AP Special
-
AP: రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించింది. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది వీటిలో పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితమవడంతో స్టార్టప్‌లలో రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం దానికి భిన్నంగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
Fact check: బాబు కోసమేగా ‘హైవే’దన రామోజీ?
పచ్చపైత్యం ప్రకోపించడంతో మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు కథనాలతో జనాన్ని నమ్మించేందుకు వికృత రాతలతో పేట్రేగిపోతున్నారు. చేతిలో ఈనాడు పత్రిక ఉందని వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న రామోజీ అడ్డగోలు కథనాలు అచ్చేయిస్తున్నారు. ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేసేందుకు ప్రతి అంశాన్నీ ఆయుధంగా మలచుకుంటున్నారు. జాతీయ రహదారులపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఓ కథనాన్ని వండేశారు. కానీ వారికి తెలియందేంటంటే... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలోనే జాతీయ రహదారుల నిర్మాణం జోరుగా సాగింది. అంతేగాదు... కొత్త జాతీయ రహదారుల పనులు కూడా ప్రజల కళ్లకు కనపడుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పాదనలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఏకంగా రూ.71, 200కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనం. ఆ నిధులతో ఏకంగా 3,770 కి.మీ.మేర జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.40వేల కోట్లు 2022–23లోనే మంజూరు చేశా రు. ఇక జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కేవలం ఏడాదిలోనే 6,933 హెక్టార్ల భూమిని సేకరించి ఇచ్చింది. అందులో ప్రభుత్వ భూమి 1,571 హెక్టార్లు కాగా ప్రైవేటు భూమి 5,362 హెక్టార్లు. బాబు చేతులెత్తేస్తే జగన్ పూర్తి చేశారు ► చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.13,353 కోట్లు వెచ్చించగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ.25,304 కోట్లు ఖర్చు చేసింది. ► గత ప్రభుత్వం నిర్మించకుండా చేతులెత్తేసిన విజయవాడలోని బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓ వర్, కనకదుర్గ ఫ్లైఓవర్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపేసిన విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణాన్ని కూడా తుది దశ కు తీసుకువచ్చింది ఈ ప్రభుత్వమే. ► గొండిగొలను నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ► విజయవాడ నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు తూర్పు బైపాస్ నిర్మాణానికి ఆమోదించేలా కేంద్రాన్ని ఒప్పించింది. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ► 2022–23లో కొండమోడు – పేరేచర్ల మధ్య జాతీయ రహదారిని రూ.1,032.52 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. కానీ దేశవ్యాప్తంగా భారత్ మాల ప్రాజెక్టుల కింద మంజూరైన ప్రాజెక్ట్‌లను తదుపరి ఉత్తర్వుల వరకు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 18న ఆదేశించింది. దాంతో టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చినప్పటికీ కాంట్రాక్టును ఖరారు చేయలేదు. ► 2021–22లో ముద్దనూరు–బి.కొత్తపల్లి రహదారిని రూ.1,020కోట్లతో మంజూరు చేశారు. ఆ ప్రాజెక్ట్ టెండరు ప్రక్రియ తుదిదశలో ఉంది. ► 2022–23 వార్షిక ప్రణాళికలో మొత్తం 450 కి. మీ. మేర 9 రహదారుల నిర్మాణానికి రూ.7,807 కోట్లతో ఆమోదించగా అందులో మూడు ప్రాజెక్ట్‌లకు ఎల్వోఏ మంజూరు చేయగా మిగిలిన ఆరు ప్రాజెక్ట్‌లు టెండరు దశలో ఉన్నాయి. ► 2023 నవంబర్ 10న కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కెబినెట్ సబ్‌కమిటీ అనుమతి వచ్చే వరకు దేశంలో భారత మాల కింద కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. అనంతరం 2017 తరువాత ఆమోదించిన భారత మాల ప్రాజెక్ట్‌లను 20శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించకూడదని మరో నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్‌ల టెండర్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఈనాడు రామోజీరావు వక్రబుద్ధికి నిదర్శనం. -
సొంతంగా చీరలు నేస్తున్నా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సొంతంగా చీరలు నేస్తున్నా.. నా భర్త మహదేవ్ టైలరింగ్ చేస్తారు. రోజుకు రూ.500 నుంచి 600 ఆదాయం వస్తుంది. ఇద్దరు పిల్లలు. సౌమ్య, స్వామి సమర్థ. అమ్మాయి కాలం చేసింది. స్వామి సమర్థ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంటి అద్దె రూ.2,800 చెల్లిస్తున్నాం. ఒకరి ఆదాయంతో ఇల్లు నడపడం కష్టంగా ఉండేది. దాంతో చీరలు నేసే కూలి పనికి వెళ్లేదాన్ని. రోజుకు రూ.200 ఇచ్చేవారు. మా ఆయన ఆదాయానికి నా కూలి తోడవడంతో కొన్ని ఇబ్బందులు తొలిగిపోయాయి. మా వృత్తి చీరలు నేయడం. ఇంట్లో మగ్గం ఉన్నా నేయడానికి అవసరమైన పరికరాలు లేవు. వీటిని కొనుగోలు చేయాలంటే కనీసం రూ.30 వేలు ఉండాలి. ముడి సరుకు కొనాలన్నా రూ.30 నుంచి 40 వేలు ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం కింద ప్రతి ఏటా రూ.24,000 మంజూరు చేస్తున్నారు. ఈ సొమ్ముతో మగ్గం పరికరాలు, ముడి సరుకులు సమకూర్చుకున్నాం. ఇంటి పనులయ్యాక తీరిక సమయంలో చీరలు నేస్తుంటాను. ఒక్కో చీరపై ఖర్చులు పోను రూ.400 నుంచి 500 వస్తుంది. పొదుపు సంఘంలో ఉండడంతో రూ.10 వేలు రుణం అందింది. అబ్బాయికి ఏటా అమ్మ ఒడి పథకం కింద రూ.15,000 పడుతోంది. దీంతో పిల్లాడి చదువు బెంగ తీరింది. ఈ ప్రభుత్వం అందించిన సహకారంతో నలుగురిలో గౌరవంగా బతుకుతున్నాం. – కామ్లె సరోజమ్మ, ఆదోని (ఇ.సుంకన్న, విలేకరి, ఆదోని) నాకు ప్రాణభిక్ష పెట్టారు మా అమ్మా నాన్నలు పాప, యల్లావుల శ్రీను.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీలోని పల్లెపాలెం గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మేము ముగ్గురం అమ్మాయిలమే. నేను రెండో కుమార్తెను. 2022లో పదో తరగతి చదువుతున్న సమయంలో నాకు కాలేయ సంబంధిత వ్యాధి వచ్చింది. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వైద్యం చేయాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో నాకు వచ్చిన వ్యాధి పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాం. సీఎం కార్యాలయం అధికారులు నాకు రూ.10 లక్షలు ముఖ్యమంత్రి తక్షణ సహాయ నిధి నుంచి మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో నాకు కాలేయానికి సంబంధించిన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది. సీఎం జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని నేను సకాలంలో వైద్యం చేయించుకోగలిగాను. నాకు ప్రాణభిక్ష పెట్టిన మావయ్యగా జగన్ ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతారు. ప్రస్తుతం నేను ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. నాకు ప్రతి ఏటా అమ్మ ఒడి పథకం కింద నిధులు మంజూరయ్యాయి. మా అమ్మకు వైఎస్సార్ ఆసరా కింద డబ్బులు రావడంతో అప్పులు చేయకుండానే కుటుంబం గడుస్తోంది. పెదగంజాం జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా ప్రభుత్వం కేటాయించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – యల్లావుల మేఘన, పెదగంజాం (పల్లపోలు శ్రీనివాసరావు, విలేకరి, చినగంజాం) నా షాపు ఆదాయం పెరిగింది నేను బార్బర్ పని చేస్తుంటా. పార్వతీపురం పట్టణంలో ఓ చిన్న సెలూన్ షాపు పెట్టుకుని దానిపై వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడిని. గత టీడీపీ ప్రభుత్వం మా లాంటి కులవృత్తిదారుల కష్టాలు పట్టించుకునేది కాదు. కనీసం మా వైపు కన్నెత్తి చూసేది కాదు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక చేదోడు పథకం కింద ఏటా రూ.10 వేలు ఇస్తుండటంతో షాపును ఆధునికంగా తీర్చిదిద్దాను. దీంతో కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఆదాయం వస్తోంది. మా నాన్న కూర్మారావుకు వైఎస్సార్ పింఛన్ కానుక కింద నెలకు రూ.3 వేలు అందుతోంది. మా అమ్మ లక్ష్మమ్మకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున మూడు విడతల్లో 56,250 అందింది. అమ్మ పేరున జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయంతో పాటు నిర్మాణ సామగ్రిని రాయితీపై సమకూర్చింది. ఇసుక ఉచితంగా అందిస్తోంది. ఇదంతా జగనన్న దయ. ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. – అలజంగి రవికుమార్, పార్వతీపురం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం టౌన్) -
విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్‌లో జరగనుంది. ఈ ముంగిపు పోటీల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించన్నారు. ఇక.. విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షలు చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో 5 కేటగిరీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మరోవైపు.. రేపటి(శుక్రవారం) నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో అయిదు చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కమిషనర్ పకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
YSRCP: రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. కాగా, రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్సీపీ తాజాగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరుగనుంది. అనంతరం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి అభినందించారు. మేడా రఘనాథరెడ్డి నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లెకు చెందినవారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మేడా రామకృష్ణారెడ్డికి ముగ్గురు కుమారులలో రెండవ కుమారుడు మేడా రఘునాధరెడ్డి. మొదటి కుమారుడు సిట్టింగ్ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. మేడా రఘనాథరెడ్డి అదే మండలంలోని టంగుటూరులో విద్యాభ్యాసం పూర్తిచేశారు. డిగ్రి పూర్తైన వెంటనే 20 ఏళ్ల వయస్సులోనే బెంగుళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో MRKR కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలొనే కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి -
మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ ల్యాండ్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు. రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాల అనుసంధానం భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్ట్ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వైద్య విద్య బలోపేతం ♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. అత్యున్నత విద్యాలయాలు ♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో సెంట్రల్ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్ కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ కర్నూలులో క్లస్టర్ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. పోలవరం పురోగమనం ♦ 2019మే నాటికి 42 శాతం హెడ్ వర్క్‌లు 70 శాతానికి చేరిక ♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్ గేట్ల ఏర్పాటు. ♦ గతేడాది నవంబర్ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్ ప్రారంభం. ♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్ త్వరలో పూర్తి. ♦ గతేడాది సెపె్టంబర్ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రారంభం. ♦ 2022 సెపె్టంబర్ 6వ తేదీన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం. ♦ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతి. పారిశ్రామిక పరుగులు ♦ 2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు ♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు ♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్íÙప్ల ఏర్పాటు ♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం -
ఇదిగో.. సామర్థ్య ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం. –సాక్షి, అమరావతి ‘విద్య’యీ భవ పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్ సరి్టఫికేషన్ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తోంది. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు, బ్యాగ్‌లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. రెడీ టు వర్క్ విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్‌లు, క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్‌లను అభివృద్ధి చేసింది. ఉన్నతంగా విద్య జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది. ఇంటర్న్‌షిప్ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది. ప్రొసీజర్స్‌ను పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది. కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం. గోరుముద్దతో ఆరోగ్యం.. ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. సామర్ధ్యాంధ్ర కేటాయింపులు రూ. 53,508.04 కోట్లు సాధారణ విద్య రూ.33,898.04 కోట్లు వైద్య రంగంరూ.17,916.67 కోట్లు సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు -
చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది. – సాక్షి, అమరావతి మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మహిళా సాధికారత కోసం.. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్ – చైల్డ్ బేస్డ్ బడ్జెట్లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది. సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్ యాప్, దిశ పెట్రోల్ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
సంక్షేమ వెలుగులు ధగధగ
సాక్షి, అమరావతి: సంక్షేమ ఆంధ్రను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం రూ.44,668 కోట్లు కేటాయించింది. ఇందులో బీసీ సంక్షేమానికి రూ.29,001.31 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.9,291.55 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.4,133.73 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,242.36 కోట్లు కేటాయించడం విశేషం. సంక్షేమంతోపాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి రూ.7,062 కోట్లు కేటాయించింది. పేదరికంపై యుద్ధం చేసి ప్రజలను గెలిపించేలా.. దృఢమైన సామాజిక భద్రతా వలయంగా సంక్షేమ అ్రస్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. వివక్ష లేని సంక్షేమంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని వారి గడప వద్దకే చేర్చింది. అట్టడుగు వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలతో వారికి ఎంతో మేలు చేసింది. ఫలితంగా ప్రజల స్థితిగతులు మారడంతో సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణం, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో అందించిన సంక్షేమంతో సాధించిన అద్భుత ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‘సంక్షేమ ఆంధ్ర’ థీమ్‌తో అసెంబ్లీలోవెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద మనస్సుతో పేదలకు భరోసా ♦ వైఎస్సార్ బీమా కింద 49,000 కుటుంబాలకు రూ.650 కోట్లు ♦ అగ్ర వర్ణాల కోసం ప్రత్యేక విభాగం (కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ వర్గాల్లో కోటి 15 లక్షల మందికి రూ.36,321 కోట్లు ♦ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1,257 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కింద 77 లక్షల మందికి రూ. 39,247 కోట్లు ♦ వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.983 కోట్లు ♦ జగనన్న తోడు కింద 16.73 లక్షల మందికి రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు ♦ వైఎస్సార్ వాహన మిత్ర కింద 2.78 లక్షల మందికి రూ.1,305 కోట్లు ♦ వైఎస్సార్ లా నేస్తం కింద 6,069 మందికి నెలకు రూ.5 వేలు చొప్పున భృతి ♦ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 46,329 మందికి రూ.350 కోట్లు ♦ ఉపాధి హామీ పథకం కింద 2,141 లక్షల పని దినాల ద్వారా 45 లక్షల కుటుంబాల్లోని 72 లక్షల మందికి చెల్లింపులు ♦ అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం 2,19,763 ఎకరాలకు 1,29,842 మంది గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు పంపిణీ. 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ. ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ నెలకు 100 యూనిట్ల నుంచి∙200 యూనిట్లకు పెంపు. కాఫీ తోటల పరిధి విస్తరణ. గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ సహకారం. ♦ వెనుకబడిన కులాల(బీసీ)ల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు. కోటి 2 లక్షల మందికి రూ.71,740 కోట్ల లబ్ధి. ♦ 2023–24లో దాదాపు 5 వేల మంది మైనారీ్టలకు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ. ఇమామ్‌లకు అందించే సహాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. 4,983 మందికి ప్రయోజనం. మోజన్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు. 4,983 మందికి మేలు. ♦ 2021–22 నుంచి 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం. 2023 నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి రూ.80 వేలు చొప్పున 1,756 మందికి లబ్ధి. 2019 నుండి 1,178 మంది యాత్రికులు జెరూసలేం వెళ్లడానికి రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం. ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ. తద్వారా 200 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ప్రీమియర్ కళాశాలలలో ప్రవేశం. ‘కెన్నెడీ లుగర్–యూత్ ఎక్సే్ఛంజ్’ కార్యక్రమం, విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమాలకు ఎనిమిది మంది విద్యార్థులకు అవకాశం. 2023 సెపె్టంబర్లో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. నగదు బదిలీ ♦ రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి 4,63,697 ఇళ్లు మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.1.53 లక్షల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ప్రతి లబ్ధిదారుని ఇంటి ఖర్చుకు రూ.లక్షా 80 వేలు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి రూ.6.90 లక్షల చొప్పున (మొత్తంగా రూ.22,909 కోట్లు) వెచ్చిస్తోంది. ఫలితంగా 22 లక్షల ఇళ్లలో దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. ♦ అవినీతి, అవకతవకలకు అవకాశం లేకుండా అర్హతే ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో, ఇతరత్రా ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అవిశ్రాంతంగా పనిచేసిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రభుత్వం అభినందించింది. ♦ 2019లో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031తో దేశంలో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం అది రూ.2,19,518తో 9వ ర్యాంకుకు ఎగబాకింది. ♦ వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. 2019లో పింఛన్ల మొత్తం నెలకు రూ.1,385 కోట్లు ఉండగా, జనవరి నెల నాటికి అది రూ.1,968 కోట్లకు పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలక్షల మందికి రూ.84,731 కోట్లు అందించింది. ♦ ప్రజల ఇంటి ముంగిటికే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో 9,260 సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వేతన కార్మికులకు ఎంతో ఊరట కలిగింది. ఈ వాహనాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఉపాధి లభించింది. సబ్సిడీ బియ్యం కోసం గత ప్రభుత్వం రూ.14,256 కోట్లు, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.29,628 కోట్లు ఖర్చు చేసింది. -
భూ హక్కులకు భద్రత
సాక్షి, అమరావతి: భద్రమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంస్కరణలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఐదేళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డుల్లో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాలవల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కారు సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడుల్ని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ♦ నూతన పింఛను పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయ పింఛను పథకంగా ఇది ఉంది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించింది. ♦ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన (రీసర్వే) చేయడం కోసం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్ స్టేషన్ల (సీఓఆర్ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీ సర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది. ♦ ఇప్పటివరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ♦ 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్పడ్డాయి. 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమిలేని దళితుల భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధిపొందారు. భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట.. ♦మా ప్రభుత్వం ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్డీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటుచేశాం. ♦ 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం. ♦ ఆశ్కా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాల్టీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్‌కి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, మెప్మాకు చెందిన రీసోర్స్ పర్సన్లు, హోమ్‌గార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్‌ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్‌కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
