AP Special
-
విత్తన పరిశోధనకు మరో ముందడుగు
సాక్షి, అమరావతి: విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతోంది. కృష్ణాజిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. రైతులకు నాణ్యమైన సర్టీఫై చేసిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ సర్టిఫై చేసిన విత్తనాలనే మార్కెట్లోకి విడుదల చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సరఫరా చేస్తోంది. మరోవైపు.. విత్తన పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తోంది. ఈ తరహా పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో ఒక్క వారణాసిలో మాత్రమే ఉంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వపరంగా ఈ తరహా పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు. ఇప్పుడు గన్నవరంలోని విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల అంచనాతో తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గతేడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.18 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు పరిపాలనామోదం ఇవ్వగా, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. కొత్త రకాల విత్తనాలకు రూపకల్పన.. ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రంలో విత్తన నాణ్యత పరీక్షించే యంత్రాంగం బలోపేతం కానుంది. మానవ వనరుల అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. వాతావర ణాన్ని తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల విత్తనాల రూపకల్పనతో పాటు సంకర జాతుల అభివృద్ధిలో ఈ సంస్థ భవిష్యత్తులో కీలక భూమిక పోషించనుంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థల సమన్వయంతో వ్యవసాయ పట్టభద్రులు, డిప్లమో హోల్డర్లకు కెపాసిటీ బిల్డింగ్ కింద శిక్షణ ఇవ్వనున్నారు. ఏటా కనీసం వెయ్యిమంది అగ్రి గ్రాడ్యుయేట్స్, రెండువేల మంది అగ్రి డిప్లమో హోల్డర్స్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అత్యాధునిక సౌకర్యాలు.. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రస్థాయి విత్తన జన్యు బ్యాంకుతో పాటు సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే.. ► విత్తనాలు నిల్వచేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మిస్తున్నారు. ► రైతుల శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిప్లమో చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించి ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగువేసే వారికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. ► ఇప్పటికే పరిశోధనా సంస్థ భవన సముదాయంతో పాటు ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తికావచ్చింది. ► వచ్చే జూలై నాటికి వీటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు రైతులకు అధిగ దిగుబడునిచ్చే నాణ్యమైన, మేలు రకం వంగడాలు అందించేందుకు విస్తృత పరిశోధనలు చేసే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం జగన్ సూచనల మేరకు డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. సంస్థ సేవలు అందుబాటులోకి వస్తే విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోను న్నాయి. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
Fact Check: ఆర్బీకేలపై నిత్యం ఏడుపే
సాక్షి, అమరావతి: రైతుకు అడుగడుగునా అండగా నిలిచి, వారిని చేయిపట్టి నడిపించే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఆర్బీకేలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. వాటి సేవలను రైతులకు దూరం చేయడమే లక్ష్యంగా ఈనాడు దినపత్రిక నిత్యం విషం కక్కుతోంది. ఏపల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని ఓర్వలేక అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టింది. తాజాగా ‘రైతు సేవ వట్టిదే..భరోసా దక్కదే..!’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. ఆరోపణ: వేధిస్తోన్న సిబ్బంది కొరత వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు రేషనలైజేషన్ చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, 1896 మంది అవసరమని గుర్తించి ఆ పోస్టుల భర్తీ చేపట్టారు. ఇటీవలే ఫలితాలు విడుదల చేయగా, ఎంపికైన వారికి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. నెలకు రూ.12వేల వేతనంతో తాత్కాలిక సిబ్బంది(ఎంపీఈవో)ని రెండు దఫాలుగా నియమించి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కర్ని ప్రభుత్వం తొలగించిన దాఖలాలు లేవు. ఆరోపణ: లక్ష్యాల పేరిట సిబ్బందిపై ఒత్తిళ్లు వాస్తవం: వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు సర్టిఫైడ్ సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వీరిపై అదనపు బాధ్యతలు మోపకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేసుకునే వాతావరణాన్ని సృష్టించిందే తప్ప లక్ష్యాల పేరిట ఏ ఒక్కర్ని ఒత్తిడికి గురిచేసిన దాఖలాలు లేవు. అలా అని ఏ ఒక్క సిబ్బంది ఫిర్యాదు చేసిన ఘటనలు లేవు. సిబ్బందికి సచివాలయ శాఖ నుంచి సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మండల అధికారుల సిఫార్సుతో సెలవులు మంజూరు చేస్తున్నారు. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా హాజరు వేసే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది అంతర్గత బదిలీలకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 186 మందిని వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఆరోపణ: అద్దె భవనాలే దిక్కు వాస్తవం: 526 గ్రామాల్లో సొంత భవనాలుండగా, 10,252 గ్రామాల్లో రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.1090.23 కోట్లతో నిర్మించిన 4,554 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.357 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వాటిని మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఆరోపణ: అద్దెలు, బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలేవీ? వాస్తవం: అద్దె భవనాల్లో ఉన్న 3,830 ఆర్బీకేలకు అద్దెల రూపంలో రూ.43 కోట్లు ఖర్చుచేయగా, వచ్చే మార్చి వరకు అద్దెల నిమిత్తం సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. వచ్చే మార్చి వరకు బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా, స్టేషనరీ కోసం ఖర్చు చేసిన సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు జమ చేసారు. స్థానికంగా అందుబాటులో ఉన్న హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్ రైతు భరోసా మాస పత్రిక కోసం ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేర్చే‡ కార్యక్రమం చేపట్టారే తప్ప వీటి కోసం సిబ్బందికి ఎలాంటి టార్గెట్లు విధించలేదు. ఆరోపణ: ఆర్బీకేలకు ఆదరణ కరువు వాస్తవం: అదును దాటక ముందే.. సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతులకు అందిస్తున్నారు. తొలి ఏడాది(2020–21) 1.07 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగ్గా, 3వ ఏడాది (2022–23) 4 లక్షల టన్నులకు అమ్మకాలు చేరాయి. తొలి ఏడాదిలో 2.55 లక్షల మంది ఎరువులు తీసుకుంటే..గతేడాది 10.90 లక్షల మంది తీసుకున్నారు. 2023–24లో ఇప్పటివరకు 8.95లక్షల మంది రైతులు 3.89 లక్షల టన్నుల ఎరువులు తీసుకున్నారు. ఆర్బీకే ద్వారా అమ్మే ఎరువుల రవాణా, నిల్వ, అమ్మకానికి కావాల్సిన సదుపాయాల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. మరొక వైపు 34.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రూ.1,040.39 కోట్ల రాయితీతో 58.74 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13.90 కోట్ల విలువైన 1,784.47 క్వింటాళ్ల పత్తి, మిరప, సోయాబీన్ తదితర విత్తనాలను 44వేల మంది రైతులకు సరఫరా చేశారు. 2020–22 మధ్య 1.51 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేయగా, ఈ ఏడాది ప్రస్తుత రబీలో ఇప్పటికే రూ.18.57లక్షల విలువైన 1657 లీటర్ల పురుగుల మందులను 6వేల మంది రైతులకు పంపిణీ చేశారు. ఆర్బీకేలు లాభాపేక్షతో కూడిన వాణిజ్య కేంద్రాలు కాదు. రైతులకు గ్రామస్థాయిలో ఏర్పాటైన సేవా కేంద్రాలన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగుల మందుల అమ్మకాలు వ్యాపారం కాదు..ఒక సదుపాయం మాత్రమే. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు, ఇథియోపియా, బంగ్లాదేశ్, జర్మనీ, వియత్నాం వంటి విదేశీ ప్రతినిధుల బృందాలు ఆర్బీకే సేవలను శ్లాఘిస్తున్నాయి. అనతికాలంలోనే అవార్డులు, రివార్డులతో పాటు ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఆర్బీకేలపై ఈనాడు విషం కక్కడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆనంద ‘ఖేలి’
