Market
-
మరింత ఖరీదైన బంగారం
Gold Price Today: దేశంలో బంగారం ధరలు ఆగినట్టే ఆగి మళ్లీ పుంజుకున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న పసిడి నేడు (సెప్టెంబర్ 23) మరింత ఖరీదైంది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు కొనుగోలుదారులను నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. నాలుగు రోజులలో తులం బంగారం సుమారు రూ.1700 దాకా పెరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.69,800 వద్దకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల పుత్తడి కూడా రూ.220 పెరిగి రూ. 76,150 వద్దకు చేరుకుంది. ఇక బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే విధంగా రేట్లు పెరిగాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.69,950 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.76,300 లకు ఎగిశాయి.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్నిలకడగా వెండి దేశవ్యాప్తంగా వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి కదలిక లేదు. రెండో రోజు కూడా సిల్వర్ ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి కేజీ ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎల్ఐసీ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలతో ‘మాన్యూఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. అక్టోబర్ 4 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఈ పథకానికి ప్రామాణికంగా ఉంటుందని పేర్కొంది. తయారీ రంగంలో వైవిధ్యమైన కంపెనీలతో కూడిన పోర్ట్‌ఫోలియోని ఈ పథకం అందిస్తుందని, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, మెటల్స్, షిప్ బిల్డింగ్, పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు ఇందులో చోటు ఉంటుందని వివరించింది.ఈ సందర్భంగా కొత్త పథకం (ఎన్ఎఫ్వో) వివరాలను ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆర్కే ఝా వెల్లడించారు. తయారీ థీమ్ లోని కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పె డుతుందని, ఇన్వెస్టర్లకు మంచి సంపద సమకూర్చడమే మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆవిష్కరణ ఉద్దేశ్యమని చెప్పా రు. ఇన్వెస్టర్లు రోజువారీగా రూ. 300 లేదా నెలవారీగా రూ.1,000 నుంచి, త్రైమాసికం వారీగా అయితే రూ.3,000 చొప్పున ఈ పథకంలో సిప్ చేసుకోవచ్చని తెలిపారు.‘‘ఈ పథకం అక్టోబర్ 16 నుంచి తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు రోజువారీ సిప్ రూ.100కు, నెలవారీ సిప్ రూ.200కు తగ్గుతుంది. తక్కువ ఆదాయంలో ఉన్న వారు సైతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని ఝా వివరించారు. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రూ.5,000 నుంచి చేసుకోవచ్చని చెప్పారు. పరిశ్రమ వ్యాప్తంగా 11 మాన్యుఫాక్చరింగ్ ఫండ్స్ ఉన్నాయని, వీటి నిర్వహణలో రూ.34,700 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.‘‘ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ గురువారం (సెపె్టంబర్ 22న) నిఫ్టీ సెపె్టంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్ డేటా సూచిస్తోంది.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్ 24న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ పెట్టుబడులుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయంగా హెచ్ఎస్బీసీ కాంపోజిట్ సెపె్టంబర్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. -
ఎన్ఆర్ఐలకు ఫండ్స్ రూట్!
మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్ఆర్ఐలు ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్ఆర్ఐలు భారత్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్‌కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ (ఎన్ఆర్వో), ఫారీన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) అకౌంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం→ ఎన్ఆర్ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. → ఎన్ఆర్వో ఖాతా.. భారత్‌లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్‌లో ఆదాయాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా కాగా, ఎన్ఆర్ఈ పొదుపు/కరెంటు/రికరింగ్/ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాగా పనిచేస్తుంది. → చెక్, డీడీ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ (ఎఫ్ఐఆర్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవైసీ కీలకంభారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్‌పోర్ట్ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఓసీఐ కార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.పెట్టుబడుల మార్గాలు.. ఎన్ఆర్ఐలు తామే స్వయంగా లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్‌లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్ఆర్ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు యూఎస్ఏ, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఎన్ఆర్ఐలు, యూఎస్ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు యూఎస్ఏ, కెనడా నుంచి ఎన్ఆర్ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్లైన్లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నవీ మ్యూచువల్ ఫండ్, ఎన్జే ఇండియా మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టారస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ క్యాపిటల్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్ మోడ్‌లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్లైన్లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents నుంచి యూఎస్, కెనడాలోని ఎన్ఆర్ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అవకాశాలు.. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్ చెల్లింపులు ఉండవు. దీంతో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్ లేదా డైరెక్ట్ ప్లాన్ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్‌స్టాక్స్, కువేరా, ఎన్ఆర్ఐలకు సంబంధించి వాన్స్ తదితర ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి. ఉపసంహరణ – పన్ను బాధ్యత భారత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్‌తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్‌కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై భారత పౌరులకు, ఎన్ఆర్ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్ఆర్ఐలు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే విక్రయించుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్ అమలు చేస్తాయి. అదే డెట్ ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్ రెసిడెన్సీ సరి్టఫికెట్ (టీఆర్సీ) సమరి్పంచాల్సి ఉంటుంది. భారత్‌లో పన్ను చెల్లించిన ఎన్ఆర్ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్’కు చెందిన కౌశిక్ రామచంద్రన్ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పసిడి జోరుకు బ్రేక్.. నేడు తులం ఎంతంటే..