సొంతింటి కల నెరవేరింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సొంతింటి కల నెరవేరింది కూలి పని చేసుకొని బతుకు బండి లాగుతున్నాం. తద్వారా వచ్చిన డబ్బుల్లో సగం అద్దెలు కట్టేందుకే సరిపోయేది. ఇక సొంతిల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నాం. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. బతుకుతెరువు కోసం 20 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లా జె.పంగులూరుకు వలస వచ్చాం. నా భర్త సుబానీ ఆటో అద్దెకు తీసుకుని నడుపుతుంటారు. నేను టైలరింగ్ చేస్తాను. మాకు ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేకపోవడంతో 15 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లోనే ఉన్నాం. ఇద్దరం సంపాదించిన డబ్బుతో కుటుంబం గడవడమే కష్టంగా ఉండేది. ఇంటి అద్దె కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చేది. పస్తులుండి అద్దెలు కట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వం మా కష్టాలను పట్టించుకోలేదు. ప్రజా ప్రతినిధులూ కన్నెత్తి చూడలేదు. కష్టాలతో సహవాసం చేస్తున్న సమయంలో వైఎస్సార్ïÜపీ ప్రభుత్వం వచ్చింది. నవరత్నాల్లో భాగంగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగానే వలంటీరు వచ్చి స్థలం వచ్చిందని చెప్పాడు. మా సంతోషానికి ఎల్లలు లేవు. ఇల్లు కూడా మంజూరు కావడంతో ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందించింది. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం. కాలనీలో మొట్టమొదటి ఇల్లు మాదే. ఇప్పుడు అందులోనే పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నాం. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరింది. మా అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. మూడేళ్లు అమ్మ ఒడి కింద రూ.45 వేలు రావడంతో అమ్మాయి చదువు కోసం ఎటువంటి ఇబ్బంది పడలేదు. మాకు ఇప్పుడు ఏ చీకుచింతా లేదు. – షేక్ నన్నేబీ, జె.పంగులూరు (అడుసుమల్లి సోమ శ్రీనివాసరావు, విలేకరి, అద్దంకి) ఉపాధికి ఆసరా తోడైంది మాది చాలా పేద కుటుంబం. నా భర్త షేక్ అబ్దుల్లా కార్ డ్రైవర్. నేను గుంటూరు జిల్లా తెనాలిలో ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటా. ఇద్దరి కష్టంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబం గడిచేది. మాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సానియా రుక్సానా అయిదో తరగతి, చిన్న కూతురు ముస్కాన్ నాలుగో తరగతి చదువుతున్నారు. మా అమ్మ కూడా మాతోనే కలిసి ఉంటోంది. అయిదుగురు సభ్యుల కుటుంబం. మా సంపాదనతో రోజూ జీవనం గడవటమే కష్టంగా ఉండేది. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించగలమా? అన్న ఆందోళనతో ఉండేవాళ్లం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా జీవితం మారిపోయింది. వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగు విడతలుగా రూ.48 వేలు వచ్చాయి. ఇదే పథకం కింద మా అమ్మకు కూడా రూ.48 వేలు వచ్చింది. ఇద్దరికీ కలిపి ప్రభుత్వం రూ.96 వేలు మా ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున అందుతోంది. ఆ డబ్బుతో నాకున్న సాధారణ కుట్టుమెషీన్ అమ్మేసి, అధునాతన మెషీన్ కొనుక్కున్నా. నూతన మోడల్స్‌తో విభిన్నంగా మహిళల వస్త్రాలు కుడుతుండడంతో పనులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనికితోడు టైలరింగ్ మెటీరియల్ కూడా విక్రయిస్తున్నా. ఇప్పుడు నా ఆదాయం పెరిగింది. త్వరలోనే మెయిన్‌బజార్‌లో టైలరింగ్ దుకాణం ప్రారంభించాలని సన్నాహాలు చేసుకుంటున్నా. పెద్దమ్మాయికి అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. దానివల్ల పిల్లల్ని ఇబ్బంది లేకుండా చదివించుకోగలుగుతున్నాం. గతంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా పరిస్థితి మెరుగు పడింది. ఇందుకు కారకులైన జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – షేక్ ఫాతిమున్నీసా, తెనాలి(బి.ఎల్.నారాయణ, విలేకరి, తెనాలి) ఆరోగ్యశ్రీతో పునర్జన్మ నేను వెల్డింగ్ పని చేస్తూంటా. రోజూ పనికెళ్తేనే మాకు పూట గడిచేది. ఏలూరు జిల్లా మండవల్లి గ్రామంలో భార్య నాంచారమ్మ, ఇద్దరు పిల్లలనూ అరకొర ఆదాయంతోనే పోషించుకుంటున్నా. గత ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. అతి కష్టంగా జీవనం సాగించాల్సి వచ్చింది. అంతలో ఓ రోజు నాకు అనారోగ్యం చేసింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే నా గుండెకు స్టంట్లు వేయాలని డాక్టర్లు చెప్పారు. రోజంతా కష్టపడితే వచ్చిన మొత్తం కుటుంబ పోషణకే సరిపోతుంది. స్టంట్లు వేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. ఇంతలో మా ఏఎన్ఎం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని చెప్పింది. వెంటనే విజయవాడలోని సెంటిని ఆస్పత్రిలో చేరగా 2022 ఆగస్టు 23న గుండెకు రెండు స్టంట్లు వేశారు. దీనికైన ఖర్చు రూ.3 లక్షలు మొత్తం ప్రభుత్వమే భరించింది. ప్రభుత్వం నాకు పునర్జన్మ ప్రసాదించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నా భార్యకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18 వేలు వంతున అందింది. నాకు వైఎస్సార్ పింఛను కానుక కింద నెలకు రూ.3 వేలు ఒకటో తేదీనే వలంటీరు ఇంటికొచ్చి ఇస్తోంది. నా మనుమరాలు 8వ తరగతి చదువుతోంది. తనకు అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.13 వేలు వస్తోంది. మా కోడలికి ఆసరా ద్వారా ఏటా రూ.14 వేలు వచ్చింది. మా కుటుంబానికి ఇంత మేలు చేస్తున్న జగన్ మేలు ఎన్నటికీ మరువలేము. – బోయిన నారాయణరావు, మండవల్లి (బోగాది వెంకట వీరాంజనేయులు, మండవల్లి) -
మా బతుకులకు భరోసా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులకు భరోసా బతుకు తెరువు కోసం వలస వచ్చిన జీవితాలు మావి. నెల్లూరు జిల్లా జలదంకి మండలం శ్యామాదల గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకుని 2015లో కడపకు వచ్చాం. మా ఆయన వేణుగోపాల్‌రెడ్డి కడప నగరంలో ఆటో నడుపుతారు. నేను కుట్టు మెషీన్‌పై దర్జీ పని చేస్తాను. మాకు రమాశ్రీ రెడ్డి, లక్ష్మీశ్రీ రెడ్డి అనే ఇద్దరు కవల పిల్లలు. 8వ తరగతి చదువుతున్నారు. మా అరకొర సంపాదనతోనే ఇంటి అద్దె చెల్లిస్తూ, ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ అతి కష్టంగా బతుకు వెళ్లదీస్తున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా బతుకులకు భరోసా కలిగింది. కడప నగర శివారు ఆచార్య కాలనీ వద్దనున్న జగనన్న కాలనీలో సెంటున్నర స్థలాన్నిచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేశారు. ప్రస్తుతం శ్లాబ్ వేశాం. దీనికి సంబంధించి బిల్లులు కూడా చెల్లించారు. వీలైనంత వేగంగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. మాలాంటి మధ్య తరగతి వారు అరకొర సంపాదనతో సొంతింటి కల నెరవేర్చుకోవడం జీవితంలో జరిగే పని కాదు. జగనన్న పుణ్యమా అని మా సొంతింటి కల నేరవేరబోతోంది. చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి రమాశ్రీ రెడ్డికి ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేలు వస్తోంది. డ్వాక్రా రుణ మాఫీ ద్వారా నాకు రూ.4,200 లబ్ధి చేకూరింది. జగనన్న చేదోడులో ఏటా రూ.10 వేలు చొప్పున మూడేళ్లలో రూ.30 వేలు నా బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఆరోగ్యశ్రీలో నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ జరిగింది. ఇందుకు ప్రభుత్వం రూ.30 వేలు ఆస్పత్రికి చెల్లించింది. వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో నా భర్తకు నాలుగేళ్లలో రూ.40 వేలు లబ్ధి చేకూరింది. మేం ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే ఈ ప్రభుత్వమే కారణం. – చిలకల లక్ష్మీప్రసన్న, కడప (గోసల యల్లారెడ్డి, విలేకరి, కడప) పక్క ఊరిలోనే ఉద్యోగావకాశం మాది సామాన్య వ్యవసాయ కుటుంబం. ఎంతో కష్టపడి మా నాన్న నన్ను బీఎస్సీ నర్సింగ్ చదివించారు. ఆ చదువు పూర్తయ్యాక ఎప్పుడు ఉద్యోగం వస్తుందో.. ఎంత దూరంలో వస్తుందోనని ఆందోళన చెందాను. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేసిన ‘వైఎస్సార్ విలేజ్ క్లీనిక్’ వ్యవస్థ వల్ల శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నరసింగపల్లి పక్కనున్న గూడేం గ్రామంలో ఎంఎల్‌హెచ్‌పీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) ఉద్యోగం వచ్చింది. 2022 ఫిబ్రవరిలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. మే నెలలో ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు జిల్లాలు దాటి ఉద్యోగావకాశాల కోసం వెళ్లాల్సి వచ్చేది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వ్యవస్థతో మా గ్రామం పక్కనే ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా జీతం మా కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చగలుగుతోంది. ఇలాంటి వ్యవస్థ వల్ల నాలాంటి ఎంతో మంది యువతకు సొంత మండలంలోనే ఉద్యోగాలు వస్తున్నాయి. – సింగుపురం ఈశ్వరి, గూడేం (లింగూడు వెంకటరమణ, విలేకరి, టెక్కలి) ‘మెట్ట’నింట జలకళ మాది వ్యవసాయ కుటుంబం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జలపవారిగూడెంలో మాకున్న సుమారు మూడు ఎకరాల భూమిలో మా బంధువైన నక్క డేవిడ్, నేను కలిసి వైఎస్సార్ జలకళ పథకం ద్వారా ఉచితంగా బోరు వేయించుకున్నాం. ఇప్పుడు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నాం. కొంత మంది టీడీపీ నాయకులు ప్రభుత్వం అందించిన 10 హెచ్‌పీ మోటార్ మెట్ట ప్రాంతానికి ఎలా సరిపోతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రైతులను మోసం చేయడానికి ఈ పథకం పెట్టిందని, ఇది దండగని ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ ఇప్పుడు మోటార్ నుంచి మూడు అంగుళాల నీళ్లు పోస్తుంటే, నవ్వినోళ్లే అవాక్కవుతున్నారు. మా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. మా కష్టాలు తీరాయి. దీంతోపాటు నాకు రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.13,500 అందడంతోపాటు, నా భార్యకు డ్వాక్రా ద్వారా సున్నా వడ్డీ లబ్ధి చేకూరింది. గత టీడీపీ ప్రభుత్వంలో మాకు ఎటువంటి సహాయం అందలేదు. మా కుటుంబానికి మేలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – నక్కా దుర్గయ్య, జలపవారిగూడెం (యు.లక్ష్మీనారాయణ, విలేకరి, కామవరపుకోట) -
fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు..
కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల శాఖ ఇంజినీర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది చూసిన పచ్చ పత్రిక ఈనాడు తట్టుకోలేక నీటి తడులపై తప్పుడు కథనాన్ని ప్రచురించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కేసీ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం, కర్షకులు ఆనందంగా ఉండడాన్ని ఓర్వలేని రామోజీ తన అక్కసు వెళ్లగక్కారు. శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారంటూ కి‘రాత’కానికి దిగారు. కర్నూలు సిటీ/ఆళ్లగడ్డ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు కేసీ కెనాల్ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. సాగు నీటి సలహా మండలి సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఆ మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులూ ఆరుతడి పంటలను సాగు చేశారు. ఆ తరువాత సెప్టెంబరు, నవంబరు నెల చివరి వారాల్లో కొంత మేర వర్షాలు పడ్డాయి. దీంతో నవంబరు నెల 25న మరోసారి సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్‌కు డిసెంబరు 15 వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. రైతులు కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు. దీంతో నంద్యాల కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రీపగలు కెనాల్‌పై గస్తీ కాసి ప్రతి ఎకరాకూ నీరు అందించారు. మంచి దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. జలవనరుల శాఖ ఇంజినీర్లను సన్మానిస్తున్నారు. అన్నీ తప్పుడు రాతలే రామోజీ పచ్చ పత్రిక బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని కథనం వండివార్చింది. ఇదంతా అవాస్తవం. కేసీ కెనాల్ పరిధిలో మిరప సాగుచేసిన రైతుల్లో బడా రైతులు లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలు ఉంది. మిగిలిన వారందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ అనధికారికంగా 20 వేల ఎకరాల్లో సాగు చేశారంటూ తప్పుడు గణాంకాలు ప్రచురించింది. ఇకపోతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్‌కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతోనే ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటుంటే ఈనాడు తప్పుడు రాతలు రాసింది. ‘‘నీటి కేటాయింపులు లేవు. రైతులకు నీరు ఎలా ఇస్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందనేలా విషపు కథనాన్ని కక్కింది. రైతుల నుంచి వసూళ్ళు చేసిన సొమ్ము రాష్ట్ర స్థాయి అధికారికి చేరిందంటూ అవాస్తవాలతో పైత్యం ఒలకబోసింది. దీనిపై ఇంజినీరింగ్ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ముమ్మాటికీ తప్పుడు కథనమే ఉయ్యాలవాడ: శ్రీశైలం నుంచి ఎస్సార్బీసీ కేసీ కెనాల్‌కు వచ్చే సాగు నీటికి రైతులు డబ్బులు ఇచ్చారని ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్ డైరెక్టర్ గజ్జెల క్రిష్ణారెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి రైతులతో కలిసి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సాగునీటి జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించారని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై రైతులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈనాడుది తప్పుడు కథనం కేసీ కెనాల్ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో 97 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆగస్టు, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన ఐఏబీ సమావేశాల్లో డిసెంబర్ 15 వరకు నీటిని అందించాలని తీర్మానం జరిగింది. రైతుల విన్నపం మేరకు శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం. ముచ్చుమర్రి ద్వారా వారాబందీ ప్రకారం రాత్రి, పగలు గస్తీకాసి నీరు అందిస్తుంటే ఇంజినీర్లు డబ్బులు వసూలు చేశారంటూ తప్పుడు కథనం రాయడం బాధాకరం. – వి.తిరుమలేశ్వర రెడ్డి, కేసీ ఈఈ సాగునీరు కొనుక్కొనే దుస్థితి లేదు సాగునీటి కోసం అధికారులకు లంచాలిచ్చి కొనుక్కొనే దుస్థితి రైతుకు దాపురించలేదు. వర్షాభావంలోనూ మా పంటలకు నీరు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చి పంటలు పండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా కుంటలను నింపుకునేందుకు కేసీ కెనాల్‌కి నీరు వదిలారు. – రామాంజనేయరెడ్డి, రైతు, గుండుపాపల చివరి పంటలకు సాగునీరు ఇచ్చారు ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే జలాశయాల్లో నీరు అంతంత మాత్రమే. అయినా మా పంటలు ఎండకూడదనే ఉద్దేశంతోనే వారాబందీగా నీరు అందించారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందింది. – వాసుడు, రైతు, చాకరాజువేముల -
