Crime
-
లోకేష్ జన్మదిన వేడుకల్లో రచ్చ.. జనసేన కార్యకర్తపై దాడి
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే భాగస్వాములైన జనసేన(Janasena), బీజేపీ నాయకులకు పలుచోట్ల అవమానాలు తప్పలేదు. ఇప్పటికే పలుచోట్ల పచ్చ నేతలు రెచ్చిపోయి కూటమి నేతలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తను టీడీపీ(TDP) కార్యకర్తలు చితకబాదారు. ఈ క్రమంలో అతడిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో గురువారం రాత్రి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) జన్మదిన వేడుకల్లో బ్యానర్లు కట్టినందుకు, కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన కార్యకర్తను టీడీపీ నాయకులు చితకబాదారు. కందూరులో జనసేన కార్యకర్త మునీర్ బాషా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బ్యానర్లు వేసి జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకులు మునీర్ బాషాను ‘నువ్వెవడురా రావడానికి’ అంటూ చితకబాదారు.ఈ ఘటనను చూసిన ఆయన తల్లి బిడ్డపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెపై కూడా దాడి చేయడంతో పిడికిలి దెబ్బలకు ఆమె పళ్లు రాలిపోయాయి. దీంతో, వెంటనే స్థానికులు పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చిన్నారాయల్కు సమాచారం అందించారు. ఆయన తన అనుచరులతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. గాయపడిన మునీర్ బాషాను, ఆయన తల్లిని, జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జనసేన నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.గాయపడిన జనసేన కార్యకర్త మునీర్ తాజాగా మాట్లాడుతూ..‘గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కందూరులో బ్యానర్లు కట్టొద్దని బెదిరించారు. నేను వాటిని లెక్క చేయలేదు, అప్పుడు నాపై దాడి చేసి గాయపరిచారు, పవన్ కళ్యాణ్ బ్యానర్లు చింపారు. నిన్న రాత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా నాపై దాడి చేశారు, నా తల్లిని గాయ పరిచారు. నన్ను చంపే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు?. నన్ను ఊరు విడిచి వెళ్ళాలి అని బెదిరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ జనసేన పార్టీ నాయకుల్ని, నన్ను ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ వాళ్ళ కంటే వైఎస్సార్సీపీ నాయకులే బెస్ట్ అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం
లక్నో : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బాధితులు ప్రయాణిస్తున్న వ్యాన్‌పై టయోటా ఇన్నోవో దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.గురువారం అర్ధరాత్రి ఉత్తర ప్రదేశ్ లక్నోలోని దేవా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు కిరణ్, ఆమె కుమారుడు కుందన్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు బంటీ యాదద్,శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను టయోటా మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న భారీ ట్రక్‌ను వ్యాన్ డీకొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలొదిలారు.రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయని, నలుగురు మరణించినట్లు పోలీస్ అధికారి పంకజ్ సింగ్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాల్ని ఈస్ట్ డీసీపీ శశాంక్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఓ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. ఆ వ్యాన్‌లో మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులు ప్రమాణిస్తున్నారు. అయితే ఆ వ్యాన్‌పైకి వెనుక నుంచి టయోటా ఇన్నోవా దూసుకొచ్చింది. ప్రమాదం తీవ్రతకు ఎదురుగా ఉన్న ట్రక్‌ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు’ అని తెలిపారు. సీఎం యోగి సంతాపంఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం యోగి ఆదేశాలకు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
అన్నే హంతకుడు
సేలం: మేట్టుపాళయలో 2019వ సంవత్సరం పరువు హత్య కేసులో ప్రేమికుడి అన్నే హంతకుడని కోవై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. మరణశిక్ష వేసే స్థాయికి నేరం జరిగినట్టు తెలిపిన న్యాయమూర్తి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని విడుదల చేసింది. వివరాలు.. కోవై జిల్లా మేట్టుపాళయం సమీపంలోని వెల్లై పాళయం. అక్కడ ఉన్న సిరంగరాయన్ ఓడై ప్రాంతానికి చెందిన కరుప్పుసామి. ఈయన కుమారులు వినోద్ (27), కనకరాజ్ (23). వీరిద్దరు కూలీ కార్మికుడు. వీరిలో కనకరాజ్ అదే ప్రాంతానికి చెందిన వర్షిణి ప్రియా (17)ను ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన అన్న వినోద్ దళిత యువతితో ప్రేమ వదులుకోమని తమ్ముడు కనకరాజ్‌ను హెచ్చరించాడు. అయినప్పటికీ ప్రేమికులు ఇద్దరు 2019, జూలై 25వ తేది కలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వినోద్ ఆవేశంతో వారిద్దరిని నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడు కనకరాజ్ రక్తపు మడుగులో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కోవై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన వర్షిణి ప్రియ అదే నెల 29వ తేది మృతి చెందింది. జంటను హత్య చేసిన వినోద్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో వినోద్ సహచరులు కందవేల్, అయ్యప్పన్, చిన్నరాజ్ అనే ముగ్గురిని మేట్టుపాళయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోవై ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే న్యాయస్థానంలో జరుగుతూ వచ్చింది. ఈ కేసు తుది విచారణ గురువారం జరిగింది. మొదటి ముద్దాయి వినోద్‌పై నేరం నిరూపించబడిన కారణంగా అతడిని నేరస్తుడిగా న్యాయమూర్తి వివేకానంద తీర్పు ఇచ్చారు. అదే విధంగా మరణ శిక్ష విధించి స్థాయికి నేర జరిగిందని తెలిపిన న్యాయమూర్తి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని విడుదల చేశారు. వినోద్‌కు విధించిన శిక్ష గురించిన వివరాలను ఈ నెల 29వ తేది (బుధవారం) వెల్లడించబడుతుందని న్యాయమూర్తి తెలిపారు. -
అడవిలో దంపతులు మృతి
కొరాపుట్: అడవిలో దంపతులు మృతి చెందిన ఘటన కొరాపుట్ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి నందపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిపుట్ గ్రామానికి చెందిన బలరాం గలాయి (22), బల గలాయి (21) మృతి చెందారు. వీరిద్దరూ టీ దుకాణం నడుపుతుంటారు. కట్టెలు తేవడానికి అడవిలోనికి వెళ్లగా అక్కడ అడవి పందులను వేటాడడానికి పెట్టిన విద్యుత్‌తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. అడవికి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు అడవిలో గాలించగా మృతదేహాలు దొరికాయి. నందపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు. -
Meerpet Case: గురుమూర్తి ఫోన్లో ఏముంది?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట(Meerpet Case) వెంకటమాధవి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురుమూర్తి(Gurumurthy) కాల్ డేటా Call Data) మొత్తాన్ని చెక్ చేసిన పోలీసులు.. అతనికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఆధారాలు దొరకకుండా భార్యను హత్య చేయడం వెనుక మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మాధవి మృతదేహం బూడిద ఆధారాల కోసం పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు: డీసీపీఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో విచారణ కొనసాగుతుందని.. ఇప్పటివరకు మిస్సింగ్ కేసు గానే మేము విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. సీసీ కెమెరాలు రికార్డయిన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. వెంకట మాధవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కూతురిని గురుమూర్తే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు.బాడీని ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఇంకా ఆధారాలు దొరకలేదు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు దృశ్యాలు లేవు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు వాళ్ల కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపుఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ సీఐ నాగరాజు తెలిపారు.భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు.మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. -
హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి వ్యవహారం జరుగుతోంది. బెంగళూరుకి చెందిన డాక్టర్‌దే కీలకపాత్రగా పోలీసులు తేల్చారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులుగా పోలీసులు నిర్థారించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.55 లక్షలు డాక్టర్ తీసుకున్నాడు. చెన్నై నుంచి ఇద్దరు మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన వైద్యుడు.. బెంగళూరుకి చెందిన లాయర్, నర్స్‌కి కిడ్నీ మార్పిడి చేశాడు. కిడ్నీ మార్పిడికి డాక్టర్‌కి లాయర్ రూ.55 లక్షలు ఇవ్వగా, నర్స్ రూ.45 లక్షలు ఇచ్చింది. చెన్నైకి చెందిన భాను, ఫిరోజ్జ భానులను కిడ్నీ డోనర్స్‌గా పోలీసులు గుర్తించారు. కిడ్నీ డోనర్లకు రూ.5 లక్షలు చొప్పున నగదు చెల్లించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.సాధారణ వైద్య చికిత్సలకు (జనరల్) మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తూ రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రి నిర్వాకాన్ని వైద్యాధికారులు, పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి డాక్టర్స్ కాలనీలోని అలకనంద ఆస్పత్రిలో అనుమతుల్లేకుండా కిడ్నీల మారి్పడి దందా సాగిస్తున్నన్నట్లు సమాచారం అందింది. దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి ఆస్పత్రిపై దాడి చేశారు.ఇదీ చదవండి: భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించి..జనరల్, ప్లాస్టిక్ సర్జరీల నిమిత్తం ఆస్పత్రి నిర్వహణకు 6 నెలల అనుమతి తీసుకున్న సుమంత్ అనే వ్యక్తి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయక యువతులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలు దానం చేసేందుకు ఒప్పిస్తున్నాడు. హైదరాబాద్‌లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు.. పోలీసులతో కలిసి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఇద్దరు కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులను కనుగొన్నారు.అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకొని వైద్యులు పరారయ్యారు. దీంతో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను అధికారులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలకనంద ఆస్పత్రిని సీజ్ చేశారు. -
పిల్లలూ.. స్కూల్లో బాంబులు పెట్టారంట పారిపోండి
ఢిల్లీ : ముంబైలో (mumbai) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముంబైకి చెందిన పలు స్కూళ్లలో బాంబులు (bomb threat) పెట్టామంటూ అగంతకులు బెదిరింపులు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్వ్కాడ్స్ స్కూల్స్‌లో తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని బాంబు స్వ్కాడ్ నిర్ధారించాయి.గురువారం ముంబైలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతానికి చెందిన ది ర్యాన్ గ్లోబల్ స్కూల్లో 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి పాల్పడ్డ అప్జల్ గురు అనుచరులు బాంబు పెట్టినట్లు అగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్‌లో పేర్కొన్నారు.మరోవైపు, బుధవారంతమిళనాడులో ఏరోడ్ జిల్లాలో సుమారు ఏడు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులొచ్చాయి. ఏరోడ్ జిల్లాకు చెందిన భారతి విద్యాభవన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్స్‌లో బాంబులు పెట్టామంటూ దుండగులు ఈ-మెయిల్స్ పంపారు.దీంతో అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థుల్ని అలెర్ట్ చేసింది. వెంటనే స్కూల్ వదిలి పారిపోవాలంటూ సూచించారు. అనంతరం, స్కూల్ తనిఖీలు నిర్వహించింది. పోలీసులకు సమాచారం అందించింది.యాజమాన్యం ఫిర్యాదుతో స్కూల్స్‌కు పోలీసులు,బాంబు స్వ్కాడ్, స్నైపర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. స్కూల్స్‌లో అణువణువూ తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో బాంబులు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
రోడ్డు ప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(Bus Accident) బుధవారం అర్థరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు– కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది(Road Accident). రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేవరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గుర్ని కాకినాడ ఆస్పత్రికి, ఇద్దర్ని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో 13 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించి..
సాక్షి, హైదరాబాద్/మీర్‌పేట: ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను పాశవికంగా హత్య చేశాడు. అయినా కసి తీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పెద్ద కుక్కర్ తీసుకొచ్చి శరీర భాగాలను ఉడకబెట్టాడు. తర్వాత ఎండబెట్టి, కాల్చాడు. ఇంట్లోనే రెండు, మూడు రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో కలిపేశాడు. మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ (చందన) చెరువులో పారేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య చేసి.. ఇంట్లోంచి వెళ్లిపోయిందని... స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అదుపులోకి తీసుకుని విచారించడంతో.. ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతోపాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ సీఐ నాగరాజు తెలిపారు. యూట్యూబ్‌లో చూసి.. ముందుగా కుక్కపై ప్రయోగం చేసి.. భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు. ఆధారాల కోసం పోలీసుల ప్రయత్నాలు.. మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. దీనితో ఆయా అంశాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారి పిల్లలు మేడ్చల్‌లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. -
తవ్వకాల్లో బంగారం దొరికిందని..
సోమందేపల్లి: తక్కువ ధరకే మేలిమి బంగారాన్ని అందజేస్తామని నమ్మబలికి నకిలీ పసిడిని అంటగట్టి డబ్బుతో ఉడాయించిన కేసులో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాణా కృష్ణబాబు, కర్ణాటకకు చెందిన శాంతరాజు, నయాజ్ అహమ్మద్, ఈరన్న, బాబు, అర్జున్, ఆనంద్‌బాబు, బంగారి, ఈడిగ హరిప్రసాద్ ఓ ముఠాగా ఏర్పడి నకిలీ బంగారం దందా చేపట్టారు. ఈ క్రమంలోనే నకిలీ బంగారపు పూసల దండలు సేకరించుకుని, అందులో కొన్ని అసలు బంగారం పూసలను చేర్చారు. కొనుగోలుదారులు పరీక్షించుకునే సమయంలో మేలిమి బంగారం పూసలను మాత్రమే చూపించేవారు.ఉత్తుత్తి పూసల దండి ఇచ్చి..ఇటీవల అనంతపురం జిల్లా విడపనకల్లుకు చెందిన ఈశ్వరన్నకు, చిత్తూరు జిల్లా కుప్పం నివాసి ముని వెంకటేష్‌కు ముఠా సభ్యులు ఫోన్ చేసి మాట్లాడారు. తమకు తవ్వకాల్లో బంగారం లభ్యమైందని, తక్కువ ధరకే అమ్ముతామని నమ్మబలికారు. ఇద్దరినీ ఈ నెల 9న సోమందేపల్లి బ్రాహ్మణపల్లి వద్దకు రప్పించుకున్నారు. తొలుత ఈశ్వరన్న నుంచి రూ.8 లక్షలు తీసుకున్నారు. తరువాత ముని వెంకటేష్ వద్ద రూ.13 లక్షలు తీసుకుని ఇద్దరికీ నకిలీ బంగారం పూసల దండలు చేతిలో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు. కాసేపటి తర్వాత వాటిని పరిశీలించుకున్న ఈశ్వరన్న, ముని వెంకటేష్... నకిలీవని నిర్ధారించుకుని వెంటనే సీఐ రాఘవన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి బుధవారం పక్కా ఆధారాలతో మొత్తం పది మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.21 లక్షలతో పాటు ఐదు సెల్ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు.బనశంకరి: బాగల్‌కోటే జిల్లా పంచాయతీ సభాంగణంలో బుధవారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కేడీపీ సమావేశంలో వ్యవసాయశాఖలో వివిధ పనుల గురించి మంత్రి ఆర్బీ.తిమ్మాపుర , జాయింట్ డైరెక్టర్ లక్ష్మ కెళ్లణ్ణవర్ను సమాచారం అడిగారు. దీనికి జేడీ నీళ్లు నమిలారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తిమ్మాపుర.. సరైన సమాచారం లేకుండా ఎందుకు సమావేశానికి వచ్చారు, బయటికి పొండి అని గదమాయించారు. అలా అధికారి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో మిగతా అధికారులు కలవరానికి గురయ్యారు.పొలంలో నకిలీ నోట్ల ముద్రణమైసూరు: నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ఆరోపణలపై తండ్రీకొడుకులను జిల్లాలోని టీ.నరసీపుర స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. టీ.నరసీపుర తాలూకా హిరియూరు గ్రామానికి చెందిన ప్రసాద్ (53), నాగేష్ (27) నిందితులు. వీరి నుంచి సుమారు రూ.25 వేల విలువ చేసే నకిలీ నోట్లు, ఒక ప్రింటర్‌ను పోలీసులు స్వాధీనపరచుకున్నారు. తండ్రీకొడుకులిదద్దరూ తమ పొలంలోని షెడ్లో నకిలీ నోట్లను ముద్రణను ప్రారంభించారు. వారు ఇస్పేట్ జూదం ఆడేవారు, ఆ సమయంలో ఎక్కువగా నకిలీ నోట్లను మార్పిడి చేసినట్లు తెలిసింది. టీ.నరసీపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్లను ముద్రణ మెళకువలు తెలుసుకున్నట్లు నిందితులు చెప్పారు. -
మీర్పేట్లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి..
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేటలో దారుణం జరిగింది. డీఆర్డీవో కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి.. అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశారు. భార్య వెంకట మాధవిని చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త.. ఉండకబెట్టిన మాంసాన్ని చెరువులో పడేశారు.ఈ నెల 13వ తేదీ నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త.. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు దొరకలేదు.గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు.దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి! -
విద్యార్థిని ఆత్మహత్య
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్‌లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై మంగళవారం ఉదయం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. పెద్దకోడూరుకు చెందిన భార్గవిగా గుర్తించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు హుటాహుటినా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. -
కర్ణాటకలో ట్రక్కు బోల్తా. 10 మంది దుర్మరణం
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు గంటల వ్యవధిలో మరోసారి నెత్తురోడింది. ఉత్తర కన్నడ(Uttara Kannada) జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూరగాయలు, పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.మరణించిన వారంతా కూరగాయల వ్యాపారులుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ట్రక్కులో కూరగాయల లోడుతో వ్యాపారులు సావనూర్ నుంచి కుంత మార్కెట్‌కు వెళ్తున్నారు. గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా హైవే వద్దకు చేరుకోగానే డ్రైవర్ ఓ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పడంతో మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో దాదాపు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. #WATCH | #Karnataka: 10 died and 15 injured after a truck carrying them met with an accident early morning today. All of them were travelling to Kumta market from Savanur to sell vegetables: SP Narayana M, Karwar, Uttara Kannada (Visuals from the spot)ANI pic.twitter.com/9vgO1nOKOu— OTV (@otvnews) January 22, 2025పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయచూరు, సింధనూరులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 14 మంది మృతి చెందారనే వార్త బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు.. మంగళవారం అర్ధరాత్రి.. కర్ణాటకలోని హంపి(Hampi) క్షేత్రంలో జరిగే నరహరి తీర్ధుల ఆరాధనకు 14 మంది వేద పాఠశాల విద్యార్ధులతో వెళుతున్న వాహనం సింధనూరు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్ధులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు విద్యార్ధులు గాయపడగా, వారిని సింథనూరు ఆసుపత్రికి తరలించారు. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
పెళ్లయిన రోజే ప్రాణాలు తీసుకుంది
సత్యవేడు: పెళ్లయిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకంలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ధనంజయ, రతి దంపతుల కుమార్తె ఆర్తీ(20) అక్కడే ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. సత్యవేడు మండలం ఆంబాకానికి చెందిన సమీప బంధువు సూర్య వారితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్యకు, ఆర్తీకి వివాహం జరిపించారు. ఆ తర్వాత తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సత్యవేడు మండలంలోని ఆంబాకానికి వచ్చారు. రాత్రి దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లిన ఆర్తీ ఎంతకీ రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే సత్యవేడు వైద్యశాలకు ఆమెను తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ రామస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అఫ్జల్‌గంజ్’ కేసులో పురోగతి
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్నాయి. ‘కాల్పుల’ వాహనం దొరికిందిసాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్‌లోనే షెల్డర్ తీసుకుని, బీదర్‌లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్‌లో నేరం చేసిన తర్వాత రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
జీవితంపై విరక్తి చెంది యువకుడు..
తూప్రాన్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి కథనం మేరకు.. మాసాయిపేట మండలం కోప్పులపల్లి గ్రామానికి చెందిన గౌరారం సాయికుమార్(22) చిన్నతనంలో తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి చిన్నాన్న వద్ద పెరిగాడు. తూప్రాన్ పట్టణంలోని ఓ మెడికల్ ఏజెన్సీలో పని చేస్తూ ఎల్లమ్మ దేవాలయం కాలనీలో అద్దె గదిలో మరో స్నేహితుడితో ఉంటున్నాడు. మంగళవారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం గుర్తించిన స్నేహితుడు మృతుడి చిన్నాన్నతోపాటు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సాయికుమార్ తాను ఒంటరి వాడినని మనస్తాపం చెందేవాడని, ఆ కారణంతోనే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఊడిన కారు టైరు.. మంత్రాలయ విద్యార్థుల దుర్మరణం
బెంగళూరు, సాక్షి : కర్ణాటకలో బుధవారం(జనవరి22) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురిని కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.హంపిలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో ఆరాధానోత్సవాల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నట్లు, బోల్టులు ఊడిపోవడంతో తుఫాన్ వాహనం బోల్తాపడినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. -
గెరిల్లా సేనాని చలపతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చిత్తూరు అర్బన్/ మల్కన్‌గిరి: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. చలపతిపై రూ.కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించి... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లెకు చెందిన శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. ఆయన తండ్రి సాధారణ రైతు. వారికి మత్యం పైపల్లెలో ఇప్పటికీ సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో చలపతి అన్న కుమారుడి కుటుంబం నివసిస్తోంది. ప్రాథమిక విద్యను మత్యంలోనే అభ్యసించిన చలపతి.. పదో తరగతి వరకు బంగారుపాళెం, డిగ్రీ ఒకేషనల్ కోర్సును చిత్తూరులో పూర్తిచేశారు. పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితుడై 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసు రికార్డుల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. శ్రీకాకుళం– కోరాపుట్ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన.. గెరిల్లా వార్ఫేర్లో చూపిన ప్రతిభతో అనతి కాలంలోనే డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 2000 నాటికి ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ స్టేట్ మిలిటరీ కమిషన్లలో సభ్యుడి హోదా పొందారు. 2010లో తోటి మావోయిస్టు అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఒక దాడిలో చలపతి పొరపాటు కారణంగా ఒక కామ్రేడ్ చనిపోవడంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్ చేసింది. చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మహేంద్ర కర్మపై దాడితో మళ్లీ తెరపైకి... సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై 2015లో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు. తరా>్వత మావోయిస్టు రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకట రమణ అలియాస్ రవి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రి 2017లో చనిపోవడంతో.. చలపతికి ప్రాధాన్యత దక్కింది. తర్వాతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 2003లో దమాన్జోడి మైన్స్ కంపెనీపై దాడి, మాచ్‌ఖండ్ పోలీసుస్టేషన్‌పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఏపీ గ్రేహౌండ్స్‌పై చిత్రకొండ జలాశయంలో దాడి, 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యను ప్లాన్ చేసినది చలపతేనని చెబుతారు. 2011లో చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినీల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆర్కే సన్నిహితుడిగా.. హిడ్మాకు గురువుగా.. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్‌లో ఒకరిగా చలపతికి గుర్తింపు ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితంగా చలపతి మెలిగారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్‌గా ఉన్న మడావి హిడ్మాకు చలపతిని గురువుగా పేర్కొంటారు. ఆయన ఎలా ఉంటారనేది చాలా కాలం పాటు పోలీసులకు తెలియలేదు. 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతడి ల్యాప్‌టాప్‌లో చలపతి, ఆయన సహచరి అరుణ సెల్ఫీ వీడియో లభించింది. -
'దండకారణ్యం' నెత్తురోడింది
చర్ల/ మల్కన్‌గిరి/ సాక్షి, పాడేరు: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మృతి చెంది వారం తిరగకముందే.. ఛత్తీస్‌గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురుకాల్పులు, కూంబింగ్ కొనసాగుతూ ఉండటంతో బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 19వ తేదీ నుంచే కూంబింగ్.. దండకారణ్యంలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఆర్పీఎఫ్, కోబ్రా, డి్రస్టిక్ట్ ఫోర్స్, ఒడిశాకు చెందిన ఎస్ఓజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) బలగాలు ఈ నెల 19 నుంచి సరిహద్దుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 20వ తేదీన ఉదయం పోలీసు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ మొదలైంది. తొలిరోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఎన్కౌంటర్లో 14 మంది మృతి చెందారు. రెండు రోజుల్లో కలిపి మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కు పెరిగింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు. మృతుల సంఖ్య 25 – 30 మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. 1,500 మంది.. 15 కిలోమీటర్ల సర్కిల్‌గా.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1,500 మంది పోలీసు బలగాలు కులారీఘాట్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15–20 కిలోమీటర్ల సర్కిల్‌గా ఏర్పడి... కూంబింగ్ చేపడుతూ దగ్గరికి వచ్చాయి. సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్‌లోకి రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది. ఎన్కౌంటర్లో మరణించిన చలపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ముందు వరుసలో సెంట్రీలు కాపలాగా ఉంటే చివరి వరుసలో ఫీల్డ్ పెట్రోలింగ్ టీమ్ రక్షణగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాంబులు అమర్చి ఉంటాయి. అయితే అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా వలయాన్ని ఛేదించుకుని బలగాలు దాడి చేసినట్టు తెలిసింది. ఘటనాస్థలంలో ఇప్పటివరకు పది వరకు ఐఈడీలను గుర్తించి తొలగించినట్టు సమాచారం. సరిహద్దుల్లో హైఅలర్ట్! కులారీఘాట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన జరిగిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ స్టేషన్లు, ఔట్‌పోస్టుల పరిధిలో రెడ్ అలర్ట్ అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతోనూ నిఘా పెట్టారు. -
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
నెటిజన్ ‘వార్నింగ్’కు పోలీసుల రియాక్షన్ ఇది
బెంగళూరు: తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తీవ్ర బెదిరింపులకు దిగాడు. ఏకంగా హత్య చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి పోలీసులు స్పందించిన తీరు.. ఆపై అతను ఇచ్చిన రిప్లై చర్చనీయాంశంగా మారాయి.యాదగిరి జిల్లా కోడేకల్ కి చెందిన షరీఫ్ అనే వ్యక్తి ఎక్స్‌లో తల్వార్ ఫోటో పోస్టు చేసి మరీ ‘‘హత్య చేస్తా’’ అంటూ హెచ్చరించాడు. ‘మేము ఇల్లు కడుతుండగా కొందరు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోలేదు’ అని ఆరోపించాడు. పైగా స్థానిక ఎమ్మెల్యే పీఏ ద్వారా ఒత్తిడి వల్లే మమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కాబట్టి నేను ఇదే తల్వార్‌తో మర్డర్ చేస్తాను అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు.ఈ పోస్ట్ కు బెంగళూరు సిటీ పోలీస్ అకౌంట్ నుంచి.. ఏ పోలీస్‌స్టేషన్ కు మీరు వెళ్లారు అని ప్రశ్నించారు. కోడేకల్ ఠాణాకు వెళ్లానని, నేను మా తండ్రి నెలరోజులుగా ఠాణా చుట్టూ తిరుగుతున్నాము, పేదలం అని ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. మీరు చర్యలు తీసుకోకపోతే నేను నా చట్ట ప్రకారం మర్డర్ చేస్తానని హెచ్చరించారు. ఈ అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ನಮ್ಮ್ ಮನೆಯ ಎಲ್ಲಾ ಧಾಖಲೆ ಇದೆ ನಮ್ಮ್ ಮನೆ ಕಟ್ಟುತಿರುವಾಗ ಜೀವ ಬೆದರಿಕೆ ಹಾಕತಾರನಾವು police station complaint ಕೊಡೋಕೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಯಾರು ಕೇರ್ ಮಾಡಲ್ಲ Station ಗೆ MLA P. A ಯಿಂದ ಹೇಳ್ತೆಸರ police ಯಾರು ಕೇರ್ ಮಾಡಲ್ ಅದ್ಕೆ ನಾ ಇದೆ ತಲ್ವಾರ್ ಯಿಂದ ಮರ್ಡರ್ ಮಾಡತೀನಿ 👇👇ಇಲ್ಲಾ FIR ತೊಗೋಳಿ pic.twitter.com/Fwc1sbWrhw— shareef (@LoverBoy1381979) January 19, 2025కాంతారగడ -
అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..!
రేణిగుంట: ‘నీపై భక్తితో ఇంతదూరమొచాము. నిన్ను దర్శించి పునీతులయ్యాము. నీకు మొక్కులు చెల్లించి రుణం తీర్చుకున్నాము. ఇంతలోనే మాకు అంత నరకం చూపావు.. మా తల్లిదండ్రులను తీసుకెళ్లి దిక్కులేని వాళ్లను చేశావు..! అయ్యో..దేవుడా.. ఎలా బతికేది స్వామీ..! అంటూ ఆ పసిమనసులు తల్లడిల్లడం తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ విషాద ఘటన రేణిగుంట–కడప మార్గంలోని రేణిగుంట మండలం, మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.దైవభక్తి ఎక్కవతెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు, అంబేడ్కర్ కాలనీకి చెందిన సందీప్‌షా(36)కు భార్య అంజలీదేవి(31), పిల్లలు లితికా షా(12), సోనాలీ షా(09), రుద్రప్రతాప్(06) ఉన్నారు. పటాన్‌చెరువులో ట్రేడింగ్ చేస్తూ సందీప్‌షా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ కోసం శ్రమిస్తున్నారు. సందీప్షాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. కుటుంబ సమేతంగా ప్రఖ్యాత ఆలయాలకు తరచూ వెళ్లి దర్శించుకునే వాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ ముగియగానే, ఈనెల 16వ తేదీన తన భార్య, పిల్లలు, అతని స్నేహితుడు నరేష్‌తో కలసి మొత్తం ఆరుగురు కారులో తిరుమలకు బయల్దేరారు. 17వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. సోమవారం కారులో సొంతూరుకు తిరుగుపయనమయ్యారు. రేణిగుంట మండలం, కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును కారు అదుపు తప్పి ఢీకొంది. దీంతో కారు, బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లాయి. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న సందీప్‌షా, అతని పక్కన కూర్చున్న భార్య అంజలీదేవి సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న లితికా షా, సోనాలిషా, రుద్రప్రసాప్, నరేష్‌కు రక్తగాయాలయ్యాయి. పెద్ద పాప లితికా షా తలకు బలమైన రక్తగాయమైంది. వెంటనే వారిని రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. లితికాషా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.టూరిస్ట్ బస్సులోనూ భక్తులతో దైవయాత్రఈ ప్రమాదంలో కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు జమ్మూ నుంచి 50 మంది భక్తబృందంతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ తిరుమలకు వచ్చే క్రమంలో ప్రమాదానికి గురైంది. 28 రోజుల కిందట వీరు జమ్ములో బయల్దేరారు. మరో 25 రోజులు వీరి యాత్ర సాగనుంది. అయితే అనూహ్య ప్రమాదంలో బస్సులోని యాత్రికులంతా తీవ్రంగా కలత చెంది రోడ్డు పక్కన దిగాలుగా కూర్చుండిపోయారు.ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా..వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాద సమయంలో రక్షణ కవచంగా నిలిచే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రమాద తీవ్రత దృష్ట్యా వారు మృత్యుఒడికి చేరారు.డీఎస్పీ పరిశీలనరేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న సందీప్‌షా, అంజలీదేవి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుల బంధువులు ఆ పిల్లలకు ఇక దిక్కెవరంటూ రోదించడం అక్కడివారిని కలిచివేసింది. -
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది. -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
స్నేహంగా మెలిగితే.. పెళ్లి చేసుకోవాలని వేధింపులు
వెంగళరావునగర్: స్నేహంగా మెలిగినందుకు యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలంటూ వేధించిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... జగిత్యాల ప్రాంతానికి చెందిన యువతి స్థానిక మధురానగర్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ క్రమంలో బోరబండలో ఉండే రఘువంశీతో పరిచయం ఏర్పడింది. ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో చనువుగా ఉండటంతోపాటు పలు దేవాలయాలకు కలిసి వెళ్లారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను సైతం కలిసి దిగారు. అయితే కొన్ని రోజుల తరువాత రఘువంశీ సదరు యువతిని పెళ్లిచేసుకోవాలని కోరాడు. అందుకు యువతి నేను స్నేహితురాలిని మాత్రమేనని పెళ్లిచేసుకోవడం కుదరదని తేలి్చచెప్పింది. దీంతో ఇరువురూ కలిసి దిగిన ఫొటోలను బంధువులకు పంపడంతోపాటు యువతి గురించి చెడు ప్రచారం చేస్తానని బెదిరించసాగాడు. వేధింపులు తట్టుకోలేక యువతి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.