Market
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 591.69 పాయింట్ల లాభంతో 81,973.05 వద్ద, నిఫ్టీ 163.70 పాయింట్ల లాభంతో 25,127.95 వద్ద ఉన్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. విప్రో, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో వంటి సంస్థలు చేరాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), మారుతి సుజుకి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
Gold Price Today: పండుగ తర్వాత బంగారం ధరలు కాస్త ఊరట కల్పించాయి. దేశవ్యాప్తంగా సోమవారం (అక్టోబర్ 14) పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. రెండు తెలుగురాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రధాన ప్రాంతాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.50 తగ్గి రూ.71,150 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.50 క్షీణించి రూ. 77,620 వద్దకు దిగివచ్చింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇలాగే ధరలు స్వలంగా క్షీణించాయి.అలాగే ఢిల్లిలో నేడు 22 క్యారెట్ల బంగారం రూ.71,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.77,770 వద్ద ఉన్నాయి. రెండు రకాల బంగారం మీద 10 గ్రాములకు రూ.50 చొప్పున తగ్గుదల నమోదైంది.వెండి నిలకడగానే..Silver Price Today: దేశంలో వెండి ధరలు వరుసగా రెండోరోజు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తులం బంగారం ఎంత.. పెరిగిందా.. తగ్గిందా?
Gold Price Today: దేశంలో వరుసగా రెండో రోజులు పెరిగిన బంగారం ధరలు నేడే (అక్టోబర్ 13) శాంతించాయి. ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయితెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,670 వద్ద ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఢిల్లిలో 22 క్యారెట్ల బంగారం రూ.71,350, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.77,820 లుగా కొనసాగుతున్నాయి.వెండి స్థిరంగానే..Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా ఈరోజు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దసరా నాడూ మరింత ఖరీదైన బంగారం
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన పసిడి ఈరోజు (అక్టోబర్ 12) కూడా సుమారుగా పెరిగాయి. దీంతో దసరా పండుగ రోజు బంగారం కొనేవారికి కాస్తంత నిరాశ తప్పలేదు.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజుల 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.71,200 లకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.270 ఎగిసి రూ. 77,670 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు ఎగిశాయి.దేశ రాజధాని ఢిల్లిలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.71,350 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ.77,820 వద్దకు చేరింది.వెండిదీ అదే దారిSilver Price Today: దేశంలో వెండి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. క్రితం రోజున కేజీకి రూ.2000 పెరిగిన వెండి నేడు రూ.1000 ఎగిసింది. దీంతో హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.1,03,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక!
క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ–సిప్)పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం సిప్ల రూపంలో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి.క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. క్రమంగా ఈక్విటీ మార్కెట్‌పై మదుపర్లకు నమ్మకం పెరుగుతోంది. దానికితోడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల వద్ద దాదాపు రూ.లక్ష ఇరవైవేల కోట్లు నిలువ ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి స్టాక్‌లు విక్రయిస్తున్నారు. అందులో నాణ్యమైన స్టాక్‌లపై ఫండ్ మేనేజర్లు ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు..ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
పండుగ ముందు ఒక్కసారిగా ఎగిసిన పసిడి, వెండి
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఐదారు రోజులుగా తగ్గుముఖంలో ఉన్న పసిడి రేట్లు శుక్రవారం (అక్టోబర్ 11) భారీగా పెరిగాయి. దీంతో దసరా పండుగకు ముందు కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు ఏకంగా రూ.700 పెరిగి రూ.70,950 లకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.760 ఎగిసి రూ. 77,400 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు ఎగిశాయి.ఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.700 పెరిగి రూ.71,100 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.760 ఎగిసి రూ.77,550 వద్దకు చేరింది.సిల్వర్ మళ్లీ స్వింగ్Silver Price Today: దేశంలో వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. క్రితం రోజున నిలకడగా ఉన్న వెండి నేడు కేజీకి ఏకంగా రూ.2000 పెరిగింది. ఈ బారీ పెంపుతో హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.1,02,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఐదేళ్లలో ఏయే టాటా షేరు ఎంత పెరిగిందంటే..
టాటా గ్రూప్ విలువను రతన్ టాటా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగు పెట్టించారు. రూ.10 వేలకోట్లుగా ఉన్న సంస్థల విలువను ఏకంగా రూ.30 లక్షల కోట్లకు చేర్చారు. అంతకుమించి ప్రజల్లో తన సేవానిరతితో చేరిగిపోని చోటు సంపాదించారు. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లు ఎంత శాతం పెరిగాయో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాటాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల పరుగు..కంపెనీ పేరు షేరు ర్యాలీ(%)టాటా టెలీసర్వీసెస్ 3002 ఆటోమోటివ్ స్టాంపింగ్స్ 2211 ట్రెంట్ 1499 టాటా ఎలక్సీ 1109 టాటా ఇన్వెస్ట్మెంట్ 820 టాటా పవర్ 686 టాటా మోటార్స్ 628 టీఆర్ఎఫ్ 489 టాటా కమ్యూనికేషన్స్ 453 ఓరియంటల్ హోటల్స్ 391 ఇండియన్ హోటల్స్ 376 టాటా స్టీల్ 362 టాటా కెమికల్స్ 347 నెల్కో 333 టాటా కన్జూమర్ 304 టైటన్ కంపెనీ 176 వోల్టాస్ 165 టీసీఎస్ 111 ర్యాలీస్ ఇండియా 81 -
మరింత దిగొచ్చిన బంగారం.. తులం ఎంతంటే..
Gold Price Today: దేశమంతా పండుగ సందడి నెలకొంది. అందరూ దసరా నవరాత్రలు, దీపావళి ఉత్సాహంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనేవారికి తగ్గుముఖం పడుతున్న ధరలు ఊరట కల్పిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి రేట్లు నేడు (అక్టోబర్ 10) కూడా మరింత దిగివచ్చాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.50 తగ్గి రూ.70,250 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.50 క్షీణించి రూ. 76,640 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లిలోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.70,400 వద్దకు 24 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గి రూ.76,790 వద్దకు దిగివచ్చింది.వెండి ధరలు ఇలా..Silver Price Today: దేశంలో వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున కేజీకి రూ.2000 తగ్గిన వెండి హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.1 లక్ష వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఇదే మంచి తరుణం! పండుగ వేళ పసిడిపై భారీ శుభవార్త
Gold Price Today: దసరా నవరాత్రలు, దీపావళి పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ శుభవార్త. దేశంలో పసిడి, వెండి ధరలు ఈరోజు (అక్టోబర్ 9) భారీగా తగ్గాయి. నిన్నటి రోజున నిలకడగా అంతకుక్రితం రోజున స్వల్పంగా తగ్గిన బంగారం నేడు గణనీయంగా దిగొచ్చింది.తెలుగు రాష్ట్రాలో తగ్గిందెంత?హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.700 తగ్గి రూ.70,300 వద్దకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.760 మేర క్షీణించి రూ. 76,690 వద్దకు తరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు క్షీణించాయి.ఇక దేశ రాజధాని ఢిల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.700 చొప్పున తగ్గి రూ.70,450 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.760 మేర కరిగి రూ.76,840 దగ్గరకు దిగివచ్చింది.రూ.లక్షకు వెండిSilver Price Today: దేశంలో నేడు వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. క్రితం రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి అదే ఊపుతో ఈరోజు ఏకంగా రూ.2000 తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1 లక్షకు పరిమితమైంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎట్టకేలకు కొండ దిగిన వెండి.. ఊరటనిచ్చిన పసిడి
Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఈరోజు (అక్టోబర్ 8) ఎలాంటి పెరుగుదల లేకుండా నిలకడగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. కాగా నిన్నటి రోజున పసిడి ధరలు కొంత మేర క్షీణించాయి. ఈరోజు మరింత తగ్గుదల లేకపోయినప్పటికీ స్థిరంగా కొనసాగడం ఊరటగా చెప్పుకోవచ్చు.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.71,000 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ. 77,450 వద్ద ఉన్నాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.మరోవైపు చైన్నైలో మాత్రం 18 క్యారెట్ల పసిడి రేట్లలో తగ్గుదల నమోదైంది. ఈ బంగారం 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.58,150 వద్దకు దిగొచ్చింది. 22, 24 క్యారెట్ల బంగారం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.71,100 వద్ద, రూ.77,450 దగ్గర ఉన్నాయి. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.71,150, 24 క్యారెట్ల బంగారం రూ.77,600 వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: ‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్దిగొచ్చిన వెండిSilver Price Today: దేశంలో ఎట్టకేలకు వెండి ధరలు కొండ దిగాయి. మూడు రోజుల క్రితం కేజీకి రూ.2000 పెరిగిన వెండి తర్వాత తగ్గుముఖం పట్టలేదు. ఈరోజు మాత్రం రూ.1000 తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,02,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్‌కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం తగ్గుముఖం.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం!
Gold Price Today: దేశంలో రెండు రోజులుగా నిలకడగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (అక్టోబర్ 7) కాస్త తగ్గాయి. పెరుగుదల మీదున్న పసిడి ధరలు నెమ్మదించి తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులలో కొత్త ఉత్సాహం వచ్చింది.హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర ఈరోజు రూ.200 తగ్గి రూ.71,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.220 క్షీణించి రూ. 77,450 వద్దకు దిగొచ్చింది. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు క్షీణించాయి. 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.71,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 కరిగి రూ.77,600 వద్దకు తగ్గింది.ఇదీ చదవండి: గూగుల్‌పేలో గోల్డ్ లోన్..నిలకడగా వెండిSilver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు కూడా నిలకడగా కొనసాగుతన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పేరుకు స్మాల్ క్యాప్..మిడ్ క్యాప్ సంస్థల్లో పెట్టుబడెందుకు?
స్మాల్ క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎందుకు కేటాయింపులు చేస్తుంటాయి? – వంశీ గౌడ్నిజానికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు అన్నింటినీ స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే పెట్టేయవు. ఇది సాధారణ నమ్మకానికి విరుద్ధమైనది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు పెట్టుబడుల పరంగా కొంత వెసులుబాటు కల్పించింది. స్మాల్‌క్యాప్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మిగిలిన 35 శాతాన్ని ఏ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలన్నది పూర్తిగా ఫండ్ మేనేజర్ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా ఈ 35 శాతాన్ని మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌లో ఏ విభాగానికి కేటాయించాలన్నది ఫండ్ మేనేజర్లు నిర్ణయిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఆటుపోట్లు ఎక్కువ. లిక్విడిటీ సమస్యలు కూడా ఉంటాయి. అందుకని పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఇతర మార్కెట్ క్యాప్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్‌లను అధిగమించొచ్చు.28 స్మాల్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్‌ను గమనిస్తే.. అవి తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 82 శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు, 13 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించాయి. కేవలం ఆరు పథకాలే మిడ్‌క్యాప్ కంపెనీలకు 15 శాతానికి మించి పెట్టుబడులు కేటాయించాయి. వాటి పనితీరు మిశ్రమంగా ఉంది. మూడు పథకాలు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250కి మించి పనితీరు చూపించాయి. మరో మూడు బెంచ్ మార్క్ పనితీరు స్థాయిలో రాబడులు అందించాయి. కేవలం జేఎం స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్‌క్యాప్, ఎస్బీఐ స్మాల్‌క్యాప్, డీఎస్పీ స్మాల్‌క్యాప్ పథకాలే 90 శాతానికి పైగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి అమలవుతున్న ఆరు మార్పులు ఇవే..నా వద్ద రూ.35 లక్షలు ఉన్నాయి. 8 నుంచి 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఏడు పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయాలన్నది నా యోచన. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్‌కు ఇది మంచి వ్యూహమే అవుతుందా? – జయదేవ్రూ.35 లక్షల పెట్టుబడులను 8–10 ఏళ్ల కాలానికి, వివిధ పథకాల పరిధిలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, ఏడు పథకాల పరిధిలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది పెద్దగా ఫలితం ఇవ్వదు. దీనికి బదులు మొత్తం పథకాల సంఖ్యను ఐదుకు తగ్గించుకోవడాన్ని పరిశీలించండి. అప్పుడు ఒక్కో పథకానికి 20 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. కొన్ని పథకాలపైనే దృష్టి సారించడం వల్ల వాటికి అర్థవంతంగా కేటాయింపులు చేసుకోవడానికి వీలుంటుంది. ఐదు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాటి పనితీరును ఎప్పటికప్పుడు సులభంగా సమీక్షించుకుంటూ, అవసరమైతే సర్దుబాట్లు చేసుకోవచ్చు. పెట్టుబడులను ఎక్కువ పథకాల మధ్య విస్తరించడం వల్ల అది సంతృప్తిని ఇవ్వొచ్చు. కానీ, విడిగా ఒక్కో పథకానికి తగినంత సమయాన్ని కేటాయించడం సాధ్యపడకపోవచ్చు. -
మరో రెండేళ్లలో రూ.86 వేలకు బంగారం: ఓస్వాల్
పండుగ సీజన్లో పసిడి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారం రూ. 78వేలకు చేరువలో ఉంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు మార్కెట్‌కు మరింత లాభాలను జోడించే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించారు. అంతే కాకుండా దేశీయ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ETF), SPDR హోల్డింగ్స్‌తో పాటు దిగుమతులు, CFTC స్థానాలు మార్కెట్‌కు మద్దతునిస్తాయని ఆయన అన్నారు.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరి, భౌగోళిక రాజకీయాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమని ఓస్వాల్ పేర్కొన్నారు. పండుగలు, వివాహ సంబంధిత శుభకార్యాలు కూడా దేశీయ డిమాండ్ మార్కెట్లో సెంటిమెంట్లను పెంచుతుందని వివరించారు. ఇదే విధంగా ధరలు ముందుకు సాగితే.. బంగారం ధర 86,000 (10 గ్రాములు) రూపాయలకు చేరుతుందని అన్నారు.పండుగ సీజన్ ముగిసే వరకు బంగారం ధరలు తగ్గే అవకాశం చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది మెరుగైన రుతుపవనాలు, అధిక పంట దిగుబడులు.. గ్రామీణ ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయనున్నాయి. దిగుమతి సుంకం తగ్గింపు ప్రకటన వెలువడిన తరువాత బంగారం కొనుగోళ్లు పెరిగాయని ఆయన ఓస్వాల్ వివరించారు. -
జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) విభాగంలో చిన్న ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వారిని ట్రేడింగ్‌కు దూరంగా ఉంచేందుకు సెబీ రంగంలోకి దిగింది. తాజాగా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో జీరో బ్రోకరేజీ సంస్థలకు బాగానే సెగ తగలనుంది. సెబీ చర్యలు అమల్లోకి వస్తే.. డెరివేటివ్స్ వాల్యూమ్స్ పడిపోయి బ్రోకరేజీ కంపెనీల ఆదాయాలకు గండి పడుతుంది. దీంతో జీరో బ్రోకరేజీ ప్లాన్లకు ఇక ‘ఎక్స్పైరీ’ తప్పదంటున్నాయి మార్కెట్ వర్గాలు!డెరివేటివ్ ట్రేడింగ్ విషయంలో సెబీ తీసుకున్న చర్యలతో జీరో బ్రోకరేజీ సంస్థల జోరుకు అడ్డకట్ట పడనుంది. ఎఫ్ అండ్ ఓ విభాగం నుంచి లభించే ఆదాయానికి చిల్లు పడుతుందన్న అంచనాలతో ఏంజెల్ వన్ ‘జీరో బ్రోకరేజీ’కి చెల్లు చెబుతున్నట్లు ప్రకటించింది. క్లయింట్ల సంఖ్య పరంగా దేశంలో మూడో అతపెద్ద బ్రోకరేజీ సంస్థగా ఇది నిలుస్తుండం విశేషం. నవంబర్ 1 నుంచి క్యాష్ మార్కెట్ లావాదేవీలు (షేర్ల కొనుగోలు, అమ్మకం)పై రూ.20 ఫ్లాట్ ఫీజు లేదా టర్నోవర్‌పై 0.1% (ఏది తక్కువైతే అది) ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా ఈ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేవు. కాగా, రాబోయే రోజుల్లో ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘పరిస్థితుల మార్పుతో అతి తక్కువ ఫీజులతో బ్రోకింగ్ పరిశ్రమ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు ఫీజులు పెంచక తప్పదు. ఎందుకంటే అవి ఎఫ్అండ్ఓ వాల్యూమ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సెబీ నిర్ణయంతో ఆదాయాలకు కోత పడుతుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ ధీరజ్ రెల్లి పేర్కొన్నారు.కొన్నేళ్లుగా హవా... గతంలో ఓ వెలుగు వెలిగిన బ్యాంకింగ్ ‘బ్రోకరేజ్’లకు (ఐసీఐసీ డైరెక్ట్, యాక్సిస్ డైరెక్ట్ వంటివి) జీరోధా, గ్రో వంటి కొత్త తరం బ్రోకరేజీ సంస్థలు భారీగానే గండి కొట్టాయి. ముఖ్యంగా క్యాష్ లావాదేవీలపై జీరో బ్రోకరేజీ, ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌కు అతి తక్కువ చార్జీలు, మార్జిన్లపై లీవరేజీ వంటి ప్రయోజనాలతో బ్యాంకుల వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. మరోపక్క, రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా యువత సరైన అవగాహన లేకుండా, అత్యాశతో ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌లో కుదేలయ్యే పరిస్థితికి దారితీస్తోంది. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయకుండా సెబీ పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 2022–24 మధ్య వ్యక్తిగత ట్రేడర్లు సగటున రూ.2 లక్షలు నష్టపోయారని.. రూ.1.8 లక్షల కోట్లు ఆవిరైందని సెబీ అధ్యయనం తేల్చింది. దీంతో ఇంకాస్త కఠిన నిబంధనలు తెచి్చంది. రూ. 2,000 కోట్ల చిల్లు... మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐలు–ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు) మెంబర్లకు (బ్రోకర్లు) విధించే ఛార్జీ లతో సమానంగానే కస్టమర్లకు (ఇన్వెస్టర్లు, ట్రేడర్లు) కూడా చార్జీలు ఉండాలని సెబీ ఈ ఏడాది జూలైలో ఆదేశించింది. ప్రస్తుతం అధిక వాల్యూమ్ ఉంటే ఎంఐఐలు బ్రోకర్లకు కొంత డిస్కౌంట్ ఇస్తున్నాయి. ట్రేడర్లకు మాత్రం ఫ్లాట్ రేట్ అమలు చేస్తుండటంతో ఆమేరకు బ్రోకింగ్ కంపెనీలకు లాభం చేకూరుతోంది. అయితే, సెబీ ఏకరీతి చార్జీల నిబంధనల వల్ల బ్రోకరేజీ సంస్థల ఆదాయాల్లో రూ. 2,000 కోట్లకు పైగా చిల్లు పడుతుందని అంచనా. ముఖ్యంగా డిస్కౌంట్ ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు జీరో బ్రోకరేజీ మోడల్స్‌కు తెరపడవచ్చనేది పరిశ్రమ విశ్లేషకుల మాట! ‘ఆదాయంలో 15–20 శాతం కోత ప్రభావంతో చాలా వరకు బ్రోకరేజీలు ఈక్విటీ డెలివరీపై ఫీజు విధించవచ్చు. మధ్య, చిన్న స్థాయి బ్రోకింగ్ కంపెనీలకు ఈ సెగ బాగా తగులుతుంది’ అని ఫైయర్స్ బ్రోకరేజ్ కో–¸ఫౌండర్, సీఈఓ తేజస్ ఖోడే అభిప్రాయపడ్డారు. కాగా, బ్రోకింగ్ దిగ్గజం జీరోధా మాత్రం ప్రస్తుతానికి తాము షేర్ల డెలివరీపై ఎలాంటి ఫీజూ విధించబోమని స్పష్టం చేసింది. ‘మా ఆదాయంలో అత్యధిక భాగం ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారానే వస్తోంది. ఈ విభాగంలో కఠిన నిబంధనల వల్ల ఆదాయంలో 30–50 శాతం తగ్గుదలకు ఆస్కారం ఉంది’ అని జీరోధా ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ పేర్కొనడం విశేషం! సెబీ కీలక మార్పులు... ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కాంట్రాక్ట్ కనీస విలువను రూ.15 లక్షలకు (గరిష్టంగా రూ.20 లక్షలు) పెంపు. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్టుల సంఖ్య కుదింపు, ఇంట్రాడే పొజిషన్ లిమిట్లను తప్పనిసరిగా పర్యవేక్షించడంబ్రోకరేజీలు ఆప్షన్ ప్రీమియంను బయ్యర్ల నుంచి ముందుగానే పూర్తిగా వసూలు చేయడం. డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున మార్జిన్ల పెంపు, క్యాలెండర్ స్ప్రెడ్ ప్రయోజనాల తొలగింపు. ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు. ఈ నిబంధనలు నవంబర్ 20 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకు దశల వారీగా అమల్లోకి రానున్నాయి.సెబీ కఠిన నిబంధనల కారణంగా మొత్తం ఎఫ్అండ్ఓ ట్రేడ్స్‌లో 60% మేర ప్రభావం ఉండొచ్చు. మా ప్లాట్ఫామ్లో డెరివేటివ్ ఆర్డర్లు 30% తగ్గుతాయని భావిస్తున్నాం. – నితిన్ కామత్, జీరోధా ఫౌండర్, సీఈఓ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం ధరల్లో మార్పు: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఇవే..
దేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 110 పెరిగింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. కాబట్టి ఈ రోజు (అక్టోబర్ 4) తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 71,200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,670 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 పెరిగింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు కూడా పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,200 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,660గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే ఈ రోజు వార్సుపైగా రూ. 100, రూ. 110 పెరిగింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 71,350 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,820 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. బంగారం ధర ఈ రోజు రూ. 100, రూ. 110 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: ఎక్స్‌లో మస్క్ ఘనత.. ప్రపంచంలో తొలి వ్యక్తిగా రికార్డ్వెండి ధరలుబంగారం ధరల పెరిగినప్పటికీ.. వెండి మాత్రం స్థిరంగానే ఉంది. దీంతో నేడు (శుక్రవారం) కేజీ వెండి ధర రూ. 1,01,000 వద్దనే నిలిచింది. బంగారం ధర దూసుకెళ్తుంటే.. వెండి మాత్రం శాంతించినట్లు అర్థమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మార్కెట్ కల్లోలానికి కారణాలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాలుస్తుండడంతో స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఇజ్రాయిల్–ఇరాన్ పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. ఫలితంగా నిన్న దేశీయ స్టాక్మార్కెట్లో రూ.9.78 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇందుకుగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.నిపుణులు అంచనా ప్రకారం..హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ సంస్థలకు మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రత్యక్ష దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌పై ఏకంగా 180కి పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్–ఇజ్రాయెల్‌ల మద్య పోరు భీకర యుద్ధానికి దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు ఈక్విటీ మార్కెట్లో స్థిరత్వం కోసం సెబీ ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. డెరివేటివ్స్ కనీస కాంట్రాక్టు విలువను రూ.15–20 లక్షలకు పెంచింది. దీంతో విస్తృత మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. సెబీ కొత్త మార్గదర్శకాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి.పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో కొన్ని వారాలుగా నిలకడగా ఉన్న క్రూడాయిల్ ధరలు ఇటీవల మళ్లీ ఎగబాకాయి. గడిచిన 3 రోజుల్లో చమురు ధరలు 5% పెరిగాయి. ప్రస్తుతం భారత్‌కు దిగుమతయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సరఫరా అవాంతరాల దృష్ట్యా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు భారీగా పెరగొచ్చనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలహీనపడి 83.96 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23 పైసలు క్షీణించి 84.00 స్థాయిని తాకింది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!చైనా ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలు, ఉద్దీపన చర్యలు, వరుస వడ్డీరేట్ల కోతను ప్రకటించడంతో గతవారంలో ఆ దేశ స్టాక్ మార్కెట్ ఏకంగా 15 శాతం ర్యాలీ అయింది. ఇప్పటికీ అక్కడి షేర్లు తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లో లాభాల స్వీకరణకు పాల్పడి, చైనా మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. -
బంగారం, వెండికి పండుగ డిమాండ్
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలకు పండుగల డిమాండ్ తోడయ్యింది. ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.200 పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.78,300కు చేరింది. స్టాకిస్టులు, రిటైల్ కస్టమర్ల నుంచి పసిడికి డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ పేర్కొంది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.665 ఎగసి రూ.93,165కు చేరింది.మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కమోడిటీ మార్కెట్లు బుధవారం పనిచేయని సంగతి తెలిసిందే. నవరాత్రి ప్రారంభంలో డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ మెరుగ్గా మారిందని, హిందూ పురాణాల ప్రకారం కొత్త వస్తువులను ముఖ్యంగా విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి ఇది శుభప్రదమైన వారమని వ్యాపారులు తెలిపారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర ఈ వార్త రాస్తున్న 10 గంటల సమయంలో రూ.200కుపైగా లాభంతో రూ.45,500 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ధర రూ.400కుపైగా పెరిగింది. వెండి సైతం రూ.1,000కిపైగా లాభంతో రూ. 92,453 వద్ద ట్రేడవుతోంది. -
రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు కొత్త సాధనం
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ (కొత్త సాధనం)ను ప్రవేశపెట్టింది. అలాగే, ప్యాసివ్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా ‘ఎంఎఫ్ లైట్–టచ్’ కార్యాచరణను అనుమతించింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనల సవరణలకూ ఆమోదం తెలిపింది. ఇలా 17 ప్రతిపాదనలకు సెబీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.అందరూ అనుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో రిటైల్ ట్రేడర్ల స్పెక్యులేషన్ కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశం ఇది కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. న్యూ అస్సెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు (పీఎంఎస్) పొందాలంటే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, రూ.50 లక్షల పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తిని సెబీ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సైతం స్వీకరించింది. ఈ సాధనంలో డెరివేటివ్స్‌లో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి లేదు. టీప్లస్0 ప్రస్తుతం టీప్లస్1 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే స్టాక్స్ కొనుగోలు చేసిన మరుసటి పనిదినంలో దాన్ని సెటిల్ చేస్తారు. తదుపరి దశలో టీప్లస్0కు మళ్లాలన్నది సెబీ ప్రణాళిక. ఇందులో భాగంగా 25 స్క్రిప్‌లకు ఆప్షనల్ (ఐచి్ఛకం) టీప్లస్0 విధానం (ట్రేడింగ్ రోజే సెటిల్మెంట్) అమల్లో ఉంది. ఇప్పుడు టాప్–500 (మార్కెట్ విలువ పరంగా) స్టాక్స్‌కు టీప్లస్0 విధానాన్ని ఐచి్ఛకంగా చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు అందరూ తమ ఇన్వెస్టర్లకు టీప్లస్0 సెటిల్మెంట్ను ఆఫర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రోకరేజీ చార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను సెబీ కల్పించింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం టీప్లస్0 విధానాన్ని పొందొచ్చు. ఎంఎఫ్ లైట్ ప్యాసివ్ పండ్స్‌కు సంబంధించి సరళించిన కార్యాచరణను సెబీ ప్రకటించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలకు నిబంధనల భారాన్ని తగ్గించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ రూపంలో ప్రవేశించే కొత్త సంస్థలకు మార్గం తేలిక చేసింది. నికర విలువ, ట్రాక్ రికార్డు, లాభదాయకత పరిమితులను తగ్గించింది. రైట్స్ ఇష్యూ వేగవంతం రైట్స్ ఇష్యూలు వేగంగా పూర్తి చేసేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. దీని కింద బోర్డు ఆమోదించిన నాటి నుంచి 23 పనిదినాల్లో రైట్స్ ఇష్యూ ముగుస్తుంది. ప్రస్తుతం 317 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కు పట్టే 40 రోజుల కంటే కూడా తక్కువ కానుంది. ఇతర నిర్ణయాలు.. » సెకండరీ మార్కెట్లో (నగదు విభాగం) యూపీఐ బ్లాక్ విధానం (ఏఎస్బీఏ) లేదా 3ఇన్1 ట్రేడింగ్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం మాదిరే తమ బ్యాంక్ ఖాతా నుంచి నిధులను ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీవో దరఖాస్తుకు ఏఎస్బీఏ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. » ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లను (ఎడీఐలు) జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) సంబంధించి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఎఫ్‌పీఐలు తమ నుంచి ఓడీఐలను పొందిన వారి వివరాలను సరిగ్గా అందిస్తున్నాయా? అన్నది ఈ యంత్రాంగం పర్యవేక్షించనుంది. -
పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు
అక్టోబర్ ప్రారంభంలో తగ్గినట్లే తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా ఎగిసి పడింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 77560వద్దకు చేరింది. ఈ రోజు గోల్డ్ రేట్లు.. ఏ నగరం ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 71,100 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,560 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 660 పెరిగింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71100 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,560గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 100, రూ. 110 పెరిగింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 71,250 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,710 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. బంగారం ధర ఈ రోజు రూ. 100, రూ. 110 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..వెండి ధరలుబంగారం ధరల భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రమే గత ఐదు రోజులుగా స్థిరంగానే ఉంది. దీంతో నేడు (గురువారం) కేజీ వెండి ధర రూ. 1,01,000 వద్దనే నిలిచింది. బంగారం ధర దూసుకెళ్తుంటే.. వెండి మాత్రం శాంతించినట్లు అర్థమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఐపీవోల సందడే సందడి
సెకండరీ మార్కెట్లను మించుతూ ప్రైమరీ మార్కెట్ సైతం సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తోంది. జనవరి నుంచి ఇప్పటికే 62 కంపెనీలు ఐపీవోలకురాగా.. తాజాగా ఒకే రోజు 13 కంపెనీలు సెబీని ఆశ్రయించాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్డెస్క్రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను, సెకండరీ మార్కెట్ల జోష్ పలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. దీంతో నిధుల సమీకరణతోపాటు.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. వెరసి తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఒకే రోజు 13 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఈ జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్ తదితరాలు చేరాయి. ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ ఏడాది(2024) ఇప్పటివరకూ 62 కంపెనీలు రూ. 64,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2023) మొత్తంగా 57 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 49,436 కోట్లతో పోలిస్తే ఇది 29% అధికం! జాబితా ఇలా తాజాగా సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసిన కంపెనీల జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్, అజాక్స్ ఇంజినీరింగ్, రహీ ఇన్ఫ్రాటెక్, విక్రన్ ఇంజినీరింగ్, మిడ్వెస్ట్, వినే కార్పొరేషన్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, అల్ టైమ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, స్కోడా ట్యూబ్స్, దేవ్ యాక్సిలరేటర్ చోటు చేసుకున్నాయి. ఈ సంస్థలన్నీ కలసి రూ. 8,000 కోట్లవరకూ సమీకరించనున్నట్లు అంచనా. విస్తరణ ప్రణాళికలు, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, ప్రస్తుత వాటాదారుల వాటా విక్రయం తదితర లక్ష్యాలతో కంపెనీలు ఐపీవో బాట పడుతున్నట్లు నిపుణులు వివరించారు. సమీకరణ తీరిదీ ఐపీవోలో భాగంగా సోలార్ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.74 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇక వరిండెరా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ బాటలో ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా.. రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. కారణాలున్నాయ్ ప్రైమరీ మార్కెట్ల జోరుకు పలు సానుకూల అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, రంగాలవారీగా అనుకూలతలు, నిధుల లభ్యత, రిటైల్‌సహా సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి తదితరాలను ప్రస్తావించారు. దేశీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తుండటం, యూఎస్‌లో వడ్డీ రేట్ల కోత సైతం ఇందుకు తోడ్పాటునిస్తున్నట్లు ఈక్విరస్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలియజేశారు. కోవిడ్–19, సబ్‌ప్రైమ్ సంక్షోభం, 2011 సెపె్టంబర్ ఉగ్రదాడి తదితర అనూహ్య విపరిణామాలు సంభవిస్తే తప్ప మార్కెట్లు పతనంకాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో 2025లో మార్కెట్ సరికొత్త రికార్డులను నెలకొల్పడంతోపాటు.. మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు తెలియజేశారు. -
భారత్, చైనా మార్కెట్లపై జెఫ్రీస్ హెడ్ కీలక వ్యాఖ్యలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల జీవితకాల గరిష్ఠాలను చేరిన నేపథ్యంలో ప్రస్తుత స్థాయి నుంచి ఒక శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లు మాత్రం ప్రస్తుత స్థానం నుంచి దాదాపు రెండు శాతం పెరగనున్నాయని అంచనా వేశారు.క్రిస్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం..భారత ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో చాలామంది మదుపర్లు లాభాలు స్వీకరించే అవకాశం ఉంది. అదే చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి మార్కెట్లు ప్రస్తుత స్థానం నుంచి సుమారు రెండు శాతం పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న యుద్ధ వాతావరణం మరింత పెరిగితే భారత్‌తోపాటు దాదాపు అన్ని గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయి.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!దీర్ఘకాల వ్యూహంతో ఈక్విటీలో పెట్టుబడి పెట్టేవారు ప్రతి ప్రతికూల ప్రభావాన్ని ఒక అవకాశంగా తీసుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. మరో పదేళ్లలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పు రానుంది. అన్ని విభాగాలు వృద్ధి చెందనున్నాయి. కాబట్టి మదుపర్లు ట్రేడింగ్ కంటే పెట్టుబడిపై దృష్టి సారించి మంచి రాబడులు పొందాలని చెబుతున్నారు. -
ఒక్కసారిగా ఎగిసిన బంగారం.. హైదరాబాద్‌లో మాత్రం ఊరట!
Gold Price Today: దేశంలో నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు (అక్టోబర్ 2) పసిడి ధరలు 10 గ్రాములకు రూ.500 పైగా పెరిగాయి. ఈ పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నమోదైంది.హైదరాబాద్ పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం తులం(10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.500 పెరిగి రూ.71,000 లకు చేరింది. అయితే 24 క్యారెట్ల బంగారం విషయంలో మాత్రం కాస్త ఊరట లభించింది. ఇది రూ.10 తగ్గి రూ. 76,900 వద్దకు వచ్చింది.ఇక విశాఖపట్నం, విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.71,000 లకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగి రూ. 77,450 వద్దకు చేరింది. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.500 పెరిగి రూ.71,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగి రూ.77,600 వద్దకు ఎగిశాయి.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ల మంజూరులో లోపాలు.. ఆర్బీఐ డెడ్లైన్నిలకడగా వెండిSilver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు కూడా నిలకడగా కొనసాగుతన్నాయి. గత నాలుగు రోజులుగా వెండి ధర ఎలాంటి కదలిక లేకుండా స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,01,000 వద్దే కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)