Crime
-
బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ హోటల్లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్ సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు. దాంతో ఆమె డిన్నర్‌కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్‌గా పేరొందిన జోయాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్‌ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. -
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
అమ్మాయితో భార్యకు అడ్డంగా దొరికిన జీహెచ్ఎంసీ అధికారి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డునపడేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సొసైటీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వివాహేతర సంబంధాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పరువు తీసుకుని నవ్వుల పాలవుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి బాగోతం బట్టబయలైంది. తన కంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో సదరు అధికారి వివాహేతర సంబంధం పెట్టుకోగా అతడి భార్య వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్‌ను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో కలిసి నగరంలోని వారాసిగూడలో మకాం ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భార్య కళ్యాణికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జానకీరామ్ ఎక్కడికి వెళుతున్నాడని కళ్యాణి నిఘా పెట్టింది. దీంతో, వారాసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది.దీంతో, ప్లాన్ ప్రకారం భర్తను ఫాలో చేసిన కళ్యాణి.. అపార్ట్మెంట్లోని గదిలో వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరినీ ఆమె చితకబాదారు. అనంతరం, కళ్యాణి మాట్లాడుతూ.. జానకీరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడని అన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జానకీరామ్‌కు తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కళ్యాణి కోరారు. -
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్తత!
సాక్షి, ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రీచైతన్య కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని నందిని(16) ఆత్మహత్య చేసుకుంది. క్లాస్‌రూమ్‌లోనే నందిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్‌కు సమాచారం అందించారు. వెంటనే నందిని మృతదేహాన్ని ఆసుపత్రి యాజమాన్యం మార్చురీకి తరలించింది. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.కాగా, విద్యార్థిని మృతి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డుపైనే కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని
కామారెడ్డి: జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని కన్నుమూసింది. స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి(14). కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌తో ఆమె బయల్దేరింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా సీపీఆర్ చేస్తూ వైద్య చికిత్స అందిస్తుండగానే.. ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ధృవీకరించారు. -
కాల్ మెర్జింగ్‌తో కాజేస్తారు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హెచ్చరించింది. అపరిచితులు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.కాల్ మెర్జింగ్ స్కాం అంటే? ఒక అపరిచితుడు మీ ఫోన్ నంబర్‌ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్‌ను విలీనం (మెర్జ్) చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్. స్కామర్ అడగ్గానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతాడు. ఇలా బ్యాంకు కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు. మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.కాల్ మెర్జింగ్ స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మరో నంబర్ నుంచి వస్తున్న కాల్‌ను మెర్జ్ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.» అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి.» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. -
అమ్మకానికి కుంభమేళా మహిళల పుణ్య స్నానాల వీడియోలు!
లక్నో : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) భక్తులు పెద్దఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈక్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు 103 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ కుంభమేళాలో మహిళలు స్నానమాచరించడం, దుస్తులు మార్చుకునే వీడియోల్ని పలువురు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్రొఫైళ్లు, గ్రూపుల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ మీడియాతో తెలిపారు. బుధవారం కుంభమేళాలో స్నానం చేయడంతో పాటు, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోల్ని తీస్తున్నారు. వాటిని అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది.ఆ వీడియోలను అమ్మేవారిని, కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం వీటిని మానిటర్ చేస్తోంది. ఎవరైతే మహిళల ప్రైవేట్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారో, వారి ప్రొఫైళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు లేదా గ్రూపులను గుర్తించారనే సమాచారంపై డీఐజీ వైభవ్ కృష్ణ స్పందించారు. 103 సోషల్ మీడియా ప్రొఫైళను గుర్తించాం. వీటిలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అకౌంట్లతో పాటు మహిళల ప్రైవేట్ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 26 సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో కుంభమేళాలో స్నానమాచరించే మహిళల వీడియోల్ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకుంటామని కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ హెచ్చరించారు. కాగా, కుంభమేళాలో మహిళల వీడియోల్ని తీస్తున్న దుండగులు ఒక్కో వీడియోను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. -
విశాఖలో జ్యోతిష్యుడి దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జ్యోతిష్యుడు దారుణ హత్యకు గురయ్యారు. జ్యోతిష్యుడు అప్పన్న అస్థి పంజరం కాపులుప్పాడలో లభ్యమైంది. మహిళతో అసభ్య ప్రవర్తన నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఒక రౌడీ షీటర్, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసి కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. అస్థి పంజరం వద్ద పూసలు, సగం కాలిన ఫోటో, పంచే లభ్యమయ్యాయి.మరోవైపు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కరీంనగర్ శివారు దుర్శేడ్ గ్రామంలోని పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు, కుంకుమ కుద్రపూజల ఆనవాళ్లు చూసి విద్యార్థులు బెంబేలెత్తారు. -
'నా కుమారుడిది ముమ్మాటికీ హత్యే ...
అల్లూరి సీతారామరాజు జిల్లా: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–హుకుంపేట ప్రధాన రహదారిలో పాటిమామిడి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై పాడేరు నుంచి వస్తు డివైడర్‌ను ఢీకొని పాడి శ్రీకాంత్(28) సంఘటన స్థలంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డివైడర్‌ను ఢీకొనగా వాహనం అతనిపై పడినట్టు పేర్కొన్నారు. దీనిపై మృతుడు తండ్రి పాడి చంటిబాబు తన కుమారుడు ప్రమాదంలో మృతి చెంది ఉండరని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేపట్టి యువకుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై! -
నిజామాబాద్: కుటుంబాన్ని బలిగొన్న కరెంట్
నిజామాబాద్, సాక్షి: బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చి.. ఆ కుటుంబ సభ్యులకు తగిలింది. దీంతో ఆ ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో విషాదం.. తుంగభద్రలో మునిగి డాక్టర్ అనన్య మృతి
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతిచెందారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్ తాజాగా ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. డాక్టర్ అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అనంతరం, సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుంది.దీంతో, రాళ్ల పైనుంచి నీటిలో దూకెసింది. నీటిలో కాసేపు ఈత కొట్టిన అనన్య.. కాసేపటికే నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్య కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక, ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటారని పోలీసులు అనుమానించారు. దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు.తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఇక, అనన్య నదిలో దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది.#KoppalMishap #Sanapur Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025 -
తీవ్ర విషాదం.. ప్రాక్టీస్‌లో భారీ బరువులెత్తబోయి 17 ఏళ్ల యస్తిక..
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్లిఫ్టర్గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కూడా సాధించింది.270 కేజీల బరువును ఎత్తే క్రమంలోతన రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా జిమ్‌లో ఆమె కోచ్‌తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.యస్తిక దుర్మరణంపైఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.కాగా పవర్‌లిఫ్టింగ్‌లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు పంజాబ్‌లో గల జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్ -
తుంగభద్రలో నగర వైద్యురాలి గల్లంతు
సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో మునిగిపోయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఆమె కోసం గాలిస్తున్నామని, ప్రాణాలతో ఉందో లేదో తెలియదని అన్నారు. గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ.20 లక్షలు ఇస్తా.. నన్ను మరిచిపో..
బంజారాహిల్స్(హైదరాబాద్) : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సదరు యువతితో చనువుగా మెదిలాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం.. మరిచిపో అంటూ తాపీగా చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లో నివసిస్తున్న సాయిప్రణీత్ (26) సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. ఆయన బెంగళూరులో ఉన్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్ గదిలో పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతి సాయిప్రణీత్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అనంతరం నగరంలోని గాయత్రీ హిల్స్‌కు మకాం మార్చిన సాయిప్రణీత్.. కొద్ది రోజులు యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లెలి పెళ్లి తర్వాత మన పెళ్లి జరుగుతుందంటూ ఆమెను నమ్మించి గత ఏడాది నవంబర్‌లో వెళ్లిపోయాడు.మీ చెల్లెలి పెళ్లి ఫొటోలు పంపించాలని యువతి చెప్పగా.. కొన్నింటిని పంపించాడు. ఆ ఫొటోలను చూసి అనుమానం వచ్చినది బాధితురాలు ఇటీవల మరింతగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల క్రితం సాయిప్రణీత్ గదికి వెళ్లిన ఆమెను కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు నాతో తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తాను.. మన బంధం మరిచిపో అంటూ చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
గన్ బ్యాక్‌ఫైర్.. జవాన్ మృత్యువాత!
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): పంజాబ్‌లోని సూరత్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) గన్‌లోని బుల్లెట్ బ్యాక్‌ఫైర్ అయ్యి రాజస్థాన్‌లో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆయన భార్య, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన మోహన్ వెంకటేష్ 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఆర్మ్డ్ గన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్ క్లియర్ చేస్తుండగా బ్యాక్ ఫైర్ అయ్యి బుల్లెట్ తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి రానుందని సైనికాధికారులు తెలిపారు. -
చంపింది ప్రియురాలి భర్త, మామలే!
నిడమర్రు(పశ్చిమ గోదావరి): బావాయిపాలెంలో సంచలనం రేకెత్తించిన మజ్జి ఏసు హత్య కేసు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఉంది. నిందితులు ఏసు ప్రియురాలి భర్త, మామలే.. వారు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ హత్యకు సహకరించిన ఉండి మండలంకు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.పోలీసుల విచారణలో...బావాయిపాలెంలో ఏసు రాజు ఇంటి సమీపంలో ఉంటున్న ఒక మహిళతో వివాహేతర సంబంధమే సాగించడమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. హత్య జరిగిన రోజు పోలీసు జాగిలాలు సదరు మహిళ ఇంటి వద్దనే తిరగడంతోపాటు.. ఆ ఇంటికి చెందిన తండ్రి, కొడుకులు (పిల్లి అన్నవరం, పిల్లి ఏసు) ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆదిశగా విచారణ ప్రారంభించారు. ఈ వివాహేతర సంబంధం తెలిసి ఏడాదిగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెద్దల వరకు గొడవ వెళ్లగా వారు సర్దిచెప్పినట్లు తెలిసింది.పథకం ప్రకారం హత్యనిందుతులుగా భావిస్తున్న తండ్రి కొడుకులు పిల్లి అన్నవరం, పిల్లి ఏసు పథకం ప్రకారం మజ్జి ఏసును హత్య చేసినట్లు తెలిసింది. ఈనెల 15వ తేదీ రాత్రి బావాయిపాలెం గ్రామంలో కాపవరం కాలువ గట్టు వద్దకు ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా తండ్రి, కొడుకులు కలిసి దాడి చేసి పదునైన కత్తితో మృతుడు ఏసురాజు కుడి చెయ్యి నరికేశారు. ఆ తర్వాత పీక నొక్కి చంపేసినట్లు సమాచారం. నరికిన చెయ్యిని కాపవరం కాలువలో విసిరేశారు. ఈ తతంగంలో మూడో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు కాపవరం కాలువలో గుర్తించి సేకరించారు. అయితే మృతుడు ఏసు రాజు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులైన తండ్రి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.అత్యంత దారుణంగా హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు -
నీ భార్యతో ఉన్నా.. ఏం చేస్తావో చేయ్!
