Market
-
రూ. 75వేలు దాటేసిన బంగారం.. రూ. లక్షకు చేరువలో వెండి
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా తులం పసిడి ధర గరిష్టంగా రూ. 160 పెరిగింది. దీంతో నిన్న స్థిరంగా వున్న గోల్డ్ రేటు, ఈ రోజు కొంత ముందుకు కదిలింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68800 వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 75050 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్), రూ. 160 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68800 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75050గా ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలలో స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ బంగారం ధర రూ. 68950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75150 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు, ఈ రోజు వరుసగా రూ. 150, రూ. 110 పెరిగింది.ఇదీ చదవండి: 'ఏఐకు అదో పెద్ద సవాలు'వెండి ధరలుదేశంలో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 98,000 వద్ద ఉంది. ఈ రోజు కేజీ వెండి ధర రూ.1000 పెరగడంతో రూ. 98వేలకు చేరింది. ఇదే ధరలు దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కొనసాగుతాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మార్కెట్ చూపు ఫెడ్ వైపు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య కమిటీ విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, యూఎస్, భారత్ బాండ్లపై రాబడులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. అలాగే వచ్చే వారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ప్లాట్‌ఫామ్ నార్తెర్న్ ఆర్క్ క్యాపిటల్ ఐపీఓల సబ్‌స్క్రిబ్షన్‌తో పాటు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్‌పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయ ఆగస్టు టోకు ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఫెడ్ కమిటీ ఆర్థిక అంచనాలు, యూఎస్ నిరుద్యోగ క్లెయిమ్స్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం విడుదల కానుంది అదే రోజున బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి. క్రూడాయిల్ ధరలూ కీలకం ద్రవ్యోల్బణంతో పాటు ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్లపై ప్రభావాన్ని చూపే క్రూడాయిల్ ధరలూ ఈ వారం కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ధరలు 14 నెలల కనిష్టం వద్ద ట్రేడవుతున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71.61 డాలర్ల దిగువకు చేరుకుంది. దీంతో చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే దేశమైన భారత్‌కు ఇది సానుకూల అంశంగా మారింది.ఫెడ్ నిర్ణయాలపై దృష్టివడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగళవారం(సెపె్టంబర్ 17న) మొదలవుతాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ప్రథమార్థంలో రూ.27,856 కోట్లుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ ప్రథమార్థం(1–15న) విదేశీ ఇన్వెస్టర్లు రూ.27,856 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–13 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,525 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం (సెప్టెంబర్ 15) సెలవు తీసుకున్నట్లు.. స్థిరంగా ఉండిపోయాయి. ధరల్లో ఏ మాత్రం చలనం లేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఈ కథనంలో దేశంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68650 వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 74890 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి నిన్నటి అదే ధరలు ఈ రోజు కూడా కొనసాగుతాయి.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు స్థిరంగానే ఉంది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68650 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74890గా ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ బంగారం ధర రూ. 68800 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75040 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న వరుసగా రూ. 400, రూ. 440 పెరిగిన పసిడి ఈ రోజు స్థిరంగానే ఉంది.ఇదీ చదవండి: ఐఫోన్ 16 సిరీస్ ఫ్రీ-బుకింగ్స్: ఇలా బుక్ చేసుకోండి వెండి ధరలుదేశంలో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 97,000 వద్ద ఉంది. ఇటీవల కాలంలో సిల్వర్ రేటు భారీగా పెరిగింది. ఇదే ధరలు దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కొనసాగుతాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే..
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కేవలం రెండు రోజుల్లోనే తులం గోల్డ్ రేటు ఏకంగా రూ. 1740 పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనూ ఇదే వరుస కొనసాగుతోంది. ఈ రోజు (సెప్టెంబర్ 14) బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా శనివారం పసిడి ధరలు వరుసగా రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68650 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.74890 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68650 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74890గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 400, రూ. 440 పెరిగినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 68800 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75040 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 1200, రూ. 1300 పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న రూ. 89,500 వద్ద ఉన్న వెండి.. ఈ రోజు రూ. 2500 పెరుగుదలతో రూ. 92000 (కేజీ) వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం ధరధగ!
న్యూఢిల్లీ/న్యూయార్క్: బంగారం అంతర్జాతీయంగా కొత్త రికార్డు ధరలను తాకింది. కమోడిటీ ఫ్యూచర్స్– నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడయ్యే డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రాములు) ధర శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 2,611.6 డాలర్లను చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 25 డాలర్లకు పైగా ఎగసి ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల కోత అంచనాలు పసిడి పరుగులకు దోహదం చేస్తున్నాయి.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన ఫారెక్స్ నిల్వలుదేశంలోనూ అదే తీరు...: దేశీయంగా చూస్తే ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.75,500కు చేరింది. ఒక్క జులైలో దేశీయంగా పసిడి ధర రూ.5,000 ఎగసి రూ.71,050కి చేరింది. మరోవైపు వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. కిలోకు శుక్రవారం రూ.2,000 ఎగసి రూ.89,000కు చేరింది. ముంబైలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల ధరలు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,260, రూ.1,200 చొప్పున ఎగసి వరుసగా రూ.72,610, రూ.69,150కి చేరాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.3,500 పెరిగి రూ.95,000కు ఎగసింది. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.700 లాభంతో రూ. 74,000పైన ట్రేడవుతోంది. వెండి ధర రూ. 2,400 పెరిగి రూ. 89,500 వద్ద ట్రేడవుతోంది. -
ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!
సెప్టెంబర్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో గోల్డ్ రేటు శుక్రవారం రూ. 1300 వరకు పెరిగింది. దీంతో తులం బంగారం రూ.75000 చేరువకు చేరిపోయింది. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో..హదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఈ రోజు (సెప్టెంబర్ 13) పసిడి ధరలు వరుసగా రూ. 1200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1300 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68250 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.74450 వద్ద ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 68250 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74450గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 1200, రూ. 1300 పెరిగినట్లు స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 68400 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.74600 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 100 తగ్గిన గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 1200, రూ. 1300 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నిన్న రూ. 91,500 వద్ద స్థిరంగా ఉన్న వెండి.. ఈ రోజు రూ. 3500 పెరుగుదలతో రూ. 95000 (కేజీ) వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ధీమాగా బీమా.. ఇలా!(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
గురువారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 గంటల సమయానికి సెన్సెక్స్ 285.23 పాయింట్ల నష్టంతో 82,677.48 వద్ద, నిఫ్టీ 77.05 పాయింట్ల నష్టంతో 25,311.85 పాయింట్ల వద్ద మొదలైంది.టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్, విప్రో మొదలైన కంపెనీలు చేరాయి. ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్తాన్ యూనిలీవర్ వంటి కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో నిలిచింది. సెన్సెక్స్ ఏకంగా 1,439.55 పాటింట్ల లాభంతో 82,962.71 వద్ద, నిఫ్టీ 470.40 పాయింట్ల లాభంతో 25388.90 వద్ద నిలిచాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ లాభాల్లో ముగిశాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హిందాల్కో, భారతి ఎయిర్టెల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు నిలిచాయి. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, బయోకాన్, అపోలో టైర్స్, గుజరాత్ గ్యాస్, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం తగ్గుముఖం.. శాంతించిన వెండి!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజున గణనీయంగా పెరిగిన పసిడి రేట్లు ఈరోజు (సెప్టెంబర్ 12) స్వల్పంగా దిగొచ్చాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం ధరలు నేడు ఎంత మేర తగ్గాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,050 వద్దకు వచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 కరిగి రూ. 73,150 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో స్వల్పంగా తగ్గాయి.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుమరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,200 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 క్షీణించి రూ.73,300 వద్దకు వచ్చింది.వెండి ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి రేట్లు ఈరోజు శాంతించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.91,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బీవోపై ఎఫ్‌పీఐల వెనకడుగు
న్యూఢిల్లీ: అంతిమ లబ్దిదారుల(బీవో) వెల్లడి నిబంధనలను వ్యతిరేకిస్తూ సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్(ఎఫ్‌పీఐ) సంస్థలు తాజాగా వెనక్కి తగ్గాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన బీవో నిబంధనల వెల్లడి గడువు ముగియనుండటంతో అత్యవసర ఉపశమనాన్ని కోరుతూ తొలుత శాట్‌కు ఫిర్యాదు చేశాయి. మారిషస్ ఎఫ్‌పీఐ సంస్థలు ఎల్టీఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, లోటస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెబీ కొత్తగా విడుదల చేసిన నిబంధనల అమలు వాయిదాను కోరుతూ దరఖాస్తు చేశాయి. అయితే ఎఫ్‌పీఐల తరఫు న్యాయవాదులు ఫిర్యాదులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే కోర్టుకు విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిచాయి. గత ఐదు రోజులుగా ఎఫ్‌పీఐలు తమ పోర్ట్‌ఫోలియోలను విజయవంతంగా రీబ్యాలన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పరిధిలోకి రాని హోల్డింగ్స్‌ను లిక్విడేట్ చేసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్‌పై 2023 జనవరిలో యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెలువరించిన నివేదికలో ఈ రెండు ఎఫ్‌పీఐల పేర్లను ప్రస్తావించడం గమనార్హం! ఏం జరిగిందంటే? సెబీ బీవో నిబంధనల అమలులో మరింత గడువు కోసం ఎఫ్‌పీఐలు శాట్‌ను ఆశ్రయించాయి. హోల్డింగ్స్ విషయంలో యాజమాన్య హక్కుల పూర్తి వివరాలను వెల్లడించని ఎఫ్‌పీఐలకు సెబీ సెపె్టంబర్ 9 డెడ్‌లైన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025 మార్చివరకూ గడువు పెంపును కోరుతూ రెండు ఎఫ్‌పీఐ సంస్థలు శాట్‌కు దరఖాస్తు చేశాయి. 2023 ఆగస్ట్‌లో సెబీ బీవో నిబంధనలను జారీ చేసింది. -
ఈక్విటీ ఫండ్స్ అదే జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్‌లోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ముఖ్యంగా థీమ్యాటిక్ ఫండ్స్, కొత్త పథకాల (న్యూ ఫండ్ ఆఫర్లు/ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఎక్కువ పెట్టుబడులను సమీకరించాయి. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. జూన్‌లో వచి్చన రూ.40,608 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు నెలవారీ గరిష్ట రికార్డు కాగా, ఆగస్ట్‌లో పెట్టుబడులు రెండో గరిష్ట రికార్డుగా ఉన్నాయి. ఈ గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి ఆగస్ట్‌లో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో ఇవి రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ జూలై చివరికి ఉన్న రూ.65 లక్షల కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి రూ.66.7 లక్షల కోట్లకు చేరింది. కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.23,547 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో ఇవి రూ.23,332 కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా పెట్టుబడులు.. → థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జూలైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించడం గమనార్హం. → ఆగస్ట్‌లో ఆరు కొత్త పథకాలు ప్రారంభం కాగా, అందులో ఐదు సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి రూ.10,202 కోట్లను సమీకరించాయి. → లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,637 కోట్లు వచ్చాయి. మిడ్‌క్యాప్ పథకాలు రూ.3,055 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,209 కోట్ల చొప్పున ఆకర్షించాయి. అన్ని రకాల పథకాల్లోకి పెట్టుబడుల రాక ఇన్వెస్టర్లలో మార్కెట్ల పట్ల ఉన్న సానుకూల ధోరణిని తెలియజేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక రూ.3,513 కోట్లుగా ఉంది. → కేవలం ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. → డెట్ పథకాల్లోకి నికరంగా రూ.45,169 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.1.2 లక్షల కోట్ల కంటే 62 శాతం తక్కువ. → డెట్‌లో ఓవర్‌నైట్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,106 కోట్లను ఆకర్షించాయి. ఆ తర్వాత లిక్విడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. మొత్తం పెట్టుబడుల్లో 86 శాతం ఈ మూడు విభాగాల్లోని పథకాల్లోకే వచ్చాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.1,611 కోట్లను ఆకర్షించాయి. జూలైలో వచ్చిన రూ.1,337 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోంది. → మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) జూలై చివరకి ఉన్న 19.84 కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి 20 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. -
నేడు బంగారం కొనబోతే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. మూడు రోజులుగా స్తబ్దుగా ఉన్న పసిడి రేట్లు ఈరోజు (సెప్టెంబర్ 11) ఎగిశాయి. దీంతో కొనుగోలుదారుల ఉత్సాహం నీరుగారింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.67,150 వద్దకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.410 పెరిగి రూ. 73,250 వద్దకు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు పెరిగాయి.ఇదీ చదవండి: ‘స్టార్ ధన్ వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఈరోజు పసిడి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.67,300 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 410 ఎగిసి రూ.73,400 వద్దకు చేరుకుంది.వెండి కూడా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం కూడా పెరుగదల కనిపించింది. హైదరాబాద్‌లో క్రితం రోజున కేజీకి రూ.1000 మేర పెరిగిన వెండి ధర నేడు రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,500 వద్దకు పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361.75 పాయింట్ల లాభంతో 81,921.29 వద్ద, నిఫ్టీ 104.70 పాయింట్ల లాభంతో 25,041.10 వద్ద నిలిచాయి.దివీస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, భారతి ఎయిర్టెల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పసిడి ధర రూ. 750 తగ్గింది. మధ్యలో ఒకరోజు (సెప్టెంబర్ 6) మాత్రమే గోల్డ్ రేటు గరిష్టంగా రూ.550 పెరిగింది. కాగా ఈ రోజు (మంగళవారం) తులం ధర రూ.30 మాత్రమే తగ్గింది. దీంతో నిన్నటికి.. ఈ రోజుకు ధరల్లో కొంత వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు వరుసగా రూ. 66,920 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.72,990 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. తులం ధర సోమవారం కంటే రూ.30 తగ్గింది.హైదరాబాద్ విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 66770 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ. 72840 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 30 మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 30 మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66770 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72840గా ఉంది.వెండి ధరలుబంగారం ధరల స్వల్పంగా తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 1000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 91000 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఇదీ చదవండి: రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్: ఎక్కడంటే?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం కొనడానికి ఇది మంచి ఛాన్స్!.. ఎందుకంటే?
బంగారం కొనేవారికి సెప్టెంబర్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో ఇప్పటి వరకు పసిడి ధరలు ఒకసారి మాత్రమే పెరిగాయి. కాగా ఈ రోజు (సోవరం) కూడా ధరల పెరుగుదల జరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్ విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 66800 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ. 72870 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.దేశ రాజధానిలో కూడా గోల్డ్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఢిల్లీలో బంగారం ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని తెలుస్తోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది.వెండి ధరలుబంగారం ధరల స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దీంతో కేజీ వెండి రేటు రూ. 90000లకు చేరింది. ఈ ధరలను గమనిస్తే.. నిన్నటికంటే కూడా ఈ రేటు రూ. 500 ఎక్కువని తెలుస్తోంది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్..
దేశంలో వినాయక చతుర్థి సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ గణేష్ చతుర్థికి.. వినాయక విగ్రహాల విక్రయాలు ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'జెప్టో' గణాంకాల ప్రకారం.. వినాయక విగ్రహాలు మాత్రమే కాకుండా రెడీమేడ్ మోదకాలు గంటకు 1500 అమ్ముడైనట్లు.. మోదకాల అచ్చులు కూడా గంటకు 500 అమ్ముడయ్యాయని సమాచారం. ప్రధాన నగరాల్లో ఎక్కువ స్వీట్ ఆర్డర్స్ పొందిన నగరంగా బెంగళూరు రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి.ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జెప్టో.. భారతదేశం అంతటా 10,000 పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాలను విక్రయించింది. వంద శాతం పర్యావరణ అనుకూల విగ్రహాలను అందించడానికి జెప్టో 100 మందికిపైగా స్థానిక కళాకారులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ గత 24 గంటల్లోనే జెప్టో 70,000కు పైగా స్వీట్లను విక్రయించింది. మోదకాలు అమ్మకాలలో ముంబై ముందంజలో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్‌లలో లడ్డూల ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే.. మోదకాలు అమ్మకాలు ఐదు రెట్లు, లడ్డూల విక్రయాలు 2.5 రెట్లు, మిఠాయిలు అమ్మకాలు రెండు రెట్లు, పూజా సామాగ్రి రెండు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. -
రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడి
పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందరూ కోరుకుంటారు. కానీ, అస్థిరతల రిస్క్‌ను ఎదుర్కొనే గుండె ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు. రిస్క్ తక్కువగా ఉండాలి, అదే సమయంలో అచ్చమైన డెట్‌తో పోల్చితే కాస్త మెరుగైన రాబడి కోరుకునే వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న కొన్ని పథకాల్లో పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. బాండ్ల పట్ల బుల్లిష్ ధోరణితో ఉన్న వారికి కూడా ఈ విభాగం అనుకూలం.రాబడులుఈ పథకం ఏడాది కాలంలో 16.6 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో ఏటా11.49 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. 2021 మే నెలలో ఇది ప్రారంభమైంది. అంటే ఈ పథకానికి మూడేళ్ల చరిత్రే ఉంది. అయినప్పటికీ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు పనితీరు కంటే ఈ పథకమే మెరుగ్గా పనిచేసినట్టు తెలుస్తోంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంలో వార్షిక రాబడి 13.91 శాతంగా ఉంటే, మూడేళ్లలో వార్షిక రాబడి 8.59 శాతంగానే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంకన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ సాధారణంగా ఈక్విటీలకు 25–30 శాతం వరకు (పరిస్థితులు, అవకాశాలు) పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. డెట్‌లో 70 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కానీ పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్మాత్రం నేరుగా ఈక్విటీల్లో 15 శాతం వరకే ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 10–15 శాతం వరకు ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.పరాగ్ పారిఖ్ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. రాబడుల కోసం అధిక రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపదు. ఈ పథకమనే కాకుండా ఈ సంస్థకు చెందిన అన్ని విభాగాల్లోనూ ఇదే విధానం అంతర్లీనంగా కొనసాగుతుంటుంది. అందులో ఇది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కనుక రిస్క్ ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈక్విటీ కేటాయింపులను గమనించినట్టయితే ఎక్కువ పెట్టుబడులు డివిడెండ్ దండిగా పంపిణీ చేసే బ్లూచిప్ కంపెనీల్లోనే ఉన్నాయి. డివిడెండ్ స్టాక్స్‌లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి. పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో రూ.2,197 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 14.28 శాతం మేర ఈక్విట్లీలో ఇన్వెస్ట్ చేసింది. 75.71 శాతం డెట్ సాధనాలకు కేటాయించింది. రియల్ ఎస్టేట్ సాధానాల్లో 6.88 శాతం పెట్టుబడులు పెట్టింది. 3.13 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే ఈ నగదును ఉపయోగించి మెరుగైన అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 62 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి. 32 శాతం మేర మిడ్‌క్యాప్‌లో, 6.18 శాతం మేర స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 14 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడులు గమనిస్తే 56 శాతం ఎస్‌వోవీ (సావరీన్ డెట్) రేటెడ్ పత్రాలు, 18.59 శాతం ఏఏఏ రేటెడ్ ఫండ్స్‌లోనే ఉండడం గమనించొచ్చు. అంటే డెట్‌లోనూ 74 శాతం పెట్టుబడులను రిస్క్ చాలా తక్కువ ఉన్న వాటినే ఎంపిక చేసుకుంది. -
బలహీనత కొనసాగొచ్చు
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.ఈ వారం ఐపీఓల పండుగ దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి. ‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు. తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం కొనేవారికి సెప్టెంబర్ కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో ఇప్పటి వరకు పసిడి ధరలు ఒకసారి మాత్రమే పెరిగాయి. కాగా ఈ రోజు (ఆదివారం) కూడా ధరల పెరుగుదల జరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఆదివారం బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 66800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.72870 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటులో ఈ రోజు ఎలాంటి కదలికలు లేదని తెలుస్తోంది.చెన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు ఈ రోజు స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నిన్న రూ. 2500 తగ్గిన వెండి.. ఈ రోజు నిశ్చలంగా ఉంది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 89500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తగ్గిన బంగారం, వెండి ధరలు: ఎంతంటే?
సెప్టెంబర్ నెలలో మొదటిసారి పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం బంగారం రేటు రూ. 440 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.72870 వద్ద నిలిచింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో శనివారం బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 400 తగ్గి రూ. 66800 వద్దకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 440 తగ్గి రూ.72870 వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న కొంత పెరిగిన పసిడి ధరలు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధర రూ. 2500 తగ్గింది. నిన్న రూ. 2000 పెరిగిన కేజీ వెండి ధర ఈ రోజు రూ. 2500 తగ్గింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 84500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
సెప్టెంబర్ మాసం... ఐపీఓల వర్షం!
స్టాక్ మార్కెట్ జోరు నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇష్యూల వర్షం కురవనుంది. 2010 సెప్టెంబర్‌లో అత్యధికంగా 15 ఐపీఓలతో రికార్డు నమోదైంది. ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్లో జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆ 14 ఏళ్ల రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.వరుస ఐపీఓలతో సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్ కళకళలాడనుంది. ఇప్పటికే గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్, బాజార్ స్టయిల్ రిటైల్ ఇష్యూలు పూర్తయ్యాయి. ఇంకా అనేక ఇష్యూలు నిధుల సమీకరణ బాటలో ఉన్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, గరుడా కన్స్ట్రక్షన్స్, మన్బా ఫైనాన్స్ సహా అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూల మోత మోగించనున్నాయి. దీంతో 2010 సెప్టెంబర్ నెల 15 ఐపీఓల రికార్డు తుడిచిపెట్టుకుపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్‌కు సెకండరీ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తోడవడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓల బాట పట్టేందుకు దోహదం చేస్తోందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. ‘వచ్చే కొన్ని వారాల్లో చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. ఇటీవలి ఐపీఓలకు బలమైన డిమాండ్‌తో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం తగినంతగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం‘. మరోపక్క తాజా ఇష్యూలు లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు పంచడం మార్కెట్లో మరింత జోష్ నింపుతోంది’ అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ వి. జయశంకర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల వెల్లువ... ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.55,300 కోట్ల నిధులను ఐపీఓల్లో కుమ్మరించారు. మరోపక్క, సెకండరీ మార్కెట్లో రూ.2,700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. రూ. 6,560 కోట్ల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ భారీ ఇష్యూ 9న మొదలవుతోంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.66–70. టోలిన్స్ టైర్స్ రూ.230 కోట్ల నిధుల కోసం 9న మార్కెట్ తలుపుతడుతోంది. ఇక పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.228–240 ధరల శ్రేణితో ఈ నెల 10న ఐపీఓకు వస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.11,893 కోట్ల విలువైన 14 ఐపీఓలే ఇటీవలి కాలంలో అత్యధికంగా నిలుస్తున్నాయి. 2024 ఆగస్ట్‌లో 10 కంపెనీలు రూ.17,076 కోట్ల నిధులను సమీకరించాయి. ‘మెరుగైన వ్యాపారావకాశాల నేపథ్యంలో భారత కార్పొరేట్ సంస్థలు ప్లాంట్ల విస్తరణతో పాటు కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచాయి. మరోపక్క, పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల గడువు ఆరు నెలలు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్నెల్ల గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఈలోపు ఐపీఓ పూర్తి చేయకపోతే, మళ్లీ ఆడిట్ చేయడంతో పాటు ఐపీవో ముసాయిదా దర ఖాస్తు పత్రాలను మా ర్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఇష్యూ జాప్యానికి దారితీస్తుంది. అందుకే కంపెనీలు వరుసకడుతున్నాయి’ అని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రవి శంకర్ చెప్పారు.ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. లిస్టింగ్‌లో అసాధారణ లాభాలిస్తుండటంతో ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఏ ఐపీఓ వచ్చినా రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడిపోతున్నారు. ఈ నెల 4న ముగిసిన రూ.168 కోట్ల గాలా ప్రెసిషన్ ఇష్యూ 201 రెట్లు అధికంగా సబ్‌్రస్కయిబ్ అయింది. బాజార్ స్టయిల్‌కు 41 రెట్ల స్పందన లభించింది. అంతక్రితం ఎకోస్ మొబిలిలిటీకి 64 రెట్లు సబ్‌్రస్కిప్షన్ లభించింది. అంతేకాదు, ఇది 32 శాతం ప్రీమియంతో లిస్టయింది కూడా. ప్రీమియర్ ఎనర్జీస్ 87 శాతం, ఓరియంట్ టెక్నాలజీస్ 48 శాతం చొప్పన లిస్టింగ్ లాభాలను పంచాయి. ఆగస్ట్‌లో లిస్టయిన 8 ఐపీఓల సగటు లాభం 36 శాతం కావడం గమనార్హం.మార్కెట్ రికార్డులు, ఐపీఓల వరదతో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్‌లో 41.4 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత కావడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.1 కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..
సెప్టెంబర్ ప్రారంభం నుంచి తగ్గుతూ ముందుకు సాగిన బంగారం ధరలు నేడు (సెప్టెంబర్ 6) ఒక్కసారిగా పెరిగాయి. దీంతో తులం బంగారం ధర రూ.73000 దాటేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో శుక్రవారం బంగారం ధరలు పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 510 పెరిగి తులం రేటు రూ. 67,200 వద్దకు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 550 పెరిగి 10 గ్రాముల ధర రూ.73,310 వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరల పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 67,200 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,310గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 510, రూ. 550 ఎక్కువ.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 67,350 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73,460 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు వరుసగా రూ. 510, రూ. 550 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా.. వెండి ధర రూ. 2000 పెరిగింది. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు అమాంతం పెరగటం వల్ల కేజీ రేటు రూ. 87000కు చేరింది. దీన్ని బట్టి చూస్తే వెండి ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయా అని అనిపిస్తోంది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: 8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) విచారణకు ఆమోదించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పీఏసీ ఈ నెలాఖరులో సెబీ పనితీరును సమీక్షించనుందని చెప్పారు.ఆగస్టు 29న జరిగిన పీఏసీ ప్యానెల్ సమావేశంలో సెబీ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలకు అనుగుణంగా సంస్థ పనితీరుపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. దాంతో కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే పీఏసీకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నాయకత్వం వహించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు అధికార ఎన్డీఏ పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ కమిటీలో భాగంగా ఉంటారు.పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరుపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ క్షణమైనా విచారణ జరిపే అధికారం కలిగి ఉంది. అందుకోసం ఆయా సంస్థలకు ముందుగా సమాచారం అందించాల్సిన అవసరం ఉండదు. సెబీ కూడా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థ. పీఏసీ తన తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్ 10న నిర్వహించనుంది. ఆ తేదీన సెబీ విచారణ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.సెబీ చీఫ్ పనితీరుపై ఉద్యోగుల ఫిర్యాదుసెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’అదానీ కంపెనీలో పెట్టుబడులుఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రతికూలంగా ముగిశాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ప్రపంచ సెంటిమెంట్ దేశీయ స్టాక్ మార్కెట్లపైన పడుతోంది. బీఎస్సీ సెన్సెక్స్ 151.48 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 82,201.16 వద్ద స్థిరపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 53.60 పాయింట్లు లేదా 0.21 శాతం కోల్పోయి 25,145.10 వద్ద ముగిసింది.నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 33 నష్టాల బారిన పడ్డాయి. అత్యధికంగా కోకా-కోలా ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.46 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అదే సమయంలో టైటాన్, ఎల్టీఐమైడ్‌ట్రీ, విప్రో, బీపీసీఎల్, ఐటీసీ ఇండెక్స్‌లోని ఇతర స్టాక్‌లలో 3.11 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెబీ చీఫ్ రాజీనామా చేయాల్సిందే.. ఉద్యోగుల నిరసన
భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్పర్సన్ మాధవి పూరి బచ్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది ఉద్యోగులు సెబీ ముంబై ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.సెబీలో విధి నిర్వహణ పరిస్థితులపై ఉద్యోగులు ఆర్థిక శాఖకు చేసిన ఫిర్యాదుపై సెబీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే ఉద్యోగులు నిరసనకు దిగారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. నిరసన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నిరసన తర్వాత ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వెళ్లారు.తమ ఫిర్యాదుపై ఉన్నతస్థాయి అధికారులు చేస్తున్న వక్రీకరణకు వ్యతిరేకంగా, తమ ఐక్యతను ప్రదర్శించడమే ఈ నిరసన ఉద్దేశం అని ఉద్యోగుల మధ్య అంతర్గత సందేశాన్ని ఉటంకిస్తూ మనీకంట్రోల్ పేర్కొంది. సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయడం తక్షణ డిమాండ్ అని ఆ సందేశంలో ఉన్నట్లు తెలిపింది.నిరసన ఎందుకంటే..సెబీలో పని చేయడం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, ఇక్కడ విషపూరితమైన పని వాతావరణం ఉందంటూ కొంతమంది సెబీ ఉద్యోగులు గత నెలలో ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీన్ని సెబీ తప్పుబట్టింది. పనితీరు, జవాబుదారీతనంలో ప్రమాణాలను పాటించే విషయంలో ఉద్యోగులను బయటి శక్తులు తప్పుదోవ పట్టించాయంటూ సెబీ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే.