Market
-
ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అలర్ట్ లిస్ట్‌లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్ లిస్ట్‌లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.రేంజర్ క్యాపిటల్, టీడీఎఫ్ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్ఎఫ్ఎక్స్, గ్రోలైన్, థింక్ మార్కెట్స్, స్మార్ట్ ప్రాప్ ట్రేడర్, ఫండెడ్నెక్ట్స్, వెల్ట్రేడ్, ఫ్రెష్ఫారెక్స్, ఎఫ్ఎక్స్ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్వన్ట్రేడ్ వీటిలో ఉన్నాయి. అలర్ట్ లిస్ట్ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానాఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్‌లో డీల్ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ (ఈటీపీ) ఆపరేట్ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్ లిస్ట్‌లో చేరుస్తారు. -
గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల రికార్డులు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో కేజీ వెండి ధర మంగళవారం రూ.1,500 పెరిగి రూ.1,01,000కు చేరింది. వెండి రూ.లక్ష దాటడం ఇదే తొలిసారి. గత ఐదు రోజులుగా వెండి లాభాల బాటన పయనిస్తోంది.బంగారం 99.9 పూర్తి స్వచ్ఛత ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.350 పెరిగి రూ.81,000కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.80,600కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం, వెండి పటిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీనత విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ పెరగటమే వెండి ధర పరుగుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల భారీగా పడుతున్నాయి. దాంతో మదుపర్లు కొంత సేఫ్‌గా ఉండే బంగారంపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర పెరుగుతోంది. -
టపటపా!.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్‌లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్అండ్టీ 2%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 930.55 పాయింట్ల నష్టంతో 80,220.72 వద్ద, 309.00 పాయింట్ల నష్టంతో 24,472.10 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీ సిమెంట్, కోల్గేట్ మొదలైన కంపెనీలు చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!
దీపావళి సమీపిస్తోంది, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరిగిన ధరల కారణంగా గోల్డ్ రూ. 80వేలకు చేరువయ్యింది. ఇదిలాగే కొనసాగితే.. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు (మంగళవారం) దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్, బెంగళూరు, ముంబైలలో.. నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 73,000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.79,640 వద్ద ఉంది. నిన్నటి ధరలు పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంటే ఈ రోజు గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయన్నమాట.చెన్నైలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు నిశ్చలంగా ఉంది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,000 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,640 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,790 వద్ద ఉంది.ఇదీ చదవండి: నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న, ఈ రోజు వెండి ధర రూ. 2500 పెరిగింది. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 10,2000లకు చేరింది. వచ్చే వారమే పండుగ కాబట్టి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నిరాశ మిగిల్చిన హ్యుందాయ్ మోటార్స్ ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ మంగళవారం స్టాక్మార్కెట్లో లిస్ట్ అయింది. కొంతకాలంగా మదుపర్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ 1.5 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) రూ.27,870 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ బాట పట్టింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 17తో ముగిసింది.ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. కానీ 1.5 శాతం డిస్కౌంట్‌తో రూ.1931కు స్టాక్ మార్కెట్లో లిస్టవ్వడం గమనార్హం. ఈ ఐపీఓకు సంబంధించి భారీగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ముందుగా భావించారు. కానీ అందుకు భిన్నంగా స్టాక్ ఒక శాతం డిస్కౌంట్లో లిస్ట్ కావడంతో మదుపర్లు కొంత నిరాశ చెందుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..గతంలో లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు వచ్చిన సమయంలో అత్యధికంగా రూ.21 వేలకోట్లు సమీకరించింది. ఇవ్వాళ లిస్టయిన హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ ఏకంగా రూ.27,870 కోట్ల సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లో లిస్టయ్యింది. ఇదిలాఉండగా, కేవలం లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కంపెనీ బిజినెస్‌పై అవగాహన ఏర్పరుచుకుని, యాజమాన్యం ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణతో ఉందనే అంశాలను పరిగణించి ఐపీఓకు దరఖాస్తు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లిస్టింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల లాభాలు రాకపోయినా దీర్ఘకాలంలో మంది రాబడులు సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
ఐపీఓ ద్వారా రూ. 5,430 కోట్ల సమీకరణ
ముంబై: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి రూ. 440–463 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 4,180 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ గోస్వామి ఇన్ఫ్రాటెక్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 32 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 600 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 320 కోట్లు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు, మరో రూ. 80 కోట్లు కన్స్ట్రక్షన్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.కంపెనీ ప్రధానంగా ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇవి.. మెరైన్ అండ్ ఇండస్ట్రియల్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైడ్రో, అండర్‌గ్రౌండ్, ఆయిల్ అండ్ గ్యాస్. 2024 జూన్ 30కల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 31,747 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 3,154 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 92 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
బంగారం రూ.80,000 పైకి..
న్యూఢిల్లీ: అటు బంగారం, ఇటు వెండి.. రెండు విలువైన మెటల్స్ ధరలు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆల్‌టైమ్ రికార్డును తాకాయి. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపు రూ.79,900తో పోల్చితే సోమవారం రూ.750 పెరిగి రూ. 80,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర రూ.750 ఎగసి, రూ.80,250కి చేరింది. ఇక కేజీ వెండి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.5,000 పెరిగి రూ99,500కి ఎగసింది. కారణాలు ఇవీ... అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, డాలర్ బలహీనత, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీన ధోరణి విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ వెండికి కలిసి వస్తున్న అంశం. అంతర్జాతీయంగా రికార్డులు పశి్చమ దేశాల సెంట్రల్ బ్యాంకుల సరళతర ఆర్థిక విధానాల నేపథ్యంలో సోమవారం యూరోపియన్ ట్రేడింగ్ గంటల్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 2,730 డాలర్ల స్థాయికి చేరింది. వెండి సైతం 3 శాతం పెరిగి 12 సంవత్సరాల గరిష్ట స్థాయి 34.20 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర రికార్డు ధర వద్ద 2,752 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,755 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకింది. గత ముగింపుకన్నా ఇది 25 డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.650 లాభంతో రూ. 78,380 రికార్డు ధర వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.2,500 లాభంతో రూ.98,000 వద్ద ట్రేడవుతోంది. -
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
దండిగా పెరిగిన వెండి.. రూ.80వేల అంచుకు పసిడి
Gold Price Today: దేశంలో బంగారం ధరల పరుగు ఆగడం లేదు. వరుసగా ఆరు రోజుల తర్వాత కూడా పసిడి దిగిరాలేదు. నేడు (అక్టోబర్ 21) కూడా బంగారం ధరలు ఎగిశాయి. వరుస పెరుగుదలతో పసిడి ప్రియుల్లో దడ పుడుతోంది.తులమెంత?హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.200 పెరిగి రూ.73,000 లను తాకింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 పెరిగి రూ. 79,640 వద్దకు ఎగిసింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో ధరలు ఉన్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ నేడు బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.73,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.79,790 వద్దకు చేరాయి.వెండి కూడా..Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా నేడు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2000 ఎగిసి కొత్త గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.1,09,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
క్యూ2 ఫలితాలదే పైచేయి
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నిర్దేశించనున్నాయి. గత వారాంతాన పలు దిగ్గజాలు జులై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు వెల్లడించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రాసహా ఆర్బీఎల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం పనితీరు ప్రకటించాయి. దీంతో సోమవారం ప్రధానంగా ఈ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఈ వారం మరిన్ని రంగాలకు చెందిన బ్లూచిప్ కంపెనీలు క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. జాబితాలో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హచ్‌యూఎల్, రిఫైనరీ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ తదితరాలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇదేవిధంగా ఫైనాన్స్ దిగ్గజాలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. అదానీ గ్రీన్ ఎనర్జీ, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. చమురు ధరలు సైతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన వివాదాలతో ఇటీవల ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 75 డాలర్లకు చేరింది. దీనికిజతగా అన్నట్లు విదేశీ మార్కెట్లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 2,730 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని దాటింది. చమురు, పసిడి ధరల పెరుగుదల వాణిజ్యలోటును పెంచే వీలుంది. దీనికితోడు ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. చరిత్రత్మాక కనిష్టం 84కు బలహీనపడి కదులుతోంది. ఇవి ప్రతికూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, చమురు ధరల సెగ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణమయ్యే అవకాశమున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పొరేట్ ఫలితాలను నిశితంగా గమనిస్తారని మిశ్రా చెబుతున్నారు. గత వారమిలా పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 157 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 81,225 వద్ద ముగిసింది. నిఫ్టీ కొంత అధికంగా 110 పాయింట్లు(0.4 శాతం) నీరసించి 24,854 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతమే నష్టపోగా.. స్మాల్ క్యాప్ 1 శాతంపైగా క్షీణించింది. ఎఫ్‌పీఐ అమ్మకాలు భౌగోళిక, రాజకీయ అనిశి్చతులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నట్లు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 74,700 కోట్ల విలువైన అమ్మకాలు చేట్టారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు) కొనుగోళ్లు చేపడుతుండటం గమనార్హం! ఈ ట్రెండ్ సమీపకాలంలో కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చైనా స్టాక్స్ చౌకగా లభిస్తుండటం, దేశీ మార్కెట్లు అధిక విలువలకు చేరుకోవడం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేíÙంచారు. కాగా.. క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ. 17,286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కొటక్ బ్యాంక్ 13 శాతం అధికంగా రూ. 5,044 కోట్ల నికర లాభం ఆర్జించింది. టెక్ మహీంద్రా 60.3 కోట్ల డాలర్ల(రూ. కోట్లు) విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. ఈ వివరాలు శనివారం(19న) వెల్లడయ్యాయి. వీటి ప్రభావం నేడు(21న) ఆయా స్టాక్స్‌పై కనిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.క్యూ2 ఫలితాలదే పైచేయిఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూషన్స్ అందించే బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సంస్థ తమ షేర్లను 2:1 నిష్పత్తిలో విభజించనుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వివరించింది. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరును రూ. 1 ముఖ విలువ ఉండే షేరుగా విభజిస్తారు. కంపెనీ ఇటీవలే బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజీనీ, బయోస్టర్ పేరిట నాలుగు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది.నవంబర్ 1న ముహూరత్ ట్రేడింగ్దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూరత్(మూరత్) ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్ 1న(శుక్రవారం) సాయంత్రం 6 నుంచి 7వరకూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది సంవత్ 2081 ప్రారంభంకానున్నట్లు ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. హిందువుల క్యాలండర్ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూరత్ ట్రేడింగ్ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తుంటాయి. కాగా.. దీపావళి రోజు మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ ఉండదు. దీనిస్థానే సాయంత్రం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. 5.45కల్లా ప్రీఓపెనింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుంటుంది.పీఎస్‌యూలలో ట్రేడింగ్‌కు నో ప్రభుత్వ అధికారులకు దీపమ్ ఆదేశాలుప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్లపై ప్రభావం చూపగల రహస్య సమాచారం అందుబాటులో ఉంటుందన్న యోచనతో దీపమ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖలలో చేరేందుకు ఎంపికయ్యే వ్యక్తులు పీఎస్‌యూలలో షేర్లను కలిగి ఉంటే ముందుగానే వెల్లడించవలసిందిగా తెలియజేసింది. అధికారిక అనుమతులు పొందాక మాత్రమే వీటిని విక్రయించేందుకు వీలుంటుందని వివరించింది. పీఎస్‌యూలలో ప్రభుత్వ ఈక్విటీని దీపమ్ మేనేజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా పీఎస్‌యూలలో ప్రభుత్వానికి చెందిన మైనారిటీ వాటా లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం, ఎంపిక చేసిన కంపెనీల ప్రయివేటైజేషన్ తదితరాలను చేపట్టే సంగతి తెలిసిందే. వెరసి షేర్ల ధరలను ప్రభావితం చేయగల సమాచారం అందుబాటులో ఉంటుందన్న కారణంతో పీఎస్‌యూలలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ప్రభుత్వ అధికారులకు అంతర్గత ఆదేశాల ద్వారా దీపమ్ స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం గతేడాది(2023–24) రూ. 16,507 కోట్ల విలువైన సీపీఎస్ఈ షేర్లను విక్రయించిన విషయం విదితమే. అంతక్రితం ఏడాది(2022–23)లోనూ రూ. 35,294 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) జీఐసీ, కొచిన్ షిప్‌యార్డ్‌లలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 5,160 కోట్లు అందుకుంది.చిన్నషేర్ల ఫండ్స్‌కు భారీ పెట్టుబడులు 6 నెలల్లో రూ. 30,352 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో మధ్య, చిన్నతరహా షేర్ల ఫండ్స్‌కు మరోసారి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 30,352 కోట్లు ప్రవహించాయి. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వివరాల ప్రకారం మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 14,756 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ. 15,586 కోట్లు చొప్పున పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇందుకు మధ్య, చిన్నతరహా షేర్ల విభాగాలు ఆకట్టుకునే స్థాయిలో రిటర్నులు సాధించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) తొలి ఆరు నెలల్లోనూ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 32,924 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఓవైపు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది పెట్టుబడులు కొనసాగడం గమనార్హం! అధిక రిటర్నులు మిడ్, స్మాల్ క్యాప్స్ అత్యధిక లాభాలు అందించగలవన్న ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు కారణమని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఈవో సందీప్ బాగ్లా, ట్రేడ్జినీ సీవోవో ట్రివేష్ పేర్కొన్నారు. ఇకపైన కూడా చిన్న షేర్లు వేగవంతంగా వృద్ధి చెందనున్నట్లు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధిగల రంగాలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో భాగమైపోయినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 20 శాతం, స్మాల్ క్యాప్ 24 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా నిఫ్టీ, లార్జ్‌క్యాప్ ఇండెక్సులను అధిగమించాయి. 2024 మార్చిలో స్ట్రెస్ టెస్ట్ సైతం ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలియజేశారు. దీంతో ఫండ్ మేనేజర్లు మార్కెట్ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లు వివరించారు.సాక్షి, బిజినెస్ డెస్క్ -
ధర వింటేనే దడ.. మళ్లీ పెరిగిన బంగారం
Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గేదే లేదన్నట్టుగా పరుగుతీస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు (అక్టోబర్ 19) కూడా పసిడి పైకే ఎగిసింది. నేడు పుత్తడి రేట్లు ఎక్కడెక్కడ ఎంత మేర పెరగాయన్నది ఇక్కడ చూద్దాం.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.72,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.440 పెరిగి రూ. 79,420 వద్దకు ఎగిసింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో ధరలు ఉన్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ నేడు బంగారం ధరలు మరింత పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.72,930 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.440 పెరిగి రూ.79,570 వద్దకు చేరాయి.వెండి మరింత స్పీడ్..Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా నేడు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2000 ఎగిసి కొత్త గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.1,07,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
డీమ్యాట్ సెక్యూరిటీలు రూ. 500 లక్షల కోట్లు
డీమెటీరియలైజ్డ్(డీమ్యాట్) రూపంలో ఉన్న మొత్తం సెక్యూరిటీల విలువ రూ. 500 లక్షల కోట్లను తాకినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. 2024 సెప్టెంబర్‌కల్లా 6 లక్షల కోట్ల డాల ర్లకు చేరినట్లు తెలిపింది.తొలి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను 18ఏళ్లలో అంటే 2014 జూన్‌లో అందుకున్నట్లు తెలియజేసింది. తదుపరి ఆరేళ్ల కాలంలో 2020 నవంబర్‌కల్లా విలువ రెట్టింపై రూ. 200 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో డీమ్యాట్ సెక్యూరిటీలు 4ఏళ్లలోనే రూ. 500 లక్షల కోట్లయ్యింది. కృతజ్ఞతలుఈ చరిత్రాత్మక మైలురాయికి కారణమైన ఇన్వెస్టర్లు, మార్కె ట్ పార్టిసిపెంట్లు, నియంత్రణ సంస్థలు తదితరులకు కృతజ్ఞతలు. – ఎస్.గోపాలన్, ఎన్ఎస్డీఎల్ ఎండీ -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 294.25 పాయింట్ల లాభంతో 81,300.86 వద్ద, నిఫ్టీ 113.55 పాయింట్ల లాభంతో 24,863.40 వద్ద నిలిచాయి.యాక్సిస్ బ్యాంక్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జిందాల్ స్టీల్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, నెస్లే, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి మోత.. ఒకేసారి భారీగా పెరిగిన బంగారం
Gold Price Today: దేశంలో పసిడి మోత మోగుతోంది. వరుసగా మూడో రోజూ బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత రెండు రోజులలో పెరిగిన దానికంటే ఈరోజు (అక్టోబర్ 18) భారీగా ధరలు ఎగిశాయి. ఏరోజుకారోజు కొత్త మార్కులను దాటుకుంటూ వెళ్తున్న తులం బంగారం రేట్లు రూ.80 వేలకు చేరువవుతున్నాయి.వివిధ ప్రాంతాల్లో ధరలిలా..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.72,400 వద్దకు ఎగిసింది. 24 క్యారెట్ల బంగారమైతే రూ.870 ఎగిసి రూ. 78,980 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇలాగే భారీగా ధరలు పెరిగాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లిలోనూ నేడు బంగారం ధరలు భారీగా ఎగిశాయి. 22 క్యారెట్ల బంగారం రూ.800 పెరిగి రూ.72,550 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి ఏకంగా రూ.79,130 వద్దకు చేరాయి.వెండి కొత్త మార్క్‌కు..Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి అత్యధికంగా రూ.2000 ఎగిసి కొత్త మార్క్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.1,05,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..
భారతదేశంలో బంగారం ధర రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం నేడు రూ. 78వేలు దాటేసింది. దిగుమతులు కొంత తగ్గడం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమైందని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా పేరొన్నారు.బంగారం ఇప్పుడు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి వైమానిక దాడుల తరువాత యూఎస్ అధ్యక్ష ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైందని కెడియా అన్నారు.యూఎస్ ట్రెజడీ దిగుబడులు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య.. బలమైన డాలర్ కారణంగా ధరలు అధిక స్థాయిల నుండి వెనక్కి తగ్గాయి. అయినప్పటికీ సురక్షితమైన బిడ్లు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు, ముఖ్యంగా లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో, క్షీణతను పరిమితం చేయడంలో దోహదపడింది.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పుభారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. దీపావళికి బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది. మొత్తం మీద పసిడి ధర ఆకాశాన్నంటేలా దూసుకెళ్తోంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 488.40 పాయింట్ల నష్టంతో 81,012.96 వద్ద, నిఫ్టీ 220.55 పాయింట్ల నష్టంతో 24,750.75 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ & టూబ్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన కంపెనీలు నిలిచాయి. బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అంతకంతకూ పెరిగిపోతున్న బంగారం!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిన్నటి రోజున భారీగా ఎగిసి గరిష్టాలకు చేరిన పసిడి రేట్లు నేడు (అక్టోబర్ 17) మరింతగా పెరిగాయి. దీంతో తెలుగురాష్ట్రాలలో తులం బంగారం రూ.78 వేలను దాటిపోయింది.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.71,600 వద్దకు ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ. 78,110 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇలాగే ధరలు పెరిగాయి.ఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ నేడు 22 క్యారెట్ల బంగారం రూ.71,750 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.78,260 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.200, రూ.220 చొప్పున ఎగిశాయి.వెండి స్వల్పంగా..Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.100 పెరిగి రూ.1,03,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
డేటా షేరింగ్‌పై సెబీ చర్చాపత్రం
డేటా గోప్యత, జవాబుదారీతనం మొదలైన పరిశోధనల కోసం డేటాను షేర్ చేసుకోవడానికి ప్రత్యేక విధానాలు రూపొందించుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఈమేరకు స్టాక్ ఎక్ఛ్సేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) సొంత విధానాలను ఏర్పాటు చేసుకోవాలని సెబీ తెలిపింది.వాణిజ్య అవసరాల కోసం షేర్ చేసుకునే డేటా గోప్యత, జవాబుదారీతనం..వంటి అంశాలపై సెబీ చర్చాపత్రాన్ని రూపొందించింది. సెబీలో భాగమైన మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీ(ఎండీఏసీ) సూచనల ప్రకారం మార్కెట్ డేటాకు బాధ్యత వహించాల్సిన సంస్థలు డేటా సేకరణ, ప్రాసెసింగ్, స్టోరేజ్, షేరింగ్, గోప్యత పాటించడం, యాక్సెస్ ఇవ్వడం మధ్య సమతూకంతో వ్యవహరించేలా తగు విధానాలను రూపొందించుకోవాలి. ఎంఐఐలు డేటాను రెండు కేటగిరీల కింద వర్గీకరించాలి. ఒకటి బహిరంగంగా షేర్ చేసుకునే డేటా. రెండు..గోప్యంగా ఉంచాల్సిన డేటా. కేవైసీ వివరాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు పరోక్షంగా ఉపయోగపడే డేటా రెండో కేటగిరీ పరిధిలోకి వస్తుంది. మార్కెట్లో స్థిరమైన విధానాలను పాటించేలా చూడటం ఈ పాలసీ లక్ష్యంగా సెబీ తెలిపింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 29లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర! -
గరిష్ఠాలను చేరిన బంగారం ధర!
ఇటీవల కాలంలో మదుపర్లు స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,400 (22 క్యారెట్స్), రూ.77,890 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,890 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: ‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 పెరిగి రూ.71,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 పెరిగి రూ.78,040 వద్దకు చేరింది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గి రూ.1,02,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆలూ, ఉల్లి ధరలు తీవ్రం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.84 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆగస్టులో ఇది 1.31 శాతం కాగా, 2023 సెప్టెంబర్‌లో అసలు పెరుగుదల లేకపోగా -0.07 శాతం క్షీణించింది. కూరగాయల ధరలు ప్రత్యేకించి ఆలూ, ఉల్లి ధరల తీవ్రత అధికంగా ఉంది. సమీక్షా నెల్లో మూడు ప్రధాన విభాగాలు చూస్తే..ఫుడ్ ఐటమ్స్ టోకు ద్రవ్యోల్బణం 11.53 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.11 శాతం కావడం గమనార్హం. ఆగస్టులో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా -10.01 శాతం తగ్గుదల నమోదయ్యింది. అయితే సమీక్షా నెల సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 48.73 శాతంగా ఉంది. ఆలూ ధరలు 78.13 శాతం పెరిగితే, ఉల్లి ధరలు ఏకంగా 78.82 శాతం ఎగశాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరలు 4.05 శాతం తగ్గాయి. రిటైల్ ధరలూ భారమే..! ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్‌లో తీవ్రంగా ఉండడం గమనార్హం. సమీక్షా నెల్లో ఈ స్పీడ్ ఏకంగా 9నెలల గరిష్ట స్థాయిలో 5.49 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.65 శాతం. అధిక కూరగాయల ధరలు దీనికి కారణమని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.24 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 5.66 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే నెల్లో 6.62 శాతం. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద, సెన్సెక్స్ 152.93 పాయింట్ల నష్టంతో 81,820.12 వద్ద నిలిచాయి.భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, భారతి ఎయిర్టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?
దీపావళి సమీపిస్తున్న తరుణంలో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు పసిడి ధరలు కొంత మేర తగ్గాయి. దీంతో నేటి (మంగళవారం) బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,400 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధానిలో కూడా 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గాయి. దీంతో నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 71,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,550 వద్ద ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర కొంత ఎక్కువనే తెలుస్తోంది.చెన్నైలో 10 గ్రామ్స్ గోల్డ్ రేటు నిన్నటికంటే రూ. 200, రూ. 220 తక్కువ. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,400 వద్ద ఉంది.వెండి ధరబంగారం ధర స్వల్ప తగ్గుదలను నమోదు చేసినప్పటికీ.. గత మూడు రోజులుగా వెండి ధరలు తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.03 లక్షల వద్ద ఉంది. ఇదే ధరలు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).