Automobile
-
కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై హీరో కసరత్తు
న్యూఢిల్లీ: మధ్య స్థాయి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీపై కసరత్తు చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్ భాగస్వామ్యంలో ఈ వాహనం అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.జీరో మోటర్‌సైకిల్స్ ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్, పవర్‌ట్రెయిన్స్ తయారు చేస్తుంది. 2022 సెప్టెంబర్‌లో జీరోలో 60 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు హీరో బోర్డు ఆమోదముద్ర వేసింది. మరోవైపు, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని మరింతగా విస్తరిస్తున్నట్లు గుప్తా చెప్పారు.వచ్చే ఆరు నెలల్లో వివిధ ధర శ్రేణుల్లో, కస్టమర్ సెగ్మెంట్లలో తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని వివరించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కి చెందిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో అమ్ముడవుతున్నాయి. -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్‌ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్‌కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్‌ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్‌కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్‌ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
హ్యుందాయ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) రెండు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వాహనాల తయారీకై 2025 నాటికి పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులోని ప్లాంటులో వీటిని నెలకొల్పనుంది.ఇందుకోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ ఒప్పందం చేసుకున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. 75 మెగావాట్ల సౌర, 43 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ను స్థాపిస్తారు. ఈ రెండు కేంద్రాలకు హెచ్ఎంఐఎల్ రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశారు.హ్యుండై మోటార్ ఇండియాకు ఈ ఎస్పీవీలో 26 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుత విద్యుత్ అవసరాల్లో 63 శాతం పునరుత్పాదక వనరుల నుంచి సమకూరుతోందని కంపెనీ తెలిపింది. హెచ్ఎంఐఎల్ ప్లాంటుకు 25 ఏళ్లపాటు ఏటా 25 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీ తెలిపింది. -
జపనీస్ బైక్ కొనుగోలుపై రూ.1.14 లక్షల డిస్కౌంట్
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ విఫణిలోని తన నింజా 'జెడ్ఎక్స్ 10ఆర్' బైక్ ధరను రూ. 1.14 లక్షలు తగ్గించింది. దీంతో ఈ బైక్ ధర 17.34 లక్షలకు చేరింది.కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ 2025 ఎడిషన్ ప్రారంభ ధర సెప్టెంబర్‌లో రూ. 17.13 లక్షలు. మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత.. ఈ బైక్ ధర కొద్దిసేపటికే రూ.18.50 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం ఇయర్ ఎండ్ సమయంలో మంచి అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ 998 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 203 hp పవర్, 11400 rpm వద్ద 114.9 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్.. బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంబ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్.. ఇప్పుడు రూ. 1.14 లక్షల తగ్గుదలతో లభిస్తోంది. -
అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బండి
అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ ‘రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350’ను ను లాంచ్ చేసింది. అలనాటి బాబర్ మోటార్‌సైకిల్ శైలిలో ప్రముఖ క్లాసిక్ 350 మోడల్‌కు అప్డేట్ ఫీచర్లతో గోవాలో జరిగిన మోటోవెర్స్ 2024 ఈవెంట్లో ఈ బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ సింగిల్-టోన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు కాగా డ్యూయల్-టోన్ మోడల్ ధర రూ. 2.38 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ అనే నాలుగు కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది.కొత్త గోవాన్ క్లాసిక్ 350 ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350 మోడల్‌కు సరికొత్త రూపంగా ఉంటుంది. బాబర్ తరహాలో విలక్షణంగా దీన్ని లుక్‌ను తీర్చిదిద్దారు. దీంట్లో చేసిన ముఖ్యమైన అప్గ్రేడ్ల విషయానికి వస్తే ఏప్ హ్యాంగర్ హ్యాండిల్బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు వంటివి ఉన్నాయి.క్లాసిక్ 350 లాగే గోవాన్ క్లాసిక్ 350 కూడా అదే 349సీసీ జె-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్పీ, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 31, 2026 వరకు రెండు సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి వంద శాతం మినహాయింపు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ పాలసీని కూని ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సంఖ్యను మాపీ చేస్తూ.. అన్ని ఈవీలకు వర్తిస్తుందని వెల్లడించింది.తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, ఆటో, ట్రాక్టర్స్, బస్సులు కొనుగోలుపైన వంద శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది. కొత్త పాలసీ ప్రకారం ద్విచక్ర వాహనాలపై రూ.15,000, నాలుగు చక్రాల వాహనాలపై రూ.3 లక్షల వరకు పన్నులు, ఫీజులు ఆదా చేసుకోవచ్చు.ప్రస్తుతం తెలంగాణలో 1.