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్లు టైటిల్ పోరుకు చేరువయ్యాయి. గ్రామ/వార్డు స్థాయి జట్లు ఐదు దశల్లో కొనసాగుతూ చివరిదైన రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. విశాఖ వేదికగా ఈ పోటీలు జరుగుతుండగా 26 జిల్లాల జట్లు తలపడుతున్నాయి. ఒక్క మెన్ క్రికెట్ టైటిల్ పోరు మినహా మిగిలిన వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారం జరగనున్నాయి. మహిళల కేటగిరీలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారమే నిర్వహించనున్నారు. విశాఖలోని ఆరు వేదికల్లో పోటీలు జరుగుతున్నాయి. వైఎస్సార్ బీ గ్రౌండ్‌తో పాటు ఏఎంసీ, స్టీల్ ప్లాంట్ గ్రౌండ్, కేవీకే గ్రౌండ్లలో క్రికెట్ పోటీలు జరుగుతుండగా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలకు ఏయూ, బ్యాడ్మింటన్ పోటీలకు జీవీఎంసీ ఇండోర్ ఎన్క్లేవ్లు వేదికలుగా నిలిచాయి. ఖోఖో పురుష, మహిళా విభాగాల్లో ఆదివారం ప్రీక్వార్టర్ ఫైనల్స్ ముగియగా విజయం సాధించిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన అన్ని పోటీలూ సోమవారం పూర్తికానున్నాయి. మహిళా క్రికెట్లో తొలి సెమీస్ ముగియగా రెండో సెమీస్ జరగనుంది. విజయం సాధించిన జట్లు ఫైనల్స్ సోమవారం ఆడనున్నాయి. పురుషుల క్రికెట్ విభాగంలో రెండు జట్లు సెమీస్‌కు చేరుకోగా మరో రెండు క్వార్టర్‌ఫైనల్స్ జరగాల్సి ఉంది. గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించిన జట్లతో తలపడనున్నాయి. అనంతరం ఫైనల్స్ ఈనెల 13న రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. బ్యాడ్మింటన్ పురుష, మహిళా విభాగాల్లో సెమీస్‌లో విజయం సాధించిన జట్లు సోమవారం ఫైనల్స్ ఆడనున్నాయి. వాలీబాల్ మహిళా, పురుష విభాగాల్లోనూ రెండేసి జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా విజయం సాధించినవి ఫైనల్స్‌లో తలపడనున్నాయి. మొత్తమ్మీద పురుష క్రికెట్ మినహా.. మిగతా అన్ని క్రీడాంశాలను సోమవారంతో ముగించాలని నిర్వాహకులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఐదు క్రీడాంశాల్లో విజేతలతోపాటు రన్నరప్, సెకండ్ రన్నరప్ జట్లు ట్రోఫీలతోపాటు భారీ నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. -
సోషల్ మీడియాలో.. 504 కోట్ల మంది
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని సోషల్ మీడియా ఊపేస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోని వివిధ యాప్‌లలో గంటలు గంటలు గడిపేస్తున్నారు. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ పరిశోధన ప్రకారం.. ప్రపంచ జనాభాలో ఏకంగా 62.30 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే 26.60 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాలోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా యూజర్ల సంఖ్య 504 కోట్లకు చేరిందని వెల్లడించింది. వీరిలో 46.50 శాతం మంది మహిళలు, 53.50 శాతం మంది పురుషులు ఉన్నారు. సగటున ఒక వ్యక్తి రోజువారీ సోషల్ మీడియా వినియోగం 2.23 గంటలుగా నమోదయ్యింది. ఇక ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో అత్యధికంగా 94.20 శాతం మంది సోషల్ మీడియాలోనే ఉంటున్నారని నివేదిక పేర్కొంది. అమెరికాలో యూట్యూబ్ టాప్ గతంలో సగటున ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లామ్‌ఫారమ్‌ల వినియోగం 6.9 శాతంగా ఉంటే ఇప్పుడు 6.7 శాతానికి తగ్గడం విశేషం. మరోవైపు టాప్–4 సోషల్ మీడియా ఫ్లామ్‌ఫారమ్‌లలో మూడు ‘మెటా’కు చెందినవే ఉన్నాయి. అగ్రస్థానంలో ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ కొనసాగుతున్నాయి. అమెరికాలో మాత్రం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెడుతూ యూట్యూబ్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది. -
Fact Check: గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నారు!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు రామోజీ రోజుకో అబద్ధాన్ని వల్లెవేస్తూ గిరిజనుల సంక్షేమానికి అగ్రపాధాన్యమిచ్చిన వైస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల కోనుగోలులో రికార్డు సృష్టిస్తున్న గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వైఎస్ జగన్ హయాంలో గిరిజనులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా చెల్లిస్తున్నా కబోది రామోజీ ‘గుండెల్లో పెట్టుకుంటానని.. గుదిబండగా మారారు!’ అంటూ ఈనాడులో అబద్ధాలు అచ్చేశారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర కోసం ప్రత్యేకంగా అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేలా జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన జగన్ ప్రభుత్వం గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. ఆరోపణ: ఆదాయం చూడడమే తప్ప ఆదుకోరా? వాస్తవం: కాఫీకి అంతర్జాతీయంగా చెల్లించే ధర కంటే ఎక్కువకు జీసీసీ కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ముడి కాఫీ రూ.215, చెర్రీ ముడి కాఫీకి రూ.130 చెల్లించేవారు. ఏజెన్సీలో పండించే కిలో ముడి కాఫీకి రూ.280, చెర్రీ ముడి కాఫీకి రూ.145 ఇస్తున్నారు. కొనుగోళ్ల సమయంలో కేంద్ర కాఫీ బోర్డు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పార్చ్మెంట్ కాఫీ 10, చెర్రీ కాఫీ 10.5 తేమతో కొనుగోలు చేసేలా నిర్ణయించారు. ప్రైవేటు వ్యాపారుల బారిన పడి గిరిజన రైతులు నష్టపోకుండా కొనుగోలు సిబ్బందికి జీసీసీ తేమ శాతం నిర్ధారణ పరికరాలు అందించింది. ఖచ్చితమైన తేమ శాతం నిర్ధారించి కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ముడి కాఫీ కొనుగోలు రిపోర్ట్‌ను జీసీసీ మేనేజర్లు ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 1000 మెట్రిక్ టన్నుల ముడి కాఫీ సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు 340 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అకాల వర్షాలతో కాఫీ దిగుబడి తగ్గడం వల్ల గత సీజన్ కంటే ఈ ఏడాది కొనుగోలు తగ్గింది. ఆరోపణ: మిగిలిన వాటికి ‘మద్దతు’ కరువే? వాస్తవం: మిగిలిన ఉత్పత్తులకు జీసీసీ మద్దతు ధర ప్రకటించి జీసీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత సీజన్లో జీసీసీ కిలో కరక్కాయలు రూ.15 నుంచి రూ.18, ఎండు ఉసిరి రూ.90, రాజ్మా రూ.90కి జీసీసీ కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల్లో పిక్క చింతపండు రూ.23 నుంచి రూ.28 మాత్రమే ఉంటే జీసీసీ పిక్క చింతపండు రూ.32 నుంచి రూ.40, పిక్క తీసిన చింతపండు రూ.63 ధర ప్రకటించి కొనుగోలు చేస్తోంది. ఆరోపణ: లాభాలే పరమావధా? వాస్తవం: ఏజెన్సీ కాఫీకి మంచి గుర్తింపు తెచ్చిన ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో జీసీసీ బ్రాండింగ్ చేస్తోంది. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ రకాలను జీసీసీ నెట్వర్క్ ద్వారా విక్రయిస్తోంది. వీటి గరిష్ట రిటైల్ ధర నిర్ణయించే సమయంలో ముడి కాఫీ ధర, శుద్ధీకరణ, తయారీ, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రిటైల్ మార్ట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవేమీ తెలియనట్టుగానే వీటి అమ్మకాల ద్వారా జీసీసీ అధిక లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు రోత రాతలు రాయడం దారుణం. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల అడవుల్లో గిరిజనుల నుంచి సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తోంది. కేజీ తేనెను రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తోంది. తేనెకు గరిష్ట రిటైల్ ధర నిర్ణయంలో ముడి తేనె ధర, శుద్ధీకరణ ఖర్చు, శుద్ధికరణలో తరుగుదల, బాట్లింగ్, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రీటైల్ మార్ట్లు, నాణ్యత ప్రమాణాల పరీక్షలకు అయ్యే ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు. అయితే తేనే విక్రయాల్లో జీసీసీ లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. అలాగే ప్రైవేటు వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేసేలా జీసీసీ అనేక చర్యలు చేపట్టింది. మద్దతు ధర నిర్ణయించడం వల్ల ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి ఎక్కువ ధరకు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఆరోపణ: రుణాలిచ్చింది 160 మందికే? వాస్తవం: గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. దీనికితోడు జీసీసీ గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేస్తోంది. గతేడాది తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి తిరిగి రుణాలు ఇస్తున్నారు. 2016–17 నుంచి 2022–23 వరకు జీసీసీ ద్వారా 4,839 మంది గిరిజన కాఫీ రైతులకు రూ.528.28 లక్షల రుణాలు ఇచ్చారు. వీటిలో ఇంకా రూ.252.86 లక్షల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో రూ.22.80 లక్షల రుణాలు మంజూరు చేశారు. -