Fact Check: గుంతలు కాదు..రామోజీ కళ్లకు గంతలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు రామోజీరావు పైత్యం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలో రోడ్లపై పదే పదే కట్టుకథలను కొత్తగా వండివారుస్తున్నాడు. రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నా సరే... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ గుంతల పేరిట కొత్త కథ వినిపించారు. చంద్రబాబుకు రాజకీయంగా పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆక్రోషం కట్టలు తెంచుకుని రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతూ దిగజారుడు పాత్రికేయం చేస్తున్నారు. పాత ఘటనలకు కొత్తగా రంగులద్దుతూ బాబుకు మేలు చేసేందుకు జాకీ లెత్తుతున్నారు. రాష్ట్రంలో 99 శాతం బాగున్న రోడ్లను చూడకుండా.. రంధ్రాన్వేషణకు పాల్పడుతూ ఎక్కడో ఒక చోట రోడ్డు కాస్త దెబ్బతిన్న ఫొటోలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి మొత్తం రూ.23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ఈ నాలుగేళ్లలోనే ఏకంగా రూ.42,236.28 కోట్లు వెచ్చించారు. ‘పచ్చ’ కామెర్లు కమ్మేసిన రామోజీ కళ్లకు ఈ నిజం ఎందుకు కనిపించలేదన్నది ఎవరికి తెలియదు?. బాబు పాలనలో 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల మరమ్మతులకు కేవలం రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం( 2023–24) తొలి నాలుగు నెలల్లోనే రూ.346 కోట్లు ఖర్చుపెట్టింది. రోడ్ల అభివృద్ధి సెస్ ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులు తీర్చడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్ ద్వారా వచ్చిన మరో రూ.2 వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది. ఈనాడు దుష్ప్రచారం: పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన బత్తిన ఆనంద్ గతేడాది అక్టోబర్ 20న పిడుగురాళ్ల మండలం జూలకల్లు అడ్డరోడ్డు వద్ద తెల్లవారుజామున బైక్‌పై వెళ్తూ గుంతలో పడి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని మరణించాడు. వాస్తవం: ఆ రోడ్డుపై ఎలాంటి గుంతలు లేవు. రైతులు తమ పొలాలకు నీటి కోసం రోడ్డు తవ్వి మట్టితో పూడ్చారు. అదే సమయంలో ఆనంద్ భార్య ఆస్పత్రి ఖర్చుల కోసం ఇంటి నుంచి నగదు తీసుకొని వేగంగా వెళ్తూ అక్కడికి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎదురుగా ఏ వాహనం ఢీకొనలేదు. ఈనాడులో రాసినట్టుగా ఆయన భార్య బైక్‌పై లేదు. వెంటనే ఆర్ అండ్ బీ అ«ధికారులు రోడ్డు తవ్విన రైతులతోనే తారు వేసి మరమ్మతులు చేయించారు. ఈనాడు దుష్ప్రచారం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన తోటాడ సింహాచలం 2021 జనవరి 4న మాకివలస– కిల్లాం రోడ్డుపై గుంత వల్ల ప్రమాదానికి గురై మరణించాడు. వాస్తవం: సింహాచలం మాకివలసకు మోపెడ్‌పై మద్యం మత్తులో వస్తూ ఒక మలుపు వద్ద అదుపు తప్పి మట్టి రోడ్డుపై నుంచి పొలాల్లో పడిపోయాడు. గాయపడిన సింహాచలంను కిళ్లాంకు చెందిన యాగేటి రమణ, నీలయ్యలు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. సింహాచలం మృతికి గుంతలు కారణమనడం సరికాదని నీలయ్య పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన స్థలంలో అసలు గుంతలే లేవు. ఈనాడు దుష్ప్రచారం: కర్నూలు నగరంలోని మద్దూర్‌నగర్‌కు చెందిన నర్సయ్య గతేడాది జూలై 29న లక్ష్మీనగర్‌లో ఉన్న గుంతలో పడి గాయపడ్డాడని, అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని రాశారు. వాస్తవం: మద్దూర్‌నగర్‌లో వార్డు పరిధిలో విశాలమైన సీసీ రోడ్లు ఉన్నాయి. నర్సయ్య వెళ్లే దారిలో కుళాయి కోసం గుంత తవ్వి వదిలేశారు. రోజూ వెళ్లే మార్గమే అయినా.. కుళాయి కోసం తవ్విన గుంత గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. అంతేకాని రోడ్లపై ఎలాంటి గుంతలు లేవు. ఈనాడు దుష్ప్రచారం: 2022 ఆగస్టు 4న అల్లిపురం నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిలో ఫ్లై ఓవర్ వద్ద గుంతలో పడి సుబ్బారావు మృతిచెందాడు. వాస్తవం: ఆ నెలలో కురిసిన భారీ వర్షాలకు అల్లిపురం–విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డుపై చిన్నపాటి గుంత పడింది. అక్కడ ఉన్న మర్రిచెట్టు కొమ్మల కారణంగా వీధిలైట్లు ఉన్నప్పటికీ వెలుతురు సరిగా లేదు. గుంతను దాటుకుంటూ ఎంతో మంది ప్రయాణించారని.. ఒక ద్విచక్రవాహనదారుడు స్పీడ్‌గా వెళ్లడంతో అక్కడ అదుపుతప్పి పడిపోయి తలకు గాయమై ఉండొచ్చని, లేదా మరేదైనా కారణం కావచ్చని సంబంధిత ఏఈ తెలిపారు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఈనాడు పత్రిక గుంతవల్లేనంటూ వార్త రాసుకొచ్చింది. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: గవర్నర్ అబ్లుల్ నజీర్ ప్రసంగం ఇదే..
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అబ్దుల్ నజీర్ ప్రసంగం ఇలా.. విద్యా రంగం.. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మనబడి నాడు-నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చాం. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అమ్మఒడి పథకం తెచ్చాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలే లక్ష్యంగా నాడు-నేడు కార్యక్రమం. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమ చేస్తున్నాం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు గోరుముద్దకు రూ.4,417కోట్లు ఖర్చు చేశాం. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటి వరకు రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం. విద్యా సంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది. 8,9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్ పంపిణీ చేశాం. వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి ఐటీ విధానం. ప్రతీ ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యాబోధన. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు. అత్యున్నత 50 విద్యా స్థంస్థల్లో గుర్తించిన 20 ఫ్యాకల్టీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు. ఇప్పటివరకు రూ.1.25 కోట్ల వరకు మొత్తం రీయింబర్స్ చేస్తున్నాం. ప్రభుత్వ కృషితో స్కూల్స్‌లో డ్రాప్ఔట్లు గణనీయంగా తగ్గాయి. వైద్య రంగం.. రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు. 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులు అభివృద్ది. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు. ఇప్పటి వరకు 53,126 మంది వైద్యసిబ్బందిని నియమించాం. ఫ్యామిలీ డాక్టర్ కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించాం. ఇప్పటి వరకు 1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు. ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేశాం. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించాం. ఇప్పటి వరకు 1.32 కోట్ల ప్రత్యేక రోగుల సేవలు అందించాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. వ్యవసాయ రంగం.. రైతులు రాష్ట్రానికి వెన్నముక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం. రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. ఉచిత పంట బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802కోట్ల క్లైయిమ్లు. మిచాంగ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు రూ.347.55 కోట్లు విడుదల. జీఎస్డీపీలో వ్యవసాయం వాటా ఏపీలో 36 శాతం కాగా, జాతీయ సగటు 18శాతమే. ఆక్వా రంగం.. రూ.50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానం. వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే రూ.10లక్షల పరిహారం. 20వేల ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.128 కోట్లు. 61వేల మంది ఆక్వా రైతులకు విద్యుత్ ఛార్జీ రాయితీ రూ.3186కోట్లు. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాతో ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా ఏపీ. మహిళా సాధికారత.. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం 78.84 లక్షల మంది మహిళలకు రూ.25,571 కోట్లు. రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణిలు, 28.62 లక్షల మంది పిల్లలకు లబ్ధి. పౌష్టికాహార పథకాలకు రూ.6688 కోట్లు ఖర్చు. అంగన్వాడీ కేంద్రాలకు రూ.21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్ష మందికి పెన్షన్ అందిస్తున్నాం. రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు పెన్షన్ కానుక.. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల పెన్షన్ అందిస్తున్నాం. నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ.1961 కోట్లు పెరిగింది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు కేటాయింపు. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,129 కోట్ల పంపిణీ. వైఎస్సార్ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు జమ. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04కోట్లు జమ. ఐదేళ్లలో రూ.75వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. 3,57,844 మంది అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు జమ. రూ.71కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల కొనుగోలు. దీని ద్వారా 3,27,289 మంది తల్లులకు లబ్ది. ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు 10వేలు ఆర్థిక సాయం. జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం 10వేలు అందిస్తోంది. జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం.. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత. పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం. పోలవరం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు 74.01 శాతం పనులు పూర్తి. ఎల్ఏ అండ్ ఆర్ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి. రూ.280 కోట్లతో 10 టీఎంసీల చిత్రావతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. అవుకు ప్రాజెక్ట్ రెండో టన్నెల్‌ను పూర్తి చేశాం. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశాం. పులిచింతల నిర్వాసితులకు రూ.142 కోట్లు చెల్లించాం. 