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు సమాచారం. ఇది రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో 5 శాతం అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశంప్రస్తుతం తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ కొత్త ఈవీ పాలసీ.. ఇతర రాష్ట్రాలకు కూడా చేసే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో.. వాయు కాలుష్యం తీవ్రతరమైపోయింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే.. తప్పకుండా ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాల్సిందే. కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా ఈ పాలసీని అమలు చేసినా.. ఆశ్చర్యపడల్సిన పని లేదు.కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ పథకాలను తీసుకువచ్చింది. ఇప్పుడు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రూ.10,900 కోట్లు వెచ్చించింది. ఈ స్కీమ్ 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు.ఇదీ చదవండి: మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడానికి ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని సబ్సిడీలను అందించాయి. అయితే ఇప్పుడు ఫ్యూయెల్ వాహనాల మాదిరిగానే.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేశాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈవీల సంఖ్య మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. -
మరో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇదే: లాంచ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ తన లైనప్‌కు మరో బైక్ యాడ్ చేసింది. అదే స్క్రామ్ 440. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కాస్మొటిక్ అప్డేట్స్ కొన్ని గమనించవచ్చు. ఇది మార్కెట్లో 2025 జనవరి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440.. చూడటానికి స్క్రామ్ 411 మాదిరిగా ఉంటుంది. ఇది 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 25.4 Bhp పవర్, 34 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైకులో ఎస్ఓహెచ్సీ వాల్వెట్రెయిన్ సిస్టమ్ ఉండటం వల్ల సౌండ్ కూడా తగ్గుతుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 రౌండ్ హెడ్‌లైట్ కలిగి.. సింగిల్ డయల్ సెటప్ కూడా పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి వాటిని చూపిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ కలిగిన ఈ బైక్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది.15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 196 కేజీలు. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ స్టాండర్డ్ స్క్రామ్ 411 ధర (రూ. 2.06 లక్షల నుంచి రూ. 2.12 లక్షలు) కంటే కొంత ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్‌షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) 2025 జనవరి 1నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలోని బీఎండబ్ల్యూ చెన్నై సదుపాయంతో 10 మోడళ్లను అసెంబుల్ చేసింది. ఇందులో ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ, 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్ మొదలైనవి ఉన్నాయి. ఇక సీబీయూ మార్గం ద్వారా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి అవుతాయి.ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా జనవరి 1 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బెంజ్ ధరల పెరుగుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తరువాత, బీఎండబ్ల్యూ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. కాబట్టి బీఎండబ్ల్యూ కార్ల ధరలు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పెరగనున్నాయి. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న కొత్త బీఎండబ్ల్యూ కారు: రేటెంతో తెలుసా?
ఈ ఏడాది జూన్‌లో 'ఎం5' (M5) కారును గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన తరువాత బీఎండబ్ల్యూ ఎట్టకేలకు భారతీయ విఫణిలో లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఎం5 ధర రూ.1.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్, వీ8 పవర్‌ట్రెయిన్ రెండూ ఉపయోగిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.బీఎండబ్ల్యూ ఎం5 భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే దీని ధర కొంత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ కారులోని 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 577 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 194 Bhp, 280 Nm టార్క్ అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ (ఎం డ్రైవర్ ప్యాకేజీతో).బీఎండబ్ల్యూ ఎం5 కారులోని 22.1 కిలోవాట్ బ్యాటరీ 70 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 7.4 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ ఉపయోగించాలి. బ్యాటరీ 3:15 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి బ్యాటరీ కూడా మంచి రేంజ్ అందిస్తుందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..2025 ఎం5 బోల్డ్ డిజైన్ కలిగి సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ ఎయిర్ వెంట్స్ కలిగి ఉండటం చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్‌తో రీస్టైల్ బంపర్, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారులో త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కర్వ్డ్ ట్విన్ స్క్రీన్లు, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.బీఎండబ్ల్యూ ఎం5 నాన్ మెటాలిక్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, సోఫిస్టో గ్రే, బ్రూక్లిన్ గ్రే, ఫైర్ రెడ్, కార్బన్ బ్లాక్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, స్టార్మ్ బే, మెరీనా బే బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్ రెడ్/బ్లాక్, కైలామి ఆరెంజ్, సిల్వర్‌స్టోన్/బ్లాక్ & ఆల్-బ్లాక్ వంటి కాంబినేషన్లను పొందుతుంది. -
సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..
అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన 'సీ3 ఎయిర్‌క్రాస్' (C3 Aircross) ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారు కొనుగోలు చేసిన వారికి భయాన్ని కలిగించింది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ 'లాటిన్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టులో జీరో రేటింగ్ సాధించింది. అయితే ఇక్కడ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ 'బ్రెజిల్ స్పెక్' కావడం గమనార్హం. ఇది గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. అయితే సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ అని తెలియడంతో.. రాబోయే అమ్మకాలు బహుశా తగ్గే అవకాశం ఉంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సొంతం చేసుకుందన్న విషయాన్ని లాటిన్ ఎన్సీఏపీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. క్రాష్ టెస్ట్ కోసం ఎంచుకున్న మోడల్ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందింది.అడల్ట్ సేఫ్టీలో 33.01 శాతం, చైల్డ్ సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ సాధించిన సీ3 ఎయిర్‌క్రాస్.. ముందున్న ప్రయాణికులకు పటిష్టమైన భద్రత అందించడంలో విఫలమైంది. సైడ్ ఇంపాక్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. తలకు కూడా మంచి రక్షణ అందించడంలో కంపెనీ సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇది ప్రయాణికులకు భద్రత అందించడంలో విఫలమైందని లాటిన్ ఎన్సీఏపీ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్న సీ3 ఎయిర్‌క్రాస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధరలు రూ. 6.16 లక్షల నుంచి రూ. 10.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
మెగా ఆటో షో!
అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో షోకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్ మొబిలిటీ షోలో భాగంగా జరగనున్న వాహన ప్రదర్శన కోసం దేశ, విదేశీ దిగ్గజాలన్నీ క్యూ కడుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన బిగ్–5 ప్రపంచ వాహన ప్రదర్శనలను తలదన్నేలా ఢిల్లీ ఆటో ఎక్స్పో కనువిందు చేయనుంది!దేశంలో మరో వాహన జాతరకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ కొంగొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్... మారుతీ సుజుకీ నుంచి గ్లోబల్ కంపెనీలు టయోటా, చైనా బీవైడీ వరకు దాదాపు 28 కంపెనీలు తమ కొత్త వాహన ఆవిష్కరణలతో సందర్శకులను అలరించనున్నాయి. దేశంలో తొలిసారిగా ఆటో షోతో పాటు దీనికి అనుబంధంగా పలు ప్రదర్శనలను కలిపి భారత్ మొబిలిటీ షో–2025 పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 17–22 వరకు జరగనున్న ఆటో ఎక్స్పో ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత్ మండపం ఈ కార్ల మేళాతో భారత్ సత్తాను చాటిచెప్పనుంది.. ముఖ్యంగా ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలపైనే కంపెనీలన్నీ మరింత ఫోకస్ చేస్తుండటం విశేషం. 2023లో జరిగిన ఆటో షోతో పోలిస్తే రానున్న షో నాలుగు రెట్లు పెద్దది. అంతేకాదు 1986లో దేశంలో మొదలైన ఆటో ఎక్స్పో నుంచి చూస్తే.. 2025 షో కనీవినీ ఎరుగని స్థాయిలో చరిత్ర సృష్టించనుంది. డెట్రాయిట్, జెనీవా దిగదుడుపే...!