AP Special
-
TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 6కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (ఆదివారం) 70,338 మంది స్వామివారిని దర్శించుకోగా 22,741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.96 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. మే నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 22న వర్చువల్ సేవల కోటా విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా…. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 23న అంగప్రదక్షిణం టోకెన్లు…. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. -
విద్య.. ప్రపంచాన్ని మార్చే ఆయుధం
గుడ్లవల్లేరు (గుడివాడ): ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యే అని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ(ఎస్జీఈసీ) రజతోత్సవాల ముగింపు సభకు ఆయన ఆదివారం హాజరయ్యారు. అబ్దుల్ కలాం చెప్పిన ప్రపంచ పురోగతి సాధించాలంటే అది విద్య అనే శక్తివంతమైన ఆయుధంతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దానికి జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత వాసులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యం, దూర దృష్టి, అభిరుచి, ఆలోచనా దృక్పథాలతో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించడం హర్షదాయకమన్నారు. తొలుత కాలేజీ స్థాపనతో పాటు అభివృద్ధి చేసిన వ్యవస్థాపకుడు వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావుకు కృతజ్ఞతాంజలి తెలిపిన పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ అందజేశారు. గవర్నర్‌ను కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ సన్మానించారు. కలెక్టర్ పి.రాజాబాబు, గుడివాడ ఆర్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
మరో 12 పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, జమ్మలమడుగు, కదిరి, నందిగామ, పలమనేరు, కడప మహిళా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మదనపల్లె మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. పక్కా ప్రణాళికతో ముందుకు.. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ సాధించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మొత్తం 31 పాలిటెక్నిక్ కాలేజీల్లోని 60 విభాగాల్లో ఎన్బీఏ సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా ఎన్బీఏ బృందం మరిన్ని కాలేజీలను కూడా పరిశీలించనుంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న సాంకేతిక విద్యా శాఖ పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడంతో పాటు ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, సొంత భవనాల నిర్మాణాలను చేపడుతోంది. వచ్చే ఏడాదికి వీలైనన్ని కాలేజీల్లో హాస్టల్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక దృష్టి సారించింది. పాలిటెక్నిక్ విద్య ద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తోంది. పాలిసెట్ కోసం ఉచితంగా కోచింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇది సరికొత్త చరిత్ర సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. అందువల్లే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అత్యంత ప్రతిష్టాత్మక ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కుతోంది. భవిష్యత్‌లో ప్రతి కాలేజ్‌నూ ఎన్బీఏ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చాం. ఉద్యోగ అవకాశాలు పెంచేలా 674 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం. గత విద్యా సంవత్సరంలో 7 వేల మంది చదువులు పూర్తి చేసుకుంటే 4 వేల మందికి పైగా ప్లేస్మెంట్లు సాధించారు. పది శాతంగా ఉన్న ప్లేస్మెంట్లను 60 శాతానికి తీసుకువచ్చాం. ఇది సరికొత్త చరిత్ర. – చదలవాడ నాగరాణి కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
రూ.1,042.51 కోట్లతో విద్యాకానుక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకిచ్చే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలోని 44,617 పాఠశాలల్లో చదువుతున్న 39,51,827 మందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం రూ.1,042.51 కోట్లతో వీటిని సిద్ధంచేస్తున్నారు. గతేడాది మాదిరిగానే 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు విద్యా కానుక (జేవీకే–5)ను అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ కిట్లను తీసుకుంటున్నారు. అయితే, జేవీకే–4లో మిగిలిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం కిట్లను తీసుకోనున్నారు. ఇప్పటికే కిట్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు అంగీకారం తెలపగా, ఏప్రిల్ చివరివారం నుంచి వాటిని సరఫరా చేయనున్నారు. ఈలోగా టెన్త్ పరీక్షలతో పాటు ఏప్రిల్ రెండోవారం నాటికి మిగతా తరగతుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. దీంతో.. అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కిట్లను తీసుకుంటారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పి, తిరిగి పాఠశాలల్లో చేరిన వారిని ఈ విద్యా సంవత్సరం ‘రెగ్యులర్’గా పరిగణించి వారికి కూడా విద్యాకానుక కిట్లను అందించారు. గతేడాది ఏ ధరకు వస్తువులను సరఫరా చేశాయో, జేవీకే–5 కిట్‌లోని వస్తువులకు కూడా అదే ధరను నిర్ణయించారు. ఇక ఈ నాలుగేళ్లలో జేవీకే పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,366.53 కోట్లు వెచి్చంచింది. నూరు శాతం నాణ్యతతో కిట్లు.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులందరికీ 2020–21 విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ను అందిస్తోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కిట్లను అందించారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్య, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉంటాయి. వీటి సరఫరాతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. మరోవైపు.. విద్యార్థులకిచ్చే ఈ కిట్ల నాణ్యతను ఆయా కంపెనీలు పరిశీలించే సరఫరా చేస్తున్నాయి. ఇందుకోసం గతంలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. అంటే.. రా మెటీరియల్ నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు లాభాపేక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేసే వస్తువులను సైతం క్యూసీఐ సంస్థే నాణ్యతను పర్యవేక్షించనుంది. -
ఇంధన ఆదాకు రోల్‌మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్‌లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్‌గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్‌లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్‌రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్‌లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్‌మోడల్‌గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
బాల్య వివాహాలకు ముగింపు
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది ఒక్కో నెలలో వందకు పైగా బాల్య వివాహాలపై ఫిర్యాదుల రాగా.. ఈ ఏడాది జనవరి నెలలో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి నెలలో 60 బాల్య వివాహాలపై ఫిర్యాదులు రాగా.. అందులో 57 బాల్య వివాహాలను ప్రభుత్వం నివారించింది. ఏలూరు జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు బాల్య వివాహాలు మాత్రమే జరగ్గా.. అందులో రెండు వివాహాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 26 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో మాత్రమే జనవరి నెలలో ఫిర్యాదులు వచ్చాయి. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. బాల్య వివాహాలపై 1098 హెల్ప్‌లైన్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా ఫిర్యాదులు రాగానే సంబంధిత శాఖల సిబ్బంది అప్రమత్తమై రంగంలోకి దిగుతున్నారు. గ్రామస్థాయి నుంచే పటిష్ట చర్యలు బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో బాల్య వివాహాల నిషేధ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. బాల్య వివాహాల నివారణకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. యుక్త వయసులో ఉన్న బాలికల తల్లిదండ్రులకు బాల్య వివాహాలు వల్ల ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలపై అవగాహన సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాల నివారణలో భాగంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాకు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించారు. బాల్య వివాహాల నిరోధించడంపై రోజువారీ, నెలవారీ చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత నెలలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాల్య వివాహాల నివారణకు నెలవారీ క్యాలండర్ ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ (ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లలకు చదువు చెప్పండి) పథకం కింద జిల్లాల వారీగా రూ.5.56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులతో బాలికల విద్యతో పాటు బాల్య వివాహాల నివారణకు అవసరమైన కార్యకలాపాలను నెలవారీ క్యాలెండర్‌గా నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద ఆడ పిల్లలకు విద్యనందించడం, లింగ వివక్షను నివారించడం, ఆడ పిల్లల రక్షణ, సంరక్షణ, బాల్య వివాహాల నివారణ కార్యకలాపాలను జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు బాల్య వివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. -
కష్టకాలంలో కన్న వారిలా ఆదుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్టకాలంలో కన్న వారిలా ఆదుకున్నారు మాది మధ్య తరగతి కుటుంబం. మా ఆయన శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషించేవారు. మూడేళ్ల కిందట ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా కన్ను మూశారు. పిల్లలను ఎలా చదివించుకోవాలో తెలియక సతమతమయ్యా. నేను తప్పనిసరి పరిస్థితుల్లో టైలరింగ్ నేర్చుకుని ఆ పని మొదలుపెట్టా. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నన్ను ఆదుకున్నాయి. మా ఆయన బతికి ఉన్నప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.76,964, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.8,375 వచ్చాయి. మా అబ్బాయి ఆకాశ్ పదో తరగతి చదువుతున్నాడు. వాడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వచ్చింది. మా అమ్మాయి మేఘన డిగ్రీ చదువుతోంది. ఆమెకు జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటి వరకు రూ.12 వేలు వచ్చింది. నాకు వైఎస్సార్ ఆసరా కింద రూ.22,682, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,577, జగనన్న చేదోడు ద్వారా ఏటా రూ.పది వేల వంతున వచ్చాయి. వితంతు పింఛన్ కూడా మంజూరైంది. ఇప్పుడు మేము ఎలాంటి చీకు చింతా లేకుండా జీవిస్తున్నామంటే కారణం ఈ ప్రభుత్వం అందించిన పథకాలే. ముఖ్యమంత్రి జగనన్న మేలును ఎప్పటికీ మరువలేం. – రౌతు అనూరాధ, కురుపాం (కె.చంద్రమౌళి, విలేకరి, కురుపాం) ‘వెన్ను’దన్నుగా జగనన్న ప్రభుత్వ వైద్య శాలలు అందుబాటులో లేని సమయంలో 2012కు ముందు వరకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో ఉంటూ సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ ఆర్ఎంపీ వైద్యుడిగా ప్రజలకు వైద్యం అందిస్తూ వచ్చాను. నాడు కుటుంబ పోషణ బాగానే ఉండేది. 2012 ఏప్రిల్‌లో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడ్డాను. వెన్నుపూసకు గాయమై మంచం పట్టాల్సి వచ్చింది. నాటి నుంచి ఎన్ని మందులు వాడినా, వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది. మాకు ఒక కుమార్తె ఉంది. ఆమే కొడుకులా మారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు డీఎంహెచ్ఓ పింఛన్ రూ.5 వేలు వస్తోంది. దీనిలో రూ.3 వేలు నెలవారీ మందులకు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోంది. మిగిలిన రూ.2 వేలతో కుటుంబ పోషణ చేస్తున్నా. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నా భార్యకు ఏటా రూ.18,750 వస్తోంది. జగనన్న మాకు వెన్నుదన్నుగా నిలిచారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. – బెజ్జంకి పాండురంగారావు, బంగారుగూడెం (కొడమంచిలి ఆశీర్వాదరావు, విలేకరి, తాడేపల్లిగూడెం రూరల్) ఆపద వేళ సర్కారు ఆసరా మాది పేద కుటుంబం. నా భర్త వెంకటరమణ చిల్లరకొట్టులో గుమాస్తా. నేను టైలరింగ్ చేస్తుంటాను. మాకిద్దరు పిల్లలు. గుంటూరు జిల్లా తెనాలిలో ఉంటున్నాం. నా భర్త సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టం కావడంతో నేను టైలరింగ్ షాపు పెట్టుకున్నా. అదే సమయంలో కరోనా మహమ్మారి విలయ తాండవంతో వ్యాపారం లేక, ఆదాయం సరిపోక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. షాపు మూసి వేయాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. ఏటా రూ.12 వేలు చొప్పున నాలుగు విడతలుగా రూ.48 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ డబ్బుతో టైలరింగ్ షాపును మళ్లీ ప్రారంభించా. జగనన్న తోడు పథకం కింద అదనంగా మరో రూ.10 వేలు వచ్చాయి. ఆ డబ్బులను కూడా వ్యాపారానికి ఉపయోగించా. దీంతో మా జీవితం గాడిలో పడింది. నా కొడుకు ఇటీవలే గుమాస్తాగా చేరాడు. కుమార్తెకు వివాహం చేశాం. చేయూత పథకంలో భాగంగా నాకు ఏటా రూ.18,750 చొప్పున రావడంతో హోల్ సేల్ మార్కెట్ నుంచి చీరలు కొనుగోలు చేసి తీసుకువచ్చి మా టైలరింగ్ షాపులోనే విక్రయిస్తున్నా. సాధారణ కుట్టుమెషిన్ అమ్మేసి ఆధునిక యంత్రాన్ని కొనుగోలు చేశా. దీంతో ఆర్డర్లు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నంతలో ఆనందంగా బతుకుతున్నాం. మా ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన సీఎం జగన్ మోహన్‌రెడ్డిని జీవితాంతం గుర్తుంచుకుంటాం. – మునిపల్లి పార్వతి, తెనాలి (ఆలపాటి సుదీర్ కుమార్, విలేకరి, తెనాలిఅర్బన్) -
ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియా (సామాజిక మధ్యమాలు)లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అయింది. సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఎత్తున ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేశారు. జనసంద్రాన్ని తలపిస్తున్న ‘సిద్ధం’ సభా ప్రాంగణం, సభకు హాజరైన ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్న జనం ఫొటోలతో సామాజిక మాధ్యమాలు నిండిపోయాయి. వైఎస్ జగన్ ఎగైన్, ఎండ్ ఆఫ్ టీడీపీ హ్యాష్‌ట్యాగ్‌లతోనూ ‘సిద్ధం’ సభ విశేషాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ అభిమానులు హోరెత్తించారు. తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి మరోమారు దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. -
Visakha: నేటి నుంచి ‘మిలాన్’ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సిద్ధమైంది. 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ మహా నగరం... తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్–2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొననున్నాయి. మిలాన్ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్‌ను ఈ నెల 22వ తేదీన ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్నారు. ఈ పరేడ్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. మిలాన్–2024 విన్యాసాలను ‘కమరడెరీ(స్నేహం)–కొహెషన్ (ఐక్యత)–కొలాబరేషన్(సహకారం)’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 11 ‘మిలాన్’లు.. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణం, స్నేహ పూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు శత్రు సైన్యాలకు తమ బలం, బలగం గురించి తెలియజేసేందుకు ‘మిలాన్’ పేరుతో 1955 నుంచి విన్యాసాలు నిర్వహిస్తున్నారు. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్, ఇండొనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ‘మిలాన్’లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా.. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించడం వల్ల ఈ విన్యాసాలు జరగలేదు. ఈ విన్యాసాల్లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో అనూహ్యంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2022లో విశాఖలో నిర్వహించిన విన్యాసాల్లో 35 దేశాలు పాల్గొనగా, 2023లో అండమాన్‌లో జరిగిన విన్యాసాల్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి ఏకంగా 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. సాగర తీరంలో వివిధ దేశాల నౌకాదళాల సందడి భారత నౌకాదళ ఆహ్వానం మేరకు మిలాన్–2024లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల నౌకాదళాలతో విశాఖ సాగర జలాలు కిటకిటలాడుతున్నాయి. భారత్‌తోపాటు యూఎస్ఏ, రష్యా, జపాన్, యూకే, ఆ్రస్టేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండొనేషియా, ఫ్రాన్స్, ఈజిప్‌్ట, శ్రీలంక, వియత్నాం, మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్‌లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్, ఫిజీ, టోంగా, టోగో, పెరూ తదితర 50దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు విశాఖ చేరుకుంటున్నాయి. ఈ చరిత్రాత్మకమైన ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ నగర ప్రజలకు తూర్పు నౌకాదళాధికారులు విజ్ఞప్తి చేశారు. మిలాన్–2024 కార్యక్రమాలు ఇలా... ♦ మొదటగా ఈ నెల 19 నుంచి 23 వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ♦ 19న తొలి రోజు ప్రీ సెయిల్ డిస్కషన్స్, టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ బ్రీఫింగ్స్, అతిథులకు ఐస్ బ్రేకర్ డిన్నర్ ఉంటాయి. ♦ 20న హెల్త్ ట్రెక్, ఆగ్రా, తాజ్‌మహాల్ సందర్శన, యంగ్ ఆఫీసర్ల ఆత్మీయ కలయిక ఉంటాయి. ఆర్కే బీచ్‌లో సిటీ పరేడ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. ♦ 21న క్రీడాపోటీలు, మేరీటైమ్ టెక్నికల్ ఎక్స్పో–2024 ప్రారం¿ోత్సవం, భారత యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విజిట్, ద్వైపాక్షిక విన్యాసాలు, వివిధ దేశాల ప్రతినిధుల సిటీ టూర్, మిలాన్ విన్యాసాలు ప్రారం¿ోత్సవం, మిలాన్ విలేజ్ ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయి. ♦ 22న అంతర్జాతీయ మేరీటైమ్ సెమినార్ ప్రారంభం, ప్రీసెయిల్ డిస్కషన్స్, సిటీ టూర్, ఆర్కే బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ♦ 23న బుద్ధగయ పర్యటన, సిటీ టూర్‌తో హార్బర్ ఫేజ్ విన్యాసాలు ముగుస్తాయి. ♦ 24 నుంచి 27 వరకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సబ్‌మెరైన్స్‌తో సీఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ♦ 28న వివిధ దేశాల యుద్ధ నౌకల నిష్క్రమణ ♦ ఈసారి విన్యాసాల్లో భారత నౌకాదళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. -
మంచి పాలనకు మళ్లీ ‘సిద్ధం’
జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: విశ్వసనీయతకు–వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యుద్ధం.. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు, ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోందన్నారు. మనందరి ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. బాబు మార్కు ఎక్కడైనా ఉందా? ఈ వేదిక నుంచి చంద్రబాబుకు ఒక సవాల్ విసురుతున్నా. మీరు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా? మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మీ పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా? మీ పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు.. మా పెన్షన్ మా ఇంటికే పంపాడనే పరిస్థితి ఏనాడైనా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్లు, ఆస్పత్రులు ఏ గ్రామంలోనైనా ఉన్నాయా? కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే మీ మార్క్ ఉందా చంద్రబాబూ? పథకాలను పక్కనపెడితే చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? మేనిఫెస్టోకు రంగులు పూసి ప్రతి సామాజికవర్గాన్ని మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీ. ఏనాడైనా కనీసం 10శాతం వాగ్దానాలను అమలు చేశారా? బంగారు కడియం ఇస్తానంటూ ఊబిలోకి దింపి మనుషుల్ని తిన్న పులి మాదిరిగా మరోసారి ఎర వేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్య్రం ఎందుకన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం అన్ని సామాజికవర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి కుర్చీని లాగేసి చీపుర్లతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా బయటకు రావాలి. వైఎస్సార్ సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికీ వివరించాలి. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న మన స్టార్ క్యాంపెయినర్‌గా ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యానీ పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి రూ.87,612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తుచేయాలి. అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని మీరంతా చెప్పాలి. ఏ గ్రామానికైనా వెళదాం.. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి నిల్చున్నా ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే మంచి వలంటీర్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే జరిగాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ‘నా’ వాళ్లకు గరిష్టంగా లబ్ధి అణగారిన వర్గాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ జగన్ బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం ‘నా..’ అని ఆప్యాయంగా పిలుచుకునే వర్గాలకే ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకే దక్కాయి. ఇంతటి సామాజిక న్యాయం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపిస్తోంది. 35 లక్షల ఎకరాలపై అనుభవదారులు, గిరిజనులు, రైతన్నలు, నిరుపేదలకు సర్వహక్కులు ఇచ్చింది ఎవరంటే మీ జగనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కింది మీ జగన్ వచ్చాకే. చంద్రబాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడమే. డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. మీరంతా గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలామంది పరిపాలన చూశారు. కానీ మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్ మాత్రమే. మొదటి చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. మీ జగన్ పేరు చెబితే.. మీ జగన్ పేరు చెబితే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడ్డ పాఠశాలలు, బైజూస్ కంటెంట్, బైలింగ్యువల్ బుక్స్, ట్యాబ్‌లు, డిజిటల్ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానళ్లు, తొలిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం గుర్తొస్తాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఇవన్నీ కొనసాగాలంటే, పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలంటే, పెత్తందార్ల పిల్లలతో పోటీ పడే పరిస్థితి రావాలంటే మీ అన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఇవాళ ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు మరో 10–15 ఏళ్లలో అంతర్జాతీయ చదువులతో గొప్ప ఉద్యోగాలు సాధించాలంటే మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పండి. సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దుకు ఓటేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే రూ.3 వేల పెన్షన్లు కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగాలన్నా, కొందరికే పింఛన్లు ఇచ్చిన రోజులు మళ్లీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ సేవలతో విస్తరించిన ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఆదుకుంటున్నాయి. వీటి పేరు వింటే కోవిడ్ కష్టకాలంలో అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరాలి. 57 నెలల్లో మీకోసం 125 సార్లు బటన్లు ఈ 57 నెలల్లో నేను ప్రజల కోసం 125 సార్లు బటన్లు నొక్కా. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లాయి. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి మన పాలనలో మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని, మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడాలని మనం నిబద్ధతతో సిద్ధం అంటుంటే ఏ ఒక్కరికైనా ఏం చేశారో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మేమూ సిద్ధం.. సంసిద్ధం అంటూ చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావ్? కృష్ణుడిలా కోట్ల గుండెలు తోడున్నాయి.. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడుగా కృష్ణుడి రూపంలో ప్రతి పేదవాడి ఇంట్లో కోట్ల గుండెలున్నాయి. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తులతో ఎన్నికల పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ఇది మీ అందరి పార్టీ. జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్సార్సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మా నాయకుడు మాటిచ్చాడంటే చేస్తాడంతే అని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి. 99 శాతం వాగ్దానాలు అమలుచేసి ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి మరీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పార్టీ మనదే. అందుకే ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్. మన టార్గెట్ 25కు 25 ఎంపీ సీట్లు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలేలేదు. మరో 55 రోజుల్లో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. చంద్రబాబు అబద్ధాలు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎదుర్కొంటూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరంతా సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, వలంటీర్లు, గృహ సారథుల పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం. చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరని జాతీయ పార్టీలతో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకే ఒక్కడిపై యుద్ధం చేయడానికి ఇన్ని తోడేళ్లు ఏకం అవుతున్నాయి. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒక్కడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న మీ జగన్‌కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. మీకెందుకు ఓటేయాలి బాబూ? జగన్ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో మంచి మార్పు కనిపిస్తున్నప్పుడు బాబుకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్ పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. ఊతం కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా? సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడని తెలుసు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
పశుపోషకులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: నాణ్యమైన దాణాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పశుపోషకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పశు పోషణ ఖర్చును భారీగా తగ్గించి.. పాడిరంగాన్ని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ఏపీ పశు దాణా చట్టం –2020 తీసుకొచ్చింది. దీని పరిధిలోకి దాణా తయారీ, సరఫరా, అమ్మకం కార్యకలాపాలన్నింటినీ తెచ్చింది. అంతేకాకుండా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకందార్లకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన.. కల్తీలేని దాణా, ఖనిజ లవణ మిశ్రమాన్ని నిర్దేశించిన ధరలకు అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,680 మంది తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్ట్‌లకు ఈ చట్టం కింద లైసెన్స్‌లు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నాసిరకం దాణా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతోంది. లైసెన్సుల జారీ, శాంపిల్స్ తనిఖీల ద్వారా ఇప్పటివరకు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. పశువుల ఆహార అవసరాలకే 70 శాతం ఖర్చు రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. మూగజీవాలకు ఏటా 65 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా ఏటా సగటున 70.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోందని అంచనా. పశుపోషణ కోసం చేసే ఖర్చులో 70 శాతం వాటి ఆహార అవసరాల కోసమే ఉంటోంది. గతంలో నాణ్యత విషయంలో దాణా తయారీదారులు గోప్యత పాటించడం పశుపోషకులకు ఆశనిపాతంగా ఉండేది. దాణాలో.. తేమ, ముడి మాంసకృత్తులు, ముడి కొవ్వు పదార్థాలు, ముడి పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా తయారైన దాణాను అధిక మోతాదులో వినియోగిస్తే తప్ప ఆశించిన స్థాయిలో ఉత్పాదన వచ్చేది కాదు. ముడి మాంసకృత్తులను పెంచడానికి కొంతమంది తయారీదారులు చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు. దీంతో పెట్టుబడి భారం పెరగడంతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తి రాక పశుపోషకులు ఆర్థికంగా నష్టపోయేవారు. మరోవైపు ఆరోగ్యవంతమైన పశువులు సైతం దీర్ఘకాలిక రోగాల బారిన పడేవి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఏపీ పశు దాణా చట్టం తెచ్చింది. ఈ చట్టం 2021 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం అమలుకు ప్రత్యేక కమిటీలు పశు దాణా చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పశుదాణా నాణ్యత, నియంత్రణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘కంట్రోలింగ్ అథారిటీ, కలెక్టర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయి లైసెన్సింగ్ అథారిటీలను నియమించింది. పశుదాణా నాణ్యతను తనిఖీ చేసేందుకు స్థానిక పశువైద్యులకు యానిమల్ ఫీడ్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. వీరు క్షేత్ర స్థాయి తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్‌కు ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు. తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ షాపులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ పేరిట ప్రత్యేకంగా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు 1,680 మంది దాణా తయారీదారులు, అమ్మకందార్లకు లైసెన్సులు ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గతంతో పోలిస్తే నాసిరకం దాణా తయారీ, సరఫరా, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని పశుపోషకులు చెబుతున్నారు. నాణ్యత లేని దాణా తయారుచేస్తే క్రిమినల్ కేసులు.. పశు దాణా చట్టం అమల్లోకి వచ్చాక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నాం. నాణ్యత లేని దాణా తయారీదారులు, నిరీ్ణత ప్రమాణాలు పాటించనివారు, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే కనీసం ఏడేళ్లు జైలుశిక్ష, తగిన జరిమానా పడుతుంది. – డాక్టర్ అమరేంద్రకుమార్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
fact check: పచ్చమీడియాకు ‘అతి’సారం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్(గుంటూరు): పచ్చమీడియాకు అతిసారం సోకినట్టుంది. గుంటూరు నగరంలో కలుషిత జలం కాటేసిందంటూ మరోసారి విషాన్ని విరజిమ్మింది. తప్పుడు కథనాలతో పేట్రేగిపోయింది. చికెన్‌పాక్స్, న్యూమోనియా కారణాలతో శుక్రవారం మరణించిన మహ్మద్ ఇక్బాల్ డయేరియాతో మరణించాడని దుష్ప్రచారానికి దిగింది. గత వారంలో మరణించిన పద్మ మరణంపైనా ఇలాగే రాక్షస రాతలు రాసింది. గుంటూరులో నివాసం ఉంటున్న మహ్మద్ ఇక్బాల్ ఈ నెల 11న సాయంత్రం విరేచనాలు , వంటిమీద చీము పొక్కులతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించడంతో విరేచనాలు తగ్గాయి. పొక్కులను చికెన్‌పాక్స్‌గా వైద్యులు గుర్తించారు. బ్లడ్‌షుగర్ లెవల్స్ కూడా 400 దాటి ఉండటంతో డెర్మటాలజీ డాక్టర్లు పరీక్షించి గోరంట్లలోని అంటువ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో చేరాలని సూచించారు. ఇక్బాల్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. జీజీహెచ్‌లోనూ ఉండకుండా వెళ్లిపోయాడు. రెండురోజల తర్వాత 15న న్యూమోనియా లక్షణాలతో ఊపిరితీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా వైద్యులు జ్వరాల ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా వెళ్లలేదు. ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ తర్వాత రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికెన్‌పాక్స్, న్యూమోనియా లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ జీజీహెచ్‌కు వచ్చాడు. వచ్చిన అరగంటలోనే మృతి చెందాడు. వైద్యులు చికెన్‌పాక్స్, అదుపులో లేని మధుమేహం, న్యూమోనియా లక్షణాలతో చనిపోయాడని నివేదిక ఇచ్చారు. కుటుంబ సభ్యులు భీమవరం వెళ్లడంతో గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు వారితో ఫోన్లో మాట్లాడారు. వారు కూడా అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన వెంటనే మృతుడు ఇక్బాల్ నివాసం ఉన్న రైలుపేట ప్రాంతాలలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఎక్కడా నీరు కలుషితం కాలేదని నివేదికలొచ్చాయి. గుండెపోటుతోనే పద్మ మరణం ఈనెల 10న మరణించిన ఎం.పద్మ(18) కూడా కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాంతులు, విరేచనాలతో రెండురోజుల పాటు ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఆఖరి ఘడియల్లో జీజీహెచ్‌లో చేరింది. అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్టుతో మృతి చెందింది. కలుషిత నీరైతే ఒకరిద్దరే జబ్బున పడతారా? కలుషిత నీరైనా, అతిసారం అయినా ఒకరిద్దరే జబ్బున పడరని వైద్యులు చెబుతున్నారు. ఆ కలుషిత నీరు తాగిన అందరూ రోగం బారిన పడతారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఒక వేళ కలుషిత నీటి వల్ల ఇక్బాల్, పద్మ జబ్బు బారిన పడితే వారి కుటుంబాలు ఎలా ఆరోగ్యంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఎల్లోవీుడియా వద్దగానీ, టీడీపీ నేతల వద్దగానీ సమాధానం లేదు. అధికారులు అప్రమత్తం ఎల్లోవీుడియావి కట్టుకథలే అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల పది నుంచి నగరంలో రోజుకు వెయ్యికిపైగా తాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడా కూడా తాగునీరు కలుషితం అయినట్లు ఆధారాలు దొరకలేదు. మినరల్ వాటర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రీజనల్ మెడికల్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. పలు ఆర్ఓ ప్లాంట్లలో ఉండాల్సిన పీహెచ్ కన్నా తక్కువ ఉండటం, బ్యాక్టీరియా ఉండడాన్ని గుర్తించారు. వీటిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పానీపూరి కోసం వాడుతున్న నీరు కలుషితంగా ఉండటం వల్ల వ్యాధులు వస్తున్నాయని రీజినల్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పచ్చమీడియా రెచ్చిపోతోంది. స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం. కొన్ని పత్రికలు రాజకీయ అజెండాతో కలుషిత జలాలు అంటూ విషం చిమ్ముతున్నాయి. రైలుపేటకు చెందిన ఇక్బాల్ చికెన్‌పాక్స్, న్యూమోనియాతోనే చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులూ, జీజీహెచ్ వైద్యులూ ధ్రువీకరించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో గుంటూరు నగరంలో 27 మంది అతిసారంతో మృతి చెందారు. అప్పట్లో జీజీహెచ్‌లో రెండు వేల మంది చికిత్స తీసుకున్నారు. డయేరియా అయితే వందల మంది ఆస్పత్రుల పాలవుతారు. ప్రజలకు సరఫరా చేసిన ప్రతినీటిబొట్టునూ పరీక్షించిన తర్వాతే కుళాయిలకు వదులుతున్నాం. సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని ముందే సూచించాం. ఇంటింటి ప్రచారమూ చేపట్టాం. రీజనల్ మెడికల్ ల్యాబ్ నివేదిక మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ కంట్రోల్ శాఖకు లేఖ రాశాం. – మీడియాతో మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తిచేకూరి, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు -
మా బతుకులు బాగుపడ్డాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులు బాగుపడ్డాయి మాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా ఆయన నాగరాజుతో కలిసి వ్యవసాయ పనులతోపాటు పాడి ఆవులు పెట్టుకున్నాం. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలోని పెద్ద దళితవాడలో ఉంటున్న మేము అరకొర ఆదాయంతోనే ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి సాయానికి నోచుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వలంటీర్‌గా అవకాశం వచ్చింది. రెండేళ్ల క్రితం పాడి ఆవుల కోసం రూ.2 లక్షలు పొదుపు రుణం తీసుకున్నాం. రూ.1.50 లక్షలతో రెండు పాడి ఆవులు కొన్నాం. రూ.50 వేలతో పశుగ్రాసం కోసం కొంత భూమిని కౌలుకు తీసుకున్నాం. రోజూ ఉదయం, సాయంత్రం 30 లీటర్ల పాలు వస్తున్నాయి. అమూల్ డెయిరీకి పాలు పోయడం ద్వారా నెలకు రూ.27 వేలు వస్తోంది. దాణా, ఇతర ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగులుతోంది. 5వ తరగతి చదువుతున్న మా అమ్మాయి వర్షిత ప్రియకు అమ్మ ఒడి వస్తోంది. ఇప్పటి వరకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున, నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. మా అత్త మల్లక్కకు వైఎస్సార్ చేయూత పథకంలో ఏటా రూ.18,750 వస్తోంది. వృద్ధాప్య పింఛన్ రూ.3 వేలు వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో హాయిగా బతుకుతున్నాం. జగనన్న సాయంతోనే మా బతుకులు బాగుపడ్డాయి. – మంచూరి దుర్గ, అంగళ్లు (సిద్దల కోదండరామిరెడ్డి, విలేకరి, కురబలకోట) నేను టీడీపీ.. అయినా ఇల్లు ఇచ్చారు చిన్న తనం నుంచీ టీడీపీ అంటే పిచ్చి. పసుపు చొక్కా వేసుకొని జెండా పట్టుకొని తిరిగే వాడిని. నన్ను అందరూ టీడీపీ కార్యకర్తగా ముద్ర వేశారు. 20 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ములో ఓ అద్దె ఇంట్లో ఉంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించాను. సొంత ఇంటి కోసం ఆ ప్రభుత్వ కాలంలో ఎంతో ప్రయత్నించాను. అందరి వద్దకూ వెళ్లాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనుగోలు చేసే స్తోమత లేక ఆ ఆశ వదులుకున్నాను. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం ఇస్తూ ఇల్లు మంజూరు చేస్తున్నారు అంటే దరఖాస్తు చేశాను. జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేటలో జగనన్న కాలనీలో స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. డ్వాక్రా నుంచి నా భార్యకు మరో రూ.30 వేలు అప్పుగా ఇచ్చారు. మరికొంత అప్పు చేసి మా కల నెరవేర్చుకున్నాం. భార్య, కుమార్తెతో హాయిగా జీవిస్తున్నాం. నా భార్య శశికళకు రూ.12 వేలు డ్వాక్రాలో రుణ మాఫీ అయ్యింది. కుమార్తెకు విద్యా దీవెన పథకంలో మూడేళ్లలో రూ.60 వేలు వచ్చింది. ఇప్పుడు మాకు ఎలాంటి ఆర్థిక సమస్యా లేదు. ఇప్పుడు జగనన్న గెలుపే నా లక్ష్యం. – పొట్నూరు జగదీష్, గడ్డెయ్యపేట (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) ప్రభుత్వ పథకాలతో బతుకు చింత తీరింది మాది పేద కుటుంబం. నేను, మావారు చేనేత పనులు చేస్తుండేవాళ్లం. ముగ్గురు పిల్లలు పుట్టాక నా భర్త నన్ను వదిలేయడంతో మగ్గం పనులు చేస్తూనే వారిని పెంచి పెద్ద చేశాను. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశాను. అబ్బాయి బంగారం వర్క్ షాపులో పని చేస్తుంటాడు. కోడలు, మనవడితో కలిసి పాత మంగళగిరిలో ఉంటున్నాం. నాకు వచ్చే పెన్షన్‌తో జీవనం కొనసాగిస్తున్నా. ఇప్పుడు ఓపిక లేక పనులకు కూడా వెళ్లడం లేదు. ఒకరోజు ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. సుమారు ఏడు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కాళ్లూ చేతులు ఆడలేదు. అసలే ఆదాయం అంతంత మాత్రం. ఏమి చేయాలో అని ఆలోచిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాకు శ్రీరామ రక్షగా నిలిచింది. లక్షలు ఖర్చు చేసే ఆపరేషన్‌ను విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు. దీంతో నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆరోగ్యశ్రీ లేకపోతే నా కుటుంబం రోడ్డున పడేది. నాకు సీఎం జగన్ పునర్జన్మ ప్రసాదించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 అందుతోంది. దానిని కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నా. మా మనవడికి అమ్మ ఒడి డబ్బులు రావడంతో వాడి చదువులకు చింత లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు మా కుటుంబాన్ని ఆదుకుంటున్నాయి. – చెరుకు ఆదిలక్ష్మి, పాత మంగళగిరి (ఐ.వి.రెడ్డి, విలేకరి, మంగళగిరి) -
పేదింట అభివృద్ధి
(పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి సాక్షి ప్రతినిధి మేడికొండ కోటిరెడ్డి) : రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమాభివృద్ధి పథకాలు.. కార్యక్రమాల వల్ల పల్లెల్లోని లక్షలాది పేద కుటుంబాల్లో అభివృద్ధితో కూడిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మగౌరవంతో కూడిన ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఆయా కుటుంబాల పెద్దలు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఉండే ఒక రేకుల షెడ్డులో భార్య, భర్త, పెళ్లీడుకొచ్చిన కొడుకుతో కలిసి జీవనం సాగించిన పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామానికి గార్లపాటి కెజియా.. అప్పటిదాకా పనులు చేసుకుంటూ సంపాదించుకున్న సొమ్ముకు ప్రభుత్వ సహకారం తోడు కావడంతో కుమారుడి పెళ్లికి ముందే మూడు గదులు, వరండాతో కూడిన పక్కా ఇంటిని నిర్మించుకోగలిగింది. ఆమె ఇంటి పక్కన నివాసం ఉండే ఆరేటి కోటేశ్వరమ్మ కొడుక్కు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ ఉద్యోగమే వచ్చింది. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు మరణిస్తే, ఆ కుటుంబంలోనే మరొకరికి కారుణ్య నియామక కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. చేతికి అందివ చ్చి న కొడుకు దూరమైన ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకే ఆమె మూడో కుమారుడికి ప్రభుత్వ వలంటీరుగా అవకాశం దక్కింది. వీరి ఇళ్లకు పక్కనే ఉండే మరో మహిళకు వివాహమై 25 ఏళ్లు అయినా, చెవి దిద్దులు తప్ప మరే ఇతర బంగారు ఆభరణాలు కొనుక్కోలేకపోయానని బెంగపడేది. ఇప్పుడామె ఈ నాలుగున్నరేళ్లలోనే దాదాపు రూ.2 లక్షలకు పైగా విలువైన కొత్త బంగారు ఆభరణాలు కొనుక్కొంది. ఈ ముగ్గురి ఇళ్ల చుట్టుపక్కలే నివాసం ఉండే మేఘన.. వలంటీర్‌గా పని చేస్తూ నెలనెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం పొందడంతో పాటు అంతకు ముందు చేసుకొనే అన్ని పనులను ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకుపోతోంది. వీళ్లంతా ఆ గ్రామంలోని ఒక స్వయం సహాయక పొదుపు సంఘం (యెహోవా) సభ్యులు. ఆసరా ద్వారానే రూ.3.34 లక్షలు లబ్ధి మొత్తం పది మంది సభ్యులు ఉండే ఈ పొదుపు సంఘం పేరిట 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రూ.3,33,440 బ్యాంకు అప్పు ఉండింది. అప్పటి ఎన్నికల్లో హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో చేసిన రుణ మాఫీ మొత్తం నేరుగా వారి చేతికే అందింది. సంఘ సభ్యులు కెజియా, కోటేశ్వరమ్మ, మేఘన.. ఇలా పది మంది ఒక్కొక్కరు ఒక్కో విడతకు రూ.8,336 చొప్పున.. నాలుగు విడతల్లో రూ.33,344 లబ్ధి పొందారు. ఈ సంఘం ఒకసారి రూ.7,50,000 బ్యాంకు రుణం పొందగా, ఒక్కొక్కరూ రూ.75 వేల చొప్పున రుణ లబ్ధి పొందారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రోత్సాహంతో ఈ రుణ మొత్తాన్ని సంఘ సభ్యులందరూ సకాలంలో కిస్తీ రూపంలో చెల్లించారు. 15 రోజుల కిత్రమే మరో విడత ఏకంగా రూ.15,00,000 పొందారు. తద్వారా ఒక్కొక్కరూ రూ.లక్షన్నర దాకా రుణ లబ్ధి పొందారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాదిరి కాకుండా పొదుపు సంఘాల రుణాలపై వడ్డీని సున్నా వడ్డీ పథకం కింద జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో వారికి మరింత ఊరట లభించింది. గతంలో ఈ సంఘంలోని సభ్యుల కుటుంబాలు తమ కుటుంబానికి ఏ ఆర్థిక అవసరం ఏర్పడినా రూ.100కు నెలకు రూ.2, రూ.3 వడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకోనే పరిస్థితి ఉండింది. ఈ నాలుగేళ్లలో వీరు ఏకంగా రూ.22.50 లక్షల రుణం తమ పొదుపు సంఘం ద్వారా పొందడంతో వడ్డీ రూపంలోనే ఒక్కొక్కరూ రూ.25 వేలకు పైబడే అదనపు ప్రయోజనం పొందారు. చేయూత, పింఛను, రైతు భరోసా, ఇతరత్రా లబ్ధి ఈ పేద కుటుంబాలకు ప్రభుత్వ సాయం కేవలం వైఎస్సార్ ఆసరా పథకం ఒక్కటికే పరిమితం కాలేదు. చేయూత కింద ఏడాదికి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున అందుతోంది. గార్లపాటి కెజియాకూ, ఆరేటి కోటేశ్వరమ్మకు ఇప్పటికే మూడు విడతలు అందింది. త్వరలో నాలుగో విడత అందనుంది. కెజియా భర్త గార్లపాటి యోహన్‌కు గత 56 నెలల కాలంలో పెన్షన్ రూపంలో రూ.1,32,750.. ఆరేటి కోటేశ్వరమ్మ భర్త ఆరేటి తిరుమలరావుకు రూ.93,750 పెన్షన్‌గా అందింది. కొడుక్కు ఉద్యోగం వచ్చిన కారణంగా కొంత కాలం పింఛను నిలిపి వేసినా, అతను రోడ్డు ప్రమాదంలో మరణించడంలో ఆరేటి తిరుమలరావుకు పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. కోటేశ్వరమ్మ కుటుంబానికి కరోనా సమయంలో ప్రభుత్వ సాయంగా రూ.1000తో పాటు జగనన్న తోడు పథకంలో రెండు విడతల్లో రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందింది. వీరికి రైతు భరోసా పథకం ద్వారా 2022, 2023లో రెండు విడతలుగా రూ.13,500 చొప్పున అందింది. వీరి చిన్న కుమారుడు సురేష్ 2019–20లో డిగ్రీ చివరి సంవత్సరానికి సంబంధించి విద్యా దీవెన పథకం ద్వారా సాయం అందింది. కెజియా కుటుంబానికి కరోనా సాయంగా ప్రభుత్వమిచ్చిన రూ. 1000తో పాటు ఇతర పథకాలన్నీ కలిపి దాదాపు రూ.రెండున్నర లక్షల మేర ప్రయోజనం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా లబ్ధి ► వైఎస్సార్ ఆసరా పథకం సద్వి నియోగం చేసుకోవడం ద్వారా తమ జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులపై 78,189 మంది తమ జీవిత గాధలను వివరిస్తూ వీడియోలు చిత్రీకరించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులపై 76,423 మంది, వైఎస్సార్ పెన్షన్లతో వచ్చిన మార్పుపై 99,436 మంది.. మొత్తంగా 2,54,013 మంది తమ జీవిత గాధలను వీడియోల రూపంలో చిత్రీకరించారు. ► నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం గత చంద్రబాబు ప్రభుత్వ సమయంలో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 11.77 శాతం పేదరికం ఉండగా, 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గింది. ► రాష్ట్రంలో 2020–21తో పోలిస్తే 2022–23 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 19.79 లక్షల నుంచి 21.65 లక్షలకు పెరిగింది. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కూడ రూ.47,518 చొప్పున పెరగడం గమనార్హం. ► ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా అందజేసే సాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా గత నాలుగేళ్ల కాలంలో ఏకంగా 18.37 లక్షల మంది ప్రతి నెలా స్థిర ఆదాయం పొందేలా శాశ్వత జీవనోపాధులు ఏర్పాటు చేసుకున్నట్టు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. -
నాణ్యమైన విద్య.. ఒక హక్కు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం. కానీ.. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు.. ఇది ఇక కొత్త నినాదం అని అన్నారాయన. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని చెప్పారాయన. ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి మంచి జీతాలు సంపాదించాలి. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అని అన్నారాయన. .అందుకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.మనం నాటిన ఈ విత్తనం చెట్టై ప్రతిఫలాలలు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు.మనం వేసిన ప్రతి అడుగు ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. మానవవనరులమీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాం. ప్రాధమికస్ధాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే... అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. గ్లోబల్ సిటిజెన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్ధాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు. అందుకనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం చేయడం నుంచి మొదలు, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పిల్లలను బడులకు తీసుకువచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. అక్కడితో మనం ఆగిపోలేదు. ఇంగ్లిషు మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పది సంవత్సరాలకు.. ఇవాళ ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు పదోతరగతికి వచ్చేసరికి ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) విద్యావిధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం. వాళ్లు మన ఎస్సీఈఆర్టీలో భాగమై.. ఈ ఏడాది టీచర్లకు సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి పెడతారు. ఈ ఏడాది టీచర్ల సామర్ధ్యం పెంచడంపై దృష్టి పెట్టడంతో పాటు వచ్చే ఏడాది ఒకటో తరగతి, ఆ తర్వాత రెండో తరగతి ఇలా.. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్ధాయికి మన పిల్లల చదువులను తీసుకునిపోతాం. 6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ... ఐఎఫ్‌బీలను ప్రతి క్లాస్‌రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి, పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ సులభంగా అర్ధం అయ్యేలా చేస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను అనుసంధానం చేశాం. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చాం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఉన్నతవిద్యలో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజెన్స్‌గా తయారవుతారు. ప్రపంచంతో పోటీపడతారు. ఉన్నతవిద్యారంగం మీద ఈ ఐదుసంవత్సరాల మీద పెట్టిన ధ్యాస ఇంతకముందు ఎవరికీ ఊహకు కూడా అందని విధంగా ధ్యాసపెట్టి అడుగులు వేయించగలిగాం. మొట్టమొదటిసారిగా పిల్లలు కచ్చితంగా చదవాలి, వారి చదువులకు పేదరికం అడ్డురాకూడని అడుగులు వేశాం. దీనికోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ప్రతి ఏటా విద్యాసంవత్సరం జూన్ –జూలైలోనూ, అలాగే విద్యాసంవత్సరం చివర్లో కూడా వసతి దీవెన అందిస్తున్నాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చాం. దాదాపు 30శాతం కోర్సులు స్కిల్ ఓరియెంటెడ్‌గా మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు తీసుకువచ్చాం. తొలిసారిగా మూడేళ్ల కోర్సులో కూడా ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా చేస్తున్నాం. మూడేళ్ల కోర్సుతో పాటు ఇంకో ఏడాది హానర్స్డిగ్రీ ఇచ్చే విధంగా తీసుకువచ్చాం. తొలిసారిగా 400 పైగా బైలింగువల్ పాడ్‌క్యాస్టులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్ధలు మాత్రమే న్యాక్ గుర్తింపు పొందగా.. ఈ రోజు రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు 437 ఉన్నాయి. ప్రతి అడుగులో విద్యలో నాణ్యత పెంచాలి.. అలా పెంచగలిగితే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడతారని ప్రతి అడుగు వేశాం. అందులో భాగంగానే ఇవాళ వేస్తున్న ఇంకో గొప్ప అడుగు ఎడ్‌క్స్‌తో ఈ రోజు మనం చేస్తున్న ఒప్పందం. దాదాపుగా 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్ కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారు. మన పిల్లలు ఆన్లైన్లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్‌గా పరీక్షలు జరుగుతాయి. మన పిల్లలు ఆ పరీక్షలు పాసవుతారు. క్రెడిట్స్ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మనదగ్గర యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా వాళ్ల దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్సేంజ్, వెల్త్ మేనేజిమెంట్, రిస్క్ మేనేజిమెంట్ వంటి వర్టికల్స్ పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో భాగంగా అందుబాటులో కనిపిస్తాయి. మన దగ్గర ఇవేవీ కనిపించవు. ఇటువంటివి నేర్పించే సిబ్బంది అందుబాటులో లేకపోవడం, రెండోది ఇటువంటి పరిజ్ఞానం మన దగ్గర లేకపోవడం కూడా మరో కారణం. ఈ రెండింటిని కూడా బ్రిడ్జ్ చేస్తూ.. ఈ కోర్సులు అందుబాటులో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీల వాళ్లే... ఏకంగా మన కరిక్యులమ్‌లో భాగమై, ఈ అంశాలను బోధించేలా మన పిల్లలకు అందుబాటులో తీసుకువస్తున్నాం. ఇది పెద్ద మార్పు. దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి తీసుకునే ఈ డిగ్రీలో స్టాక్ ఎక్సెంజ్, రిస్క్ మేనేజిమెంట్, వెల్త్ మేనేజిమెంట్, ఫైథాన్ కోర్సుల వంటివన్నీ ఎంఐటీ, హార్వర్డు సంస్ధలు సర్టిఫై చేసి మన పిల్లలకు ఇస్తాయి. ఆయా సంస్ధలకు వెళ్లి చదువుకున్నవాళ్లు చేసే కోర్సులు ఇక్కడే మన యూనివర్సిటీల్లో అందుబాటులోకి వస్తాయి. దాదాపుగా 12లక్షల మంది విద్యార్ధులకు 2వేలకు పైగా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మన యూనివర్సిటీలలో మన పాఠ్యప్రణాళికలో భాగంగా అవి అందుబాటులోకి రానున్నాయి. వీటిని మన పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీటిలో విద్యార్ధి తనకు కావాల్సిన వర్టికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాంప్రదాయంగా మన దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు ఉండడం వల్ల ఉద్యోగ సాధన మరింత సులభం అవుతుంది. గతంలో అన్ని యూనివర్సిటీల వీసీలకు ఇదే మాట చెప్పాను. రాబోయే రోజుల్లో ఏఐ, అగ్మెంటెడ్ టెక్నాలజీ, 3డి లెర్నింగ్ వంటి వాటిని మన కరిక్యులమ్‌లో అందుబాటులోకి తీసుకునిరావాలి. అలా తేగలిగితేనే నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేగలుగుతాం. మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య వారికి అందించగలిగితేనే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్ద, పెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. విద్యను ఏ స్ధాయిలో ప్రోత్సహిస్తున్నామంటే.. టాప్ –50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో టైమ్స్ రేటింగ్స్, క్యూ ఎస్ రేటింగ్స్‌లో ఉన్న 320 కాలేజీలలో సీటు వస్తే.. రూ.1.25 కోట్ల వరకు ప్రభుత్వమే ఫీజులు కట్టి చదవిస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 400 మందికి పైగా వినియోగించుకుని ఇప్పటికే వినియోగించుకున్నారు. అందరికీ ఆ రకంగా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు, ప్రతి యూనివర్సిటీలలో ఆ యూనివర్సిటీలనే, ఆ సబ్జెక్టులనే తీసుకుని వచ్చే గొప్ప ప్రయత్నమే ఈ ఎడ్‌క్స్‌తో చేసుకుంటున్న ఒప్పందం. దీనివల్ల పెద్ద యూనివర్సిటీలలో సీట్లు రాకపోయినా.. ఆ కోర్సులు మన యూనివర్సిటీలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఇది గొప్ప మార్పు. నాణ్యమైన విద్య మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తున్నాం. ప్రతి వైస్ ఛాన్సలర్‌కి చెబుతున్నాను. మీరు కూడా వీటి మీద దృష్టి పెట్టండి. ఆన్లైన్ కేపబులిటీని పెంచాలి. మన దగ్గర రిజిస్ట్రేషన్లు బాగా జరిగేలా చూడాలి. పద్మావతి యూనివర్సిటీలో కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్ధాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు.యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్‌కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇది ప్రారంభం. ఇటువంటి చర్యలు ప్రతి యూనివర్సిటీ తీసుకోవాలి. టెక్నాలజీని మన పిల్లలకు తీసుకునిరావాలి. అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్యకు అందించగలుగుతాం. ఆ దిశగా వీసీలు మందడుగు వేయాలి. కార్యక్రమంలో మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఆశిస్తూ ఎంఓయూ చేసుకుంటున్నాం’ అని సీఎం తన ప్రసంగం ముగించారు. -
Ratha Saptami: రథసప్తమి వైభవం
సాక్షి, తిరుపతి: తిరుమలకు మినీ బ్రహోత్సవంగా పిలువబడే రథసప్తమి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సూర్య జయంతి వేడుకలతో టీటీడీ ఆలయ మాడ వీధుల్లో భక్తసందోహం నెలకొంది. సప్త వాహనాల సేవలో భాగంగా.. తొలుత సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. ఇక రథసప్తమి మహోత్సవాలకు తిరుమల సుందరంగా ముస్తాబైంది. ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారి నుదుటన, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారన్నది తెలిసిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. మహద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. భక్తుల భద్రతకు పటిష్ఠ చర్యలను టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీసుశాఖ చేపట్టింది. వాహన సేవలు ఇలా.. తెల్లవారుజామున 5.30-8.00 సూర్యప్రభ (సూర్యోదయం 6.40) ఉదయం 9-10 : చిన్నశేష ఉదయం 11-12 : గరుడ వాహనం మధ్యాహ్నం 1-2 : హనుమంత మధ్యాహ్నం 2-3 : చక్రస్నానం సాయంత్రం 4-5 : కల్పవృక్ష సాయంత్రం 6-7 : సర్వభూపాల రాత్రి 8-9 : చంద్రప్రభ తిరుమలలో నేడు ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. శనివారం వరకు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేసిన నేపథ్యంలో భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలాగే.. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీంతో.. స్థానిక ఆలయాలైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం తదితర ఆలయాల్లో రథసప్తమి పర్వదినం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు సూర్యప్రభ వాహనం సేవతో మొదలై.. రాత్రి గజ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆలయ మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం భారీ షెడ్లను ఏర్పాటు చేసింది. రథ సప్తమి ప్రశస్తి.. మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతి రథసప్తమిగా ప్రశస్తి పొందింది. అదితి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన సుదినమిది. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ. రథసప్తమిని సూర్యజయంతి, జయంతి సప్తమి, మహాసప్తమి, సౌరసప్తమి, భాస్కర సప్తమి మొదలైన పేర్లతో విభిన్న ప్రాంతాల్లో పిలుస్తారు. నిజానికి రథసప్తమి నుంచే ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రోజున స్వర్గస్థులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఒకప్పుడు రథసప్తమినే ఉగాదిగా వ్యవహరించేవారట. రాష్ట్రంలో పలు ఆలయాల్లో.. రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు, రథయాత్రల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి సన్నిధి లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి అర్ధరాత్రి క్షీరాభిషేకం తో ప్రత్యేక పూజలు చేశారు. సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కోసం వేల సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు జిల్లాలోని వజ్రపుకొత్తూరు (మం ) అక్కుపల్లి శివసాగర్ బీచ్ కు భక్తులు పోటెత్తారు. కృష్ణాజిల్లా మోపిదేవిలో వైభవంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సుబ్రహ్మణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మోపిదేవి పురవీధుల్లో వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు, ఆలయ ఏసీ నల్లం సూర్య చక్రధరరావు ప్రారంభించారు. -
ఏపీ విద్యార్థులకు మరో శుభవార్త
సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. .. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తోంది. 12 లక్షల మందికి లబ్ధి ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు. ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి నచ్చిన వర్టికల్స్ చదువుకునేలా ప్రణాళిక రూపొందించింది. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగమవుతాయి. తద్వారా ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో ఎడెక్స్ ఎంతో ఉపయోగపడనుంది. -
విశాఖ, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్‌లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేష్ ఉన్నారు. -
అదంతా ‘పచ్చ’ అబద్ధం!
సాక్షి, అమరావతి: నిత్యం కట్టుకథలతో పేజీలకు పేజీలు నింపేస్తున్న ఈనాడు పత్రిక గురువారం మరో అబద్దాన్ని అందంగా అచ్చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల పోద్బలంతో అక్కడి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్న అమరావతి ఈనాడు విలేకరిపై ఏకంగా పెట్రోల్‌పోసి నిప్పంటించేస్తామని బెదిరించి... చంపబోయారన్నట్టు... ఓ అబద్దపు వార్త ప్రచురించింది. వాస్తవానికి ఆ విలేకరి పీడీయాక్ట్పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన టీడీపీ నేత దండా నాగేంద్రతో సన్నిహితంగా ఉంటూ అతను చెప్పినట్టు ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. అక్రమాలకు పాల్పడుతున్న ఆ విలేకరిని వేరే పత్రిక తొలగిస్తే టీడీపీనేత దండా సిఫార్సుతో ఈనాడులో కొన్నాళ్ల క్రితం చేరాడు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్న నాగేంద్రం సూచనమేరకు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. ఇసుక ర్యాంపులోకి అక్రమంగా... అమరావతి మండలం మల్లాది ఇసుకరీచ్‌ను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం స్వయంగా పరిశీలించారు. కానీ తవ్వకాలు ఆపమని బుధవారానికి ఎటువంటి ఆదేశాలు రాకపోవటంతో యథావిధిగానే ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థాయి అధికారులు ఉదయం 10.30గంటలకు వచ్చి తవ్వకాలు ఆపేయాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడింగ్ చేయటానికి నిర్వాహకులు బిల్లులు రాశారు, ఇంకా బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనక్కు పంపారు. బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలతో ఇసుక పంపించేశారు. అదే సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో “ఏంటబ్బాయ్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నావు... గతంలో కూడా ఇలాగే ఫొటోలు తీసి నిజాలు దాచిపెట్టి అబద్దాలు రాసి మన ఊరి పరువుతీస్తున్నావ’ని సరదాగా అన్నారు. దానికి ఆయన “నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రీచ్‌లోకి రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తాను’ అంటూ దురుసుగా మాట్లాడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఈనాడు కంట్రిబ్యూటర్ కవ్వింపు చర్యలకు దిగడంతో తోపులాట జరిగింది. వెంటనే ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి కంట్రిబ్యూటర్‌ను ద్విచక్ర వాహనంపై పంపించేశారు. కిందపడిపోయిన ఆయన సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం ద్వారా అప్పగించారు. ఈనాడులో వచ్చింది అబద్ధం జరిగిన సంఘటన ఒకటైతే... ఈనాడు పత్రికలో వేరేవిధంగా వార్త వచ్చిందని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు మీడియాకు తెలిపారు. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఈనాడు కంట్రిబ్యూటర్ ఇసుక రీచ్‌లోకి ప్రవేశించడమే గాకుండా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగాడనీ ఆ సమయంలో “పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం’ అని ఎవరూ అనలేదని, అసలు నిర్బంధించలేదని చెప్పారు. ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్సీపీ అనిగానీ, ఎమ్మెల్యే శంకరరావు పేరుగానీ ప్రస్తావించకపోయినా ఈనాడులో తప్పుడు కథనాలు ప్రచురించారని తెలిపారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, రాజకీయ రంగు పులిమారనీ పేర్కొన్నారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో కంట్రిబ్యూటర్ గుంటూరు ఈనాడు కార్యాలయానికి వెళ్లాక, అక్కడ కట్టు కథ అల్లి అడ్డగోలుగా వార్త ప్రచురించినట్టు స్పష్టమైంది. -
పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేగంగా విస్తరిస్తుండటమే కాక అవి ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 2019–20 నుంచి 2022–23 మధ్య కాలంలో రాష్ట్రంలో కొత్తగా 18.3 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం.. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట వేస్తుండడం ఐటీ రిటర్నుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత గడిచిన మూడేళ్ల కాలంలో మహారాష్ట్రలో అత్యధికంగా 13.9 లక్షలు, ఉత్తరప్రదేశ్ 12.7 లక్షలు, గుజరాత్ 8.8 లక్షలు, రాజస్థాన్ 7.9 లక్షలు చొప్పున ఐటీఆర్ పెరిగాయి. కానీ, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రిటర్నుల సంఖ్య 11.7 లక్షలు తగ్గడం గమనార్హం. ఎంఎస్ఎంఈలు 1.93లక్షల నుంచి 6.6 లక్షలకు.. ఇక అసంఘటిత రంగంగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని సంఘటితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2020న ఎంఎస్ఎంఈ యూనిట్ల నమోదు కోసం ఉద్యమ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈలకు బ్యాంకు రుణాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ వంటి అనేక సౌలభ్యాలు ఉండటంతో ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530గా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఇప్పుడు 6.6 లక్షలు దాటినట్లు ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల దేశవ్యాప్తంగా 2.18 కోట్ల ఎంఎస్ఎంఈలు కొత్తగా రిటర్నులు దాఖలు చేయడానికి దోహదపడినట్లు ఎస్బీఐ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఇక మొత్తం పెరిగిన ఐటీఆర్‌ల్లో 60 శాతం తొలి ఐదు రాష్ట్రాల నుంచే వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య 4.1 లక్షలకు దాటడం కూడా రిటర్నులు దాఖలు పెరగడంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలవల్ల రానున్న కాలంలో ఈ రిటర్నులు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం.. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ రిస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో చేయిపట్టి నడిపించడం ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి పునరుజ్జీవం కల్పించడంతో కొత్త యూనిట్లు ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి వాటిని ఆదుకుంది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీపడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.118 కోట్లతో ‘ర్యాంప్’కార్యక్రమాన్ని చేపట్టింది. -
22లోగా రబీ ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత రబీలో ఈ–క్రాప్, ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రబీలో ఎక్కువ సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము వంటి మెట్టపంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని, అందువలన సాధ్యమైనంత త్వరగా ఈ క్రాప్, ఈ కేవైసీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నియమించిన సూపర్ చెక్ బృందాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ కేవైసీలో నూరుశాతం సాధించే దిశగా ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న క్యాంపెయిన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ 2024లో అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయని వారిని గుర్తించి సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. -
ఇవిగో నవరత్నాల వెలుగులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా పాపకు మాటొచ్చింది మాది నిరుపేద కుటుంబం. పెద్దలిచ్చిన రెండెకరాల భూమే మాకు బతుకుదెరువు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ మండలం జాజరకల్లు గ్రామంలో నేను, మా ఆయన జి.రామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటున్నాం. మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఉమేష్ బెంగళూరులో డిప్లొమా చదువుతున్నాడు. అమ్మాయి శ్రావణి పుట్టుకతోనే మూగ, చెవిటి. ఆమెలో ఉన్న లోపాన్ని చూసి బాధతో కుంగిపోయేవాళ్లం. పాపకు మాటలు రప్పించేందుకు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. ఎలాంటి ఫలితం కనిపించలేదు. మూగమ్మాయి అంటూ హేళన చేస్తారనే భయంతో స్కూలుకు వెళ్లకుండా అప్పుడప్పుడు మొండికేసేది. సర్దిచెప్పి మేమే పంపేవాళ్లం. ఈలోగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింది. స్థానిక నాయకుల సలహాతో మా అమ్మాయి సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి ఒక లేఖ ద్వారా తీసుకెళ్లాం. సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేయించారు. ఇప్పుడు మా అమ్మాయికి మాటొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బిడ్డకు నేను జన్మనిస్తే.. మేనమామగా సీఎం జగనన్న మాట్లాడే భాగ్యం కల్పించారు. మాలో ప్రాణం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – లక్ష్మీ, జాజరకల్లు (ఈ.రాధాకృష్ణ, విలేకరి, రాయదుర్గం) జగనన్న సంక్షేమ ‘ఆటో’గ్రాఫ్ బతుకు తెరువుకోసం ఆటో నడుపుతుంటా. దాని ద్వారా వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు వాహనానికి మరమ్మతులు తప్పనిసరి. ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఇంకా కేసుల సంగతి సరేసరి. అలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం తప్పనిసరి అయ్యేది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవానిగరువుకు చెందిన నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. ఈ సొమ్ముతో ఏటా ఇన్సూరెన్స్, ఆటో రిపేర్లు చేయించుకుంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు. బాబు అభినయ్ ఐదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. పాప భవ్యశ్రీ స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. నా భార్య మణికి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందింది. సున్నా వడ్డీ ద్వారా మరో రూ.2 వేలు బ్యాంక్ ఖాతాలో పడింది. వాటితో మా జీవనం సాఫీగా సాగిపోతోంది. ఇప్పుడు మాకు బతుకు భయం లేదు. – కలిగితి రమేష్, యాళ్లవానిగరువు (కె శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) సర్కారు సాయంతో స్వయం ఉపాధి మాది వ్యవసాయ కుటుంబం. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట గ్రామంలో మాకు సుమారు రెండెకరాల పొలం ఉంది. మా ఆయన గోవింద్ వ్యవసాయం చేస్తారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అబ్బాయి. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ఇంటి అవసరాలకు సరిపోయేది కాదు. పంట చేతికొస్తే సరేసరి. లేకుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. దానిని తీర్చడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 చొప్పున నగదు అందుకున్నా. దీనికి మరికొంత నగదు కలిపి రెండు ఆవులు కొనుగోలు చేశా. రెండేళ్లుగా పాల ద్వారా రోజుకు రూ.400కు పైగా.. నెలకు రూ.12 వేలకు పైగా సంపాదిస్తున్నా. రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు రూ.54 వేలు అందింది. దీంతో సాగుకు పెట్టుబడి ఇబ్బందులు తొలగాయి. 6 నెలల కిందట మా కుమార్తెకు వివాహం చేశాం. మా అబ్బాయి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం. దానికి కారణం ఈ ప్రభుత్వమే. – ఎల్లపు వెంకటలక్ష్మి, విజయరామరాజుపేట (చప్పా రామలింగేశ్వరరావు, విలేకరి, బుచ్చెయ్యపేట) -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్‌లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్‌లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్‌ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్‌ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్‌లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్‌లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
రఘురామ అమాయకుడేమీ కాదు..
సాక్షి, అమరావతి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయన తన వ్యక్తిగత కక్షతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. అంతేకాక.. తన గురించి అనేక వాస్తవాలను తొక్కిపెట్టి ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం రిట్, పిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తనపై కేసుల గురించి కనీస స్థాయిలో కూడా ఆయన ప్రసా్తవించలేదన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదు గురించి, జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందున్న కోర్టు ధిక్కార ప్రోసీడింగ్స్‌ను కూడా తన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పైపెచ్చు తనపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవంటూ డిక్లరేషన్ కూడా ఇచ్చారని ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అసలు రఘురామ చట్ట నిబంధనల గురించి తెలియని అమాయకుడేమీ కాదన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయన బాగా తెలుసన్నారు. అలాగే, కోర్టుల్లో జరిగే కేసుల విచారణలపై వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు తెలుసునని తెలిపారు. పైగా ఆయన పార్లమెంట్ సభ్యుడని, అలాంటి వ్యక్తికి చట్ట నిబంధనల గురించి తెలియకపోవడానికి ఏముంటుందని శ్రీరామ్ చెప్పారు. అన్నీ తెలిసే ఆయన ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన కీలక విషయాలను పిటిషన్లో బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారని కోర్టుకు వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేయడాన్నే రఘురామకృష్ణరాజు పనిగా పెట్టుకున్నారన్నారు. కోర్టులు ఒకవైపు కేసులను విచారిస్తుంటే మరోపక్క ఆయన మీడియా ముందు ఆ కేసుల గురించి మాట్లాడటమే కాక, వ్యక్తులపై విషం చిమ్ముతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని ఏజీ వివరించారు. ఆయన పలు మీడియా ఛానెళ్లతో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోలను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. ఆ వీడియాలను తమ కౌంటర్‌తోపాటు జతచేశామని తెలిపారు. వాటిల్లో మాట్లాడిన మాటలను యథాతథంగా కౌంటర్లో పొందుపరిచామన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ఈ వీడియోలను తాము ఇంటి వద్ద చూస్తామని, కౌంటర్లో రాసిన అంశాలను చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సంక్షేమ పథకాల నిర్ణయాలపై పిల్.. రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతోపాటు వాటివల్ల పలువురికి లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రఘురామ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని విచారణార్హతపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తింది. దీంతో ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులందరినీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా.. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రఘురామ దురుద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, ఇలాంటి వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. అడ్వొకేట్ జనరల్‌గా తాను కోర్టులకు సహకరిస్తుంటానని, తాను మొదట కోర్టు ఆఫీసర్నని, తనపై కూడా ఆయన నిందారోపణలు చేశారని తెలిపారు. ఆ వీడియోలనూ పరిశీలించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. విచారణార్హతపై వాదనలకే పరిమితం కావాలి అంతకుముందు.. రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు నాయకులంటే ఎలా ఉండాలో వివరించడం మొదలుపెట్టారు. ధర్మాసనం ఆయన్ను వారిస్తూ, కేసు గురించి వాదనలు చెప్పాలని స్పష్టంచేసింది. దీంతో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే తాము ఈ పిల్ దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. -
ఇసుకపై మళ్లీ అదే అక్కసు
సాక్షి, అమరావతి: అసలే కోతి.. కల్లు తాగింది.. ఆపై నిప్పు తొక్కితే ఎలా ఉంటుంది..? ఈనాడు రామోజీరావు పరిస్థితి ఇప్పుడు అచ్చు అలాగే ఉంది. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక విషం చిమ్మందే తెల్లారని రాజగురువు పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాలపై ఇప్పటికే టన్నుల కొద్దీ అబద్ధాలను తన విషపుత్రిక ఈనాడులో అచ్చేసిన ఆయన ఇప్పుడు మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించి వికృత రాతలతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. జిల్లా కలెక్టర్లు చేసిన తనిఖీలను అడ్డగోలుగా వక్రీకరించి తన వక్రబుద్ధిని మళ్లీ బయటపెట్టుకున్నారు. ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్‌పైనా గుడ్డి వ్యతిరేకతతో ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని పారదర్శకంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచురించారు. బాబు పాలనలో తవ్వకాల బరితెగింపు.. నిజానికి.. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగింది. సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూని ప్రజాసంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ప్రజలు ఇసుక కొనుగోలు చేయడానికి బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి అరాచకాలను నిర్మూలించేందుకు సీఎం జగన్ కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలను ఒక క్రమపద్ధతిలో నిర్వహించేలా చేస్తున్నారు. ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు నిర్వహించారు. అందులో సక్సెస్ఫుల్ బిడ్డర్లుగా ఎంపికైన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. దీనిపై పర్యవేక్షణ, నిఘా కోసం ఎస్ఈబీని ఏర్పాటుచేశారు. అలాగే, జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనుల శాఖలో పనిచేస్తోంది. అంతేకాక.. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. బాబు హయాంలో దోపిడీకి ఈనాడు వత్తాసు.. అసలు చంద్రబాబు పాలనలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగినా రామోజీరావు, ఈనాడు పత్రిక కళ్లుమూసుకున్నాయి. మహిళా సంఘాలకు ఇసుక తవ్వకాలను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం పేరుతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. టీడీపీ నేతల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ.3,825 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ సొమ్మంతా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. మరోవైపు.. ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. అప్పట్లో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వోపైనే నాటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడిచేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దంపట్టింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక లారీలు పెద్దఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కాపత్రం లేకుండా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా.. ఇక మన రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్, పర్యవేక్షణకు పారదర్శకంగా అనుసరిస్తున్న విధానాలను పలు రాష్ట్రాలకు చెందిన మైనింగ్ అధికారులు కూడా పరిశీలించి, తమ రాష్ట్రాల్లో మోడల్‌గా అమలుచేసేందుకు విధానాలు రూపొందించుకుంటున్నారు. ఇవన్నీ ఈనాడుకు కనిపించడంలేదు. ఒకవేళ కనపడినా కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ.. అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ అసత్యపు రాతలు రాస్తోంది. పొంతనలేని రాతలతో తప్పుడు ఆరోపణలు.. మరోవైపు.. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్కడక్కడా వచ్చిన ఆరోపణలపై పలు జిల్లాల్లో కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కూడిన బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీలు జరుగుతున్నాయని రాసిన ఈనాడు.. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు రీచ్‌ల వైపు రాలేదని, మరికొన్నిచోట్ల గనులు, కాలుష్య నియంత్రణ, భూగర్భ జలశాఖ, ఎస్ఈబీ అధికారులతో కమిటీలు వేసి వారితో తనిఖీలు చేయించారంటూ పొంతనలేని రాతలు రాసింది. అలాగే, తనిఖీలు కొనసాగుతుంటే.. అప్పుడే ఎన్జీటీకి నివేదికలు ఇచ్చారంటూ అడ్డగోలు వాదనకు తెరతీసింది. వాస్తవంగా ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, కేవలం అధికారులపై బురదజల్లే ఉద్దేశంతోనే పరస్పరం పొంతనలేని కథనాలతో తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఏటా రూ.785 కోట్ల ఆదాయం.. ఇప్పుడు ప్రతిఏటా ప్రభుత్వానికి రూ.785 కోట్లు ఆదాయం వస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్‌లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అలాగే, రీచ్‌లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, లేదా ఇసుక కొనుగోళ్లు, రవాణాలో ఎటువంటి సమస్యలున్నా టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఇసుక తవ్వకాలపై పదేపదే అక్కసు వార్తలు వండి వారుస్తోంది. ఎన్జీటీ సంతృప్తి.. ఈనాడు మొద్దు నిద్ర.. ఇప్పుడు సీఎంగా వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక తవ్వకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తంచేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాలవల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దుచేసింది. ఈ విషయం తెలిసినా ఈనాడు తెలియనట్లు మొద్దునిద్ర నటిస్తోంది.