Corporate
-
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్‌పిక్ -
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌లో భారీ ఆర్డర్
దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్ ఆర్డర్.1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంట్‌లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్‌లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు.ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ 640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది. ఏఎం గ్రీన్ గురించి.. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది. -
ఆర్డర్ పెట్టిందొకటి.. డెలివరీ అయ్యిందొకటి
ధన్‌తేరాస్ సందర్బంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి వాటి ద్వారా కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు బంగారు, వెండి నాణేలను అందించారు. అయితే ఆన్లైన్లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూసేద్దాం..మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి బ్లింకిట్ ద్వారా మోహిత్ జైన్ అనే వ్యక్తి.. 24 క్యారెట్ల 1 గ్రామ్ లక్ష్మి గోల్డ్ కాయిన్, 10 లక్షి గణేష్ సిల్వర్ కాయిన్ ఆర్డర్ చేశారు. అయితే అతనికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ స్థానంలో 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఫోటోలను షేర్ చేస్తూ.. బ్లింకిట్ డెలివరీ చేసే సమయానికి నేను ఇంట్లో లేను, అందుకే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడికి ఓటీపీ చెప్పి తీసుకోమన్నాను. కానీ నేను 20 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయి ఉండటం చూసి ఖంగుతిన్నాను వెల్లడించారు.వచ్చిన డెలివరీకి ఆర్డర్ చేద్దామనుకుంటే.. రిటర్న్ విండో గడువు ముగిసింది. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన వస్తువులను బ్లింకిట్‌లో ఆర్డర్ చేయడం ఇదే మొదటిసారి. అయితే డెలివెరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉందని కూడా పేర్కొన్నారు. ఇది చూసిన చాలామంది ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపైన మండిపడ్డారు.Got scammed by blinkitI ordered 1 gm gold coin from blinkit, along with the 1gm silver coin. It was all prepaid. I wasn't there at home to receive the order, so I gave the otp to my younger brother to get it received. After 20 mins I reached home and saw wrong item was… pic.twitter.com/N15wSfIhpt— Mohit Jain (@MohitJa30046159) October 29, 2024 -
ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్లను తీర్చాలి.ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు. -
'రెండు లక్షల కిరాణా స్టోర్లు మూతపడతాయి': ఏఐసీపీడీఎఫ్
భారతదేశంలో క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆన్లైన్ వ్యాపారం దేశంలోని సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడటానికి కారణమవుతాయని 'రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' (AICPDF) వెల్లడించింది.చాలామంది నిత్యావసర వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ పండుగ సీజన్లో కిరాణా స్టోర్ల విక్రయాలు చాలా వరకు మందగించాయని ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 13 మిలియన్ల కిరాణా స్టోర్స్ ఉన్నట్లు.. ఇందులో 10 మిలియన్ల కంటే ఎక్కువ టైర్ 2, చిన్న నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ ప్రకారం.. క్విక్ కామర్స్ సైట్స్ వల్ల చిన్న వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. దీనికి కారణం ఆ సైట్లలో అందించే కొన్ని డిస్కౌంట్స్ కూడా అని వెల్లడించారు. ఆన్లైన్లో కొనుగోళ్లు పెరగటం వల్ల రాబోయే రోజుల్లో చిల్లర వ్యాపారులను భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది, లేదా వారి వ్యాపారాలకు మంగళం పాడాల్సి ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కిరాణా స్టోర్లకు కస్టమర్ల సందర్శనలు దాదాపు సగానికి పడిపోయాయని తెలుస్తోంది. క్విక్ కామర్స్ ప్రభావం మెట్రోల్ నగరాల్లో ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఇప్పటికే.. టైర్ 1 నగరాల్లో 60,000 స్టోర్స్, టైర్2, టైర్ 3 నగరాల్లో 50,000 స్టోర్స్ మూతపడ్డాయి. కాబట్టి చిన్న చిల్లర వ్యాపారులకు రక్షణ కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐసీపీడీఎఫ్ వెల్లడించింది. View this post on Instagram A post shared by Upsc World official (@upscworldofficial) -
బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..
రోజు రోజుకి బంగారం ధరలు తారాజువ్వలా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు (30 అక్టోబర్) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 710 పెరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 81,160 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 74,400 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 650, రూ. 710 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 650, రూ. 710 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,160 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 74,400 వద్ద ఉంది.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,550 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 81,310 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 650, రూ. 710 పెరిగింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 100 తగ్గిన సిల్వర్ రేటు ఈ ఒక్క రోజే రూ. 2100 పెరిగింది. ధరలు ఇలాగే కొనసాగితే.. వెండి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ధనవంతులు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలు: తెలంగాణ ఎక్కడుందంటే..
2024లో దేశంలో ఎక్కువ మంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఇందులో ఏ రాష్ట్రంలో ఎంతమంది ధనవంతులనున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2020తో పోలిస్తే ధనవంతుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఇది ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను మాత్రమే కాకుండా.. సంపద సృష్టిని ప్రతిబింబిస్తుంది. ● భారతదేశంలో ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాలో అగ్రగామిగా మహారాష్ట్ర ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో మొత్తం 470 మంది ధనవంతులున్నట్లు సమాచారం. 2020తో (247 మంది) పోలిస్తే ఈ సంఖ్య 222 పెరిగినట్లు తెలుస్తోంది. ● 2020లో 128 మంది ధనవంతులతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఇప్పుడు 213మందితో మళ్ళీ అదే స్థానంలో నిలిచింది. ● గుజరాత్ రాష్ట్రంలో 129 మంది, తమిళనాడులో 119 ధనవంతులున్నట్లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో 2020లో వరుసగా 60, 65 మంది ధనవంతులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే గుజరాత్, తమిళనాడులో కూడా ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. ● తెలంగాణాలో 109 మంది ధనవంతులు, కర్ణాటకలో 108 మంది ధనవంతులున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2020లో ఈ రెండు రాష్ట్రాల్లో 54, 72 మంది ధనవంతులున్నారు. తెలంగాణ ఇప్పుడు ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల్లో కర్ణాటకకు అధిగమించింది. ● పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా 70, 40, 36, 28 మంది ధనవంతులున్నారు. 2020లో ఈ రాష్ట్రాల్లో ఉన్న ధనవంతుల సంఖ్య వరుసగా 32, 16, 9, 9 మాత్రమే. 2024లో ఈ రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.2020లో ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న తమిళనాడు, కర్ణాటక ఈ సారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2024లో మన దేశంలో ఉన్న ధనవంతుల సంఖ్య 1,322 మంది. 2020లో ఈ సంఖ్య 693 మాత్రమే. దీని ప్రకారం 2024లో 629 మంది ధనవంతులు కొత్తగా జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది. -
చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!
చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్‌డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.చైనా కంటే భారత్‌లో పెరుగుదలచైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్‌లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు డౌయిన్, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది. -
ఫ్లిప్‌కార్ట్ సరికొత్త రికార్డ్: పండుగ సీజన్లో..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ పండుగ సీజన్లో (సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 28 వరకు) 720 కోట్ల సందర్శనలను నమోదు చేసి భారీ కస్టమర్ ఎంగేజ్మెంట్ పొందింది. ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్ 2 నగరాలలోని ప్రజలు ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించినట్లు సమాచారం.కస్టమర్లు ఎక్కువగా షాపింగ్ అవసరాల కోసం ఫ్లిప్‌కార్ట్ సైట్ విజిట్ చేరారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏట పెరిగిన భాగస్వామ్యం, మెరుగైన ఆఫర్లు వంటివి అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని సాధించేలా చేశాయి. అంతే కాకుండా ఈ సారి సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల కస్టమర్లు ఉన్నారు.ఎక్కువ మంది పండుగ సీజన్లో ఫ్యాషన్, హోమ్ ఎసెన్షియల్స్, అప్లయెన్సెస్, బ్యూటీ, జనరల్ మర్చండైజ్ వంటి కేటగిరీలలో ఉత్పత్తుల కోసం సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సెర్చింగ్ విషయంలో కూడా ఈ ఏట 17 వృద్ధి నమోదైంది.సమర్థ్ సేల్ ఈవెంట్పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ సేల్ ఈవెంట్ ఎనిమిదవ ఎడిషన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇందులో వందలాది మంది కళాకారులు, చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో 25,000కు పైగా ప్రత్యేకమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ 18 లక్షల ప్రజల జీవనోపాధిపై సానుకూలంగా ప్రభావం చూపింది. ఇది ఆర్థిక వృద్ధిని దోహదపడింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా శక్తివంతమైన ఈ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ సాధించిన వృద్ధి గురించి కంపెనీ గ్రోత్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ విభిన్న ఆఫర్లతో పండుగ సీజన్‌ను ప్రారంభిస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మా పరిధిని విస్తరించడం ద్వారా మారుమూల ప్రాంతాలలోని కస్టమర్లకు కూడా సేవలందించాము. మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించగలిగామని అన్నారు.ఇదీ చదవండి: భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్లక్షకు పైగా ఉద్యోగాలుపండుగ సీజన్లో కస్టమర్లకు వేగవంతమైన డెలివరీలను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ లక్ష కంటే ఎక్కువ జాబ్స్ (గిగ్ వర్కర్స్) సృష్టించింది. ఈ సీజన్లో ఫ్లిప్‌కార్ట్.. కస్టమర్లకు మాత్రమే కాకుండా, అమ్మకందారులు, లక్షలాది మంది ఎంఎస్ఎంఈలకు, కళాకారులు, కిరానా భాగస్వాములకు ప్రయోజనం చేకూర్చడంపై దృష్టి సారించింది. -
ముడి చమురుకు కొరత లేదు
చండీగఢ్: అంతర్జాతీయంగా ముడి చమురుకు ఎలాంటి కొరత లేదని.. దేశీయ అవసరాలను తీర్చేందుకు వీలుగా తగినంత రిఫైనరీ సామర్థ్యం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ అవి కుదుటపడతాయన్న స్వీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.చండీగఢ్‌లో రోజ్‌గార్ మేళా సందర్భంగా మీడియా ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ పరిణామాలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 105 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రోజువారీగా ఉత్పత్తయ్యేది. ఓపెక్ కూటమి రోజువారీగా 5 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నది. అనంతరం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా చమురు రవాణాకు భిన్న మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగిపోయాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినా మన దగ్గరే పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఉన్నాయి.2021 నవంబర్‌లో, 2022 మే నెలలో రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నేడు చమురుకు కొరత లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ బ్యారెల్ చమురు ధర 72–73 బ్యారెళ్ల వద్దే ఉంది’’అని మంత్రి వివరించారు.దేశీయంగా 270 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీ సామర్థ్యం ఉండగా, దీన్ని 310 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 4 లక్షల బ్యారెళ్ల చమురు బ్రెజిల్ నుంచి మార్కెట్లోకి వస్తోందని, యూఎస్ సైతం మరింత పరిమాణాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి పురి చెప్పారు. -
కాకినాడలో పెన్సిలిన్–జీ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెన్సిలిన్–జి ఉత్పత్తి కోసం కాకినాడలో నెలకొల్పిన ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించినట్లు ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాలో భాగమైన లిఫియస్ ఫార్మా వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది.ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 2,500 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులతో ఈ ప్లాంటు ఏర్పాటైంది. ఈ ప్లాంటు వార్షికోత్పత్తి సామర్ధ్యం 15,000 మెట్రిక్ టన్నులుగా (ఎంటీ) ఉంటుందని సంస్థ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణ తెలిపారు.భారత్‌ను ఫార్మా తయారీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కంపెనీ తన వంతు తోడ్పాటును అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నాంది పడింది. -
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో పోస్కో జట్టు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఉక్కు సంస్థ పోస్కో తాజాగా దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జట్టు కట్టింది. భారత్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీపీఏ) గల సమగ్ర ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.పెట్టుబడులు, ప్లాంటు నెలకొల్పే ప్రాంతంపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ 1 ఎంటీపీఏ ప్రాజెక్టుకు సగటున సుమారు రూ. 8,000 కోట్ల చొప్పున 5 ఎంటీపీఏ ప్రాజెక్టుకు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘భారత్‌లో ఉక్కు, బ్యాటరీ మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యానికి సంబంధించి పోస్కో గ్రూప్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాం’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ముంబైలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ జిందాల్, పోస్కో చైర్మన్ చాంగ్ ఇన్–హువా తదితరులు పాల్గొన్నారు. ‘భారత్‌లో తయారీ రంగ ముఖచిత్రాన్ని మార్చే విధంగా టెక్నాలజీ, పర్యావరణహితమైన విధానాల విషయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాం’ అని జిందాల్ తెలిపారు. ‘కొరియా, భారత్ ఆర్థిక వృద్ధికి ఈ భాగస్వామ్యం గణనీయంగా ఉపయోగపడుతుంది’ అని చాంగ్ ఇన్–హువా పేర్కొన్నారు.ఎంట్రీ కోసం పోస్కో ప్రయత్నాలుభారత మార్కెట్లో ప్రవేశించేందుకు పోస్కో సంస్థ చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. గతంలో ఒరిస్సాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 12 ఎంటీపీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, స్థల సమీకరణలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రణాళికలను విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్)తో కూడా జట్టు కట్టే ప్రయత్నం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సాధ్యాసాధ్యాల రిపోర్టును తయారు చేసేందుకు ఇరు సంస్థల అధికార్లతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. -
జోరుగా ఐఫోన్ల ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో సుమారు రూ.50,400 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ పరంగా 33 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్‌లో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి యాపిల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ జోరు చూస్తే భారత్ నుంచి విదేశాలకు సరఫరా అయ్యే ఐఫోన్ల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2023–24లో కంపెనీ సుమారు రూ.84,000 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. ప్రభుత్వ రాయితీలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దేశంలో సాంకేతిక పురోగతి.. వెరశి కంపెనీ భారత్‌లో తన తయారీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బీజింగ్–వాíÙంగ్టన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనాలో తయారీకి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి యాపిల్ యొక్క వ్యూహంలో భారత్ కీలక కేంద్రంగా మారింది. కీలకంగా యాపిల్.. ప్రధాన మార్కెట్ అయిన యూఎస్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్‌లో రూ.24,192 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ సరఫరా అయ్యాయి. యూఎస్‌కు ఎగుమతుల పరంగా టాప్–1 సెగ్మెంట్‌గా మొబైల్స్ నిలవడంతోపాటు భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతి రంగానికి ఐఫోన్లు వెన్నెముకగా మారాయి. అయిదేళ్ల క్రితం ఇక్కడి నుంచి యూఎస్‌కు ఎగుమతి అయిన స్మార్ట్‌ఫోన్స్ విలువ రూ.43.6 కోట్లు మాత్రమే. తాజా ఎగుమతి గణాంకాలు యాపిల్ తయారీ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది.యాపిల్ కీలక సరఫరాదారులైన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్ప్, భారత్‌కు చెందిన టాటా ఎల్రక్టానిక్స్ దక్షిణ భారతదేశంలో చురుకుగా ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. చెన్నైకి సమీపంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ అతిపెద్ద సరఫరాదారుగా నిలుస్తోంది. ఇది భారత ఐఫోన్ ఎగుమతుల్లో సగం సమకూరుస్తోంది. టాటా ఎల్రక్టానిక్స్ గతేడాది విస్ట్రన్ కార్పొరేషన్ నుంచి అసెంబ్లీ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఏప్రిల్–సెపె్టంబర్ కాలంలో కర్ణాటక ఫ్యాక్టరీ నుండి సుమారు రూ.14,280 కోట్ల విలువైన ఐఫోన్లను టాటా ఎల్రక్టానిక్స్ ఎగుమతి చేసింది.కొనసాగుతున్న పెట్టుబడులు..యాపిల్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం లోపు మాత్రమే వాటా కలిగి ఉంది. షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ బ్రాండ్లదే ఇక్కడ హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆపిల్ దేశీయంగా గణనీయంగా పెట్టుబడులు చేస్తోంది. బెంగుళూరు, పుణేలో కొత్త స్టోర్లతో సహా రిటైల్ ఉనికిని విస్తరించే ప్రణాళికలతో భారత్‌లో యాపిల్ వృద్ధి పథం ఆశాజనకంగా కనిపిస్తోంది. భారత్‌లో యాపిల్ అమ్మకాలు 2030 నాటికి రూ.2,77,200 కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, సులభతర వాయిదా చెల్లింపుల స్కీములు ఇందుకు కారణంగా తెలుస్తోంది.కఠిన కోవిడ్–19 లాక్డౌన్లు, ఆరి్ధక సంక్షోభం కారణంగా మాంద్యంతో చైనాలో యాపిల్ కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశీయంగా తయారీ సామర్థ్యం పెంచుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో యాపిల్ ప్రధాన మార్కెట్‌గా చైనాను అధిగమించే అవకాశం భారత్‌కు లేదు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారత్‌లో రూ.1,17,600 కోట్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఉత్పత్తి సామర్థ్యాలను రెట్టింపు చేసింది. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్‌ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తూంటాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్‌బాక్స్ అన్‌బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్‌ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
ప్రముఖ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ తమ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. పని ప్రదేశాల్లో సిబ్బందికి అందించే టీ, కాఫీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంతో సంస్థలో పని చేస్తున్న మరింత మంది తమ కొలువులను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇజ్రాయెల్‌లోని ఇంటెల్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు టీ, కాఫీ, పండ్లు వంటి సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కాస్ట్‌కటింగ్ పేరిట ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రకటనతో కంపెనీ పరిస్థితిపై ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఉద్యోగులకు కాంప్లిమెంటరీగా అందించే కాఫీ, టీ, పండ్లకు పెద్దగా ఖర్చవ్వదు. అలాంటిది సంస్థ వాటిని అందించేందుకు కూడా ఇంతలా ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో మరింత మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే కంపెనీలోని మొత్తం శ్రామికశక్తిలో 15 శాతానికిపైగా ఉద్యోగులను కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ పేరుతో తొలగించారు.కొత్తగా మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన లేఖలను జారీ చేయడానికి మేనేజర్లు సమావేశాలను షెడ్యూల్ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ వారం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీలను సైతం అందించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!ఇదిలా ఉండగా, సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ గతంలో వెల్లడించారు. ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్
దీపావళి పండగను పురస్కరించుకుని ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రిలయన్స్ గ్రూప్ అవకాశం కల్పిస్తోంది. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్ యాప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా చర్యలు చేపట్టింది. ముదుపర్లు, వినియోగదారులు నేరుగా ఈ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్మార్ట్ గోల్డ్ ఫీచర్‌తో డిజిటల్ రూపంలో కేవలం రూ.10తో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది.నేరుగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి జియో ఫైనాన్స్ యాప్ ద్వారా 0.5 గ్రాములు, 1 గ్రా., 2 గ్రా., 5 గ్రా., 10 గ్రా. బరువుగల బంగారం అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన బంగారం అందిస్తామని తెలిపింది. గోల్డ్‌లో మదుపు చేసేందుకు మరో మార్గాన్ని కూడా జియో ఫైనాన్స్ అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!కస్టమర్లు రూ.10 అంతకంటే ఎక్కువ పెట్టుబడితో డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఇలా కొంతకాలం మదుపు చేసిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీన్ని రెడీమ్ చేసుకోవచ్చని చెప్పింది. -
ఐఫోన్ ఎగుమతుల్లో భారత్ హవా: ఆరు నెలల్లో..
భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా.అమ్మకాల పరంగా యాపిల్ గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఉద్యోగులను ఉపయోగించుకుని.. కంపెనీ దేశంలో తన పరిధిని భారీగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. అమెరికా.. చైనా దిగుమతులను తగ్గించుకోవడంతో ఐఫోన్ దిగుమతులు భారత్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది.యాపిల్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్పొరేషన్ రెండూ కూడా టాటా ఎలక్ట్రానిక్స్‌తో చేతులు కలిపాయి. స్వదేశీ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ దక్షిణ భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. చెన్నై శివార్లలోని ఫాక్స్‌కాన్ యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలో జరుగుతున్న మొత్తం ఐఫోన్ ఎగుమతుల్లో ఇది దాదాపు సగం వాటాను కలిగి ఉంది.గత సంవత్సరం యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'టిమ్ కుక్' ముంబై, న్యూఢిల్లీలోని ఆపిల్ స్టోర్స్ ప్రారంభించారు. దీంతో మన దేశంలో కూడా యాపిల్ విక్రయాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో యాపిల్ మరింత గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉంది. 2030 నాటికి భారతదేశ యాపిల్ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.7 లక్షల కోట్లు) చేరుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ కూడా వెల్లడించారు. -
10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..
నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లు 'ధన త్రయోదశి' సందర్భంగా బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటివి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించనున్నట్లు సమాచారం.ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలును చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అయితే జ్యువెలరీకి వెళ్లి షాపింగ్ చేసే ఓపిక, సమయం లేనివారు.. ఇప్పుడు గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్ మొదలైనవి ఈ యాప్‌లతో జతకట్టాయి.ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను కూడా ఈ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. 24 క్యారెట్ల లక్ష్మీ గణేష్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్లు కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా బంగారు, వెండి నాణేలను కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు ఏ జ్యువెలరీ ఎలాంటి నాణేలను అందిస్తుంది, ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి యాప్‌లని తనిఖీ చేయవచ్చు. కస్టమర్లు తప్పకుండా అధికారిక యాప్‌లను మాత్రమే తనిఖీ చేయాలి. లేకుంటే నకిలీ యాప్‌లు మోసం చేసే అవకాశం ఉంటుంది. -
మేధావులకు ప్రశ్న.. చెబితే జాబ్: సీఈఓ పోస్ట్ వైరల్
తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచుకోవడానికి చాలామంది చదరంగం, పదవినోదం వంటివి ఆడుతారు. అయితే ఇటీవల కాలంలో దీనికోసం బ్రెయిన్ టీజర్లు విరివిగా అందుబాటులోకి వచ్చేసాయి. ఇలాంటివి చూడటానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ.. లోతుగా ఆలోచింపజేస్తాయి. ఈ కోవకు చెందిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది.జెనెసిస్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ 'డినో డియోన్' ఈ పోస్ట్ చేస్తూ.. ఉద్యోగం కావాలంటే దీనికి మూడు సెకన్లలో సరైన సమాధానం చెప్పాలి, అని పేర్కొన్నారు. దీనికి సమాధానం నా ఆరేళ్ళ పిల్లాడు 30 సెకన్లలో చెప్పినట్లు వెల్లడించారు.డినో డియోన్ షేర్ చేసిన పోస్టులో 3x3-3/3+3 అని ఉంది. ఇది కేవలం మేధావులకు మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేల లైక్స్ పొందిన ఈ పోస్టుకు.. భారీ సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్లలో.. దీనిని మూడు సెకన్లలో ఎలా చెప్పగలం అని కొందరు చెబితే.. మరికొందరు మూడు సెకన్లలో ఆలోచించడానికి ప్రయత్నించవచ్చని అన్నారు. ఇంకొందరు దీనికి సమాధానం తొమ్మిది అని వెల్లడించారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. -
రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..
దేశం కోసం వేలకోట్లు ఉదారంగా దానం చేసిన దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తాయి. ఈ గౌరవంతోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించనున్న భవనానికి 'రతన్ టాటా' పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ భవనాన్ని రాడ్‌క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్లో.. టాటా గ్రూప్, సోమర్విల్లే కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించనున్నాయి. దీని ద్వారా బోధన, విద్యాకార్యకలాపాల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఇది అవసరమైన పరిశోధనలకు నిలయంగా ఉంటుంది.సోమర్విల్లే కాలేజ్, రతన్ టాటా మధ్య దశాబ్ద కాలంగా ఉన్న స్నేహం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. దీనిని లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మోరిస్ కో డిజైన్ చేయనున్నట్లు సమాచారం. రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించానికి లండన్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది.రతన్ టాటా పేరుతో భవన నిర్మాణం ప్రకటన తరువాత, సోమర్విల్లే కళాశాల ప్రిన్సిపాల్ బారోనెస్ రాయల్ మాట్లాడుతూ.. ఈ భవనం గత దశాబ్దంలో అనేక సంభాషణలు, ఆశలు, కలల ఫలం. టాటాతో మా సుదీర్ఘ అనుబంధానికి చిహ్నం అని అన్నారు. ఇది ఒక గొప్ప వ్యక్తి, సోమర్విల్లే ప్రియమైన స్నేహితుడి జీవితానికి శాశ్వత వారసత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్విల్లే కళాశాలతో ఈ సహకారం రతన్ టాటా విలువలకు నివాళి అని అన్నారు. -
హెచ్పీసీఎల్తో అమెజాన్ జట్టు
ముంబై: సుదూర రవాణా కోసం కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాల (లో కార్బన్ ఫ్యూయల్స్) అభివృద్ధి, వినియోగానికై ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం ప్రకటించింది.సుదూర రవాణాకు ఉపయోగించే వాహనాల్లో ఇంధనాలను పరీక్షించడానికి ఇరు సంస్థలు పైలట్‌ను నిర్వహిస్తాయి. కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాలను సులభంగా వినియోగించడానికి ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటు అవకాశాలను అన్వేíÙస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఇంధన ఉత్పత్తికి వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగిస్తామని వివరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ చొరవ సహాయపడుతుందని పేర్కొంది. -
స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడైన 'గౌతమ్ అదానీ' గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదానీ గ్రూప్ అధినేతగా తెలిసిన చాలా మందికి.. ఆయన మరణపు అంచులదాకా వెళ్లి వచ్చిన విషయం బహుశా తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.1962లో అహ్మదాబాద్‌లోని గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ ప్రారంభ జీవితం నిరాడంబరంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సొంత వ్యాపారం ప్రారభించాలనుకునేవారు. ఇందులో భాగంగానే గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి తప్పకున్న తరువాత అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించారు. అదే ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యంగా అవతరించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ 93.5 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1988లో ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్.. నేడు ఇంధనం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది.ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ జీవితంలో భయంకరమైన దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను అదానీ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.1998లో కిడ్నాప్గౌతమ్ ఆదానీని, అతని సహచరుడు శాంతిలాల్ పటేల్‌ను 1998లో అహ్మదాబాద్‌లో ఫజ్ల్ ఉర్ రెహ్మాన్ (ఫజ్లు), భోగిలాల్ దర్జీ (మామా) స్కూటర్లపై వచ్చి కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్లు వారిని విడుదల చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు అదానీ, పటేల్ ఇద్దరూ ఒకే రోజు విడుదలయ్యారు. కిడ్నాప్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేసును రుజువు చేయలేకపోయారు.ఉగ్రవాదుల దాడి1998లో కిడ్నాపర్ల నుంచి బయటపడిన అదానీ 2008 నవంబర్ 26న తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా అక్కడ బందీగా ఉన్నాడు. దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్‌తో సమావేశం ముగిసిన తర్వాత, దాడి ప్రారంభమైనప్పుడు అదానీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఆ సమయంలో నేను మరణాన్ని 15 అడుగుల దూరం నుంచి చూశానని అదానీ తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రాణాంతక సవాళ్లను సైతం ఎదుర్కొని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి భారతీయ వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అదానీ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్.