ఈసారి ఆటో షో.. విదేశాల్లో పేరొందిన ప్రదర్శనలన్నింటినీ మించిపోయే రేంజ్లో ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జెనీవా, మ్యూనిక్, డెట్రాయిట్, పారిస్, టోక్యో ఆటో ఎక్స్పోలను ‘బిగ్–5’గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో ఇక్కడ పాల్గొంటున్న కంపెనీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అధిక వ్యయాలు, సందర్శకులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. మ్యూనిక్ ఆటో షోలో 13 కార్ల కంపెనీలు పాల్గొనగా... ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జెనీవా షోలో 20 వాహన సంస్థలు పాలు పంచుకున్నాయి. ఇక పారిస్‌లో 11, టోక్యోలో 22 కంపెనీలు కొత్త ఆవిష్కరణలు చేశాయి. గతేడాది జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో 13 కంపెనీలు 35 వాహన బ్రాండ్లను ప్రదర్శించాయి. కాగా, రాబోయే మన ఆటో ఎక్స్‌పోలో 16 కార్ల కంపెనీలు, 6 వాణిజ్య వాహన తయారీదారులు, 6 ద్విచక్ర వాహన సంస్థలు.. వెరసి 28 సంస్థలు అదరగొట్టేందుకు సై అంటున్నాయి. గత ఎడిషన్ (2023)కు దూరంగా ఉన్న హీరో మోటో, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, స్కోడా తదితర కంపెనీలు మళ్లీ తిరిగొస్తున్నాయి. మరోపక్క, ఈసారి అర డజను కొత్త కంపెనీలు రంగంలోకి దూకుతున్నాయి. ఇందులో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్, టీఐ క్లీన్ మొబిలిటీ, పోర్‡్ష తదితర కంపెనీలు ఉన్నాయి.వీటిపై ఫోకస్మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రి్టక్ ఎస్యూవీ వియత్నాం కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు వేవ్ మొబిలిటీ భారత్‌లో తొలి సోలార్ ఎలక్ట్రిక్ కారు ఈవీల హల్చల్.. గత షోలో కంపెనీల సంఖ్య తగ్గినప్పటికీ 75 వాహనాలను ఆవిష్కరించారు. ఈసారి కొత్త మోడళ్లతో పాటు ఆవిష్కరణలు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ ఈవీ రంగంలో తన తొలి మోడల్‌ను ప్రపంచానికి చూపనుంది. టాటా మోటార్స్ సైతం కొత్త ఈవీలను ప్రదర్శించనుంది. వియత్నాం ఈవీ తయారీదారు విన్‌ఫాస్ట్ కార్లు కూడా షో కోసం ఫుల్ చార్జ్ అవుతున్నాయి.మన మార్కెట్ రయ్ రయ్... ఈ ఏడాది మన వాహన మార్కెట్ కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ.. ప్రపంచ టాప్–10 ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యంత వేగవంతంమైన వృద్ధితో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ప్రధాన వాహన మార్కెట్లలో ఒక్క భారత్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే 2019 ముందు నాటి కోవిడ్ ముందస్తు స్థాయి అమ్మకాలను చేరుకోగలిగాయి. అత్యంత కీలక ఆటోమొబైల్ మార్కెట్లయిన అమెరికా, జర్మనీ, జపాన్‌లో 2019 నాటి ఉత్పత్తి కోవిడ్ ముందు స్థాయిని అందుకోలేకపోవడం గమానార్హం. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉంది. ఇది వాహన కంపెనీలకు అపారమైన అవకాశాలను షృష్టించనుంది. అంతేకాదు, దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే కావడం, తలసరి ఆదాయం (ప్రస్తుతం దాదాపు 2000 డాలర్లు. 2030 కల్లా 5,000 డాలర్లను చేరుతుందని అంచనా) పెరుగుతుండటం కూడా సానుకూలాంశం! -
నేలపై కారు.. గాలిలోనూ షికారు!
చైనీస్ ఆటోమేకర్ ఎక్స్‌పెంగ్ అనుబంధ సంస్థ అయిన ఎక్స్‌పెంగ్ ఏరోహ్ట్ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరుతో కొత్త మాడ్యులర్ ఫ్లయింగ్ కారును ఆవిష్కరించింది. రెండు మాడ్యూళ్లను కలిగిన ఈ కారును ఇటీవలి 15వ చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది.ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మదర్షిప్, ఎయిర్‌క్రాఫ్ట్ అనే రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. మదర్షిప్ పొడవు 5.5 మీటర్లు, ఎత్తు, వెడల్పు 2 మీటర్లు ఉంటుంది. విద్యుత్‌తో నడిచే ఈ కారు ఇది 1000 కిలోమీటర్లకుపైగా రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎయిర్‌క్రాఫ్ట్ ఆరు-రోటర్, డ్యూయల్-డక్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ , తేలికైన మన్నిక కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంది. ఎక్స్‌పెంగ్ ఈ ఫ్లయింగ్ కార్లను ఒక కొత్త ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఇది 10,000 యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.China’s Xpeng just unveiled a modular flying car called the Land Aircraft Carrier. This vehicle combines a ground module—a fully functional EV—with an air module capable of vertical takeoff and flight. pic.twitter.com/ZpqW7CjSr5— Tansu Yegen (@TansuYegen) November 20, 2024 -
నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులు ప్రారంభం
దక్షిణాఫ్రికాకు సరికొత్త ఎస్యూవీ న్యూ నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులను నిస్సాన్ మోటార్ ఇండియా ప్రారంభించింది. “ఒక కారు, ఒకే ప్రపంచం” విధానంతోపాటు భారత్‌ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఎగుమతులు చేపట్టింది.ఈ వాహనాలు చెన్నైలోని నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ నుండి ఎగుమతి అవుతున్నాయి. సరికొత్త మాగ్నైట్ మోడల్‌ను దిగుమతి చేసుకున్న మొదటి అంతర్జాతీయ మార్కెట్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. భారత్‌లో లాంచ్ అయిన ఒక నెలలోనే, చెన్నై పోర్ట్ నుండి 2,700 యూనిట్లకు పైగా న్యూ మాగ్నైట్ వాహనాలు ఎగుమతయ్యాయి.కాగా 2020 డిసెంబర్లో మాగ్నైట్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 150,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇది నిస్సాన్క “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవ విజయాన్ని చాటుతోంది. బోల్డ్ లుక్, మెరుగైన భద్రతా ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన న్యూ మాగ్నైట్ ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూ ఢిల్లీలో లాంచ్ అయింది. -
ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ''ప్యూర్ ఈవీ'' (Pure EV).. క్లారియన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనుబంధ సంస్థ 'అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ'తో చేతులు కలిపింది. ఈ సహకారంతో కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతాల వినియోగదారులకు చెరువవుతుంది.ప్యూర్ ఈవీ, అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ సహకారంతో.. ద్విచక్ర వాహనాల పంపిణీ, విక్రయాలను చేపట్టడం వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ మొదటి బ్యాచ్‌లో 50,000 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయనుంది. ఆ తరువాత నుంచి సంవత్సరానికి 60,000 యూనిట్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం.ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'నిశాంత్ డొంగరి' (Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం అమ్మకాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చేరువవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో కూడా మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇదీ చదవండి: పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎలక్ట్రిక్ బైకులలో 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft), 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X) ఉంటాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్), రూ. 1,49,999 (ఎక్స్ షోరూమ్). ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జీతో 151 కిమీ రేంజ్ అందిస్తే.. ఈట్రిస్ట్ ఎక్స్ 171 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ రెండు బైకులు ఉత్తమంగానే ఉంటాయి. -
భారత్‌లో 6 లక్షల మంది కొన్న కారు ఇదే..
అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?
భారతదేశంలో మొత్తం పండుగ సీజన్లో 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్ అన్నీ ఉన్నాయి. 2023 ఇదే పండుగ సీజన్లో అమ్ముడైన మొత్తం వాహనాలు 38.37 లక్షల యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో వాహన విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2024 పండుగ సీజన్లో 45 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది. అయితే ఊహించిన అమ్మకాలు జరగలేదు, కానీ 2023 కంటే 2024లో సేల్స్ ఉత్తమంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.2023లో ద్విచక్ర వాహనాల సేల్స్ 29.10 లక్షల యూనిట్లు కాగా.. 2024లో 33.11 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అమ్మకాలు 13.8 శాతం వృద్ధి చెందాయి. త్రీ వీలర్స్ సెల్స్ 2023లో 1.50 లక్షల యూనిట్లు.. 2024లో 6.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లకు చేరింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..కమర్షియల్ వాహన విక్రయాలు 2023లో 1.27 లక్షల యూనిట్లు.. కాగా 2024లో 1.29 లక్షల యూనిట్లు. ఈ విభాగంలో అమ్మకాలు 1 శాతం పెరిగింది. ప్యాసింజర్ వాహన సేల్స్ 2023లో 5.63 లక్షల యూనిట్లు, 2024లో 6.03 లక్షల యూనిట్లు. ఇలా మొత్తం మీద 2024లో మొత్తం వాహనాల సేల్స్ 42 లక్షల యూనిట్లను అధిగమించింది. -
ఆడి కొత్త కారు.. బుకింగ్‌లు ప్రారంభం
ముంబై: లగ్జరీ కార్ల సంస్థ ఆడి.. నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆడి ఇండియా వెబ్సైట్ లేదా ‘మైఆడికనెక్ట్’ మొబైల్ యాప్ నుంచి రూ.2,00,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.ఈ నెల 28న విడుదల చేసే న్యూ ఆడి క్యూ7 మోడల్ కార్లను ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. 3.0లీటర్ల వీ6 టీఎఫ్ఎస్ఐ ఇంజన్ కలిగిన ఆడి క్యూ7.. 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌తో ఉంటుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుందని, 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది. -
పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు ఉన్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి, చిన్న బ్యాటరీలను కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, రిమూవబుల్ లేదా స్వాపబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో పెద్ద బ్యాటరీలను కలిగిన టాప్-5 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి తెలుసుకుందాం.4 కిలోవాట్ బ్యాటరీఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్, రివర్ ఇండీ, టోర్క్ క్రటోస్ ఆర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలో 4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా 195 కిమీ (ఓలా ఎస్1 ప్రో), 190 కిమీ (ఓలా ఎస్1 ఎక్స్), 161 కిమీ (రివర్ ఇండీ), 180 కిమీ (టోర్క్ క్రటోస్ ఆర్)గా ఉంది. ఒకే పరిమాణంలో ఉన్న బ్యాటరీని కలిగి ఉన్నప్పటికీ రేంజ్ తేడా ఏంటా? అని బహుశా ఎవరికైనా అనుమానం రావొచ్చు. కానీ ఒక వాహనంలో ఉన్న ఫీచర్స్.. దాని పరిధిని (రేంజ్) నిర్థారిస్తారు. అంతే కాకుండా ఎంచుకున్న మోడ్.. ప్రయాణించే రోడ్డు మీద కూడా ఆధారపడి ఉంటాయి.4.4 కిలోవాట్ బ్యాటరీఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైకులో 4.4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 187 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఈ రేంజ్ వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో మారే అవకాశం ఉంటుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఏకైన మోడల్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ కావడం గమనార్హం.5 కిలోవాట్ బ్యాటరీసింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఫిక్డ్స్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లలోనూ లభిస్తుంది. 5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జీతో 212 కిమీ రేంజ్ అందిస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు 525 సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయించినట్లు సమాచారం.5.1 కిలోవాట్ బ్యాటరీటీవీఎస్ ఐక్యూబ్ వివిధ పరిమాణాల బ్యాటరీలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ లాంచ్ చేసిన రెండేళ్ల తరువాత 5.1 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జీతో 185 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా ఇది దాదాపు సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే సంస్థ ఈ స్కూటర్ డెలివరీలను ఇంకా ప్రారంభించలేదు.ఇదీ చదవండి: రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..7.1 కిలోవాట్ బ్యాటరీ & 10.3 కిలోవాట్ బ్యాటరీబెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైకులో 7.1 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 211 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇదే కంపెనీకి చెందిన ఎఫ్77 మ్యాక్ 2 రీకాన్ మోడల్ 10.3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 323 కిమీ రేంజ్ అందిస్తుంది. -
రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు భారతదేశంలో లక్ష యూనిట్లు దాటేశాయి. సెప్టెంబర్ 2022లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అక్టోబర్ చివరి నాటికి హైరైడర్ మొత్తం సేల్స్ 1,07,975 యూనిట్లుగా నమోదయ్యాయి.2023 ఆర్ధిక సంవత్సరంలో 22,839 యూనిట్లు, 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,916 యూనిట్లు, 2025 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 36,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హైరైడర్.. టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, మారుతి బాలెనో నుంచి పుట్టిన రీబ్యాడ్జ్ మోడల్.ఇదీ చదవండి: ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయంటయోటా కంపెనీ అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,91,029 యూనిట్ల హైరైడర్ కార్లను డీలర్‌షిప్‌లకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ వరకు హైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి పండుగ సీజన్ చాలా దోహదపడింది. టయోటా కంపెనీ మరింత మంది కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో పండుగ సీజన్లో హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. -
పండుగలో 42,88,248 వాహనాలు కొనేశారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగల సీజన్లో వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది 42 రోజులపాటు సాగిన ఫెస్టివ్ పీరియడ్‌లో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 11.76 శాతం వృద్ధితో 42,88,248 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది పండుగల సీజన్లో కస్టమర్లకు చేరిన వాహనాల సంఖ్య 38,37,040 యూనిట్లు.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. ఒడిశాలో తుఫాను, దక్షిణాదిన అకాల వర్షాలతో పరిశ్రమ అంచనాలను చేరుకోలేకపోయింది. అన్నీ అనుకూలిస్తే పండుగల సీజన్లో పరిశ్రమ 45 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని భావించింది. కాగా, ఈ ఏడాది పండుగల సీజన్లో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లు నమోదయ్యాయి. బలమైన గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో టూవీలర్స్ అమ్మకాలు 14 శాతం దూసుకెళ్లి 33,11,325 యూనిట్లను తాకాయి.వాణిజ్య వాహనాల రిటైల్ సేల్స్ 1 శాతం పెరిగి 1,28,738 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 7 శాతం అధికమై 1,59,960 యూనిట్లకు ఎగశాయి. ట్రాక్టర్ల విక్రయాలు 2 శాతం క్షీణించి 85,216 యూనిట్లకు పడిపోయాయి’ అని ఫెడరేషన్ వివరించింది. క్యాలెండర్ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒకటిన్నర నెలలు మిగిలి ఉన్నందున 2024 స్టాక్‌ను విక్రయించడంపై దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను ఎఫ్ఏడీఏ కోరింది. -
ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగాల కోతను ధ్రువపరుస్తూ జనరల్ మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుత్ వాహనాల వృద్ధి కొనసాగుతుండడంతో ఈ విభాగంలో అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది.‘భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. వాటి తయారీ, అందులో వాడే సాఫ్ట్‌వేర్‌కు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ వ్యయాలను రెండు బిలియన్ డాలర్ల (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్ డాలర్లు(రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ పోటీ మార్కెట్లో గెలవాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని, సామర్థ్యాల వినియోగాన్ని పెంచుకోవాలి. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపుఆగస్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో సాఫ్ట్వేర్ విభాగంలో పనిచేసే 1,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని గతంలో జనరల్ మోటార్స్ తొలగించింది. సెప్టెంబర్‌లో కాన్సాస్ తయారీ కర్మాగారంలో దాదాపు 1,700 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. 2023లో దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
జనవరి 1 నుంచి బెంజ్ కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది జనవరి 1 నుంచి తన అన్ని రకాల కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జీఎల్సీ మోడల్ నుంచి టాప్ఎండ్(ఖరీదు శ్రేణి) మేబాక్ ఈక్యూఎస్ 680 మోడల్ వరకు కారు ధరను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల మేర ఈ పెంపు ఉంటుందని పేర్కొంది.‘‘అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ పెరుగుదల వ్యాపార కార్యకలాపాలపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, రవాణా ఖర్చులతో గత మూడు త్రైమాసికాల నుంచి నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో ధరల పెంపు నిర్ణయం తప్పలేదు’’ అని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకునే వాహనాలకు మాత్రం పెంపు వర్తించదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు -
ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయం
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతదేశంలో 'రెవెల్టో' (Lamborghini Revuelto) కోసం రీకాల్ జారీ చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) వెబ్సైట్ ప్రకారం.. కంపెనీ 8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సూపర్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇవన్నీ 2023 డిసెంబర్ - 2024 అక్టోబర్ మధ్యలో తయారైన కార్లు.లంబోర్ఘిని తన రెవెల్టో కార్లకు రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం ప్యాసింజర్ సైడ్ విండ్‌షీల్డ్ వైపర్ సిస్టమ్‌లో సమస్య అని తెలుస్తోంది. ఈ సమస్య వైపర్ & వైపర్ మోటారు మధ్య కనెక్షన్‌ను ఏర్పరుస్తుంది. తద్వారా.. వైపర్ మోటారును వేరు చేసి వైపర్ ఆర్మ్ పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల డ్రైవర్ సరైన దృశ్యమానతను కోల్పోయే అవకాశం ఉంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.రెవెల్టో కారులో సమస్య ఉన్నట్లు వినియోగదారులు కూడా వెల్లడించలేదు. కానీ కంపెనీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే ఈ రీకాల్ ప్రకటించింది. రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని రెవెల్టో 2.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం.