AP Special
-
Fact Check: గొప్పగా చేసినా.. ‘పచ్చ’ రాతలేనా?
పాలన సవ్యంగా సాగిపోతుంటే పాపం రామోజీకి నిద్రపట్టడం లేదు. పథకాలు సక్రమంగా అమలవుతుంటే ఆయన విష‘పత్రిక’కు నచ్చడం లేదు. ప్రభుత్వానికి ప్రజాభిమానం రోజురోజుకూ పెరిగిపోతుంటే సహించడం లేదు. క్రమ పద్ధతిలో ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఆ ‘పచ్చ’కళ్లకు కనిపించడం లేదు. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయి... తప్పుడు కథనాలతో జనాన్ని తప్పుదారి పట్టించి... వికృతానందం పొందాలని తెగ తాపత్రయపడుతున్నారు. ‘బాబు’ కళ్లలో ఆనందం చూడాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు. వాస్తవమేంటో కళ్లకు కనిపిస్తున్నా... జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే ప్రాజెక్టులపైనా లేనిపోని ఆరోపణలు చేసి ఓ కథనాన్ని వండివార్చేశారు. కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు పరుగులు పెట్టింది ఈ ప్రభుత్వంలోనే అన్నదిప్రజలందరికీ అర్థమవుతున్నా... పాపం ఈనాడుకే ఎందుకో తెలియడం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే ‘ఈనాడు’ రామోజీరావు ఓర్వలేకపోతున్నారు. రైతుల్లో సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు రోజురోజుకూ పెరుగుతుండటం.. అది చంద్రబాబు రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూండటంతో పచ్చబ్యాచ్ ఆందోళన చెందుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పుంఖానుపుంఖాలుగా సీఎం వైఎస్ జగన్‌పై విషపు రాతలకు తెగబడుతున్నారు. అ కోవలోనే ప్రాజెక్టులపై అబద్ధాలను అచ్చేసింది. గడచిన 57 నెలల్లో కరోనా ప్రభావం వల్ల దాదాపు 24 నెలలు ప్రపంచమే స్తంభించిపోయింది. మిగిలిన 33 నెలల్లోనే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అవుకు రెండో టన్నెల్, లక్కసాగరం ఎత్తిపోతలను పూర్తి చేసి, జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ఆ జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించనున్నారు. మరో 14 ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ♦ తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువకు లైనింగ్ చేయడం ద్వారా సకాలంలోనే వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. ఏటా కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. ♦ చంద్రబాబు అవినీతి వల్ల విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి.. ప్రణాళికాయుతంగా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. నిర్వాసి తులకు పునరావాసం కల్పించి, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ చానల్, స్పిల్ వేను పూర్తి చేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించారు. ♦ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దాన్ని చేపట్టి.. ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ♦ 57 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులకోసం వెచ్చించినది రూ.32,161.49కోట్లు ♦ సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు నాడు బాబు నిర్లక్ష్యంపై ప్రశ్నించలేదెందుకు? 2014 జూలై 28వ తేదీన టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని ప్రకటించారు. 2014, జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.68,293.95 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. ఆస్థాన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తికి పోలవరం పనులే తార్కాణం. సబ్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికే చంద్రబాబు ప్రతి సోమవారాన్ని సమీక్షల పేరుతో పోల‘వరం’గా మార్చుకున్నారని అప్పటి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలవరంలో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. చంద్రబాబు దోపిడీలో రామోజీ కి వాటా ఉండటం వల్లే అప్పట్లో సాగునీటి ప్రాజెక్టులో సాగిన దోపిడీపై ఒక్క అక్షరమైనా ఈనాడులో అచ్చేయ లేదన్నది బహిరంగ రహస్యం. -
అన్నవరం రైల్వేస్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లోనే తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ సాధించింది. ఇది డివిజన్‌లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ (నాంపల్లి) తర్వాత రెండోదిగా నిలిచింది. ఈ సర్టిఫికెట్ సాధించేందుకు డివిజన్ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. ఆ స్టేషన్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్ యజమానులు, సరఫరాదారులకు ఎఫ్ఏఎస్టీఏసీ (ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్)లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కమర్షియల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి–పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించేవారు. ప్రారంభంలో ప్రీ–ఆడిట్ నిర్వహించి చివరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంతరం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ వరించింది. ఈ సర్టిఫికెట్ సాధించడానికి కృషిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓ మహ్మతుల్లా, ఇతర అధికారులను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
చలిగాలుల విజృంభణ
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): శీతాకాలం ముగుస్తున్న సమయంలో అల్లూరి సీతారాజు జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. చింతపల్లిలో నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం 7.6 డిగ్రీలు నమోదవగా, పాడేరు మండలం మినుములూరులో 12 డిగ్రీలు, అరకులోయలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేకువజామున పొగమంచు కురుస్తున్నప్పటికీ 7గంటలకే సూర్యోదయమవుతోంది. -
AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్‌కు మహర్దశ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్ భవిష్యత్‌లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్‌కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మళ్లీ ఈ మధ్యే సందడి.. ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్ వెబ్ సిరీస్‌ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్ సిరీస్‌లను చిత్రీకరిస్తున్నారు. మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్ సిరీస్ కోసం అవసరమైనవి షూటింగ్ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్‌కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్ సిరీస్‌ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్‌లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్సైట్లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం. మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. –మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత -
Adudam Andhra: విజేతల జాబితా ఇదే..
విశాఖ స్పోర్ట్స్: యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా..’ తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, వుమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటు నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలవగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్ మెన్, వుమెన్ రెండు విభాగాల్లోనూ బాపట్ల విజేతగా నిలిచింది. ఖోఖో మెన్లో బాపట్ల, వుమెన్‌లో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్ మెన్లో ఏలూరు జోడి, వుమెన్‌లో బాపట్ల జోడి విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్లో బాపట్ల, వుమెన్‌లో విశాఖ జట్లు విజేతలుగా నిలిచి సీఎం జగన్ చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు చెక్కులను అందుకున్నాయి. క్రికెట్ విజేత ఏలూరు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌గా సాగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నక్కవానిపాలెం (విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ప్రతిగా అశోక్ పిల్లర్ రోడ్ (ఏలూరు) జట్టు తొలి యాభై పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయినా 69 పరుగులు చేసి నాలుగో వికెట్‌ను 87 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 16వ ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలచడం ద్వారా టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఏలూరు జట్టు గెలుపొందగా విశాఖ రన్నరప్‌గా నిలిచింది. మెన్ క్రికెట్ టైటిల్ పోరును సీఎం జగన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. కబడ్డీలో బాపట్ల ఆధిక్యం.. కబడ్డీ పురుషుల ఫైనల్ పోటీ ఏయూ గ్రౌండ్స్‌లో జరిగింది. టాస్ గెలిచిన నాగులాపురం–1 (తిరుపతి) జట్టు కోర్టును ఎంచుకోగా కొత్తపాలెం–2 (బాపట్ల) జట్టు తొలి రైడ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో బాపట్ల 15–7తో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తిరుపతి జట్టు రెండో అర్ధభాగంలో కాస్త పుంజుకున్నా ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది. ఇరు జట్లు రెండో అర్ధభాగంలో తొమ్మిదేసి పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి. చివరికి కొత్తపాలెం 2 (బాపట్ల) 26–17తో నాగులాపురం 1 (తిరుపతి)పై గెలుపొంది మెన్ కబడ్డీ విజేతగా నిలిచింది. నాగులాపురం జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాపట్ల తరపున లక్ష్మీనారాయణ, రామకృష్ణ, శ్రీకాంత్, వెంకటేశ్వర, హరిప్రసాద్, బాలకృష్ణ, అనిల్ ప్రసాద్ కోర్టులోకి దిగగా తిరుపతి జట్టు తరపున సతీష్, తరుణ్‌కుమార్, సుమన్, చిన్నముత్తు, దేవేంద్ర, తమిళైర్సన్, నరసింహ కోర్టులోకి దిగారు. -
పుట్టింటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పుట్టింటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది నాకు 2010లో వివాహమైంది. అప్పటి నుంచి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నడింపల్లెలో భర్త మంజునాథ్‌తో కలసి వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు. చిన్నోడు కడుపులో ఉండగానే 2020లో నా భర్త అనారోగ్యం బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించినా ఆయనను కాపాడుకోలేకపోయాను. ఒక్కసారిగా నా జీవితం మొత్తం చీకటిగా మారిపోయింది. చిన్న పిల్లలతో ఎలా బతకాలో తెలియని అయోమయంలో పడ్డాను. బతకడానికి ఎన్ని పాట్లు పడాలోనని ఆందోళన చెందాను. అదృష్టవశాత్తు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింది.అప్పటి నుంచి నా సమస్యలన్నీ పరిష్కారమైపోయాయి. ముఖ్యంగా నా భర్త మరణంతో బీమా రూ.2 లక్షలు నా బ్యాంకు అకౌంటులో వేశారు. కూలి పనులు చేస్తూ బిడ్డలను పోషించుకుంటున్న నాకు ప్రతి నెలా వితంతు పింఛన్ ఇస్తున్నారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చారు. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఆరో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు చరణ్‌కుమార్‌కు అమ్మఒడి పథకం కింద ఏటా రూ. 15 వేలు వంతున వస్తోంది. అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న చిన్నోడు భరత్ పోషణ ప్రభుత్వమే చూస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.8 లక్షలకు పైగానే వచ్చింది. అనుకోని కష్టం వచ్చిన ఆడబిడ్డను పుట్టింటి వారికన్నా గొప్పగా ఈ ప్రభుత్వం ఆదుకుంది. జన్మజన్మలకీ మా జగనన్న మేలు మరువలేను. – చిన్నమ్మయ్య, నడింపల్లె (ఎస్.జి. హరినాథ్, విలేకరి, శాంతిపురం) మా ‘ఇంటి’వేల్పు జగనన్న మాది చాలా పేద కుటుంబం. పశి్చమగోదావరి జిల్లా ఉండి మండలంలోని యండగండి గ్రామంలో నేను ఆటో నడుపుతూ భార్య మాధవి, కుమార్తె శ్రావణి, కుమారుడు దావీదురాజును పోషించుకుంటున్నా. అన్ని రోజులూ గిరాకీ ఉండేది కాదు. వచ్చినపుడు ఏదోలా బతుకు సాగినా... గిరాకీ లేనినాడు నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. ఆటోకి ఏదైనా మరమ్మతు వస్తే దానిని బాగు చేయించేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. దానిని తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మా జీవితం మారిపోయింది. నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.పది వేలు అందుతోంది. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. అమ్మాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు వస్తోంది. పిల్లలిద్దరికీ విద్యా కానుక ద్వారా ఉచిత పుస్తకాలు, బూట్లు, బెల్టు, టై అందుతున్నాయి. పాఠశాలలో జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మాకు ఇల్లు కట్టుకోవడమనేది ఓ కల. ఆటో నడిపే నేను ఇంటి స్థలం ఎలా కొనాలి అనుకునేవాడిని. కానీ జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం నా భార్య పేరుతో ఇవ్వడమే గాకుండా ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నేను సొంత ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అద్దె బాధ తప్పింది. మా ఇంట ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. మాకు ఇంతకంటే ఏం కావాలి.. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. – ఎలకపల్లి శ్రీను, యండగండి (చాలంటి రత్నరాజు, విలేకరి, ఉండి) బతుకు బెంగ తీరింది బార్బర్ వృత్తి మాది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామంలో సెలూన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. నాతో పాటు భార్య నాగరత్నమ్మ, కుమారుడు జగదీష్ ఉంటున్నారు. సెలూన్‌పై వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబం మొత్తం గడవాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండేవి కాదు. ఆదాయమే లేకుంటే బతకడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. రోజొక గండంగా గడిచేది. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా కుటుంబ సమస్యలన్నీ తీరిపోయాయి. బతకడానికి ఎలాంటి బెంగ లేకుండా పోయింది. జగనన్న చేదోడు పథకం కింద నాకు ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందుతోంది. ఈ మొత్తంతో సెలూన్ షాపునకు అవసరమైన సామగ్రి తెచ్చుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా కుల వృత్తి చేసుకుంటున్నాను. గతంలో మాకు సొంతిల్లు లేక బాడుగ ఇళ్లలో ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ ప్రభుత్వం మాకు ఇంటి స్థలం మంజూరు చేసింది. రూ.1.80 లక్షల సాయం అందించటంతో సొంతిల్లు నిర్మించుకున్నాం. నా భార్యకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 అందుతోంది. ఇంటర్మిడియట్ చదువుతున్న నా కుమారుడికి ఏటా రూ.15 వేలు వంతున ‘అమ్మఒడి’ వస్తోంది. ఈ విధంగా మాలాంటి పేదవాళ్ల కోసం అనేక మంచి పథకాలు అమలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. – బి.ఆంజనేయులు, మామిళ్లపల్లి (వై.మహదేవరెడ్డి, విలేకరి, కనగానపల్లి) -
అమలాపురం సీటు కోసం సిగపట్లు
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ బరిలో ఈసారి టీడీపీకి అవకాశం లేదనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి శేఖర్‌తోపాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ ఆదివారం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అమలాపురం ఆత్మగౌరవానికి సంబంధించిందని వదులుకోవద్దని ఆయనకు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే సీటును జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ నేత ఆనందరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీడీపీ నేతలు వాసంశెట్టి సుభాష్ , గంధం పల్లంరాజు పేరుతో ఆనందరావుకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సుభాష్, పల్లంరాజులు కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిన సమయంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్నారని, వారి పేరిట ప్రచారం చేపడితే ఉన్న కాస్త అవకాశాలనూ కోల్పోతామని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
15న వలంటీర్లకు వందనం
సాక్షి, అమరావతి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా సత్కరిస్తోంది. కనీసం ఏడాది పాటు నిరాటంకంగా పనిచేస్తున్న వలంటీర్లందరినీ సత్కరించి, మూడు కేటగిరిల్లో నగదు బహుమతులను కూడా అందజేయనుంది. ఈ వలంటీర్లకు వందనం నాలుగో విడత కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తర్వాత రాష్ట్రమంతటా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ ప్రాంత వలంటీర్లను సత్కరించే కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఒకపక్క ప్రతిపక్షాలు నిత్యం బెదిరింపు ధోరణులతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నా.. కొన్ని పత్రికలు పనిగట్టుకుని నిరంతరం తమపై దు్రష్పచారం కొనసాగిస్తున్నా.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 2.5 లక్షల మందికిౖ పెగా వలంటీర్లు తమ పనితీరుతోనే రాష్ట్ర ప్రజల మనన్నలతో పాటు దేశ ప్రజల ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. 2,55,464 మందికి సత్కారం, నగదు బహుమతులు వలంటీర్లకు వందనం పేరిట వరుసగా నాలుగో ఏడాది చేస్తున్న ఈ సత్కారానికి రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సేవావజ్ర, సేవారత్న అవార్డులతోను, నిరాటంకంగా ఏడాది పనిచేసిన వారికి సేవామిత్ర అవార్డుతోను సత్కరించి, నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు వంతున మొత్తం 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డు ప్రదానం చేయనున్నారు. ప్రతి మండలంలో, మున్సిపాలిటీలో ఐదుగురు వంతున, నగరపాలక సంస్థలో పదిమంది వంతున.. రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డు, కనీసం ఏడాది పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డు అందజేస్తారు. 997 మందికి ప్రత్యేక బహుమతులు ఈ అవార్డులకు అదనంగా.. తమ పరిధిలో వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలతో మెరుగైన లబ్ధిదారుల జీవన ప్రమాణాలపై ఉత్తమ వీడియోలు చిత్రీకరించిన వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతులను కూడ ఈ ఏడాది కొత్తగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. మండల, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయిల్లో ఒక్కొక్కటి వంతున 796 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి, వాటిని చిత్రీకరించిన వారికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. నియోజకవర్గస్థాయిలో ఒక్కొక్కటి వంతున 175 ఉత్తమ వీడియోలను ఎంపికచేసి, వాటిని చిత్రీకరించిన వారికి రూ.20 వేలు అందజేయనున్నారు. జిల్లాస్థాయిలో ఒకటి వంతున ఉత్తమ వీడియో ఎంపికచేసి వాటిని చిత్రీకరించిన 26 మందికి రూ.25 వేల చొప్పున ప్రత్యేక నగదు బహుమతి ఇవ్వనున్నారు. -
Fact Check: పేదల ఇళ్లపై కుళ్లు రాతలేలా?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఒకేసారి 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలను అప్పగించడం... వాటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేస్తుండడం పెత్తందారు రామోజీరావుకు మింగుడు పడటంలేదు. నిరుపేదలు సొంతింట్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తన వంకర రాతలతో బురదజల్లి అలిసిపోయాడు. ఇక మిగిలిందల్లా ఆ ఇళ్ల స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుండడాన్ని కూడా మాయాజాలమంటూ తప్పుడు రోత రాతలు రాస్తోంది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తుండడాన్ని, ఆ ఇళ్లను ఒక విలువైన ఆస్తిగా పేదలకు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పు పడుతూ ప్రజలను, నిరుపేదలు ఆందోళన చెందేలా ప్రయత్నాలు చేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం కింద వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 ఊళ్లను కొత్తగా నిర్మించడం వారి కళ్లకు కనిపించడంలేదు. ఒక్కో కాలనీ ఒక్కో ఊరుగా మారుతున్నా ఆ పత్రికకు కనిపించదు. ఒక్కో పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ఇంటి రూపంలో రూ.20 లక్షల వరకూ విలువైన స్థిరాస్తి సమకూరుస్తుంటే ఈనాడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. పేదలకు ఇంత పెద్దమేలు జరుగుతుండడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుండడం.. అదే సమయంలో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రామోజీరావు గంగవెర్రిలెత్తిపోతున్నారు. దీంతో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సేవలపైనా నిత్యం వక్రీకరించడమే విధిగా పెట్టుకున్నారు. జియో ట్యాగ్ ఉంటే ప్లాట్లు గుర్తించడం కష్టమెలా అవుతుంది? ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారనడం పచ్చి అబద్ధం. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి సరిహద్దు రాళ్లు వేశారు. లబ్ధిదారులను వారి ప్లాట్లలో ఫోటోలు తీసుకుని జియోట్యాగ్ కూడా చేశారు. ప్లాటులో నిలబడి ఫోటో దిగడం ద్వారా లబ్ధిదారులకు వారి ప్లాటు ఎక్కడ ఉందో తెలుసు. ’పచ్చ‘పాతంతో చూసే ఈనాడుకు ఇవేమీ కనిపించవు. కేటాయించిన ప్లాట్‌లో ఫోటో దిగి జియోట్యాగ్ చేయడమంటే వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసనే కదా? ఇది పేదలను బురిడీ కొట్టించే పన్నాగం ఎలా అవుతుంది..? గుంటూరు జిల్లాలో పేరేచర్ల లేఅవుట్లో 9,219 ఇళ్లను మంజూరు చేశారు. ఇంకా 6,152 ఇళ్ళకు సంబంధించి రెండవ విడత గృహ నిర్మాణ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో 1,230 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 486 రూఫ్ స్థాయిలోనూ, మిగతావి బేస్మెంట్ స్థాయిలోనూ ఉన్నాయి. మూడవ ఆప్షన్ కింద ఇళ్ల నిర్మాణానికి పదిమంది కాంట్రాక్టర్లను నియమించి, మూడు ఇటుక తయారీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో ప్రతిరోజు సుమారు వెయ్యి మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ వాస్తవాలను చూడని ఈనాడు ప్రభుత్వంపై ఆక్రోశంతో విషం చిమ్ముతూ తన దిగజారుడుతనానికి ప్రదర్శించుకుంటోంది. రిజిస్ట్రేషన్ చేయడం మాయాజాలమా? పేదలందరికీ స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే ఆయా రిజిస్ట్రేషన్లను చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డేటా బేస్‌లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టీఫైడ్ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫోర్జరీ చేస్తారని గానీ, ట్యాంపర్ చేస్తారని గాని భయం ఉండదు. అమ్మే సమయంలో ఆ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేదలకు లబ్ధి చేకూరే రిజిస్ట్రేషన్ మాయాజాలం అవుతుందా? ఇప్పటికే 8 లక్షల మంది లబ్ధిదారులు తమ పేరున పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి దశలో కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో మొదటి దశ ఒకటవ లేఅవుట్లో 53 ఎకరాల 33 సెంట్లు 345 మంది లబ్ధిదారులకు, రెండో లేఅవుట్లో 29 ఎకరాల 66 సెంట్లు భూమిలో 777 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేట్ అధీనంలో ఉన్న భూమిని రూ.43.93 కోట్లతో కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని విజయవాడ మున్సిపల్ అధికారులకు లేఅవుట్ అభివృద్ధి కోసం అప్పగించారు. -
Fact check: అసత్య రాతలు.. తప్పుడు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎందరో పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివే అవకాశం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇది ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించట్లేదు. పేదింటి బిడ్డను ప్రభుత్వం ఉన్నత చదువులకు తీసుకెళ్తుంటే ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పుడుతోంది. దీనికి తోడు అసలు ప్రభుత్వ పథకం లక్ష్యం, అది ఎలా అమలవుతోంది కనీస పరిజ్ఞానం లేని కొన్ని ప్రతిపక్షాలు ఈ తప్పుడు వార్తల ఆధారంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి. తిరిగి వాటినే మళ్లీ ఎల్లో మీడియా పెద్దపెద్ద హెడ్డింగ్లతో ముద్రిస్తూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044కోట్లుగా ఉంది. అప్పట్లో అప్పులు చేసి ఫీజులు కట్టే దుస్థితి గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్‌టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి ఉండేది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెనను జమ చేస్తోంది. టీడీపీ హయాంలో సగటు చెల్లింపు స్వల్పం.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్‌మెంట్ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1778 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెడితే.. సీఎం జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా తీర్చింది. ఈ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2835 కోట్లు, వసతి దీవెన కింది అత్యధికంగా రూ.1068.94 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య స్లాబ్ పెట్టిమరీ ఇచ్చేవారు. కానీ సీఎం జగన్ స్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2లక్షలకు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాలు వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. -
fact check: అండగా ఉన్నా ఆర్తనాదాలే..
సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి. రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. మార్కెట్లో జోక్యంతో రైతులకు మేలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది. మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు.. మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు. గతంలో అరకొరగా ధాన్యం సేకరణ.. నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్‌మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది. బాబు కంటే రెట్టింపు కొనుగోలు.. ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు. టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, లేబర్, ట్రాన్స్‌పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. -
Fact Check: టీడీపీ కోసం ఇదేనా మీ 'పెట్టుబడి సాయం'!
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారంతో సీఎం వైఎస్ జగన్ సర్కారు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే ఈనాడు పత్రిక మాత్రం బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. కరువుతోపాటు మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ(పంట నష్టపరిహారం) జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేస్తుంటే.. ఈనాడు మాత్రం ‘సంక్రాంతి పోయింది..సెట్టింగులూ తీసేశారు..!’అంటూ వ్యంగ్యంగా రైతులను తప్పుదోవ పట్టించేలా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ విషం కక్కింది. ఆరోపణ: ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు వాస్తవం: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌తో పాటు ప్రస్తుత రబీ సీజన్లోను కొనసాగుతున్నాయి. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలు కాగా 63.46లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వలన 21.48 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. పూర్తి స్థాయి గణాంకాలతో ఎన్నిసార్లు అధికారులు వివరణ ఇచ్చినా... ఈనాడు మాత్రం పదేపదే 31 లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదంటూ అబద్ధాలు అచ్చేస్తూనే ఉంది. 6 ప్రామాణికాలు (వర్షపాతం, పంట విత్తిన విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భజలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 7 జిల్లాల్లో 103 కరువు మండలాలుగా గుర్తించారు. బెట్ట పరిస్థితుల వల్ల 14.07 లక్షల ఎకరాలలో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్కతేల్చారు. రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 55.28 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 39.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాధారణ విస్తీర్ణం 19.53 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 12.62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీలో 35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని, వరి 11.40 లక్షల ఎకరాలలో మాత్రమే సాగైందంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది. ఆరోపణ: మిచాంగ్ వల్ల 20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాస్తవం: రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుఫాన్ వల్ల 22 జిల్లాల్లో 6.56 లక్షల ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 4.61 లక్షల రైతులకు రూ.442.35 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఈనాడు పట్టించుకోకుండా తుఫాన్ వల్ల 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అడ్డగోలుగా అబద్ధాలు అచ్చేస్తూనే ఉంది. గత 57 నెలలుగా వైపరీత్యాలు సంభవించిన ప్రతీసారి ఆ సీజన్ చివరలో పరిహారం ఇస్తున్నారు. ఇలా ఇంతవరకు 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీని అందించింది. ఆరోపణ: ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు గాలికొదిలేశారు వాస్తవం: ఖరీఫ్‌లో కరువు, రబీలో మిచాంగ్ తుఫాన్ వల్ల 20.63 లక్షల ఎకరాలలో పంటలు నష్టపోయిన 11.57 లక్షల మంది రైతులకు అంచనా వేసిన రూ.1,289.38 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సీజన్ చివర్లో నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెలాఖరులోనే ఇన్పుట్ సబ్సిడీ పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయినా సరే ఇవేమీ ఈనాడుకు పట్టదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురద జల్లుతూ రైతులను గందరగోళ పరిచేలా విషంకక్కడమే పనిగా పెట్టుకుంది. -
ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి సిటీ: రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజరింగ్ బ్లాక్‌లో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల గురించి అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో 1,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి మాస్టర్ ట్రైనర్లు వచ్చారని, వారి నుంచి ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు కొనసాగాల్సిన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ సమీర్ అహ్మద్ జాన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్వో కె.మోహన్‌కుమార్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఆర్వోలు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
ఇరగవరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులై, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో సోమవారం మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో 15 కుల సంఘాల వారు, మహిళలు అధిక సంఖ్యలో చేరగా, వీరికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా తూర్పువిప్పర్రు గ్రామంలో శెట్టిబలిజ రామాలయం వద్ద ఉన్న శెట్టిబలిజ నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ కులంలో మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన వైద్యం అందేలా మార్పులు చేస్తూ అందించిన ఆరోగ్యశ్రీ కార్డులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. సంక్షేమ పాలనకు మెచ్చి.. పెదవేగి: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడిలో టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పాలనకు, దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులైన సుమారు 200 మంది టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ బాణాసంచాతో ఘనస్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరికల కార్యక్రమానికి ముందు కూచింపూడి మెయిన్ రోడ్డు నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతా రమ్య, పెదవేగి సొసైటీ చైర్మన్ పెనుమాక వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కోలేకే.. భీమవరం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్సీపీకి ఉన్న ప్రజాబలాన్ని ఢీకొట్టడం ప్రతిపక్ష పార్టీలకు సా«ధ్యమయ్యే పనికాదని గ్రహించడం వల్లే మొత్తం పార్టీలన్నీ మూకుమ్మడిగా దాడికి సిద్ధమవుతున్నాయని ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన క్షత్రియ యూత్ ఉద్దరాజు రాజేష్‌వర్మ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్ గత ఐదేళ్లుగా జనరంజకమైన పాలన అందించడంతో అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమైందని చెప్పారు. జగన్ ప్రజా బలాన్ని చూసి భయపడిన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒంటరిగా పోటీ పడలేక మూకుమ్మడిగా పోటీకి రావాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన వంటి పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే తమ పార్టీ కార్యాలయాలను మూసేసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించడం వల్ల చంద్రబాబు గతంలో గెల్చుకున్న 23 స్థానాలైనా దక్కించుకోవడానికి పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ 175 సీట్లు గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నరసాపురం పార్లమెంట్ అ«భ్యర్థి గూడూరి ఉమాబాల, రాష్ట్ర యువత నాయకుడు గ్రంధి రవితేజ, ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు తదితరులున్నారు. పార్టీలో చేరినవారిలో ఉద్దరాజు అప్పలరాజు, కూనపరాజు దుర్గరాజు, ముదునూరి శివనాగరాజు, అల్లూరి వెంకట కృష్ణంరాజు, పి.చల్లారావు, సుబ్రమణ్యం, కూనపరాజు వాసురాజు తదితరులు ఉన్నారు. -
డీఎస్సీ వచ్చేసింది
సాక్షి, అమరావతి: బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన టీచర్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్సీ అర్హతలు, భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలు 11,12లతో పాటు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తూ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వెనువెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. 2022 తర్వాత బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా మేలు జరిగేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పని చేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటినీ భర్తీ చేయనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను సైతం డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంతో ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాదే భర్తీ చేస్తామని తెలిపారు. 2018 నిబంధనలే అమలు డీఎస్సీ 2024లో ఎలాంటి కొత్త నిబంధనలు లేవని, 2018 డీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్న విధివిధానాలు, అర్హతలనే ఖరారు చేశామని మంత్రి బొత్స తెలిపారు. ఇందులో ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. జనరల్ అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 44 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ట వయోపరిమితి విధించారు. డీఎస్సీ ఎంపికలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌కు 80 శాతం, ఏపీ టెట్/సీటెట్కు 20 శాతం మార్కులు వెయిటేజీ ఉంటుందన్నారు. ఆన్లైన్లో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కు రాష్ట్రవ్యాప్తంగా 122 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చని, ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని వివరించారు. మార్చి 15 నుంచి 30వతేదీ వరకు రెండు సెషన్స్‌లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు, ఏపీపీఎస్సీ పరీక్షలు జరిగే తేదీలను మినహాయించి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. డీఎస్సీ 2024కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ, సందేహాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. అర్హతలు, నియామకాలపై జీవోలు డీఎస్సీ 2024 విద్యార్హతలు, నియామకాలకు సంబంధించి వేర్వేరుగా జీఓలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. జీవో నం.11లో ఉపాధ్యాయ నియామక వివరాలు, జీవో నం.12లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన వివరాలను పొందుపరిచామన్నారు. మార్చి 5వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో రోజుకు సగటున 40 వేల మంది అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్షలు రాసేందుకు వీలుగా సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందిన దరఖాస్తుల ఆధారంగా మిగతా కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామని వెల్లడించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ (9505619127, 9705655349) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుందని, అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాలల మౌలిక సదుపాయాల విభాగం కమిషనర్ కె.భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిత, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీతో క్యాన్సర్‌ను జయించా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీతో క్యాన్సర్‌ను జయించా నా పేరు బొప్పా నాగలక్ష్మి, నా భర్త శ్రీనివాస్. తాపీ పనిచేస్తారు. మాది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామం. నాకు 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. గుంటూరులోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా రేడియేషన్, కీమోథెరపీ చేశారు. ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స కూడా చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయ్యింది. పూర్తిగా ప్రభుత్వమే భరించింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. పూర్తిగా కోలుకున్నాను. ఇటీవల నా భర్త శ్రీనివాస్ ప్రమాదవశాత్తు పడిపోవడంతో కాలు విరిగింది. ప్లేట్లు వేశారు. ఆ తర్వాత ప్లేట్లు కూడా తీసేశారు. ప్రస్తుతం ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు వైఎస్సార్ చేయూత పథకంలో మూడుసార్లు ఏడాదికి రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందింది. వైఎస్సార్ ఆసరాలో ఏడాదికి రూ.16 వేల చొప్పున మూడుసార్లు నా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి. సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ.2 వేల చొప్పున అందింది. నవరత్నాల పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. నాకు ఇద్దరు సంతానం. ఇద్దరికీ వివాహాలు చేశాను. – బొప్పా నాగలక్ష్మి, పూలపల్లి (కె.శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) వృద్ధాప్యంలో పింఛనే ఆధారం మాది పేద కుటుంబం. నా భర్త చాలా కాలం క్రితం మృతి చెందారు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ వివాహం చేశాను. ఎవరి కుటుంబాలను వారు పోషించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే నాకు వితంతు పింఛన్ మంజూరైంది. ఇప్పుడు రూ.3 వేలు ఇస్తున్నారు. వృద్ధాప్యంలో ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతోంది. మాది అనకాపల్లి జిల్లా మునగపాక మండల కేంద్రం. సొంతిల్లు లేకపోవడంతో దరఖాస్తు చేసిన వెంటనే ఇల్లు మంజూరైంది. ఇప్పుడు సొంతింట్లోనే ఉంటున్నాను. ఉపాధి హామీ పథకంలో కూలి పనులకు కూడా వెళుతుంటాను. నా లాంటి వృద్ధులను సీఎం జగన్మోహన్రెడ్డి పెద్ద కొడుకులా ఆదరిస్తున్నారు. నాకు వచ్చే పింఛన్‌ను కుటుంబ అవసరాలు, మందులకు వినియోగించుకుంటున్నా. పొద్దు పొడవక ముందే ప్రతి నెలా ఒకటో తారీఖునే వలంటీర్ వచ్చి పింఛన్ అందజేయడం సంతోషంగా ఉంది. – గుదే పార్వతి, మునగపాక (వెలగా జగదీష్‌కుమార్, విలేకరి, మునగపాక) ఈ మేలును జీవితాంతం మరవం భార్యాభర్తలిద్దరం పని చేస్తేగానీ పూట గడవని కుటుంబం మాది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారింది. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని హనుమాన్‌నగర్. నా భర్త తిరుమలేశు ఇక్కడే ఓ వస్త్ర దుకాణంలో గుమస్తాగా పని చేసేవాడు. నేను భాగ్యలక్ష్మి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. మా సంఘం రూ.10 లక్షలు రుణం తీసుకుంది. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆసరా ద్వారా ఆ రుణం నాలుగు విడతల్లో మాఫీ అయింది. గతంలో మేము మగ్గం నేసేవాళ్లం. అప్పుడు వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున మూడేళ్లు రూ.72 వేలు అందుకున్నాం. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాక చేనేత వృత్తిని వీడి, ప్రస్తుతం ఇంటి వద్ద బియ్యం వ్యాపారం చేస్తున్నాం. మా అమ్మాయి కళావతి బీటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మూడేళ్లపాటు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా రూ.లక్షకు పైగా లబ్ధి చేకూరింది. కుమారుడు జయకృష్ణకు ఇంటర్లో అమ్మఒడి ద్వారా రూ.30 వేలు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం బీటెక్ డేటా సైన్స్‌లో చేరాడు. గతంలో మా ప్రాంతానికి తాగునీరు వచ్చేది కాదు. ఇప్పుడు రోజూ ఇంటి వద్దకే నీటి సరఫరా జరుగుతోంది. జగనన్న పాలనలో మా కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. దిగుల్లేదిక. ఈ ప్రభుత్వం మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాం. – తనికంటి లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు (కుడుముల వీరారెడ్డి, విలేకరి, ప్రొద్దుటూరు) -
రాజ్యసభ సభ్యత్వానికి.. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, అమరావతి : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం. విజయరాజుకి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితారాణి, అభ్యర్థుల తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్పీపీ నేత వి. విజయసాయిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 3 స్థానాల్లో విజయం సాధిస్తాం: వైవీ శాసనసభలో అత్యధిక సంఖ్యా బలం మాకే ఉంది. వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురం విజయం సాధిస్తాం. సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కి ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. గతంలో బీసీలు నలుగురికి అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశమిచ్చారు. చరిత్రలో ఎప్పుడులేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని పార్లమెంట్ మెట్లు ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్న, సంక్షేమ–అభివృద్ధి పథకాలు అందాలన్నా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలి. వైఎస్సార్సీపీ ఆశయ సాధనకు పనిచేస్తాం : మేడా రఘునాథరెడ్డి అన్నా.. నువ్వు పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టి ముఖ్యమంత్రి జగన్ నాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి త్వం కేటాయించారు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. నేను దేశవ్యాప్తంగా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, ఇలాంటి మనస్సున్న సీఎంను ఎక్కడా చూడలేదు. ఒకరికి మేలుచేసే విషయంలోనూ, గౌరవించే విషయంలోను ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. ఎంతో పోటీ ఉన్నా నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి పిలిచి మరీ నాకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా, వైఎస్సార్సీపీ ఆశయాల సాధనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేడా సోదరులం కలిసి పనిచేస్తాం. పేదలను జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారు: గొల్ల బాబురావు అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు నడుస్తున్న రోజులివి. ఈ కాలంలో మానవీయాన్ని ఒంటినిండా నింపుకున్న ఏకైక రాజకీయ నేతగా ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కన్పింస్తారు. కష్టకాలంలో సీఎం జగన్ వెంట నడిచాను. ఎవరు మన వారు.. ఎవరు పరాయి వారు అనేది ఆయనకు తెలుసు. నమ్మిన వారిని గుండెల్లో పెట్టుకునే కుటుంబం వైఎస్సార్‌ది. చంద్రబాబు పార్టీలో దళితులకు రాజ్యసభ సీటు అందని ద్రాక్షే. అదే ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి పదవులైనా అన్ని వర్గాలకు సమంగా పంచుతారు. పేద వర్గాలను ఆయన రాజ్యసభకి పంపిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబ రుణం తీర్చుకోలేనిది. సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం. బీ–ఫారాలు అందజేసిన సీఎం జగన్ సీఎం జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వారికి సీఎం జగన్మోహన్రెడ్డి బీ–ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు: సీఎం జగన్
CM YS Jagan Vishaka Visit Updates 6:52PM, Feb 13, 2024 ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అనేది దీని ఉద్దేశం. రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాం. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తిగారి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలు నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం. పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం. వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్యూ. కబడ్డీకి సంబంధించి సతీష్(తిరుపతి జిల్లా), కృష్ణారెడ్డి(బాపట్ల) వీరిని ప్రొ కబడ్డీ టీమ్ దత్తత తీసుకోవడం జరిగింది. సుమన్(తిరుపతి జిల్లా), సంధ్య(విశాఖపట్నం)లను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, మౌనిక(బాపట్ల)లను వీరిద్దర్నీ దత్తత తీసుకోవడానికి బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్(బాపట్ల) అనే తమ్ముడిని, హేమావతి(ప్రకాశం)అనే చెల్లెమ్మను దత్తత తీసుకోవడానికి ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎ. వంశీకృష్ణ(ఏలూరు జిల్లా), ఎం ఆకాంక్ష(బాపట్ల)లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది 6:50PM, Feb 13, 2024 ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో భాగంగా లైట్ షో ప్రదర్శన తిలకిస్తున్న సీఎం జగన్ ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో భాగంగా వివిధ విభాగాల్లో కళాకారుల నృత్య ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్ ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు 6:30PM, Feb 13, 2024 ఆరు వికెట్ల తేడాతో విశాఖపై ఏలూరు క్రికెట్ జట్టుపై విజయం ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల్లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విశాఖ క్రికెట్ జట్టుపై ఏలూరు జట్టు విజయం సాధించింది 6:15PM, Feb 13, 2024 వేదికపై నుంచి సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్‌ను తిలకించారు. సీఎం జగన్ చప్పట్లు కొడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు 6:00PM, Feb 13, 2024 సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు చివరి ఐదు ఓవర్ల మ్యాచ్‌ను సీఎం జగన్ వీక్షిస్తున్నారు విశాఖ-ఏలూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు 5:23PM, Feb 13, 2024 విశాఖ చేరుకున్న సీఎం జగన్ 4:55 PM, Feb 13, 2024 కాసేపట్లో విశాఖ చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ 4:18PM, Feb 13, 2024 విశాఖకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్ 2:50PM, Feb 13, 2024 కాసేపట్లో విశాఖపట్నం బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్ నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్ 50 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగిన క్రీడలు విజేతలకు బహుమతులు అందజేయనున్న సీఎం జగన్ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. ఇకపై ఏటా ఆడుదాం.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడాకారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారీగా నగదు బహుమతులు విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్ రూ.లక్ష, సెకండ్ రన్నరప్ రూ.50 వేలు అందుకోనున్నారు. ప్రతిభకు ప్రోత్సాహం.. ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్కే)తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా క్రికెట్లో టాలెంట్ హంట్ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది. -
నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫైనల్ దశకు చేరుకుంది. మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఇకపై ఏటా ఆడుదాం.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడాకారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారీగా నగదు బహుమతులు విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్ రూ.లక్ష, సెకండ్ రన్నరప్ రూ.50 వేలు అందుకోనున్నారు. ప్రతిభకు ప్రోత్సాహం.. ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్కే)తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా క్రికెట్లో టాలెంట్ హంట్ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది. -
AP: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన చర్చలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్‌లు, పదవీ విమరణ బకాయిలపై చర్చించింది. చర్చలు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని తెలిపారు. త్వరగా ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సీఎస్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ ఎమ్మార్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పటికే ప్రకటించామని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
AP: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే!
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నేటి(ఫిబ్రవరి 12) నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండ సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు, ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ.. ఏప్రిల్ ఏడున డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. cse.apgov.in వెబ్సైట్లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. రిజర్వ్ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు. చదవండి: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు -
AP: మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి : సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్స్పైర్’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటుతున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 10 నుంచి మూడో స్థానానికి.. నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం తెలిచిం దే. ఇప్పుడు అదే స్థాయిలో ఇన్స్పైర్ విద్యారు్థలు జపాన్‌కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు. జాతీయ పోటీలకు ఏటా 40 మంది.. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్స్పైర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే.. ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది. ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్స్.. గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. రూ.10 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూరలు వారంరోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే.. ► చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా నిల్వచేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరియా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది. ► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి. చరణ్ తేజ బైక్‌పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను రూపొందించాడు. ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారని స్టేట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ సదుపాయాలు, బోధనా పద్ధతులు మెరుగుపడ్డాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చెప్పారు. 2022–23 సంవత్సరపు ఇన్స్పైర్ పోటీలు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు. -
అప్పు చేయాల్సిన అవసరమే లేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. అప్పు చేయాల్సిన అవసరమే లేదు మా కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. నాకు ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం యరకన్నపాలెంలోని మా పొలాల పక్కనే తాండవ జలాశయం కాలువ పారుతుండటంతో నీటికి ఇబ్బంది లేదు. నీటి వసతి ఉండటంతో ఏటా వరి పంట వేస్తుంటాం. 30 సెంట్లలో జీడిమామిడి తోట ఉంది. మిగిలిన ఎకరా 20 సెంట్లలో వరి పంట వేశాను. జీడి తోట సంవరక్షణ, వరికి నాట్ల దగ్గర నుంచి కోతకోసే వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుంది. ఈ ప్రభుత్వం రాకమునుపు వ్యవసాయ పెట్టుబడికి అప్పుచేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున వస్తుండటంతో పెట్టుబడికి ఇబ్బంది లేదు. వరి పంట కోత దశకు వచ్చింది. ఈ సమయంలో రైతు భరోసా కింద రూ. 4 వేలు పడింది. ఈ డబ్బు కోత పనులకు ఉపయోగపడుతుంది. నా భార్య రామలక్ష్మి కి వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.13 వేలు వచ్చింది. గుంటూరు ప్రైవేటు కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నా కుమారుడు ప్రవీణ్‌కుమార్‌కు జగనన్న విద్యా దీవెన ద్వారా ఏటా రూ.55 వేల వంతున వచ్చింది. గుడ్ల వల్లేరు ఏఏఎన్‌ఎం కాలేజీలో డిప్లమా ఫైనల్ ఇయర్ చదువుతున్న మా అమ్మాయి శ్రావణికి ఏటా రూ.25 వేల వంతున వచ్చింది. జగనన్న ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా ఇద్దరు బిడ్డలను ప్రైవేటు కళాశాలలో చదివించుకుంటున్నాను. అప్పు కోసం తిరగాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వంలో జరిగిన మేలు మరువలేను. – రుత్తల సాంబశివరావు, రైతు, యరకన్నపాలెం (ఏనుకూరి అప్పారావు, విలేకరి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా) సొంతిల్లు కల్పించిన జగనే మా దేవుడు మా సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. ఆర్ఎంపీగా జీవనం సాగిస్తున్నాను. 26 ఏళ్ల కిందట ఉపాధి కోసం అనంతపురం జిల్లాకు వలస వచ్చా. నాకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఉరవకొండ, విడపనకల్లు, అనంతపురం రూరల్ మండలం కందుకూరు తదితర ప్రాంతాల్లో పనిచేశా. ప్రస్తుతం కందుకూరు గ్రామంలో స్థిరపడ్డా. పిల్లలు పెద్దయ్యేకొద్ది ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. వచ్చే సంపాదనంతా ఇంటి అద్దెలు, కుటుంబ నిర్వహణకే సరిపోయేది. సొంతగూడు కట్టుకోవాలని కలలు కనేవాడిని. ప్రతీరోజూ ఆ దేవుడ్ని మొక్కుకునేవాడిని. బాడుగ డబ్బు చెల్లించడంలో కాస్తా ఆలస్యమైతే చాలు ఇల్లు ఖాళీ చేయమనేవారు. ఇంతకుముందు ఎక్కడా అరసెంటు కూడా లబ్ధి పొందలేదు. మహానుభావుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కందుకూరు జగనన్న లే అవుట్లో సెంటున్నర స్థలం ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.5 లక్షల దాకా ఉంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేయడంతో ఇల్లుకూడా నిర్మించుకున్నా. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేశా. నా కొడుకుకు సచివాలయ ఉద్యోగం వచ్చింది. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా అనంతపురంలో పనిచేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేమి కావాలి? అందుకే నా ఇంట్లో దేవుని గూటిలో మా నాయన ఫొటో పెట్టుకోలేదు కాని వైఎస్ జగన్ ఫొటో పెట్టుకుని పూజిస్తున్నా. – సీహెచ్ గోవిందరెడ్డి, కందుకూరు (రిపోర్టర్: బొడ్డు నగేష్, అనంతపురం ఎడ్యుకేషన్) వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే పోషిస్తోంది నేను వృద్ధురాలిని..ఒంటరి మహిళను. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బాపులపాడులో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాను. రెక్కాడితే కాని డొక్కాడని జీవితం నాది. వయోభారంతో కూలీ పనులు చేసే ఓపిక లేకపోవటంతో బతుకు భారంగా మారింది. ఆదాయం లేకపోవటంతో డ్వాక్రా గ్రూపు ద్వారా తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నన్ను భగవంతుడిలా ఆదుకుంది. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మనోధైర్యాన్ని ఇచ్చాయి. వైఎస్సార్ చేయూత, ఆసరా, రైతు భరోసా, వైఎస్సార్ ఫించన్ కానుక పథకాలతో పెద్ద కొడుకుగా జగన్ నన్ను ఆదుకున్నాడు. వృద్ధాప్య ఫించన్‌తో పాటు ఏటా నాలుగు సంక్షేమ పథకాల ద్వారా బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. ప్రతి నెల ఒకటో తేదీనే వలంటీర్ ఇంటికి వచ్చి నాకు రూ.3 వేలు వృద్దాప్య పింఛన్ అందిస్తున్నారు. ఆసరా పథకం క్రింద రూ.30 వేలు డ్వాక్రా రుణమాఫీ చేశారు. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750, రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందుతున్నాయి. దీంతో ఎవ్వరిపైనా ఆధార పడకుండా ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు నెలకు సరిపడా అందిస్తున్నారు. జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – జోగి లక్ష్మి, బాపులపాడు చలమలశెట్టి శ్యామ్, విలేకరి, హనుమాన్‌జంక్షన్ -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్‌తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్‌లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
విద్యా వ్యవస్థలో మరో విప్లవం
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ విభిన్న ప్రాజెక్టులతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పునాది స్థాయిలోనే కంప్యూటర్ విద్యను అందిస్తే.. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే యువతగా విద్యార్థులు తలెత్తుకొని జీవించగలరనే నమ్మకంతో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్ ఇండియాతో జతకడుతూ ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ప్రోగ్రాం’ కింద వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ పాఠాలు పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి బోధించేందుకు అడుగులు పడనున్నాయి. వెనక బాటు జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంత భవిష్యత్తు సార థులైన విద్యార్థులకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరం నాటికి 10 వేల మంది ఏపీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ ఇండియాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 2026–27 నాటికి సంపూర్ణంగా ఈ ప్రయోజనాలను లక్ష మందికి అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా విజయవాడలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఒప్పంద సంతకాలు జరిగాయి. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి అనేక సంస్థలు మందుకువచ్చాయి. అమెజాన్ ఇండియా ఫండ్స్, సమగ్ర శిక్షతో పాటు ప్రపంచబ్యాంక్ టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్ అనే ఎన్జీవో ఇందులో ఉన్నాయి. వీరందరి భాగస్వామ్యంతో ఉత్తరాంధ్ర విద్యార్థుల భవితను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ‘కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ 21 సెంచరీ స్కిల్స్’పై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా బోధన, సాంకేతిక, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. 10 వేల మంది నుంచి లక్ష వరకూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కంప్యూ టర్ సైన్స్ పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో 10 వేల మంది విద్యార్థులకు ఈ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో లక్ష మందికి ఈ విద్యను చేరువ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎస్సీఈఆర్టీతో కలిసి పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు కంప్యూటర్ సై న్స్ పాఠాల బోధన, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇలా విభిన్న అంశాల్లో తరగతులు నిర్వహించి పిల్లల్ని నిష్ణాతుల్ని చేయనుంది. ఎక్సలెన్స్ కోర్సుల అనుసంధానం కంప్యూటర్ సైన్స్ టీచింగ్ ఎక్సలెన్స్ కోర్సులను అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ ప్రోగ్రాం ఒక పునాదిలా మారుతుంది. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ప్రతి విద్యార్థికి అవకాశం అమేజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులందరినీ సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే అమేజాన్ ఇండియా లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు వారి కెరీర్లకు అవ సరమైన నైపుణ్యాల్ని అందిస్తాం. బెస్ట్ కెరీర్‌కు కంప్యూటర్ సైన్స్ విద్య ఎంతో దోహద పడు తుంది. రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 1.5 మిలి యన్ మంది విద్యార్థులకు, 8 వేల మంది టీచర్లకు కంప్యూటర్ సైన్స్ విద్య అందించాం. – అక్షయ్ కశ్యప్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ఇండియా లీడర్