24 గంటల త్రీఫేజ్ కరెంట్ విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయ ఫీడర్లు. గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నాం. ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు పగటి పూట కరెంట్. తొమ్మిది గంటల ఉచిత్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 1221 కి.మీల రోడ్ల మరమ్మతులకు రూ.490కోట్లతో పనులు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 880 బస్సులు. జగనన్న టౌన్‌షిప్‌ల కోసం ప్రతీ నియోజకవర్గంలో రెండు ఎంఐజీ లేఅవుట్లు. 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్ట్‌లు చేపట్టాం. ఐటీ, విమానయాన, పర్యాటక రంగం.. భోగాపురంలో మే మూడో తేదీన నిర్మాణ పనులు ప్రారంభించాం. మరో 30 నెలల్లో ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు సిద్ధం. ఐటీ రంగాన్ని ప్రొత్సహించేందుకు ఐటీ పాలసీ 2021-24 ప్రవేశపెట్టాం. ఐటీ ఫలాలు చివరి మైలురాయి వరకు చేరేలా కృషి. 200 ఎండబ్ల్యూ డేటా సెంటర్ కోసం రూ.14,694కోట్ల పెట్టుబడి. మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు. పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ టూరిజం పాలసీ 2020-2025 అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై ఫోకస్. 7,290 మందికి ఉపాధి కల్పించేలా రూ.3,685 కోట్ల పెట్టుబడి. వికేంద్రీకరణ.. వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 13 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. 2.6 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు. జగనన్న సురక్ష ద్వారా కోటి ధృవీకరణ పత్రాలను ఇంటి వద్దకే అందించాం. 35,44,866 ఎకరాల భూమి పేదలకు పంపిణీ, హక్కులు కల్పించాం. 20,24,709 మంది భూమి లేని నిరు పేదలకు ప్రయోజనం. మా ప్రభుత్వంలో పేదరికం 11.52 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. -
సమాజంలో మా గౌరవం పెరిగింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. భయం పోయి ప్రశాంతంగా చదువుకుంటున్నా.. నేను కర్నూలు కృష్ణానగ ర్లో మా తాత, అమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ షేక్ స్వాలేహా బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. నెలకు రూ.10 వేలు వేతనం. తాత షేక్ సర్దార్ పటేల్ రిటైర్డు ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ఆదాయంతో ఇల్లు గడవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో నా చదువుపై బెంగ పెట్టుకున్నా. ఇంటరీ్మడియట్‌లో 93 శాతం మార్కులు, ఏపీ ఈఏపీ సెట్లో 15వేల ర్యాంకు సాధించా. ఇంటి ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా పై చదువులు ఎలా చదవాలో అర్థం కాలేదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేవుడిలా ఆదుకుంది. స్థానిక రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్‌లో బీటెక్(సీఎస్ఈ)లో జాయిన్ అయ్యా. ఫీజు రీయింబర్స్మెంట్ నాకు వర్తించింది. జగనన్న విద్యా దీవెన కింద మూడేళ్ళకు రూ.1.05 లక్షలు, వసతి దీవెన కింద రూ.30 వేలు విడుదలయ్యాయి. ఫీజుల భయం పోయింది. ప్రశాంతంగా చదువుకుంటున్నాను. ఇప్పుడు ఫైనలియర్ బీటెక్. క్యాంపస్ సెలక్షన్లో అసెంచర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఏడాదికి రూ.6.5లక్షల వేతనం. మా అమ్మగారికి వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ. 18,750లు వంతున వచ్చింది. ప్రభుత్వం మాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులను ఇలా ఆదుకోవడంతో చాలా మందికి మంచి ఉద్యోగావకాశాలు లభించాయి. నేను, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. సీఎం సర్‌కు ధన్యవాదాలు. – తయ్యిభా ఫాతిమా, బీటెక్ విద్యారి్థ, క్రిష్ణానగర్ (జి.రాజశేఖర్‌నాయుడు, విలేకరి, కర్నూలు అర్బన్) సమాజంలో మా గౌరవం పెరిగింది నే ను టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం భాసూరు గ్రామంలో భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులతోపాటు, వృద్ధురాలైన తల్లితో కలసి జీవిస్తున్నాను. రోజురోజుకూ రెడీమేడ్ దుస్తులు మార్కెట్లో విరివిగా లభిస్తున్న పరిస్థితుల్లో టైలరింగ్‌కు ఆదరణ తగ్గిపోయింది. దానివల్ల మాకు వచ్చే అరకొర ఆదాయం కూడా తగ్గిపోయింది. కుటుంబ పోషణ మరీ కష్టంగా తయారైంది. గత టీడీపీ హయాంలో రేషన్ బియ్యం పథకం తప్ప ఇంకేమీ వర్తించలేదు. ఈ తరుణంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు మమ్ములను ఆదుకున్నాయి. మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. నా భార్యకు చేయూత కింద ఏటా రూ. 18,750లు వస్తోంది. నా మనవడు చదువుకుంటుండటంతో పెద్దకోడలు రాజ్యలక్ష్మి ఖాతాకు అమ్మఒడి డబ్బులు జమవుతున్నాయి. కొడుకు ఈశ్వరరావుకు సర్వేయర్‌గా గ్రామ సచివాయంలో ఉద్యోగం వచి్చంది. ఆరి్థకంగా చేయూత లభిస్తుండడంతో కష్టాలు ఒక్కొక్కటి గెట్టెక్కాయి. సహచరులు, బంధువుల మధ్య కుటుంబానికి గౌరవం పెరిగింది. ఈశ్వరరావు సార్ ఉన్నారా... అంటూ నా కొడుకు కోసం వచ్చేవారు మాకు ఇస్తున్న మర్యాద వెలకట్టలేనిది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాకు సొంత ఇల్లు వచి్చంది. ఆయన బిడ్డ జగన్ ప్రభుత్వంలో సమాజంలో మరింత గౌరవం పెరిగింది. – కడారు మోహనరావు, భాసూరు (మారోజు కళ్యాణ్‌కుమార్, విలేకరి, పాలకొండ) ఖర్చు లేకుండా రెండుసార్లు శస్త్రచికిత్స నే ను సాధారణ రైతును. నాకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకలాంలో నాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అన్నీ అనుకూలిస్తే నాలుగు వేళ్లు నోటికెళ్లేవి. లేకుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. కునికిన నక్కపై తాటిపండు పడ్డట్టు నాలుగేళ్ల క్రితం కిడ్నీలో రాళ్లు చేరాయి. తెలియక అశ్రద్ధ చేయడంతో కిడ్నీలు మరింత పాడయ్యాయి. వైద్యులకు చూపిస్తే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు పోయే ప్రమాదం ఉందన్నారు. చికిత్సకు రెండు లక్షల వరకూ ఖర్చవుతుందన్నారు. అంత మొత్తం వెచి్చంచలేక సతమతమయ్యాను. అయితే నాకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యమిత్ర చెప్పడంతో వారి ద్వారా విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరా. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేశారు. ప్రస్తుతం నయం అయింది. ఇప్పుడు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను. గడిచిన ఏడాదిలో మళ్లీ రాళ్లు చేరితే ఆరోగ్యశ్రీ ద్వారానే ఆపరేషన్ చేయించుకున్నా. నాలాంటి వారికి ఎందరికో ఈ పథకం ప్రాణదానం చేసినట్టయింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్ పేరును నా కుడిచేయిపై పచ్చబొట్టు వేయించుకున్నా. కొడుకు, కూతురికి పెళ్లిళ్లయ్యాయి. వారు వేరేగా ఉంటున్నారు. జగనన్న అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ఠంఛన్‌గా రూ. 13,500లు చొప్పున వస్తోంది. నా భార్య రమణమ్మకు వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా రూ. 45 వేలు వచి్చంది. చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 వంతున వచి్చంది. మా ఆరి్థక పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. – శానాపతి సూర్యనారాయణ(రోహిణి) లుకలాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) -
‘రాష్ట్ర బడ్జెట్‌తో సినిమాలు తీయమంటావా పవన్?’
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన విప్లవాత్మక విద్యా సంస్కరణలపై ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ తీవ్రంగా తప్పుపట్టారు. పేద పిల్లలకు కార్పోరేట్ విద్య నేర్పిస్తే ఇందులో పెత్తందారులకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు ఇంగ్లిష్ నాలెడ్జ్ వస్తే ఆ పిల్లల్లో క్రియేటివిటీ అనేది 1000 రెట్లు పెరుగుతుందని స్పష్టం చేశారు. ఇంగ్లిష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అని, దాన్ని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు అందుబాటులోకి సీఎం జగన్ తీసుకొస్తే మరి ఇందులో వారికి వచ్చిన నష్టమేంటో తెలియడం లేదన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఐలయ్య పలు విషయాలను పంచుకున్నారు. రాబోయే పదేళ్లల్లో పల్లె విద్యలో కొత్త చరిత్ర ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఐలయ్య. తమ పిల్లలకు గ్రామాల్లో ఉన్న పిల్లలు తీవ్రంగా పోటీ ఇస్తారని, తమ పిల్లలకు ఊళ్లల్లో పిల్లలు పోటీ వస్తారని ఆ కారణం చేతనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కొన్ని కులాల్లో నేటికి విద్య అనేది సరిగా లేదని, రాబోయే కాలంలో ఊళ్లల్లో ఉన్న విద్యార్థులు.. అంబానీ, అదానీ స్కూళ్లలో చదివే పిల్లల్ని సైతం ఓడించగలరన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అనేది రాబోయే 10 ఏళ్లలో పల్లె విద్యలో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. పవన్‌కు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏపీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని పవన్ కళ్యాణ్ గతంలో తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలపై కూడా ఐలయ్య ఘాటుగా స్పందించారు. ప్రధానంగా యూట్యూబ్‌లో చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చని, దాని కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని చేసిన వ్యాఖ్యలను ఐలయ్య ఖండించారు. అసలు పవన్ కళ్యాణ్ కామన్ సెన్స్‌తో మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. అంతా యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటే పిలల్ని కూడా కార్పోరేట్ స్కూళ్లలో చేర్చించాల్సిన అవసరమే ఉండదన్నారు. మరి మీ పిలల్ని పెద్ద పెద్ద స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారో చెప్పాలని సూటిగా నిలదీశారు. పవన్ యాక్షన్ చేసి ఏవో డబ్బులు సంపాదించాడు తప్ప కనీసం నాలెడ్జ్ లేదన్నారు. ప్రభుత్వ బడులకు బడ్జెట్ ఖర్చు పెడుతుంటే తప్పేంటన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను దేనిపైనా ఖర్చు పెట్టకుండా మరి సినిమాలు తీయమంటావా? లేక చంద్రబాబుతో కలిసి హైటెక్ సిటీ కట్టమంటావా? అని పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీ మనవడితో తెలుగు మీడియం చదివించు ఇంగ్లిష్ మీడియంలో చదివితే పిల్లలు ఏమవుతారో తెలుసా అంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఐలయ్య తప్పుపట్టారు. ‘ కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయింది’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఐలయ్య తనదైన శైలిలో బదులిచ్చారు. ఇదే నిజమైతే తన మనవడిని తెలుగు మీడియంలో చదివించొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. మరి అటువంటప్పుడు తన మనవడి ఉన్న నాలుక(కొండ నాలుకకు మందేస్తే) ఎందుకు తీసేస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. అలా అయితే మీరు.. మీ పార్టీ వారి పిల్లల్ని రేపే తెలుగు మీడియంలో చేర్పించాలని డిమాండ్ చేశారు ఐలయ్య. -
విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ ‘సంకల్పం’
సాక్షి, అమరావతి: విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, కనీవినీ ఎరుగని పథకాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం.. వాటిలోని పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణనివ్వడానికి ‘సంకల్పం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే పారిపోవడం కాదు.. ఎదుర్కొని పరిష్కారం వెతకాలి.. భిన్న మనస్తత్వాలు ఉన్న బృందాన్ని కలుపుకుని విజయవంతంగా పనిచేయగలగాలి.. ఇందుకు భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి’.. వంటివాటిపై శిక్షణ మేనేజ్మెంట్ స్కూళ్లకు మాత్రమే ఇన్నాళ్లూ పరిమితమైంది. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. తొలిదశలో భాగంగా 1,300 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు శిక్షణ మొదలైంది. పాఠశాల విద్యాశాఖ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కలిసి ఉచితంగా ఈ శిక్షణను అందిస్తున్నాయి. మూడు దశల్లో మూడేళ్లపాటు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 1,300 పాఠశాలల్లో (జిల్లాకు 50 స్కూళ్లు) సంకల్పం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి శుక్రవారం ఒక గంట సమయాన్ని ఇందుకు కేటాయించారు. మొదటి దశలో 26 జిల్లాల్లోని 1,011 పాఠశాలల్లో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇటీవల మరో 289 పాఠశాలలకు విస్తరించారు. వచ్చే రెండేళ్లలో మొత్తం 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మరో 2,600 స్కూళ్లలో ప్రవేశపెట్టనుంది. సంకల్పం అమలు ఇలా.. జిల్లాకు 50 చొప్పున 26 జిల్లాల్లో హైస్కూళ్లు ఎంపిక మొత్తం 1,300 ప్రభుత్వ హైస్కూళ్లలో కార్యక్రమం వచ్చే విద్యా సంవత్సరంలో 2,600 స్కూళ్లకు విస్తరణ మూడో ఏడాది మొత్తం 6,790 స్కూళ్లలో శిక్షణ 6–8 తరగతుల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై తర్ఫీదు మూడేళ్లల్లో మూడు దశల్లో 13 లక్షల మందికి శిక్షణ 2,600 మంది ఉపాధ్యాయులకు శిక్షణ గతేడాది ఫిబ్రవరిలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీఎస్సీఈఆర్టీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘సంకల్పం’ శిక్షణను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం 130 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చింది. ఈ మాస్టర్ ట్రైనర్లు 13 జిల్లా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు (డైట్స్) నుంచి 52 మంది ఫ్యాకల్టీలు, ఒక్కో స్కూల్‌కు ఇద్దరు చొప్పున 26 జిల్లాల నుంచి 2,600 మంది ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. వీరు ఆయా స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్ ప్రకారం శిక్షణనిస్తారు. శిక్షణ రోజు ఇచ్చిన టాస్‌్కలను విద్యార్థులు స్వయంగా మ్యాజిక్ షీట్ల ఆధారంగా పూర్తి చేస్తున్నారు. తద్వారా వారు నేర్చుకున్న అంశాలను శిక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విద్యార్థులకు స్వీయ–నిర్వహణ, సమస్య–పరిష్కారం, సరైన నిర్ణయం తీసుకోవడం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు వంటి వివిధ కార్యాచరణ–ఆధారిత జీవిత నైపుణ్యాలను విద్యలో అంతర్భాగం చేయడం దేశంలో మన రాష్ట్రంలోనే ప్రారంభమైందని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణ కౌమారదశలో ఉన్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, వారి ఉజ్వల భవిష్యత్‌కు దోహదం చేస్తుందన్నారు. ఈ 11 అంశాలపై శిక్షణ.. సమాజంలో అనేక సందర్భాల్లో వివిధ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అయితే ఇంటి నుంచి మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సాధారణంగా ఎదురయ్యే అంశాలు 11 ఉన్నట్టు అంతర్జాతీయ సర్వే ద్వారా గుర్తించారు. ఆ అంశాలపై వివిధ దశల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ‘కాగి్నటివ్, సోషల్, ఎమోషనల్’ అనే మూడు భాగాలుగా విభజించింది. ఏడాదికి ఒక అంశంపై మూడేళ్లపాటు శిక్షణ ఇవ్వనుంది. కాగ్నిటివ్‌లో.. సమస్యల పరిష్కారం, సరైన నిర్ణయం తీసుకోవడం, సెల్ఫ్ మేనేజ్మెంట్, సృజనాత్మకతపై శిక్షణ ఉంటుంది. విద్యార్థులు తమ ఇల్లు, పరిసరాల్లో గుర్తించినవి, వారికి అవగాహన ఉన్న అంశాలపై తొలి ఏడాది శిక్షణనిస్తున్నారు. సోషల్ విభాగంలో.. ఎదుటివారిపై సానుభూతి ఎప్పుడు చూపాలి (ఎంపతి), నిశ్చయత (అసెర్టివ్నెస్), చర్చించి సమస్యను పరిష్కరించడం (నెగోషియేషన్), పరస్పర సహకారం (కొలాబరేషన్), కమ్యూనికేషన్ వంటి అంశాలు ఉన్నాయి. రెండో ఏడాది మొత్తం ఈ అంశాలపైనే శిక్షణ ఉంటుంది. ఎమోషనల్ (భావోద్వేగాలు) విభాగంలో.. స్వీయ అవగాహన (సెల్ఫ్ అవేర్నెస్), అనుకూలత అంశాలపైనా శిక్షణ ఉంటుంది. వీటన్నింటిపైనా కార్యాచరణ ఆధారిత (క్రీడలు, పరిశీలన) ద్వారా మూడో ఏడాది శిక్షణ ఉంటుంది. -
9 నుంచి ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ తుదిఘట్టానికి చేరుకుంది. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఐదుదశల పోటీల్లో దిగ్విజయంగా నాలుగింటిన దాటుకుని ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా విజయగీతిక మోగించనుంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజి్రస్టేషన్లతో ఆడుదాం ఆంధ్రా రికార్డు సృష్టించింది. గ్రామ/వార్డు సచివాలయం, మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. 8 క్రీడా మైదానాల ఎంపిక ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ ఫైనల్స్ కోసం విశాఖలో ఎనిమిది క్రీడా మైదానాలను తాత్కాలికంగా గుర్తించారు. క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం, ఆంధ్ర మెడికల్ కాలేజీ, జీవీఎంసీ ఇందిరాప్రియదర్శిని, డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని గ్రౌండ్–బి, బ్యాడ్మింటన్ పోటీలను జీవీఎంసీ ఇండోర్ స్టేడియం, వాలీబాల్ పోటీలను ఆంధ్ర యూనివర్సిటీ అవుట్డోర్, కబడ్డీని ఏయూ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాల్స్, ఖోఖోను ఏయూ జిమ్నాజియం అవుట్‌డోర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించింది. పారదర్శకంగా నగదు బహుమతుల ప్రదానం 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి కాంపిటీటివ్ క్రీడలతోపాటు నాన్–కాంపిటీటివ్‌లో సంప్రదాయ మారథాన్, టెన్నీకాయిట్, యోగాలోను పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 38,08,741 మంది క్రీడాకారులు (23,81,621 మంది పురుషులు, 14,27,120 మంది మహిళలు) నమోదు చేసుకున్నారు. ఇందులో గ్రామ/వార్డు స్థాయిలో మొత్తం 24,46,538 మంది క్రీడాకారులు (13,92,764 మంది పురుషులు, 10,53,774 మంది మహిళలు) పాల్గొన్నారు. వారిలో మండల స్థాయికి 17,10,456 మంది క్రీడాకారులు (8,55,228 మంది పురుషులు, 8,55,228 మంది మహిళలు) పోటీపడ్డారు. వారిలో 85,842 మంది క్రీడాకారులు (42,921 మంది పురుషులు, 42,921 మంది మహిళలు) నియోజకవర్గస్థాయిలో సత్తాచాటారు. నియోజకవర్గస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన జట్లకు (51,164 మంది క్రీడాకారులు పాల్గొంటే 28,513 మంది విజేతలు) నగదు బహుమతులు పొందారు. జిల్లాస్థాయి పోటీల అనంతరం ఫైనల్స్‌కు 1,482 మంది పురుషులు, 1,482 మంది మహిళలు.. మొత్తం 2,964 మంది అర్హత సాధించారు. ఆయా క్రీడల్లో తొలి మూడుస్థానాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పారదర్శకంగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బహుమతులను జమచేసేందుకు శాప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
ఈనాడు చావు తెలివి..
సాక్షి, అమరావతి: ప్రపంచం మొత్తం వేనోళ్ల కీర్తిస్తున్న ఆర్బీకే వ్యవస్థను అప్రదిష్టపాల్జేయడం, రైతులకు అండగా నిలుస్తూ వారిని చేయిపట్టి నడిపిస్తున్న ఆర్బీకే సిబ్బందిపై ఇప్పుడు రామోజీ కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న ఆయన ఈసారి వారి మనోస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓ ఆర్బీకే సిబ్బంది మరణాన్ని సైతం రాజకీయం చేస్తూ చావు తెలివితేటలను ప్రదర్శించింది. వ్యక్తిగత కారణాలతో ఆర్బీకే ఉద్యోగిని ఒకరు బలవన్మరణానికి పాల్పడితే, దాన్ని వక్రీకరిస్తూ ‘ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువుల విక్రయాలు’ అంటూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇష్టారాజ్యంగా అబద్ధాలను అచ్చేసింది. ఈనాడు కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. బకాయిలపై ఎలాంటి ఒత్తిడిలేదు బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి–1 ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకురాలుగా మూడున్నరేళ్ల నుంచి సమర్థవంతమైన సేవలందిస్తున్న బి.పూజిత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కారణాలు ఏమైనప్పటికీ ఆమె మరణం బాధాకరం. కానీ, ఎరువుల బకాయిలపై ప్రభుత్వాధికారులు ఒత్తిడిని తట్టుకోలేకే ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టిందంటూ ఈనాడు చేసిన ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వాస్తవానికి.. ఈ ఆర్బీకే ద్వారా రైతులకు సరఫరా చేసిన ఎరువులకు సంబంధించిన బకాయిలు అక్షరాల కేవలం రూ.16 మాత్రమే. ఈ కొద్దిపాటి సొమ్ము కోసం ఒత్తిడి తీసుకొచ్చారనడం ఎంతో హాస్యాస్పదం. ఆర్బీకేలో నిల్వచేసిన తడిసి, పాడైన ఎరువుల తాలూకు విలువను ఆర్బీకే సిబ్బంది నుంచి వసూలు కోసం ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఈనాడు మరో ఆరోపణ చేసింది. నిజానికి.. వర్షాలు, ఇతర వైపరీత్యాల సందర్భంలో తడిసిన, గడ్డకట్టిన, పాడైన ఎరువులను సంయుక్త విచారణ ద్వారా నిర్ధారించి వాటిని రద్దుచేసి, ఆ మేరకు సొమ్మును బకాయిల నుంచి మినహాయిస్తున్నారే తప్ప ఏ ఒక్క ఆర్బీకే నుంచి వసూలుచేసిన దాఖలాల్లేవు. ఇప్పటివరకు సంయుక్త విచారణలో ఇలా వైపరీత్యాలవల్ల పాడైనట్లుగా గుర్తించిన రూ.8.4 లక్షల విలువైన 15 టన్నుల ఎరువులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సకాలంలో అద్దె జమ.. ఇక ఆర్బీకే అద్దెల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లు ఖర్చుచేసింది. రానున్న మార్చి వరకు సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాల్లో జమచేశారు. పెండింగ్‌లో విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా, ఇక నుంచి నేరుగా ఈ బడ్జెట్‌ను విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా ఇప్పటికే ఖర్చుచేసిన సిబ్బందికి రూ.53.48 లక్షలు విడుదల చేశారు. ఇంటర్నెట్ కోసం కూడా రూ.23 కోట్లు విడుదల చేశారు. ఇలా రైతుల అవసరాలను తీరుస్తూ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్న ఆర్బీకేలపై నిత్యం అదే పనిగా బురద జల్లడం, సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీసేలా దుర్మార్గపు రాతలు రాస్తోంది. ఈ క్షుద్ర పాత్రికేయాన్ని ఇకనైనా మానుకోవాలని రైతులు ఈనాడు రామోజీకి సూచిస్తున్నారు. ఆర్బీకేల్లో ఎరువుల విక్రయం వ్యాపారం కాదు.. ఇక రైతుభరోసా కేంద్రాల్లో ఎరువుల అమ్మకం వ్యాపారం కాదని, రైతులకు గ్రామస్థాయిలో చేసిన ఓ సదుపాయం మాత్రమే. నిజానికి.. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఎరువుల్లో 50 శాతం వ్యాపారులకు, మిగిలిన 50 శాతం సహకార కేంద్రాలు, ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటుచేసిన తొలి ఏడాది 1.07 లక్షల టన్నుల అమ్మకాలు జరగ్గా.. మూడో ఏడాదికి వచ్చేసరికి అది నాలుగు లక్షల టన్నులకు చేరుకుంది. ఈ సదుపాయం వినియోగించుకున్న రైతుల సంఖ్య 2020–21లో 2.55 లక్షల మంది ఉంటే, 2022–23లో ఏకంగా 10.90 లక్షల మందికి చేరింది అంటే.. 428 శాతం వృద్ధి కన్పిస్తోంది. గ్రామస్థాయిలో ఎమ్మారీ్పకే ఎరువులు అందుబాటులో ఉంచడంతో.. బ్యాగ్‌పై రూ.20–50 వరకు రవాణ, లోడింగ్, అన్లోడింగ్ భారం తగ్గడంతో రైతులు ఆర్బీకేల ద్వారా ఎరువులు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ–క్రాప్ నమోదులోనూ ఒత్తిడి లేదు.. మరోవైపు.. వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉమ్మడి అజమాయిషీ కింద జరుగుతున్న ఈ–క్రాప్ నమోదు కోసం టైమ్‌లైన్ నిర్దేశించారే తప్ప సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడిలేదు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. ఖరీఫ్ 2023 నుండి జియో ఫెన్సింగ్ అమలుచేస్తున్నారు. ఆర్బీకే సిబ్బంది అభ్యర్థన, ఫీడ్‌బ్యాక్ మేరకు వరి పంటకు జియో ఫెన్సింగ్‌ను 20 నుంచి 200 మీటర్లకు పెంచడమే కాదు.. అవసరమైతే క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మినహాయింపు కూడా ఇస్తున్నారు. అలాగే.. వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక కోసం ఇప్పటివరకు 14,300 మంది రైతులు స్వచ్ఛందంగా బుక్ చేసుకున్నారు. ఈ విషయంలో సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారనడంలో కూడా ఎలాంటి వాస్తవంలేదు. -
బాబు పలుగుపోట్లు మర్చిపోతే ఎలా?
సాక్షి, అమరావతి: నిత్యం చంద్రబాబు మత్తులో జోగుతున్న ఈనాడు రామోజీరావు ఆ మైకంలో పడి పూర్తి ఉన్మాదిగా మారిపోయారు. ఎందుకంటే.. టీడీపీ హయాంలో కృష్ణానది ఒడ్డున పవిత్ర దేవా లయాలు కూల్చేస్తే సిగ్గులేకుండా కళ్లుమూసుకున్న ఆయన.. ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం గు రించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లి స్తున్నట్లుగా ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు.. ఈనాడులో తరచూ ప్రచురించే కథనాలకు ఎక్కడా పోలిక లేదనేది జగమెరిగిన సత్యం. చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా ఏపీలో దేవాలయాల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. దేవదాయ శాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మా ణంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలు మూలలా 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇదంతా సీఎం వైఎస్ జగన్ హయాంలో చేపట్టడాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన విషపుత్రిక ‘ఈనాడు’లో ‘జగనన్న పాపాలు–భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు’ అంటూ చేతికొచ్చింది రాసిపారేశారు. చంద్ర బాబు సీఎంగా ఉన్నప్పుడు రోడ్లకు అడ్డంగా ఉన్నా యనే నెపంతో విజయవాడలో ఒకే రాత్రి పదుల సంఖ్యలో గుళ్లను పలుగుపోట్లతో నేలమట్టం చేసిన విషయం ఆయన మర్చిపోయారు. అలాంటి చంద్రబాబును ‘ఈనాడు’ నిత్యం కీర్తిస్తుంది. కానీ, ఆ కూల్చిన గుళ్లను పునర్నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్‌ను మాత్రం రాక్షసుడిగా పోల్చడమంటే రామోజీ పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ట్రస్టు భూములు అమ్మినోళ్లపై ఎందుకంత ప్రేమ? 2014లో బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖ పరిసరాల్లో దేవదాయ శాఖకు చెందిన నాలుగు వందల ఎకరాలకుపైగా మాన్సాస్ ట్రస్టు భూములను అమ్మకానికి పెట్టారు. కానీ, కాలేజీపై నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ ఐదేళ్లలో 70ఎకరాల వరకు విక్రయించి రూ.వందల కోట్లను పోగేసుకున్నారు. ఇలా దేవదాయ శాఖకు చెందిన అనేక భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నంలేదు. సీఎం జగన్ మాత్రం.. భవిష్యత్తులో ఆలయాల భూములను ఎవరూ ఆక్ర మించుకునేందుకు వీల్లేకుండా ఓ ఆర్డినెన్స్ తీసు కొచ్చారు. ఇది దేవదాయ శాఖ చరిత్రలో పెద్ద విప్లవాత్మక నిర్ణయం. దేవుడి భూము లను కాపాడేందుకు ఇలాంటి పటిష్ట చట్టాలు తీసుకురావడం ఈనాడుకు నచ్చడంలేదు. అందుకే సీఎం జగన్ నిర్ణయంపై అక్కసు ప్రదర్శిస్తోంది. బాబు పాలన రామరాజ్యమా? చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారని పెద్ద దుమారం చెలరేగింది. బెంజ్‌సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను అధికారులు వ్యతి రేకించినప్పటికీ తక్కువ లీజుకే బాబుకు అత్యంత సన్నిహితుడి విద్యాసంస్థకు టీడీపీ సర్కార్ కట్ట బెట్టింది. సీఎం జగన్ ప్రభుత్వం విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి ఎప్పుడు లేనంతగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.70 కోట్లను మంజూరు చేసింది. రామోజీకి చంద్రబాబు ప్రభుత్వం రామ రాజ్యంగానూ, ఆలయాలను అభివృద్ధి చేస్తున్న జగన్ సర్కారు రాక్షస ప్రభుత్వంలా కనిపిస్తుంది. భక్తుల కమిటీలకే ఆలయాల నిర్వహణ.. దేవదాయ శాఖ పరిధిలోని చిన్నా, పెద్ద ఆలయాలు అన్నింటికీ టీడీపీ నేతలే ట్రస్టు బాధ్యతల్లో ఉండే వారు. సీఎం జగన్ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ ఆయా ఆల యాల వంశపారంపర్య ధర్మకర్తలకు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో 25 వేలకు పైగా ఆలయాలు, సత్రాలు ఉండగా.. రూ.5 లక్షలు పైబడి ఆదాయమున్న 1,400 ఆల యాలకే ప్రభుత్వం ట్రస్టు బోర్డులు నియమిస్తోంది. ధార్మిక పరిషత్ కథ ఇంతే.. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్‌కు వర్తింప జేస్తూ 2009లోనే అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రభుత్వం జోక్యం చాలావరకు తగ్గింది. అయితే, 2014–19 మధ్య చంద్రబాబు దాని ఏర్పాటును నిర్లక్ష్యంచేశారు. ఆలయాల భుములను టీడీపీ నేతలు ఇష్టానుసారం వాడుకునేందుకు వీలుగా కేవలం ఐదారుగురు అధికారులతో తాత్కాలిక పరిషత్ ఏర్పాటుచేశారు. అదే సీఎం జగన్ ప్రభుత్వం 2022లో ధార్మిక పరిషత్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. కానీ, దేవదాయ శాఖకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ‘ఈనాడు’ గొప్పగా ఊహించుకుంటూ జగన్ సర్కారును రాక్షస రాజ్యంగా ఈనాడు అభివర్ణిస్తూ పేట్రేగిపోతోంది. -
సీబీఐ విచారణలో కాకాణికి క్లీన్చిట్
సాక్షి, అమరావతి: నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకాణికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చిచెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయత్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులే నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఫైళ్లను కూడా అపహరించినట్లు నిర్ధారించింది. మంత్రి కాకాణి ఆ ఫైళ్లను దొంగతనం చేయించారన్న టీడీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈమేరకు విజయవాడలోని ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్– మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో సీఐబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ... నెల్లూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో 2022 ఏప్రిల్ 13వతేదీ రాత్రి కొందరు ఆగంతకులు దొంగతనానికి పాల్పడిఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు పలు పత్రాలను అపహరించారు. దీనిపై మర్నాడు కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, షేక్ ఖాజాలను అరెస్ట్ చేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపారు. ఈ ఉదంతంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఆధారాలను గల్లంతు చేసేందుకు చోరీకి పురిగొల్పారని అభాండాలు వేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కాకాణి దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు విచారణ చేపట్టిన సీఐబీ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరిపింది. రెండేళ్లపాటు దర్యాప్తు చేసి 88 మంది సాక్షులను విచారించి రూపొందించిన 403 పేజీల చార్జ్‌షీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ వ్యవహారంతో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ నిర్ధారించింది. ఏపీ పోలీసులు ఈ కేసును సక్రమంగానే విచారించారని స్పష్టం చేసింది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రధానంగా పేర్కొన్న అంశాలివీ.. కాకాణికి సంబంధం లేదు... నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మంత్రి కాకాణి, ఆయన పీఏలు, సన్నిహితుల ఫోన్ కాల్స్ డేటాను సీబీఐ విశ్లేషించింది. న్యాయస్థానం సిబ్బందితోగానీ, ఈ కేసుతో సంబంధం ఉన్న వారితోగానీ, దర్యాప్తు అధికారులతోగానీ మంత్రి కాకాణి, ఆయన అనుచరులు ఫోన్లో మాట్లాడినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్ల గురించి అతి స్వల్ప వ్యవధి కాల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్‌తో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధాలు లేవన్నది నిర్ధారణ అయింది. నిందితుల నుంచి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను ఎవరూ ట్యాంపర్ చేయలేదని తిరువనంతపురంలోని సీ–డాక్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. దొంగతనాలే ప్రవృత్తి.. ఈ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూలే నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డారు. నేర చరిత్ర ఉన్న వారిద్దరిపై 15 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏడు కేసుల్లో శిక్ష పడగా మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడిన నిందితులిద్దరూ దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నారు. నిందితుల భార్యలు కూడా వారికి దూరంగా ఉంటున్నారు. నిందితులు తమ తల్లుల ఫోన్లను మాత్రమే వినియోగిస్తున్నారు. వారిద్దరే నెల్లూరు న్యాయస్థానంలో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైల్ ఫోన్లను తస్కరించి మిగిలిన పత్రాలను సమీపంలోని కాలువలో పారేశారు. తాము అపహరించిన వస్తువులు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కేసుకు సంబంధించినవి అనే విషయం నిందితులకు తెలియదు. పోలీసులు వారిద్దరి నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాలువలో పారేసిన రబ్బరు స్టాంపులు, రౌండ్ సీళ్లు, స్టాంపు, స్టాంప్ ప్యాడ్లు మాత్రం లభ్యం కాలేదు. సోమిరెడ్డి ఆరోపణలు అవాస్తవం మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీఐబీ తేల్చి చెప్పింది. ఆయన చేసిన 14 ఆరోపణలను విడివిడిగా ప్రస్తావిస్తూ అవన్నీ నిరాధారణమని పేర్కొంది. నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, ఖాజా రసూలపై విచారణ కొనసాగించాలని సీఐబీ పేర్కొంది. సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? పారదర్శకంగా నెల్లూరు పోలీసుల విచారణ: మంత్రి కాకాణి నెల్లూరు(సెంట్రల్): కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను పటాపంచలు చేస్తూ సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ ఘటన చోటు చేసుకుందని, ఈ కేసును విచారించిన ఎస్పీ విజయారావు పూర్తి వివరాలను వెల్లడించారని గుర్తు చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనపై బురద చల్లేందుకు దీన్ని తనకు ఆపాదిస్తూ ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు, లోకేశ్ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు. ఏడాదిపాటు క్షుణ్నంగా విచారించిన సీబీఐ అధికారులు 88 మందిని విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారని చెప్పారు. ఆ ముగ్గురూ సమాధానం చెప్పాలి తనకు సంబంధం లేని ఫైల్స్ చోరీ కేసులో చంద్రబాబు తనపై నిందలు వేశారని, లోకేశ్ కూడా కోర్టు దొంగ అంటూ తనపై నిందలు మోపారని, ప్రజలు నాలుగుసార్లు తిరస్కరించిన సోమిరెడ్డి తనపై దురుద్దేశంతో ఆరోపణలు చేశారని కాకాణి పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో ఆ ముగ్గురు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీపీఐ రామకృష్ణ కూడా విమర్శలు చేశారన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ లోకేశ్ పలు దఫాలు విమర్శలు చేశారన్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించారనేందుకు ఈ కేసే ఉదాహరణ అని తెలిపారు. బాబు కుమ్మక్కు రాజకీయాలు నిజం గెలవాలంటూ పర్యటిస్తున్న నారా భువనేశ్వరి నిజంగానే అలా కోరుకుంటుంటే చంద్రబాబుపై ఉన్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే నిజం గెలుస్తుందని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని మంత్రి సవాల్ విసిరారు. తనకు అనుభవం ఉందంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌తో రాజకీయంగా తలపడలేక కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. -