ఇంద్రవెల్లి (మంచిర్యాల): ఓ వివాహిత ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడు ఆ భర్తను రెచ్చగొట్టాడు. రగిలిపోయిన ఆ భర్త.. భార్యతోపాటు అత్త, వాళ్ల తరఫు బంధువులపై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. మండలకేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సంజీవాణికి దనోరా(బి) గ్రామానికి చెందిన గుట్టె అంకుష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భర్త అంకుష్ గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో.. వారం క్రితం సంజీవాణి పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే.. మంగళవారం మధ్యాహ్నం సంజీవాణి ప్రియుడు రాహుల్ అంకుష్‌కు ఫోన్ చేశాడు. ‘‘నీ భార్యతో ఆమె ఇంట్లోనే ఉన్నా.. ఏం చేస్తావో చేయ్..అంటూ సవాల్ విసిరాడు. అంకుష్ కోపంతో అత్తగారింటికి వచ్చాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తల్లి అనిత, అమ్మమ్మ రాధాబాయిలపై దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన సంజీవాణితోపాటు ఇద్దరిని స్థానికులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.భర్త స్నేహితునితో భార్య అనైతిక సంబంధం.. భర్త ప్రాణత్యాగం -
అమిత్ షా కొడుకు పేరుతో వసూళ్లు.. మోసగాడి అరెస్ట్
డెహ్రాడూన్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు,ఐసీసీ ఛైర్మన్ జై షాపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియాంషు పంత్ (19) జై షా పేరు చెప్పి ఇక్కడి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు ఫోన్ చేశాడు.తనను అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకొని పార్టీ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ప్రశ్నించగా తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో ఎమ్మెల్యే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు మొదలు పెట్టిన పోలీసులు మోసానికి పాల్పడుతున్న ప్రియాంశు పంత్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే నిందితుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా జై షా పేరుతో ఫోన్ చేసి డబ్బులిస్తే మంత్రి పదవులు ఇప్పిస్తానని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.విలాసవంతమైన జీవితం గడిపేందుకే పంత్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. -
ఇల్లరికం అల్లుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాపన్నపేట(మెదక్): భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని..అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓ భార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తీరా మృతుడి మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మ దంపతులకు కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక, నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్కు చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల బోరు వేసి ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చారు. శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడగా, తుంటి ఎముక విరిగింది. ఆశయ్యకు శస్త్ర చికిత్సకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్‌తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది. పొద్దున ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
AP: అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ.. ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్
సాక్షి, గుంటూరు: గుంటూరులో మత్తుమందు సేవిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి గుంటూరుకు తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.గుంటూరులో సాయిక్రిష్టనగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో మత్తుమందు సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎండీఎంఏ మత్తు మందును సేవిస్తూ, విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులతో సహా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి 10.67 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి గుంటూరుకు ఇంజనీరింగ్ విద్యార్థి సాయిక్రిష్ణ డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎండీఎం మత్తుమందును ఒక గ్రామును 1400 రూపాయలకు కొనుగోలు చేసి సాయిక్రిష్ట్ర దాన్ని ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా.. వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
Moinabad: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పాడె ఎక్కాడు..
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డు చేసి బంధువులకు పంపి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన వీఎం సాయికుమార్(32)కు వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. మార్చి 6న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం కుదిరిన రోజు నుంచి సాయికుమార్ తన కు కాబోయే భార్యతో నిత్యం ఫోన్ మాట్లాడేవాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపించాడు.వారు వెంటనే ఈ విషయాన్ని సాయికుమార్ తల్లి లక్ష్మికి తెలియజేశారు. కుటుంబసభ్యులు రాత్రంతా వెతికారు. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో గండిపేట ్త సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. సాయికుమార్ ఆత్మహత్యకు అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల వేధింపులే కారణమని తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
భార్య విద్రోహం.. భర్త ప్రాణత్యాగం
తుమకూరు: ప్రేమించుకున్నారు, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి తాళితో ఒక్కటయ్యారు. కానీ ఆమె మరొకరిపై మోజుపడి కట్టుకున్నోడికి ద్రోహం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలే వద్దనుకున్నాడు. తన స్నేహితుడే భార్యను తీసుకెళ్లడంతో విరక్తి చెందిన భర్త సెల్ఫీ వీడియో తీసి, చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని, తనకు న్యాయం చేయాలని స్నేహితులను కోరుతూ ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఉరి వేసుకున్నాడు. చిచ్చుపెట్టిన స్నేహితుడు హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం జిల్లాలోని గుబ్బి పట్టణంలోని గట్టి లేఅవుట్ బడావణెలో జరిగింది. వివరాలు.. నాగేష్ (35), 12 సంవత్సరాల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. నాగేష్ ఇటీవల సొంత ఇల్లు విక్రయించి గట్టి లేఅవుట్ బడావణెలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజిత మనసు మార్చాడు, ఇటీవల ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విరక్తి చెందిన నాగేష్.. మిత్రుడు భరత్ తన భార్య రంజితతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని, పరారు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
‘తల్లి’ మరణంపై కూతురు బొమ్మ.. కేసులో బిగ్ ట్విస్ట్
ఝాన్సీ: ‘పాపా కిల్డ్ మమ్మీ, హ్యాంగ్డ్ బాడీ’ అంటూ నాలుగేళ్ల బాలిక వేసిన బొమ్మతో ఆమె తల్లి మరణోదంతం కొత్త మలుపు తిరిగింది. తల్లిని చంపేస్తానని తండ్రి గతంలోనూ బెదిరించాడని బాలిక చెప్పింది. అంతేగాక తననూ చంపేస్తానన్నాడని చెప్పుకొచ్చింది. దాంతో అత్తింటివారి ‘ఆత్మహత్య’ కథనాన్ని పోలీసులు అనుమానించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ జిల్లాకు చెందిన సోనాలికి ఝాన్సీలోని కొత్వాలీకి చెందిన సందీప్ బుధోలియాతో 2019లో వివాహమైంది. రూ.20 లక్షల కట్నమిచ్చారు. కారు అడగ్గా తమ శక్తికి మించినదని తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్నుంచీ సోనాలిపై వేధింపులు మొదలయ్యాయి."🚨 Jhansi: A 4-year-old girl's drawing exposed the murder of her mother, Sonali Budholia. She alleged her father, Sandeep Budholia, killed her after years of dowry harassment & abuse. 💔 Police are investigating. #JusticeForSonali #StopDowry #UttarPradesh" pic.twitter.com/ayZG51DKxO— HK Chronicle (@HK_Chronicle_) February 18, 2025నాలుగేళ్లకు పాప పుట్టడంతో.. భర్త, అత్తామామలు సోనాలిని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. సోనాలి తండ్రే ఆస్పత్రి బిల్లు చెల్లించి కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలానికి అత్తింటివారు వచ్చి తల్లీకూతుళ్లను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం, సోనాలి ఆరోగ్యం బాగాలేదంటూ భర్త ఇటీవల ఆమె తల్లిదండ్రలకు ఫోన్ చేశాడు. కాదు, ఉరేసుకుందంటూ ఆ వెంటనే సమాచారమిచ్చాడు. వెళ్లి చూసేసరికి సోనాలి చనిపోయి ఉంది. దాంతో కూతురిని అత్తింటివారే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.అయితే తండ్రే తన తల్లిని చంపాడని వారి నాలుగేళ్ల దర్శిత చెప్పింది. ‘మమ్మీపై డాడీ దాడి చేసి చంపేశాడు. తర్వాత ‘కావాలంటే నువ్వు చచ్చిపో అని నన్ను అన్నాడు. అమ్మకు ఉరేసి రాయితో తలపై కొట్టాడు. తర్వాత కిందకు దించి సంచిలో పడేశాడు’ అంటూ బొమ్మగీసి మరి చూపించింది. ‘నువ్వు మా అమ్మను తాకితే నీ చెయ్యి విరగ్గొడతానని గతంలో నాన్నను తిట్టా. దాంతో ‘మీ అమ్మను చంపేస్తా, నిన్నూ చంపేస్తా’ అని అన్నాడు’ అని కన్నీరు పెట్టుకుంది. కూతురి వాంగ్మూలం, మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అయిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండ్రస్టియల్ టెక్నాలజీ(కేఐఐటీ)లో 20 ఏళ్ల నేపాలీ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాలేజీ హెచ్ఆర్ విభాగ డైరెక్టర్ జనరల్, పరిపాలనా విభాగ డైరెక్టర్, హాస్టల్స్ డైరెక్టర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.వివరాల ప్రకారం.. విద్యార్థి వేధింపుల కారణంగా కేఐఐటీ హాస్టల్లో ప్రకృతి లాంసాల్ అనే బీటెక్ మూడో ఏడాది విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 900 మంది నేపాలీ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు అణచివేసేందుకు వర్సిటీలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా కొట్టడం, తర్వాత 800 మంది విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి పంపేయడం చర్చనీయాంశమైంది. ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ముగ్గురితో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీచేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఈ కమిటీ ఆరాతీసి ప్రభుత్వానికి నివేదించనుంది.ఇక, ఘటనపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. తమ దేశ విద్యార్థులను కలిసి విషయం తెల్సుకుని తదుపరి కార్యచరణ కోసం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిశాకు పంపింది. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్లో చేర్పించడం లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు ఆ అధికారులు సలహాలు, సూచనలు చేస్తారు. విద్యార్థి మరణం వార్త తెల్సి నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సైతం విచారం వ్యక్తంచేశారు. The tragic death of Nepali student Prakriti Lamsal at KIIT has sparked protests,Alleged harassment led to her suicide, with the college’s mishandling and irresponsible comments from officials raising serious concerns. investigations are ongoing #JusticeForPrakriti#KIITUniversity pic.twitter.com/Bl2GS71Oic— R0ni (@R0ni9801025590) February 18, 2025 -
ఫొటో షూట్ పేరుతో రాసలీలలు!
నెల్లూరు సిటీ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు డీఐజీ కిరణ్‌కుమార్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన పలువురు మహిళా ఉద్యోగులను ఫొటోషూట్ల పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి రాసలీలలు సాగించారని సమాచారం. ఆ దుర్మార్గాలను ఫొటోలు తీసుకుని దాచుకునేవాడని తెలుస్తోంది. కిరణ్‌కుమార్ చీకటి జీవితాన్ని వివరిస్తూ ఆయన భార్య అనసూయరాణి బయటపెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. భార్యకు దూరంగా ఉంటూ...గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్, అనసూయరాణి ప్రేమించుకుని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కిరణ్‌కుమార్‌కు 2009లో రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య ఏడాది కిందట విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనసూయరాణి వద్ద కుమారుడు ఉండేలా, వారి బాగోగులను కిరణ్‌కుమార్ చూసుకునేలా పది నెలల కిందట పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పందాలు జరిగాయి. సోమవారం విజయవాడలో ఒక ఫంక్షన్లో కలిసిన కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య గొడవ జరిగింది. తనతోపాటు తన కుమారుడిపై కిరణ్‌కుమార్ విచక్షణారహితంగా దాడి చేశారని అనసూయరాణి గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వికృత చేష్టలు భరించలేక విడిగా ఉంటున్నానని ఆమె తెలిపారు. కిరణ్‌కుమార్ ఇతర మహిళలతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తనకు పంపించి మానసిక క్షోభకు గురిచేసేవాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె కొన్ని ఫొటోలను కూడా బయటపెట్టారు. -
మెదక్ జిల్లాలో దారుణం.. ప్రియురాలు దూరం పెట్టిందన్న కక్షతో..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల విచారణలో హత్య ఘటన బయటపడింది. తనను దూరం పెట్టిందని ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. హత్య తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకూడా పోయింది. తల్లి కనిపించకపోవడంతో మెదక్ టౌన్ పీఎస్‌లో కొడుకు శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు.విచారణ చేపట్టిన పోలీసులు. మహిళ కాల్ డేటాలో ప్రియుడి నెంబర్ గుర్తించారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోవడంతో రేణుక.. తన ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ ఫతేనగర్ ఉంటుంది. ఇంటిపక్కనే ఉంటున్న వ్యక్తితో రేణుకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందలించడంతో ఆ మహిళ ప్రియుడిని దూరంగా పెట్టింది. రేణుక దూరం పట్టిందనే కక్షతో ప్రియుడు హత్యకు ప్లాన్ చేశాడు. హత్య చేసిన తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. -
అధిక బరువు భరించలేక అన్న, చెల్లెలు ఆత్మహత్య
అన్నానగర్: చెన్నై శివారులోని తురైపాక్కంకు చెందిన ఇబ్రహీం బాషా (54) డ్రైవర్. ఇతని చెల్లెలు శంషాద్ బేగం (50). వీరిద్దరూ రెండు రోజుల క్రితం కోయంబత్తూరు గాందీపురానికి కారులో వచ్చి ఓ హోటల్లో బస చేశారు. ఆదివారం ఇబ్రహీం బాషా హఠాత్తుగా హోటల్ గది నుంచి బయటికి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్లారు. గదికి లోపలి భాగంలో తాళం వేసి ఉంది. వెంటనే, సేవకులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, శంషాద్ బేగం నోటి నుండి నురగతో చనిపోయి కనిపించింది. శంషాద్ బేగం పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. ఆమె మృతదేహం దగ్గర ఓ లేఖ కూడా లభ్యమైంది. అందులో నేను, మా అన్న అధిక బరువుతో బాధ పడుతున్నామని, బతకడం ఇష్టం లేక ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాసి ఉంది. పోలీసులు ఇబ్రహీం బాషాను పట్టుకుని విచారించారు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకు తన చెల్లెలితోపాటు నిద్ర మాత్రలు వేసుకున్నానని, చెల్లెలు కంటే తక్కువ నిద్రమాత్రలు వేసుకుని చనిపోలేదని బ్లేడ్ పగలగొట్టి మింగినట్లు చెప్పాడు. అనంతరం అతడికి ఆస్పత్రిలో తీవ్ర చికిత్స అందిస్తున్నారు. -
మా చావుకు ఎవరూ కారణం కాదు..
మైసూరు: వారసత్వ నగరి మైసూరులో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి కొడుకు, వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని విశ్వేశ్వరయ్య నగరలో ఉన్న సంకల్ప్ అపార్ట్మెంటులో ఈ విషాదం చోటుచేసుకుంది. అంతా భయానకం అపార్టుమెంటులో నివసిస్తున్న చేతన్ (45), రూపాలి (43) దంపతులు, వారి కొడుకు కుశాల్ (15), చేతన్ అమ్మ ప్రియంవద (65) మృతులు. మొదట చేతన్ తల్లి, భార్య, కుమారునికి ఏదో శక్తివంతమైన పురుగుల మందును తాగించడంతో వారు మరణించారు. తరువాత అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు అక్కడి దృశ్యాలను బట్టి చూస్తే ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాటులో తల్లీ కొడుకు మృతదేహాలు ఒకచోట, వృద్ధురాలి మృతదేహం మరోచోట ఉండగా, పై కప్పునకు చేతన్ మృతదేహం వేలాడుతున్న దృశ్యాలు నగరవాసులకు గగుర్పాటును కలిగించాయి. ఈ సామూహిక ఆత్మహత్యలు ఉదయం నుంచి తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. మేమే కారణం విద్యారణ్యపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మొబైల్ఫోన్లు తదితరాలను స్వాదీనం చేసుకున్నారు. చేతన్ రాసిపెట్టిన డెత్‌నోట్ అక్కడ లభించింది. ఆర్థిక ఇబ్బందులే కారణం, మా చావుకు ఎవరూ కారణం కాదు, మేమే కారణం అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మా స్నేహితులను, బంధువులను ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని క్షమించాలి అని రాశారు. సోదరునికి కాల్ చేసి నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ ఆ ఫ్లాటును పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చేతన్ కార్మికులను సౌదీ అరేబియాకు పంపించే ఏజెన్సీ నడుపుతున్నాడు. చేతన్ కుటుంబం, తల్లి ప్రియంవద పక్క పక్క ఫ్లాట్లలో జీవిస్తున్నారు. ప్రతి ఆదివారం అందరూ కలిసి ఉండేవారు. హాసన్ జిల్లాలోని గోరూరు దేవాలయానికి వెళ్ళి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చారు. చేతన్ సొంతూరు గోరూరు, భార్య రూపాలి మైసూరువాసి. 2019 నుంచి మైసూరులో నివాసం ఉంటున్నారని కమిషనర్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు చేతన్ అమెరికాలో ఉన్న సోదరుడు భరత్‌కు ఫోన్ చేసి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని, అందరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. దీంతో భరత్ రూపాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చరించాడు. వారు చేతన్ ఫ్లాటుకు వచ్చి చూడగా అప్పటికే అందరూ ఆత్మహత్య చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులా, లేక ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది సస్పెన్స్‌గా మారింది. -
స్నేహితురాలి మోజులో భార్యను.. ఆప్ నేత అరెస్ట్
అక్రమ సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితులకైనా దారితీస్తాయనడానికి పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఒక ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పదిమందికీ ఆదర్శంగా నిలవాల్సిన ఒక నేత స్వయంగా అకృత్యానికి పాల్పడటం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని లుథియానాలో భార్యను హత్య చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అనోఖ్ మిట్టల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని స్నేహితురాలు, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తొలుత అనోఖ్ మిట్టల్ తన భార్య లిప్సీ మిట్టల్‌ను ఒక గ్రామం దగ్గర దుండగులు హత్య చేశారని చెప్పాడు. తాను, తన భార్య లుథియానా-మలెర్‌కోట్లా రోడ్డులో ఒక హోటల్లో భోజనం చేసి, తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని అనోఖ్ మిట్టల్ పోలీసులకు తెలిపాడు. ఆ దుండగులు మారణాయుధాలతో దాడి చేసి, తమ కారు తీసుకుని పారిపోయాడని పేర్కొన్నాడు.పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ తమ విచారణలో లిప్సీ మిట్టల్‌ను ఆమె భర్త అనోఖ్ మిట్టల్ హత్య చేశాడని విచారణలో వెల్లడయ్యిందన్నారు. అనోఖ్ మిట్టల్‌తో పాటు ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితురాలు, మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నదని లిప్సీ మిట్టల్‌కు తెలిసిపోయందని, దీంతో భయపడిన అనోఖ్ మిట్టల్ తన స్నేహితురాలి సాయంతో భార్యను హత్య చేశాడన్నారు. ఈ ఘటనలో అనోఖ్‌కు సహకరించిన అమృత్‌పాల్‌సింగ్, గురుదీప్ సింగ్, సోనూ సింగ్, సాగర్‌దీప్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత? -
చదివింది ఎంటెక్... చేసేది చీటింగ్స్!
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్ చదివిన ఓ వ్యక్తి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేసి వాటిలో జరిగే ఎంపిక ప్రక్రియ తెలుసుకున్నాడు. ఆపై తానే సొంతంగా ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో ఎర వేశాడు. నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో మోసం చేశాడు. ఇతడిపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు కావడంతో సెంట్రల్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం టాస్‌్కఫోర్స్ వైవీఎస్ సు«దీంద్ర వివరాలు వెల్లడించారు. చింతల్ వెంకటేశ్వర నగర్‌కు చెందిన కె.భార్గవ్ ఎంటెక్ పూర్తి చేసి కొన్ని ఐటీ కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్‌గా పని చేశాడు. ఇలా ఇతడికి ఆయా కంపెనీల్లో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పడింది. దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన అతను ఐటీ ఉద్యోగాల పేరుతో మోసాలకు తెరలేపాడు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ వద్ద ఓ కార్యాలయాన్నీ అద్దెకు తీసుకుని అందులో నియోజీన్ సాఫ్ట్‌టెక్ పేరుతో కార్పొరేట్ లుక్‌తో ఆఫీస్ ఏర్పాటు చేశాడు. అందులో కొందరిని ఉద్యోగులుగా నియమించడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్ డిజైన్ చేశాడు. తన కార్యాలయం ఫొటోలను ఈ వెబ్సైట్లో పొందుపరిచాడు. క్లౌడ్ సరీ్వసెస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ రంగాల్లో వివిధ ఉద్యోగాలు ఉన్నట్లు ఆన్లైన్లోనే ప్రకటన ఇచ్చాడు. జూనియర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తదతర ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామని పేర్కొన్నాడు. కొందరు ఉద్యోగార్థులు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఈ కంపెనీ వెబ్సైట్, అందులో ఉన్న ఫొటోలు చూసి పెద్ద కంపెనీగా భావించారు. దరఖాస్తు చేసిన వారికి కన్సల్టెంట్స్ ద్వారా శిక్షణ కూడా ఇప్పించాడు. ఆపై ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరు ఎంపికైనట్లు ప్రకటించాడు. వీరికి ఈ–మెయిల్ ద్వారా జాబ్ ఆఫరింగ్ లెటర్లు పంపి... వారి నుంచి అడ్వాన్సులు, డిపాజిట్ల పేరుతో రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున వసూలు చేశాడు. భారీ మొత్తం దండుకున్న తర్వాత తన కార్యాలయం మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి చేతిలో మోసపోయిన వారి ఫిర్యాదుతో లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. భార్గవ్ ఆచూకీ కనిపెట్టడానికి మధ్య మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.లక్ష నగదు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, గుర్తింపుకార్డులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని లాలాగూడ పోలీసులకు అప్పగించారు. ఈ మోసాలు చేయడంలో ఇతడికి సహకరించిన వారు మరికొందరు ఉన్నారని గుర్తించిన టాస్‌్కఫోర్స్ వారి కోసం గాలిస్తోంది. -
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి లోనైన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిటీ పోలీస్ ఐటీసెల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రంగనాథ్‌రావు (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య గాజుల దాక్షాయణి, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అందు కు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అ యినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఆదివారం కుమార్తెతో కలిసి బోయిన్‌పల్లిలోని పుట్టింటికి వెళ్లిన అతడి భార్య దాక్షాయణి అక్కడి నుంచి భర్తకు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రాత్రి ఇంటికి వచ్చి చూడగా రంగనాథ్ వెంటిలేటర్ గ్రిల్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడ గా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. -
దేవుడా.. ఎవరిదీ పాపం?
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. బండపని చేసుకుంటూ పొట్టపోసుకునే బడుగులు.. ఏ పూటకు ఆ పూట కూలి తెచ్చుకుని జీవనం సాగించే నిరుపేదలు.. అష్టకష్టాలు పడుతున్నా తమ నలుగురు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అందులో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేశారు. మరో అమ్మాయిని పదోతరగతి, అబ్బాయిని ఏడోతరగతి, మూడో కుమార్తెను రెండో తరగతి చదివిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ సాఫీగానే సంసారం నెట్టుకొస్తున్నారు. ఇంతలో ఆ పేద కుటుంబంపై పిడుగు పడింది. వారి జీవితాలను అల్లకల్లోలం చేసేసింది.పలమనేరు : మండలంలోని టి. వడ్డూరు గ్రామంలో బండపని చేసుకుని బతికే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. మిగిలినవారు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో రెండో బిడ్డకు కడుపు ముందుకొస్తోందని టీచర్లు చెప్పడంతో ఆందోళన చెందారు. కామెర్ల వల్ల అలా జరిగిందేమో అని పట్టించుకోలేదు. తర్వాత బాలికకు కడుపునొప్పి అసలు విషయం తెలిసింది. ఆ బిడ్డ గర్భం దాల్చిందని తెలిసి బంగారుపాళెంలోని సోదరి ఇంటికి పంపేశారు. అక్కడే ఓ ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. అయితే ఆ అమ్మాయికి ఫిట్స్ రావడంతో మూడురోజుల క్రితం చిత్తూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిజరేయన్ చేసి శిశువును బయటకి తీశారు. ఉన్నట్టుండి తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్సపొందుతూ ఆ బాలిక మృతిచెందింది. ఆ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.కారణం ఆ ముగ్గురే..తన అక్క మృతికి ముగ్గురు యువకులు కారణమని చెల్లెలు వెల్లడించింది. తమ బంధువైన ఓ మహిళ కారణంగా తమ ఇంటికి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు వచ్చేవారని తెలిపింది. తరచూ బిరియానీ, ఇతర తినబండారాలను అక్కకు ఇచ్చేవారని వివరించింది.గ్రామంలో నిరసనలుఇలా ఉండగా తిరుపతి నుంచి బాలిక మృతదేహం ఆంబులెన్స్‌లో రాగానే గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిక మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పలమనేరు సీఐ నరసింహరాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.కఠినంగా శిక్షించాలిమైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భం దాల్చేలా చేసి, ఆమె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. తొమ్మిదినెలలు తన కడుపులో బిడ్డను మోస్తున్నా ఏ డాక్టరైనా ఎందుకు గుర్తించలేదు. ఇది వైద్యులు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. గతంలోనూ ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో నిందితులను కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి.– భువనేశ్వరి, ఐద్వా జిల్లా కన్వీనర్ -
అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన అత్తా మామ..
టేకులపల్లి: భార్యాపిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. మంటలకు తాళలేక ఎంతగా మెత్తుకున్నా వారు తలుపు తీయకపోవడంతో పక్కనే ఉన్న నీటితొట్టిలో దూకాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం దంతెలబోరు ఎస్సీకాలనీకి చెందిన బల్లెం చినవెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు బల్లెం గౌతమ్ (23).. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు కుమార్తె కావ్యను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సుజాతనగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గత నెల కావ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రామచంద్రునిపేటలోని పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న రాత్రి గౌతమ్ తన పిల్లలు, భార్యను చూసేందుకు రామచంద్రునిపేటకు వచ్చాడు. గౌతమ్‌ని లోపలికి వెళ్లనీయకుండా అత్తా మామ, బావమరుదులు అడ్డుకున్నారు. దుర్భాషలాడి, దాడి చేయడంతో పాటు గౌతమ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తున్నా రక్షించలేదు. పక్కనే ఉన్న నీటి తొట్టిలో దూకిన గౌతమ్‌ని చుట్టు పక్కల వారు బయటకు తీసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన గౌతమ్ ఆదివారం మృతి చెందాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
హత్య చేసి.. కుడి చేయి తీసుకెళ్లినా హంతకులు
నిడమర్రు (పశ్చిమ గోదావరి): నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు(26)ను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్ మరణించగా, తల్లి దుబాయ్‌లో ఉంది. ఏసు దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలోని ఆక్వా చెరువుల కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య 8వ నెల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మృతుడితోపాటు అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో ఉన్న చినకాపవరం పంటకాల్వ వద్ద ఏసును చంపి, శవాన్ని కాలువ రేవు వద్ద పడేశారు. అతని కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. భార్య శ్రీవల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఇంటి పరిసరాల్లోనే డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది. -
కూతురుతో చనువుగా ఉంటున్నాడని..
నారాయణఖేడ్: తన కూతురుతో వివాహితుడైన యువకుడు చనువుగా ఉండటాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కూతురుతో ఫోన్ చేయించి రప్పించి, అతడిని అత్యంత దారుణంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుముక్క లుగా చేసి తగులబెట్టాడు. తర్వాత తానే హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు. సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట మండలం నాగ్‌ధర్ పరిధిలోని రాంచందర్ తండాకు చెందిన ఆంగోతు దశరథ్ (26) సంగారెడ్డి సమీపంలోని ఓ చక్కెర కర్మాగారంలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దశరథ్ గతంలో ట్రాక్టర్ నడిపిన సమయంలో పరిచయమైన నిజాంపేట మండలం మేగ్యానాయక్ తండాకు చెందిన నేనావత్ గోపాల్ కూతురు (14 ఏళ్లు)తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. బాలిక ఉండే హాస్టల్వద్దకు సైతం తరచూ వెళ్లి వచ్చే వాడని తెలిసింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేపోయిన బాలిక తండ్రి గోపాల్.. ఈ నెల 12వ తేదీన తన కూతురుతోనే ఫోన్ చేయించి దశరథ్ను రప్పించాడు. అతడిని మభ్యపెట్టి ఈదుల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గుట్టలమధ్య దారుణంగా హత్య చేశాడు. తర్వాత దశరథ్ శవాన్ని బండరాళ్లతో కొట్టి కాళ్లు, చేతులు, ముక్కలుముక్కలుగా నరికి కాల్చివేశాడు. ఇదిలా ఉండగా పని ఉందంటూ బయటకు వెళ్లిన తన భర్త అటు స్వస్థలమైన రాంచందర్ తండాలోని ఇంటికి వెళ్లక.. ఇటు సంగారెడ్డిలోని తాము ఉంటున్న ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన దశరథ్ భార్య సోని ఈనెల 14న తన భర్త అదృశ్యమైనట్లు సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.దశరథ్ జాడ తెలియక ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలోనే అతడిని తానే హత్య చేసినట్లు ఒప్పుకుని గోపాల్, నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో శనివారం లొంగిపోయాడు. పోలీసులు విచారించగా, ఆదివారం ఈదుల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో గుట్టలమధ్య హత్యచేసిన ప్రదేశాన్ని చూపించాడు. పోలీసులు దశరథ్ మృతదేహం అవశేషాలను స్వాధీనం చేసుకొని, వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
Jagtial: మొన్న తల్లి.. నేడు పిల్లలు
పెగడపల్లి (జగిత్యాల జిల్లా) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తల్లి శుక్రవారం మృతిచెందగా.. పిల్లలు కృష్ణంత్ (10), మయాంతలక్ష్మి (8) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. పిల్లల మృతదేహాలను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి తరలించారు. కాగా, తమ అల్లుడు తిరుపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు అదనంగా కట్నం తేవాలని వేధించినందుకే తమ కూతురు ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందని హారిక తల్లిదండ్రులు అల్లెం మల్లయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన..పిల్లల మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం మద్దులపల్లికి తీసుకొచ్చారు. అప్పటికే హారిక కుటుంబ సభ్యులు, బంధువులు మద్దులపల్లికి తరలివచ్చారు. హారికతోపాటు పిల్లల మృతికి తిరుపతే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని హారిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు చేయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి.. -
Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!
కీసర(హైదరాబాదు): ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కీసర పోలీస్‌స్టేషన్(Keesara Police Station) పరిధిలోని కీసర దాయరలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కీసర దాయరకు చెందిన ప్రవళిక(23) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా(Software Engineer) పని చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె తల్లిదండ్రులతో పాటు, సోదరుడు బయటికి వెళ్లారు.సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ప్రవళిక(Pravallika) ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఆన్లైన్ గేమ్‌లో పరిచయం.. ఆపై అత్యాచారం..
ఫిలింనగర్: ఆన్లైన్ గేమ్ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్లైన్ చాటింగ్‌లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్ అజ్’ యాప్‌లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్‌లెస్’ పేరిట ప్రొఫైల్ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్ డేవ్ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి ఆ యాప్ ద్వారా చాట్ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్ ద్వారా చాట్ చేసుకునేవారు. చాట్ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్ చేయాల్సిందిగా ఖుష్‌డేవ్ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది. నగ్న ఫొటోలతో బెదిరింపులు.. వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు. అర్ధరాత్రి అత్యాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్‌డేవ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 65(1), 351 (2), సెక్షన్ 5 రెడత్ విత్ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Medchal: నడి రోడ్డుపై అన్నను హత్య చేసిన తమ్ముళ్లు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్: అది జాతీయ రహదారి.. ఆదివారం సాయంత్రం కావస్తోంది.. జన సంచారం.. వందలాది వాహనాలు వస్తూ పోతున్నాయి. ఓ వ్యక్తి ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడిని కొందరు వ్యక్తులు వెంబడించారు. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ దారుణాన్ని అక్కడున్న వారు ఆపే ప్రయత్నం చేయకపోగా.. తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉమేష్ (25), రాకేష్ ఉన్నారు. వీరు మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు ఉమేష్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య ప్రియాంకను, సోదరుడు రాకేష్‌ను, ఇంట్లోని పిల్లలను వేధింపులకు గురి చేస్తుండేవాడు. దురలవాట్లకు బానిసైన అతడిని దుబాయ్‌కి పంపించే ఏర్పాట్లు చేస్తుండగా.. వాటిని కూడా చెడగొట్టాడు. ఈ క్రమంలో ఆదివారం సైతం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఉమేష్.. కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు. అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంట్లోనే ఉన్న సోదరుడు రాకేష్‌తో, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్‌లతో ఉమేష్ వాగ్వాదానికి దిగాడు. వారిని బీరు సీసాతో బెదిరించాడు. రాకేష్ లక్ష్మణ్‌లు అతడిని ప్రతిఘటించారు. దీంతో ఉమేష్ సమీపంలోని జాతీయ రహదారి వైపు పరుగెత్తాడు. రాకేష్ లక్ష్మణ్‌లు బస్టాండ్ సమీపంలో ఉమేష్‌ను పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉమేష్ మృతదేహంపై 12 కత్తిపోట్లు ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. హత్య ఘటన వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నా.. మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాకేష్ లక్ష్మణ్‌తో పాటు వీరి కుటుంబ సభ్యులు నవీన్, నరేష్ సురేష్‌లు ఉన్నట్లు సమాచారం. ఉమేష్‌ను కత్తులతో దారుణంగా పొడుస్తున్నా.. అక్కడున్నవారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తమ మొబైల్ ఫోన్లలో హత్య చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తోటి మనిషి కత్తి పోట్లకు గురవుతున్నా.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా.. ఎవరూ స్పందించకపోవడం మానవత్వం కనుమరుగవుతోందనడానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. -
గర్భవతిని చేశాడు.. బాలిక ఉసురు తీశాడు!
కాణిపాకం/పలమనేరు : బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది. చివరికి ప్రాణాల మీదికొచ్చింది. వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు విఫలయత్నం చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ.ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణీ అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త హీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి.. వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. పలమనేరు సీఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ మాయలేడిని నమ్మి.. ఇదిలా ఉండగా, పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఓ మాయలేడి ఆ బాలికను ఆవుల మేతకు తీసుకెళ్లేదని, అక్కడ ఓ కామాంధుడి చేతిలో పెట్టేదని తెలిసింది. పూర్తి వివరాలను రెండ్రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్‌కు, థాయ్‌లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
ఫాల్కన్ స్కామ్ రూ.850 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫాల్కన్ సంస్థ అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్‌ఫామ్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో ఏకంగా రూ.1,700 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా, మిగిలిన రూ.850 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6,979 మందిని మోసం చేసిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు.ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ డైరెక్టర్ కావ్య నల్లూరి, బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) ఈనెల 15న అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఫాల్కన్ ఎండీ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యోగేందర్ సింగ్‌లు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుబంధ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు.ఇందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని ప్రజలకు ఆశ పెట్టారు. డిపాజిట్లను సేకరించేందుకు మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను సైతం రూపొందించారు.22 శాతం వరకు రాబడినిందితులు 2021లో డిపాజిట్ల సేకరణను ప్రారంభించారు. రూ.25 వేల నుంచి రూ.9 లక్షల డిపాజిట్ చేస్తే 45 నుంచి 180 రోజుల వ్యవధికి 11–22 శాతం రాబడిని ఇస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. డిపాజిటర్లకు రాబడిని అందించే క్రమంలో నిరంతరం కొత్త డిపాజిట్లను జోడిస్తూ వెళ్లారు. 2025 జనవరి 15న నాటికి ఈ స్కీమ్ ఆగిపోయింది. అయితే అప్పటికే డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసేశారు.దీంతో డిపాజిటర్లు లబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బీఎన్‌ఎస్‌తోపాటు తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999లోని పలు సెక్షన్ల కింద 19 మందిపై కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఈనెల 15న ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు.షెల్ కంపెనీలకు సొమ్ముజనాల నుంచి సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని మన దేశంతోపాటు సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి దేశాల్లోని షెల్ కంపెనీలకు మళ్లించారు. కాయిన్ ట్రేడ్, బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, యుకియో రిసార్ట్, ప్రెస్టిజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్, ఆర్డీపీ, రెట్ హెర్బల్స్ అండ్ రెట్ హెల్త్‌కేర్, ఎంబీఆర్–1, క్యాపిటల్ టెక్సోల్, విర్గో గ్లోబల్, ఓజేఏఎస్, హాష్‌బ్లాక్, వెల్ఫెల్లా ఇంక్, స్వస్తిక్ నెయ్యి వంటి షెల్ కంపెనీలకు నిధులను మళ్లించారు. నిందితులు గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడ్డారు. బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా మోసం చేసినట్లు 2022లో చేవెళ్ల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
మేడ్చల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్‌లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. బస్సు డిపో వద్ద నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఉమేష్ అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ్ముడే అన్నను చంపినట్లు పోలీసులు గుర్తించారు. తమ్ముడే మరో వ్యక్తితో కలిసి అన్నను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
రూ.5 కోట్ల కట్నం సరిపోలేదట.. బెజవాడలో నవవధువుకు వేధింపులు
సాక్షి, విజయవాడ: రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు.. అయినా సరిపోలేదంటూ వివాహం జరిగిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పని చేస్తున్న చెరుకూరి లక్ష్మణరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్‌లోకి చెందిన ప్రసన్నకుమార్ కుమార్తె లక్ష్మి కీర్తనకి అజయ్‌తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 7న రాయచూర్‌లో కీర్తన, అజయ్ వివాహం ఘనంగా జరిగింది. అయితే, వివాహం జరిగిన రెండు రోజులకే లక్ష్మి కీర్తనకి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలంటూ అజయ్, లక్ష్మణరావు వేధింపులకు గురిచేశారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించడంతో... టార్చర్ భరించలేక.. భవానీపురం పోలీసు స్టేషన్లో నవవధువు ఫిర్యాదు చేసింది. -
వరంగల్ ఏకశిలా కాలేజీలో కీచక లెక్చరర్!
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్‌ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అనుమానం.. అంతం చేసింది
బనశంకరి: పచ్చని సంసారంలో అనుమానం, అక్రమ సంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. అర్ధాంతరంగా గొడవలు చెలరేగి కుటుంబాలు కూలిపోతున్నాయి. రాష్ట్రంలో రెండు చోట్ల ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. భర్త ప్రవర్తన పట్ల అనుమానంతో ఆవేదన చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని బెల్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాయచూరు కు చెందిన మల్లమ్మ (26) మృతురాలు. ఆమెకు ఆరేళ్ల క్రితం క్యాబ్డ్రైవరు గా పనిచేసే బసవరాజుతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి తిమ్మారెడ్డి లేఔట్లో కుటుంబం నివాసం ఉంటుంది. భర్త ప్రవర్తన పట్ల బార్యకు అనుమానం ఏర్పడింది. వేరే మహిళలతో చనువుగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని మథనపడేది. ఈ వ్యథతో శనివారం ఉదయం ఇంట్లో పై కప్పు ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందిన వెంటనే బెల్లందూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. భార్యను శిక్షించాలని డెత్‌నోట్ రాసి.. యశవంతపుర: భార్య అక్రమ సంబంధంపై విరక్తి కలిగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా జగళూరు పట్టణంలో జరిగింది. భర్త బసవరాజ్ డెత్‌నోటు రాసి ఇంటిలో ఉరి వేసుకొని తనువు చాలించాడు. తన ఆత్మహత్యకు భార్య కారణం. ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు రాశాడు. భార్య, అనైతిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. నా పిల్లలను మా అమ్మ చూసుకోవాలని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
బెంగళూరులో దారుణం.. టోల్గేట్ వద్ద అరాచకం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు కొంత దూరం లాకెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నెలమంగళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్‌బూత్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఓ కారును మరో కారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి.. ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, టోల్బూత్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.ఈ క్రమంలోనే కారు స్టార్ చేసి.. వాగ్వాదానికి దిగిన వ్యక్తి కాలర్ పట్టుకుని కారును ముందుకు నడిపాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Shocking Incident in Bengaluru!A man was dragged for 50 meters by a car at Nelamangala toll booth after an argument over overtaking. The entire incident was caught on CCTV. Police have launched an investigation to identify the accused. #Bengaluru #RoadRage #ViralVideo pic.twitter.com/mFJ8YOMXoQ— Shubham Rai (@shubhamrai80) February 16, 2025 -
అమ్మను నాన్నే చంపేశాడు
వెంగళరావునగర్: ‘మా అమ్మను నాన్నే కొట్టి చంపాడు’ అని ఓ చిన్నారి కేసు పెట్టడంతో నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వర్మ కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ సలీంకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఫర్జానా బేగంతో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. జీవనోపాధి కోసం 8 ఏళ్ల క్రితం నగరంలోని జవహర్‌నగర్ మసీదుగడ్డకు వలస వచ్చి అద్దె గదిలో నివసించేవారు. పెళ్లయినప్పటి నుంచీ సలీం, ఫర్జానా దంపతులు తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలోనే సలీం మద్యానికి బానిసయ్యాడు. రెండేళ్ల క్రితం సలీం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.50 వేల కోసం గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో వంట గదిలో ఉన్న పప్పుగుత్తితో తలపై బలంగా కొట్టాడు. పెద్ద కుమార్తె జోక్యం చేసుకోగా ఆమెను కూడా కొట్టాడు. తెల్లారుజామున కుమార్తె తల్లిని నిద్ర లేపడానికి ప్రయత్నించగా ఆమె లేవలేదు. సలీం వచ్చి తన భార్యకు పల్స్ ఆడటం లేదని తెలుసుకుని ఆమె బంధువులకు తెలియజేశాడు. తల్లిని కొట్టి చంపిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కుమార్తెను బెదిరించాడు. ఇద్దరు కుమార్తెలను కామారెడ్డి వెళ్లి ఫర్జానా సోదరి షెహనాజ్‌కు అప్పగించాడు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా మధురానగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పెద్దమ్మ వద్దే∙ఇద్దరు పిల్లలు పెరిగారు. ఇటీవల ఫర్జానా బేగం పెద్ద కుమార్తె తన పెద్దమ్మతో గతంలో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెను తీసుకుని షెహనాజ్ మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి కొట్టడం వల్లే తల్లి చనిపోయినట్లు ఫర్జానాబేగం పెద్ద కుమార్తె పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని విచారించగా.. భార్యను తానే కొట్టినట్టు అంగీకరించాడు. పోలీసులు హత్యానేరం కిందట కేసు నమోదు చేసి అతనిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు పంపించారు. -
అదనపు కట్నం కోసం అత్తమామల వికృత చేష్ట.. కోడలికి ఏకంగా..
లక్నో: అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో కోడలిపై కక్ష గట్టి దారుణానికి ఒడిగట్టారు అత్తామామలు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసి హెచ్ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో 2023 ఫిబ్రవరి 15న వివాహమైంది. వివాహం సందర్భంగా సచిన్‌కు రూ.15 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. వీరి పెళ్లి తర్వాత కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇంతలో అత్తింటి వారు స్కార్పియో కారు కొనడానికి తల్లిగారి దగ్గర నుంచి మరో రూ.25 లక్షలు తీసుకురావాలని కోడలిని వేధించారు. ఈ క్రమంలో తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో, ఆగ్రహానిలోనైన అత్తామామలు.. కోడలిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు.అయితే, ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లడంతో వారికి నచ్చజెప్పి యువతిని తిరిగి అత్తింటికి పంపారు. కానీ, తీరు మార్చుకోని అత్తమామలు అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే హెచ్ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. కొంత కాలం తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు నిర్దరించారు. ఇదే సమయంలో భర్త అభిషేక్‌కు పరీక్షలు చేయగా.. అతడికి హెచ్ఐవీ నెగిటివ్‌గా తేలడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు స్థానిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Bahu is injected with an HIV-infected needle by Bimaru criminal in-laws.In Bimaru Pradesh, a fairly typical incident pic.twitter.com/KiTm2EIDtV— @PoliJester (@PoliJester420) February 15, 2025 -
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలితీసుకున్న వివాహేతర సంబంధం
విజయనగరం క్రైమ్: తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఇంజినీరు కోనారి ప్రసాద్ (28) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ నెల 10న హత్యకు పాల్పడిన అన్నదమ్ములైన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్య వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఐ నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు కోనారి ప్రసాద్‌కు నెమలాం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లను భర్త అచ్యుతరావు గమనించాడు. విషయాన్ని తమ్ముడు శివకృష్ణకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్‌ను అంతమొందించాలని నిర్ణయించారు. బెంగళూరులో పనిచేస్తున్న ప్రసాద్ గ్రామానికి రావడంతో హత్యపథకం అమలుచేయాలని నిశ్చయానికి వచ్చారు. ఆయనతో ముందురోజు మాట్లాడారు. విజయరాంపురంలోని అమ్మమ్మవారి ఇంటికి వెళ్తున్న విషయం, తిరిగి ఏ సమయానికి వస్తాడన్న విషయం తెలుసుకున్నారు. మాట్లాడదామని నెమలాం సమీపంలోని వారి పొలాల వద్దకు పిలిచారు. ప్రసాద్‌తో శివకృష్ణ మాట్లాడుతుండగా వెనుకనుంచి తలపై కర్రతో అచ్యుతరావు బలంగా మోదాడు. తర్వాత ఇద్దరూ కలిసి కర్రలతో దాడిచేశారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ కాలుజారి పిల్లకాలువలోని రాయిపై పడిపోవడంతో అక్కడకు వెళ్లి మరోసారి దాడిచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డుపై తెచ్చి పడేశారు. అనంతరం బైక్‌ను కూడా కర్రలతో ధ్వంసం చేసి రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత ప్రమాదంగా అనుమానించారు. ఘటనా స్థలాన్ని చూసి హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ, సీఐ, తెర్లాం ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
పల్నాడు: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు ప్రకాశం జిల్లాలకు చెందినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం పెదనెమలిపూరి దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో తల్లి షేక్ నజీమా (50).. ఆమె కుమారులు ఇద్దరు షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) ఉన్నారు. ఇక, వీరిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
మహిళతో వరుస మరిచి టీడీపీ నేత అకృత్యాలు.. ఎట్టకేలకు అరెస్ట్!
సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం.. బంధువులను సైతం షాక్‌కు గురిచేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి.. మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని, బాబాయ్ రవి కుమార్.. ఆమెను చేరదీశారు. అనంతరం, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్. ఇక, ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్.. వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు.లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో, సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. అనంతరం, బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్.. మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రిని అని రవి కుమార్ సంతకం చేశాడు.ఆ తరువాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించాడు. ఈ సమయంలో బాధితురాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రవికుమార్ కీచకపర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రేమికుల రోజే ప్రియుడి బలవన్మరణం
సంతోష్ నగర్: ప్రేమికుల రోజునే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కథనం ప్రకారం... సంతోష్ నగర్ కళంధర్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (21) చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన మహ్మద్ ఆబిద్ అలీ కూతురు రబియా ఫాతిమాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇది రబియా తండ్రి అబిద్ అలీకి తెలియడంతో ఆయన ఈ నెల 14న చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తన కూతురును ఇమ్రాన్ వేధిస్తున్నాడని రబియాతో ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు ఇమ్రాన్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి.. తన మృతికి రబియా తండ్రి కారణమని సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి..
పెగడపల్లి: ఇద్దరు పిల్లలకు విషంమిచ్చి తల్లి తను కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా, ఇద్దరు పిల్లలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పెగడపల్లి ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కంబాల తిరుపతికి జగిత్యాలకు చెందిన హారికతో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు కృష్ణంత్ (10), కూతురు మాయంతలక్ష్మి (8) ఉన్నారు. పిల్లలిద్దరూ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. తిరుపతి, హారిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో తిరుపతి ఒగ్గు కథలు చెప్పేందుకు వెళ్తుంటాడు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఒగ్గు కథ చెప్పేందుకు వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోగానీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో హారిక (30) తన ఇద్దరు పిల్లలకూ గడ్డి మందు తాగించి తానూ తాగింది. విషయాన్ని వెంటనే తిరుపతికి వీడియోకాల్ చేసి చెప్పింది. కంగారుపడిన తిరుపతి గ్రామంలోని సమీప బంధువుకు తెలపడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లేసరికి పిల్లలతోపాటు హారిక అపస్మారక స్థితిలో కనిపించింది. వారిని చికిత్స నిమిత్తం ముందుగా జగిత్యాల.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం హారిక మృతి చెందింది. ఆమె సోదరుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మరింత సమాచారం సేకరించేందుకు హారికతోపాటు తిరుపతి సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. -
సంగారెడ్డిలో దారుణం.. కూతురితో చనువుగా ఉంటున్నాడని..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో చనువుగా ఉంటున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న తన కూతురితో చనువుగా ఉండటంతో దశరథ్(26)పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడిని హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్ అరెస్ట్
సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్‌గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్‌తో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె నోటిలో పోశాడు.తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్‌ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు. -
నా భర్త ఎక్కడ ఉంటే అక్కడకు వస్తోంది...
బనశంకరి: హత్యాయత్నం చేశారంటూ బెంగళూరు ఏసీపీ గోవర్ధన్, అతని తల్లిదండ్రులపై హైగ్రౌండ్స్ పోలీస్‌స్టేషన్‌లో భార్య అమృత ఫిర్యాదు చేసింది. ఆమె పలు తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తకు శిక్షణలో ఉన్న మహిళా డీఎస్పీతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంది. ఆమైపె కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఆ మహిళా డీఎస్పీకి పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ నా భర్తతో స్నేహంగా ఉంటోంది. నా భర్త ఎక్కడ డ్యూటీలో ఉంటే అక్కడకు వస్తోంది. ఈ విషయాన్ని ప్రశ్నించానని నా భర్త కోపోద్రిక్తుడై నాపై దాడికి పాల్పడ్డారు. విడాకులు ఇస్తానని బెదిరించారు. అంతేగాక నాపై తప్పుడు కేసు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు, అత్త కిరోసిన్ పోసి నిప్పంటించాలని చూసింది అని చెప్పారు. పోలీసులు గోవర్ధన్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ రావాలని ఆదేశించారు. -
19 ఏళ్ల మర్డర్ మిస్టరీకి ముగింపు పలికిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
1992లో వచ్చిన బ్రహ్మ సినిమా చూశారా? అందులో హీరోకి చిన్నప్పటి ఫొటో ఇస్తే.. పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీసి ఇచ్చేస్తాడు. విలన్లు ఓ అమ్మాయిని చంపడం కోసం ఆమె చిన్ననాటి ఫొటో ఇచ్చి.. పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీసి ఇవ్వాలని కోరతారు.. అయితే, హీరో ఆమె బొమ్మ కాకుండా చనిపోయిన తన భార్య బొమ్మ గీసి ఆ అమ్మాయిని కాపాడతాడు. అది ఆ సినిమా కథ (Cinema Story) ఇప్పుడు ఇలాంటి పనులకు ఆ బ్రహ్మ అవసరం లేదు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. అంతకంటే ఎక్కువ పనులే చేస్తోంది. దైనందిన జీవితంలోనే కాదు.. నేర పరిశోధనలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. పోలీసులకు సవాల్‌గా నిలిచిన కేసుల చిక్కుముళ్లను సునాయాసంగా విప్పి.. నేరస్తులను కటకటాల వెనక్కి నెడు తోంది. కేరళలో 19 ఏళ్లుగా మూలనపడి ఉన్న కేసును ఈ అభివన బ్రహ్మ సునాయాసంగా ఛేదించింది.- సాక్షి సెంట్రల్ డెస్క్19 ఏళ్ల క్రితం.. అది కేరళ (Kerala) కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణం (Anchal Town) 2006 ఫిబ్రవరి 10 సాయంత్రం ఆరు గంటలు.. స్థానిక పంచాయతీ కార్యాలయంలో పనిచేసే శాంతమ్మ అప్పుడే ఇంటికొచ్చి లోపలకు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. గది మొత్తం రక్తసిక్తంగా కనిపించింది. తన ఒక్కగానొక్క కుమార్తె, రంజని, ఆమె 17 రోజుల కవలు పిల్లలు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఎవరో వారు ముగ్గురినీ అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. 17 రోజుల పసిపిల్లలనే కనికరం లేకుండా దారుణానికి తెగబడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అక్కడ లభించిన ద్విచక్ర వాహనం ఆధారంగా ఆర్మీలో పనిచేస్తున్న దివిల్, రాజేశ్ ఈ హత్యలకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ ఎంతగా గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. 2010లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. అయినా నిందితుల జాడ తెలియలేదు.ఏఐ రాకతో..ప్రస్తుతం నేరపరిశోధనలోనూ ఏఐ (AI) కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంజని, ఆమె పిల్లల హత్య కేసును ఏఐ సాయంతో పరిష్కరించాలనే ఆలోచనతో దర్యాప్తు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయింది. తమ దగ్గర ఉన్న ఆధారం రాజేశ్ ఫొటో ఒక్కటే. అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఫొటో సాయంతో అతడిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేశ్ పాత ఫొటోను ఉపయోగించి.. అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సాయంతో ఓ ఫొటో సృష్టించారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉన్న లక్షలాది ఫొటోలను ఏఐను ఉపయోగించి జల్లెడ పట్టగా.. ఓ పెళ్లి ఫొటోలో ఉన్న వ్యక్తి 90 శాతం మేర మ్యాచ్ అయ్యాడు. వెంటనే వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు పుదుచ్చేరి వెళ్లి రాజేశ్‌ను, అతడి ద్వారా దివిల్ను గుర్తించి అరెస్టు చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఒకే గ్రామానికి చెందిన రంజని, దివిల్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. దీంతో దివిల్ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. 2006 జనవరిలో ఆమె కవల పిల్లలకు (Twins) జన్మనిచ్చింది. తనను మోసం చేసిన దివిల్ పై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న దివిల్.. రంజని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం ఆర్మీలోనే తనతో పనిచేస్తున్న రాజేశ్ సహాయం కోరాడు. వారి పథకంలో భాగంగా రాజేశ్ అంచల్ వచ్చి.. తనను అనిల్ కుమార్‌గా రంజనికి పరిచయం చేసుకున్నాడు. దివిల్పై పోరులో సహకరిస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలకు తండ్రి దివిల్ అని.. అతడికి డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన రంజని.. ఆ మేరకు ఉత్తర్వులు పొందింది. దీంతో సాధ్యమైనంత త్వరగా రంజనిని అంతం చేయాలని దివిల్, రాజేశ్ నిర్ణయానికి వచ్చారు.చదవండి: విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!ఫిబ్రవరి 10న రంజని ఇంటికి వచ్చిన రాజేశ్.. పిల్లల పుట్టినరోజు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీ ఆఫీసుకు పంపించాడు. ఆమె వెళ్లిన వెంటనే రంజనిని గొంతు కోసి చంపేశాడు. తర్వాత 17 రోజుల ఇద్దరు పసికందులను కూడా అలాగే చంపి, అక్కడ నుంచి జారుకున్నాడు. తర్వాత ఇరువురూ ఏమీ తెలియనట్టుగా పఠాన్ కోట్‌లోని ఆర్మీ బేస్ క్యాంపునకు వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా వీరిని నిందితులుగా గుర్తించిన పోలీసులు పఠాన్ కోట్ ఆర్మీ బేస్‌కు వెళ్లారు. అయితే, అప్పటికే ఇరువురూ అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడ నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయి విష్ణు, ప్రవీణ్ కుమార్ అనే తప్పుడు పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా అవతారమెత్తారు. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో తీసిన ఫొటోలో ఉన్న రాజేశ్‌ను ఏఐ గుర్తించడంతో ఇరువురూ కటకటాల వెనక్కి వెళ్లారు. -
అంకుల్ మా అమ్మను.. మా నాన్నే చంపాడు
కడప అర్బన్ : భర్తే కాలయముడిగా మారి భార్య తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. మద్యం సేవించడానికి డబ్బులను ఇవ్వలేదనే నెపంతో జీవితాంతం తోడు నీడగా నిలిచి, పిల్లలకు మంచి తండ్రిగా చూసుకోవాల్సిన ఆ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన హృదయవిదారకంగా మారింది. ఈ సంఘటన వారి ముగ్గురు పిల్లల జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేసింది. కడప నగరంలోని టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్ఐ ఎస్‌కెఎం హుసేన్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బెల్లమండివీధి, చిన్నమునిరావు వీధిలో గత నెల రోజులక్రిందట ఓ ఇంటిలో బాడుగకు పఠాన్ ఇమ్రాన్‌ఖాన్, అతని భార్య పఠాన్ జమీల (28) చేరారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో షాహిదాఖానం(9), ఏజాజ్‌ఖాన్ (7), అలినాఖానం(5) ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ఎలక్ట్రిషన్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్యతో తరచూ గొడవపడుతూ తాను మద్యం సేవించి వచ్చి మరింత తీవ్రస్థాయిలో భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వరకు పనిచేసుకుని వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ తన భార్యకు రూ. 1000 డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులో రూ. 500 దాచిపెట్టి, రూ.300 తన భర్తకు మద్యం సేవించేందుకు ఇచ్చింది. రూ. 200 కూరగాయలను తీసుకుని వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తనకు మద్యం సేవించడానికి ఇంకా డబ్బులు కావాలంటూ భార్య జమీలతో భర్త వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో భార్య జమీల ఈనెల అద్దె డబ్బులను కట్టాలని, అదే కట్టకుండా డబ్బులను మద్యానికి ఇవ్వమని అంటున్నావా? అనీ అరిచింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తాను ఉపయోగించే ఎలక్రిషన్ కిట్‌లో ఉన్న సుత్తిని తీసుకుని ఆవేశంతో ఊగిపోతూ భార్య తలపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ దెబ్బలకు రక్తపుమడుగులో అక్కడికక్కడే జమీల కుప్పకూలిపోయింది. తన తండ్రి తల్లిని సుత్తితో బాదిన విషయాన్ని గమనించిన పెద్దకుమార్తె షాహిదాఖానమ్ భయంతో తన బంధువుల ఇంటికి పరుగుతీసింది. వారికి చెప్పగానే జమీల బావ, అన్నదమ్ములు పరుగెత్తుకుంటూ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు స్థానిక ప్రజల సాయంతో జమీలను ఆటోలో రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ డాక్టర్లు ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కలా విచారించారు. తమ తల్లి దారుణంగా హత్యకు గురి కావడం, తన తండ్రే హత్య చేయడంతో ముగ్గురు పిల్లలు అనాథ«లుగా మారారు. వారి భవిష్యత్తు ఎలా వుంటుందోననీ స్థానికులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటనతో ఐదుగురు జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు! -
బుల్లెట్ నడిపాడని.. చేతులు నరికేశారు!
సాక్షి, చెన్నై : వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన ఓ యువకుడు తమ కళ్ల ముందు బుల్లెట్ నడపడాన్ని చూసి ఆగ్రహంతో అగ్రవర్గాలు అతడి చేతులను నరికేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మానామదురై సమీపంలో గురువారం జరిగింది. వివరాలు..మేళపాలయంకు చెందిన రామన్, చెల్లమ్మ దంపతుల కుమారుడు అయ్యాస్వామి శివగంగైలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మరణంతో చిన్నాన్న భూమినాథన్ సంరక్షణలో అయ్యా స్వామి ఉన్నాడు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినప్పటికీ భూమినాథన్ కాస్త స్తోమత కలిగిన వ్యక్తి. దీంతో చిన్నాన్న బుల్లెట్లో అయ్యాస్వామి కళాశాలకు తరచూ వెళ్లి వచ్చేవాడు.తమ కళ్ల ముందు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన యువకుడైన అయ్యాస్వామి బుల్లెట్లో గ్రామంలో తిరుగుతుండటాన్ని చూసి అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఆగ్రహంతో ఊగి పోయారు. గురువారం ఉదయం కళాశాలకు బుల్లెట్‌పై వెళ్తున్న అయ్యాస్వామిని అడ్డుకుని అగ్రవర్ణ యువకులు కత్తులతో చేతులను నరికేశారు. వీరి వద్ద నుంచి తప్పించుకుని అయ్యాస్వామి చిన్నాన్న భూమినాథన్ వద్దకు పరుగులు తీశాడు. తక్షణం అయ్యాస్వామిని శివగంగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు తెగిన భాగానికి కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో ఆ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వల్లరసు, వినోద్, ఈశ్వరన్‌లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
భార్యను కాల్చి చంపిన భర్త
సేలం: తెన్కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది. పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్‌కు చెందిన జాన్‌కిల్‌బర్ట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్‌కిల్‌బర్ట్ అదే ప్రాంతానికి చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్‌కిల్‌బర్డ్ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్‌కిల్‌బర్డ్ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్‌కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్కిల్బర్డ్తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్‌కు తరలించారు. -
విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!
సాక్షి, విశాఖ: విశాఖలో భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక వివాహిత వసంత ఆత్మహత్యకు పాల్పడింది. నీలి చిత్రాలు చూపిస్తూ.. అందులో చేసినట్లు చేయాలని భర్త వేధించడమే దీనికి కారణమని తేలింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం, నాగేంద్ర ఫోన్లో గూగుల్ హిస్టరీ చూసి పోలీసులే షాక్ అయినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు, వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.ఇక, ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నాగేంద్రను రిమాండ్‌కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. గూగుల్ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సెర్చ్ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.మరోవైపు.. నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
కీచక ఐపీఎస్: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు
సాక్షి, చెన్నై: చెన్నై ట్రాఫిక్ విభాగంలో ఐపీఎస్ అధికారి కీచకుడయ్యాడు. మహిళా పోలీసును లైంగికంగా వేధించడంతో ఆమె డీజీపీ శంకర్ జివ్వాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీఎస్‌ను సస్పెండ్ చేశారు. విశాఖ కమిటీ విచారణకు ఆదేశించారు. గతంలో మహిళా ఐపీఎస్‌కు డీజీపీ స్థాయి అధికారి ఒకరు వేధింపులు ఇవ్వడం, ఐజీ స్థాయి అధికారి తన సహచర అధికారిణికి వేధింపులు ఇవ్వడం వంటి ఘటనలు తమిళనాట పోలీసు యంత్రాంగంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక చోట కింది స్థాయి అధికారులపై వేధింపుల పిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో గురువారం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు ఒకరు డీజీపీ శంకర్ జివ్వాల్ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కొంటున్న వేదింపు గురించి ఆయనకు వివరించారు. చెన్నై కమిషరేట్‌లో ఏడవ అంతస్తులో›ట్రాఫిక్ జాయింట్ కమిషననర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి డి. మహేశ్‌కుమార్ ఈ వేదింపులకు గురి చేసినట్టు ఫిర్యాదు చేయడం తక్షణం, విచారణ జరగడం జరిగింది. విచారణలో ఆయనపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో తక్షణం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసును డీజీపీ సీమా అగర్వాల్, ఐపీఎస్ అధికారిణులతో కూడిన విశాఖ కమిటికి అప్పగించారు. ఈ కమిటీ తన విచారణపై దృష్టి పెట్టింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మహేశ్కుమార్పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. -
పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్ సీల్ చేసిన కలెక్టర్
కడలూరు: పుదుచ్చేరిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలకు దిగారు. పుదుచ్చేరి-కడలూరు రోడ్డుపైకి నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. తలవకుప్పంలో ఓ బాలికను ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధితురాలు స్కూల్‌కు వెళ్లేందుకు భయంతో వణికిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకున్నారు. టీచర్‌ను చితకబాదారు. పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.#JUSTIN ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் பொதுமக்கள் தர்ம அடி கொடுத்து போலீசில் ஒப்படைத்தனர்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/3viBaLMA2j— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025అంతటితో ఆగకుండా.. పుదుచ్చేరి-కడలూరు రోడ్డును నిరసనకారులు బ్లాక్ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో, పోలీసుల తీరుపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసనలను మరింత ఉధృతం చేశారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల ట్రాఫిక్ స్థంభించిపోయింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నిరసనలు తెలిపారు. #JUSTIN புதுச்சேரியில் ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை பள்ளியை அடித்து நொறுக்கிய போராட்டக்காரர்கள்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/yMVcvBXOKP— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం, కలెక్టర్ కులోత్తుంగన్, సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా పాఠశాలను సీల్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో పాఠశాలలో శనివారం జరగాల్సిన పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.புதுச்சேரியில் தவளக்குப்பம் அருகே, தனியார் பள்ளியில் மாணவிக்கு பாலியல் தொல்லை.மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் மீது வழக்கு பதியவில்லை என பெற்றோர் குற்றச்சாட்டு. @LGov_Puducherry pic.twitter.com/Zx9FHqQVqJ— Dhivya Marunthiah (@DhivCM) February 14, 2025 -
యాసిడ్ దాడి నిందితుడు గణేష్ ఎక్కడ?
అన్నమయ్య, సాక్షి: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో నాశనం చేయాలని చూసిన నిందితుడు గణేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు!. నేరం జరిగిన కాసేపటికే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. ఆ వెంటనే మాట మార్చేశారు. దీంతో.. ఈ కేసులో పోలీసుల అలసత్వంతో పాటు, రాజకీయ నేతల జోక్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి.మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల ముచ్చుమర్రి బాలిక కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. వీటికి తోడు ఉన్మాద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.తాజాగా.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లెలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై.. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించగా.. నిందితుడు అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్‌గా పోలీసులు ప్రకటించారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోపే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. తర్వాత అతని జాడ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు.. అతను పరారీలో ఉన్నాడని, గాలింపు కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో బాధితురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా.. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు ప్రధాన అనుచరుడు. అంతేకాదు.. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా సన్నిహితుడే. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నా.. ఇంత వరకు కేసులో ఎలాంటి పురోగతి చోటు చేసుకోలేదు. ఉన్మాది దాడి ఇలా..యువతి డిగ్రీ వరకు చదువుకుని మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో కొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. -
Hyderabad: ఆ ఇద్దరూ అమన్, అలోక్!
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు బీహార్‌లోని వైశాలీ జిల్లా, ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్‌గా తేలింది. వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. ఈ మేరకు లుక్ ఔట్ నోటీసులు రూపొందించి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు పంపారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం నలుగురు ఉండే వారని, 2023లో ఉత్తరప్రదేశ్‌లో ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు బీదర్ అధికారులు చెబుతున్నారు. మీర్జాపూర్‌లోనూ ఓ గార్డు హత్యఈ గ్యాంగ్ బైక్‌లపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకుంటోంది. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠాలో అమన్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్ని సభ్యులుగా ఉండేవారు. వీళ్లు 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో పంజా విసిరారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. పట్టపగలు, నడిరోడ్డుపై సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంకు పెట్టెతో ఉడాయించారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా ఓ స్పెషల్ టాస్‌్కఫోర్స్ (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ గ్యాంగ్‌లో ఒక్కొక్కరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించింది. ఎస్టీఎఫ్కు ఇద్దరు మాత్రమే చిక్కారు ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 30 మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ ఎస్టీఎఫ్ దాదాపు ఏడాది పాటు దేశ వ్యాప్తంగా గాలించింది. ఎట్టకేలకు గత ఏడాదిసెపె్టంబర్లో చందన్ కుమార్‌ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలీలో పట్టుకుంది. అప్పట్లో అమన్, అలోక్‌లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వేట ము మ్మరం చేయగా... ఇరువురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై బీహార్‌లోనూ ఈ ద్వయం పలు నేరాలు చేసినట్లు తేలింది. చివరకు గత నెల 16న బీదర్‌లో పంజా విసిరింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటేష్‌ను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. రివార్డు ప్రకటించిన కర్ణాటక పోలీసులుఅఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌పై కాల్పులు జరపడం, పారిపోవడం జరిగిపోయాయి. ఈ హత్యాయత్నం ఘటనపై అఫ్జల్‌గంజ్ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చెన్నై వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం కష్టసాధ్యంగా మారింది. దీంతో వీరిపై కర్ణాటక పోలీసులు రూ.5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల్లో దుండగుల ఫొటోలను జత చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు కలబురిగి డీఐజీ (9480800030) లేదా బీదర్ ఎస్పీ (9480803401) లేదా బీదర్ డీఎస్పీలకు (9480803420) సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచారం ఇచి్చన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ రహదారిపై బొలేరో వాహనం బస్సును ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. వీరంతా మహాకుంభామేళకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్(Prayagraj) జాతీయ రహదారిపై మహా కుంభమేళా(Maha KumbhaMela)కు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడినట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులని తెలిపారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. VIDEO | At least 10 people have been killed and several injured in a head-on collision between a car and a bus in Prayagraj. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/06t5TkNd4m— Press Trust of India (@PTI_News) February 15, 2025 -
Mastan Sai Case: 44 మంది యువతులు, 250కి పైగా వీడియోలు
మణికొండ: నగ్న వీడియోలు, బ్లాక్‌మెయిలింగ్, డ్రగ్స్, అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. రెండో రోజు శుక్రవారం క్రైం పోలీసులతో పాటు సైబరాబాద్ నార్కొటిక్స్ విభాగం సైబరాబాద్ ఇన్చార్జి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అతడిని విచారించారు. ఈ సందర్భంగా మస్తాన్‌సాయిని డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తావు, ఎంత మందికి ఇచ్చావు, డ్రగ్స్ అలవాటు చేసిన యువతులపై ఎందుకు అత్యాచారం చేశావని, అలా ఎంత మందిని చేశావు, నగ్న వీడియోలను తీయాల్సిన అవసరం ఏమిటని, లావణ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నావని ప్రశ్నించినట్లు తెలిసింది. తన హార్డ్ డిస్క్‌లో లావణ్య ఆరోపించినట్లు వేల సంఖ్యలో వీడియోలు లేవని, తన భార్యతో పాటు ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్వి మాత్రమే ఉన్నాయని మరోసారి బుకాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దాంతో హార్డ్డెస్్కను అతడి ముందే ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో ఒక్కో యువతికి సంబంధించి ఒక్కో ఫోల్డర్ రూపంలో వాట్సాప్ చాట్స్, ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్‌లను భద్రపర్చినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్డిస్్కలో 44 మంది యువతులకు సంబందించి 250కి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. తన విల్లాలోని బెడ్రూంలో సీక్రెట్‌గా ఏర్పాటు చేసిన ఐదు కెమెరాలతో వీటిని తీసినట్లు విచారణలో మస్తాన్‌సాయి అంగీకరించినట్టు సమాచారం. లావణ్య ఇంట్లోనూ తీసిన వీడియోలు, చాట్ డాటా అతడి సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. తన మిత్రుడు వినీత్‌రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసే వాడని, పార్టీలు ఉన్నపుడు అతడి వద్ద కొనుగోలు చేసే వాడినని మస్తాన్‌సాయి వెల్లడించినట్లు సమాచారం. దీంతో వినీత్‌రెడ్డిని అరెస్టు చేసి, మరోమారు విచారించాలని నార్కోటిక్స్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. రెండో రోజు విచారణలో మస్తాన్‌సాయి యువతులను డ్రగ్స్ పార్టీల ద్వారా మచి్చక చేసుకుని వారిని లైంగికంగా వాడుకున్నానని అంగీకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం వరకు పోలీసులు అతడి మరింత లోతుగా విచారించనున్నారు. అప్పటికీ తమకు రావాల్సిన సమాచారం రాకపోతే శనివారం మరో సారి కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య -
యాసిడ్ తాగించి.. కత్తితో పొడిచి!
గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్‌తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.వేధింపులతో ఉద్యోగం మానేసి..ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరువాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ (24) ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌తో ఈనెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పొలం నుంచి పరుగులు తీస్తూ..బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతినిత్యం మహిళలపై దాడులు..యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
భర్త వికృత చేష్టలు.. విశాఖలో నవ వధువు..
సాక్షి, విశాఖ జిల్లా: గోపాలపట్నంలో నవ వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. అశ్లీల వీడియోలకు బానిసగా మారిన భర్త నాగేంద్ర.. వికృత ప్రవర్తనకు భార్య బలైంది. భర్త చేష్టలు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నాగేంద్ర సైకోలాగా మారి లైంగికంగా వేధించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.మితిమీరిన కోరికలు, శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర వేధించేవాడు. నాగేంద్రలో కామం వికృత రూపం దాల్చడంతో టార్చర్‌ను భార్య భరించలేకపోయింది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా కానీ మార్పు రాలేదు. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్ద కూడా బాధితురాలు వాపోయింది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరికి ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా తమకు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు అన్నారు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. -
కేడీల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా (Rohit Kedia) ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోగా... అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు 20 గంటల్లో వారిని పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరు గతేడాది దోమలగూడ పోలీసుస్టేషన్ (Domalguda Police Station) పరిధిలో స్నేహలత దేవిని చంపి, రూ.కోటి విలువైన సొత్తు దోపిడీకి పాల్పడిన కేసులో వాంటెడ్‌గా ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. తూర్పు మండల డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, జె.నర్సయ్యలతో కలిసి గురువారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు. కుమార్తె పెళ్లి పనుల కోసం.. రాజేంద్రనగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ నిర్వహిస్తున్న రోహిత్ కేడియా హిమాయత్ నగర్లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం వద్ద దాదాపు 20 మంది పనివాళ్లు ఉన్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉండే వీరి ఇంటి ప్రాంగణంలోనే పనివాళ్ల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బిరోల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పని చేసి ఏడాది క్రితం మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో పాటు దుబాయ్‌లో డెస్టిషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల కోసం సహాయంగా ఉండటానికి సుశీల్‌ను సంప్రదించిన రోహిత్ 15 రోజుల క్రితం పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి ఇతడితో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. నేరగాడితో గతంలో ఉన్న పరిచయంతో.. సుశీల్‌తో పాటు బసంతి సైతం మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ ఫ్యామిలీ మొత్తం గత వారం దుబాయ్ వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సుశీల్.. ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను నగరానికి పిలిపించాడు. గత ఏడాది దోమలగూడ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్య చేసిన బిహారీలు రూ.కోటి సొత్తు దోచుకుపోయారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేసే మహేష్ ముఖియాతో పాటు మోల్హు, రాహుల్ నిందితులుగా ఉన్నారు. దోపిడీ జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మిగిలిన ఇద్దరూ పరారీలోనే ఉండిపోయారు. మోల్హు నేర చరిత్ర తెలిసిన సుశీల్ తాజా నేరం కోసం ఢిల్లీ తలదాచుకున్న అతడిని పిలిపించాడు. వీరిద్దరూ కలిసి మంగళవారం తెల్లవారుజామున సర్వెంట్స్ బిల్డింగ్ నుంచి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాలతో కూడిన ఆభరణాలు, 1.4 కేజీల స్వర్ణాభరణాలు, రూ.19.63 లక్షలు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి అపహరించారు.మూడు నగరాలకు ప్రత్యేక బృందాలు... మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని రోహిత్ మేనేజర్ అభయ్ కేడియా గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును ఛేదించడానికి నారాయణగూడ పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులు ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారని, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని గుర్తించారు.చదవండి: సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ దీంతో మూడు ప్రత్యేక బృందాలు భోపాల్, నాగ్‌పూర్, పట్నాలకు వెళ్లి కాపుకాశాయి. డీసీపీ బాలస్వామి మహారాష్ట్ర పోలీసులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఈ నిందితుల సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నగర పోలీసులు, అక్కడి జీఆర్పీ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు మొత్తం స్వాదీనం చేసుకుని నగరానికి తీసుకువచ్చారు.ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాంరోహిత్ కేడియా ఇంటి నుంచి చోరీ అయిన సొత్తులో వజ్రాలే 3,300 క్యారెట్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక్కో క్యారెట్ రూ.1.12 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూస్తే వీటి విలువే రూ.37 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. సొత్తు మొత్తం రికవరీ చేసి వీడియో కాల్ ద్వారా దుబాయ్‌లో ఉన్న యజమానికి చూపించి ఖరారు చేసుకున్నాం. భారీ సొత్తు చోరీ, రికవరీపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. నగదు, సొత్తును యజమాని వారి వద్ద డిక్లేర్ చేశారా? లేదా? అనేది ఆ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు.. యూట్యూబ్‌లో వీడియో చూసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. అనుమానం రాకుండా భూ తగాదాలో ప్రత్యర్థులు హతమార్చినట్లు డ్రామాలాడాడు. పోలీసుల విచారణతో మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 8వ తేదీన మైలవరం మండలం మెర్సుపల్లి వద్ద వక్తి మృతదేహం లభ్యం కాగా, మృతుడు ములకలపెం గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు.వ్యవసనాలకు బానిసై తండ్రి శ్రీనివాసరావును హతమార్చిన కొడుకు పుల్లారావు.. పేకాట, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లలో డబ్బు పోగొట్టుకున్నాడు. గతంలో పుల్లారావు చేసిన నాలుగు లక్షల అప్పును తండ్రి శ్రీనివాసరావు తీర్చాడు. వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన కొడుకు పుల్లారావును పలుమార్లు తండ్రి మందలించాడు. దీంతో తండ్రిని చంపేందుకు పుల్లారావు స్కెచ్ వేశాడు.యూట్యూబ్‌లో సీరియల్ కిల్లర్ మర్డర్ వీడియోలు చూసిన పుల్లారావు.. ఒకే దెబ్బతో ఎలా మనిషి ప్రాణం తీయొచ్చు అని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. పథకం ప్రకారం ఈనెల 8వ తేదీన పొలంలో ఉన్న తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయంటూ డ్రామాకు తెరతీసిన మృతుడి కుమారుడు పుల్లారావు.. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిపి నిరసనలు చేపట్టాడు. పోలీసుల విచారణలో పుల్లారావే హంతకుడని నిర్థారణ కావడంతో నిందితుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. -
అన్నమయ్య జిల్లా: వాలెంటైన్స్ డే రోజున ప్రేమోన్మాది యాసిడ్ దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజున అమానుష ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. రాబోయే ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. అనంతరం, ఈరోజు దాడికి పాల్పడ్డారు.గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇక, నిందితుడిని మదనపల్లె అమ్మచెరువుమిట్టకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి వద్దకు జడ్జీ వెళ్లి బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
AP: ఒంటరి మహిళపై వేధింపులు.. సీఐ సస్పెండ్
సాక్షి, శ్రీ సత్యసాయి: పోలీసు స్టేషన్లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.జరిగింది ఇది..బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మడకశిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయత్రి శనివారం ఎస్పీ రత్నను కలిసి పోలీసు స్టేషన్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.అనంతరం పోలీస్ కార్యాలయం ఎదుట బాధితురాలు గాయత్రి మీడియాతో గోడు వెళ్లబోసుకొంది. టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిందని చెప్పింది. వారికి సర్ది చెప్పాలని తాము కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లామంది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వచ్చి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు చెప్పింది.అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని వివరించింది.వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింది. విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయబ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో, ఉన్నతాధికారులు తాజాగా సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సీఐ రామయ్యపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. -
వ్యాధులు నయం చేస్తామని మోసాలు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీలో రాళ్లు కరిగిస్తామని, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గించే మందులిస్తామని తప్పుడు ప్రకటనలిస్తూ.. నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న క్లినిక్‌ల్లో సోదాలు నిర్వహించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.దుండిగల్, గండిమైసమ్మతోపాటు హనుమకొండ పట్టణాల్లో బుధవారం జరిపిన సోదాల్లో రెండు నకిలీ క్లినిక్‌లను గుర్తించినట్టు తెలిపారు. ఈ సోదాల్లో స్టోన్నిల్ డీఎస్ సిరప్లు, మహాసుదర్శన్ కాదా.. అనే రెండు రకాల సిరప్‌లను స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులపై డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అబ్జక్షనబుల్ అడ్వరై్టజ్‌మెంట్) యాక్ట్ 1954 ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.88.58 లక్షల కోట్లు కొల్లగొట్టడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. గ్లోబల్ యాంటీ స్కామ్స్ అలయన్స్ (గాసా) నివేదిక సైబర్ నేరాల బాధితులపై సర్వే చేసింది.నివేదికలోని ప్రధాన అంశాలు..⇒ ఆసియా దేశాల్లో రూ.6.88 లక్షల కోట్లు కొల్లగొట్టారు. ⇒ ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది సైబర్ నేరాల బారినపడ్డారు. ⇒ 74శాతం మంది బాధితులు వారి తప్పిదం, అవగాహన రాహిత్యంతోనే సైబర్ నేరాల బారిన పడుతున్నారు.⇒ 67శాతం మంది బాధితులు తమకు వచ్చిన లింకులు సైబర్ నేరాలకు సంబంధించినవని సందేహిస్తూనే క్లిక్ చేస్తూ మోసపోతున్నారు.⇒ 70శాతం మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే లేదు.⇒ 25 శాతం మంది తమ బ్యాంకు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.⇒ సైబర్ నేరాల్లో 28శాతం ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్, బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారానే సాగుతున్నాయి.⇒ 36శాతం సైబర్ నేరాలకు ఈ–వాలెట్ విధానాన్ని వాడుకుంటున్నారు. ⇒ ఫిర్యాదు చేస్తున్న వారిలో కేవలం 4శాతం మంది బాధితులే తాము కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందుతున్నారు. ⇒ కేవలం 0.05శాతం మంది సైబర్ నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ⇒ ఆన్లైన్ మోసాలను ముందుగా గుర్తించడంలో చైనీయులు మొదటిస్థానంలో ఉండగా భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. ⇒ అత్యధికంగా సైబర్ నేరాల బాధిత దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. ⇒ అమెరికా, డెన్మార్క్, స్లోవేకియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ⇒ భారత్‌లోని సైబర్ బాధితులు సగటున రూ.35వేలు కోల్పోయారు. -
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటా: లావణ్య
సాక్షి, హైదరాబాద్: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.ఈ క్రమంలో లావణ్య.. ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని ఆమె తెలిపారు. ‘‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలి’’ అని లావణ్య కోరారు.‘‘యువతులు వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలి. నేను రాజ్ తరుణ్ కోసం ఒంటరి పోరాటం చేశాను. నేను సహాయం కోసం మాత్రమే కొందరితో పర్సనల్ గా మాట్లాడాను. నేను నా కేసులో ఏమవుతుందో తెలుసుకోవడం కోసమే వేరే వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడాను. రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చిన కాళ్ళు మొక్కుతాను. నేను మస్తాన్ సాయి నుంచి బయటపడితే చాలు’’ అంటూ లావణ్య వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్.. సంచలన విషయాలు వెల్లడి -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. డంబెల్స్ వేలాడదీసి
తిరువనంతపురం : ‘అరె తమ్ముళ్లు మందేయాలి. డబ్బులు ఇవ్వండ్రా అని సీనియర్ విద్యార్థులు.. తమ జూనియర్ విద్యార్థులకు హుకుం జారీ చేశారు. దీంతో జూనియర్లు చేసేది లేక కొన్ని వారాల పాటు ప్రతి ఆదివారం సీనియర్లకు డబ్బులు ఇచ్చే వారు. ఈ తరుణంలో ఓ ఆదివారం ఎప్పటిలాగే జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సీనియర్లు ప్రయత్నించారు. దీంతో జూనియర్లు మీకు ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు అన్నా’అని సమాధానం ఇచ్చారు. అంతే కోపోద్రికులైన సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను అత్యంత కిరాతంగా ర్యాగింగ్ (Ragging) చేశారు. చివరికి..కేరళ పోలీసులు వివరాల మేరకు.. కేరళ (kerala) రాజధాని తిరువనంతపురంకు చెందిన ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలో ప్రభుత్వ కాలేజీలో (kottayam government narsing college) నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే, గతేడాది నవంబర్‌లో మూడో సంవత్సరం నర్సింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఈ ముగ్గురు విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేశారు.ఆ ర్యాగింగ్ ఎలా ఉందంటే? బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడం. వాటిపై కారం పూయడం. మంటకు విలవిల్లాడుతుంటే వీడియోలు తీసి పైశాచికానందం పొందడం. గాయాల్ని కంపాస్‌తో కొలవడం. అంతర్గత అవయవాలకు డంబెల్స్‌ను వేలాడదీయడం వంటి వికృత చేష్టలకు దిగారు. తాము ర్యాగింగ్ చేస్తున్నామని ఫిర్యాదు చేస్తే మీకు చదువును దూరం చేస్తామని బాధిత విద్యార్థుల్ని బెదిరింపులకు దిగారు. అలా నాలుగు నెలల పాటు సీనియర్ల వేధింపులను మౌనంగా భరించారు.ఈ నేపథ్యంలో ఓ బాధిత విద్యార్థి ధైర్యం చేసి కాలేజీలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో విద్యార్థుల్ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.👉చదవండి : నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి!