Market
-
బంగారం బాటలోనే వెండి: స్థిరంగా ధరలు
సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ రోజు (గురువారం) మాత్రం ఉలుకుపలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ కథనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయని వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో సెప్టెంబర్ 5న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో తులం పసిడి ధరలు రూ. 66690 & రూ. 72760 వద్ద ఉన్నాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉంటాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66690, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72760గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు రూ.66840 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.72910 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఈ రోజు స్థిరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా గురువారం (సెప్టెంబర్ 5) స్థిరంగా ఉన్నాయి. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 90000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. వెండి రేటు నిన్న మాదిరిగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పడేసిన ప్రతికూల సెంటిమెంట్..
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.అంతర్జాతీయ ప్రతికూల సెంటిమెంట్లతో దేశీయ ప్రామాణిక సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ తన 14 రోజుల విజయ పరంపరను కోల్పోయింది.ప్రామాణిక సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్ 202.80 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 82,352.64 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 81.15 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 25,198.70 వద్ద ముగిసింది.నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 31 నష్టాల్లో ముగిశాయి. విప్రో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందాల్కో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 3.05 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అదే సమయంలో ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా ఇండెక్స్‌లోని ఇతర స్టాక్‌లలో 2.50 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ఆశాజనకం.. వెండి మరింత తగ్గుముఖం
బంగారం ధరలు కొనుగోలుదారులకు ఆశాజనకంగా కొనసాగున్నాయి. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించలేదు. ఈరోజు (సెప్టెంబర్ 4) కూడా పుత్తడి రేట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా గడిచిన వారం రోజుల్లో కొద్దికొద్దిగానే తులానికి రూ.500 మేర తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.10 తగ్గి రూ.66,690 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.10 క్షీణించి రూ. 72,760 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు క్షీణించాయి.ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.66,840 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 తరిగి రూ.72,910 వద్ద కొనసాగుతున్నాయి.వెండి సైతంవెండి ధరలు గత ఎనిమిది రోజులుగా సానుకూలంగా కొనసాగుతన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం కూడా భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో నేడే కిలో వెండి రూ.900 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.90,000 వద్దకు దిగివచ్చింది. మొత్తంగా గడిచిన ఎనిమిది రోజుల్లో ఎటువంటి పెరుగుదల లేకుండా కేజీకి రూ.3,500 మేర వెండి ధరలు క్షీణించాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో నిలిచాయి. సెన్సెక్స్ 4.41 నష్టంతో 82,555.44 వద్ద, నిఫ్టీ 1.15 పాయింట్ల నష్ఠంతో 25,279.85 వద్ద ముగిశాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు (మంగళవారం) ఉలుకుపలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ కథనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయని వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో సెప్టెంబర్ 3న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో తులం బంగారం ధర రూ. 66700 & రూ. 72770 వద్ద ఉన్నాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉంటాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66700, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72770గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు రూ.66850 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.72920 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఈ రోజు స్థిరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం కొంత తగ్గాయి. కాబట్టి నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 90900 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. వెండి రేటు నిన్నటి కంటే ఈ రోజు రూ. 100 తగ్గింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
త్వరలో సింగిల్ ఫైలింగ్
ముంబై: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి సింగిల్ ఫైలింగ్ ప్రతిపాదన త్వరలోనే అమల్లోకి రాగలదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ వెల్లడించారు. దీనితో, లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలు తాము వెల్లడించాల్సిన సమాచారాన్ని ఒక ఎక్సే్చంజీలో ఫైలింగ్ చేస్తే రెండో ఎక్సే్చంజీలో కూడా అది ఆటోమేటిక్‌గా అప్లోడ్ అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఫైనాన్సింగ్ 3.0 సదస్సులో ప్రత్యేక ప్లీనరీ సెషన్లో పాల్గొన్న సందర్భంగా మాధవి ఈ విషయాలు తెలిపారు. సెబీ మాజీ హోల్‌టైమ్ సభ్యుడు ఎస్కే మొహంతి సారథ్యంలోని కమిటీ ఈ సిఫార్సులు చేసింది. మరోవైపు, నెలకు అత్యంత తక్కువగా రూ. 250 నుంచి ప్రారంభమయ్యే సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రతిపాదన కూడా త్వరలో సాకారం కాగలదని కాగలదని మాధవి వివరించారు. అన్ని ఆర్థిక సాధనాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక పరిణామం కాగలదని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ఐపీవో పత్రాలు..: భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకు, ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పత్రాలను బహుళ భాషల్లో అందుబాటులోకి తేవాలన్న నిబంధనను కూడా ప్రవేశపెట్టే యోచన ఉందని మాధవి చెప్పారు. మరింత మంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో పాలుపంచుకునేందుకు ఐపీవో ప్రాస్పెక్టస్ 15–16 ప్రాంతీయ భాష ల్లో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇన్వెస్టరు తీరుకు అనుగుణమైన వివిధ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సాధనాలను ప్రవేశపెట్టడంపై పరిశ్రమతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు.‘హోల్డ్’లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ‘ఆఫర్’జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దరఖాస్తును సెబీ ‘హోల్డ్’లో పెట్టింది. ‘పరిశీలన జారీ చేశాం. దీంతో నిలుపుదల చేశాం’అని సెబీ పేర్కొంది. కారణాలను తెలియజేయలేదు. ఈ ఏడాది ఆగస్ట్ 16న ఐపీవో పత్రాలను సెబీకి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సమరి్పంచడం గమనార్హం. ప్రతిపాదిత దరఖాస్తు ప్రకారం.. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా సమకూరిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్‌లోని నాగౌర్‌లో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 19 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం (ఎంటీపీఏ) ఉండగా.. 60 ఎంటీపీఏ చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీవోకు ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్: వీఎఫ్ఎక్స్ సేవల కంపెనీ ‘ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్’ ఐపీవోకి రావాలనుకుంటోంది. ఎన్ఎస్ ఈ ‘ఎమర్జ్’ ప్లాట్‌ఫామ్‌పై (సూక్ష్మ కంపెనీలకు ఉద్దేశించిన) లిస్ట్ అయ్యేందుకు వీలుగా పత్రాలు సమరి్పంచింది. ఐపీవోలో భాగంగా 36.94 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. సమీకరించే నిధులతో ముంబైలోని అంధేరిలో ఉన్న స్టూడియో, ఆఫీస్ నవీకరణ, అంధేరిలోనే కొత్త శాఖలో సౌండ్ స్టూడియో సెటప్ ఏర్పాటుకు వినియోగించనుంది. లక్నోలో నూతన బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలకు కావాల్సిన వీఎఫ్ఎక్స్ సేవలను ఈ సంస్థ అందిస్తుంటుంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.20 కోట్ల ఆదాయంపై, రూ.5.34 కోట్ల లాభాన్ని ప్రకటించింది.ఐపీవో షేర్లు.. వారంలోనే విక్రయం!లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్ల మొగ్గు ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది స్వల్పకాల దృష్టితోనే వస్తున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడైంది. ఐపీవోలో తమకు కేటాయించిన షేర్లలో 54 శాతం మేర (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయిస్తున్నారు. ఐపీవో ధరతో పోలి్చతే లాభాలతో లిస్టింగ్ అయ్యేవి ఎక్కువ ఉంటుండగా, కొన్ని నష్టాలతో లిస్ట్ కావడం లేదా లిస్ట్ అయిన వెంటనే నష్టాల్లోకి వెళ్లడం సాధారణంగా చూస్తుంటాం. అయితే, నష్టాలతో లిస్ట్ అయిన వాటి కంటే, లాభాలతో లిస్ట్ అయిన వాటిని విక్రయించే స్వభావం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఐపీవోలలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రిటైల్ కోటా సైతం పదులు, వందల సంఖ్యలో అధిక సబ్‌్రస్కిప్షన్లను అందుకుంటోంది. దీంతో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్ల ధోరణి తెలుసుకునేందుకు సెబీ లోతైన అధ్యయనం నిర్వహించింది. 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో 144 ఐపీవోలకు సంబంధించిన డేటాను విశ్లేíÙంచింది. యాంకర్ ఇన్వెస్టర్లు మినహా మిగిలిన ఇన్వెస్టర్లు 54 శాతం మేర షేర్లను (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయించారు. ఇందులో 50.2 శాతం షేర్లు వ్యక్తిగత ఇన్వెస్టర్లకు చెందినవి కాగా, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం 63.3 శాతం షేర్లను వారంలోనే విక్రయించారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 42.7 శాతం షేర్లను లిస్ట్ అయిన వారంలోపే విక్రయించి లాభాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీవోల్లో పాల్గొన్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు 70 శాతం మేర తమకు కేటాయించిన షేర్లను ఏడాదిలోపు విక్రయించినట్టు సెబీ అధ్యయనంలో తెలిసింది. -
బంగారం కొనటానికి ఇది మంచి సమయం!.. ఎందుకంటే?
సెప్టెంబర్ 1న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు (సోమవారం) స్వల్పంగా తగ్గాయి. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు రూ. 250 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 270 (24 క్యారెట్స్ 10 గ్రా) తగ్గింది. దీంతో ఈ ప్రాంతాల్లో తులం బంగారం ధర రూ. 66700 & రూ. 72770 వద్ద ఉన్నాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66700, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72770గా ఉంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ఈ రోజు వరుసగా రూ. 250, రూ. 270 తగ్గింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా 10 గ్రా 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ గోల్డ్ రేట్లు వరుసగా రూ. 250, రూ. 270 తగ్గింది. దీంతో పసిడి ధరలు రూ. 66850 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 72920 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం రేటు.. ఈ రోజు మాత్రం స్వల్పంగా మాత్రమే తగ్గింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో సిల్వర్ ప్రైస్ కొంత తగ్గింది. ఈ రోజు (సెప్టెంబర్ 2) కేజీ వెండి రేటు రూ. 1000 తగ్గి రూ. 86000 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులు
ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్రషార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే. సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించవచ్చు.నేను నా రిటైర్మెంట్ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – వినాయక్ రావు భోలేఎక్ఛ్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఏదో ఒక ఇండెక్స్‌కు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్ మాదిరే ఇవి స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో ట్రేడ్ అవుతుంటాయి. ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఈటీఎఫ్‌లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు. మ్యూచువల్ ఫండ్స్‌లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. అదే ఇండెక్స్ ఫండ్స్‌లో అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే ఇండెక్స్ ఫండ్స్ స్థానం బలమైనది.- ధీరేంద్ర కుమార్, సీఎఫ్ఓ, వ్యాల్యూ రిసెర్చ్ -
మిడ్‌క్యాప్‌లో మెరుగైన అవకాశాలు
దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలంలో మెరుగైన సంపద సృష్టించాలని కోరుకునే వారు నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో పెట్టుబడికి తక్కువ పథకాలే అందుబాటులో ఉన్నాయి. అందులో మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ఒకటి. ఇన్వెస్టర్లు తమ వెసులుబాటుకు అనుగుణంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) లేదా లంప్సమ్ రూపంలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.రాబడులు మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ 2019 సెప్టెంబర్‌లో మొదలైంది. గడిచిన ఏడాది కాలంలో అసాధారణ స్థాయిలో 50 శాతం రాబడినిచ్చింది. మరీ ముఖ్యంగా మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ ఈ పథకం లాభాల్లో ప్రతిఫలిస్తోంది. మూడేళ్లలో ఏటా 27.55 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఆరంభం నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 32 శాతంగా ఉంది. నిఫ్టీ 100తో పోల్చి చూస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ పరిమిత రిస్క్‌తోనే రోలింగ్ రాబడులు అధికంగా ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే ఇండెక్స్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో ఫండ్స్ సంస్థలు వసూలు చేసే చార్జీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులు మెరుగవుతాయి.దీర్ఘకాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. కానీ, అదే సమయంలో అధిక రిస్క్ కూడా ఉంటుంది. కరెక్షన్లలో ఎక్కువ విలువను కోల్పోవడం ఈ విభాగంలో గమనించొచ్చు. అందుకని రిస్క్ భరించే సామర్థ్యంతో ఉన్న వారు, కనీసం 7–10 ఏళ్ల కాలానికి ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. అయితే, ఈ పథకం కేవలం మిడ్‌క్యాప్ ఒక్కటే కాకుండా, లార్జ్క్యాప్కూ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుందని గమనించొచ్చు.పెట్టుబడులకు విధానంప్రతీ ఇన్వెస్టర్ ఈక్విటీ పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలకూ చోటు కల్పించుకోవాలి. తద్వారా రిస్క్ సర్దుబాటుతో అధిక రాబడులు సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. టాప్–100 కంపెనీల తదుపరి 150 కంపెనీల్లో ఈ పథకం ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంది. తమ పనితీరుతో చిన్న కంపెనీల నుంచి మధ్యస్థ స్థాయికి ఎదిగిన ఇవి.. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్ కంపెనీలుగానూ అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్వెస్టర్ల రాబడులను ఇతోధికం చేస్తుంది.మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250 వరకు వరుసలో ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్ విభాగం కిందకు వస్తాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు.. నిఫ్టీ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌కు మధ్య వ్యత్యాసాన్ని గమనించినట్టయితే.. నిఫ్టీ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఒకే రంగానికి, ఒకే స్టాక్‌కు ఎక్కువ కేటాయింపులు చేయవు. దీంతో రిస్క్‌ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది.పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.1878 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.86 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇందులో 41 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ అయినప్పటికీ లార్జ్‌క్యాప్‌కు ఈ స్థాయి కేటాయింపులతో రిస్క్‌ను తగ్గించే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.మిడ్ క్యాప్ కంపెనీలకు 59 శాతం కేటాయింపులు చేసింది. రిస్క్ దృష్ట్యా స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. పోర్ట్‌ఫోలియోలో 150 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 21 శాతం పెట్టుబడులను ఇండస్ట్రియల్స్ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 17 శాతం మేర ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో, కన్జ్యూమర్ డిస్క్రీషినరీలో 14.39 శాతం, మెటీరియల్స్‌లో 13 శాతం, హెల్త్‌కేర్‌లో 10.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
లాభాలు కొనసాగే వీలు
దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనా వార్తలు ఈక్విటీ మార్కెట్లను ముందుకు నడిపించవచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.‘‘అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉంది’’ అని మెహ్తా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.యూఎస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడంతో పాలసీ సర్దుబాట్లకు సమయం ఆసన్నమైందంటూ ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో గతవారం సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సైతం సెంటిమెంట్‌ను బలపరిచాయి. ముఖ్యంగా విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 1,280 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాల వెల్లడి కారణంగా ఆటో రంగ షేర్లలో కదలికలు గమనించవచ్చు. ఇవాళ(సోమవారం) భారత్ పాటు చైనా, యూరోజోన్లు ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల చేయనున్నాయి. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటాను మంగళవారం ప్రకటించనుంది.దేశీయ సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం(సెప్టెంబర్ 4న) విడుదల అవుతాయి. ఆగస్టు 31తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(సెప్టెంబర్ 6న) విడుదల చేస్తుంది. ఇదే వారాంతాపు రోజున యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ అంచనా డేటా, అమెరికా నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. ఆగస్టులో రూ.7,320 కోట్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో రూ.7,320 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అధిక వాల్యుయేషన్ ఆందోళనలతో పాటు జపాన్ వడ్డీరేట్ల పెంపుతో యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆగస్టులో అమెరికా ఆర్థిక మాంద్య భయాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కూడా విదేశీ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అయితే జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం విశేషం. ఇదే నెలలో డెట్ మార్కెట్లో రూ.17,960 కోట్ల పెట్టుడులు పెట్టారు.‘‘ఎఫ్ఐలు సెప్టెంబర్‌లో కొనుగోళ్లు చేపట్టే వీలుంది. దేశీయ రాజకీయ స్థిరత్వం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు, మార్కెట్ వాల్యుయేషన్లు, రంగాల ప్రాధాన్యత, డెట్ మార్కెట్ ఆకర్షణ అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
పసిడి మళ్లీ పడిందా.. లేచిందా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (సెప్టెంబర్ 1) స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు నిలకడగా కొనసాగుతున్నాయి. కాస్తయినా తగ్గుతుందని ఆశించిన నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.73,040 వద్ద కొనసాగుతన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,100, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.73,190 లుగా ఉన్నాయి.ఇక వెండి విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఆదివారం ఎలాంటి కదలిక కనిపించలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మళ్లీ తగ్గిన బంగారం.. దిగొచ్చిన వెండి!
బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. దేశవ్యాప్తంగా పసిడి రేట్లు నేడు (ఆగస్టు 31) స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజున కూడా బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. పుత్తడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.66,950 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 క్షీణించి రూ. 73,040 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి.ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,100, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 110 తరిగి రూ.73,190 లుగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ శనివారం భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1000 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,000 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నిఫ్టీ ‘వరుస లాభాల’ రికార్డు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. 1996లో ఎన్ఎస్ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది. సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి. -
కాసింతైనా కరిగిన బంగారం!
ఏదైనా విలువైన వస్తువు కొనాలంటే భారతీయులకు మొదటి ఎంపిక బంగారమే. పసిడి కొనుగోలు చాలా మందికి సెంటిమెంట్ కూడా. అలాంటి బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని కొనుగోలుదారులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. దేశంలో క్రితం రోజున నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు (ఆగస్టు 30) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.67,050 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 క్షీణించి రూ. 73,150 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి.ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,200, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 తరిగి రూ.73,300 లుగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ శుక్రవారం తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.500 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.93,000 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త శిఖరాలకు
ముంబై: ఫైనాన్స్, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో దేశీ సూచీలు గురువారం ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి అధిక వెయిటేజీ షేర్లూ రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్లు ఎగసి 82,283 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది. చివరికి 349 పాయింట్ల లాభంతో 82,135 రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది ఎనిమిదో రోజు లాభాల ముగింపు. వరుసగా 11వ రోజూ లాభాలు కొనసాగించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,152 వద్ద స్థిరపడింది. ఒక దశలో 141 పాయింట్లు బలపడి 25,193 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.51% పెరిగి రూ.3,041 వద్ద స్థిరపడింది. ఏజీఎంలో ముకేశ్ అంబానీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించడంతో ఇంట్రాడేలో 2.63 శాతం ర్యాలీ చేసి రూ.3,075 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,390 కోట్లు పెరిగి రూ.20.57 లక్షల కోట్లకు చేరింది. తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో ‘డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్’కు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించడంతో పేటీఎం షేరు 3% పెరిగి రూ.554 వద్ద ముగిసింది. -
బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఇవే..
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన తగ్గి పసిడి రేట్లు నేడు (ఆగస్టు 29) స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.67,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,250 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు స్థిరంగా ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు నిడకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,300, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,400 లుగా ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.93,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
యూఏఈ నుంచి 160 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ నుంచి భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం–యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి అధికారి తెలిపారు.రెండు దేశాల మధ్య 2022 మే 1వ తేదీ నుంచి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పదం ప్రకారం, టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) కింద ఒక శాతం టారిఫ్ రాయితీతో యూఏఈ నుండి ఏటా 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించింది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫైకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాజాగా 160 టన్నుల దిగుమతులకు ఆమోదముద్ర వేసింది.భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16 శాతం కాగా, దక్షిణాఫ్రికా వాటా 10 శాతంగా ఉంది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది. 2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.జీఎస్టీ లేకపోవడం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండడంతో భారత్‌లో కంటే దుబాయ్‌లో బంగారం ధరలు చౌకగా ఉంటాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం అందిస్తున్న ఈ వెసులుబాటుతో రెండు దేశాల మధ్య పసిడి వాణిజ్యం మరింత బలపడటమే కాకుండా భారతీయ జువెలరీ పరిశ్రమకూ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. -
ప్యాసివ్ ఫండ్స్ బూమ్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్) పథకాల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. పనిలో పనిగా ఈ డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) కొత్త పథకాలతో (ఎన్ఎఫ్వో) మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ పథకాలు రాబడుల విషయంలో సూచీలతో వెనుకబడుతున్న తరుణంలో ప్యాసివ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం.. గడిచిన ఏడు నెలల్లో (జనవరి–జూలై) 63 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రావడమే. గతేడాది మొత్తం మీద 51 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోల రికార్డును ఈ ఏడాది ఇప్పటికే అధిగమించడం గమనార్హం. ముఖ్యంగా ఈ నెలలో మార్కెట్లోకి 12 ఎన్‌ఎఫ్‌వోలు రాగా, అందులో సగం మేర ప్యాసివ్ ఫండ్స్ నుంచే ఉన్నాయి. జూలై చివరి నాటికి అత్యధికంగా టాటా మ్యూచువల్ ఫండ్ 10 ప్యాసివ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలను చేపట్టింది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 5, మిరే అస్సెట్ మేనేజ్మెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చెరో నాలుగు చొప్పున ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకొచ్చాయి. ప్యాసివ్ ఫండ్స్ పరిధిలోని ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 22 శాతం పెరిగి జూలై చివరికి 3.22 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో యాక్టివ్ ఫండ్స్ విభాగంలో ఫోలియోలు 19 శాతం పెరిగి 13.84 కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 24 శాతం వృద్ధితో రూ.10.95 లక్షల కోట్లకు చేరాయి. నెలవారీ ఈ పథకాల్లోకి వచ్చే పెట్టుబడులు ఈ ఏడాది జనవరిలో రూ.3,983 కోట్లుగా ఉండగా.. జూలైలో రూ.14,778 కోట్లకు వృద్ధి చెందడం, వీటి పట్ల ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.ప్రత్యామ్నాయాలపై దృష్టికొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు మ్యూచువల్ ఫండ్స్ వినూత్న మార్గాలపై దృష్టి సారించాయి. సంప్రదాయ పథకాల పరంగా ఇప్పటికే తగినంత మార్కెట్ ఏర్పడడంతో.. కొత్త పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఇన్వెస్టర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. యాక్టివ్ పథకాలు ఇప్పటికే తగినంతగా మార్కెట్లో ఉండడంతో, ప్రముఖ ఏఎంసీలు ప్యాసివ్, థీమ్యాటిక్ ఎన్‌ఎఫ్‌వోల బాట పట్టినట్టు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ కౌస్తభ్ బేల్‌పుర్కార్ తెలిపారు. ప్యాసివ్, యాక్టివ్ ఫండ్స్ మధ్య అంతరాన్ని భర్తీ చేసే విధంగా స్మార్ట్ బీటా తదితర వినూత్నమైన విధానాలను కొత్త ప్యాసివ్ ఫండ్స్ విషయంలో ఏఎంసీలు అమలు చేస్తున్నాయి. స్మార్ట్ బీటా అంటే.. ఆయా ప్యాసివ్ ఫండ్ ఒక సూచీని అనుసరించి పెట్టుబడులు పెట్టినప్పటికీ.. రాబడుల్లో మార్కెట్‌ను అధిగమించేలా ఉంటుంది. ఈ తరహా ప్యాసివ్ ఫండ్ వ్యూహాల్లో ‘ఈక్వల్ వెయిట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండెక్స్’ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. నిఫ్టీ సూచీలో టాప్–10లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, తక్కువ రిస్క్‌తో కూడిన రాబడులు ఆఫర్ చేసే విధానానికీ ప్రాచుర్యం పెరుగుతోంది. మొత్తానికి ప్యాసివ్ ఫండ్స్ రూపంలో మెరుగైన రాబడులు ఆఫర్ చేయడం ద్వారా ఇన్వెస్టర్ల ఆదరణ సొంతం చేసుకునే దిశగా ఏఎంసీలు ప్రయతి్నస్తుండడం గమనార్హం. -
బంగారం ధరల్లో కదలిక
దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులను నిరాశపరిచాయి. మూడు రోజుల అనంతరం మళ్లీ ఎగిశాయి. క్రితం రోజున స్వల్పంగా తగ్గినట్టే తగ్గి నేడు (ఆగస్టు 28) మోస్తరుగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పసిడి ధరలు ఎంత మేర పెరిగాయో ఇక్కడ తెలుసుకుందాం..విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.210 పెరిగి రూ.67,150 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.220 ఎగిసి రూ. 73,250 వద్దకు పెరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.67,300 వద్దకు హెచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.73,340 వద్దకు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.93,500 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈ ఆఫర్ ఓ తుఫాన్!
దేశీ ప్రైమరీ మార్కెట్లలో తాజాగా ఒక విచిత్రమైన రికార్డ్ నమోదైంది. కేవలం రూ.12 కోట్ల సమీకరణకు ఒక చిన్నతరహా సంస్థ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అయితే కనీవినీ ఎరుగని రీతిలో రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన రీసోర్స్ఫుట్ ఆటోమొబైల్ కంపెనీ యమహా ద్విచక్ర వాహన డీలర్‌గా వ్యవహరిస్తోంది. అదికూడా రెండు ఔట్లెట్లను మాత్రమే కలిగి ఉంది. 2018లో ఏర్పాటైన సంస్థ 8 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2023 డిసెంబర్ 28న సెబీకి దాఖలు చేసిన ఐపీవో ప్రాస్పెక్టస్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు సాధిస్తున్న రికార్డుల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న, మధ్యతరహా కంపెనీల(ఎస్ఎంఈలు) ఐపీవోలకూ ఇటీవల భారీ డిమాండ్ నెలకొంటోంది. వెరసి తాజాగా ఐపీవోకు వచ్చిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఏకంగా 419 రెట్లు అధికంగా సబ్‌స్రైబ్ అయింది. సాహ్నీ ఆటోమొబైల్ బ్రాండుతో యమహా డీలర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు, సర్వీసింగ్ చేపడుతోంది. ఇన్వెస్టర్ల నుంచి హెవీ రష్ఈ నెల 22న ప్రారంభమై 26న ముగిసిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీవోలో భాగంగా 9.76 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 40.76 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. రూ.12 కోట్ల సమీకరణకు తెరతీస్తే ఏకంగా రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కేటగిరీలో 316 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 496 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూకి తొలి రోజు 10.4 రెట్లు, రెండో రోజు 74 రెట్లు అధికంగా స్పందన లభించింది. చివరి రోజుకల్లా బిడ్డింగ్ తుఫాన్ సృష్టించింది. షేరుకి రూ.117 ధరలో మొత్తం 10.25 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సాహ్నీ ఆటోమొబైల్ లిస్ట్‌కానుంది.ఇదీ చదవండి: భారత్‌లో ఎప్పటికీ చిన్నకార్లదే హవాఎస్ఎంఈలకు కనిపిస్తున్న అనూహ్య డిమాండ్ అసంబద్ధమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన పెట్టుబడుల వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. లిస్టింగ్ లాభాల కోసం ఇన్వెస్టర్లు నాణ్యతా సంబంధ విషయాలను సైతం విస్మరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అధిక సబ్స్క్రిప్షన్వల్ల తాత్కాలికంగా లాభాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కొంత నిరాశ కలిగించవచ్చన్నారు. అయితే కంపెనీ బిజినెస్‌పై పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టే వారు తక్కువవుతున్నారని ఆందోళన వ్యక్తి చేశారు. నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ వేలంవెర్రి కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్లాట్ ఫామ్ ద్వారా లిస్టయ్యే కంపెనీల ఖాతాలను మరింత అప్రమత్తంగా ఆడిటింగ్ చేయమంటూ గత వారం సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అశ్వనీ భాటియా చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏలు)కు సూచించడం గమనార్హం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.81 పాయింట్ల లాభంతో 81,711.30 వద్ద, నిఫ్టీ 7.20 పాయింట్ల లాభంతో 25017.80 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్ & టూబ్రో మొదలైన కంపెనీలు చేరాయి. జేఎస్‌డబ్ల్యు స్టీల్, టైటాన్ కంపెనీ, హిందూస్తాన్ యూనీలివర్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధర తగ్గినట్లేనా? నిరాశపడుతున్న పసిడి ప్రియులు
వారం రోజులుగా పడుతూ లేస్తూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు (మంగళవారం) తగ్గిందా? అనుమానం రేకెత్తించింది. ఎందుకంటే తులం ధర కేవలం రూ. 10 మాత్రమే తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడా వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు రూ. 67,090 వద్ద. . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 73,180 వద్ద ఉంది. నిన్నటి ధరలు పోలిస్తే ఈ రోజు ధరలు కేవలం రూ.10 మాత్రమే తగ్గింది.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66940, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 73030గా ఉంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం రెండు రోజుల తరువాత కేవలం రూ.10 తగ్గింది.దేశ రాజధానిలో కూడా 10 గ్రా 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.10 తగ్గింది. దీంతో పసిడి ధరలు రూ. 67090 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 73180 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం రేటు.. ఈ రోజు మాత్రం స్వల్పంగా మాత్రమే తగ్గింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. వెండి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తోంది. దీంతో సిల్వర్ రేటు మళ్ళీ గరిష్టాలకు చేరింది. ఈ రోజు (ఆగష్టు 27) కేజీ వెండి రేటు రూ. 600 పెరిగి రూ. 93500 వద్ద నిలిచింది. అయితే వెండి ధర ఢిల్లీలో మాత్రం రూ. 88500 వద్ద ఉంది. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం అక్కడే.. వెండి దిగుడే..!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఎగిసిన పసిడి ధరలు నేడు (ఆగస్టు 26) నిలకడగా ఉన్నాయి. దేశంలో బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లతో సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,040 వద్ద స్థిరంగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగున్నాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు ఎలాంటి మార్పూ లేకుండా నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో సోమవారం స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.92,900 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)