చిన్న పరిశ్రమ ధగధగ
ఓ ప్రయత్నం పది మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపథానికి దారిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే... ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్... నెల్లూరు జిల్లా పొదలకూరులో బయో మాస్ బ్రికెట్స్... బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో మారుతి గ్రానైట్స్... ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే. ఇప్పుడు వందలాదిమందికి ఉపాధి కల్పిస్తూ... పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్ఎంఈలే సాక్ష్యం. ♦ కరోనా విలయం నుంచి.. విజయపథానికి ♦ గ్రానైట్ ఫ్యాక్టరీతో పది మందికి ఉపాధి.. వ్యవసాయం వదిలి పారిశ్రామిక పయనం బల్లికురవ: వారిది వ్యవసాయం కుటుంబం. భర్త డిగ్రీవరకూ చదువుకోగా... భార్య పాలిటెక్నిక్ పాసయ్యారు. వారికి వ్యవసాయం ద్వారా తగిన ఆదాయం సమకూరకపోవడంతో పదిమందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. తొలుత పౌల్ట్రీ పరిశ్రమతో ప్రస్థానం మొదలైంది. దంపతులు ఇద్దరూ అక్కడే పనిచేసి కొందరికి ఉపాధి చూపారు. అయితే బంధువులు గ్రానైట్ వ్యాపారాలు చేసి లాభాలు పొందడాన్ని చూశాక వీరికీ ఓ ఆలోచన వచ్చింది. బాపట్ల జిల్లా ఈర్లకొండ మల్లాయపాలెం గ్రామాల్లో ముడిరాయి దొరుకుతుండడంతో గ్రానైట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. అయితే సాయమందించే ప్రభుత్వం అప్పుడు లేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయితీతో రుణం అందించి ఊతం అందించడంతో మారుతి గ్రానైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి కల సాకారమైంది. ఇప్పుడు విజయవంతంగా ఆ సంస్థ నడుస్తోంది. ఇదీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి నీరజ, హనుమంతరావు దంపతుల విజయప్రస్థానం. అధికారుల నుంచి సానుకూల స్పందన పరిశ్రమ స్థాపిస్తామని చెప్పగానే పరిశ్రమల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.1.5 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఎస్ఐడీబీఐ(సిబీ)గా గుర్తించి బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేశారు. అందులో రూ.90 లక్షలు ప్రభుత్వ రాయితీ కింద వచ్చింది. మొత్తం మూడు కోట్లతో ఫ్యాక్టరీ పెట్టారు. ముడిరాయిని పలకలు కోస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన రాళ్లను అద్దంకి, మార్టూరు, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ పట్టణాలకు తరలిస్తున్నారు. మాకు ఉపాధి దొరికింది నాకు ఏపనీ దొరక్క తిరుగుతున్న సమయంలో గ్రానైట్ అధినేత పిలిచి ఉపాధి కల్పించాడు. గతంలో క్వారీల్లో చేసిన అనుభవం ఉండడంతో ఇక్కడ లైన్ పాలిష్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. నెలా నెలా జీతాలు బాగా ఇస్తున్నారు. – డేవిడ్, గ్రానైట్ ఆపరేటర్ కోవిడ్ కష్టకాలంలోనూ చేయూత.. రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ వణికించింది. గ్రానైట్‌పైనా ప్రభావం చూపింది. ఫ్యాక్టరీ మూత పడింది. కరోనాతో వందల మంది మృతి చెందడంతో అన్నీ రెడ్ జోన్లే. వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మాకు మరో రూ.28 లక్షల లోన్ ఇచ్చారు. నెలానెలా కంతుల వారీగా రుణం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. పిల్లలను బాగానే చదివించుకుంటున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానే తృప్తి మిగిలింది. సంవత్సరానికి రూ. 1 కోటి వరకు టర్నోవర్ చేస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాకు బాగా అండగా నిలిచింది. – లేమాటి నీరజ, ఫ్యాక్టరీ యజమాని కర్షకుడి నుంచి కర్మాగార స్థాపన వరకూ.. ♦ నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపన ♦ మొక్కవోని దీక్షతో విజయంవైపు అడుగులు పొదలకూరు: ఆయనో సామాన్య రైతు. వ్యాపారం, పరిశ్రమలపై అవగాహన లేదు. అయినా తాను జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం ఓ చిన్నతరహా పరిశ్రమ స్థాపన వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారు. మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా పరిశ్రమను నిర్వహిస్తూ పది మందికి అన్నం పెడుతున్నారు. ఇదీ పొదలకూరు మండలం సూదుగుంట గ్రామానికి చెందిన పెద్దమల్లు శ్రీనివాసులు రెడ్డి విజయప్రస్థానం. పడిలేచిన కెరటంలా.. గతంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో సూదుగుంట షుగర్స్, సోనాక్(రొయ్య పిల్లల మేత) వంటి పెద్ద తరహా పరిశ్రమలు, అల్లోవీర, సిమెంటు బ్రిక్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి తట్టుకోలేక మూతపడ్డాయి. కానీ పెద్దమల్లు శ్రీనివాసులురెడ్డి 2015లో బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమలను స్థాపించి నష్టాలు, కష్టాలను అధిగమించి ఓ స్థాయికి చేరుకున్నారు. పడి లేచిన కెరటంలా ఎదిగారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బయో మాస్ బ్రికెట్స్(కట్టె ముక్కలు) తయారీ పరిశ్రమను స్థాపించి తయారు చేసి వస్తువును అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా పొందలేకపోయారు. ఫలితంగా పరిశ్రమకు ఎలాంటి రాయితీలు పొందలేకపోయారు. బ్రికెట్స్‌ను అమ్ముకోగలిగినా లాభాలు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. ఇబ్బందులతో నెట్టుకొస్తున్న సమయంలో 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొంది యూనియన్ బ్యాంకులో రూ.కోటి రుణం పొందగలిగారు. దానితో పరిశ్రమలో ఆధునాతన మెషినరీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచారు. మార్కెటింగ్ పల్స్ తెలుసుకున్నారు. ఫలితంగా విజయం సాధించి ఇప్పుడు రూ.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 మందికి ఉపాధి అవకాశం కల్పించి నెలకు రూ.3 లక్షల జీతాలు అందజేస్తున్నారు. బ్యాంకు రుణంలో ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇవ్వడం, విద్యుత్ యూనిట్‌కు ఒకరూపాయి సబ్సిడీని అందజేయడంతో నిలదొక్కుకోగలిగారు. సర్కారు సాయంతోనే నిలదొక్కుకున్నాం ప్రారంభంలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొన్నాను. నిలదొక్కుకునేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ నిలదొక్కుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నా అదృష్టం బాగుండి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రోత్సాహాలు లభించాయి. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన టిప్పర్లు, మెషనరీ కొనుగోలు చేయగలిగాను. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొందడం వల్ల పంచాయతీ, టౌన్‌ప్లానింగ్ అనుమతులు లభించాయి. ఫలితంగా పరిశ్రమ గాడిలో పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతున్నాను. ఎలాంటి కాలుష్యం ఏర్పడనందున ఫార్మాసిటికల్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. – పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, పొదలకూరు స్థానికంగానే ఉద్యోగం దొరికింది నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మా ఊరికి చెందిన మారుతీ గ్రానైట్స్ నీరజ, హనుమంతరావు ఫ్యాక్టరీ పెట్టడంతో నాకు అందులో సూపర్వైజర్గా పని ఇచ్చారు. నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్లే నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని లేకుండా ఉపాధి దొరికింది. నాతోపాటు ఇక్కడ మరో 15 మంది పనిచేస్తున్నారు. – వెంకటేశ్, సూపర్వైజర్ పదేళ్లుగా పనిచేయిస్తున్నా.. మాది రాజస్థాన్. బతుకుతెరువు కోసం వచ్చా. ఇక్కడ మేస్త్రీగా పని చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ యజమాని మాకు బాగా నచ్చాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నెలా నెలా వేతనాలు అందుతున్నాయి. – బీరారామ్, మేస్త్రీ డెంటిస్ట్ కల అలా సాకారమైంది విశాఖలో డెంటల్ ల్యాబ్‌కు శ్రీకారం సాక్షి, విశాఖపట్నం: ఆయనో దంత వైద్యుడు. వైద్య విద్యను పూర్తి చేసుకుని 2010లో విశాఖపట్నం మురళీనగర్‌లో ఓ డెంటల్ క్లినిక్ ప్రారంభించారు. తాను నడిపే క్లినిక్కంటే దానికి సంబంధించిన ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తే పలువురికి ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. దాని వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశారు. స్నేహితుడు గోపీకృష్ణతో కలిసి కృత్రిమ దంతాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఎంఎస్ఎంఈ సింగిల్ పోర్టల్ విధానంలో నెల రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు రుణమూ మంజూరైంది. రూ.3.50 కోట్ల పెట్టుబడితో 2020 జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక టర్నోవర్ రూ.4.80 కోట్లకు చేర్చారు. ఆయన పేరు డాక్టర్ గండి వెంకట శివప్రసాద్. ఆయన స్థాపించిన యూనిట్ పేరు డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ డెంటల్ ల్యాబ్‌కు రూ.20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ కూడా మంజూరు చేసింది. మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో... విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ల్యాబ్ నడుస్తోంది. ఇందులో కృత్రిమ దంతాలకు అవసరమైన అచ్చులు, క్రౌన్లు, బ్రిడ్జిలు వంటివి తయారు చేస్తారు. వీటిని కాస్టింగ్ టెక్నాలజీతో కాకుండా మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో డిజిటల్ త్రీడీ ప్రింటింగ్ విధానంలో చేస్తారు. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఇవి మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇప్పుడు 45 మంది శాశ్వత, 20 మంది తాత్కాలిక, మరో 20 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. అతి తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకవసరమైన అనుమతులను మంజూరు చేస్తోంది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మా ల్యాబ్‌ను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు రూ.6.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఉత్పత్తులు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులో దేశమంతటా విస్తరించాలని యోచిస్తున్నాం. ల్యాబ్ విస్తరిస్తే వెయ్యి మంది ఉపాధి పొందుతారని భావిస్తున్నాం. – డా. గండి వెంకట శివప్రసాద్, ఎండీ, డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖపట్నం