిరుపతి నగరమైంది. ఈ మేరకు శనివారం 894వ పుట్టిన రోజు వేడుకలకు తిరుపతి నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది. తిరుపతి తుడా: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉందన్న విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేధావులు, పండితులతో కలసి 2022లో ప్రకటించారు. చరిత్ర, పురాణ, ఇతిహాసాల ఆధారంగా అద్వైత పురుషుడైన రామానుజాచార్యులు చేతుల మీదుగా తిరుపతి నగరం పురుడు పోసుకుందని సామాజానికి చాటిచెప్పారు. ఈ క్రమంలో శనివారం తిరుపతి నగర 894వ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 1130వ ఏటే పునాది శ్రీరామానుజాచార్యులు కంచి నుంచి తిరుమలకు వచ్చే క్రమంలో తన 112వ ఏట నిర్మానుష్యంగా ఉన్న పార్థసారథిస్వామి ఆలయం (నేటి గోవిందరాజస్వామి ఆలయం) ప్రాంతాన్ని ఓ గ్రామంగా నిర్ణయిస్తూ పునాది వేశారు. 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామానికి పునాది వేశారని స్పష్టమవుతోంది. కపిలతీర్థం సమీపంలో కొత్తూరు గ్రామం ఉండేది. వివిధ వ్యాధులతో ఆ గ్రామ వాసులు వరుసగా మృత్యువాత పడుతుండడాన్ని శ్రీరామానుజాచార్యులు గుర్తించారు. గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంలోనే కొత్తూరు గ్రామ ప్రజలను సంరక్షించడం, నిర్మానుష్య ప్రాంతంగా ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు గరుడ ఆకారంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రామానికి హద్దులు పెట్టించి పునాది వేయించారు. ఆగమశాస్త్రోక్తంగా నాడు వేసిన పునాదే నేడు ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ క్రమంలోనే ఆ గ్రామానికి గోవిందరాజపట్నంగా నామకరణం చేశారు. ఆ తరువాత గోవిందరాజపట్నానికి రామానుజపురంగా స్థానికులు పేరును మార్పుచేశారు. కాలక్రమేణా 13వ శతాబ్దంలో తిరుపతిగా ప్రసిద్ధికెక్కింది. హద్దులు ఇవే నాటి గోవిందరాజపట్నానికి కృష్ణాపురం ఠానా, నాలుగుకాళ్ల మండపం, రైల్వేస్టేషన్‌కు తూర్పు ప్రాంతం, బేరివీధి నాలుగు ప్రాంతాల్లో మండపాలను నిర్మించారు. ఆ తరువాత ఆయా ప్రాంతాల్లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నాలుగుకాళ్లమండపం మాత్రమే చరిత్రకు సాక్షిగా మిగిలింది. తొలివీధి అదే నాడు తిల్లా గోవిందరాజస్వామిని ప్రతిష్టించే లఘ్నం ఖరారు కావడంతో యుద్ధప్రాతిపాదికన సున్నపు ముద్దలతో గోవిందరాజస్వామి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ విగ్రహంలో స్వామి వారి పొట్టలో దేవదాసి తిల్లా వద్ద ఉన్న లోహవిగ్రహాన్ని ప్రతిష్టించి తయారు చేశారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. గోవిందరాజపట్నం గ్రామం ఏర్పడ్డాక రామానుజ తిరువీధి (గోవిందరాజస్వామి తూర్పుమాడావీధి) ఏర్పడింది. ఇలా తొలివీధి రామానుజ తిరువీధిగా చరిత్రలో నిలిచింది. కై కాల రెడ్లదే తొలిదర్శనం గోవిందరాజస్వామిని తొలినాళ్లలో దేవదాసి అయిన తిల్లా పూజిస్తూ స్వామివారి బాగోగులు చూసుకునేవారు. ఈ క్రమంలో దేవదాసి అయిన మహిళ పూజలు చేయడం ఏంటని ప్రశ్నించి అవమానించేవారు. ఈ క్రమంలోనే ఆమె కై కాల చెంగారెడ్డి అనే చిన్నారిని దత్తత తీసుకుంది. కై కాల చెంగారెడ్డి ద్వారా ఆలయంలో ఉత్సవాలు, సేవలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే నేటికీ కైకాల కులస్థులకు గోవిందరాజస్వామి ఆలయంలో తొలిదర్శనం కల్పిస్తున్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉత్సవాల్లోనూ ఈ వర్గానిదే ఆధిపత్యం. నాటి రాజావీధే నేటి గాంధీరోడ్డు గోవిందరాజపట్నం ఏర్పడ్డాక గ్రామానికి తొలివీధిగా రామానుజ తిరువీధితో పాటు పడమర, తూర్పు, దక్షిణ మాడావీధులు శ్రీవారి అర్చకులు, వారి బంధుమిత్రులకు ఆవాసాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తరువాత ఆ వీధికి బజారువీధిగా ఆపై మహాత్మాగాంధీ ఈ రోడ్డులో నడయాడంతో గాంధీరోడ్డుగా మార్పుచెందింది. సున్నం తయారు చేస్తున్న ప్రాంతం సున్నపువీధిగా, ఇసుక నిల్వ ఉంచిన ప్రాంతాన్ని ఇసుక వీధిగా నామకరణం చేశారు. బండ్లు నిలిపే ప్రాంతమే నేటి బండ్ల వీధిగా మారినట్టు తెలుస్తోంది. తొలి భక్తుడు ఆయనే శ్రీమన్నారాయనుడు శ్రీవేంకటేశ్వరుడిగా సప్తగిరులపై కొలువుదీరారు. శ్రీరామానుజాచార్యుల మేనమామ అయిన శ్రీవారి పరమ భక్తుడు తిరుమల నంబి తొలిభక్తుడుగా కీర్తిగడించారు. ఆయన అనుగ్రహంతోనే అడపురి(అలిపిరి) ఓ మహావృక్షం కింద శ్రీరామానుజాచార్యులు వారు ఆధ్వైత పురుషుడుగా, వైఖానస పండితులుగా ప్రసిద్ధి గడించారు. 904 ఏళ్ల క్రితం తిరుమల ఆలయ పరిరక్షణ కోసం జీయంగార్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదో చారిత్రక ఘట్టం ఏ నగరానికీ లేని పుట్టిన రోజు తిరుపతి నగరానికి మాత్రమే ఉంది. ఇది నగర ప్రజలకు దక్కిన గౌవరం. పుణ్య పురుషుడైన శ్రీ రామానుజాచార్యుల వారి చేత ఆ శ్రీమన్నారాయణుడే తిరుపతి పుణ్యక్షేత్రానికి పుణాది వేయించారు. ఈ చరిత్ర తెలియడం చారిత్రక ఘట్టమే. అందుకే తిరుపతి పుట్టిన రోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకోవడం మనందరి బాధ్యత. – భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ చైర్మన్. ఇప్పటికీ గోవిందరాజపట్నంగానే.. తమిళులు ఇప్పటికీ తిరుపతిని గోవిందరాజపట్నంగానే పిలుస్తుంటారు. కపిలతీర్థం సమీపంలోని కొత్తూరు గ్రామ ప్రజలను రక్షించడం, గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించడం, ఈ ప్రాంతం దేదీప్యమానంగా విరాజిల్లాలన్న సంకల్పంతో గరుడ ఆకారంలో గోవిందరాజ పట్ననికి హద్దులు నిర్ణయించారు. – ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ -
స్వయం ఉపాధికి సర్కారు ఊతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. స్వయం ఉపాధికి సర్కారు ఊతం మా ఆయన చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగం లేదు. ఏదైనా వ్యాపారం చేసుకుని నిలదొక్కుకుందామనుకుంటే గత ప్రభుత్వం ఆశించిన సహకారం అందివ్వలేదు. ఇక చేసేది లేక ఎలాగోలా బతుకుతుండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. మా కలలు సాకారం చేసుకోవడానికి అడుగులు పడ్డాయి. మహిళాభివృద్ధికి ఈ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో మా సొంత ఊరైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని బొడ్డపడలో సొంతంగా హోటల్ ఏర్పాటు చేసుకుందామని మా ఆయన నర్సింగ్ సాహు యోచించారు. వెంటనే పెట్టుబడి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష రూపాయల రుణం తీసుకున్నాం. ఆ సొమ్ముతో బస్టాండ్ కూడలిలో చిన్నపాటి హోటల్ ఏర్పాటు చేశాం. మౌలిక వసతులకోసం జగనన్న తోడు పథకం ద్వారా పది వేల రూపాయలు వడ్డీలేని రుణం తీసుకున్నాం. వైఎస్సార్ ఆసరా ద్వారా నాకు ప్రభుత్వం అందజేసిన రూ.14వేలు కూడా వ్యాపారానికి వినియోగించాం. ఇప్పుడు రోజుకు సుమారు ఐదు వందల వరకు లాభం వస్తోంది. అలాగే ప్రభుత్వం మాకు ఓ మంచి గూడును కూడా జగనన్న కాలనీలో సమకూర్చింది. ప్రతీ ఏడాది మా పాపకు జగనన్న విద్యా దీవెన అందుతుండటంతో ఆమె చదువు మాకు భారం కాలేదు. ఈ రోజు మా కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణమైన ఈ ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కుమారీ సాహూ, బొడ్డబడ (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) ఏ దిక్కూ లేని నాకు పింఛనే ఆధారం నా వయస్సు 75 సంవత్సరాలు. భర్త దూరమై 20 ఏళ్లు అవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో నివాసం ఉంటున్న నాకు బిడ్డలు, బంధువులు ఎవరూ లేరు. ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాను. కిడ్నీ సమస్య, బీపీ, షుగర్‌తో బాధపడుతున్న నేను కనీసం కూలి పని కూడా చేసుకోలేను. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొడుకులా ఆదుకున్నాడు. ప్రతి నెలా రూ.3 వేల పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నెలా నెలా ఇంటికి బియ్యాన్ని ఉచితంగా తీసుకువస్తున్నారు. ఏ దిక్కూ లేని నాకు పింఛనే ఆధారం. మూడు పూటలా తింటూ బతుకుతున్నాను. బీపీ, షుగర్, ఇతర సమస్యలకు మందులు క్రమం తప్పకుండా ఉచితంగా ఇస్తున్నారు. నాకు ఎవరూ అండగా లేకపోయినా ఈ ప్రభుత్వ సాయంతో బతకగలుగుతున్నాను. మళ్లీ జగన్ సీఎం అయితేనే మా లాంటి పేదలు హాయిగా బతుకుతారు. – పిల్లి శాంతమ్మ, సీలేరు (చీపురుపల్లి రామారావు, విలేకరి, సీలేరు) సమస్యలు తొలగి సంతోషంగా జీవనం మాది చేనేత కుటుంబం. మా వృత్తికి సరైన ఆదరణ లేక... చేసిన పనికి గిట్టుబాటైన కూలి లేక నానా అవస్థలు పడేవాళ్లం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో మా అబ్బాయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నపాటి కమ్మరేకుల ఇళ్లలో జీవిస్తున్నాం. గత ప్రభుత్వం మాలాంటివారికి ఎలాంటి సాయం అందివ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ మా ఇంటి తలుపులు తట్టి నాకు వృద్ధాప్య పింఛన్ అందిస్తోంది. మా అబ్బాయి భోగ భాగ్య నారాయణ తాతారావుకు వాహన మిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుకుంటున్నాడు. నా కోడలు లక్ష్మి ఇంట్లోనే చేనేత మగ్గాన్ని నేస్తూ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు తీసుకుంటోంది. డ్వాక్రా రుణ మాఫీతో వచి్చన సొమ్ముతో కుటుంబాన్ని తీర్చిదిద్దుతోంది. మా మనవడు క్రాంతికుమార్ స్కూల్లో చదువుకుంటున్నాడు. వాడికి అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్న రూ.15000లు ఏటా మా కోడలి ఖాతాలో జమవుతున్నాయి. మా కుటుంబానికి జగనన్న ఇంటి స్థలం కూడా ఇచ్చారు. త్వరలోనే ఇల్లు కట్టుకుని అక్కడకు వెళ్లిపోతాం. ఇప్పుడు నా కుటుంబం ఏ చీకూ చింతా లేకుండా ముందుకు సాగుతోంది. మాకుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – కూర్మా దుర్గ, బండార్లంక (పరసా సుబ్బారావు, విలేకరి, అమలాపురం టౌన్) -
నా పసుపు, కుంకుమ కాపాడిన సీఎం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. నా పసుపు, కుంకుమ కాపాడిన సీఎం నా భర్త గంగాధర్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో మాకున్న తొమ్మిది ఎకరాల్లో చీనీ సాగు చేస్తున్నాం. పెద్ద కుమారుడు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో, చిన్నకుమారుడు అనంతపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. 2021లో కరోనా సమయంలో నా భర్తకు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. శ్వాస తీసుకునేందుకూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఎక్కడికి పోవాలో కూడా నాకు దిక్కు తోచలేదు. నా భర్త ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వలంటీర్ సూచన మేరకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లి అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించా. నయా పైసా ఖర్చు లేకుండా వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని రూ.4 లక్షలకు పైగా ఖర్చయ్యే చికిత్సను ఉచితంగా అందించారు. దీంతో నా భర్త ప్రాణాలతో బయటపడ్డారు. నా కుమారుడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున, రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.13,500 చొప్పున, పంటల బీమా పథకం ద్వారా రూ.72,000 వంతున రెండుసార్లు, రూ.58,000 వంతున ఇంకో రెండుసార్లు అందింది. నేను మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో సున్నా వడ్డీ పథకం ద్వారా ఏటా రూ.3 వేలు చొప్పున మూడు పర్యాయాలు వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంతలా ఆదుకున్న దాఖలాల్లేవు. నా పసుపు కుంకుమ కాపాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ రుణపడే ఉంటాను. – ఆదిలక్ష్మి, ముకుందాపురం (జె.ఆదినారాయణ, విలేకరి, గార్లదిన్నె) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మాది సాధారణ కుటుంబం. విజయనగరం జిల్లా తెర్లాంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కిరాయి అన్ని రోజులూ ఒకేలా ఉండేది కాదు. బేరం లేకపోతే ఆ రోజు రాబడి సున్నా. అప్పుడప్పుడు మరమ్మతు చేయించాల్సి వస్తే అప్పు చేయక తప్పేది కాదు. మా గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు నాకు రూ.40 వేలు వచ్చాయి. అమ్మఒడి పథకం ద్వారా నా కుమార్తెకు ఏటా రూ.15 వేలు చొప్పున నాలుగేళ్లకు రూ.60 వేలు నా భార్య ఖాతాలో జమయింది. వైఎస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ.2,800, సున్నా వడ్డీ ద్వారా ఏటా రూ.840 చొప్పున వచ్చింది. ప్రజా సంకల్ప యాత్రలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ మేలును ఎన్నటికీ మరచిపోలేం. – రాజాన రమేష్, తెర్లాం (గొండేల సూర్యనారాయణ, విలేకరి, తెర్లాం) జగనన్న దయతో డయాలసిస్ మాది పేద కుటుంబం. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ప్రాతాళ్లమెరకకు చెందిన నా భర్త రేవు నాగరాజు 2013 మార్చి నుంచి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. అప్పటి ప్రభుత్వం ఎటువంటి వైద్య సాయం అందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చేయించడంతోపాటు నెలకు రూ.10 వేలు పింఛన్ సాయం ప్రకటించారు. ఫలితంగా మా పేద బతుకులకు ధైర్యం వచ్చింది. నాలుగేళ్లుగా ఆరోగ్యశ్రీ ద్వారా వారానికి రెండుసార్లు ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నాం. తోడబుట్టిన అన్నయ్యలా జగనన్న పింఛన్ సాయం అందిస్తున్నారు. పింఛన్‌గా ఇప్పటి వరకు రూ.4,80,000 మేర లబ్ధి పొందాం. మా పాప చదువుకు అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15 వేలు వంతున సాయం అందుతోంది. జగనన్న రుణం తీర్చుకోలేం. ఆయనే నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలి. – రేవు ఎస్తేరు రాణి, ప్రాతాళ్లమెరక (కడితల శివాజీ, విలేకరి, కాళ్ల) -
Fact check: ప్రభుత్వ బడులపైనే బండలా!
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు తిని ఊరి మీద పడి తిరిగినట్టు.. ఎన్నికల ముందు ఈనాడు పత్రికాధినేత రామోజీరావు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పేదింటి పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై కత్తిగట్టారు. వాస్తవాలను వక్రీకరించి అసత్యాలతో తనకలవాటైన రీతిలో చెలరేగిపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు, పేద పిల్లల ప్రగతిపై ఏనాడూ అక్షరం ముక్క రాయని ‘ఈనాడు’ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు లేవంటూ అబద్ధాలను అచ్చేసింది. మొదటి విడత మనబడి: నాడు–నేడుతో సమూలంగా రూపురేఖలు మార్చుకున్న 15,715 ప్రభుత్వ పాఠశాలల గురించి మాటమాత్రంగా ప్రస్తావించలేదు. కానీ నాడు–నేడు రెండోవిడతలో పనులు జరుగుతున్న పాఠశాలలపై రామోజీ విషం కక్కారు. గత ప్రభుత్వంలో సర్కారు బడి భవనాలు బీటలు వారి కూలిపోతున్నా అడిగింది లేదు.. విద్యార్థులకు కనీస వసతులైన పుస్తకాలు, తాగునీరు, యూనిఫామ్ ఇవ్వకున్నా నిలదీసింది లేదు. ఇప్పుడు నాడు–నేడు రెండో దశలో బడులకు కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు సాగుతుండగా ఫొటోలు తీసి పనులు నిలిచిపోయాయంటూ రామోజీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకటీ రెండుసార్లు కాదు.. ఈ విద్యా సంవత్సరంలో 15 సార్లు ఒకే అంశంపై తప్పుడు రాతలు ప్రచురించడం ఆయన మానసిక దౌర్భల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని.. విద్యార్థులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి కొనియాడారు. వివిధ దేశాల ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ప్రశంసిస్తున్నారు. తమ దేశంలోనూ ఏపీ విధానాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కానీ రామోజీ పచ్చ కళ్లకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్ల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరంలో నాడు–నేడు మొదటి దశ కింద 15,715 పాఠశాలలను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. నూతన భవనాలతో పాటు అవసరమైన 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక 2022–23 విద్యా సంవత్సరంలో 22,344 పాఠశాలల్లో రూ.8,000 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. ఇందులో మొదటి దశలో లేని అదనపు పనులు సైతం జోడించారు. ఇప్పటికే 99.79 శాతం స్కూళ్లల్లో పనులు ప్రారంభించారు. 2,755 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తవగా, 1,331 స్కూళ్లను నూరుశాతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్లు, 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు రూ.3,361 కోట్లు చెల్లించారు. వాస్తవం ఇదయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పాఠశాలల్లో ఫొటోలు తీసి, నిర్మాణ పనులు నిలిచిపోయాయంటూ ఈనాడు పత్రిక వక్రీకరిస్తోంది. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు స్కూళ్లు, ప్రకాశంలోని కొత్తపట్నం, ఏలూరు జిల్లా ఉంగుటూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, విజయనగరం జిల్లా గుర్ల మండలాల్లోని పాఠశాలను చూపించింది. వాస్తవానికి ఆ పాఠశాలల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి గాయాలు కాకూడదని ఆరుబయట ఉంచారు. ఈ ఫొటోలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవే పాఠశాలల గోడలు బీటలు వారి, పైకప్పులు ఎప్పుడు కూలతాయోనన్న భయంతో చదువులు సాగాయి. కానీ తన శిష్యుడు చంద్రబాబు జమానా కావడంతో రామోజీకి ఒక్క ముక్క కూడా రాయాలనిపించలేదు. ఇప్పుడు అన్నీ బాగున్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అన్నీ తప్పులే ఆయనకు కనిపిస్తున్నాయి. -