తిరుమల గిరుల్లో తులిప్ విరులు
తులిప్స్.. ఎన్నెన్నో రంగుల్లో మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. మగువలు సిగలో అలంకరించుకునేందుకు ఉపయోగపడకపోయినా.. వేడుకల అలంకరణలో మాత్రం రాజసాన్ని చాటుతాయి. నింగీనేలా చుంబించే లాలిలో ఓలలాడించే ఈ పుష్ప రాజాలు కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో ఆహ్లాదాన్నిపంచే ఈ పుష్పాలు ఉద్యాన శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు తిరుమల గిరులపైనా విరబూస్తున్నాయి. సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తులిప్ పూలను ఏపీలోనూ సాగు చేయించాలన్న తలంపుతో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని సిట్రస్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వీటి సాగుకు తిరుమల గిరుల్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు సత్ఫలితాలనివ్వడంతో భవిష్యత్‌లో మరిన్ని రకాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. శీతల పరిస్థితులు గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే ఈ పూల మొక్కలు జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తులిప్స్ రానున్న రోజుల్లో కలియుగ దైవం కొలువైన ఏడుకొండలపైనా ఇకపై కనువిందు చేయనున్నాయి. తులిప్స్ పూలకు ప్రత్యేకతలెన్నో..: లిలియాసీ (లిల్లీ) పూల జాతికి చెందిన ఈ పుష్పాలు ప్రపంచంలోనే టాప్–10 కట్ ఫ్లవర్స్‌లో ఒకటిగా ఖ్యాతి చెందాయి. తులిప్‌లో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. వీటిని దుంపల ద్వారా సాగు చేస్తారు. తల్లి దుంపల(బల్బ్సŠ)ను నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. తల్లి దుంపల్ని 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో 3 నెలలపాటు ఫ్రీజ్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీటిని నాటుకుంటారు. దుంపకు దుంపకు మధ్యలో 8–10 సెం.మీ. దూరంలో దుంప సైజును బట్టి 5–8 సెం.మీ. లోతులో నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెం.మీ., వరుసల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తారు. 20 చదరపు అడుగులకు 100 దుంపల చొప్పున ఎకరాకు 45 వేల దుంపల వరకు నాటుకోవచ్చు. ఏడాది పాటు భూమిలోనే ఉంచితే పిల్ల దుంపలు పుట్టుకొస్తాయి. వాటిని సేకరించి మరుసటి ఏడాది నాటుకోవచ్చు. పుషి్పంచే కాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నాటిన 45–60 రోజుల్లో పుషి్పస్తాయి. పుష్పించే సమయంలో రాత్రి పూట 5–12 డిగ్రీలు, పగటి పూట 20–26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. 10 రోజుల పాటు తాజాగా..: రెండాకులు ఉండేలా పూలను కత్తిరించి, వాటి తాజాదనం కోల్పోకుండా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కత్తిరించిన తర్వాత కనీసం 5–10 రోజుల వరకు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. పూలు కోసిన తరువాత 10 రోజుల్లో మొక్క ఎండిపోతుంది. ఎండిన మొక్కను తొలగించి భూగర్భంలో ఉన్న దుంప బయటకు తీసి మళ్లీ ఫ్రీజ్ చేయాలి. మరుసటి ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత మళ్లీ నాటుకోవాలి. ఎత్తైన మడుల్లో డ్రిప్ ఇరిగేషన్ సాయంతో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. వసంతకాలంలో 3–7 రోజుల పాటు వికసించే ఈ పూలు దాదాపు అన్ని రంగుల్లోనూ కనువిందు చేస్తాయి. మెజార్టీ రకాల పూలు ఒకే విధమైన ఆకృతిలో ఉంటాయి. అత్యంత ఖరీదైన ఈ పూల రెమ్మలను తింటారు. కొన్ని వంటకాల్లో ఉల్లికి బదులు వీటి రెబ్బలనే వాడుతుంటారు. మార్కెట్లో ఒక్కో పువ్వు రూ.50 నుంచి రూ.75 వరకు ధర పలుకుతుంది. ఫలించిన పరిశోధన తిరుపతిలోని మైదాన ప్రాంతాలతోపాటు సముద్ర మట్టానికి 980 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండ ప్రాంతాల్లో ప్రత్యేక నర్సరీ నెలకొల్పి వీటి సాగుపై అధ్యయనం చేశారు. ఏడీ రెమ్, డెన్మార్క్, డౌ జోన్స్, రాజవంశం, ఎస్కేప్, గోల్డెన్ పరేడ్, పింక్ ఆర్డోర్, పురిస్సిమా, పర్పుల్ ఫ్లాగ్ సూపర్ మోడల్ రకాలకు చెందిన తులిప్ దుంపలను డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో నాటారు. రెండుచోట్ల మొలకెత్తినట్టు గమనించినప్పటికీ తిరుమలలో మాత్రం నాటిన ప్రతి దుంప మొలకెత్తింది. డెన్మార్క్ రకం 10–12 రోజుల్లో పూర్తిగా పూలు విచ్చుకోవడాన్ని గుర్తించారు. తిరుమలలో తులిప్ పార్క్ అత్యంత శీతల ప్రాంతంలో సాగయ్యే ఈ పూల సాగుపై మేం చేసిన పరిశోధనలు ఫలించాయి. శ్రీనగర్ తరహాలోనే తులిప్ గార్డెన్స్ పెంచేందుకు తిరుమల గిరులు కూడా అనుకూలమని గుర్తించాం. భవిష్యత్‌లో టీటీడీ సౌజన్యంతో వీటి సాగు దిశగా సన్నాహాలు చేయబోతున్నాం. గుర్రం కొండతోపాటు ఇతర ఎత్తైన ప్రాంతాల్లో వీటి సాగును విస్తరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలపై కూడా పరిశోధన చేస్తున్నాం. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం
నగరంపాలెం: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 8341396104కు ఫోన్ చేయొచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచనాలతో జీజీహెచ్‌కు వచ్చారన్నారు. వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే.. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. శారదా కాలనీలో మూడు షిఫ్ట్‌లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్ తెలియజేశారన్నారు. కొళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారని తెలిపారు. -
వికసిత్ భారత్‌కు ప్రధాన ఆర్థిక దిక్సూచి విశాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కీలకమైన విశాఖ నగరం దేశ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించడంలో తనవంతు పాత్ర పోషించనుంది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు దిక్సూచిగా విశాఖను మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు దీనిని పరిపాలన రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ నగరాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు. ఇక్కడి పలు ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఇటీవల ప్రధాని మోదీని కోరిన విషయం తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థలో విశాఖ నగర ప్రాధాన్యాన్ని తాజాగా నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే కీలక నగరాల్లో విశాఖపట్నం కీలకపాత్ర పోషించనుందని ప్రకటించింది. వికసిత్ భారత్–2047 కింద దేశీయ ఆర్థికవ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.2,500 లక్షల కోట్లు)కి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్‌తో ముందుకెళుతోంది. 2047 నాటికి భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తొలిసారిగా 2047 వరకు దేశ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రమణ్యం ప్రకటించారు. వీటితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ హబ్స్‌గా కీలకపాత్ర పోషించే మరో 20 నుంచి 25 పట్టణాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు పట్టణాల ఆర్థిక ప్రణాళికలు కాకుండా కేవలం పట్టణ అభివృద్ధి ప్రణాళికలకు పరిమితమయ్యామని, కానీ ఇప్పుడు ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నంలను ఆర్థిక చోదకశక్తులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నట్లు వివరించారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 11న సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా దేశ యువతను కోరింది. ఇప్పటివరకు 10 లక్షలకుపైగా వివరణాత్మకమైన సూచనలు, సలహాలు వచ్చాయని, వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్–2047ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఐటీకి అనుకూలమని గతంలోనేగుర్తించిన నాస్కామ్–డెలాయిట్ ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు విశాఖ అనువైన ప్రాంతమని గతంలో నాస్కామ్–డెలాయిట్ గుర్తించిన సంగతి తెలిసిందే. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్క్–వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖను ప్రోత్సహిస్తుండటమే కాకుండా నూతన తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా, మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ బ్రాండింగ్ శక్తిమంతమైన ఈ నగరానికి మరిన్ని వసతులు, వనరులు కల్పించేందుకు, అంతర్జాతీయంగా విశాఖ బ్రాండింగ్‌ను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. జీ20 సమావేశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, అంతర్జాతీయ వైద్యసదస్సు, మారిటైమ్ సదస్సు.. ఇలా అనేక అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడం ద్వారా విశాఖకు గ్లోబల్ బ్రాండింగ్‌ను తీసుకొచ్చింది. తద్వారా మరిన్ని పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం ఏర్పడింది. ఇటీవల ప్రధానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ–కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానిస్తూ భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టును కలిపే 55 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. -
యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్
బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్‌బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్‌కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్‌పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్‌ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు. -
ఆరోగ్యశ్రీ బతికించింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీ బతికించింది ఒకరోజు ఒంట్లో బాగోలేదని ఆసుపత్రుల చుట్టూ తిరిగా. వైద్యులు క్యాన్సర్ అని చెప్పారు. నేను చదువుకోలేదు. వయస్సు మీదపడటం, నిరక్షరాస్యతతో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. నా కుమారుడు ఏసుబాబు కూడా చదువుకోలేదు. స్థానిక ఏఎన్ఎం కౌసల్య ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందవచ్చని చెప్పారు. నా పేరు వాసిరెడ్డి సుబ్బాయమ్మ. మా ఊరు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చినకాపవరం. నేను, నా కొడుకు విజయవాడలోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాం. ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా వైద్యం చేస్తామని చెప్పారు. వైద్యం ప్రారంభించి ఇప్పటికి ఆరుసార్లు కీమో థెరపీ చేశారు. ఏడోసారి ఫిబ్రవరి 15న రమ్మన్నారు. నేను పౌష్టికాహారం తినేందుకు రోజుకు రూ.250 చొప్పున నా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.5 వేలు జమ చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. నా భర్త చనిపోయాడు. కొడుకు కూలి పనికి వెళ్లి నన్ను పోషిస్తున్నాడు. మనవరాలికి అమ్మఒడి వస్తోంది. కోడలికి ఆసరా ద్వారా లబ్ధి కలిగింది. నాకు వితంతు పింఛన్ నెలకు రూ.3 వేలు వస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడుతోంది. ఆరోగ్యశ్రీ నన్ను బతికించింది. పెద్ద కొడుకులా ఆదుకున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను. – వాసిరెడ్డి సుబ్బాయమ్మ, చినకాపవరం (బీఆర్ కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు) మలి వయసులో నడి‘పించెన్’ నా పేరు కుపిలి సూర్యారావు. మాది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం యర్రమిల్లిపాడు. నాకు 74 సంవత్సరాలు. వ్యవసాయ కూలి పనులు చేసే నేను ఇప్పుడు ఏ పనులకూ వెళ్లలేకపోతున్నా. నా పిల్లల పెళ్లిళ్లు చేశాక ఎవరి దోవన వారు వెళ్లిపోయారు. మిగిలింది నేను, నా భార్య. ఇద్దరమూ ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం. నేను వైకల్యంతో కదల్లేని స్థితిలో ఉన్నా. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం రావడం మా అదృష్టమని చెప్పాలి. ప్రభుత్వం రావడంతోనే అమలు చేసిన నవరత్నాలు మాకు ఎంతో ఆసరా అయ్యాయి. నేను, నా భార్య ప్రభుత్వం అందించే పథకాలతోనే బతుకుతున్నాం. నాకు డీఎంహెచ్ఓ పింఛన్ నెలకు రూ.5 వేలు వస్తోంది. నా భార్యకు వృద్ధాప్య పింఛను రూ.3 వేలు, అభయహస్తం పింఛను రూ.500 కలిపి మొత్తం ప్రతి నెలా రూ.8500 వస్తున్నాయి. వలంటీరు ఇంటికి తీసుకువచ్చి ఆ డబ్బు ఇస్తున్నారు. ఈ డబ్బుతోనే మేము జీవిస్తున్నాం. సీఎం జగన్‌కు ధన్యవాదాలు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి. – కుపిలి సూర్యారావు, యర్రమిల్లిపాడు (పాండ్రాకుల వెంకట పెద్దిరాజు, విలేకరి, ఉంగుటూరు) మా ఆనందం చెప్పలేనిది మేము కృష్ణా జిల్లా పెడన పట్టణంలోని ఏడో వార్డు వీరభద్రపురంలో ఉంటున్నాం. నా పేరు వాసా నాగలక్ష్మి. నేత కారి్మకురాలిని. నా భర్త పేరు శ్రీనివాసరావు. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే జీవిస్తున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లు రూ.1.20 లక్షలు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. మా అమ్మాయి పావన సాయి నాగ మల్లేశ్వరికి ఇంటర్మిడియట్‌లో అమ్మఒడి ద్వారా రూ.15 వేలు చొప్పున, డిగ్రీలో విద్యాదీవెన కింద రూ.35 వేల వరకు వచ్చాయి. నాకు ఆసరా కింద ఏటా రూ.16,300 చొప్పున వచ్చింది. పట్టణంలోని పల్లోటి లే అవుట్–1లో ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం. త్వరలో గృహ ప్రవేశం చేసి ఆ ఇంట్లోకి వెళ్లడానికి ముహూర్తం చూస్తున్నాం. నాకు ప్రమాదం జరిగి చేయి విరిగితే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకున్నా. ఆ సమయంలో రూ.35 వేలు ఖర్చయింది. దానిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి చెల్లించింది. విశ్రాంతి సమయంలో కూడా ఆరోగ్య ఆసరా కింద రెండు నెలలకు రూ.10 వేలు ఇచ్చారు. మా ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నాం. జగనన్నకు కృతజ్ఞతలు. మళ్లీ ఆయనే రావాలి. – వాసా నాగలక్ష్మి, పెడన (ఎన్.గంగాధరరావు, విలేకరి, పెడన) -
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
అనకాపల్లి: కొన్ని రోజుల క్రితం ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో చేరి రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలకు వద్దకు వెళుతున్న షర్మిలకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా మళ్లీ మీరు ఎందుకు కప్పుకున్నారని షర్మిలను ఓ సామాన్యుడు నిలదీశాడు. గతంలో జగనన్న వెంట నడిచి, ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అనడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని నిలదీశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సామాన్యుడి నుంచి ఎదురైన ఈ హఠాత్తు పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మా కార్యకర్తలమంతా తప్పుపట్టాం. ఆ సమయంలో మేమంతా మీకు, మీ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీ పాదయాత్రలో మీతో నడిచాం. ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారు. అందుకే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి’ అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హుడైన పేదవాడికి అందుతుందని స్పష్టం చేశాడు . -
విజయపథంలో అక్క చెల్లెమ్మలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. వీటిని సద్వినియోగించుకుంటూ అక్కచెల్లెమ్మలు వారి కాళ్లపై వారు నిలదొక్కుకోవడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. ఇదే క్రమంలో పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా కూడా రూపుదిద్దుకుంటున్నారు. పొదుపు సంఘాల మహిళలు రాష్ట్ర ప్రథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలనూ సద్వినియోగం చేసుకొంటున్నారు. ఇలా పొదుపు సంఘాల మహిళలను హయ్యర్ ఆర్డర్ ఎంటర్ప్రెన్యూర్ (ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు)గా తీర్చిదిద్దడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2021 – 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 1,126 మంది పేద పొదుపు సంఘాల మహిళలు ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. వారు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు పెద్ద సంఖ్యలో తోటి మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. వీరు ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. ధాన్యాలు, చిరు ధాన్యాలతో కూడిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, నూనె, బెల్లం తయారీ, పిండిమర, పచ్చళ్ళు, కారం పొడులు తదితర యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరి వివరాలు, విజయగాథలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) “ఆంధ్రప్రదేశ్ కొత్త తరం మహిళా పారిశ్రామికవేత్తలు’ పేరుతో తెలుగు, ఇంగ్లిష్,, హిందీ భాషల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించింది. శుక్రవారం ఈ పుస్తకాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్యి బి. రాజశేఖర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్, ఆర్.వై.ఎస్.ఎస్ సీఈవో విజయ్ కుమార్ ఆవిష్కరించారు. గ్రామాల్లో మహిళా శక్తిని, గ్రామీణాభివృద్ధి రెండూ విదదీయరానివని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చెప్పారు. పేదరికంలో నివసిస్తున్న గ్రామీణ నిరక్ష్యరాస్యులైన సామాన్య మహిళలు తగిన ప్రేరణతో మార్పును తేగలరనే నమ్మకంతోనే సెర్ప్ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. మహిళలు నూతన శిఖరాలను అధిరోహించే క్రమం, వారు సాధించిన విజయాలు, ఆర్థికంగా ఎదుగుతున్న వైనాన్ని ఈ పుస్తకంలో ప్రచురించినట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. -
AP: రాష్ట్రంలో విద్యా విప్లవం
పులివెందుల టౌన్: రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా విద్యా వెలుగుల వ్యాప్తితోనే సీఎం జగన్ పేదరికానికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించారు. విద్యార్థి విభాగం వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆధ్వర్యంలో శుక్రవారం పులివెందులలో జగనన్న కాలేజ్ కెప్టెన్స్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. జగనన్న రుణాన్ని కొంతైనా తీర్చుకునేందుకు ఎన్నికల రణరంగంలో ఆయనకు అండగా నిలవాలని విద్యార్థి లోకం యావత్తు సమష్టిగా, స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం పలు కళాశాలలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న కాలేజ్ కెప్టెన్స్ విద్యార్థులతో మమేకమై జగనన్న హయాంలో జరిగిన మేలుపై వారిలో అవగాహన పెంచారు. జగనన్న హయాంలో మారిన విద్యారంగ పరిస్థితులను సమగ్రంగా వివరించారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించిన విద్యారంగం నాడు–నేడు కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం పులివెందుల మార్కెట్‌యార్డు చైర్మన్ చిన్నప్ప, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న కాలేజ్ కెప్టెన్ టీషర్ట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నేతలు శ్రీకాంత్‌రెడ్డి, సాయి, శివ, మోహన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ‘సంక్షేమం’ సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్‌మార్షల్ మనీష్‌కుమార్ గుప్తా ప్రశంసించారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. మనీష్‌కుమార్ మాట్లాడుతూ.. నేషనల్ డిఫెన్స్ కళాశాల ఫ్యాకల్టీ, కోర్సు సభ్యులతో కలిసి రెండ్రోజులుగా విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, మహిళ, రైతు సంక్షేమం తదితర రంగాల్లో అమలుచేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు అక్కడి ప్రజలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ఎన్డీసీ బృందం పర్యటించి ఆక్కడ అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించామని.. అయితే, ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉందని మనీష్‌కుమార్ కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు.. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి పలు కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. అలాగే, ప్రాథమిక విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అలాగే, పేద ప్రజల సంక్షేమానికి పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్.. ఇక రాష్ట్రంలో ఇంధన శాఖకు సంబంధించిన అంశాలపై ఎపీ ట్రాన్స్‌కో సీఎండీ కేవీఎస్ చక్రధర్‌బాబు వివరిస్తూ.. ప్రజలకు 24 గంటలూ యాక్ససబుల్, రిలయబుల్ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని.. సుమారు 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం ఒకే గ్రిడ్ నినాదంలో భాగంగా 5 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని, ఐదు పంపు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఇంధన రంగంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ ఏడాది నాలుగు జాతీయ, మూడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డును కూడా సాధించామన్నారు. అనంతరం.. వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్ జి. శేఖర్‌బాబు వివరిస్తూ.. రాష్ట్ర జీడీపీలో 34 శాతం పైగా వాటా వ్యవసాయ రంగం నుంచే వస్తోందని చెప్పారు. రైతులకు అవసరమైన సేవలంని్నటినీ ఆర్బీకేల ద్వారా ఒకేచోట నుండి అందిస్తున్నామన్నారు. కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. రాష్ట్రంలో వైద్యసేవలను రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ డా. వెంకటేశ్వర్ వివరిస్తూ.. రాష్ట్రంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నడూలేని విధంగా 53 వేల పోస్టులను భర్తీచేయడంతోపాటు ఇంటివద్దకే మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి జరుగుతోందని వివరించారు. అలాగే.. కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. -
టీడీపీ శవ రాజకీయం
కంచికచర్ల: తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకు తెరతీస్తోంది. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా రాజకీయ లబ్ది పొందడానికి అశుభ కార్యాలయాలను కూడా ఉపయోగించుకొంటున్నారు. మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ తమ్ముడు వైఎస్సార్సీపీ నేత దేవినేని చంద్రశేఖర్ (52) అనారోగ్యకారణంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మృతుని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించేందుకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల విచ్చేశారు. ఈ సమయంలో తమ నాయకుడు ఉమా మంచి వాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న విషయం అర్ధంకాక భువనేశ్వరి కొన్ని నిముషాలు ఖిన్నులయ్యారు. చంద్రశేఖర్ మృతి చెంది రెండు రోజులయినప్పటికీ రాజకీయ రంగు అంటుకోవటం పట్ల కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం, అమావాస్య రోజు పరామర్శించే కార్యక్రమం ఏర్పాటు చేయటం పట్ల కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడి మరణాన్ని కూడా ఉమా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం చూస్తుంటే సిగ్గేస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. మృతిచెందే వరకూ వైఎస్సార్సీపీలోనే దశాబ్దం క్రితం దేవినేని చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలో చేరి మరణించే వరకు పార్టీలో కొనసాగారు. పది రోజుల క్రితం ఆయన బతికి ఉన్న సమయంలోనూ తన సహచరులతో 2024లో తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కుర్చీలో కూర్చుంటారని అన్నట్టు అనుచరులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తన అన్న దేవినేని ఉమా మహేశ్వరరావు ఓటమి కోసం మైలవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్‌తో కలసి ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి నేత భౌతిక కాయానికి గురువారం టీడీపీ జెండా కప్పటం పట్ల ఆయన అభిమానులు, సహచరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం చంద్రశేఖర్ తన పిల్లల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి ఉమాను ఆహ్వానిస్తే ఆయన వెళ్లలేదు. పక్షం రోజుల క్రింత చంద్రశేఖర్‌ను టీడీపీ నాయకులు టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఉమా మహేశ్వరరావు ఆ పార్టీలో ఉన్నంతకాలం రానని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అటువంటి చంద్రశేఖర్ భౌతికకాయంపై ఉమా మహేశ్వరరావు పచ్చ జెండా కప్పటంపై రాజకీయ ప్రయోజనం కాక మరొకటి లేదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేని ప్రేమను తెచ్చుకుని రాజకీయ లబ్ది కోసం ఉమా చేస్తున్న ఉబలాటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎంపీ మాధవి కుమార్తెకు సీఎం నామకరణం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ మాధవి శివప్రపాద్ దంపతుల కుమార్తెకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నామకరణం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన మాధవి, భర్త శివప్రసాద్ అక్కడకు వచ్చిన సీఎం జగన్‌ను కలిశారు. వారి కోరిక మేరకు చిన్నారికి నామకరణం చేశారు. తాము కోరిన వెంటనే సీఎం నామకరణం చేయడం ఆనందంగా ఉందని, త్వరలో బారసాల నిర్వహించి సీఎం నామకరణం చేసిన పేరును ప్రకటిస్తామని ఎంపీ మాధవి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
ఘనంగా మేరీమాత ఉత్సవాలు
గుణదల (విజయవాడ తూర్పు): క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం విజయవాడ గుణదలలోని మేరీమాత ఆలయంలో ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానాల యం దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కతోలిక గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. భక్తుల పాలిట కల్పతరువుగా మేరీమాత కొలువుదీరిందన్నారు. దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా లోక రక్షకుడైన క్రీస్తును ఈ లోకానికి అందించి లోకమాతగా కీర్తించబడిన మరియతల్లిని ఆశ్రయించిన భక్తుల జీవితాలు దీవెనకరంగా ఉంటాయని తెలిపా రు. గుణదల పుణ్యక్షేత్రం స్థాపించబడి నూరు వసంతాలు పూర్తి కావడం హర్షణీయమన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలకు హాజరై భక్తులు మరియమాత ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, ఫాదర్ సునీల్ రాజు, ఫాదర్ పసల థామస్ తదితరులు పాల్గొన్నా రు. ఉత్సవాల తొలిరోజున యాత్రికులు పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. -
ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరికింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. చీకూ చింతా లేకుండా జీవిస్తున్నా.. గోడలకు రంగులు వేయడం నా వృత్తి. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. శ్రీకాకుళం సమీపంలోని కాజీపేటకు చెందిన నాది దినసరి కూలీ బతుకు. రెక్కాడితేగానీ డొక్కాడదు. ఉన్నదాంట్లో ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో నా భార్యకు ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. ఆమెకు చికిత్స చేయించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చాను. ఆమెకు సహాయంగా నేనూ ఆస్పత్రిలోనే ఉండేవాడ్ని. ఇంతలో డిసెంబర్ 28వ తేదీన ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రిలో వైద్యులు నన్ను పరీక్షించి స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడంతో సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ చేస్తుండగానే మరోసారి స్ట్రోక్ వచ్చింది. అయినా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. విశ్రాంతి సమయంలో ఆసరాగా రూ.10 వేల వరకు డబ్బులు జమ చేశారు. నా భార్య కన్ను మూసింది. ఒంటరిగానే ఉంటున్న నాకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. రేషన్‌కార్డు ఉండటంతో బియ్యం, పప్పు ఉచితంగా వస్తున్నాయి. ఇంకా నెలనెలా అవసరమైన మందులు మా ఊరికే తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఏ చింతా లేదు. – సాధు మల్లేసు, కాజీపేట (బలివాడ శివప్రసాద్, విలేకరి, అరసవల్లి) అద్దె భారం తప్పింది మా ఆయన వెంకట నూక శివ అప్పారావు పెయింటింగ్ పని చేస్తుంటాడు. ఆయన సంపాదనతోనే కుటుంబం మొత్తం గడవాలి. పనులు ఉంటేనే ఆదాయం. లేదంటే అప్పులతోనే జీవనం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లిలో ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లోనే కాపురం చేస్తున్నాం. ఒక్కో నెల ఆదాయం ఉండేది కాదు. అలాంటి సమయంలో అప్పు చేసి అద్డె చెల్లించాల్సి వచ్చేది. గత ప్రభుత్వ హయాంలో పలు మార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసినా ఫలితం లేక పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటి పట్టా మంజూరు చేయాలని సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. వెంటనే స్థలంతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.లక్షా 80 వేలు సాయం అందించారు. దీంతో సొంతిల్లు నిర్మించుకొని గృహ ప్రవేశం చేశాం. అద్దె బాధ తప్పడంతో సంతోషంగా కుటుంబ పోషణ సాగుతోంది. మాకు ఇద్దరు సంతానం. మా బాబుకు అమ్మఒడి పథకం ద్వారా మూడు సంవత్సరాలుగా రూ.45 వేలు అందింది. మా మామ మల్లేశ్వరరావుకు వృద్ధాప్య పింఛన్ ప్రతి నెలా ఒకటో తేదీనే అందుతోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. – కొయిలాడ ఇందు, వాడ్రాపల్లి (వెలగా జగదీష్ కుమార్, విలేకరి, మునగపాక) ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరికింది మాది పేద కుటుంబం. నేను బీఎస్సీ, నా భర్త శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశాం. ఇద్దరం నిరుద్యోగులం. నా ఇద్దరు కుమారులు ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పర గ్రామానికి చెందిన మాకు ఇక్కడ బతుకు తెరువు లేకపోవడంతో వలస వెళ్లిపోవాలని అనుకున్నాం. ఇంతలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత మా కుటుంబ జీవన స్థితిగతుల్లో మార్పు వచ్చింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.30 వేలు వచ్చింది. వెలుగు శాఖ ద్వారా స్త్రీనిధి రుణం రూ.2 లక్షలు, సీఐఎఫ్ రుణం రూ.1.50 లక్షలు, పీఎంఎఫ్ఎంఈ కింద రూ.6.90 లక్షలు తీసుకుని దాంతో మాప్స్టిక్స్(తుడుపు కర్రలు) యూనిట్ నెలకొల్పాం. అనంతరం మినపగుళ్లు తయారీ యంత్ర పరికర యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. నా భర్త శ్రీనివాసరావు సహాయంతో రెండు రకాల యూనిట్ల ద్వారా వ్యాపారం సాగిస్తున్నాం. నెలకు రూ.30 వేల వరకు సంపాదించుకొని నిరుద్యోగాన్ని పారదోలాం. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. మా అమ్మమ్మ వరహాలమ్మకు వైఎస్సార్ పింఛన్ కానుక వర్తిస్తోంది. ఇప్పుడు మేము ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉన్న ఊళ్లోనే జీవిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసిన సాయం మరచిపోలేం. – లగ్గు మౌనిక, కొప్పర(తూముల మహేశ్వరరావు, విలేకరి, వంగర) -
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి బదిలీల అనంతరం కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య 8మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నింటిలో తక్కువ మంది ఉన్నారు. అన్ని చోట్లా సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్ (సర్దుబాటు)కు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయాల్లో 8 మందికంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన చోట్ల 8 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు. 8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు తెలిపారు. ఈ çసుమారు 5,000 మందికి స్థానచలనం కలుగుతుందని వెల్లడించారు. జిల్లాల ప్రాతిపదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుందని తెలిపారు. ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. విధివిధానాలివీ.. ♦ ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు ♦ జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు ♦ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయాలకే బదిలీ ♦ ఎక్కడైనా భార్య, భర్త వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే, వారి అభ్యర్ధన మేరకు ఇరువురికీ ఒకే చోటకు బదిలీకి అవకాశం కల్పిస్తారు. వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో.. మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో సర్దుబాటు ప్రక్రియ సాగుతుంది. అప్పటికీ సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)తో సర్దుబాటు చేస్తారు. మూడో ప్రాధాన్యతలో డిజిటల్ అసిస్టెంట్లు, అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి. ఇలా ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు. ♦ వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి. ♦ ఉద్యోగులతో నేరుగా కౌన్సెలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు -
ముందే వచ్చిన వేసవి!
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది వేసవి ఆరంభానికి ముందే ఉష్ణతాపం భయపెడుతోంది. శీతాకాలం సీజను ముగియక ముందే సూర్య ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలోనే ఏప్రిల్ నాటి ఎండలు చుర్రుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే రికార్డవుతున్నాయి. ఇవి రానున్న వేసవి తీవ్రతను ఇప్పట్నుంచే తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడపల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా కొన్ని ప్రాంతాల్లో మినహా పలు చోట్ల క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. పెరగనున్న వేసవి తీవ్రత రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండట, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అ«దికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే సాధారణంగా ఫిబ్రవరిలో చిరుజల్లులు కురుస్తూ ఉష్ణతాపాన్ని అదుపు చేస్తాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. గత సంవత్సరానికంటే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడి, లానినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే ఆఖరు వరకు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు -
యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్య
సాక్షి, విశాఖపట్నం: అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ అవకాశాలు సృష్టిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్య విద్యను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విశాఖపట్నంలోని రుషికొండలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 పేరుతో నేషనల్ స్కిల్ కాంక్లేవ్–2024 శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో పర్యటించామన్నారు. గత 30–40 ఏళ్లలో నైపుణ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర యువతలో ఏయే విభాగాల్లో నైపుణ్య కొరత ఉందో.. ఎందులో ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని దానికనుగుణంగా కార్యాచరణ చేపట్టామని వివరించారు. స్థానిక పరిశ్రమల అవసరాలను బట్టి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. సన్‌షైన్ ఏపీ కోసం 26 నైపుణ్య అకాడమీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు కూడా ఉన్నాయన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వీరిలో 50 శాతం మందిని స్థానిక పరిశ్రమల అవసరాల కోసం ఉపయోగించుకోవాలని అన్ని సంస్థలకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. రాష్ట్ర యువత.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా.. నైపుణ్య శిక్షణ అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీ పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పలు సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు.. సదస్సులో భాగంగా.. ఏపీఎస్ఎస్డీసీతో వివిధ సంస్థలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నైపుణ్య శిక్షణకు సంబంధించి 100 మిలియన్ లెర్నర్స్ (అరిజోనా స్టేట్ యూనివర్సిటీ), ట్రస్టెడ్ జాబ్స్, తాత్విక్ బ్యూటీ–వెల్నెస్, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ), ఎక్సెల్ఐఆర్, జీయూవీఐ, హెచ్ఈఆర్ఈ టెక్నాలజీస్, రబ్బర్, కెమికల్, పెట్రో కెమికల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొదలైన సంస్థలతో 6 ఎంవోయూలను ఏపీఎస్ఎస్డీసీ కుదుర్చుకుంది. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కోసం గత ఐదేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన వీడియో ప్రదర్శనకు దేశ, విదేశాల ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీ ‘న్యూస్కిల్’ న్యూస్ లెటర్‌ను మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. ఏపీఎస్ఎస్డీసీకి సహకారం అందిస్తూ ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగయ్యేలా చేస్తున్న బెస్ట్ ప్లేస్మెంట్, సీఎస్ఆర్ పార్టనర్లగా కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్, లలితా జ్యుయెలర్స్ తదితర 13 సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్లీ, సెంట్రల్ ఎంఎస్ఎంఈ బోర్డు సీఈవో సేతు మాధవన్, సీడాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేశ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ నవ్య, పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాల కల్పనలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, హబ్‌లు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తోంది. దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్‌వన్‌కి చేరుకునే అవకాశాలున్నాయి. – డా. వినోద్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో ఏపీ విధానాలు భేష్ నైపుణ్య శిక్షణ కోసం ఏపీలోనూ అవలంబిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఐదు ప్రధాన విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2.7 లక్షల మందికి ఏడాది కాలంలో ఉద్యోగాలు ఇవ్వగలిగాం. – డా. అపూర్వ పాల్కర్, మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ యూనివర్సిటీ వీసీ చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుగ్గన చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. టీడీపీకి ఒక అజెండా, విధానం అంటూ ఏమీ లేవని విమర్శించారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. వీటితో ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ తోక పార్టీ జనసేన సిద్ధాంతం ఏంటో ఆ పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాలు, పేదల సంక్షేమమే వైఎస్సార్సీపీ అజెండా అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని వెల్లడించారు. బీజేపీ, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు విభజన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వైఎస్సార్సీపీ నెరవేరుస్తోందన్నారు. -
AP: 42 శాతం ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం సరికొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తోంది. విస్తరించిన ప్రయోజనాలు, సరికొత్త ఫీచర్లతో కూడిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా వేగంగా సాగుతోంది. ఇప్పటికే 42 శాతం లబ్ధిదారులకు కార్డులు అందాయి. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన 1.43 కోట్ల కుటుంబాలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. వీరికి నూతన కార్డుల పంపిణీ డిసెంబరు నెలలో మొదలైంది. ఇప్పటివరకు 60,43,902 కుటుంబాలకు కార్డులను అందజేశారు. అత్యధికంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 7.16 లక్షల కార్డులు ఉండగా 3.45 లక్షలు, ప్రకాశం జిల్లాలో 6.45 లక్షలకు గాను 2.54 లక్షలు, కాకినాడ జిల్లాలో 4.67లక్షలకు గాను 4.67 లక్షల కార్డుల పంపిణీ పూర్తయింది. కొత్త కార్డులు అందజేయడంతోపాటు పథకం కింద ఉచితంగా పొందే వైద్య సేవలు, వాటిని ఎలా పొందాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్విర్యం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఈ పథకానికి ఊపిరిలూదారు. మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా పని చేసేలా తీర్చిదిద్దారు. గతంలో కేవలం తెల్లరేషన్ కార్డుదారులు మాత్రమే పథకం పరిధిలోకి వస్తుండగా, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను కూడా పథకం పరిధిలోకి తెచ్చారు. అంతేకాకుండా పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. వందలాది చికిత్సలను కొత్తగా ఇందులో చేర్చారు. ఈ తరహా ప్రయోజనాలన్నింటితో కూడిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తోంది. సిటిజెన్ యాప్‌పై అవగాహన కార్డులు పంపిణీ సమయంలోనే ప్రతి కుటుంబానికి పథకం సేవలను సులువుగా ఎలా పొందాలో వివరిస్తూ బ్రోచర్‌ను అందజేస్తున్నారు. పథకం సమగ్ర సమాచారం ఈ బ్రోచర్లో ఉంది. ఇది ప్రజలకు ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లబ్దిదారుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్‌ను ఇన్స్టాల్ చేయిస్తున్నారు. అందులో లాగిన్ అయి ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తున్నారు. వైద్య సేవలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ఉండే నెట్వర్క్ ఆస్పత్రులు, వాటిల్లో ఏ ప్రొసీజర్స్‌కు వైద్యం చేస్తారనే సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఏ ఆస్పత్రి ఉందో కూడా తెలుసుకోవచ్చు. అక్కడకు చేరుకోవడానికి జీపీఆర్ఎస్ సౌకర్యం కూడా ఉంది. ఇక గతంలో పథకం ద్వారా పొందిన చికిత్సలు, రిపోర్ట్‌లను ఒక్క క్లిక్‌తో పొందడానికి వీలుంటుంది. కార్డులో ఉండేవివీ.. ♦ కుటుంబ యజమాని పేరు, జిల్లా, మండలం, గ్రామ/వార్డు సచివాలయం వివరాలు ♦ కుటుంబ సభ్యుల ఫోటోలు, వారి పేర్లు, ఇతర వివరాలు ♦ యూనిక్ హెల్త్ ఐడెంటిటి నంబర్ (యూహెచ్ఐడీ) ♦ క్యూఆర్ కోడ్ (వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆరోగ్యమిత్ర, వైద్యులు సులువుగా కేస్ రిజిస్ట్రే షన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. ♦ దీనివల్ల మరింత వేగంగా, సులభంగా వైద్య సేవలు అందుతాయి) -
విద్యా శాఖలోకి ‘పురపాలక’ టీచర్లు
సాక్షి, అమరావతి: ఎంతోకాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.7, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నం.9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాద్యాయులకు జీవో నం.10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అప్పగించినట్టయింది. గతంలో నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూనిట్‌గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను కూడా పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. -
అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలు
విశాఖ స్పోర్ట్స్ : ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖ వేదికగా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, అధికారులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగురవేసి రాష్ట్ర పర్యాటక, యువజన స ర్విసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర, కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున ఇతర అధికార, రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని, శాప్ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. క్రీడాకారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. శాప్ అధికారులు రూపొందించిన ప్రత్యేక ప్రకటనను చదవటం ద్వారా ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి పోటీలు క్రీడాకారుల కేరింతలు మధ్య విశాఖ రైల్వే మైదానంలో మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం.. అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. యువతలో క్రీడానైపుణ్యాలను పెంపొందించడానికే ఆడుదాం ఆంధ్రా పోటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అనేది అందరి ఆట.. యువతకు భవిష్యత్తుకు బంగారు బాట అని కొనియాడారు. యువ ఆటగాళ్లలో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికితీసే వేట అన్నారు. 15,400 సచివాలయాల పరిధిలోని ఎంతో మందిని ఈ క్రతువులో భాగస్వామ్యం చేశామన్నారు. ఈనెల 13న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజేతలకు వైఎస్సార్ స్టేడియంలో రాష్ట్ర టైటిల్స్ అందిస్తారన్నారు. విజేతలకు ప్రత్యేక శిక్షణ : కలెక్టర్ ఈ క్రీడలకు విశాఖ మహానగరం వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున చెప్పారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులకు ఏసీఏ, ప్రొ కబడ్డీ, బ్లాక్ హాక్స్, శ్రీకాంత్, సింధు బ్యాడ్మింటన్, ఖోఖో అసోసియేషన్ల తరఫున ప్రత్యేక శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డీసీసీబీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేసీ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్, జాతీయ క్రికెటర్ శ్రీకర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి: బైరెడ్డి ‘ఆడుదాం–ఆంధ్ర’ వేదికగా క్రీడాకారులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆకాంక్షించారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని.. కష్టం విలువ తెలుసుకున్న రోజు విజయాలు వాటంతట అవే వస్తాయని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రీడల కోసం రూ.130 కోట్లు ఖర్చుపెట్టి గ్రామస్థాయి నుంచే పత్రిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేలా పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం.. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే ‘ఆడుదాం ఆంధ్రా’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర చెప్పారు. ఇక ఇప్పటివరకు జరిగిన క్రీడల్లో విజేతలకు రూ.12 కోట్లతో బహుమతులు అందజేశామని, రాష్ట్రస్థాయి విజేతలకు రూ.87 లక్షలతో బహుమతులు అందజేయనున్నామన్నారు. ఆ బకాయిలు, ఆస్తులను రాబట్టండి.. షర్మిలకు మంత్రి రోజా సూచన అనంతరం.. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావల్సిన రూ.ఆరువేల కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఏపీకి రావల్సిన రూ.లక్షా 80వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల రాబట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి అక్కడ నేతలను ఆమె నిండా ముంచారని, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో ఎందుకు పోరాటం చేస్తున్నారో షర్మిల చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు అమిత్ షా కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయంగా చంద్రబాబు రోజురోజుకి దిగజారిపోతున్నాడని రోజా ధ్వజమెత్తారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ కిట్లపై స్పందిస్తూ.. వాటిపై సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటో వేస్తే తప్పేంటని.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో వేయాలా అంటూ ప్రశ్నించారు. -
సామాజికరంగ వ్యయం రూ.3.06 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) అకౌంట్స్ నివేదిక–2022–23 స్పష్టం చేసింది. గత నాలుగేళ్ల నుంచి ఏటా సామాజిక రంగ వ్యయం పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని వెల్లడించింది. గత నాలుగేళ్లలో సామాజిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3.06 లక్షల కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. విద్య, వైద్య ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, తాగునీరు, పారిశుధ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ది, కార్మిక ఉపాధి, సంక్షేమం, సామాజిక భద్రతలను సామాజిక రంగంగా పరిగణిస్తారు. విద్య, వైద్య రంగాలకు, పౌష్టికాహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ రంగాలపై ఎక్కువ ఖర్చు చేసినట్టు కాగ్ అకౌంట్స్ నివేదిక తెలిపింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాల్లోని పేదల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాజిక రంగం వ్యయం ఏటా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే కార్మికుల సంక్షేమంతో పాటు తాగునీటి సరఫరాకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.