Gold Price Today: వరుసగా రెండు రోజులుగా కొనసాగుతున్న బంగారం జోరుకు బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (సెప్టెంబర్ 22) కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.69,600 వద్ద, 24 క్యారెట్ల పుత్తడి రూ. 75,930 వద్ద కొనసాగుతన్నాయి. అదేవిధంగా బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే రేట్లు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.69,750లుగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.76,080 లుగా కొనసాగుతన్నాయి.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు ఎలాంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.98,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ఇంతలా పెరిగితే ఇంకేం కొంటాం..!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 21) ఎగిసిన ధరలతో మేలిమి, ఆర్నమెంట్ బంగారం రేట్లు కొత్త మార్కులకు చేరువయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.750 ఎగిసి రూ.69,600 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి ఒకేసారి రూ.820 పెరిగి రూ. 75,930 లకు ఎగిసింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.ఇదీ చదవండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడిదేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు ఈరోజు ఆకాశానికి ఎగిశాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.69,750 లను చేరుకుంది. 24 క్యారెట్ల మేలిమి బంగాంర ధర రూ.820 ఎగిసి రూ.76,080 లను తాకింది.వెండి ధరలూ పైకే..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజూ పెరిగాయి. క్రితం రోజున కేజీకి రూ.1500 పెరిగిన సిల్వర్ రేట్లు ఈరోజు రూ.500 మేర దూసుకెళ్లాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.98,000లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బుల్.. కొత్త రికార్డుల్!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు, అమెరికా, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కలిసిరావడంతో దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 1,360 పాయింట్లు ఎగసి తొలిసారి 84 వేల స్థాయిపైన 84,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,750 ఎగువున 25,791 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఇది సరికొత్త రికార్డు ముగింపు. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,510 పాయింట్లు బలపడి 84,694 వద్ద, నిఫ్టీ 433 పాయింట్లు ఎగసి 25,849 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, మెటల్, ఆటో, రియల్టీ రంగాలకు చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.37%, 1.16 శాతం చొప్పున పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు పెరిగి 83.55 స్థాయి వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. యూరప్ మార్కెట్ల ఒకటిన్నర శాతం నష్టపోయాయి. రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.21%, ప్రైవేటు రంగ బ్యాంక్ సూచీ 3%, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్సు 2.32% లాభపడ్డాయి. ఆటో, ఇండ్రస్టియల్, మెటల్, కన్జూమర్ సూచీలు 2% పెరిగాయి. → పసిడి రుణాల వ్యాపారంపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు భారీగా లాభపడింది. బీఎస్ఈలో 7% పెరిగి రూ.531 వద్ద స్థిరపడింది.→ ఐటీడీ సిమెంటేషన్ ఇండియా షేరు 20% లాభపడి రూ.566 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ఈ కంపెనీలో అదానీ ఈ కంపెనీలో 46.64% వాటా కొనుగోలు చేయ నుందన్న వార్తలతో ఈ షేరుకుడిమాండ్ నెలకొంది. → సెన్సెక్స్ 1,330 పాయింట్లు ర్యాలీ చేయడంతో ఒక్కరోజులో రూ.6.24 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.472 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లో 30కి గానూ 26 షేర్లు లాభపడ్డాయి. నాలుగు షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే 1000కి పైగా పాయింట్లు లాభపడటం ఇది పదోసారి కావడం విశేషం. → ఐసీఐసీఐ(4%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం 1,360 పాయింట్లలో సగ భాగం ఈ షేర్ల నుంచి వచ్చాయి. ఇంట్రాడేలో ఐసీఐసీఐ బ్యాంకు అయిదున్నర శాతం ర్యాలీ చేసి రూ.1361 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1359.51 పాయిట్ల లాభంతో 84544.31 వద్ద, నిఫ్టీ 375.20 పాయింట్ల లాభంతో 25791.00 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యు స్టీల్, లార్సెన్ & టూబ్రో, భారతి ఎయిర్టెల్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ఉత్సాహం ఆవిరి.. రయ్‌మన్న రేట్లు!
Gold Price Today: బంగారం కొనుగోలుదారుల ఉత్సాహం ఆవిరైంది. దేశంలో పసిడి ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 20) భారీగా పెరిగాయి. మూడు రోజుల్లో తగ్గిన దానికి మించి శుక్రవారం ధరలు ఎగిశాయి.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒకేసారి రూ.600 పెరిగి రూ.68,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ఏకంగా రూ.660 ఎగిసి రూ. 75,110 లను తాకింది.బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.ఢిల్లీలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.69,000 లను చేరుకుంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.660 హెచ్చి రూ.75,260 వద్దకు పెరిగింది.ఇదీ చదవండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడివెండి ధరలు సైతందేశవ్యాప్తంగా వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న సిల్వర్ రేట్లు శుక్రవారం కేజీకి ఏకంగా రూ.1500 పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.97,500లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
సెబీ కొత్త రూల్స్.. డెట్ సెక్యూరిటీల నిబంధనలు మార్పు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రుణ(డెట్) సెక్యూరిటీల జారీ విధానాలను క్రమబద్ధీకరించేందుకు నడుం కట్టింది. ఇందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీంతో ఇక డెట్ సెక్యూరిటీల జారీ వేగవంతంకానుంది.తద్వారా పబ్లిక్కు సెక్యూరిటీలను జారీ చేసే సంస్థలకు నిధులు త్వరగా అందనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సెబీ పబ్లిక్ నుంచి స్పందన కోరే ముసాయిదా డాక్యుమెంట్ల గడువును ప్రస్తుత 7 రోజుల నుంచి 1 పనిదినానికి సవరించింది. ఇది ఇప్పటికే లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు వర్తించనుంది. ఇతరత్రా సెక్యూరిటీల జారీని చేపట్టే సంస్థలకు 5 రోజులుగా వర్తించనుంది.జాతీయస్థాయిలో టెర్మినళ్లు కలిగి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు ఫైలింగ్ తదుపరి ఒక రోజులోనే ముసాయిదా పత్రాలను దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో కనీస సబ్స్క్రిప్షన్ గడువును సెబీ 3 నుంచి 2 రోజులకు తగ్గించింది. -
ఫెడ్ వడ్డీ కోత పసిడికి బూస్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. నాలుగేళ్ల తదుపరి బుధవారం 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలసిరాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ నిధులు బంగారం ధరలకు దన్నునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. మిశ్రమ అంచనాలు సుమారు 14 నెలలపాటు రెండు దశాబ్దాల గరిష్టం వద్ద కొనసాగిన ఫెడ్ ఫండ్స్ రేట్లు దిగివస్తున్నాయి. తాజాగా రేట్ల తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి(డిసెంబర్)కల్లా మరో 0.5 శాతం కోత పెట్టనున్నట్లు అంచనా. అయితే ఫెడ్ రేట్ల తగ్గింపుతో ఈక్విటీలపై రాబడి క్షీణించనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు. కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సమీపకాలంలో పసిడి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు. యూఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారిచూపుతుందని అభిప్రాయపడ్డారు. రేట్ల కోతకు దారి... ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు బిజ్2క్రెడిట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా పేర్కొన్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేశారు. వెరసి ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న విషయం విదితమే.అయితే ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల ప్రభావం భారత్‌పై ఉండదని ఇండియాబాండ్స్.కామ్ సహవ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా పేర్కొన్నారు. రిస్క్ ఆస్తులలో భారీ ర్యాలీ, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాల కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపునకు చాన్స్ తక్కువేనని తెలియజేశారు. అంచనాలకు మించి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎడిల్వీజ్ ఎంఎఫ్ ఈక్విటీస్ సీఐవో త్రిదీప్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.భారత్‌పై ప్రభావం అంతంతే..మార్కెట్‌వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను పరిగణనలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్‌పై పెద్దగా ఉందు. దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మొత్తం మీద రేట్ల తగ్గింపనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.21 పాయింట్ల లాభంతో 83267.44 వద్ద, నిఫ్టీ 38.30 పాయింట్ల లాభంతో 25415.80 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), కోటక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, నెస్లే, హిందూస్తాన్ యూనీలీవర్ మొదలైన కంపెనీలు చేరాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), కోల్ ఇండియా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైన్సన్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ హ్యాట్రిక్.. వరుసగా మూడో రోజూ కరిగిన బంగారం!