మా పిల్లల ప్రాణాలు జగనన్నచలువే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా పిల్లల ప్రాణాలు జగనన్నచలువే మాది నిరుపేద కుటుంబం. మా ఆయన వసంతరావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో వ్యవసాయ కూలీగా ఉండేవారు. ఆయనకు నేను చేదోడుగా ఉండేదాన్ని. మా ఆయన అనుకోకుండా రెండేళ్ల క్రితం కాలం చేశారు. మాకు 12 ఏళ్ల బాబు, తొమ్మిదేళ్ల పాప ఉన్నారు. ఇద్దరూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి ప్రభావం వల్ల పిల్లల్లో రక్తం తగ్గిపోవడంతో అనారోగ్యంతో బాధ పడేవారు. గత ప్రభుత్వ హయాంలో మాకు ఏ విధంగానూ సాయం అందలేదు. రక్తం తగ్గినప్పుడు అప్పు చేసి రక్తం ఎక్కించి పిల్లలను అతి కష్టం మీద బతికించుకునేవాళ్లం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా పిల్లలిద్దరికీ నెలకు రూ.10 వేలు వంతున ఇద్దరికీ రూ.20 వేలు పింఛన్ మంజూరు చేశారు. ఆ మొత్తంతో పిల్లలిద్దరికీ రక్తం ఎక్కిస్తున్నా. పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పెడుతున్నా. అవసరమైన మందులు కొనుగోలు చేస్తున్నా. నాకు వితంతు పింఛన్ వస్తోంది. పిల్లల సంరక్షణ చూసుకుంటుండటంవల్ల ఏ పనికీ వెళ్లలేకపోతున్నా. అయినా వచ్చిన పింఛన్ డబ్బులతో పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నా. ఈ రోజు మా పిల్లలు బతికే ఉన్నారంటే అదంతా జగనన్న చలవే. – అందవరపు భవాని, కొత్తూరు (అల్లు నరసింహారావు విలేకరి, కొత్తూరు) కుటుంబానికి చేదోడుగా.. మాది మధ్య తరగతి కుటుంబం. విశాఖపట్నంలోని అల్లిపురం వెంకటేశ్వరమెట్టలో నివాసం ఉంటున్న మేమంతా కష్టపడినా గతంలో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. టైలరింగ్ ప్రారంభించాను. ఈ మేరకు చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకోగానే మంజూరైంది. రెండు సంవత్సరాలుగా ఈ పథకం కింద ఏటా రూ.10 వేల వంతున ఇప్పటికి రూ.20 వేలు వచ్చింది. ఈ మొత్తంతో కుట్టుమెషిన్ కొనుక్కొని టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నా. మా ఆయన ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మా అబ్బాయి ఒకటో తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా మామగారికి 60 ఏళ్లు దాటడంతో వైఎస్సార్ ఆసరా ఫించన్ వస్తోంది. ఈ ప్రభుత్వం అందించిన సాయంతో ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాం. – మునశాల కనక, అల్లిపురం, విశాఖపట్నం (మద్దాల వెంకటసూరి అప్పారావు, విలేకరి, అల్లిపురం) దేవుడిలా ఆదుకున్నారు మా ఆయన రెడ్డి ప్రసాద్ రైతు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మాకు ఇద్దరు పిల్లలు. బాబు కేతన్, పాప షన్విత. కేతన్కు ఆరేళ్ల వయస్సులో స్కూల్లో ఉన్నపుడు గుండె నొప్పి రావడంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించాం. వైద్యులు ప్లేట్లెట్స్ తగ్గాయని వైద్య పరీక్షల ద్వారా గుర్తించి పెద్దాస్పత్రిలో చేర్చాలని చెప్పారు. దీంతో బెంగళూరులోని రెయిన్బో చిన్నపిల్లల ఆస్పత్రికి వెళితే బ్లడ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. చికిత్సకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. బిడ్డను ఎలాగైనా దక్కించుకోవాలని ఉన్న పొలాలు, నగలు అమ్మి వైద్యానికి ఖర్చు చేశాం. రూ.8 లక్షలు అనుకున్నది కాస్తా రెండేళ్లలో రూ.70 లక్షల వరకు ఖర్చయింది. బిడ్డ వైద్యం కోసం డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే.. తెలిసిన వారు సీఎం సహాయనిధి గురించి చెబితే దరఖాస్తు చేసుకున్నాం. బ్లడ్ క్యాన్సర్‌తో రెండేళ్లు పోరాడి ఈ నెల 2న బాబు చనిపోయాడు. సరిగ్గా వాడు చనిపోయిన 12 రోజులకు సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిసింది. ఇప్పుడు మాకు అదే ఆధారం. బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు సీఎం సహాయ నిధి ఆదుకుంది. కేతన్కు అమ్మ ఒడి పథకం కింద రెండు విడతల్లో రూ.30 వేలు అందింది. రెండో బిడ్డను ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. జగనన్న ప్రభుత్వం మాలాంటి ఎందరికో మేలు చేస్తోంది. మళ్లీ మేము మామూలుగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. ప్రజలందరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలో ఉండాలన్నది నా ఆకాంక్ష. – రోజారమణి, మదనపల్లె (వంశీధర్ సూరమాల, విలేకరి, మదనపల్లె) -
‘వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు’
గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియాపై మరోసారి ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అండ్ కంపెనీ ఇష్టంమొచ్చినట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంపై కొడాలి నాని తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే... చెప్పేవాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ‘ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్‌లను ఏడు విడతల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్రెడ్డి చేస్తారు.. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, మహాటీవీ వంశీ కాదు. నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్ రాధాకృష్ణ టికెట్ ఇవ్వగలడు. నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి. గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్మోహన్రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్, మహాన్యూస్పకోడీగాళ్లు కాదు. ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా? ... గన్నవరంలో వంశీని, గుడివాడలో నన్ను మారుస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారా?, మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు?, పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్సీపీలో ఉండదు. వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు. మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు. వైఎస్సార్సీపీలో ఒకడు ట్రైచేస్తేనో... బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు. సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు.చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి. సీట్లు మారుస్తాడా లేదా.. అనేది మాకు జగన్మోహన్రెడ్డికి సంబంధించిన వ్యవహారం. మధ్యలో టీడీపీ బ్రోకర్లకు పనేంటి. .... ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి. జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. ఎంతమంది కలిసొచ్చినా జగన్మోహన్రెడ్డిని ఎదిరించలేరు. జగన్ సింగిల్‌గా వస్తానని చెబుతున్నాడు. మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు. చంద్రబాబు పర్మినెంట్‌గా మాజీగానే ఉంటాడు. పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి. ఏబీఎన్‌ను, వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం.. ఎవరు రమ్మన్నారు. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు’ అని కొడాలి నాని విమర్శించారు.