Market
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 33.49 పాయింట్ల నష్టంతో 84,266.29 వద్ద, నిఫ్టీ 1.50 పాయింట్ల నష్టంతో 25,809.35 వద్ద ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, మహింద్ర అండ్ మహీంద్రా, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు చేరాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టైటాన్ కంపెనీ మొదలైనవి నష్టాలను జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
శుభవార్త!.. పతనమవుతున్న పసిడి ధరలు
సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. అక్టోబర్ ప్రారంభంలో కొంత శాంతించాయి. దీంతో పసిడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మంగళవారం) దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 70,500 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.76,910 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,500 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 76,910గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 300, రూ. 330 తగ్గినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 70,650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,060 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. బంగారం ధర ఈ రోజు రూ. 300, రూ. 330 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్వెండి ధరలుబంగారం ధరల కొంత తగ్గినప్పటికీ.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. సిల్వర్ రేటులో గత మూడు రోజులుగా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి వెండి ధర రూ. 1,01,000 (కేజీ) వద్ద ఉంది. ఇదే ధరలు దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉండే అవకాశం ఉంటుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మెగా ఐపీఓ వేవ్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్‌క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది. సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్‌లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!! -
షేర్ మార్కెట్లో దూసుకెళ్తున్న అనిల్ అంబానీ
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ (ఆర్‌పవర్) షేర్ మార్కెట్లో దూసుకెళ్తోంది. ఆ కంపెనీ షేర్లు గత తొమ్మిది సెషన్లలో 55 శాతం ర్యాలీ చేశాయి. సెప్టెంబర్ 17న రూ. 31.40 ముగింపు ధర నుండి ఆర్‌పవర్ షేర్లు వరుసగా తొమ్మిది రోజులు ఎగువ సర్క్యూట్లను తాకాయి.నిధుల సమీకరణకు సంబంధించి అక్టోబర్ 3న కంపెనీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో కంపెనీ షేర్లకు ఊపు వచ్చింది. సెప్టెంబర్ 30న ఆర్‌పవర్ షేర్లు దాని మునుపటి ముగింపు రూ. 46.35కి వ్యతిరేకంగా ఒక్కొక్కటి రూ. 46.25 వద్ద ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభమైన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్టాక్ దాదాపు 5 శాతం క్షీణించి రూ.44.21 కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే మధ్యాహ్న సమయంలో తిరిగి పుంజుకుంది. ఎన్ఎస్ఈలో రూ. 48.66 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎన్ఎస్ఈలో 20.62 కోట్ల షేర్లు చేతులు మారగా, బీఎస్ఈఇలో దాదాపు 3.57 కోట్ల షేర్లు చేతులు మారాయి.ఊపు ఎందుకంటే..విదర్భ ఇండస్ట్రీస్ పవర్‌కు రూ. 3,872 కోట్ల గ్యారెంటీని పూర్తిగా సెటిల్ చేసినట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత ఆర్‌పవర్ షేర్లలో అప్‌ట్రెండ్ వచ్చింది. ఈ సెటిల్మెంట్ ఫలితంగా రూ. 3,872.04 కోట్ల బకాయి రుణానికి సంబంధించిన అన్ని కార్పొరేట్ గ్యారెంటీలు, అండర్‌టేకింగ్‌లు, ఆబ్లిగేషన్లు పరిష్కారమయ్యాయి. సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్తో కూడా అన్ని వివాదాలను రిలయన్స్ పవర్ పరిష్కరించుకుంది. అంతేకాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలన్నీ తీరిపోయినట్లు ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగింపు నాటికి సంస్థ ఏకీకృత నికర విలువ రూ.11,155 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
తగ్గిన బంగారం, వెండి ధరలు
రూ.70,000 దాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలుతాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పులు జరిగాయి. కాబట్టి నేడు (సెప్టెంబర్ 30) దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 70,800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.77,240 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,800 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,240గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 150, రూ. 160 తగ్గినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 70,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,390 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 150, రూ. 160 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయివెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న రూ. 1,01,000 వద్ద ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ. 1,09,000 వద్దకు చేరింది. ఇదే ధరలు దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉండే అవకాశం ఉంటుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 363.09 పాయింట్ల నష్టంతో 85208.76 వద్ద, నిఫ్టీ 117.70 పాయింట్ల నష్టంతో 26061.30 వద్ద ట్రేడవుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హిందాల్కో, టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) మొదలైన కంపెనీలు ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, నెస్లే, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా? తులం ఎంతంటే..
Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారు ధరలను నిత్యం పరిశీలిస్తుంటారు. ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తుంటారు. ఆగకుండా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు రెండు రోజులుగా బ్రేక్ పడించి నిన్నటి రోజున స్వల్పంగా తగ్గిన బంగారం నేడు (సెప్టెంబర్ 29) నిలకడగా కొనసాగుతోంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం తులం(10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.70,950, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ. 77,400. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.71,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.77,550 వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇప్పుడు మేలు!వెండీ అంతే..Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా కొనసాగుతన్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న వెండి ధర క్రితం రోజున కేజీకి రూ.1000 తగ్గగా నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తగ్గిందోచ్.. ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం!
Gold Price Today: పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట దక్కింది. దేశంలో చాలా రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. వారం రోజులకు పైగా తగ్గకుండా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 28) స్వల్పంగా క్షీణించాయి.తెలుగు రాష్ట్రాల్లో తగ్గిందెంత? హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.70,950 దగ్గరకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.50 క్షీణించి రూ. 77,400 లకు తగ్గింది. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇదే విధంగా స్పల్పంగా ధరలు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడిపై రూ.50 తగ్గి రూ.71,100 వద్దకు రాగా 24 క్యారెట్ల బంగారం సైతం రూ.50 తరిగి రూ.77,550 వద్దకు వచ్చింది.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..కరిగిన వెండి..Silver Price Today: పెరిగిపోతున్న ధరలతో ఆందోళన పడుతున్న వెండి కొనుగోలుదారులకు నేటి ధరలు ఉపశమనం కలిగించాయి. దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగివచ్చాయి. హైదరాబాద్‌లో ఈరోజు వెండి కేజీకి రూ.1000 తగ్గి రూ.1,01,000 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పీఎన్బీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 103.75 ధరలో 48.19 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫ్లోర్ ధర రూ. 109.16తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌గా పీఎన్బీ పేర్కొంది. ఈ నెల 23–26 మధ్య క్విప్ సబ్ర్స్కిప్షన్ పూర్తయినట్లు వెల్లడించింది.మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, బీమా కంపెనీలు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి రూ. 41,734 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. ఇవి క్విప్ ప్రాథమిక పరిమాణం రూ. 2,500 కోట్లకు 16.7 రెట్లు అధికంకాగా.. మొత్తం సమీకరణ పరిమాణం రూ. 5,000 కోట్లకు 8.3 రెట్లు అధికమని వివరించింది. క్విప్ నిధులను బ్యాంక్ సీఈటీ–1 నిష్పత్తి మెరుగుకు, కనీస మూలధన నిష్పత్తి పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 230.89 పాయింట్ల నష్టంతో 85,605.23 వద్ద, నిఫ్టీ 40.90 పాయింట్ల నష్టంతో 26,175.15 పాయింట్ల వద్ద నిలిచాయి.భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), సిప్లా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, రిలయన్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ బంగారు జోరు! ఇంకెంత పెరుగుతుందో..
Gold Price Today: దేశంలో బంగారం ధరల జోరుకు బ్రేక్ పడినట్లే పడి మళ్లీ జోరందుకున్నాయి. క్రితం రోజున శాంతించిన పసిడి నేడు పరుగందుకుంది. తగ్గుదల కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. బంగారం తగ్గుముఖం చూసి ఎనిమిది రోజులైంది. ఈ ఎనిమిది రోజుల్లో 10 గ్రాములకు దాదాపు రూ.3000 దాకా పెరిగింది.ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు (సెప్టెంబర్ 27) బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.71,000 వద్దకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారమైతే రూ.430 ఎగిసి రూ. 77,450 లకు చేరింది.బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బంగారం ధరలు ఎగిశాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడిపై రూ.400 పెరిగి రూ.71,150 వద్దకు చేరగా 24 క్యారెట్ల బంగారం రూ.430 పుంజుకుని రూ.77,600 లను తాకింది.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..వెండి ‘కొండ’లా..Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు కొండలా పెరిగిపోతున్నాయి. కేజీకి రూ.లక్ష దాటినా శాంతించడం లేదు. హైదరాబాద్‌లో ఈరోజు ఈకేజీకి రూ.1000 పెరిగి రూ.1,02,000 వద్దకు చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి గరిష్ట లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్ 666.25 పాయింట్ల లాభంతో 85,836.12 వద్ద, నిఫ్టీ 211.90 పాయింట్ల వద్ద 26,216.05 వద్ద ఉన్నాయి.మారుతి సుజుకి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సిప్లా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), లార్సెన్ & టుబ్రో, హీరో మోటోకార్ప్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెరిగింది చాలులే.. బంగారం స్పీడ్‌కు బ్రేక్!
Gold Price Today: బంగారం ధరల స్పీడ్‌కు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా ఆగకుండా దూసుకెళ్లి కొత్త మార్కులకు చేరిన పసిడి పెరిగింది చాలులే అన్నట్లు కాస్త విరామం తీసుకుంది. దేశవ్యాప్తంగా నేడు (సెప్టెంబర్ 26) బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ రేట్లలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.70,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,020 వద్ద ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే రేట్లు కొనసాగుతన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి రూ.70,750 వద్ద స్థిరంగా ఉండగా 24 క్యారెట్ల బంగారం మాత్రం అత్యంత స్పల్పంగా రూ.10 పెరిగి రూ.77,180 వద్ద ఉంది.వెండి స్వల్పంగా..Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. క్రితం రోజున కేజీకి రూ.3000 పెరిగి బెంబేలెత్తించిన వెండి నేడు రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.1,01,100 లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
సెబీ కీలక నిర్ణయం.. యూపీఐ తప్పనిసరి
న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ (బ్యాంక్ ఖాతాలో స్తంభన) చేసుకునే ఆప్షన్‌తోనే రూ.5లక్షల వరకు దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది.అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిష్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం అందుబాటులో ఉన్న సంగతి విదితమే.‘‘డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (స్టాక్ బ్రోకర్లు, డీపీలు, రిజిస్ట్రార్ తదితర) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుం రూ.5 లక్షల వరకు ఉంటే వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్నే ఉపయోగించుకోవాలి’’అని సెబీ తన సర్క్యులర్‌లో కోరింది. -
పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓ
స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. సెబీ ఇటీవల చేసిన బ్రోకరేజ్ ఛార్జీలో మార్పుల వల్ల స్టాక్ బ్రోకింగ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్ పోస్ట్‌లో మాట్లాడారు.‘జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,370 కోట్ల ఆదాయాన్ని సంపాధించింది. అందులో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023లో కంపెనీ ఆదాయం రూ.6,875 కోట్లు, నికర లాభం రూ.2,900 కోట్లుగా ఉంది. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ (ఎంఐఐ)ల్లో పారదర్శకతను నిర్ధారించడానికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌లో నష్టపోయే బాధితులను తగ్గించేందుకు సెబీ ఇటీవల నిబంధనల్లో మార్పులు చేసింది. వాటి అమలుతో కంపెనీకి రానున్న ఏడాదిలో లాభాలు తగ్గనున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్ ట్రేడింగ్ విభాగంలో కంపెనీకు సమకూరే రాబడి 30-50% వరకు తగ్గనుంది’ అని చెప్పారు. సెబీ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. దాదాపు 97 శాతం మంది ట్రేడర్లు ఈ విభాగంలో నష్టాలపాలవుతున్నట్లు గుర్తించింది. దాంతో నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి.ఇదీ చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపునిబంధనల్లో మార్పులివే..ఇండెక్స్ డెరివేటివ్‌ల కోసం కనీస కాంట్రాక్ట్ పరిమాణం ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. దాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. వచ్చే ఆరు నెలల్లో దీన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచనున్నారు. బ్రోకర్లు క్లయింట్ల నుంచి ఆప్షన్ ప్రీమియంలను ముందుగానే సేకరించవలసి ఉంటుంది. వీక్లీ ఎక్స్‌పైరీలను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్లు (ఎంఐఐ) ఇంట్రాడే(అదే రోజు ముగిసే ట్రేడింగ్) ప్రాతిపదికన ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తాయి. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మరో కొత్త మార్కు.. అమాంతం దూసుకెళ్లిన బంగారం!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజూ ధరలు ఊపందుకోవడంతో పసిడి నేడు (సెప్టెంబర్ 25) మరో కొత్త మార్కును తాకింది. దీంతో తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు నిరాశే ఎదరైంది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ఎంత మేర పెరిగిందన్నది పరిశీలిస్తే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.70,600 వద్దకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.660 పెరిగి రూ. 77,020 లను తాకింది.బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బంగారం రేట్లు పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.70,750 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.660 పెరిగి రూ.77,170 లకు ఎగిశాయి.ఇదీ చదవండి: EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్మురూ. లక్షకు వెండి Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు బెంబేలెత్తిస్తున్నాయి. కేజీ వెండిపై ఒకేసారి రూ.3,000 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
14 ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ
పద్నాలుగేళ్ల తర్వాత ఈ నెల(సెప్టెంబర్) సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్‌లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి.ఫైనాన్షియల్ మార్కెట్లు వృద్ధిలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెప్టెంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌స్క్రైబ్ అవుతున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోల్లో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 20.97 పాయింట్ల లాభంతో 84,949.58 వద్ద, నిఫ్టీ 11.80 పాయింట్ల లాభంతో 25,950.85 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలో నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గరిష్ఠాలను చేరుతున్న బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,000 (22 క్యారెట్స్), రూ.76,360 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.210 పెరిగింది. మే నెలలో 24 క్యారెట్ల బంగారం గరిష్ఠంగా రూ.76,450కు చేరింది. తిరిగి ఆ ధరను అందుకునేలా కనిపిస్తోంది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.210 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.76,360 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.70,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.210 పెరిగి రూ.76,510 వద్దకు చేరింది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గి రూ.92,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి.. పరుగో పరుగు!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి పరుగు కొనసాగుతోంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోలి్చతే సోమవారం 12 డాలర్లు పెరిగి సరికొత్త రికార్డు 2,659.7 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫండ్ రేటు కోతతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పలు దేశాల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం భయాలు పసిడి పరుగుకు కారణం. ఇక దేశీయంగా కూడా పసిడి ధర పటిష్టంగానే కొనసాగుతున్నప్పటికీ, కస్టమ్స్ సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును కొంత నిలువరిస్తున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 600 ఎగసి రూ. 76,950కి చేరింది. దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.255 పెరిగి రూ.74,295కు చేరింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 384.30 పాయింట్ల లాభంతో 84,928.61 వద్ద, నిఫ్టీ 148.00 పాయింట్ల లాభంతో 25939.00 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), హీరో మోటోకార్ప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మరింత ఖరీదైన బంగారం
Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఆగినట్టే ఆగి మళ్లీ పుంజుకున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న పసిడి నేడు (సెప్టెంబర్ 23) మరింత ఖరీదైంది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు కొనుగోలుదారులను నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. నాలుగు రోజులలో తులం బంగారం సుమారు రూ.1700 దాకా పెరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.69,800 వద్దకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల పుత్తడి కూడా రూ.220 పెరిగి రూ. 76,150 వద్దకు చేరుకుంది. ఇక బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే విధంగా రేట్లు పెరిగాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.69,950 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.76,300 లకు ఎగిశాయి.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్నిలకడగా వెండి దేశవ్యాప్తంగా వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి కదలిక లేదు. రెండో రోజు కూడా సిల్వర్ ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)