దేశంలో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ క్షీణించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 19) పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.600 మేర పుత్తడి ధరలలో తగ్గుదల నమోదైంది. మరోవైపు యూఎస్ ఫెడ్ రేట్ల కోత ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లాయి. అయితే ఇక్కడ దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు ఎంత మేర తగ్గాయన్నది చూస్తే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.68,250 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.280 కరిగి రూ. 74,450 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల పసిడి ధర రూ.280 క్షీణించి రూ.74,600 వద్దకు దిగివచ్చింది.ఇదీ చదవండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడివెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు నిలకడగా కొనసాగుతన్నాయి. హైదరాబాద్‌లో నిన్నటి రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి ధర ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.96,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడి
అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బుధవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరష్టాలకు పెరిగాయి.బుధవారం మధ్యాహ్నం 2:17 గంటల సమయానికి స్పాట్ బంగారం 0.9% పెరిగి ఔన్సుకు 2,592.39 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 2,598.60 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ బుధవారం ప్రకటించిన అర శాతం రేట్ల కోతతో ద్రవ్య విధాన సడలింపు స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ బెంచ్‌మార్క్ రేటు ఈ సంవత్సరం చివరి నాటికి మరో అర శాతం, 2025లో పూర్తిగా ఒక శాతం తగ్గుతుందని భావిస్తున్నారు.వడ్డీ రేట్ల తగ్గింపుతో అందరి దృష్టి బంగారంపై పడింది. పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో డాలర్‌పై భారం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీలను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు బంగారం చౌకగా ఉండనుంది.ఫెడ్ రేట్ కట్ తరువాత డాలర్ 0.5% పతనమైంది. 2023 జూలై నుండి దాని కనిష్ట స్థాయికి పడిపోయింది.ఇన్వెస్టర్లు ఇప్పుడు పాలసీ మార్గంపై ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నుంచి మరిన్ని సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా స్పాట్ వెండి సోమవారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఔన్స్‌కు 0.6% పెరిగి 30.93 డాలర్ల వద్దకు చేరింది. -
ఫెడ్ అర శాతం వడ్డీ కట్
న్యూయార్క్: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటులో ఏకంగా 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఇప్పటివరకూ 5.25–5.5 శాతంగా అమలవుతున్నాయి. 32 నెలల తదుపరి ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్ల పెంపు నుంచి యూటర్న్ తీసుకుంది. ఆగస్ట్‌లో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాలకంటే తక్కువగా 1,42,000కు పరిమితంకాగా.. రిటైల్ ధరలు 0.3 శాతం బలపడి 3.2 శాతాన్ని తాకాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు అందినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం కోవిడ్–19 కారణంగా 2000 మార్చిలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వచి్చన ఫెడ్ 2023 జూలై తదుపరి నిలకడను కొనసాగిస్తూ వచి్చన సంగతి తెలిసిందే. 2000 డిసెంబర్లో 6.5 శాతానికి ఎగసిన ఫెడ్ ఫండ్స్ రేట్లు గతేడాది తిరిగి 5.5 శాతానికి చేరడంతో గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి! వడ్డీ రేట్ల తగ్గింపుతో యూఎస్ మార్కెట్లు 1% పైగా ఎగసి ట్రేడవుతున్నాయి. పసిడి ఔన్స్ ధర 24 డా లర్లు పెరిగి 2,618 డాలర్ల ఆల్‌టైమ్ హైని చేరింది. -
బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 18) పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,500 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 కరిగి రూ. 74,730 వద్దకు తగ్గింది.దేశంలోని ఇతర ప్రాంతాల విషయానికి వస్తే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగురాష్ట్రాలలో మాదిరిగానే బంగారం ధరలు తగ్గి అవే రేట్లు ఉన్నాయి. ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,650 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 క్షీణించి రూ.74,880 వద్దకు వచ్చింది.ఇదీ చదవండి: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..వెండి ధరలు కూడా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి ధర ఈరోజు కూడా రూ.1000 క్షీణించింది. హైదరాబాద్‌లో వెండి ధర కేజీ రూ.96,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గోల్డ్ ఈటీఎఫ్‌లు జిగేల్!
ఇన్వెస్టర్లు పుత్తడి పెట్టుబడుల వెంట పడుతున్నారు. భారీగా లాభాలందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) జారీ నిలిచిపోవడం... తాజా బడ్జెట్లో పన్ను ఊరట.. బంగారం రేట్లు అంతకంతకూ దూసుకుపోతుండటంతో మదుపరులు మళ్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా బంగారం కొనుగోళ్లకు సై అంటున్నారు. గత కొంతకాలంగా మెరుపు కోల్పోయిన గోల్డ్ ఈటీఎఫ్‌లు మళ్లీ తళుక్కుమంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 6,134 కోట్ల విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచి్చనట్లు అంచనా. ఇందులో రూ.4,500 కోట్లు గత నాలుగు నెలల్లోనే మదుపరులు ఇన్వెస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఒక్క ఆగస్ట్ నెలలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో రూ.1,611 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం రేట్లు రూ. 3,000కు పైగా దిగొచి్చన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకున్నారు. ఆభరణాల కొనుగోళ్లు జోరందుకోవడంతో పాటు అటు డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్పీడ్ పెంచారు. ఇదిలాఉంటే, అంతర్జాతీయంగా పుత్తడి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దూసుకెళ్తూనే ఉంది. తాజాగా ఔన్స్ రేటు 2,600 డాలర్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. దీంతో దేశీయంగానూ సుంకం కోతకు ముందు స్థాయికి, అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,500కు చేరింది. గోల్డ్ బాండ్ల నిలిపివేత ఎఫెక్ట్... గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ తగ్గేందుకు గోల్డ్ బాండ్లు ప్రధాన కారణం. దేశంలో బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం 2016లో ప్రవేశపెట్టిన ఎస్జీబీ స్కీమ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభం వరకు పక్కాగా అమలు చేసింది. క్రమంతప్పకుండా ఎస్జీబీలను జారీ చేస్తూ వచి్చంది. అటు బంగారం ధర భారీగా పెరగడంతో పాటు వార్షికంగా 2.5% వడ్డీ రేటు లభించడం.. 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లపై బాగా ఆసక్తి చూపారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో గడువు తీరిన ఎస్‌జీబీలపై 120 శాతం పైగానే రాబడి లభించడం విశేషం. ప్రస్తుతం ఇంకా రూ.27,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. అయితే, బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రం కొత్త గోల్డ్ బాండ్ల జారీకి ముఖం చాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో ఇక ఈ స్కీమ్‌కు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేననేది పరిశీలకుల అభిప్రాయం. ఈటీఎఫ్‌ల వైపు చూపు... గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ 20 శాతం మేర రాబడులు అందించింది. గోల్డ్ బాండ్ల జారీ నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లకు ప్రధానంగా రెండే ఆప్షన్లున్నాయి. ఇప్పటికే ట్రేడవుతున్న గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం. ‘బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై సానుకూల పన్ను విధానం, కస్టమ్స్ సుంకం తగ్గింపు, తాజా గోల్డ్ బాండ్ల జారీ లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఈటీఎఫ్‌ల బాట పడుతున్నారు’ అని మనీ మంత్ర ఫౌండర్ విరల్ భట్ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తర్వాత భారీగా లాభాలను కళ్లజూసిన ఇన్వెస్టర్లు సైతం మళ్లీ ఆ ఆప్షన్ లేకపోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు తిరిగొస్తున్నారని ఫండ్ డి్రస్టిబ్యూటర్లు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సానుకూలంగా మారింది. పెట్టుబడిని రెండేళ్లకు పైగా కొనసాగిస్తే 12.5% సుంకం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇన్వెస్టర్ల ట్యాక్స్ శ్లాబ్‌ను బట్టి పన్ను విధింపు ఉండేది.రేటు రయ్ రయ్...భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఖాయంగా కనిపిస్తుండటంతో బంగారం రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉందనేది ఫండ్ మేనేజర్ల అంచనా. ‘మెరుగైన రాబడుల నేపథ్యంలో పసిడి పెట్టుబడుల ట్రెండ్ కొనసాగనుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన పుత్తడిలోకి పెట్టుబడులు పెరిగాయి. సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవన్నీ గోల్డ్ రష్కు మరింత దన్నుగా నిలుస్తున్నాయి’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. -
ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్
భారతదేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు బంగారం దిగుమతులు 22.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. దేశంలో పసిడికి డిమాండ్ పెరగటం వల్ల దిగుమతులు గతంలో కంటే కూడా గణనీయంగా పెరిగాయి.బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, పండుగ సీజన్లో పెరిగిన డిమాండ్‌తో నగల వ్యాపారులు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా యూనియన్ బడ్జెట్లో గోల్డ్ ట్యాక్స్ తగ్గించడం అని తెలుస్తోంది. అయితే రత్నాలు, రత్నాలకు సంబంధించిన ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.2024 మొదటి త్రైమాసికం కంటే.. రెండో త్రైమాసికంలోనే బంగారం దిగుమతులు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్ కూడా పెరిగింది. పండుగ సీజన్ కోసం దేశం సిద్ధమవుతున్నందున, పెరుగుతున్న బంగారం డిమాండ్‌ను తీర్చడానికి రిటైలర్లు తమ స్టోర్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నారు.జులై యూనియన్ బడ్జెట్లో బంగారం మీద ట్యాక్ తగ్గించడం కూడా బంగారం కొనుగోళ్లను బాగా పెంచింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చింది. మొత్తం మీద 2024లో భారతదేశంలో బంగారం డిమాండ్ 850 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 12 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐకు అదో పెద్ద సవాలు: తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చుపెరుగుతున్న ధరలుదేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెలలోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. ఈ రోజు (సెప్టెంబర్ 17)న గోల్డ్ రేటు రూ. 74890 (తులం 24 క్యారెట్స్) వద్ద ఉంది. ఈ ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 41.86 పాయింట్ల లాభంతో 83030.64 వద్ద, నిఫ్టీ 20.20 పాయింట్ల లాభంతో 25403.20 వద్ద నిలిచాయి.హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్టెల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.ఇదీ చదవండి: హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రేట్ రివర్స్.. వెనక్కి తగ్గిన బంగారం, వెండి!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు రివర్స్ అయ్యాయి. క్రితం రోజున ఎంత మేర పసిడి రేటు పెరిగిందో మళ్లీ ఈరోజు (సెప్టెంబర్ 17) అంతే స్థాయిలో తగ్గి మొన్నటి ధరకు దిగొచ్చింది. అంటే మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.75వేల దిగువకు వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎంత మేర తగ్గాయంటే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,650 వద్దకు వచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.160 కరిగి రూ. 74,890 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు ఇదే విధంగా తగ్గాయి.ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,800 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 క్షీణించి రూ.75,040 వద్దకు వచ్చింది.వెండి ధర వెనక్కి..దేశవ్యాప్తంగా వెండి ధరలు వెనకడుగు వేశాయి. నిన్నటి రోజున కేజీకి రూ.1000 మేర పెరిగిన వెండి ఈరోజు అంతే మొత్తంలో క్షీణించింది. హైదరాబాద్‌లో మంగళవారం వెండి కేజీకి రూ.1000 తగ్గి రూ.97,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
సెబీ చీఫ్ వ్యవహారంపై స్పందించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: సెబీ చైర్పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తమను తాము సమర్థించుకుంటున్నారని, కాంగ్రెస్ ఆరోపణలకు విరుద్ధమైన వాస్తవాలను బయటపెడుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ తమను తాము రక్షించుకొంటూనే, తమపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా స్పందిస్తున్నారన్నారు.‘చాలా ఆరోపణలకు సమాధానాలు వస్తున్నాయ్. ఈ నిజాలను వాళ్లు(పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) పరిగణనలోకి తీసుకుంటారనే అనుకుంటున్నాను’ అని ఆమె అన్నారు. ‘మాధబి పురి బచ్ సమాధానాలపట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా?’ అనే మరో ప్రశ్నకు.. ‘నేనిక్కడ ఉన్నది అది తప్పో, ఒప్పో నిర్ధారించేందుకు కాదు’ అని నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.బచ్ దంపతులు అక్రమాలకు పాల్పడ్డారని, లాభాపేక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంలో బచ్ అవినీతికి దిగారని హిండెన్‌బర్గ్ ఆరోపించినదీ తెలిసిందే.ఇదీ చదవండి: సెబీ పనితీరును సమీక్షిస్తాం: PAC -
బోనస్ షేర్ల ట్రేడింగ్‌లో సెబీ మార్పులు
బోనస్ షేర్ల క్రెడిట్, ట్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మదుపరులు రికార్డు తేదీ నుండి కేవలం రెండు రోజుల తర్వాత నుంచే బోనస్ షేర్లను ట్రేడ్ చేయగలుగుతారు. అక్టోబర్ 1 నుంచి ఈ సర్దుబాటు అమల్లోకి వస్తుంది.ప్రస్తుత ఐసీడీఆర్ (ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) నియమాలు బోనస్ ఇష్యూ అమలుకు సంబంధించి మొత్తం టైమ్‌లైన్‌లను సూచిస్తాయి. అయితే ఇష్యూ రికార్డ్ తేదీ నుండి బోనస్ షేర్ల క్రెడిట్, అటువంటి షేర్ల ట్రేడింగ్ కోసం నిర్దిష్ట కాలక్రమం లేదు.ప్రస్తుతం బోనస్ ఇష్యూ తర్వాత ఇప్పటికే ఉన్న షేర్లు అదే ఐఎస్ఐఎన్ కింద ట్రేడింగ్‌ను కొనసాగిస్తాయి. వీటికి కొత్తగా క్రెడిట్ అయ్యే బోనస్ షేర్లు రికార్డ్ తేదీ తర్వాత 2-7 పని దినాలలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి.నూతన మార్గదర్శకాల ప్రకారం, బోనస్ షేర్లలో ట్రేడింగ్ ఇప్పుడు రికార్డ్ తేదీ తర్వాత రెండవ పని రోజు (T+2) ప్రారంభవుతుంది. దీంతో మార్కెట్ సామర్థ్యం పెరగడంతోపాటు ఆలస్యం తగ్గుతుంది. అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ప్రకటించిన అన్ని బోనస్ ఇష్యూలకు ఇది వర్తిస్తుంది అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఒక సర్క్యులర్‌లో తెలిపింది. -
రూ. 75వేలు దాటేసిన బంగారం.. రూ. లక్షకు చేరువలో వెండి
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా తులం పసిడి ధర గరిష్టంగా రూ. 160 పెరిగింది. దీంతో నిన్న స్థిరంగా వున్న గోల్డ్ రేటు, ఈ రోజు కొంత ముందుకు కదిలింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68800 వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 75050 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్), రూ. 160 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68800 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75050గా ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలలో స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ బంగారం ధర రూ. 68950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75150 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు, ఈ రోజు వరుసగా రూ. 150, రూ. 110 పెరిగింది.ఇదీ చదవండి: 'ఏఐకు అదో పెద్ద సవాలు'వెండి ధరలుదేశంలో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 98,000 వద్ద ఉంది. ఈ రోజు కేజీ వెండి ధర రూ.1000 పెరగడంతో రూ. 98వేలకు చేరింది. ఇదే ధరలు దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కొనసాగుతాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).