Bankers
-
వేల కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు, కానీ.. : సుప్రీం కోర్టు
‘‘ఏ సంస్థను మేం ఇక్కడ నిందించడం లేదు. అలాగే వాటి పని తీరును మేం తప్పుబట్టడం లేదు. దేశంలో వేల మంది కన్నీళ్లు పెడుతున్నారు. అంతమంది కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు. కానీ, వాళ్ల సమస్యలను మేం ప్రస్తావిస్తాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తాం. ఇది మాత్రం స్పష్టం’’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ: బ్యాంకులకు, బిల్డర్లు.. డెవలపర్లు మధ్య నలిగిపోతూ ఏళ్ల తరబడి సొంతింటి కల కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్లను ఒక్కటిగా విచారణ జరిపిన జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. బిల్డర్లు, డెవలపర్లు తమ చేతికి ఇంటి తాళాలు ఇవ్వకపోయినా.. ఇంకోవైపు నుంచి బ్యాంకులు ఈఎంలు కట్టాలని వేధిస్తున్నాయని పలువురు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో హోంబయ్యర్లను లోన్లకు మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారని.. ఒకవేళ బయ్యర్లు గనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బ్యాంకులు వాళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కాలపరిమితితో కూడిన సీబీఐ దర్యాప్తునకు కచ్చితంగా ఆదేశిస్తామని తెలిపింది. అలాగే.. ఈ పనిని ఎలా చేపట్టాలనే దానిపై ఒక ప్రణాళికను దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను కోరింది. ఈ క్రమంలో ఫైనాన్షియర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీపై జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. సైట్లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు. అయినా కూడా 60 శాతం పేమెంట్ చేసేశారు. సైట్లో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఇలా ఏలా చేశారు? అని ప్రశ్నించారు. ఇది ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశమని, అవసరమైతే మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తామని, సహాయం కోసం అమీకస్ క్యూరీని నియమించుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపురి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సాధారణంగా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడే అమీకస్ క్యూరీని కోర్టు నియమించుకుంటుంది.ఇదిలా ఉంటే.. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని హోంబయ్యర్లకు కిందటి ఏడాది జులైలో తన ఆదేశాల ద్వారా భారీ ఊరట ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంటి తాళాలు అందుకోని యాజమానులపై ఈఎంఐ రికవరీ సహా బలవంతపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఆ దేశాల ఆచరణకు నోచుకోవడం లేదు. పైగా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. -
లోన్ కట్టలేదని ఇంటికి వచ్చిన బ్యాంకు వాళ్లు ఏం చేశారో తెలుసా?
-
హైడ్రాను చూసి బ్యాంకర్లు భయపడొద్దు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాను చూసి భయపడొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు ధైర్యం నింపారు. హైడ్రా గురించి ఆందోళన అవసరం లేదని, హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవ మర్యాదలతో జీవించేందుకు దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్ నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు 9 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని, బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే సూక్ష్మ, మధ్యతర పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, పురపాలక సంచాలకులు, కమిషనర్ శ్రీదేవి పాల్గొన్నారు. ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణ: సామాన్య ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బుధవారం ప్రజాభవన్‌లో ఆదాయ వనరుల సమీ కరణపై వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు రిజి్రస్టేషన్లు, మైనింగ్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారు లతో భట్టి భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా శాఖల వారీగా సాధించిన పురోగతి వివరాలు, ఆదాయ సమీకరణ కోసం రూపొందించిన ప్రణాళి కలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. భట్టి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే పన్ను ఎగవేతదారులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుకుమార్ సుల్తానియా, రెవెన్యూ, వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, భూగర్భ గనుల శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ పాల్గొన్నారు. -
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: పంటరుణాలకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నామని, ఒక సొసైటీ పరిధిలో ఒకే రోజు ఐదువందల మందికి రుణాలు ఇచ్చినట్లు సమాచారం వచి్చందని, ఇదే తరహాలో 7 బ్యాంకులు సమాచారం ఇచ్చాయన్నారు.వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రుణ మంజూరుకు కారణాలను పరిశీలించి నిర్ధారించుకుంటామన్నారు. తప్పుడు సమాచా రం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.రుణమాఫీకి 25 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తా యని ప్రాథమికంగా భావించామని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకుల ద్వారా రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు ఉందన్నారు. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఈ కా ర్డు లేని వారిని పాస్‌బుక్ ఆధారంగా గుర్తిస్తామన్నారు.రుణమాఫీ చేయకుంటే ఉరితీయండి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంటరుణ మాఫీ చారిత్రక నిర్ణయమని తుమ్మల చెప్పారు. అన్నదాతకు లబ్ధి చేకూరే ఈ పథకంపై రాజకీయ నేతలు తప్పుగా మాట్లాడొద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ పంటరుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏవైనా అనుమానాలు ఉంటే రైతు వేదికల వద్ద వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఇంకా నాలుగున్నరేళ్లపాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని, రుణమాఫీ చేయకుంటే తమను ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రూ.లక్షలోపు రుణమాఫీ చేశామని, త్వరలో రూ.1.5 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ.1.50 లక్షలు, రూ.2 లక్షల రుణమాఫీ లబి్ధదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చెప్పలేమని, నిధులు విడుదల సమయంలో వెల్లడిస్తామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ జరుగుతుందని, ఇప్పటివరకు చేసిన రూ.లక్ష లోపు మాఫీ ద్వారా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత కలెక్టరేట్లో లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చన్నారు. -
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో బుధవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు.రుణాలు, డిపాజిట్ వృద్ధికి మధ్య అంతరం, లిక్విడిటీ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు వంటి అనేక అంశాలు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం, సరిహద్దు లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచడం, ఆర్బీఐ ఆవిష్కరణ కార్యక్రమాలలో బ్యాంకుల భాగస్వామ్యం గురించి కూడా చర్చించారు.తమ పరిధిలోకి వచ్చే బ్యాంకులు, సంస్థల సీనియర్ మేనేజ్మెంట్తో తరచూ ఆర్బీఐ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజా సమావేశం జరిగింది. ఇంతకుముందు భేటీ ఫిబ్రవరి 14న జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్‌తోపాటు, డిప్యూటీ గవర్నర్లు ఎం. రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పొదుపు మహిళే బ్యాంకర్! సంఘాలే బ్యాంకులు
పేదింటి మహిళలు పది మంది చొప్పున కలిసి స్వయం సహాయక పొదుపు సంఘాలుగా ఏర్పడటం మననందరికీ తెలుసు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వ్యాపార, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడమూ తెలిసిందే. అయితే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంఘాలు ఇంకో అడుగు ముందుకు వేశాయి. ప్రతి నెలా పోగేసుకున్న సొమ్ముతో స్వయంగా రుణాలిచ్చే దశకు ఎదిగాయి. తద్వారా అంతర్గత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని సూచిస్తోంది. ఇంత వేగంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినకొండ గ్రామంలో 18–19 ఏళ్ల క్రితం తొమ్మిది మంది మహిళలతో రాజరాజేశ్వరి స్వయం సహాయక పొదుపు సంఘం ఏర్పాటైంది. మొదట్లో ఒక్కొక్కరు నెలకు రూ.50 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి నెలా రూ.500 చొప్పున దాచుకుంటున్నారు. ఇలా జమ చేసుకున్న సొమ్ము రూ.ఆరున్నర లక్షలకు చేరుకుంది. ఈ డబ్బులను అవసరమైన వారికి నామమాత్రపు వడ్డీకి అప్పుగా ఇవ్వాలని ఈ సంఘం సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సంఘంలో సభ్యులైన నలుగురు మహిళలు ఆరు నెలల క్రితం రూపాయిలోపు వడ్డీతో రూ.ఆరు లక్షలు రుణంగా తీసుకున్నారు. అప్పటి వరకు ఈ సొమ్ము పావలా వడ్డీ కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాకే పరిమితమై ఉండింది. ఈ సంఘం నిర్ణయం వల్ల ఇప్పుడు రూపాయి లోపు వడ్డీ వస్తోంది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తం తిరిగి సంఘ నిధికే జమ అవుతుంది. సంఘం ఉమ్మడి నిధిలో జమ అయ్యే ఈ సొమ్ములో సభ్యులందరికీ వాటా ఉండటం వల్ల అప్పు తీసుకున్న సభ్యులకు మరింత ఉపశమనం కలుగుతోంది. ఈ విధానం వల్ల అందరం సంతోషంగా ఉన్నామని ఈ సంఘం లీడర్ సీహెచ్ లక్ష్మీకాంతం తెలిపారు. పి.అరుణ అనే సంఘ సభ్యురాలికి ప్రభుత్వం ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి సైతం ఆర్థిక సహాయం మంజూరు చేయగా, అనుకున్న విధంగా ఇల్లు అందంగా కట్టుకునేందుకు అదనంగా రూ.1.65 లక్షలు సంఘమే ఆమెకు అప్పుగా ఇచ్చిందని చెప్పారు. ఇంకొక సభ్యురాలికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.65 లక్షలు, మరొకరికి కొత్త వ్యాపార దుకాణం ఏర్పాటుకు రూ.రెండు లక్షలు, ఇంకొకరికి కుటుంబ అవసరాల కోసం రూ.70 వేల రుణం అందజేశామని ఆమె వివరించారు. సంఘ సభ్యులలో ఎవ్వరికీ డబ్బులు అవసరం లేని పక్షంలో తమ చుట్టపక్కల ఉండే తెలిసిన వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇదే గ్రామంలోని కల్యాణ స్వయం సహాయక సంఘం సైతం ఇదే రీతిలో ఆర్థిక లావాదేవీలు సాగిస్తోంది. ఈ సంఘం వద్ద రూ.ఏడు లక్షల పొదుపు నిధి ఉండగా.. ఐదు నెలల క్రితం ఇద్దరికి, ఈ నెలలో మరో ఇద్దరు తమ సంఘ సభ్యులకే మొత్తం రూ.నాలుగు లక్షలు రుణంగా ఇచ్చామని సంఘం లీడర్ పద్మావతి తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పొదుపు సంఘాలు మినీ బ్యాంకుల తరహాలో లావాదేవీలు సాగిస్తుండటం విశేషం. అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పేదింటి మహిళల్లో ఆర్థిక భద్రత తొణికిసలాడుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న పొదుపు సంఘాలు ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.రెండు మూడు లక్షల చొప్పున అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఒకపక్క ఈ సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరోపక్క వేరుగా పెద్ద మొత్తంలో అంతర్గత రుణ వ్యవస్థను పెంపొందించుకున్నాయి. ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహంతో ఏడాదిన్నరగా అంతర్గతంగా మినీ బ్యాంకుల తరహా రుణ లావాదేవీలు సాగిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామమని ఆర్థిక రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 8,45,374 స్వయం సహాయక పొదుపు సంఘాలు ఉండగా.. కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 4.39 లక్షల సంఘాలు తమ సంఘ పొదుపు నిధి నుంచి రూ.866 కోట్లు అంతర్గతంగా రుణాలు ఇచ్చాయి. ఆగస్టులో 1,55,778 పొదుపు సంఘాలు రూ.297 కోట్లు, సెప్టెంబర్‌లో 1,21,672 సంఘాలు రూ.204 కోట్లు, అక్టోబర్‌లో 1,62,259 సంఘాలు రూ.365 కోట్లు రుణంగా ఇచ్చాయి. 3 నెలల్లో రూ.1,241 కోట్లు వసూలు మరోవైపు.. స్వయం సహాయక పొదుపు సంఘాలు అంతర్గత రుణాల రూపంలో ఇచ్చే రుణాలను నెల వారీ కిస్తీ రూపంలో లేదా ఒకే విడత చెల్లింపునకు వీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలు గతంలో అంతర్గత రుణాల రూపంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి గత మూడు నెలల్లో ఏకంగా రూ.1,241 కోట్లు (అసలు, వడ్డీ కలిపి) జమ కావడం గమనార్హం. గతంలో సంఘం నుంచి అంతర్గత రుణాలు పొందిన మహిళలు ఆగస్టులో రూ.493 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.386 కోట్లు, అక్టోబర్‌లో రూ.362 కోట్లు చెల్లించారు. మొత్తంగా గత మూడు నెలల్లో బ్యాంకులకు ఏ మాత్రం సంబంధం లేకుండా పేద మహిళలు ఏర్పాటు చేసుకున్న ఆయా పొదుపు సంఘాలలో ఏకంగా రూ.2,107 కోట్ల మేర అంతర్గత రుణ లావాదేవీలు కొనసాగడం ఈ వ్యవస్థలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామం. ఇది మరిన్ని సంస్కరణలకు నాంది అని అధికారులు పేర్కొంటున్నారు. రూ.11,291 కోట్లకు పైగా పొదుపు నిధి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.45 లక్షల స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల పేరిట పొదుపు నిధి రూపంలో ఏకంగా రూ. 11,291 కోట్ల మేర డబ్బులు ఉన్నాయి. ఇప్పటిదాకా పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణ మొత్తంలో నాలుగో వంతుకు పైబడి ఆయా సంఘాల పొదుపు డబ్బులు కేవలం ఆయా సంఘాల సేవింగ్ ఖాతాలలో నిరుపయోగంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు సగటున ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.200 చొప్పున దాచుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఈ మొత్తం ప్రతి నెలా రూ. 110 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఉంటోంది. అక్టోబర్‌లో రూ.126 కోట్లు ఇలా పొదుపు చేశారు. ఇలా దాచుకున్న డబ్బులు కేవలం పావలా వడ్డీ చొప్పున కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఇలా ఉండిపోయిన రూ. 11,291 కోట్ల మొత్తాన్ని రూపాయి దాకా వడ్డీ వచ్చేలా అంతర్గత రుణాలు రూపంలో వినియోగించుకునేలా ప్రభుత్వం మహిళలను ప్రొత్సహిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల్లో కీలక అంశమైన దీనిపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మహిళలు ప్రతి నెలా పొదుపు రూపంలో దాచుకునే డబ్బులతో అంతర్గత రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇవ్వడం వల్ల మొత్తం సంఘాల పొదుపు నిధి భారీగా పెరుగుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయా సంఘాల్లోని మహిళలు రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆదుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంఘాల్లోని సభ్యులు అవసరమైన మేర రుణాలు తీసుకునే స్థాయికి పొదుపు సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశం. పొదుపు నిధిలో 80–90 శాతం వినియోగం పొదుపు సంఘాల మహిళలు నెలనెలా దాచుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో ఉంచుకొని కూడా అవసరాలకు అదే బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ల అవసరాలకు ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని ఎస్ఎల్బీసీ సమావేశాల్లో బ్యాంకర్లకు సూచించారు. ఉదాహరణకు ఒక పొదుపు సంఘం పేరిట రూ.రెండు లక్షల దాకా పొదుపు నిధి ఉండీ కూడా.. ఆ సంఘ సభ్యులు రూ.పది లక్షలు అవసరం ఉంటే రూ.పది లక్షలు అప్పుగా తీసుకునే బదులు, తమ పొదుపు డబ్బుల్లో రూ.లక్షన్నర వినియోగించుకొని, మిగిలిన రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకోవచ్చు. తద్వారా ఆ మహిళలందరికీ ప్రయోజనం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పొదుపు సంఘాల మహిళలు తాము పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులతో మొదట అంతర్గతంగా రుణాలు తీసుకుంటే, మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేలా సెర్ప్ ద్వారా మహిళలను ప్రొత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాం. పొదుపు సంఘాల పేరిట ఉండే మొత్తం పొదుపు నిధి రూ.11,291 కోట్లలో 80–90 శాతం నిధులను సంఘాల అంతర్గత రుణ వ్యవస్థలో వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంపై నిరంతరం జిల్లాలతో సమీక్షిస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
డిజిటల్ లావాదేవీలు, నగదుపై నిఘా, లిమిట్ దాటితే..!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో నగదు సరఫరా, పంపిణీపై రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అక్రమ నగదు రవాణా, పంపిణీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆన్లైన్ వేదికగా జరిపే డిజిటల్ నగదు బదిలీలపై కూడా పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకర్లతో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే రూ.కోట్లలో నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండిని పోలీసులు స్వాదీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్, యూపీఐ, ఇతర డిజిటల్ లావాదేవీలను ట్రాక్ చేయడానికి బ్యాంకర్లు ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంకర్ల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. అనుమానాస్పద బల్క్ లావాదేవీలపై పర్యవేక్షించేందుకు బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని, ఒక బ్యాంకు ఖాతా నుంచి వివిధ అకౌంట్లకు లావాదేవీలు జరిపితే, వాటిని గుర్తించి వెంటనే పోలీసు శాఖను అప్రమత్తం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లినా, యూపీఐ ద్వారా ఎక్కువ మందికి డబ్బు పంపితే సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని పోలీసులు సూచించారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆన్లైన్ లావాదేవీల వివరాలు బ్యాంకుల నుంచి సేకరిస్తారు. ఆస్పత్రులు, భూ క్రయవిక్రయాలు, వివాహాలకు సంబంధించి నగదు, బంగారం తీసుకెళితే సంబంధిత ఆధారాలు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. -
సమీప కాలంలో రుణాలకు డిమాండ్
ముంబై: అన్ని ముఖ్యమైన రంగాల్లో స్వల్పకాలంలో రుణాలకు డిమాండ్ అధికంగా ఉంటుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. వరుసగా రెండేళ్ల బలహీనత తర్వాత ఆహారేతర రుణాల వృద్ధి 2022–23లో 15 శాతానికి పైగా ఉంటుందని ఆర్బీఐ నిర్వహించిన బ్యాంక్ లెండింగ్ సర్వే వెల్లడించింది. సర్వే వివరాలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. భవిష్యత్తు క్రెడిట్ డిమాండ్‌పై సీనియర్ లోన్ ఆఫీసర్ల అభిప్రాయాల ఆధారంగా ఆర్బీఐ ఈ వివరాలను రూపొందించింది. రుణాల్లో 90 శాతం వాటా కలిగి ఉన్న 30 వాణిజ్య బ్యాంకుల అధికారులను సర్వే చేసింది. కరోనా ప్రతికూలతల నుంచి ఇవి బయటకు వచ్చినట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. రిటైల్/వ్యక్తిగత రుణాల్లో బ్యాంకుల మదింపు వేగంగా పుంజుకున్నట్టు పేర్కొంది. -
అన్నదాత.. అప్పు గోస!
► వికారాబాద్ జిల్లా ‘దోమ’కు చెందిన రైతు బాయిని వెంకటయ్య ఆరు నెలల క్రితం పంట రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఇతర బ్యాంకుల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తేవాలన్నారు. వెంకటయ్య ఇతర బ్యాంకుల చుట్టూ తిరిగి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. యాసంగి సాగు మొదలైనా ఇంకా రుణం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ► సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన సావిత్రమ్మ.. యాసంగిలో పంట రుణం కోసం బ్యాంకును ఆశ్రయించారు. కానీ బ్యాంకు అధికారులు కొర్రీలు పెట్టారు. ఇతర బ్యాంకుల్లో పంట రుణం తీసుకోనట్టు/ఎలాంటి బాకీ లేనట్టుగా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని.. లేకుంటే రుణం ఇచ్చే మాటే లేదని చెప్పారు. దీనితో ఆమె ఆ మండలంలోని ప్రధాన బ్యాంకుల చుట్టూ తిరిగి నో డ్యూస్ సర్టిఫికెట్‌పై సంతకాలు చేయించుకొచ్చారు. ఆ తర్వాతే పంట రుణం అందింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంట రుణాల కోసం రైతులు గోసపడుతున్నారు. బ్యాంకర్లు ఏదో ఓ కొర్రీ పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సదరు మండలంలోని ఇతర బ్యాంకులకు వెళ్లి నోడ్యూస్ సర్టిఫికెట్లు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇప్పటికే ఉన్న పంట రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వబోమని తేల్చి చెప్తున్నారు. దీనితో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థ పడుతున్నారు. చివరికి పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. లక్ష్యం ఘనం.. ఇచ్చేది కొంచెం.. పంటరుణాల మంజూరుకు బ్యాంకులు, ప్రభుత్వం ఘనంగానే లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు మాత్రం పంట రుణాల కోసం వస్తున్న రైతులకు చుక్కలు చూపుతున్నారు. ఏదో ఒక కొర్రీ పెడుతూ తిప్పుకొంటున్నారు. ఈ విషయంలో రైతులకు బాసటగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ ఏమీపట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. యాసంగి మొదలై రెండు నెలలైనా రైతులకు ఇప్పటివరకు అరకొరగానే రుణాలు అందుతున్నాయి. 2022–23 వానాకాలం సీజన్లో పంటరుణాల మంజూరు లక్ష్యం రూ.40,718 కోట్లుకాగా.. సీజన్ పూర్తయ్యే నాటికి బ్యాంకులు రూ. 21,272 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే లక్ష్యంలో 52 శాతమే రుణాలు అందించాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌కు లక్ష్యం రూ.27,146 కోట్లుకాగా.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.5వేల కోట్లలోపేనని వ్యవసాయ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ధరణితో సాంకేతిక సమస్యలంటూ.. గతంలో రైతుల పట్టాదారు పాస్‌బుక్కులు తనఖాగా పెట్టుకుని బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానం తీసుకువచ్చారు. ప్రతి జాతీయ బ్యాంకుకు ధరణి పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. బ్యాంకర్లు ధరణి పోర్టల్‌లోకి లాగిన్ అయి సర్వే నంబర్లు, ఇతర వివరాలు సరిచూసుకుని పంట రుణాలు ఇస్తున్నారు. కానీ ధరణిలో సాంకేతిక సమస్యలతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖతో జరిగిన సమావేశాల్లో బ్యాంకర్లు ధరణి సమస్యల వల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పినట్టు తెలిసింది. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యల వల్ల రైతుల సర్వే నంబర్లు నమోదు కావడం లేదు. పాస్‌బుక్‌లు ఉన్నా బ్యాంకర్ల లాగిన్‌లో కనిపించడం లేదు. కొన్నింట్లో బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా నమోదు కావడం లేదు. పలు గ్రామాలు ఇంకా ధరణిలో నమోదుగాకపోవడం, కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లలో ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి తేడాలు ఉండటం వంటి సమస్యలు నెలకొన్నాయి. ఇలాంటి ఇబ్బందులున్న రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీనితో లక్షల మంది రైతులకు పంట రుణం అందకుండా పోతోంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగక.. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతోనూ రైతులకు రుణాలు అందని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.37 వేల వరకు బకాయిలున్న రైతులకే రుణమాఫీ చేసింది. ఆపై రుణాలున్న వారికి మాఫీ కావాల్సి ఉంది. రైతులు బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, ప్రభుత్వం తర్వాత చెల్లిస్తుందని మంత్రులు ప్రకటించినా.. కొందరే అలా రెన్యువల్ చేసుకున్నారు. చాలా మంది రైతులు ప్రభుత్వం నుంచి రుణమాఫీ సొమ్ము వచ్చిన తర్వాతే రెన్యువల్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. వారికి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. మరోవైపు 2018నాటికి ఉన్న బకాయిలపై వడ్డీ, చక్రవడ్డీ కలిసి తడిసి మోపెడవుతోంది. కొన్నిచోట్ల బ్యాంకు అధికారులు రైతుబంధు సొమ్మును బకాయిల కింద జమ చేసుకుంటున్నారని.. అలా చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్ల తీరు మారడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోడ్యూస్ సర్టిఫికెట్ తెస్తేనే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజు పంటరుణం కోసం ఏపీజీవీబీని సంప్రదించారు. కానీ బ్యాంకు అధికారులు ఆయనను దొమ్మాట, చేగుంట, నార్లాపూర్లలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి ‘నోడ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఆయన పది రోజులు తిరిగి అన్ని బ్యాంకుల్లో సంతకాలు తీసుకొచ్చిన తర్వాతే రుణం మంజూరు చేశారు. -
మారుతున్న ఆర్థిక పరిస్థితులను గమనించాలి
ముంబై: మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బ్యాంకులను కోరారు. అప్పుడే తమ బ్యాలన్స్ షీట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని పరిమితం చేసుకోవచ్చన్నారు. కరోనా సంభవించినప్పటి నుంచి కల్లోల సమయంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించినట్టు అంగీకరించారు. సవాళ్లు ఉన్నప్పటికీ భారత బ్యాంకింగ్ రంగం బలంగా ఉందంటూ, ఎన్నో అంశాల్లో మెరుగుపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఎండీ, సీఈవోలతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. డిపాజిట్లలో వృద్ధి నిదానంగా ఉండడం, రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు, నూతన టెక్నాలజీ సొల్యూషన్లను అందిపుచ్చుకోవడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్బీఐ డేటా ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకుల డిపాజిట్లలో 9.6 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.2 శాతంతో పోలిస్తే తగ్గింది. కానీ, ఇదే కాలంలో రుణాల్లో వృద్ధి 6.5 శాతం నుంచి 17.9 శాతానికి పెరగడం గమనార్హం. -
21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్‌లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్‌బీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ప్రొక్యూర్మెంట్ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థల చీఫ్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. -
అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థ వాటా, కేంద్ర ఖజానాలోకి రూ.36 వేల కోట్లు!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 29.53 శాతం వాటా విక్రయ వ్యవహారాలు చూసేందుకు ఐదు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూపు గ్లోబల్ మార్కెట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ప్రభుత్వానికి ఆరు వరకు మర్చంట్ బ్యాంకర్లు వాటాల విక్రయ వ్యవహరాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మర్చంట్ బ్యాంకర్ల కోసం దీపమ్ ఈ ఏడాది జూలైలో బిడ్లను ఆహ్వానించింది. ఎంపికైన మర్చంట్ బ్యాంకర్లు, సకాలంలో వాటాలు విక్రయించడం, ఇన్వెస్టర్ల అభిప్రాయాలు తెలుసుకోవడం, ఇన్వెస్టర్ రోడ్ షోలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవడం తదితర వ్యవహరాల్లో దీపమ్‌కు సేవలు అందిస్తాయి. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వం వాటాల విక్రయంతో రూ.36,000 కోట్ల వరకు సమకూర్చుకునే అవకాశం ఉంది. -
Andhra Pradesh: అన్నదాతకు విరివిగా రుణాలు
సాక్షి, అమరావతి: విత్తనాల నుంచి విక్రయాల దాకా అడుగడుగునా అన్నదాతలకు తోడుగా నిలుస్తూ చేయి పట్టి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో వ్యవసాయదారులకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముందెన్నడూలేని రీతిలో బ్యాంకర్లు రుణ వితరణతో ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. గతంలో రుణాల కోసం రైతన్నలు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. గత మూడేళ్లుగా అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టారు. వంద శాతం లక్ష్యం దిశగా.. 2021–22 సీజన్లో 1.08 కోట్ల మంది రైతన్నలకు రూ.1.48 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 75.78 లక్షల మందికి రూ.1.23 లక్షల కోట్ల మేర మంజూరయ్యాయి. ఖరీఫ్‌లో లక్ష్యం రూ.86,981 కోట్ల రుణాలు కాగా 50.88 లక్షల మంది రైతులకు రూ.70,531 కోట్ల రుణాలు (81 శాతం) ఇవ్వగలిగారు. స్వల్ప కాలిక రుణాలు 45.88 లక్షల మందికి రూ.56,940 కోట్లు అందాయి. దీర్ఘకాలిక రుణాలు 4.72 లక్షల మందికి రూ.10,966 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 27,345 మందికి రూ.2625 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో 44.19 లక్షల మందికి రూ.61,518 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికే 34.90 లక్షల కుటుంబాలకు రూ.52,659 కోట్ల రుణాలు మంజూరు చేశారు. షార్ట్ టర్మ్ రుణాలు 13 లక్షల మందికి రూ.28,281 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు 8.28 లక్షల మందికి రూ.17,948 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 66,981 మందికి రూ.6,430 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రబీలో మంజూరైన రుణాల్లో ఆప్కాబ్, డీసీసీబీల ద్వారా పంట రుణాలు 6,595.64 కోట్లు, షార్ట్ టర్మ్ రుణాలు రూ.4,893.63 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు రూ.5,255.92 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు కౌలుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లోనూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. ఇబ్బంది లేకుండా రుణం.. ప్రస్తుత రబీ సీజన్లో నాకున్న ఎకరం పొలంలో జొన్న సాగు చేశా. స్థానిక సహకార బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది. – పెండ్యాల సురేష్, గొడవర్రు, కృష్ణా జిలా నూరు శాతం లక్ష్యాన్ని అధిగమిస్తాం.. 2021–22 సీజన్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాం. మూడో త్రైమాసికం ముగిసే నాటికే 86 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. ఈ నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ -
రైతుబంధు.. అక్కడికెళ్తే సాయం బందు.. నిరాశగా వెనుదిరుగుతున్న రైతన్న
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు గాను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులు రాష్ట్రంలో చాలామందికి అందడం లేదు. రైతులు తీసుకున్న రుణాల కింద, రుణాలకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుబంధు నిధులు రైతులు తీసుకోకుండా వారి ఖాతాలను ముందే ‘హోల్డ్’లో పెట్టేస్తున్నాయి. అంటే వారెలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా చేస్తున్నాయన్న మాట. రుణం లేదా వడ్డీ చెల్లిస్తే కానీ ‘హోల్డ్’తీసివేయబోమని నిక్కచ్చిగా చెబుతుండటంతో.. ప్రభుత్వ సాయం కోసం ఎంతో ఆతురతతో బ్యాంకులకు వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. బ్యాంకర్ల వైఖరిపై కొందరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు, వడ్డీలకు సంబంధించి కానీ, రుణాల రెన్యువల్‌కు సంబంధించి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. సర్కారు సాయం తమకు అందకుండా ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి 57,60,280 మంది రైతులకు రైతుబంధు కింద రూ.5,294 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో 10 శాతం వరకు అంటే రూ.500 కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులు ఈ విధంగా ‘హోల్డ్’చేయడం లేదా రుణాల కింద జమ చేసుకోవడం జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సీజన్లో ఇలాగే వ్యవహరించిన బ్యాంకులపై అప్పట్లో ప్రభుత్వం సీరియస్ అయినా, తీరు మార్చుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లను పిలిపించి మాట్లాడటంలేదన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. రూ.5,294 కోట్లు పంపిణీ పంటల సాగు సీజన్లో పెట్టుబడి సొమ్ము లేక ఇబ్బందులు పడే రైతుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండుసార్లు యాసంగి, వానాకాలం సీజన్లకు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద నిర్ణీత మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధుల పంపిణీని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు 1.52 కోట్లకు పైగా ఎకరాలకు గాను రూ.7,645 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 60,16,697 మంది రైతులకు రూ.6008.27 కోట్లు పంపిణీ చేశారు. అయితే తమ వద్ద రుణం తీసుకొని చెల్లించని రైతులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్బీఐ చట్టం ప్రకారం రికవరీ చేయాల్సిందే: బ్యాంకు వర్గాలు రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి డబ్బులు తిరిగి రికవరీ చేయడం తాము సొంతగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారమే ఇది జరుగుతుందని బ్యాంకర్లు వివరిస్తున్నారు. తాము ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదని, కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్‌లో బ్యాంకులో ఎవరైనా ఖాతాదారుని రుణం పెండింగ్‌లో ఉంటే.. అకౌంట్లో ఏవైనా డబ్బులు జమ అయితే అవి అప్పు కింద జమ అవుతాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం రైతుబంధు నిధులను రైతు రుణాల కింద జమ చేసుకుంటున్న బ్యాంకుల్లో ఎక్కువగా చిన్న బ్యాంకులే ఉన్నాయని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో నడిచే పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇలాంటి సమస్యలు లేవని బ్యాంకర్లు చెపుతుండగా, వడ్ల కొనుగోలు కింద ప్రభుత్వం జమ చేసిన నిధులను కూడా అంతకుముందు తీసుకున్న అప్పుల కింద కొన్ని బ్యాంకులు బిగపడుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులకు గతంలోనే చెప్పాం: వ్యవసాయ శాఖ వర్గాలు రైతుబంధు నిధులను బ్యాంకర్లు రుణాల కింద జమ చేసుకోవడం సరైంది కాదని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. ఆర్బీఐ నిబంధనలు ఏవైనా ఉండొచ్చు కానీ రైతులకు ప్రభుత్వం సాయం చేయడంలోని ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని వారు చెబుతున్నారు. రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకునే పక్షంలో, ప్రభుత్వం సాయం చేసినా ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చి, వాటిని గత రుణాల కింద జమ చేసుకోవాలని, కొత్త రుణాలను క్రమం తప్పకుండా చెల్లించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు బ్యాంకులకు చెప్పామని, లేఖలు సైతం రాశామని తెలిపారు. తమ ఒత్తిడి కారణంగానే 2019–20లో బ్యాంకర్లు జమ చేసుకున్న రైతుబంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 'మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ పంచాంగల్ తండాకు చెందిన లావుడ్యా నాయక్‌కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట రుణం కింద గతంలో గండేడ్ ఎస్బీహెచ్లో రూ.1.5 లక్షలు తీసుకున్నాడు. బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం అందరి రైతుల మాదిరిగానే ఆయనకు కూడా ప్రభుత్వం నుంచి రైతుబంధు డబ్బులు రూ.20 వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ మొత్తాన్ని బ్యాంకు అధికారులు అప్పు కింద అట్టే పెట్టుకున్నారు. వారం క్రితం వరకు ఆయన బ్యాంకు ఖాతాను ‘హోల్డ్’లో (లావాదేవీల నిలిపివేత) పెట్టలేదు. కానీ రైతుబంధు పడుతోందని తెలియగానే హోల్డ్‌లో పెట్టేశారని నాయక్ తెలిపాడు. డబ్బులు తీసుకురావడానికి బ్యాంకుకు వెళ్తే పంట రుణం బాకీ చెల్లిస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తామని అధికారులు చెబుతున్నారని' వాపోయాడు -
ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!
Two Bank Staff Arrested For Stealing Jewels: బ్యాంకులు సురక్షితం అని ప్రజలు అనుకుంటారు. పైగా రుణాలు అవసరమైన ఏ విధమైన రిస్క్ ఉండదని బ్యాంకులనే విశ్వసించి ఆభరణాలు లేదా పొలాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. అటువంటిది ప్రజలు బాగా విశ్వసించే బ్యాంకు ఉద్యోగులే ప్రజలు తాకట్టు పెట్టిన ఆ భరణాలను దొంగలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అచ్చం అలాంటి సంఘటనే పాండిచ్చేరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. (చదవండి: ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!) అసలు విషయంలోకెళ్లితే.... పోలీసుల కథనం ప్రకారం..ఒక ఖాతాదారుడు రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారు నగలను విడిపించుకునేందుకు లాస్పేట్లోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే అతను తాకట్టు పెట్టిన ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరింగ్‌తో ఉన్న నగలు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కి గురుయ్యాడు. దీంతో ఆ ఖాతాదారుడు సదరు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంకు అధికారులు ఖాతాదారులు బ్యాంకు వద్ద తాకట్టు పెట్టిన ఆభరణాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. అయితే దాదాపు నాలుగు వందల సవార్ల బంగారు ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరిగింగ్ బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంతో రూ. 1.19 కోట్ల విలువైన అసలు ఆభరణాలు తిరిగి లభించాయి. అంతేకాదు ఆ బ్యాంకులో పనిచేస్తున్న గణేశన్ (క్యాషియర్), విజయకుమార్ (అసిస్టెంట్ క్యాషియర్)లు ఇద్దరు ఖాతాదారుల ఒరిజినల్ ఆభరణాలను ప్రైవేట్ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!) -
భారం పెరిగినా తీరం చేర్చాం
ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తద్వారా లావాదేవీల ప్రక్రియ ఊపందుకుంటుంది. ఈ దృష్ట్యా ఏటీఎంలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వేదిక కావాలి. ఆ మేరకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇది గొప్ప మార్పునకు దారితీస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 60.53 శాతం.. అంటే రూ.1,71,520 కోట్ల రుణాలు పంపిణీ చేశాయి. ప్రాధాన్యతా రంగాలకు వార్షిక రుణ లక్ష్యం రూ.2,13,560 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 47.29 శాతం.. అంటే రూ.1,00,990 కోట్లు రుణాలుగా పంపిణీ చేశాయి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా తీసుకొచ్చిన పలు కార్యక్రమాలు, పథకాలకు బ్యాంకర్లు తోడ్పాటు అందించి.. ఆర్థిక చక్రానికి ఊతమివ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోందన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వంపై భారం మరింత పెరిగిందని తెలిపారు. కోవిడ్‌తో ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గడంతో పాటు కోవిడ్ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కించగలిగిందన్నారు. బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా చొరవ చూపినందుకు అభినందిస్తున్నానని చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకపోతే ఇంకా వేగంగా పుంజుకునేదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల లబ్ధిదారులకు మూడు శాతం వడ్డీతో రుణాలు ► ‘నవరత్నాలు–అర్హులైన పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దీన్ని చూసి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ► దీని వల్ల ఆర్థికంగా ఎన్నో రంగాలకు మేలు కలుగుతోంది. సిమెంటు, స్టీల్ వినియోగం పెరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తోంది. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటుండడంతో వారికీ పని దొరుకుతోంది. ఆ విధంగా గ్రామాలు, పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ► కేంద్రం పీఎంఏవై ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. మరో రూ.35 వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉంది. ఆ ఇళ్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చింది కాబట్టి, బ్యాంకులు ఆ రుణం మంజూరు చేయాలి. ► బ్యాంకులు ఇచ్చే రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయంలో బ్యాంకులు చొరవ చూపితే అన్ని విధాలా ఆర్థిక ప్రగతికి చేయూత ఇచ్చినట్లుగా ఉంటుంది. 2,62,216 టిడ్కో ఇళ్ల (ఫ్లాట్లు)కు సంబంధించి బ్యాంకులు చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుంది. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ► వ్యవసాయ స్వల్పకాలిక పంట రుణాలలో తొలి ఆరు నెలల్లోనే 51.57 శాతం పంపిణీ చేశాయి. అయితే వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల్లో వ్యవసాయ మౌలిక వసతులకు సంబంధించి 35.33 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళికలో 37.31 శాతం మాత్రమే రుణాలివ్వడం నిరాశాజనకం. ఈ రెండింటిలో రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలి. ► వార్షిక రుణ ప్రణాళిక తొలి ఆరు నెలల్లో వ్యవసాయ యాంత్రీకరణలో 9.08 శాతం, పాడి రంగానికి 24.29 శాతం, మొక్కలు నాటడం, చెట్లు పెంచడానికి 4.52 శాతం, ఉద్యాన పంటల సాగు, చేపల పెంపకానికి 14.84 శాతం రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. ► బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు (గత ఏడాది 42.50 శాతం) ఈ ఏడాది 38.48 శాతానికే పరిమితమయ్యాయి. దీనిపై దృష్టి పెట్టాలి. అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)లను ఆర్బీకేల స్థాయిలో వెంటనే జారీ చేయాలి. ► ఈ–క్రాప్ ఆధారంగా కౌలు రైతులకు కూడా రుణాలు అందాలి. రా>ష్ట్రంలో దాదాపు ఇంకా 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ మేరకు కరెస్పాండెంట్లను నియమించాలి. వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం ► వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తూ, జాతీయ స్థాయి ప్రమాణాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు, మరో 16 నర్సింగ్ కాలేజీలు కడుతున్నాం. ► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఉంటుంది. వాటిలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఇందు కోసం మొత్తం రూ.12,243 కోట్లు అవసరం కాగా, కొంత రుణం ఇవ్వడానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఇంకా దాదాపు రూ.9 వేల కోట్ల నిధులు కావాలి. ► ప్రాథమిక ఆరోగ్య రంగంలో కూడా సమూల మార్పులు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. 108, 104 సర్వీసులు ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఉంటుంది. పీహెచ్‌సీల వైద్యులు ఒక్కో రోజు ఒక్కో గ్రామం సందర్శించి సేవలందిస్తారు. ఆ విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తోంది. ► ఆరోగ్యశ్రీ పథకంలో 2,432 వైద్య, చికిత్స ప్రక్రియలు చేర్చాం. ఈ పథకం కింద ఇకపై పీహెచ్సీలలో కూడా చికిత్స పొందవచ్చు. విద్యా రంగానికి చేయూత ఇవ్వాలి ► విద్యా రంగంలో నాడు–నేడు ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్, ఇంగ్లిష్ ల్యాబ్ వంటి సదుపాయాలు కల్పించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ తీసుకొచ్చాం. 15,715 స్కూళ్లను తొలి దశలో రూ.3,500 కోట్లతో సమూలంగా మార్చాం. ► మొత్తం మూడు దశల్లో అన్ని స్కూళ్ల (దాదాపు 57 వేలు)ను సమూలంగా మార్చేస్తాం. ఈ ప్రక్రియలో బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలి. నిజానికి ఇది మానవ వనరుల్లో పెట్టుబడి అని చెప్పొచ్చు. ఎంఎస్ఎంఈల ఓటీఆర్‌ను అమలు చేయాలి ► రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పలు చర్యలు చేపట్టింది. 2019లో తొలి చర్యగా ఎంఎస్ఎంఈల రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తూ ‘వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్’ (ఓటీఆర్) ప్రకటించింది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి దాదాపు 8.3 లక్షల రుణ ఖాతాలుంటే, వాటిలో కేవలం 1.78 లక్షల ఖాతాలు.. అంటే 22 శాతం ఖాతాలు మాత్రమే పునర్ వ్యవస్థీకరణకు నోచుకున్నాయి. ఈ దృష్ట్యా వీలైనన్ని రుణ ఖాతాలు ఓటీఆర్ వినియోగిచుకునేలా చూడాలి. తద్వారా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ► ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన (గత ప్రభుత్వం బకాయి పెట్టినవి కూడా) నాలుగైదేళ్ల రాయితీలను చెల్లించాం. కోవిడ్ సమయంలో అండగా నిలిచాం. బ్యాంకులు కూడా సానుకూలంగా ఆలోచించాలి. చిరు వ్యాపారులకు అండగా నిలవాలి ► వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారి వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా కడుతుంది. ► రెండు విడతల్లో 7.57 లక్షల మందికి రుణాలు ఇచ్చాయి. స్త్రీ నిధి ద్వారా కూడా వారికి రుణాలు ఇస్తున్నాం. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలి. ఈ పథకంలో మొత్తం 9.01 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ► 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది వలంటీర్లు నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) తగ్గించడంలో మీకు తోడుగా నిలుస్తారు. మహిళల జీవనోపాధి పెంపునకు సహకారం ► ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి స్వయం సహాయక బృందాలలో 18.36 శాతం ఎన్పీఏలు ఉండేవి. వారికి వివిధ పథకాల ద్వారా తోడుగా నిలబడడంతో వారి రుణాలు, ఎన్పీఏ ఒక శాతం కంటే తక్కువ (0.73శాతం)గా ఉంది. ► మహిళలకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారికి ఉపాధి లభించేలా సొంత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ చర్యల వల్ల ఇవాళ రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా మహిళలు వ్యాపారాల (కిరాణం దుకాణాలు) ద్వారా నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్ వ్యవస్థను కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని, దశల వారీగా విస్తరిస్తామని బ్యాంకర్లు సీఎంకు వివరించారు. -
వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలను ఎదుర్కొనేందుకు గతేడాది మార్చి నుంచి దాదాపు సున్నా స్థాయి వడ్డీ రేట్లను కొనసాగిస్తున్న అమెరికా క్రమంగా వాటిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. నియామకాలు పుంజుకునే కొద్దీ చౌక వడ్డీ రేట్ల విధానాలను క్రమంగా ఉపసంహరించడం మొదలుపెట్టే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది ఆఖరు మూడు నెలల్లో క్రమంగా తగ్గించుకోనున్నట్లు బ్యాంకర్లు, ఆర్థికవేత్తల సమావేశంలో ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం తాము నిర్దేశించుకున్న 2 శాతం స్థాయికి చేరడంతో బాండ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం ద్వారా వ్యవస్థలో రుణాలు, వ్యయాలకు డిమాండ్ కల్పించేందుకు ప్రస్తుతం ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీన్ని నిలిపివేస్తే తనఖా రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా వడ్డీ రేట్ల పెంపు ఉండదని పావెల్ తెలిపారు. పావెల్ ప్రకటనపై అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఒక దశలో 225 పాయింట్లు పెరిగింది. -
ఆర్టీసీకా.. రుణమివ్వలేం!
సాక్షి, హైదరాబాద్: మొండి బకాయిల జాబితాలోకి చేరటంతో ఆర్టీసీ ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆదాయం బాగా క్షీణించిపోవటం, నష్టాలు తీవ్రం కావటం, ఇతరత్రా ఆదాయం నామమాత్రమే కావటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి చూసి బ్యాంకులు వెనకాడుతున్నాయి. దీంతో ఆ సంస్థకు రుణం ఇచ్చేందుకు జంకుతున్నాయి. ఫలితంగా నిధులు లేక ఆర్టీసీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఏ విధమైన చెల్లింపులు జరపలేక అంతా గందరగోళంగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం దీనికి అద్దం పడుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులు, నష్టాలతో సతమతమవుతున్న తరుణంలో కోవిడ్ మహమ్మారి ఆర్టీసీని పూర్తిగా కుంగదీసింది. జీతాల చెల్లింపు, డీజిల్ బిల్లులు, మృతిచెందిన ఉద్యోగులకు బెనిఫిట్స్, ఆర్టీసీ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు, సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్ బకాయిలు, అద్దె బస్సుల యజమానుల బిల్లుల చెల్లింపు.. ఇలా అన్నీ పెండింగులో పడిపోయాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కేటాయించిన నిధుల్లోంచి సాయం చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులు రెండు నెలల క్రితం ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం రూ.వేయి కోట్లకు పూచీకత్తు (గ్యారంటీ) ఇస్తూ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సిందిగా సూచించింది. దానికి ఓ ప్రధాన బ్యాంకు స్పందించింది. అయితే, గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.180 కోట్లు బకాయిగా ఉండటంతో ఎన్పీఏగా ముద్రపడిందని, ఆ మొత్తం చెల్లిస్తే రుణం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సాయంతో దాన్ని తీర్చేసి మళ్లీ రుణం కోసం వెళ్లింది. రీజినల్ స్థాయి బోర్డు సమావేశంలో బ్యాంకు దీనికి ఓకే చేసింది. కానీ కేంద్ర స్థాయిలో బోర్డు మోకాలొడ్డింది. అసలే ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున ఒకేసారి ఏకంగా రూ.వెయ్యి కోట్ల రుణం ఇవ్వటం సరికాదని ఆ ప్రతిపాదనను తిరస్కరించి కేవలం రూ.500 కోట్లకు ఓకే చెప్పింది. అయితే ఈ రుణం ఇప్పుడు ఆర్టీసీ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం ఆర్టీసీ అవసరాలకు రూ.2 వేల కోట్లు కావాలి. కనీసం రూ.వెయ్యి కోట్లు అందినా సగం సమస్య తీరేది. ప్రభుత్వ పూచీకత్తులో మిగిలిన రూ.500 కోట్ల కోసం ఇప్పుడు అధికారులు ఇతర బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. వారికి నిరాశే ఎదురవుతోంది. -
సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
-
ఆ మూడు రంగాలకూ రుణాలివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ రంగం, ఓడరేవుల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మేనేజింగ్ డైరెక్టర్ జి.రాజ్‌కిరణ్‌రాయ్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆదిత్యనాథ్‌దాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం కోసం బోధనాస్పత్రులతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ఆరోగ్య రంగానికి రూ.2 వేల కోట్ల రుణ సదుపాయం అవసరమని, ఇందుకు సహకరించాలని బ్యాంక్ ఎండీని కోరారు. 2023 నాటికి రాష్ట్రంలో మూడు పంక్షనల్ గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు కూడా రుణ సదుపాయం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూబీఐ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ మాట్లాడుతూ ఈ విషయాల్లో ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక–ఇంధన) డి.కృష్ణ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్సింఘాల్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి, ఏపీ ఎంఐఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్సీఎఫ్లో 10% విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్ఎల్)లో 10 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. మర్చంట్ బ్యాంకర్లు జనవరి 28 నాటికి, లీగల్ అడ్వైజర్లు 29 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్సీఎఫ్ఎల్లో కేంద్రానికి 75 శాతం వాటాలు ఉండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 10 శాతాన్ని విక్రయించాలని భావిస్తోంది. శుక్రవారం నాటి ఆర్సీఎఫ్ షేరు ముగింపు ధర రూ. 54 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 300 కోట్లుగా ఉంటుంది. బీఈఎంఎల్లో వాటాల విక్రయానికి బిడ్ల ఆహ్వానం ప్రభుత్వ రంగ దిగ్గజం బీఈఎంఎల్లో 26 శాతం వాటాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. బిడ్డర్లు మార్చి 1 లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) వెల్లడించింది. శుక్రవారం బీఈఎంఎల్ షేరు ధర రూ. 974 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 1,000 కోట్లుగా ఉంటుంది. డిఫెన్స్, రెయిల్, విద్యుత్, మైనింగ్, ఇన్ఫ్రా తదితర రంగాల్లో బీఈఎంఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. 2020 మార్చి 31 నాటికి రూ. 9,795 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. సంస్థలో కేంద్రానికి 54.03 శాతం వాటాలు ఉండగా.. కొనుగోలుదారులకు 26 శాతం వాటాలతో పాటు యాజమాన్య హక్కులు కూడా బదలాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
ఊరట : రుణగ్రహీతలకు వెసులుబాటు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో ప్రభావితమైన వ్యాపార సంస్థలను కాపాడేందుకు సెప్టెంబర్ 15 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో గురువారం నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. రుణాల పునర్వ్యవస్థీకరణకు బోర్డు ఆమోదించిన విధానాన్ని సత్వరమే అమలు చేసేందుకు బ్యాంకులు సిద్ధం కావాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పథకానికి అర్హులైన రుణగ్రహీతలను గుర్తించి సత్వరమే వారిని సంప్రదించి ఆయా వ్యాపారాలను బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్-19తో దెబ్బతిన్న రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలుకు సన్నద్ధతను ఆయా బ్యాంకుల సీఈఓలతో సమీక్షించారు. చదవండి : ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా రుణాల చెల్లింపులపై మారటోరియంను ఎత్తివేసే సమయంలో రుణగ్రహీతలకు బ్యాంకులు బాసటగా నిలవాలని సూచించారు. రుణగ్రహీతల రుణసామర్ధ్యంపై ప్రభావం లేనివిధంగా వ్యవహరించాలని అన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణపై తాము పూర్తిసమాచారాన్ని పలు భాషల్లో తమ వెబ్సైట్లపై అందుబాటులో ఉంచామని బ్యాంకులు ఆమెకు వివరించారు. తాము రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులైన రుణగ్రహీతలను గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని బ్యాంకులు వివరించాయి. కంపెనీలు, వాణిజ్య సంస్ధలతో పాటు వ్యక్తిగత రుణగ్రహీతల అవసరాలను గుర్తెరిగి బ్యాంకులు చురకుగా స్పందించాలని మంత్రి సూచించారు. కాగా, కార్పొరేట్, ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణం సహా వివిధ రుణగ్రహీతలకు ఆగస్ట్ 6న ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణను ప్రకటించింది. రుణ పునర్వ్యవస్థీకరణ కోసం రుణగ్రహీతలు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా బ్యాంకులను కోరవచ్చు. ఈ ప్రతిపాదనకు బ్యాంకులు అంగీకరించిన 180 రోజుల్లోగా రుణ పునర్వ్యవస్థీకరణ అమలవుతుంది. -
ఉత్పాదకతకు మరిన్ని రుణాలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో కుదేలయిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయం సకాలంలో అందించేలా బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓలు, ఎన్‌బీఎఫ్‌సీల చీఫ్‌లతో ప్రధాని బుధవారం మూడు గంటలపాటు సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం సదస్సుకు సంబంధించి కొద్ది ముఖ్యాంశాలు చూస్తే... ► ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్), దేశం స్వయం సమృద్ధి లక్ష్యాల సాధన వంటి కీలక అంశాలను ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ఫైనాన్షియల్ రంగం ప్రాముఖ్యతను వివరించారు. లక్ష్యాల సాధన దిశలో ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అన్నింటినీ అందిస్తుందని పేర్కొన్నారు. ► రుణ సదుపాయాలు, లక్ష్యాల సాధనలో అనుసరించాల్సిన మార్గాలు, టెక్నాలజీ ద్వారా ఫైనాన్షియల్ రంగంలో సాధికారత, ఈ విభాగం స్థిరత్వానికి అనుసరించాల్సిన అత్యున్నత ప్రమాణాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ► ఎస్బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డైరెక్టర్ ఎస్ఎస్ మల్లిఖార్జున రావు, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భక్షీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అదిత్య పురి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణూ సూద్ కర్నాడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ► 2019 మేలో బ్యాంక్ రుణ వృద్ధి 11.5 శాతం ఉంది. 2020 మేలో ఇది 7 శాతం క్షీణతకు పడిపోయింది. కోవిడ్–19 తీవ్రత దీనికి నేపథ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణతలోకి వెళుతుందన్న సందేహాలూ ఉన్నాయి. రుణాలకు సంబంధించి అటు రుణ దాతల నుంచీ ఇటు రుణ గ్రహీతల నుంచీ సానుకూల స్పందన కనబడ్డం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్వహించిన సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో చరిత్రాత్మక కనిష్టస్థాయి 4 శాతానికి దిగివచ్చింది. అయినా కార్పొరేట్, రిటైల్ రుణ గ్రహీతలు రుణాలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనితో బ్యాంకులు రివర్స్ రెపో మార్గంలో తమ డబ్బును ఆర్బీఐ వద్ద ఉంచుతున్నాయి. ► వ్యవస్థలో డిమాండ్‌ను పునరుద్ధరింపజేయడానికిగాను మేలో ఆర్థికమంత్రి ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీ అంశాల అమలుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
బ్యాంకు సమ్మె: 10 లక్షల మంది, 80 వేల శాఖలు
సాక్షి,చెన్నై: రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జనవరి 31- ఫిబ్రవరి 1 తేదీల్లో వివిధ బ్యాంకు సేవలు ప్రభావితం కానున్నాయి. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ సమ్మెకు నాయకత్వం వహించనుంది. మరోవైపు జనవరి 31 న ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తో చర్చలు విఫలమైన అనంతరం రెండు రోజుల సమ్మెకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం చెప్పారు. సమ్మెకాలంలో 80వేల బ్యాంక్ శాఖల్లో ఎక్కువ భాగం మూత పడతాయని తెలిపారు. అలాగే మార్చి 11 నుండి మూడు రోజుల పాటు మరోసారి సమ్మెను చేపట్టనున్నామని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని యుఎఫ్‌బియు ఇంతకుముందే ప్రకటించిన సంగతి విదితమే. -
దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్
-
క‘రుణ’ చూపని బ్యాంకులు
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడింది. అయితే అన్నదాతలకు బ్యాంకుల నుంచి చేయూత కరువైంది. రబీ పంట రుణాల పంపిణీని ఇంతవరకు చేపట్టలేదు. ఖరీఫ్‌లో అంతంత మాత్రంగానే రుణాలు పంపిణీ చేశాయి. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రబీలో ప్రధానంగా శనగ, జొన్న, ధనియాలు, మినుము, వేరుశనగ, వరి సాగుచేస్తారు. శనగ 1.90 లక్షల హెక్టార్లలో, వరి 25,119, జొన్న 56,397, మొక్కజొన్న 8,248, మినుము 14294 హెక్టార్లలో సాగు కానున్నాయి. ఖరీఫ్ సాధారణ సాగు 6.27 లక్షల హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌కు వాతావరణం అనుకూలించడంతో ఉత్సాహంగా విత్తనం పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం కూడా రబీ రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేస్తోంది. రుణాలకు తప్పని తిప్పలు రైతులకు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ బ్యాంకర్లలో మార్పు రాలేదు. ఖరీఫ్ పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.4,360.42 కోట్లు ఉండగా, బ్యాంకులు మాత్రం రూ.3136.07 కోట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం అవుతోంది. జిల్లాలో రైతుల ఖాతాలు 6.92 లక్షలు ఉన్నాయి. వీరందరూ పంట రుణాలకు అర్హులే. ఖరీప్‌లో కేవలం 3,53,212 మంది రైతులకు మాత్రమే పంట రుణాల పంపిణీ చేశాయి. ఎస్బీఐ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు లక్ష్యాలను అధిగమించినా.. ఆంధ్రా, కెనరా , కేడీసీసీ బ్యాంకు లు నిర్లక్ష్యం వహించాయి. ఖరీఫ్‌లో ఈ నెల 10వ తేదీ నాటికి 71.92 శాతం మాత్రమే పం టరుణాల పంపిణీలో లక్ష్యాన్ని సాధించారు. రబీలో అంతులేని నిర్లక్ష్యం.. రబీలో 3 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. పంట రుణాల లక్ష్యం రూ.2749.58 కోట్లు. జిల్లాలోని 27 బ్యాంకులకు లక్ష్యాలు ఇచ్చారు. ఏపీజీబీ రూ.562.14 కోట్లు, ఆంధ్రబ్యాంకు రూ.416.72 కోట్లు, ఎస్బీఐ రూ.412.70 కోట్లు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు రూ.419.52 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.247.80 కోట్లు, కెనరా బ్యాంకు రూ. 114.62కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.102.89 కోట్లు ప్రకారం పంపిణీ చేసే విధంగా లక్ష్యలు ఇచ్చారు. కొన్ని మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు పడటంతో కొద్ది రోజులుగా రబీ పంటల సాగు చేస్తున్నా.. పంట రుణాల పంపిణీ అతీగతీ లేదు. బ్యాంకులు మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాల్సి ఉంది. రుణం ఇవ్వడం లేదు రైతు పేరు పెద్దమద్దిలేటి. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామవాసి. ఆరు ఎకరాల పొలం ఉంది. రబీ సీజన్లో శనగ వేయడానికి విత్తనాలు సిద్ధం చేసుకున్నాడు. పంట రుణం కోసం ఆంధ్రాబ్యాంకు, పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు తిరిగినప్పటికీ రుణం ఇవ్వడం లేదు. -
అమరావతి: బ్యాంకర్లతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
ఇక ఏటీఎం విత్ డ్రా రోజుకు ఒకసారే?
సాక్షి, ముంబై : బ్యాంకు వినియోగదారులకు షాకింగ్ న్యూస్. అక్రమ లావాదేవీలను నిరోధించేందుకుగాను, ఏటీఏం రోజువారీ లావాదేవీలను నియంత్రించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా బ్యాంక్, ఏటీఎం మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించే దిశగా చర్యలకు దిగనున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ (ఎస్ఎల్బీసీ) కమిటీలో బ్యాంకర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రోజుకు ఒక్కసారి మాత్రమే ఏటీఎం విత్‌డ్రాయల్‌కు అనుమతించాలని ప్రతిపాదించింది. ఒక్కో ఏటీఎం లావాదేవీకి కనీసం 6 నుంచి 12గంటల వ్యవధి ఉండేలా కొత్త నిబంధనను చేర్చాలని తన నివేదికలో సూచించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగినప్పటికీ, తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. వినియోగదారులకు మరోసారి తిప్పలు తప్పవు. అలాగే ఆయా బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కూడా ఎస్ఎల్బీసీ సిఫారసు చేసింది. దీంతోపాటు కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఏటీఎంలకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నివేదించింది. ఉదాహరణకు ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని ఏటీఎం సెంటర్లోకి వెళ్తే ‘‘హెల్మెట్‌ను తొలగించండి’’ అనే వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది. అదేవిధంగా, బ్యాంక్ శాఖలలో కూడా, వినియోగదారులు టెల్లర్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. అంతేకాదు ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతోంటే కెమెరాతో ఆ ప్రదేశాన్ని కన్నేసి ఉంచేలా సెక్యూరిటీ వ్యవస్థని రూపొందించాలని కోరింది. కాగా 2018-19 సంవత్సరంలో 179 ఏటీఎం మోసాలతో దేశ రాజధాని నగరం రెండవ స్థానంలో ఉండగా 233 మోసాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత ఏడాది 911 ఏటీఎం మోసాలతో పోలిస్తే ఈ ఏడాదిలో 980 కి పెరిగాయి. క్లోనింగ్ ద్వారా కూడా ఏటీఎం మోసాలు నమోదుగా భారీగానే ఉంటోంది. ఈ మోసాలకు పాల్పడుతున్న వారిలో విదేశీయులూ ఎక్కువగానే ఉంటున్నారు. ఇప్పటికే ఎస్బీఐ ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణను రూ. 20 వేలకు కుదించింది. మరోవైపు రూ. 10 వేలకు మించి విత్‌డ్రా చేసే వారికి ఓటీపీని ఎంటర్ చేయాలని కెనరా బ్యాంకు కూడా ప్రకటించింది. -
గత ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమాన్ని మరిచింది
-
కాళేశ్వరానికి రుణాలిచ్చిన బ్యాంకర్లకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భారీ నిధులను సమకూర్చడంలో బ్యాంకుల ద్వారా సేకరించిన రుణాలే కీలక పాత్ర పోషించాయి. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణకు వీలుగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఇప్పటివరకు ఏకంగా రూ. 40 వేల కోట్లకు పైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ. 29,259 కోట్లను ఖర్చు చేశారు. ప్రాజెక్టు నిధుల అవసరాలను తీర్చడంలో బ్యాంకుల పాత్ర కీలకం కావడంతో రుణాలిచ్చిన బ్యాంకర్లను ఘనంగా సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 37 లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చే ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా రూ. 80,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దానికి తగినట్లుగా గడిచిన నాలుగు బడ్జెట్లలో రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 8 వేల కోట్ల వరకు కేటాయింపులు చేస్తూ వచ్చారు. ఈ స్థాయిలో నిధుల ఖర్చుకు వీలుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి నిధుల సేకరించారు. తొలి విడతలో ఆంధ్రా బ్యాంకు కన్సార్షియం నుంచి రూ. 7,400 కోట్లు సేకరించగా, అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియం నుంచి రూ. 11,400 కోట్ల రుణానికి సంబంధించి ఒప్పందం జరిగింది. ఇక పీఎఫ్సీ ద్వారా రూ. 18 వేల కోట్లు, నాబార్డ్ ద్వారా రూ. 1,500 కోట్ల మేర రుణాలు దక్కాయి. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఇంతవరకు మొత్తంగా రూ. 49,877 కోట్లు ఖర్చవగా అందులో రుణాల ద్వారానే రూ. 29,259 కోట్లు ఖర్చు చేశారు. మారో రూ. 20 వేల కోట్లు రాష్ట్ర నిధుల నుంచి ఖర్చు చేశారు. సీఎం చేతుల మీదుగా సన్మానం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలిచ్చిన బ్యాంకర్లను ఘనంగా సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 21న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించింది. వివిధ బ్యాంకుల సీఎండీ, ఎండీలు, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. వీరంతా గురువారం ఉదయం హెలికాప్టర్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వీరంతా పాల్గొననున్నారు. అదే రోజున వీరికి సీఎం చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉండనుంది. -
బాబు... నీకో దండం
‘‘అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం. బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి చేరుస్తాం.’’ తేనె పూసిన మాటలతో ఎన్నికల ముందు రైతుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన చంద్రబాబు.. ఐదేళ్లు గడిచినా మాట నిలుపుకోలేకపోయారు. అధికారం కట్టబెట్టిన ప్రజలను, రైతులను టీడీపీ ప్రభుత్వం అప్పుల పాలు చేసి రోడ్డున నిలిపింది. అరకొర రుణమాఫీ వడ్డీలకూ సరిపడక.. తాకట్టులోని బంగారం విడిపించుకునే దారి కనిపించక చుక్కలు చూస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు.. పత్రికల్లో వేలం ప్రకటనలతో అవమాన భారం అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టే రోజుకు జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల్లో 10.24లక్షల ఖాతాలకు సంబంధించి రూ.6,817.85 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం తేల్చిన లెక్కల ప్రకారం 8.20లక్షల ఖాతాలు రుణమాఫీకి అర్హత సాధించాయి. ఈ లెక్కన రూ.4,944కోట్ల రుణమాఫీ కావాలి. అంటే.. రూ.3,093.06కోట్ల పంట రుణాలు, రూ.1851.18కోట్ల బంగారు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం పంట, బంగారు రుణాలు కలిపి కేవలం రూ.2,956కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇదీ ‘బంగారు’ అప్పుల లెక్క జిల్లా వ్యాప్తంగా 2.12లక్షల మంది రైతులు బంగారం తనఖా పెట్టి రూ.1851.18కోట్లు రుణంగా తీసుకున్నారు. సర్కారు లెక్క ప్రకారం ఇవన్నీ మాఫీ కావాలి. అయితే ప్రభుత్వం కేవలం 1.32లక్షల ఖాతాల్లో రూ.905.12కోట్ల బంగారం రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో తక్కిన 79,939 ఖాతాల్లోని రూ.946.06కోట్లు మాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది. అంతటితో ఆగలేదు. మాఫీ చేస్తామని ప్రకటించిన మొత్తంలో కూడా రూ.218.42కోట్లను మాత్రమే మాఫీ చేసింది. ఇదేంటని విపక్షాలు ప్రశ్నిస్తే మొదటి విడత మాఫీ అని, తక్కిన బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని బుకాయించారు. దాదాపు ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. తిరిగి ఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకూ బంగారం రుణాలు మాఫీ చేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయింది. అంటే మొత్తంగా జిల్లాలో రైతులకు రూ.1851.18కోట్ల బంగారం రుణాలు ఉంటే ప్రభుత్వం రూ.218.42కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఈ వంచనతో రైతులకు చెందిన రూ.1632.76కోట్ల బకాయి మిగిలింది. మాఫీ చేసిన సొమ్మును.. మాఫీ చేయాల్సిన సొమ్ముకు వడ్డీని ఈ ఐదేళ్లకు లెక్కిస్తే ఏ మూలకూ సరిపోని పరిస్థితి. బంగారం వేలం వేస్తామని నోటీసులు బంగారం రుణాలపై ప్రభుత్వ వ్యవహార శైలిని బ్యాంకర్లు గమనించారు. రుణమాఫీ విధానంపై లోతుగా అధ్యయనం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏటా 20 శాతం రుణమాఫీ చేసినా.. వడ్డీనే 14–18శాతం అవుతుంది. అంటే ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం వడ్డీ కూడా మాఫీ చేయలేని పరిస్థితి. దీంతో తీసుకున్న రుణమాఫీతో సంబంధం లేకుండా తీసుకున్న రుణాలను గడువులోపు చెల్లించాలని బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేశారు. ఇవి కాకుండా రైతుల పేర్లు, తీసుకున్న రుణం, వేలం తేదీలను పత్రికల్లో రోజూ పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చారు. రెండేళ్ల పాటు బ్యాంకర్ల నుంచి ఇదే వేధింపులు కొనసాగాయి. పత్రికల్లో వేలం ప్రకటనలు, ఇంటికి నోటీసులు చూసి రైతులు తీవ్ర అవమానానికి లోనయ్యారు. వరుస కరువులతో కుదేలవుతున్న జిల్లా రైతులు పూటగడవటమే కష్టమైన తరుణంలో కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. సత్తువ లేని రైతులు భిక్షాటనకు సిద్ధపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ నోటీసు ఇస్తే తామేం రుణాలు చెల్లిస్తామని రైతులు బంగారాన్ని వదిలేసిన ఘటనలు కోకొల్లలు. ఇంకొందరు అప్పులు చెల్లించలేక, వేలం వేస్తారనే అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలకు తెగించారు. ఇలా గడిచిన 58 నెలల్లో 273 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబాలతో పాటు అప్పులపాలైన లక్షలాది రైతు కుటుంబాల వేదనకు ప్రత్యక్షంగా చంద్రబాబు ప్రభుత్వం కారణమైంది. రైతులకు అండగా నిలిచిన జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ‘అనంత’ను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలి. ఇక్కడి వ్యవసాయ పరిస్థితులు, కరువు ప్రభావం మరే ప్రాంతంతో పోల్చలేనిది. పైగా ఇక్కడ రెండు పార్లమెంటు స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలను జిల్లావాసులు టీడీపీకి కట్టబెట్టారు. అప్పుల బాధ తాళలేక గత ఐదేళ్లలో వందలాది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది. రైతుకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. జిల్లా పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా విఫలమయ్యారు. కానీ విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఆత్మహత్య చేసుకున్న 82 రైతు కుటుంబాల ఇళ్లకు నేరుగా వెళ్లి భరోసా కల్పించారు. రుణమాఫీ నగదు వడ్డీకి జమ గ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. వేరుశనగతో పాటు రాగి, వరి పంటలు సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడంతో పొలంలో బోరుబావి తవ్విచ్చేందుకు 2013లో అగళి కర్ణాటక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష అప్పుగా తీసుకున్నాం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలను పూర్తిగా విశ్వసించాం. ఆ తర్వాత ఆయన మాట మార్చడం, నగలు వేలం వేస్తామని బ్యాంకోళ్లు నోటీసులు ఇవ్వడంతో ప్రయివేట్‌గా వడ్డీకి తీసుకొచ్చి విడిపించుకున్నా. వచ్చిన అరకొర రుణమాఫీ సొమ్ము వడ్డీకే జమేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం. – విజయ్‌కుమార్, కె.బ్యాడిగెర గ్రామం, రొళ్ల మండలం -
రూపాయికి మరో 17పైసలు లాభం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ బలపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 17 పైసలు లాభపడి 69.54 వద్ద ముగిసింది. ఈ ఏడాది ప్రారంభం రోజు జనవరి 1వ తేదీన రూపాయి 69.43 స్థాయిని చూసింది. అటు తర్వాత రూపాయి మళ్లీ ఈ స్థితిని చూడ్డం ఇదే తొలిసారి. గడచిన మూడు రోజుల్లో రూపాయి 60 పైసలు బలపడింది. బుధవారం ఎగుమతిదారులు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున డాలర్ అమ్మకాలకు దిగారని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లోకి మరిన్ని నిధులు వస్తాయన్న అంచనాలు రూపాయికి వరుసగా రెండవరోజూ లాభాలను తెచ్చిపెట్టినట్లు విశేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 12 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులూ రూపాయికి కలిసి వస్తోంది. -
బీమాకు కొర్రీ.. రైతుకు వర్రీ!
సాక్షి, హైదరాబాద్: రైతుబీమా అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోయిన మూడు నుంచి పది రోజుల్లోగా ఆయా కుటుంబాలకు బీమా కింద రూ.5 లక్షలు ఎల్ఐసీ నుంచి ఇప్పించాలి. కానీ, జిల్లా వ్యవసాయాధికారులు, ఎల్ఐసీ, బ్యాంకు వర్గాల కారణంగా కొన్నిచోట్ల జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని గతేడాది ఆగస్టు 14వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏ కారణంతోనైనా 58 ఏళ్ల లోపు రైతులు చనిపోతే వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రూ. 5 లక్షల బీమా పరిహారం చేతికందేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. అందుకోసం 28 లక్షలమంది రైతుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రూ.636 కోట్లను ఎల్ఐసీకి ప్రీమియం కింద చెల్లించింది. అంటే.. ఒక్కో రైతుకు రూ.2,271 ప్రీమి యం చెల్లించింది. బీమా పరిహారాన్ని రైతులకు సకాలంలో అందించేలా ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఎల్ఐసీ కాకుండా వ్యవసాయశాఖ తీసుకుంది. రైతు చనిపోతే మరణ ధ్రువీకరణపత్రం, ఇతర డాక్యుమెంట్లను తీసుకోవడం, పరిశీలించడం, అప్లోడ్ చేయడం వంటి పనులను కిందిస్థాయి వ్యవసాయాధికారులే చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు 7,486 మంది రైతులకు రైతుబీమా కింద పరిహారం అందింది. ఇంకా 300 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంది. అందులో 192 దరఖాస్తులు జిల్లా వ్యవసాయాధికారుల వద్ద ఉండిపోయాయి. వాటికి ఆమోదం తెలపడంలో జాప్యం జరుగుతోందని నల్లగొండ జిల్లాకు చెందిన బాధిత రైతు కుటుంబసభ్యుడు ఎం.వీరేశం ఆరోపిస్తున్నారు. నల్లగొండ, మెదక్ జిల్లాల్లో 18 దరఖాస్తుల చొప్పున ఆయా జిల్లా వ్యవసాయాధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 15, నిజామాబాద్ జిల్లాలో 13 పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే చనిపోయిన 55 మంది రైతుల బీమా దరఖాస్తులను ఇప్పటికీ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 11 రైతు బీమా దరఖాస్తులను అప్లోడ్ చేయలేదు. ఎల్ఐసీ ఎందుకు తిరస్కరించినట్లు? రైతుబీమా ప్రక్రియలో అన్నీ సక్రమంగా ఉన్నా కొన్ని దరఖాస్తులు ఎల్ఐసీ వద్ద తిరస్కరణకు గురికావడంపై విమర్శలున్నాయి. మొత్తం 43 మంది రైతుల పరిహారాన్ని ఎల్ఐసీ తిరస్కరించిందని వ్యవసాయశాఖ తెలిపింది. అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించినా ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో తెలియదని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబసభ్యుడు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో 8 మంది రైతుల బీమాను ఎల్ఐసీ తిరస్కరించింది. ఎల్ఐసీ ఆమోదించి డబ్బు పంపినా బ్యాంకులు సొమ్ము ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నాయి. ఈవిధంగా రాష్ట్రంలో 10 మంది రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
ఏటీఎం దొంగ అరెస్ట్
కళ్యాణదుర్గం: అమాయకులను లక్ష్యంగా చేసు కుని ఏటీఎం ద్వారా నగదు చేయడానికి సహాయపడుతున్నట్టు నటించి.. వారికి ఇతరుల ఏటీఎం కార్డు అంటగట్టి.. తర్వాత వారి కార్డుతో డబ్బు చేసుకునే దొంగను బ్యాంకర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే.. ఈ నెల ఐదో తేదీన ముదిగల్లు క్రాస్‌లో గల స్టేట్‌బ్యాంకులో రాయదుర్గం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాటువేశాడు. ముదిగల్లు రైతు రూ.లక్ష అవసరం కావడంతో అక్కడకు వచ్చాడు. ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే విధానం తెలియకపోవడంతో ఓ వ్యక్తి ద్వారా తొలుత రూ.40 వేలు డ్రా చేయించుకున్నాడు. మిగిలిన మొత్తం కావాలంటే మరో రోజు రావాల్సిందేనని ఆ వ్యక్తి చెప్పి వెళ్లిపోయాడు. ఇదంతా గమనించిన యువకుడు ‘పెద్దాయనా.. ఆయన మాటలెందుకు వింటావు..ఇంకా ఎక్కువ డ్రా చేయొచ్చులే’ అంటూ రైతును నమ్మించాడు. రైతు వెంకటేశులు ఏటీఎం తీసుకుని స్వైపింగ్‌లో డ్రా చేస్తున్నట్లు నటించి.. తర్వాత డబ్బు రాలేదని చెప్పి అతడి ఏటీఎం కార్డును తనవద్ద ఉంచుకుని మంగమ్మ పేరుపై గల ఏటీఎం కార్డును అందజేశాడు. ఏడో తేదీ రైతు ఏటీఎంకు, బ్యాంకుకు వెళ్లగా డబ్బు డ్రా చేసేకోలేకపోయాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఏటీఎం కార్డు మారిందని తేల్చారు. అనంతరం సదరు ఏటీఎంను బ్లాక్ చేశారు. అయితే అంతకుమునుపే యువకుడు రూ.12వేలు డ్రా చేసేశాడు. ♦ శుక్రవారం రోజు అదే స్టేట్‌బ్యాంక్‌లో గోళ్ల వీఆర్ఏ నాగరాజును కూడా ఆ యువకుడు మోసం చేశాడు. ఏటీఎం ద్వారా రూ.4వేలు తస్కరించాడు. ♦ శుక్రవారం స్టేట్‌బ్యాంకుకు వెళ్లి స్వైపింగ్‌లో స్లిప్ పేపర్ రావడం లేదని సిబ్బందికి చెప్పి వెళ్లాడు. అప్పటికే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ కుమార్, సిబ్బంది పోలీసులను పిలిపించి ఆ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐ జమాల్‌బాషాలు సదరు బ్యాంకుకు వెళ్లి సీసీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి సూత్రధారులు, పాత్రదారులు ఇంకా ఎవరన్నదీ పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
రూపాయి ఈ వారం 70ని తాకొచ్చు!
ముంబై: రూపాయి మరింత పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ బలపడుతుండటం... భారత్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల తిరోగమనం, ముడి చమురు ధరల పెరుగుదలతో రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ వారంలో డాలరుతో రూపాయి మారకం విలువ 70ని తాకొచ్చని వారు అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతానికి 69.30 రూపాయికి చాలా కీలకమైన స్థాయి అని, దీన్ని గనుక కోల్పోతే వేగంగా 70కి జారిపోవచ్చనేది బ్యాంకర్ల అంచనా. గత నెల 28న రూపాయి ఇంట్రాడేలో 69.10 ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న 68.95 వద్ద ముగింపులో కూడా కొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని రూపాయి నమోదు చేసింది. గత శుక్రవారం 68.87 వద్ద ముగిసింది. ‘ముడిచమురు ధరల జోరుతో కరెంట్ అకౌంట్ లోటు (మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం) పెరిగిపోతోంది. చమురు, ఇతర దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగబాకుతోంది. దీనివల్ల రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ వారంలో రూపాయి విలువ 70ని తాకొచ్చు. అయితే, అ స్థాయిలోనే ఉండిపోయే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఈ క్షీణతను అడ్డుకోవడానికి ప్రయత్నించొచ్చు’ అని సీనియర్ బ్యాంక్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జూన్ 29తో ముగిసిన వారానికి భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 406.05 బిలియన్ డాలర్లకు చేరడంతో ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యానికి తగిన బలాన్ని అందిస్తోందని మరో బ్యాంకర్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవలే ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం కూడా రూపాయిని దెబ్బతీస్తోందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏఎంఎల్) తాజా నివేదికలో పేర్కొంది. జూన్ 6న ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచి 6 శాతానికి చేర్చిన నాటి నుంచి చూస్తే భారత్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి 2 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని.. అప్పటి నుంచి రూపాయి విలువ 1.9 శాతం పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది. -
ఇక రాత్రి 11 దాటితే ఏటీఎంలు మూసివేత!
-
రాత్రి 11 దాటితే నో ఏటీఎం!
సాక్షి, హైదరాబాద్: ఇకపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎం కేంద్రాలు మూతపడనున్నాయి. ఏటీఎంల నిర్వహణ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాయి. నిర్ణీత లావాదేవీల కంటే తక్కువ ఉన్న ఏటీఎం కేంద్రాలను రాత్రి వేళల్లో డీ–లింక్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించాయి. నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్ వంటి సైబర్ నేరాలు తగ్గించడానికి డీ–లింక్ చేయడమే కాక ఆయా కేంద్రాలను నిర్ణీత సమయంలో పూర్తిగా మూసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు. నిర్వహణ కోణంలో చూసిన బ్యాంకర్లు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ఏటీఎంలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని పోలీసులు బ్యాంకర్లకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏటీఎం కేంద్రాల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలు ఉండే ఏటీఎంలను రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు డీ–లింక్ చేసి ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకర్లు పోలీసులకు తెలిపారు. ఇలాంటి ఏటీఎంల వల్ల ఏసీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని వారు పేర్కొన్నారు. డీ–లింక్ చేయడం ద్వారా ఏటీఎం మిషన్ పని చేయకుండా పోతుంది. అప్పుడు ఏసీలను ఆఫ్ చేసినా మిషన్‌కు ఎలాంటి నష్టం ఉండదు. నిర్ణీత సమయం తర్వాత మళ్లీ సదరు ఏటీఎంను సర్వర్‌తో లింక్ చేయడం ద్వారా యథావిధిగా పని చేసేలా చేయవచ్చు. మూసేయాలని సూచించిన పోలీసులు.. బ్యాంకర్ల ప్రతిపాదనకు సైబరాబాద్ పోలీసులు కీలక సవరణలు సూచించారు. నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడానికి ఏటీఎంలను డీ–లింక్ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలున్న ఏటీఎంల్లో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. డెబిట్/క్రెడిట్ కార్డుల్ని క్లోనింగ్ చేసే ముఠాలు ఇలాంటి వాటినే ఎంచుకుని.. రాత్రి వేళల్లో ఏటీఎంలకు స్కిమ్మర్లు, చిన్న కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్డుకు సంబంధించిన సమాచారం, పిన్ నంబర్లు తస్కరిస్తాయి. వీటి ఆధారంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా చేస్తుంటాయి. మిషన్‌ను డీ–లింక్ చేసినప్పటికీ వినియోగదారుడు వచ్చి అందులో కార్డు పెట్టే, పిన్ నంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉందని పోలీసులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లారు. అలా చేస్తే స్కిమ్మింగ్ పూర్తయిపోతుందని, అలా కాకుండా ఉండాలంటే ఆయా ఏటీఎంల షట్టర్లు దింపడం ద్వారా పూర్తిగా మూసేయాలని సూచించారు. ఏటీఎం కేంద్రాలను నిర్ణీత సమయాల్లో మూసి ఉంచితే ఇలాంటి నేరాలకూ ఆస్కారం లేకుండా చేయవచ్చని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రతినిధులు విషయాన్ని తమ ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్తామని, అనుమతి లభించిన వెంటనే అమలులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. -
బ్యాంకర్లకు ధన్యవాదాలు : ఈటెల
సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకంలో బ్యాంకర్లు గొప్ప సహకారం అందించారని, వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రైతు బంధు పథకంతో బ్యాంకులలో డబ్బుల కొరత కొంతమేర తగ్గిందన్నారు. దేశంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గురువారం తాజ్ డెక్కన్‌లో జరిగిన ‘19వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం’లో ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2018-19 వార్షిక క్రెడిట్ ప్లాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. రైతు బంధు పథకం కోసం కేంద్రం నుంచి 5 వేల కోట్ల రూపాయలను కోరగా.. 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఈటెల ఈ సందర్భంగా తెలిపారు. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రమైన తెలంగాణను, అనేక అద్భుతాలు సాధించి నెంబర్ వన్‌లో నిలపడానికి బ్యాంకర్ల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. తెలంగాణ ప్రస్తుతం ఒక రోల్ మోడల్‌గా ఉందన్నారు. దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అని అప్పట్లో చదువుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్‌గా చదువుకుంటున్నాం అని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందు ఉందని కాగ్ కూడా క్రెడిట్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, దానికి బ్యాంకర్లు అందించిన సహకారం మరవలేదని కొనియాడారు. మిషన్ భగీరథకు బ్యాంకర్లు రూ.25 వేల కోట్లు మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు 25 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించారన్నారు. మిషన్ భగీరథకు బ్యాంకర్లు ఇచ్చిన సహకారం ఇప్పటికీ మరవలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితే మరింత సాగు విస్తీర్ణంలోకి వస్తుందని కూడా తెలిపారు. గతంలో ‘రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనేవారని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ అనే స్థాయికి ఎదిగామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్‌ల సంఖ్య పెంచాలని ఈటెల బ్యాంకర్లను కోరారు. బ్యాంక్‌లలో ఉద్యోగుల సంఖ్య పెంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు రుణాల ఇచ్చి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం, బ్యాంకులపైనే ఉందన్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు బ్యాంక్ డిపాజిట్ లేకుండా రుణాలు ఇవ్వాలని కోరారు. కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వమే ఆదుకునేలా రైతు బీమా పథకం పెట్టామని చెప్పారు. బ్యాంకర్లు ప్రభుత్వంలో భాగమని, తెలంగాణ రాష్ట్రానికి బ్యాంకర్ల సహకారం ఎప్పటికీ ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి బ్యాంక్‌లకు సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. -
రైతును ముంచిన శనగ
సాక్షి, రాజుపాళెం : రైతులను శనగ పంట ముంచేసింది. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం పట్టించుకోక వారు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది రబీలో జిల్లాలో 84480 హెక్టార్లలో శనగ సాగు చేశారు. విత్తనం వేశాక ఒక్క వాన కూడా పడకపోవడంతో పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. ఎకరాకు కేవలం 2 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఎకరాకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ట్రాక్టరు బాడుగలు, కూలీలు తదితర వాటి కోసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. ధర అంతంత మాత్రమే... శనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.3500 పలుకుతోంది. గతంలో రైతులు విత్తనం వేసేటప్పుడు కొనుగోలు చేయగా.. క్వింటా రూ.7 వేలు పలికింది. ఇలా ధర వ్యత్యాసం ఉంటే ఎలా గట్టెక్కుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.8000 కల్పించి ఉంటే.. పరిస్థితి కొంత వరకు బాగుండేదని వారు పేర్కొన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి కౌలుకు తీసుకున్నారు. దీంతో పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. అటు అప్పులు కట్టలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక సందిగ్ధంలో ఉన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మంది రైతులకు టోకన్లు దొరకక అమ్ముకోలేదు. మరి కొంతమంది రైతులు శనగ పంట నూర్పిడి తర్వాత పొలాల్లోనే వ్యాపారులకు అనామత్ (ధాన్యం వేశాక ఎప్పుడైనా అమ్ముకోవచ్చు) వేశారు. ప్రభుత్వ గోదాములు నిండిపోవడంతో చాలా మంది ప్రైవేటు గోదాములను ఆశ్రయించారు. ఒక్కో బస్తాకు ఏడాదికి రూ.130 బాడుగ చెల్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు వేలం నోటీసులు ఒక వైపు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగానికి బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడంతో.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గోదాముల్లో ఉంచిన ధాన్యాన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. గతంలో క్వింటా ధర రూ.10 వేలు పలికింది. ఇలాంటి ధర వచ్చిన తర్వాత అమ్ముకుందామని కొందరు రైతులు భావించారు. అయితే ఏడాది గడిచినా ధర తక్కువగా ఉండటంతో అమ్ముకోలేక పోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించక ఏడాది పూర్తి కావడంతో.. బ్యాంకర్లు రైతులకు వేలం నోటీసులు పంపారు. ఆ తర్వాత శనగలు వేలం వేస్తామని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించి, రుణాలను రెన్యువల్ చేయాలని కోరినా బ్యాంకర్లు వినుకోవడం లేదు. గతంలో క్వింటా ధర రూ.6000 నుంచి రూ.6500 వరకు ఉండటంతో.. బ్యాంకులు క్వింటాకు రూ.3500 నుంచి రూ.4500 వరకు రుణం ఇచ్చాయి. ప్రస్తుతం క్వింటా రూ.3500 పలుకుతుండటంతో తీసుకున్న అప్పునకు కూడా సరిపోవడం లేదు. ఎమ్మెల్యేను కలిసిన రైతులు రుణం చెల్లించకుంటే ఈ నెల 22న వేలం వేస్తామని బ్యాంకులు పత్రికల్లో ప్రకటన ఇచ్చాయి. దీంతో రాజుపాళెం మండలంలోని పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని కలిసి, పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే వెంటనే బ్యాంక్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఫలానా రోజు కట్టాలని చెప్పలేదు కదా.. ఉన్నట్టుండి ఇప్పుడు కట్టమంటే ఎలా కడతారు. కాదు కూడదు రుణం వడ్డీతో సహా చెల్లించాలంటే నేనే చెల్లిస్తా. గాంధీ మార్గంలో దీక్ష చేస్తా. శనగలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయనీయబోం’ అని మేనేజర్‌కు ఎమ్మెల్యే చెప్పారు. -
పీఎన్బీ స్కాంపై మౌనం వీడిన జైట్లీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మౌనం వీడారు. ఈ స్కాంపై తొలిసారి స్పందించారు. ఈ స్కాంలో ఆడిటర్లు, బ్యాంకర్లనే జైట్లీ నిందించారు. పీఎన్బీలో చోటుచేసుకున్న ఈ రూ.11,400 కోట్ల కుంభకోణానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ''నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు మేనేజ్మెంట్కి ఉంటే, దాన్ని సమర్థవంతంగా, సరియైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. ఒకవేళ దానిలో ఏమైనా లోపాలు గుర్తిస్తే, దానికి వారే బాధ్యత వహించాలి'' అని జైట్లీ ఏడీఎఫ్ఐఏపీ వార్షిక సమావేశంలో అన్నారు. ఆడిటర్లు ఏం చేస్తున్నారు? అంతర్గత, బహిర్గత ఆడిటర్లు దీన్ని గుర్తించడం విఫలమైతే, సీఏ నిపుణులు గురించి తీవ్రంగా ఆలోచించాల్సి ఉందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. బ్యాంకుల నిర్వహణపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకుల సిస్టమ్ నమ్మకం, రుణగ్రహీత, రుణదాత రిలేషన్‌షిప్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. కాగ, పీఎన్బీలో నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి వచ్చాక, ఈడీ, సీబీఐ వీరి సంస్థలపై భారీ ఎత్తున్న తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో 120 షెల్ కంపెనీలు పాలుపంచుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో 80 కంపెనీలు నీరవ్ మోదీ, చౌక్సి రన్ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కేసులో భాగమైన మెహుల్ చౌక్సి ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి జెమ్స్, దాని అసోసియేటెడ్ సంస్థలపై ఐటీ కూడా దాడులు చేసింది. ముంబై, పుణే, సూరత్, హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాల్లో ఉన్న కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది. -
మసక ‘ముద్ర’
సాక్షి, ఆదిలాబాద్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను స్థాపించుకునేందుకు, నిలదొక్కుకునేందుకు, విస్తరించుకునేందుకు ఆర్థిక చేయూతగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం జిల్లాలో మసకబారి అభాసుపాలవుతోంది. ఈ పథకం ప్రారంభమైన మూడేళ్లలో జిల్లాలో ఇచ్చింది అరకొర మాత్రమే. ఈ రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు నిరాసక్తత చూపిస్తున్నారు. రికవరీ జరగడం లేదా మరేమో గానీ ‘ముద్ర’ మాటెత్తడానికే బ్యాంకర్లు ఆసక్తి కనబర్చడం లేదు. బడా వ్యాపారులు బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టినా చోద్యం చూసే బ్యాంకర్లు చిరువ్యాపారులపై మాత్రం కఠినంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చింది అరకొరే.. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున రుణాలు ప్రకటిస్తుంది. నాబార్డ్ ద్వారా ప్రకటించే జిల్లా వార్షిక ప్రణాళికలోనూ వ్యవసాయ పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణలక్ష్యం తర్వాత ఎంఎస్ఎంఈ కింద పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుంది. ముద్ర రుణాలు కూడా ఇందులో భాగమే. ఈసారి ఎంఎస్ఎంఈ కింద జిల్లాకు మరో 10 శాతం రుణ లక్ష్యం పెంచారు. ముద్ర రుణాలను 2015 ఏప్రిల్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మూడేళ్లలో జిల్లాలో ఇచ్చింది అరొకర మాత్రమే. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఆ రంగంలో రాణించేందుకు వీలుగా మూడు వేర్వేరు పథకాలు శిశు కింద రూ.50వేలు, కిశోర్ కింద రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు, తరున్ కింద రూ.10లక్షల వరకు రుణాలు అందజేసే వీలుంది. శిశు కింద కొత్త రుణాలు ఇవ్వడం, కిశోర్ కింద వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు, తరుణ్ కింద నిలదొక్కుకొని వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలను బట్టి ఈ రుణాలు ఇవ్వాలి. ప్రధానంగా ముద్ర రుణాలకు సంబంధించి బ్యాంక్ వారీగా టార్గెట్లు ఉండడంతో జిల్లా లక్ష్యం ఎంత అన్నదానిపై స్పష్టతలేదు. అయితే ముద్ర రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముభావం ప్రదర్శిస్తున్నారని పలువురు చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు, షూరిటీలు అవసరం లేకుండానే సొంతపూచికత్తుపై ఈ రుణాలు ఇచ్చే వీలుంది. బ్యాంకులకు వెళ్తున్న పలువురు వ్యాపారులకు బ్యాంకర్ల నుంచి మొండి చెయ్యే ఎదురవుతుంది. అనేకమార్లు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కనికరించడం లేదు. దీంతో చేసేదేమి లేక వారు నిరాసక్తతతో వెనుదిరుగుతున్నారు. డీఎల్ఆర్సీలో చర్చ.. ఇటీవల రాష్ట్ర మంత్రి జోగురామన్న, కలెక్టర్ దివ్యదేవరాజన్ అధ్యక్షతన బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లాస్థాయి రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశంలో ముద్ర రుణాలపై చర్చకొచ్చింది. ప్రధానంగా ఈ రుణాలివ్వడంలో బ్యాంకర్ల తీరుపై డీఎల్ఆర్సీ విస్మయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం గడువు మరో నెలన్నరలో ముగియనున్న నేపథ్యంలో అప్పటికైనా కొంత పరిస్థితిలో మార్పు రావాలని హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా ప్రతీ బ్యాంకు ఫిబ్రవరిలో ఐదు అకౌంట్లు, మార్చిలో మూడు అకౌంట్లు ముద్ర రుణాలవి తెరవాలని చెప్పడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 2,560 అకౌంట్లు ముద్ర రుణాల కింద ఉన్నాయి. ఒకవేళ డీఎల్ఆర్సీ సమావేశానికి అనుగుణంగా కొత్త అకౌంట్లు తెరిచిన పక్షంలో ఈ సంఖ్య 3,288కి పెరిగే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ కింద రుణ లక్ష్యం.. 2017–18 రూ. 144.62 కోట్లు 2018–19 రూ. 161.56 కోట్లు పెరిగిన శాతం 10.55 శాతం ముద్ర రుణాలు.. (మూడేళ్లలో రుణం, అందజేసిన అకౌంట్ల వివరాలు) స్కీం అకౌంట్లు ఇచ్చిన రుణం (రూ.కోట్లలో) శిశు 1345 6.64 కిషోర్ 1177 17.05 తరున్ 38 2.71 మొత్తం 2560 26.41 -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్
సాక్షి, ముంబై: బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించనున్నారు. వేతన సవరణను డిమాండ్ చేస్తూ యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (యుఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో బ్యాంకర్లు ఈ సమ్మెకు దిగనున్నారు. భారత బ్యాంకింగ్ రంగంలోని తొమ్మిది యూనియన్లు మార్చి 15 వ తేదీన సమ్మె చేసేందుకు నిర్ణయించామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం చెప్పారు. నవంబర్ 2017 నాటి పే రివిజన్ పెండింగ్‌లో ఉందని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాటానికి దిగనున్నామని చెప్పారు. అలాగే యూనియన్ ఆధ్వర్యంలో ఇతర నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ముంబయిలో జరిగిన యుఎఫ్‌బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. -
ఇంకా ప్రజల మన్ననలు పొందలేకపోతోంది..
పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఏడాది. ఏడాది గడుస్తున్నా.. నోట్ల రద్దు అనంతరం మార్కెట్లోకి వచ్చిన కొత్త రూ.2000 నోటు మాత్రం ఇంకా ప్రజల మన్ననలను పొందలేకపోతుంది. ఇప్పటికీ ఈ నోటును తిరస్కరిస్తూనే ఉన్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. చిన్న చిన్న లావాదేవీలకు ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాలకు ఈ నోటు వాడకం కష్టతరంగా ఉందని తెలిపారు. గతేడాది నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం కొన్ని నెలల వరకు బ్యాంకింగ్ కార్యకలాపాలు చాలా క్లిష్టతరంగా మారాయి. పెద్ద నోట్లను కొత్త నోట్ల రూపంలో మార్చుకోవడానికి ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఒక్క ప్రజలే కాక, ఇటు బ్యాంకింగ్ సిబ్బంది కూడా రాత్రింబవళ్లు పనిచేసిన రోజులున్నాయి. ప్రస్తుతం పరిస్థితి కాస్త సద్దుమణిగింది. కానీ ఇప్పటికీ నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త నోటు రూ.2000కు మాత్రం ఎలాంటి ఆదరణ లభించడం లేదు. '' ప్రజలు ఇప్పటికీ రూ.2000 నోటును ఇష్టపడటం లేదు. చిన్న కరెన్నీ నోట్లు రూ.500, రూ.200, రూ.100ను మాత్రమే వారు కోరుకుంటున్నారు. కానీ డిమాండ్‌కు తగ్గట్టు వీటి సరఫరా లేదు'' అని మహాగుజరాత్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనక్ రావల్ చెప్పారు. అయితే ఎక్కువ మొత్తంలో నగదును విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఎక్కువగా ఏటీఎంల నుంచి రూ.2000 డినామినేషన్ నోట్లే వస్తున్నాయని, ఆ సమయంలో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో చిన్న మొత్తాలు కూడా ప్రజలకు ఎక్కువగా అందుబాటులోకి రావడం లేదు. చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ విత్‌డ్రాలపై బ్యాంకులు పరిమితులు విధించి ఛార్జీలు విధించడం మరో సమస్యగా ఉంది. -
పెద్ద నోట్ల రద్దుపై బ్యాంకర్ల స్పందన..
సాక్షి, న్యూఢిల్లీ : ఇంకా ఒక్క రోజైతే పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తవుతుంది. తొలి వార్షికోత్సవం పూర్తవుతున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై బ్యాంకర్లు స్పందించారు. పెద్ద నోట్ల రద్దు తమకు మంచే చేసిందని, డిపాజిట్లు భారీగా పెరుగడంతో పాటు డిజిటలైజేషన్ చాలా వేగవంతంగా విస్తరించేలా చేసిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. గతేడాది నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. బ్లాక్‌మనీ, అవినీతి నిర్మూలనకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. '' బ్యాంకింగ్ రంగం పరంగా తీసుకుంటే, పెద్ద నోట్ల రద్దుతో అధికారిక బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి చాలా నగదు వచ్చి చేరింది. ఇది బ్యాంకింగ్ రంగానికి మంచి పరిణామం. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు కనీసం 250-300 బేసిస్‌లో పెరిగాయి. ఇది నిజంగా మాకు చాలా పెద్ద సానుకూలమైన విషయం'' అని ఎస్బీఐ చైర్మన్ రజ్నీష్ చెప్పారు. బ్యాంకింగ్ రంగంలోకి వచ్చిన డిపాజిట్లు ట్రిలియన్ల కొద్దీ ఉన్నాయి. దీంతో బ్యాంకుల్లో ఫండ్స్ పెరిగాయి. మొత్తంగా మనీ మార్కెట్ రేట్లు కిందకి దిగొచ్చాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో అధికారిక ఫైనాన్సియల్ సేవింగ్స్ పెరిగాయని, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్‌లోకి ఫండ్స్ వెల్లువ ఎగిసిందని ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ చందా కొచ్చర్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్ చాలా వేగవంతంగా విస్తరించదన్నారు. -
నికో కార్పొరేషన్ మూసివేత!
కోల్‌కతా: మొండి బాకీల కేసులో కేబుల్ తయారీ సంస్థ నికో కార్పొరేషన్ లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా బెంచ్ ఆదేశించింది. దివాలా చట్టంలోని సెక్షన్ 14 కింద కంపెనీపై ఈ చర్యలు తీసుకుంటారు. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్) రద్దు తర్వాత ఎన్సీఎల్టీ ముందుకు వచ్చిన తొలి కంపెనీ నికోనే. బ్యాంకర్లు కాకుండా తామే స్వయంగా ఎన్సీఎల్టీని అశ్రయించినట్లు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ కౌల్ చెప్పారు. తాము అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కంపెనీ లిక్విడేషన్ ఆదేశాలు రావడం ఆశ్చర్యపరిచినట్లు తెలియజేశారు. ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నికో రెండు ప్లాంట్లలో (పశ్చిమ బెంగాల్‌లోని శ్యామ్‌నగర్, ఒడిషాలోని బారిపద) సుమారు 600 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ కోసం ఇచ్చిన 270 రోజుల గడువు ముగియడంతో లిక్విడేషన్ అనివార్యంగా మారిందని నికో కార్పొరేషన్‌కి నిర్దేశించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) కునాల్ బెనర్జీ తెలిపారు. ఈ లోగా సంస్థ యాజమాన్యం సమర్పించిన పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీని రుణదాతలు తిరస్కరించినట్లు వెల్లడించారు. వివిధ బ్యాంకుల నుంచి నికో సుమారు రూ. 186 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఇందులో అత్యధిక భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పొందినదే. -
పరపతి లేక.. పట్టించుకోక!
∙ కౌలురైతును కనికరించని బ్యాంకర్లు ∙ ఎక్కడా పంట పెట్టుబడులు దొరకని పరిస్థితి ∙ గుర్తింపుకార్డులివ్వరు.. రుణాలు దొరకవు కౌలు రైతుకు అన్యాయం జరుగుతున్నా నోరుమెదిపే వారే కరువయ్యారు. ప్రభుత్వ నిర్లిప్తతకు తోడు అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో కౌలురైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బయట అప్పులు దొరకక.. బ్యాంకర్లు ఇవ్వక అల్లాడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తల తాకట్టుపెట్టి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. చివరకు అప్పులపాలై తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లోని సంక్షేమ çఫలాలు కూడా అందకపోవడంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వారికి గుర్తింపు కార్డుల విషయంలోను సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. సాక్షి, కడప :కౌలురైతు సంక్షేమం గాల్లో దీపంలా మారింది. వారికి పరపతి దక్కడం లేదు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఏం చేయాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేక కృషితోపాటు రైతుల రణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తామన్న బాబు సర్కార్ అధికారం అందగానే అన్నింటిని మర్చిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏవేవో హామీలిచ్చి ఏమీ చేయలేక చేతులెత్తేసింది.. అధికారంలోకి రాక మునుపు ఒకమాట..వచ్చిన తరువాత మరొకమాట చెబుతూ చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. కేవలం ఆర్భాటాలే చేస్తున్నారు. రుణాలు అంతంతమాత్రమే కౌలురైతుల విషయంలో ఎవరూ కనికరం చూపడం లేదు. ఎందుకంటే వారు పంట పెట్టుకునేందుకు అవసరమైన పెట్టుబడి కూడా దొరకని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లినా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఏదొక సాకు చూపి తిప్పుకుంటున్నారే తప్ప రుణాలు మం జూరుచేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా పొలాల్లో హలం పట్టి వ్యవసాయం చేస్తున్నా.. ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. పైపెచ్చు ప్రభుత్వ ప్రయోజనాలు లేకపోవడం కూడా వారిని కృంగదీస్తోంది. ఇలా అయితే పంటల సాగు కష్టమన్న తరహాలోకి కౌలురైతు వచ్చా డు. జిల్లాలో కౌలుదారులకు 10శాతం రుణాలు కూడా అందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుర్తింపుకార్డులు ఇవ్వరు.. ప్రభుత్వం కౌలుదారులకు గుర్తింపుకార్డులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో 13,550మంది కౌలుదారులు ఉండగా, ఇప్పటివరకు 4,821మందికి మాత్రమే గుర్తిం పుకార్డులు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కౌలురైతులు నరకం అనుభవిస్తున్నారు. కార్డుల క్రమబద్ధీకరణ జరిగితేనే కౌలు రైతుకు ఏదైనా చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే పాతవాళ్లకే చాలామందికి ఇంతవరకు అందివ్వలేదు. దీంతో ఎక్కడికి వెళ్లినా వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కౌలు రైతులకు భరోసా కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుపత్రంతో బతుకు చిత్రం మారుతుందనే ఆశతో పొలంలోకి అడుగుపెడుతున్నా వారి జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడడం లేదు. దశాబ్దాలుగా బడుగు జీవుల వ్యథలకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. పరపతి బాసట లేదు....కనీసం అధికారిక గుర్తింపు ఎంతమాత్రం లేదు..భూమి హక్కు మాట పక్కన పెడితేనే మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో కనీస గుర్తింపు లేకుండా కౌలు రైతును ఆదుకునేది ఎలాగో అధికారులే సెలవివ్వాలి! తనువు చాలిస్తున్న కౌలురైతులు వ్యవసాయంపై ఆధారపడి నిత్యం కష్టం చేస్తున్నా ఆశించిన మేర ఉత్పత్తులు రాక అన్నదాత దిగాలు చెందుతున్నాడు. పెట్టుబడులు భారీగా పెడుతున్నా దిగుబడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో జిల్లాలో పంటలకు చేసిన అప్పులు తీరక అనేకమంది రైతులు తనువు చాలిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తుందే తప్ప ఆదుకోవడం లేదు. సవాలక్ష ఆంక్షలతో అరకొరగా అందించే ఆర్థికసాయాన్ని కూడా నిబంధనల పేరుతో కొంతమందికే పరిమితం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పంట సాగు చేస్తున్నా కౌలుదారులు గుర్తింపుకార్డులతోపాటు రుణాలు అందక బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆవేదన కలిగిస్తోంది. -
కొండెక్కని ట్రైకార్ రుణాలు..!
♦ 2016–17 సంవత్సరంలో రుణాల ఊసేలేదు ♦ 2015–16 లక్ష్యం నెరవేరలేదు ♦ 2014–15లో 1601 యూనిట్లకు ఇచ్చినవి 491 యూనిట్లే ♦ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న గిరిపుత్రులు ♦ రుణాల మంజూరుకు ఆసక్తి చూపని బ్యాంకర్లు ♦ రికవరీ చేయలేమంటూ మొండిచేయి చూపుతున్న వైనం ♦ పట్టించుకోని పాలకులు, అధికారులు ఆవేదనలో లబ్ధిదారులు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు వారికి ఇప్పటికీ ఆమడ దూరమే. కనీసం రుణ మందితే స్వయం ఉపాధి పొందుదామని, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుందామని ఆశించిన గిరిపుత్రులకు నిరాశే ఎదురవుతోంది. పాలకులు, అధికారుల కరుణలేకపోవడంతో దరఖాస్తు చేయడమే తప్ప చేతికి రుణం అందడం లేదు. వ్యయప్రయాసల కోర్చి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా మొండిచేయి చూపుతున్నారు. రుణాలు రికవరీ చేయలేమంటూ బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు. ఫలితం.. రుణాలు కొండెక్కడం లేదు. గిరిజనుల బతుకులు మారడం లేదు. దీనికి నెరవేరని ట్రైకార్ రుణాల లక్ష్యం.. గ్రౌండింగ్ కాని యూనిట్లు.. అందని రాయితీలే నిలువెత్తు నిదర్శనం. పార్వతీపురం టౌన్: గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ఏటా మంజూరు చేసే ట్రైకార్ రుణాలు గిరిజనుల చేతికి చేర డం లేదు. రుణాలు అందించడంలో అ ధికారులు, బ్యాంకర్ల అలక్ష్యం గిరిపుత్రులకు శాపంగా మారింది. రుణ లబ్ధి దారుల జాబితాను తయారు చేసినా రుణాల మంజూరు ‘ఎక్కడవేసిన గొంగ ళి అక్కడే’ అన్న చందంగా తయారైంది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి ఒక్క గిరిజనుడికీ రుణం అందలేదు. దరఖాస్తుదారులందరూ రుణాల కోసం ఎదురు చూస్తున్నా నిరాశే ఎదురవుతోంది. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికీ యూసీ అప్లోడ్ చేయలేదు. ఏడాది కాలంగా రుణ అర్హత పొందిన లబ్ధిదారులు కలెక్టర్, ఐటీడీఏ పీవో కార్యాలయాల చుట్టూ తిరిగి గ్రీవెన్స్‌సెల్‌లో వినతులు సమర్పిస్తున్నా స్పందన లేకపోతోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన యూనిట్లు ఇంకా కొన్ని గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి ట్రైకార్ రుణాలు 215 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి ప్రభుత్తం రూ.2.72 కోట్లు రుణ లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రభుత్వం తరఫున అందించాల్సిన రాయితీ రుణం రూ.1.60 కోట్లు కూడా రిలీజ్ చేసింది. బ్యాంకర్లు అందించాల్సిన రూ.1.11 కోట్లు రుణాన్ని మాత్రం రిలీజ్ చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. దీంతో ఏడాది కాలంగా రుణాలు అందడంలేదు. టెంట్ హౌస్‌లు, గొర్రెలు, గేదెలు, ఆవులు, కిరాణా దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా ఎదుగుదామనుకున్న గిరిపుత్రుల ఆశలు నిర్జీవమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీ జాతాపు, కొండదొర, ఎరుకల వంటి కులాలవారికి 60 శాతం, పీటీజీ గ్రామాల పరిధిలోని సవర, గదబ కులాల ప్రజలకు 90 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. రికవరీయే సమస్య.. ట్రైకార్ రుణాల కింద లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు మందుకు రాకపోవడానికి రికవరీనే సమస్యగా చూపుతున్నారు. అప్పుగా ఇచ్చిన రుణాన్ని లబ్ధిదారుల నుంచి వసూలు చేయాలంటే బ్యాంకర్లకు చుక్కలు కనిపిస్తున్నాయని వాదిస్తున్నారు. దీనివల్లే ట్రైకార్ రుణ లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని చెబుతున్నారు. రుణాలు అందజేయడం లేదు.. ప్రభుత్వం ప్రస్తుతం ఏ రకమైన రుణాలు మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం, బ్యాంకర్ల నుంచి ఎలాంటి రుణ సమాచారం అందలేదు. నిరుద్యోగులకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం రుణాలను మంజూరు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదు. రెండేళ్లుగా రణాలకోసం ఎదురు చూస్తున్నా ఇంతవరకు రుణం మంజూరు కాలేదు. – డప్పుకోట అశోక్, తులసివలస -
అన్నదాతల వద్దకొచ్చి అప్పులివ్వాలి
బ్యాంకర్లే రైతులనడిగే రోజులు రావాలి అదే నా కల.. నెరవేరి తీరుతుంది: కేసీఆర్ ► వ్యవసాయ, రెవెన్యూ శాఖలపై సమీక్ష ► రైతు సంఘాల ఏర్పాటు.. విధివిధానాలు ఖరారు ► భూ రికార్డుల నిర్వహణకు కూడా గ్రామస్థాయిలో 11 మందితో రైతు సమన్వయ సమితి ► పంట ధరల నిర్ణయంలో మండల కమిటీయే కీలకం ► అవసరమైతే రాష్ట్ర కమిటీ జోక్యం.. నేరుగా కొనుగోలు ► ప్రభుత్వ గ్యారంటీతో రూ.10 వేల కోట్లు సమకూరుస్తాం ► వ్యవసాయ భూముల రికార్డుల కోసం స్పెషల్ డ్రైవ్ లెక్క తేలాక కొత్త పాస్ పుస్తకాలు సాక్షి, హైదరాబాద్ మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైతులు కష్టాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వెలిబుచ్చారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష, నిర్లక్ష్యాల వల్ల తెలంగాణ రైతులు మరింత చితికిపోయారన్నారు. ‘‘మన రాష్ట్రంలో రైతులే ప్రధానం. వారి కోసం ఒక్కో పని చేసుకుంటూ పోతున్నం. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసినం. త్వరలోనే 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వచ్చే ఏడాది నుంచి ఎకరాకు ఎనిమిది వేల పెట్టుబడి, గిట్టుబాటు ధర , మార్కెట్ డిమాండ్ తదితరాల కోసం చర్యలు తీసుకుంటున్నం. ఫలితంగా రైతుల బతుకులు బాగుపడుతయని నమ్ముతున్న. ఇవన్నీ జరిగి ఐదేళ్లు గడిచాక, బ్యాంకులే రైతుల ఇండ్ల ముందు నిలబడి ‘అప్పులిస్తాం’అనే పరిస్థితి వస్తుంది. ఇది నేను కంటున్న కల. తప్పక నిజమై తీరుతది’’అని ఆయన ధీమా వెలిబుచ్చారు. రైతు సంఘాల ఏర్పాటు, భూ రికార్డుల సక్రమ నిర్వహణ తదితరాలపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు సంఘాల ఏర్పాటుకు సంబంధించి ఈ సందర్భంగా విధివిధానాలు ఖరారు చేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మెదక్, పాలమూరు జిల్లాల్లో ఇప్పటికే మార్పు వచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ‘హైదరాబాద్‌కు వలస వచ్చిన వారంతా రేషన్ కార్డులు వాపస్ చేసి సొంత జిల్లాలకు వెళ్తున్నారు. ఇది నాకెంతో సంతృప్తినిచ్చింది’అని వ్యాఖ్యానించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్‌లతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రైతు సంఘాల ఏర్పాటు విధివిధానాలివే: ⇒ రెవెన్యూ గ్రామానికో రైతు సంఘం ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతును సభ్యుడిగా చేర్చి 11 మందితో గ్రామ రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ, మహిళా రైతులకు ప్రాతినిధ్యం ఉంటుంది. గ్రామాల్లోని అన్ని సమితులను కలిపి మండల సమాఖ్య, ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర సమాఖ్యలను ఏర్పాటు చేస్తారు. ⇒ గ్రామ రైతు సమితులు ప్రతి రైతుతోనూ బ్యాంకు ఖాతా తెరిపించాలి. వ్యవసాయ అధికారులకు ఇచ్చిన ఈ బ్యాంకు ఖాతాల్లో హైదరాబాద్ నుంచే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. రైతులు ఎవరికీ దరఖాస్తు చేయాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరం ఉండదు. ⇒ మార్కెట్లోని అడితీదారులతో సంప్రదింపుల ద్వారా పంటల ధరలను నిర్ణయించడంలో మండల రైతు సమాఖ్య ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. ఆ తర్వాతే మార్కెట్‌కు ఉత్పత్తులు వస్తాయి. గిట్టుబాటు ధర కోసం అవసరమైతే రాష్ట్ర సమాఖ్య జోక్యం చేసుకుంటుంది. నేరుగా పంటను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర రైతు సంఘానికి బడ్జెట్లోనే రూ.500 కోట్ల మూల నిధి కేటాయిస్తారు. ప్రభుత్వ గ్యారంటీతో రూ.10 వేల కోట్లను రాష్ట్ర రైతు సంఘం సమకూర్చుకుంటుంది. ప్రభుత్వ అనుమతితో ఆ పంటలను ప్రాసెస్ చేసి రాష్ట్ర రైతు సంఘమే విక్రయిస్తుంది. భూ రికార్డుల నిర్వహణ విధివిధానాలు: ⇒ దేశంలో మరెక్కడా లేనివిధంగా వచ్చే నెలలో భూ రికార్డుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమి లెక్కా సరిచేయాలి. స్పెషల్ డ్రైవ్ కోసం అవసరమైతే 15 వేల మంది నిరుద్యోగ యువకులను నెలకు రూ.20 వేల వేతనమిచ్చి పనిచేయిస్తారు. ఇందుకు ప్రతి జిల్లాకూ ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తారు. ⇒ గ్రామంలో ఎంత భూమి (విలేజ్ ఆబాది), ఎవరి పేరిట ఉందో డ్రైవ్‌లో తేలుస్తారు. ఈ వివరాలన్నింటినీ గ్రామ ముఖ్య కూడలి వద్ద ప్రదర్శిస్తారు. వివాదాల్లేని భూములను తక్షణం, మిగతా వాటిని విచారణ తర్వాత ఏ రైతువో ప్రకటిస్తారు. భూ రికార్డులు సరిచేసేందుకు గ్రామ రైతు సంఘాలే వేదిక. వాటి సమక్షంలో భూమి వివరాలు సేకరణ, రికార్డులలో నమోదు జరుగుతాయి. ⇒ ఏ భూమి ఎవరిదో తేలాక కొత్తగా పాస్ పుస్తకాలిస్తారు. ప్రతి రైతుకూ, పాస్ పుస్తకానికి యూనిక్ కోడ్ ఇస్తారు. ఆ వివరాలన్నీ కంప్యూటర్లో నమోదు చేస్తారు. ఈ సరిచేసిన వివరాల ఆధారంగానే ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి పథకం అమలవుతుంది. భూ రికార్డులన్నీ సరి చేశాక ప్రకటించిన జాబితానే ప్రభుత్వానికి పంపుతారు. ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందన్న దాని ప్రకారమే బ్యాంకులో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. ⇒ భూమి కొన్నా, అమ్మినా వివరాలను సంబంధిత ఎమ్మార్వోకు, గ్రామ రైతు సంఘానికి తెలియచేయాలి. ఆ తర్వాతే రిజిస్టర్ చేయాలి. ఈ ప్రక్రియంతా నాలుగు రోజుల్లో పూర్తి కావాలి. రిజిస్టరైన తర్వాత 15 రోజుల్లో మ్యుటేషన్ (పేరు మార్పిడి) జరగాలి. అంతే సమయంలో పాస్ పుస్తకాలూ సిద్ధం కావాలి. క్రయ విక్రయాల వివరాలను పాస్ పుస్తకాల్లో పొందుపరచాలి. రిజిస్టర్ కాగితాలు, పాస్ పుస్తకాలను నేరుగా రైతుల ఇంటికే కొరియర్లో పంపాలి. ఇదంతా నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే సంబంధిత అధికారికి ఆలస్యపు రుసుం విధిస్తారు. రైతు సంఘాల నిర్మాణం, భూ రికార్డుల స్పెషల్ డ్రైవ్‌పై అవగాహనకు కొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తారు. జిల్లాల నుంచి ప్రతినిధులను పిలిపిస్తారు. సీఎంతో పాటు వ్యవసాయ మంత్రి, అధికారులు పాల్గొంటారు. -
కౌంటర్ తెరవలే..!
♦ 26 బ్యాంకు శాఖల్లో షురూ కాని పంట రుణ మంజూరు ప్రక్రియ ♦ 12 శాతం దాటని ఖరీఫ్ రుణాలు ♦ జిల్లాలో 33 శాతం పూర్తయిన సాగు విస్తీర్ణం ♦ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతన్నలు జిల్లాలోని బ్యాంకు శాఖలు 255 ఖరీఫ్ సీజను పంట రుణ మంజూరు లక్ష్యం రూ.1,560.82 కోట్లు మంజూరు చేసిన రుణం రూ.172.65 కోట్లు (11 శాతం) రుణ మంజూరు ప్రక్రియను షురూ చేయనివి : 26 బ్యాంకు శాఖలు ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంచనా 4.89 లక్షల ఎకరాలు ఇప్పటి వరకు అయిన సాగు 1.33 లక్షల ఎకరాలు (31శాతం) సాక్షి, నిజామాబాద్: బ్యాంకర్ల తీరు మారడం లేదు. రైతన్నలకు పంట రుణాల మంజూరులో ఆలసత్వం వీడటం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాగు మూడో వంతు పూర్తయినప్పటికీ, 26 బ్యాంకుల శాఖలు ఇప్పటి వరకు పంట రుణాల మంజూరు ప్రక్రియను అసలు షురూ చేయలేదంటే రైతుల పట్ల బ్యాంకర్ల తీరును అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని బ్యాంకుల శాఖలు సైతం నామమాత్రంగా రుణం మంజూరు చేశాయి. జిల్లాలో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. బోధన్, వర్ని తదితర మండలాల్లో పక్షం రోజుల క్రితమే వరి నాట్లు వేసుకున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో సోయా, పసుపు వంటి పంటలు విత్తుకున్నారు. ఈ సీజనులో 4.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా కాగా, ఇప్పటికే 33 శాతం (1.33 లక్షల ఎకరాల్లో) పంటలు వేసుకున్నారు. కానీ పంట రుణాలు మాత్రం 12 శాతానికి మించలేదు. ఈసారి ఖరీఫ్‌లో సుమారు 2.38 లక్షల మంది రైతులకు రూ.1,560.82 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ జూన్ నెలాఖరు వరకు కేవలం 26 వేల మంది రైతులకు రూ.172.65 కోట్లు మాత్రమే రుణం ఇవ్వగలిగారు. అంటే ఖరీఫ్ పనులు ప్రారంభమై నెల రోజులు దగ్గర పడుతున్నప్పటికీ కనీసం 12 శాతం కూడా రుణాలు ఇవ్వలేదన్నట్లు స్పష్టమవుతోంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు బ్యాంకులు ఖరీఫ్ రుణాలు మంజూరు చేస్తాయి. అయితే నిర్దేశించిన గడువులో నెల రోజులు ముగిసినప్పటికీ రుణ మంజూరు ప్రక్రియ ఊపందుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ వ్యాపారులే దిక్కు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ఖరీఫ్ సాగు అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. చాలా చోట్ల రైతులు వరి నాట్లు వేసుకుంటున్నారు. ఇందులో దుక్కులు దున్నడం కోసం ట్రాక్టర్, అరక ఖర్చులకు డబ్బులు అవసరం ఉంటాయి. అలాగే ఎరువులు, విత్తనాల కొనుగోలుకు పెట్టుబడులు కావాలి. వీటికి తోడు కూలీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు రుణాలివ్వక పోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు రుణ ప్రక్రియ ప్రారంభించని బ్యాంకుల పరిధిలోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆన్లైన్ పహణీలతోనే ఇబ్బందిగా ఉంది పంటరుణాలు తీసుకోవడమేమోగాని, ఆన్లైన్ పహణీలతోనే రైతులకు తీవ్ర ఇబ్బంది ఉంది. వేల్పూర్ మండలంలో చాలా మంది రైతులకు సంబంధించి ఆన్లైన్లో భూముల వివరాలు ఉండడం లేదు. ఆన్లైన్ పహణీ లేకుంటే బ్యాంకు వారు ఒప్పుకోవడం లేదు. బ్యాంకు వారిని ఎంతో బతిమాలితే రాతపూర్వక పహణీకి ఒప్పుకుంటున్నారు. రాత పూర్వక పహణీ కోసం కనీసం నాలుగైదు రోజుల సమయం తీసుకుంటోంది. వీఆర్వోలకు రెవెన్యూ సర్వే ఉండడం వల్ల వారు సర్వేకే వెళ్తున్నారు. ఆన్లైన్ పహణీలే ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు పచ్చలనడ్కుడ గ్రామీణ బ్యాంకులో మేనేజరు లేక రుణాల ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల ఒక అధికారిని ఇన్చార్జిగా పంపించారు. భూములకు ఆన్లైన్ సమస్యను తీర్చడానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నవీన్‌రెడ్డి, రైతు,వాడి మేనేజరు లేక సతమతం వేల్పూర్ ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజరు బదిలీ అయి సుమారు నెలరోజులవుతోంది. కొత్త మేనేజరు ఇంతవరకు రాలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారు.పంట రుణాల రెన్యూవల్‌కు చాలా సమయం తీసుకుంటోంది. పంటరుణం రెన్యూవల్ చేయించుకోవడం రైతులకు కష్టంగా మారింది. గంటల తరబడి బ్యాంకులో ఉండాల్సి వస్తోంది. భూములకు సంబంధించి ఎటువంటి తాకట్టు లేదని నిరూపించుకోడానికి మీసేవా నుంచి ఈసీ తెమ్మంటున్నారు. ఇది అదనంగా రైతులకు భారంగా మారింది. మేనేజరును, సిబ్బందిని నియమించి, పంటరుణాలు తొందరగా రెన్యూవల్ చేయాలి. – గడ్డం సత్యం. రైతు, వేల్పూర్ -
సీఎం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి: జీవన్‌రెడ్డి
జగిత్యాల: రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ యుద్ధప్రతిపాదికన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సీఎం పదవీ చేపట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించిన దాఖలు లేవన్నారు. దేశంలోని అన్నిరాష్ట్రాల సీఎంలు ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందిస్తారని, కేసీఆర్ మాత్రం రైతుల సంక్షేమం కోసం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించే తీరిక లేదని ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు డబ్బుల కోసం అవస్థలు పడుతున్నారని, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు డబ్బుల విషయంలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పండించిన పంటకు వరిధాన్యానికి క్వింటాలుకు రూ.2 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, మిర్చికి రూ.12 వేలు, పసుపునకు రూ.12 వేలు, పప్పు దినుసులకు రూ.12 వేలు అందజేయాలన్నారు. -
మీకు దయలేదు !
► బ్యాంకర్ల తీరుపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం ► రైతుల నుంచి 4 శాతం వడ్డీ ఎందుకు వసూలు చేస్తున్నారు ► ఆ డబ్బులు ప్రభుత్వమే కడుతుంది.... వెంటనే తిరిగి ఇచ్చేయండి ► రూ.1600 కోట్లు ఇచ్చినా రైతుల ఖాతాల్లో రుణమాఫీ జమచేయలేదు ► పైగా ప్రభుత్వాన్ని బదనామ్ చేస్తున్నారు ► నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందం ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : రైతు సంక్షేమాన్ని కోరి రుణ మాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తల తాకట్టు పెట్టి మరీ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 16 వేల కోట్లు తెచ్చింది. జిల్లాలో రూ. 1600 కోట్లు బ్యాంకర్లకు ఇస్తే వాటిని సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. ఇటు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి 4 శాతం వడ్డీని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు ఎందుకని, ప్రభుత్వం మీ డబ్బులు కట్టకుండా పారిపోతుందా...? ఇది భావ్యమా..? అసలు మీకు దయ అనేది లేదు... అంటూ బ్యాంకర్ల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇన్‌పుడ్ సబ్సిడీ విషయంలో కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమచేయడం లేదని బ్యాంకర్లపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు లేవని ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దని అన్నారు. లోపాలను సవరించుకుని ముందుకు పోవాలని బాధ్యతగా పనిచేస్తే ఫలితం ఉంటుందన్నారు. విడుదల చేసిన జిల్లా 2017–18 వార్షిక ప్రణాళిక రూ.4619 కోట్ల ప్రణాళికలో అత్యధికంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు 50 శాతం కంటే ఎక్కువగా కేటాయించామని , క్రాప్‌లోన్ లక్ష్యం రూ.2409 కోట్లు నిర్ణయించామన్నారు. ఈ వార్షిక ప్రణాళిక లక్ష్యాన్ని గడువులోగా పూర్తిచేయాలని కోరారు. గత ఏడాది ప్రణాళికలో మొత్తం రూ.3931 కోట్లు కాగా 80 శాతం లక్ష్యంతో రూ.3140 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపిన మంత్రి గత ఏడాది రుణాలు ఇవ్వడంలో కొన్ని బ్యాంకులు వెనుకబడ్డాయన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్నాయని పంటలసాగు బాగుందని, ఈ నేపథ్యంలో పంటల బీమా విషయంలో రైతులకు అవగాహనకల్పించి క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసి అందరితో సహకాలంలో ప్రీమియం కట్టించాలన్నారు. ఇందుకు ప్రచారం కోసం గ్రామాల్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై ప్రచారం నిర్వహించేందుకు ప్రచార రథాలను తింపాలన్నారు. రైతు రుణాల వడ్డీ బకాయి రూ.271 కోట్లు విడుదల చేశామని, బ్యాంకులు చేస్తున్న తప్పులకు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. అదే విధంగా నకిలీ విత్తనాలపై టాస్క్ఫోర్సు టీమ్‌లను వేశామని తెలిపిన మంత్రి అలాంటి నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీయాక్ట్‌లు బుక్‌చేసి లైసెన్స్‌లు రద్దుచేయడమే కాకుండా కటకటలాపాలు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ వి.జి.గౌడ్ మాట్లాడుతూ రైతులకు రుణాలను సకాలంలో అందించాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, జిల్లా కలెక్టర్ యోగితారాణా, బోధన్ సబ్‌కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎల్డీఎం సురే‹శ్‌రెడ్డి, బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆ సెక్టార్ '8 లక్షల కోట్ల' టైమ్ బాంబు
ముంబై : టెలికాం సెక్టార్ పై బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. భారీ ఎత్తున్న రుణాలు పొందిన టెలికాం రంగ వైఫల్యం పరిశ్రమలో డిఫాల్టర్ గా మారబోతుందంటూ ప్రభుత్వానికి టాప్ భారతీయ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. టెలికాం పరిశ్రమ రుణాలు 8 లక్షల కోట్లగా ఉన్నాయని, ఇవి ఓ టైమ్ బాంబుగా బ్యాంకులు అభివర్ణించాయి. ఈ రంగానికి బ్యాంకులు ప్రత్యక్షంగా రూ.2.63 లక్షల కోట్లను ఇవ్వగా, రూ.3.09 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ పేమెంట్లను టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించకుండా వాయిదా వేసినట్టు బ్యాంకులు పేర్కొన్నాయి. ఆపరేటర్స్ కాంట్రాక్ట్స్ పై ఆధారపడిన థర్డ్ పార్టీ రుణాలు సుమారు రూ. 1.8 లక్షల కోట్లగా ఉన్నట్టు బ్యాంకులు టెలికాం సెక్రటరీకి నివేదించాయి. దీనికి అదనంగా వార్షిక మూలధన ఖర్చులు రూ.35వేల కోట్లూ ఉన్నాయి. ఇన్ని కోట్ల రుణాలు కలిగిన టెలికాం సెక్టార్ వృద్ధి మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదని బ్యాంకులు పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి టెలికాం సెక్టార్ వార్షిక వృద్ధి మొత్తంగా 25 శాతం తగ్గి రూ.1,31,000 కోట్లను నమోదుచేయనుందని బ్యాంకులు అంచనావేస్తున్నాయి. 20 శాతం ఆపరేటింగ్ మార్జిన్లతో సర్వీసులు అందజేయడానికి సరియైన ఫండ్స్ ను బ్యాంకులు పొందలేవని బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే బ్యాంకులకు పేమెంట్లు చెల్లించడంలో డిఫాల్టర్స్ గా మారుతున్నాయని టెలికాం కార్యదర్శికి ఇచ్చిన ప్రజెంటేషన్ లో బ్యాంకులు పేర్కొన్నాయి. టెలికాం కంపెనీలు తమ రుణ సమస్యను భరించడానికి, ఈ సెక్టార్ కు కొంత పన్ను రిలీఫ్ ను అందించాలని బ్యాంకులు ప్రతిపాదిస్తున్నాయి. విలీనాలు, కొనుగోళ్లలో ప్రభుత్వాల నిబంధనలు సరళతరంగా ఉండాలని కూడా కోరాయి. తక్కువ స్పెక్ట్రమ్ వాడక ఛార్జీలు, లైసెన్సు ఫీజులు, పన్నులను ప్రభుత్వాలు తక్కువగా ఉంచాలని కూడా పేర్కొన్నాయి. స్పెక్ట్రమ్ లను సెక్యురిటీ కింద కంపెనీలు వాడితే, బ్యాంకులు రుణాలను అందించగలవని తేల్చిచెప్పాయి. -
వెక్కిరిస్తున్న ఏటీఎంలు
•ఆర్బీఐ నుంచి రాని నగదు •ఖాళీగా ఏటీఎంలు •ఖాతాదారులకు తప్పని పాట్లు •మరో వారం రోజులు వెతలు •తప్పవంటున్న బ్యాంకర్లు విశాఖపట్నం : ఏటీఎంల తీరు మారడం లేదు. ఏప్రిల్ ఒకటి నుంచి ఏటీఎంల్లో సరిపడినంత నగదు అందుబాటులో ఉంచుతామని చెప్పిన బ్యాంకర్లు ఆ పని చేయడం లేదు. దీంతో జనానికి నగదు కష్టాలు తప్పడం లేదు. దాదాపు నెల రోజుల నుంచి ఏటీఎంలు ఖాతాదారుల అవసరాలు తీర్చడం లేదు. నగదు లేదనో, సాంకేతిక సమస్య అనో, ఔటాఫ్ సర్వీసు అనో రకరకాల కారణాలు చూపుతూ ఏటీఎంలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఏ ఏటీఎంకు వెళ్లినా నగదు లేదంటూ వెక్కిరిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి ఏటీఎంలకు సరిపడినంత నగదు సరఫరా అవుతుంది. బ్యాంకులకు అవసరమైన నగదును ఆర్బీఐ నుంచి ఆయా జిల్లాల్లోని స్కేబ్‌లకు వస్తుంది. అక్కడ నుంచి కేటాయించిన మేరకు పంపిణీ చేస్తారు. కాని దాదాపు నెల రోజులుగా పూర్తి స్థాయిలో నగదు రావడం లేదు. దీంతో ఏటీఎంలు ఎందుకూ పనికిరాకుండా ఖాతాదార్లను పరిహసిస్తున్నాయి. మరోవైపు ఎస్బీఐ ఏటీఎంలే పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ ఇవే ఇప్పుడు ఎక్కువగా పనికిరాకుండా పోతున్నాయి. స్టేట్ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లు ఎస్బీఐలో ఇటీవలే విలీనమయ్యాయి. ఇప్పుడు వీటి ఏటీఎంల్లో సాంకేతికంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడా ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తి కావడానికి మరికొన్నాళ్ల సమయం పడుతుంది. ఇది కూడా ఎస్బీఐ ఏటీఎంల్లో నగదు కొరతకు కారణమవుతోంది. నగరం మొత్తమ్మీద ఎక్కడో కొన్ని ఏటీఎంల్లో మాత్రమే అరకొర క్యాష్ లభ్యమవుతోంది. ఆ సంగతి తెలుసుకున్న జనం అక్కడికి పరుగులు తీస్తున్నారు. అక్కడ చాంతాడంత క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల నుంచి తప్పించినా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ల్లో ఉండే ఏటీఎంల్లో నగదు ఉంచే బాధ్యతను ప్రైవేటు సంస్థల నుంచి తప్పించి ఇకపై సంబంధిత బ్యాంకుల సిబ్బందికే అప్పగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇది ఈ నెల ఒకటో తేదీ నుంచే అమలు చేస్తామని, అందువల్ల ఆయా శాఖల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు కొరత ఉండబోదని బ్యాంకర్లు భరోసా ఇచ్చారు. కాని కొన్ని బ్రాంచిల ఏటీఎంలే అరకొరగా అవసరాలు తీరుస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల పరిస్థితి మరింత దిగజారింది. వివిధ ఏటీఎంల్లో నగదు నింపే బాధ్యతను ప్రైవేటు సెక్యూరిటీ/ఔట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించారు. కానీ రిజర్వు బ్యాంకు నుంచి తగినంతగా సొమ్ము రాకపోవడంతో వీరు కూడా ఏటీఎంల్లో క్యాష్ పెట్టడం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ క్యాష్ కష్టాలు మరో వారం రోజుల పాటు ఉంటాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
రుణాల కల్పనలో జిల్లా మొదటిస్థానంలో ఉండాలి
జిల్లాస్థాయి బ్యాంకర్ల సలహా సంప్రదింపుల కమిటీ సమావేశంలో కలెక్టర్ రూ.19770.21 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల కాకినాడ సిటీ : లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు నూరుశాతం రుణాలు అందించి జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బ్యాంకర్లను కోరారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లాస్థాయి బ్యాంకర్ల సలహా సంప్రదింపుల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రూ.19770.21 కోట్లతో రూపొందించిన 2017–18 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల ద్వారా ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. పంట రుణాల కోసం రూ.7380.07 కోట్లు కేటాయించగా వ్యవసాయ, వ్యవసాయానుబంధ రంగాలు అయిన పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పట్టు పరిశ్రమ, అగ్రి ఇన్ ప్రాస్ట్రక్చర్, గొర్రెలు, మేకలు పెంపకం తదితర రంగాలకు కలిపి రూ.3641.13కోట్లు కేటాయించారన్నారు. ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.2058.99కోట్లు కేటాయించగా విద్యారంగానికి సుమారు రూ.200కోట్లు కాగా గృహ రుణాల కోసం రూ.707కోట్లు, ఎక్స్పార్టు క్రేడిట్ కోసం రూ.347కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ సెక్టార్ రూ.2వేల 664కోట్లు మహిళా సంఘాల రుణాల కోసం రూ.1200 కోట్లు కేటాయించారన్నారు. జిల్లా నాబార్డు రూపొందించిన పీఎల్పీ 2017–18 ప్రాతిపదికగా వార్షిక రుణ ప్రణాళిక కేటాయింపులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, స్టేట్‌బ్యాంకు ఏజీఎం సాయిబాబు, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్‌హెచ్-216 పనులు త్వరగా పూర్తి చేయాలి జాతీయ రహదారి 216 విస్తర్ణకు సంబంధించి పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నష్టపరిహారంపై రైతుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. పనసపాడు, చేబ్రోలు గ్రామాల్లో రోడ్డు విస్తరణలో ఉన్న దేవాదాయ భూములకు ప్రత్యామ్నయ భూములు గుర్తించి వారికి అప్పగించాలని సూచించారు. చిత్రాడలో మార్కింగ్ దాటి కట్టడాలు కూల్చివేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయని, లబ్ధిదారుల ఫిర్యాదుల మేరకు సర్వే చేసి ఎంత భూమి తీసుకుంటున్నామో నిర్ధారించి చెప్పాలన్నారు. విస్తరణలో నష్టపోయిన కట్టడాల విలువ 3వ పార్టీ ద్వారా మదించి చెల్లింపులకు చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 3న ఐడియాలజీ రన్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 3న ఐడియాలజీ రన్ నిర్వహించాలని, అందుకు యువతను సమీకరించాలని సోషల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 14న నిర్వహించే ముగింపు ఉత్సవాలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు, రెడ్‌క్రాస్ కార్యదర్శి వైడీ రామారావు పాల్గొన్నారు. -
రూ.10 నాణేలపై ఆగని వదంతులు
కడప అగ్రికల్చర్: పది రూపాయల నాణేలు (బిళ్లలు) చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉన్నా... వారం రోజులుగా మరీ ఘోరంగా తయారైంది. అయితే పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని ఎలాంటి భయం, అనుమానం అవసరం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు లేఖ రాశానని, అది రాగానే జిల్లా ప్రజలకు వివరణ ఇస్తామని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ లేవాకు రఘునా««థ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నోట్ల రద్దు నుంచి.. కష్టాలే: గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ప్రజలు తీవ్రమైన కరెన్సీ కష్టాలను ఎదుర్కొన్నారు. దాదాపు 135 రోజులుగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల బిళ్లలు చెల్లవని ఆటోవాలాలు, చిల్లర అంగళ్లవారు, పండ్లు, కూరగాయలు, పాల పాకెట్ల విక్రయదారులు ఇలా ఒకరేమిటి దుకాణాల వారందరూ తిరస్కరిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రూ.10 బిళ్లలు వచ్చిన కొత్తలో, ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవనే ప్రచారం జరుగుతుండటంతో ఇన్నాళ్లూ దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నారు. దీంతో చాలా మంది వ్యాపారులు వీటిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు సరి కదా.. తమ వద్ద ఉన్న వాటిని వినియోగదారులకు అంటగట్టడానికి చూస్తున్నారు. దీనివల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు 10 రూపాయల నాణేలు ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అపోహలు వద్దు: పది రూపాయల నాణేలు చెల్లవనే అపోహలను ప్రజలు, వ్యాపారులు పెట్టుకోవద్దని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన పలు సమావేశాల్లో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు 10 రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని చెప్పారు. ఈ సమస్య ఒక్క వైఎస్సార్ జిల్లాలో మాత్రమే ఉందని, మరే ఇతర జిల్లాల్లో లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు, ప్రజలు, వ్యాపారులకు 10 రూపాయల నాణేలపై ఉన్న అపోహలు తొలగించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశానని, అక్కడి నుంచి సమాధానం రాగానే వివరణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంత వరకు లేనిపోని అపోహలు వద్దని అన్నారు. పది రూపాయల నాణేలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదని అన్నారు. భవిష్యత్తులో కూడా రద్దు కావన్నారు. ప్రజలు సందేహాలు, అపోహలకు పోవద్దన్నారు. పది రూపాయల బిళ్లలు తీసుకోకపోతే వారిపై కేసులు పెట్టవచ్చని కలెక్టర్ ప్రకటించిన విషయం విదితమే. -
అవన్నీ పుకార్లే
రూ.10 కాయిన్లు చెల్లుతాయి వ్యాపారులు నిరభ్యతరంగా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోకపోతే నేరంగా పరిగణిస్తాం తేల్చిచెప్పిన బ్యాంకు ఉన్నతాధికారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయినా రూ. 10 కాయిన్లు మారవంటూ 10–15 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రభావం ప్రజలు, చిన్నచితకా వ్యాపారులపై తీవ్రంగా చూపుతోంది. చివరకు కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావి వర్గాలు సైతం రూ.10 కాయిన్లు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారంటే వీటిపై దుష్ర్పచారం ఎంతగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రూ. 10 కాయిన్ మారకంపై జనంలో అపోహలు ఎంత మేర ప్రభావం చూపుతున్నాయో పై రెండు ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. - అనంతపురం/అగ్రికల్చర్ -------------------------------- అమ్మవారి ఫొటో ఉంటే చెల్లదట రూ. 10 కాయిన్లపై కొందరు పని గట్టుకుని ప్రచారం చేస్తుండడంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. దీనికి తోడు కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది రూ. పది కాయిన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే వాటిని లెక్కించడం వారికి ఇబ్బందిగా ఉంటోంది. ఇలాంటి తరుణంలోనే బ్యాంకర్లు వాటిని తిరస్కరిస్తున్నారని, అవి చెల్లవంటూ కొందరు దుష్ర్పచారం చేపట్టారు. ముఖ్యంగా అమ్మవారి ఫొటో ఉన్న కాయిన్లు, పదికి మించి లైన్లు ఉన్న కాయిన్లు చెల్లవంటూ రకరకాల ప్రచారం ఊపందుకుంది. అయితే వీటిని బ్యాంకు అధికారులు కొట్టి పడేస్తున్నారు. రూ.10 కాయిన్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేస్తున్నారు. అపోహలు నమ్మొద్దు రూ.10 కాయిన్లు తీసుకోకపోతే నేరమే అవుతుంది. వాటిని రద్దు చేస్తున్నట్లు కాని, ఇతరత్రా చెల్లుబాటు కావనే ఉత్తర్వులు ఆర్బీఐ నుంచి రాలేదు. నిరభ్యంతరంగా బ్యాంకులు, వ్యాపారులు, ప్రజలు లావాదేవీలు చేసుకోవచ్చు. అపోహలు నమ్మకుండా వాటిని పరస్పరం మార్పిడి చేసుకోవాలి. – పి. అమ్మయ్య, ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్, అనంతపురం చెల్లుబాటు అవుతాయి. రూ.10 కాయిన్స్ చెల్లుబాటు రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. నిరభ్యంతరంగా చెలామణి చేసుకోవచ్చన్నారు. వ్యాపారులు కూడా వదంతులు నమ్మకుండా కాయిన్స్ తీసుకోవాలి. ఖాతాదారులు ఎవరైనా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఇదే అదనుగా సంచులు సంచులు తీసుకువస్తే సిబ్బంది కొరత, సమయాభావం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. - శ్రీనివాసరావు, ఏజీఎం, ఎస్బీఐ, అనంతపురం -
ఈ నెల 28న బ్యాంకుల సమ్మె
కర్నూలు(అగ్రికల్చర్): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు 28న చేపట్టే సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏఐబీఈఓ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎదుట భోజన విరామ సమయంలో వివిధ డిమాండ్లపై నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేయాలని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన బ్యాంకులను అవసరమైనంత నగదు ఇవ్వాలని, నోట్ల రద్దు సమయంలో కొందరు పెద్దలకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కొత్త కరెన్సీ వెళ్లిదని దీనిపై సీబీఐ విచారణ జరపాలని తదితర డిమాండ్లతో 28న బ్యాంకుల సమ్మె పాటిస్తున్నట్లు తెలిపారు. -
140 పొదుపు గ్రూపులపై కేసుల నమోదు
– ఇందులో 10 గ్రూపు లీడర్ల ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం – బ్యాంకర్ల సమావేశంలో వెల్లడి – ఇంత జరుగుతుంటే తన దృష్టికి ఎందుకు తీసుకోరాలేదని ఐకేపీ సిబ్బందిపై పీడీ ఆగ్రహం ఆళ్లగడ్డ: చాగలమర్రి మండలంలో పొదుపు రుణాలు తీసుకుని చెల్లించని 140 డ్వాక్రా సంఘాలపై కేసులు నమోదు చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో మంగళవారం ఆళ్లగడ్డ డివిజన్ జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్ల సమావేశం జరిగింది. డీఆర్డీఏ పీడీ, ఎల్డీఎం, వివిధ కారొ్పరేషన్ల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగలమర్రి ఎస్బీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ రుణాలు సక్రమంగా చెల్లించని 140 గ్రూపులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇందులో 10 సంఘాల సభ్యుల ఆస్తులు అప్పులోకి జప్తు చేసేకునేందుకు రంగం సిద్ధం చేశామని వెల్లడించారు. సిబ్బందిపై డీఆర్డీఏ పీడీ ఆగ్రహం పొదుపు సంఘాలపై కేసుల నమోదు విషయం తన దృష్టికి ఎందుకు తీసుకోరాలేదని డీఆర్డీఏ పీడీ రామకృష్ణ ఐకేపీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేక పోతే ఎలా ప్రశ్నించారు. రుణాలు చెల్లించేలా సంఘాలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్డీఎం నరసింహులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, శిరివెళ్ల, గోస్పాడు మండలాల ఎంపీడీఓలు, బ్యాంకర్లు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు -
ఆర్బీఐ నుంచి రూ.30,900 కోట్లు
తాజాగా రాష్ట్రానికి రూ.1,500 కోట్ల నగదు పంపిణీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంకు మరో రూ.1,500 కోట్ల నగదును పంపిణీ చేసింది. దీంతో నోట్ల రద్దు నిర్ణయం అనంతరం తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు పంపించిన మొత్తం రూ.30,900 కోట్లకు చేరింది. ప్రస్తుతం పంపించిన నగదులో ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నా యని, వీటిని ఎక్కువగా ఏటీఎంల్లో అందుబాటులో ఉంచినట్లు బ్యాంకర్లు ప్రభుత్వానికి సమాచారం అందించారు. చిన్న నోట్లు పెరిగిన కొద్దీ నగదు కొరత తగ్గుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఉన్న పరిస్థితితో పోలిస్తే రాష్ట్రమంతటా నగదు నోట్ల కొరత తీరిందని, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే టీఎస్ వ్యాలెట్ రూప కల్పన, డిజిటల్ చెల్లింపులను ఉద్యమంలా ప్రోత్సహించేందుకు మొదట్లో హడావుడి చేసిన ప్రభుత్వం క్రమంగా వెనక్కి తగ్గింది. -
వడ్డీ రాయితీ చంద్రశేఖరా!
పేరుకుపోయిన వడ్డీ రాయితీ బకాయిలు మహిళల వద్ద వడ్డీ వసూలు చేసిన బ్యాంకర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఎస్‌హెచ్‌జీ మహిళలు అధికారులు మా చేతుల్లో లేదంటున్నారు.. వడ్డీ రాయితీ బకాయిలు చాలా రోజులుగా రావాల్సి ఉంది. అధికారులను అడిగితే మా చేతుల్లో లేదంటున్నారు. వడ్డీ కట్టలేక మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రాయితీ నిధులు విడుదల చేయాలి. ఈనెల 5న జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాం. – సఫియా బేగం, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న వడ్డీలేని రుణాల పథకం అభాసుపాలవుతోంది. వడ్డీ రాయితీ నిధుల విడుదలలో సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం నీరుగారుతోంది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్న ఎస్‌హెచ్‌జీ మహిళలపై వడ్డీ భారం పడుతోంది. – సాక్షి, నిజామాబాద్ నిజామాబాద్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రుణాలు మంజూరు చేస్తున్నారు. ఈ రుణాలపై సుమారు 12 నుంచి 14 శాతం వరకు బ్యాంకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. రుణాలు పొందిన మహిళలు సకాలంలో చెల్లించిన వారికి ఈ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ముందుగా మహిళలు ఈ వడ్డీ, అసలు కలిపి చెల్లిస్తే.. ఆ వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే రెండున్నరేళ్లుగా ఈ వడ్డీ రాయితీ బకాయిలు పేరుకు పోయాయి. 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ మహిళల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఈ మహిళా సంఘాల సభ్యులు ఏళ్ల తరబడి వడ్డీ భరించాల్సి వస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో 20,285 సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకు లింకేజీ కింద వీరికి రూ.367.68 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరు వరకు 10,035 సంఘాలకు రూ.199.99 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం రూ.168.81 కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 84.41 శాతం మాత్రమే రుణాలివ్వగలిగారు. ఈ రుణాలకు సంబందించి వడ్డీలేని రాయితీ రూ.24.93 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే మరో మూడు నెలలైతే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ.. ఈ వడ్డీ రాయితీ నిధులు జాడ లేదు. దీంతో వడ్డీతో సహా రుణాలు చెల్లించిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా బకాయిలు.. కేవలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే కాదు రెండేళ్లుగా ఈ వడ్డీ రాయితీ బాకాయిలు జిల్లాలో పేరుకు పోయాయి. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడం గమనార్హం. 2014–15 ఆర్థిక సంవత్సరంలో 19,706 సంఘాలకు రూ.35.89 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, రూ.31.28 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన రూ.4.61 కోట్లు ఇప్పటికీ జాడ లేదు. అలాగే 2015–16లో 21,285 సంఘాలకు రూ.38.87 కోట్ల వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, కేవలం రూ.2.02 కోట్లు మాత్రమే వచ్చాయి. -
కొత్త ఏడాదీ నోట్ల కోసం క్యూలే!
-
కొత్త ఏడాదీ నోట్ల కోసం క్యూలే!
ఇబ్బందులు ఇంకా ముగియలేదన్న బ్యాంకర్లు న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి సరిగ్గా నాలుగు రోజులే మిగిలి ఉంది. ప్రభుత్వం విధించిన గడువు డిసెంబర్ 30 తర్వాత నగదు ఉపసంహరణలపై పరిమితులు ఎత్తివేసే అవకాశాలూ కనిపించడం లేదు. ఈ నెల 30 తర్వాత కూడా రద్దీ తగ్గే అవకాశం లేదని, కొత్త సంవత్సరంలోనూ కస్టమర్లు నగదు కోసం బారులు తీరాల్సిన పరిస్థితులే కొనసాగుతాయని బ్యాంకు ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ‘‘బ్యాంకుల వద్ద ఇప్పటికీ రద్దీ ఉంది. ఈ పరిస్థితి మారుతుందన్న ఆశలేవీ లేవు. ఆర్బీఐ బ్యాంకులకు అవసరమైన నగదులో 20 నుంచి 30 శాతమే అందిస్తుంటే పరిస్థితి ఎలా మారుతుంది?’’ అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం అన్నారు. పరిస్థితి ఏమీ మెరుగుపడలేదని, దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు లేఖ ద్వారా తెలిపినా ఎలాంటి స్పందన లేదన్నారు. దేశవ్యాప్తంగా కట్టల కొద్దీ కొత్త నోట్ల కట్టలు పట్టుబడడం, సరైన కస్టమర్లకు అవి అందకపోవడంపై ఆర్బీఐ మౌనం వహించడం ద్వారా... బ్యాంకింగ్ వ్యవస్థపై కస్టమర్ల నమ్మకాన్ని తుడిచేసిందని మండిపడ్డారు. టీవీలు, పేపర్లలో వార్తలు చూస్తుంటే ఇదంతా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నట్టు ఉందని, ఆ నగదును తామే పక్కదారి పట్టిస్తున్నట్టు అపోహలు కలిగిస్తోందన్నారు. -
గ్రామీణులకు డబ్బు అందించండి
విజయవాడ : గ్రామీణ ప్రజల నగదు అవసరాలను తక్షణమే తీర్చాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ బ్యాంకర్లను, అధికారులను ఆదేశించారు. నగరంలో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శనివారం బ్యాంకర్లు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు రు. 306 కోట్ల నగదు రిజర్వ్‌బ్యాంకు నుంచి సరఫరా అయిందని చెప్పారు. ఈ క్రమంలో ప్రతి బ్రాంచికి రూ. 25లక్షల నగదు సరఫరా చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు సరిపడా డబ్బు అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. అన్ని బ్యాంకులలో నగదు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడా క్యూలైన్లు కనపడకుండా బ్యాంకు అధికారులు నగదు పంపిణీ చేయాలన్నారు. రు. 500నోట్లను ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్లకు అందిచాలని సూచించారు. పింఛన్లు, ఉపాధిహామీ కూలీల వేతనాలు ఎటువంటి ఆటంకం లేకుండా బిజినెస్ కరస్పాండెంట్లు డబ్బు అందిస్తారని చెప్పారు. బ్యాంకర్లు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం సెలవుదినంగా భావించకుండా పని చేయాలని ఆదేశించారు. 21, 22 తేదీల్లో సీఎం కాన్ఫరెన్స్ ఈనెల 21, 22 తేదీలలో నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లాలో లైజన్ ఆఫీసర్లు, ప్రోటోకాల్, సిట్టంగ్ తదితర ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
నెల రోజుల్లోనే ఉత్తీర్ణులమయ్యాం..!
- నగదు రహిత రాష్ట్రంపై చంద్రబాబు వ్యాఖ్య - బ్యాంకర్లు, ఆర్థిక శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నెలరోజులకే రాష్ట్రాన్ని నగదు రహితంగా మార్చడంలో ఉత్తీర్ణులమయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భౌతిక నగదు వినియోగం తగ్గించి, డిజిటల్ నగదు వాడకం పెంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమని అన్నారు. పెద్దనోట్ల రద్దు సమస్య నేపథ్యంలో ఈ నెల మొదటి వారాన్ని విజయవంతంగా ముగించామని, మిగతా రోజులు కూడా ఇదే స్ఫూర్తితో పని చేసి సమస్యను అధిగమించాలని చెప్పారు. బుధవారం తన నివాసం నుంచి బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స నిర్వహించారు. బ్యాంకు కరస్పాండెంట్లు, పంచారుుతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను డిజిటల్ లిటరసీపై చైతన్య పరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. -
జిల్లాకు పదివేల ఈ పాస్ యంత్రాలు
- నగదు రహిత లావాదేవీల కోసం ప్రతిపాదన - రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానున్న నగదు సమస్య - డీసీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్) : రానున్న రోజుల్లో నగదు కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందని, సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాంకు అధికారులు నగదు రహిత లావాదేవీలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సూచించారు. పది రోజుల్లో జిల్లాకు కనీసం పది వేల ఈపాస్ యంత్రాలను తెప్పించి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్హాల్లో బ్యాంకర్లతో డీసీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగదు కొరతను అధిగమించడంలో బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతోపాటు ప్రతి ఒక్కరికీ ఏటీఎం, రూపే కార్డులను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాకు అవసరమైన స్వైపింగ్ మిషన్లు, మినీ ఏటీఎంలను తెప్పించాలన్నారు. కిరాణం షాపులు, ప్రైవేట్ విద్యా సంస్థలు, మెడికల్ షాపులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు తదితర వాటిల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని 445 బ్రాంచుల్లో ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమస్తామని, ఈయన బ్యాంకు ఖాతాల ప్రారంభంలోనూ, ఇతరత్రా కార్యక్రమాల్లో బ్యాంకర్లకు సహకరిస్తాన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను ప్రారంభిస్తే స్వైపింగ్ మిషన్లను పంపిణీ చేయాలన్నారు. తమ దగ్గర లైసెన్సులు పొందిన వ్యాపారులందరూ స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకొని నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పది రోజుల్లో నగదు రహిత లావాదేవీలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను వీటివైపు మళ్లించాలని సూచించారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవు సారూ.. బ్యాంకుల్లో డబ్బులు లేవని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు కలెక్టర్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు సహా దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు నగదు కొరతపై కలెక్టర్‌కు వివరించారు. జిల్లాకు రూ.160 కోట్లు వచ్చినా, అన్ని రెండు వేల నోట్లే వచ్చాయని, అందువల్ల చిల్లర సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. జిల్లాకు అవసరమైన నగదును తెప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమావేశంలో జేసీ హరికిరణ్, ఎల్డీఎం నరసింహరావు, ఆంధ్రాబ్యాంకు డీజీఎం గోపాలకృష్ణ, ఎస్బీఐ ఆర్ఎం రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
జిల్లాకు రూ.160 కోట్లు
–అన్నీ రూ. 2000 నోట్లే కర్నూలు(అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాకు శుక్రవారం రూ.160 కోట్ల నగదు వచ్చింది. అయితే అంతా రూ. 2000 నోట్లలోనే ఉండటం గమానార్హం. రూ.500, 100 నోట్ల అవసరం ఎక్కువగా ఉండగా రూ. 2000 నోట్లు రావడం పట్ల బ్యాంకర్లు పెదవి విరుస్తున్నారు. ఆంధ్రబ్యాంకు చెస్ట్‌కు రూ.100 కోట్లు , ఎస్బీఐ చెస్ట్‌కు రూ.60కోట్లు వచ్చాయి. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అన్ని బ్యాంకులకు పంపిణీ చేయనున్నారు. శుక్రవారమే ఈ నగదు కొన్ని బ్యాంకులకు వెళ్లింది. పూర్తి స్థాయిలో ఈ నగదు శనివారం బ్యాంకులకు చేరనుంది. అయితే ఇప్పటికే 2 వేల నోట్లకు చిల్లర దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. మళ్లీ రూ.160కోట్ల రూ. 2వేల నోట్లు రావడంతో చిల్లర సమస్య మరింత తీవ్రం కానుంది. -
కరెన్సీ...కట్..కట!
కనికరించని బ్యాంకర్లు.. తెరచుకోని ఏటీఎంలు యథావిధిగా జనం వెతలు క్యూలలోనే పెన్షనర్లు.. ఉద్యోగులు సిటీబ్యూరో : ఆబిడ్స...చార్మినార్...సికింద్రాబాద్...మాదాపూర్..కూకట్పల్లి..ఎల్బీనగర్...రాజేంద్రనగర్...బంజారాహిల్స్..ప్రాంతమేదైనా రెండోరోజూ అదే సీన్. బ్యాంకుల ముందు భారీ క్యూలు. అరకొర నగదుతో సరిపెట్టిన బ్యాంకులు..తెరచుకోని ఏటీఎంలు...నగరవాసికి తప్పని కరెన్సీ ఇక్కట్లు. శుక్రవారం కూడా గ్రేటర్ వ్యాప్తంగా ఇదే దుస్థితి. ఎడారిలో ఒయాసిస్సులా ఎక్కడో ఓ చోట ఏటీఎం తెరచుకున్నప్పటికీ అక్కడి లైన్లు చూస్తే సొమ్మసిల్లి పడిపోయే దుస్థితి. గంటల తరబడి క్యూలో నిల్చున్నా తీరా మావంతు వచ్చే సరికి నగదు నిల్వలు నిండుకున్న దుస్థితి ఎదురైందని పలువురు సిటీజన్ల ఆక్రోశం. అత్యవసర చికిత్సలు, ప్రాణాధార మందుల కొనుగోలుకూ చేతిలోచిల్లి గవ్వ లేదని పెన్షనర్ల ఆందోళన. ఇంటి అద్దె, పాలబిల్లు, పిల్లల ట్యూషన్ ఫీజులు, నిత్యావసరాలుఎలా కొనుగోలు చేయాలో తెలియడంలేదని సగటు వేతన జీవి ఆవేదన. ఇదీ నగరంలో సర్వత్రా కనిపించిన దుస్థితి. మహానగరం పరిధిలోని 1435 బ్యాంకులుండగా..శుక్రవారం పలు బ్యాంకుల్లో సేవింగ్స ఖాతా వినియోగదారులకు రూ.2 నుంచి రూ.4 వేల నగదు ఉపసంహరణకే అనుమతించారుు. పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో మధ్యాహ్నానికే మూతపడ్డారుు. నగదు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమంటూ బ్యాంకర్లు చేతులెత్తేయడంతో జనం అవస్థలు వర్ణనాతీతంగా మారారుు. ఏటీఎంలలో వస్తున్న రూ.2 వేల నోట్ల మార్పిడికీ అష్టకష్టాలు పడాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తంచేశారు. వెరుు్యకి పైగా బిల్లు చేస్తేనే చిల్లర ఇస్తామంటూ వ్యాపారులు చుక్కలు చూపుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రేటర్ పరిధిలోని ఏడువేల ఏటీఎం కేంద్రాలుండగా..తెరచుకున్నవి రెండు వేలలోపు మాత్రమే కావడం గమనార్హం. పెట్రోల్ బంకుల్లోనూ పాత రూ.500 నోట్ల స్వీకరణకు స్వస్తి పలకడంతో బండి నడిచేదెలాగో అర్ధంకాని పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. కాగా నగరంలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఏటీఎంల వద్ద రోగుల బంధువులు, సహాయకులు నగదు కోసం గంటలతరబడి క్యూలైన్లలో నిల్చున్పటికీ ఫలితం లేదని వాపోయారు. కుదేలైన చిరువ్యాపారులు... పెద్ద నోట్ల రద్దు గ్రేటర్లో చిరు వ్యాపారుల్ని చిదిమేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి ఉపాధిపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నోట్ల రద్దుకు ముందు కళకళలాడిన వ్యాపారాలు నేడు జనం లేక బోసిపోరుు కనిపిస్తున్నారుు. పెద్ద నోట్లు రద్దు చేసి 23 రోజులు గడుస్తున్నా.. ఇంకా చిల్లర కష్టాలు జనాన్ని వెంటాడుతుండడంతో చిరువ్యాపారుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటోంది. పెద్ద నోట్లు తీసుకువస్తే వాటిని తీసుకోలేని పరిస్థితి...దీంతో వ్యాపార లావాదేవీలన్నీ స్తంభించిపోయారుు. ఈ 23 రోజుల్లో 50 శాతం నుంచి 70 శాతం అమ్మకాలు పడిపోవడంతో చిరువ్యాపారుల కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కళ తప్పిన మార్కెట్లు... గ్రేటర్ పరిధిలోని బేగంబజార్, చార్మినార్, ఆబిడ్స, బషీర్‌బాగ్, జనరల్‌బజార్, సుల్తాన్‌బజార్ వంటి మార్కెట్లన్నీ కరెన్సీ కష్టాల కారణంగా కళతప్పారుు. గత 20 రోజులుగా తమ వ్యాపారాలు 50 శాతానికి పైగా పడిపోయాయని, దుకాణాల అద్దెలు, పనివాళ్ల వేతనాలు, కరెంట్ బిల్లులు ఇతరత్రా నిర్వహణ వ్యయాలకు నగదు ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకావడం లేదని పలువురు వ్యాపారులు వాపోయారు. -
కడపలోనూ బ్లాక్ మేనేజర్లు!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజానీకానికి చేరాల్సిన కరెన్సీ పక్కదారి పట్టింది. బ్లాక్ మనీ¯ని చెలామణి చేసుకోవడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. ఉన్నతాధికారి సిఫార్సులకు కీలక అధికారి తలొగ్గారు. ఆనక బ్యాంకర్లపై ఒత్తిడి పెంచి క్యాష్ చేసుకున్న ఉదంతం జిల్లాలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని రూ.1000, రూ.500 పెద్దనోట్లు రద్దు చేయడం సామాన్యుల నుంచి ధనికుల వరకూ కుదిపేసింది. ఈ క్రమంలో అధికారులు సైతం బాధితులయ్యారు. అప్పటివరకూ పోగుచేసుకున్న ధనం ఒక్కమారుగా చెల్లుబాటు కాదని తేలడంతో, నగదు మార్పిడికోసం వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు బ్యాంకుల కీలక అధికారి ద్వారా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆమేరకు కరెన్సీ మార్పునకు సదరు కీలక అధికారి చీఫ్ మేనేజర్లపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ వ్యవహారం తొలిదశ కరెన్సీ సరఫరాలోనే సాగినట్లు తెలుస్తోంది. ఉన్నతస్థాయి అధికారి తర్వాత అదే పంథాను మరికొంతమంది అధికారులు అనుసరించినట్లు సమాచారం. ఇలా నూతన కరెన్సీ జిల్లాకు చేరిన ప్రతిమారు కొంతమొత్తం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాగా ఎంత మొత్తాన్ని పక్కదారి పట్టించారనే విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. బ్లాక్ బాబుల్లో సీబీఐ గుబులు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా బ్యాంకుల నుంచి నగదు పక్కదారి పట్టిందని వెలుగుచూడటంతో జిల్లాలో కొందరికి సీబీఐ గుబులు పట్టుకుంది. ధ్రువీకరణ జిరాక్స్‌ల ద్వారా నగదు పక్కాగా దారిమళ్లించిన వైనం వెలుగులోకి రానుందని తెలిసి వారిలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. కీలక అధికారి సిఫార్సులకు తలొగ్గి సర్దుబాటు చేస్తే చివరికి అది తమ మెడకు చుట్టుకుంటోందని కొందరు బ్యాంక్ చీఫ్ మేనేజర్లు మథనపడుతున్నారు. జిల్లాలోని కొందరు ఉన్నతాధికారులు బ్యాంకర్ల ద్వారా స్వయంగా నూతన కరెన్సీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం జిల్లాలో రూ.2,000 కోట్లు దాటినట్లు సమాచారం. ప్రతిరోజు దాదాపుగా రూ.100 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్దఎత్తున డిపాజిట్లు ఖాతాదారులు, ప్రజానీకం స్వయంగా చేస్తున్నారా? నగదు పక్కదారి పట్టించి, బ్లాక్మనీదారులకు బ్యాంకర్లు అవకాశం కల్పిస్తున్నారా? అనే అంశాన్ని క్షుణ్ణంగా సీబీఐ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన ’బ్లాక్ మేనేజర్లు’ జిల్లాలో కూడా ఉన్నట్లు వెల్లడికావడంతో సదరు సార్లు ఎలా తప్పించుకోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. -
అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీలపై మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లపై ఒత్తిడి పెంచుతున్నామని భావించవద్దన్నారు. మనకున్న వనరులు మరే రాష్ట్రంలో లేవని, మనకున్న వ్యవస్థ మరే దేశంలో లేదని అన్నారు. అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు, ఈ-పోస్ యంత్రాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సమగ్ర పల్స్ సర్వే చేశాం.. ట్యాబ్‌ల వినియోగం పెంచామన్నారు. వచ్చే నెల నుంచి ఫైబర్ గ్రిడ్ ప్రారంభమవుతుందని, పది లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. వీటన్నిటిని వినియోగించుకుని ప్రస్తుత సమస్యను అధిగమించాలని, ఇదొక జాతీయ విపత్తుగా భావించి సమష్టిగా పనిచేయాలని సూచించారు. నగదు తక్కువ ఉంది.. ఈఐపోస్ మిషన్లు తక్కువ ఉన్నాయి.. అయినా పరస్పర సమన్వయంతో సమస్యను అధిగమించాలని చంద్రబాబు అన్నారు. డిసెంబర్ 1 నుంచి నగదు రహిత లావాదేవీలు అధికంగా జరగాలని, మొబైల్ బ్యాంకింగ్‌పై శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు జరపాలని, ఇంటింటా ప్రచారం నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు. బ్యాంకర్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ‘వెలుగు’ సిబ్బంది, ‘నరేగా’ సూపర్వైజర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. లోటు వర్షపాతంలో కూడా దిగుబడులు తగ్గకుండా చూశాం.. అలాగే నగదు లోటు ఉన్నప్పటికీ దైనందిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా చూడాలని బ్యాంకర్లు, అధికారులకు సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో బ్యాంకర్లు, కలెక్టర్లు, ఆర్థిక శాఖాధికారులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలను సహకరించండి
- ప్రత్యేక డీసీసీ సమావేశంలో కలెక్టర్ పిలుపు - డిసెంబరు 5లోగా ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డులు - జన్‌ధన్ ఖాతాలన్నింటినీ వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయం కర్నూలు (అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సూచించారు. ఇందుకు సంబంధించి మంగళవారం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల ప్రత్యేక డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,422 చౌకదుకాణాలుండగా, 572 షాపులకు డీలర్లు లేరన్నారు. 1850 షాపులకు మాత్రమే రెగ్యులర్ డీలర్లున్నారని, వీరందరినీ బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. వీరికి ఈ-పాస్ మిషన్లు సరఫరా చేయడంతోపాటు పూర్తిగా సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. ఖాళీగా ఉన్న చౌకదుకాణాల నిర్వహణ బాధ్యతలను గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తామన్నారు. మెడికల్‌షాపులు, కిరాణం షాపులు, ఎరువులు, ఫెస్టిసైడ్ షాపులకు కూడా ఈ-పాస్ మిషన్లు సరఫరా చేసి నగదు రహిత లావాదేవీలకు సహకరించాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి సమీపంలోని బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి డెబిట్ కార్డులు పంపిణీ చేసేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జన్‌ధన్ ఖాతాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడం, ఖాతాలు లేని వారందరికీ ఖాతాలు ప్రారంభించి డెబిట్ కార్డులు ఇవ్వడం తదితర ప్రక్రియ మొత్తాన్ని డిసెంబరు 5లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా డెబిట్ కార్డులను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలను నిర్వహించడంలో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను ఈ సందర్భంగా బ్యాంకర్లు ప్రస్తావించగా బ్యాంకు నిబంధనలను ఏ విధంగానూ మార్చుకోకుండా ఉన్నంతలోనే డెబిట్ కార్డులను ఉపయోగించేందుకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లున్నప్పటికీ ప్రస్తుతం జిల్లా యంత్రాంగం నియమిస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లు కరెంటు ఖాతాలను ప్రారంభించి రూ.50 వేలు డిపాజిట్ చేస్తారని, వారికి రూ. 50 వేల కొత్తనోట్లు ఇచ్చి లావాదేవీలకు సహకరించాలని కోరారు. ఈ పక్రియను డీఆర్డీఏ, డ్వామా పీడీలు, జేడీఏ తదితరులు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహరావు, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఏపీజీబీ ఆర్ఎంలు రమేష్‌కుమార్, గోపాలకృష్ణ, మోహన్, వీసీకే ప్రసాద్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది : సీఎం చంద్రబాబు
విజయవాడ : పెద్ద నోట్ల రద్దుపై పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దుతో అందరు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బ్యాంకర్లు వివరణ ఇచ్చారు. పది రోజుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం తప్ప ఏ పనీ చేయలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో దెబ్బతిన్న చిల్లర వ్యాపారులను ఆదుకోవడానికి రూ.26 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేస్తామని సీఎం చెప్పారు. నగదు రహిత రూపే కార్డు లావాదేవీలపై సర్వీస్ ఛార్జ్ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతానని చంద్రబాబు తెలిపారు. -
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): నగదు రహిత లావాదేవీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బ్యాంకర్లను ఆదేశించారు. జన్‌ధన్ ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బులు జమ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్లర్లకు సూచించారు. శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నగదు కొరతను అధిగమించేందుకు శనివారం నుంచి క్యాష్ ఎట్ మిషన్లతో మొబైల్ ఏటీఏంలను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కిరాణం షాపులు, మెడికల్ షాపులు, చౌకధరల దుకాణాలు తదితర వాటిల్లో క్యాష్ ఎట్ మిషన్లను ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. ఎస్బీఐ ఆర్ఎం రమేష్ కుమార్ మాట్లాడుతూ... తమ బ్యాంకులో రూ.25వేల నుంచి రూ50వేల డిపాజిట్తోమ కర ంట్ఖాతా ప్రారంభిస్తే వారికి క్యాష్ ఎట్ మిషన్లు ఇస్తామని వివరించారు. ఆంధ్రబ్యాంకులో రూ.3000 జమ చేస్తే వీటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీఎం గోపాలకృష్ణ తెలిపారు. మండలానికి నలుగురు, మేజర్ పంచాయతీకి ఇద్దరు, మైనర్ పంచాయతీకి ఒకరు ప్రకారం బిజినెస్ కరస్పాండెంట్లను నియమిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహారావు, అన్ని బ్యాంకుల రీజినల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. మొబైల్ ఏటీఎంలు ప్రారంభం నగదు కొరతను తీర్చేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమొహన్ మొబైల్ ఏటీఎంలను ప్రారంభించారు. వీటి ద్వారా రూ.2000 నగదు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతానికి మూడు మొబైల్ ఎటీఎంలను అందుబాటులోకి తెచ్చామని శనివారం నుంచి నగరంలో అందుబాటులో ఉంటాయని వివరించారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల బ్లాక్ మార్కెట్
-
కొత్త నోట్ల బ్లాక్ మార్కెట్
♦ తెలంగాణ, ఏపీలో దొడ్డిదారిన భారీగా చేతులు మారిన రూ. 2 వేల నోట్లు ♦ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలులో దళారుల దందా ♦ ఈ ఐదు నగరాల్లో బ్యాంక్‌ల నుంచి భారీగా నగదు జారీ చేసిన బ్యాంకర్లు ♦ హైదరాబాద్‌లో 24 మంది ఉన్నతాధికారులపై విచారణ ప్రారంభం ♦ విజయవాడ, గుంటూరు, కర్నూలులో13 మంది అధికారుల అక్రమాలు పెద్ద మొత్తంలో నగదు బయటకు రావడంపై రిజర్వు బ్యాంక్ ఆరా కమీషన్ ప్రాతిపదికన పెద్దనోట్లు అందించినట్లు ఆరోపణలు బేగంపేట్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి భారీగా నగదు బయటకు.. సహకార బ్యాంక్‌ల నుంచి రాజకీయ ప్రముఖులకు పెద్ద ఎత్తున నగదు! రూ. 2 వేల నోట్ల సరఫరా, వినియోగంపై లెక్కలు తేల్చేపనిలో కేంద్ర ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్ గుట్టుచప్పుడు కాకుండా కొత్త నోట్ల బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందా? అందులో ఏకంగా బ్యాంకు అధికారులే భాగస్వాములయ్యారా? కమీషన్ ప్రాతిపదికన పాత నోట్లకు కొత్త నోట్లను ఇచ్చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వరంగ బ్యాంకుల సీనియర్ అధికారులు కొందరు రూ. 2 వేల నోట్లను బ్లాక్‌మార్కెటింగ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇష్టానుసారంగా ఈ నోట్లను కమీషన్ ప్రాతిపదికన బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేలింది. రూ.1,000, 500 నోట్లను రద్దు చేసిన రెండోరోజు అంటే గురువారం నుంచి ఆదివారం దాకా భారీగా రూ.2 వేల నోట్లు పక్కదారి పట్టాయి. ప్రధాని పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించిన రెండోరోజు 40 శాతంగా ఉన్న కమీషన్ల దందా మంగళవారం వచ్చేసరికి 25 శాతానికి తగ్గింది. రూ.2 వేలనోట్లు భారీగా చలామణిలోకి రావడం వల్లే ఇలా జరిగిందని, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఈ దందా జోరుగా సాగుతోందని నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించాయి. దీంతో మంగళవారం నుంచి బ్యాంక్ శాఖల వద్ద నిఘా పెరిగింది. ముఖ్యంగా గురువారం నుంచి ఆదివారం దాకా భారీ ఎత్తున నగదు బయటకు తరలించినట్లు తేలిన బ్యాంక్ శాఖల సిబ్బందిని పక్కనబెట్టి ఇతర శాఖల ఉద్యోగులను సర్దుబాటు చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు చెందిన 24 మంది సీనియర్ అధికారులు, విజయవాడ, గుంటూరు, కర్నూలులో 13 మంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు రిజర్వు బ్యాంక్ గుర్తించింది. తీగలాగితే డొంక కదిలిందిలా.. రిజర్వు బ్యాంక్ హైదరాబాద్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు తన సమీప బంధువు ఒకరు ఫోన్ చేసి.. తన దగ్గర ఉన్న రూ.25 లక్షల పాత నోట్లు తీసుకుని కొత్తవి రూ.20 లక్షలు ఇస్తామంటున్నారు నమ్మవచ్చా అని అడిగారు. సదరు అధికారి మాటల్లో పెట్టి తన బంధువు నుంచి ఎవరు సమకూర్చబోతున్నారు? అతనికి ఎవరు ఇస్తామన్నారు? వంటి వివరాలను సేకరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే దిల్షుక్నగర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు సిబ్బందిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఆ బ్యాంక్ నుంచి నగదు మార్పిడి పేరిట డూప్లికేట్ పత్రాలు సృష్టించి రూ.50 లక్షల దాకా బయటకు తరలించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లో ఓ బ్యాంక్ చీఫ్ మేనేజర్.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనకు సన్నిహితుడైన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 25 శాతం కమీషన్‌పై గత ఆదివారం రూ.2.5 కోట్లు సమకూర్చారు. ఆ నగదు విత్‌డ్రాకు ఆయన గడచిన గురు, శుక్రవారాల్లో నగదు మార్పిడికి వచ్చిన వారి పత్రాలను డూప్లికేట్ చేశారు. ఇంతపెద్దమొత్తంలో నగదు ఎందుకు విత్‌డ్రా చేశారని రిజర్వుబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు ప్రశ్నిస్తే మొదటి రెండు రోజులు వచ్చినవారే నాలుగోరోజు వచ్చారని బుకాయించారు. సోమవారం బ్యాంక్ సెలవు దినం కావడంతో దీనిపై మగంళవారం విచారణ ప్రారంభమైంది. ఒక్క జూబ్లీహిల్స్లోనే కాదు... నెల్లూరులో ప్రభుత్వ రంగ బ్యాంక్‌కే చెందిన ఓ సీనియర్ మేనేజర్ తన బ్రాంచ్ నుంచి ఏకంగా రూ.2 కోట్ల విలువైన వంద నోట్లను ఓ వడ్ల వ్యాపారికి విత్‌డ్రా చేసి ఇచ్చాడు. చిల్లర లేదని ఇబ్బంది పడుతూ నగదు మార్పిడికి వచ్చిన వారికి మాత్రం ఆయన రూ.2000 నోట్లు ఇచ్చాడు. వంద నోటు కావాలని గొడవ చేసినా లేవంటూ వడ్ల వ్యాపారికి మాత్రం కమీషన్‌కు ఆ నోట్లు అమ్ముకున్నట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. దీనిపైనా విచారణ ప్రారంభమైంది. విజయవాడలోనూ ఇదే తంతు విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్‌కు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాలుగు బ్యాంక్‌లకు అందించాల్సిన రూ.12.5 కోట్ల నగదులో నాలుగో వంతు తాను పంపించిన వారికి ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్లను పురమాయించాడు. పాత నోట్ల మొత్తానికి 30 శాతం తక్కువగా కొత్తవాటిని సరఫరా చేశారు. ఈ నోట్లు తీసుకున్న వారు వెంటనే ఏలూరులో 40 శాతం కమీషన్‌కు పాత నోట్లు తీసుకుని పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి అధికారులు పోలీసులను అప్రమత్తం చేసే లోపే దళారులు జారుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల్లో ఈ దందా సాగుతోంది. ‘‘రూ.1000, రూ.500 పాత పెద్ద నోట్లు ఉంటే చెప్పండి...30 శాతం తక్కువకు కొత్త రూ.2000 నోట్లు సరఫరా చేస్తాం. మీ దగ్గర లేకపోతే మీకు తెలిసిన వారి దగ్గర ఉన్నా చెప్పండి. ఎంతైనా ఫర్వాలేదు. మేం పాతవి తీసుకుని కొత్తవి ఇవ్వడానికి సిద్ధం’’ అనేక చోట్ల ఇప్పుడు ఇదే సంభాషణ. అత్యవసరంగా నగదు కావాలనుకునే వారి నుంచి 40 నుంచి 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు సమకూర్చిన మొత్తంలో 80 శాతం నగదు బయటకు తరలించిన విషయం రిజర్వు బ్యాంక్ దృష్టికి వచ్చింది. దీంతో మంగళవారం ఆ బ్యాంక్‌కు బయటి నుంచి సిబ్బందిని తెప్పించి నగదు మార్పిడి, డిపాజిట్ల కార్యకలాపాల బాధ్యతలు అప్పగించారు. నగదు తరలింపుపై కన్ను హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల నుంచి బ్యాంక్‌ల నుంచే భారీ ఎత్తున అక్రమంగా రూ.2 వేల నోట్లు బయటకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించింది. రూ.500 నోట్లను తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు అందజేస్తే ప్రమాదకరమని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సోమవారం ఉదయమే ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని హెచ్చరించారు. అందువల్లే మంగళవారం ఇక్కడి బ్యాంక్‌లకు అందాల్సిన రూ.500 నోట్లను కావాలనే నిలుపుదల చేసినట్లు రిజర్వు బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు సాక్షి ప్రతినిధికి చెప్పారు. రూ.2,000 నోట్లను బహిరంగ మార్కెట్‌కు తరలించిన సీనియర్ అధికారులను గుర్తించామని, అతి త్వరలోనే వారిపై వేటు వేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంలకు చెందిన 24 మంది ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై రిజర్వుబ్యాంక్ విచారణ జరుపుతోంది. మామూలు కంటే నగదు విపరీతంగా బయటకు తరలించిన బ్రాంచ్‌లు వాటికి కారకులైన అధికారుల జాబితాను రిజర్వుబ్యాంక్ ఇప్పటికే ఆయా బ్యాంక్‌ల యాజమాన్యాలకు అందజేసింది. విజయవాడ, గుంటూరు, కర్నూలులోనూ ఇలాంటి కార్యకలాపాలకుపాల్పడిన 13 మంది సీనియర్ అధికారులపైనా కన్నేసి ఉంచాలని రిజర్వుబ్యాంక్ సదరు బ్యాంక్‌ల ఉన్నతాధికారులను ఆదేశించింది. కమీషన్లపై ఐబీ నివేదిక హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురంలో కమీషన్ల ప్రాతిపదికన పెద్ద ఎత్తున నగదు మార్పిడి జరుగుతోందంటూ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఇది జోరుగా సాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. బ్యాంక్ సిబ్బంది లాలూచీ కారణంగానే పాత నోట్ల బ్లాక్ మార్కెటింగ్ అధికమైందని నివేదికలో తెలిపింది. అనంతపురం జిల్లాకు పొరుగున కర్ణాటక సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి కోట్ల రూపాయల్లో రూ.2 వేల నోట్లు వచ్చి చేరుతున్నాయని, వాటిని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, విజయవాడ నుంచి వ్యాపారులు అనంతపురంలో తిష్ట వేశారని కూడా ఐబీ హెచ్చరించింది. దీంతో మంగళవారం అనంతపురం సరిహద్దులోని కర్ణాటక బ్యాంక్‌ల వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. సహకార బ్యాంక్‌ల్లో నగదు పంపిణీ బంద్ రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించిన తర్వాత నగదు మార్పిడికి రాష్ట్రాల ఆధీనంలోని సహకార బ్యాంక్‌లకు రిజర్వు బ్యాంక్ అవకాశం ఇచ్చింది. అయితే ఈ బ్యాంక్‌లకు చేరిన మొత్తం ఖాతాదారులు, నగదు మార్పిడి కోసం వచ్చిన వారి కంటే స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వారికే చేరుతున్నాయని గ్రహించింది. దీంతో రిజర్వుబ్యాంక్ మంగళవారం నుంచి ఆ బ్యాంకుల్లో కార్యకలాపాలను నిలుపుదల చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో సహకార బ్యాంక్‌ల నుంచి భారీగా డబ్బు రాజకీయ ప్రముఖులకు చేరినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దీన్ని కొనసాగిస్తే ప్రమాదకరమని, రూ.2 వేలు, రూ.500 నోట్లు బ్లాక్‌మార్కెట్ అవుతాయని హెచ్చరించింది. దీంతో దేశవ్యాప్తంగా సహకార బ్యాంక్‌ల నుంచి నగదు కార్యకలాపాలు నిషేధిస్తున్నట్లు రిజర్వుబ్యాంక్ మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది కూడా వెల్లడించలేదు. ఆయా రాష్ట్రాల్లో సహకార బ్యాంక్‌లకు తరలించిన నగదు వివరాలపై విచారణ జరపాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. -
బ్యాంకర్లతో చంద్రబాబు సమీక్ష
అమరావతి: పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో సోమవారం సమీక్షించారు. విజయవాడ కేంద్రంగా అనుక్షణం పరిస్థితిని గమనిస్తుండాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే రైతు బజార్లలో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో రూ.50 నోట్లను అందుబాటులోకి తేవాలని కోరారు. నోట్ల అవసరాలకనుగుణంగా బ్యాంకు, ఆర్బీఐ అధికారులు వేగంగా స్పందించాలన్నారు. కొత్తగా విడుదల చేసిన రూ. 500 నోట్లను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆర్బీఐ అధికారులకు సూచించారు. -
మనీ.. అదే పరేషానీ!
వరంగల్ రూరల్ జిల్లాలో పనిచేయని ఏటీఎంలు బ్యాంకర్లు బిజీ బిజీ.. రైతుల రుణాలపై పట్టింపు కరువు కొత్త రుణం ఇచ్చేది లేదు.. పాత బకారుు తీసుకోవడానికీ నిరాకరణ పెళ్లిళ్లు సైతం వారుుదా వేసుకునే పరిస్థితి పాత నోట్లు తీసుకోవడంతో భారీగా విద్యుత్, ఆస్తి పన్నుల వసూలు హన్మకొండ : కేంద్రప్రభుత్వం రూ.500, రూ.వెరుు్య కరెన్సీ నోట్లను రద్దు చేసిన సందర్భంగా ఏర్పడిన ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారుు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పట్టణాలు, మండలాల్లో శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఏటీఎంలు పనిచేయకపోవడంతో నగదు కోసం పలువురు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకుల వద్ద ఉదయం నుంచి వందల సంఖ్యలో ప్రజలు క్యూలో నిల్చున్నప్పటికీ స్వల్ప మొత్తాల్లో మాత్రమే నగదు ఇస్తుండడంతో వారి సమస్యలు తీరడం లేదు. ఇక యాసంగికి సంబంధించి రైతులకు మంజూరైన రుణం మొత్తాన్ని ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తుండడంతో రబీకి సిద్ధమైన రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న పనికే సమయం చాలక, కరెన్సీ సరిపోక ఇబ్బందులు పడుతుంటే రైతుల రుణాల గురించి పట్టించుకునే సమయం లేదని బ్యాం కర్లు చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. చివరకు గతంలో తీసుకున్న పంట రుణం చెల్లించేందుకు వచ్చినా పలు ప్రైవేట్ ఫైనాన్స కంపెనీల బాధ్యులు నిరాకరిస్తున్నారు. మరోవైపు సినిమా థియేటర్లు, వ్యాపార దుకాణాల్లో రద్దీ లేక వెలవెలపోయారుు. సాధారణంతో పోలిస్తే 30శాతం కంటే తక్కువ వ్యాపారం జరిగింది. ‘పెళ్లి’ తిప్పలు ఖరీఫ్ సీజన్ పూర్తి కావడంతో కార్తీక మాసం కావడంతో చాలామంది రైతులు తమ ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెట్టుకున్నారు. ఇందుకోసం నగదు సిద్ధం చేసుకున్నారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి కార్డు చూపించినప్పటికీ బ్యాంకర్లు కనికరించడంలేదని గగ్గోలు పెడుతున్నారు. కొందరు చెక్కుల రూపంలో చెల్లిస్తుండగా.. మరికొందరు కార్యాలనే వారుుదా వేసుకుంటున్నామని చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లికి చెంది న కొండ్లె అశోక్, రాజక్క దంపతుల కుమార్తె రాణి వివాహం ఈనెల 15న పెట్టుకున్నారు. ఇందుకోసం రూ.1.50లక్షలు సిద్ధం చేసుకోగా ఇప్పుడు కరెన్సీ సమస్య రావడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భూపాలపల్లి మండలం చిట్యాల మండలం బడిదెలకు చెందిన ఓ వ్యక్తి తమ కుమార్తె వివాహానికి రూ.5లక్షలు సిద్ధం చేసుకోగా ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ఈనెల 16న జరగాల్సిన వివాహాన్ని వారుుదా వేసుకునేందుకు నిర్ణరుుంచారు. 14వ వరకు చెల్లించొచ్చు.. వరంగల్ రూరల్ : రిజర్వు బ్యాంకు ఇండియా(ఆర్బీఐ) రద్దు చేసిన రూ.500, రూ.వెరుు్య నోట్లతో ప్రజలు తమ ఆస్తి, నల్లా పన్నులు, ట్రేడ్ లెసైన్సులు, విద్యుత్ బకారుులను ఈనెల 14వ తేదీ వరకు చెల్లించొచ్చని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. నర్సంపేట, పరకాల నగరపంచాయతీల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
ఆందోళన వద్దు
– జిల్లా ప్రజలకు ఎస్పీ భరోసా – నగరంలో మోటర్ బైక్‌పై విస్తృత పర్యటన – బ్యాంకు ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం కర్నూలు : జిల్లా ప్రజలు రూ.500, రూ.1000 నోట్ల గురించి ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఎస్పీ ఆకే రవికృష్ణ భరోసా ఇచ్చారు. గురువారం నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చునని, శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పనిచేస్తాయని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ స్వయంగా ద్విచక్ర వాహనంపై నగరంలో పర్యటించారు. జిల్లాపరిషత్ ఎదురుగా ఉన్న ఎమ్జీ పెట్రోల్ బంకుకు వెళ్లి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి అక్కడ మేనేజర్‌తో మాట్లాడారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నగరంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్కడైనా సమస్యలు తలెత్తితే డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఏటీఎం మిషన్లలో డిపాజిట్ చేసేవారు రోజుకు రూ.49,900 వరకు జమ చేసుకోవచ్చునని, బ్యాంకులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒరిజినల్స్, జిరాక్స్‌లతో వెళ్లి నగదు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఎస్పీ సూచనలు... డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున.. క్యూలైన్లు ఏర్పాటు చేసుకోవాలని, టోకన్ సిస్టమ్ పాటించే విధంగా చూడాలన్నారు. ప్రతి బ్యాంకు వద్ద గురువారం నుంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, జనసమూహం ఎక్కువగా ఉండే బ్యాంకుల వద్ద టెంట్లు వేసి వారికి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకు వేళలు ఉదయం నుంచే ప్రారంభించాలని కోరారు. మండలాలు, గ్రామాల్లో ఉండే రైతులు, ఇతర ప్రజలు.. ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్లో జమ చేసుకోవచ్చునన్నారు. 2017 మార్చి 31 వరకు ఆర్బీఐ కార్యాలయాల్లో కూడా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉందని సూచించారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రోజుకు రూ.4 వేలు మాత్రమే మార్పు చేసుకోవచ్చునన్నారు. బ్యాంకులలోని సీడీఎం, ఏటీఎం మిషన్‌లో కూడా రూ.500, రూ.1000 నగదును రూ.49,900 వరకు డిపాజిట్ చేసుకోవచ్చునని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని బ్యాంకర్లు కోరగా అందుకు ఎస్పీ సమ్మతించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మురళీధర్, చీఫ్ మేనేజర్ బాలమురళీకృష్ణ, సీఐలు డేగల ప్రభాకర్, కృష్ణయ్య, మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, మధుసూదన్‌రావు, నాగరాజు యాదవ్, ఎస్ఐలు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. -
బ్యాంకర్ల ఒత్తిడి తాళలేక..
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం ఆదోని టౌన్: అప్పు కట్టమని బ్యాంకర్లు ఒత్తిడి చేయడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కోసిగి మండలం పల్లెపాడులో చోటుకుంది. గ్రామానికి చెందిన రైతు హనుమంతుకు రెండు ఎకరాల బోరు పొలం ఉంది. అక్కడ మిరప పంటను సాగు చేశాడు. వర్షాధారం కింద మరో నాలుగు ఎకరాలను కౌలుకు సాగు చేశాడు. అరకొరగా కురిసిన వర్షాలతో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ క్రమంలో పంట సాగు కోసం బ్యాంక్‌లో తెచ్చుకున్న రుణం వెంటనే చెల్లించాలని రెండు సార్లు నోటీస్‌లు ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. 2014–15లో బ్యాంకులో రూ. 40వేలు అప్పు తీసుకోగా వడ్డీతో కలుపుకొని రూ. 70 వేలు అయింది. రుణమాఫీ కింద పదివేలు మాఫీ అయిందని మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబీకులు ఆదోనికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోసిగి పోలీసులు తెలిపారు. -
కేటీఆర్ కు, అధికారులకు కేసీఆర్ ఆదేశాలు
-
కేటీఆర్ కు, అధికారులకు కేసీఆర్ ఆదేశాలు
నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు నేడు మూడో రోజుకు చేరుకుంది. నాలాలపై అక్రమ కట్టణాల కూల్చివేత, అభివృద్ధిపై సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి సమీక్షించారు. నగర అభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పురపాలకశాఖ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ను, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిందని తెలిపారు. బ్యాంకర్లలో విశ్వాసం ఏర్పడి రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని వెల్లడించారు. హైదరాబాద్ నగరం వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను రుణాల కోసం సంప్రదించి పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని కేటీఆర్ కు, అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఎప్పటికప్పుడూ మంత్రి కేటీఆర్ కూడా అధికారులతో సమీక్ష చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. -
రుణాల కల్పనలో బ్యాంకులు చొరవ చూపాలి
రైతులు, చిన్న వ్యాపారులు, వృత్తికారులను ఆదుకోవాలి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : చిన్నతరహా వ్యాపారాలు, వృత్తులకు రుణాల కల్పనకు బ్యాంకులు చొరవతో ముందుకు రావాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బ్యాంకర్లను కోరారు. గురువారం కలెక్టరేట్ కోర్టు హాలులో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, బ్యాంకుల అధికారులతో జిల్లాస్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సలే్టటీవ్ కమిటీ సమావేశాలు కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని రైతులకు రూ.4251 కోట్లు పంట రుణాలు కల్పించే లక్ష్యానికి గాను ఇప్పటి వరకూ రూ.3922 కోట్ల రుణాలు కల్పించి 92 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. జిల్లాలో లక్షా 30వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయగా 45,581 మంది రైతులకు 97 కోట్లు మేరకు పంట రుణాలు కల్పించారన్నారు. కౌలు రైతులకు రుణాల కల్పన మరింత సరళం చేస్తూ వ్యవసాయ శాఖ ద్వారా సాగు ధృవీకరణ పత్రాల జారీని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు జిల్లాలో సాగు చేపట్టిన కౌలు రైతుందరికీ ఈ పత్రాలు జారీ చేసి రుణాలు అందేట్టు చూడాలని, ఈ నెలాఖరులోగా మరో రూ.30 కోట్లు అందించాలన్నారు. జిల్లాలో స్వయం సహాయ బృందాలకు ఈ ఏడాది రూ.1346 కోట్ల రుణాల కల్పన లక్ష్యానికి గాను ఇప్పటి వరకూ రూ.229 కోట్ల రుణాలు అందించామన్నారు. జిల్లాలో చిన్న వ్యాపారస్తులు, వృత్తికారులు అధిక వడ్డీ రుణాల ఊబిలో చిక్కుకోకుండా వర్కింగ్ కాపిటిల్ కింద రూ.5 వేల నుంచి రూ.15వేలు డీఆర్ఐ రుణాల కల్పనలో బ్యాంకులు చొరవ చూపాలని, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి బ్యాంకు బ్రాంచి నెలకు కనీసం 100 రుణాలు కల్పించాలన్నారు. చంద్రన్న బీమా పథకం కింద జిల్లాలో నమోదైన 17 లక్షల మందిలో సుమారు 3 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లు అక్టోబరు 2లోగా తెరవాల్సి ఉన్నందున బ్యాంకులు, డీఆర్డీఏ అధికారులు సమన్వయంతో సకాలంలో అకౌంట్లు కల్పించి లబ్ధిదారులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, వరుపుల సుబ్బారావు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ఆర్.భాస్కరరావు, ఎల్డీఎం బీవీ సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్, ఆర్బీఐ ఏజీఎం సీబీ గణేష్, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, వ్యవసాయశాఖ జేడీ కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. -
మాల్యా రుణ ఎగవేతలో... బ్యాంకులపై ఎస్ఎఫ్ఐఓ కన్ను
* మాజీ బ్యాంకర్ల పాత్రపై విచారణ ప్రారంభం... * నష్టాల్లో ఉన్న కింగ్ఫిషర్కు కొత్త రుణాల మంజూరుపై దర్యాప్తు న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా రుణ ఎగవేతలపై కేంద్రం దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఎఫ్ఐఓ).. ఇప్పుడు బ్యాంకర్ల పాత్రను నిగ్గుతేల్చే పనిలో ఉంది. ప్రధానంగా కింగ్‌ఫిషర్ భారీగా నష్టాల్లోకి కూరుకుపోతున్నా.. పూర్తిస్థాయిలో మదింపు చేపట్టకుండా దానికి కొత్తగా రుణాలిచ్చిన బ్యాంకులపై దృష్టిసారించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఉన్నాయి. రుణాల మంజూరీలో ఆయా బ్యాంకుల మాజీ చీఫ్‌ల పాత్రపై ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 10కి పైగా బ్యాంకులకు చెందిన మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు పంపినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన కొందరు మాజీ ఉన్నతాధికారులను విచారించినట్లు కూడా తెలిపాయి. మరోపక్క, మాల్యాకు చెందిన కొన్ని బ్రాండ్లు, ఆస్తుల విలువను భారీగా పెంచి చూపడం ద్వారా పెద్దమొత్తంలో రుణాలిచ్చారన్న ఆరోపణలతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి నిధులను దారిమళ్లించడంపైనా ఎస్ఎఫ్ఐఓ దృష్టిపెడుతోంది. కాగా, ఇప్పటికే మల్యా రుణ ఎగవేతలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఈడీ) ఇతరత్రా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. 2008-09లో కింగ్‌ఫిషర్ నష్టాలు రూ.1,600 కోట్లకు పైగానే ఎగబాకగా.. 2007-10 మధ్య కాలంంలోనే బ్యాంకులు భారీగా రుణాలివ్వడం గమనార్హం. తీవ్ర నష్టాలు, రుణాల ఊబిలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు 2012లో మూతపడ్డాయి. బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగానే రుణాలను(వడ్డీతో కలిపి) ఎగ్గొట్టిన మాల్యాను ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకులు మాల్యా ఎగవేతలపై కేసులు పెట్టడం... సీబీఐ, ఈడీ ఇతరత్రా ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించడంతో మాల్యా ఈ ఏడాది మార్చిలో బ్రిటన్‌కు వె ళ్లిపోవడం తెలిసిందే. -
మాల్యా కేసులో బ్యాంకుల పాత్రపై ఎస్ఎఫ్ఐ కన్ను
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రయోటర్ విజయ్ మాల్యా రుణ ఎగవేతలపై కేంద్రం దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఎఫ్ఐఓ).. ఇప్పుడు బ్యాంకర్ల పాత్రను నిగ్గుతేల్చే పనిలో ఉంది. ప్రధానంగా కింగ్‌ఫిషర్ భారీగా నష్టాల్లోకి కూరుకుపోతున్నా.. పూర్తిస్థాయిలో మదింపు చేపట్టకుండా దానికి కొత్తగా రుణాలిచ్చిన బ్యాంకులపై దృష్టిసారించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఉన్నాయి. రుణాల మంజూరీలో ఆయా బ్యాంకుల మాజీ చీఫ్‌ల పాత్రపై ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 10కి పైగా బ్యాంకులకు చెందిన మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు పంపినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన కొందరు మాజీ ఉన్నతాధికారులను విచారించినట్లు కూడా తెలిపాయి. మరోపక్క, మాల్యాకు చెందిన కొన్ని బ్రాండ్లు, ఇతరత్రా ఆస్తుల విలువను భారీగా పెంచి చూపడం ద్వారా పెద్దమొత్తంలో రుణాలిచ్చారన్న ఆరోపణలతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి నిధులను దారిమళ్లించడంపైనా ఎస్ఎఫ్ఐఓ దృష్టిపెడుతోంది. కాగా, ఇప్పటికే మల్యా రుణ ఎగవేతలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఈడీ) ఇతరత్రా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. 2008-09లో కింగ్‌ఫిషర్ నష్టాలు రూ.1,600 కోట్లకు పైగానే ఎగబాకగా.. 2007-10 మధ్య కాలంంలోనే బ్యాంకులు భారీగా రుణాలివ్వడం గమనార్హం. తీవ్ర నష్టాలు, రుణాల ఊబిలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు 2012లో మూతపడ్డాయి. బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగానే రుణాలను(వడ్డీతో కలిపి) ఎగ్గొట్టిన మాల్యాను ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకులు మాల్యా ఎగవేతలపై కేసులు పెట్టడం... సీబీఐ, ఈడీ ఇతరత్రా ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించడంతో మాల్యా ఈ ఏడాది మార్చిలో బ్రిటన్‌కు పారిపోవడం తెలిసిందే. -
‘1–బీ’లను తిరస్కరిస్తున్న బ్యాంకర్లు
∙అధికారులు ఇచ్చిన పçహాణీలు చెల్లవంటున్న మేనేజర్లు ∙రుణాల కోసం ఇబ్బంది పడుతున్న రైతులు మహబూబాబాద్ : రుణాలు, రుణమాఫీకి సం బంధించి రెవెన్యూ అధికారులు రైతులకు జారీ చేసిన 1–బీ నమూనా (ఆర్ఓఆర్) పహాణీలను కొందరు బ్యాంకు మేనేజర్లు తిరస్కరిస్తున్నారు. దీంతో రుణాల కోసం తాము అనేక ఇబ్బందు లు పడాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బ్యాంకులలో రుణాలు, రుణమాఫీ, ఇతరత్ర అవసరాల కోసం వీఆర్ఓలు రూ. 20 తీసుకుని 1బీ, పçహా ణీలను అందజేశారు. అయితే వాటిని కొన్ని బ్యాంకుల మేనేజర్లు అంగీకరించడం లేదని, మీ సేవ కేంద్రాల నుంచి తేవాల్సిందేనని కొర్రీలు పెడుతున్నారనిరైతులు చెపుతున్నారు. రెవెన్యూ అధికారులే బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకే రైతులకు ఆన్లైన్ ద్వారా 1బి, పçహాణీలను అందజేశామన్నారు. ఇందుకోసం ఒక్కో రైతు నుంచి రూ.10 మాత్రమే తీసుకున్నామని తెలిపారు. అయితే వీటిపై రుణాలు ఇచ్చేందుకు కొందరు బ్యాంకు మేనేజర్లు ఇబ్బంది పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. బ్యాంకులలో తీసుకోవడం లేదు.. రెవెన్యూ అధికారులు ఇచ్చిన 1బి, పహాణీలను మానుకోటలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్ అంగీకరించడం లేదు. మీసేవ కేంద్రం నుంచి పహణీ, 1బీ తీసుకురావాలంటున్నారు. రెవెన్యూ అధికారులు రూ.20 తీసుకుని ఇచ్చినా అవి పనికి రావడం లేదు. అధికారులే ఈ సమస్య పరిష్కరించాలి. – రమణ, రైతు -
సమ్మె బాటలో బ్యాంకర్లు
చెన్నై : కేంద్ర ప్రభుత్వ ఎకానమిక్ పాలసీలకు, కార్మిక వ్యతిరేక సంస్కరణలకు వ్యతిరేకంగా బ్యాంకర్లు మళ్లీ సమ్మెకు దిగనున్నారు. సెప్టెంబర్ 2న దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు బంద్ చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రకటించింది. కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించిన కేంద్ర కార్మిక యూనియన్ కన్వెన్షన్‌లో నేషనల్ జనరల్ బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఏఐబీఈఏ ఓ ప్రకటనలో తెలిపింది. చిన్న బ్యాంకులుగా ఉన్నందున్న విలీనాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థిస్తున్నాయని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీ.హెచ్ వెంకటాచలం అన్నారు. కానీ అది సరియైన పద్ధతి కాదని, మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్స్‌కు చిన్న బ్యాంకులు ఏర్పాటుచేసుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయని ఆయన చెప్పారు. వర్కర్లకు ట్రేడ్ యూనియన్ హక్కులను ఇవ్వకుండా, కేంద్రప్రభుత్వం చట్టాలను సవరిస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు, రీజినల్ రూరల్, కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులూ ఈ బంద్‌లో పాల్గొననున్నారు. -
రుణ లీలలు
⇒ రుణాల మంజూరులో పొంతన లేని లెక్కలు ⇒ తాకట్టు లేనిదే రైతులకు అందని రుణాలు ⇒ కష్టతరమవుతున్న ఖరీఫ్ సాగు చిత్తూరు (అగ్రికల్చర్): ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు రైతులకు అందించాల్సిన రుణాల్లో బ్యాంకర్లు, అధికారులు కనికట్టు లెక్కలు చూపుతున్నారు. వాస్తవాల్లోకి వెళితే సన్న, చిన్నకారు, ఇదివరలో రుణాలు ఉన్న రైతులకు ఏమాత్రం పంట రుణాలు అందడం లేదు. కేవలం బంగారు తాకట్టుపైనే రుణాలను బ్యాంకర్లు అందిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని రైతులకు ఈ ఖరీఫ్ సాగు కష్టతరంగా మారింది. రైతులకు పంటల సాగులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులు పంట రుణాలు అందిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అదేగాక ఈ ఖరీఫ్‌కు రైతులకు ఏమేరకు రుణాలు అందించాలనే లక్ష్యాలను కూడా కేటాయించినట్లు ప్రకటించింది. ఇదివరలో రుణాలు పొంది రుణమాఫీలో ఉన్న రైతులకు కూడా తమ పాత రుణాలను రెన్యూవల్ చేసుకుంటే వెంటనే కొత్త రుణాలు అందించే విదంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అయితే వాస్తవంగా సన్న, చిన్న రైతులకు పంట రుణాలు అందించిన దాఖలాలు కనిపించడం లేదు. పలుకుబడి ఉన్న మోతుబరి రైతులకు, బంగారు తాకట్టు పెట్టిన రైతులకు మాత్రమే బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొంతనలేని లెక్కలు ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని రైతులకు పంట రుణాలు అందిచాలని లక్ష్యాలను కేటాయించింది. అయితే కేటాయించిన లక్ష్యాలు, అందించిన రుణాలపై బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల్లో ఏమాత్రం పొంతనలేదు. బ్యాంకర్లు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రభుత్వం రూ.2,520 కోట్లు లక్ష్యాన్ని కేటాయించగా అందులో ఇప్పటికి రూ.1,790 కోట్ల రుణాలను రైతులకు అందించినట్లు చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు రూ.1,962 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటికి రూ.1,020 కోట్ల మేరకు రుణాలు అందించినట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇంతకీ ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలు ఎంత, వాటిలో అందించిన రుణాలు ఎంత అన్నది ప్రశ్నార్ణకంగా మారింది. బ్యాంకర్లు ఇప్పటికి అందించిన రుణాలను కేవలం పలుకుబడి ఉన్న మోతుబరి రైతులకు, నగలు తాకట్టు పెట్టిన రైతులకు మాత్రం రుణాలు అందించి పంట రుణాల కింద లెక్కలు చూపుతున్నట్లు పలువురు తెలుపుతున్నారు. కష్టాల సాగు ఈ ఖరీఫ్ సీజనుకు పంటలు సాగు చేయాలంటే రైతులకు కష్టతరంగా మారుతోంది. గత ఏడాది నవంబరులో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు నీటితో నిండాయి. దీంతో దశాబ్ద కాలంగా వర్షాభావంతో పంటలు లేక విలవిల్లాడుతున్న రైతుల్లో పంటల సాగుపై ఆశలు మొలకెత్తాయి. పంటల సాగుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బంగారు నగలు తాకట్టుపెట్టి, ప్రై వేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులుచేసి పంటలను సాగుచేశారు. అయితే పంటలకు చీడపీడలు ఆశించడంతో వచ్చిన కాస్తా దిగుబడి అప్పులకు కూడా చాలక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో ఖరీఫ్ సాగుకు మళ్లీ రుణాలు చేయాల్సిన దుస్థితి రైతులకు నెలకొంది. అయితే బ్యాంకర్లు మాత్రం రైతులకు తాకట్టు లేనిదే రుణాలు అందించడానికి సుముఖత చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇటు బ్యాంకు రుణాలు అందక, అటు ప్రై వేటు రుణాలు అందక పంటల సాగు రైతులకు కష్టతరంగా మారింది. -
ఎగ్గొట్టే వారికే రుణాలిస్తారా? బ్యాంకర్లను ప్రశ్నించిన కలెక్టర్ భాస్కర్
ఏలూరు (మెట్రో) : పెద్ద మనుషులు ఎగ్గొట్టిన రూ. 25 వేల కోట్లు మాఫీ చేయడానికి ముందుకు వచ్చిన బ్యాంకర్లు పేదలకు రుణాలివ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్లో డీఎల్ఆర్సీ సమీక్ష సమావేశంలో బ్యాంకు అధికారులతో కలెక్టర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎంతో మంచివారని తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని తిరిగి బ్యాంకులకు చెల్లించే ఆలోచనలతో ఉన్న ప్రజలకు రుణాలివ్వడానికి ఎందుకు బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్పాదక రంగానికి రుణాలివ్వకుండా వడ్డీ వ్యాపారం చేసే బడాబాబులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం వల్ల జిల్లాలో ఆశించిన ప్రగతి ఎలా సాధ్యపడుతుందని, పేదలకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంకర్ల కమిటీ, జిల్లా బ్యాంకు అధికారుల సంప్రదింపుల కమిటీ నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు పేదలకు రుణాలు ఇవ్వడం లేదని కలెక్టర్ ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతేడాది 42 మందికి , బీసీ కార్పొరేషన్ ద్వారా 440 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 280 మందికి లోన్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ బ్యాంకర్లు నేటికీ ఖాతాలు ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే వారికి లోన్లు ఇస్తే ఉత్పాదకత పెరిగి అటు రైతులు ఇటు జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో విప్ చింతమనేని ప్రభాకర్, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం గురుమూర్తి, ఆర్బీఐ ఏజీఎం హరిహరశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు డీడీఎం రామప్రభు పాల్గొన్నారు -
వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!
≈ లోపాల పుట్టగా ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ ≈ సర్కారు అనాలోచిత నిర్ణయం.. భూ యాజమానులకు శాపం ≈ ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు ≈ ప్రభుత్వ ఖాతాలో ప్రైవేట్ భూములు ≈ సవరణల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ≈ ముడుపులిస్తేనే తప్పులను సవరిస్తున్న అధికారులు ≈ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ≈ పట్టాదారు పాసు పుస్తకాలను కొనసాగించాలని రైతుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇటీవల ఒకరికి చెందిన భూమిని మరొకరు విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిని ప్లాట్లుగా చేసేందుకు కూలీలను తీసుకెళ్లగా అసలైన యజమాని వచ్చి అడ్డుకున్నాడు. ఇది తన భూమి అని చెప్పడంతో వెబ్‌ల్యాండ్ చూసి మోసపోయానని లబోదిబోమనడం కొనుగోలుదారుడి వంతయ్యింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన ఒక రైతు వెబ్‌ల్యాండ్‌లో తన భూమి నమోదు కోసం వెళ్లగా రెవెన్యూ అధికారులు ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేశారు. బేరమాడి రూ.80 వేలు ముట్టజెప్పిన తర్వాతే ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో చేరింది. అత్యంత ప్రామాణికంగా, పకడ్బందీగా రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ అక్రమాల పుట్టగా తయారైంది. ప్రభుత్వం ముందుచూపు లేకుండా, అనాలోచితంగా తీసుకొచ్చిన రెవెన్యూ వెబ్‌ల్యాండ్ భూ యజమానుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ‘డబ్బు ల్యాండ్’గా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు)లో లొసుగులు, అవినీతి అక్రమాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరుతో ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో దర్శనమిస్తున్నాయి. వందో రెండొందలో కాదు, ఇలాంటివి లక్షల్లోనే ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లలోని భూములు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఆన్లైన్లో నమోదైన చాలా ఆస్తులను తహసీల్దార్లు ధ్రువీకరించ లేదు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాలకు పొంతన కనిపించడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే వారి భూములు వెబ్‌ల్యాండ్‌లో లేవంటూ బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. తమ భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్న రైతులను రెవెన్యూ సిబ్బంది/దళారులు పీడిస్తున్నారు. డబ్బు ముట్టచెబితేనే వారి భూములను నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం నిత్యం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. కొనుగోలుదారులకు తీవ్ర నష్టం వెబ్‌ల్యాండ్‌లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఒకరికి చెందిన భూమి వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరిట ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, పకడ్బందీగా పూర్తి చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఆధారిత లావాదేవీలకు ఆమోదం తెలిపితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. సర్వం లోపాలమయం దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాలూ సర్కారు భూముల ఖాతాలో కనిపిస్తున్నాయి. భూ పంపిణీ కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వేరే వారి పేర్లతో ఉండటంతో వాస్తవ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కిందిస్థాయి రెవెన్యూ అధికారులు/ దళారులు కుమ్మక్కై నకిలీల పేర్లను భూ యజమాని కింద వెబ్‌ల్యాండ్‌లో చేర్చి, విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు బయట పడుతున్నాయి. దీంతో అసలైన యజమానులే కాకుండా కొనుగోలుదారులు కూడా మోసపోతున్నారు. అధికారులు భారీగా సొమ్ము తీసుకుని ప్రభుత్వ భూములను, ప్రైవేట్ వ్యక్తుల పొలాలను ఇతరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. భూమి విలువను బట్టి రేట్లు ఆన్లైన్లో భూముల నమోదుకు వాటి విలువ, యజమానుల ఆర్థిక పరిస్థితి, వారి అవసరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు/ దళారులు రేట్లు ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదుకు భూమి విలువ, ఇతర అంశాల ఆధారంగా రూ.10 వేల నుంచి 60 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. కొంపముంచిన తొందరపాటు నిర్ణయం వెబ్‌ల్యాండ్‌లోని పొరపాట్లను పరిశీలించకుండానే ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగానే భూముల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలంటూ ఏకంగా జీవో ఇచ్చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. వెబ్‌ల్యాండ్‌లో తప్పులను సవరించే వరకూ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే లావాదేవీలకు అనుమతించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం పేరు మాయం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో సర్వే నంబరు 831లో నాకు 2.60 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. రెండు నెలల క్రితం వెబ్‌ల్యాండ్‌లో ఈ భూమి యజమానిగా నా పేరు బదులు మరో వ్యక్తి పేరు ప్రత్యక్షమైంది. నిజమైన రైతు పేరును వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడానికి డాక్యుమెంట్లు అడుగుతున్న అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే నా భూమి యజమానిగా వేరే వ్యక్తి పేరును ఎలా నమోదు చేశారో అర్థం కావడం లేదు. - చింతకాయల రామాంజనమ్మ ఐదెకరాలుంటే రెండెకరాలుగా నమోదు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన గుంటబోయిన వెంకటరమణకు ఐదెకరాలకు పైగా సాగు భూమి ఉంది. వెబ్ అడంగల్‌లో మాత్రం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. దీంతో ఈయన మ్యుటేషన్ కోసం మార్చి నెల లో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశారు. ఇంతవరకూ వెబ్ అడంగల్‌లో మార్పు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా గోళ్లవలస గ్రామంలో 400 మంది రైతులకు చెందిన 2 వేల ఎకరాల భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. దీంతో పంట రుణాలకు నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మోసాలు బయటపడటంతో... వెబ్‌ల్యాండ్‌లోని తప్పులను ఆసరాగా చేసుకుని ఒకరి భూమిని మరొకరు విక్రయిస్తున్నారని, కొందరు రెవెన్యూ అధికారులు ఇలాంటి మోసాలకు సహకరిస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వెబ్‌ల్యాండ్ ఆధారిత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటికే ఎన్నో మోసాలు బయటపడ్డాయి. దీనివల్లే తాత్కాలిక (నోషనల్) ఖాతాలకు సంబంధించిన భూములను విక్రయ రిజిస్ట్రేషన్లు చేయరాదని, శాశ్వత ఖాతాలేని వారికి పంట రుణాలు ఇవ్వరాదంటూ తాజాగా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని, వీటిని సవరించే ప్రక్రియ త్వరలో చేపడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
ఐపీవోకు వస్తున్న షీలా ఫోమ్
స్లీప్‌వెల్ బ్రాండుతో పరుపులను(మ్యాట్రెస్) అమ్ముతున్న షీలా ఫోమ్ ప్రెవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ కి రానుంది. దీనికి సంబందించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 510 కోట్ల సమీకరించాలని యోచిస్తోంది. 15 శాతం వాటాను విక్రయించాలని కంపెనీ భావిస్తున్న కంపెనీ దీనికి అనుమతించమనికోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. దీంతో కంపెనీ విలువ 40-50 కోట్ల డాలర్లకు చేరనుందని అంచనా . రూ. 5 ముఖవిలువగల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తదుపరి దశలో ఆఫర్ చేయనున్న షేర్ల సంఖ్యను వెల్లడించనుంది. ఎదెల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ నిర్వహిణలో ఐపీవోకు రానుంది. రాహుల్ గౌతమ్ నేతృత్వంలోని షీలా ఫోమ్ పాలీరెథాన్ ఫోమ్ ఆధారిత పరుపులను విక్రయిస్తుంది. స్లీప్ వెల్ ప్రధాన బ్రాండ్ కాగా పారిశ్రామిక కంపెనీలకు కూడా ఫోమ్ ను కూడా విక్రయిస్తుంది. కాగా 2015 ఆర్థికసంవత్సం పోలిస్తే 2016లో ఇప్పటివరకూ 10 సంస్థలు ఐపీవోకి వచ్చాయి. దీని ద్వారా 6, 743కోట్లమేరకు ఆర్జించాయి. ప్రేమ్ డేటా బేస్ ప్రకారం 2015లో 21 కంపెనీలు 13,600 కోట్లను ఆర్జించాయి. -
బ్యాంకర్లు ముందుకు వస్తే ఆన్లైన్ సేవలు
టీటీడీ బోర్డు సభ్యుడు రమణ కొడంగల్ : బ్యాంకర్లు సహకరిస్తే టీటీడీ కల్యాణమంటపాల్లో ఆన్లైన్ సేవలు అందించడానికి టీటీడీ అనుమతి ఇస్తుందని పాలకవర్గం సభ్యుడు ఏవీ రమణ అన్నారు. ఆదివారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీలో సిబ్బంది కొరత ఉన్నందున తాము ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. కొడంగల్ ఆలయానికి వైభవోత్సవ మంటపాన్ని మంజూరు చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తలకు సూచించారు. భక్తుల కోరిక మేరకు కొడంగల్ ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు తిరుపతి రెడ్డి, నందారం ప్రశాంత్, అనురాధ ఉన్నారు. -
సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు
చెన్నై: దేశంలోని 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఈనెల 29 నుంచి సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకింగ్ రంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు దిగనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జెనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలమ్ తెలిపారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొంటాయని ఆయన తెలిపారు. తొమ్మిది యూనియన్ల లో సభ్యత్వం కలిగిన దాదాపు 10 లక్షల మంది ఇందులో పాల్గొననున్నారు. -
ఉపశమనం.. ఉత్తమాటే..
చెల్లుబాటు కాని రుణమాఫీ పత్రాలు ఆదేశాలు లేవంటున్న బ్యాంకర్లు బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణ పాత విధానమే మేలంటున్న వైనం ఇటీవల ప్రభుత్వం రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా చేపట్టింది. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు సభలు ఏర్పాటు చేసి.. రైతులకు పత్రాలు పంపిణీ చేశారు. ‘రైతు ప్రభుత్వం’ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. పత్రాలు బ్యాంకర్లకు ఇస్తే 24 గంటల్లో ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని చెప్పారు. అయితే..వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మాఫీ పత్రాలను బ్యాంకర్లు తీసుకోవడం లేదు. తమకు ఆదేశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ధర్మవరం : ధర్మవరం మండలం తుమ్మల గ్రామానికి చెందిన దాదాపు 70 మంది రైతులకు రుణమాఫీ పత్రాలు ఇచ్చారు. వీరు రోజూ ధర్మవరం పట్టణంలోని కెనరా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం కూడా 20 మంది దాకా వచ్చారు. రుణమాఫీ పత్రాలు తీసుకుని..తమ ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చూడాలని బ్యాంకు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే.. వారు తీసుకోలేదు. ‘ మేం పత్రాలు తీసుకుని ఏం చేయాలి? మాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. పోండి’ అంటూ రైతులను తిప్పి పంపారు. దీంతో రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఒక్క ధర్మవరంలోనే కాదు..జిల్లాలో చాలాచోట్ల రైతులకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రుణమాఫీ పత్రాలు ఇచ్చినప్పటికీ బ్యాంకర్లు వీటిని తిరస్కరిస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రుణమాఫీ పథకం అమలులో భాగంగా తొలి ఏడాది అప్పులు తీసుకున్న రైతుల నుంచి ఆయా బ్యాంకుల ద్వారా వారి ఖాతా, ఆధార్ నంబర్లు సేకరించారు. ఆన్లైన్ ద్వారా నేరుగా సదరు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి తొలివిడత మొత్తాన్ని జమచేశారు. ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయకపోయినప్పటికీ అయ్యిందేదో అయ్యిందని భావించిన రైతులు వచ్చిన కాస్త మొత్తానికి మరింత జమ చేసి పంట రుణాలను రెన్యూవల్ చేసుకున్నారు. రుణమాఫీ చేసినా తొలి ఏడాదిలో రైతుల నుంచి ఎటువంటి మద్దతూ లభించలేదని భావించిన ప్రభుత్వం.. రెండో ఏడాది కొండంత ప్రచారం చేపట్టింది. రైతు సాధికార సంస్థ పేరిట రుణ ఉపశమన అర్హత పత్రాలను మంజూరు చేసింది. అయితే.. వాటిని తీసుకుని రైతుల వివరాలను ఆన్లైన్లో రైతు సాధికార సంస్థకు అప్లోడ్ చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో రైతులను బ్యాంకర్లు తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ రుణాల రెన్యూవల్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ మొత్తం వస్తే రైతులకు కొద్దిపాటి ఉపశమనమైనా లభిస్తుంది.జిల్లాలో ఎనిమిది లక్షల మందికి గాను 5.15 లక్షల మంది రైతులకు రుణ మాఫీ పత్రాలు మంజూరయ్యాయి. వీటిలో ఇంకా 30 శాతం వరకు రైతులకు చేరలేదు. వాస్తవానికి ఆధార్ కార్డులో ఏ చిరునామా ఉంటే ఆ మండల వ్యవసాయ అధికారుల వద్దకు పత్రాలు చేరాయి. వీటిని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు రైతులు సకాలంలో తీసుకోలేకపోతున్నారు. పాతపద్ధతే మేలు గత సంవత్సరం మా ఖాతాలోకే రుణమాఫీ మొత్తం పడింది. దాంతో పాటు మరికొంత చెల్లించి పంట రుణం రెన్యూవల్ చేసుకున్నా. ఈ సారి పత్రాలు ఇచ్చినారు. బ్యాంకోళ్లు.. ఇవి తీసుకోబోమని చెబుతున్నారు. తమకు ఎవరూ చెప్పలేదంటున్నారు. పాత పద్ధతిలో అకౌంట్లలోకి వేసి ఉంటే బాగుండేది. - కేశవరెడ్డి, తుమ్మల, దర్మవరం మండలం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం ప్రభుత్వం అందజేసిన రుణమాఫీ పత్రాలను తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని బ్యాంకర్లందరికీ చెప్పాం. పంట రుణాల రెన్యూవల్స్‌లో కొంత బిజీగా ఉన్నందున, సిబ్బంది కొరత కారణంగా కొన్ని బ్యాంకుల్లో తీసుకోలేదని నా దృష్టికి వచ్చింది. అయినా మరొకసారి అందరికీ చెబుతాం. రైతులను వెనక్కి పంపొద్దని ఆదేశిస్తాం. - జయశంకర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ -
పత్రాలిచ్చారు సరే.. పైసలేవీ..?
♦ బ్యాంకులకు పోటెత్తుతున్న రైతులు ♦ మాకేమి డబ్బులు రాలేదంటున్న బ్యాంకర్లు ♦ ముందు చూపులేక సమస్య జఠిలం ♦ జిల్లాలో అన్నిచోట్లాఇదే పరిస్థితి ♦ ఎన్ఐసీ వెబ్సైట్లో క్లిక్ చేయాలంటున్న ఎల్బీఎం సాక్షి కడప : ఐదేళ్లల్లో పూర్తి రుణం మాఫీ చేస్తామని మరోమారు అన్నదాతలకు రుణ ఉపశమన పత్రాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా.. బ్యాంకుల్లో అధికారులు మాత్రం వాటిపట్ల నిరాసక్తత చూపుతున్నారు. కారణం అవగాహన లేకపోవడంతో పాటు రాష్ట్రప్రభుత్వం నిధులు వేసిందో.. లేదో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున కొంతమంది మంత్రులు, టీడీపీ నేతలు అట్టహాసంగా రుణ ఉపశమన పత్రాలను రైతులకు పంపిణీ చేసినా.. బ్యాంకుల్లో నిధులు నిల్ అంటుండటంతో పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అన్నదాతలకు, మహిళలకు రుణాల మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తర్వాత సవాలక్ష కొర్రీలతో అతితక్కువ మంది రైతులకే రుణం మాఫీ చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. రూ.50వేలలోపు రుణం ఉన్న రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామన్నా.. చాలామందికి అది జరగలేదు. తాజాగా పంపిణీ చేస్తున్న రుణ ఉపశమన పత్రాల వ్యవహారం కూడా అయోమయంగా తయారైంది. గగ్గోలుపెడుతున్న అన్నదాతలు.. : జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఖాతాలకు మొదటి విడతలోనే రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా పంపిణీ చేస్తున్న రుణ ఉపశమన పత్రాలు చాలామంది రైతులకు అందడం లేదు. ఉదాహరణకు తొండూరు మండలంలో 6వేల పైచిలుకు ఖాతాలు ఉండగా.. ఇప్పటివరకు 3వేలలోపు ఖాతాలకు మాత్రమే రుణవిముక్తి పత్రాలను అందజేశారు. మిగతా వారికి ఎప్పుడిస్తారో స్పష్టతలేదు. అసలు రుణవిముక్తి పత్రాలు వస్తాయో.. రావో తెలియని పరిస్థితి. దీంతో అన్నదాతలు గగ్గోలుపెడుతున్నారు. ఇదేమిటని పలువురు రైతులు పులివెందులలో జరిగిన రుణ ఉపశమన పత్రాల పంపిణీ సభలో టీడీపీ నేతలను నిలదీశారు. అయినా ప్రయోజనం శూ న్యం. ఒక్క తొండూరు మండలంలోనే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా చాలామంది రైతులకు రుణ విముక్తి పత్రాలు అందలేదు. బ్యాంకు అధికారులకు అవగాహనలేక ఇబ్బందులు తమకు అందజేసిన ఉమశమన పత్రాలను పట్టుకొని రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. అక్కడ రైతులకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రైతులు తీసుకెళ్లిన తర్వాత పత్రాల్లోని సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉన్న పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్యాంకు అధికారులకు దీనిపై అవగాహన లేకపోవడం.. ప్రభుత్వం మాఫీకి సంబంధించిన సొమ్మును ఎక్కడ పెట్టింది తెలపకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. మాఫీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రైతన్నలను పలువురు అధికారులు తిప్పిపంపుతున్నారు. నేతల ఆర్భాటం.. బ్యాంకు అధికారుల అవగాహన లోపం.. రైతులకు శాపంగా మారుతున్నాయి. ఎన్ఐసీ వెబ్సైట్లో క్లిక్ చేయాలి: ఎల్బీఎం ప్రస్తుతం రుణ ఉపశమన పత్రాలు తీసుకున్న రైతులు బ్యాంకులకు రాగానే పత్రాలలో ఉన్న పేరుతోపాటు ఇతర వివరాలను ఎన్ఐసీ(నేషనల్ ఇన్‌ఫార్మటిక్ సెంటర్)లో అప్లోడ్ చేయాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి తెలియజేశారు. అందుకు సంబంధించి రైతులు బ్యాంకులకు రాగానే పత్రాల్లో ఉన్న సమాచారాన్ని అప్లోడ్ చేస్తే సాధికారిత సంస్థకు వెళుతుందన్నారు. తర్వాత రెండు, మూడు రోజులకు సాధికారిత సంస్థల హెడ్ ఆఫీసు ఆ మొత్తాన్ని జమ చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం హెడ్ ఆఫీసుల నుంచి సంబంధిత బ్రాంచ్‌లకు వస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం రైతుల ఖాతాలకు జమచేస్తారని తెలిపారు. రైతులకు సంబంధించిన రుణ పత్రాలను తీసుకొని అన్ని బ్యాంకుల అధికారులు ఎన్ఐసీలో ఆప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. -
దుక్కిదున్ని.. దిక్కులు చూస్తూ..!
ప్రహసనంగా పంట రుణాలు మొండి చెయ్యి చూపిస్తున్న బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులే దిక్కు అయోమయంలో అన్నదాత ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో ఖరీఫ్ రైతుల పరిస్థితి. తొలకరి పలకరించినా చేతిలో చిల్లిగవ్వలేక దుక్కులు దున్ని దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకు రుణాలు అందక.. ఇన్పుట్ సబ్సిడీ రాక.. ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పెట్టుబడి కోసం నగానట్రా తాకట్టుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. చిత్తూరు : ఖరీఫ్ కష్టాలు మొదలయ్యాయి. తొలకరి పలకరించినా పంట పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక రైతులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో ఒక్కరైతుకూ ప్రభుత్వ రుణం అందక ప్రయివేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులకు బాసటగా నిలిచి బ్యాంకు రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అందని ద్రాక్షలా ఇన్‌పుట్‌సబ్సిడీ జిల్లా ైరె తులకు ఇన్పుట్ సబ్సిడీ అందని ద్రాక్షలా మారింది. గత రెండు ఖరీఫ్‌లకు సంబంధించి ఇన్‌పుట్‌సబ్సిడీ రూ.205 కోట్ల వరకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దానిపై ప్రభుత్వం కనీసం నిర్ణయమూ తీసుకోలేదు. రెండేళ్లు గడచినా సబ్సిడీ రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రైవేటు భారం రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు రైతులకు చుక్కలు చూపుతున్నారు. పాత రుణాలు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని తెగేసి చెబుతుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దళారులు ఒక రోజుకు రూ.10వేలకు రూ.500 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇదే మొత్తాన్ని బ్యాంకులో రుణం తీసుకుంటే రూ.1.50 పైసలు పడుతుంది. ప్రైవేటు దళారులు వందకు రూ.3 నుంచి రూ.4 వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రమారమీ ప్రతి సంవత్సరమూ రూ.50 కోట్ల వరకు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. రుణమాఫీ ఏదీ తాము అధికారంలోకి వస్తే వ్యసాయ రుణాలు మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కర్షకుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తరువాత కొర్రీలు పెడుతుండటంతో ైరె తులకు మాఫీ ఫలాలు అందటం లేదు. జిల్లాలో 8.70 లక్షల రైతులకు బ్యాంకుల్లో రూ.11,180.25 కోట్ల రుణాలు ఉన్నాయి. మొదటి విడతగా రూ.600 కోట్లు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రెండో విడత అని రైతులను ఊరిస్తోంది. వాటికి ప్రస్తుతం రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈసొమ్ములు ఎప్పటికి చేతికి వచ్చేనో. చేయూత లేకుండా ఏరువాక సంబరాలా? రె తులకు ప్రభుత్వం చేయూత నివ్వకుండా ఏరువాక సంబరాలు నిర్వహిస్తుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమై పది రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు రుణాలు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు లేకుండా ఏరువాక ఎలా సాగించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం జిల్లా రైతులకు రుణం ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్త రుణాలు, ఉన్న రుణాలను రెన్యువల్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్క కొత్త రుణం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.3,176 కోట్లు ఉండగా ఇందులో ఈ ఖరీఫ్‌కు దాదాపు రూ.1,500 కోట్ల మేరకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు ఇచ్చారో అధికారుల వద్దే సమాచారం లేదు. -
సమ్మెకు దిగుతున్న బ్యాంకు ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకు విలీనం ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు. అసోసియేట్ బ్యాంకులకు చెందిన దాదాపు 45వేలమంది ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జులై 12 న సమ్మెకు దిగనున్నారు. అలాగే జూలై 13న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. అయిదు అనుబంధ బ్యాంకుల స్టేట్ బ్యాంక్ విలీనంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటానికి దిగుతున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలతో ఉద్యమానికి దిగుతున్నట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం వెల్లడించారు. మొండి బకాయిల రికవరీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనీ.. అదే సందర్భంలో బ్యాంకింగ్ పరిశ్రమలో కన్సాలిడేషన్ ఇప్పుడు ప్రధానం కాదని ఆయన వాదించారు. 100,000 కోట్ల మేర పేరుకుపోయిన రుణాల రికవరీపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి వీలుగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. నాలుగు లిస్టెడ్ బ్యాంకులు, ఒక్క అన్‌లిస్టెడ్ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకులవిలీనానికి కేంద్ర క్యాబినెట సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, హైదరాబాద్, బికనూర్, మైసూర్, పాటియాల, భారతీయ మహిళాబ్యాంక్ వీటిలో ఉన్నాయి. -
త్వరలో మూడో విడత ‘మాఫీ’ నిధులు
* విడుదల చేస్తామని బ్యాంకర్లకు సీఎస్ రాజీవ్‌శర్మ హామీ * రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయవద్దని సూచన సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించిన మూడో విడత నిధులను త్వరలోనే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ బ్యాంకర్లకు తెలిపారు. రుణ మాఫీకి సంబంధించిన వడ్డీని రైతుల నుంచి వసూలు చేయరాదని స్పష్టం చేశారు. వడ్డీ, రుణ మాఫీ అంశం ప్రభుత్వానికి, బ్యాంకర్లకు సంబంధించిన అంశమని రైతులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. పంట రుణ మాిఫీలో లబ్ధి పొందిన అనర్హుల వివరాలను బ్యాంకర్లకు పంపించామని, వారి నుండి రికవరీ చేసేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పంట రుణ మాఫీకి సంబంధించి రైతుల భూ వివరాల కోసం రెవెన్యూ శాఖ వెబ్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని బ్యాంకర్లను సూచించారు. గురువారం సచివాలయంలో 6 ప్రధాన బ్యాంకుల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వరం పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. 2016-17లో రూ.29,101 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఖరీఫ్‌లో రూ.17,460 కోట్ల మేర రుణాలు రైతులకు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత మేరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ స్కేల్ ప్రకారం రైతులకు రుణాలు చెల్లించాలని సూచించారు. రైతులకు పంట రుణాల రెన్యువల్స్‌ను వేగవంతం చేయాలన్నారు. అర్హులైన రైతులకు రుణాలు అందేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో బ్యాంకు సిబ్బంది వడ్డీని చెల్లించాలని రైతులను కోరుతున్న విషయాన్ని వివరాలతో సహా బ్యాంకర్లకు తెలిపారు. ఖరీఫ్ 2016 సంవత్సరానికి సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాల ద్వారా వివిధ పంటలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కటాఫ్ డేట్ వివరాలను బ్యాంకర్లకు అందించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయి ప్రసాద్, ఎస్బీఐ జీఎం గిరిధర్ కిని, డీజీఎం వి.సదా శివం, డీజీఎం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏజీఎం జేబీ సుబ్రమణ్యం, టీఎస్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఎండీ మురళీధర, ఏపీజీబీ జీఎం టీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ రూ.500 కోట్లూ మాకిచ్చేయండి
ఎస్ఎల్బీసీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సూచన సాక్షి, విజయవాడ బ్యూరో: తాను సృజనాత్మకంగా, కొత్తగా పనిచేస్తున్నానని.. బ్యాంకర్లు కూడా అలాగే పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పాత విధానాలను వదిలిపెట్టి, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన 194వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశంలో సీఎం మాట్లాడారు. రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా తాము పని చేస్తున్నామని.. అందుకనుగుణంగా బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు రుణాలివ్వాలని కోరారు. రుణ ప్రణాళికలకు ఆమోదముద్ర వేయించుకోవడం ప్రధానం కాదని.. అమలులో కూడా అదే వేగం, ఉత్సాహాన్ని చూపించాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు నిర్దేశించామని, బ్యాంకర్లు వారిని సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆర్బీఐ కూడా సృజనాత్మకంగా పనిచేయాల్సి ఉందన్నారు. స్మార్ట్ గ్రామాల ప్రాజెక్టు రిపోర్టులకు నాబార్డు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ మొత్తాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తే మిగిలిన పథకాలతో కలిపి వినియోగిస్తామని, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల ప్రతి గ్రామంలో వ్యక్తిగత మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతులను కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలే ఇకపై బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా పనిచేస్తారని, ఇందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. జల సంరక్షణ ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పద్ధతులను అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రుణ ప్రణాళికను చంద్రబాబు విడుదల చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పలు రంగాలకు రూ.1,65,538 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఎస్ఎల్బీసీ ప్రతిపాదించింది. ఈ సమావేశంలో బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఆంధ్రాబ్యాంకు జీఎం దుర్గాప్రసాద్, ఎస్ఎల్బీసీ చైర్మన్, ఆంధ్రా బ్యాంకు ఎండీ, సీఈఓ సురేష్ ఎన్.పటేల్, నాబార్డు జీఎం చంద్రశేఖర్, ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.చెల్లపండి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సమ్మెకు సై అంటున్న బ్యాంకులు
చెన్నై: కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా త్వరలోనే బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి. దాదాపు 10 లక్షల బ్యాంకులు జులై 29నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ నేత ఒకరు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన యునైడెట్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఎఎన్ఎస్ కు తెలిపారు. బ్యాకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్ల (AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC, NOBW, NOBO) ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబీఈఎ) గురువారం ఒక ప్రకటలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపర్చేవిగా ఉన్నాయని ఎఐబీఈఎ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం ఆరోపించారు. ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, కొత్త బ్యాంకు లైసెన్సుల జారీ, క్యాపిటల్ ఇన్ఫూజన్, ఏకీకరణ, విలీనం, గ్రామీణ బ్యాంకుల్లో ప్రయివేటు మూలధనం అనుమతి పెంపు తదితర చర్యల వల్ల బ్యాంకులు నిర్వీర్యమయ్యే ప్రమాదముందని వెంకటాచలం హెచ్చరించారు. ఇప్పటికే బ్యాంకింగ్ సెక్టార్ లో చెడు రుణాల మొత్తం రూ.10 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. పెద్ద మొత్తంలో రుణాలను ఎగవేస్తున్న కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోకవడమే దీనికి కారణమన్నారు. బ్యాంకు ప్రయోజనాలకు భిన్నంగా కార్పొరేట్ సంస్థలకు రుణాల మంజూరు, మాఫీ జరుగుతోందన్నారు. బ్యాంకులకు అప్పులను ఎగవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 7,000 మందికిపైగా డిఫాల్టర్ల తో 60,000కోట్ల రుణ భారం బ్యాంకింగ్ రంగంపై పడిందని వెంకటాచలం తెలిపారు. -
రుణాల మంజూరులో బ్యాంకర్ల సహకారం లేదు
♦ 193వ ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ♦ డిపాజిట్లు లేకుండా రైతులకు రుణాలు మంజూరు చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకర్ల నుంచి సహకారం లభించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.3 లక్షల్లోపు రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా పంపిణీ చేయాలని ఎస్ఎల్బీసీ(రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ)లో తీసుకున్న నిర్ణయాన్నే బ్యాంకర్లు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 193వ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ డిపాజిట్లతో నిమిత్తం లేకుండా స్వల్ప కాలిక రుణాలు మంజూరు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా ముద్రా బ్యాంకు ద్వారా పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకూ రుణాలను మంజూరు చేస్తున్నారని వివరించారు. రైతులకు బ్యాంకర్లు ఉదారంగా రుణాలు మంజూరు చేస్తే వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఖాయమన్నారు. కరవు రహిత ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి జూన్ నాటికి పది లక్షల సేద్యపు కుంటలను తవ్వడంతోపాటూ, లక్ష రెయిన్ గన్స్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కరవు బారి నుంచి రాష్ట్రా న్ని శాశ్వతంగా కాపాడటానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో బ్యాంకులకు కన్సల్టెంట్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. -
21న బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సీనియర్ అధికారులతో మార్చి 21న ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. మొండిబకాయిల సమస్య, రికవరీ, బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ సమావేశం దృష్టి సారించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధి కూలీలకు బ్యాంకుల భయం
బ్యాంకర్లు పాత బకాయిల కింద కూలీ డబ్బులను జమ చేసుకుంటుండడంతో ఉపాధి కూలీకి వె ళ్లాలంటేనే నిరుపేదలు భయపడుతున్నారు. ఉపాధి హామీ పధకం కింద కూలీలు చేసిన పనులకు గాను ఈజీఎస్ నుంచి వారానికోరోజు నేరుగా బ్యాంకులో వారిపేరిట ఖాతాల్లో డబ్బులు జమ అవుతోంది. ఈ డబ్బును కూలీలు బ్యాంక్ ఖాతాల్లోనే ఉంచుకుంటున్నారు. అయితే, ఈ డబ్బు నిల్వ చూసిన బ్యాంకు అధికారులు మాత్రం సంబంధిత వ్యక్తుల పాత బకాయిల కింద మినహాయించుకుంటున్నారు. దీంతో కూలీలు లబోదిబోమంటున్నారు. దీనిపై స్పందించిన ఈజీఎస్ అధికారులు.. ఖాతాల్లో డబ్బును వెంటనే డ్రా చేసుకోండంటూ కూలీలకు సూచిస్తున్నారు. బ్యాంక్ చర్యల కారణంగా కూలీలు ఉపాధి పనులు మానేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రెండువేల మంది ఇప్పటికే పనులు మానేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి పనుల లక్ష్యం కుంటుపడింది. దీంతో కూలీల్లో ధైర్యం నింపేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా బ్యాంక్ మేనేజర్లతో సమావేశమయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నారు. -
మోటార్!
భారీగా పెరిగిన మోటార్ల ధర ఒక బోరుకు మోటారు అమర్చాలంటే రూ.1.5 లక్షలకు పైమాటే అప్పుల వేటలో రైతులు పట్టించుకోని బ్యాంకర్లు జిల్లాలోని పడమటి మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. ప్రస్తుతం వంద అడుగుల్లోనే పుష్కలంగా నీరు లభిస్తోంది. వర్షాభావం కారణంగా వలస వెళ్లిన రైతులు ప్రస్తుతం స్వగ్రామాలకు చేరుకుని సేద్యంబాట పట్టారు. గతంలో నీళ్లు రాక వదిలేసిన బోర్లకు మోటార్లు బిగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో బోరు మోటార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు ఒక్కసారిగా మోటార్ల రేట్లను పెంచి అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు. పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాల్లో బోరు మోటార్ల ధరలు భారీగా పెరిగాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేక రైతులు దిక్కులు చూస్తున్నారు.రూ.1.5 లక్షలుంటేనే గంగ పైకొస్తుంది బోర్లలో ప్రస్తుతం భూగర్భజలాలు సుమారు వంద అడుగులకు చేరాయి. 20 అడుగుల ఇనుప పైపులు కనీసం 20 వరకు వేయాలి. ఒక్కో పైపు ప్రస్తుతం రూ.2 వేలు. ఆ లెక్కన రూ.40 వేలవుతుంది. ఈ పైపులకు అమర్చే 20 కప్లింగ్‌లకు రూ.3 వేలు, బోరులోకి వేసే కేబుల్ వైరు రూ.5 వేలు, బోరు స్టార్టర్ రూ.14 వేలు, 12.5 హెచ్‌పీ 15 స్టేజీల మోటారు కంపెనీది అయితే రూ.70 వేలు, 15 హెచ్‌పీ మోటార్, 20 స్టేజీల పంపు అయితే రూ.85 వేలు, ఒకవేళ లోకల్ మోటార్, పంపులైతే రూ.50 నుంచి రూ.60 వేల వరకు అవుతోంది. ఇక బోరు నుంచి నీటి ట్యాంకు వరకు పైపులకు రూ.20 వేలు, మిగిలిన ఖర్చులు మరో రూ.8 వేలు ఇవన్నీ కలుపుకుంటే సుమారు రూ.1.50 లక్షలకు పైమాటే. పుట్టని అప్పులు.. పట్టించుకోని బ్యాంకర్లు ఓ వైపు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు పుట్టకపోవడం మరోవైపు బ్యాంకుల నుంచి కొత్త అప్పులు ఇవ్వకపోవడంతో రైతులు కుంగిపోతున్నారు. ఏదో ఒకటి చేయాలి కాబట్టి భూములు తనఖా పెట్టడమో, లేదా అధిక వడ్డీలకు అప్పు చేయడమో చేస్తున్నారు. సుమారు 30 శాతం మంది రైతులు పండే పంట ఫలసాయం వ్యాపారులకు ముట్టజెప్పేలా ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకుని మోటార్లు బిగించుకుంటున్నారు. భారీగా పెరిగిన మోటార్ల ధర మోనోబ్లాక్ పంప్‌సెట్స్ 2014 ఆగస్టు వరకు 5హెచ్‌పీ మోటారు రూ.12 వేల రూపాయలుండేది. ఇదే మోటారు ఇప్పుడు రూ.16,600 పలుకుతోంది. 7.5హెచ్‌పీ రూ.14 వేల నుంచి రూ.20,000కు చేరింది. మోనోబ్లాక్ సబ్మెర్సిబుల్ మోటార్లు 7.5హెచ్‌పీ 10 స్టేజీల మోటారు రూ.35వేల నుంచి రూ.65వేలు, 12 హెచ్‌పీ 15 స్టేజ్‌లు రూ.41 వేల నుంచి రూ.69 వేల వరకు చేరింది. 15హెచ్‌పీ 22 స్టేజ్‌లు గతంలో రూ.70 వేలు ఉండగా ప్రస్తుతం రూ.89 వేల వరకు పెరిగింది. ఇదే స్థాయిలో సెకండ్ హ్యాండ్ మోటార్ల ధరా పెరిగింది. గతంలో నీళ్లురాని బోర్ల నుంచి ఊడదీసిన మోటార్లను రైతులు ఒకటికి సగానికి అమ్ముకోగా ఇప్పుడు వాటికి మెరుగులు దిద్ది మెకానిక్‌లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. -
రైతుల నుంచి వడ్డీ గుంజొద్దు
* ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సర్కారు ఆదేశాలు * లక్ష లోపు రుణాలకు వడ్డీ లేదని స్పష్టీకరణ * ఆ మేరకు బ్యాంకుల ఎదుట బ్యానర్లు కట్టాలని సూచన * వడ్డీ వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళానికి తెర దింపాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టంచేసింది. వడ్డీ వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని బ్యాంకులు.. బ్రాంచీల వారీగా రుణమాఫీలో లబ్ధి పొందిన రైతుల పంట రుణాల ఖాతా(స్టేట్మెంట్) వివరాలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. శుక్రవారమిక్కడ ఎస్బీహెచ్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్, వ్యవసాయ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ శివశ్రీతో పాటు అన్ని బ్యాంకుల అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రభుత్వం మాఫీ చేసిన పంట రుణాలకు వడ్డీ మాఫీ కూడా వర్తిస్తుంది. కానీ ఈ డబ్బును రైతుల ఖాతాలో జమ కట్టే విషయంలో కొన్ని బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు, గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సర్కారుకు నివేదిక అందించాయి. దీంతో అదే ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ జరిగింది. మాఫీపై ప్రచారం కల్పించండి.. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయటం లేదని, రుణమాఫీ చేసిన రైతులకు సంబంధించిన ఖాతాల్లో ప్రభుత్వం ఇచ్చిన రెండు విడతల నిధులు జమ చేసినట్లుగా బ్యాంకర్లు వివరణ ఇచ్చారు. అయినా వరుసగా ఫిర్యాదులు అందుతున్నందున రుణమాఫీకి సంబంధించి రైతులకు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లకు సూచించారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు అందితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడేది లేదని హెచ్చరించారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయటం లేదని, లక్ష లోపు పంట రుణాలకు వడ్డీమాఫీ వర్తిస్తుందనే అంశానికి తగినంత ప్రచారం కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రజలందరికీ ఈ విషయం తెలిసేలా అన్ని బ్యాంకులు బ్రాంచీల ఎదుట బ్యానర్లను కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ మాఫీ పథకం వర్తిస్తుందని, ప్రభుత్వం మాఫీ చేసిన రుణాలపై వడ్డీని వసూలు చేయటం లేదని అందరికీ అర్థమయ్యేలా ఈ బ్యానర్లు ఉండాలని సూచిం చారు. దీంతో పాటు రైతులకు ఎంత రుణం మాఫీ అయింది.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎం త చెల్లించింది.. ఖాతాలో మిగిలిన రుణమెంత? అన్న వివరాలన్నీ ప్రచురించాలని పేర్కొన్నారు. వారంలోగా ఈ నిర్ణయాలు అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. -
రైతులను వేధిస్తే ఇక దాడులే!
బ్యాంకర్లకు ఎమ్మెల్యే సోలిపేట హెచ్చరిక దౌల్తాబాద్: తమ రెక్కల కష్టాన్నే నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలను వేధించే బ్యాంకర్లపై దాడులు తప్పవని అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు పెట్టిన పెట్టుబడితో వచ్చిన లాభాలనే జీతాలు తీసుకునే బ్యాంకర్లు వారిపై దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. బ్యాంకర్ల వ్యవహార శైలి వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
బ్యాంకులకు టోకరా
‘నకిలీ’లు బ్యాంకులకే కన్నం వేశారు. బోగస్ పాస్‌పుస్తకాలతో బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. సర్కారు స్థలాలను తనఖా పెట్టి కొందరు.. లేని భూమిని పట్టాదారు పుస్తకాల్లో చూపించి మరికొందరు.. దొంగ పాస్‌పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో ఇంకొందరు బ్యాంకులకు టోకరా కొట్టారు. బ్యాంకర్ల హస్తలాఘవం.. రెవెన్యూ సిబ్బంది అండదండలతో గుట్టుగా సాగిన ఈ అవినీతి పరంపర వెలుగులోకి వస్తోంది. జిల్లాలో దాదాపు రూ.5 కోట్ల మేర కుంభకోణంజరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన యంత్రాంగం.. ఈ బాగోతంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. - బోగస్ పాస్‌పుస్తకాలతో రూ.5 కోట్ల మేర కుచ్చుటోపీ - అధికారుల విచారణతో వెలుగులోకి అక్రమాల చిట్టా - బ్యాంకర్ల హస్తం.. రెవెన్యూ సిబ్బంది చేతివాటం సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: గతంలో పహాణీ, పట్టా పాస్‌పుస్తకాలను అట్టిపెట్టుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు దొంగ పాస్‌పుస్తకాలను సృష్టించి సర్కారీ స్థలాలను రికార్డుల్లోకెక్కించి బ్యాంకర్లను తప్పుదోవ పట్టించారు. రుణగ్రహీత దరఖాస్తును నిశితంగా పరిశీలించకుండా.. క్షేత్రస్థాయిలో భూమి స్థితిగతులను తెలుసుకోకుండా రుణాలివ్వడంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఇటీవల ఈసీలు, ఆన్లైన్ పహాణీలను తప్పనిసరి చేయడంతో ఈ అవినీతి గుట్టు బయటపడింది. ఇప్పటికే యాచారం, మర్పల్లి, మంచాల, మోమిన్‌పేట, షాబాద్, గండేడ్, ధారూరు తదితర మండలాల్లో నకిలీ పాసు పుస్తకాలతో బ్యాంకులను మోసగించినట్లు రెవె న్యూ, బ్యాంకు యాజమాన్యాలు గుర్తించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ పాసు పుస్తకాల రాకెట్‌ను తలదన్నెలా జిల్లాలోనూ ‘బోగస్’ చిట్టా బహిర్గతమవడం అధికారవర్గాలను విస్మయపరుస్తోంది. తిలాపాపం.. తలా పిడికెడు! నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందడమే కాకుండా.. రుణ మాఫీ కూడా వర్తింపజేయడంతో సర్కారు ఖజానాకు భారీగా చిల్లు పడింది. బోగస్ పట్టాల సృష్టిలో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తహసీల్దార్/ ఆర్డీఓ కార్యాలయాల నుంచి తస్కరించిన పాస్‌పుస్తకాల్లో ఫోర్జరీలతో బినామీలను సృష్టించి బ్యాంకులకు టోపీ పెట్టారు. బ్యాంకర్లు కూడా పాస్ పుస్తకాలు అసలువా? నకిలీవా అనేది తేల్చుకోకపోవడం.. రికార్డుల్లో నమోదైన భూమిపై క్షేత్రస్థాయిలో తెలుసుకోకపోవడం నిధుల దుర్వినియోగానికి దారి తీసింది. అంతేకాకుండా మీ-సేవ కేంద్రాల్లో రికార్డులను ట్యాంపరింగ్ చేసి వాటి ద్వారా రుణాలు తీసుకున్న విషయాన్ని కూడా బ్యాంకర్లు పసిగట్టలేకపోయారు. రుణ వితరణలో దళారీల ప్రమేయం కూడా తోడు కావడంతో రుణాలు అనర్హుల పాలయినట్లు తెలిసింది. నకి‘లీలలు’ మచ్చుకు కొన్ని.. - యాచారం మండలం నక్కర్తమేడిపల్లి, పల్లె చెల్కతండా, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను పాస్‌పుస్తకాల్లో చూపి.. బ్యాంకులను మోసం చేశారు. ఇప్పటికే దాదాపు 150 మంది నకిలీ పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. ఈ తతంగంలో ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. - మంచాల మండలం బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాస్బుక్కులతో పెద్ద సంఖ్యలో బినామీ రైతులు రుణాలు పొందగా.. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీకి సైతం అర్హుల య్యా రు. గ్రామపంచాయతీలో అర్హుల వివరాలను ప్రదర్శించిన సమయంలో అనర్హుల చిట్టా బయటపడింది. దీంతో స్థానిక రెవెన్యూ యంత్రాంగం పట్టాదారు పుస్తకాల జారీపై పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించింది. - మోమిన్‌పేట మండలం చిట్టెంపల్లి, రాళ్లడుగుపల్లి, ఎన్కెపల్లి, మోమిన్‌పేట, మర్పల్లి మండలం మొగిలిగుండ్ల, కోంశెట్టిపల్లి, కోటమర్పల్లి గ్రామాల్లో 25 మంది ఖాతాదారులు బోగస్ పీటీ బుక్కులతో బుధేరా కార్పొరేషన్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా పొందారు. - పరిగి మండల పరిధిలోని రంగాపూర్, మాదారం, రాఘవాపూర్, లఖ్నాపూర్, నస్కల్, సయ్యద్‌మల్కాపూర్, మల్లెమోనిగూడ, గండేడ్ మండలంలో రెడ్డిపల్లి, బల్సుర్‌గొండ, బల్సుర్‌గొండ తండా, కొండాపూర్‌లలో, దోమ మండల పరిధిలోని గూడూరు, పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల, తిర్మలాపూర్, తదితర గ్రామాల్లోని భూములకు సంబంధించి పలువురు రైతులు వెయ్యి ఎకరాలపై బినామీలు పాసుపుస్తకాలు సమర్పించి దాదాపు రూ.3కోట్ల మేర రుణాలు పొందారు. ఈ తంతును గుర్తించిన అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. -
ఏం మాయ చేశారు
రుణం తీసుకున్నవాడు రుణగ్రస్తుడు ... ఇచ్చినవాడు రుణదాత. ఇది సహజమే కదా కొత్తగా చెప్పేదేముందని విసుక్కుంటున్నారు కదూ. కసురుకోకుండా సర్కారు లెక్కల్లోకి తొంగి చూడండి వాస్తవమేమిటో మీకే తెలుస్తుంది. బాబు జమానాలో బ్యాంకర్లు లెక్కల ప్రకారం పరిశీలిస్తే రుణం పొందకుండానే రుణగ్రస్తులైపోతున్నారు ... రుణం ఇవ్వకుండానే రుణదాతలై కూర్చుంటున్నారు. అదేలా అంటే ఇలా... రుణమాఫీ జాబితాలో సర్కారు అంకెల గారడీ ఇచ్చింది రూ.27 కోట్లు.. రికార్డుల్లో రూ.1,167 కోట్లు - లక్ష్యానికి చేరవైపోయామంటూ బ్యాంకర్ల్ల గెంతులు - విషయం తెలియక అయోమయంలో రైతులు - ఖరీఫ్ ప్రారంభం కాకుండానే లక్ష్యం చేరిపోయారట! - స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ దెబ్బకు ఠారెత్తిన అన్నదాతలు - నేటికీ రుణ మాఫీ కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు రుణ మాయాజాలం ఇలా... ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా రైతులకు రూ.1643.41 కోట్ల రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ణయించారు. జూన్ మాసాంతానికే రూ.1167.37 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు ప్రకటిం చేశారు. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాంతాలకుబ్యాంకర్లు చేరుకోవాల్సిన లక్ష్యం రూ.476.04 కోట్లు మాత్రమే. వాస్తవానికి ఇంత మొత్తం రుణాలు పంపిణీ జరగలేదు. ఆ విషయం ఈ కింది పట్టికను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. పై పట్టికలోని సాగు విస్తీర్ణం వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించిందే. దాని ప్రకారంగా పరిశీలిస్తే ఈ ఏడాది 2,13,482.50 ఎకరాల్లో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఆ పంటలకు రకాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద మొత్తం మంజూరు చేయాల్సిన రుణం రూ.439.69 కోట్లు మాత్రమే. సాగు ప్రకారం చూస్తే రూ.109.92 కోట్లు మాత్రమే పంట రుణాలుగా తీసుకోవడానికి అర్హులు. ఇందులో బంగారం రుణాలు రూ.27.48 కోట్లు మాత్రమే ఉంటాయని అంచనా. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా రూ.1167 కోట్లు ఎలా పంపిణీ చేశారు? ఎంత మందికిచ్చారు? ఇచ్చిన రుణాలను ఏ పంటకింద వెచ్చించారో వ్యవసాయ శాఖే చెబితే బాగుంటుందని రైతులంటున్నారు. రెన్యువల్స్‌తో హస్తలాఘవం చేస్తూ బాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంద ని కన్నెర్ర చేస్తున్నారు. ఒంగోలు: పంట రుణమైనా... బంగారం తాకట్టు రుణమైనా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారమే అంటున్న బ్యాంకర్లు గోరంత సాగుకు కొండంత రుణాలు ఇచ్చినట్లు లెక్కలు చూపించేస్తున్నారు. వాస్తవానికి గతం తాలూకా రుణాలను రెన్యువల్ చేసి పాత రుణాలు రద్దుచేసి కొత్తగా ఇచ్చినట్లు బ్యాంకర్లు రికార్డులు తిరగ రాసేస్తుండడమే ఇందుకు కారణం. కొద్ది బ్యాంకులు మాత్రమే బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండగా చాలా మంది పాస్ పుస్తకాలపైనే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం రుణం ఇస్తామని చెప్పేస్తుండడంతో జిల్లా రైతాంగం ఠారెత్తిపోతోంది. వ్యాపారాన్ని, అవసరాన్ని ఒకే గాటన కట్టొద్దంటూ రైతాంగం వేడుకుంటున్నా రుణాల జారీకి బ్యాంకర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ప్రకృతి ప్రకోపాలు ఒక వైపు ... ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక పరిస్థితులు మరోవైపు వెరసి రైతు సాగుకు ముందుకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. భయపెట్టి...బెంబేలెత్తించి... జిల్లాలో మొత్తం రూ.6500 కోట్ల రుణానికిగాను రుణమాఫీ కింద రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కేవలం రూ.1900 కోట్లు మాత్రమే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణనలోకి లెక్కలోకి తీసుకోకుండా ఇష్టారీతిన ఎందుకు రుణాలు పంపిణీచేశారంటూ బ్యాంకర్లపై ప్రభుత్వం మండిపడింది. దీంతో అప్పటి వరకు రైతులపట్ల ఉదాశీనంగా వ్యవహరించిన బ్యాంకర్లు కూడా కఠిన వైఖరే అవలంబించాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన రుణాల పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతే రైతుల నుంచి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి తప్పదని భావించి అందుకు ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది. బకాయిదారులను భయపెట్టి, బెంబేలెత్తించి, ఒత్తిడి తెచ్చి బంగారు రుణాలను వేలం వేస్తామంటూ పత్రికల్లో జారీచేసిన ప్రకటనలు రైతులను పరుగులెత్తించాయి. దీంతో బంగారానికి సంబంధించి మార్కెట్లో వచ్చిన హెచ్చుతగ్గులను చెల్లించి పాత బాకీని రదు ్దచేసుకున్నట్లు, తాజాగా రుణం తీసుకున్నట్లు బ్యాంకు రికార్డులలో చేరాయి. దీంతో లక్ష్యం కాస్తా ఖరీఫ్ ప్రారంభం కాని జూన్ నాటికే రూ. 1167.36 కోట్లకు చేరింది. బంగారు రుణాలకు నై... ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ వర్తింపజేసినాక వ్యవసాయం కోసమంటూ బంగారు రుణాలు ఇచ్చేదిలేదంటూ బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. మరీ అంతగా కావాలంటే రూ.2 లక్షల వరకు బంగారు రుణాల తాకట్టుపై 11 శాతం సాలుసరి వడ్డీకి, ఇంకా అంతకంటే ఎక్కువ కావాలంటే వాణిజ్య అవసరాలకు విధించే 12.5 శాతం వడ్డీకి రుణాలిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది కూడా కొన్ని బ్యాంకులు మాత్రమే ముందుకు వస్తున్నాయి. అది కూడా పంట రుణం తీసుకోవాలంటే తప్పనిసరిగా బీమా ప్రీమియం కట్ చేసుకొని మిగతా మొత్తాన్ని అందిస్తున్నారు. దీంతో ఆ భారం కూడా రైతు నెత్తినే పడుతుంది. దీంతో వడ్డీ భారం పెరిగి చివరకు రైతులు స్వచ్ఛందంగా పంట రుణాలకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకు, యూకో బ్యాంకులాంటి పలు బ్యాంకులు బంగారు రుణాలను తాకట్టుపెట్టుకొని రుణాలు ఇచ్చేందుకు పూర్తిగా విముఖతను ప్రదర్శిస్తున్నాయి. ఖరీఫ్‌లో రూ.1167.36 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశామని, వాటిలో రూ. 594 కోట్లు బంగారు ఆభరణాల మీద ఇచ్చినవేనని బ్యాంకర్లు చెబుతున్నా వాటిలో కేవలం రూ. 27.48 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఖరీఫ్‌లో వాస్తవానికి కొత్తగా ఇచ్చినవని, మిగిలిన మొత్తం పాత రుణాలను రెన్యువల్ చేయడం ద్వారా బ్యాంకర్లు చూపుతున్న లక్ష్యాలని రైతు సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. రైతులకు నష్టం ఇలా... చంద్రబాబు రుణమాఫీ వ్యవహారం లేకముందు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకునేవారు. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ఎందుకు పాటించడంలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లను నిలదీయడంతో బ్యాంకర్లు కూడా చెక్ పెట్టేశారు. దీనికితోడు కొటేషన్లు...రకరకాల డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివాటితో రైతుకు అదనపు భారం పడుతుంది. ఈ నిబంధనలతో రైతుకు రూపాయి కూడా దక్కని పరిస్థితి నెలకుంది. చేతిలో చిల్లిగవ్వలుంటేనే సాగు...లేదంటే ఆగు పరిస్థితి ఏర్పడుతోంది. మూడో విడతలోనూ మాఫీ కాలేదు 2011, డిసెంబర్ 28న మార్కాపురం ఎస్బీఐలో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బంగారం తాకట్టు పెట్టి రూ.75 వేల పంట రుణం తీసుకున్నాను. ఐదు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. రుణమాఫీలో తీసుకున్న నగదు మాఫీ అవుతుందన్న ఆశతో రెండేళ్ల నుంచి బ్యాంక్‌కు చెల్లించలేదు. మొదటి, రెండో విడత జాబితాకు అన్ని అర్హత పత్రాలను పంపినా పేరు లేకపోవటంతో మూడవ విడత జాబితాకు కూడా ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్ పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ పంపించాను. మూడో జాబితా లో కూడా నా పేరు లేదు.-భవనం వెంకట్రామిరెడ్డి, భూపతిపల్లె, మార్కాపురంమండలం రుణ మాఫీకోసం ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం.. మాది కొండపి మండలం పెరిదేపి గ్రామం. నా పేరు ముప్పరాజు బ్రహ్మయ్య. అయిదున్నర ఎకరాల పొలం ఉంది. రూ. 3 లక్షలు బ్యాంకులో రుణం తీసుకున్నా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నాకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున రుణం రద్దుకావాలి. కానీ కేవలం రూ.5 వేలు చొప్పున రుణమాఫీ ప్రకటించారు. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ తప్పుగా నమోదైందని, న్యాయం చేయాలంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. కానీ బ్యాంకర్లు మార్చి పంపినా పాత వివరాలే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి తప్ప రుణమాఫీ జరగడం లేదు. -ముప్పరాజు బ్రహ్మయ్య, రైతు -
కరుణ లేదా?
విజయనగరం కంటోన్మెంట్: ఖరీఫ్‌లో రైతులతో వరుణుడు దోబూచులాడుతుంటే కౌలు రైతులతో బ్యాంకర్లు మరో ఆట ఆడుతున్నారు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్ల కాళ్లావేళ్లా పడ్డా రుణాలు ఇవ్వడం లేదు సరికదా మీరు రైతుల పట్టాదారు పాసు పుస్తకం, దాని జిరాక్సు తీసుకువస్తే అప్పుడు చూద్దామని చెబుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు వీరికి రుణ అర్హత కార్డులిచ్చి రుణాలిస్తామని చెప్పిన అధికారులు, బ్యాంకర్లు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో దాదాపు లక్షా 20 వేల మంది కౌలు రైతులున్నారని అంచనా! కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తాము సర్వే చేశామని, జిల్లా లో కౌలు రైతులు 62 వేల మంది మాత్రమే ఉన్నారని తేల్చింది. ప్రస్తుతం తాము సర్వేచేసిన వారినే కౌలు రైతులుగా గుర్తిస్తూ రుణ అర్హత కార్డులు ఇస్తామనీ నమ్మబలికిన అధికారులు గ్రామ సభలు నిర్వహించి రుణ అర్హత కార్డులు ఇస్తామని చెప్పారు. కానీ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కేవలం 12 వేల మందికి మాత్రమే కార్డులు ఇచ్చారు. గ్రీవెన్సలో ఫిర్యాదు బొండపల్లి మండలం దేవుపల్లికి చెందిన ఓ పది మంది రైతులు తమకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని పెట్టుబడులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ తమకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీ అందజేసి కోరారు. కానీ ఇప్పటి వరకూ వారికి ఎటువంటి రుణాలూ ఇవ్వలేదు. పట్టాపుస్తకాలు ఇవ్వాలని అడుతున్నారని అసలు రైతులకే పట్టా పుస్తకాలు పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే తామెలా వారిని తీసుకువస్తామని కౌలు రైతులు వాపోతున్నారు. 2012లో 13వేల మంది కౌలు రైతులకు రూ.4 కోట్లు మాత్రమే రుణాలుగా ఇచ్చారు. 2013లో రూ.5 కోట్లు ఇవ్వగా 2014లో రూ.3 కోట్లు ఇచ్చి చేతులు దులు పుకొన్నారు. పదివేల మంది రైతులకు రుణ ప్రణాళిక ప్రకారం పంట రుణాలు ఇవ్వాలంటే రూ.120 కోట్లు అవసరమవుతుంది. కానీ అలా ఇవ్వడం లేదు. భూమి సాగు చేయక వదిలేస్తున్న యజమానులున్న ఈ రోజుల్లో భూమి తనది కాకున్నా కాయకష్టాన్నే నమ్ముకుని అటు యజమానికి, ఇటు బ్యాంకర్లు, ప్రభుత్వానికి కిస్తీలు చెల్లిస్తున్న తమ పట్ల నిర్లక్ష్యం సరికాదని కౌలురైతులు వాపోతున్నారు. సాధారణ రైతులకు ఇచ్చే విధంగా చెరుకు, వరి, అరటి పంటలకు రుణ ప్రణాళిక ప్రకారం రుణాలివ్వాలని ఉన్నా కౌలు రైతులకు మాత్రం ఎంతో కొంత ఇవ్వడం నిర్లక్ష్య వ్యవహారమని వాపోతున్నారు. -
అంతా మా ఇష్టం!
- రెన్యువల్ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు - చేసుకోని వారి ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకర్ల నిరాకరణ - వడ్డీ చెల్లింపు విషయంలో స్పష్టత లేకపోవటమే కారణం పరిగి: మేం మోనార్కులం.. ఎవరి మాటా వినం.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు బ్యాంకర్లు. రెండోవిడత రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు అందజేసినా.. అవి రైతుల ఖాతాల్లో బ్యాంక్ అధికారులు జమ చేయటంలేదు. రెన్యువల్ చేసుకున్న రైతుల ఖాతాల్లోనే రుణమాఫీ డబ్బులు జమచేసి చేతులు దులుపుకొంటున్నారు. రెన్యువల్ చేసుకోని రైతులకు సంబంధించిన డబ్బులు బ్యాం కుల్లోనే ఉంచుకుని వాటితో జమయ్యే వడ్డీతో బ్యాంకర్లు తమ వ్యాపారాలు వెలగబెట్టుకుంటున్నారు. విషయాన్ని పసిగట్టిన కలెక్టర్ వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆయా మండలాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. ఏయే బ్యాంకులకు ప్రభుత్వం ఎన్ని డబ్బులు జమచేసింది. ఆయా బ్యాంకులు రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమచేశాయి. ఇంకా ఎన్ని డబ్బులు ఖాతాల్లో మూలుగుతున్నాయనే విషయంలో తనకు వెంటనే నివేదిక సమర్పించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన ప్రత్యేకాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇదే సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చే యాలని వ్యవసాయ శాఖ అధికారులు బ్యాం కుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటంలేదు. రెన్యువల్ చేసుకున్నప్పుడే ఖాతాల్లో జమచేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 25 రోజులైనా.. 30 శాతంలోపే.. ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ డబ్బులు విడుదల చేసి 25 రోజులు కావస్తోంది. 25 రోజుల క్రితమే అన్ని బ్యాంకుల్లో రెండో రుణమాఫీకి సంబంధించి 12.5 శాతం నిధులు ప్రభుత్వం జమ చేసింది. ఇదే సమయంలో మరో 12.5 శాతం నిధులు త్వరలో బ్యాంకులకు ఇస్తాం. వాటిని కూడా రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించింది. అయితే బ్యాంకర్లు ఇవేవీ పట్టించుకోకుండా అసలుకే ఎసరు పెట్టారు. ఇప్పటికే బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిన 12.5 శాతం నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా తమ ఖాతాల్లోనే ఉంచుకున్నారు. ఇప్పటి వరకు పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న 30శాతంలోపు రైతులకు మాత్రమే ఖాతాల్లో జమ చేసి ఊరుకున్నారు. పరిగి వ్యవసాయ డివిజన్లోని నాలుగు మండలాలకు చెందిన బ్యాంకుల్లో ప్రభుత్వం 25 రోజుల క్రితం రూ.22.89 కోట్లు జమ చేయగా ఇప్పటి (బుధవారం) వరకు రూ.7.35 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం 41,651 మందికి రుణమాఫీ జమచేయగా 14,337 మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి. ఈ విషయమై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నగేష్‌కుమార్‌ను వివరణ కోరగా.. విడుదల చేసిన డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమచేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం రెన్యువల్ చేసుకున్న వారి కాతాల్లోనే జమ చేస్తున్నారని తెలిపారు. రైతులంతా రెన్యువల్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. -
గాలికొదిలేశారు..!
డీఆర్డీఏకు తొమ్మిది నెలలుగా సారథి కరువు డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని విస్మరించిన అధికారులు రుణాల మంజూరు మృగ్యం రూ. 1,015 కోట్లకు గాను రూ.30 కోట్లు మాత్రమే మంజూరు అనంతపురం సెంట్రల్ : జిల్లాలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఇంతకుముందు ఎంతో మెరుగ్గా ఉండేది. దీనివల్ల బ్యాంకర్లు లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. లక్ష్యంలో 50 శాతం రుణాలివ్వడం కూడా గగనంగా మారింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు రూ.1,015 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా రూ.30 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. గతంలో ప్రతి సంఘానికి రూ.5 లక్షల వరకూ రుణాలిచ్చేవారు. ఈ మొత్తాన్ని డ్వాక్రా మహిళలు జీవనోపాధి కోసం ఉపయోగించుకునేవారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు రుణాలివ్వాలంటేనే బ్యాంకర్లు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోయినా జిల్లాలో వేలాది సంఘాలు కంతులు సక్రమంగానే చెల్లిస్తున్నాయి. అయినా బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. కంతులు చెల్లిస్తున్నా రుణాలు ఎందుకివ్వరని బ్యాంకర్లను గట్టిగా ప్రశ్నించే అధికారులే కరువయ్యారు. గతంలో బ్యాంకర్లతో, క్షేత్రస్థాయి అధికారులతో వెలుగు సిబ్బంది నిత్యం సమావేశాలు నిర్వహిస్తుండేవారు. విరివిగా రుణాలు ఇప్పించేవారు. లక్ష్యానికి మంచి రుణాలిచ్చిన సమయంలో బ్యాంకర్లకు గౌరవంగా విందు కూడా ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం బ్యాంకర్లను సమన్వయం చేసుకోవడంలో ఐకేపీ అధికారులు విఫలమయ్యారు. దీనివల్ల సంఘాల పనితీరు అధ్వానంగా తయారవుతోంది. జిల్లాలో 52 వేల సంఘాలుంటే 6,700 మాత్రమే ఏ గ్రేడ్‌లో(పనితీరు మెరుగు) ఉన్నాయి. మరో 5 వేల సంఘాలు బీ గ్రేడ్(పర్వాలేదు)లో ఉన్నాయి. మిగిలిన 40,300 సంఘాలు సీ,డీ గ్రేడ్‌లో అంటే పూర్తి అధ్వానంగా నడుస్తున్నాయి. వరుస కరువుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల ఆర్థిక లావాదేవీలు పూర్తిగా పడిపోయాయి. ఉన్న ఊళ్లో ఉపాధి లేక వలస పోతున్నారు. ఇలాంటి సమయంలో డ్వాక్రా మహిళలకు విరివిగా రుణాలిప్పించి.. సొంతూళ్లలోనే ఉపాధి కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. డీఆర్డీఏ-వెలుగులో కీలకమైన ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టే ఖాళీగా ఉంది. రెండు ఏపీడీ పోస్టులు, కదిరి, ధర్మవరం, పామిడి, తాడిపత్రి ఏరియా కో ఆర్డినేటర్ పోస్టులు కొన్నేళ్ల నుంచి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ స్థానాల్లో ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన అధికారులు రెండు పడవలపై ప్రయాణం సజావుగా సాగించలేకపోతున్నారు. -
ప్రీమియాన్ని బీమా సంస్థలకు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బీమా ప్రీమియం సొమ్మును మినహాయించుకుని పెద్ద మొత్తంలో తమ వద్దే దాచిపెట్టుకున్న బ్యాంకులు తక్షణమే ఆ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతులు రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆ సొమ్మును జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)కి చెల్లించాలి. కానీ కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రీమియం సొమ్మును బ్యాంకులు తమ వద్దే దాచుకుంటున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, జిల్లాల్లో ప్రతీ బ్యాంకు బ్రాంచీలో ఎంత ప్రీమియం సొమ్మును ఈ రకంగా దాచిపెట్టుకున్నారో వెంటనే తెలపాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. బ్యాంకుల ద్వారానే చెల్లించాలి... ఇప్పటివరకు పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించి బీమా సంస్థలకు చెల్లిస్తున్నాయి. ఇకనుంచి బ్యాంకు రుణాలు తీసుకోని రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియాన్ని వసూలు చేసి బీమా కంపెనీలకు చెల్లించాలని..ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త రుణాల ఆలస్యంపై అసంతృప్తి... ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును విడతల వారీగా ఇస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం అనుకున్న స్థాయిలో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని మంత్రి పోచారం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ సారి పంట రుణాల లక్ష్యం రూ. 15 వేల కోట్లు పైగా ఉండగా... ఇప్పటివరకు 35 శాతానికి మించి రుణాలు ఇవ్వలేకపోయాయని మంత్రి పేర్కొన్నారు. తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్లతో ప్రత్యక్ష పోరు
కౌలురైతులకు మద్దతుగా చరిత్రలో తొలిసారిగా రెవెన్యూ యంత్రాంగం ఆందోళన బాటపట్టింది. రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ జిల్లా యంత్రాంగం శుక్రవారం ప్రత్యక్ష పోరుకు దిగింది. ఏజెన్సీ పరిధిలోని బ్యాంకుల ఎదుట సాక్షాత్తు తహశీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూయంత్రాంగం రైతుల తరపున ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సంచలనం రేపుతోంది. బ్యాంకర్ల మెడలు వంచేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ ఆందోళనలు చేపట్టినట్టుగా క్షేత్ర స్థాయి సిబ్బంది చెప్పడం గమనార్హం.. విశాఖపట్నం: బ్యాంకర్ల శల్యసారథ్యం, కౌలు రైతులకు రుణాలివ్వడంలో శాఖల మధ్య సమన్వయ లోపం మరోసారి బయటపడింది. బ్యాంకర్లను ఒప్పించి కౌలురైతులకు రుణాలిప్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే. అలాంటి రెవెన్యూ యంత్రాంగమే చేష్టలుడిగి ప్రత్యక్ష ఆందోళనకు దిగడం కొత్త ఒరవడికి నాంది పలికింది. ఏటా కష్టం ఒకరిది..ఫలితం మరొకరిది అన్నట్టుగా రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించే కౌలురైతులకు అప్పులు మిగలడం పరిపాటి. వీరికి జారీ చేస్తున్న రుణఅర్హత కార్డులు(ఎల్ఈసీ)అలంకార ప్రాయంగా మిగిలి పోతున్నాయి. ఏటా వీరికి ఎల్ఈసీ కార్డులు జారీ చేయడం..రుణాల మంజూరులో బ్యాంకర్లు చుక్కలు చూపించడం ఆనవాయితీగా వస్తోంది. కనీసం ఈ ఏడాదైనా ఉదారంగా వీరికి రుణాలివ్వాలన్న కలెక్టర్ యువరాజ్ ప్రయత్నాలకు బ్యాంకర్లు మోకాలొడ్డుతున్నారు. ఈ ఏడాది 40వేల మందికి ఎల్‌ఈసీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం 16,500 మందికి జారీ చేయగలిగారు. వీరికైనా రుణాలు మంజూరు చేశారా అంటే అదీ లేదు. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 800 మందికి కేవలం రూ.1.5కోట్ల రుణాలు జారీ చేయగలిగారు. ఎల్ఈసీ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని ఎలాంటి హామీ లేకుండా రుణాలివ్వాలని కలెక్టర్ పదేపదే ఆదేశించినా బ్యాంకర్లు పెడచెవిన పెట్టారు. అడంగళ్, వన్‌బీ కాపీలు, భూమి యజమానితో చేసుకున్న ఒప్పంద పత్రాలు. వారి నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు, ఆ భూమిపై గతంలో ఎలాంటి అప్పుల్లేవని తెలిపే ధ్రువీకరణ పత్రాలు ఇలా సవాలక్ష సమర్పిస్తే కానీ రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఇవన్నీ సమర్పించినా ఏదో విధంగా కొర్రీలు వేస్తూ మోకాలొడ్డుతూనే ఉన్నారు. ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.850 కోట్లు కాగా..ఇప్పటి వరకు రూ.250కోట్ల వరకు రుణాలిచ్చారు. ఈమొత్తంలో కౌలురైతులకు ఇచ్చింది కేవలం రూ.1.5కోట్లు మాత్రమే. దీంతోబ్యాంకర్లపై ఒత్తిడి పెంచేందుకు జిల్లా కలెక్టర్ యువరాజ్ రంగంలోకి దిగారు. కౌలు రైతుల తరపున రెవెన్యూ యంత్రాంగం బ్యాంకుల ఎదుట ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఏకంగా మండల తహశీల్దార్ల ఆధ్వర్యంలోనే ఈ ఆందోళనలు జరగడం గమనార్హం. ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో శుక్రవారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో బ్యాంకుల ఎదుట ధర్నాలు.. రాస్తారోకోలు జరిగాయి. కౌలురైతులతో పాటు మండల స్థాయిలోని ఆర్ఐలు, వీఆర్వోలు, వీఆర్ఏలతో సహా ఇతర రెవెన్యూ యంత్రాంగమంతా పాల్గొన్నారు. ఆంధ్రబ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో పాటు ఏజెన్సీ పరిధిలోని గ్రామీణ బ్యాంకులకు చెందిన బ్రాంచ్‌ల ఎదుట ఈ ఆందోళనలు జరిగాయి. ఎల్ఈసీ కార్డుల్లో సర్వే నంబర్, అదే నంబర్‌పై ఎలాంటి రుణ బకాయిలు లేకుండా ఉంటే చాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలి వ్వాలని జిల్లా బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ బ్యాంకర్లు పెడచెవినపెట్టడం వల్లే తాము ఆందోళన బాటపట్టామని పాడేరు డిప్యూటీ తహశీల్దార్ సాక్షికి తెలిపారు. -
గూడుపుఠాణి
జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు అవినీతి మకిలి పూర్తి సొమ్ము చెల్లించినా బకాయిలే అంటున్న వైనం యూసీడీ చేతివాటం విచారణ చేస్తామన్న కమిషనర్ విజయవాడ సెంట్రల్ : జేఎన్ఎన్యూఆర్ఎం ఆవాసాల్లో అవినీతి గూడు కట్టుకుంది. అనర్హులకు ఇళ్లు కట్టబెట్టడంతో అక్రమాలకు తెరలేపిన అధికారులు అందినకాడికి పేదల్ని దోచేస్తున్నారు. బ్యాంకులకు జమచేయాల్సిన రుణాలతో జేబులు నింపుకొంటున్నారు. బకాయిలు చెల్లించపోతే ఇళ్లు సీజ్ చేస్తామంటూ బ్యాంకర్లు వెళ్లడంతో బండారం బయటపడింది. సతీష్‌రాజు, అతడి బంధువులకు వాంబే కాలనీలో కె.కె. 4, 5 ఫ్లాట్లను ఐదేళ్ల కిందట కేటాయించారు. తొలివిడతగా రూ.10 వేలు, ఇంటి రిజిస్ట్రేషన్ సమయంలో రూ.34,100 చొప్పున యూసీడీ సీడీవో (కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్) లకు చెల్లించినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంటి పత్రాల పేరుతో కొన్ని కాగితాలను అందజేశారు. రెండురోజుల క్రితం బ్యాంకర్లు వచ్చి మీ పేరుతో బ్యాంక్‌లో రూ.31,400 బకాయి చూపిస్తోందని, చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో బెంబేలెత్తిన లబ్ధిదారులు కొందరు నగరపాలక సంస్థకు చేరుకుని సీడీవో దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించారు. బ్యాంకర్లు పొరపాటున మీ ఇళ్లకు వచ్చి ఉంటారు. వాళ్లకు నేను చెబుతాలే. ఇబ్బందేమీ లేదు’ అంటూ ఆయన నచ్చజెప్పి పంపేశారు. బోగస్ రసీదులు కాల్వగట్లపై ఆక్రమణల తొలగింపు నుంచి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల కేటాయింపు వరకు అన్ని బాధ్యతల్ని హౌసింగ్, యూసీడీ, టౌన్‌ప్లానింగ్ అధికారులకు అప్పగించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను యూసీడీ విభాగంలోని సీడీవో స్థాయి అధికారి చూస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు ఇంటి ధర రూ.44 వేలు ఉండేది. ప్రస్తుతం రూ.66 వేలకు చేరింది. ఇళ్లు మంజూరైన వెంటనే రూ.10 వేలు చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంక్ లోన్ లేదా సొంత సొమ్ముతో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇక్కడే అధికారులు కొందరు అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బోగస్ రసీదులు లబ్ధిదారులకు ఇచ్చి ఆ సొమ్ముల్ని నొక్కేశారని తెలుస్తోంది. ఇందుకు ఓ ప్రైవేటు ఉద్యోగిని అడ్డం పెట్టుకున్నట్లు సమాచారం. అక్రమాలు కోకొల్లలు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా 2006లో నగరానికి 28,152 ఇళ్లు మంజూరు కాగా 18,176 ఇళ్లను మాత్రమే నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ఇందులో 14 వేల గృహాలు పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయినవాటిలో 10,500 ఇళ్లనే కేటాయించారు. ఇందులో కేవలం 3 వేల గృహాలకు మాత్రమే బ్యాంకర్లు రుణాలిచ్చారు. మిగిలిన వాటికి వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులే డబ్బు చెల్లించారు. ఈ గృహాల్లో 30 శాతం అనర్హులకు కేటాయించారన్నది బహిరంగ రహస్యం. ఇళ్లు మంజూరు చేయిస్తామని బ్రోకర్లు కొందరు భారీగా డబ్బులు దండుకున్నారు. దీనిపై పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్ల కేటాయింపుల పేరుతో మామూళ్లకు తెగబడ్డ వర్క్ ఇన్స్పెక్టర్లు ముగ్గురిని ఇటీవలే కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పొంతనలేని సమాధానం కొన్ని గృహాలకు సంబంధించిన నగదు కమిషనర్ అకౌంట్లో జమఅయింది. సతీష్‌రాజు చెల్లించిన మొత్తం కమిషనర్ అకౌంట్లో ఉండి ఉండొచ్చు. పరిశీలించాల్సి ఉందంటూ సీడీవో దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. కమిషనర్ అకౌంట్లో నగదు జమ అయితే ఎస్బీఐలో బకాయి ఎందుకు చూపిస్తోందన్న ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. శివ అనే ప్రైవేటు ఉద్యోగిని తాను ఏర్పాటు చేసుకున్నానని స్పష్టం చేశారు. విచారణ చేపడతాం జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల వసూళ్లకు సంబంధించి విచారణ చేపడతామని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రెండంకెల వృద్ధిరేటుకు సహకరించాలి
* బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు * లోప భూయిష్టమైన విధానాలపై నిలదీసిన బ్యాంకర్లు.... రైతుమిత్ర సంఘాలకు రుణ మాఫీ విధానంపై ఈసడింపు * వడ్డీలేని రుణం, ‘పావలా వడ్డీ’పై స్పష్టతేదీ? * బ్యాంకర్లను అనునయించిన ముఖ్యమంత్రి * వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన బాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండంకెల వృద్ధిరేటు సాధించడానికి బ్యాంకర్లు ఉదారంగా రుణాలు ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు, పాడి, మత్స్య పరిశ్రమ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్యా రంగాలకు భారీ ఎత్తున రుణాలు ఇస్తేనే రెండంకెల వృద్ధి రేటు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 190వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్బీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ నేపథ్యంలోవ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీలో ప్రభుత్వం అనుసరించిన విధానాలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం లోప భూయిష్టమైన విధానాలను రూపొందించి.. ఉదారంగా రుణాలు ఇచ్చి సహకరించాలని కోరడం సమంజసం కాదంటూ స్పష్టీకరించారు. బ్యాంకర్ల నుంచి ఎదురుదాడిని ముందే ఊహించిన సీఎం చంద్రబాబు.. ఎస్ఎల్బీసీకి మీడియాను అనుమతించలేదు. ఈ సమావేశంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల రుణాలను కలిపి రూ.1,25,748 కోట్లతో బ్యాంకర్లు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. ఇది 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికతో పోలిస్తే 47 శాతం అధికం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఇచ్చిన తరహాలోనే రైతుమిత్ర సంఘాలు(ఆర్ఎంజీ), జేఎల్‌జీ(జాయింట్ లయబుల్ గ్రూప్స్)ల్లోని రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఇంతలోనే బ్యాంకర్లు జోక్యం చేసుకుంటూ ఆర్ఎంజీ, జేఎల్‌జీ సంఘాల్లో రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఈసడించారు. స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా భారీ ఎత్తున రుణాలు ఇవ్వాలని కోరడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. బ్యాంకర్ల ఎదురుదాడితో తేరుకున్న సీఎం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామంటూ వారిని చల్లార్చేయత్నం చేశారు. జూలై ఆఖరుకు పునరుద్ధరణ పూర్తి మొదటి విడత రుణమాఫీ కింద ప్రభుత్వం అందజేసిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి.. పాత రుణాలను జూలై ఆఖరు నాటికి పునరుద్ధరించాలని బ్యాంకర్లను సీఎం చంద్రబాబు కోరారు. రూ.లక్ష లోపు రుణాలను వడ్డీ లేకుండా, రూ.మూడు లక్షల్లోపు రుణాలను పావలా వడ్డీ కింద ఇస్తోండటం వల్ల రైతులు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. దీనిపై బ్యాంకర్లు స్పందిస్తూ.. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తుందో.. లేదో.. స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘రుణాలను మాఫీ చేశాం కదా.. వడ్డీ రాయితీ చెల్లించడం ఏంటి?’ అంటూ సీఎం ప్రశ్నించడంతో అవాక్కైన బ్యాంకర్లు.. ఇంతకూ వడ్డీలేని రుణం, పావలావడ్డీ పథకాలను కొనసాగిస్తున్నారా? లేదా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దశలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో చర్చించిన చంద్రబాబు.. ఆ రెండు పథకాలను కొనసాగిస్తున్నామని, వడ్డీరాయితీ బకాయిల చెల్లింపులపై ఓ నిర్ణయం తీసుకుంటామని దాటవేసే యత్నం చేశారు. భూమికి సంబంధించిన రికార్డులను ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ ద్వారా ఆన్లైన్లో పెట్టామని.. ఇది వేగంగా రుణాలను పంపిణీ చేయడానికి ఉపకరిస్తుందన్నారు. సూక్ష్మ సేద్యానికి సహకారం రాష్ట్రంలో సూక్ష్మ నీటిపారుదల సేద్యానికి సహకరించాలని బ్యాంకర్లను సీఎం చంద్రబాబు కోరారు. పదెకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్పింక్లర్లను ఇప్పటిదాకా 50 శాతం రాయితీపై ఇచ్చే వారని.. ఇప్పుడు ఆ రాయితీని 70 శాతానికి పెంచామని చెప్పారు. 2015-16లో ఐదు లక్షల ఎకరాల్లో డ్రిప్, స్పింక్లర్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ, అటవీ శాఖ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు టి.కుటుంబరావు, ఆర్బీఐ రీజనల్ డెరైక్టర్ ఆర్.ఎన్.దాస్, ఎస్ఎల్బీసీ చైర్మన్ సీవీఆర్ రాజేంద్రన్, నాబార్డు సీజీఎం హరీష్ జావాలు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయం: ప్రత్తిపాటి ఎస్ఎల్బీసీ సమావేశం ముగిసిన అనంతరం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరులతో మట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో కన్నా 2015-16లో రైతులకు అధికంగా రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరామన్నారు. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక ముఖ్యాంశాలు (అంకెలు.. రూ.కోట్లల్లో) ⇒ 1,25,748 బ్యాంకర్లు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళిక ⇒ 85,345 ప్రాధాన్యరంగానికి ⇒ 28,828 ప్రాధాన్యేతర రంగాలకు ⇒ 65,272 వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం ⇒ 17,205 వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణం ⇒ 1344 మత్స్య పరిశ్రమకు రుణ లక్ష్యం ⇒ 3,098 పాడి పరిశ్రమకు.. ⇒ 2,789 వ్యవసాయ యాంత్రీకరణకు.. ⇒ 15,880 స్వయం సహాయక మహిళా సంఘాలకు.. ⇒ 16,960 చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు మార్చి 31, 2015 నాటికి ⇒ 1,93,753 బ్యాంకుల్లో డిపాజిట్లు ⇒ 2,15,797 రుణాలుగా పంపిణీ ⇒ 1,51,482 ప్రాధాన్యత రంగ అప్పులు ⇒ 95,597 వ్యవసాయ రుణాలు ⇒ 32,276 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు ⇒ 3,026 విద్యా రుణాలు ⇒ 17,424 గృహ నిర్మాణ రుణాలు -
‘అప్పు’డే తిప్పలు
ఖరీఫ్ ముంచుకొచ్చేసింది... పెట్టుబడులకోసం అన్నదాతలు పరుగులు పెడుతున్నారు... రుణమాఫీ ‘మాయ’లో పడి పాత బకాయిలు తీర్చక డిఫాల్టర్లుగా మారి... కొత్త రుణాలు పొందేందుకు అనర్హులయ్యారు. ఏటా ప్రతికూల పరిస్థితులవల్ల ఆర్థికంగా చితికిపోయిన కర్షకునికి బ్యాంకుల క‘రుణ’ కరువైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుగా అప్పులకోసం నానా తిప్పలు పడుతున్నారు. శ్రీకాకుళం రూరల్ : ఏటా తలెత్తిన ప్రతికూల పరిస్థితులతో నష్టాలు చవిచూస్తున్న రైతు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నాడు. అయినా ఆర్థిక పరిస్థితులు సహకరించడంలేదు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో పాత బకాయిలు తీర్చకుండా కాలయాపన చేసిన రైతు నెత్తిన బ్యాంకులో పేరుకుపోయిన మొత్తాలు గుదిబండలా మారాయి. కొత్తగా పెట్టుబడులకోసం బ్యాంకుల కెళ్తే వారినుంచి మొండిచెయ్యి ఎదురవుతోంది. మృగశిర కార్తె పోయి ఆరుద్ర కార్తె ప్రవేశించినా పొలం పనులు ఇంకా ముందుకు సాగడంలేదు. ఈ పాటికే వేరుశనగ, గోగు వంటి పంటలకు గొప్పులు కూడా పూర్తి చేయాలి. కానీ ఇటు వర్షాభావం, అటు మదుపులు లేకపోవడంవారిని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనీయడంలేదు. బకాయిలు బారెడు... మాఫీ బెత్తెడు జిల్లాలో సుమారు 6లక్షల మంది రైతులున్నారు. వీరిలో సుమారు 5 లక్షల మంది రూ. 1985 కోట్లవరకూ పంట రుణాలు తీసుకున్నారు. రెండు విడతల్లో 2,84,000మంది రైతులకు రూ. 367 కోట్లు మాత్రమే రుణ మాఫీ జరిగింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్... ఆధార్ నంబరు... రేషన్‌కార్డు నంబర్... ఒక కుటుంబంలో ఒకరికే... ఇలా సవాలక్ష షరతుల కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. దీంతో అటు రుణం తీర్చుకోలేక.. ఇటు కొత్త రుణం అందక రైతు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. ఇప్పటికే వరుసగా పంట పాడవడంతో దొరికినకాడికల్లా అప్పులు చేసిన అన్నదాతకు కొత్తగా అప్పు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. బంగారం కూడా బ్యాంకుల్లో కుదువపెట్టి మరీ భూమాతను నమ్ముకుని వ్యవసాయంలో పెట్టారు. అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రైతును ముంచాయి. దీంతో కోటి ఆశల ఖరీఫ్ కోసం ఎవరు అప్పు ఇస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నా అప్పులు తీర్చే పరిస్థితిలో లేని రైతన్న అయోమయంగా చూస్తున్నాడు. పంట రుణాల లక్ష్య రూ. 1994కోట్లు ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 1994 కోట్లుగా నిర్ణయించారు. ఖరీఫ్‌కు రూ. 1396 కోట్లు, రబీకి రూ. 598 కోట్లు ఇవ్వాలని భావించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతోంది. జూలై నెల దగ్గర పడుతోంది. కార్తెలు ముగిసిపోతున్నాయి. అయినా ఇప్పటికి రూ. 100కోట్లు మాత్రమే కొత్త రుణాలు తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రుణ మాఫీ ప్రభావం రైతులపై ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది. రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం రెన్యువల్ మాత్రమే చేస్తామని చెప్పడంతో రుణమాపీ వర్తించిన రైతులు మాత్రమే కొత్త రుణాలు తీసుకుంటున్నారు. అందులోనూ వడ్డీభారం పెరిగిపోయినవారు ఆ అవకాశాన్నీ వినియోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీసం రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నారు. -
పెట్టుబడి ఎట్లా?
రైతులకు పంట రుణాలు అందని ద్రాక్షగానే మారాయి. మొదట్లో ఊరిస్తూ చివరకు ఉసూరుమనిపిస్తున్నారు బ్యాంకర్లు. ఏటా ఇదే పరిస్థితి. పంట రుణాల లక్ష్యం భారీగానే ఉంటున్నా మంజూరులో మాత్రం పూర్తి స్థాయిలో వెనుకబడిపోతున్నారు. అవసరానికి డబ్బులు అందక రైతులు ప్రైవేట్ అప్పులు చేస్తున్నారు. ఆపై వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. ఈసారి బ్యాంకర్లు రెండో విడత రుణ మాఫీని సాకుగా చూపి రుణాల మంజూరులో జాప్యం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం డబ్బులు అందుతాయో లేదోనని రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. గత ఏడాది ఖరీఫ్‌లో బ్యాంకర్ల లక్ష్యం.... మంజూరు చేసిన రుణాలు ఇలా... బ్యాంకు = లక్ష్యం= మంజూరు చేసింది ఎస్బీహెచ్= రూ.156 కోట్లు= రూ.96.46 కోట్లు ఎస్బీఐ= రూ.165 కోట్లు= రూ.109 కోట్లు ఆంధ్రాబ్యాంకు = రూ.139 కోట్లు= రూ.49.15 కోట్లు డీసీసీబీ= రూ.148 కోట్లు= రూ.45.21 కోట్లు గ్రామీణ వికాస్ బ్యాంకు= రూ.357 కోట్లు= రూ.151 కోట్లు పంట రుణాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా రుణాలిచ్చే విషయంలో లక్ష్యాలు నిర్దేశించుకునే బ్యాంకర్లు అమలులో మాత్రం విఫలమవుతున్నారు. ఖరీఫ్, రబీలో లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లోనూ లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందుతాయా? అన్న సంశయం నెలకొంది. సీజన్ ప్రారంభమైనా బ్యాంకర్లు రుణాలివ్వటం ప్రారంభించలేక పోయారు. ఇదిలావుంటే రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో రైతులకు డబ్బులు అత్యవసరం. సాగుకు పొలాలను సిద్ధం చేసుకోవటం, విత్తనాలు, యూరియా కొనుగోలు తదితర అవసరాలకు రైతులకు డబ్బులు అవసరం. దీంతో రైతులు బ్యాంకుల వైపు చూస్తున్నారు. బ్యాంకర్లు ఇంకా రుణాలు మంజూరు చేయకపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణమాఫీపై స్పష్టత ఏదీ? రుణమాఫీ కింద నాలుగు విడతల్లో డబ్బులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు మొదటి విడతగా 25 శాతం డబ్బులు చెల్లించింది. రెండో విడతగా 25 శాతం మొత్తాన్ని చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. జిల్లాలో రుణమాఫీ పథకం కింద 4.06 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.2,012 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం మొదటి విడతగా రూ.503 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా యంత్రాంగం రూ.483 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. వివిధ కారణాలతో మిగితా రూ.20 కోట్లను ప్రభుత్వానికి తిరిగి జమచేయడం జరిగింది. రెండో విడత రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రుణాల మంజూరు విషయంలో తాత్సారం చేస్తున్నట్టు సమాచారం. వందశాతం రుణాలు మంజూరు చేసేనా? పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు చిత్తశుద్ధిని కనబరచడం లేదు. ఏటా ఖరీఫ్, రబీలో రుణాలకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నా ఆ మేరకు రుణాలు ఇవ్వడం లేదు. గత ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.1,184 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నా, కేవలం రూ.525 కోట్లు మాత్రమే అందజేశారు. కేవలం యాభై శాతం రుణాలు మాత్రం మంజూరు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.1248.28 కోట్లు పంట రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారైనా వందశాతం రుణాలిస్తారో లేదో వేచి చూడాలి. -
ఆసరా..గాభరా!
- జీరో ఖాతాలకు బ్యాంకర్ల కొర్రీలు.. - లబ్ధిదారుల అవస్థలు - జంట జిల్లాల్లో 4.52 లక్షల ఆసరా పింఛన్లు - బ్యాంకు ఖాతాలు 1.51 లక్షలు మాత్రమే - అయోమయంలో 3.01 లక్షల మంది... సాక్షి, సిటీబ్యూరో: పింఛన్లు అందక ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల కొర్రీలు, జీరో ఖాతాల ఓపెనింగ్‌లో కష్టాలతో దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారానే సామాజిక పింఛన్లు(ఆసరా) పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం కారణంగా లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చే యాల్సి వస్తోంది. ఆసరా పింఛన్లకు సంబంధించి జీరో ఖాతాలు తెరవాలని అధికారయంత్రాంగం బ్యాంకర్లను ఆదేశించినా..సరిగ్గా పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే తేదీ (10) దగ్గర పడుతుండటంతో మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. ఖాతాల కోసం బ్యాంకులకు వెళ్లితే సాయంత్రం లేదా రేపు...ఎల్లుండి రావాలని సమాధానం వస్తుండడంతో వారు ఆవేదన చెందుతున్నారు. వికలాంగులు, వృద్ధులైతే బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు తిరగలేక మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. జీరో ఖాతాలు తెరిపించినందుకుగాను దళారులకు రూ.50 నుంచి రూ. 100 వరకు ముట్టజెప్పాల్సివస్తుందంటున్నారు. అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే తప్ప ఖాతాలపై బ్యాంకర్లు కనికరించే పరిస్థితి లేదంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెల ఆసరా పింఛన్లు వరకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోవటం కష్టమని లబ్ధిదారులంటున్నారు. అధికారులు మాత్రం బ్యాంకు ఖాతాలు లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వలేమంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలలో మొత్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,52,168 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,65,025 మంది, రంగారెడ్డి జిల్లాలో 2,87,143 మంది ఉన్నారు. అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం ఇప్పటి వరకు జంట జిల్లాలలో 1.51 లక్షలే ఆసరా పింఛ న్లతో అనుసంధానమయ్యాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 78 వేలు కాగా, రంగారెడ్డి జిల్లాలో 73 వేల వరకు ఉన్నాయి. జంట జిల్లాల్లో ఇంకా 3,01,168 ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. దీంతో ఈనెలలో పింఛన్ల పంపిణీపై అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతుండగా... బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులు మాత్రం పింఛన్ వస్తుందో..రాదోనని టెన్షన్ పడుతున్నారు. -
రైతు పరువు తీసిన బ్యాంకు
-
వడ్డీ రేట్ల కోతకు చాన్స్..!
పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఉండొచ్చు.. రేపటి పరపతి విధాన సమీక్షపై బ్యాంకర్ల అంచనా న్యూఢిల్లీ: ఆర్బీఐ రేపు(మంగళవారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి.. తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్బీఐ దృష్టిపెట్టొచ్చనేది వారి అభిప్రాయం. గత కొద్ది నెలలుగా మైనస్‌లోనే కొనసాగుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం... ఏప్రిల్‌లో కొత్త కనిష్టాన్ని(మైనస్ 2.65%) తాకిన సంగతి తెలిసిందే. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ నెలలో 4.87 శాతానికి తగ్గింది. మరోపక్క, ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో(2014-15) ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి కట్టడి చేయడంతో పాలసీ సమీక్షలో ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు ఆస్కారం కలిగించే అంశమని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా ఉన్నాయి. గత సమీక్ష(ఏప్రిల్7న)లో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించిన విషయం విదితమే. సీఆర్ఆర్ తగ్గిస్తే బెటర్.. ద్రవ్యోల్బణం మైనస్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో పాలసీ రేట్లలో మార్పులకు అవకాశాలున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ టీఎం భాసిన్ పేర్కొన్నారు. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ పి. శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఇప్పుడు చాలా తగ్గింది. దీంతో రెపో రేటు పావు శాతం తగ్గించేందుకు వీలుంది. వృద్ధికి చేయూతనివ్వాలంటే ఆర్బీఐ సానుకూల నిర్ణయం అవసరం. ఇప్పుడు గనుక వడ్డీరేట్లను తగ్గించకపోతే.. ఎల్‌నినో ప్రభావంవల్ల వర్షాలు సరిగ్గా కురవని పక్షంలో రానున్న నెలల్లో రేట్లకోత కష్టతరంగా మారొచ్చు’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాగా, సీఆర్ఆర్ కోత వల్ల కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ముందుకొచ్చే అవకాశం ఉందని భాసిన్ చెప్పారు. ‘ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో అవసరానికి మించి ద్రవ్యలభ్యత(లిక్విడిటీ) ఉంది. రుణ వృద్ధి తగినంతగా లేకపోవడమే దీనికి కారణం. బ్యాంకుల నుంచి ఇప్పుడు మేం స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రెపో విండో(సదుపాయం) వల్ల బ్యాంకులకు అదనపు ప్రయోజనం ఉండదు. సీఆర్ఆర్ తగ్గింపు ద్వారానే బ్యాంకుల వ్యయం దిగొచ్చేందుకు దోహదం చేస్తుంది. కనీసం సీఆర్ఆర్ను అర శాతం తగ్గించాలనేది మా విజ్ఞప్తి. దీనివల్ల వ్యవస్థలోకి రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది’ అని భాసిన్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలుండటంతో పావు శాతానికి మించి ఆర్బీఐ రేట్ల కోతకు ఆస్కారం లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, ఎండీ వీఆర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. -
ఎదురుచూపులేనా?
రుణమాఫీ నిధుల కోసం అన్నదాతల నిరీక్షణ * ఖరీఫ్ ప్రారంభానికి సమీపిస్తున్న గడువు * రెండో విడత 25 శాతం సొమ్ము వస్తేనే రుణాలు రెన్యువల్ చేస్తామంటున్న బ్యాంకర్లు * జిల్లాకు మంజూరు కావాల్సింది రూ.447.5 కోట్లు మోర్తాడ్: పంట రుణాల మాఫీకి సంబంధించిన రెండో విడత 25 శాతం సొమ్ము కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో కొత్త పంటల సాగు కోసం రైతులు రుణాలను రెన్యువల్ చేయించుకోవాలి. అయితే రెండో విడత మాఫీ సొమ్ము జమ అయ్యూకనే రుణాలు రెన్యువల్ చేస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. లక్ష వరకు పంట రుణాలను రెన్యువల్ చేస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ హమీ ఇచ్చిన విషయం విదితమే. తర్జన భర్జనల అనంతరం పంట రుణాల మాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒకేసారి రూ.లక్ష రుణం మాఫీ కాకుండా నాలుగు విడతల్లో నిధులను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరకు గత సంవత్సరం అక్టోబర్‌లో తొలి విడతగా 25 శాతం రుణం మాఫీ సొమ్మును ప్రభుత్వం కేటాయించింది. జిల్లాలో 3.62 లక్షల మంది రైతులు పంట రుణాల మాఫీకి అర్హత సాధించారు. వారికి రూ.1,790 కోట్ల రుణాలు మాఫీ అయ్యూయి. ఇందులో తొలి విడతగా 25 శాతం అంటే రూ.447.5 కోట్లు బ్యాంకర్లకు చేరగా, వారు అర్హులైర రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతు తీసుకున్న రుణం మొత్తంలో 25 శాతం తగ్గింది. ఇక రెండో విడతలో ఇచ్చే మరో 25 శాతం కోసం గత బడ్జెట్లోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఇంకా బ్యాంకర్లకు చేర్చకపోవడంతో రుణాల రెన్యువల్‌కు బ్రేక్ పడినట్లు అయింది. త్వరలో మొదలయ్యే ఖరీఫ్ సీజన్లో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. తొలకరి రాకతోనే పంటల సాగు పనులు మొదలు పెడతారు. సకాలంలో బ్యాంకుల్లో రుణాల రెన్యువల్ చేస్తేనే తమ చేతిలో డబ్బు ఉండి అన్ని పనులు ఊపందుకుంటాయని అంటున్నారు. కాగా ప్రభుత్వం మాత్రం ఇంత వరకు రెండో విడత రుణ మాఫీ సొమ్ము విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. బ్యాంకులకు నిధులు కేటాయిస్తే వారు రైతుల రుణ ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. రెండో విడత మాఫీ సొమ్ము ఆలస్యమైతే రుణాలు రెన్యూవల్ కాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పదని రైతులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా ఇంత వరకు మాఫీ సొమ్ము బ్యాంకులకు చేరక పోవడం వల్ల రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం తొందరగా స్పందించి రెండో విడత మాఫీ సొమ్మును బ్యాంకులకు చేర్చాలని పలువురు కోరుతున్నారు. -
రైతులకు సేవా దృక్పథంతో సహకారం అందించాలి
హన్మకొండ అర్బన్ : రైతులు సుఖ సంతోషాలతో ఉంటేనే సమాజం సుఖ సంతోషాలతో ఉంటుందని.. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచించారు. గురువారం వరంగల్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ జిల్లాలో 90శాతంమంది వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తునారని.. వారికి అవసరమైన సహకారాన్ని సేవా దృక్పథంతో అందించాలన్నారు. ప్రస్తుతం రైతు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బ్యాంకులు పంటరుణాలు ఇచ్చేందుకు అవసరమైన పత్రాలు రెవెన్యూ అధికారులు సకాలంలో అందజేయాలన్నారు. అర్హత ఉన్న రైతులకు బ్యాంకులు వారి ఇంటి వద్దనే రుణంఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎస్బీహెచ్ నియంత్రణాధికారి మాట్లాడుతూ అర్హత ఉన్న రైతులు రుణం పొందిన తర్వాత పంటలు చేతికి వచ్చినా... రుణం తిరిగి చెల్లించడం లేదన్నారు. గ్రామాల వారీగా బకాలయిల వివరాలు ఇస్తే గ్రామ సభల్లో వివరాలు చెప్పి, రుణం తిరిగి చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. -
బీమాతో పేదల కుటుంబాలకు భరోసా
ఒంగోలు: ప్రధానమంత్రి ఇటీవల ప్రవేశపెట్టిన మూడు రకాల పథకాలు పేదల కుటుంబాలకు అతిపెద్ద భరోసాగా నిలుస్తాయని బీమా సంస్థలే కాదు...బ్యాంకర్లూ చెబుతున్నారు. అయితే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వీటిని వినియోగించుకునేందుకు దృష్టి సారించడం లేదు. చాలామంది ఏదో ఒక స్కీమును వినియోగించుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కనీసం రెండు బీమా పథకాలను ఉపయోగించుకున్నా ఆపద వేళల్లో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే ఈనెల 31వ తేదీ వరకు బ్యాంకుల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా పథకాలు అమలులోకి వస్తాయి. మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేదు. కేవలం ఫారం పూర్తిచేసి ఇస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: ఇది పూర్తిగా ప్రమాద బీమా. ఈ బీమాలో సభ్యత్వం పొందాలంటే బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ కనీసంగా నెలకు రూపాయి చొప్పున ప్రతి ఏడాది ఏకమొత్తంగా రూ.12 చెల్లించాలి. ఈ మొత్తం కూడా జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉండాలి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి నిల్వ ఉంచుకునేలా చూసుకోవాలి. దీనికి 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు అందరూ అర్హులే. ఏదైనా ప్రమాదవశాత్తు సంబంధిత పాలసీదారుడు మరణిస్తే అతను పేర్కొన్న నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. ఒక వేళ పాలసీదారుడు తీవ్రంగా గాయపడి ఎటువంటి పనిచేసుకోలేని నిస్సహాయ స్థితికి లోనైతే అతనికి లక్ష రూపాయలు అందుతుంది. ప్రయోజనం ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన: ఇది పూర్తిగా జీవిత బీమా. మరణం ఏ రూపంలో సంభవించినా పాలసీదారుడు సూచించినా నామినీకి రూ.2 లక్షలు అందుతుంది. దీనికి ఏడాదికి రూ.330లు ప్రీమియం చెల్లించాలి. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారు మాత్రమే అర్హులు. పాలసీ 5 వరుస సంవత్సరాలు అమలులో ఉంటుంది. దీనికి కూడా ప్రీమియం రూ.330లు ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉండేలా చూసుకోవాలి. జూన్ ఒకటో తేదీ నుంచి బీమా అమలులోకి వస్తుంది. వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రెండింటికీ ప్రీమియం చెల్లించిన పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రెండు పథకాల నుంచి రూ.4 లక్షలు పరిహారం అందుతుంది. అటల్ పెన్షన్ యోజన: ఇది కేవలం భవిష్యత్తులో పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన పథకం. పెన్షన్ కనీసంగా వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన తరువాతే అందుతుంది. పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వెయ్యి రూపాయల పెన్షన్ పొందాలంటే 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రతినెల రూ.42 చొప్పున చెల్లించాలి. రూ.2 వేలు పెన్షన్ పొందాలంటే రూ.84, రూ.3 వేలు పెన్షన్ పొందాలంటే రూ.126, రూ.4 వేలు పెన్షన్ పొందాలంటే రూ.168, రూ.5 వేలు పెన్షన్ పొందాలంటే రూ.210లు చొప్పున ప్రీమియం చెల్లించాలి. అయితే ప్రీమియం వయస్సు పెరిగేకొద్దీ పెరుగుతూ ఉంటుంది. అయితే వేరే పెన్షన్ సౌకర్యం పొందుతున్నవారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.1.70 లక్షలు చెల్లించడంతోపాటు పెన్షన్ కూడా ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది. -
బీసీ రుణాలకు బ్యాంకర్ల తిరకాసు
నిబంధనల పేరిట కొర్రీలు రుణం మంజూరైనా అందని డీడీ ఫెడరేషన్లకు 25 దరఖాస్తులే నేటితో ముగియనున్న గడువు బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరీలో బ్యాంకర్ల నిబంధనలు లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారుు. చాలా చోట్ల బ్యాంకర్లు వ్యక్తిగత, ఫెడరేషన్ రుణాలకు సంబంధించిన కాన్సెంట్ , డీడీలు ఇవ్వడానికి నిబంధనల సాకుతో కొర్రీలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతో పాటు వివిధ కుల ఫెడరేషన్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసింది. వీటికి బ్యాంక్ కాన్సెంట్ తప్పనిసరి కావడంతో దరఖాస్తుదారులు కేటాయించిన బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్ సిటీ : బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దొంతరవేని శ్రీనివాస్ డెయిరీ యూనిట్ కోసం బీసీ కార్పొరేషన్లో రూ.60వేల రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంక్ కాన్సెంట్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అందచేశాడు. రుణం మంజూరైనట్లు కలెక్టర్ పేరిట ఆర్సీ నెం.377/2014-15, తేదీ : 29/12/2014తో ప్రొసీడింగ్ జారీ అయింది. మూడు నెలల క్రితం శ్రీనివాస్‌కు సంబంధించిన నాన్ ఆపరేటింగ్ ఖాతాలో ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీని జమ చేసింది. దీనికి సంబంధిత బ్యాంక్ మేనేజర్ మోకాలొడ్డారు. హర్యానా గేదెనే కొనుగోలు చేయాలని, అక్కడికి వెళ్లి కొటేషన్ తెస్తేనే డీడీ ఇస్తానని షరతు విధించాడు. హర్యానాకు చెందిన ఒక్కో గేదె విలువనే సుమారుగా రూ.65 వేలు ఉంటుంది. అక్కడికి వెళ్లి గేదెను కొనుగోలు చేసి తీసుకురావడానికి మరో రూ.50 వేలు ఖర్చవుతుంది. అంటే రూ.60 వేల యూనిట్‌కు రూ.1.15 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని శ్రీనివాస్ మేనేజర్‌ను కలిసి విన్నవిస్తే నిబంధనలు అలానే ఉన్నాయని, హర్యానా గేదె అరుుతేనే డబ్బులిస్తామని తెగేసి చెప్పారు. తాను స్థానికంగా కొనుగోలు చేస్తే రెండు గేదెలు వస్తాయని, రూ.60 వేల తో హర్యానాకు వెళ్లి గేదెను ఎలా కొనుగోలు చేయాలో తెలియక శ్రీనివాస్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. ఫెడరేషన్లకు దరఖాస్తులేవీ.. బ్యాంకర్ల కఠిన వైఖరి కారణంగా వెనుకబడిన తరగతుల సమాఖ్య (ఫెడరేషన్) రుణాలకు దరఖాస్తులు రావడం లేదు. ఈ నెల 15వరకు దరఖాస్తుకు గడువున్నా, సోమవారం వరకు 25 దరఖాస్తులే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 498 యూనిట్లు మంజూరు కాగా, చాలా ఫెడరేషన్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. రజక, నాయూబ్రాహ్మణ, వడ్డెర, సగర(ఉప్పర), వాల్మీకి బోయ, కృష్ణబలిజ/పూసల, భట్రాజ, కుమ్మరి/శాలివాహన, మేదర, విశ్వబ్రాహ్మణ సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదిహేను మంది సభ్యులతో గ్రూపు ఏర్పడితే ఆ గ్రూపునకు రూ.7.50 లక్షల రుణం అందచేస్తారు. ఇందులో 50 శాతం సబ్సిడీ అంటే రూ.3.75 లక్షల అందచేస్తారు. ఈ లెక్కన ఒక్కో సభ్యునికి రూ.25 వేలు రుణం, రూ.25 వేలు సబ్సిడీ వస్తుంది. 2014-15 సంవత్సరానికి రజక సమాఖ్యకు 128 యూనిట్లు, నాయూబ్రాహ్మణులకు 188, వడ్డెరలకు 15, భట్రాజులకు 32, మేదరులకు 35, వాల్మీకిబోయలకు 30, కుమ్మరి శాలివాహనులకు 10, కృష్ణబలిజ/పూసలకు 25, విశ్వబ్రాహ్మణులకు 25, సగర/ఉప్పరలకు 10 మొత్తం 498 యూనిట్లు జిల్లాకు మంజూరయ్యాయి. వీటికోసం ప్రభుత్వం రూ.18.67 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని ప్రధాన బ్యాంక్‌లకు ఈ యూనిట్ల లక్ష్యం విధించారు. అయితే చాలా చోట్ల బ్యాంకర్లు కాన్సెంట్ ఇవ్వకపోవడంతోనే కనీస దరఖాస్తులు కూడా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారంతో గడువు ముగియనుండడంతో ఆశించిన స్థారుులో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులతో చర్చించి, ఆర్థిక వెనుకబాటును తొలగించేందుకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు పొందేలా చూడాలని లబ్దిదారులు వేడుకుంటున్నారు. మైనారిటీ రుణాలకు నేడే గడువు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగుస్తుందని ఈడీ ఎంఏ.హమీద్ తెలిపారు. బ్యాంక్ కాన్సెంట్ పొందిన దరఖాస్తులను సంబంధిత మున్సిపాలిటీ, నగరపంచాయతీ కమిషనర్లు, ఎంపీడీఓల లాగిన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0878-2233150 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
బ్యాంకుల చైర్మన్ నియామక ప్రక్రియ షురూ!
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్లను ఎంపికచేసే ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వశాఖ చేపట్టింది. ఇందుకోసం పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్స్, బ్యాంకర్లను గుర్తించే ప్రయత్నం ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్ట్‌ను విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్‌సహా ఎనిమిది బ్యాంకులకు ఈ నియామకాల అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌కు కూడా చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకుల్లో మాజీ బ్యాంకర్లు లేదా, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ నియామకాల సందర్భాల్లో ఎటువంటి ఇంటర్వ్యూలూ నిర్వహించడం జరగదని సమాచారం. ఐదు ప్రభుత్వ రంగ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల కోసం మంత్రిత్వశాఖ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. మంగళవారంతో ఇందుకు సంబంధించి గడువు ముగుస్తుంది. -
‘రుణ’ లక్ష్యంపై నిర్లక్ష్యం!
ప్రణాళిక అమలులో బ్యాంకర్ల నిర్లిప్తత - భారీ అంచనాలతో ప్రారంభం.. తుదకు కొర్రీలు - యేటా లక్ష్యాన్ని - సాధించలేకపోతున్న వైనం - గత యేడాది ప్రగతి 83.86 శాతమే సాక్షి, రంగారెడ్డి జిల్లా: వార్షిక సంవత్సరం ప్రారంభంలో అట్టహాసంగా రూపొందించే రుణప్రణాళికలు.. గడువు ముగిసే నాటికి అబాసుపాలవుతున్నాయి. భారీతనం కోసం వేల కోట్లతో ప్రణాళికలు తయారుచేస్తున్న బ్యాంకర్లు.. ఏడాది ముగిసే నాటికి కొర్రీలు, నిబంధనలు సాకుగా చూపుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతున్నారు. గతేడాది వార్షిక ప్రణాళిక లక్ష్యసాధనలో జిల్లా బ్యాంకుల పురోగతి అంతంత మాత్రం గానే ఉంది. రూ.4,558.95 కోట్ల రుణాల పంపిణీకి గాను రూ.3,823.14 కోట్లు రుణాలిచ్చినట్లు లెక్కల్లో చూపారు. మొత్తంగా 83.86శాతం పురోగతి సాధిం చినట్లు వెల్లడించారు. ఇవికాకుండా ఇతర కేటగిరీల్లో ఇచ్చిన రూ.657.51 కోట్లు కూడా లక్ష్యసాధనలో చూపి చేతులు దులుపుకున్నారు. లక్ష్యసాధన ఘనంగా ఉన్నట్లు పేర్కొంటూ.. ఈ ఏడాది ప్రణాళికలో మరో రూ.350.64 కోట్లు అదనంగా చేర్చి ఘనతను చాటారు. తిరగరాసిన లెక్కలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.714.66 కోట్ల పంటరుణాలిచ్చేలా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కరువు నేపథ్యంలో ఆయా సీజ న్లలో రైతులను ఇబ్బంది పెట్టొందంటూ పంటరుణాలను రీషెడ్యూల్ చేయాల్సిం దిగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లాలో దాదాపు రూ.550 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేశారు. కానీ బ్యాంకులు మాత్రం ఈ మొత్తాన్ని లక్ష్యసాధనలో చూపాయి. అదేవిధంగా భూఅభివృద్ధి కోసం రూ.26.15 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం రూ. 17.57 కోట్లు మాత్రమే ఇచ్చారు. పాడి పరిశ్రమల, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం కోసం రూ.318.49 కోట్ల రుణాలివ్వాల్సిం దిగా ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ రూ.275.11 కోట్లు రుణాలిచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇలా అన్ని కేటగిరీల్లో లక్ష్యసాధన చివరకు మిగిలి పోయింది. ఇతర అనుభంధ రుణాలు రూ.50.38 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.708.34 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చూపారు. ఈ మొత్తాన్ని లక్ష్యసాధనకు జతచేయడంతో పురోగతిలో భారీ మా ర్పులు చోటుచేసుకోవడం గమనార్హం. -
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2015-16 వార్షిక సంవత్సర రుణ ప్రణాళిక రూ.4,909.59 కోట్లతో రూపుదిద్దుకుంది. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక తయారు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణ మంజూరులో వేగం పెంచి లబ్ధిదారుల రుణ సౌలభ్యాన్ని సులభతరం చేయాలని కోరారు. రూ.350.64 కోట్ల పెరుగుదల రుణ మంజూరులో బ్యాంకర్లు ఈ ఏడాది భారీ ప్రణాళికనే తయారు చేశారు. గతేడాది రూ.4,558.95 కోట్ల రుణ ప్రణాళిక రూపొందించగా.. తాజాగా ఈ ప్రణాళిక రూ.4,909.59 కోట్లకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం రూ.350.64 కోట్లు అదనంగా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కీలకమైన పంటరుణాల కింద రూ.730 కోట్లు ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించారు. లింకేజీ రుణాల కింద రూ.281.51 కోట్లు, వ్యవసాయ యాంత్రికీకరణకు రూ.111.20 కోట్ల రుణాలిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. పాడిపరిశ్రమకు రూ.130.75 కోట్లు, పౌల్ట్రీ రంగానికి రూ.116.45 కోట్లు, గోదాములు, మార్కెట్ యార్డుల కోసం రూ.50.06 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి గాను రూ.791.25 కోట్లు నిర్దేశించారు. ఈ రుణాల మంజూరు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, వార్షిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను సాధిస్తామని బ్యాంకర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్బీహెచ్ డీజీఎం శేషసాయి, ఆంధ్రాబ్యాంకు డీజీఎం శేషగిరిరావు, ఆర్బీఐ ఎల్డీఓ వెంకటేష్, ఎస్బీహెచ్ అగ్రీ డీజీఎం అనూరాధ, ఎల్డీఎం సుబ్రమణ్యం, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రుణ స్వాహా
సాక్షి ప్రతినిధి, కడప: బ్యాంకర్లు సహకరిస్తే ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఎలా పొందవచ్చో చేప్పేందుకు ఆ నాయకుడు వ్యవహారమే చక్కటి ఉదాహరణ. ఉన్న భూమినే కుటుంబ సభ్యులందరి పేర్లతోనూ పట్టాలు తయారు చేశారు. మరికొన్ని సర్వే నంబర్లను గ్రామస్థులవి సైతం వాడుకొన్నారు. ఒకే పేరుపైనే పలు బ్యాంకుల్లో రుణాలు పొందారు. మొత్తంగా ఒకే కుటుంబానికి బ్యాంకర్లు వరుసగా లక్షలాది రుణాలు అందించారు. ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి బ్యాంకర్ల సహకారంలో రుణాలు పొందిన వైనం జిల్లా కలెక్టర్ కేవీ రమణ దృష్టికి చేరింది. విచారణకు ఆదేశిస్తే తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. దువ్వూరు మండలం గుడిపాడు గ్రామ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ మండల నేత తుమ్మల వెంకటకొండారెడ్డి కుటుంబంలో ఐదుగురు సభ్యులతో పలు బ్యాంకుల ద్వారా సుమారు రూ.26లక్షల రుణాలు, మరో రూ.10లక్షల మేరకు బంగారు రుణాలు పొందారు. ఒక బ్యాంకులో మార్టిగేజ్ చేయించి రుణం పొందితే, మరికొన్ని బ్యాంకుల్లో పంట రుణాలు పొందారు. తొలుత కొండారెడ్డి వారికి ఉన్న సర్వే నంబర్ల ద్వారా భూమిపై రుణాలు పొందితే, తర్వాత ఆ సర్వే నంబర్లల్లో కొన్నింటిని కుటుంబ సభ్యులతో రికార్డులు రూపొందించి రుణాలు పొందారు. ఇలా చింతకుంట, దువ్వూరులలో ఉన్న కార్పొరేషన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీసీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. తుదకు వ్యక్తిగతంగాను, గ్రామ సర్పంచ్ ఖాతాపై కూడ ఒకే బ్యాంకులో పంట రుణాలు పొందినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో భాగంగా గ్రామకంఠం సర్వే నంబరుతోపాటు, మరో ముగ్గురి గ్రామస్థుల సర్వే నంబర్లుకు చెందిన భూమిని సైతం వాడుకున్నట్లు తెలుస్తోంది. సామాన్యుడికి రుణం దక్కాలంటే.... సామాన్యుడికి రుణం ఇవ్వాలంటే సవాలక్ష అడ్డంకులు సృష్టించే బ్యాంకు అధికారులు కాస్తా పరపతి ఉన్నవారికి సలక్షణంగా అండగా నిలుస్తున్నారని ఈ వ్యవహారం రూఢీ అవుతోంది. మార్టిగేజ్ చేసి కార్పొరేషన్ బ్యాంకులో రుణం పొందిన సర్పంచ్ కొండారెడ్డి అనంతరం స్టేట్‌బ్యాంకులో రెండు ఖాతాలపై (ఒకటి సర్పంచ్ ఖాతా), డీసీసీబీ బ్యాంకులోనూ పంటరుణాలు పొందారు. ఎన్ఓసీ లేనిదే బ్యాంకు రుణం ఇవ్వని యంత్రాంగం కొండారెడ్డికి మాత్రం ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. ఆయనకొక్కరికే వివిధ బ్యాంకుల్లో రూ.8.5లక్షల రుణాలు, రూ.9.2లక్షలు బంగారు రుణాలు లభించాయి. అలాగే కుటుంబసభ్యుల పేర్లుపై మరో రూ.16.5 లక్షల రుణాలు అందాయి. అయితే వారు తీసుకున్న రుణాలకు చెందిన సర్వే నంబర్లు 45 గోపిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సర్వే నంబర్ 23 పోరెడ్డి బాలనరసింహారెడ్డి, 521/1 చెన్నమ్మలకు చెందిన భూములుగా రికార్డులు రూఢీ చేస్తున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ తన పరపతిని వినియోగించుకుని బ్యాంకర్ల ద్వారా విరివిరిగా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. అందుకు ఆయా బ్యాంకుల అధికారుల సహకారం కూడాఅంది ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. విచారణకు ఆదేశించిన కలెక్టర్... గుడిపాడు సర్పంచ్ కొండారెడ్డి కుటుంబ సభ్యులు బ్యాంకర్ల సహకారంలో క్రమం తప్పకుండా పలు బ్యాంకుల్లో రుణాలు పొందిన వైనాన్ని కొందరు దువ్వూరు మండల వాసులు జిల్లా కలెక్టర్ కెవీ రమణకు ఆధారాలు సహా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాల్సిందిగా ఆయన తహశీల్దారు నరసింహులును ఆదేశించారు. అయితే తహశీల్దారుపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆమేరకు నివేదిక ఇవ్వడంలో ఆలస్యం అవుతోన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై తహశీల్దారు వివరణ కోరగా ఎప్పుడు ఎవరి నేతృత్వంలో ఎవరెవరికి పాసుపుస్తకాలు ఇచ్చారు.. ఇప్పుడు ఆ సర్వే నంబర్లు భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి. అడంగళ్, 1బి ఎవరు జారీ చేశారు.. అన్న విషయాలను సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు తహశీల్దారు నరసింహులు సాక్షికి వివరించారు. 12 మంది విఆర్వోల పరిధిలో ఈ అంశం ముడిపడి ఉందని, సర్వే నంబర్లు రికార్డులు తెప్పించాల్సి ఉందని, అందుకే కాస్తా ఆలస్యం అవుతోందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. -
ఏం.. తమాషాగా ఉందా..!
- డీసీసీ సమావేశంలో బ్యాంకర్లపై కలెక్టర్ ఆగ్రహం - రుణ మంజూరులో శ్రద్ధ పెట్టడంలేదని మండిపాటు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణ మంజూరుపై బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాల్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెజారిటీ సంఖ్యలో బ్యాంకు కోఆర్డినేటర్లు గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలోనూ గైర్హారయ్యారని గుర్తుచేస్తూ.. వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. అనంతరం కేటగిరీల వారీగా రుణాల పంపిణీ తీరును సమీక్షిస్తూ ప్రత్యేక శ్రద్ద వహించి లక్ష్యాల్సి సాధించాలన్నారు. పంటరుణాల కేటగిరీలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 714 కోట్లకుగాను రూ.664.84 కోట్లు మాత్రమే పంపిణీ చేశామని, మిగతా రుణాల్సి త్వరితంగా మంజూరుచేయాలన్నారు. జిల్లాలో 15,385 స్వయంసహాయక సంఘాలకు రూ.244.73 కోట్ల లక్ష్యం నిర్దేశిం చగా.. ఇప్పటివరకు 9502 సంఘాలకు రుణాలిచ్చారన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా ప్రతి సంఘానికి రుణం అందించాలన్నారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల పంపిణీ సైతం వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, ఆర్బీఐ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు. -
తిరగరాశారు!
ఈ గణాంకాలు చూస్తుంటే బ్యాంకర్లు రైతుల పాలిట స్పందించిన తీరు అమోఘమనిపిస్తోంది కదూ. కానీ ఇదంతా బ్యాంకర్లు చూపిస్తున్న లెక్కల మాయ. అసలు సంగతి ఏమిటంటే.. రబీ సీజన్లో రైతుల చేతికి వచ్చిన రుణం కేవలం రూ.29.01 కోట్లు మాత్రమే. ఈ రుణ మొత్తం అందింది 20,023 మంది రైతులకే. మిగతా రుణాలన్నీ రెన్యూవల్, రీషెడ్యూల్ చేసినవే. బుధవారం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్(ఎల్డీఎం) జిల్లా యంత్రాంగానికి సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. - పంటరుణాల పంపిణీలో బ్యాంకర్ల గిమ్మిక్కులు - రెన్యూవల్, రీషెడ్యూల్ ప్రక్రియతో సరిపెట్టిన వైనం - ఎండమావిగా ఆర్థికసాయం రబీ సీజన్లో పంటరుణాల లక్ష్యం : రూ.272.44 కోట్లు ఇప్పటివరకు ఇచ్చిన రుణాలు : రూ.256.42 కోట్లు లబ్ధిపొందిన రైతులు : 58,362 రబీలో రుణ పంపిణీ సాధన : 94.1శాతం సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారీ స్థాయిలో పంట రుణ ప్రణాళిక రూపొందించడం.. చివరకు కాకి లెక్కలతో పురోగతిని వివరించడం జిల్లా యంత్రాంగానికి పరిపాటిగా మారింది. రైతులకు కోట్ల రూపాయల రుణాలిస్తున్నామంటూ ప్రగల్బాలు పలికే బ్యాంకర్లు.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లెక్కల మాయ చేసి లక్ష్యాల్ని సాధించినట్లు చూపిస్తున్నారు. ఇందులో కొత్తగా రుణాలందించడం అతితక్కువగా ఉండడం, పాత బకాయిలనే రెన్యూవల్ లేదా రీషెడ్యూల్ చేయడం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లోనూ ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. రూ. 272.44 కోట్లు ఇస్తామని కార్యచరణ విడుదల చేసిన అధికారులు.. ఇప్పటివరకు రూ.29.01 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా రూ.227.41 కోట్లు రీషెడ్యూల్, రెన్యూవల్ చేసి 94.1శాతం లక్ష్యం సాధించినట్లు చెప్పుకోవడం గమనార్హం. రికార్డుల్లోనే అంకెలు.. వరుస నష్టాలతో కుదేలవుతున్న రైతులకు పంటల సాగుకు పెట్టుబడి రూపంలో బ్యాంకులు రుణాలందిస్తాయి. ప్రభుత్వమే ఇందుకు కార్యచరణ రూపొందించి అమలు చేస్తుంది. భూముల పాసు పుస్తకాల్ని తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలివ్వడం సాధారణమే. కానీ ప్రస్తుతం బ్యాంకులు రూటు మార్చాయి. రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గతేడాది ఖరీఫ్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాను కరువు ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్తగా ఆర్థిక చేయూత అందించాలి. ఈ క్రమంలో రుణాలు రీషెడ్యూల్ చేసిన బ్యాంకులు.. చివరగా రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా చేతులె త్తేశాయి. జిల్లావ్యాప్తంగా 62వేల మంది రైతులకు రూ.211.25 కోట్లు రెన్యూవల్ చేయగా 5,807 మంది రైతులకు రూ.16.16 కోట్లు రీషెడ్యూల్ చేశారు. చెయ్యిచ్చిన ప్రధాన బ్యాంకుల - జిల్లాలో లీడ్ బ్యాంకుగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) వ్యవహరిస్తోంది. - ఈ క్రమంలో ప్రస్తుత రబీ సీజన్లో రూ.65.5కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. - కానీ ఈ బ్యాంకు జిల్లాలో ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా కొత్తగా రుణం ఇవ్వలేదని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కు సైతం రూ.2.44 కోట్ల లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఒక్కపైసా రైతులకు రుణరూపంలో ఇవ్వలేదు. ప్రధాన బ్యాంకులే మొండికేయడంతో జిల్లాలో ఆర్థిక సాయం కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చెందిన సభావట్ లింగా 2012లో తనకున్న 4.20 ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టి మాల్ ఆంధ్రాబ్యాంకులో రూ. 80 వేల రుణం తీసుకున్నాడు. వడ్డీతో సహా రూ.లక్ష ఏడు వేలు అయింది. ప్రభుత్వం రుణమాపీ చేయడంతో రూ. 25 వేలు మాఫీ అయింది. కొద్ది రోజుల కింద లింగా బ్యాంకులో రెన్యూవల్ చేసుకున్నాడు. రూ.లక్ష రుణం కింద జమ చేసుకొని కేవలం రూ.7 వేలను మాత్రమే ఇవ్వడం జరిగింది. రైతు మీద మళ్లీ రూ.లక్ష అప్పు అలానే మిగిలింది. -
కౌలు రైతుకు మొండిచేయి
కౌలు రైతులకు ప్రభుత్వాలు రేపిన ఆశలు ఓటికుండలయ్యాయి. రుణ అర్హత కార్డుల పేరుతో చేసిన హడావిడి కార్డులకే పరిమితమైంది. 2014-15 ఏడాదికి గాను జిల్లాలో 5698 మంది కౌలు రైతులను రుణం పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. మిగతా రైతులతో సమానంగా వీరికీ రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, బ్యాంకర్లు చివరకు మొండిచేయి చూపారు. అర్హులైన వారిలో ఇప్పటి వరకు 11 మందికే రుణం దక్కింది. రబీ సీజను కూడా ముగుస్తున్న నేపధ్యంలో మిగిలిన వారిలో ఎంతమందికి రుణాలు దక్కుతాయనేది అనుమానమే. కడప అగ్రికల్చర్ : రుణ అర్హత కార్డుల వల్ల కౌలు రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినా వాస్తవంగా ఎందుకు పనికిరావని తేలిపోయింది. 2014-15 సంవత్సరానికి కార్డులు జారీ చేసేందుకు మే నెలలో రెవిన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 945 రెవిన్యూ గ్రామాలలో సభలు నిర్వహించి 6300 దరఖాస్తులు స్వీకరించారు. అందులో 602 మందిని అనర్హులుగా తేల్చారు. మిగిలిన 5698 మందికి రుణాలు అందిస్తామని చెప్పారు, ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సీజన్ కూడా పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 11 మంది రైతులకు రూ.1.65 లక్షల రుణం మాత్రమే అందించారు. ఇలా ఉంది మన ప్రభుత్వ వ్యవసాయ రుణాల పంపిణీ తీరు అని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2011-12లో ప్రభుత్వం తొలిసారిగా కౌలురైతులను ఆదుకునేందుకు కౌలు రుణ అర్హత చట్టాన్ని తీసుకువచ్చి, కార్డుల జారీ ప్రక్రియను చేపట్టింది. ఇవి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ కార్డుల ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ పొందవచ్చు. ప్రధానంగా బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందే వీలుంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ కార్డులను బ్యాంకర్లు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. 2012-13లో జిల్లాలో 2088 మంది అర్హత సాధించారు. వీరిలో 1205 మందికి రూ.1.65 కోట్ల రుణం ఇచ్చారు. అటు తరువాత 2013-14లో 9905 మందికి కార్డులు ఇవ్వగా అతి కష్టమీద 1410 మందికి * 2.04 కోట్లు మాత్రమే రుణం అందిచారు. అయితే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందనేలేదు. ఇన్పుట్ సబ్సిడీ సంగతి సరేసరి. యజమానులే సంబంధిత భూములపై అన్ని ప్రయోజనాలు పొందారు. ఇక మీకొచ్చేది ఏమి లేదంటూ బ్యాంకర్లు, అధికారులు తేల్చిచెప్పారు. చివరికి ఈ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కౌలు రైతులు గ్రహించారు. ముగుస్తున్న సీజన్... అందరికీ రుణాలు అనుమానమే.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కొద్ది రోజుల్లో ఇంకెంతమంది కౌలు రైతులకు రుణాలు అందుతాయన్నది ప్రశ్నార్థకమే. కౌలు రైతులు రుణ అర్హత కార్డులను నమ్ముకుని పంటల సాగు కోసం ప్రయివేటుగా అప్పులు తెచ్చుకున్నారు. రుణాలపై ప్రభుత్వం ఎటూ తేల్చి చెప్పకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అందునా ఈ నెలాఖరు వరకే పంట రుణాలు ఇచ్చేదని, అటు తరువాత రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ స్థితిలో రుణ అర్హత కార్డులు పొంది కూడా ప్రయోజనం లేకుండా పోయిందని కౌలు రైతులు మధన పడుతున్నారు. -
నేడు ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులో ఉండడం, అలాగే దిగువ స్థాయిలోనే కొనసాగుతున్న అంతర్జాతీయ ముడిచమురు ధరలు నేపథ్యంలో ఆర్బీఐ మంగళవారం పావుశాతం రెపోరేటును (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.75 శాతం) మరో పావుశాతం తగ్గించే అవకాశం ఉందని కొందరు బ్యాంకర్లు అభిప్రాయపడుతుండగా, దీనికి సంబంధించి తదుపరి నిర్ణయానికి 28వ తేదీ బడ్జెట్ వరకూ ఆర్బీఐ వేచిచూసే అవకాశం ఉందని మరికొందరి విశ్లేషణ. దాదాపు 20 నెలల తరువాత అనూహ్యంగా జనవరి 15న ఆర్బీఐ రెపో రేటును 8 శాతం నుంచి 7.75 శాతానికి (పావుశాతం) తగ్గించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, ద్రవ్య పరిస్థితి మెరుగుపడటం వంటి అంశాలపై ఆధారపడి తదుపరి రేట్ల కోత ఉంటుందని కూడా సూచించింది. ఈ రెండు అంశాలూ ప్రస్తుతం సానుకూలంగా ఉండడం, పాలక, పారిశ్రామిక వర్గాల ‘తాజా పావుశాతం రేట్ల కోత’ ఆశలకు ఊపిరిలూదుతోంది. -
మరోవిడత రేట్ల కోతకు చాన్స్!
⇒ పావు శాతం తగ్గే అవకాశం... ⇒ ఆర్థికవేత్తలు, బ్యాంకర్ల అంచనా... ⇒ రేపు ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష న్యూఢిల్లీ/ముంబై: రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరింత ఊరటనివ్వనున్నారా? వడ్డీరేట్లు ఇంకా దిగిరానున్నాయా? అవుననే అంటున్నారు బ్యాంకింగ్ వర్గాలు, ఆర్థికవేత్తలు.రేపు(మంగళవారం) చేపట్టబోయే పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక పాలసీ వడ్డీరేటును మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందనేది వారి అంచనా. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం.. కోల్ ఇండియాలో వాటా విక్రయం విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో వృద్దికి చేయూతనిచ్చేందుకు ఆర్బీఐ మరోవిడత రేట్ల కోతకు ఓకే చెప్పొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గత నెలలో అనూహ్యంగా ఆర్బీఐ పాలసీ రేటు(రెపో)ను పావు శాతం తగ్గించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. దీంతో గడిచిన 20 నెలలుగా కొనసాగుతున్న కఠిన పాలసీకి బ్రేక్ పడినట్లయింది. రెపో రేటు ప్రస్తుతం 7.75%, రివర్స్ రెపో 6.75%, సీఆర్ఆర్ 4% వద్ద ఉన్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5%కి తగ్గగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం సున్నా స్థాయిలోనే(0.1%) ఉంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ.22,557 కోట్లు లభించాయి. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.43,425 కోట్లలో ఇప్పటికే సగానికిపైగా ఖజానాకు చేరాయి. ఇంకా ఓఎన్జీసీ, ఐఓఎల్, భెల్, ఎన్ఎండీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి పీఎస్‌యూలు వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో మార్చిలోగా ఈ లక్ష్యం సులువుగానే సాకారమయ్యే అవకాశాలు సుస్పష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అటు పారిశ్రామిక వర్గాలు ఆర్బీఐ మరింత రేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. గతనెలలో పావు శాతం తగ్గింపు చాలా తక్కువేనని కార్పొరేట్లు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐ విజయం సాధించిందని.. రానున్నరోజుల్లో వడ్డీరేట్లు ఇంకాస్త దిగొచ్చే అవకాశాలున్నాయంటూ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. ఎవరేమన్నారంటే... * రానున్న నెలల్లో వడ్డీరేట్లు ఒక శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయి. మెరుగైన దేశీ స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా రేపు ఆర్బీఐ చేపట్టే సమీక్షలో పావు శాతం రెపో రేటు కోతకు ఆస్కారం ఉంది. - అనిమేష్ చౌహాన్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ చీఫ్ * తాజా ద్రవ్యోల్బణం, ఇతరత్రా గణాంకాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్బీఐ కచ్చితంగా మళ్లీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. - మలయ్ ముఖర్జీ, ఐఎఫ్సీఐ ఎండీ * బడ్జెట్ తర్వాత ఎప్పుడైనా రేట్ల కోత ఉంటుందనే అంచనాలు గతంలోనే వున్నాయి. అయితే, ఈ నెల 3న తగ్గింపునకు అవకాశాలు పెరిగాయి. మొత్తంమీద ఈ ఏడాది(2015)లో ముప్పావు శాతం వడ్డీరేట్లు తగ్గే చాన్స్ ఉంది. - సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ * ద్రవ్యోల్బణం తగ్గుముఖం, ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణల ప్రభావంతో త్వరలోనే డిపాజిట్, రుణ రేట్లు మరింత దిగొస్తాయి. అయితే, రేపు సమీక్షపై అంచనా వేయలేను. తాము, ప్రభుత్వం చేపడుతున్న విధాన, సంస్కరణ చర్యలను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోంది. కొంత వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు. రానున్న రోజుల్లో కచ్చితంగా రేట్లు దిగొస్తాయి. - రాజన్ ధావన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ * 3న రేట్ల కోతకు ఆస్కారం ఉంది. అయితే, గత నెలలో ఆనూహ్య తగ్గింపు నేపథ్యంలో మళ్లీ మార్చిలోనే ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందనేది మా ప్రాథమిక అంచనా - ప్రాంజుల్ భండారి, హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ -
రెన్యువల్ కాకుంటే మాఫీ లేదు
రుణాలు పునరుద్ధరించుకోనిరైతుల ఖాతాల్లో మాఫీ నిధులు జమచేయొద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ ఇలా మిగిలిపోయే రూ. 500 కోట్లు వెనక్కు ఇచ్చేయండి బ్యాంకులకు సర్కారు ఆదేశం రాష్ట్రంలో రెన్యువల్ కాని రుణ ఖాతాలు దాదాపు 8 లక్షలు ఈనెల 31 వరకు రెన్యువల్‌కు గడువు సాక్షి, హైదరాబాద్: రుణాలు రెన్యువల్ (పునరుద్ధరణ) చేసుకోని రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం తేల్చింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. దీనితో బ్యాంకుల్లో పంట రుణం తీసుకుని, వాటిని పునరుద్ధరించుకోని దాదాపు ఎనిమిది లక్షల అకౌంట్లకు సంబంధించిన రైతులకు రుణమాఫీ అయ్యే అవకాశం లేకుండా పోతోంది. రుణాలు పునరుద్ధరించుకోని రైతుల ఖాతాల్లో మాఫీ నిధులు జమచేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బ్యాంకర్లకు దిక్కుతోచడం లేదు. రుణాలు తీసుకున్న రైతులను ఏదో విధంగా పిలిపించి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేకపోతే ఆ రుణాలన్నీ నిరర్థక ఖాతా కింద మారే ప్రమాదం ఏర్పడడంతో వారు రైతుల వెంటపడుతున్నట్లు సమాచారం. రైతులు పునరుద్ధరణ చేసుకోకపోవడం వల్ల బ్యాంకుల్లో మిగిలిపోయిన దాదాపు రూ. 500 కోట్ల నిధులను తమ ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. రైతుల నుంచి వసూలు చేసే బదులు ప్రభుత్వం ఏకమొత్తంలో నిధులు చెల్లించడంతో సంబరపడ్డ బ్యాంకర్లు తాజా నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ నెలాఖరులోగా సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులతో రుణాలు పునరుద్ధరణ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క రుణాలను పునరుద్ధరించుకోకపోవడంతో రుణమాఫీకి అర్హత కోల్పోయే రైతులకు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం పైసా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో మొత్తం రూ. 17 వేల కోట్లకుపైగా పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో మూలధనం, వడ్డీ కలిపి మొత్తం బ్యాంకులకు చెల్లించి రైతులకు రుణవిముక్తి కల్పిస్తామని ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా ఈసారి రుణం పునరుద్ధరణ చేసుకోకుంటే.. మిగిలిన దశల్లో రుణమాఫీ వర్తించదని పేర్కొనలేదని బ్యాంకర్లు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించలేదంటున్నారు. రుణమాఫీ మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,250 కోట్లను బ్యాంకులకు గత అక్టోబర్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 36 లక్షల అకౌంట్లు ఉంటే.. అందులో దాదాపు ఏడు లక్షలకు పైగా అకౌంట్లు ఉన్న రైతులు ఇప్పటి వరకు రుణాలను పునరుద్ధరించుకోలేదు. రుణమాఫీ ప్రక్రియ మూడు నెలలుగా సాగుతున్నా రైతులు ముందుకు రాకపోవడంతో ఇకపై వారిని కొనసాగించడం వల్ల లాభం లేదని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. లక్ష రూపాయలకుపైగా రుణాలు తీసుకున్న వారు, భూములు విక్రయించిన వారు పునరుద్ధరణకు ముందుకు రావడం లేదన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మొదటి దశలోనే ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలాయంటే... ఆ లెక్కన వచ్చే మూడు దశలకు చెల్లించాల్సిన మొత్తంలో దాదాపు రూ.1500 కోట్లు మిగిలే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 31లోగా రైతులు తమ పంటరుణాలను పునరుద్ధరించుకోకపోతే వారు రుణమాఫీకి అర్హత కోల్పోతారని జిల్లాల్లో వ్యవసాయ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ మేరకు వారు నోటీసులు జారీ చేస్తున్నారు. -
అంతర్జాతీయంగా ఎదగాలి..
క్రియాశీలకంగా వ్యవహరించాలి.. * సైబర్ నేరాలు అరికట్టడంపై దృష్టి పెట్టాలి * ‘జ్ఞాన సంగం’లో బ్యాంకులకు ప్రధాని సూచన పుణె: బ్యాంకులు నింపాదిగా పనిచేసే విధానాన్ని మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సామాన్యులకు సహాయం అందించడంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, అంతర్జాతీయంగా టాప్ స్థాయికి ఎదగాలని శనివారం పేర్కొన్నారు. బ్యాంకులు వృత్తి నిపుణుల సారథ్యంలో ఎదగాలని, వాటి కార్యకలాపాల్లో రాజకీయ జోక్యానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్న సందర్భాల్లో ఇలాంటి జోక్యాన్ని తాను సమర్థిస్తానని ప్రధాని చెప్పారు. శనివారం జ్ఞాన సంగం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. దేశ ఎకానమీ వృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ప్రగతే నిదర్శనంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బ్యాంకులు ఏటా ఒక్కో రంగాన్ని ఎంచుకుని, దాని ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని మోదీ తెలిపారు. అధిక స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగే సంస్థలకు రుణాల మంజూరీలో ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసే దిశగా కనీసం 20,000-25,000 మంది ఔత్సాహిక స్వచ్ఛత వ్యాపారవేత్తలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు తోడ్పాటు అందించాలన్నారు. ఆర్థికాంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని మోదీ సూచించారు. సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం: జైట్లీ ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేసేందుకు సాహసోపేత సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రిస్కులు తీసుకోక తప్పదు కనుక.. ఆ ప్రయత్నాల్లో ఏవైనా తప్పులు దొర్లినా, ప్రభుత్వం బాసటగా నిల్చేందుకు సిద్ధం అన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కావాల్సిన తోడ్పాటు అందించేలా నిబంధనలు సవరించడాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. ఇక, సరైన వేల్యుయేషన్లు వచ్చినప్పుడే పీఎస్బీల్లో వాటాల విక్రయం చేపడతామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మరోవైపు, విలీనాలకు సంబంధించి ప్రభుత్వం కాకుండా బ్యాంకులే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ఒత్తిడి తేబోదని స్పష్టం చేశారు. ఏడాదిలో మొండి బకాయిలు తగ్గాలి: రాజన్ ఎకానమీని మళ్లీ అధిక వృద్ధి బాట పట్టించాలంటే.. ఏడాది వ్యవధిలోగా బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను చక్కబెట్టాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఎన్పీఏలుగా మారే అవకాశాలున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, వృద్ధికి అవసరమయ్యే వనరులను సమీకరించుకోవడంలో భాగంగా ఇంటింటా ఉండే పొదుపు మొత్తాలను పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని రాజన్ చెప్పారు. బ్యాంకర్లు వాణిజ్యపరమైన నిర్ణయాలు విషయాల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరగొచ్చని, అయితే వీటి వెనుక దురుద్దేశం లేనిపక్షంలో.. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. -
‘రుణమాఫీ’పై మరో కొత్త విన్యాసం..
-
‘రుణమాఫీ’పై మరో కొత్త విన్యాసం..
* సర్కార్ సర్కస్ ఫీట్లు * తాజా సర్క్యులర్‌తో బ్యాంకుల్లో గందరగోళం * నేడు బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం * రుణమాఫీ అయిందో లేదో తెలియక రైతుల్లో ఆందోళన * పేరు ప్రకటించి మాఫీలేదంటే.. రైతులు కొడతారంటున్న బ్యాంకర్లు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పథకం విన్యాసాలతో రాష్ట్రంలో రైతులను అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకర్లను కూడా ఇబ్బందులు పెడుతోంది. సర్కారు తీరుతో ఒకవైపు రైతులు విలవిల్లాడుతుండగా మరోవైపు బ్యాంకర్లు గగ్గోలు పెడుతున్నారు. రుణ మాఫీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకులకు జారీ చేసిన సర్క్యులర్‌తో మేనేజర్లు తలపట్టుకుంటున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఒక రైతు ఒక సర్వే నంబర్‌పై సహకార బ్యాంకులో పట్టాదారు పుస్తకం పెట్టి రుణం తీసుకుని, ఆ రుణం సరిపోక అదే పట్టాదారు పాసుపుస్తకం ద్వారా వాణిజ్య బ్యాంకులో బంగారం తనఖా పెట్టి మరో రుణం తీసుకుంటే... తొలుత తీసుకున్న రుణం ఒకటే మాఫీ కింద పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతుల రుణ విముక్తి’ తొలి జాబితాలో ఒక బ్యాంకులో కన్నా ఎక్కువ బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారి పేర్లనూ ప్రకటించారని ప్రభుత్వం భావిస్తోంది. కానీ సర్క్యు లర్‌లో మాత్రం ఒక సర్వే నంబర్‌పై ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని రుణాలు తీసుకున్నా తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకోవాలనే నిబంధనను ఇప్పుడు కొత్తగా విధించారు. ఒకే సర్వే నంబర్‌పై ఒక రైతు ఎన్ని బ్యాంకుల్లో ఎంత రుణం తీసుకున్నారనే వివరాలు బ్యాంకు సెర్చ్ కొడితే తెలిసిపోతాయని, దాని ప్రకారం బ్యాంకు మేనేజర్లు ఒక బ్యాం కులో రుణం మాత్రమే మాఫీకి వర్తింపచేయాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఒకసారి జాబితాలో పేరున్నట్లు రైతులు తెలుసుకున్నాక ఇప్పుడు రెండు బ్యాంకుల్లో తీసుకున్నందున మాఫీ వర్తించదని చెబితే బ్యాంకుల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ బ్యాంకులో రుణం మాఫీ చేయాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ధారించకుండా తమను బలి పశువులను చేయాలనుకుంటోం దని వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే తమకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముందుకు సాగని రుణమాఫీ పథకం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ నేపథ్యంలో ఎక్కడా కూడా రుణ మాఫీ పథకం అమలు ముందుకు సాగడం లేదు. రైతుల నుంచి ఎక్కడెక్కడ రుణాలు తీసుకున్నారనే వివరాలను ముందుగానే ప్రచురించిన అఫిడవిట్ ద్వారా బ్యాంకులు సేకరిస్తున్నాయి. అలాగే సర్వే నెంబర్ గల ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకం తేవాలని కోరుతున్నాయి. అయితే బ్యాంకు మేనేజర్లు వ్యక్తం చేస్తున్న సందేహాలతోపాటు మళ్లీమళ్లీ అడుగుతున్న వివరాలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గ్రామాల్లోని రైతులు తమ పొలంపై సహకార సంఘాల నుంచి పట్టాదారు పాసుపుస్తకంపై రుణం తీసుకున్నారు. ఆ రుణం వ్యవసాయ పెట్టుబడికి సరిపోకవడంతో అదే సర్వే నెంబర్ భూమిని చూపెట్టడంతో పాటు వాణిజ్య బ్యాంకులో బంగారం కుదువపెట్టి వ్యవసాయానికి రుణం తీసుకున్నారు. రుణమాఫీ జాబితాలో రెండు బ్యాంకుల్లో రుణం ఉన్నట్లు రైతుల పేర్లను సర్కారు ప్రకటించింది. కానీ తాజా సర్క్యులర్‌లో తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ చేయాలని పేర్కొంది. లేదంటే అందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్‌నే బాధ్యుడిని చేస్తామని, ఆ మొత్తాన్ని మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని స్పష్టంచేసింది. ఈ అంశంపై బ్యాంకర్లు పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించినా స్పందన రాకపోగా... బ్యాంకులే కచ్చితంగా ఈ విషయాన్ని రైతులకు చెప్పాలంటున్నారు. ఈ నేపథ్యంలో రుణ విముక్తికి అర్హులంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు ఇంకా ప్రభుత్వ నిధులను బ్యాంకులు జమ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకైతే తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు రుణ విముక్తి సొమ్ము ఈ నెల 12వ తేదీలోగా సర్దుబాటు కావాల్సి ఉంది. అయితే డిసెంబర్ నెలాఖరు వస్తున్నా చాలా బ్యాంకుల్లో రైతుల రుణ ఖాతాలకు ప్రభుత్వం తొలుత ఇచ్చిన సొమ్ము ఇంకా సర్దుబాటు కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు శనివారం ప్రధానమైన బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. -
పసుపు పంటకు ధీమా లేనట్లే!
బాల్కొండ : పంటల బీమాలో పలు మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పసుపు రైతులను మాత్రం పట్టించుకోలేదు. నూతన వ్యవసాయ పంటల బీమా పథకంలో పసుపు ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.గతంలో ప్రకృతి బీభత్సం వల్ల పంటలకు నష్టం జరిగినప్పుడు జిల్లా యూనిట్‌గా తీసుకుని బీమా క్లయిమ్ చెల్లించేవారు. కానీ కొత్త రాష్ట్రంలో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వరికి గ్రామం యూనిట్‌గా తీసుకున్న సర్కార్.. పొద్దుతిరుగుడు, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, కంది, తదితర తొమ్మిది పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ఆదేశించింది. ఈ తొమ్మిది పంటల్లో పసుపు లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందన్న ధీమా లేకుండా పోయింది. గతంలో పంట రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకర్లు బీమా ప్రీమియం మినహాయించుకుని రుణం ఇచ్చేవారు. ఎకరానికి రూ. 6 వేల బీమా ప్రీమియం వసూలు చేసేవారు. కానీ పంట నష్టపోయినా ఏనాడూ బీమా క్లయిమ్ అందలేదు. అప్పట్లో జిల్లాను యూనిట్‌గా తీసుకుని బీమా చేయడం వల్లే పరిహారం అందలేదు. జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగా పంట దెబ్బతింటేనే అప్పట్లో బీమా క్లయిమ్ చెల్లించేవారు. దీంతో ఎప్పుడూ రైతులకు పంట ప్రమాద బీమా డబ్బులు అందలేదు. ప్రస్తుతం పంట బీమాలో మార్పులు చేయడం వల్ల కొంత మేలు జరగవచ్చని రైతులు పేర్కొంటున్నారు. కానీ పసుపు రైతులకు ఆ సౌకర్యం కల్పించ లేదు. నిజమాబాద్ జిల్లాలో ఆర్మూర్ సబ్ డివిజన్లో అత్యధికంగా పసుపు పంటను సాగు చేస్తారు. సుమారు 20 వేల హెక్టార్లకుపైగా ఈ పంట సాగవుతుంది. ఎకరం విస్తీర్ణంలో పంట సాగుకు లక్ష రూపాయలనుంచి లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇంత పెట్టుబడి పెట్టి సాగు చేసే పంటకు బీమా రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
11 లక్షల మందికి ‘నో రెన్యువల్’!
34 లక్షల మంది రైతుల్లో... 23 లక్షల మంది రుణాలే రె న్యువల్ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 14 వేల కోట్లు... ఇచ్చింది రూ. 11 వేల కోట్లు రబీ సీజన్‌కు సంబంధించి కూడా లక్ష్యానికి దూరంగా రుణాల మంజూరు నెలాఖరులోగా ‘రెన్యువల్’ పూర్తి చేసి రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వఆదేశం రైతులే ముందుకు రావడం లేదంటున్న బ్యాంకర్లు లక్ష్యాల మేరకు ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు రుణాలిచ్చామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంకా దాదాపు 11 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రెన్యువల్ కాలేదు. ఖరీఫ్ సీజన్లో మొత్తంగా రూ. 14 వేల కోట్ల మేరకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక రబీలో పెట్టుకున్న రుణ మంజూరు లక్ష్యం రూ. 6,300 కోట్లు కాగా... ఇప్పటికీ ఈ రుణ పంపిణీ క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 4,250 కోట్లను విడుదల చేయడంతో... మొత్తం 34 లక్షల రైతుల రుణాలను రెన్యువల్ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 23 లక్షల ఖాతాలు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. ఖరీఫ్‌లో రైతులకు మొత్తం రూ. 11 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మిగతా 11 లక్షల మంది రైతుల రుణాలు రెన్యువల్ చేసి, వెంటనే వారికి కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ బ్యాంకర్లను కోరారు. అయితే వర్షాల్లేక, క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు లేక రైతులు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని బ్యాంకర్లు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రాధాన్యతా రంగానికి 40 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికే 33 శాతం మేరకు ఇచ్చినట్లు వివరించారు. కాగా.. రబీ సీజన్లో రూ. 6,300 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినా... క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చారు. రుణాల రెన్యువల్‌కు సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉందో బ్యాంకులు వివరిస్తే దానిని సరిచేయడానికి వీలవుతుందని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందుకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే రుణాలు ఆ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని, అందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని బ్యాంకులను కోరారు. ఇదివరకే మంజూరైన వారికి ఈ మూడు నెలల కాలంలో రుణాలన్నీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ.. పంట రుణాల రెన్యువల్లో కొద్దిరోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా దానిని పూర్తి చేయాలని కోరారు. సంతృప్తస్థాయిలో బ్యాంకు ఖాతాలు.. తెలంగాణ రాష్ట్రంలో 97 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఇచ్చామని, ఈ నెల 20వ తేదీ నాటికి అందరికీ ఖాతాలు కల్పించినట్లు ప్రకటించనున్నామని బ్యాంకర్లు సమావేశంలో వెల్లడించారు. జన్ ధన్ యోజన కింద 36 లక్షల ఖాతాలు తెరిపించినట్లు చెప్పారు. వారందరికీ ‘రూపే’ కార్డులను పంపిణీ చేశామని... వారికి రూ. 30 వేల జీవిత బీమా, రూ. లక్ష ప్రమాద బీమా పాలసీ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో దాదాపు కోటి బ్యాంకు ఖాతాలున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీహెచ్ ఎండీ శంతన్ ముఖర్జీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను అభినందించారు. రాష్ట్రంలో బ్యాంకు శాఖల సంఖ్య 4,682కు చేరిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 10,531 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, దీనితో మొత్తం డిపాజిట్లు రూ. 2,97,422 కోట్లకు చేరాయని తెలిపారు. దేశంలో రుణ నిష్పత్తి అత్యధికంగా 113 శాతం ఉన్నట్లు తెలిపారు. -
అంతా మోసం!
‘‘అనంత’కు మంజూరైన రూ.227 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయకుండా బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారు. దీన్ని ఆపాలని చంద్రబాబుకు విన్నవించా! ఆయన సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ - మంత్రి పల్లె వ్యాఖ్యలు ‘‘రైతులకు సంబంధించిన ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా)తో పాటు ఎలాంటి బీమా పరిహారాన్నైనా బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకోవచ్చు’’ - ఈనెల 4న ప్రభుత్వం జారీ చేసిన 218 జీవోలో పేర్కొన్న కీలకాంశం. ‘‘పంటల బీమా సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ పాతబకాయిల కింద జమ చేసుకునేందుకు వీల్లేదు. కచ్చితంగా రైతుల ఖాతాలో జమ చేయాల్సిందే! -2005 పార్లమెంట్ చట్టం చెబుతున్న వాస్తవమిది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : రుణమాఫీతో రైతులను నిలువునా ముంచేసిన ప్రభుత్వం మరో వంచనకు ఉపక్రమించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కంటే కరువు జిల్లా అయిన అనంతపురం రైతులను పెద్దదెబ్బ తీసేలా జీవో 218ని జారీ చేసింది. ఈ నెల 4న రుణమాఫీపై విధాన ప్రకటన చేసిన చంద్రబాబు, అదే రోజు 218 జీవోను జారీ చేసి ‘అనంత’ రైతులకు తీవ్ర అన్యాయం చేశారు.‘ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో రుణమాఫీలో రైతుకు నష్టం కల్గించే చర్యలు అవలంభించిన ప్రభుత్వం.. 218 జీవోతో పూర్తిగా ముంచేసింది. వాతావరణబీమా సొమ్మును బకాయిల్లోకి జమ చేసుకోండి: 2013-14 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు దాదాపు రూ.227 కోట్ల వాతావరణ బీమా ప్రీమియం మంజూరైంది. బీమా సొమ్ము రెన్నెళ్ల క్రితం బ్యాంకులకు చేరినా ఆ సొమ్మును రైతుల ఖాతాల్లోకి బ్యాంకర్లు జమ చేయలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బీమా సొమ్మును పాతబకాయిల కింద జమ చేసుకున్నారు. నిబంధనల ప్రకారం బ్యాంకర్లు చేసిన ఈ చర్య చట్ట విరుద్ధం. 2005లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం బీమా సొమ్ము ఎట్టి పరిస్థితుల్లో బకాయిల కింద జమ చేసుకోకూడదు. కచ్చితంగా రైతుల ఖాతాల్లో జమ చేసి తీరాలి. కానీ బ్యాంకర్లు భిన్నంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఈ నెల 4న ఓ జీవో జారీ చేశారు. అందులోని 11 కాలమ్‌లో ‘‘అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా’కు సంబంధించిన బీమా పరిహారాన్ని పాతబకాయిల కింద జమ చేసుకోవచ్చని బ్యాంకర్లకు అధికారికంగా అనుమతిచ్చేశారు. అంటే రైతులు నిజాయితీతో బీమా ప్రీమియాన్ని చెల్లించి, పంట నష్టపోయి, వారికి హక్కుగా రావాల్సిన సొమ్మును కూడా చంద్రబాబు సర్కారు దక్కకుండా చేస్తోందన్నమాట! అయితే నిజానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో 218, పార్లమెంట్ చట్టానికి విరుద్ధంగా జారీ చేయబడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో చెల్లుబాటు కాదు. అయితే ఈ జీవో జారీతో రైతులపై ప్రభుత్వానికి ఉన్న కుటిలబుద్ధి బట్టబయలైంది. రైతులపై ‘పల్లె’కున్న ప్రేమ ఎంత గొప్పదో: బీమాకు రైతులు ప్రీమియం చెల్లించారు, వారికి బీమా సొమ్ము హక్కుగా దక్కాలి. అయితే రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలుపుకోవడంలో సర్కారు అవలంభించిన అసంబద్ధ వైఖరితోనే బీమాపరిహారాన్ని బ్యాంకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పైగా ప్రభుత్వం కూడా ఓ జీవో జారీ చేసింది. ఈక్రమంలో ‘అనంత’ రైతులకు అన్యాయం చేసే జీవోను, పైగా పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఎలా జారీ చేస్తారని చంద్రబాబును మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు జిల్లా అధికారపార్టీ నేతలు ప్రశ్నించాలి. అయితే బీమాసొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని తాను సీఎంకు విన్నవించానని, అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, అందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలని పల్లె చెబుతున్నారు. రైతులకు రావాల్సిన బీమా సొమ్ము రావడంలో సీఎం కృషి ఏంటో పల్లెగారి విశదీకరించి చెబితే బాగుంటుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. -
మాఫీ మాయ
బ్యాంకర్ల చుట్టూ రైతుల ప్రదక్షిణ మెజార్టీ బ్యాంకులకు చేరని జాబితాలు అర్హులకు దక్కని చోటు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం దగా చేశారు.. రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటన అధికారులు.. బ్యాంకర్లు.. రైతులను గందరగోళంలోకి పడేసింది. ఎవరు అర్హులో.. ఎవరు అనర్హులో.. ఎవరికిమాఫీ అయిందో.. ఎవరికి కాలేదో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సీఎం ప్రకటించి ఆరురోజులు గడిచి పోయాయి. జాబితా విడుదలచేసి నాలుగురోజులైంది. ఏ బ్యాంకు వద్ద పూర్తి స్థాయిలో సమాచారం లేదు . కొన్నిశాఖలలో జాబితాలు ప్రకటించినా వాటిలో అర్హులకుచోటు దక్కని దుస్థితి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సాక్షి బృందం మండలాల వారీగా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణమాఫీపై పరిశీలన జరపగా అంతటా గందరగోళమే నెలకొంది. విశాఖపట్నం: జిల్లాలో 3.87లక్షల ఖాతాలుంటే రూ.50వేల రుణమాఫీ సీలింగ్ పేరుతో కేవలం లక్ష 30వేల 979 ఖాతాలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన 2.83,021 ఖాతాల్లో మరో లక్షమంది వరకు అర్హులున్నప్పటికీ వారికి మొండిచేయే మిగిలింది. వీటిలో 50వేలకుపై బడి రూ.500ల నుంచి ఐదువేల లోపు ఉందనే సాకుతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ జాబితాలోకి చేర్చినట్టు చెబుతున్నప్పటికీ 70 శాతం మందికి అర్హుల జాబితాలో చోటు దక్కలేదు. సాధారణంగా ఏజెన్సీలోని గిరిజన రైతులంతా 50వేల లోపు రుణం తీసుకున్న వారే. కానీ జాబితాలో చోటు దక్కింది మాత్రం 35 శాతం లోపే. ఉదాహరణకు వి.మాడుగలలో పదివేల మందికి పైగా రైతులుంటే కేవలం 4వేల మందికే జాబితాలో చోటు దక్కింది. కోటపాడులో 8వేలమందిరైతులుంటే కేవలం 3వేల మందికే మాఫీ వర్తించింది. భీమిలి నియోజకవర్గంలో ఏకంగా 6వేల మంది రైతులకు రూ.12.5కోట్ల రుణాలుంటే అర్హుల జాబితాలో ఏ ఒక్కరికి చోటు దక్కలేదు. ఇక్కడ పీఎస్సీఎస్ పరిధిలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులు 720మంది ఉంటే కేవలం 62 మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది. ఏజెన్సీలో ఒక్కమండలానికే: ఏజెన్సీలో కేవలం కొయ్యూరు మండల పరిధిలోని రైతులకు మాత్రమే మాఫీ వర్తించింది. మిగిలిన మండలాల్లోని సోసైటీల్లో ఎక్కడా జాబితాలనే ప్రదర్శించలేదు. మైదానంలో కేవలం పది మండలాల్లో మాత్రమే అదీ కూడా కొన్ని బ్యాంకుల్లోనే మంగళవారం జాబితాలను ప్రదర్శించారు. 50వేల లోపు రుణాలు తీసుకున్నవారు ఎక్కువ మంది సహకార సంఘాల పరిధిలోనే ఉంటారు. సొసైటీల పరిధిలో రూ.250కోట్లకు పైగా రుణాలున్నాయి. వీటిలో కనీసం 80 శాతం రుణాలు తొలి జాబితాలోనే చోటు దక్కాల్సి ఉన్నప్పటికీ కనీసం 40శాతం రుణాలు కూడా మాఫీకాని పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి మాఫీ సర్టిఫికెట్ల జారీ: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు క్షేత్ర స్థాయి లో రైతుసాధికారత సదస్సుల పేరిట స మావేశాలు నిర్వహించి అర్హులైన రైతులకు మాఫీ సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు బ్యాంకర్లు, జిల్లా అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీకాలేదు. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఉ న్నామని డీఆర్వో నాగేశ్వరరావు సాక్షికి తెలిపా రు. బుధవారం నాటికి క్లారిటీ వస్తుందన్నారు. మోసపోయాం.. ప్రభుత్వం మోసం చేసింది. నాకు పాడేరు డీసీసీబీ బ్యాంకులో 40వేల రుణం ఉంది. వడ్డీతో 50వేల లోపే ఉంది. కానీ జాబితాలో నా పేరు లేదు. అడిగితే మీకు రాలేదంటున్నారు. ఎందుకురాలేదని అడిగితే సమాధానం చెప్పే వారే కరువయ్యారు. పైగా కసురుకుంటున్నారు.ఎందుకు మాఫీ కాలేదో కూడా చెప్పే పరిస్థితిలేదు. -మువ్వల సత్యనారాయణ, గిరిజన రైతు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు రెండు రోజులుగా రుణ మాఫీ జాబితా గురించి బ్యాంకు చుట్టూ తిరుతున్నా జాబితా రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చీడిగుమ్మల సొసైటీలో రూ.30 వేలు, నర్సీపట్నం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.30 వేలు తీసుకున్నారు. సొసైటీలో రుణమాఫీ గురించి అడిగితే రాలేదంటున్నారు. ఏబీడీ బ్యాంక్ వస్తే అసలు రుణ జాబితా రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం పూటకో ప్రకటనతో రైతులను ఇబ్బంది పెడుతున్నది. -గండి శ్రీను, చీడిగుమ్మల నాది ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు.ఖరీఫ్ కోసం గతేడాది ఎస్.రాయవరం మండలం గుడివాడ ఎస్బీఐలో రూ.40వేల రుణం తీసుకున్నారు. పుస్తెలతాడుతో సహా బంగారు ఆభరణాలు కుదువపెట్టి మరో పాతికవేల తీసుకున్నాను. పంట కలిసిరాలేదు. చంద్రబాబు హామీతో అప్పు మాఫీ అవుతుందని ఆశపడ్డాను. మాఫీ జాబితాలో నా పేరు లేదు. ఇంతకంటే దగా ఇంకేముంటుంది. -కె.సత్యలక్ష్మి -
కష్టాల్లో ‘డ్వాక్రా’
నారు పోసిన వాడు నీళ్లు పొయ్యకుండా పోతాడా! అనేది సామెత. అంటే పుట్టుక ఇచ్చిన దేవుడు జీవించడానికి ఏదో మార్గం చూపిస్తాడనేది అర్థం. డ్వాక్రా సంఘాల విషయంలో అది తిరగబడింది. సంఘాల ఏర్పాటుకు బీజం వేసిన సీఎం చంద్రబాబు పదేళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉసురు తీశారు. ఎన్నికల వేళ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట మార్చారు. హామీ మేరకు రూ.పది వేలు కూడా ఇవ్వకుండా నామం పెట్టారు. అప్పులకు తోడు వడ్డీ భారం పెరిగింది. మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ సంఘాలపై చీకట్లు అలుముకున్నాయి. సొంత జిల్లాలోనే డ్వాక్రా సంఘాల నుంచి సీఎం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది జిల్లాలోని 43,837 గ్రూపులకు రూ.1,177 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కాగా బ్యాంకు లు ఇప్పటివరకు కేవలం 12,652 సంఘాలకు రూ.475 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చే శాయి. ఇంకా 31 వేల గ్రూపులకు రుణాలు చెల్లించాల్సి ఉన్నా బ్యాంకులు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో మొత్తం 62 వేల డ్వాక్రా గ్రూపులు ఉండగా, 58,602 గ్రూపులు బ్యాంకుల లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా జిల్లాలో 89 శాతం గ్రూపులు రూ.100 కోట్లు కడుతున్నాయి. 11 శాతం మాత్రమే బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు రుణమాఫీ హామీతో చాలా గ్రూపులు ఎన్నికల అనంతరం బ్యాంకులకు రుణాలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరి గా యి. నిబంధనల మేరకు మూడు నెలలపాటు బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీలు పడడమే కాక వడ్డీలేని రుణానికి అర్హత కోల్పోతారు. దీంతో చాలా గ్రూపులు ఇదే పరిస్థితినెదుర్కొంటున్నాయి. చంద్రబాబు రుణమాఫీ హామీని తుంగలో తొక్కడంతో డ్వాక్రా గ్రూపుల అప్పులు పెరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 10,484 గ్రూపులకు సంబంధించి రూ.58 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా రూ.7,436 గ్రూపులు 3 నెలలుగా రూ.147 కోట్లను కట్టలేని పరిస్థితిలో బ్యాంకులకు చెల్లించడం నిలిపివేశాయి. బ్యాంకులు సకాలం లో రుణాలు మంజూరు చేయలేదు. బలవంతపు రుణవసూళ్లు రుణమాఫీ సంగతి దేవుడెరుగు. ముందు డ్వాక్రా రుణాలను తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు డ్వాక్రా రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పైగా పాతబకాయిలకు సంబంధించి రీపేమెంట్ చేయకపోతే అధిక వడ్డీలు వసూలు చేయాల్సి వస్తుందని, బకాయిలు చెల్లించకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదని తేల్చి చెబుత్నున్నారు. సకాలంలో తిరిగి చెల్లించకపోతే రూ.5 లక్షలకు నెలకు రూ.5 వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సందేనంటూ బెదిరిం పులకు సైతం దిగారు . జిల్లాలో 62 వేల డ్వాక్రా సంఘాల్లో దాదాపు 7.80 లక్షల మంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. 2013-14లో రూ.1387 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో రూ.147 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. గడువులోపు చెల్లించక నిలిచిపోయిన బకాయిలు మరో రూ. 58 కోట్లు ఉన్నారుు. మొత్తంగా ఈ ఏడాది ప్రారంభం నాటికే ఇచ్చిన రూ. 1200 కోట్లు బకాయిలు ఉండగా, బలవంతపు వసూళ్ల పుణ్యమాని ఇప్పటికే 89 శాతం వసూలు చేశారు. రూ. పది వేలు ఏదీ? మరో వైపు అక్కాచెల్లెళ్లకు ఖర్చుల కోసం ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేలు ఉచితంగా ఇస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదే పదే చెప్పారు. కానీ పైసా విదల్చలేదు. జిల్లాలోని 7.80 లక్షలసభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల వంతున మొత్తం రూ.780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా చంద్రబాబు మాటలు నమ్మి పోసపోయామంటూ మహిళలు వాపోతున్నారు. -
రుణమాఫీ జాబితాలు. . ఆన్లైన్లో
- జాబితాల కోసం రైతుల ఉరుకులు, పరుగులు - ఎంతమంది పేర్లున్నాయనేది చెప్పలేకపోతున్న బ్యాంకర్లు మచిలీపట్నం : రుణమాఫీ జాబితాలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఆదివారం ఈ వివరాలను ఆన్లైన్లో ఉంచింది. ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ జాబితాలను ఆరో తేదీన ప్రకటిస్తామని చెప్పగా.. ఒకరోజు ఆలస్యంగా ఈ జాబితాలను ఆన్లైన్లో ఉంచారు. ఆదివారం సాయంత్రం నుంచి పలువురు రైతులు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు నెట్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాలు,బ్యాంకులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. గ్రామీణ ప్రాంతంలో నెట్ సెంటర్లు మూసి ఉండటంతో వివరాలు తెలుసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. రూ.50 వేల లోపు రుణం ఉన్నవారికి 20 శాతం మాత్రమే నగదు జమ చేస్తామని శనివారం సాయంత్రం ఆయా బ్యాంకులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయానికి ఈ సమాచారాన్ని నిలిపివేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రుణమాఫీకి సంబంధించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వివరాలు అందుబాటులో లేవు. గతంలోనే బ్యాంకులకు రుణమాఫీ జాబితాలు ఇచ్చినా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని బయట పెట్టలేదు. ఆదివారం ఈ జాబితాలను ఆన్లైన్లో ఉంచారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందనే అంశంపై బ్యాంకు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సోమవారం సాయంత్రానికి ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కుటుంబపరంగా వివరాలు... రుణమాఫీ జాబితాలను కుటుంబంలోని సభ్యుల పేర్లు.. ఎంత విస్తీర్ణానికి ఎంత రుణం తీసుకున్నారు.. ఏ తేదీన తీసుకున్నారు.. తీసుకున్న రుణం ఎంత.. ఎకరానికి రూ.19 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) ప్రకారం బకాయిలో ఎంత మొత్తం రద్దవుతుంది.. ఇప్పటివరకు ఈ రుణానికి ఎంత వడ్డీ అయ్యింది.. తదితర అంశాలు వివరంగా చూపారు. రూ.50 వేలకు పైబడి పంట రుణం ఉంటే 2014-15లో జమ చేసిన మొత్తం వద్ద జీరో చూపారు. ఉదాహరణకు ఒక రైతు ఎస్బీఐ గూడూరు బ్రాంచ్‌లో 2.75 ఎకరాలకు 2013 జూన్ ఆరో తేదీన రూ.68 వేలు రుణం తీసుకుంటే ఇప్పటివరకు ఈ మొత్తం వడ్డీతో కలుపుకొని రూ.71,419 అయ్యింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2.75 ఎకరాలకు రూ.52,250 రుణమాఫీ కింద గుర్తించి ఈ మొత్తానికి వడ్డీతో కలిపి రూ.54,877 రుణమాఫీ అవుతుందని చూపారు. రైతుకు సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు నమోదు చేస్తేనే ఈ వివరాలు ఆన్లైన్లో వస్తున్నాయి. జిల్లాలో 7.03 లక్షల మంది రైతులకు గాను రూ.9,137 కోట్ల పంట రుణాలు బకాయిలు ఉన్నాయి. ఇందులో ఎంతమంది పేర్లు జాబితాలో ఉన్నాయో వేచిచూడాలి. -
మాఫీ ఆట..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వ్యవసాయ రుణమాఫీలో ఇప్పటి వరకు పలు రకాల కారణాలు, నిబంధనలతో కాలయాపన చేసిన ప్రభుత్వం..తాజాగా మరో మెలిక పెట్టింది. పంట రుణపరిమితికి మించి రుణాలు ఎలా ఇచ్చారంటూ బ్యాంకర్లను ప్రశ్నించింది. వరిపంట వేస్తే ఎకరాకు గరిష్టంగా రూ.22 వేలు ఇవ్వాల్సి ఉండగా లక్షల రూపాయలు ఎలా ఇచ్చారని బ్యాంకులను నిలదీస్తోంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు మించి బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, రుణమాఫీ అర్హత జాబితాను సరిచేసి పంపాలని, ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకర్లు అర్హతకు మించి రుణాలు ఇచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కేందుకు రకరకాల ఎత్తు లు వేస్తున్నారు. అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు రకరకాల నిబంధనలతో రైతులను అనర్హులుగా పరిగణించి మొక్కుబడిగా కొందరికి మాత్రం చేతులు దులుపుకునేందుకు సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే రకరకాల కొర్రీలతో వేలాది మంది రైతులను అనర్హుల జాబితాలో చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో మరో కొత్త నిబంధనకు తెరతీసి మరి కొందరిని ఏరివేసే పనిలో పడింది. అదే విధంగా బంగారు కుదువ పెట్టిన రైతులకు కొందరు బ్యాంకర్లు బంగారం విలువ ఆధారంగా లక్ష వరకు రుణాన్ని మంజూరు చేశాయి. అయితే అంత రుణం మంజూరు చేసినా రుణమాఫీ పరిధిలోకి తీసుకోబోమని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంత రుణం ఇవ్వాలో అంతకే తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులన్నీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన కింద ఎంత మందికి ఇచ్చారో తెలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హతకు మించి ఇచ్చి ఉంటే అనర్హులే: అర్హుల జాబితాను కుదించటమే లక్ష్యంగా ప్రభుత్వం రకరకాల నిబంధనలు విధిస్తోంది. ఇందులో భాగంగా నాలుగో సారి స్కేల్ ఆఫ్ పైనాన్స్ పద్ధతిని తెరమీదుకు తెచ్చింది. అర్హతకు మించి రుణాలు ఇచ్చి ఉంటే.. వారందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా 25శాతం మంది రైతులు అనర్హులుగా తేలే అవకాశం ఉందని అధికారలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ధర్నాలకు పిలుపు ఇవ్వటంతో టీడీపీ సర్కారు రుణమాఫీ అర్హుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రకటిస్తే అనర్హులంతా ఒక్కటవుతారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు మరింత బలం పెరుగుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. -
బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు..
ఎంపీ పొంగులేటికి రైతుల ఫిర్యాదు దమ్మపేట: నిబంధనల పేరుతో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని మండలంలోని పట్వారీగూడేనికి చెందిన పలువురు రైతులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆదివారం పట్వారీగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీని రైతులు కలిశారు. పాత పహణీల ప్రకారం రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ - పహణీలు ఉంటేనే బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇస్తామంటున్నారని తెలిపారు. పట్వారిగూడెంలో తమకు వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ ఈ పహణీలు లేవని తెలిపారు. తమలాంటి వారికి బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. అందుకు స్పందించిన ఎంపీ దమ్మపేట తహశీల్దార్‌కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీని కలిసిన రైతుల్లో కోటగిరి మురళీ, కూరం చినముత్యాలు, కణితి వెంకటేశ్వరరావు, కోటగిరి సత్తిబాబు, రెడ్డిమళ్ల చిట్టి, కోటగిరి యుగంధర్, పఠాన్ మున్నా తదితరులు ఉన్నారు. -
అలక్ష్యం
ఒక్క పైసా కట్టొద్దు..నేను అధికారంలోకి వచ్చేస్తున్నా.. మీ కష్టాలన్నీ తీర్చేస్తా.. మీ అప్పులన్నీ అణాపైసలతో సహా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారం ఊదరగొట్టేశారు. తీరా పగ్గాలు చేపట్టగానే అబ్బే మాఫీ కాదు..లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ గ్రాంట్‌కు కూడా దిక్కులేదు. సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇస్తామంటూ మాఫీకి మంగళం పాడి డ్వాక్రా సంఘాలపై శఠగోపం పెట్టారు. * కొత్త రుణాలు ఇచ్చేందుకు ముఖం చాటేస్తున్న బ్యాంకర్లు * స్త్రీ నిధి రుణాలదీ అదే తీరు * మైక్రో ఉచ్చులో డ్వాక్రా మహిళలు * గగ్గోలు పెడుతున్న నిరుపేదలు * రుణమాఫీ పుణ్యమాని పేరుకుపోయిన బకాయిలు సాక్షి, విశాఖపట్నం: ఇటుక మీద ఇటుక కడుతూ ఇల్లు నిర్మించాలంటే ఆరేడు నెలలు పడుతుంది.. అదే ఇల్లు కూలగొట్టాలంటే కనురెప్పకాలం చాలు. ఇప్పుడు అదే తీరులో ఉంది డ్వాక్రా పొదుపు ఉద్యమం. మూడున్నర దశాబ్దాలుగా నిర్మితమైన ఈ ఉద్యమం సర్కారు తీరుపై కుప్ప కూలే పరిస్థితి ఏర్పడింది. కొండలా పేరుకుపోయిన రుణ బకాయిలు ఒక వైపు.. కొత్త అప్పులు పుట్టక ఆర్థిక ఇబ్బందులు మరో వైపు..వెరసి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు, మైక్రో సంస్థల ఉచ్చులో నిరుపేద మహిళలు చిక్కుకునేలా చేసింది. జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటిలో విశాఖ రూరల్ జిల్లా పరిధిలో 45,500 సంఘాలుంటే జీవీఎంసీ పరిధిలో 18,900 సంఘాలున్నాయి. ఇక నర్సీపట్నం, యలమంచిలి పట్టణాల్లో మరో 2,040 సంఘాలున్నా యి. వీటి పరిధిలో సుమా రు ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని సంఘాలకు రూ.260 కోట్లు, విశాఖ రూరల్ జిల్లా పరిధిలో రూ.620 కోట్లు, మెప్మా (నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీలు) పరిధిలో మరో ఆరు కోట్ల బకాయిలున్నాయి. ఈ రుణాలన్నీ మాఫీ అయిపోతాయని ఆయా సంఘాలు ఇన్నాళ్లు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం కాస్తా 14 శాతం వడ్డీతో వెయ్యి కోట్లు దాటి పోయిందని అంచనా. మొత్తం బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని బ్యాంకులైతే మరొకడుగు ముందుకేసి సంఘాల పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును జమచేసుకుంటున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ బకాయిలు చెల్లించండి.. లేదా వడ్డీ అయినా చెల్లించండంటూ లేకుంటే ఎంతకాలం ఎదురు చూస్తాం.. అంటూ నిలదీస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకుంటే ఈవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం ప్రకటిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ మీ అకౌంట్లో జమవుతుంది కదా.. అప్పటివరకు ఎదురు చూస్తే మీ రుణాలపై వడ్డీ భారం తడిసి మోపెడవుతుంది..తక్షణమే చెల్లించండి లేకపోతే మీకే ఇబ్బంది అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఇటీవల విశాఖ కైలాసగిరిలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబును మహిళా సంఘాలు నిలదీస్తే మీ మ్యాచింగ్ గ్రాంట్ కోసమే ఆలోచిస్తున్నాం.. అందకా ఒక్కొక్క సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేయమని చెప్పాను..ఈ లోగా మీ రుణాలు చెల్లించేయండి అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పది శాతం దాటని లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో రూ.155 కోట్లు, మెప్మా పరిధిలో రూ.19 కోట్లు, విశాఖ రూరల్ జిల్లా పరిధిలో రూ.581 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా కనీసం 10 శాతం రుణ లక్ష్యం కూడా దాటని దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జీవీఎంసీ పరిధిలోని సంఘాలకు రూ.48 కోట్లు రుణాలు ఇస్తే, రూరల్ జిల్లా పరిధిలోని సంఘాలకు రూ.51 కోట్లు, మెప్మా పరిధిలోని సంఘాలకు రూ. 5 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. ఈ లెక్కన రూ.755కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా,ఇప్పటి వరకు అతికష్టమ్మీద రూ.104 కోట్ల రుణాలు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక మిగిలింది నాలుగునెలలు మాత్రమే. ఆర్థికసంవత్సరం ముగిసేలోగా రూ.650 కోట్ల రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే. మరో పక్క కుటుంబ అవసరార్థం సంఘాల పరిధిలో రుణాలు తీసుకునే అవకాశం ఉన్న స్త్రీ నిధి రుణాల పరిస్థితి కూడా అదే రీతిలో ఉంది. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకం ద్వారా ఈ ఏడాది కేవలం 262 సంఘాలకు రూ.2 కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. మరో పక్క ఈ రుణాలకు కూడా ప్రస్తుతం 14 శాతం వడ్డీ వసూలు చేస్తుండడం వీరికి పెనుభారంగా పరిణమించింది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు పాపం ‘బాబు’ మాయమాటలు నమ్మి డ్వాక్రా మహిళలు పదినెలలుగా వాయిదాలు చెల్లించడం మానేశారు. దీంతో వడ్డీ లేని రుణం కాదు కదా కనీసం పావలా వడ్డీ రాయితీని కూడా కోల్పోయారు. ఇప్పుడు 14 శాతం వడ్డీతో బకాయి మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సర్కార్ గద్దెనెక్కి ఆర్నెల్లు దాటింది. రుణాలు మాఫీ కాలేదు.. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ జమకాలేదు. ఒక పక్క బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఈ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త రుణాలు మంజూరు చేయబోమని బ్యాంకర్లు తెగే సి చెబుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో డ్వాక్రా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నారు. ఉచ్చు బిగిస్తున్న మైక్రో సంఘాలు ఇన్నాళ్లు బ్యాంకర్లు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. దీంతో మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కాళ్లావేళ్లాపడినా వీరి వడ్డీ బాదుడుకు జడిసి ఎవరూ వీరి వద్ద రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల నిమిత్తం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వారికి అవసరం ఉన్నా లేకున్నా ఇళ్లకు వెళ్లి మరీ రుణాలందించడం మొదలు పెట్టారు. ఐదురూపాయలు..పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా తమ అవసరాల కోసం వీర్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బేషరతుగా రుణమాఫీ అమలుచేయాలని లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమకు ఆత్మహత్యలే శరణ్యమని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా రుణమాఫీ చేయడం లేదా..నిర్దిష్ట గడువులోగా రూ. లక్ష చొప్పున మ్యాచింగ్ గ్రాంట్యినా రిలీజ్ చేయాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రూ.2లక్షలు బాకీ ఉన్నాం డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఐదు నెలలు వాయిదాలు చెల్లించలేదు. దీనివల్ల మా గ్రూ పులో ఇంకా ఇచ్చిన రుణంలో అస లు రూ.2 లక్షలు ఉండిపోయింది. దీనికి రూ.30 వేల వరకు వడ్డీ పడుతోందని చెబుతున్నారు. ఇలా అయి తే బయట వడ్డీలకు తెచ్చి రుణాలు చెల్లించడమే. -కాగిత అంబిక, మాకవరపాలెం -
బాబూ.. చేతగాకపోతే గద్దె దిగండి
‘నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించి అధికారంలోకి వచ్చారు. తీరా ఇపుడు బ్యాంకర్లు సహకరించడం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే నెపంతో ఆ హామీలనే మాఫీ చేయూలనుకుంటున్నారు. పేదలనిలా మోసం చేస్తే ఆ పాపం ఊరకేపోదు.. ప్రభుత్వానికి ఉసురు తగిలి తీరుతుంది. చేతగాదని తెలిసీ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పడం క్షమార్షం కాద’ని మహిళలు, రైతులు వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘రైతులు కష్టాల్లో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారు. గద్దెనెక్కి ఐదునెలలు దాటుతున్నా రుణమాఫీ చేయలేదు. లేనిపోని సాకులు చెబుతున్నారు. రుణమాఫీ ఇక అమలు కాదని జిల్లా వ్యాప్తంగా ఈ ఐదు నెలల్లో 59 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ సర్కారు హత్యలే. వీటికి చంద్రబాబే బాధ్యత వహించాల’ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించారు. రైతు, డ్వాక్రా రుణాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏఒక్క హామీని చంద్రబాబు సర్కారు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలతో తహశీల్దార్ కార్యాలయాలు హోరెత్తారుు. రైతులు, మహిళలు, విద్యార్థులు భారీగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. సీఎం చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. ధర్నాల అనంతరం అన్నిచోట్ల తహశీల్దార్లకు వినతిపత్రాలను సమర్పించారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతో సంబంధం లేకుండా అనంతపురం జిల్లాలోని రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని గురునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పడం వల్ల డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమయ్యాయని ఆయన విమర్శించారు. రైతులు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాను కోల్పోయారన్నారు. బ్యాంకులతో కూడా రైతులు, మహిళలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. కదిరిలో ఎమ్మెల్యే చాంద్‌బాషా ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మాటమీద నిలబడిన వైఎస్ మహానేతగా చరిత్రలో నిలిచిపోతే.. మాట తప్పిన చంద్రబాబు చరిత్రహీనుడయ్యారని చాంద్‌బాషా విమర్శించారు. పెనుకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రుణమాఫీ సాధ్యం కాదని తెలిసి కూడా చంద్రబాబు అబద్ధపు హామీలతో గద్దెక్కారని, ఇప్పడు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 99 అబద్ధాలు ఆడి చంద్రబాబు సీఎం అయితే.. రుణాలు మాఫీ చేయలేనని ఒక్క నిజం చెప్పి వైఎస్ జగన్ అధికారానికి దూరమయ్యారని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు నిలుపుకోకపోతే టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రాప్తాడు, అనంతపురం, కనగానపల్లి ధర్నాల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసి తీరుతానని ఢాంబీకాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదంటూ మాట మారుస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి నిలదీశారు. సోషల్ మీడియాలో టీడీపీ మేనిఫెస్టోను కూడా తొలగించారంటే.. ఏస్థాయికి దిగజారుతున్నారో ఇట్టే తెలుస్తోందన్నారు. హిందూపురం ధర్నాలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడారు. రుణమాఫీ చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలన్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాలకృష్ణ చుట్టపుచూపుగా జిల్లాకు రావడం మాని ఇక్కడి కష్టాలను బాబుకు వివరించి.. అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు దద్దమ్మలని, రుణమాఫీ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని మండిపడ్డారు. పుట్టపర్తి ధర్నాలో సమన్వయకర్త సోమశేఖరెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన బాబును చరిత్ర క్షమించదన్నారు. శింగనమలలో సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహిళలను నమ్మించి మోసం చేసిన బాబుకు మహిళల ఉసురు తగలక తప్పదని ఆమె శాపనార్థాలు పెట్టారు. తాడిపత్రిలో సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మాని, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగించి భయానక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. చంద్రబాబు ఎన్నికల హామీలను నిలుపుకోకపోతే ప్రజలు చేతలతో సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. మడకశిరలో సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ మోసం చేయడంలో తనకు తానేసాటి అని చంద్రబాబు నిరూపించుకున్నారని విమర్శించారు. -
ఎందుకో ఈ అలక్ష్యం!
ఇచ్చేది గోరంత.. చూపించేది కొండంత అన్నట్లుంది జిల్లాలో వ్యవసాయ రుణాల పరి స్థితి. బ్యాంకర్లు కొత్తగా వ్యవసాయ రుణాలివ్వకున్నా.. లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపించే విషయంలో మాత్రం ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి అర్ధమాసాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాపకం కోసం వారు ఎంత వరకు ఆరాట పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మాఫీ.. కిరికిరి * తక్కువ రుణాలిచ్చినా.. లక్ష్యం చేరినట్లు చూపిస్తున్న బ్యాంకర్లు * రెన్యువల్‌తో కలిపినా 60 శాతం మందికే రుణాలు * తొలి అర్ధ సంవత్సరంలో ఇదీ జిల్లాలో పరిస్థితి ఒంగోలు: రైతు రుణమాఫీ పేరిట అన్నదాతలు గందరగోళంలోకి నెట్టేసిన టీడీపీ ప్రభుత్వం.. ఈ విషయంలో మాఫీ భారం ఎంత తగ్గినా తగ్గినట్టేనని శతథా ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ అంగీకరించకపోవడంతో రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటుచేసి తద్వారా మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మాఫీని ఎగ్గొట్టేందుకు పలు ఆంక్షలు విధించి రైతు కుటుంబాల్లో తీవ్రమైన సంక్షోభాన్నే తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న బ్యాంకర్లు ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు సరికొత్త ప్లాన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షల చట్రంలో రైతన్నలు వ్యవసాయ రుణం కావాలని బ్యాంకర్ల వద్దకు వెళ్తే‘పొలం ఏ ఊళ్లో ఉందో అక్కడే రుణం తీసుకోవాల’ని ంటూ సరికొత్త ఆంక్షలు పెడుతున్నారు. ఇవన్నీ తిరగలేక రైతు కాస్తా ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నాడు. అయినా బ్యాంకర్లు మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం రికార్డుల పరంగా ముందే ఉండడం గమన్హాం. కౌలు రైతులకు రుణాలు నిల్ సాధారణంగా ఈ ఆరు నెలల కాలంలో ఖరీఫ్ సాగే ప్రధానం. కానీ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకాారం సాగు మొత్తం 64 శాతం మాత్రమే. ఇందులో కౌలుదారులు 20శాతంు. వారికి రుణాలు ఇచ్చిన దాఖలాలే జిల్లాలో లేవు. మిగిలిన 44 శాతంలోనూ చాలామంది రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. రుణం కడతారా.. బంగారం వేలం వేయమంటారా అంటూ బ్యాంకర్లు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. తాము వ్యవసాయ రుణాలిస్తున్నామని చెబుతున్నా.. వాస్తవానికి వ్యవసాయానికి బంగారు ఆభరణాలపై ఇవ్వడాన్ని నిలిపివేశారు. కొత్తగా పట్టుమని 15 శాతం మందికి కూడా రుణాలిచ్చిన దాఖలాలు లేవు. రెన్యువల్స్‌లో మతలబు! ఈ ఏడాది వ్యవసాయ రుణ లక్షాన్ని చేరుకునేందుకు బ్యాంకర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతు రుణాన్ని రెన్యువల్ చేసి పెద్ద మొత్తంలో రుణాలిచ్చినట్లు లెక్కలు చెప్పేవి. ఇప్పుడు వాణిజ్య, గ్రామీణ బ్యాంకులు కూడా అదే పంథా అనుసరించడం గమనార్హం. దాని ప్రకారం గతంలో రైతులు తీసుకున్న బంగారపు రుణాలను రద్దుచేసి, తాజాగా వాటికి రుణాలు ఇచ్చినట్లుగా బ్యాంకర్లు వారి ఖాతాలను రెన్యువల్ చేశారు. లేని పక్షంలో బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరికలు చేస్తుండడంతో రైతులు వడ్డీ, అసలులో కొంతమొత్తం కట్టి తాత్కాలికంగా ఉపశమనం పొందగా... బ్యాంకర్లు మాత్రం ఈ ఏడాది ఖరీఫ్‌లో 74.67 శాతం ఖరీఫ్ రుణాలిచ్చినట్లు ప్రకటిస్తుండడం విశేషం. -
బ్యాంకర్లతో ముగిసిన చంద్రబాబు భేటీ
-
'20 శాతం మేరకు కొత్త లోన్లు ఇస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతుల రుణమాఫీ, కొత్త రుణాల గురించి చంద్రబాబు వారితో చర్చించారు. కాగా రైతు సాధికారిక కార్పొరేషన్‌కు ఇచ్చే నిధుల ఆధారంగానే కొత్త రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకర్లు చంద్రబాబుకు స్పష్టం చేశారు. 20 శాతం మేరకే కొత్త లోన్లు ఇస్తామని బ్యాంకర్లు చెప్పారు. రైతులకు అదనంగా రుణాలు మంజూరు చేయాలని చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతు రుణమాఫీ చేయనున్నట్టు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రైతుల రుణాలను ఇంకా మాఫీ చేయలేదు. విడతల వారీగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. -
బ్యాంకర్లతో సమావేశం కానున్న చంద్రబాబు