Guntur District News
-
దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలి
జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజ గుంటూరు వెస్ట్: దివ్యాంగుల సమస్యలపై అధికారులు దృష్టి సారించి వారి ఇబ్బందులను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వికలాంగుల కమిటి సమావేశంలో జేసీ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈసందర్భంగా వివిధ దివ్యాంగ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్సులు, మున్సిపల్ కాంప్లెక్సుల్లో దుకాణాలు, స్టాల్స్ కేటాయింపులో దివ్యాంగులకు అవకాశాలు కల్పించాలన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వంద శాతం వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా బస్సు పాస్ ఇవ్వాలన్నారు. దివ్యాంగుల ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వారి కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. అవసరం మేరకు ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని కోరారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగి సూరిటీ అడుగుతున్నారని, దీన్ని కొంత ఆలోచించాలని పేర్కొన్నారు. సమావేశంలో వికలాంగుల సంక్షేమ అధికారి సువార్త, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి సంఘటన శుక్రవారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో హుబ్లి ఎక్స్‌ప్రెస్ కింద పడి పెద్దచెరువు ప్రాంతానికి చెందిన గాలి థామస్(70) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పైలెట్ సమాచారాన్ని నరసరావుపేట రైల్వే పోలీసులకు అందించారు. ఎస్ఐ శ్రీనివాసనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు
కొరిటెపాడు(గుంటూరు): పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రీయ పదార్థం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై వీటిని అందిస్తోంది. తాజాగా రాయితీ ధరలను ఖరారు చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా(గుంటూరు, పల్నాడు, బాపట్ల)కు ఈ ఏడాది 9,536 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. అందులో గుంటూరు జిల్లాకు 301 క్వింటాళ్ల జీలుగ, 436 క్వింటాళ్లు జనుము, 967 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 1,704 క్వింటాళ్లు కేటాయించారు. పల్నాడు జిల్లాకు 2,607 క్వింటాళ్లు జీలుగ, 1,559 క్వింటాళ్లు జనుము, 1,178 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 5,544 క్వింటాళ్లు కేటాయించారు. అలాగే బాపట్ల జిల్లాకు 856 క్వింటాళ్లు జీలుగ, 853 క్వింటాళ్లు జనుము, 779 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 2,488 క్విటాళ్లు కేటాయించారు. వీటిని 50 శాతం రాయితీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. గరిష్టంగా ఐదు బ్యాగులు జీలుగ విత్తనాలు క్వింటా పూర్తి ధర రూ.12,300 కాగా, 50 శాతం రాయితీతో రూ.6,150 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే క్వింటా జనుము విత్తనాల పూర్తి ధర రూ.10,900 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.5,450 చెల్లించాలి. పిల్లిపెసర క్వింటా పూర్తి ధర రూ.18 వేలు కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.9 వేలు చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగ, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్ కింద ఎకరాలోపు రైతులకు ఒక బ్యాగ్, రెండు ఎకరాలకు రెండు బ్యాగులు, మూడు ఎకరాలకు మూడు బ్యాగ్‌లు, నాలుగు ఎకరాలున్న రైతులకు నాలుగు బ్యాగ్‌లు, ఐదు ఎకరాలు, అంత కన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగుల పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో నాలుగు కిలోల చొప్పున జీలుగ, జనుము, రెండు కిలోల పిల్లిపెసర ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్ కిట్ పూర్తి ధర రూ.1,296 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.648లు చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే)లో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ సీడ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా మేనేజర్ పి.సుమలత శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9,536 క్వింటాళ్ల కేటాయింపు 50 శాతం రాయితీతో రైతులకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు -
కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి
వినుకొండ: మిరపకాయల కూలీల ఆటో తిరబడి ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏనుగుపాలెం సమీపంలో జరిగింది. ఉమ్మడివరం నుంచి నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ప్రతిరోజు కూలీలు వెళ్తూ ఉంటారు. ఉదయం ఏనుగుపాలెం సమీపంలో ఆటో తిరగబడింది. ఈ ప్రమాదంలో జోజమ్మ (60) మృతి చెందింది. మార్తమ్మ, వెంకాయమ్మ, అంకమ్మ, కోటమ్మ, మరియమ్మ, ఆదెమ్మ తదితర ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో వారిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.మరో ఏడుగురికి తీవ్రగాయాలు -
క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా రేపల్లె రూరల్: క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా అన్నారు. అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రేపల్లె క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుని వాఖ్యాన్ని ప్రజలకు చేర్చి పరిశుద్దులను చేసే పాస్టర్లపై దాడులకు పాల్పడటం అమానుషమని పేర్కొన్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు చిత్రాల ఓబేదు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అన్నికోణాలలో సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో పాస్టర్లపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ కుటుంబ సభ్యులకు క్రైస్తవ సంఘాలు అన్ని వేళలా అండగా నిలుస్తాయని అన్నారు. ర్యాలీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, నెహ్రు బొమ్మ సెంటరుల మీదగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్, పోలీసుస్టేషన్లలో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు గుజ్జర్లమూడి ప్రశాంత్‌కుమార్, గుజ్జర్లమూడి ఇమ్మానుయేలు, సముద్రాల ప్రభుకిరణ్, షేక్ ఖుద్దూష్, ఆలా రాజ్‌పాల్, జాలాది మునియ్య, జాలాది సునీల్, వివిధ చర్చిల పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
డీఆర్ఎం రామకృష్ణ బదిలీ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డీఆర్ఎం ఎం.రామకృష్ణ బదిలీ అయ్యారు. ఆయన నైరుతీ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. స్థానిక పట్టాభిపురం రైల్వే డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా డివిజన్ ఏడీఆర్ఎం సైమన్ మాట్లాడుతూ రామకృష్ణ కృషిని కొనియాడారు. డీఆర్ఎం రామకృష్ణ మాట్లాడుతూ సంతృప్తికరంగా విధులు నిర్వర్తించినట్టు వివరించారు. అనంతరం రామకృష్ణను ఏడీఆర్ఎం సైమన్, సీనియర్ డీపీఓ షహబాజ్ హానూర్, సీనియర్ డీపీఓ రత్నాకర్, సీనియర్ డీఎస్టీఈ మద్దాలి రవికిరణ్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, యూనియన్ నాయకులు, సంఘ్ యూనియన్ తదితరులు సత్కరించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో శుక్రవారం స్థానిక ఎన్జీఓ రిక్రియేషన్ హాల్లో జరిగింది. సమావేశానికి జిల్లా జేఏసీ చైర్మన్, సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్, రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ. 25వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఎన్జీఓ సంఘ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు సర్కారు రూ. 7,200 కోట్లు విడుదల చేసిందని వివరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శిగా శ్యామ్ సుందర్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుకుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీవాణి, మహిళా సంయుక్త కార్యదర్శిగా విజయలక్ష్మి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ జానీ భాష, కృష్ణకిషోర్, విజయబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగూర్ షరీఫ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, పివి నాగేశ్వరరావు, ధనుంజయ నాయక్, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి గుంటూరు నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు సూరి, కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన మహిళా విభాగం నాయకురాలు రాధా రాణిని, బదిలీపై వెళ్లిన మహిళా సంఘం నాయకురాళ్ళు శివజ్యోతి, లక్ష్మీరమ్యలను సత్కరించారు. -
సఖీ నివాస్ ప్రారంభం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నగరంపాలెంలోని మహిళా ప్రాంగణంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ (సఖీ నివాస్)ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటీజన్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారి, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం రూ. 2.27 కోట్లతో సఖీ నివాస్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఐసీడియస్ పీడీ కె.విజయలక్ష్మీ, ఆర్జెడి జయలక్ష్మి, మహిళా సహకార ఆర్థిక సంస్థ జిల్లా మేనేజర్ రమణశ్రీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజ, గుంటూరు పశ్చిమ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కేఎల్‌యూలో అంతర్జాతీయ మహిళా సదస్సు
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా సమ్మిట్(సదస్సు)ను ఉమెన్ డెవలప్మెంట్సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు మహిళా మణులతో కలిసి ప్రో.చాన్సలర్ డాక్టర్ కె.ఎస్.జగన్నాథరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సదస్సుకు గుంటూరుకు చెందిన సమగ్ర ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కె.నీరజ, యూఎస్ఏ సాడ్ డియగో యూనివర్శిటీ డీన్ డాక్టర్ మహాశ్వేత సర్కార్, కాసా ఎలైట్ డైరెక్టర్ ప్రీతి కొరటాల, రాష్ట్ర విపత్తుల శాఖ మేనేజర్ యశశ్విని పెద్ది, చినోయ్ డిజైన్ మేనేజింగ్ డైరెక్టర్ సాందీపని వజ్జి, అఖిల భారత సైకలాజికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కె.లక్ష్మి తులసిబాయి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బొల్లినేని కీర్తి, హోప్ విన్ ఆస్పత్రుల వ్యవస్ధాపక సీఈఓ ఎండీ షమా సుల్తానా, ది స్టెమ్ మేకర్ వ్యవస్థాపక సీఈఓ ఆష క్రాంతి నందిగం, ఏపీ హై కోర్టు న్యాయవాది అనుపమ దార్ల, కేఆర్ఆర్ ఇన్నోవేషన్ డైరెక్టర్ సిఇవో రష్మితరావు, లిటిల్ బ్లాక్ స్టార్ కో ఫౌండర్ తిరుమల శెట్టి మేఘన, సేఫ్, ఫన్ టైమ్ ఉపాధ్యక్షురాలు సుమ అట్లూరి ముఖ్యఅతిథులుగా హాజరై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏడు అంశాలపై బృందాలుగా ఏర్పడి చర్చలు జరిపారు. మహిళా సమ్మిట్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ రూతు రమ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కార్యదర్శి కోనేరు శివకాంచనలత తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు సమాధానం చెప్పాలి
కేంద్రంలోని బీజేపీ సర్కారు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భయమెందుకు? ఎన్నికల ముందు ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది తగదు. తక్షణమే వక్ఫ్ సవరణ బిల్లుకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు సమాధానం చెప్పాలి. షేక్.మస్తాన్ వలి, కాంగ్రెస్‌నేత, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే -
‘బర్డ్‌ఫ్లూ మృతి’ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే
నరసరావుపేట: బర్డ్‌ఫ్లూ వ్యాధితో రెండేళ్ల చిన్నారి ఆరాధ్య మృతి నేపథ్యంలో వెంటనే పల్నాడు జిల్లాను బర్డ్‌ప్లూ ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ప్రకటించాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్య ఫలితమేనని అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలయ్యనగర్ ఒకటో లైనులో ఉండే ఆరాధ్య కుటుంబాన్ని కేంద్ర బృందం పరిశీలించే సమయంలో ఆయన కూడా అక్కడకు వచ్చారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు పెండ్యాల గోపీ, జ్యోతిలను అడిగి తెలుసుకున్నారు. వారికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలిక బర్డ్‌ప్లూతో చనిపోవటం బాధాకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అవయవాలు పనిచేయక పోవడం వల్ల బాలిక చనిపోయిందని నిర్ధారించారన్నారు. మొదటి బర్డ్‌ప్లూ కేసు 2021లో మహారాష్ట్రలో నమోదుకాగా, తిరిగి రెండో కేసు నరసరావుపేటలో నమోదు కావడం బాధాకరమైన విషయమన్నారు. జిల్లాను బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ఎందుకు ప్రకటించలేదని గోపిరెడ్డి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
గుంటూరు
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వైభవంగా మహా కుంభాభిషేకం పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలగ పాలెంలో ఉన్న కోదండ రామాలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రిఫ్రిజిరేటర్ బహూకరణ పిడుగురాళ్ల: పట్టణ పోలీస్ స్టేషన్‌కు రిఫ్రిజిరేటర్‌ను తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల తరఫున శుక్రవారం అందించారు. డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పెద్దలందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ నూరిఫాతిమా డిమాండ్ చేశారు. స్ధానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం ఐక్యవేదిక, ఆవాజ్ కమిటీ, పలు ముస్లిం సంఘాలన్నీ ఐక్యంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టాయి. ముందుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు ప్రదర్శనగా బయలుదేరారు. మార్కెట్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ముస్లింలు చంద్రబాబుడౌన్ డౌన్, నరేంద్రమోదీ డౌన్ డౌన్, వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పెమ్మసాని రాజీనామా చేయాలి అనంతరం నూరిఫాతిమా మాట్లాడుతూ ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీల హక్కులకు భంగం కలిగితే రాజీనామాలకూ వెనకాడబోమని గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారని, ఇప్పుడు వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై ఎందుకు మాట్లడడం లేదని నిలదీశారు. పెమ్మసాని తక్షణం రాజీనామా చేసి ముస్లింల పక్షాన పోరాడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వక్ఫ్‌బోర్డు బిల్లుపై తక్షణం స్పందించాలని, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. గుంటూరు తూర్పులో ముస్లింల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఇంట్లో కూర్చోవడం సరికాదని, ముస్లింల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పలువురు ముస్లిం ప్రముఖులు వక్ఫ్ సవరణ బిల్లుపై గళమెత్తారు. టీడీపీ, జనసేన ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాలు, వామ పక్ష నాయకులు, మతపెద్దలు, ముస్లిం సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 7న్యూస్‌రీల్ బిల్లుపై ముస్లింల ఆగ్రహం పోరాటానికి సిద్ధం కేంద్రమంత్రి పెమ్మసాని రాజీనామా చేయాలని డిమాండ్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటే కుదరదని హెచ్చరిక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అన్యాయం. పార్లమెంటులో దీనిని ఆమోదించుకోవడం తగదు. మోదీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష కట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 శాతం వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు ఈ బిల్లు వల్ల కలెక్టర్ల ద్వారా వక్ఫ్ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – షేక్ వలి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాబు, పవన్ ముస్లిం ద్రోహులు ముస్లింలపై కక్ష కట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చింది. తాజాగా వక్ఫ్ సవరణ బిల్లును కుట్రపూరితంగా ఆమోదించుకుంది. ముస్లింలు బ్రిటిష్‌వారి తూటాలకే భయపడ లేదు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదు. ఇప్పుడు దేశం కోసం అంటూ బీజేపీ కాకమ్మ కబుర్లు చెబుతోంది. రాష్ట్రంలో ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి తగిన బుద్ధి చెబుతాం. ముస్లిం ద్రోహులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మిగిలిపోతారు. – గులాం రసూల్, వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు -
మిర్చి ఘాటు చూపిస్తాం
కొరిటెపాడు(గుంటూరు): మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు మిర్చి యార్డులో ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన క్వింటా మిర్చి ధర రూ.11,781లు మోసపూరితంగా ఉందని ధ్వజమెత్తారు. రైతులు క్వింటా మిర్చి పండించడానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలకు పైగా ఖర్చు అవుతుండగా, దీనిలో సగం మద్దతు ధర కల్పించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల నుంచి మిర్చిని నేరుగా కొనుగోలు చేస్తే రైతులు, కౌలు రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 2019 నుంచి 2023 వరకు క్వింటా మిర్చి రూ.18 వేలు నుంచి రూ.27 వేల వరకు ధర వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కేవలం రూ.7 వేలు నుంచి రూ.13 వేలు లోపు ధర పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే ధరలు కొనసాగితే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ధరల స్థిరీకరణ కింద కేవలం రూ.300 కోట్లు కేటాయించడం చూస్తే రైతులంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదని స్పష్టమవుతోందని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.ఐదువేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముందుగా నరసరావుపేట రోడ్ వైపు ప్రధాన గేటు నుంచి నినాదాలు చేస్తూ మిర్చి యార్డు కార్యదర్శి చాంబర్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యార్డు కార్యదర్శి ఎ.చంద్రికకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన యార్డు కార్యదర్శి చంద్రిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలు రాలేదని చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులను ఆదుకోకపోతే త్వరలో మిర్చి యార్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల గుంటూరు, పల్నాడు జిల్లాల నాయకులు బైరగాని శ్రీనివాసరావు, కె.రామారావు, జి.బాలకృష్ణ, బి.రామకృష్ణ, బిక్కి శ్రీనివాస్, జి.పిచ్చారావు, ఈవూరి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదుకోకుంటే త్వరలో యార్డు ముట్టడి ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల హెచ్చరిక -
మొరాయిస్తున్న సాగర్ కుడికాలువ గేట్లు
మూడేళ్లకే మరమ్మతులకు లోనైన 8వ గేటువిజయపురిసౌత్: సుమారుగా 10.50లక్షల ఎకరాలకు సాగునీరందించే కుడి కాలువ గేట్లు మూడేళ్లకే మరమ్మతులకు లోనయ్యాయి. 8వ గేటు కిందికి దిగకపోవడంతో గురువారం ఎమర్జెన్సీ గేటు ద్వారా దానిని మూసివేసి 2వ గేటు ద్వారా కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు మూడు గేట్లు ఉండగా, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు 9 గేట్లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కుడి కాల్వ 9వ గేటు కిందికి, పైకి జరుగకపోవడంతో బలవంతగా కిందికి దింపేందుకు ప్రయత్నం చేయగా ఊడిపోయి కాలువలోకి కొట్టుకు పోయింది. ఆ గేటును అమర్చకపోవటంతో చాలా రోజులు వరకు నీటి విడుదల కొనసాగింది. ఆ సమయంలోనే కుడి, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దగల తూములకు కొత్తగేట్లకు టెండర్లు పిలిచారు. 9వ గేటు మరమ్మతులు చేశాక అదే కంపెనీకి పనులు అప్పగించారు. కుడి హెడ్ రెగ్యులేటర్ గేట్లకు తొమ్మిదింటికిగాను రూ.3.30కోట్లు, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ మూడు గేట్లకు రూ.2.50కోట్లు, సూట్ గేటుకు రూ.1.50కోట్లకు 2022లో టెండర్లు పిలిచి పనులు చేయించారు. అవికాస్త అప్పుడే మరమ్మతులకు గురైనట్లు సమాచారం. విద్యుదుత్పాదన కేంఽద్రం ద్వారా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో హెడ్‌రెగ్యులేటర్ గేట్లు అంతగా వినియోగించ లేదు. నీటి అవసరాల మేరకు ఎక్కువగా 2,9వ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇటీవలే ఈ రెండు గేట్లు మూసివేసి 8వగేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం దానిని మూసేందుకు ప్రయత్నించగా కిందికి దిగలేదు. దీంతో ఇంజినీర్లంత శ్రమించి ఎట్టకేలకు మూసివేశారు. ప్రస్తుతం 2వ గేటు ద్వారా 3,031 క్యూసెక్కులు కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. బుధవారం వరకు 4050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
దమ్ముంటే పెమ్మసాని రాజీనామా చేయాలి
ఇచ్చిన మాటకు కట్టుబడాలి ● వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు తెలపడం సిగ్గుచేటు ● వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా ధ్వజం పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): మైనార్టీల స్వేచ్ఛకు భంగం కలిగితే తక్షణం రాజీనామా చేస్తానని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దమ్ముంటే ఇప్పుడు తక్షణం మాట నిలబెట్టుకోవాలని వైఎస్సార్ సీపీ గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆమె గురువారం గుంటూరు మంగళదాస్ నగర్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు బిల్లు ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తారు. మోసం చేయడంలో గురువు చంద్రబాబును పెమ్మసాని అనుసరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పెమ్మసాని చేసిన ఉపన్యాసం వీడియోను ప్రదర్శించారు. వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, జనసేన మైనార్టీలకు ద్రోహం చేశాయని దుయ్యబట్టారు. వక్ఫ్‌బోర్డులో నాన్ మైనార్టీ సభ్యుడిని పెట్టే అంశం వల్ల ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకించడంతోపాటు, పార్లమెంట్లో కూడా సుస్పష్టంగా ఎంపీల చేత చెప్పించిన అంశాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ముస్లింలకు ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఈవీఎం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నోరు మెదపరేంటీ..! మైనార్టీలకు తీరని ద్రోహం జరుగుతుంటే, మైనార్టీ ఎమ్మెల్యే అయిన ఎం.డీ.నసీర్ అహ్మద్ నోరు మెదపకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఫాతిమా అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిచారు కనుకనే ఆయనకు మైనార్టీల కష్టాలు ఏమాత్రం తెలియవన్నారు. ఈద్గా వద్ద దీనిపై చర్చించేందుకు పలువురు సుముఖత చూపిన నేపథ్యంలో పక్కన పేటీఎం బ్యాచ్‌ను పెట్టుకుని ఏ ఒక్కరినీ రానీయకుండా నసీర్ అడ్డుకున్నారని విమర్శించారు. మైనార్టీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కులమతాలకతీతంగా అందరూ మైనార్టీలకు అండగా నిలవాలని ఫాతిమా కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నేతలు, పలువురు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ వెబ్సైట్లో టీచర్ల సీనియార్టీ జాబితా
ఈనెల 11 వరకు అభ్యంతరాల స్వీకరణగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను డీఈవోజీఎన్‌టీ.బ్లాగ్స్పాట్.కామ్‌లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు వెబ్సైట్లో ఉంచిన సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈనెల 11వ తేదీలోపు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. సౌపాడులో వీధి కుక్కల దాడి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు గుంటూరు రూరల్: వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామంలో గురువారం వీధి కుక్కలు దాడిచేసి ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన ఎరుబోయిన గంగయ్య, ఇస్సాకు, తాటి మస్తాను, తాటి శివయ్య, నాగనజీమా, షేక్ బుల్లోడు, పరమేశ్వరరావు, గండు సాంబయ్యలను 108లో గుంటూరుకు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఓ బాలుడు ఉన్నారు. ఇటీవల గ్రామాల్లో శునకాల బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత శనివారం వట్టిచెరుకూరులో రైతు మక్కెన సుబ్బారావుకు చెందిన బర్రెదూడపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇప్పటికీ దూడ పరిస్థితి విషమంగానే ఉంది. ఇప్పటికై నా అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య పారా వలంటీర్లు వారధులు 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ నరసరావుపేటటౌన్: న్యాయవ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ పేర్కొన్నారు. గురువారం అదనపు జిల్లా కోర్డు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. పారా లీగల్ వలంటీర్ల విధులు, నైతికత, రాతపూర్వక నైపుణ్యం, రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను, చట్టపరమైన సలహాలు ఇచ్చే విధివిధానాలను గురించి వివరించారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 10వేల మెట్రిక్ టన్నులు నరసరావుపేట: రబీ సీజన్లో ధాన్యం సేకరణ 10వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణ సమావేశం వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. రబీలో 2024–25 సంవత్సరానికి 234 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 20,561 హెక్టార్లలో వరిసాగు చేశారన్నారు. దీనిలో 1,32,773 ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటా రూ.2320లు, సాధారణ రకం క్వింటా రూ.2300లుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే ఈ–పంట ద్వారా పంటను నమోదుచేయించి 100శాతం ఈకేవైసీ చేయించాలన్నారు. మాయిశ్చర్ మీటర్లను త్వరగా కాలిబ్రేషన్ చేయించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నారదమునిని ఆదేశించారు. రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లు సామర్ధ్యం, ఇతర వివరాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలన్నారు. -
ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వండి
కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: జిల్లాలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలు నిర్దేశించిన సమయంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు బోట్స్‌మెన్ సొసైటీకి కేటాయించే రాయిపూడి డి–సిల్టేషన్ పాయింట్ పర్యవేక్షణ ఏ శాఖ పరిదిలోకి వస్తుందో రాష్ట్ర మైనింగ్ శాఖాధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. బొమ్మువారి పాలెం–16 ఓపెన్ శాండ్ రీచ్ మైనింగ్ ప్లాన్‌ను రూపొందించి టెండర్ ప్రక్రియ సిద్ధం చేయాలన్నారు. గుండెమెడ ఓపెన్ శాండ్ రీచ్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బిడ్‌ను ఆహ్వానించి ఈ నెల 16నాటికి అర్హత గల బిడ్డర్‌కు కేటాయించాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలో ఇసుక నిల్వల కోసం హైడ్రో గ్రాఫిక్ సర్వే కోసం ఈఈ, కేసీ కెనాల్ డివిజన్‌కు జిల్లా వాటా కింద రూ.24 లక్షలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక సరఫరా చేసే కేంద్రాల వద్ద పర్యవేక్షణ కోసం సంబంధిత తహసీల్దార్ల ద్వారా రెవెన్యూ, మైనింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి నాగిని, తదితర అధికారులు పాల్గొన్నారు. -
20 కిలోల గంజాయి స్వాధీనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాడీపేట 1/1వ లైన్లో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గురువారం రాత్రి జరిగింది. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. ఏటి అగ్రహారానికి చెందిన పైర్ధ కిరణ్‌బాబు బ్రాడీపేట 1/1 లైన్‌లోని నగరపాలక సంస్థ సులబ్ కాంప్లెక్స్‌లో పని చేసే బిహార్‌కు చెందిన గుల్షన్కుమార్కు గంజాయి విక్రయించి వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అరండల్‌పేట సీఐ వీరాస్వామి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌బాబు వద్ద బస్తాలో 20.620 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్టేషన్‌కు తరలించారు. గంజాయి కొనుగోలు చేసిన బిహార్‌కు చెందిన గుల్షన్ కుమార్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కిరణ్బాబుపై సుమారు 39కి పైగా గంజాయి, దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిరణ్‌బాబు డిసెంబర్లో బాపట్ల సబ్‌జైల్ నుంచి విడుదలై బయటకు వచ్చాడని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. కిరణ్‌బాబు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నాడు? నగరంలో ఎవరెవరికి విక్రయిస్తున్నాడు అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. -
యార్డుకు 1,25,074 మిర్చి బస్తాలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,25,074 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,23,828 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,600 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 57,307 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి: వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి నిత్యన్నదానానికి కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్ష విరాళాన్ని గురువారం సమర్పించారు.కొనసాగుతున్న సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురు వారం కొనసాగింది. పలు విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. 7 -
కన్నకొడుకే కాలయముడు
● మతి స్థిమితం లేని తల్లిని చంపిన కొడుకు ● మంచంపై నిద్రిస్తుండగా రోకలి బండతో మోది హత్య బొల్లాపల్లి: కన్న కొడుకు చేతిలో జన్మనిచ్చిన తల్లి దారుణంగా హత్యకు గురైన సంఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో గురువారం జరిగింది. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్, బండ్లమోటు ఎస్ఐ ఎ.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వెల్లటూరు గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య, గజ్జ సోమమ్మ (67) దంపతులకు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ సంతానం. చిన్న కుమారుడు బాదరయ్య అవివాహితుడు కావడంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మిగిలిన సంతానంలో అందరికీ వివాహాలై వేర్వేరుగా ఉంటున్నారు. మతిస్థిమితం లేని తల్లి ఎప్పుడు గొణుగుతుండడం, తనకు వివాహం కాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న నిందితుడు బాదరయ్య తెల్లవారుజామున మంచం మీద పడుకుని నిద్రిస్తున్న తల్లిని రోకలిబండతో కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు గజ్జ శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అందజేశారు. -
టెన్త్ మూల్యాంకనం ప్రారంభం
● విధులకు 945 మంది ఉపాధ్యాయులు ● మినహాయింపు కోరుతూ డీఈఓ వద్దకు క్యూ కట్టిన టీచర్లు ● షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించడంతో విధుల్లో చేరిక గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో క్యాంపు అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అధ్యక్షతన జరిగిన మూల్యాంకనం విధులకు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈనెల 9 వరకు జరగనున్న వాల్యూయేషన్ విధులకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో కొందరు గురువారం వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేసేందుకు వచ్చారు. డీఈఓ సీరియస్ అయితే చాలామంది విధుల నుంచి మినహాయింపు కోరడంపై డీఈఓ సీవీ రేణుక అసహనం వ్యక్తం చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ఆర్డర్లు పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరని పక్షంలో వారిని తన అనుమతి లేకుండా పాఠశాలల్లో విధులకు చేర్చుకోరాదని హెచ్ఎంలను ఆదేశించారు. సహేతుకమైన కారణాలు లేకుండా విధుల నుంచి తప్పించుకోవాలని చూసే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. డీఈఓ హెచ్చరికలతో దిగి వచ్చిన ఉపాధ్యాయులు ఎట్టకేలకు స్పాట్ కేంద్రంలో రిపోర్టు చేశారు. చీఫ్ ఎగ్జామినర్లు 105, ఎగ్జామినర్లు 630, స్పోషల్ అసిస్టెంట్లు 210 మంది చొప్పున విధులకు హాజరయ్యారు. దూరవిద్య ఇంటర్ ఆన్సర్ షీట్లకు ఇదే ప్రాంగణంలో మూల్యాంకనాన్ని ప్రారంభించారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వసతులు కల్పించినట్టు డీఈఓ సీవీ రేణుక చెప్పారు. విధుల నుంచి మినహాయించండి చాలామంది తమను విధుల నుంచి మినహాయించాలని కోరుతూ డీఈఓ సీవీ రేణుక వద్ద క్యూ కట్టారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, అత్యవసర శస్త్రచికిత్సలు చేయించుకున్న ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించేందుకు అధికారులకు అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయులు ఏదో ఒక సాకుతో విధుల నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతల సిఫార్సులతో యత్నిస్తున్నారు. దాదాపు 50 మంది వరకు ఉపాధ్యాయులు వేర్వేరు కారణాలతో మినహాయింపులు కోరడంతో గురువారం మధ్యాహ్నానికీ మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత డీఈఓ హెచ్చరికతో గురువులు దిగొచ్చారు. మూల్యాంకనం ప్రారంభమైంది. -
వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ శ్రేణుల దాడి
లంకెలకూరపాడు(ముప్పాళ్ల): ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడికి దిగిన సంఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామంలోని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొంత కాలంగా నరసరావుపేటలో నివాసముంటున్నాడు. మాజీ సర్పంచ్ వర్ధంతి కార్యక్రమానికి గ్రామానికి వచ్చాడు. పాతకక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి(పెదకాపు), అతని కుమారుడు బ్రహ్మారెడ్డి, కిష్టిపాటి లింగారెడ్డిలు విచక్షణారహితంగా దాడి చేశారు. ముఖంపైన తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేస్తుండగా స్పృహ కోల్పోవటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాయపడిన శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్ సీపీ నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. -
పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ జి.పున్నారావు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్లోని పెన్షనర్స్ హోమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సవరణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. ఇటువంటి అంశాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సమావేశంలో జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్.వెంకటేశ్వర్లు, ఎం.ఎన్.మూర్తి, టి.శ్రీనివాసరావు, పార్థసారథి పాల్గొన్నారు. -
పైపులైన్ పనులు ఆగవు
ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా నకరికల్లు: ఒప్పుకున్నా లేకున్నా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పైపులైన్ చేపడతామని అధికారులు రైతులను హెచ్చరించారు. బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటులో భాగంగా మండలంలోని చల్లగుండ్ల, నకరికల్లు, నర్శింగపాడు గ్రామాల రైతులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి మాట్లాడుతూ బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటుకు భూములు తీసుకునేది భూసేకరణ కిందకు రాదని భూ వినియోగం మాత్రమేనన్నారు. గుర్తించిన భూమిలో ఆరుమీటర్ల లోతులో ఒకటిన్నర మీటరు వెడల్పులో పైపులైను ఏర్పాటు ఉంటుందన్నారు. పైపులైను పనులు చేపట్టేందుకు 18 ఇంటు 18మీటర్ల వెడల్పులో భూమిని వినియోగించుకొని పైపులైన్ పూర్తయ్యాక భూమిని యథావిధిగా బాగు చేసి ఇస్తామన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంట పూర్తయ్యాకే పనులు చేపతామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న భూముల విలువను బట్టి రెండున్నర రెట్లు కలిపి మొత్తం సెంటుకు రూ12వేలు చొప్పున రైతులకు చెల్లిస్తామని తెలిపారు. దీనికిగాను రైతులు అంగీకారపత్రం ఇవ్వాలని ఒకవేళ ఒప్పుకోకుంటే ఇది కేంద్రప్రభుత్వం ప్రాజెక్టు అని పోలీస్ బందోబస్తు నడుమ అయినా పూర్తిచేసి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు. డిమాండ్లకు ఒప్పుకొంటేనే భూములిస్తాం.. పైపులైను వేసిన భూముల్లో గోడౌన్లు కట్టుకోవాలన్నా... ప్లాట్లు వేసుకోవాలన్నా... అమ్ముకోవాలన్నా, భూమిలో పైపులైన్లు ఉండడం మూలంగా ఇబ్బందులు తలెత్తుతాయని, పనులు చేపట్టే క్రమంలో భూమిని పంటకు పనికిరాకుండా చేస్తారని, హద్దురాళ్లు చెల్లాచెదరు చేస్తారని రైతులు వాపోయారు. హామీలు నెరవేరుస్తామని రాతపూర్వకంగా ఇవ్వాలని, అలాగే సెంటుకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే భూములు ఇచ్చేందుకు ఒప్పుకోమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆర్డీఓ రమణాకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పనులు చేపట్టిన 105 గ్రామాల్లో సెంటుకు రూ 2వేలు చొప్పున మాత్రమే ఇచ్చారని, ఇక్కడి రైతుల కోసం రూ 12వేలు ఇస్తున్నార న్నారు. తహశీల్దార్ కె.పుల్లారావు, బీపీసీఎల్ ప్రాజెక్టు లీడర్ భగవాన్ శుక్లా, సైట్ ఆఫీసర్ అమిత్ కాంబ్లో, సైట్ ఇన్చార్జి పవన్, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. పోలీసుల భద్రతతోనైనాపూర్తిచేస్తాం బీపీసీఎల్ పైప్‌లైన్ ఏర్పాటుపై రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
పిడుగురాళ్ల: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ సూచించారు. పిడుగురాళ్ల పట్టణ, గ్రామీణ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో రూరల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో గురవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ... విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కరెంట్ బిల్లుల వసూళ్లలో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పరిధిలోని జానపాడు, రూరల్ పరిధిలోని జూలకల్లు సబ్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. వేసవిలో లోడ్ పెరుగుతున్న కారణంగా దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ను అందించాలని ఆదేశించారు. 50 శాతం అదనపు లోడ్ సబ్సిడీ స్కిమ్‌ను గృహ వినియోగదారులందరు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.నాగసురేష్బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.సింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ -
నవ్యకేర్‌తో జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ ఒప్పందం
గుంటూరు మెడికల్ : క్యాన్సర్ రోగులకు మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించేందుకు గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ గురువారం నవ్య కేర్ నెట్వర్క్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఆంధ్రప్రదేశ్ చాప్టర్)తో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో క్లినికల్ సామర్‌ాధ్యలను మెరుగుపరచడం, ఆధారిత చికిత్సా ప్రణాళికలు, వర్చువల్ మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వర్చువల్‌గా ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం మధ్య ఏర్పడిన భాగస్వామ్యంలో ఒక భాగమని పేర్కొన్నారు. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ రాష్ట్రంలో క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి ఒక సమర్థవంతమైన నెట్‌వర్క్‌ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు కింద కింగ్ జార్జ్ హాస్పిటల్ (విశాఖపట్నం), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (కాకినాడ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (గంటూరు), స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (కర్నూల్)లలో అమలు చేస్తారన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం, ఎక్కడమిక్ డీఎంఈ డాక్టర్ రఘునందన్ ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ గుంటూరు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలను మెరుగైన క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు తాము అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో నాట్కో క్యాన్సర్ సెంటర్ కో ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్, క్యాన్సర్ వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, డెప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య
బొల్లాపల్లి: పురుగుమందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామానికి చెందిన బైలడుగు రమణ(45) మద్యానికి బానిసైన భర్తను బెదిరించేందుకు గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగింది. వెంటనే బంధువులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. భర్త చిన్న బాదరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ జె.భాస్కరరావు తెలిపారు. -
బాకీ ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసు
నరసరావుపేటటౌన్: బాకీ డబ్బులు ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఏలూరి ప్రసాద్ విమర్శించారు. గురువారం ప్రకాష్‌నగర్ సిరి అపార్ట్మెంట్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అమరా వెంకటేశ్వరరావు బాధితులతో కలిసి మాట్లాడారు. పట్టణానికి చెందిన అమరా వెంకటేశ్వరరావు అమరా ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహిస్తూ ఆర్థిక సమస్యలతో 2023లో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అతనికి సన్నిహితంగా ఉండే వారి వద్ద సుమారు రూ.10 కోట్లు అప్పుగా తీసుకొని ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించాడన్నారు. కాలేజీని కోర్టు వేలం వేసి బ్యాంకుకు చెల్లించవలసిన పైకం పోనూ మిగిలిన మొత్తాన్ని సొసైటీ పేరిట సుమారు రూ.4 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారన్నారు. వెంకటేశ్వరరావు మృతి అనంతరం ఆయన భార్య అమరా సుధారాణి, వారి పిల్లలు బాకీదారులతో సన్నిహితంగా ఉంటూ ఉన్న ఆస్తిని అమ్మి బాకీలు తీరుస్తామని నమ్మబలుకుతూ వచ్చారన్నారు. ఇటీవల నరసరావుపేటలో ఐపీ పెట్టే వారి సంఖ్య పెరగటంతో వీళ్లు కూడా డబ్బులు ఎగ్గొట్టాలని దురాలోచన చేశారన్నారు. అందులో భాగంగానే బుధవారం సుధారాణి తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి నిజానిజాలు తెలుసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా కోరారు. సమావేశంలో కండె హనుమంతరావు, కూరపాటి శ్రీనివాస గుప్తా, కొత్తూరు సురేషు, పెనుగొండ ప్రతాపు, పెనుగొండ ప్రభాకర్, సీతారామయ్య, చీరాల నారాయణ, ఇక్కుర్తి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నంబూరులో లారీ ఢీకొని మహిళ మృతి
పెదకాకాని: రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళను లారీ ఢీకొనడంతో మృతి చెందిన ఘటన నంబూరులో జరిగింది. పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామానికి చెందిన వుయ్యూరు వెంకటరత్నం బుధవారం రాత్రి గ్రామంలోని గోళ్లమూడి రోడ్డులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి బయలు దేరింది. శివాలయం సెంటర్‌కు వచ్చే సరికి గోళ్ళమూడి నుంచి ఈమని వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వెంకటరత్నం(52) పరిస్థితి విషమించి మరణించింది. మృతురాలికి కుమార్తె లావణ్య, కుమారుడు తారక్ ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉండటంతో మృతదేహాన్ని పెదకాకానిలోని అపరకర్మల సత్రంలోని ఏసీ బాక్స్‌లో ఉంచారు. -
యార్డుకు 1,30,848 బస్తాలు మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,30,848 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,28,132 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,600 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 56,061 బస్తాలు నిల్వ ఉంది. -
థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి..
శివసుబ్రహ్మణ్యం 2009లో చీరాల నుంచి గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు. తొలినాళ్లలో ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2018లో ఓ సినిమా ఽథియేటర్‌లో టైలర్ శ్రీను పరిచయమయ్యాడు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 2022 నుంచి చోరీలకు శ్రీకారం చుట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడం ప్రారంభించారు. స్కూటీపై వెళ్తూ గొలుసులు తెంచుకెళ్లేవారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఆధారాల్లేకుండా జాగ్రత్తపడటంలో వీరు నేర్పరులు. ధనవంతులు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా చోరీలు చేశారు. దొంగలించిన సొత్తును తెలిసిన వారి ద్వారా బంగారు దుకాణాల్లో విక్రయించేవారు. ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకుని జల్సాలు చేసేవారు. వీరు పట్టాభిపురం పీఎస్ పరిధిలో 2, నల్లపాడు పీఎస్ పరిధిలో 4, తెనాలి వన్‌టౌన్ పరిధిలో 2, అరండల్ పేట పీఎస్, తెనాలి త్రీటౌన్ పీఎస్, చీరాల టూ టౌన్, చీరాల త్రీ టౌన్ పీఎస్ పరిధిలో ఒక్కొక్క చోరీ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు. -
అమ్మ చారిటబుల్ ట్రస్టు సేవలు అబినందనీయం
ఐటీసీ మాజీ ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు చేబ్రోలు: మూఢనమ్మకాలను విడనాడి ప్రజలే ముందుకు వచ్చి నిర్మించుకుంటే శ్మశానాలే దేవాలయాలుగా మారతాయని ఐటీసీ మాజీ ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు అన్నారు. చేబ్రోలు మండలం వేజెండ్లలో బుధవారం కొత్తగా నిర్మించిన శ్మశాన వాటికను అద్దంకి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. వేజండ్లలో కెలిన్, దహనశాలను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా చివరి మజిలీ ఇదేనన్నారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చనన్నారు. శ్మశాన వాటిక నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సేవకులు స్వామి జ్ఞాన ప్రసన్న గిరి సేవలు అభినందనీయమన్నారు. వారి సేవలను కొనియాడారు. అన్ని పనులు ప్రభుత్వం చేయదని కొన్ని మనమే చేసుకోవాలని ఇది సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. అమ్మ చారిటబుల్ ట్రస్టు సేవకులు స్వామి జ్ఞాన ప్రసన్న గిరి మాట్లాడుతూ మనిషి మరణిస్తే కనీసం గౌరవంగా సాగరంపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దానికి ఊర్లో ఉండే స్మశాన వాటిక ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అమ్మా ఆశ్రమం సేవకులు, సత్య హరిశ్చంద్ర సేవా సమిత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బ్లేడ్‌తో ఇద్దరిపై దాడి
సత్తెనపల్లి: బ్లేడుతో ఇద్దరిపై యువకుడు దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన గింజుపల్లి అశోక్ కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం పూటుగా మద్యం తాగాడు. ఇంటి సమీపంలోని ఎనిమిదో తరగతి చదువుతున్న మేడూరు చాణిక్యతో ఏంటి రా.. నా వైపు చూస్తున్నావ్ ! అంటూ దూషించి దాడి చేసి బెదిరించడంతో చాణిక్య వెంటనే తల్లి మేడూరు జ్యోతికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఎయిర్టెల్ కార్యాలయంలో పనిచేస్తున్న జ్యోతి తన బిడ్డ చాణిక్యపై దాడి చేస్తున్నారంటూ చూసి రమ్మని తన వద్ద పనిచేసే ఏల్పూరి నవీన్, తూమాటి శ్రీకాంత్‌లను పంపింది. వారు ఘటన స్థలానికి చేరుకొని ఎందుకు దాడి చేసి, బెదిరిస్తున్నావు అంటూ ప్రశ్నించారు. దీంతో అశోక్ కుమార్ బ్లేడ్ తీసుకొని ఏల్పూరి నవీన్ మెడ, చెవి పైన, తూమాటి శ్రీకాంత్ చేతులపై దాడి చేశాడు. ఎవరైనా దగ్గరకు వస్తే దాడి తప్పదు అంటూ బ్లేడు చూపిస్తూ హల్చల్ చేయడంతో స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పట్టణ ఏఎస్ఐ సుబ్బారావు పరారైన అశోక్ కుమార్‌ను క్రిస్టియన్ పేటలో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన ఏల్పూరి నవీన్‌ను ఏరియా వైద్యశాలకు తరలించగా, వైద్యులు 10 కుట్లు వేశారు. తూమాటి శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. -
పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యం
● ధరలు దారుణంగా పడిపోయాయి ● ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి ● సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు ఆవేదన ప్రత్తిపాడు: పొగాకు ధరలు దారుణంగా పడిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి పరిణమిస్తుందని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన తిమ్మాపురం సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు పొగాకు రైతుల దైన్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరుడు పొగాకు ధర రూ 15 వేలు ఉందని, ఇప్పుడు ఆరు వేలు కూడా లేదని ప్రశ్నించారు. రైతుల దీనస్థిథిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పొగాకుకు గత ఏడాది భారీగా ధర వచ్చిందని, దీంతో ఈ ఏడాది సెంటు భూమి లేని రైతులు కూడా పొలాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారని పేర్కొన్నారు. పత్తి, మిర్చి పంటలు తెగుళ్ళతో పోతున్నాయని, అందుచేత రైతులంతా పొగాకు మీదనే ఆధారపడ్డారని తెలిపారు. పొగాకు సాగుకు ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయ్యిందని, ధర చూస్తే రూ.ఆరువేలు కూడా పలకడం లేదని ఆవేదన చెందారు. పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రైతులను కాపాడలేకపోతే ఎందుకీ సమావేశాలని అసహనం వ్యక్తం చేశారు. శనగలకు కూడా సరైన గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. -
వైద్య సిబ్బంది 8వ తేదీలోగా అభ్యంతరాలు తెలపాలి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కార్యాలయం పరిధిలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి ఎం.మజిదాబి తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు పట్టాభిపురంలోని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయంలో నేరుగా వచ్చి తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రేవుల హక్కులపై జెడ్పీలో బహిరంగ వేలం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని 11 రేవుల్లో పడవలు, బల్లకట్లు నడుపుకునేందుకు బుధవారం జెడ్పీ సమవేశ మందిరంలో సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహించారు. జెడ్పీ డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలంలో ఏడు రేవులను పాటదారులు దక్కించుకోగా, నాలుగు రేవులకు పాటదారులు పాల్గొనకపోవడంతో వాయిదా వేశారు. అచ్చంపేట, మాచవరం, అమరావతి, కొల్లిపర మండలాల పరిధిలోని చామర్రు, గింజుపల్లి, తాడువాయి, మాదిపాడు, దిడుగు, ధరణికోట రేవుల్లో పడవ, పుట్లగూడెంలో బల్లకట్టును వచ్చే ఏడాది మార్చి 31 వరకు తిప్పుకునేందుకు నిర్వహించిన వేలంలో పాటదారుల నుంచి జెడ్పీకి మొత్తం రూ.1,46,07,526 ఆదాయం సమకూరింది. కాగా చింతపల్లి, వల్లభాపురంలో పడవ, మాదిపాడు, గోవిందాపురంలో బల్లకట్టు వేలంలో పాటదారులు ఆసక్తి చూపలేదు. వేలం ప్రక్రియలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రానైట్ తరలింపు లారీ పట్టివేత ముప్పాళ్ళ: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని ముప్పాళ్ళ దర్గా సమీపంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె.చంద్రశేఖర్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీని గుర్తించారు. లోడ్‌కు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని గుర్తించి తదుపరి చర్యలు నిమిత్తం లారీని పోలీసులకు అప్పగించారు. -
‘98’ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి
మంగళగిరి టౌన్: 1998 డిఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళగిరి ఐబీఎన్ భవన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఉద్యోగం రాని వారికి వయోపరిమితి నెలల వ్యవధి మాత్రమే ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ రిమైనింగ్ కాండిడేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు డీఎస్సీపై ఎటువంటి స్పందన లేదని, పలుమార్లు విజ్ఞాపనలు సమర్పించామని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో దాదాపు 1500 మంది అభ్యర్ధులు ఉన్నారని, 600 శాంక్షన్డ్ పోస్టులు మిగిలి ఉన్నాయని మానవతా దృక్పథంతో మరో 900 పోస్టులు కలిపి తక్షణం ఎస్జీటీలుగా అపాంయింట్మెంట్లు ఇవ్వాలని కోరారు. అనంతరం ప్రెస్‌క్లబ్ నుంచి మంగళగిరి అంబేడ్కర్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 98 డిఎస్సీ అభ్యర్థులు చంద్రయ్య, జగ్గయ్య, రత్నబాబు, రామారావు, గోవిందరావు, సుహాసిని, మేరి తదితరులు పాల్గొన్నారు. నేడు కేతవరంలోప్రతిష్టా మహోత్సవం బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన కేతవరంలో కొండపై వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహుని ఆలయంలో గురువారం ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నట్లు మండల దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొండ దిగువన గల స్వామివారి ఆలయం వద్ద జీవ ధ్వజస్తంభం, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరగనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అభాగ్య శిశువుల కోసం ‘ఊయల’ నరసరావుపేట: అభాగ్యులైన శిశువులను అక్కున చేర్చుకునేందుకు బుధవారం జిల్లా శిశు సంక్షేమం, సాధికారిత అధికారి ఆధ్వర్యంలో పెద్దచెరువులోని శిశుగృహంలో క్రెడిల్ బేబీ రెడెప్షంన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అభాగ్యులైన శిశువులను చెత్తకుప్పలు, కాలువల్లో వేయకుండా బతకనిచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని పీడీ ఉమాదేవి కోరారు. 7న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ రూ.1534.27కోట్ల ఆమోదం కోసం గత నెల 29న జరగాల్సిన కౌన్సిల్ సమావేశం ఉగాది, రంజాన్ పండగల దృష్ట్యా మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఇన్చార్జ్ మేయర్ షేక్ సజీల వాయిదా వేసిన సంగతి తెలిసింది. తిరిగిన ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన నోటిసులను సభ్యులకు నగరపాలక సంస్థ సిబ్బంది అందజేశారు. -
సజావుగా జేఈఈ మెయిన్స్
గుంటూరు ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) లకు విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీబీటీ విధానంలో ఆన్లైన్ పరీక్షల కోసం గుంటూరులో రెండు, పల్నాడు జిల్లాలో రెండు చొప్పున వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అయాన్ డిజిటల్ జోన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు హడావుడి పడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈనెల 3, 4, 7, 8వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, 9వ తేదీన పేపర్–2ఏ బీఆర్క్,పేపర్–2బీ బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడులోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు -
శంకర్ విలాస్ ఆర్వోబీని కుదించటం సరికాదు
గుంటూరు ఎడ్యుకేషన్: రాబోవు 50 ఏళ్లలో నగర ప్రజల భవిష్యత్ ప్రజల అవసరాలు, బహుళ ప్రయోజనాలను నెరవేర్చేలా శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, చాలీచాలని నిధులతో తక్కువ నిడివితో నిర్మిస్తే ప్రయోజనం ఉండదని శంకర్ విలాస్ ఫైఓవర్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. బుధవారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో సమావేశమైన జేఏసీ నాయకులు శంకర్‌విలాస్ ఆర్వోబీ నిర్మాణం, భవిష్యత్తు అవసరాలపై మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా డిజైన్‌లో చేయాల్సిన మార్పులపై పౌర సంఘాల అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు ఎల్ఎస్ భారవి మాట్లాడుతూ ఆర్వోబీకి తాము వ్యతిరేకం కాదని, అది భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా ఉండాలన్నదే తమ అభిప్రాయం అని స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన ప్లాన్‌కు భిన్నంగా, ప్రజల ఆమోదం లేని కొత్త ప్లాన్‌తో అధికార యంత్రాంగం ముందుకు వెళ్లటం సరికాదన్నారు. గతంలో హిందూ కాలేజి సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకూ నిర్మిస్తామని, ఆర్వోబీ, ఆర్యూబీ రెండింటినీ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పుడు ప్లాన్‌ను పూర్తిగా మార్చేశారన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు రోజువారీ రాకపోకలు సాగించే ప్రజలకు శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన మార్గమన్నారు. అటువంటి ఆర్వోబీని మూసివేస్తే, మూడు వంతెనలు, ఇతర మార్గాలు ప్రజలు అవసరాలు తీర్చలేదన్నారు. ముందుగా ఆర్యూబీ నిర్మించి, తర్వాత ఆర్వోబీ నిర్మించాలన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ అవసరాల రీత్యా ఆరు లైన్ల నిర్మాణం అవసరం అని చెప్పిన కలెక్టర్, అధికార యంత్రాంగం నాలుగు లైన్లకు తగ్గించటమే కాకుండా, ఆర్యూబీ లేకుండా ట్రాఫిక్ అవసరాలు ఎలా తీరుతాయో ప్రజలకు చెప్పాలని కోరారు. జేఏసీ నాయకుడు పీవీ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని, పౌర సంఘాలతో చర్చిస్తే స్పష్టత వస్తుందన్నారు. అధికార యంత్రాంగం డీపీఆర్ ఆమోదానికి ముందు ప్రజలతో ఎలాంటి చర్చా జరపలేదన్నారు. అలాగే సామాజిక ప్రభావం సర్వే సైతం నిర్వహించలేదన్నారు. 23 అడుగుల సర్వీసు రోడ్డులో ఐదు అడుగులు డ్రైన్‌కు పోతే మిగిలిన రోడ్డులో ట్రాఫిక్ సులభంగా ఎలా వెళుతుందని ప్రశ్నించారు. ఆర్యూబీ లేకపోతే తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు జీజీహెచ్, విద్యాసంస్థలు, హాస్పిటల్స్, ఇతర వాణిజ్య అవసరాల కోసం రాకపోకలు సాగించటం సాధ్యం కాదన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, చరిత్రలో చెప్పుకునే విధంగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని, అవసరం అయితే అందుకు అదనపు నిధులు సాధన కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు అవధానుల హరి, ఎన్.కమలకాంత్, రాధాకృష్ణ, వి.సదాశివరావు, వెంకట్రావు, కె.నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదనపు నిధులు సమకూర్చి పాత ప్లాన్ ప్రకారం నిర్మించాలి కలెక్టర్‌కు జేఏసీ ప్రతినిధుల వినతి -
జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా చిలువూరి కిరణ్మయి బుధవారం విధుల్లో చేరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. ప్రస్తుతం మంగళగిరి టీబీ శానిటోరియం హాస్పిటల్లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతి పొంది గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరారు. గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్మయి సికింద్రాబాద్ గాంధీలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సు 2000లో పూర్తి చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట పీహెచ్సీలో స్టాఫ్ నర్సుగా 2001 జనవరిలో చేరి ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. హెడ్‌నర్సుగా 2007లో ఉద్యోగోన్నతి పొంది నిజామాబాద్ పీచ్పల్లికి బదిలీ అయ్యారు. అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక బదిలీ అయి 2008లో గోరంట్లలోని జ్వరాల ఆస్పత్రిలో చేరారు. 2018 వరకు అక్కడే పనిచేసి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం మంగళగిరి బదిలీ అయ్యారు. ఇప్పుడు గ్రేడ్ –1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరిన కిరణ్మయికి పలువురు నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ యూనియన్ అధికారులు, వైద్య సిబ్బంది, వైద్యులు అభినందనలు తెలిపారు. -
సహజీవనానికి అడ్డు వస్తుందని చిన్నారికి చిత్రహింసలు
మంగళగిరి: సహజీవనానికి అడ్డు వస్తుదన్న అక్కసుతో తల్లి, పెద్దనాన్న చిన్నారిని చిత్రహింసలు పెట్టి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మరియమ్మకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నకుమార్తె ప్రీతి అక్క భర్త నాగేంద్రబాబుతో ప్రేమలో పడి సహజీనం చేస్తోంది. దీనిని గమనించిన ప్రీతి భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రీతికి మూడేళ్ల పాప ఉంది. దీంతో పాపతో సహా ప్రీతి, నాగేంద్రబాబు చినకాకానిలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని మూడునెలలుగా నివాసం ఉంటున్నారు. తమ బంధానికి అడ్డు వస్తుందన్న అక్కసుతో కొద్ది రోజులుగా నాగేంద్రబాబు పాపను కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడు. పాపను అమ్మమ్మతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నాడు. మంగళవారం రాత్రి నాగేంద్రబాబు ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండడంతో కోపంతో ఊగిపోయాడు. దారుణంగా కొట్టాడు. ప్రీతి కూడా అడ్డు చెప్పలేదు. సమాచారం తెలుసుకున్న అమ్మమ్మ మరియమ్మ పాపను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించింది. బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● రెండేళ్ల నుంచి ఐఆర్, డీఏలు లేవు ● మూడేళ్ల నుంచి సరెండర్ లీవ్‌లు లేవు ● సీపీఎస్ రద్దు ఊసే లేదు ● ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన
పీఆర్సీకి మోక్షం ఎప్పుడు ? గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లుగా పీఆర్సీ లేదని, డీఏ, ఐఆర్ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి సరెండర్ లీవు లేదని, చివరకు సీపీఎస్ రద్దు ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి చేసుకొన్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణంలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చాంద్‌బాషా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేకుంటే ఉద్యోగులు ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పోతురాజు, ఉపాధ్యక్షుడు రహెమాన్, సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోటా సాహె బ్, నగరశాఖ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, నగర శాఖ ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదరత్తయ్య, జాను, నగర శాఖ కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు అన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నరసింహారావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఖాళీలు లేవనే పేరుతో కాలయాపన చేయడం సరికాదని పేర్కొన్నారు. 12వ వేతన సవరణ(పీఆర్సీ) కాలం ముగిసి, ఇప్పటికే 21 నెలలు గడిచిపోయినా కనీసం కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయలేదని, వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ కె.వీరాంజనేయులు మాట్లాడుతూ 2003 డీఎస్పీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో మాజీ చైర్మన్ సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయనందున ఉపాధ్యాయులకు డెప్యూటీ డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్, డీఈఓ పోస్టులు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని, తక్షణమే జీఓలు 73, 74, 75 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. బసవలింగరావు మాట్లాడుతూ తెలుగు మీడియంను కనీసం సమాంతర మీడియంగానైనా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అడిషనల్ సెక్రటరీ జనరల్ యు.రాజశేఖర రావు మాట్లాడుతూ సరెండర్ లీవ్ బకాయిలతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో ఫ్యాప్టో కో–చైర్మన్ షేక్ ఫైజుల్లా, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ డీకే సుబ్బారెడ్డి, మహమ్మద్ ఖలీద్, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులు కళాధర్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ రామచంద్రయ్య, యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఎం.హనుమంతరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లా, జిల్లా అధ్యక్షుడు సీహెచ్కొండయ్య, ఫ్యాప్టో భాగస్వామ్య పక్షాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ తేజకు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టీచర్ల నిరసన -
బాలికలపై నేరాలను నివారించాలి
గుంటూరు వెస్ట్ : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వసతి గృహాల్లో 18 ఏళ్లలోపు బాల, బాలికలపై నేరాలు నివారించేందుకు నిర్దేశించిన ముందస్తు భద్రతా రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్పటల్స్, ప్రవేశ మార్గాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. తల్లిదండ్రులు కాకుండా, విద్యార్థుల కోసం వచ్చే ఇతర బంధువుల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. విద్యా సంస్థలకు, వసతి గృహాలకు ప్రహరీలు నిర్మించడంతోపాటు, వాచ్మెన్లను తప్పక ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్‌కు విద్యార్థులు వచ్చిన తరువాత తిరిగి వారు వారి ఇళ్లకు వెళ్లే వరకు పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు వహించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్యలు ఉంటే వాటిని ఆశాఖ వెంటనే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద భద్రత పెంచాలన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ బాలికలపై నేరాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు ప్రహరీలు నిర్మించడం, వాచ్మెన్లను నియమించడం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, అడిషనల్ ఎస్పీ జి.వి.రమణమూర్తి, డీఎస్పీ సుబ్బారావు, ఆర్ఐఓ జి.కె.జుబేర్, జిల్లా వైద్య శాఖ అధికారి కె.విజయలక్ష్మి, ఈఓ టి.వి.రేణుక, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. ప్రైవేటు బస్సులకు రూట్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలి జిల్లాలో ఆరు రూట్లులో ప్రైవేటు బస్సులకు అనుమతులు పారదర్శకంగా ఇవ్వాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వై జంక్షన్– పెదపలకలూరు, ఆర్టీసీ బస్టాండ్– లాం, ఆర్టీసీ బస్టాండ్– అడవి తక్కెళ్ళపాడు, పాత గుంటూరు మణి హోటల్–ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్– ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా రెడ్డిపాలెం, గుజ్జనగుండ్ల– గుండవరం వరకు మొత్తం 6 రూట్లకు 54 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 9లోగా ఆర్టీఏ అధికారులు వీటిపై సమీక్షించి పూర్తి వివరాలతో రిపోర్ట్ అందజేస్తే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా ఉప రవాణా కమీషనర్ సీతారామిరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్, ట్రాఫిక్ డిఎస్సీ రమేషన్ పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
తోడు దొంగలు చిక్కరు..దొరకరు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఇద్దరూ తోడు దొంగలు.. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో నేర్పరులు. సీసీ కెమెరాలకు చిక్కరు.. దొరకరు.. మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు చేసినా ఏ పీఎస్ పరిధిలోనూ వీరిపై కేసుల్లేవు. ఎట్టకేలకు నల్లపాడు పోలీసులు వీరి ఆట కట్టించారు. ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెలలో నల్లపాడు పీఎస్ పరిధిలోని లింగయ్యపాలెంలో, గుంటూరు క్లబ్ దగ్గర్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. దీనిపై సీఐ వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. ఏటుకూరురోడ్ డీఎస్ నగర్ తొమ్మిదో వీధిలో ఉంటున్న టైలర్ వల్లెపు శ్రీనును అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతనిచ్చిన సమాచారంతో వసంతరాయపురం నాలుగో వీధికి చెందిన అన్నపురెడ్డి శివ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి బంగారు గొలుసుల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చోరీలు చేసినట్టు తేల్చారు. ఇప్పటివరకు 13కుపైగా చోరీలకు పాల్పడినా వీరిపై కేసులు లేవని గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.32 లక్షల ఖరీదు చేసే 390 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును దర్యాప్తు చేసిన సీఐ వంశీధర్, ఎస్ఐ జనార్దన్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, మస్తాన్‌వలి, బిక్షనాయక్, వెంకటేశ్వర్లును ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ (క్రైం), శిక్షణ ఐపీఎస్ అధికారిణి దీక్ష, డీఎస్పీ భానోదయ పాల్గొన్నారు. గొలుసుల చోరీల్లో దిట్టలు మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు ఏ పీఎస్‌లోనూ కేసుల్లేవు ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం -
పులిసిన రాజకీయం
ఫ్లెక్సీల వివాదంతో ముదిరిన విభేదాలు తాను చెప్పిన పనులు చేయనందుకే.. తూర్పు ఎమ్మెల్యే అనుచరులు కొందరు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ పనులు చేపట్టారు. ఆ బిల్లులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాస్ చేయలేదు. దీంతో ఎమ్మెల్యే నసీర్ కమిషనర్‌కు ఫోన్ చేసి బిల్లులను పాస్ చేయాలని కోరినట్లు సమాచారం. అయినా కమిషనర్ బిల్లులను పాస్ చేయలేదు. దీనికితోడు కొల్లి శారదా మార్కెట్లో ఆశీలు వసూలు విషయంలోనూ నసీర్ మాట కమిషనర్ వినలేదు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కమిషనర్ తన మాట వినడం లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి స్పందించిన కేంద్రమంత్రి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు వర్సెస్ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌గా మారిపోయింది గుంటూరు రాజకీయం.. కొద్దికాలంగా మున్సిపల్ కమిషనర్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అండదండలతో ఎమ్మెల్యేలను లెక్కచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పిన పనులేవీ చేయకపోవడంతో ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. నాలుగు నెలలుగా ఇద్దరూ ఎడముఖంపెడముఖంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో తాము చెప్పిన పనులేవీ మున్సిపల్ అధికారులు చేయడం లేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల నిలదీత.. ఎమ్మెల్యే సీరియస్ తాజాగా బుధవారం తన నియోజకవర్గం రాజీవ్‌గాంధీనగర్‌లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్ధ్యం అధ్వానంగా ఉందంటూ ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఎక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్, రోడ్లు ఉడ్చుకుంటే సరిపోతుందా? పారిశుద్ధ్యాన్ని పట్టించుకోరా? ఒక ఎమ్మెల్యే పర్యటనకు వచ్చినా మున్సిపల్ అధికారులు రారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడీఎఫ్ టీం వస్తే అధికారులు వెళ్లారంటూ స్థానిక మున్సిపల్ సిబ్బంది బదులిచ్చారు. సాయంత్రం సమావేశమై మరీ క్లాస్ దీంతో ఎమ్మెల్యే నసీర్ సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతో సమావేశమయ్యారు. అధికారుల తీరుపై చిర్రుబుర్రులాడారు. తన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల నుంచి రూ.లక్షల ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ పారిశుద్ధ్య పనులూ చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి పారిశుద్ధ్య పనులను రోజూ పరిశీలించి ఒక్కొక్కరి వ్యవహారం తేలుస్తానని చెప్పారు. దీంతో కమిషనర్, ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలాఉంటే వారి మధ్య విభేదాలుంటే వాళ్లూవాళ్లూ చూసుకోవాలిగానీ తమను బలి చేస్తే ఎలాగంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన వారికి బిల్లులు చెల్లించలేదని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అలక రంజాన్ ముందు రోజు ఎమ్మెల్యే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగింపు అర్ధరాత్రి కమిషనర్‌కి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే వర్గీయులు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికుల ఫిర్యాదులు స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి పట్టించుకోరా అంటూ నసీర్ ఆగ్రహం అధికారులతో సమావేశమై మండిపాటు టీడీపీ అధిష్టానానికి కమిషనర్‌పై ఫిర్యాదుకు సిద్ధం కమిషనర్ వర్సెస్ ఎమ్మెల్యే రంజాన్ ముందురోజున నగరమంతా ఉన్న ఫ్లెక్సీలను పట్టించుకోని మున్సిపల్ అధికారులు పాతబస్తీలోని ఫ్లెక్సీలను మాత్రం తొలగించడం వివాదానికి దారితీసింది. తూర్పు ఎమ్మెల్యే నసీర్ రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి రోడ్డుపై భైఠాయించి కమిషనర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. అధికార పార్టీ వారే రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడానికి మున్సిపల్ కమిషనరే కారణమనే భావనలో ఉన్న నసీర్ కమిషనర్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. -
విజిబుల్ పోలీసింగ్‌తోనే ప్రజల్లో విశ్వాసం
తాడేపల్లి రూరల్: విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు పోలీస్‌శాఖపై నమ్మకం పెరుగుతుందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ చెప్పారు. తాడేపల్లి రూరల్‌పరిధిలోని నులకపేటలో మంగళవారం రాత్రి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.పౌరసరఫరాల గోదాము పరిశీలనతాడికొండ: తాడికొండ సివిల్ సప్లైస్ గోదాములో జరుగుతున్న గోల్మాల్ వ్యవహారంపై ఎట్టకేలకు సివిల్ సప్లైస్ అధికారులు స్పందించారు. ‘రేషన్ బియ్యం సరఫరాలో గోల్మాల్’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి డీఎస్ఓ పద్మ స్పందించారు. గోదామును తనిఖీ చేశారు. సరుకు వివరాలు, రిజిస్టర్‌ను పరిశీలించారు. డీలర్లకు తక్కువగా సరుకు వెళుతున్న విషయంపై హమాలీలు, గోదాము ఇన్చార్జిని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన డీఎస్ఓ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన డీలర్ ఎవరు? అతనికి సరుకు వెళుతుందా అని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని డీలర్లను కోరారు. ప్రతి బస్తాకు తమకు 600 గ్రాముల నుంచి కిలో వరకు తక్కువగా వస్తుందని, తూకం వేయకుండానే నేరుగా లోడింగ్ చేస్తున్నారని లిఖిత పూర్వకంగా డీలర్లు ఫిర్యాదు ఇచ్చారు.సదరం ధ్రువపత్రాలు కోసం 4 నుంచి శ్లాట్ బుకింగ్తాడికొండ: దివ్యాంగులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్‌లు ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తాడికొండ, తుళ్ళూరు ఎంపీడీవోలు కె.సమతావాణి, కానూరి శిల్ప ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఉదయం 10 గంటల నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరు నమోదు చేయించుకోవాలని వారు సూచించారు.అరండల్‌పేటలో యువకుడి హత్య!లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్):అరండల్‌పేట 1వ లైన్లో నలుగురి మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి మరణానికి దారి తీసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. వెంకటప్పయ్య కాలనీకి చెందిన గణేష్ (35)కి అరండల్‌పేటలో భిక్షాటన చేస్తూ మద్యం, గంజాయి తాగే మరో ముగ్గురితో స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో ఒక స్నేహితుడి సోదరి పట్ల గణేష్ అసభ్యంగా ప్రవర్తించడంతో ముగ్గురూ కలిసి గణేష్‌పై దాడి చేశారు. ఈ ఘటన సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న గణేష్‌ను తీవ్రంగా కొట్టడంతో వారి వద్ద నుంచి పారిపోయి దాక్కున్నాడు. అయితే గొంతు ఎండిపోయి అక్కడికక్కడే మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ధానికులు అరండల్‌పేట పోలీసులకు రాత్రి 11గంటలకు సమాచారం అందించడంతో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ వీరాస్వామి, సిబ్బందితో చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ రౌడీషీట్ ఉన్నట్లు సమాచారం. -
స్థలం లేక అల్లాడుతున్నాం!
తాడికొండ: రాజధానిలో ఈద్గాకు స్థలం లేక పదేళ్లుగా మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాలను పూలింగ్‌కు ఇచ్చిన ఈ ప్రాంతంలో ముస్లింలకు ఈద్గా స్థలం కావాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూలింగ్ సమయంలో సీఆర్డీఏ భూములు తీసుకునేప్పుడు తమ పరిస్థితి వివరిస్తే ఈద్గాకు స్థలం కేటాయించడమే కాకుండా మసీదు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు పూర్తిగా విస్మరించారని ముస్లింలు చెబుతున్నారు. పవిత్ర రంజాన్ రోజున కూడా ప్రార్థనలు చేసుకునేందుకు జానెడు జాగా లేక రోడ్డుపైనే టెంట్లు వేసి ప్రార్థనలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ముస్లింలు అధికంగా ఉన్న రాయపూడి గ్రామంలో ఈద్గాకు స్థలం కేటాయించాలని పూలింగ్ సమయంలోనే నాటి ఎమ్మెల్యే, అధికారులు, సీఎంకు పలుమార్లు ముస్లింలు వినతిపత్రాలు అందజేశారు. అయితే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేస్తే గతంలోనూ, ఇప్పుడూ తమను నట్టేట ముంచారని, సమస్యను ఎమ్మెల్యేకి వివరిస్తే ఇదిగో పరిష్కారం చేస్తామని చెబుతున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపైనే టెంట్ వేసి ప్రార్థనలు రాజధానిలో మైనార్టీల ఆవేదన ఈద్గాకు స్థలం కేటాయించాలని డిమాండ్ సర్కారుకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం -
46 ఎకరాల గడ్డివాములు దగ్ధం
తెనాలిరూరల్: అగ్నిప్రమాదంలో సుమారు రూ.ఐదు లక్షల విలువైన 46 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధమైన ఘటన తెనాలి పినపాడు వద్ద మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పినపాడు ప్రాంతానికి చెందిన 13 మంది రైతులు ఉమ్మడిగా గడ్డివాములను వేశారు. 46 ఎకరాలు గడ్డిని 15 గడ్డివాములుగా ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి గడ్డివాములు తగలబడటం ప్రారంభించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచగా, సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. గడ్డి వాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎండ వేడికి దగ్ధమయాయా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రైతులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఇక్కడే గడ్డి వాములు వేస్తున్నామని, పంటలు నూర్పి గడ్డిని 13మంది రైతులము కలిసి ఒకచోట వాములు వేశామని, గడ్డికి ఎలా మంటలు వ్యాపించాయో తెలియదని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అర్పిన లాభం లేకుండా పోయిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
వలస కూలీల ఆటోను ఢీకొన్ని ప్రైవేటు బస్సు
మేడికొండూరు : విషదళ సమీపంలోని ఎన్నారై కళాశాల వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మేడికొండూరు సీఐ నాగూర్ మీరా సాహెబ్ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు మేడికొండూరు మండల పరిధిలోని సరిపుడి గ్రామంలో గుడారాలు నిర్మించుకొని నివసిస్తున్నారు. రోజూ కూలి పనుల కోసం పొన్నూరు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం కూడా తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పేరేచర్ల గ్రామ శివారు దాటిన తర్వాత ఎన్నారై కళాశాల సమీపంలో అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న ప్రైవేట్ బస్సు కూలీల ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో త్కోసారిగా పల్టీ కొట్టి పక్కకు బోల్తా పడింది. ప్రమాదంలో తుపాకుల జయమ్మ, తుపాకుల సుబ్బారావు, మాణిక్యమ్మ, తుపాకుల లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ నాగూర్ మీరా సాహెబ్ తెలిపారు. కళాశాల బస్సును దొంగిలించి ఆటోను ఢీకొట్టాడు వలస కూలీలను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన బస్సు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది ఎన్నారై కళాశాలకు చెందిన బస్సుగా తెలిసింది. ఈ బస్సును పేరేచర్ల జంక్షన్ వద్ద ఆపి డ్రైవర్ మందులు కొనుక్కుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి నడుపుకుంటూ తీసుకెళ్లిపోయాడు. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మేడికొండూరు పోలీసులు పల్నాడు జిల్లా లిథం కళాశాల సమీపంలో బస్సును అదుపులోకి తీసుకొని దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు. బస్సు దొంగిలించిన వ్యక్తి జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పొన్నవోలు నాగేశ్వరరావు అని గుర్తించారు. నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసు గంట వ్యవధిలోనే పోలీసులు ఛేధించారు. నలుగురికి తీవ్ర గాయాలు -
ప్రాణం తీసిన ఈత సరదా
పెదకాకాని: స్నేహితులతో కలిసి గుంటూరు చానల్‌కు ఈత నేర్చుకునేందుకు వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించిన ఘటన తక్కెళ్ళపాడులో జరిగింది. గుంటూరుకు చెందిన షేక్ జానీ(18) మరో ముగ్గురు స్నేహితులు మేకా వంశీ, లోకేష్‌కుమార్, మహబూబ్‌లతో కలసి ఈత నేర్చుకునేందుకు పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు సమీపంలో ప్రవహిస్తున్న గుంటూరు చానల్ వద్దకు చేరుకున్నాడు. కృష్ణానది నుంచి ప్రారంభమైన గుంటూరు చానల్(కొత్తకాలువ) మండలంలోని నంబూరు, పెదకాకాని, తక్కెళ్ళపాడు, రామచంద్రపాలెం గ్రామాల గుండా ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం గుంటూరు చానల్లో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. తక్కెళ్ళపాడు గ్రామంలోకి వెళ్ళే సమీపంలో కాలువలోకి దిగి ఈత కొడుతుండగా ఈత పూర్తిగా రాని షేక్ జాని నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. అదే సమయంలో అక్కడ సుమారు 30 మంది యువకులు ఈత కొడుతున్నారు. జాని నీటిలో మునగడంతో స్నేహితులు కేకలు వేశారు. దీంతో కొందరు నీటిలో మునిగిపోయిన జానీని వెతికి ఒడ్డుకు చేర్చారు. ఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందిస్తుండగా జానీ మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడు జానీకి తల్లి వహీదా, చెల్లెలు సానియా, తమ్ముడు సైఫ్అలీ ఉన్నారు. తండ్రి కొంతకాలంగా కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటున్నాడు. జానీ గుంటూరులోని వస్త్రదుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు జానీ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని అమ్మ చారిటబుల్ ట్రస్టు వారి వాహనంలో గుంటూరు మార్చురీకి తరలించారు. మృతుని తల్లి షేక్ వహీదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.పి.నారాయణస్వామి తెలిపారు. -
జీవన సత్యాన్ని చాటిన ‘జేబు చెప్పిన ఊసులు’
తెనాలి: పట్టణానికి చెందిన డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ ఆధ్వర్యంలో 14వ జాతీయస్థాయి నాటకోత్సవాలు మంగళవారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో ఏర్పాటైన నాటకోత్సవాలను ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తొలిరోజున సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘జేబు చెప్పిన ఊసులు’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. ‘జేబు నిండుగా ఉంటే మనకు అందరూ ఉంటారు.. అదే జేబు ఖాళీ అయితే మనకోసం ఎవరూ ఉండరు.. జీవితం చివరి రోజుల్లో భరోసా ఉండదు’ అనే నిజాన్ని అర్థవంతంగా చెప్పిందీ నాటకం. మన దగ్గర మనసుంది...మమకారం ఉంది.. వాటితోపాటు డబ్బును కూడా కాపాడుకోవాలనేది నాటక సందేశం. మనిషనేవాడు జాగ్రత్త పడుతూండాలి.. తనకోసం కూడా ఆలోచించుకోవాలి.. విలువైన డబ్బును తన కోసం కొంతయినా జాగ్రత్త చేసుకోవాలి.. ఆ డబ్బే చివరి దశలో ఆసరా అవుతుంది.. లేకుంటే జీవితంలో అభద్రత చోటుచేసుకుంటుంది.. జేబులు చెప్పే నిజాలను పట్టించుకోవాలంటూ ‘జేబు చెప్పిన ఊసులు’ నాటకం మనిషి ఎలా బతకాలో ఎలా బతకకూడదో తెలియచెప్పిన వాస్తవ ఘటనల సమాహారంగా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. స్నిగ్ధ రచించిన నాటకాన్ని మంజునాథ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ప్రధాన పాత్రల్లో ఎస్డీ బాషా, మంజునాథ్, ప్రశాంత్, మల్లాది భాస్కర్, ఆకెళ్ల గోపాలకృష్ణ, కె.శ్రీదేవి నటించారు. సంగీతం నాగరాజు, లైటింగ్ ఉమాశంకర్. నాటకం తదుపరి జరిగిన సభకు కళాపరిషత్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ రంగస్థల, సినీనటుడు నాయుడుగోపి అధ్యక్షత వహించారు. ఈ సభలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలు కె.విజయలక్ష్మికి ఎన్టీఆర్ జీనవ సాఫల్య పురస్కారాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ప్రదానం చేశారు. విశ్రాంత పోస్టల్ సూపరింటెండెంట్ కె.రమేష్, కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి పీఎస్సార్ బ్రహ్మాచార్యులు, కోశాధికారి ఎ.పోతురాజు పాల్గొన్నారు.ఆలోచింపజేసిన సాంఘిక నాటకం జాతీయస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం విశాఖ నటి, రచయిత్రి, దర్శకురాలు విజయలక్ష్మికి ఎన్టీఆర్ జీవనసాఫల్య పురస్కారం -
మద్యం మత్తులో వృద్ధుడి హత్య
గుంటూరు రూరల్: మద్యం మత్తులో వృద్ధుడిని హత్య చేసిన ఘటన రెడ్డిపాలెం సమీపంలో మంగళవారం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ కథనం ప్రకారం శారదా కాలనీకి చెందిన దారావత్ రాము (60) ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుని జీవిస్తుంటాడు. ఈ క్రమంలో రెడ్డిపాలెం వద్ద అదే గ్రామానికి చెందిన బట్టు రాజు అనే వ్యక్తితో కలిసి మంగళవారం మద్యం తాగాడు. ఈ సమయంలో వివాదం జరిగింది. దీంతో రాజు ఆవేశంలో మద్యం బాటిల్ పగలగొట్టి రాముపై దాడిచేశాడు. దాడిలో రాము తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన విషయం తెలిసిన సౌత్ డివిజన్ డీఎస్పీ భానోదయ సిబ్బందితో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. వివరాలను సేకరించిన సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
ముగిసిన టెన్త్ పరీక్షలు
● 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ● గుంటూరు స్టాల్ బాలికోన్నత పాఠశాలలో మూల్యాంకనం ● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్ష రాసిన విద్యార్థులు పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలు కొట్టారు. పరీక్షలు ముగిసిన ఆనందంలో మునిగితేలారు. మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షను జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల పరిధిలో 27,372 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 27,222 మంది హాజరయ్యారు. డీఈఓ సీవీ రేణుక,, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వెంకట్‌రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ల ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు డీఈవో సీవీ రేణుక ప్రకటించారు. జిల్లాలో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసూ నమోదు కాలేదని చెప్పారు. ఈనెల 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ఈనెల 3వ తేదీ గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూల్యాంకన విధుల్లో భాగంగా చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు జిల్లా వ్యాప్తంగా 1,200 మంది ఉపాధ్యాయులను నియమించారు. గతేడాది పెదకాకానిలోని సెయింట్ జోసఫ్ హైస్కూల్లో నిర్వహించిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు తిరిగి స్టాల్ బాలికోన్నత పాఠశాలకు మార్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్పాట్ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. విధులకు నియమితులైన ఉపాధ్యాయులందరూ గురువారం స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వైభవంగా ఆలయ వార్షికోత్సవం నిజాంపట్నం: అడవులదీవి గ్రామంలో వేంచేసియున్న అనంత సాయిబాబా మందిర 15వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. బాబాకి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. రేపు బ్రహ్మంగారి ఆరాధన తిరునాళ్ల కర్లపాలెం: ఏట్రవారిపాలెంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన తిరునాళ్ల గురువారం జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు.శిలువ పాదయాత్ర నాదెండ్ల: ఇర్లపాడు విచారణ ఆర్సీఎం సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామం నుంచి కనపర్రు బాలయేసు పుణ్యక్షేత్రం వరకు శిలువ పాదయాత్ర నిర్వహించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అయితే అందుకనుగుణంగా అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా లేదనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా ప్రమాదాలను నియంత్రించడం ఆ శాఖకు అగ్నిపరీక్షగా పరిణమించనుంది. దీనికి సర్కారు నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ప్రజలూ అప్రమత్తంగా ఉండా లని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మిస్ట్ వాహనాలు నిరుపయోగం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో గుంటూరు, 1, 2, తెనాలి, మంగళగిరి, పొన్నూరు, వెలగపూడి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయంలో ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. వెలగపూడి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయాల్లో ఉన్న అగ్నిమాపక దశాలు తాత్కాలికమే. వీటితోపాటుగా సీఎం కాన్వాయ్ విధుల్లో ఒక అగ్నిమాపక వాహనం ఉంటుంది. జిల్లాలో ఒక డీఎఫ్‌వో, ఇద్దరు ఏడీఎఫ్‌వోలు కలిపి 138 మంది సిబ్బంది ఉండాలి. మొత్తం ఏడు ఫైరింజన్లు, 5 మిస్ట్ బుల్టెట్లతోపాటు ఆధునిక అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉడాలి. వీటిలో మిస్ట్ జీప్, మిస్ట్ బుల్లెట్ ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. వీటి టైర్లు ఎండకు పాడైపోతున్న దుస్థితి. ఫైరింజన్ వెళ్ళలేని స్థితిలో మిస్ట్ వాహనాల ద్వారా మంటలు అదుపుచేస్తారు. వీటికి ఉండాల్సిన ట్యాంకర్లూ లేవు. మిస్ట్ జీప్, బుల్లెట్లు దుమ్ముపట్టుకుపోయాయి. ఫ్లోటింగ్ పంపు, చిన్నచిన్న సందుల్లోకి వెళ్ళే డీసీపీ ట్రాలీల నిర్వహణ సరిగా లేదు. సిబ్బంది కొరత గుంటూరు జిల్లాలో అగ్నిమాపక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఇద్దరు ఏడీఎఫ్లు ఉండాల్సి ఉండగా ఒకరే ఉన్నారు. స్టేషన్ ఆఫీసర్లు ముగ్గురు, లీడింగ్ ఫైర్‌మెన్ 21, డ్రైవర్లు 21, ఫైర్మెన్లు 67 మంది ఉండాల్సి ఉండగా.. ఫైర్మెన్లు 38 మంది మాత్రమే ఉన్నారు. 20 మంది హోంగార్డులతో ఈ స్థానాలు భర్తీ చేశారు. ఇంకా పది మంది సిబ్బంది కొరత ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపినా సర్కారు నుంచి స్పందన లేదు. ఉన్న సిబ్బందికి సరైన తర్ఫీదు కూడా లేదు. ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల లీక్‌లు, షార్ట్సర్క్యూట్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 101కు డయల్ చేయాలి. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకూ అవగాహన కల్పిస్తున్నాం. – ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా, అగ్నిమాపకశాఖాధికారి 7న్యూస్రీల్జిల్లాలో ప్రమాదాలు ఇలా.. అగ్నిప్రమాదాల నియంత్రణ పెను సవాలే మూలనపడిన అత్యాధునిక వాహనాలు అరకొర సిబ్బందే గతి వేసవి నేపథ్యంలో అప్రమత్తత అవసరం -
ఉపాధ్యాయ సమస్యలపై నేడు ఫ్యాప్టో నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. మంగళవారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో జరిగిన గుంటూరు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు 30 శాతం ఐఆర్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ఆర్థిక బకాయిలు, జెడ్పీ పీఎఫ్ రుణాలు, ఏపీజీఎల్ఐ క్లోజర్స్, సరెండర్ లీవ్స్ నిధులు విడుదల చేయడంతో పాటు సీపీఎస్, జీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. కారుణ్య నియమకాలు తక్షణమే పూర్తి చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ కె. వీరాంజనేయులు, డెప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్‌రావు, డీకే సుబ్బారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ. వేళాంగిణి రాజు, పి.ప్రసాద్, జిల్లా నాయకులు ఎం.సాంబశివరావు, ఎంపీ సుబ్బారావు, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
చికిత్సలన్నీ పూర్తి ఉచితం
జీజీహెచ్ క్యాథ్‌ల్యాబ్‌లో కార్డియాలజీ రోగులకు యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఫేస్మేకర్ ఇతర అన్ని రకాల గుండె చికిత్సలు పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. న్యూరో రేడియాలజీ వైద్యసేవలనూ అందుబాటులోకి తీసుకొచ్చాం. మెదుడు రక్తనాళాల్లో పూడికలు, కాళ్ళ రక్తనాళాల్లో ఏర్పడే పూడికలు తీసివేసి స్టంట్లు వేస్తున్నాం. – డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య, సీనియర్ ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, క్యాథ్‌ల్యాబ్ నిర్వాహకులు కార్డియాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేశాం. ఇటీవల 100కుపైగా గుండె బైపాస్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించాం. 25వేలకుపైగా క్యాథ్‌ల్యాబ్ చికిత్సలు పూర్తిచేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, జింకానా, నాట్కో సంస్థ, ఇతర దాతల సహకారంతో ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – డాక్టర్ యశశ్వి రమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
శంకర్‌విలాస్ బ్రిడ్జిపై అపోహలొద్దు
గుంటూరు వెస్ట్: శంకర్‌విలాస్ బ్రిడ్జి పునర్నిర్మాణంపై ఎవరికీ అపోహలు వద్దని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి ఆర్యూబీ అంశాన్ని కూడా పరిశీలించామని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలరీత్యా ఆర్యూబీ స్థానంలో ఆర్వోబీకి మాత్రమే అవకాశం ఉందన్నారు. మొత్తం 900 మీటర్ల పొడవుతో స్థానిక ఏసీ కళాశాల నుంచి అరండల్‌పేట 9వ లైను వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.98 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతోపాటు, అండర్పాస్లూ నిర్మిస్తామని పేర్కొన్నారు. మొత్తం బ్రిడ్జి నిర్మాణంతో 134 స్ట్రక్చర్లు ఎఫెక్ట్ అవుతాయని వివరించారు. ఇప్పటికే 40 మంది తమ అంగీకారం తెలిపారని, మరికొంత మంది కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే వారిని కూడా ఒప్పించే యత్నం చేస్తున్నామన్నారు. బ్రిడ్జి వల్ల ప్రభావితం అవుతున్న వారితో మూడు సమావేశాలు నిర్వహించామన్నారు. ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలు తీసుకుంటూ నిర్మాణ డిజైన్ చేపట్టామని పేర్కొన్నారు. బ్రిడ్జి తొమ్మిది మీటర్ల హైట్ ఉంటుందని పేర్కొన్నారు. కొందరు ఆరేడు మీటర్లు సరిపోతుంది కదా అని అంటున్నారని, అయితే ప్రస్తుతం రైళ్లన్నీ ఎలక్ట్రికల్ విధానంలో నడుస్తున్నాయని, వీటి ఎత్తు సుమారు 7 మీటర్లు ఎత్తు ఉంటుందని వెల్లడించారు. దీంతో తొమ్మిది మీటర్ల ఎత్తు నిర్మాణం తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్మాణంతో నష్టపోయేవారికి చెల్లించే పరిహారం కూడా చట్టానికి లోబడి ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం కొత్త బ్రిడ్జి నిర్మించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం : ఎస్పీసమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైన నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించవచ్చని పేర్కొన్నారు. నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే బ్రిడ్జిని పగులగొడతారని తెలిపారు. అమరావతి, గోరంట్ల నుంచి వచ్చే వాహనాలు ఇన్నర్‌రింగ్ రోడ్డువైపు మళ్లిస్తామన్నారు. వీలైనంత వరకు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్లాన్ ద్వారా వివరించారు. భవిష్యత్తు అవసరాల కోసం నిర్మాణం తప్పనిసరి ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం కలెక్టర్ నాగలక్ష్మి -
కార్మికులపై కూటమి కత్తి
● 60ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తొలగింపు ● పారిశుద్ధ్య విభాగంలో 103 మందికి ఉద్వాసన ● ఇంజినీరింగ్ విభాగంలో 39 మంది తొలగింపు ● గత ప్రభుత్వ హయాంలో 60 ఏళ్లు నిండితే కుటుంబ సభ్యులకు అవకాశం ● ఇప్పుడు ఆ అవకాశం లేదని అధికారుల స్పష్టీకరణ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) కూటమి ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ఆప్కాస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ సిబ్బంది వందల మందిని 60 ఏళ్ల వయసు దాటిందనే సాకుతో విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శ్రామిక వర్గం నిరసన గళం వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో కుటుంబ సభ్యులకు అవకాశం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 103 మంది పారిశుద్ధ్య, 39 మంది ఇంజినీరింగ్ కార్మికులను కూటమి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. గత వైఎస్సార్ సీపీ పాలనలో 60 ఏళ్ళు వయసు నిండిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. దీంతోపాటు ఆప్కాస్ పద్ధతిలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకూ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఆప్కాస్ పద్ధతిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వడం లేదు.. 60 ఏళ్లు పూర్తయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోస్టులు అమ్ముకునేందుకే కుట్ర! 2025 మార్చి 31కి 142 మందిని విధుల నుంచి తొలగించాలని నగరపాలక సంస్థలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇంజినీర్ అధికారులకు జాబితాతో కూడిన సర్క్యులర్‌ను ఉన్నతాధికారులు జారీ చేశారు. జాబితాలో ఉన్న కార్మికులను మంగళవారం నుంచి విధులకు రానివ్వద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోస్టులు అమ్ముకునేందుకే కూటమి ప్రభుత్వం 60 ఏళ్ల వయసు దాటిన వారిని విధుల నుంచి తొలగిస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు గుంటూరు నగరపాలక సంస్థలో 60 ఏళ్లు పూర్తయిన పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కార్మికులను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం దారుణం. పనిచేసిన కాలానికి గ్రాట్యూటీ అమలు చేయకుండా కనీస పెన్షన్ ఇవ్వకుండా వారిని ఇంటికి పొమ్మనడం తగదు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. ఇప్పటికై నా సర్కారు గ్రాట్యూటీ చెల్లించి కనీసం పెన్షన్ రూ.5,000 ఇవ్వాలి. తొలగించిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలి. –బందెల రవికుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి -
నగర పరిసరాల్లో జిల్లా ఎస్పీ పర్యటన
నగరంపాలెం: గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది విధినిర్వహణ తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. పట్టాభిపురం పీఎస్ పరిధిలోని పట్టాభిపురం, కోబాల్డ్‌పేట మసీదులు, లాలాపేట పీఎస్ పరిధిలోని ఎత్తురోడ్డు మసీదు, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని ఆంధ్ర ముస్లిం కళాశాల, నగరంపాలెం పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సమీపంలోని ఈద్గాల వద్ద నెలకొల్పిన బందోబస్త్‌ను పరిశీలించారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రార్థనలు ముగిసే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రార్థనలు ముగిశాక ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. రంజాన్ పర్వదిన సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేలా ఆయా ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట సీఐలు ఎ.అశోక్‌కుమార్ (తూర్పు ట్రాఫిక్ పీఎస్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్ పీఎస్), వైవీ.సోమయ్య (పాతగుంటూరు పీఎస్), పోలీస్ అధికారులు ఉన్నారు.నేడు యథావిధిగా టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్షగుంటూరు ఎడ్యుకేషన్ రంజాన్ పండుగ సెలవు కారణంగా వాయిదా పడిన 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం మంగళవారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినప్పటికీ, టెన్త్ సోషల్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే సోషల్ స్టడీస్ పరీక్షకు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు.జెస్సీరాజ్‌కు పతకాలుమంగళగిరి: ఈనెల 26 నుంచి 31 వరకు తైవాన్‌లో జరిగిన తైవాన్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ స్కేటింగ్ పోటీలలో మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ అద్భుత ప్రతిభ కనపరిచింది. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాలలో రెండు గోల్డ్ మెడల్స్, పెయిర్ స్కేటింగ్‌లో సిల్వర్, ఇన్ లైఫ్ ఫ్రీ స్టాల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. సోమవారం జెస్సీరాజ్‌కు ఏషియన్ ఆర్టిస్ట్ స్కేటింగ్ చైర్మన్ అలెక్స్ వాంగ్ పతకాలు అందజేసి అభినందించారు.ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తుబాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీచినగంజాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ సోమవారం చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం మొత్తం 904 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వీరిలో ఒకరు అడిషనల్ ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 67 మంది ఎస్ఐలు ఉన్నారన్నారు. మొత్తం బందోబస్తును 11 సెక్టార్లుగా విభజించామన్నారు. అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రదేశాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్, బాపట్ల, చీరాల, రేపల్లె సీసీఎస్ డీఎస్పీలు రామాంజనేయులు, మొయిన్,శ్రీనివాసరావు, జగదీష్ నాయక్‌లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం మత్తులో ఆటోలను ఢీకొట్టిన కారు
● రెండు ఆటోల్లో 17మందిపైనే ప్రయాణికులు ● ఎనిమిది మందికి గాయాలు చినగంజాం: మద్యం మత్తులో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న కూలీల ఆటోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైనే గాయాల పాలైన ఘటన సోమవారం సాయంత్రం చినగంజాం రొంపేరు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చినగంజాం పల్లెపాలెం, చీరాల బోయనవారిపాలెం గ్రామానికి చెందిన పలువురు మహిళా కూలీలు నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో కూలీ పనుల కోసం వచ్చి సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని ఆటోలలో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వారి ఆటోలు రొంపేరు బ్రిడ్జి సమీపానికి వచ్చేసరికి చీరాల నుంచి వస్తున్న ఏపీ 31 బీకే 1881 నంబరుతో ఉన్న కారులో డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి ఎదురుగా వస్తున్న కూలీల ఆటోను ఢీ కొట్టాడు. ముందు వెళ్తున్న బోయనవారిపాలెం ఆటోను బలంగా ఢీ కొట్టడంతో వెనుక ఉన్న ఆటో దానిని ఢీ కొట్టింది. వెనుక ఉన్న ఆటోలో మహిళా కూలీలకు స్వల్ప గాయాలు కాగా ముందు ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక వృద్ధురాలికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. కారు, ఆటో డ్రైవర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్య చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. గాయాలపాలైన మహిళా కూలీలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న బీహార్‌కు చెందిన శంశాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలించినట్లు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న కొండేపి శివజ్యోతి కాలు విరిగినట్లు చీరాల ఔట్ పోస్టు ఏఎస్ఐ శ్యాం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఆయన వివరించారు. -
కనిపించె ప్రగతికి స్వాగతం
తెనాలి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కత్తెర కాన్పులు అధికమయ్యాయి. సాధారణ ప్రసవాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సమీక్షలో తేలిన అంశమిది. దీనిపై వైద్యాధికారులతో ఆస్పత్రుల్లో చేయించిన తనిఖీల్లో కఠోర వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నూటికి 98 శాతం ప్రసవాలు సిజేరియన్లతోనే జరిగాయి. అయితే తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 35 శాతం వరకు సాధారణ కాన్పులు చేయగలిగారు. గత ఆర్నెల్లలో జరిగిన ప్రసవాలను సమీక్షించుకుంటే నిగ్గు తేలిన అంశమిది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీసుకున్న ముందస్తు చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రసవాల తనిఖీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, తెనాలి ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఇటీవల పట్టణంలోని ఐదు ప్రైవేటు ఆస్పత్రులు, సమీపంలోని మరో కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలను తనిఖీలు చేశారు. ఆ ఆస్పత్రుల్లో నెలకు వంద వరకు ప్రసవాలు జరిగితే, అందులో రెండు మాత్రమే సాధారణ కాన్పులు. మిగిలిన 98 సిజేరియన్లే. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సగటున నెలకు 200 ప్రసవాలు జరిగా యి. గత ఆర్నెల్లలో 1200పైగా ప్రసవాలు జరిగితే అందులో 444 కాన్పులు సాధారణమే. అంటే దాదాపు 35 శాతం. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ కాన్పులను ఎందుకు ప్రోత్సహించడం లేదని అధికారులు నిర్వాహకులను ప్రశ్నించారు. ఇకపై ఆదిశగా ప్రయత్నించాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలపై గత ప్రభుత్వం దృష్టి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేవలం ఆదేశాలతోనే సరిపెట్టకుండా అందుకు అవసరమైన చర్యలను తీసుకుంది. ఆస్పత్రిలోని లేబర్ రూమ్‌ను ఆధునికీకరించారు. పెయింట్ వేయించారు. ఏసీలు అందుబాటులోకి తెచ్చారు. లేబర్ రూంలో అవసరమైన టేబుల్స్ సమకూర్చారు. ఐదుగురు స్టాఫ్ నర్సులకు సాధారణ ప్రసవాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వీటితోపాటు మహిళలకు గర్భిణి నిర్ధారణ కాగానే, రిజిస్ట్రేషన్ చేసి, కౌన్సెలర్‌తో కౌన్సెలింగ్ ఇప్పించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్సర్‌సైజులపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారంపై డైటీషియన్ సూచనలు చేస్తున్నారు. ఓపీ హాలులోని టీవీలో ఎక్సర్సైజులు, ఆహారంపై ప్రసారాలు చేస్తు న్నారు. ప్రసవం దగ్గర పడే వరకు ఇలాంటి జాగ్రత్తలు కొనసాగిస్తున్నారు. నొప్పులు మొదలుకాగానే లేబర్ రూంకు తీసుకెళతారు. ప్రవస సేవలకు నలుగురు మెటర్నటీ అసిస్టెంట్లు, అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఇన్ని చర్యల కారణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులకు అవకాశం కలుగుతోంది. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 35 శాతం వరకు సాధారణ కాన్పులు గత ప్రభుత్వ చర్యలతో ఒనగూరిన ప్రయోజనం సాధారణ ప్రసవాలకు వైద్యులు కృషి ప్రైవేటు ఆసుపత్రుల్లో 98 శాతం సిజేరియన్లు తగ్గించాలని కమిటీ ఆదేశంతెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఆర్నెల్లలో జరిగిన ప్రసవాలు... నెల ప్రసవాలు సిజేరియన్ సాధారణ మొత్తం కాన్పులు కాన్పులు అక్టోబరు 264 168 96 నవంబరు 276 165 111 డిసెంబరు 204 135 69 జనవరి 174 110 64 ఫిబ్రవరి 144 97 47 మార్చి 27వరకు 145 88 57 మొత్తం 1207 763 444 -
జోరుగా రిజిస్ట్రేషన్లు.. భారీగా ఆదాయం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో సెలవురోజు కూడా రిజిస్ట్రేషన్లు ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం, సోమవారాలు సెలవు దినాలైనా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ రెండు రోజులు పనిచేశాయి. ఇందులో భాగంగా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆదివారం ఒక్కరోజే 24 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.కోటి 1 లక్ష ఆదాయం వచ్చిందని, సోమవారం 18 రిజిస్ట్రేషన్లు జరగా 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. భూములు, పొలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్లు భారీగా క్రయ విక్రయాలు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే రూ.కోటికిపైగా ఆదాయం వచ్చింది. ఉగాది, ఆదివారం అయినప్పటికీ కొనుగోలు దారులు వెనక్కి తగ్గలేదు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతోసెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేశాయి. దీంతో పొలాలు, స్దలాలు, ఇళ్లు భారీగా కొనుగోలు జరిగాయి. 2023–2024 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 161 కోట్ల రూపాయలు ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కాగా 142 కోట్ల రూపాయలు మాత్రమే లక్ష్యాన్ని పూర్తిచేశారు. అదే ఆర్ధిక సంవత్సరంలో 15903 డాక్యుమెంటేషన్లు జరిగాయి. కాగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళగిరి సబ్ రిజిష్టర్ కార్యాలయానికి 200 కోట్లు ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 176 కోట్లు లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలో సుమారు 16 వేల డాక్యుమెంటేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
దండకారణ్యంలో మారణకాండ ఆపాలి
నరసరావుపేట: దండకారణ్యంలో మారణకాండను వెంటనే నిలిపివేసి సుప్రీం కోర్టు న్యాయమూర్తితో ప్రభుత్వం విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో సోమవారం పౌర హక్కులు, ప్రజా సంఘాల నాయకులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మధ్య భారతంలో, ముఖ్యంగా దండ కారణ్యంలో నిత్యం ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసీలు, మావోయిస్టులను హత్యలు చేస్తున్నారని తెలిపారు. ఆయుధాలతో మావోయిస్టులు సంచరిస్తే వారిని అరెస్ట్ చేయాలన్నారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మట్టు పెట్టడం, అణిచివేస్తాం, తుడిచేస్తాం అనే పదాలు రాజ్యాంగబద్ధం కాదని పేర్కొన్నారు. ఆరు నెలల పసి పిల్లలతో పాటు, యువకులు, మహిళలను పెద్దఎత్తున కాల్చి చంపడం, 2026 మార్చి 31 నాటికి అందరిని నిర్మూలిస్తామని హోం మంత్రి అమిత్‌షా బహిరంగ ప్రకటన చేస్తూ సవాల్ విసరడం చట్టబద్ధం, న్యాయబద్ధం కాదని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో మిలిటెంట్ సంస్థలతో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకొని, వారి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటిస్తున్న పాలకులు మావోయిస్టులు, ఆదివాసీల విషయంలో వారిని నిర్మూలించడమే తమ లక్ష్యం అనడంలోనే దుర్బుద్ధి కనిపిస్తోందని వివరించారు. మధ్య భారతంలో ఉన్న ఖనిజాలు, అటవీ సంపదను తరలించుకపోవటానికి అంబానీ లాంటి కార్పొరేటర్లతో ఒప్పందాలు చేసుకున్నారన్నారు. వాటిని అమలు చేయాలంటే అక్కడ వీరు అడ్డమని, వారిని చంపడమే పరిష్కారమని పాలకుల భావిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకొని న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. 2024 జనవరి నుంచి నేటి వరకు 500 మందిని చంపేశారని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, పౌర హక్కుల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ వినుకొండ పేరయ్య పాల్గొన్నారు. పౌర హక్కులు, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ -
ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటూ ధర్నా
ఫిరంగిపురం: మండలకేంద్రం ఫిరంగిపురంలోని ముస్లింపేట వద్దనున్న జెండాచెట్టు వద్ద గల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో నానా ఇక్కట్లు పడుతున్నామని దానిని మార్చాలంటూ ముస్లింపేట వాసులు సోమవారం సాయంత్రం సొలస బస్టాండు వద్ద రోడ్డుపై బైఠాయించారు. సేకరించిన వివరాల ప్రకారం.. ముస్లింపేట వద్ద ట్రాన్స్ఫార్మర్ సరిలేని కారణంగా విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతుందని తెలిపారు. రంజాన్ పండుగ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు పడ్డామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటుచేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొలస బస్టాండువద్ద గుంటూరు – కర్నూలు రాష్ట్ర రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి స్థానికులతో మాట్లాడారు. అనంతరం విద్యుత్‌శాఖ అధికారులతో ఫోనులో మాట్లాడటంతో ప్రస్తుతం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మంగళవారం నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. పండుగనాడు విద్యుత్ లేదంటూ ఆగ్రహం ఫిరంగిపురం సొలస బస్టాండు వద్ద గుంటూరు– కర్నూలు రోడ్డుపై ధర్నా -
రేపల్లె నుంచి దూరప్రాంతాలకు సర్వీసులు నడపాలి
రేపల్లె రూరల్: తీరప్రాంతమైన రేపల్లె ఆర్టీసీ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నడపాలని పట్టణ ఆదర్శ వేదిక కార్యదర్శి యడ్లపల్లి కిషోర్‌బాబు విన్నవించారు. రేపల్లె ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతూ డిపో వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. రేపల్లె – విశాఖపట్నం – శ్రీకాకుళం, రేపల్లె – మచిలీపట్నం – కాకినాడ – విశాఖపట్టణం – శ్రీకాకుళం పోర్టు, రేపల్లె – తిరుపతి – బెంగళూరు, రేపల్లె – హైదరాబాద్ (బెర్త్‌తో కూడుకున్న బస్సులు)లతో పాటు శ్రీశైలం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు సర్వీసులు నడపాలన్నారు. అదేవిధంగా మోపిదేవి మీదగా చల్లపల్లికి మినీ సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎన్.సాయికృష్ణమాచార్యులు, కొడాలి ఆనందరావు, నటరాజ్ ఉన్నారు. -
రేపటి నుంచి ‘స్లాట్ రిజిస్ట్రేషన్’
గుంటూరు వెస్ట్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం కూటమి ప్రభుత్వ ఆదేశాలతో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి రానుంది. ప్రతి రోజూ 72 స్లాట్స్... ఏదైనా ఆన్లైన్ కేంద్రంలో ముందుగా సంబంధిత రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అనువైన, ఖాళీ ఉన్న సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. అందులో కేటాయించిన సమయంలో కార్యాలయానికి వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 72 స్లాట్స్‌ను ప్రతి రోజూ అందుబాటులో ఉంచారు. స్లాట్ బుక్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశముండదని అధికారులు చెబుతున్నారు. నరసరావుపేటలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, బాపట్లలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్లాట్ విధానం అందుబాటులో ఉంది. ముందుగా పైలెట్ ప్రాజెక్టును అమలు చేసి అందులోని ఇబ్బందులను అధిగమించి త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అమలు చేయనున్నారు. స్లాట్ బుక్ చేసుకుని దస్తావేజు మొత్తం సిద్ధం చేసుకుని ఎస్ఆర్వో కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలిఅవగాహన కల్పిస్తాం ఈ విధానం చాలా సులభతరం. స్లాట్ విషయంలో కొన్ని రోజులపాటు మేం ప్రజలకు అవగాహన కల్పిస్తాం. పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. గంటల కొద్దీ వేచి ఉండకుండా త్వరగానే రిజిస్ట్రేషన్ చేయించి పంపేందుకే ప్రభుత్వం ఈ నూతన విధానం అమలులోకి తెచ్చింది. ఇది పూర్తిగా ప్రజల సౌలభ్యం కోసమే. – షరీల్ బాబు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1, గుంటూరు -
ఎడ్ల పందేల్లో అపశ్రుతి
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులోని జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య జాతీయస్థాయి ఎడ్ల పందేల్లో మూడోరోజైన సోమవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లి దగ్గర్లోని కొమెరపూడి గ్రామానికి చెందిన యర్రా వెంకటేశ్వరరావు పందెపు ఎడ్ల జత బండలాగుడు పోటీల్లో పాల్గొన్నపుడు ఒక ఎద్దుకు కాలుజారి ఫ్రాక్చర్ అయింది. అక్కడే ఉన్న పశుసంవర్ధకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) డాక్టర్ ఒ.నరసింహారావు పర్యవేక్షణలో పశువైద్యులు పరిశీలించి ప్రాథమిక వైద్యం చేశారు. ● అత్యవసర శస్త్రచికిత్స కోసం గన్నవరంలోని పశువైద్య కళాశాలలోని సర్జరీ విభాగానికి తరలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మొబైల్ వెటరనరీ అంబులెన్స్ వాహనాన్ని రప్పించారు. తెనాలి వాహనంలో లిఫ్ట్ పనిచేయకపోవటంతో దుగ్గిరాల నుంచి 1962 మొబైల్ అంబులెన్స్‌ను పిలిపించారు. గాయపడిన ఎద్దును మొబైల్ వాహనంలోని లిఫ్ట్ సాయంతో అందులోకి ఎక్కించి, గన్నవరం తరలించారు. ● మనుషులకు 108 అంబులెన్స్ వాహనం తరహాలోనే పశువులకు ప్రమాదం జరిగినపుడు అత్యవసర వైద్యసేవల కోసమని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1962 మొబైల్ అంబులేటరీ వెటరనరీ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గాయపడిన పశువుల వద్దకు నేరుగా వెళ్లి వైద్యం చేయటం, సాధ్యం కాకపోతే పశువును లిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తరలించి వైద్యం చేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు పొరుగు జిల్లాకు వెళ్లటం నిబంధనలకు విరుద్ధమైనా, పరిస్థితి తీవ్రతతో ఉన్నతాధికారులు, ఈఎంఆర్ఐను జేడీఏ డాక్టర్ నరసింహారావు ఫోనులో సంప్రదించి, వారి అనుమతితో తరలించారు. తెనాలి పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.నాగిరెడ్డి, డాక్టర్ జి.నరేంద్ర, ఆలపాటి వెంకట్రామయ్య, సిబ్బంది సహకరించారు. బండ్ల లాగుడు పోటీల్లో కాలుజారి పందెపు ఎద్దుకు ఫ్రాక్చర్ 1962 అంబులెన్స్ వాహనంలో గన్నవరం తరలింపు -
వక్ఫ్ సవరణ చట్టంపై శాంతియుత నిరసన
లక్ష్మీపురం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈద్గాలు, మసీదులలో నమాజులు చేసుకునేందుకు వచ్చిన ముస్లింలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక నగరంపాలెంలోని ఈద్గాలో సోమవారం పవిత్ర రంజాన్ పురస్కరించుకుని జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి పాల్గొన్నారు. నమాజ్ అనంతరం కాంగ్రెస్‌పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పూర్వీకుల ఆస్తులను దోచుకుంటూ ఉంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు. వక్ఫ్ ఆస్తులు ఎవరి బాబు గాడి సొత్తు కాదని, బ్రిటిష్ వారికే భయపడకుండా గుండె చూపించి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ముస్లిం సమాజాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ముస్లింలందరూ రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమించిన వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తులను దోచుకోవాలని చూసే దుర్మార్గులకు తగిన విధంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. ముస్లింలందరూ ఐకమత్యంతో వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం, రాధారంగా నగర్, కొలనుకొండ ప్రాంతాల్లో నివాసముంటూ గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను తాడేపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈసందర్భంగా సీఐ కల్యాణ్‌రాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలు, కొనుగోలుపై దృష్టి సారించామని, వడ్డేశ్వరం, రాధారంగానగర్కు చెందిన ముత్యాల మనోజ్ కుమార్ ఏజన్సీ ఏరియాల నుంచి గంజాయి తీసుకువచ్చి వడ్డేశ్వరంలో నివాసముంటున్న షేక్ అమిద్ బాషా, కొలనుకొండకు చెందిన ప్రవీణ్‌తో కలసి గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారనే సమచారం వచ్చిందన్నారు. దీంతో వారిపై నిఘా ఏర్పాటు చేయగా ఎయిమ్స్ రోడ్‌లోని బ్రహ్మానందపురంకు వెళ్లే రహదారిలో ఈ ముగ్గురు గంజాయి అమ్మేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద వున్న 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు ఆయన తెలిపారు. గంజాయి విక్రయించే, సేవించే వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మూడు కిలోల గంజాయి స్వాధీనం -
ఏకాదండయ్య పంతులు జీవితం స్ఫూర్తిదాయకం
గుంటూరు ఎడ్యుకేషన్: ఎనిమిది దశాబ్దాల క్రితం అప్పటి కాలమాన పరిస్థితుల కనుగుణంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్య, వైద్య, ఆధ్యాత్మిక, ఆదరణ గృహాల ద్వారా సమాజ హిత సేవలందించిన ఏకాదండయ్య పంతులు జీవితం వర్తమాన, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏకాదండయ్య పంతులు చారిటీస్ ఆధ్వర్యంలో సోమవారం అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. రాళ్లబండి వెంకట సత్య రామాంజనేయ శర్మ నూతన పంచాంగ శ్రవణం గావించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఏకాదండయ్య పంతులు బహుముఖ సేవలను కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది కొండూరి కృష్ణారావు మాట్లాడుతూ ఏకాదండయ్య పంతులు ధార్మిక సంస్థలను చిరకాలంగా మేనేజింగ్ ట్రస్టీ కోటంరాజు శేష చంద్రమౌళీశ్వర రావు నేతృత్వంలో మిగతా ట్రస్టీలు కాపాడుతూ సామాజిక సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రముఖ వైద్యులు వి.రమణరావు కమలవల్లి దంపతులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక ట్రస్టీ కొండూరి నందకిషోర్, ట్రస్టీలు కేఎస్ఆర్ కుటుంబరావు, భట్రాజు కృష్ణ కిషోర్, కేసానుపల్లి వెంకట శ్రీరామ సుబ్బారావు, నెప్పల్లి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు -
తెనాలి వైద్యశాలలో అరుదైన సర్జరీ
తెనాలిఅర్బన్: రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఆటో హ్యాండిల్ రెండు తొడల మధ్య ఇరుకున్న ఓ వ్యక్తికి ఆపరేషన్ చేసి ప్రాణప్రాయాన్ని తప్పించారు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు. సేకరించిన వివరాలు, వైద్యుల కథనం ప్రకారం.. తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్‌కు చెందిన ప్రసాద్ (28) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్ వైపు తన ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రసాద్ నడుపుతున్న ఆటో హ్యాండిల్ అతని రెండు తొడల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంత సేపు ప్రయత్నించి హ్యాండిల్ బయటకు రాకపోవడంతో స్థానికులు దానిని కట్ చేసి, అతడిని జిల్లా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ జె.హనుమంతరావు రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం సెలవు అయినప్పటికీ హుటాహుటిన వైద్యశాలకు వచ్చారు. ఓపీ నుంచి అదే స్ట్రక్చర్‌పై థియేటర్‌కు తీసుకువెళ్లి అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. రెండు తొడల మధ్యలో ఇరుకున్న హ్యాండిల్‌ను తొలగించడంతో పాటు లోపల దెబ్బతిన్న నరాలను కూడా సరిచేసి కుట్లు వేశారు. వెంటనే సర్జరీ చేయడం వలన ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎనస్తీషియా వైద్యులు డాక్టర్ యశస్వి, డాక్టర్ తులసీలు పాల్గొన్నారు. రోగి తరఫు బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తొడల మధ్యలో ఇరుకున్న ఆటో హ్యాండిల్‌ను తొలగించిన వైద్యులు వ్యక్తికి తప్పిన ప్రాణాపాయం -
‘కొండవీటి కళారేఖ’ కావ్యావిష్కరణ
నరసరావుపేట ఈస్ట్: కొండవీడు పాలకుల సాహితీ సేవ, ప్రజారంజక పాలనను చారిత్రక పద్య కావ్యంగా తీసుకురావడం అభినందనీయమని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కల్లి శివారెడ్డి తెలిపారు. శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో విశ్రాంత ప్రిన్సిపాల్, పద్యకవి డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డి రచించిన ‘కొండవీటి కళారేఖ’ చారిత్రక పద్య కావ్యాన్ని శివారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సాహితీలోకంలో డాక్టర్ చేరెడ్డి ధ్రువతారగా నిలిచిపోతారని కొనియాడారు. పుస్తక సమీక్షకులు డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి, డాక్టర్ మేళ్లచెర్వు భానుప్రసాదు మాట్లాడుతూ మస్తాన్‌రెడ్డి కలం పట్టి పద్యం రాయడం మొదలు పెట్టి 60 వసంతాలు నిండాయని తెలిపారు. ఆయన రచించిన ‘అఖండ యోగి’ పాఠకుల మన్ననలు పొందిందని పేర్కొన్నారు. కొండవీటి కావ్యరేఖ సైతం అందరి హృదయాలలో నిలిచిపోతుందని వివరించారు. అనంతరం గాయత్రీ పరివార్ సత్సంగ్, సంస్కృత సంధ్యా, సద్గురు కళాసమితి ఆధ్వర్యంలో డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డిని పద్య కళానిధి బిరుదుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీనాథ సాహితీ పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి, ఆయా సంస్థల ప్రతినిధులు డాక్టర్ పోపూరి గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ వేదాంతం సత్య శ్రీనివాస అయ్యంగార్, పి.వి.ఎస్.ఆర్. ప్రసాదరావు పాల్గొన్నారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సంతోషాల రంజాన్రంజాన్ పర్వదినాన్ని సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మసీదులు, ఈద్గాలు కళకళలాడాయి. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేసవి దృష్ట్యా మసీదులు, ఈద్గాల వద్ద షామియానాలు వేశారు. తాగునీటి సదుపాయం కల్పించారు. భక్తులు ఇబ్బంది పడకుండా పలుచోట్ల కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని పలు మసీదులను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల ముస్లింలు కేంద్ర ప్రభుత్వం చేయనున్న వక్ఫ్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. నల్లరిబ్బన్లు చేతికి ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. – నగరంపాలెం(గుంటూరు వెస్ట్)7వైభవంగా పోలేరు తల్లి తిరునాళ్ల రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడులో గ్రామ దేవత పోలేరు తల్లి తిరునాళ్లను సోమవారం నిర్వహించారు. గ్రామ స్తులు పొంగళ్లు చేసి నైవేద్యంగా సమర్పించారు. ఏర్పాట్లను ఆల య ధర్మకర్త చాగంటి శ్రీనివాసరెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 519.70 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 4,050 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి సోమవారం చిలకలూరిపేట గణపవరానికి చెందిన గ్రంథి శ్రీనివాసరావు కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందించింది. న్యూస్‌రీల్ -
1, 2 తేదీల్లో జాతీయస్థాయి నాటకోత్సవాలు
తెనాలి: పట్టణానికి చెందిన డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ ఆధ్వర్యంలో 14వ జాతీయస్థాయి నాటకోత్సవాలు ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. కళాపరిషత్ వ్యవస్థాపకుడు డీఎల్ కాంతారావు, ప్రధాన కార్యదర్శి పీఎస్సార్ బ్రహ్మాచార్యులు ఆదివారం విలేకరుల సమావేశంలో నాటకోత్సవాల ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఒకటో తేదీ సాయంత్రం 6.30 గంటలకు నాటకోత్సవాల ప్రారంభసభకు కళాపరిషత్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు నాయుడు గోపి అధ్యక్షత వహిస్తారు. విశాఖపట్నంకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి, దర్శకురాలు కె.విజయలక్ష్మికి నందమూరి తారక రామారావు లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా బహూకరిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘జేబు చెప్పిన ఊసులు’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తారు. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి మంజునాథ దర్శకత్వం వహిస్తారు. 2వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్, తెనాలి వారిచే ‘ది లెసన్’ సాంఘిక నాటక ప్రదర్శన ఉంటుంది. స్నిగ్ధ రచించిన ఈ నాటికను పీఎస్సార్ బ్రహ్మాచార్యులు దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 7.30 గంటలకు శ్రీసాయి కళానికేతన్ వెల్ఫేర్ సొసైటీ, విశాఖపట్నం వారి పౌరాణిక పద్యనాటకం ‘శశిరేఖా పరిణయం’ (మాయాబజార్) ప్రదర్శిస్తారు. విద్వాన్ కన్వశ్రీ రచించిన ఈ నాటకానికి బీవీఏ నాయుడు దర్శకత్వం వహిస్తారు. -
ఎన్జీటీ కాన్ఫరెన్సులో పాల్గొన్న ఏఎన్‌యూ ఆచార్య
ఏఎన్‌యూ(గుంటూరు): నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జియాలజీ విభాగాధిపతి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు ఆచార్య పొన్నెకంటి జోసఫ్ రత్నాకర్ పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విగ్యాన్ భవన్లో ఈనెల 29, 30 తేదీలలో జరిగిన ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్– 2025’లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్యతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సును ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించగా 30వ తేదీ సాయంత్రం జరిగిన ముగింపు సభకు ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్ఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో ప్రస్తుతం పర్యావరణం ఎదుర్కొంటున్న సవాళ్ళు, పర్యావరణ నిర్వహణలో ఉత్తమ పద్దతుల అనుసరణ, పర్యావరణ పరిరక్షణలో పలు విభాగాల భాగస్వామ్యం, సుస్థిర పర్యావరణ నిర్వహణకోసం భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన తదితర అంశాలపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రతినిథులు హాజరై చర్చించారు. వారి అభిప్రాయాలను తెలియజేసి నివేదికల రూపంలో అందజేశారు. ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్, ఎన్జీటీ చైర్మెన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరామణి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణం ఏర్పాటుపై నిరసన
తెనాలి రూరల్: స్థానిక మత్తెంశెట్టిపాలెంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ముత్తెంశెట్టిపాలెం ప్రధాన సెంటరు వద్ద మద్యం దుకాణాన్ని ఆదివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ ద్వారా పాత రత్నా టాకీసు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ముత్తెంశెట్టిపాలేనికి తరలించారు. ఆదివారం దుకాణాన్ని తెరవడంతో స్థానికులు వ్యతిరేకించారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు వద్దని ఆక్షేపించారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కొనసాగించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై నిరసన తెలుపడం సరికాదని, సంబంధిత ఎకై ్సజ్ అధికారులను, మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తమ అభ్యంతరాన్ని తెలియజేయాలని సూచించారు. స్థానికులు మాత్రం ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. -
హత్య కేసులో ముగ్గురు అరెస్టు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కేఎల్ రావు కాలనీలో గుర్తు తెలియని వ్యక్తిని కొట్టి చంపిన కేసులో తాడేపల్లి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదివారం కోర్టుకు హాజరుపరిచారు. నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ కల్యాణ్‌రాజు నేతృత్వంలో నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఈనెల 27న గుర్తుతెలియని సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి కేఎల్‌రావు కాలనీలోని హోసన్న ప్రార్థనా మందిరం వద్ద దుర్గాశి రాజేశ్వరి ఇంట్లోకి దూరి ఆమైపె అఘాయిత్యం చేయడానికి యత్నించాడు. రాజేశ్వరి బిగ్గరగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వల్లభాపురం జశ్వంత్, వల్లభాపురం కోటేశ్వరరావు, బోజంగి సింహాచలం నాయుడు మరో ముగ్గురు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే ఆ వ్యక్తి కొండపైకి పారిపోయాడు. దీంతో అతడిని వెంబడించి పట్టుకుని పిడిగుద్దులు కురిపించడంతో మరణించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రోడ్డుపైకి తీసుకొచ్చి పడేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు ఎస్ఐ జె.శ్రీనివాసరావుతో కలిసి దర్యాప్తు చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద తిరుగుతున్న వల్లభాపురం జశ్వంత్, వల్లభాపురం కోటేశ్వరరావు, బోజంగి సింహాచలం నాయుడును అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ హత్యలో పాలుపంచుకున్న మరో ముగ్గురు మైనర్లు అని తేలింది. వారినీ త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. -
ఉల్లాసంగా ఎడ్ల పందేలు
తెనాలి రూరల్: తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. వారం రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. రెండోరోజు ఉత్సాహంగా పందేలు సాగాయి. తెనాలి, పరిసర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలిరోజు శనివారం రాత్రి జరిగిన రెండు పళ్ల విభాగం పోటీల్లో నంధ్యాల జిల్లా గడివేములకు చెందిన పెరుమాళ్ల సంజయ్‌కుమార్ ఎడ్ల జత నిర్ణీత సమయంలో 3592.01 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకుంది. ఈ జత యజమానికి సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ బహుమతిని అందజేశారు. నాలుగు పళ్ల విభాగంలో.. రెండోరోజు నాలుగు పళ్ల విభాగం పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో మొత్తం 14 జతల ఎడ్లు పోటీకి దిగాయి. రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగిన పోటీల్లో బాపట్ల జిల్లా జే పంగలూరుకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ యూత్ ఎడ్ల జత ముందంజలో ఉంది. పోటీలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. పోటీలకు రిఫరీగా సూరపనేని రాధాకృష్ణ వ్యవహరించారు. -
వక్ఫ్ సవరణ బిల్లుతో తీవ్ర అన్యాయం
రేపల్లె రూరల్: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం కోరారు. పట్టణంలోని తన చాంబర్లో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ముస్లింల హక్కులు, స్వేచ్ఛను కాలరాయటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతోందన్నారు. బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించటం బాధాకరమన్నారు. సమస్య ముస్లిం సమాజందే కాకుండా దేశ సమస్యగా ప్రతి ఒక్కరూ భావించి బిల్లు సవరణను అడ్డుకోవాలని ఆమె కోరారు. బిల్లు పార్లమెట్లో ఆమోదం పొందితే ముస్లింల భావితరం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులపై ప్రైవేటు సంస్థలకు, ప్రభుత్వాలకు ఎటువంటి అధికారం ఉండదని, ఆస్తులపై అధికారం చేజిక్కించుకోవాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్‌లో ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్లిం పెద్దలు వక్ఫ్ బోర్డు ద్వారా పలు ఆస్తులను ఏర్పరిచారని, వాటిని స్వాధీనం చేసుకోవాలన్న కుట్రతో బిల్లును తెరపైకి తెచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం -
శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరునికి ఆదివారం వేకువజామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఈవో సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో వెంకటాద్రినాయుడు మండపంలో స్వామిని ఉంచి, శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ రంగాల్లో జరిగే పరిణామాలను వివరించారు. అనంతరం భక్తులందరికీ ఉచితంగా పంచాంగాలను పంపిణీ చేశారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
చినగంజాం: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామానికి ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో గ్రామంలో ఆదివారం కలెక్టర్, ఎస్పీ తుషార్ డూడీలు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులకు కేటాయించిన బాధ్యతలను సోమవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ప్రజావేదిక వద్ద 2 వేల మంది ప్రజలు హాజరయ్యే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. ఆయనవెంట జేసీ ప్రఖర్ జైన్, డీఆర్ఓ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, జిల్లా రవాణాశాఖాధికారి పరంధామరెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి మాధవ నాయుడు తదితరులు ఉన్నారు. -
తాడేపల్లి క్రీడాకారుడికి స్కేటింగ్‌లో పతకాలు
తాడేపల్లి రూరల్: ఈనెల 24 నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో తాడేపల్లి డోలాస్నగర్కు చెందిన మెరుగుపాల హాశిష్ సత్తాచాటాడు. చైనీస్ తైపి రోలర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో హాశిష్ ఆర్టిస్ట్ స్కేటింగ్ విభాగంలో ఫ్రీ స్టైల్, ఇన్లైన్, సోలో డ్యాన్స్ పోటీల్లో తలపడగా మూడు విభాగాల్లో రెండవ స్ధానంలో నిలిచి మూడు రజిత పతకాలు సాధించాడు. తమిళనాడు కోలాచీలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన జాతీయస్ధాయి పోటీల్లోనూ హాశిష్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కోచ్ పి.సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రోలర్స్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి.థామస్, గుంటూరు రోలర్‌స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నీలిమ, శ్రీకాంత్ హాశిష్కు అభినందనలు తెలిపారు. -
రూ.30 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ
కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ఆధ్వర్యంలో తులసి సీడ్స్ సహకారంతో 570 మంది పేద విద్యార్థులకు ఆదివారం రూ.30 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ తాను పదో తరగతిలో ఉండగా కేవలం రూ.16 ఫీజు కట్టలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. బీటెక్ ఇంటర్ చదివే రోజుల్లో ప్రభుత్వ ఉపకార వేతనం రూ.450 అందేదని చెప్పారు. జీవితంలో స్థిపడ్డాక 1995–96లో ఇద్దరు విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వడం మొదలు పెట్టానని, ఇప్పుడు 36వేల మందికి రూ.22 కోట్లు ఉపకారవేతనంగా అందిస్తున్నానని వివరించారు. కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలెజ్డ్ ట్రస్టు ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ వితరణలో సింహభాగం తులసి సీడ్స్ సమకూరుస్తుందని వివరించారు. -
మస్తిష్కం మరణ వేదన
జీజీహెచ్‌లో కార్పొరేట్ వైద్యం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పక్షవాతం బాధితులకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. పది పడకలతో రూ.50 లక్షలతో నిర్మించిన ఆధునిక స్ట్రోక్ యూనిట్లో 2015 అక్టోబర్ నుంచి వైద్యుసేవలు అందిస్తున్నాం. రెండు తెలుగురాష్ట్రాల్లో స్ట్రోక్ యూనిట్ కలిగి ఉన్న ఏకైక ప్రభుత్వ ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్. – డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, న్యూరాలజీ వైద్యవిభాగాధిపతి గుంటూరు జీజీహెచ్ 20శాతం కేసులకు ఆపరేషన్లు తప్పనిసరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో నూటికి 80శాతం మందికి మందులతో నయమైపోతుంది. 20శాతం మంది మెదడులో రక్తపుగడ్డ పెద్దసైజులో ఉంటుంది. అప్పుడు శస్త్రచికిత్స తప్పనిసరి. – డాక్టర్ భవనం హనుమశ్రీనివాసరెడ్డి, న్యూరోసర్జన్, జీజీహెచ్ గుంటూరు. గోల్డెన్ అవర్ కీలకం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత తొలి మూడు గంటలూ గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఈలోపు సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. – డాక్టర్ పమిడిముక్కల విజయ, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, గుంటూరుగుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. దీనినే పక్షవాతం అని కూడా అంటారు. దీనిని నూటికి 80శాతం నివారించవచ్చని, అవగాహన లేకపోవటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు రోజూ 15 మంది వరకు పక్షవాతానికి గురైన వారు వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో 30 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు మూడు నుంచి ఐదుగురు పక్షవాత బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి 70 లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారు. వీరిలో 65 లక్షల మంది చనిపోతున్నారు. మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు పక్షవాతానికి గురవుతున్నారు. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల వ్యాధి విషమంగా మారుతుందని, ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆకుపసర్లు మింగుతూ కాలయాప చేయడం వల్ల పరిస్థితి విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకొస్తుందంటే..! రక్తనాళాలు పూడుకుపోవటం వల్ల మెదడుకు రక్తసరఫరా ఆగిపోతే పక్షవాతం వస్తుంది. పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్. హార్ట్ అటాక్లాగే ఇది చాలా ప్రమాదకరం. రక్తపోటు(బీపీ) పెరిగి రక్తనాళాలు దెబ్బతిని చిట్లిపోవడం వల్ల పక్షవాతం వస్తుంది. అధికరక్తపోటు, మధుమేహం, మెదడులో కణుతులు, రక్తంలో కొవ్వు పదార్ధాల వల్ల పక్ష వాతం వచ్చే అవకాశం ఎక్కువ. మెదడువాపు, గుండెజబ్బలూ పక్షవాతానికి దారితీయొచ్చు. స్థూలకాయుల్లోనూ, 70 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి అధికంగా వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు.. పక్షవాతం వచ్చినవారిలో ఒకే వస్తువు రెండుగా కనబడటం, మాట తడబడటం, మింగుడు పడకపోవటం, కళ్లు, తల తిరగటం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, మూతి వంకరపోవటం, దృష్టి మందగించటం, కాళ్ళు చేతులు ఉన్నట్టుండి బలహీన పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రోగి కోమాలోకి వెళ్తాడు. ముందు జాగ్రత్తలతో రక్షణ ముందు జాగ్రత్త చర్యలతో పక్షవాతం రాకుండా చూసుకోవచ్చు. రక్తపోటు, షుగర్‌ను అదుపులో పెట్టుకోవాలి. మద్యం, ధూమపానాలకు దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడదు. రోజూ వ్యాయామం చేయటం మంచిది.బ్రెయిన్ స్ట్రోక్.. బీకేర్‌ఫుల్ చిన్న వయస్సులోనే స్ట్రోక్ మరణాలు 80 శాతం పక్షవాతాన్ని నివారించవచ్చు ఆశ్రద్ధ చేస్తే ముప్పు తప్పదు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం యుక్త వయసులోనే స్ట్రోక్ కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన వెంకటనాగయ్య, పరిమళ దంపతుల కుమారుడు రిషికేష్ పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 17న టెన్త్ పరీక్షలు రాసి వచ్చాడు. సాయంత్రం విపరీతమైన తలనొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పి మంచంపై వాలిపోయాడు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కంగారు పడిన తల్లిదండ్రులు కర్నూలులోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి బ్రెయిన్ స్ట్రోక్ అని నిర్ధారించారు. ఆపరేషన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆధునిక జీవన శైలి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వయస్సుతో సంబంధం లేకుండా వస్తుందనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. జీజీహెచ్‌లో చికిత్స పొందిన బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు ఇలా.. సంవత్సరం రోగుల సంఖ్య 2022 515 2023 540 2024 450 -
ముందు తరాలకు అందించాలి
తెలుగు భాషా వైభవాన్ని నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషా వైభవాన్ని ముందు తరాలకు అప్పగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. ఉగాది పండగ సందర్భంగా సాహితీ సమాఖ్య, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీవేంకటేశ్వర విజ్ఙాన మందిరంలో ఆదివారం సాయంత్రం సాహితీ వసంతోత్సవం నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ డీవీఎస్బీ రామమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను మండల స్థాయిల్లోనూ నిర్వహించాలని చెప్పారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని అన్నారు. పీ–4 మంచి కార్యక్రమం అని, ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని చెప్పారు. సంగీత విద్వన్మణి ఆర్.సూర్యలక్ష్మీ శిష్య బృందంతో విష్ణుసహస్రనామ పారాయణం చేయగా, గుదిమెళ్ల శ్రీ కూర్మనాథస్వామి పంచాంగ శ్రవణం చేపట్టారు. అనంతరం సాహితీ సమ్మేళనంలో సుప్రసిద్ధ సినీ గేయ, గజల్ రచయిత రసరాజు, సుప్రసిద్ధ సినీ నటులు కేదార్ శంకర్, హాస్య రచయిత డాక్టర్ పీవీ రామ్‌కుమార్, సంభాషణ రచయిత కె.కృష్ణవేణి, అష్టావధాని సల్లాన్ చక్రవర్తుల సాహిత్ పాల్గొన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్.లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఆర్.రాము, టీఎంటీ ట్రస్ట్ కార్యదర్శి పి.రామచంద్రరాజు పాల్గొన్నారు.ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ -
విశ్వావసు.. విజయోస్తు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఉగాది పండగ సందర్భంగా మార్కెట్ కూడలిలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖ, నగరపాలక సంస్థ సంయుక్తంగా విశ్వావసు నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించాయి. ఎమ్మెల్యేలు నసీర్‌అహ్మద్ (తూర్పు), బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు), జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, రాష్ట్ర ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కార్పొరేటర్లు సమత, ఈరంటి వరప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. తొలుత నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీకూర్మనాధస్వామి పంచాగపఠనం ఆకట్టుకుంది. అనంతరం పలు రంగాల ప్రముఖులు, కవులను సత్కరించారు. శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీకూర్మనాథస్వామి, అర్చకులు షణ్ముఖ రఘుకిషోర్శర్మ, గంజాం రాధాకృష్ణమాచార్యులు, జంధ్యాల వెంకటరామలింగేశ్వరశాస్త్రి, వేద పండితులు చింతపల్లి నరసింహమూర్తి, పలు రంగాల్లోని ప్రముఖులు సాంబశివరావు, భట్టు సిదానందశాస్త్రి, మండవ నరసిహారావు, గోగినేని రామారావు, హాజీబేగ్సాహెబ్, సయ్యద్ జానీభాషా, కోల్లా వీరయ్య చౌదరి, కవులు డాక్టర్ రావి రంగారావు, షేక్.ఖాసింబీ, డాక్టర్ నల్లాన చక్రవర్తుల సుధామైథిలీ, చల్లా సత్యవతిరెడ్డి, డాక్టర్ గడల శివప్రసాద్, షేక్.అస్మతున్నీసాబేగం, నూతక్కి ప్రజ్ఙాచారి, ఏవీకే.సుజాత, జానీభాషా, బొమ్మ మహేశ్వరరెడ్డి తదితరులు జ్ఙాపికలు, ప్రశంస పత్రాలు, నగదు పురస్కారాలతో సత్కారాలు అందుకున్నారు. అందరికీ మంచి జరగాలి ఎమ్మెల్యేలు నసీర్‌అహ్మద్, బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి మాట్లాడుతూ ఈ ఉగాది అందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, స్టెప్ సీఈఓ చంద్రమౌళి, జిల్లా టూరిజం అధికారిణి రమ్య, దేవదాయ, ధర్మదాయ శాఖ డీసీ శ్రీనివాసులు, జీఎంసీ ఏసీ ఓబులేస్, పీవో రామారావు, ఈఈ సుందరరామిరెడ్డి, కార్పొరేటర్లు, ప్రముఖులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. కుర్చీలన్నీ ఖాళీగా.. శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీకూర్మనాథస్వామి పంచాగ పఠనం పూర్తయిన తర్వాత ఆడిటోరియం ఖాళీగా మారింది. అయినా ఎమ్మెల్యేలు, కమిషనర్ ప్రసంగం చేశారు. అలాగే కవులకు సత్కారం చేశారు. ఈ క్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు తక్కువగా ఉండడంతో కమి సమ్మేళనం జరగకుండానే కార్యక్రమాన్ని ముగిద్దామని ప్రతిపాదించడాన్ని కవులు వ్యతిరేకించారు. దీంతో కవి సమ్మేళనం కొనసాగింది. గుంటూరులో ఉగాది వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ మధ్యలోనే నిష్క్రమించిన ప్రజలు ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు -
విజయ కీలాద్రిపై ఉగాది వేడుకలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళ శాసనాలతో విశ్వావసు నామ సంవత్సర ఉగాది నుంచి తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించామని తెలిపారు. ఉదయం హనుమ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రులకు అభిషేక మహోత్సవం అనంతరం పంచాంగ పఠనం, సుందరకాండ పారాయణ, అష్టోత్తర శతనామార్చన, సీతారామ చంద్రులకు కల్యాణ మహోత్సవం నిర్వహించామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పై కార్యక్రమాల్లో పాల్గొని రామచంద్రుల ఆశీస్సులు పొందితీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు నగరంపాలెం: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు గమనించాలని జిల్లా ఎస్పీ కోరారు. బంగారు గరుడోత్సవంమంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం ఉదయం ఉగాది తిరువంజనోత్సవంతోపాటు స్వామికి శాంతి కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం ఉగాది సందర్భంగా శనగల శేషాంజనేయ గోపాల్ పంచాంగ పఠనం చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామి బంగారు గరుడోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. అద్దాల మహల్ పవళింపు సేవలో గులాబీ పువ్వులతో సహస్ర నామార్చన నిర్వహించారు. ఆలయ ఈఓ రామకోటి రెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బంగారు గరుడోత్సవానికి కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన నందికంటి వెంకట హనుమాన్ ప్రసాద్ వ్యవహరించారు. శివ లింగాన్ని తాకిన సూర్య కిరణాలు దాచేపల్లి : మండలంలోని గామాలపాడులో సుప్రసిద్ధ మహా శైవ క్షేత్రంలోని శివలింగాన్ని ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. సూర్యోదయం అయిన తరువాత దేవాలయం తలుపులు తీయగానే నేరుగా గర్భగుడిలోని శివలింగంపై పడ్డాయి. దీంతో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు తరలివచ్చి శివలింగాన్ని దర్శించుకుని, పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, సర్పంచ్ జంగా సురేష్ మహా శైవ క్షేత్రంలో పూజలు నిర్వహించారు. శివలింగాన్ని సూర్య కిరణాలు తాకడం అరుదైన ఘటన కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరస్వామికి కిరీటం బహూకరణ గురజాల రూరల్ : నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామికి రూ.5లక్షల విలువైన బంగారు పూత కలిగిన వెండి కిరీటాన్ని నందేల పెద్ద సైదారెడ్డి, నాగమ్మ, చిన సైదారెడ్డి, కోటేశ్వరమ్మ ఆదివారం బహూకరించారు. కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అర్చకులకు అందజేశారు. -
విర్రవీగుతున్నావా లోకేష్ రాజా?.. రెడ్‌బుక్‌పై అంబటి సెటైర్లు
సాక్షి, గుంటూరు: నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఇంకా అంబటి రాంబాబు ఏమన్నారంటే... ఆయన మాటల్లోనే..తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.ఏనాడైన తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా?తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ ఆఖరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆయన జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీది. దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారు.దీనినే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శం. సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారు. ఇది కార్యకర్తల పార్టీ, శాశ్వతంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇదే పార్టీలోని కార్యకర్తలను ఆయన ఈసడించుకుంటున్నారు. తన కుమారుడి పదవి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్టరెడ్బుక్ అంటూ విర్రవీగుతున్న లోకేష్ రాజాచంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారు. తన రెడ్‌బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని విర్రవీగుతున్నాడు లోకేష్ రాజా. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు వెళ్ళకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయావా లోకేష్ రాజా.జైలులో చంద్రబాబుకు వెన్నుపూస కింద వరకు దద్దుర్లు వచ్చాయని, రాత్రిపూట దోమలు కుడుతున్నాయని, శరీరంపై పొక్కులు మొలుస్తున్నాయని వాపోయారు. 750 మంది డ్రగ్స్ తీసుకునే నేరచరిత్ర ఉన్న ఖైదీలున్న జైలులో మా నాన్నను వేశారంటూ లోకేష్ వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ రోజు అధికారం ఉందని తన రెడ్‌బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్లో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్ రాజాకు ముందుంది ముసళ్ళ పండుగ. ఈ రోజు నీవల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారు రాజా. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎగతాళి దినోత్సవంగా మారుస్తూ మాట్లాడుతున్న దానికి ఏదో ఒకరోజు జవాబు దొరుకుతుంది రాజా. హామీలు అమలు చేయని మీ అసమర్థతపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులపై న్యాయస్థానాల స్పందన చూసిన తరువాత అయినా సిగ్గు తెచ్చుకోవాలి. రెడ్‌బుక్ రాజ్యాంగం, వాగ్దానాల అమలు చేయకుండా పారిపోయే మోసగాళ్ళు మీరు. పార్టీ ఆవిర్భావం మీది కాదు, నందమూరి తారక రామారావుది. ఆయన పార్టీని మీరు మోసపూరితంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్న పార్టీ. వాపుచూసి బలం అనుకుంటోంది, శక్తిలేని పార్టీ. తెలుగుదేశం ఒక పేకమేడ లాంటివి. వారినీ వీరిని అడ్డంపెట్టుకుని బతుకుతున్న రాజకీయ జీవితాలు.దోపిడీనే చంద్రబాబు నైజంతాజాగా విజయం సాధించగానే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అన్నారు. సూపర్ సిక్స్ ను అమలు చేస్తానని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా అమరావతి నిర్మాణానికి హుండీలు పెట్టారు, చందాలు ఇవ్వమని అడిగారు, ఇటుకలు అమ్ముకున్నారు. అమరావతికి రెండు గాజులు ఇచ్చి అమరావతిని దోచుకున్నారు. ఇప్పుడు 26వేల కోట్లు అమరావతి అంటున్నారు. దీనిలోనూ దోపిడీ.కాంట్రాక్టర్ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారు. డయాఫ్రం వాల్ వేసేసిన తరువాత జగన్ కాఫర్ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారు. సింపుల్‌గా ఇన్వెస్ట్ చేయడం.. భారీగా బాగుపడటం చంద్రబాబు నైజం. రెండెకరాల నుంచి ప్రారంభించారు, నేడు వేల కోట్లు సంపాధించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటు. -
నృసింహుని హుండీ ఆదాయం రూ. 38.70 లక్షలు
మంగళగిరి టౌన్ : పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీలను గురువారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. దేవస్థానానికి సంబంధించి ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్ రోడ్డులో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 38,70,176లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువ సన్నిధి హుండీ ఆదాయం రూ.16,13,384, దిగువ సన్నిధి హుండీ ఆదాయం రూ. 21,76,972, ఘాట్ రోడ్డులోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 43,011తో పాటు అన్నదానానికి రూ. 36,809 వచ్చినట్లు సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి తెలిపారు. గతంలో మూడు నెలలకు గాను రూ. 50,97,560 వచ్చిందని, ఇప్పుడు ఒక నెల ముందుగా లెక్కింపు కారణంగా రూ. 12,27,844 తక్కువ వచ్చినట్లు ఆయన వివరించారు. లెక్కింపును కాజ గ్రూపు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పి. వెంకటరెడ్డి పర్యవేక్షించారు. -
నాటక కళ పరిరక్షణ అందరి బాధ్యత
నగరంపాలెం: సర్వ కళా సమాహారం నాటకమని, ఇటువంటి కళను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళా వేదికపై కళా విపంచి (హైదరాబాద్), ఆరాధన ఆర్ట్స్ అకాడమి (గుంటూరు), నటరత్న ఎన్.టి.ఆర్. కళాపరిషత్ సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న రంగస్థల పురస్కారాల సభ గురువారం రాత్రి ప్రారంభమైంది. పిన్నమనేని మృత్యుంజయరావుకు గురజాడ పురస్కారం, బసవరాజు జయశంకర్‌కు బళ్లారి రాఘవ పురస్కారం, వైవీఆర్ ఆచార్యులకు పీఎస్ఆర్ పురస్కారం, సుంకర కోటేశ్వరరావుకు గరికపాటి రాజారావు పురస్కారం, సురభి సంతోష్‌కు గోవిందరావు పురస్కారం, తిరుమలాబీకి రఘురామయ్య పురస్కారం, డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబుకి వై.కె.నాగేశ్వరరావు పురస్కారం, జ్యోతికి జామున రాయలు పురస్కారం, మల్లాది భాస్కర్‌కు జంధ్యాల పురస్కారం అందించి, సత్కరించారు. తొలుత ఆలాపన వెంకటేశ్వరరావు, మునిపల్లె రమణ సినీ భక్తి గీతాలు అలపించారు. రచయిత, సినీ నటుడు యు.సుబ్బరాయశర్మ, డాక్టర్ ఎస్.రామచంద్రరావు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, కళా పోషకులు నూత లపాటి సాంబయ్య, ఉప కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. కార్యక్రమాలను బొప్పన నరసింహారావు, డి.తిరుమలేశ్వరరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు, భాగి శివశంకరశాస్త్రి, జీవీజీ శంకర్, సయ్యద్ జానీబాషా, మధుసూదనరావు పర్యవేక్షించారు. మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పలువురికి రంగస్థల, ఉగాది పురస్కారాలు ప్రదానం -
శ్రీరంగపురం ఉప సర్పంచ్‌గా నాగమ్మ
శ్రీరంగపురం(చేబ్రోలు): చేబ్రోలు మండలం శ్రీరంగపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన పోతురాజు నాగమ్మ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం ఈవోపీఆర్డీ టి. ఉషారాణి పర్యవేక్షణలో ఎన్నికను నిర్వహించారు. పంచాయతీ ఒకటో వార్డు మెంబరు పోతురాజు నాగమ్మను సభ్యులందరూ ఆమోదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి ఉషారాణి నాగమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న నాగమ్మను గ్రామ సర్పంచ్ జాస్తి సాంబశివరావు, తిరుమలశెట్టి బాల, చెరుకూరి భాస్కరరావు, పి. శివశంకర్, వైఎస్సార్ సీపీ నాయకులు అభినందించారు. -
ఫ్యాప్టో నూతన కార్యవర్గం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) గుంటూరు జిల్లా చైర్మన్‌గా కె. నరసింహారావు (ఏపీటీఎఫ్–1938), సెక్రటరీ జనరల్‌గా కె. వీరాంజనేయులు (ఎస్సీ, ఎస్టీ సంఘం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎం. కళాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఫ్యాప్టో కో–చైర్మన్లుగా బి. సత్యం (హెచ్ఎంఏ), షేక్ ఫైజుల్లా (డీటీఎఫ్), డెప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా యు. రాజశేఖర్‌రావు (యూటీఎఫ్), బి. సుబ్బారెడ్డి (ఎస్టీయూ), ఎండీ ఖాలీద్ (ఏపీటీఎఫ్–257)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
దుగ్గిరాల ఎంపీపీగా షేక్ జబీన్ ఏకగ్రీవం
దుగ్గిరాల: స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక గురువారం సమావేశ మందిరంలో నిర్వహించారు. డ్వామా పీడీ శంకర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. టీడీపీ చెందిన ఎంపీటీసీ సభ్యులు తొమ్మిది మంది, జనసేన సభ్యులు ఒకరు, కోఆప్షన్ సభ్యులు ఒకరు ఎన్నికలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యులంతా గైర్హాజర్ అయ్యారు. ముందుగా సమావేశంలో కోరం సభ్యులు సరిపోగా ఎన్నిక ప్రారంభించారు. గొడవర్రు ఎంపీటీసీ శివకుమార్ లేచి జబీన్‌ను అధ్యక్షురాలిగా ప్రతిపాదించారు. దీన్ని మధుబాబు బలపరిచారు. ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో జబీన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కార్యక్రమంలో ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ.సునీత పాల్గొన్నారు. అల్లర్లు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎస్ఐ వెంకట రవి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మంచికలపూడిలో ఉప సర్పంచిగా పులి కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అఽధికారి కె.జె.నెహ్రూ తెలిపారు -
జీడీసీఎంఎస్‌ను ప్రథమ స్థానంలో నిలపాలి
పర్సన్ ఇన్చార్జి, జేసీ భార్గవ్ తేజ కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీడీసీఎంఎస్)ను అన్ని రంగాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పర్సన్ ఇన్చార్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. స్థానిక కన్నావారితోటలోని జీడీసీఎంఎస్ కార్యాలయంలో గురువారం జరిగిన మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)ను లాభాల్లో నడిపించాలని చెప్పారుఉ. ముందుగా బిజినెస్ మేనేజర్ డి.హరిగోపాలం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.6.21 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024–25లో జిల్లాలోని 44 జీడీసీఎంఎస్ బ్రాంచీలు, పలు పీఏసీఎస్‌ల ద్వారా రూ.81 కోట్లు విలువైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, నోటు పుస్తకాలు, స్టేషనరీ, ప్రొవిజన్స్ తదితర వ్యాపారాలు చేసినట్లు పేర్కొన్నారు. 2024–25 ఖరీఫ్ సీజన్లో ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 12 మండలాల్లో రూ.280 కోట్ల విలువ గల 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏపీ మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.19.19 కోట్ల విలువ గల 2,541 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లు లాభం ఆర్జించినట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాపారాలు చేసి జీడీసీఎంఎస్‌ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జేసీ భార్గవ్ తేజ పలు ఫైళ్లు, తీర్మానాలపై సంతకాలు చేశారు. సమావేశంలో జీడీసీఎంఎస్ కార్యాలయం మేనేజర్ కె.శ్రీనివాసరావు, పీఏసీఎస్‌ల పర్సన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
8 నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
లక్ష్మీపురం: విజయవాడ నుంచి సప్త (7) జ్యోతిర్లింగ దర్శనం చేసే భారత్ గౌవర్ టూరిస్ట్ రైలును ఏప్రిల్ 8వ తేదీనుంచి నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రలో ఉజ్జయిన్లో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకలో నాగేశ్వర్, సోమనాథ్‌లో సోమనాథ్, పుణేలో భీమశంకర్, నాసిక్‌లో త్రయంబకేశ్వరుడు, ఔరంగబాద్‌లో గ్రిష్ణేశ్వర్ను చూడవచ్చని తెలిపారు. యాత్ర ఏప్రిల్ 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 11రాత్రులు, 12 రోజులు ఉంటుందని వివరించారు. రైలు విజయవాడ నుంచి, ఖమ్మం, కాజీపేట, సికింద్రబాద్ మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.20,890, 5నుంచి 11 సంవత్సరాల చిన్నారులకురూ.19,555 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి హోటల్లో బస నాన్ ఏసీ, రవాణా నాన్ ఏసీ వాహనంలో ఉంటాయని తెలిపారు. త్రీ టైర్ ఏసీలో అయితే పెద్దలకు రూ.33,735, 5నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు రూ.32,160 చార్జీలు ఉంటాయన్నారు. హోటల్లో రాత్రి బస ఏసీ రూమ్, రవాణా నాన్ ఏసీ వాహనంలో ఉంటుందన్నారు. టూ టైర్ ఏసీలో అయితే పెద్దలకు రూ.44,375, 5నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు రూ.42,485తో పాటు ఏసీ హోటల్, రవాణా ఏసీ వాహనంలో ఉంటుందని తెలిపారు. అన్ని శాకాహార భోజనాలు, ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, ప్రయాణికులకు బీమా, వృత్తిపరమైన, స్నేహపూర్వక పర్యటన ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రత, అవసరమైన సహాయం కోసం ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ అంతటా ప్రయాణిస్తారని పేర్కొన్నారు. అన్ని రకాల పన్నులు వర్తిస్తాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఆన్లైన్ బుకింగ్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఇతర వివరాలకు 9281495848, 9281030714 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం సప్తర్లింగ్ దర్శన యాత్ర బ్రోచర్‌ను ఆవిష్కరించారు. -
సాంకేతికతను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలి
ఏఎన్‌యూ వీసీ గంగాధరరావు గుంటూరు ఎడ్యుకేషన్: సాంకేతిక విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు పేర్కొన్నారు. జేకేసీ కళాశాలలో గురువారం కంప్యూటర్ రంగంలో నూతన అధునాతన పోకడలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజ్ఞానాన్ని, సాంకేతితను దుర్వినియోగపరచరాదని విద్యార్థులకు సూచించారు. గతంలో కంటే విజ్ఞానశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. దీనిపై విద్యార్థులు, పరిశోధకులు దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని సూచించారు. కంప్యూటర్ సైన్సులో నాటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న అధునాతన దశల గురించి వివరించారు. విద్యాబోధన, అధ్యయనం సమాంతరంగా సాగాలని తెలిపారు. అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలన్నారు. ఆధునిక బోధనా పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించినప్పుడే మెరుగైన జ్ఞానాన్ని పొందుతారని సూచించారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్సార్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ పి.గోపీచంద్, వైస్ ప్రిన్సిపాల్ కె.సాంబశివరావు, సదస్సు డైరెక్టర్ డాక్టర్ యలవర్తి సురేష్‌బాబు, డాక్టర్ వై. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సుష్మ..యూ ఆర్ గ్రేట్ !
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. అవయవాలను వైద్యులు ప్రత్యేక విమానంలో పలు ఆసుపత్రులకు తరలించి పలువురికి ప్రాణదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు స్తంభాలగరువు ఎల్ఐసీ కాలనీకి చెందిన చెరుకూరి సుష్మ (47) అనారోగ్యంతో ఈనెల 23న గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆస్టర్ రమేష్ హాస్పటల్ యాజమాన్యం మంత్రి నారా లోకేష్‌ను సంప్రదించారు. వెంటనే ఆయన ప్రత్యేక విమానాన్ని గన్నవరంలో ఏర్పాటు చేయించారు. రమేష్ హాస్పిటల్ నుంచి గ్రీన్ చానల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్‌కు గుండెను, చైన్నె ఎంజీఎం హాస్పిటల్‌కు ఊపిరితిత్తులను, విజయవాడ కామినేని హాస్పటల్‌కు ఒక కిడ్నీ, గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగికి కిడ్నీ, ఒకరికి లివర్ అమర్చి వారికి ప్రాణదానం చేశారు. ఈ ప్రక్రియలో రమేష్ హాస్పిటల్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత, బిజినెస్ క్లస్టర్ హెడ్ డాక్టర్ యలవర్తి కార్తిక్ చౌదరి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సాయికుమార్, ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ శిల్ప పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ చెరుకూరి సుష్మ అవయవ దానం పెద్ద మనస్సుతో అంగీకరించిన కుటుంబసభ్యులు -
రూ.46 కోట్లతో జీడీసీసీబీ అంచనా బడ్జెట్
ప్రవేశపెట్టిన బ్యాంక్ సీఈఓ కృష్ణవేణి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(జీడీసీసీబీ) మహాజన సభ సమావేశాన్ని బ్రాడీపేటలోని ప్రధాన కార్యాలయంలో ఆ బ్యాంక్ పర్సన్ ఇన్చార్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సీఈఓ టి.కృష్ణవేణి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జమ, ఖర్చులు చదివి వినిపించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.46 కోట్లతో అంచనా బడ్జెట్‌ను సభ ముందుంచారు. దీన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతోపాటు పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సీఈఓ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు ఇచ్చిన రుణాలను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. 2024– 25లో జీడీసీసీ బ్యాంక్ రూ.25 కోట్లు లాభం ఆర్జించిందని ఆమె ప్రకటించారు. పీఏసీఎస్, జీడీసీసీ బ్యాంక్ బ్రాంచిల్లో ఎన్పీఏ తగ్గించాలని, రుణాల రికవరీలో అభ్యంతరాలు ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 167 పీఏసీఎస్‌ల్లో ఇప్పటి వరకు 127 సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తయిందని, మిగిలిన 40 సంఘాల్లో కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సీఈఓ కృష్ణవేణి అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్చార్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ‘ఎనీ అబ్జక్షన్స్’ అంటూ సభ్యులను వివరణ కోరారు. అభ్యంతరాలు ఏమీ లేవని చెప్పడంతో మహాజన సభ సమావేశాన్ని 10 నుంచి 15 నిమిషాల్లో ముగించి వేశారు. సమావేశంలో పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జిలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
యార్డులో 1,44,863 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,41,161 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,863 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,100 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,300 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,873 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ తాడేపల్లి రూరల్: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర విభాగ ప్రధాన కార్యదర్శిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముదిగొండ ప్రకాష్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ముదిగొండ ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి తనమీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్సార్ సీపీ బలోపేతం కోసం కృషిచేస్తాననిపేర్కొన్నారు. -
పరమ పదనాథుడు అలంకారంలో నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం పరమ పద నాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరుకు చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. వట్టిచెరుకూరు హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయండి మంత్రి సవిత ఆదేశం సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు బీసీ హాస్టల్ విద్యార్థి కిశోర్ చెరువులో పడి దుర్మరణం పాలవ్వడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ శారదారాణిని తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. చేతికందికొచ్చిన కొడుకు మృతి చెందడం బాధాకరమని, మృతుడి తల్లిదండ్రుల కడుపుకోత వర్ణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు మంత్రి సవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. రాజధాని ముఖ ద్వారంలో మరో దారుణం ● గుర్తు తెలియని వ్యక్తిని కొట్టి చంపిన స్థానికులు ● ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం తాడేపల్లి రూరల్: రాజధాని ముఖ ద్వారమైన కె.ఎల్.రావు కాలనీలో మద్యం మత్తులో కొంతమంది యువకులు దారుణానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తిని గురువారం రాత్రి విచక్షణా రహితంగా కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. ప్రకాశం బ్యారేజ్ మంగళగిరి రోడ్డులో కేఎల్‌రావు కాలనీ హోసన్నా ప్రార్థన మందిరం ఎదుట కింద భాగంలో రాత్రి 7.30 సమయంలో ఓ యువకుడు రోడ్డుపై సంచరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మద్యం తాగి రోడ్డుపై తిరుగుతున్న ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అతడితో గొడవకు దిగాడు. సరిగా సమాధానం చెప్పకపోవడంతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కొంతమంది స్నేహితులు కూడా ఆ యువకుడిపై మరోసారి దాడిచేశారు. కాళ్లు పట్టుకుని ఏడ్చినా సరే వదలకుండా కాళ్లతో, చేతులతో పిడిగుద్దులు గుద్దడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది కూడా అక్కడ ఉన్న వారికి తెలియదు. ఇదిలా ఉండగా కాలువలో చనిపోతే పైకి తీసుకు వచ్చినట్లు చిత్రీకరించారు. ఎట్టకేలకు స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు మాత్రం ఎవరు కొట్టారు అనే విషయాన్ని వెల్లడి చేసేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి : పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర ఆరోపించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్, లీకేజీలను అరికట్టాలంటూ శుక్రవారం గుంటూరు జిల్లా ఆత్మకూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న రాష్ట్ర విద్యాభవన్ కార్యాలయం ఎదుట ఽవైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క లీకేజీ కాలేదని గుర్తు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు పేపర్ల లీకేజీ జరుగుతుందని విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా ప్రశ్నపత్రాలు లీకేజీమయం అని దుయ్యబట్టారు. కడపలో మ్యాథ్స్ పేపర్ లీకేజీ ఘటనపై తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, వారంతా లేకేజీల ఘటనలతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పరీక్షలలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం నాయకులు కె.శివారెడ్డి, ఐ. శ్రీనివాస్, ఎం. గోపీచంద్, కొండలరావు, సురేష్, ప్రతాప్, పూజిత, నాగరాజు, రాము, సురేంద్ర పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ స్టూడెంట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ -
వాయిదాల మీద వాయిదా
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 29న జరగాలి. మెజార్టీ సభ్యులు కోరిన మీదట వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు గురువారం సాయంత్రం ప్రకటించారు. జెడ్పీ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఈనెల 15న కొలువుదీరిన సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కీలకమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈనెల 29న మరోసారి సమావేశాన్ని నిర్వహించేందుకు మూడు జిల్లాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమాచారాన్ని పంపారు. మార్చి 31లోపు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, బడ్జెట్‌ను ఆమోదించాల్సిన కీలక సమయంలో మరోసారి వాయిదా వేశారు. సభ్యుల గైర్హాజరుతో వాయిదా పడిన రెండు వారాల వ్యవధిలో ఏర్పాటు చేసిన రెండవ సమావేశాన్ని సైతం వాయిదా వేయడంపై అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెడ్పీని పరిపాలిస్తున్న వారు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో వారికే తెలియాలని అంటున్నారు. అడ్డొచ్చిన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 29న టీడీపీ వ్యవస్ధాపక దినోత్సవం దృష్ట్యా అదే రోజు జరగాల్సిన జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ రోజున ఏర్పాటు చేస్తే తాము హాజరు కాబోమని టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు చెప్పారు. దీంతో సమావేశాన్ని నిర్వహించలేమనే సాకుతో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వాయిదా వేయడమే ఏకై క లక్ష్యంగా జెడ్పీటీసీ సభ్యులకు ఫోన్లు చేసి గురువారం గుంటూరులోని జెడ్పీకి పిలిపించుకున్నారు. వారికి విందు ఏర్పాట్లు చేసి సమావేశాన్ని వాయిదా వేసేందుకు సహకరించాల్సిందిగా బుజ్జగించారు. సమావేశాన్ని వాయిదా వేసేందుకు 50 శాతం సభ్యుల అంగీకారం అవసరం ఉండటంతో ఈ విధమైన ప్రయత్నాలు చేశారు. చైర్పర్సన్ ఆహ్వానం మేరకు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి వచ్చిన కొంత మంది జెడ్పీటీసీ సభ్యులు మెత్తపడ్డారు. ఎట్టకేలకు సమావేశాన్ని వాయిదా వేసేందుకు అంగీకరిస్తూ, సంతకాలు చేశారు. దీనిపై జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసును వివరణ కోరగా జెడ్పీలో ఓటు హక్కు కలిగిన మొత్తం 82 మంది సభ్యుల్లో 50 శాతానికి పైగా సభ్యులు సంతకాలు చేయడంతో వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మరలా ఎప్పుడు నిర్వహించేదీ తదుపరి తెలియజేస్తామని చెప్పారు. కాగా కొంత మంది జెడ్పీటీసీ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కాగా, సమావేశ వాయిదా కోరుతూ పలువురు ఎమ్మెల్యేలు లేఖలు పంపించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం మరోసారి వాయిదా షెడ్యూల్ ప్రకారం ఈనెల 29న జరగాలి అదే రోజు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకపోవడంతో వాయిదా నాటకం జెడ్పీటీసీ సభ్యులకు ఫోన్లు చేసి గుంటూరుకు ఆహ్వానించిన చైర్పర్సన్ హెనీ క్రిస్టినా సమావేశాన్ని వాయిదా వేసేందుకు వీలుగా సంతకాలు చేయాలని బుజ్జగింపులు ఎట్టకేలకు సగం మంది సభ్యులు ఆమోదించడంతో వాయిదా వేసిన సీఈవో -
గుంటూరు
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025అమ్మవార్లకు నిత్య పూజలు భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామదేవత గోగులమ్మకు గురువారం నిత్య పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ ఫిరంగిపురం: రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈవీఎంలు, వీవీప్యాడ్స్ భద్రపరచిన గోడౌన్‌ను డీఆర్ఓ ఎన్.షేక్ ఖాజావలి గురువారం తనిఖీ చేశారు. శ్రీ మడేలేశ్వర స్వామికి బోనాలు గురజాల: మండలంలోని పులిపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మడేలేశ్వర స్వామికి గురువారం భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లావ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగరేసింది. ప్రజల్లో తన బలాన్ని చాటింది. కుట్రలు కుతంత్రాలు, పోలీసులతో బెదిరింపులు, డబ్బులతో సత్తా చాటాలని చూసిన కూటమి నేతలకు భంగపాటు ఎదురైంది. కూటమి నక్క జిత్తులను వైఎస్సార్ సీపీ నేతలు ఐకమత్యంతో అడ్డుకట్ట వేశారు. ప్రజా క్షేత్రంలో తమకు తిరుగు లేదని చాటి చెప్పారు. ఎంపీటీసీలను కొనుగోలు చేసి తమ ఆధిక్యతను నిరూపించుకోవాలని చూసిన కూటమి నేతలకు నిరాశే ఎదురైంది. ఐకమత్యంతో, కలసికట్టుగా వైఎస్సార్ సీపీ నేతలు వ్యవహరించడంతో కాల‘కూటమి’ నేతల పాచికలు పారలేదు. ఇఫ్తార్ సహర్ (శుక్ర ) (శని ) గుంటూరు 6.25 4.49 నరసరావుపేట 6.27 4.51 బాపట్ల 6.25 4.49స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హవాగుంటూరు రూరల్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గురువారం ఎన్నిక నిర్వహించేందుకు మండల స్పెషల్ ఆఫీసర్ వజ్రశ్రీ, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు ఆదేశాలను జారీ చేశారు. దీంతో రూరల్ మండలంలో వైస్ ఎంపీపీ పదవి కోసం కూటమి, వైఎస్సార్ సీపీలు పోటాపోటీగా తలపడ్డాయి. కూటమికి చల్లావారిపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవగా, జొన్నలగడ్డకు చెందిన ఎంపీటీసీ ఒకరు ఉన్నారు. ఇద్దరితో బలం సరిపోక కూటమి నేతలు కుట్రలకు తెరతీశారు. బెదిరింపులు, డబ్బుతో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ఒక ఎంపీటీసీని కలుపుకున్నారు. దీంతో కూటమికి బలం మూడుకు పెరిగింది. మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో ఐదు స్థానాలను వైఎస్సార్ సీపీ కై వశం చేసుకుంది. ఈ నేపథ్యంలో కూటమి కుట్రలకు ఒక ఎంపీటీసీ పార్టీ మారగా వైఎస్సార్ సీపీ విప్ జారీ చేసింది. ఒక ఎంపీటీసీని కోల్పోయినప్పటికి నాలుగు స్థానాలతో వైఎస్సార్ సీపీ ఏకగ్రీవంగా వైస్ ఎంపీపీ స్థానాన్ని కై వశం చేసుకుంది. తోక ముడిచిన కూటమి నేతలు ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నారు. కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసి, బెదిరించి మండల పరిషత్ కార్యాలయానికి తెచ్చారు. ఎలాగైనా ఒక ఎంపీటీసీనైనా కిడ్నాప్ చేసి, ఎన్నిక జరగకుండా చేయాలని లేదా డ్రా చేయాలని ప్రయత్నాలు చేశారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు బెదరలేదు. అంతా మండల పరిషత్‌లోని సమావేశ మందిరానికి చేరుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఎన్నికల కేంద్రానికి చేరుకోవడంతో కూటమి నేతలు అక్కడినుంచి జారుకున్నారు. కనీసం ఉన్న ముగ్గురు ఎంపీటీసీలు కూడా ఎన్నికకు హాజరవ్వకుండా తోకముడిచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక జరిగిందిలా.... వైఎస్ ఎంపీపీ ఎన్నికకు ఎన్నికల అధికారిగా, మండల స్పెషల్ ఆఫీసర్ ఎల్. వజ్రశ్రీ వ్యవహరించారు. ఉదయం 11 గంటలకు వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీలు ఎంపీపీ ఇంటూరి పద్మావతి, వైఎస్ ఎంపీపీ దర్శి సుజాత, పులగం దివ్య, కాకాని రమేష్, కోఆప్షన్ సభ్యుడు కరీముల్లాలు చేరుకున్నారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కాకాని రమేష్ నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం ఆయన్ను ఎంపీటీసీ, ఎంపీపీ ఇంటూరి పద్మావతి ప్రతిపాదించగా, ఎంపీటీసీ, వైఎస్ ఎంపీపీ దర్శి సుజాత బలపరిచారు. అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం కూటమి నేతలు ఎన్నికకు హాజరుకాకపోవడం, కాకాని రమేష్ మాత్రమే నామినేషన్‌ను దాఖలు చేయడంతో ఎన్నికల అధికారి వజ్రశ్రీ అధికారికంగా ఏకగీవ్రంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అనంతరం నియామక పత్రాన్ని అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికై న వైఎస్ ఎంపీపీ కాకాని రమేష్‌ను వైఎస్సార్ సీపీ నేతలు, మండల పరిషత్ అధికారులు అభినందించారు. ఘనంగా శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. ● మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ● మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుని ఏకగ్రీవ ఎన్నిక తెనాలి: స్థానిక మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా తేలప్రోలుకు చెందిన ముస్లిం మైనారిటీ నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సయ్యద్ జానీబాషా ఏకగ్రీవ ఎన్నిక పార్టీ ఐక్యతకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికై న సయ్యద్ జానీబాషా, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పార్టీ ఎంపీటీసీలతో కలిసి గురువారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శివకుమార్‌ను కలిశారు. సయ్యద్ జానీబాషాను శివకుమార్ అభినందించి శాలువతో సత్కరించారు. జానీబాషా ఏకగ్రీవ ఎన్నిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని బహిర్గతం చేస్తోందని తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 18 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ, తాను ఓటమి చెందినప్పటికీ ఎంపీపీ, ఎంపీటీసీలు ఏకతాటిపై ఉండటంతో కో–ఆప్షన్ ఏకగ్రీవమైందని చెప్పారు. ఇందుకు కారకులైన ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశులు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీటీసీలను అభినందించారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం రాజ్యాధికారంలో అన్ని సామాజికవర్గాలకు స్థానం కల్పించినట్టు చెప్పారు. తెనాలి నియోజకవర్గంలోనూ ఆ సామాజిక సమతుల్యతను పాటించామని శివకుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటికీ ముందు చెప్పినట్టుగా, తేలప్రోలుకు చెందిన మైనారిటీ సోదరుడు జానీబాషాకు ఇచ్చామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుడి ఎంపిక అల్లా ఆశీర్వాదం అనుకుంటున్నామని అన్నారు. ఇదే తరహాలో భవిష్యత్‌లోనూ అంతా కలసికట్టుగా జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజలపక్షాన పోరాడతామని శివకుమార్ స్పష్టం చేశారు. గత అయిదేళ్లలో పేదవాడికి గరిష్టంగా సంక్షేమం ఇచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తేలప్రోలు సర్పంచ్ షేక్ బాషా, ఎంపీటీసీలు షేక్ ఇలియాస్, దోసపాటి నాగదేవిక, కాలిశెట్టి వెంకట మారుతీఫణికుమార్, ఇసుకపల్లి సుందరరావు, సంకురు బుజ్జిబాబు, పఠాన్ ఖాసింఖాన్, షేక్ ముజీర్, షేక్ గాలబ్, షేక్ జానీ, షేక్ మస్తాన్, షేక్ నాగురా, షేక్ సలీం, షేక్ మున్నా, షేక్ సుభాని పాల్గొన్నారు, Iన్యూస్రీల్భవిష్యత్లోనూ ఐక్యంగా కొనసాగుతాం గుంటూరు రూరల్ మండలం వైస్ ఎంపీపీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవం ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్‌కు ప్రయత్నించిన కూటమి నేతలు పోలీసులతో బెదిరింపులు, డబ్బుతో కొనుగోలుకు యత్నం ఎత్తుకు పైఎత్తులతో ఏకగ్రీవంగా ఎన్నికై న వైఎస్సార్ సీపీ అభ్యర్థి -
శాంతి భద్రతల పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): శాంతి భద్రతల పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సతీష్‌కుమార్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో బుధవారం సాంకేతిక పరిజ్ఞానంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసింగ్‌లోనూ సాంకేతిక పరిజ్ఙానంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరిగే నేర సమగ్ర సమాచారాన్ని రూపొందించాలని చెప్పారు. నేర స్థలాలను అనుసంధానం చేసి, నేరస్తులను, నేరాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా చేయాలన్నారు. ఇటీవల వేలిముద్రలకు సంబంధించి ఏఎఫ్ఐఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కువ కేసులు ఛేదించామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), సుప్రజ (క్రైం), డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) పలు విభాగాల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ -
ప్రయాణికుల సౌఖ్యమే ముఖ్యం
తెనాలిఅర్బన్: బస్టాండ్ ఆవరణలో, బస్సులలో ప్రయాణికుల సౌఖ్యమే ముఖ్యమని ఆర్టీసీ జిల్లా ప్రాంతీయ అధికారి ఎం.రవికాంత్ చెప్పారు. తెనాలి డిపోను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్, గ్యారేజ్‌లను పరిశీలించి సూచనలు చేశారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉన్న సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎం ఎ.రాజశేఖర్, అసిస్టెంట్ డీఎం ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ జిల్లా ప్రాంతీయ అధికారి రవికాంత్ -
ఎదురుచూపూల్ ఎన్నాళ్లు!
గుంటూరు వెస్ట్: సుమారు 200 నుంచి 300 మంది సభ్యులు. నెలకు సుమారు రూ.2 లక్షలు పైనే ఆదాయం. ఎందిరికో ఆరోగ్యాన్ని, ఆటవిడుపును అందించే ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కునారిల్లుతోంది. 25 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల వెడల్పుగల ఈ పూల్ నగరంలోనే అతి పెద్దది. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి మూతపడిన ఈ పూల్‌ను కొన్ని నెలలపాటు గాలికొదిలేశారు. కొత్తగా క్రీడలను ప్రోత్సహిస్తామన్న కూటమి ప్రభుత్వం ఉన్న వాటిని కూడా కాపాడుకోలేకపోతోందనే విమర్శలు సభ్యుల నుంచి వస్తున్నాయి. ఎన్నో సార్లు సభ్యులు, స్థానికులతోపాటు పత్రికల్లో కూడా వార్తలు వచ్చినా జీఎంసీ అధికారుల్లో చలనం లేదు. ఇటీవల మరమ్మతుల పనులను రూ.20 లక్షలతో కాంట్రాక్ట్‌కు అప్పగించారు. అయితే ఆ నిధులూ అరకొరగా ఉండడంతో మరమ్మతులు సజావుగా సాగడం లేదు. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నా అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. పూల్‌ని శుభ్రపరచడానికి కావాల్సిన కనీస పరికరాలు కూడా అందుబాటులో లేవు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు ఈ పూల్‌లో ఆధిపత్యం చలాయించడానికి యత్నించడమే కాని అభివృద్ధి గురించి మాట్లాడరనే విమర్శ ఉంది. సభ్యులు ఒకొక్కరూ ఏడాదికి రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. సమ్మర్లో కేవలం ఒక్క మే నెలలోనే ఒక్కొక్కరికి రూ.2,000 వసూలు చేస్తారు. ఇన్ని నిధులు సమకూరుతున్నా అభివృద్ధి మాత్రం చేయరు. 50 మీటర్ల పూల్ సంగతేంటి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇదే ఆవరణలో 50 మీటర్ల పూల్‌కు శంకుస్థాపన చేశారు. దీనికి సుమారు రూ.3 కోట్లు కేటాయించారు. తర్వాత దీని సంగతే మర్చిపోయారు. ఈ పూల్ నిర్మాణం అయితే ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ పోటీలు నిర్వహించవచ్చు. ఏమి మారింది గత ప్రభుత్వ హయాంలో ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో నాలుగు నెలల నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. ఏం మారింది. మేము సీనియర్ సిటిజన్స్. ఈతతో కొంత ఉపశమనం పొందుతాం. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. 9 నెలల నుంచి బీఆర్ స్టేడియమూ ఇలానే ఉంది. ఇక్కడ వస్తున్న డబ్బులో కొంత పెట్టడానికి ఇబ్బంది ఏమిటీ. ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని తక్షణం పూల్‌ని ప్రారంభించాలి. – పెద్ది రమణారావు, సభ్యుడు. మా మొర ఎవరూ ఆలకించరు ప్రస్తుతం పూల్ ఉండే ప్రాంతం సుమారు రెండున్నర ఎకరాలు. సుమారు రూ.500 కోట్లపైనే విలువ చేస్తోంది. ఇంత ఖరీదైన ప్రాంతంలో ఉండే పూల్‌ని జీఎంసీ అధికారులు గాలికొదిలేశారు. గతంలో ఇక్కడ జాతీయ స్విమ్మర్స్ సాధన చేసేవారు. ఇప్పుడు వారు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. బయట ప్రైవేట్ పూల్స్ నెలకు రూ.3,000–5,000 వసూలు చేస్తున్నాయి. అధికారులు చొరవ చూపాలి. ముఖ్యంగా 50 మీటర్ల పూల్ నిర్మాణానికి దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుకు వస్తే అందరికీ మేలు జరుగుతుంది. – పాటిబండ్ల సుబ్బయ్య, స్విమ్మర్ ఏమిటీ నిర్లక్ష్యం మాకు పర్మినెంట్ మెంబర్షిప్ ఉంది. ఏడాదికి రూ.1,500 కడుతున్నాం. నేను మాస్టర్స్ విభాగంలో నేషనల్స్‌లో పాల్గొన్నాను. నాకు నిత్యం సాధన తప్పనిసరి. ఏడాదికి కనీసం 6 నెలలు కూడా పూల్ సరిగ్గా ఓపెన్ చేయట్లేదు. ఎన్నిసార్లని ఫిర్యాదులు చేయాలి. డబ్బులు తీసుకునేటప్పుడు ఆ మాత్రం బాధ్యత జీఎంసీ వారికి ఉండక్కర్లేదా. కనీసం ఎంపీ నిధులతోనైనా దీనిని పూర్తి చేయాలి. సమ్మర్ క్యాంప్ కోసం ౖపైపె మెరుగులు చేస్తారు. మళ్ళీ మామూలే. – ఎ.స్వర్ణ లలిత, స్విమ్మర్ నాలుగు నెలల నుంచి ఈత కొలను మూత నత్తనడకగా పూల్ మరమ్మతులు సుమారు 200 మంది సభ్యుల ఆగ్రహం నెలకు రూ.2 లక్షలపైగానే ఆదాయం అయినా జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం సమస్యలివీ పూల్‌లోని ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. ఫ్లోరింగ్ మళ్లీ వేయాల్సి ఉంది. పురుషులు, మహిళలకు కంబైన్డ్ బాత్ రూమ్స్ ఉన్నాయి. ఇవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కొత్తగా నిర్మించాలి. లైటింగ్ చాలా వరకు లేదు. నీటిని ఫిల్టర్ చేసే యతంరం కూడా మరమ్మతులకు గురైంది. కొత్త లైట్లు వేయాల్సి ఉంది. ఇక బేబీ పూల్ మరీ దారుణంగా ఉంది. దీనికి కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి. -
నేడు దుగ్గిరాల ఎంపీపీ పదవికి ఎన్నిక
దుగ్గిరాల: దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఇన్చార్జి ఎంపీపీగా షేక్ జబీన్ వ్యవహరిస్తున్నారు. ఎన్నిక నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తహసీల్దార్ ఐ.సునీత తెలిపారు. ఇదిలా ఉంటే మంచికలపూడి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ పదవికి కూడా గురువారం ఎన్నిక జరగనుంది. గుంటూరు రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నిక నేడు గుంటూరు రూరల్: రూరల్ మండలం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎన్నికను గురువారం ఉదయం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మండల అభివృద్ది అధికారి బి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు గుంటూరు లీగల్: ప్రతిష్టాత్మకమైన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఫలితాలూ అదేరోజు వెలువడతాయి. అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కోసం మొత్తం మూడు బూత్‌లు ఏర్పాటు చేశారు. 2,016 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు ముగిస్తుంది. గంట తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ రాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థులు బాధ్యతలు స్వీకరిస్తారు. -
తెనాలిలో సదరం క్యాంప్ పునఃప్రారంభం
తెనాలిఅర్బన్: దివ్యాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్‌ను నిర్వహించారు. ఆర్ధో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన దివ్యాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం ఆర్ధో–90, ఈఎన్టీ–42, సైక్రాటిక్–45 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. గురు, శుక్రవారాలలో కూడ క్యాంప్ జరుగుతుందని చెప్పారు. నృసింహస్వామి ఆలయ హుండీల లెక్కింపు నేడుమంగళగిరి టౌన్: మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను గురువారం లెక్కిస్తామని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను గురువారం ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్టు వివరించారు.ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోలునరసరావుపేట: రబీ 2024–25కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. ఖరీఫ్ కాలంలో ధాన్యం సేకరణ జిల్లాలో అధిక భాగం పూర్తయిందని ఈనెల 29 నాటికి కొనుగోళ్లు పూర్తిచేయటం జరిగుతుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 115 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 73 రైతు భరోసా కేంద్రాల ద్వారా 1947 మంది రైతుల వద్ద నుంచి 13,737 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. పీఎం యోగా అవార్డుకు దరఖాస్తు చేసుకోండినరసరావుపేట ఈస్ట్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యోగా అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు, లేదా సంస్థలకు అందించే ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన వారు ఆన్లైన్లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం తెలిపారు. యోగా అవార్డులు నిష్కళంకమైన ట్రాక్ రికార్డు, యోగా ప్రమోషన్, అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలకు అందిస్తారని వివరించారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను https://innovateindia. mygov.in/pm&yoga& awards&2025 వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాని సూచించారు. నేడు భట్టిప్రోలు కో–ఆప్టెడ్ మెంబర్ ఎంపికభట్టిప్రోలు: స్థానిక మండల ప్రజా పరిషత్ కో–ఆప్టెడ్ మెంబర్ స్థానానికి గురువారం పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎస్. వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రత్యేక అధికారి బి. వేణుగోపాల్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కో–ఆప్టెడ్ మెంబర్ మహ్మద్ ఫిరోజ్ ఎలియాస్ సలీం గత ఏడాది నవంబర్ 13న డిస్ క్వాలిఫై అయినట్లు జెడ్పీ సీఈవో జ్యోతిబసు ఉత్తర్వులు జారీ చేశారు. సలీం వరుసగా మూడు సమావేశాలకు హాజరు కానందున ఖాళీ స్థానం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నిక ఉంటుందని తెలిపారు. సమావేశంలో సభ్యులు చేతులు ఎత్తి ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారని ఆయన వివరించారు. రేపు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ రద్దు బాపట్ల: ఎస్టీలు, దివ్యాంగుల కోసం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా శుక్రవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి బుధవారం పేర్కొన్నారు. -
అవకతవకలు, అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలి
నరసరావుపేట రూరల్: అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జామాయిల్ వేలంలో అవకతవకలు, అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలని సామాజిక వన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డె హనుమారెడ్డి డిమాండ్ చేశారు. జామాయిల్ వేలంలో అక్రమాలు, అక్రమంగా కర్రను తరలించడాన్ని నిరసిస్తూ సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అటవీ శాఖ కార్యాయలం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల పరిధిలో 218 వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో పెంచిన జామాయిల్, కర్రకు గత ఏడాది నవంబర్‌లో వేలం నిర్వహించారని తెలిపారు. కర్ర నరుకుడు ప్రారంభించిన వ్యాపారులు అక్రమంగా రవాణా చేస్తూ కంపెనీలకు తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచిన జామాయిల్ కర్రకు వేలం నిర్వహించడం ద్వారా రైతులు టన్నుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. అటవీ శాఖ భూముల్లో రైతులకు నష్టం కలిగించే జామాయిల్ పంటను నిషేదించాలని కోరారు. ఈ భూముల్లో పండ్ల తోటల పెంపకం చేయడం ద్వారా రైతులకు, అటవీ శాఖకు ఆదాయం లభిస్తుందన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ గిట్టుబాటు ధరల లేక రైతులు నష్టాల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తాళ్లూరి బాబురావు, కె.వీరారెడ్డి, కొల్లి లింగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర కల్పించాలి
నాలుగు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షలు ఖర్చు చేశా. దిగుబడి 10 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితులు లేవు. వాటిలో సగం తాలు. ప్రస్తుతం 40 బస్తాలు యార్డుకు తీసుకువచ్చాను. క్వింటా రూ.9 వేలు ధర పలికింది. గత ఏడాది మిర్చి క్వింటా ధర సుమారు రూ.27 వేల వరకు పలికింది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ముడావత్ హిరా నాయక్, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, కల్వకుంట గ్రామం ఆత్మహత్యలే శరణ్యం నాలుగు ఎకరాల్లో 116 డీలక్స్ రకం మిర్చి పంట సాగు చేశాను. గత ఏడాది 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది పది క్వింటాళ్లుకూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందులో సగానికి పైగా తాలు వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టా. గత ఏడాది క్వింటా రూ.27 వేలు పలికింది. ప్రస్తుతం 34 బస్తాలు యార్డుకు తీసువచ్చాను. క్వింటా కాయలకు రూ.10 వేలు వేశారు. రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మిర్చి అమ్ముకుని వెళ్ళాలంటే భయమేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలు, ఎరువులు, పురుగు మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవే ధరలు కొనసాగితే రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం – పినికే వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా, పెద్ద అర్ధవీడు మండలం, తమ్మడపల్లె గ్రామం ● -
శుభాల షబ్–ఏ–ఖదర్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): పరిపూర్ణ మనసుతో మన్నింపు కోరుకునే అవకాశం రంజాన్ మాసంలో ముస్లింలకు దక్కుతుంది. చేసిన పాపాలను మనిషి మనస్ఫూర్తిగా ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరితే దైవం తప్పక అనుగ్రహిస్తాడని ఖురాన్లో ఉంది. వేయి నెలల ప్రార్థనల పుణ్యఫలాన్ని ఒక్క రాత్రిలో అందించే షబ్–ఏ–ఖదర్ గురువారం జరగనుంది. రంజాన్ మాసంలో ఈ రాత్రికి ప్రత్యేకత ఉంది. 26 రోజుల కఠోర ఉపవాస దీక్షలు పూర్తయిన తరువాత ఆఖరి మూడు రోజులకు ముందు వచ్చే షబ్–ఏ–ఖదర్ రాత్రి చాలా పవిత్రమైందని గ్రంథాల్లో(హదీసులు) ఉంది. ఈ రాత్రి చేసే ప్రత్యేక నమాజ్‌లు, ఆరాధనలు, ప్రత్యేక ప్రార్థనలు తప్పక అనుగ్రహం పొందుతాయని చెబుతారు. షబ్–ఏ–ఖదర్ తర్వాత ఆఖరి మూడు రోజుల ఉపవాస దీక్షలు(సతామీ) ప్రారంభమవుతాయి. రంజాన్ నెల ప్రారంభం నుంచి ఉపవాస దీక్షలు ఉండలేని వారు ఈ ఆఖరి మూడు రోజులు మాత్రం తప్పండా ఆచరిస్తారు. పేదల హక్కు జకాత్ ఇస్లాంకు ఉన్న ఐదు మూల స్తంభాలలో జకాత్ ఒకటి. ఇది ఆరాధనలో రెండో విధి. ఇస్లాం పవిత్ర గ్రంథంలో జకాత్ గురించి ప్రస్తావన కనీసం 32 సార్లు ఉంది. దీన్నిబట్టి జకాత్‌కు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతోంది. ఇది పేదల హక్కు. అవసరార్థులకు జకాత్ చెల్లించే సదాచారుల కోసం దేవుని వద్ద ప్రతిఫలం సిద్ధంగా ఉంటుందని హదీసులలో పేర్కొనబడింది. ప్రతి ముస్లిం తన సంపాదనలో రెండున్నర శాతం పేదలకివ్వాలన్నది జకాత్ ఉద్దేశం. నమాజ్ వలే ఇది కూడా తప్పనిసరి నియమం. ఇస్లాంను ఆచరించేవారు దీనిని విస్మరించరాదు. రంజాన్ మాసంలో నేడు ప్రత్యేకమైన రాత్రి ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమవుతున్న ముస్లింలు వేయి నెలల ప్రార్థనల పుణ్యం ఒక్కరోజులోనే.. జకాత్‌కు అమిత ప్రాధాన్యం పేదలకు సంపాదనలో 2.5శాతం ఇవ్వడం ఆనవాయితీ దానం బాధ్యత రంజాన్ మాసంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. పేదలకు సాయం చేయడం ముస్లింల బాధ్యత. పేదలూ సంతోషంగా పండగ జరుపుకోవడానికి ఈ విధానం దోహదపడుతుంది. రంజాన్ మాసంలో సాయం, దానం చేయడం ఎంతో పుణ్యం. – ముఫ్తి సమీయుజమా హబీబీ, ముస్లిం మత గురువు -
సిజేరియన్లు చేసే ఆస్పత్రులకు నోటీసులివ్వండి
గుంటూరు మెడికల్: నూరుశాతం సిజేరియన్స్ చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. బుధవారం గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా ప్రొగ్రామ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ నూరు శాతం సిజేరియన్లు చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో జిల్లా టీమ్‌లతో తనిఖీలు చేయాలని చెప్పారు. ఆ ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేయాలని, సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లభించే మందుల వివరాలు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆసుపత్రి నోటీసు బోర్డులో అందరికి కన్పించేలా ప్రదర్శించాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను సత్వరమే గుర్తించి చికిత్స అందించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే క్షయ వ్యాధి పరీక్షల వివరాలు తప్పనిసరిగా సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే కుక్కకాటు, పాముకాటు కేసుల వివరాల గురించి ఆరా తీసి సంబంధిత వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా జిల్లా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవాలు ఆరోగ్య కేంద్రాల్లో పెంచేందుకు సంబంధిత పీహెచ్ వైద్య అధికారులకు ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేయాలని వెల్లడించారు. ఆర్సీహెచ్, హెచ్ఎంఐఎస్ పోర్టల్‌లో గర్భిణీల నమోదు నూరు శాతం తప్పనిసరి చేయాలన్నారు. గర్భిణీలు, చిన్నారులకు నూరు శాతం వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్‌బాబు, డాక్టర్ రత్నమన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచండి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ -
జిల్లాలో ప్రాధాన్య రంగాలకు ప్రత్యేక స్థానం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రాధాన్య రంగాలైన వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సర్వీసు రంగాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడో కలెక్టర్ల సమావేశంలో బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ హార్టికల్చర్, పశువులు, అడవులు, ఫిషింగ్, ఆక్వా, ఇండస్ట్రీస్, మైనింగ్, మ్యానుఫ్యాచరింగ్, తదితర 19 ప్రముఖ రంగాల్లో గ్రోత్ రేటు పెంచేందుకు లక్ష్యాలను తయారు చేశామన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీడీవీఏ వృద్ధిరేటు 14.9 శాతం, ఇండస్ట్రీస్ రంగానికి 21.29, సర్వీసు రంగంలో 16.01 ప్రగతి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఉద్యాన పంటలు, పశు సంవర్ధక శాఖలు ప్రధానమని పేర్కొన్నారు. గుంటూరులో మిర్చి సాగు విస్తారంగా చేస్తారని, ప్రస్తుతం జిల్లాలో శీతల గిడ్డంగుల గోదాముల్లో 40 లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉంచారన్నారు. ఎగుమతి మార్కెట్ ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోవడంతో మంచి ధర కోసం రైతులు గోదాముల్లో నిల్వ ఉంచారని తెలిపారు. వ్యవసాయ రంగంలో రబీలో పంటల సాగు పెరిగిందన్నారు. కౌలు రైతుల పంటల రుణాలకు రూ. 58 కోట్లు నుంచి రూ. 100 కోట్లకు పెంచేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉద్యాన పంటల్లో గ్రోత్ ఇంజిన్ పంటలైన మిరప, పసుపు, కూరగాయలు, పూల సాగును 17800 హెక్టార్ల నుంచి 18,400 హెక్టార్లకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్ పంటల సాగును 12,100 హెక్టార్లను 14,500 హెక్టార్లకు పెంచుతామన్నారు. జిల్లాకు సంబంధించి అన్ని రంగాల్లో నిర్ధేశించనున్న లక్ష్యాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం
పెదకాకాని: ఆర్చరీ క్రీడాకారులు అత్యున్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత సంజీవ సింగ్, వీవీఐటీయూ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అర్చరీ క్రీడకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్చరీ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న చెరుకూరి లెనిన్ వోల్గా అసోసియేషన్ కృషి ప్రశంసనీయమన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అమరావతి వేదికగా స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటునట్లు వివరించారు. వీవీఐటీయూ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్ల్లాడుతూ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ నిర్వహణకు వీవీఐటీ యూనివర్శిటీ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్చరీ వంటి క్రీడల ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 900 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్‌లు హాజరయ్యారు. అండర్ 10, అండర్ 13, అండర్ 15 విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజు బుధవారం 723 మంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీవీఐటీయూ ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, ఏపీ అర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యం, వీవీఐటీయూ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో ఈనెల 28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.స్వరూపరాణి తెలిపారు. సాంబశివపేటలోని కళాశాలలో బుధవారం సదస్సు బ్రోచర్, ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ గ్లోబల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (జీసీపీఏ), సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాల సంయుక్తంగా తొలిసారిగా అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘సైకో సోషల్ కాంపెటెన్సీస్ ఫర్ గ్లోబల్ యూత్’’ అనే అంశంపై ఏర్పాటు చేస్తున్న సదస్సు ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, గుంటూరు జేఎంజే ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ విజయమేరీ ఉడుముల, పలువురు ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటుండగా, ఎస్వీయూ పూర్వ వీసీ ఆచార్య వి.శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య ప్రసంగం చేస్తారని వివరించారు. దేశ, విదేశాల నుంచి పరిశోధకులు, అధ్యాపకులు, వివిధ రంగాల ప్రముఖులు ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. జీసీపీఏ అధ్యక్షురాలు డాక్టర్ డి. సరోజ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సామాజిక, మానసిక పరిస్థితులకు అనుగుణంగా యువతను సక్రమమైన మార్గంలో పయనింపచేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సదస్సు దోహదం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఏ. రోజిలీన్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టీఎస్ సుభాషిణి పాల్గొన్నారు. -
స్తంభోద్భవ అలంకారంలో నారసింహుడు
మంగళగిరి: మంగళాద్రి వేంచేసివున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి అలంకారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆస్థాన అలంకారోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు స్తంభోధ్భవం అలంకారంలో దర్శనమివ్వగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కైంకర్యపరులు రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావు ,శ్రీనివాసరావు,వైజాగ్‌కు చెందిన అంగలూరి శరకోపాచార్యులు వ్యవహరించారు. బుధవారం అలంకారోత్సోవాలలో భాగంగా కాళీయమర్ధనం అలంకారంలో స్వామి వారు దర్శనమివవ్వనున్నారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి పర్వేక్షించారు. -
రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి
తెనాలిరూరల్: రైలు ఢీకొని ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద చోటుచేసుకుంది. తెనాలి జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి ఆరో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పెద్దనబోయన రాఘవరెడ్డి(46) తనతో కలసి డ్యూటీలో ఉన్న సహచరులకు వారి ఇళ్ల నుంచి మంగళవారం భోజన క్యారేజీలను తీసుకెళ్లాల్సి ఉంది. 11 గంటల ప్రాంతంలో సహచరులకు ఫోన్ చేసి భోజనాలు సిద్ధమయ్యాయో లేదో కనుక్కుంటే తీసుకొస్తానని చెప్పాడు. కొద్ది సేపటికే ఇప్పటం రైల్వే గేటు వద్ద పట్టాల వెంబడి మృతి చెంది పడి ఉన్నాడు. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రైలు ఢీకొట్టిందా లేక సడెన్‌గా రైలు రావడంతో పక్కకు జరిగే క్రమంలో కాలు జారి పడడంతో తల వెనుక భాగంలో గాయమై మృతి చెందాడా అన్న అంశాలు దర్యాప్తులో తెలుస్తాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సహకార సంవత్సర ప్రణాళిక కోసం కమిటీలు
గుంటూరు వెస్ట్: ఐక్యరాజ్యసమితి 2025–26 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా(ఐవైసీ) ప్రకటించిందని, దీని ప్రణాళిక కోసం జిల్లా కమిటీలు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా కో–ఆపరేటీవ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ఐవైసీ సంవత్సర లక్ష్యాలు, జిల్లాస్థాయి ప్రణాళికలు, వార్షిక కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనికి సంబంధించి కమిటీ క్యాలెండర్ ఆమోదించిందని తెలిపారు. జిల్లాలో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల వివరాలతోపాటు, కొత్తగా కమిటి సభ్యుల వివరాలు కంప్యూటరైజేషన్ ప్రక్రియను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ నెలలో ఐవైసీ యాక్షన్ ప్లాన్ చేయాల్సిన యాక్టివిటీస్‌కు సంబంధించి ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మహిళలకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. మల్టీపర్పస్ స్పెషలిటి సెంటర్ గోడౌన్లకు ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక ప్రాజెక్టు కింద ఏదైనా కవర్ చేయడానికి అవకాశం ఉందో లేదో చూడాలన్నారు. జిల్లాలో పీఏసీలు నాబార్డు ద్వారా అందించిన ఆర్ధిక సహాయంతో నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్లలో స్థానిక రైతులు వారి పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీల ద్వారా అందించిన రుణాలు, ఓవర్జ్యూస్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని రికవరీ చేయాలన్నారు. ఏపీ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ వివిధ మండలాల్లో మహిళ పాడి సహకార సంఘ 15 గ్రామాలను గుర్తించామన్నారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో 101 ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సంఘాలు పనిచేస్తున్నాయని జేసీ వివరించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి విరాచారీ, డీపీఓ నాగసాయికుమార్, వ్యవసాయ శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జీడీసీసీ బ్యాంకు సీఈఓ కృష్ణవేణి, అధికారులు పాల్గొన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మిర్చికి క్వింటాకు రూ.25వేలు చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11,781లు మద్దతు ధర అని ప్రకటించి మిర్చి రైతులకు తీరని అన్యాయం చేశాయన్నారు. ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదని ఆవేదన చెందారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ప్రతి రైతుకు అన్నదాతా సుఖీభవ ద్వారా రూ.20 వేలు ఇస్తానని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వేసవిలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలి పలు సూచనలు చేసిన సహాయ కార్మిక శాఖ అధికారి నరసరావుపేట: వేసవిలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి ఆఫీసర్, సహాయ కార్మికశాఖ అధికారి జి.ధనలక్ష్మి కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలకు అనుగుణంగా కార్మికుల రక్షణకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్మాగారాలు, దుకాణాలు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధిహామీ కూలీలు, వలస కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు సూచనలు చేశామన్నారు. పనిచేసే సమయం మార్చి పనిప్రాంతంలో చల్లని నీడ, నీటివసతి కల్పించాలని తెలిపారు. వైద్యసిబ్బందితో సమన్వయం చేసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలని చెప్పారు. -
సీఐపై చర్యలు తీసుకోవాలి
ఫిరంగిపురం: స్థానిక శాంతిపేటలో ఓ స్థలం వివాదం నేపథ్యంలో దళితులపై దురుసుగా ప్రవర్తించిన సీఐ రవీంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాత్రి కాలనీ వాసులు రాస్తారోకో చేశారు. ఫలితంగా గుంటూరు –కర్నూలు రాష్ట్రరహదారిపై ఇరువైపుల రెండకిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న గుంటూరు డీఎస్పీ భానోదయ కాలనీ వాసులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. స్థానిక పోలీసు స్టేషన్‌కు మంగళవారం ఉదయం శాంతిపేట కాలనీ వాసులను డీఎస్పీ మురళీకృష్ణ పిలిపించి వారితో మాట్లాడారు. సీఐపై ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేస్తానని చెప్పడంతో వారు జరిగిన విషయాలు తెలియజేస్తూ ఫిర్యాదు అదించారు. దీనిపై గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్ దృష్టికి తీసుకువెలతానని సీఐపై కేసు కడతానని డీఎస్పీ మురళీకృష్ణ హామీ ఇచ్చారు. తహసీల్దార్‌కు వినతి శాంతిపేటలో స్థలాన్ని కాలనీకి చెందిన జి.చిన్న అనే వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణం చేపడుతున్నాడని ఆ భూమి 608 ఏ–1 గ్రామకంఠానికి చెందిన భూమి అని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ జె.ప్రసాదరావుకు, స్థానిక పంచాయతీ ఈవో ఏకేబాబుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ ఆ భూమి పంచాయతీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అనంతరం కాలనీవాసులు గుంటూరులోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెల్లి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. శాంతిపేట వాసుల రాస్తారోకో స్థలం వివాదం పరిష్కరించాలని డిమాండ్ -
విశ్రాంత పోస్టల్ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలే శరణ్యం
తెనాలి: స్థానిక కొత్తపేటలోని కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీలోని డీఎల్ కాంతారావు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆలిండియా పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ 2వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్సీసీపీఏ సెక్రటరీ జనరల్ కె.రాఘవేంద్రన్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాన్ని పటిష్టం చేసి, ఐక్యంగా పోరాడాలని సూచించారు. వైద్యసదుపాయాల అంశంలో ఉన్న సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పు కాపీలను రాష్ట్ర నలుమూలల్నుంచి వచ్చిన కార్యకవర్గసభ్యులు రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ నాగేశ్వరరావుకు అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని గౌరవాధ్యక్షుడు డీఎల్ కాంతారావు హామీనిచ్చారు. ఎఫ్‌ఎన్‌పీఓ సెక్రటరీ జనరల్ శివాజీ మాట్లాడుతూ సర్వీసు ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని చెప్పారు. ఏఐపీఈయూ పోస్ట్‌మెన్, గ్రూప్–డి సర్కిల్ కార్యదర్శి సీహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, వ్యతిరేక విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. పెన్షనర్లు, ఉద్యోగులు ఐక్యపోరాటాలను జరపాల్సిన ఆవశ్యకతను వివరించారు. సభలో ఆయా సంఘాల నేతలు ఎన్.రామారావు, కేఎస్సీ బోసు, న్యాయవాధి బి.జయభారతరెడ్డి, అతిథులు డి.మోహనరావు, కె.రాజారావు, పి.బాబూజీ, సీహెచ్ కోటేశ్వరరావు, వివిధ డివిజన్ల కార్యదర్శులు ప్రసంగించారు. తొలుత ఏఐపీఆర్పీఏ జెండాను డీఎల్ కాంతారావు, ఎన్సీసీపీఏ జెండాలను కె.రాఘవేంద్రన్ ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ 2వ సర్వసభ్య సమావేశంలో ఎన్సీసీపీఏ సెక్రటరీ జనరల్ కె.రాఘవేంద్రన్ -
గుంటూరు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధురాలు (55) మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు ప్లాట్‌ఫాం –1 వద్దకు చేరుకునే సరికి రైలులో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెంది ఉంది. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతురాలి వివరాలను సేకరించగా ఎలాంటి వివరాలు లేక పోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు జీఆర్పీ సీఐ అంజిబాబు 9440627546, ఎస్ఐ దీపికా 9121715242, జీఆర్పి పోలీస్ స్టేషన్ 0863–2220753 నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా తెలిపారు. -
దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ(గుంటూరు) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలను వర్సిటీ వీసీ ఆచార్య కంచర్ల గంగాధర్ రావు మంగళవారం విడుదల చేశారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 31న తుది గడువుగా నిర్ణయించారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ర్యాంక్ పొందిన వారితోపాటు ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు అని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ లు తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డులను వర్సిటీ వైబ్సెట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌యూసీడీఈ.ఇన్ఫో నుంచి పొందవచ్చన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వర్సిటీ ఓఎస్డీ ఆచార్య ఆర్వీఎస్ఎస్ రవికుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణవేణి, సూపరింటెండెంట్లు జవ్వాజి శ్రీనివాసరావు, నేలపాటి నాగేశ్వరరావు, వర్సిటీ సిబ్బంది రాధాకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా సుబ్బారెడ్డి నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పట్టణానికి చెందిన వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో ఈనెల 23వ తేదీన అసోసియేషన్ సమావేశంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ 4 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా సేవలు అందిస్తున్న సుబ్బారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావటంపై జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, కోశాధికారి వై.వి.శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. -
ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన వాయిదా
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్చి 27 నుంచి 29వ తేదీవరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శనను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని తెలిపారు. గణనీయంగా పెరిగిన మల్లేశ్వరుడి ఆదాయం 109 రోజుల హుండీ కానుకల ఆదాయం రూ.58.03లక్షలు పెదకాకాని: శివాలయం మల్లేశ్వరస్వామి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మంగళవారం హుండీల్లోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా కాజ గ్రూపు టెంపుల్స్ ఈఓ పుణ్యాల వెంకటరెడ్డి హాజరయ్యారు. 109 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ.58,03,497లు ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.2,89,270లు సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం 54.300 గ్రాములు, వెండి 438 గ్రాములు, ఆస్ట్రేలియా 20 డాలర్లు, యుఎస్ఏ 139 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పాండ్లు, నేపాల్ కరెన్సీ రూ.130 , ఇండోనేషియా రూ.5000 వచ్చాయని డీసీ తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్ శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలుగ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గురు వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు మాచవరం: మాచవరం మండలంలో ముగ్గురు వీఆర్ఓలకు ఆర్డీఓ మురళీ కృష్ణ షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగమల్లేశ్వరరావు మంగళవారం తెలిపారు. మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం వీఆర్ఓలు ఏసుపాదం, లోకేష్, జానీబాషాలు ఐవీఆర్ కాల్స్‌లో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని మూడు గ్రామాలకు చెందిన కొంత మంది రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ముగ్గురు వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. -
సొంత రాజ్యాంగం పులిమేసి!
● మున్సిపల్ చట్టాలకు తూట్లు ● కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై వైఎస్సార్ సీపీ సభ్యుల ధ్వజం ● మేయర్ రాజీనామా ఆమోదంపై కౌన్సిల్ నిర్వహణ! ● అసలు రాజీనామా ఫార్మెటే సరికాదు ● వైఎస్సార్ సీపీ సభ్యుల వాకౌట్ ● మెజార్టీ సభ్యుల మద్దతుతో మేయర్ రాజీనామా ఆమోదం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్) : గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు రాజీనామాపై మున్సిపల్ చట్టాలను కాదని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) దుయ్యబట్టారు. ఈనెల 15న మేయర్ కావటి మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేసి కలెక్టర్‌కు పంపిన విషయం తెలిసిందే. మేయర్ రాజీనామా ఆమోదం కోసం మంగళవారం కౌన్సిల్ హాల్లో అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీల తన నియామకానికి కారణమైన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తరువాత మేయర్ రాజీనామా ఆమోదానికి సభ్యుల అభిప్రాయాలు తెలియజేయాలని సజీల కోరారు. వెంటనే డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ మే యర్ రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపితే.. ఆ లేఖ ఆధారంగా కౌన్సిల్ ఎలా నిర్వహిస్తారు? అస లు కలెక్టర్ నగరపాలక సంస్థకు మేయర్ రాజీనామాపై ఏమని రాశారో చెప్పాలని సెక్రటరీని కోరారు. మౌనం వహించిన సెక్రటరీ డెప్యూటీ మేయర్ అడిగిన ప్రశ్నపై కౌన్సిల్ సెక్రటరీ మౌనం వహించారు. దీంతో వెంటనే కమిషనర్ పులిశ్రీనివాసులు అందుకుని సమాధానం చెప్పే యత్నం చేశారు. మేయర్ పదవికి మనోహర్ రాజీనామా చేస్తూ లేఖను మెయిల్ ద్వారా కలెక్టర్‌కు, కమిషనర్‌కు పంపారని, దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారని కమిషనర్ వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేయర్ రాజీనామాపై అత్యవసర కౌన్సిల్ నిర్వహణకు ఉన్న ఇద్దరు డెప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్‌గా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎంఏయూడీ శాఖకు లేఖ రాశామని, ఈ నెల 21న డెప్యూటీ మేయర్ షేక్ సజీలను తాత్కాలిక మేయర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీని ప్రకారం అత్యవసరం కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేయర్ రాజీనామా ఫార్మెట్ సరైంది కాదు ‘‘మున్సిపల్ చట్టం 92 (1) మేయర్ తన పదవికి రాజీనామా చేయాలంటే కౌన్సిల్ నిర్వహించి కౌన్సిల్లో రాజీనామాకు గల కారణాలను చర్చించిన తరువాత సభ్యుల ఆమోదంతో రాజీనామాను ఆమోదించాలి. లేదా కౌన్సిల్ సెక్రటరీకి రాజీనామాను పంపితే ఆ రాజీనామాకు అనుగుణంగా సెక్రటరీ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ తరువాత రాజీనామాను ఆమోదించాలి. కానీ ఇక్కడ నగర కమిషనర్ కలెక్టర్‌కు పంపిన రాజీనామాను ఆధారం చేసుకుని కమిషనర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రభుత్వానికి లేఖ రాయడమేమిటి’’ అని డెప్యూటీ మేయర్ వజ్రబాబు ప్రశ్నించారు. దీనిపై తాము లీగల్ ఓపీనీయన్న్ తీసుకుంటామని.. అప్పటి వరకు మేయర్ రాజీనామా ఆమోదం కోసం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తరువాత తాత్కాలిక మేయర్ షేక్ సజీల మెజార్టీ సభ్యుల ఆమోదంతో మేయర్ మనోహర్ రాజీనామాను ఆమోదించారు. అధికారపార్టీకి కమిషనర్ కొమ్ముకాస్తున్నారు మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు మేయర్ రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపడం ఆమోదయోగ్యం కాదు డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజమెత్తారు. కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసిన ఆనంతరం విలేకరులతో డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు మాట్లాడారు. కమిసనర్ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మేయర్లు, డెప్యూటీ మేయర్లను, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లను టీడీపీ కూటమి భయభ్రాంతులకు గురిచేస్తోందని, పచ్చజెండా పట్టుకుంటేనే పదవిలో కొనసాగుతారని ప్రలోభాలకు గురిచేస్తోందని విమర్శించారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ సభ్యులు 46 మంది ఉంటే మెజార్టీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుందని ధ్వజమెత్తారు. కమిషనర్ కూడా మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. మేయర్ తన రాజీనామాను కలెక్టర్‌కు పంపడం ఆమోదం యోగ్యం కాదని పేర్కొన్నారు. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకుంటామని కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025వైభవంగా ఆలయ వార్షికోత్సవం బాపట్ల: బాపట్ల పట్టణం పాతబస్టాండ్‌లోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. శాంతి కల్యాణ మహోత్సవం చేపట్టారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమరావతిలో జపాన్ బృందం అమరావతి: ప్రముఖ పర్యాటక కేంద్రం అమరావతిని మంగళవారం జపాన్ ప్రతినిధుల బృందం సందర్శించింది. వారివెంట ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఉన్నారు.వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం దుగ్గిరాల: శ్రవణానక్షత్రం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం దుగ్గిరాల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం ఘనంగా జరిగింది. I -
పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలోని ఇళ్లు లేని అందరికీ ఇళ్ళస్థల పట్టాలు అందజేయడంతో పాటు ఎన్నో ఏళ్లుగా కొండ పోరంబోకు, అటవీ, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలకు అదే స్థలాల్లో పట్టాలివ్వాలని, లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 23వేల మంది పేదలు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తుంటే మంత్రి నారా లోకేష్ ఐదు వేల మందికి పట్టాలిస్తామనడం సరికాదన్నారు. 23 వేల మంది స్థలాల పట్టాలివ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలన్నారు. మంగళగిరి పట్టణంలోని 134 సర్వేలోని ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వాలని కోరారు .నగరంలోని అనేక కాలనీలలో డ్రెయినేజీ, తాగునీటి సమస్య ఉందని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇచ్చిందని, అలాగే టీడీపీ ప్రభుత్వం కార్మికులకు పథకం వర్తింపజేసి ఏడాదికి రూ రూ.24 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వీసం జవహర్లాల్, జేవి రాఘవులు, పిల్లలమర్రి బాలకృష్ణ, ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కార్యదర్శి పాశం రామారావు -
ఉప ఎన్నికలపై అధికారులతో జెడ్పీ సీఈఓ సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తొమ్మిది మండల ప్రజా పరిషత్‌లకు సంబంధించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యలో ఉప ఎన్నికల నిర్వహణపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. జెడ్పీలోని తన చాంబర్లో జరిగిన సమావేశంలో జ్యోతిబసు మాట్లాడుతూ ఈనెల 27న మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసి, అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే విధానంపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సన్నాహక ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులతో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శిక్షణ నిర్వహించారు. పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు, దుగ్గిరాల, గుంటూరు రూరల్, తెనాలి, అచ్చంపేట, కారంపూడి, నరసరావుపేట, ముప్పాళ్ల ఎంపీడీవోలతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధిత జిల్లా కలెక్టర్లచే నియమించిన ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. బాపట్ల మండలం పిట్టలవానిపాలెం మండల అధ్యక్ష ఎన్నికకు బాపట్ల డీఎల్డీవో విజయలక్ష్మి, భట్టిప్రోలు కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు బాపట్ల డీఏహెచ్‌వో వేణుగోపాలరావు, దుగ్గిరాల మండల అధ్యక్ష ఎన్నికకు గుంటూరు డ్వామా పీడీ శంకర్, గుంటూరు రూరల్ ఉపాధ్యక్ష ఎన్నికకు ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, తెనాలి కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు హ్యాండ్లూమ్స్ ఏడీ ఉదయ కుమార్, అచ్చంపేట మండల అధ్యక్ష ఎన్నికకు క్రోసూరు వ్యవసాయశాఖ ఏడీ హనుమంతరావు, కారంపూడి ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డ్వామా పీడీ లింగమూర్తి, నరసరావుపేట ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డీఏఓ ఐ.మురళి, ముప్పాళ్ల కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు పల్నాడు డీఏహెచ్‌వో కె.కాంతారావు ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులయ్యారు. గురజాల డీఎల్డీవో గభ్రూ నాయక్, పెదకాకాని ఈవోపీఆర్డీ కె.శ్రీనివాసరావు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. -
హిజ్రా ప్రోద్బలంతోనే హత్య ప్రియుడే హంతకుడు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ కొలనుకొండ డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన హిజ్రా బత్తుల శశి అలియాస్ జెస్సీ ఏడాది క్రితం లక్ష్మీతిరుపతమ్మ(32)ను వ్యభిచార వృత్తిలోకి దించింది. కొలనుకొండ వద్ద ఆమెతో వ్యభిచారం చేయిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ముత్యాల కోమల్ కుమార్ (చింటూ) తిరుపతమ్మకు పరిచయమయ్యాడు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకే గదిలో కొంతకాలం సహజీవనం చేశారు. ఈ క్రమంలో జెస్సీ (హిజ్రా) భర్త నవీన్తోనూ లక్ష్మీతిరుపతమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు చింటూను దూరంగా ఉంచుతోంది. దీనిని మనస్సులో పెట్టుకున్న జెస్సీ లక్ష్మీతిరుపతమ్మపై కోపంతో రగిలిపోయింది. చింటూను ఉసిగొల్పి తిరుపతమ్మను హత్య చేయించింది. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపర్చినట్లు డీఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు, సిబ్బంది కేసును ఛేదించినట్టు వివరించారు. ఇదిలా ఉండగా జనవరి 31న జరిగిన మహిళ హత్యకేసు వివరాలను పోలీసులు వెల్లడించకపోవడం విశేషం. లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసు ఛేదించినట్టు పోలీసుల ప్రకటన హిజ్రా భర్తతో తిరుపతమ్మ వివాహేతర సంబంధం ప్రియుడినీ దూరం పెట్టిన హతురాలు పథకం ప్రకారమే హత్య గుట్టుచప్పుడు కాకుండా నిందితుల అరెస్ట్ -
సీఐ గన్కార్యం..!
ఫిరంగిపురంలో ఓవర్ యాక్షన్ ● అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న ఖాకీలు ● అధికార పార్టీకి కొమ్ముకాసి వీఆర్ బాట పడుతున్న వైనం ● సివిల్ పంచాయితీలలో తలదూర్చి శాఖకు చెడ్డపేరు ● రేంజ్ పరిధిలో అడ్డగోలు బదిలీలు, వీఆర్లు ● పది నెలల్లో ఒకే స్టేషన్‌కు ముగ్గురు సీఐలు ● కూటమి సర్కారు వచ్చాక ఎల్లో పైరవీలదే రాజ్యం సాక్షి ప్రతినిధి, గుంటూరు, నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలను పట్టుకుని పోస్టింగ్‌లు తెచ్చుకున్న సీఐలు కొందరు స్వామిభక్తి ప్రదర్శిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మరికొందరు అడ్డంగా దొరికిపోయి వీఆర్ బాట పడుతున్నారు. తాజాగా ఫిరంగిపురంలో సీఐ రవీంద్రబాబు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఒక స్థల వివాదంలో ఫిర్యాదు చేసిన వారిపైనే దాడికి తెగబడటం, వారికి సినీఫక్కీలో గన్ గురిపెట్టడం, ఒక యువకుడిని గన్‌తో కొట్టి గాయపరిచడం జిల్లాలో సంచలనం రేకెత్తించాయి. ఈ అధికారి సివిల్ పంచాయితీలో తలదూర్చి రెచ్చిపోవడం ఇది రెండోసారి. గతంలో గోడను పడగొట్టించి మరీ..! గతంలో పొనుగుపాడు గ్రామంలో దళితుల స్థలంలో గోడను పడగొట్టించి మరీ ఈ సీఐ రోడ్డు వేయించిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకుని వెళ్లిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డైమండ్బాబుపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గ్రామస్తుల చేతిలో తన్నులు తినే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ అధికారిని ఉన్నతాధికారులు వెనకేసుకొస్తారా, లేక చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ‘రేంజ్’ వేరు..! సీఐల బదిలీలు, వీఆర్ విషయంలో గుంటూరు రేంజ్ కొత్త ట్రాక్ రికార్డును నెలకొల్పింది. గుంటూరు రేంజ్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠీ వచ్చిన తర్వాత పలువురు సీఐలను బంతాట ఆడుతున్నారు. సరిగ్గా పది నెలలు క్రితం సుమారు 13 మందికిపైగా సీఐలను బదిలీ చేశారు. అయితే వీరు బాధ్యతలు స్వీకరించక ముందే వెనక్కి పిలిచారు. కొందరు సీఐలు బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిల్లోనే వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లోకి వెళ్తున్నారు. కొంతమందికి పోస్టింగ్ ఇవ్వగానే కూటమికి చెందిన పచ్చపత్రికల్లో, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతోంది. గత ప్రభుత్వానికి అంటకాగారని, వారికి పోస్టింగ్ ఇవ్వడమేమిటంటూ పోస్టింగ్‌లు వస్తాయి. వెంటనే వారిని వీఆర్‌కు పిలుస్తున్నారు. ఇలా వెళ్లిన వారికి నెలలు గడిచినా పోస్టింగ్‌లు ఉండటం లేదు. బూట్లతో డెప్యూటీ సీఎం వద్దకు వెళ్లారని వీఆర్‌కు.. జనసేన కార్యాలయంలో డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దీక్షలో ఉండగా బూట్లతో లోపలికి వెళ్లారంటూ మంగళగిరి పట్టణ సీఐ ఎం.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపడం కూటమి ప్రభుత్వ విధానాలకు పరాకాష్ట. కొన్ని స్టేషన్లకు సీఐగా వస్తే ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. పట్టాభిపురంలో ఇప్పటికి నలుగురు సీఐలు మారారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ స్టేషన్‌కు సీఐగా కిరణ్ వచ్చారు. అతను ఎమ్మెల్యే భర్త ఆదేశాల మేరకు వేరే వారిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టడంతో అతనిని వీఆర్‌కు పంపారు. తర్వాత వీరేంద్రబాబు వచ్చీరాగానే సివిల్ పంచాయితీలలో వేలుపెట్టారు. విపక్ష నాయకులే టార్గెట్‌గా కేసులు పెట్టి వేధింపులకు దిగారు. అయితే అతన్ని కూడా వీఆర్‌కు పంపించి మధుసూదన్‌కు డీవో ఇచ్చారు. విధుల్లో చేరిన 24 గంటల్లోనే పోస్టింగ్ నిలిపేసి గాల్లో పెట్టారు. అరండల్‌పేట స్టేషన్‌కూ మొదట కుంకా శ్రీనివాసరావును తీసుకురాగా బోరుగడ్డ అనీల్ కేసులో వీఆర్‌కు పంపించి వీరాస్వామిని తీసుకువచ్చారు. నగరంపాలెం స్టేషన్‌కు మొదట మధుసూధనరావును, తర్వాత నాయక్, ప్రస్తుతం నజీర్బేగ్ను తీసుకొచ్చారు. ● తాజాగా రెండు రోజుల క్రితమే అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్‌పై వేటు పడింది. గ్రంధశిరి గ్రామంలో జరిగిన వివాదంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఒక నిందితుడు తప్పించుకుపోయేలా వ్యవహరించిన అంశంలో వీఆర్‌కు పిలిచారు. 25 మంది వీఆర్‌లో.. ప్రస్తుతం రేంజ్లో సుమారు 25 మందికి పైగా సీఐలు వీఆర్‌లో ఉన్నారు. వీరంతా కూడా కూటమి అధికారంలోకి వచ్చాక వీఆర్‌కు వెళ్లిన వారే. సీఐల పోస్టింగులలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. మిగిలిన వారిని వీఆర్‌కు పిలవడం లేకపోతే ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు కట్టబెట్టడం చేస్తున్నారు. లూప్‌లైన్ పోస్టింగ్‌లు ఇచ్చినా చిన్నచిన్న కారణాలతోనే వారిని పక్కన పెట్టారు. -
అమరావతిలో మంత్రి నారాయణ పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మంగళవారం పర్యటించారు. రాయపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాలను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకొని సూచనలు చేశారు. ఈ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.43 వేల కోట్లతో గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయన్నారు. మొదట రాజధానిలో క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఇప్పుడు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు పరిశీలించినట్టు పేర్కొన్నారు. 186 బంగ్లాలు, మంత్రులు, జడ్జిలు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు వస్తున్నాయన్నారు. గెజిటెడ్ అధికారులకు 1440, ఎన్జీవోలకు 1995 నిర్మాణాలు వస్తున్నాయని, హైకోర్టు 16.85 లక్షల చదరపు అడుగులు వస్తుందని, అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో అందుబాటులోకి రానుందన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నామని, ల్యాండ్ వాల్యూ పెరిగిన తరువాత అప్పు తీరుస్తామని వెల్లడించారు. -
రెచ్చిపోయిన సీఐ.. తిరగబడ్డ జనం
గుంటూరు: శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన సీఐ రెచ్చిపోవడంతో ఓ మామూలు వివాదం శాంతిభద్రతలకే విఘాతం కలిగించే పరిస్థితికి దారితీసింది. ఫిర్యాదు చేసిన దళితులపైనే విచక్షణ మరిచి తన ప్రతాపం చూపడంతో.. ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఓ యువకుడిని సీఐ తుపాకీతో కొట్టడంతో న్యాయం చేయాల్సిన తమపైనే దాడిచేయడం ఏమిటని ప్రజలు ముట్టడించడంతో సదరు సీఐ అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయ స్థలం ఉంది.ఈ స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ స్థలంలో సోమవారం షెడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ మురళీ, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడికి ఫిరంగిపురం సీఐ బి.రవీంద్రబాబు హోంగార్డుతో అక్కడికి చేరుకున్నారు. వచ్చీ రావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయడమేమిటని అక్కడి యువకులు ప్రశ్నించడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు.తన గన్ బయటకుతీసి అఖిల్ అనే యువకుడిని కొట్టడంతో అతనూ గాయపడ్డాడు. దీంతో స్థానికులు సీఐ రవీంద్రబాబును ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. అనంతరం.. దళితులు సీఐ డౌన్ డౌన్ అంటూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు డీఎస్పీ భానూదయ మేడికొండూరు, నల్లపాడు సీఐలు నాగూల్ మీరా, వంశీధర్‌తో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సీఐపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో వారికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్‌కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్‌ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్‌స్కా్వడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్‌బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్‌కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.హతురాలు పామర్రు వాసి.. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్‌జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్‌జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్‌కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. -
సాయుధ దళాలకు ఆర్థిక చేయూత అభినందనీయం
గుంటూరు వెస్ట్ : దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్న సాయుధ దళాలకు ఆర్థిక చేయూతనందించడం అభినందనీయమని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2024కు సంబంధించి గుంటూరు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక బృందాల నుంచి సేకరించిన రూ.2,05,197 చెక్కును మెప్మా పీడీ విజయలక్ష్మి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చేతుల మీదుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఆర్.గుణ షీలాకు అందజేశారు. ఈ సందర్బంగా మెప్మా విభాగ కృషిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి పాల్గొన్నారు.కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
వైద్యసేవ ఉద్యోగులు విధుల బహిష్కరణ
గుంటూరు మెడికల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం గుంటూరులో ఎన్టీఆర్ వైద్య సేవ క్షేత్రస్థాయి ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రభుత్వ శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయిప్ యూనియన్ తరపున ఈ నిరసన చేపట్టారు. యూనియన్ నాయకులు ఏపీ జేఏసీ అధ్యక్షురాలు శివకుమారి, కార్యదర్శి ప్రత్యూష, జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. నేడు గుంటూరులో న్యాయవాదులు విధుల బహిష్కరణ గుంటూరు లీగల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇ.ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. క్షయ వ్యాధిపై ఫార్మసీ విద్యార్థుల ప్రచారం తెనాలి: అంతర్జాతీయ క్షయ వ్యాధి దినం సందర్భంగా స్థానిక ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజి ఐపీఏ–ఎస్ఎఫ్, ఎన్ఎస్ఎస్ విభాగాల విద్యార్థులు సోమవారం ప్రచారం నిర్వహించారు. క్షయ వ్యాధిపై అవగాహన ప్రదర్శన చేశారు. క్షయ లక్షణాలు, నివారణ, సమయోచిత చికిత్స వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వ్యాధిపై అవగాహన కల్పించారు. అవసరమైన జాగ్రత్తతలను వివరించారు. ఏపీటీఐ–ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్. కె.వెంకటరమణ, ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, ఐపీఏ–ఎస్ఎఫ్ మెంటర్స్ జి.నందగోపాలకృష్ణ, పి.భార్గవి, ఎన్ఎస్ఎస్–1,2 విభాగాల ప్రోగ్రాం అధికారులు టి.జ్యోతిబసు, కె.కళ్యాణ చక్రవర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రుక్మిణీ అలంకారంలో నృసింహుడు మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీ నృసింహస్వామి సోమవారం రాత్రి రుక్మిణీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. మంగళవారం స్వామి స్థంభోద్భవం అలంకారంలో దర్శనమివ్వనున్నారు. -
హద్దులు దాటుతున్న ఇసుక
కొల్లూరు: కూటమి నేతలు ఇసుకను అక్రమ మార్గంలో హద్దులు దాటిస్తున్నారు. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంట సాల మండలం శ్రీకాకుళం ప్రాంతంలో ఉచిత ఇసుక క్వారీ ఉంది. ఇసుకను భారీ లారీలలో నింపి దొడ్డిదారిలో బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల కు అక్రమంగా తరలిస్తున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక, కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామాల నడుమ వ్యవసాయ కార్యకలాపా లు, ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గాలు మార్గం వారి అక్రమాలకు రాచమార్గంగా మారింది. రోజుకు 100 ఇసుక లారీలు అక్రమంగా తరలివెళుతున్నాయి. బిల్లులు నిల్ నిబంధనల మేరకు రీచ్‌ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇతర జిల్లాల్లోకి బిల్లులతో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఉచిత ఇసుక క్వారీలను దక్కించుకున్న కూటమి నాయకులు బిల్లులు లేకుండానే బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లా లకు ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం కృష్ణా జిల్లా నుంచి నదిలోని గాలు మార్గం ద్వారా బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా జిల్లాలోకి వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా అధిక సంఖ్యలో వాహనాలు గాజుల్లంక, పెసర్లంక, కొల్లూరు, పోతార్లంక, దోనేపూడి, కిష్కిందపాలెం, తోకలవారిపాలెం మీదుగా తరలివెళుతున్నా యి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు మాత్రం స్పందించడంలేదు. పెసర్లంక–కొల్లూరు రహదారి పనులు జరుగుతున్న తరుణంలో ఇసుక లారీల నుంచి కారుతున్న నీరు కారణంగా రోడ్డు మన్నిక ప్రశ్నార్ధకంగా మారుతుంది. కూలీల కడుపుకొడుతున్నారు ఉచిత ఇసుక క్వారీలలో తవ్వకాలకు కూలీలను మాత్రమే వినియోగించాలన్న నిబంధనకు తూ ట్లు పొడుస్తున్నారు. కాంట్రాక్టర్లు యంత్రాలను వినియోగిస్తున్నారు. నదిలో ట్రాక్టర్లు దిగి కూలీల తో ఇసుక నింపకుండా గుంతలు తీసి అడ్డుకుంటు న్న అధికారులు పక్క జిల్లా నుంచి అక్రమ మార్గంలో ఇసుకరవాణా జరుగుతున్నా పట్టించుకోలేదు. కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక క్వారీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు తరలింపు గాలు రోడ్డే అక్రమాలకు మార్గం పట్టించుకోని అధికారులు పరిశీలించి చర్యలు నదిలో అక్రమ మార్గం ద్వారా జిల్లాలోకి ఇసుక రవాణాను అరికట్టే విషయంలో రూల్స్‌ను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. మైనింగ్ శాఖాధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి కృష్ణా నదిలో జిల్లా దాటి బిల్లులు లేకుండా వాహనాలు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలిస్తాం. – బి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు. -
నేడు కౌన్సిల్ అత్యవసర సమావేశం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం తాత్కాలిక మేయర్ షేక్ సజిల అధ్యక్షతన జరగనుంది. ఇటీవల నగర మేయర్‌గా కావటి శివనాగమనోహర్‌నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమోద తీర్మానం చేసేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు విజయపురిసౌత్: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో మాచర్ల మండలం అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి 10 లక్షల చేప పిల్లలను సోమవారం విడుదల చేశారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వారంలో సైతం 10 లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలి వలలతో చేపల వేట చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మత్స్య సంపదను కాపాడుకోవాలని సూచించారు. ఎఫ్డీఓ టీవీఏ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఏఓ జగదీష్, మత్స్యశాఖ తనిఖీ అధికారి వెంకట రమణ, గ్రామ మత్స్య సహాయకులు లీలావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. యార్డుకు 1,18,783 బస్తాలు మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,18,783 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,05,617 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,200 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,200 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,366 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి
కలెక్టర్ నాగలక్ష్మిగుంటూరు వెస్ట్: కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అర్జీదారులు పదే పదే వస్తున్నారని, ఈ విధానం మారాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ చిన్న చిన్న అంశాలను కొందరు సిబ్బంది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలు చాలా కీలకమన్నారు. వీటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కరించాలన్నారు. అనంతరం వచ్చిన 231 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025దర్యాప్తుకు నాలుగు ప్రత్యేక బృందాలు ● అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు ● మృతురాలి మాజీ ప్రియుడిపైనా అనుమానం ఇఫ్తార్ సహర్ (మంగళ) (బుధ) గుంటూరు 6.25 4.52 బాపట్ల 6.25 4.52 నరసరావుపేట 6.27 4.54 తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం జరిగిన మహిళ హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్‌కుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీష్‌కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు విజయవాడలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతురాలు పామర్రు వాసి మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మి తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని తల్లికి చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్‌జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్‌జెండర్ నజీరతోనూ పరిచయమైంది. వీరిద్వారా తిరుమపత్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్‌కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది. ● 45 రోజుల వ్యవధిలో ఇద్దరి మహిళల హతం ● హడావుడిగా హతుల మృతదేహాల తరలింపు●● ఆధారాల సేకరణలో ఖాకీల విఫలం ● అసహనం వ్యక్తం చేసిన ఎస్పీ సతీష్‌కుమార్ ● డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఘటనలు ● రాజధాని ప్రాంతంలో కొట్టొచ్చినట్టు కనిపించిన భద్రతా వైఫల్యం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్‌కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలూ సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీ తిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9.30 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్‌ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్‌స్క్వాడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్థలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్‌బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్‌కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. గంజాయికి అడ్డా! కూటమి సర్కారు వచ్చాక తాడేపల్లి ప్రాంతం గంజాయికి అడ్డాగా మారింది. గంజాయి తాగి యువకులు హల్చల్ చేస్తున్నారు. మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల నులకపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఎస్పీ సతీష్‌కుమార్‌కు మహిళలు వివరించారు. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మి తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదల్లో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సీ, నజీర లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి లక్ష్మీతిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల్ని పోషించుకోవడం కోసం వంట పనికి వస్తుందని భావించామే కానీ ఇలాంటి పనులు చేస్తోందని ఊహించలేదని, ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని గుండెలవిసేలా విలపించారు. పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఘటనా స్థలం వద్దకు చేరుకుని పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ సతీష్కుమార్తాడేపల్లి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మహిళ హత్య కేసులో పూర్తి ఆధారాలు సేకరించకుండా మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తరలించడంపై జిల్లా ఉన్నతాధికారీ అసహనం వ్యక్తం చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. గత 45 రోజుల్లో ఈ ప్రాంతంలో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడం, డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నిత్యం వీవీఐపీలు తిరిగే ప్రాంతంలో ఘటనలు జరగడం, రెండు కేసుల్లోనూ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారడం కూటమి సర్కారు, హోంశాఖ పనితీరును, భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. 7న్యూస్రీల్మూడు నెలలుగా వీడియోలు, రీల్స్ హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీతిరుపతమ్మ, మరికొందరు రీల్స్, సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. డీజీపీ కార్యా లయం సమీపంలో నిత్యం వీవీఐపీలు తిరిగే రహదారిలో భద్రతా వైఫల్యానికి ఇది నిదర్శనంగా ఉంది. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. -
27న గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం సోమవారం జరిగింది. అభ్యర్థులు తమ మేనిఫెస్టోను న్యాయవాదుల ముందు ఉంచారు. అధ్యక్ష పదవికి యగలశెట్టి శివ సూర్యనారాయణ, కాజా భరద్వాజ, నంబూరు పాములు, మధిర నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. వీరు బార్ అసోసియేషన్‌ను ప్రగతి పథంలో నడిపిస్తామని ఎలక్షన్ ఆఫీసర్ కాసు వెంకటరెడ్డి, న్యాయవాదుల సమక్షంలో ప్రమాణాలు చేశారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి మాలే దేవరాజు, డాక్టర్ చింతా రామ కోటిరెడ్డి, జనరల్ సెక్రెటరీ పదవికి ఎరస్రాని అజయ్ కుమార్, మొగల్ కాలేషా బేక్, మోతుకూరి శ్రీనివాసరావు. జాయింట్ సెక్రటరీ పదవికి పొమ్మినేని చంద్రశేఖర్, ఇల్లూరి విజయ్ వర్మ, గూడూరి అశోక్ కుమార్, జీవీఎస్ఆర్కేఎస్ చంద్రన్, లైబ్రరీ కార్యదర్శి పదవికి మువ్వా పాపిరెడ్డి, బొప్పా శ్రీనివాసరావు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కొప్పాల హనుమంతరావు, గండికోట శేషగిరిరావు పోటీలో ఉన్నారు. లేడీ రిప్రజెంటివ్ పదవికి అడపా ఇందిరా, పూర్ణం కళ్యాణి, లేడీ ఎగ్జిక్యూటివ్ పదవికి కండెపు కవిత, మంద విజయ్ కుమారి పోటీలో ఉన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ పదవికి మోర్ల బాల సుందరి, మహమ్మద్ దాదా ఖరీం, బండ్లకృష్ణ, పల్లె నరసింహారావు, పి.సురేష్ కుమార్ పోటీలో ఉన్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పదవికి లింగాల మారుతి, శివ నాగ ప్రసాద్, షేక్ రిహాన్ బేగం, పెరుమాళ్ళ శివ రంగనాయకులు, రాయపూడి శ్రీనివాసరావు (గుండు శీను) పోటీలో ఉన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్‌లో సుమారు 3వేల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 2012 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
పుత్రశోకంతో తల్లడిల్లుతున్నాం
మద్యం దుకాణం తొలగించండి నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పుత్రశోకంతో తల్లడిల్లుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఇద్దరు బాధితులు ఎస్పీ సతీష్‌కుమార్ ఎదుట తమ గోడు వినిపించారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార కార్యక్రమం (పీజీఆర్ఎస్) నిర్వహించారు. బాధితుల అర్జీలను ఎస్పీ సతీష్‌కుమార్ పరిశీలించారు. ఫిర్యాదుదారుల బాధను ఆలకించారు. అర్జీలపై సబ్ డివిజన్లలోని పోలీసు అధికారులతో మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష, జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు. కొడుకు ఆచూకీ గుర్తించండి పెద్దబ్బాయి ఓంసాయిరెడ్డి గుంటూరు కృష్ణనగర్ నాలుగో వీధిలోని నారాయణ విద్యా సంస్థలో 10వ తరగతి చదివేవాడు. తొంభై శాతం సీటు రాయితీతో చేర్చాం. ఫీజు రాయితీ తొంభై శాతం నుంచి 80శాతానికి కుదించామని డబ్బులు చెల్లించాలని బయట నిలబెట్టారు. ఈ క్రమంలో నా సోదరుడు వెళ్లి ఫీజు చెల్లిస్తామని చెబితే లోనికి అనుమతించారు. గతనెల 8, 9 తేదీల్లో స్కూల్ నుంచి కుమారుడు ఫోన్ చేసి మాట్లాడాడు. బాగా చదువుతానని బదులిచ్చాడు. అదేనెల 13న విద్యా సంస్థల నుంచి ఫోన్ చేసి, ఓంసాయిరెడ్డి కనిపించడంలేదని తెలిపారు. సాయంత్రం వెళ్లి స్కూల్లో విచారించాం. అప్పటి నుంచి కుమారుని జాడలేదు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. కుమారుడు కనిపించక ఇప్పటికి నలభై రోజులకుపైగా గడిచింది. నా కొడుకుకు వ్యసనాల్లేవు. – తండ్రి వెండిదండి శివశంకర్‌రెడ్డి, పోస్ట్‌మాస్టర్, ముప్పలపాడు గ్రామం, హనుమంతునిపాడు మండలం, ప్రకాశం జిల్లా కుమారుడు మృతిచెందాడు.. ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి చిన్న కుమారుడైన వై.హరికృష్ణ (41) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్తంభాలగరువు సెంటర్ ఓ కంటి ఆసుపత్రి సమీపాన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ హరికృష్ణను కాలితో కొట్టి, చేతులతో నెట్టేశారు. దీంతో కొడుకు కిందపడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. గాయపడిన అతను చికిత్స పొందుతూ ఈనెల 18న మృతిచెందాడు. దీనిపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పది రోజులుగా పోలీసులు చుట్టూ తిరుగుతున్నా.. ఇప్పటి వరకు అనుమానితులను గుర్తించలేదు. ఇప్పటికై నా నిందితులను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నాం. – వై.రత్నకుమారి, రాజేంద్రనగర్ ఒకటో వీధి. న్యాయం చేయండి ఎస్పీకి విన్నవించుకున్న బాధితులు కొడుకు జాడ కనుక్కోవాలని ఒకరి విన్నపం కుమారుడిని హతమార్చిన వారిని గుర్తించాలని మరొకరి వేడుకోలు -
కొత్త కవులను ప్రోత్సహిద్దాం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బ్రాడిపేటలోని కథా రచయిత్రి తాటికోల పద్మావతి నివాసంలో గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కవులందరూ కలిసి ‘కవిత్వంతో కాసేపు’ నిర్వహించారు. ఈనెల 21 న అంతర్జాతీయ కవితా దినోత్సవం, 30న ఉగాది పండుగ సందర్భంగా కవిత్వంపై చర్చించారు. ఔత్సాహిక కవులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సంఘం పని చేద్దామని సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.సుభాని తెలిపారు. కవులు తాము రాసిన కవితతోపాటు సమకాలీన కవులు రాసిన, తమకు నచ్చిన మరో కవిత వినిపించి జయప్రదం చేశారని కోశాధికారి నానా చెప్పారు. రచయిత్రి తాటికోల పద్మావతి ఆతిథ్యం, ఆప్యాయతలను కవులు కొనియాడారు. సంఘం ఉపాధ్యక్షులు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, సభ్యులు ఈవూరి వెంకట రెడ్డి, కొణతం నాగేశ్వరరావు, శ్రీవశిష్ట సోమేపల్లి పాల్గొన్నారు. -
నాడు డ్రాపవుట్.. నేడు పట్ట‘భద్రత’పై పట్టు
● యూజీసీ కమిటీకి తెనాలి బిడ్డ సారథ్యం ● జాతీయ భద్రత అధ్యయాలపై సరికొత్త కోర్సు రూపకల్పనకు కృషి ● డాక్టర్ రమేష్ కన్నెగంటి విజయప్రస్థానం తెనాలి: చదువుల్లో ఒకనాటి డ్రాపవుట్ కుర్రోడు...ఇప్పుడు ఏకంగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలోని కమిటీకి సారథి అయ్యారు. అదికూడా జాతీయ భద్రత అధ్యయనాలకు సంబంధించిన సరికొత్త ‘మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు’ రూపకల్పన కోసం. ప్రసిద్ధ యూనివర్శిటీల ప్రొఫెసర్లు, వైస్‌ఛాన్సలర్ సభ్యులుగా గల కమిటీకి ఆయన నాయకత్వం వహిస్తుండటం మరింత విశేషం. చదువు విలువ తెలుసుకుని.. తెనాలి బిడ్డ డాక్టర్ రమేష్ కన్నెగంటి. పుల్లరి ఉద్యమ యోధుడు కన్నెగంటి హనుమంతు మునిమనవడు. ఇంటర్ ఫెయిలయ్యారు. చదువు మానేశారు. తర్వాత విద్య విలువ తెలుసుకుని మళ్లీ పుస్తకం పట్టారు. బీఏ వరకు ఇక్కడే చదివారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ అనంతరం, న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో ‘యూఎస్–ఆస్ట్రేలియా సెక్యూరిటీ రిలేషన్స్’పై ఎంఫిల్ చేశారు. 2000–01లో ‘మిస్టర్ జేఎన్‌యూ’ టైటిల్‌ను ‘ద్రోణాచార్య’ గురుచరణ్‌సింగ్ చేతులు మీదుగా అందుకున్నారు. 2002–03లో ఇజ్రాయెల్‌లోని హిబ్రూ యూనివర్శిటీలో ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’ చదివారు. జేఎన్‌యూలో 2006లో ‘యూఎస్–ఇజ్రాయెల్ సెక్యూరిటీ రిలేషన్స్ ఇన్ ది పోస్ట్ కోల్డ్‌వార్ ఎరా’పై పీహెచ్డీ చేశారు. తర్వాత ఇజ్రాయెల్‌లోని బార్–ఇలాన్ యూనివర్శిటీలో ‘యూఎస్–ఇజ్రాయెల్–ఇండియా స్ట్రాటెజిక్ రిలేషన్స్’ (టె ర్రరిజాన్ని ఓడించటానికి మూడు దేశాల త్రిముఖ వ్యూహం’పై పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ చేశారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతపై దృష్టి దేశంలో జరిగిన ఉగ్రవాద బాంబు పేలుళ్ల నేపథ్యంలో డాక్టర్ రమేష్ దృష్టి మానవ భద్రతపైకి మళ్లింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదం, వ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనాన్ని టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవటంపై అధ్యయనం, పరిశోధన కొనసాగించారు. ఆ క్రమంలోనే 2013లో హైదరాబాద్‌లో మానవ రక్షణ అధ్యయన సంస్థ (సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్)ను కొందరు స్నేహితులు, సంస్థల సహకారంతో ఆరంభించారు. పన్నెండేళ్లలోనే ఆ సంస్థ దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలపై ‘థింక్ ట్యాంక్’గా పలు విజయాలను సాధించింది. ఐఐటీ, నల్సర్ లా యూనివర్శిటీతో సహా పలు యూనివర్శిటీలు, ఆంధ్ర, తెలంగాణ పోలీసులతో సంస్థ ఎంఓయూలను కుదుర్చుకుంది. సంస్థ 12వ వార్షికోత్సవం ఈనెల 22న జరుపుకున్నారు. స్మార్ట్ పోలీసింగ్‌కు శ్రీకారం టెక్నాలజీ సాయంతో మానవభద్రత అంశంపై పలు ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న రమేష్, కృత్రిమ మేధతో స్మార్ట్ పోలీసింగ్, ఓడరేవుల రక్షణపై సరికొత్త ప్రోగ్రామ్‌లను రూపొందించారు. ఫలితంగా అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఆయనకు ఆహ్వానం లభించింది. యూనివర్శిటీ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ (హెచ్ఏఐ) ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో జరిగిన ‘మానవ–కేంద్రీకృత కృత్రిమ మేధస్సు’ శిక్షణకు డాక్టర్ రమేష్ హాజరయ్యారు. చైనా ప్రాబల్యం నుంచి హిందూ, పసిఫిక్ మహాసముద్రాల జలాలను కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీతో ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై వివిధ దేశాల సీనియర్ మిలటరీ అధికారుల చర్చలకూ రమేష్ సంస్థ వేదికై ంది. తాజాగా యూజీసీకి.. యూజీసీ సారథిగా తాజాగా రమేష్ ఎంపికయ్యారు. జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం సిలబస్, కోర్సు కంటెంట్‌ను ఖరారు చేస్తారు. క్రెడిట్ల సంఖ్య, కోర్సు కోసం మొత్తం మాడ్యూళ్ల సంఖ్య, పరిశ్రమల లింకేజ్లు ‘స్వయం’ ప్లాట్‌పామ్‌పై కోర్సును సకాలంలో అభివృద్ధి చేసి, అందించటం యూజీసీ బాధ్యత. జాతీయ భద్రతపై ఓ కోర్సు ఉంటుందని డాక్టర్ రమేష్ ‘సాక్షి’కి వెల్లడించారు. భద్రతా అంశాన్ని పాఠశాల విద్య నుంచే భాగం చేయాలని పేర్కొన్నారు. -
కేవీకేలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సోమవారం నగర శివారుల్లోని లాంఫాంలోని కేవీకేలో ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ ఎం.యుగంధర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పశు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జేవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనశాలల్లో రూపుదిద్దుకుంటున్న సాంకేతికతను రైతులకు చేరవేయటంలో కృషివిజ్ఞాన కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. వివిధ రంగాల్లో శిక్షణ, నైపూణ్యాల వృద్ధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ యువతకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ శాసీ్త్రయ సలహా మండలి సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించాలని అభిప్రాయపడ్డారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గేదెల యాజమాన్య పద్ధతులపై కేవీకే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ బి. శోభామణి, డాక్టర్ శివన్నారాయణలు క్షేత్రస్థాయి పరిశీలనలు, సూక్ష్మ సమన్వయంతో నిర్వహించేట్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు నరసింహారావు, ఎల్ఆర్ఎస్ హెడ్ డాక్టర్ ముత్తారావు వ్యవసాయ, అనుభంద సంస్థల నిపుణులు వారి సలహాలను అందించారు. కేవీకే శాస్త్రవేత్తలు 2024–25 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 2025–26 సంవత్సరంలోని కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యుగంధర్‌కుమార్ మాట్లాడుతూ సలహామండలి సలహాలు సూచనలు పాటిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు, ఎల్ఆర్ఎస్ సిబ్బంది, రైతులు, శాస్త్రవేత్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల వేతనాలు పెంచాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఇంతవరకు తమ వేతనాలు పెంచలేదని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. పాతగుంటూరులోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి అధ్యక్షుతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోగా ఉద్యోగుల పేరుతో కరెంట్ బిల్లులు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో అంగన్వాడీల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా వై.రమణను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దీప్తి, ఉపాధ్యక్షులు సుకన్య, ధనలక్ష్మి, హేమలత, రాజకుమారి, శివ పార్వతి పాల్గొన్నారు. -
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం వారు కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన తాడికొండ: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ–4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అంతకు ముందు రాష్ట్ర సచివాలయంలో మార్చి 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆమె వెంట ప్రొటోకాల్ డైరెక్టర్ మోహనరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, జిల్లా ఉపాధి కల్పనాధికారి దుర్గాభాయి, గుంటూరు పశ్చిమ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తుళ్ళూరు తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాల పరిశీలన తాడికొండ: తాడికొండ మండలంలో కొనసాగుతున్న వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాలను ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. నాలుగు కేంద్రాలను పరిశీలించిన వారు నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 50 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 510 మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్య ద్వారా చదువుతున్న మహిళలకు పరీక్ష నిర్వహించి ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేంద్ర అడల్ట్ ఎడ్యుకేషన్ బ్యూరో కన్సల్టెంట్ అధికారి జగన్ మోహన్ రావు, సభ్యులు ఓంకారం, శిరీష, దాసరి వెంకటస్వామి ఎంపీడీవో కె.సమతా వాణి, ఏపీఎం సాంబశివరావు పాల్గొన్నారు. శ్రీరంగనాయకులుగా నృసింహస్వామి మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆస్థాన అలంకార ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీరంగనాయకులు అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కైంకర్యపరులుగా కొడాలి సుగుణమ్మ జ్ఞాపకార్థం సీతారామయ్య, బసవ ఆనంద్, వెంకట అజయ్, ఆస్థాన కైంకర్యపరులుగా పచ్చళ్ళ విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈఓ ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. -
వైద్యులే నిజమైన హీరోలు
గుంటూరు మెడికల్: ఒక డాక్టర్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం ఏడాదికి రూ.1.72 కోట్లు ఖర్చు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజా సొమ్ముతో డాక్టర్లయిన వారు తమ సేవల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్‌లో 108 గుండె బైపాస్ సర్జరీలు విజయవంతంగా చేసిన ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి వైద్యులు, పద్మశ్రీ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను ఆదివారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే కార్డియాలజీ వైద్య విభాగంలో 25,000 ప్రొసీజర్స్, 5,000 పీటీసీఏ ప్రొసీజర్స్ చేసిన వైద్యులను సన్మానించారు. ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైద్యులు నిజమైన హీరోలని, చరిత్రలో నిలిచిపోయేలా మంచి పనులు చేయాలని పేర్కొన్నారు. సేవాభావం కలిగి ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్సీడీ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నామని, 1.8 కోట్ల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. వీరిలో కొత్తగా 10 లక్షల మంది అధిక రక్తపోటు, 10 లక్షల మంది షుగర్ బారిన పడ్డారని వివరించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 60వేల మంది రోగులను గుర్తించినట్టు వెల్లడించారు. స్టెమి కార్యక్రమం ద్వారా గుండె పోటు వచ్చిన 2,224 మందికి ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడామన్నారు. డాక్టర్ గోఖలేను అభినందించారు. జీజీహెచ్‌కు గొప్ప చరిత్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తాను గుంటూరు జీజీహెచ్‌లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవటానికి రెండు ఘటనలు కారణమని చెప్పారు. జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిందని, సెల్‌ఫోన్ వెలుతురులో ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు ఆపరేషన్ చేశారని ‘సాక్షి’ మీడియాలో వార్తలు ప్రచురితం అయినట్లు చూసి జీజీహెచ్‌పై పేదలకు నమ్మకం కలిగించేందుకు ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ చేయించుకుని ఎనిమిదేళ్లయిందని, చాలా సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ చదువుకున్న ఏడుగురు వైద్యులకు పద్మశ్రీలు రావటం చాలా గొప్ప విషయమని చెప్పారు. లివర్ మార్పిడి ఆపరేషన్లకు ఏర్పాట్లు గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో మాతృసంస్థ అభివృద్ధికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. వంద ఆపరేషన్లు పూర్తిచేసిన గోఖలేను అభినందించారు. విశాఖలో ఇటీవల లివర్ మార్పిడి ఆపరేషన్ చేశారని, గుంటూరు జీజీహెచ్‌లో కూడా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సేవా భావం కలిగి ఉండాలి వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ వంద గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గోఖలేకు సన్మానం త్వరలో గుండె మార్పిడి ఆపరేషన్లు సన్మాన గ్రహీత డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ వైద్యులు ఆరోగ్యవంత సమాజానికి సాధ్యమైనంత కృషి చేయాలన్నారు. త్వరలో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్, నగర సెక్రటరీ డాక్టర్ బి.సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీ డాక్టర్ చండ్ర రాధిక రాణి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగళ్ల కిషోర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ తాతా సేవకుమార్, గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ , సీటీఎస్ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణమూర్తి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ నాతానీ శ్రీకాంత్, ఎనస్థీషియా వైద్య విభాగాధిపతి డాక్టర్ పోలయ్య పాల్గొన్నారు. -
గతంలో ఓ సచివాలయ ఉద్యోగి అదృశ్యం
కొద్ది రోజుల కిందట ముగిసిన ఐసీసీ టోర్నీ, తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ నేపథ్యంలో నరసరావుపేట కేంద్రంగా బెట్టింగ్ భూతం జడలు విప్పింది. దీనికి అభం శుభం తెలియని ఎందరో అభాగ్యుల ప్రాణాలు అర్ధంతరంగా ఆరిపోతున్నాయి. అరికట్టాల్సిన పోలీసు యంత్రాంగం ముందుగానే పెవిలియన్ చేరడంతో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా బెట్టింగ్ సాగుతోంది. ఇప్పటికే ఎందరో అమాయకులు బెట్టింగ్ భూతానికి ఆహుతి అయ్యారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో జీవితాలు బలి కాకముందే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరసరావుపేట టౌన్: కాయ్ రాజా కాయ్ అంటూ ఊరిస్తోన్న బెట్టింగ్ భూతానికి అమాయకులు బలవుతున్నారు. ఒకటికి పది రెట్లు అంటూ ఆశలు కల్పించడంతో ఆ వలలో చిక్కుకుని బయటికి రాలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఓ యువకుడు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి నాలుగు నెలల కిందట నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన మహిళతో వివాహమైంది. గతంలో సాఫ్ట్వేర్ గా పనిచేసిన ఆ యువకుడు ఉద్యోగం మానేసి స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం బెట్టింగ్ యాప్‌లకు బానిసయ్యాడు. దీంతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందిన విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తొలుత పని ఒత్తిడితో కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. తీగలాగితే కదిలిన బెట్టింగ్ డొంక యువకుడి ఆత్మహత్యను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులకు దర్యాప్తులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతుడి సెల్‌ఫోన్, లాప్టాప్లను స్వాధీనం చేసుకుని అందులోని డేటా విశ్లేషించారు. కొంతమందికి మృతుడు తాను క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయానని, సమయం ఇస్తే తిరిగి చెల్లిస్తానని ప్రాథేయపడుతూ పంపిన సందేశాలు గుర్తించారు. దీంతో బెట్టింగ్ ఊబిలో దిగి ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగుతోంది. ఐపీఎల్ నేపథ్యంలో జోరందుకున్న బెట్టింగ్‌లు అశల వలలో చిక్కుకుంటున్న యువత డబ్బులు పోగొట్టుకుని నవ వరుడు ఆత్మహత్య విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం ఆత్మహత్య చేసుకునేందుకు మరో యువకుడు ఇంటి నుంచి పరారీ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా రక్షించిన పోలీసులు బెట్టింగ్ అరికటడ్డంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్న పోలీసులు పోలీసులు విఫలం బెట్టింగ్ ఈ స్టాయిలో జడలువిప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా, అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బెట్టింగ్ చాపకింద నీరులా విస్తరించింది. ఏ ఇతర జిల్లాలో లేనంతమంది క్రికెట్ బకీలు పట్టణంలో ఉండటం గమరార్హం. పోలీసులు పట్టించుకోకపోవడంతో జడలు విచ్చుతోంది. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు వచ్చిన కొన్నే. జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి కూకటి వేళ్లతో పెకలించకపోతే ప్రస్తుత ఐపీఎల్లో మరెన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో యువకుడు పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నాడు. అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లో డబ్బులు పందెం కట్టాడు. అవి పోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఇంట్లో విషయం తెలియజేసి తనకు డబ్బులు కావాలని కోరాడు. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా అతన్ని గుర్తించి ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. విచారణలో క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఏం చేయాలో తెలియక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆ యువకుడు తెలిపాడు. రెండు నెలల కిందట గురజాల నియోజకవర్గానికి చెందిన ఓ సచివాలయ ఉద్యోగి సామాజిక పింఛన్ డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్‌లో పెట్టాడు. తెల్లవారేసరికి అధిక మొత్తం అవుతాయని ఆశకు పోయి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఒకటో తేదీ ఉదయం నగదు పంచకుండా అదృశ్యమయ్యాడు. అనంతరం ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తానని, ఉద్యోగం ఇస్తేనే తమ భార్యాపిల్లలు బతికి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇలా బెట్టింగ్ వ్యసనానికి బానిసై నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్‌తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అర్జిత సేవల్లో ఉభయదాతలు తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీహోమం, శాంతి కళ్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెటు కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. అంతరాలయానికి రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ముఖ మండప దర్శనానికి అనుమతించారు. భక్తులకు అమ్మవారి బంగారు వాకిలి దర్శనం కల్పించడంతో త్వరతిగతిన అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు ఇబ్బంది కలుగకుండా రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్ క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా భక్తులకు మంచినీటిని సరఫరా చేశారు. ఉచిత అన్న ప్రసాద వితరణ చేశారు. -
లవ్ యువర్ ఫాదర్ చిత్ర బృందం సందడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలో లవ్ యువర్ ఫాదర్ (ఎల్వైఎఫ్) చిత్ర బృందం సందడి చేసింది. వచ్చేనెల 4న ఎల్వైఎఫ్ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చిత్ర హిరో శ్రీహర్ష, నటులు బంటి, శ్రీకర్, నిర్మాత కిషోర్రాఠీ చేరుకున్నారు. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజ కార్యక్ర మాలు నిర్వహించారు. అనంతరం నటుడు శ్రీహర్షను ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య సత్కరించి, చిత్ర బృందానికి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్ర హిరో శ్రీహర్ష మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయని చెప్పారు. వచ్చే నెల 4న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లల్లో వీక్షించాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ చిత్ర టైటిల్ లవ్ యువర్ ఫాదర్ చాలా బాగుందని అన్నారు. వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఫాదర్స్ డే రోజునే కాకుండా తండ్రిని ప్రతినిత్యం ప్రేమించాలని అన్నారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ నటుడు శ్రీహర్షను అభినందించారు. టీడీపీ నాయకులు మల్లి, చిత్ర నిర్మాతలు కిషోర్ రాఠీ, రామస్వామిరెడ్డి, నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎం.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిత్ర బృందం బస్సు యాత్ర ప్రారంభించింది.