Thamanna
-
మా అమ్మానాన్న కూడా అడగలేదు!
‘మీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న లైఫ్‌లో ఒక దశలో దాదాపు అందరికీ ఎదురవుతుంటుంది. సెలబ్రిటీలను అయితే ప్రతి ఇంటర్వ్యూలో, బయటికి వెళ్లినప్పుడు.. ఇలా తరచూ ఈ ప్రశ్న వెంటాడుతుంటుంది. ఇటీవల తమన్నాని ఓ అభిమాని, ‘‘పెళ్లెప్పుడు చేసుకుంటారు? తమిళ అబ్బాయిలెవరైనా నచ్చారా?’’ అని అడిగితే.. ‘‘ఇప్పటివరకూ మా అమ్మానాన్న కూడా అడగలేదు’’ అంటూ ఈ బ్యూటీ కాస్త అసహనంగా సమాధానం ఇచ్చారు. ఇక తమిళ అబ్బాయిలు ఎవరైనా నచ్చారా? అనే ప్రశ్నని ఉద్దేశించి ‘‘ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితం చాలా ఆనందంగా సాగుతోంది’’ అని పేర్కొన్నారామె. నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేస్తారు? అనే ప్రశ్నకు – ‘‘విమర్శలు, ప్రశంసలు.. రెండూ వస్తుంటాయి. విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు అలా అన్నారా? అని ఆలోచిస్తాను. అయితే విమర్శ, ప్రశంస.. ఏదైనా వారి వ్యక్తిగత అభి్ర΄ాయమే. అందుకని పెద్దగా పట్టించుకోను’’ అన్నారు తమన్నా. -
పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు
పోలీస్ ఆఫీసర్లుగా కొందరు నాయికలు దోషులను పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కేసు వివరాల కోసం లోతుగా విచారణ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్లి΄ోయారు. ఈ తారల పరిశోధనల విశేషాల్లోకి వెళదాం. ఆన్ ఇన్వెస్టిగేషన్ తొలి అడుగు రెండు దశాబ్దాలుగా అగ్రకథానాయికగా త్రిష ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా కూడా నడుస్తున్న తరుణంలో ఈ ΄్లాట్‌ఫామ్‌లో ఆమె సైన్ చేసిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. ఇందులో త్రిషపోలీసాఫీసర్గా నటిస్తున్నారు. పూర్తి స్థాయిపోలీసాఫీసర్ పాత్రలో త్రిష నటిస్తుండటం కూడా ఇదే మొదటిసారి అనొచ్చు. క్రైమ్–ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సురేష్ వంగలా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ సిరీస్ ఇతర భాషల్లో అనువాదమై, త్వరలో స్ట్రీమింగ్ కానుంది. పవర్ఫుల్ సత్యభామ హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌పోలీస్ సత్యభామగా చార్జ్ తీసుకున్నారు కాజల్ అగర్వాల్. ఆమె టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఏసీపీ సత్యభామ పాత్ర చేస్తున్నారు కాజల్. ఆల్రెడీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అఖిల్ డేగల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో కాజల్పోలీసాఫీసర్ పాత్రలో నటించినప్పటికీ ఓ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించడం ఇదే తొలిసారి. ఆఖరి నిజం ఢిల్లీలో 2018లో జరిగిన బురారి ఆత్మహత్యల ఘటన ఆధారంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లు రూపొందాయి. తాజాగా రూపొందిన మరో వెబ్‌సిరీస్ ‘ఆఖ్రీ సచ్’ (ఆఖరి నిజం). ఆత్మహత్యల మిస్టరీ చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆన్యగా తమన్నా నటించారు. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి అని ఇటీవల తమన్నా పేర్కొన్నారు. రాబీ గ్రేవాల్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా మరికొందరు తారలు నటిస్తున్నారు. -
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిరు తమన్నా స్టెప్స్
-
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
సంతోషం అవార్డ్స్‌లో తళుక్కుమన్న తారలు
-
తమన్నా స్పెషల్ సాంగు.. వరుణ్ మాసు స్టెప్పు
‘గని’తో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ స్టెప్పులేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గని’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట తమన్నా. త్వరలో ఈ మాసీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వార్’, ‘జై లవకుశ’, ‘కేజీఎఫ్: ఛాప్టర్ వన్’, ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ‘గని’ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కోవిడ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. -
యశ్‌కు జోడీ కుదిరిందా?
‘కేజీఎఫ్’ చిత్రంతో హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు కన్నడ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యశ్–ప్రశాంత్ ‘కేజీఎఫ్ 2’ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కన్నడ డైరెక్టర్ నార్తన్ తెరకెక్కించనున్న చిత్రంలో యశ్ ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రంలో పవర్ఫుల్ అండ్ యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట యశ్. ఇందులో హీరోయిన్గా తమన్నాని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. యశ్ ‘కేజీఎఫ్’ మొదటి భాగంలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నార్తన్ దర్శకత్వంలో యశ్ చేయనున్నది ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఇటు దక్షిణాది అటు ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు ఉన్న తమన్నా అయితే కథానాయికగా బాగుంటుందని భావించారట. మరి... యశ్, తమన్నాల జోడీ కుదురుతుందా? అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. -
Tamannah Bhatia: ఆ విషయంలో నేను లక్కీ
‘‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా పెరిగిన తర్వాత ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు ఆస్వాదించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి’’ అంటున్నారు తమన్నా. అలాగే నటీనటుల స్టార్డమ్ విషయంలో కూడా ఈ తరం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోందని అంటున్నారీ బ్యూటీ. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ఒకప్పుడు జస్ట్ ప్రతిభ ఉంటేనే ఫ్యాన్స్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు నటీనటుల ప్రతిభని మాత్రమే చూసి, ఫ్యాన్స్ అయిపోవడంలేదు. ప్రతిభతో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్న కొత్తదనానికి తగ్గ పాత్రలు చేసినప్పుడే యాక్టర్స్ వారి అభిమానాన్ని మరింత పొందగలుగుతున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు డిఫరెంట్‌గా ఉండేది. పదేళ్ల క్రితం ఫ్యాన్‌బేస్ ఆర్గానిక్‌గా ఉండేది. ఏది ఏమైనా ఆ తరం అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకుల అభిమానాన్ని కూడా నేను పొందగలగడం నా లక్’’ అన్నారు. తమన్నా నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబరు స్టోరీస్’ వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీటీమార్’ సినిమా ను పూర్తి చేసిన తమన్నా ప్రస్తుతం ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ట్రో’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటిస్తు న్నారు. -
New Movies Updates: పాంచ్ పటాకా!
ఒకటీ.. రెండు.. మూడు... ఐదు వరకూ లెక్కపెట్టాల్సిందే. ఎందుకంటే అందాల తారలు వరుసగా ఐదు సినిమాల్లో కనిపించనున్నారు. ప్లాన్ చేసినట్లుగా సినిమాలు విడుదలయ్యుంటే.. లెక్క ఐదు వరకూ వచ్చేది కాదు. వాయిదా పడిన సినిమాలు విడుదలయ్యే నాటికి చేతిలో ఉన్న సినిమాలు రెడీ అవుతాయి. అలా ఇప్పటికే పూర్తి చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలతో కలిపి కొందరి నాయికల డైరీలో ఐదు సినిమాలు కచ్చితంగా ఉన్నాయి. ఆ ‘పాంచ్ పటాకా’ సినిమాల గురించి తెలుసుకుందాం. క్రేజీ బుట్ట బొమ్మ బుట్టబొమ్మ పూజాహెగ్డే జోరు మామూలుగా లేదు. ఉత్తరాదిలోనైనా, దక్షిణాదిలోనైనా పూజ క్రేజ్ వేరు. ఈ క్రేజే ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన పూజ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తయ్యాయి. ఇక నిర్మాణంలో ఉన్న చిత్రాల విషయానికొస్తే.. ఇటీవల తమిళ హీరో విజయ్ సరసన ఓ సినిమా కమిట్ అయ్యారు పూజ. అటు హిందీలో రణ్వీర్ సింగ్ చేస్తున్న ‘సర్కస్’ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న పూజ.. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’ సినిమాలోనూ హీరోయిన్గా కమిట్ అయ్యారు. థియేటర్స్ ఓపెన్ అయితే.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, సర్కస్.. ఇలా వరుసగా వెండితెరపై ప్రేక్షకులకు దర్శనం ఇస్తారు పూజ. కాజల్ తగ్గేదే లే ! ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. కెరీర్లో యాభై చిత్రాల మైలురాయిని చేరుకున్నారు. అయినా సరే.. కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమెకు వస్తున్న అవకాశాలే ఇందుకు నిదర్శనం. తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా (ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో..), తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో సినిమా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’ (ఒక హీరోయిన్గా.. మరో హీరోయిన్ అదితీరావ్ హైదరీ) చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్నారు కాజల్. అలాగే కమల్‌హాసన్‌తో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేయాల్సిన ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్ (హిందీ ‘క్వీన్’కు తమిళ రీమేక్) విడుదల కావాల్సి ఉంది. మిగతా హీరోయిన్లకు హిందీతో కలిపి ఐదు ప్రాజెక్ట్స్ అయితే కాజల్ మాత్రం సౌత్‌లోనే ఐదు సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇటు వెబ్ సిరీస్‌లు (కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ ఇటీవల విడుదలైంది) కూడా చేస్తూ ‘తగ్గేదే లే’ అంటున్నారు కాజల్. తాప్సీ దూకుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయారు తాప్సీ. గడచిన మూడేళ్ళుగా తాప్సీ ఏడాదికి నాలుగు సినిమాలకు సైన్ చేస్తున్నారు. అంతే వేగంగా ఆ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే దూకుడును చూపించారు. ‘హసీన్ దిల్రుబా’, ‘రష్మీ: ది రాకెట్’, ‘లూప్ లపేటా’ (జర్మన్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కు హిందీ రీమేక్) ‘దో బార’ సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసి, విడుదలకు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ‘శభాష్ మీతూ’ (క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్), సౌత్‌లో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నారు తాప్సీ. ‘హసీన్ దిల్రుబా’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మిగతా చిత్రాలు థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశమే ఉంది. తమన్నా హవా మిల్కీ బ్యూటీ తమన్నా తన డైరీని ఖాళీగా ఉంచేందుకు ఇష్టపడటం లేదు. వెంకటేష్ – వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, సత్యదేవ్ ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా చేస్తున్నారు. నితిన్ ‘మ్యాస్ట్రో’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తమన్నా హీరోయిన్గా నటించిన ‘సీటీమార్’ సినిమా ఈ ఏడాది ఈపాటికే విడుదల కావాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించారు. ఇక బాలీవుడ్లో తమన్నా నటించిన ‘భోలే చూడియాన్’ చిత్రీకరణ పూర్తయింది. హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు తమన్నా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ విడుదల కాలేదు. ఇంకో విశేషం ఏంటంటే... ‘సీటీమార్’ (ఏప్రిల్ 2), ‘మ్యాస్రో’్ట (జూన్ 11), ‘ఎఫ్ 3’ (ఆగస్టు 27).. ఈ ఏడాది విడుదల కావాల్సిన చిత్రాలు. కానీ కరోనా వల్ల కాలేదు. వచ్చే ఏడాది తెలుగు తెరపై తమన్నా హవా తప్పక కనిపిస్తుందని అర్థం అవుతోంది. రాకెట్ వేగంతో రష్మిక దక్షిణాది అగ్రకథానాయికల్లో రష్మికా మందన్నా పేరు కూడా ఉంది. ఇదే సీన్‌ను ఉత్తరాదిలోనూ రిపీట్ చేయాలనే ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ హిందీలో ఏకంగా మూడు చిత్రాలు చేజిక్కించుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ‘గుడ్ బై’ చిత్రాలు చేస్తున్నారు రష్మిక. అలాగే మరో హిందీ సినిమా కూడా సైన్ చేశానని, త్వరలో ఆ వివరాలు చెబుతానని ఇటీవల ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్లో రష్మికా మందన్నా వెల్లడించారు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కాకుండా తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఈ రెండు చిత్రాలే కాకుండా మరో చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు కూడా రష్మికా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇలా దక్షిణ, ఉత్తరాదిలో రాకెట్ వేగంతో కెరీర్లో దూసుకెళ్తున్నారు రష్మికా మందన్నా. రకుల్.. డైరీ ఫుల్ సౌత్‌లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే జాన్ అబ్రహాం ‘ఎటాక్’ అజయ్ దేవగణ్ ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్న రకుల్ తాజాగా తేజస్ డియోస్కర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇందులో కండోమ్ టెస్టర్‌గా రకుల్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. హిందీలో ఈ నాలుగు చిత్రాలతో పాటు తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా (ఇందులో వైష్ణవ్‌తేజ్ హీరో), తమిళంలో శివ కార్తికేయన్ ‘ఆయలాన్’ చిత్రాల్లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా కనిపిస్తారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో రకుల్ డైరీ ఫుల్. డిఫరెంట్ కృతీ మహేశ్‌బాబు ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో హీరోయిన్గా నటించిన కృతీ సనన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు కృతీ హవా బాలీవుడ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఇట్స్ మై టైమ్’ అంటు కృతీ ప్రస్తుతం ఐదు చిత్రాలకు సైన్ చేశారు. ప్రభాస్ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’, వరుణ్ ధావన్ హారర్ ఫిల్మ్ ‘బేడియా’, అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బచ్చన్ పాండే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు కృతీ సనన్. ఈ చిత్రా లే కాకుండా... రాజ్‌కుమార్ రావ్‌తో ‘హమ్ దో హమారే దో’, టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఫిల్మ్ ‘గణ్‌పత్’ చిత్రాల్లో కృతీసననే హీరోయిన్. మరోవైపు కృతీ నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మిమి’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. మైథాలజీ, యాక్షన్, రొమాన్స్, హారర్.. ఇలా ఒకేసారి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేసే అవకాశం రావడం అంటే గొప్ప విషయం. ఈ అవకాశాలను ఛాలెంజ్‌గా తీసుకుని, నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు కృతీ సనన్. ట్రిపుల్ రోల్ దీపికా హెడ్డింగ్ చదివి, ఫోటో చూసి దీపికా పదుకోన్ మూడు పాత్రలతో ఓ సినిమా వస్తుందనుకుంటే పొరపాటే. ఇంతకీ విషయం ఏంటంటే... అతిథిగా, నిర్మాతగా, హీరోయిన్గా దీపికా పదుకోన్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న చిత్రం, షారుక్ ఖాన్ ‘పఠాన్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’, దర్శకుడు శకున్ బాత్రా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో హీరోయిన్గా కనిపిస్తారు దీపిక. ఇక తన భర్త, నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘83, సర్కస్’ చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. క్రికెట్లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్పు సాధించిన 1983 సంఘటనల ఆధారంగా రూపొందిన ‘83’ చిత్రానికి దీపిక ఓ నిర్మాత. అలాగే దీపక నిర్మాతగా మహాభారతంలోని ద్రౌపది పాత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుందని, ఇందులో ద్రౌపదిగా దీపికానే కనిపిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
అలా పిలిస్తే కూత ఆగిపోద్ది!
‘‘నన్నెవడైనా అలా (రేయ్ కార్తి) పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి.. లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి.. ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’.. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్‌తో ‘సీటీమార్’ టీజర్ విడుదలైంది. ‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. తమన్నా, భూమిక, దిగంగనా సూర్యవంశీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ. -
తమన్నా రాకతో గ్రాఫ్ మారిపోయింది
సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో విడుదలై విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. నాగశేఖర్, భావనా రవి, ఎం.ఎస్. రెడ్డి, చినబాబు నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను హీరో అయినా, తమన్నాగారు రియల్ హీరో. ఆమె ఈ సినిమాలో చేస్తున్నారని ప్రకటించినప్పటి నుండి ‘గుర్తుందా శీతాకాలం’ గ్రాఫ్ మారిపోయింది. ఈ సినిమాలో చేస్తున్న మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను, ఎన్నో కథలు విన్నాను. ఈ సినిమా ఆఫర్ రాగానే ఎందుకో ఈ సినిమాలో నటించాలనుకున్నాను. రొమాంటిక్ డ్రామాలో నటించి చాలాకాలం అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ హీరో’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ– ‘‘కన్నడంలో నేను స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో ఇది నాకు మొదటి సినిమానే. నటీనటులు, టెక్నీషియన్లు నూటికి నూరు శాతం ప్రతిభ ఉన్నవారు. ఎంతో తపనతో సినిమా చేస్తున్నారు’’ అన్నారు. ‘‘బహుశా ఈ సినిమాకు పనిచేయటం మొదలుపెట్టిన తొలి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నేను మాటలు అందించిన ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబి’ సినిమాల తరహాలో పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్. సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీభూపాల్ గారు ఈ సినిమా కోసం వేసవిలో పని చేయటం ప్రారంభిస్తే, నేను వర్షాకాలంలో ప్రారంభించాను. ఈ సినిమా మంచి మ్యూజికల్ ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చినబాబు, సంపత్ కుమార్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. -
గోపిచంద్ ‘కూత’ మొదలైంది
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘సీటీమార్’. ఈ చిత్రంలో గోపిచంద్ హీరోగా నటిస్తున్నాడు. కథానాయికిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ కోచ్‌గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఇంతక ముందే గోపిచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ‘గౌతమ్ నంద’గా నటించి ప్రేక్షకులకు మంచి క్లాస్ యాక్షన్ సినిమాను అందించారు. మాస్ యాక్షన్, క్లాస్ పాత్రల్లో డబుల్ యాక్షన్‌తో మెప్పించాడు. ఇక తమన్నా ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మరో కథనాయికగా దిగంగన నటిస్తోంది. పచ్చని పల్లెటూరులో ఉంటూ గోపిచంద్‌ని ప్రేమించే పాత్రలో అందాల దిగంగన ఓదిగిపోయిందని చిత్రబృందం చెబుతోంది. 2010లో ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా సంపత్ నంది తెలుగు చిత్రసీమకు పరిచియమయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో రచ్చ సినిమా చేశాడు. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా చూపించి ప్రేక్షకుల నుంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా విజయాలు లేక వెనుకబడిన సంపత్ నంది ఇప్పుడు సీటీమార్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 📢📢📢 Aftr a longggg warm up solid stretches n powerpacked practice Everyone’s set..fit..fab n back to do wat we love the most 🎥 wid xtra care n zeal. Wait is over! కూత మొదలు..Nov 23 నుండి... ఇక non-stop కబడ్డి..కబడ్డి..కబడ్డి!!!💥#Seetimaarr @bhumikachawlat #HappyDiwali pic.twitter.com/8WYlbXuoaQ — Sampath Nandi (@IamSampathNandi) November 14, 2020 -
వెబ్‌కి వెల్కమ్
స్టార్స్ అందరూ వెబ్‌లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్, తమన్నా కూడా వెబ్ మీడియమ్‌లోకి ఎంటర్ అయ్యారు. త్వరలో విడుదల చేయబోయే ప్రాజెక్ట్‌లను డిస్నీ హాట్‌స్టార్ శుక్రవారం ప్రకటించింది. అందులో కాజల్ లీడ్ రోల్ చేస్తున్న ‘లైవ్ టెలీకాస్ట్’, తమన్నా ‘నవంబర్ స్టోరీ’ కూడా ఉన్నాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘లైవ్ టెలీకాస్ట్’. ఒక భూత్ బంగ్లాలో చిక్కుకుపోయిన ఓ టీవీ బృందానికి ఎదురయిన సమస్యలతో ఈ సిరీస్ ఉంటుంది. చేయని నేరానికి శిక్ష అనుభవించబోతున్న తండ్రిని కాపాడే కూతురు కథాంశంతో తమన్నా ‘నవంబర్ స్టోరీ’ రూపొందింది. రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. ఈ రెండూ తమిళంలో రూపొందినప్పటికీ తెలుగులో అనువాదం కానున్నాయి. ఈ సిరీస్‌లు ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతాయనేది హాట్‌స్టార్ ప్రకటించలేదు. -
సవాల్‌కి సై
కథని బట్టి కథలోని పాత్రను బట్టి నటీనటులకు కసరత్తు ఉంటుంది. కొన్ని అవలీలగా చేసేవి ఉంటాయి. కొన్ని కష్టపడి చేసేవి ఉంటాయి. కొన్నింటికి శారీరక శ్రమ ఉంటుంది. మరికొన్నింటికి మానసిక శ్రమ. ఏ పాత్రకు సంబంధించిన కష్టం దానికి ఉంటుంది. పాత్ర ఎంత ఛాలెంజ్ చేస్తే అంత శ్రమిస్తారు. ప్రస్తుతం కొన్ని పాత్రల కోసం కొందరు హీరోయిన్లు శారీరకంగా శ్రమిస్తున్నారు. కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. కొత్త టెక్నిక్‌లు సాధన చేస్తున్నారు. సుకుమారి భామలు చేస్తున్న కఠోర కసరత్తులు గురించి తెలుసుకుందాం. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు కాజల్. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్య కళరి పయ్యట్టు నేర్చుకుంటున్నారామె. ఇందులో ఆమె పలు ఫైట్ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారట. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. ఇందులో ఈ ఇద్దరూ హాకీ ప్లేయర్స్ పాత్రలో కనిపించనున్నారు. హాకీ ప్లేయర్‌గా కనిపించడానికి చిత్రీకరణ ప్రారంభం అయ్యే ముందు కొన్నిరోజుల పాటు హాకీ నేర్చుకున్నారు లావణ్యా త్రిపాఠి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘సీటీమార్’ సినిమా కోసం తమన్నా కబడ్డీ మెళకువలు తెలుసుకున్నారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ ‘సీటీమార్’. ఇందులో కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ‘రష్మీ రాకెట్’ అనే స్పోర్ట్స్ సినిమా చేస్తున్నారు తాప్సీ. ఈ సినిమాలో రన్నర్ పాత్రలో కనిపించనున్నారామె. ఇందుకోసం తన డైట్‌ని మొత్తం మార్చేశారు తాప్సీ. రన్నర్ లుక్ కోసం, రన్నర్‌గా మారడానికి ఫిట్నెస్ మీద మరింత దృష్టిపెట్టారామె. మరింత చురుకుగా పరిగెత్తడం నేర్చుకుంటున్నారట. ‘తేజస్’ అనే హిందీ సినిమాలో పైలట్‌గా కనిపించనున్నారు కంగనా రనౌత్. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారు. త్వరలోనే పైలట్ ట్రైనింగ్ తరగతులకు కూడా హాజరు కానున్నారట. వచ్చే ఏడాది సూపర్ హీరోయిన్గా మారనున్నారు కత్రినా కైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ సూపర్ హీరోయిన్ మూవీ చేయనున్నారు. ఇందులో భారీ యాక్షన్ ఉంటుందట. ఇందుకోసం ఆమె శిక్షణ కూడా మొదలెట్టారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. చాలావరకు గ్లామరస్ రోల్స్ చేసే కథానాయికలు అవకాశం వచ్చినప్పుడల్లా ‘యాక్షన్’ పాత్రల్లో రెచ్చిపోతుంటారు. ఎంతైనా కష్టపడతారు. వీళ్లంతా ప్రేక్షకుల మెప్పు పొంది, ఫుల్ మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుందాం. -
మీ ప్రేమను తిరిగి ఇస్తా!
కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన హీరోయిన్ తమన్నా నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు పిచ్చి పిచ్చిగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నార్మల్ లైఫ్‌లోకి వస్తానా అనిపించింది. ఈ టైమ్‌లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి వస్తాను. నా మీద మీరు (అభిమానులను ఉద్దేశించి) చూపించిన ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇస్తాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను. ఫుల్ స్టామినాతో మీ ముందుకొస్తాను’’ అని పేర్కొన్నారు తమన్నా. వీడియోలో ఈ బ్యూటీ తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుకుంటూ కనిపించారు. -
తమన్నా పాజిటివ్
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఆర్నెళ్లు దాటినా ఇంకా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు... ఇలా తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. తాజాగా హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడ్డారు. ఆ మధ్య తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా వారు కోలుకున్నారు. తాజాగా తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిసింది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు. అధిక జ్వరంతో బాధపడుతున్న తమన్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు తెలుగు చిత్రాలున్నాయి. వాటిలో ‘గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధాధూన్’ ఉన్నాయి. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నారు తమన్నా. -
బీ పాజిటివ్
ప్రస్తుతం ఎటు చూసినా కరోనా పాజిటివిటీ. సామాజిక వేదికల నిండా నెగటివిటీ. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా ముఖ్యం. కరోనాకి నెగటివ్‌గా ఉంటూ... మానసికంగా పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. ఎనర్జీలు మన మాట వినేలా చేసుకోవాలి. ఈ కరోనా కష్టకాలాన్ని దాటే మాత్రను కనిపెట్టే పనిలో ఉన్నారు పరిశోధకులు. ఆ మందు వచ్చేలోగా పాటించాల్సిన మంత్రం ఒకటుందంటున్నారు మన కథానాయికలు. ‘‘బీ పాజిటివ్’ – అదే మనందర్నీ ఉంచుతుంది యాక్టివ్’’ అని తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు పలువురు కథానాయికలు. ఈ అందాల తారలు ఏమంటున్నారో చూద్దాం. ప్రేమను పంచుదాం – తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా నెగటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపుతున్నారు. ప్రస్తుతం మనందరం సాధారణమైన పరిస్థితుల్లో లేము. అందరం ఓ విపత్తును ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయాల్లో మనందరం ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. మన తోటి వారికి ప్రేమను పంచుదాం. ద్వేషాన్ని కాదు. సోషల్ మీడియాను ఒకరితో ఒకరం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిద్దాం. నిందించడానికి, నెగటివిటీని పంచడానికి కాదు. ఒకరికి ఒకరం నిలబడితే ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చు. నిరాశను దగ్గరకు రానివ్వకండి – జాక్వెలిన్ ఫెర్నాండజ్ ఈ లాక్డౌన్లో నేను ఆచరించింది ఏంటంటే.. పాజిటివ్‌గా ఆలోచించడం, నన్ను నేను స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం. మనసు పాజిటివ్‌గా ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం మనకు ఏర్పడుతుంది. జీవితానికి కొత్త ఆశ కలుగుతుంది. మనం ఏదైనా చేయాలన్నా, కొత్త మనిషిగా మారాలన్నా ముందు మన ఆలోచనల నుంచి మొదలుపెట్టాలి. మన ఆలోచనలే మనం. వాటిని సక్రమంగా ఉంచుకుని, ఆచరించగలిగితే చాలు. ప్రస్తుతం అందరం ఒకలాంటి అనిశ్చితిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మనందరం మరింత ధైర్యంగా నిలబడాలి. నిరాశను దగ్గరకు రానివ్వకండి. నెగటివిటీ పంచకండి. పాజిటివ్‌గా ఉందాం. ఏది ఇస్తే అదే తిరిగొస్తుంది – కృతీ సనన్ మనందరం మన ఆలోచనల ద్వారా ఓ ఎనర్జీను మన చుట్టూ నింపుకుంటాం అని నమ్ముతాను. ఆ ఎనర్జీ ద్వారానే మరొకరితో కనెక్ట్ అవుతాం. నువ్వు పాజిటివ్‌గా ఆలోచిస్తే నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది. పాజిటì వ్గా ఆలోచించేవాళ్లే నీతోనూ కనెక్ట్ అవుతారు. ఒకవేళ నెగటివ్ అయితే నెగటివ్‌గా ఆలోచించేవాళ్లను ఆకర్షిస్తావు. అంటే మనం ఏది ఇస్తే అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. అందుకే ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. తీసుకున్న నిర్ణయాన్ని బలంగా నమ్మండి. అదే ఆచరించండి. ఇదే నా మంత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైన మంత్ర ఏంటంటే... ప్రేమను పంచండి. తిరిగి ప్రేమనే పొందండి. -
పదేళ్లకు జోడీ కుదిరింది
పదేళ్ల క్రితం విజయ్–తమన్నా జంటగా ‘సుర’ అనే తమిళ చిత్రంలో నటించారు. మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ జంటగా సినిమా చేయలేదు. పదేళ్ల తర్వాత ఈ జోడీ ఒక సినిమాకి కుదిరిందని సమాచారం. హీరో విజయ్‌కి ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ వంటి హ్యాట్రిక్ విజయాలను అందించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది విజయ్‌కి 65వ సినిమా కావడం, మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే విజయ్ సరసన తమన్నా కథానాయికగా నటించనున్నారని తెలిసింది. ‘సర్కార్’ సినిమాను తెరకెక్కించిన సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: సంతోష్ శివన్. -
శీతాకాలం ప్రేమ
సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగÔó ఖర్ మూవీస్ బ్యానర్‌పై భావన, రవి నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఆడియో హక్కులను కర్ణాటకకు చెందిన ఆనంద్ ఆడియో సంస్థ 75లక్షలకు సొంతం చేసుకుంది. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగశేఖర్ మాట్లాడుతూ –‘‘సత్యదేవ్, తమన్నా కాంబినేసన్ అనగానే ట్రేడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. మా చిత్రం టైటిల్ విన్నవారంతా ప్రేమకథలు శీతాకాలంలోనే మొదలవుతాయని, తమ ప్రేమకథలను గుర్తు చేసుకుంటున్నారు. టైటిల్ పొయెటిక్‌గా ఉంది అంటుంటే ఆనందంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య హెగ్డే, లైన్ప్రొడ్యూసర్స్: సంపత్‌కుమార్, శివ్దశ్ యశోదర. -
నాలో మంచి కుక్ ఉందని తెలుసుకున్నా!
లాక్‌డౌన్‌తో దొరికిన ఖాళీ సమయం తమన్నాను వంటగదికి దగ్గర చేసింది. తనలో ఓ మంచి కుక్ దాగి ఉందని తమన్నా తెలుసుకునేలా చేసింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్స్‌తో ఫుల్æబిజీగా ఉండేదాన్ని. మా ఇల్లు నాకు హోటల్లానే అనిపించేది. సినిమాల షూటింగ్స్ మధ్యలో కాస్త విరామం దొరికినా నేను మా ఇంట్లో ఉండేది మూడు రోజులే. అసలు మా ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో? అవి నాకు ఎంత ఉపయోగపడతాయో? అని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఈ లాక్డౌన్లో అవన్నీ తెలుసుకున్నాను. అవసరానికి మించిన వస్తువులు ఉన్నాయని గ్రహించాను. ఇదివరకు నేను ఎప్పుడూ వంట చేయలేదు. లాక్డౌన్ వల్ల చాలా సమయం దొరకడంతో వంటలు చేశాను. నాలో ఓ మంచి కుక్ ఉందని నాకు తెలిసింది ఈ సమయంలోనే. అయితే నేను వంట స్టార్ట్ చేసిన మొదట్లో కిచెన్ రూమ్‌లో టీ పొడి ఎక్కడుంది? పంచదార ఏ డబ్బాలో ఉంది? అనే విషయాలు తెలియక మొత్తం అల్మరా అంతా వెతికేదాన్ని. ఫస్ట్ టైమ్ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ తర్వాత మెల్లిగా అన్నీ తెలుసుకున్నాను. వంట చేయడం అంటే వంటకాలను రుచిగా చేయడమే కాదు. ఆ వంటలు వండిన పాత్రలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. వంట రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి’’ అన్నారు తమన్నా. -
అర్హత ఉంటేనే అడగాలి
‘‘ఏ ఆర్టిస్ట్ పారితోషికం అయినా వాళ్ల మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకానీ మేం ఎంత అడిగితే అంత నిర్మాతలు ఇవ్వరు’’ అంటున్నారు తమన్నా. అడిగినంత పారితోషికం ఇవ్వని కారణంగా ఇటీవల ఆమె ఓ సినిమా వదులుకున్నారనే వార్త వచ్చింది. అయితే ఈ వార్తలో నిజం లేదన్నారు ఈ మిల్కీ బ్యూటీ. ఈ సందర్భంగా పారితోషికం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ఒక నిర్మాత నాకు పారితోషికం ఇస్తున్నారంటే నేను అంత అడిగానని ఇవ్వడంలేదు. నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే ఇస్తారు. నా గత చిత్రాల బాక్సాఫీసు హిట్స్‌ను అంచనా వేసి, పారితోషికం ఇస్తారు. అంతేకానీ నేనేదో నాకు తోచినంత అడిగి, కచ్చితంగా అంత ఇవ్వాలని ఎదురు చూడకూడదు. అంత తీసుకునే అర్హత ఉంటేనే అడగాలి. నేను అడిగే పారితోషికం సరైనదని నాకు అనిపిస్తేనే అడుగుతాను’’ అన్నారు. -
ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ
‘గౌతమ్‌నంద’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా, దిగంగన కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీ¯Œ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నేడు గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘సీటీమార్’ టీమ్ కొత్త స్టిల్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ–‘‘కబడ్డీ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ ఏడాదే షూటింగ్ మొదలుపెట్టాం. కానీ లాక్ డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్‌లో 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన భాగం చిత్రీకరణ ఆగస్ట్ మొదటివారంలో మొదలుపెట్టి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం. ఒక పాట మినహా ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్ చేశారు సంగీత దర్శకుడు మణిశర్మ. మాస్ ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేస్తున్నారాయన. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండబోతుంది’’ అన్నారు. కాగా ‘సీటీమార్’ చిత్రంలో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. పల్లెటూరిలో ఉండి హీరోని ప్రేమించే ప్రత్యేక పాత్రలో దిగంగన నటిస్తున్నారు. ఈ సినిమాకి సమర్పణ: పవ¯Œ కుమార్. -
కన్నడ ఎంట్రీ?
తమన్నా దాదాపుగా 15 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు పాపులారిటీ సంపాదించారామె. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశారామె. తాజాగా కథానాయికగా మొదటిసారి ఓ కన్నడ సినిమా చేయబోతున్నారని టాక్. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కె.జీ.ఎఫ్’లో చేసిన ప్రత్యేక గీతం ద్వారా తొలిసారి కన్నడ తెరపై మెరిశారు తమన్నా. యశ్ హీరోగా నర్తన్ అనే కన్నడ దర్శకుడు ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్నా ఓకే అంటే కథానాయికగా ఇదే ఆమె చేయబోయే మొదటి కన్నడ సినిమా అవుతుంది. -
పర్ఫెక్ట్ కోచ్
‘జ్వాల’ క్యారెక్టర్‌ను ఓ చాలెంజ్‌గా తీసుకున్నానంటున్నారు తమన్నా. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ జ్వాల పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ పాత్ర కోసం తాను సిద్ధమవుతున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో తొలిసారి ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నాను. కబడ్డీ ప్లేయర్స్‌కు కోచ్‌గా నేను నటిస్తానని అస్సలు ఊహించలేదు. జ్వాల పాత్రను పర్ఫెక్ట్గా చేసేందుకు ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ యాస నేర్చుకోవడాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను.వీగన్ (శాకాహారి)గా మారిపోయి గ్లూటెన్ డైట్ ఫాలో అవుతూ యోగా కూడా చేస్తున్నాను. కోచ్‌గా నా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాను. సంపత్ నంది సూచనలతో పాటు మా సెట్లో ఉన్న జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్స్ సలహాలను తీసుకుంటున్నాను. ‘జ్వాల’ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఇంతలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ సిని మాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపించనున్నారు గోపీచంద్. -
నిజమైన స్నేహితులు వాళ్లే!
అభిమానులను ప్రత్యేకంగా పలకరించడానికి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాట్ చేస్తుంటారు తారలు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. అలా శనివారం తమన్నా తన ఫ్యాన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధాలు, కొందరికి సలహాలు ఇచ్చారు. వాటి గురించి తెలుసుకుందాం. ► ఈ ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఏది? ► నా కుటుంబం ఎంతో విలువైనది. ► మీ ఫేవరెట్ ప్లేస్? ► మా ఇల్లు. ► మీ నిక్ నేమ్? ► తమ్ము. ► స్నేహితుల ప్రాముఖ్యత గురించి? ► మనం డౌన్లో ఉన్నప్పుడు మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారే నిజమైన స్నేహితులు. ► అపజయాలను మీరు ఎలా ఎదుర్కొంటారు? ► మన జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకునే అవకాశాన్ని కల్పించేవి అపజయాలే. ఏదైనా కొత్త విషయాన్ని స్టార్ట్ చేయడానికి కూడా అపజయాలే కొన్నిసార్లు స్ఫూర్తినిస్తాయి. అందుకని అపజయాలకు కుంగిపోకండి. ► హార్ట్‌ను ఫాలో కావాలా? బ్రెయిన్నా? ► దిల్ సే సునో... దిమాక్ సే కరో! (మనసుతో విను.. బుర్రతో చెయ్). ► మీరెప్పుడు క్రియేటివ్‌గా ఉంటారు? ► నాకు నేనులా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు క్రియేటివ్‌గా ఉంటాను. ► టెన్నిస్‌లో మీరు ఏదైనా బహుమతి అందుకున్నారా? ► ఏదో అలవాటుగా ఆడతాను కానీ పోటీల్లో పాల్గొనను. ► మీ ఫేవరెట్ డిష్? ► పావ్ బాజీ.. (గ్లూటెన్ ఫ్రీ పావ్ మాత్రమే). ► ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్ గురించి ఒక్క మాటలో... ► సాహసోపేతమైనది. ► ఏ జానర్ అయితే నటిగా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోగలరని భావిస్తున్నారు? ► యాక్షన్ కామెడీతో కూడుకున్న హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. ► నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఆలోచనలు ఏంటి? ► ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. కెమెరాను బాగా ఫేస్ చేయాలి. ► గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ గుడ్ క్యారెక్టర్? ► సినిమాలు టీమ్ వర్క్‌పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆర్టిస్టుగా నేనొక మంచి టీమ్‌లో భాగం కావాలని కోరుకుంటాను. నాకొక మంచి క్యారెక్టర్ ఉన్న ఆసక్తికరమైన కథలను ఇష్టపడతాను. నటిగా నిరూపించుకోవ డానికి స్కోప్ ఉందా? అని చూస్తాను. -
కోచ్ జ్వాల
కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా మారిపోయారు తమన్నా. ‘గౌతమ్‌నంద’ (2017) చిత్రం తర్వాత గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ‘సీటీమార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా తమన్నా, దిగంగనా సూర్యవన్షీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసాచిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా నటిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది కుమారుడు యువ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. శనివారం జ్వాలారెడ్డి లుక్‌ను విడుదల చేశారు. ‘‘నా పాత్ర చాలెంజింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు తమన్నా. ‘‘హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాం. సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. -
సీటీమార్ ఖరార్
గోపీచంద్ విజిల్ వేస్తున్నారు. సీటీ మార్ సీటీ మార్ అంటూ సందడి చేస్తున్నారు. ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల్లో హుషారు నింపనున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించనంత ఎనర్జిటిక్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సినిమా టైటిల్ ‘సీటీ మార్’. ‘యు టర్న్’లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది దర్శకుడు. గోపీచంద్ సరసన తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సీటీమార్’ టైటిల్‌ని ఖరారు చేసిన విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ‘‘గోపీచంద్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్, రాజమండ్రిలోæభారీ షెడ్యూల్ పూర్తి చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభించిన షెడ్యూల్‌ను నాన్‌స్టాప్‌గా జరుపుతాం. సమ్మర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్ కుమార్. -
కబడ్డీ కబడ్డీ
గోపీచంద్ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా దిగంగన సూర్యవంశి నటిస్తుండగా, భూమిక, రావురమేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తున్నారు గోపీచంద్. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో షెడ్యూల్ మొదలైంది. ప్రస్తుతం రాత్రివేళ వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రాజమండ్రి, ఢిల్లీ ప్రదేశాల్లోనూ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్
మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమాలో తమన్నా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేశారు. శనివారం (డిసెంబరు 21) తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ పాటలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌ని ఉద్దేశించి ‘పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్’ అని తమన్నా పేర్కొన్నారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
ఆట ఆరంభం
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. భూమిక, రావు రమేష్, దిగంగన సూర్యవంశి కీలక పాత్రధారులు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. అంటే ఆరంభమైందన్నమాట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌లో మొదలైన తొలి షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశాం. ఆ నెక్ట్స్ రాజమండ్రి, ఢిల్లీల్లో షూటింగ్ జరుగుతుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
తండ్రిని కాపాడే కూతురు
అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్న తండ్రిని కాపాడటానికి కూతురిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు తమన్నా. మరి ఈ క్రైమ్‌ని ఛేదించి, తన తండ్రిని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారని తెలియడానికి కొంచెం టైమ్ ఉంది. తమన్నా తొలి ‘వెబ్ సిరీస్’ ‘ది నవంబర్స్ స్టోరీ’ కథ ఇది. ఇదొక క్రైమ్ థిల్లర్. తమిళంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కు రామ్ సుబ్రమణియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తండ్రిని కాపాడే కూతురి పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ సిరీస్ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. ‘‘తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ వెబ్ సిరీస్‌ను ఆనంద వికడన్ సంస్థ నిర్మిస్తోంది. హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. -
కొత్త ప్రయాణం
నటిగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు తమన్నా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రకరకాల పాత్రలు చేశారు. కొన్నిసార్లు స్పెషల్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు నటిగా ఓ కొత్త జర్నీ ఆరంభించారని తెలిసింది. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తమన్నా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వికడన్ టెలీవిస్తాస్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్ ఏ జానర్లో ఉండబోతోంది? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది కాకుండా హిందీలో ‘బోల్ చుడియా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తమన్నా. తమిళంలో ఓ సినిమా కూడా కమిట్ అయ్యారు. -
రుద్రవీణ చూసి ఇండస్ట్రీకి వచ్చా
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్’. తమన్నా కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీ కార్తికేయ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ ఆడెపు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నేడు విడుదలవుతోన్న ఈ సినిమా గురించి శ్రీనివాస్ ఆడెపు విలేకరులతో మాట్లాడుతూ... ► సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ‘హుషారు, ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, రాజుగారిగది 3’ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను నిర్మాతగా మా బ్యానర్లో విడుదల అవుతున్న తొలి చిత్రం ‘యాక్షన్’. 600 థియేటర్స్‌లో విడుదలవుతోంది. భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తాను. ఇండస్ట్రీలో నిర్మాతగానే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌గా ఉండటం కూడా కష్టమే.. దేని పోరాటం దానిదే. ► ‘యాక్షన్’ టీజర్ చూడగానే ఎగై్జటింగ్‌గా అనిపించి హక్కులు కొన్నాను. విశాల్ అభిమానులకు ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఈ సినిమా సుందర్ సి. గారి దర్శకత్వ శైలికి భిన్నంగా ఉంటుంది. తమన్నాకు ఈ సినిమాతో మరింత మంచి పేరు వస్తుంది. రానాగారితో ర్యాప్ పాడించాలనే ఆలోచన విశాల్‌తో కలిసి నేనూ ఆలోచించినదే. వ్యక్తిగతంగా నాకు భావోద్వేగ చిత్రాలంటే ఇష్టం. ‘రుద్రవీణ’ సినిమా చూసి ఇండస్ట్రీకి వచ్చాను. -
నాకంత ఓర్పు లేదు
ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పొగడ్తలు, విమర్శలు ఉంటాయి. నటిగా మీ కెరీర్లో ఎదురయ్యే విమర్శలను మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే– ‘‘నేనేం దేవుణ్ణి కాదు. మామూలు మనిషిని. అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. నన్ను నేను విశ్లేషించుకుని నాలోని లోపాలను సరిదిద్దుకుంటాను. అంతేకానీ తప్పుడు విమర్శలను పట్టించుకుని అనవసరంగా బాధపడను’’ అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దర్శకత్వం ఆలోచన ఏమైనా ఉందా? అన్నప్పుడు... ‘‘దర్శకత్వం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించిన ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. పాత అంశాలను కొత్త దృష్టి కోణంలో చూడగలగాలి. అన్నింటికన్నా ముందు చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు నాలో లేదు. ప్రసుతం దర్శకత్వం ఆలోచన లేదు. కానీ శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా తీస్తే అందులో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
గోపీచంద్ అభిమానులు గర్వపడతారు
‘‘శ్రీనివాస్, పవన్‌గార్లు నాకు చాలాకాలంగా తెలిసినా, వారితో తొలిసారి పని చేస్తున్నాను. మంచి సినిమా చేయాలనే తపన ఉన్న నిర్మాతలతో మంచి కథతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని గోపీచంద్ అన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కనున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘యు టర్న్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ ఇచ్చారు. గోపీ చంద్ మాట్లాడుతూ– ‘‘గౌతమ్ నంద’ తర్వాత సంపత్ మంచి స్క్రిప్ట్‌తో వచ్చారు. తమన్నాతో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. తనది కూడా మంచి పాత్ర’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాను. ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీగారు, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్, పవన్, శ్రీనివాస్‌గార్ల బేనర్లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గోపీచంద్‌గారి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సంపత్‌గారితో నా మూడో సినిమా ఇది. గోపీచంద్‌గారితో సినిమా చేయాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. నాది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర’’ అన్నారు తమన్నా. ‘‘అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. నవంబర్‌లో షూటింగ్ ఆరంభించి, ఏప్రిల్‌లో సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. ఈ కార్యక్రమంలో చిత్రసమర్పకులు పవన్ కుమార్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, కె.కె. రాధామోహన్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, కెమెరామేన్ సౌందర్ రాజన్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి పరిచయం
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు తమన్నా. నార్త్ టు సౌత్ తమన్నా అందరికీ పరిచయం. కానీ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి తొలి పరిచయం కాబోతున్నారు. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తమన్నా తొలిసారి మలయాళంలో స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు. గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా మలయాళంలో కనిపించారామె. ఇప్పుడు తొలి స్ట్రయిట్ సినిమాతోనే ప్రేక్షకులను భయపెడతానంటున్నారు. ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (సెంట్రల్ జైల్లో దెయ్యం అని తెలుగు అర్థం) అనే హారర్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. కథ మొత్తం ఓ సెంట్రల్ జైల్, అందులో ఉండే దెయ్యాల చుట్టూ తిరుగుతుందట. ఇందులో మలయాళ, తమిళ స్టార్స్ యాక్ట్ చేయనున్నారు. సంధ్యా మీనన్ దర్శకురాలు. -
గాల్లో యాక్షన్
తనపై ఎటాక్ చేసినవారికి తనదైన శైలిలో జవాబు చెబుతున్నారు విశాల్. ఇందుకోసం కత్తులు, తుపాకులతో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు ‘యాక్షన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో విశాల్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కోసం విశాల్ అండ్ టీమ్ టర్కీ, అజర్‌బైజాన్‌కు వెళ్లొచ్చారు. టర్కీ షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు విశాల్. ఇందులో తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... విశాల్–సుందర్. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
స్వాతంత్య్రానికి సైరా
నేడు స్వాతంత్య్ర దినోత్సవం. మనం ఆనందిస్తున్న ఈ ఫ్రీడమ్‌ను మనకు అందించడం కోసం ఎందరో పోరాడారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లలో తొలి తరం యోధుల్లో తెలుగు వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఒకరు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి లీడ్ రోల్లో ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించారు. దాదాపు 225 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ పీరియాడికల్ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావడానికి చిత్రబృందం పడిన శ్రమ, మేకింగ్ ఆఫ్ ‘సైరా’ గురించి కొన్ని విశేషాలు మీకోసం. మేకింగ్ ఆఫ్ ‘సైరా’ రాజ్య వ్యవస్థలను, రాజులను ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకొని తమ అదుపులో ఉన్న ప్రాంతాలకు ‘పాలెగాళ్ల’ను ఏర్పాటు చేసేవాళ్లు. అలాంటి ఓ పాలెగాడు నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై ఎలా ఎదురుతిరిగాడు? ఈ ఉద్యమంలో ఎవరెవరిని తనతో కలుపుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది చిత్రకథ అని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ రాణిగా కనిపిస్తారు. సినిమా అనుష్క వాయిస్ ఓవర్‌తోనే మొదలవుతుందని తెలిసింది. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్ నటించారు. రాజ నర్తకి పాత్రలో తమన్నా, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డికి మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చే దళ నాయకుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తారు. ఎవరి పాత్రేంటి? చిరంజీవి – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నయనతార – సిద్ధమ్మ అమితాబ్ బచ్చన్ – గోసాయి వెంకన్న జగపతి బాబు – వీరారెడ్డి ‘కిచ్చ’ సుదీప్ – అవుకు రాజు విజయ్ సేతుపతి – రాజా పాండీ తమన్నా – లక్షి అనుష్క – ఝాన్సీ లక్ష్మీభాయ్ సైరా బృందం రచన : పరుచూరి బ్రదర్స్ దర్శకుడు : సురేందర్ రెడ్డి నిర్మాత : రామ్‌చరణ్ ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ కెమెరా మేన్ : రత్నవేలు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ : గ్రెగ్ పోవెల్, రామ్ లక్ష్మణ్, లీ వైట్కర్ కాస్ట్యూమ్ డిజైనర్ : అంజూ మోడీ, సుష్మితా కొణిదెల, ఉత్తరా మీనన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కణ్ణన్ సంగీతం : అమిత్ త్రివేది రాజస్తాన్ స్పెషల్ కత్తి యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 150కు పైగా వివిధ రకాలైన కత్తులను తయారు చేయించారట. ప్రధానంగా చిరంజీవి రెండు కత్తులు వాడారని సమాచారం. ఒక కత్తిని ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి తెప్పించారట. ఇక్కడ డిజైన్ చేసి, రాజస్తాన్ పంపించి, ఆ కత్తిని తయారు చేయించారు. మరో కత్తిని హైదరాబాద్‌లోనే తయారు చేయించారు. ఇంకా మిగతా కత్తులను ఇక్కడ డిజైన్ చేసి, చెన్నైలో తయారు చేయించారు. రెండు భారీ యుద్ధాలు! ‘సైరా’ సినిమాలో రెండు భారీ యుద్ధాలు ఉంటాయని తెలిసింది. ఈ యుద్ధ సన్నివేశాల్లో ఒకటి జార్జియా దేశంలో, మరొకటి హైదరాబాద్‌లోని కోకాపేట్ సెట్లో షూట్ చేశారు. జార్జియాలో నెల రోజుల పాటు ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించగా, కోకాపేట్లో దాదాపు 35 రోజులుపైగా నైట్ షూట్ చేశారట. సినిమాలో వచ్చే ఈ మేజర్ వార్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలిసింది. ఇంకా ఇవి కాకుండా పోరాట దృశ్యాలు మరిన్ని ఉంటాయి. వాటిలో నీటి లోపల తీసిన అండర్ వాటర్ ఎపిసోడ్ ఓ హైలైట్ అని తెలిసింది. ఈ ఎపిసోడ్‌ను ముంబైలో వారం రోజులు షూట్ చేశారు. పదిహేను సెట్లు ‘సైరా’ చారిత్రాత్మక చిత్రం. స్క్రీన్ మీద ఆ కాలాన్ని ప్రతిబింబించాలంటే సెట్లు కచ్చితంగా నిర్మించాల్సిందే. ‘సైరా’ చిత్రాన్ని ఎక్కువ శాతం సెట్లోనే షూట్ చేశారు. దాని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు సెట్లు, ఆర్ఎఫ్సీలో రెండు సెట్లు, కోకాపేటలో మూడు సెట్లు (టెంపుల్ సెట్, ప్యాలెస్ సెట్‌తో పాటు మరోటి), ఇంకా హైదరాబాద్‌లోనే రెండు సెట్లు, పాండిచెరీలో ఒకటి, మైసూర్, తమిళనాడులో హోగెనకల్లో ఒకటి, కేరళలో ఒకటి, రెండు సెట్లను రూపొందించారు. ఇలా 15కు పైగా భారీ సెట్లను ఈ సినిమా కోసం రూపొందించారు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో అద్భుతమైన సెట్లు తయారు చేశారు. నయనతార గెరిల్లా ఫైట్ నరసింహారెడ్డి ఆంగ్లేయులతో తలపడిన విధానాల్లో గెరిల్లా ఒక పద్ధతి. శత్రువుల్లో కలిసిపోయి అనూహ్యంగా దాడి చేయడం ఈ యుద్ధ విద్య విశేషం. సినిమాలో ఓ పాటలో ఈ గెరిల్లా పోరాటాన్ని చూపించనున్నారట చిత్రబృందం. పాట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ ఫైట్‌లో చిత్రకథానాయకుడు చిరంజీవితో పాటు దాదాపు 500మంది పాల్గొన్నారు. కాస్ట్యూమ్స్ ఇందులో చిరంజీవి సుమారు 50 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చిరంజీవి కాస్ట్యూమ్స్‌ను ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల డిజైన్ చేశారు. తమన్నా నర్తకి పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూడా ఓ 25 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. నయనతారకి 20 డ్రస్ చేంజ్‌లు ఉంటాయని తెలిసింది. సినిమాలో ఎక్కువ కాస్ట్యూమ్స్ ఈ మూడు పాత్రలకే ఉంటాయి. అంజూ మోడీ, ఉత్తరా మీనన్‌లు కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. తమన్నా ‘‘సైరా’లో నా పాత్ర రెండు నిమిషాలు కూడా ఉండదు. కానీ మేకింగ్ వీడియోలో నా విజువల్స్ కూడా వేశారు చరణ్ (రామ్ చరణ్) అన్న. అది చాలా స్వీట్ అనిపించింది. అన్న స్టైలే అది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మా అందర్నీ హ్యాపీగా ఉంచుతాడు. ఇది రక్షాబంధన్‌కి అడ్వాన్స్‌గా ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను’’ అని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు నిహారిక. ఇందులో నిహారిక కాసేపు కనిపిస్తారు. నిహారిక -
ప్రేమతో...!
జైపూర్‌లో ప్రేమాయణం సాగిస్తున్నారు విశాల్. సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్‌లోని జైపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విశాల్, తమన్నాలపై లవ్ సీన్స్‌ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్లోనే నటి ఖుష్బూ కూడా పాల్గొంటున్నారు. దాదాపు నెలరోజుల పాటు ఈ జైపూర్ షెడ్యూల్ సాగుతుందని కోలీవుడ్ టాక్. -
రీమేక్ క్వీన్
రెగ్యులర్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలను అదే సంఖ్యలో చేస్తున్నట్టున్నారు తమన్నా. లేటెస్ట్గా ఓ తమిళ సినిమా హిందీ రీమేక్‌లో తమన్నా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తండా’ హిందీలో రీమేక్ కాబోతోంది. తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రలో ఆర్యన్ కార్తీక్, బాబీ సింహా చేసిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ నిర్మించనున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ ఏడాది తమన్నా ఎక్కువ రీమేక్స్‌లో కనిపించనున్నారు. ఇటీవలే హిందీ ‘క్వీన్’ను తెలుగులో ‘దటీజ్ మహాలక్షి’గా రీమేక్ చేశారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది . ఆల్రెడీ తెలుగు సూపర్ హిట్ ‘ఆనందో బ్రహ్మా’ను ‘పెట్రోమాక్స్’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు. అందులో తమన్నా లీడ్ రోల్ చేశారు. ఇప్పుడు తమిళ ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి తెలుగు టు తమిళం టు హిందీ సినిమాల రీమేక్స్‌తో ప్రస్తుతానికి ‘రీమేక్ క్వీన్’ అయ్యారు తమన్నా. -
ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్
దక్షిణాదిలో కథానాయికగా మంచి పేరు సంపాదించుకున్నారు తమన్నా. సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల హిందీలో ఓ సినిమాకు సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించనున్నారు. కాగా బాలీవుడ్లో ఏ హీరోయిన్ వర్కింగ్ స్టైల్ అంటే ఇష్టం? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే...‘‘దీపికా పదుకోన్ వర్కింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఆమె కళ్లు చాలా అందంగా ఉంటాయి. ప్రయోగాత్మక చిత్రాలను చేయడానికి ఇష్టపడుతుంటారామె’’ అన్నారు. మరి హాలీవుడ్లో? అంటే ‘‘ప్రముఖ నటి మెరిల్ స్ట్రిప్స్ అంటే విపరీతమైన అభిమానం. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తారామె. డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో ‘పెట్రోమాక్స్’ సినిమాతో బిజీగా ఉన్న తమన్నా తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి, సైరా: నరసింహారెడ్డి’ సినిమాలను పూర్తి చేశారు. -
తలకిందుల ఇంట్లో తమన్నా!
ఇంట్లోని గడియారం, అల్మరా, అద్దం.. ఇలా అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తున్నాయి. అదే ఇంట్లో ఉన్న తమన్నా మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని నవ్వుతున్నారు. విశేషం ఏంటంటే.. తమన్నా కూర్చున్న కుర్చీ మాత్రం తలకిందులుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రంలోని స్టిల్ ఇది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను తాప్సీ విడుదల చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో హిట్ సాధించిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమాకు ‘పెట్రోమాక్స్’ తమిళ రీమేక్ అని టాక్. తెలుగు వెర్షన్లో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. అందుకే తమిళ రీమేక్‌ని ఆమె చేతుల మీదుగా విడుదల చేయించి ఉంటారు. -
మార్పు కనిపిస్తోంది
‘‘హీరోయిన్గా 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లల్లో వివిధ రకాల సినిమాల్లో భాగమయ్యే అవకాశం లభించింది. గతంలో కొన్ని సినిమాలు చేయాలనుకున్నా ప్రేక్షకులు చూస్తారో? చూడరో? అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది. ఆ మార్పు బాగా కనిపిస్తోంది’’ అన్నారు తమన్నా. ప్రస్తుతం తన దగ్గరకు వస్తున్న పాత్రలు, ప్రేక్షకులు సినిమా చూస్తున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు భిన్నమైన సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. కొత్త ఐడియాలకు స్వాగతం పలుకుతున్నారు. ఇంతకుముందు చేయలేం అనుకున్న పాత్రలు ఇప్పుడు నమ్మకంగా చేయొచ్చు. నా దగ్గరకు వచ్చే పాత్రల్లో కూడా మార్పును గమనించాను. పాత్రల్లో కొత్తదనం ఉండి, అవి మేము (హీరోయిన్లు) చేయగలమని దర్శకులు నమ్మడం యాక్టర్‌గా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తోంది. చేసే ప్రతీ పాత్రలో వ్యత్యాసం చూపించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే’’ అన్నారు. -
అది తప్పుడు ప్రచారం : తమన్నా
చెన్నై : నేనెందుకు అలాంటి పని చేస్తాను అంటోంది నటి తమన్నా. ఈ అమ్మడు బాలీవుడ్లో స్ట్రాంగ్‌గా పాదం మోపాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అడపాదడపా అక్కడ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే మంచి హిట్ ఈ బ్యూటీని వరించడం లేదు. ఈ భామ ఎలాగైనా అక్కడ నిలదొక్కుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ముందుగా ముంబాయిలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని నిర్ణయించుకుని ఇటీవలే అక్కడ ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ముంబాయిలోని వెర్సోవా ప్రాంతంలో చదరపు అడుగును రూ.80,778 చొప్పున 2,055 చదరపు అడగుల విస్తీర్ణంతో కూడిన ఈ ఫ్లాట్‌ను రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. అంతవరకూ బాగానే ఉంది. ముందే చెప్పినట్లుగా హీరోయిన్లు ఏం చేసినా మీడియా కాస్త అతి చేస్తుంటుంది. తమన్నా నూతన ఫ్లాట్ విషయంలోనూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. తమన్నా మార్కెట్ రేటు కంటే డబుల్ ధర వెచ్చించి ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు దుమ్మురేపే ప్రచారం చేసేసింది. ఇలాంటి ప్రచారం నటి తమన్నా హింది టీచర్‌ను కూడా స్పందించేలా చేసిందట. ఆమె తమన్నాకు ఫోన్ చేసి ఎందుకు రెట్టింపు ధర చెల్లించి ఫ్లాట్ కొనుగోలు చేశావు? అని ప్రశ్నించిందట. ఆ తరువాత ఒక్కొక్కరు ఇలాంటి ప్రశ్నలే వేస్తున్నారట. ఈ విషయాన్ని నటి తమన్నానే స్వయంగా వెల్లడించింది. తన ఫ్లాట్ గురించి ఎంత చర్చ జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని అంది. తాను రెంట్టింపు ధర చెల్లించి ఫ్లాట్ ఎందుకు కొంటానని ప్రశ్నించింది. తాను ముంబాయిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన విషయం నిజమేనని, అయితే రెట్టింపు ధరను మాత్రం చెల్లించలేదని వివరించింది. ఆ ఫ్లాట్ పూర్తయిన తరువాత తన తల్లిదండ్రులతో కలిసి అందులో నివాసం ఉండనున్నట్లు తమన్నా తెలిపింది. ఈ అమ్మడు 2055 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్‌ను సమీర్ బోజ్వాణి అనే వ్యక్తి నుంచి రూ.16.6 కోట్లకు కొనుగోలు చేసినట్టు స్పష్టత ఇచ్చి ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో విశాల్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, హిందిలో ఒక చిత్రం చేస్తోంది. -
డబ్బుల్ పెట్టలేదు
ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న టాప్ లిస్ట్ హీరోయిన్ తమన్నా ఇటీవల ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. తమన్నా ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్త కన్నా.. ఆమె ఆ ఫ్లాట్‌ను అక్కడ ఉన్న సాధారణ ఖరీదు కన్నా రెట్టింపు ధర చెల్లించి కొన్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్యూటీ కొన్న ఫ్లాట్‌లోని ఏ వ్యూ నుంచి చూసినా సముద్రం కనిపిస్తుందట. అందుకే తమన్నా ఆ అపార్ట్మెంట్ కోసం అంత ఖర్చు చేశారన్నది బీ టౌన్ టాక్. ఈ విషయంపై తమన్నా స్పందిస్తూ – ‘‘నేను ముంబైలో కొత్త ఫ్లాట్ కొన్నమాట వాస్తవమే. కానీ ప్రచారంలో ఉన్నట్లు డబుల్ అమౌంట్ మాత్రం పెట్టలేదు. ఇదే విషయమై మా హిందీ టీచర్ నాకు మొబైల్లో మెసేజ్ చేశారు. కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని వాపోయారు తమన్నా. ఇంకా కొత్త ఇంటి విశేషాలను చెబుతూ– ‘‘ప్రస్తుతం ఫ్లాట్ లోపలి వర్క్ జరుగుతోంది. పూర్తి కాగానే గృహ ప్రవేశం చేస్తాం. నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయడానికే నేను ఇష్టపడతాను’’ అని చెప్పుకొచ్చారు. -
త ప్లేస్‌లో తా?
మూడో రాజుగారి గదిలోకి ఇటీవల తమన్నా గృహప్రవేశం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే తమన్నా ప్లేస్‌లోకి తాప్సీ రానున్నారని లేటెస్ట్ టాక్. ఓంకార్ దర్శకత్వంలో ఇటీవల ‘రాజుగారి గది 3’ మొదలైంది. ఈ చిత్రాన్ని ఓక్ ఎంటర్‌న్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ‘రాజుగారి గది 2’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి తమన్నా తప్పుకున్నారట. దీంతో చిత్రబృందం తాప్సీతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది తాజా సమాచారం. -
దోసేస్తారు!
షూటింగ్‌లు, ప్రమోషన్లు, కొత్త సినిమా స్క్రిప్ట్‌లు వినడం... ఇలా ఆర్టిస్టుల లైఫ్ బిజీ బిజీగా ఉంటుంది. ఎప్పుడో కానీ కాస్త టైమ్ దొరకదు. ఆ టైమ్‌లో ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంటారు. సోనమ్ కపూర్, శ్రుతీహాసన్ లాంటి హీరోయిన్లు ఖాళీ సమయాల్లో బొమ్మలు వేస్తారు. శ్రియ, దిశా పాట్నీ, పరిణీతి కేటగిరీ వారు సముద్రతీరాలకు వాలిపోతారు. మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం వంటింట్లోకి దూరి గరిటె చేత పట్టుకుని దోశలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ యాప్‌లో షేర్ చేసుకున్నారు. మరి.. దోశ టేస్ట్ ఎలా ఉందనే విషయం మాత్రం ఈ బ్యూటీనే అడగాలి. వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులు మనసులు దోచేసిన తమన్నా ఇప్పుడు కావాల్సినవాళ్లకు ఇంట్లో దోసెలు వేసి, వారి మనసుని కూడా దోసేస్తున్నారేమో! ఇక సినిమాల విషయానికి వస్తే.. సౌత్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ‘బోలే ఛూడియా’ అనే హిందీ సినిమాకు సైన్ చేశారు. -
పక్కా ప్లానింగ్!
ఇటు సౌత్ అటు నార్త్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తమన్నా. ఇక్కడ సినిమాలు కమిట్ అవుతూ అక్కడి సినిమాలకు కూడా డేట్స్ ఇస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళుతునాన్రు. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘ఖామోషి’ చిత్రంలో కనిపించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్లో మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘బోలె చూడియా’లో తమన్నా నాయికగా నటించనున్నారట. ఈ సినిమాతో నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు షమాస్ నవాబ్ సిద్ధిఖీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో తొలుత మౌనీ రాయ్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. అయితే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఆ అవకాశం తమన్నాకి దక్కింది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యపై ఈ చిత్రకథ ఉంటుందట. కాగా, ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘రాజుగారి గది 3’ నుంచి తమన్నా తప్పుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ‘సైరా’లో ఆమె ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. తమిళంలో సుందర్ .సి దర్శకత్వంలో ఓ సినిమా, ‘ఆనందో బ్రహ్మ’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. -
నేను బొమ్మ గీస్తే..!
‘‘సినిమాలో పాత్ర పండటం కోసం ఏదేదో చేస్తాం. ఫైట్ చేస్తాం, వంట చేస్తాం, గయ్యాళిలా ప్రవర్తిస్తాం.. ఇలా పాత్రకు తగ్గట్టు చేస్తాం. అవన్నీ రియల్ లైఫ్‌లో చేయం. అసలు సినిమాల్లో కనిపించే మేం వేరు.. రియల్ లైఫ్‌లో మేం వేరు’’ అంటున్నారు తమన్నా. ఎందుకు ఇలా అంటున్నారంటే.. ఆ మధ్య విడుదలైన ‘అభినేత్రి 2’లో ఈ మిల్కీ బ్యూటీ పెయింటర్ పాత్ర చేశారు. మరి.. నిజజీవితంలో మీకు బొమ్మలు గీయడం వచ్చా? అని అడిగితే – ‘‘నేనా? బొమ్మలు గీయడమా? రానే రాదు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాను (నవ్వుతూ). నాకెవరైనా ఖాళీ కాగితం ఇచ్చి, బొమ్మలు గీయమంటే.. ఓ సర్కిల్ (వలయం) గీసి, దానికి రెండు కాళ్లు, రెండు చేతులు గీయగలను. అవేముంది? జస్ట్ గీతలే కదా. నా బొమ్మలో ఆ గీతలే కాళ్లూ చేతులు. ఆ బొమ్మ బొమ్మలా ఉండదు. అయితే నాకు కవితలు రాయడం బాగా వచ్చు. షూటింగ్ లేనప్పుడు కవితలు రాస్తుంటాను’’ అని చెప్పారు. చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది నెగటివ్ రోల్ అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే అది నిజం కాదని సమాచారం. -
16 కోట్ల ఫ్లాట్!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు కూడబెట్టుకోవాలి. ఈ మంత్రాన్నే హీరోయిన్లు పాటిస్తుంటారు. కూడబెట్టడంలోనే కాదు ఖర్చుపెట్టడంలోనూ కొందరు హీరోయిన్లు ముందుంటారు. తాజాగా ఓ ఫ్లాట్ కోసం అక్షరాలా పదహారు కోట్లు ఖర్చు చేశారట తమన్నా. ఈ ఫ్లాట్‌లోంచి చూస్తే ఎగిసిపడే సముద్రం కనిపిస్తుందట. ఆ కనువిందు కోసమే ఇంత ఖర్చు. హీరోహీరోయిన్లు విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేయడం ఇదివరకు చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా తమన్నా కూడా ఈ లిస్ట్‌లోకి గృహప్రవేశం చేయబోతున్నారు. ముంబైలోని ‘బే వ్యూ’ అనే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌ను మార్కెట్ రేటుకు రెండింతలు చెల్లించి సొంతం చేసుకున్నారని సమాచారం. సుమారు 16.6 కోట్లు తమన్నా ఖర్చు చేశారట. దీనికి తోడుగా 2 కోట్లతో ఇంటీరియర్ డిజైన్ చేయించాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే ఈ అపార్ట్మెంట్లోకి కుడి కాలు పెట్టనున్నారట. ప్రస్తుతం తమిళంలో ఓ రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. -
రాజుగారి గదిలోకి ఎంట్రీ
భయపెట్టడానికి కొత్త గదిలోకి అడుగుపెట్టారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఓంకార్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజుగారి గది 3’. ఇదివరకు ఓంకార్ దర్శకత్వంలోనే వచ్చిన ‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలకు ఇది సీక్వెల్ అని చెప్పుకోవచ్చు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ‘ రాజుగారి గది 3’ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ‘స్టార్ మా’ బిజినెస్ హెడ్ అలోక్‌జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అశ్విన్‌బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్, ఊర్వశి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి. -
ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది
నటిగా తమన్నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయట. అయితే ఇవి బాలీవుడ్‌కి సంబంధించినవి. ఒకటి ప్రముఖ నటి శ్రీదేవి జీవిత చరిత్రలో నటించాలన్న కోరిక. మరోటి హిందీలో పూర్తి స్థాయి డ్యాన్స్ బేస్డ్ మూవీలో నటించాలని కోరిక. ఇవి ఎప్పుడు తీరుతాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే.. శ్రీదేవి జీవిత చరిత్రలో తమన్నా ఎందుకు నటించాలనుకుంటున్నారంటే.. చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలనూ చూస్తూ పెరిగానని, ఆమె అందం, నటన అద్భుతం అనీ తమన్నా అంటున్నారు. శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం మరోటి లేదని కూడా పేర్కొన్నారు తమన్నా. అయితే గతంలో శ్రీదేవి నటించిన ‘హిమ్మత్వాలా’ రీమేక్‌లో తమన్నా నటించారు. ఆ సినిమా అపజయం పాలైంది. అది వేరే విషయం. చిన్నప్పటి నుంచి ఆరాధించిన మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం అని కూడా తెలిపారు. ఇవన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. అదే ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ యంగ్ రెబల్ స్టార్ సరసన తమన్నా ‘రెబల్’, ‘బాహుబలి’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా సాఫ్ట్ అని, దయాగుణం ఉన్నవాడని తమన్నా చెప్పారు. అది మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలనుకుంటున్నారని ఈ మిల్కీబ్యూటీ చెప్పడం విశేషం. -
రెండింతలు భయపెడతాం
‘అభినేత్రి’ చిత్రంతో తమన్నా, ప్రభుదేవా ప్రేక్షకులను భయపెట్టారు. మొదటిసారి కంటే రెట్టింపు భయపెట్టడానికి ‘అభినేత్రి’ సీక్వెల్ ‘అభినేత్రి 2’తో రెడీ అయ్యారు. ప్రభుదేవా, తమన్నా జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అభినేత్రి 2’. సోనూ సూద్, నందితా శ్వేత, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్ చేస్తూనే మనసును ఆకట్టుకునే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతల నటన ఈ సినిమాకు హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయాంకా బోస్, సంగీతం: శ్యామ్ సీఎస్. -
జర్నీ ఎండ్!
సుదీర్ఘ ‘సైరా’ ప్రయాణం క్లైమాక్స్‌కు వచ్చింది. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలిసింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార, తమన్నా కథానాయికలు. ఇటీవలే చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్‌ను షూట్‌ను పూర్తి చేశారు. ఈ నెలాఖరులో అనుష్కతో రెండు రోజులు సీన్స్ చిత్రీకరించనున్నారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిందట. వీఎఫెక్స్ వర్క్స్ కూడా అనుకున్న సమయానికి జరిగితే సినిమాను గాంధీ జయంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
నో బ్రేక్
ఈ రోజుల్లో సినిమా పూర్తి కావాలంటే 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల వరకూ పడుతుంది. చిన్న సినిమాల షూటింగ్ కూడా చాలా రోజులు పడుతోంది. కానీ తమిళంలో తమన్నా నటించనున్న ఓ హారర్ సినిమా నలభై రోజుల్లోనే పూర్తి కానుందని తెలిసింది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ముఖ్యపాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ థ్రిల్లర్ రూపొందనుంది. యోగిబాబు, మన్సూర్ అలీ ఖాన్, భగవతీ పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం 42 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎటువంటి బ్రేక్స్ తీసుకోకూడని ఫిక్స్ అయ్యారట. మొదటి పది రోజులు చెన్నైలో మిగతా పోర్షన్ మొత్తం కారైకుడిలో షూట్ చేస్తారట. తమన్నా నటించిన హారర్ చిత్రాలు ‘దేవి 2’, కామోషీ’ సినిమాలు మే 31న రిలీజ్ కానున్నాయి. -
అప్పుడే పేరూ డబ్బూ వస్తాయి
నిన్న మొన్నటివరకు గ్లామరస్ క్యారెక్టర్స్‌కే పరిమితమైన మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త దారిని ఎంచుకున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలపై (దేవి 2, రాజుగారి గది 3, ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా) దృష్టి సారించారు. కథ నచ్చితే గ్లామరస్ రోల్స్‌కి కూడా సై అంటున్నారు. ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో తన పేరు కచ్చితంగా ఉండేలా కష్టపడుతున్నారు. నటిగా మీరు ఇంత పేరు, అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే – ‘‘పేరు, డబ్బు, సౌకర్యవంతమైన జీవితం కోసం మాత్రమే యాక్టింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకుంటున్నారని చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ అది నిజం కాదు. నటన పట్ల తపన లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలవలేం. నా సక్సెస్‌కి కారణం అదే. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే పేరు, డబ్బు వస్తాయి. అప్పటివరకు అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. కష్టపడకుండా ఏదీ వచ్చేయదు’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ మీరు యాక్టర్ కాకపోయి ఉంటే ఏ రంగాన్ని ఎంచుకునేవారు అని అడగ్గా – ‘‘యాక్టింగ్ లేకుండా నా లైఫ్‌ని ఇప్పుడు ఊహించుకోలేను. అయితే మెడికల్ సెక్టార్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో... మెడిసన్ చదివేదాన్నేమో’’ అని చెప్పారు. -
కేరళలో ఖేల్ ఖతమ్
‘సైరా’ ప్రయాణం పూర్తి కావస్తోంది. షూటింగ్ ఖేల్ ఖతమ్ చేయడానికి కేరళ అడవుల్లో షూటింగ్ చేస్తోంది చిత్రబృందం. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కానుందని సమాచారం. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రెండింతల థ్రిల్
ఎండలు మండిపోతున్నాయి. ఈ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెల ఎలా ఉంటుంది? ఎండలు రెండింతలు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం చల్లని థియేటర్‌కి వెళితే బోలెడంత థ్రిల్‌కి గురి చేస్తారట ప్రభుదేవా, తమన్నా. కూల్ కూల్ అంటూ హాయిగా థియేటర్లో కూర్చుని మా థ్రిల్‌ని ఎంజాయ్ చేయండి అంటున్నారు. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ ముఖ్య తారలుగా రెండేళ్ల క్రితం వచ్చిన ‘అభినేత్రి’ గుర్తుందా? తమిళంలో ‘అభినేత్రి’గా తెలుగులో, ‘దేవి’గా విడుదలైంది. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ‘అభినేత్రి 2 ’ రూపొందింది. ఫస్ట్ పార్ట్ కన్నా సీక్వెల్లో రెండింతల థ్రిల్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితా శ్వేత, డింపుల్ హయాతి, కోవై సరళ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 1న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచాలను చేరుకునే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్, డైలాగ్స్: సత్య. -
అదుపు తప్పింది
విశాల్ చేజింగ్ రాంగ్ ట్రాక్‌లో వెళ్లింది. దీంతో ఆయన గాయపడ్డారు. విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అయితే ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా విశాల్ నడుపుతున్న ఏటీవీ బైక్ అదుపు తప్పింది. దీంతో విశాల్ గాయపడ్డారు. వెంటనే చిత్రబృందం ఆయనకు చికిత్స చేయించారు అనుకోని ఈ ప్రమాదం వల్ల అనుకున్న సమయానికన్నా ఈ షెడ్యూల్ కాస్త లేట్ కావొచ్చట. -
టర్కీ పోదాం... చలో చలో
.... అంటూ బ్యాగ్ ప్యాక్చేసుకునే పనిలో ఉన్నారట విశాల్ అండ్ తమన్నా. దాదాపు యాభై రోజులు అక్కడే ఉంటారని కోలీవుడ్ టాక్. సుందర్. సి దర్శకత్వంలో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను టర్కీలో ప్లాన్ చేశారట చిత్రబృందం. అక్కడ జరిగే మేజర్ షూటింగ్లో రెండు పాటలు, మూడు ఫైట్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్యాలక్ష్మీ మరో కథానాయికగా నటిస్తారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. ఇంతకుముందు ‘కత్తిసండై’ అనే సినిమాలో జంటగా కనిపించారు తమన్నా, విశాల్. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ జోడీ కట్టారు. అలాగే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో కూడా తమన్నా, విశాల్ జంటగా కనిపించనున్నారని తెలిసింది. -
చైనాలో నైరా
‘సైరా’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టే సమయం వచ్చేసిందట. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తమన్నా, అనుష్క కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, ఏప్రిల్ మొదటి వారంతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి అయిపోతుందని తెలిసింది. ఈ చిత్రం చైనాలో చిత్రీకరణ జరగుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట. చైనాలో ‘నైరా’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉందని టాక్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
కొత్త దారి!
కెరీర్లో తమన్నా కొత్తదారికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా వీలైనప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ కాలు కదిపారు. కానీ ఇప్పుడు ట్రాక్ మార్చి లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టారామె. ఆల్రెడీ తమన్నా నటించిన రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’, తమిళ ‘దేవి 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రాజుగారి గది 3’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘దేవి 2, రాజుగారి గది 3’ చిత్రాలు హారర్ బేస్డ్ కావడం విశేషం. తాజాగా తమన్నా మరో హారర్ సినిమాకు సై అన్నారు. ఈ చిత్రానికి రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయాల్లో కొత్తగా ఉండే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం ఒకటి. ‘రాజుగారి గది 3’ చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో ఉండటమే కాకుండా స్క్రీన్ ప్లే రెండు కాలసమయాల్లో నడుస్తుంది. ఆసక్తిగా అనిపించి సైన్ చేశాను. స్క్రిప్ట్ నచ్చితే మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తారు. ఇవి కాకుండా చిరంజీవి ‘సైరా’ సినిమాలో నర్తకి లక్ష్మీ అనే ఓ కీలక పాత్రను తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఫొటోషూట్ రెడీ
కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. ఎందుకంటే ఆయన తర్వాతి చిత్రం కోసం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఈ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఇటీవల చిరంజీవిపై ఓ ఫొటోషూట్ జరిగిందని సమాచారం. త్వరలో చిత్రీకరణ స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చిరంజీవి బరువు కూడా తగ్గుతారని తెలిసింది. ఇందులో కథానాయికగా తమన్నా, నయనతార, శ్రుతీహాసన్ పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరో ఒకరు చిరంజీవికి జోడీగా నటిస్తారా? లేక వేరే హీరోయిన్ ఎవరైనా ట్రాక్‌లోకి వస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
నాతో తప్పుగా ప్రవర్తించలేదు
‘మీటూ’ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పట్ల సాజిద్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు కథానాయికలు ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారాయన. సాజిద్ ఖాన్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, అతనితో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గానే అనిపించిందని పేర్కొన్నారు తమన్నా. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హిమ్మత్వాలా, హమ్‌షకల్స్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు తమన్నా. సాజిద్ ఖాన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తమన్నా పంచుకుంటూ – ‘‘నేనెలాంటి సినిమా చేయబోతున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి? అన్నదే నాకు ముఖ్యం. నేను, సాజిద్ ఖాన్ కలసి చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తనెప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తనతో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతాను’’ అని పేర్కొన్నారామె. ఇటీవల విద్యాబాలన్ ‘మళ్లీ సాజిద్‌తో కలసి సినిమా చేయబోనని పేర్కొన్నారు’ కదా అని అడగ్గా –‘‘అందరి అనుభవాలు ఒకలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకవేళ విద్యకు బ్యాడ్ఎక్స్పీరియన్స్ ఎదురై ఉంటే ఆమె అలా రియాక్ట్ అయ్యుండొచ్చు’’ అని చెప్పారు తమన్నా. -
అడుగుపెడతారా?
‘రాజు గారి గది’ ఫస్ట్, సెకండ్ పార్ట్స్ హిట్స్‌గా నిలవడంతో, ఈ హారర్ సిరీస్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. సెకండ్ పార్ట్‌లో నాగార్జున, సమంత నటించడంతో ‘రాజుగారి గది 2’ పెద్ద సినిమా అయింది. ‘రాజుగారి గది’కి మూడో పార్ట్ తెరకెక్కిస్తా అని దర్శకుడు ఓంకార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నారు. ఈ మూడో భాగంలో హీరోయిన్గా తమన్నాను సంప్రదించారట. ముంబై వెళ్లి తమన్నాకు కథ కూడా వినిపించారట. ఇందులో నటించేందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మరి భయంకరమైన రాజుగారి గదిలో ఏముందో తెలుసుకోవడానికి ధైర్యంగా తమన్నా అడుగుపెడతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి, దేవీ 2’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘సైరా : నరసింహారెడ్డి’లో కీలక పాత్ర చేస్తున్నారామె. -
అనిల్ సినిమాలు చూస్తే జిమ్‌కు వెళ్లక్కర్లేదు
‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. ‘దిల్’ రాజు మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఇక అనిల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్లనక్కర్లేదు’’ అని దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్–లక్ష్మణ్ నిర్మించిన ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా, రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నా సినిమాల్లో ‘పెళ్ళిసందడి, గంగోత్రి’ సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు, వరుణ్ కూడా మంచి నటనను కనపరిచాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం అనిల్. మా హీరోలిద్దరూ బిజీగా ఉండటం, అనిల్ తన నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్రెడీ బిజీగా ఉన్నా... ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఎక్కడా గ్యాప్ లేకుండా కామెడీతో అనిల్ ఇరగొట్టేశాడు. టాలెంట్‌ను వెతికి పట్టుకుని, ఎంకరేజ్ చేయడం ‘దిల్’ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. నవ్విస్తే చాలు.. ప్రేక్షకుడు లాజిక్, మేజిక్ల గురించి ఆలోచించడు’’ అన్నారు యస్వీ కృష్ణారెడ్డి. ‘‘ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాపకం మైండ్‌లో రీల్లా తిరుగుతుంది. అందుకనే ఈ ఫంక్షన్ చేశాం. 107 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. 130 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసిన సినిమా ఇది. ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాను వెంకటేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకు మరోసారి తెలిసింది. వరుణ్‌తేజ్ కామెడీజోనర్లో చేసిన తొలి చిత్రమిది. అలాగే తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్‌గారు, ఇలా ప్రతి ఆర్టిస్ట్‌కు, సాంకేతిక నిపుణలకు థాంక్స్.రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు కుటుంబతో సమానం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నా 10వ సినిమా బెస్ట్ మూవీగా నిలవడం, సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పట్ల çసంతోషంగా ఉన్నాను’’ అన్నారు మెహరీన్. -
మా ఇద్దరి మధ్య ఏమీ లేదు
వినోద ప్రపంచంలో ఎక్కువగా ఆకర్షించేవి సినిమా, క్రీడలు. అది కూడా స్పోర్ట్స్‌లో క్రికెట్‌ది ప్రత్యేక స్థానం. సినిమా, క్రీడలను కలిపేది యాడ్స్. క్రికెటర్స్, మూవీ స్టార్స్ కలసి యాడ్ ఫిల్మ్స్‌లో కనిపించడం చాలాసార్లు చూశాం. 2012లో క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ తమన్నా ఓ యాడ్ ఫిల్మ్ కోసం కలిశారు. ఆ స్మార్ట్‌ఫోన్ యాడ్ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, డేటింగ్ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఈ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలకు సమాధానం చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆ విషయం మీద ఓ షోలో మాట్లాడారు తమన్నా. ‘‘యాడ్ షూట్ సమయంలో నేను, విరాట్ గట్టిగా నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘ఆ యాడ్ తర్వాత మేమిద్దరం మళ్లీ కలవలేదు, మాట్లాడుకోనూ లేదు. కానీ నేను యాక్ట్ చేసిన చాలామంది యాక్టర్స్ కంటే కూడా విరాట్ చాలా బెటర్ యాక్టర్’’ అని ప్రశంసించారు. ప్రస్తుతానికి ఎవరితో రిలేషన్షిప్లో లేనన్నారామె. హృతిక్ ఒక్కరే మినహాయింపు ఇదే షోలో మరికొన్ని విశేషాలు చెబుతూ – ‘‘సాధారణంగా సినిమాల్లో లిప్‌కిస్ సన్నివేశాలను చేయను నేను. ఏదైనా సినిమాకు సంతకం చేసేటప్పుడు నా కాంట్రాక్ట్‌లో ఆ నియమం కచ్చితంగా ఉంటుంది. కానీ హృతిక్‌తో కలసి నటిస్తే మాత్రం ఆ రూల్‌ని బ్రేక్ చేస్తానని సరదాగా ఫ్రెండ్స్‌తో జోక్ చేస్తుంటాను’’ అని పేర్కొన్నారామె. -
‘సైరా’లో అనుష్క స్పెషల్ అపియరెన్స్
2006లో చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు అనుష్క. మళ్లీ పదమూడేళ్ల తర్వాత అలాంటి స్పెషల్ అపియరెన్సే ‘సైరా’ సినిమాలో ఇవ్వబోతున్నారట. అయితే అప్పుడు పాటకు మాత్రమే పరిమితమైతే ఇప్పుడు సీన్స్‌లో కూడా కనిపిస్తారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాలోకి అనుష్క కూడా జాయిన్ అవ్వనున్నారట. ఓ స్పెషల్ రోల్లో కొన్ని నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించనున్నారట అనుష్క. ప్రస్తుతం పాండిచ్చేరీ దగ్గర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
స్పైతో సై
గోపీచంద్ గూఢచారిగా మారి భారతదేశం బోర్డర్లో సాహసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గూఢచారికి జోడీ ఫిక్స్ అయ్యారని సమాచారం. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా స్పై థ్రిల్లర్ జానర్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ బోర్డర్లో జరుగుతోంది. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్గా తమన్నా పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. గోపీచంద్‌తో తమన్నా హీరోయిన్గా యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆల్రెడీ ఈ సినిమాలో మరో కథనాయికగా బాలీవుడ్ భామ జరైన్ ఖాన్‌ను ఎంపిక చేశారు. సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. -
యాభై.. వందరోజుల వేడుకలు పోయాయి
‘‘ఇప్పటికే మా ‘ఎఫ్ 2’ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సంతోషం. ఇంకెంత వసూలు చేస్తుందో మాకు తెలీదు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు నుంచి మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కేరింతలు కొట్టే విధంగా ఈ కొత్త సీన్స్ ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి. ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ మా ‘ఎఫ్2’ చిత్రం వంద కోట్ల గ్రాస్ షీల్డ్స్‌ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్ కల. అది ‘ఎఫ్2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేయడానికి 5 కొత్త సీన్స్‌ని యాడ్ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన ‘హ్యాపీడేస్’ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ‘ఎఫ్ 2’ బిగ్గెస్ట్ హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు తమన్నా. -
సైరా.. జాతర!
హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి వారం రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు ‘సైరా: నరసింహారెడ్డి’ టీమ్. ప్రస్తుతానికైతే యాక్షన్ సన్నివేశాల కోసం కాదు. ఓ సాంగ్ కోసం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రేపటి నుంచి చిత్రీకరించబోయే ఈ సాంగ్‌లో చిరంజీవి, తమన్నా, జగపతిబాబు, సుదీప్ పాల్గొంటారని సమాచారం. జాతర నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ను దాదాపు వారం రోజుల పాటు చిత్రీకరిస్తారని తెలిసింది. అంతేకాదు.. వెయ్యిమంది డ్యాన్సర్లు ఈ పాటలో పాల్గొంటారట. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని తెలుస్తోంది. -
మహాలక్ష్మి ముస్తాబు
ఓ సాధారణ యువతి అసాధారణ మహిళగా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’. తమన్నా ప్రధాన పాత్రలో నటించారు. టైజాన్ ఖొరాకివాలా సమర్పణలో మెడైంటే ఇంటర్నేషనల్ పతాకంపై మను కుమరన్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మను కుమరన్ మాట్లాడుతూ– ‘‘హిందీలో ఘన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ పనులు మొదలు పెట్టాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాం. అమిత్ త్రివేది చక్కని సంగీతం అందించారు. మైఖెల్ ట్యాబ్యురియస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పరుల్ యాదవ్, పంకజ్ కపూర్, కె. వెంకట్రామన్, మనోజ్ కేశవన్ లైగర్, త్యాగరాజన్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: జి. మోహన్ చంద్రన్, హేటల్ యాదవ్, యోగేష్ ఈశ్వర్ ధబువాలా. -
అందరూ నవ్వుతుంటే కన్నీళ్లొచ్చాయ్
‘‘ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ చేశారు. నిజంగా అభిమానుల కళ్లలో ఆ ఆనందం చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు అక్కడ అందరూ నవ్వుతున్నారు.. కానీ, నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయ్. చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్ చూసినప్పుడు.. మేమంతా కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్ ఫీలింగ్. ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కి థ్యాక్స్ చెబుతున్నా. నావి ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ‘గణేశ్, ప్రేమించుకుందాం రా... నా బిగినింగ్ సినిమా ‘బొబ్బిలి రాజా నుంచి మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలు కానీ, నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి... ఇలా ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. అనిల్ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం.. ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వండ్రఫుల్ సినిమా ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. అనిల్ చాలా మంచి ఎనర్జీ ఇచ్చాడు. వరుణ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టైటిల్‌ని అనిల్ ‘ఎఫ్ 2’ అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ‘వీ 2’ అని వెంకటేశ్‌గారు, వరుణ్‌గారు జాయిన్ అయ్యారు. సినిమా రిలీజ్ రోజు ‘ఈ 2’ అని(ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్) కొందరు మెసేజ్‌లు పంపించారు. ఫైనల్‌గా ‘బీ 2’ అని (బొమ్మ బ్లాక్‌బస్టర్) బిరుదు ఇచ్చేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం.ఈ సక్సెస్ అనిల్ ఒక్కడిదే కాదు.. టెక్నీషియన్స్ అందరిదీ. మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ క్రెడిట్ మా టీమ్‌తో పాటు ప్రేక్షకులదే. మిమ్మల్ని కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని అర్థం అయింది. వెంకటేశ్‌గారు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 50కోట్ల క్లబ్లో ఉన్నారు. వరుణ్ ‘ఫిదా’ సినిమాతో 50కోట్ల క్లబ్లో చేరారు. ఇద్దరూ ‘ఎఫ్ 2’ తో 50కోట్ల క్లబ్ దాటేశారు. మా బ్యానర్‌కి హయ్యస్ట్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే.. చాలా హ్యాపీ’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. ఓ సినిమా చేయాలంటే 100 నుంచి 200 మంది ఎఫర్ట్ ఉంటుంది. మా ‘ఎఫ్ 2’ సినిమాకి ఇంకా ఎక్కువ మంది పనిచేశారు. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో పనిచేశారు.. అందరికీ థ్యాంక్స్. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూశా. ఒక్కరు చిరంజీవిగారు, రెండోది వెంకటేశ్‌గారు. వాళ్లను చూసి ఇలా మనం చేయగలుగుతామా? అనిపించేది. వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్‌లా నా పక్కన ఉంటూ సపోర్ట్ చేశారు. వెంకీగారు నిజంగా నా కో బ్రదర్, బెస్ట్‌ఫ్రెండ్. మీతో పనిచేయడం మరచిపోలేను. వెంకీగార్ని, అనిల్గార్ని, ఈ టీమ్‌ని మిస్ అవుతున్నందుకు ఎక్కడో ఫీలింగ్ ఉండేది. కానీ, త్వరలోనే ‘ఎఫ్ 3’ సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, వాళ్లందరికీ నచ్చే కామన్ వ్యక్తి వెంకటేశ్‌గారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్. ప్రతి సినిమా నాకు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నటీనటులందరూ లైఫ్పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్స్. తమన్నా, మెహరీన్ చాలా బాగా నటించారు. దేవిశ్రీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకీ సార్‌తో కలిసి వరుణ్ చాలా కష్టపడి చేశాడు. మళ్లీ మళ్లీ వరుణ్‌తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్‌గారి దెబ్బకి బాక్సాఫీస్ అబ్బ. ఈ చిత్రంలో వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. మనం ఏరుకోవడమే. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. నా లైఫ్‌లో ఇది నవ్వుల సంక్రాంతి.. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా టీమ్‌ని ఎంతో ఎంకరేజ్ చేసిన మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్. ‘ఎఫ్ 3’ సినిమా కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కథానాయిక మెహరీన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
సేనాధిపతి రాజాపాండీ
ప్రస్తుతం తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్న హీరో విజయ్ సేతుపతి. రీసెంట్గా రజనీకాంత్ ‘పేట్టా’లో కూడా కనిపించారు. ఇప్పుడీ హీరో చిరంజీవి నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నిన్న విజయ్ సేతుపతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సైరా’ సినిమాలో ఆయన పోషిస్తున్న ‘రాజా పాండీ’ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో తమిళ సైన్యానికి సేనాధిపతిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. -
ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను
‘‘ఎవరైనా సక్సెస్ కోసం పని చేస్తారు. నేను ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను. ఫెయిల్యూర్ భయం నాకు ప్రతి క్షణం ఉంటుంది. డైరెక్టర్‌గా నేను సక్సెస్ అయ్యాను. రైటర్‌గా ఉన్నప్పుడు నేను చాలా ఫెయిల్యూర్స్ చూశా. మనం చేసిన పనికి ప్రశంస రాకపోతే ఉండే బాధను అనుభవించాను. ఇప్పుడు ఆ బాధ లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా’’ అని అనిల్ రావిపూడి అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు... ► ఈ సినిమాకు ముందు మూడు యాక్షన్ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్) చేశాను. యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దామనుకున్నాను. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరెళితె’ తరహాలో ఉండే సినిమా చేద్దామని ‘ఎఫ్ 2’ చేశాను. ‘రాజా ది గ్రేట్’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ‘ఎఫ్ 2’ ఆలోచన వచ్చింది. ► జంధ్యాలగారు గొప్ప రైటర్. గొప్ప దర్శకులు. బోర్ కొడితే ఆయన సినిమాలు చూస్తాను. ఆయన్ను ఫాలో అవుతాను కానీ ఆయన్ని కాపీ కొట్టను. అలాగే ఈవీవీగారు, కృష్ణారెడ్డిగారి సినిమాలు కూడా బాగా ఇష్టం. వీరిని ఇన్‌ప్లూయెన్స్ అవుతున్నానన్న మాట మాత్రం వాస్తవం. కానీ నా స్టైల్ ఆఫ్ నరేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ► నాది తక్కువ.. నీది ఎక్కువ, ఒకరికి ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఒకరికి తక్కువ ఉన్నాయి అన్న తలనొప్పి నాకు లేదు ఈ సినిమా సెట్లో. అందరూ నమ్మి ఈ సినిమా చేశారు. మంచి ఫలితం వచ్చింది. వెంకటేశ్‌గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. సినిమాలో వెంకీ ఆసనం, డాగ్ ఎపిసోడ్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వెంకీగారు గ్రేట్ యాక్టర్. రిజల్ట్ పట్ల ఆయన ఫుల్‌హ్యాపీ. వరుణ్ ఇప్పటివరకు కామెడీ జానర్ చేయలేదు. వెంకీగారితో వరుణ్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందా? అనుకున్నాం. బాగా చేశారు. తెలంగాణ డైలాగ్స్ బాగా పలికారు. సినిమాలో ప్రకాష్‌రాజ్‌గారికి ‘గుండమ్మ కథ’ అంటే ఎంత పిచ్చో నాకు అంత పిచ్చి. అదే సినిమాలో పెట్టాను. ఈ సినిమాలో ముందుగా ‘అంతేగా.. అంతేగా..’ డైలాగ్స్ అనుకోలేదు. ► నీ సినిమాల్లో గ్లామర్ ఉండదేంటి? అన్నారు కొందరు. అలాంటి ఆడియన్స్ కూడా ఉన్నారని రియలైజ్ అయ్యి ఈ సినిమాలో కొంచెం గ్లామర్ సీన్స్ పెంచాను. కానీ బోర్డర్ దాటి చేయలేదు. నా పెళ్లి తర్వాతే రాసుకున్నాను ఈ సినిమా స్క్రిప్ట్‌ని (నవ్వుతూ). నా వైఫ్ చూసి చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. ► నేను న్యూస్, కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతాను. సినిమానే నాకు లైబ్రరీ. సినిమానే నాకు పుస్తకం. అందుకే నేను చేసే సినిమాల్లో కరెంట్ అఫైర్స్ ట్రెండ్ కనిపిస్తుంది. బాల్యంలో ఎంత బాగా చదివేవాడినో అంతే బాగా సినిమాలు చూసేవాడిని. నా గురించి ఇప్పుడు అరుణ్ ప్రసాద్‌గారు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆయన తీసిన ‘గౌతమ్ ఎస్ఎస్సి’ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆయనంటూ లేకపోతే నేనూ ఇండస్ట్రీలో లేను. కాస్త టైమ్ తీసుకుని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా. బాలకృష్ణ, వెంకటేశ్ గార్లకు ఐడియాలు చెప్పాను. బయోపిక్స్ పట్ల ఆసక్తి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదు. ► ‘ఎఫ్ 3’ చేయాలనే కోరిక ఉంది. ‘ఎఫ్ 2’ కి ఆడియన్స్ సక్సెస్ ఇచ్చారు కాబట్టి నా కోరికకు బలం కూడా వచ్చింది. వెంకీగారు, వరుణ్ కూడా ఎగై్జట్‌గా ఉన్నారు. వెంకీగారు, వరుణ్‌కి తోడుగా ఇంకో హీరో వస్తారా? లేక అసలు ఎలా ఉండబోతుందన్న వివరాలు భవిష్యత్‌లో తెలుస్తాయి. -
నేను పెద్ద హీరోని అనుకోను
‘‘సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను, వరుణ్ సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘నేను పెద్ద హీరోని అని ఎప్పుడూ అనుకోను. కథ, దర్శకుడు అనిల్‌ని నమ్మి ఈ సినిమా చేశా. ‘దిల్’ రాజుగారితో మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కలియుగ పాండవులు’ చిత్రంతో వెంకటేశ్‌గారి అభిమానిని అయ్యా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు అనిల్’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. అది కూడా కామెడీ క్యారెక్టర్. ‘ఎఫ్ 2’తో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ‘ఫిదా’ తర్వాత మరోసారి పనిచేయడం హ్యాపీ. మా పెదనాన్నగారి (చిరంజీవి) కాన్టెంపరరీ హీరో వెంకటేశ్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో ఫ్రెండ్‌లా, మెంటర్‌లా ఉన్నారు. నెక్ట్స్ టైమ్ ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి రెడీ’’ అన్నారు. ‘‘ఎఫ్ 2’ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. టైమింగ్ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు’’ అన్నారు అనిల్ రావిపూడి. నటులు రాజేంద్రప్రసాద్, కథానాయికలు తమన్నా, మెహరీన్, నిర్మాత శిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
సడన్‌గా సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా?
‘‘నిన్న ఒక సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో వాళ్లు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారేమో నాకు తెలియదు. పండక్కి›వస్తున్న 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయ్యాయి. 3 పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా సెట్ చేసుకోవాలని స్ట్రగుల్ అవుతున్నాం. అలాంటిది 20 రోజుల ముందు సినిమాను కొనుక్కొచ్చి సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా? 3 తెలుగు సినిమాలున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయి?’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి, ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘రాజా ది గ్రేట్’ తర్వాత అనిల్ ఈ ఐడియా చెప్పాడుæ. బాగా నచ్చింది. జర్నీ అంతా ఫన్‌గా సాగిపోయింది. మొన్న ఇద్దరం మాట్లాడుకుంటూ ‘ఏంటి అనిల్.. 3 సినిమాలు చేసేశాం. చిన్న క్లాష్ కూడా రాలేదు’ అని నవ్వుకున్నాం. తను అనుకున్నట్టు సినిమా చేశాడు. పండక్కి మా సినిమా ఫన్ ఇస్తుందని నమ్ముతున్నాం. అలాగే థియేటర్స్ ఇష్యూలో రెండో పాయింట్.. ఆ నిర్మాతే గత నాలుగు నెలల్లో ‘నవాబ్, సర్కార్’ సినిమాలు రిలీజ్ చేశారు. ‘సర్కార్’కు ఎన్ని థియేటర్స్ కావాలో అన్ని థియేటర్స్‌లో వేసుకున్నారు. ఇప్పుడు దొరకడం లేదంటే? తెలుగు సినిమాలను తగ్గించుకుని రిలీజ్ చేయలేం కదా. ఈ సీజన్లో మన తెలుగు సినిమా కాకుండా వేరే భాష చిత్రాలకు థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. 18న రిలీజ్ చేయొచ్చుగా? అలా చేస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయిగా. ఇలాంటివి ఆలోచించకుండా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చి, నోరు జారారు. అలా మేమూ మాట్లాడగలం. కానీ ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. డబ్బు సంపాదించడానికే. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయాయి. అయినా సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాం. ఎవరి మీదా స్టేట్మెంట్లు ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు. 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకు థియేటర్స్ ఉండాలా వద్దా? మూడూ క్రేజీ సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అది తెలియకుండా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ మధ్యలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్లో ఫుల్ కామెడీ సినిమా చేయలేదు. అనిల్ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మల్టీస్టారర్ అయితే ఇంకా ఫన్ ఉంటుందనుకుని చేశాం. వరుణ్‌తో పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఎంటర్టైన్ చేసిన ప్రతిసారీ నన్ను ఆదరించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. ‘‘నా కెరీర్లో చేయాల్సిన కామెడీ అంతా ఈ సినిమాలో చేయించాడు అనిల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. వెంకీగారితో పని చేయాలంటే టెన్షన్ పడ్డా. ఫ్రేమ్‌లో ఆయనతో పోటీపడటం పెద్ద చాలెంజ్. ఆయన ఇచ్చిన కంఫర్ట్ వల్లే బాగా చేయగలిగాను. సీట్లో కూర్చోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ ఆన్నారు వరుణ్ తేజ్. ‘‘ఈ బ్యానర్లో ఇది నాకు మూడో సినిమా. నిర్మాతలు ఫ్యామిలీలా మారిపోయారు. వాళ్లతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. మా కాంబినేషన్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. రెండు నిమిషాల ట్రైలర్లో కొన్ని నవ్వులే. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో చాలా నవ్వులుంటాయి. వెంకటేశ్, వరుణ్, తమన్నా మెహరీన్‌లు ఈ సినిమాకు 4 పిల్లర్స్’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో రాజుగారు నాదో సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు నుంచి నా లైఫ్‌లో ‘హ్యాపీడేస్’ వచ్చేశాయి. అప్పటి నుంచి ఆయనతో ఎప్పుడు సినిమా చేస్తానా అనుకున్నాను. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అనిల్‌గారు ఓన్లీ ఫన్ నో ఫ్రస్ట్రేషన్. వెంకీ సార్ ఎన్ని పాత్రలు చేసినా అంత ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనిపిస్తారో అర్థం కాదు. వరుణ్ చేస్తున్న సినిమాలు నాకు ఇష్టం. మెహరీన్ నా హనీ’’ అన్నారు తమన్నా. ‘‘200 శాతం ఈ సినిమాకు ఇచ్చాను. వెంకటేశ్ సార్, వరుణ్, తమన్నాలతో కలసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నాను’’ అన్నారు మెహరీన్. -
తెలుగు సినిమా మరోసారి సత్తా చాటాలి
‘‘హలో వైజా........గ్.. సౌండ్ అంటే అదమ్మా. మీ సౌండ్‌తో నాకు గొంతు పోయినట్టుంది (నవ్వుతూ). వైజాగ్ ఉత్సవాల్లో మా ‘ఎఫ్ 2’ సినిమా ఆడియో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఎఫ్ 2’ వండర్ఫుల్ స్క్రిప్ట్. నా గత సినిమాలన్నీ జాగ్రత్తగా చూసిన అనిల్ వాటన్నిటికంటే చాలా బాగా రెచ్చిపోయాలా నన్ను చూపించాడు’’ అన్నారు వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదివారం వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నాకెంతో క్లోజ్. నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ఎన్నో సినిమాలు నేను ఇక్కడ చేశాను. ‘స్వర్ణకమలం, సుందరకాండ, గురు’... ఇన్‌ఫ్యాక్ట్ ‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రినాకైఫ్‌తో ఇదే బీచ్‌లో అలా నడుస్తూ ఉన్నాను కదా (నవ్వుతూ). వైజాగ్ నాకెంతో లక్కీ ప్రదేశం. మా పెళ్లాలు (తమన్నా, మెహరీన్) రాలేదు. దానికే కొంచెం అందరం ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాం (నవ్వుతూ). మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీకి థ్యాంక్స్. ‘ఎఫ్ 2’ లాంటి మంచి సినిమా ఇస్తున్నందుకు ‘దిల్’రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. వారితో చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో బ్రదర్ మహేశ్‌ని సంపాదించుకున్నా.. ‘ఎఫ్ 2’ సినిమాకి మరో బ్రదర్ వరుణ్ని సంపాదించుకున్నా. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న బాలయ్య బాబు (యన్.టి.ఆర్. కథానాయకుడు), చరణ్ (వినయ విధేయ రామ), రజనీకాంత్‌సార్ (పేట) సినిమాలన్నీ బాగా ఆడాలి.. మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కరెక్టుగా 2014 డిసెంబరు 31న నేను, బన్నీ (అల్లు అర్జున్) ఇక్కడే వైజాగ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. 2017లో సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద పోటీ అని అందరం భావించాం. బాలకృష్ణగారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్లాసిక్ సినిమా అయింది.. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అయింది. మా ‘శతమానం భవతి’ మంచి సినిమా అయ్యి జాతీయ అవార్డు వరకూ వెళ్లింది. 2019 సంక్రాంతికి మళ్లీ మూడు సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెంకటేశ్‌గారితో మా బ్యానర్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్‌తో ‘ఫిదా’ సినిమాలు చేశాం. వారిద్దరితో మల్టీస్టారర్‌గా ఇప్పుడు తీసిన ‘ఎఫ్ 2’ సంక్రాంతికి రాబోతోంది. ఇద్దరూ నిర్మాతకి కంఫర్టబుల్ హీరోలు. థ్యాంక్యూ వెంకీ సార్. మంచి కథ కుదిరితే మీతో మరో సినిమా చేయాలనే కోరిక ఉంది. వరుణ్ ఆల్మోస్ట్ ఓ ఫ్యామిలీ మెంబర్. చిరంజీవిగారిలోని లక్షణాలు తీసుకుని మంచి సినిమాలు చేస్తూ ఎదుగుతున్న వరుణ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవుతాడు. అనిల్ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నా. మా బ్యానర్‌కి మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందని అప్పుడే తెలుసు. అనిల్ గత చిత్రాలు ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అయితే ‘ఎఫ్ 2’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే ఈ సినిమాకి ‘సంక్రాంతి అల్లుళ్లు’ వస్తున్నారని మరో ట్యాగ్‌లైన్ పెట్టాడు. సినిమాలో ఒకరు ఆంధ్ర అల్లుడు.. మరొకరు తెలంగాణ అల్లుడు. మా బ్యానర్లో అనిల్‌కి వరుసగా మూడో సినిమా. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. దేవిశ్రీతో ‘ఆర్య’ నుంచి మా జర్నీ మొదలైతే ‘ఎఫ్ 2’ పదో సినిమా. ఇప్పటి వరకూ 9 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నా యాక్టింగ్ కెరీర్ ఇక్కడి నుంచే మొదలైంది. వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. ‘ఎఫ్ 2’కి దేవి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా గత సినిమాలు చూసి ఈ పాత్ర ఎవరూ నాకు ఇవ్వరేమో? కానీ అనిల్ చాలా ధైర్యం చేసి ఇచ్చాడు.. బాగానే చేశా. ఓ ఫ్రెండ్‌లా, మెంటర్‌లా వెంకటేశ్ సార్ నన్ను ప్రోత్సహించడంతో ఈ జర్నీ చాలా హ్యాపీగా సాగింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మా ఫన్, ఫ్రస్ట్రేషన్ వైజాగ్ బీచ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే ఈ కథ ఇక్కడే రాశాం. వెంకటేశ్‌గారితో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది. ఈ సినిమాతో వెంకీగారు మిమ్మల్ని టైమ్ మెషీన్లో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి’.. అక్కడికి తీసుకెళ్లిపోతారు. వరుణ్ తొలిసారి ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు మిమ్మల్ని నవ్విస్తాయి. దేవిశ్రీగారు ఆరు పాటలూ మంచివి ఇచ్చారు. జీవితంలో ఎన్ని ఉన్నా నవ్వులు లేకపోతే అదో వెలితి. సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి మా సినిమా చూడండి.. తప్పకుండా నవ్వుకుని బయటికెళతారు’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూస్తే మీలోని ఫ్రస్ట్రేషన్ వదిలేసి ఫన్‌తో ఇంటికెళతారు. వెంకటేశ్‌గారికి విక్టరీ అలవాటైపోయింది. మీరు చాలామందికి స్ఫూర్తి సార్. వరుణ్‌తో తొలిసారి చేస్తున్నా. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. అనిల్‌తో చాలా సరదాగా ఉంటుంది. ‘దిల్’ రాజుగారితో నా జర్నీ ఇంకా ఇంకా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ వేడుకలో పాటల రచయితలు కాసర్ల శ్యాం, శ్రీమణి, బాలాజీ, నటుడు ‘సత్యం’ రాజేశ్, నటి హరితేజ, లైన్ ప్రొడ్యూసర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
2018 పలు విజయాలు, ఘన విజయాలతో పాటు పలువురు తారలను ఒకింటివాళ్లను కూడా చేసింది. తమ టాలెంట్‌ను నిరూపించుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. ఈ వారం ఇయర్ ఎండింగ్ స్పెషల్ క్విజ్.... 1. 2018లో ఈ ప్రముఖ హీరో సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఎవరా హీరో కనుక్కోండి? ఎ) మహేశ్‌బాబు బి) రామ్‌చరణ్ సి) ప్రభాస్ డి) యన్టీఆర్ 2. 2018లో 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా? ఎ) భరత్ అనే నేను బి) రంగస్థలం సి) గీత గోవిందం డి) అరవింద సమేత వీర రాఘవ 3. ఈ సంవత్సరం విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రంలోని టాప్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం.. ఇంకేం కావాలే...’ అనే పాట పాడిన గాయకుడెవరో తెలుసా? ఎ) సిథ్ శ్రీరామ్ బి) కైలాష్ ఖేర్ సి) యాసిన్ నజార్ డి) శ్రీరామచంద్ర 4. ఈ సంవత్సరం ఎక్కువ తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) యస్.యస్. తమన్ సి) యం.యం. కీరవాణి డి) మిక్కీ జే మేయర్ 5. ‘ఆర్ఎక్స్–100’ చిత్రంతో హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటుని పేరేంటి? ఎ) తేజస్ కంచర్ల బి) కార్తి్తకేయ సి) కల్యాణ్ దేవ్ డి) వైష్ణవ్ తేజ్ 6. ఈ సంవత్సరం మూడు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన నటి ఎవరో కనిపెట్టండి? ఎ) సమంత బి) లావణ్యా త్రిపాఠి సి) రాశీ ఖన్నా డి) త్రిష 7. ఓ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ 2018లో దర్శకునిగా మారారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో అందరి మనసులూ దోచుకున్నారు. ఆయనెవరు? ఎ) అజయ్ భూపతి బి) రాహుల్ సంకృత్యాన్ సి) వెంకటేశ్ మహా డి) శశికిరణ్ తిక్క 8. 2018లో ఓ కన్నడ నటుడు తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించారు. ఆ సినిమా పేరు ‘కె.జీ.ఎఫ్’. ఈ కన్నడ నటుని పేరేంటి? ఎ) గణేశ్ బి) యష్ సి) పునీత్ రాజ్‌కుమార్ డి) దునియా విజయ్ 9. 2018లో అకాల మరణం పొందిన కన్నడ రెబెల్‌స్టార్ ఎవరో తెలుసా? ఎ) రాజ్‌కుమార్ బి) విష్ణువర్థన్ సి) అంబరీష్ డి) దృవ్ శర్మ 10. నటునిగా అంతకుముందు చాలా సినిమాల్లో నటించారు. 2018లో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో సోలో హీరోగా వచ్చిన ఆ నటుని పేరేంటి? ఎ) సత్యదేవ్ బి) శ్రీనివాసరెడ్డి సి) చైతన్య కృష్ణ డి) సత్యం రాజేశ్ 11. ఈ ఏడాది విడుదలైన ‘మహానటి’తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న దర్శకుడెవరు? ఎ) నాగ్అశ్విన్ బి) వెంకీ కుడుముల సి) పరశురాం డి) విక్రమ్.కె.కుమార్ 12. రజనీకాంత్, శంకర్ల విజువల్ వండర్ ‘2.ఓ’. ఆ విజువల్ వండర్‌కు పనిచేసిన కెమెరామెన్ ఎవరో తెలుసుకుందామా? ఎ) పి.సి. శ్రీరామ్ బి) కబీర్ లాల్ సి) నిరవ్ షా డి) కె.కె. సెంథిల్‌కుమార్ 13. ఈ ఏడాది మూడు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు కనిపించిన హీరో ఎవరో తెలుసా? (అందులో ఓ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంటరయ్యారా హీరో) ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగచైతన్య డి) అఖిల్ 14. ‘కలర్స్’ స్వాతి ఈ ఏడాది వివాహం చేసుకుంది. అతని పేరు వికాస్ వాసు. మరి స్వాతి భర్త ఏం చేస్తారో తెలుసా? ఎ) డాక్టర్ బి) యాక్టర్ సి) బిజినెస్‌మేన్ డి) పైలెట్ 15. ఈ సంవత్సరం బాలీవుడ్ నటీనటులు దీపికా, రణ్వీర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారు ఏ తేదీన వివాహం చేసుకున్నారో చెప్పుక్కోండి? (క్రింద ఇచ్చిన తేదీల్లో ఈ హీరోయిన్ మ్యారేజ్ డేట్‌తోపాటు ఈ ఏడాది పెళ్లయిన వేరే హీరోయిన్లవీ ఉన్నాయి) ఎ) డిసెంబర్ 1 బి) డిసెంబర్ 13 సి) నవంబర్ 14 డి) ఆగస్టు 30 16. బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా ఈ ఏడాది అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహమాడారు. ఆమెకంటే వయసులో అతను ఎంత చిన్నవాడో తెలుసా? ఎ) ఏడేళ్లు బి) పదేళ్లు సి) రెండేళ్లు డి) ఐదేళ్లు 17. ఈ ఏడాది ఒకే హీరోతో రెండు విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏది? ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) మైత్రీ మూవీ మేకర్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ 18. ‘రంగస్థలం’ చిత్రంలోని ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి...’ అనే ఐటమ్ సాంగ్‌లో మొదటిసారి నటించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) పూజా హెగ్డే డి) కియారా అద్వానీ 19. ‘దారి చూడు దుమ్ము చూడూ మామా...’ అనే పాటతో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారీయన. 2018లో సిల్వర్ స్క్రీన్‌పై తన రచనతో, యాసతో వెలుగులోకొచ్చిన ఈ రాయలసీమ రైటర్ ఎవరో కనుక్కోండి? ఎ) మేర్లపాక గాంధీ బి) పెంచల్ దాస్ సి) జి.ఆర్ మహర్షి డి) ప్రసన్నకుమార్ బెజవాడ 20. 2018లో తెలుగు తెరపై కనిపించని టాప్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) సాయిపల్లవి బి) నయనతార సి) రకుల్ ప్రీత్ సింగ్ డి) అనుపమా పరమేశ్వరన్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) బి 5) బి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) ఎ 11) ఎ 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) ఎ 18) సి 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
నాట్యలక్ష్మి
తమన్నా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే కచ్చితంగా తన డ్యాన్స్ గురించి ప్రస్తావించాల్సిందే. ‘రచ్చ’లోని ‘వానా వానా వెల్లువాయే...’, ‘బద్రినాథ్’లో ‘కళ్లు మూస్తే బద్రినాథ్...’ పాటలు అందుకు చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఏకంగా డ్యాన్సర్ పాత్ర అంటే.. తమన్నా స్టేజ్‌ని షేక్ చేసేస్తారని ఊహించవచ్చు. చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, తమన్నా కథానాయికలు. శుక్రవారం తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’ లోని ఆమె పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో లక్ష్మీ అనే నాట్యకళాకారిణి పాత్రను పోషిస్తున్నారట తమన్నా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది. దటీజ్ మహాలక్ష్మీ తమన్నా నటించిన మరో చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మీ’ టీజర్‌ను కూడా శుక్రవారం రిలీజ్ చేశారు. బాలీవుడ్ హిట్ చిత్రం ‘క్వీన్’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలవుతోంది. -
స్క్రీన్ టెస్ట్
సినిమా డైలాగ్ అనగానే యన్టీఆర్ నటించిన ‘దానవీర శూర కర్ణ’ చిత్రంలో ‘ఆచార్య దేవా’ ఏమంటివీ.. ఏమంటివీ ... అనే డైలాగ్ ఇప్పటికీ గుర్తొస్తుంది. 40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయంటే డైలాగ్‌కి ఉన్న పవర్ అది. 2018లో విడుదలైన చిత్రాల్లోని పలు ఫేమస్ డైలాగ్‌లు ఈ వారం క్విజ్.... 1. ‘‘ప్రతిభ ఇంటిపట్టునుంటే... ప్రపంచానికి పుట్టగతులుండవు’’ ఈ డైలాగ్ ‘మహానటి’ చిత్రంలోనిది. చిత్రంలో ఈ డైలాగ్ పలికిన నటుడెవరో తెలుసా? ఎ) మోహన్‌బాబు బి) ప్రకాశ్ రాజ్ సి) దుల్కర్ సల్మాన్ డి) నరేశ్ 2. ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్‌తో హల్చల్ చేసిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి. ఈ డైలాగ్ ఉన్న సినిమా 2019 ఆగస్టులో విడుదలవుతుంది? ఎ) మహేశ్‌బాబు బి) వెంకటేశ్ సి) ప్రభాస్ డి) రానా 3. ‘‘వయొలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మా మీద పడ్డ అత్యవసర పరిస్థితి...’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ:ఈ డైలాగ్ రైటర్ త్రివిక్రమ్) ఎ) యన్టీఆర్ బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేశ్ 4. ‘‘ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగావంటే.. యాసిడ్ పోసేస్తా’’ అనే ఫేమస్ డైలాగ్‌ను విజయ్ దేవరకొండతో చెప్పిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) ప్రియాంక జవాల్కర్ బి) మెహరీన్ సి) షాలినీ పాండే డి) రష్మికా మండన్నా 5. ‘‘క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావురాక ముందు చచ్చిపోవటమే’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ డైలాగ్‌ను రాసింది వక్కంతం వంశీ) ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) కల్యాణ్ రామ్ డి) అల్లు అర్జున్ 6. ‘‘యూనిఫామ్‌లో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు, యూనిఫామ్ తీసేస్తే దీనమ్మ రాయితో చంపుతానో, రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి? (ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకుడు) ఎ) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బి) రవితేజ సి) నాగచైతన్య డి) గోపీచంద్ 7. ‘‘ఆడోళ్లు భలే కఠినాత్ములు...’ ఈ డైలాగ్‌ను ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో హీరో నాని చెప్తాడు. ఈ డైలాగ్ రైటర్ ఎవరు? ఎ) వక్కంతం వంశీ బి) మేర్లపాక గాంధీ సి) పెంచల్ దాస్ డి) ఆకుల శివ 8. ‘వియ్ ఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ... ప్రతి ఒక్కరికీ బరువు, బాధ్యత ఉండాలి...’ అనే సోషల్ మెసేజ్ డైలాగ్ ఏ సినిమాలోనిదో కనిపెట్టండి? ఎ) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బి) భరత్ అనే నేను సి) టచ్ చేసి చూడు డి) కవచం 9. ‘చేపలకి కూడా కన్నీళ్లుంటాయి బాస్... నీళ్లల్లో ఉంటాం కదా కనిపించవు అంతే’ ఈ డైలాగ్‌ను హీరో నాని ‘అ!’ చిత్రంలోని చేప పాత్ర ద్వారా చెప్పారు. ఈ చిత్రంలో కృష్ణవేణి పాత్రలో నటించిన నటి ఎవరో కనిపెట్టండి? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) నిత్యామీనన్ డి) రెజీనా 10. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో హీరో నితిన్ చెప్పిన ‘‘వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని, వేసవికాలంలో విడిపోయాము’’ డైలాగ్ రాసిందెవరో తెలుసా?(ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఓ నిర్మాత) ఎ) చైతన్యకృష్ణ బి) సత్యానంద్ సి) త్రివిక్రమ్ డి) యం.రత్నం 11. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. ఈ చిత్రానికి మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) కోన వెంకట్ బి) అబ్బూరి రవి సి) నాగ్ అశ్విన్ డి) బుర్రా సాయిమాధవ్ 12. ‘‘సల్మాన్‌ఖాన్ జిందాబాద్, షారుక్æఖాన్ జిందాబాద్, ఆమిర్ ఖాన్ జిందాబాద్, అబ్దుల్ కలాం జిందాబాద్, ఇన్సాన్ జిందాబాద్, మొహబ్బత్ జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్’’ ఈ డైలాగ్ ‘మెహబూబా’ చిత్రంలోనిది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఆకాష్ పూరి. డైలాగ్ రైటర్ ఎవరో చెప్పుకోండి? ఎ) పూరి జగన్నాథ్ బి) భాస్కరభట్ల సి) కందికొండ డి) వనమాలి 13 ‘‘కాలేజీలో ఉన్న ప్రతివాడికి రాఖీ కడతా, వాడికి తప్ప... బికాజ్ ఐ లవ్ హిమ్’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా ఏ హీరో గురించి అంటుందో కనిపెట్టండి? ఎ) వరుణ్ తేజ్ బి) సాయిధరమ్ తేజ్ సి) సందీప్ కిషన్ డి) నాగౖచైతన్య 14. ‘‘ఏయ్ లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా అని హీరోయిన్ అంటే... ఆ మీకు తెలిసిపోయిందా. అయినా మీరు ఇలా దగ్గరికొచ్చి మాట్లాడటం ఏం బాలేదండి...’’ అని హీరో శర్వానంద్ ఏ హీరోయిన్ని ఉద్దేశించి అంటాడో కనుక్కోండి? ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) సాయి పల్లవి డి) నిత్యామీనన్ 15. ‘‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ, అబద్ధాలు చెబితే అమ్మాయిలు కచ్చితంగా పడతారు...’ ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్ బి) అఖిల్ సి) రాహుల్ రవీంద్రన్ డి) నవీన్ చంద్ర 16. ‘‘ఫణీంద్ర భూపతి నాయుడు.. నువ్వు భయపడాల్సింది మేకను చంపిన సింహాల గుంపును చూసి కాదు, సింహాల మందకు ఎదురు తిరిగిన మేక గురించి’’ అనే డైలాగ్ ‘రంగస్థలం’ చిత్రంలోనిది. ఫణీంద్ర నాయుడుగా నటించింది ఎవరు? ఎ) ఆది పినిశెట్టి బి) రాజీవ్ కనకాల సి) ‘జబర్దస్త్’ మహేశ్ డి) జగపతిబాబు 17. ‘‘అమ్మాయిలతో ప్రాబ్లమ్ ఇదేరా, మనం వాళ్లను చూసినా వాళ్లు మనల్ని చూసినా డిస్ట్రబ్ అయ్యేది మనమేరా’’ ఈ డైలాగ్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ప్రసన్నకుమార్ బెజవాడ బి) విజయేంద్ర ప్రసాద్ సి) పోసాని కృష్ణమురళి డి) వేగేశ్న సతీశ్ 18. ‘‘సినిమా, సాహిత్యం బతికే ఉంటాయి. అంతే.. అని నరేశ్ అంటే, సాహిత్యం అన్నావ్ ఓకే, సినిమా...’ అని సుధీర్‌బాబు అనే డైలాగ్ ‘సమ్మోహనం’ చిత్రం లోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) తనికెళ్ల భరణి సి) శ్రీనివాస్ అవసరాల డి) జనార ్ధన మహర్షి 19. ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా’’ అనే డైలాగ్ ‘భాగమతి ’ చిత్రంలోనిది. అనుష్క టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) యూవీ క్రియేషన్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ 20. ‘‘నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’’ అనే డైలాగ్ ‘నేలటిక్కెట్టు’ చిత్రంలో హీరో రవితేజ చెబుతారు. ఈ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) వీఐ ఆనంద్ బి) కల్యాణ్ కృష్ణ సి) వీవీ వినాయక్ డి) శ్రీను వైట్ల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి )2) సి 3) ఎ 4) డి 5) డి 6) బి 7) బి 8) బి9) సి 10) ఎ 11) డి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) డి 17) డి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
స్క్రీన్ టెస్ట్
పదే పదే వినాలనిపించే పాట ఏ సినిమాకైనా ప్లస్ అవుతుంది. ఆడియో రిలీజయ్యాక ఆ పాట విని, సినిమా చూడటం కోసం థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. ఇలాంటి పసందైన పాటలు సంగీత దర్శకులు, పాట రాసినవారు, పాడిన వారు, నటించిన వారు, ఎంతోమంది సాంకేతిక నిపుణుల కృషి ఫలితమే. 2018లో బాగా విసిపించిన ఇలాంటి క్రేజీ సాంగ్స్ గురించి ఈ వారం క్విజ్. పాడుకుంటూ చదవండి. 1 ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...’ పాటలో హీరో విజయ్ దేవరకొండతో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) రష్మికా మండన్నా బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) లావణ్యా త్రిపాఠి డి) నివేథా థామస్ 2 రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్రంలోని హై వోల్టేజి సాంగ్ ‘జిల్ జిల్ జిల్ జిల్...జిగేలు రాణి...’లో నటించిన ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) కియరా అద్వానీ బి) తమన్నా భాటియా సి) పూజా హెగ్డే డి) శ్రుతీహాసన్ 3 ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని మెలోడియస్ సాంగ్ ‘పెనివిటి...’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సిరివెన్నెల బి) శ్రీమణి సి) అనంత శ్రీరామ్ డి) రామజోగయ్య శాస్త్రి 4 ‘భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను..’ పాట ‘భరత్ అనే నేను’ చిత్రం లోనిది. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) గోపి సుందర్ సి) యం.యం. కీరవాణి డి) తమన్ 5 ‘దారి చూడు దుమ్ము చూడు మామా, దున్నపోతుల మేరే చూడు...’ పాట నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోనిది. ఆ పాట రచయిత, గాయకుడు ఎవరో తెలుసా? ఎ) పెంచల్ దాస్ బి) రేలా కుమార్ సి) శివనాగులు డి) వరంగల్ శ్రీను 6 ‘వారు వీరు అంతా చూస్తూ ఉన్న...’ పాట నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలోనిది. ఆ పాటలోని మేల్ వాయిస్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మరి లేడీ వాయిస్ ఎవరిదో తెలుసా? ఎ) గీతా మా«ధురి బి) సునీత సి) అంజనా సౌమ్య డి) రమ్య బెహరా 7 ఆర్. నారాయణమూర్తి నటించి, దర్శక నిర్మాతగా చేసిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రంలోని ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేన వేల వందనాలమ్మ ...’ పాట గాయకుడు ఎవరు? ఎ) వందేమాతరం శ్రీనివాస్ బి) గద్దర్ సి) వంగపండు డి) గోరేటి వెంకన్న 8 1993లో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది...లగ్గాయత్తు..’ సాంగ్ సూపర్ హిట్. ఆ పాటను ‘సవ్యసాచి’ చిత్రం కోసం సంగీత దర్శకుడు యం. యం. కీరవాణి రీమిక్స్ చేశారు. హీరో నాగచైతన్య సరసన ఈ పాటలో నటించిన నూతన నటి ఎవరో తెలుసా? ఎ) పాయల్ రాజ్‌పుత్ బి) నిధీ అగర్వాల్ సి) నభా నటేశ్ డి) ప్రియాంక జవాల్కర్ 9 సుధీర్ బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రంలోని ‘ఓ చెలి తార... నా మనసారా...’ పాట సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) వివేక్ సాగర్ బి) చైతన్య భరద్వాజ్ సి) సాగర్ మహతి డి) ప్రశాంత్ విహారి 10 ‘పిచ్చి పిచ్చిగా నచ్చావురా.. మనోహరా...’ అంటూ ‘నర్తనశాల’ చిత్రంలోని విరహగీతాన్ని ఆలపించిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) లిప్సికా బి) మోహన భోగరాజు సి) సమీరా భరద్వాజ్ డి) దామిని బాట్ల 11 ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, కాళిదాస ప్రేమ కావ్యమా, త్యాగరాజు సంగీతమా... గీతమా’ పాట పాడిన ప్రముఖ గాయని ఎవరో తెలుసా? ఎ) శ్రేయా ఘోషల్ బి) మానసి సి) కల్పన డి) కౌసల్య 12 ‘బయటికొచ్చి చూస్తే టైమేమో... త్రీ ఓ క్లాక్.. ఇంటికెళ్లే 12బి రూటు మొత్తం రోడ్డు బ్లాక్..’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) సంతోశ్ నారాయణ్ బి) యువన్ శంకర్‌రాజా సి) హిప్ హాప్ తమిళ డి) అనిరు«ద్ రవిచంద్రన్ 13 ‘రంగస్థలం’ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్. ఆ సినిమాకి సింగిల్ కార్డు రైటర్‌గా సాహిత్యాన్ని అందించిన రచయితెవరు? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) చంద్రబోస్ సి) భువనచంద్ర డి) అనంత శ్రీరామ్ 14 ‘అయామే లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో...’ అంటూ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) విజయ్ దేవరకొండ 15 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మెహబూబా’. ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఓ ప్రియా... నా ప్రియా.. మెహబూబా...’ రచయితెవరో తెలుసా? ఎ) సుద్ధాల అశోక్‌తేజ బి) పూరి జగన్నాథ్ సి) భాస్కరభట్ల రవికుమార్ డి) కందికొండ 16 ‘చూసి చూడంగానే నచ్చేశావే, అడిగి అడగంగానే వచ్చేశావే...’ పాట ‘ఛలో’ చిత్రంలోనిది. ఆ చిత్రంతోనే దర్శకునిగా అరంగేట్రం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) అజయ్ భూపతి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) వెంకటేశ్ మహా 17 ‘మహానటి’ చిత్రంలోని ‘చివరకు మిగిలేది...’ అనే పాటను ‘సిరివెన్నెల’ రచించారు. ఆ పాటను ఆలపించిన గాయని ఎవరో కనుక్కోండి? ఎ) చిన్మయ్ శ్రీపాద బి) సునీత ఉపద్రష్ట సి) చిత్ర డి) యస్పీ శైలజ 18 2018లో సూపర్‌హిట్ అయిన ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి..’, ‘మాటే వినదుగ, వినదుగ..’, ‘ఉండి పోరాదే గుండెల్లోన’, ‘యంతరలోకపు సుందరివో..’ పాటలను పాడిందెవరు? ఎ) సిథ్ శ్రీరామ్ బి) రేవంత్ సి) కార్తీక్ డి) కైలాశ్ ఖేర్ 19 2018లో విడుదలైన చిత్రాల్లో ఒక్క పాట కూడా లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమేంటో కనుక్కోండి? (థీమ్ సాంగ్ మాత్రం ఉంది). ఎ) గూఢచారి బి) కేరాఫ్ కంచరపాలెం సి) అ! డి) ఈ నగరానికి ఏమైంది 20 ఈ ఏడాది చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమవుతున్న బాలీవుడ్ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) శంకర్ ఎహసాన్ లాయ్ బి) అమిత్ త్రివేది సి) హిమేశ్ సేషమ్మియా డి) విశాల్ భరద్వాజ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ2) సి 3) డి 4) ఎ 5) ఎ 6) సి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) ఎ 12) డి 13) బి 14) బి 15) సి 16) బి 17) బి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
డైరెక్షన్ మారుతోంది
టాలీవుడ్‌కి దిగుమతి జోరు పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్లు, విలన్లు ఇక్కడ హల్చల్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కూడా వస్తున్నారు. ఈ ఏడాది డైరెక్టర్లు కూడా వచ్చారు. గతంలోనూ పరభాషల దర్శకులు తెలుగు సినిమాలు చేశారు కదా? అనుకోవచ్చు. అయితే ఒకే ఏడాదిలో నలుగురైదుగురు వేరే భాషల దర్శకులు వచ్చిన దాఖలాలు తక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకూ ముగ్గురు నలు గురు పరభాష దర్శకులు వస్తే వచ్చే ఏడాది కూడా ఆ నంబర్ కంటిన్యూ కానుంది. చెప్పాలంటే ఎక్కువ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. సొంత భాష నుంచి పరభాషకు డైరె క్షన్ మార్చుతున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం... అట్లీ ఖాయం ‘రాజా రాణి, తేరి (తెలుగులో పోలీసోడు) మెర్సెల్ (తెలుగులో అదిరింది) చిత్రాలు సూపర్ హిట్. ఈ మూడు హిట్స్‌తో తమిళ దర్శకుడు అట్లీ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడీయన మళ్లీ విజయ్‌తోనే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన ‘మెర్సెల్’ బంపర్ హిట్ కాబట్టి తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వచ్చే ఏడాది అట్లీ మన తెలుగు ఇండస్ట్రీకి వస్తారు. ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని టాక్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ మధ్య ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. అట్లీతో కూడా ఓ సినిమా ఉందన్నారాయన. దీంతో ఎన్టీఆర్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్ ఒక కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా వచ్చే ఏడాది చివరికి ఓ కొలిక్కి వస్తుంది కాబట్టి 2020 స్టార్టింగ్‌లో ఎన్టీఆర్–అట్లీ–అశ్వనీదత్ సినిమా స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ సినిమాకి అట్లీ దర్శకుడు కాకపోతే ఎలానూ నిర్మాత అశ్వనీదత్ ఈ దర్శకుడితో ఓ సినిమా అన్నారు కాబట్టి అట్లీ రావడం ఖాయం. కోలీ అర్జున్ హీరో అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. త్రివిక్రమ్, విక్రమ్ కె. కుమార్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకా అధికారికంగా ఏ దర్శకుడి పేరు ఫిక్స్ కాలేదు. అయితే తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తమిళంలో ‘వేదాలం, వీరమ్, వివేగమ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఇటీవల కొన్ని గాసిప్‌లు వినిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రానికి లింగుస్వామి దర్శకుడని చెప్పలేం కానీ ఫ్యూచర్లో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఇక్కడ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేరళలో అల్లు అర్జున్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. మల్లూ అర్జున్ అంటారు. ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడితో చేసి, ‘కోలీ అర్జున్’ అని కూడా అనిపించుకుంటారేమో. రానా రౌండప్ ‘బాహుబలి’ సినిమా తర్వాత రానా క్రేజ్ డబుల్ ట్రిపుల్ అయ్యింది. అందుకే పరభాష డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్ సత్యశివ, ప్రభు సాల్మన్ దర్శకత్వాల్లో రూపొందుతున్న ‘మడైతిరందు, కాడన్’ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు రానా. మలయాళ దర్శకుడు కె.మధు దర్శకత్వంలో ఆయన హీరోగా ‘అంజామ్ తిరునాళ్ మార్తాండ వర్మ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో రూపొందిన ‘హౌస్‌ఫుల్ 4 సినిమాలో రానా ఓ కీ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా అన్ని ఇండస్ట్రీల సినిమాలతో రానా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. ఇలా అన్ని భాషల దర్శకులు రానాని రౌండప్ చేస్తున్నారు. అన్నట్లు రానా పరభాషల్లో నటిస్తున్న చిత్రాల్లో ఏకకాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్నవి ఉన్నాయి. ఆ రకంగా ఆ దర్శకులు మన భాషకు వస్తున్నట్లే కదా. కోలీ అసోసియేట్.. టాలీలో డైరెక్టర్ ఈ ఏడాది జూలైలో విడుదలైన ‘పంతం’ సినిమాతో పాతిక చిత్రాలను కంప్లీట్ చేశారు గోపీచంద్. ఇప్పుడాయన నెక్ట్స్ సినిమాను బిన్ను సుబ్రహ్మణ్యం అనే కొత్త తమిళ దర్శకుడు తెరకెక్కించనున్నారని సమాచారం. కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు మోహన్‌రాజా (‘తని ఒరువన్’ మూవీ ఫేమ్) దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేశారట బిన్ను సుబ్రహ్మణ్యం. దర్శకుడిగా తొలి అడుగుని తెలుగులో వేయనున్నారన్న మాట. తెలుగులో ముద్ర కోసం... స్టెప్ బై స్టెప్ కెరీర్లో ఎదుగుతున్నారు హీరో నిఖిల్. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ముద్ర’. తమిళంలో రూపొందిన ‘కణిదన్’ చిత్రానికిది రీమేక్. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి హాయ్ చెప్పనున్నారు. తెలుగులో తనదైన ముద్ర వేసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ వచ్చేశారహో గతంలో పలువురు పరభాషల దర్శకులు తెలుగు తెరపై సినిమా చూపించారు. కె. బాలచందర్, పి. వాసు, సురేష్‌కృష్ణ, ఉదయ్‌కుమార్, కె.యస్. రవికుమార్, కరుణాకరన్, రాధామోహన్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, వంటి దర్శకులు తెలుగులో సినిమాలు తెరకెక్కించారు. ఆ తర్వాత మురుగదాస్, రీసెంట్ టైమ్స్‌లో ‘ఇష్క్, మనం, 24’ సినిమాలతో విక్రమ్ కె.కుమార్ టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇక ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయ్యారు. రానా, విజయ్ దేవరకొండ, నిఖిల్, ఎన్టీఆర్ దీంతో కోలీవుడ్ నుంచి కబురొచ్చింది విజయ్‌కి. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘నోటా’ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చాయనే టాక్ కూడా వినిపించినప్పటీకీ ఆ వెంటనే ‘టాక్సీవాలా’ సక్సెస్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు విజయ్. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక టాలీవుడ్లో సమంతకు ఎంత పాపులారిటీ ఉందో కోలీవుడ్‌లోనూ దాదాపు అంతే ఉంది. ఈ ఏడాది ఆమె ‘యు–టర్న్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా పవన్ కుమార్ అనే కన్నడ దర్శకుడు టాలీవుడ్‌కి వచ్చారు. కన్నడ ‘యు–టర్న్’ను సేమ్ టైటిల్‌తో తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ‘హమ్‌తుమ్, ఫనా, ఫిర్ సే’ వంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు దర్శకుడు కునాల్ కోహ్లీ. ప్రజెంట్ థియేటర్స్‌లో ఆడుతున్న ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాకు ఆయనే దర్శకుడు. ఇలా మరికొంతమంది పరభాష దర్శకులు తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్. తెలుగు ఇండస్ట్రీది విశాల హృదయం. ఎవరు వచ్చినా అవకాశం ఇచ్చేస్తుంది. అందుకనే మన భాషలో పరభాషల హీరోయిన్లు, విలన్లు, ఇప్పుడు దర్శకుల జోరు కూడా మొదలైంది. కొందరు ఏకకాలంలో ద్విభాషా చిత్రాలు చేస్తూ.. ఆ విధంగా సొంత భాషకు దగ్గరగా ఉంటూనే పరభాషకు కూడా దగ్గరవుతున్నారు. -
ప్రత్యేక అతిథి
‘క్షణం, గాయత్రి, రంగస్థలం’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి అనసూయ. ఇప్పుడు ఆమె ‘ఎఫ్ 2’ చిత్రంలో ఓ అతిథి పాత్ర పోషించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మోహరీన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. ‘‘ఎఫ్ 2’ చిత్రంలో అనసూయ అతిథి పాత్ర చేశారు. అలాగే ఓ సాంగ్‌లో కూడా కనిపిస్తారు’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అనిల్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు అనసూయ. -
మైసూరు పోదాము
సూపర్ క్లైమాక్స్ కోసం జార్జియాకు వెళ్లొచ్చారు ‘సైరా’ టీమ్. రీసెంట్గా హైదరాబాద్‌లో షూటింగ్ చేశారు. త్వరలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం మైసూర్‌కు మకాం మార్చాలని ‘సైరా’ టీమ్ భావిస్తోందని సమాచారం. అక్కడ సెట్ వర్క్ డిజైన్స్ కూడా పూర్తయ్యాయట. అది మాత్రమే కాదు.. ఫేమస్ మైసూర్ ప్యాలెస్‌లోనూ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. టైటిల్ రోల్లో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మైసూర్లో స్టార్ట్ కానుందని సమాచారం. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఓ సాంగ్ షూట్ కూడా ఉంటుందట. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది స్వరకర్త. ‘సైరా’ చిత్రం వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తెలియజేయునది ఏమనగా..!
‘‘ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. ఈ నెల 12న మా చిత్రం ‘ఎఫ్ 2’టీజర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని వచ్చే ఏడాది వెండితెర సంక్రాంతి అల్లుళ్లు వెంకటేశ్, వరుణ్ తేజ్ గురువారం చాటింపు వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ఇందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. త్వరలోనే ఈ సాంగ్‌ను కూడా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్లో వస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ ‘ఎఫ్ 2’. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. త్వరలో పాటలను విడుదల చేసి, సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. -
మంచి ప్రయత్నం చేశాం
‘‘నిర్మాత అక్షయ్ పూరి చాలా పాజిటివ్ పర్సన్. సినిమాను గ్రాండ్‌గా నిర్మించడమే కాదు.. మంచి బిజినెస్ కూడా చేసుకున్నారు. కునాల్ కోహ్లి డైరెక్ట్ చేసిన ‘హమ్ తుమ్, ఫనా’ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో తమన్నాతో కలిసి ‘నెక్ట్స్ ఏంటి’ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ముఖ్య తారలుగా కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నిజాయతీగా చేసిన ప్రయత్నం ‘నెక్ట్స్ ఏంటి’. సినిమాను బాగా తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సాంగ్స్, ట్రైలర్ చూసిన తర్వాత కునాల్గారు తనదైన స్టయిల్లో సినిమాను ఎంత బాగా తెరకెక్కించారనే విషయం అర్థమవుతోంది’’ అన్నారు అక్షయ్ పూరి. ‘‘ఈ సినిమాపై పడ్డ ట్యాగ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి, మంచి సినిమాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. లియోన్ మంచి సంగీతం అందించారు. సందీప్, నవదీప్ చాలా కూల్ కోస్టార్స్’’ అని తమన్నా అన్నారు. ‘‘మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు రైనా జోషి. ‘‘మా చిత్రం పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ లియోన్. ఈ చిత్రానికి కెమెరా: మనీష్ చంద్ర భట్, అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల, రిలీజ్: శ్రీ కృష్ణ క్రియేషన్స్. -
వయసులో వెనక్కి వెళ్తున్నా
‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నింట్లో నా వయసు కంటే పెద్ద పాత్రలే చేశాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు చేసింది తక్కువ. ‘హ్యాపీడేస్,‘100% లవ్’ లో చేసినవి నా పాత్రకి దగ్గరగా ఉన్నాయి. మళ్లీ ‘నెక్ట్స్ ఏంటి?’ సినిమాలో అలాంటి పాత్రే చేశాను’’ అని తమన్నా అన్నారు. సందీప్ కిషన్, తమన్నా, నవదీప్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం‘నెక్ట్స్ ఏంటి?’. ఈ చిత్రంతో బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. రైనా జోషీ, అక్షయ్ పూరి నిర్మాతలు. ఈ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తమన్నా చెప్పిన సంగతులు... ► ‘నెక్ట్స్ ఏంటి?’ స్క్రిప్ట్ వినగానే ఎగై్జట్ అయ్యాను. గత రెండేళ్ల నుంచి తెలుగు సినిమాల్లో మార్చు వచ్చింది. కొత్త కథలు చేయడంలో, ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో మా ర్పు కనిపిస్తోంది. దానికి బాక్సాఫీస్ సక్సెసే సాక్ష్యం. ► ‘నెక్ట్స్ ఏంటి?’ కథ అంతా లండన్‌లో జరుగుతుంది. చాలా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా ముఖ్యంగా ట్యాగ్స్ గురించి మాట్లాడుతుంది. అమ్మాయి డీసెంట్‌గా డ్రెస్ చేసుకుంటే ఒక ట్యాగ్, ట్రెండీగా ఉంటే మరో ట్యాగ్ ఇస్తాం. ఈ ట్యాగ్లు ఎందుకివ్వాలి? అమ్మాయి చాలా చిన్న నుంచి పెద్ద నిర్ణయాల వరకూ అన్నీ తన సొంతంగానే తీసుకోవాలి. అదే మా సినిమాలో చూపిస్తున్నాం. ► సందీప్, నవదీప్ మంచి సహకారం అందించారు. నవదీప్ తన వయసు కంటే పెద్ద పాత్ర చేస్తున్నాడు. శరత్బాబుగారిది నా తండ్రి పాత్ర. ► ఈ సినిమా అమ్మాయి కోణంలో జరుగుతుంది. అలా అని ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అనే ట్యాగ్ వేయను. ► ఈ కంటెంట్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. లవ్, సెక్స్ అన్నింటి గురించి ఓపెన్‌గానే మాట్లాడాం. కునాల్‌కి తెలుగు సినిమా కొత్త కావచ్చు. కానీ, ఆయన కొత దర్శకుడిలాగానే ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్నారు. ► ఒక పని చేసేటప్పుడే అది పూర్తి కాకముందే నెక్ట్స్ ఏంటి? అంటుంటాం. ఉన్న మూమెంట్‌ని ఆస్వాదించం. ఆ ఉద్దేశంతోనే ఈ టైటిల్ ఫిక్స్ చేశాం. గుండె ను బరువు చేసే, ఏడిపించే పాత్రలు నాకు నచ్చవు. నేను ఇండస్ట్రీకి వచ్చింది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి, హ్యాపీగా ఉంచడానికి. ► ఈ ఏడాది ఎక్కువగా షూటింగ్స్‌తో గడిపాను. అందుకే తక్కువ రిలీజ్లు ఉన్నాయి. తమన్నా తక్కువ సినిమాలు చేస్తోంది అని రాస్తుంటారు. వాళ్లు అలా రాసినప్పుడే నేను ఎక్కువ సినిమాలకు కమిట్ అయ్యుంటాను. మీరు అలానే రాయండి. నేను ఎక్కువ సినిమాలు చేస్తుంటాను (నవ్వుతూ). ► ప్రస్తుతం నేను నటిస్తున్న ‘ఎఫ్ 2’ పూర్తి కావచ్చింది. ‘సైరా’ లో నా పాత్ర షూటింగ్ ఇంకా ఉంది. ‘దటీజ్ మహాలక్ష్మి’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ► టాప్ హీరోలతో పనిచేశా. యంగ్ హీరోలతోనూ చేస్తున్నాను. వయసు విషయంలో నాది రివర్స్ జరుగుతుంటుంది అనుకుంటున్నాను. ‘క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజామిని’ అనే హాలీవుడ్ సినిమాలో హీరోలా. వయసు పెరిగేకొద్దీ చిన్నగా అయిపోతాను అనుకుంటాను(నవ్వుతూ). -
మదరాసులో మకాం
నరసింహారెడ్డి తన సైన్యంతో తమిళనాడు బయలుదేరారు. 18 రోజుల పాటు అక్కడే మకాం అట. స్వాతంత్య్ర ఉద్యమంలో ఏదైనా రహస్య సమావేశాల కోసమా? యుద్ధం తాలూకా వ్యూహ రచనలా? ప్రస్తుతానికైతే సస్పెన్స్. వచ్చే ఏడాది థియేటర్స్‌లో వీక్షించడమే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ న రసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ డిసెంబర్ 3న తమిళనాడులో ప్రారంభం కానుంది. హొగెనక్కల్ జలపాతం వద్ద ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ఈ షెడ్యూల్ సుమారు 18 రోజుల పాటు సాగనుంది. చిత్ర తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారట. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో ఈ సినిమా సుమారు 60 శాతంపైగా పూర్తయిందని టాక్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
ఓన్లీ ఫన్
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్... వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం సెట్స్‌లో నో ఫ్రస్ట్రేషన్. ఓన్లీ ఫన్. ఎందుకంటే అనిల్ రావిపూడి బర్త్‌డే. ఈ సందర్భంగా అనిల్ కేక్ కోశాక.. చిత్ర కథానాయికలు తమన్నా, మెహరీన్‌లు ఇలా కేక్ పూసి, ఫన్ చేశారు. అన్నట్లు సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఏం చేశానని?
మనలో కొందరం ఎప్పుడూ ఒకే ప్రశ్నను పదే పదే అనుకుంటాం. అది ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్న. తమన్నాను దాదాపు పదేళ్లుగా అలాంటి ఓ ప్రశ్న వెంటాడుతోంది. ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా దాని గురించి అనుకుంటున్నారట. ‘ఏం చేశానని..?’ అన్నది ఆ ప్రశ్న. ఇంతకీ తమన్నా ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే? లక్షలాది మంది అభిమానులను చూసి, ఇలా తనని తాను ప్రశ్నించుకుంటున్నారట. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడానికి జీవితంలో నేను ఏం చేశానని..? యాక్టింగ్ అనేది నా జాబ్. ఈ జాబ్ ఇంతమంది ప్రేమను ఇస్తుందంటే.. నేను వాళ్ల కోసం ఏం చేశానని? నాకైతే ఇది మిస్టరీలా అనిపిస్తోంది. ఎందుకంటే అందరిలా నేను కూడా మనిషినే కదా. ఒక మనిషి ఇంతమంది ‘అటెన్షన్’ని సాధించడం ఏంటి? అందుకే నేను అభిమానులకు రుణపడి పోయా. నన్ను అభిమానించేవాళ్లందర్నీ కలవాలంటే ఈ జీవితం మొత్తం సరిపోదు. కానీ, జీవితాంతం మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు లేనిది నేను లేను’’ అంటున్నారు తమన్నా. ఇంతకీ ‘నేనేం చేశానని?’ తమన్నా అనుకుంటున్నారు కానీ సిల్వర్ స్క్రీన్‌పై మెరుస్తున్న ఈ మెరుపు తీగను చూస్తే అదో హాయి. అది చాలదా ఫ్యాన్స్‌కి. -
తెలుగు సినిమా మారుతోంది
రోజు వారి జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకున్న ఒక్కో పని అయిపోగానే ‘నెక్ట్స్ ఏంటి’ అనుకుంటాం. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంది. తమన్నా, సందీప్ కిషన్‌లు నాయికా, నాయకులుగా నవదీప్, పూనమ్ కౌర్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వం వహించారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మాతలుగా వ్యవ హరించిన ఈ చిత్రానికి లియోన్ జోన్స్ సంగీతాన్ని అందించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు కునాల్ కోహ్లీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను మొదట నేను శరత్‌బాబుగారికి పంపాను. ఆయన ఎంతో థ్రిల్ ఫీలయ్యి నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. శరత్‌బాబుగారు, తమన్నా తండ్రీకూతుళ్లలా నటించారు. ఈ పాత్రల మధ్య సీన్స్ చాలా బావుంటాయి. భారతదేశ సంప్రదాయాన్ని తెలిపే చిత్రం ఇది. సినిమాకి భాష ఇబ్బంది కాదు, కంటెంట్ బావుంటే ఏ భాషలోనైనా ఆడుతుంది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘తమన్నా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆమె డబ్బింగ్ బావుంది. సినిమా ట్రైలర్లో ఉన్న కంటెంట్ వేరు.. సినిమాలో ఉన్న ఫీల్ వేరు. యూత్‌ని ఆకట్టుకోవటానికి ట్రైలర్‌ను అలా కట్ చేశారు’’ అని చెప్పారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ కునాల్ దర్శకుడు అనగానే హిందీ సినిమా అనుకున్నాను. తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని. కథ వినగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మ్యూజిక్ చాలా బావుంది. నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్‌లో నాకు బాగా నచ్చిన నిర్మాత కిరణ్‌గారు.. ఆ తర్వాత అక్షయ్‌గారు. తమన్నాతో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియన్స్’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా రోజు రోజుకు మారుతోంది. తెలుగు సినిమాలు భారతదేశం మొత్తం తెలిసిపోతున్నాయి. నేను ముంబైలో పుట్టినా తెలుగు సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. దర్శకుడు కునాల్గారికి తెలుగు ఇండస్ట్రీకి బిగ్ వెల్ కమ్ చెబుతున్నా. ఈ చిత్రంలో నా కేరక్టర్ నేనే ప్లే చేశానా అనిపించింది. డిసెంబర్లో సినిమా విడుదలవుతుంది, అందరూ ఆదరించాలి’’ అన్నారు. -
ప్లే బాయ్‌గా సందీప్.. గ్లామరస్‌గా తమన్నా
అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం.. ప్రేమించుకోవడం.. విడిపోవడం.. ‘నెక్ట్స్ ఏంటి?’. వారిద్దరి మధ్య నడిచింది ప్రేమనా, రొమాన్సా లేక కామమా ఎవరికి తెలుసు. ఈ అంశంతోనే బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి తెలుగులో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సందీప్ కిషన్, తమన్నా జంటగా, నవదీప్, పూనమ్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. వరస ఫ్లాఫ్లతో సతమతమవుతున్న సందీప్ కిషన్ ఈ చిత్రంలో ప్లే బాయ్ రోల్ పోషిస్తుండగా, మిల్క్ బ్యూటీ తమన్నా మరోసారి గ్లామరస్ రోల్‌తో ఆకట్టుకుంది. నవదీప్ ఏజ్డ్ రోల్లో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ‘ఫనా, హమ్ తుమ్’ వంటి బాలీవుడ్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కునాల్ కోహ్లి సందీప్ కిషన్‌కు హిట్ అందిస్తాడని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. -
రై.. రై... రైఫిల్
వీలైనంత తొందరగా షూటింగ్‌ను పూర్తి చేయాలని ‘సైరా’ టీమ్ భావిస్తున్నట్లుంది. ఇటీవల జార్జియాలో క్లైమాక్స్‌ను కంప్లీట్ చేసిన ‘సైరా’ టీమ్ పెద్ద గ్యాప్ తీసుకోకుండానే తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చిరంజీవి రైఫిల్ షూట్ నేర్చుకుంటున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్లో రేపటి నుంచి నయనతార పాల్గొంటారని సమాచారం. అలాగే ఈ నెల 15న తమన్నా సెట్లో జాయిన్ అవుతారని వినికిడి. మరి సినిమాలో నయనతార, తమన్నా కాంబినేషన్ సీన్స్ ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుందని టాక్. -
తర్వాత ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన దర్శకులు బాలీవుడ్ వెళ్లడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ ఛేంజ్.. బాలీవుడ్లో తన ప్రతిభ నిరూపించుకున్న డైరెక్టర్ కునాల్ కోహ్లి తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చారు. ‘ఫనా, హమ్ తుమ్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు. సందీప్ కిషన్, తమన్నా జంటగా కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. నవదీప్, పూనమ్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లండన్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఫస్ట్ లుక్, టీజర్‌ని త్వరలో విడుదల చేయనున్నారు. డిసెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. శరత్ బాబు, లారిస్సా నటించిన ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: మనీష్ చంద్రభట్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: సతీష్ సాల్వి, సంజన చోప్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల. -
రెండోసారి
మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నాకి రెండోసారి జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘పందెం కోడి 2’ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రం ‘అయోగ్య’. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ ఇది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం తర్వాత సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విశాల్. ఇందులో ఆయనకి జోడీగా తమన్నాని తీసుకున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విశాల్–తమన్నా రెండేళ్ల క్రితం ‘కత్తి సండై’(తెలుగులో ‘ఒక్కడొచ్చాడు) చిత్రంలో నటించి, ప్రేక్షకులను అలరించారు. తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో మొదలు కానుంది. -
సంక్రాంతికి అల్లుళ్లు వస్తున్నారు
సంక్రాంతి పండగంటే కొత్త అల్లుళ్లు ఇంటికి రావడం సంప్రదాయం. సినీ అల్లుళ్లు ‘వెంకటేశ్, వరుణ్’ కూడా సంక్రాంతికి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అయ్యారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. చిత్రనిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా సంస్థలో వస్తోన్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్. కమర్షియల్ హంగులతో పర్ఫెక్ట్ లాఫ్టర్ రైడ్‌లాంటి చిత్రం. మూడు హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తోన్న చిత్రం. ఇప్పటి వరకూ 80శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. సంక్రాంతికి విడుదలకి ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
ఆట పాట
ఇటీవల జార్జియాలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు ‘సైరా’ టీమ్. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లోనే నయనతార, తమన్నా పాల్గొంటారు. చిరంజీవి, నయనతార, తమన్నాలపై కొన్ని కీలక సన్నివేశాలతోపాటుగా పాటలను కూడా చిత్రీకరించనున్నారట. ఆల్రెడీ యాభైశాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని వినికిడి. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
కూలీలుగా..!
సరదాగా ‘ఎఫ్ 2’ సినిమా కోసం కూలీలుగా మారారట వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కి జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు కూలీ బ్యాడ్జ్‌లు కట్టుకున్న ఒక ఫొటోను ట్వీటర్లో పోస్ట్ చేశారు అనిల్ రావిపూడి. ఇన్సెట్లో ఉన్న ఫొటో అదే. ఒక బ్యాడ్జ్‌పై ‘కూలీ నెం 1’ అని, మరో బ్యాడ్జ్ పై ‘కూలీ 786’ అని ఉంది. దీంతో ‘కూలీ నెం.1’ వెంకటేశ్ సినిమా కాబట్టి ఆ బ్యాడ్జ్ ఉన్న హ్యాండ్ వెంకీది అని, ‘ఖైదీ నంబర్ 786’ చిరంజీవి సినిమా కాబట్టి ఆ హ్యాండ్ వరుణ్ తేజ్‌ది అని ఊహలు మొదలయ్యాయి. ఏ సీన్ కోసం వెంకీ, వరుణ్ కూలీలుగా మారారు? అన్నదే సస్పెన్స్. ఇందులో ఈ ఇద్దరూ ఫుల్ లెంగ్త్ కూలీలు కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సందడే సందడి
‘ఎఫ్ 2’ బ్యాచ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో హంగామా చేస్తున్నారు. మొన్నామధ్యే కదా బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చారు అంటే.. అవును.. కానీ, తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం మళ్లీ అక్కడికే వెళ్లారు. ‘ఎఫ్ 2’ బ్యాచ్ బ్యాంకాక్‌లో చేసిన సందడి ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉప శీర్షిక. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ షెడ్యూల్ నవంబర్ 5 వరకు జరగనుందని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరగబోయే 15 రోజుల చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుందని సమాచారం. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
మరో టూర్‌కి సిద్ధం
ప్రాగ్ వెళ్లి వచ్చిన తోడల్లుళ్లు తర్వాత ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అయ్యారు. మరి ఈసారి డ్యూయెట్ పాడతారో ఏదైనా ముఖ్యమైన సన్నివేశాల కోసమో అన్నది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరగనుందన్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తవుతుందని టాక్. ఆ తర్వాత లాస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారట. మొత్తం షూటింగ్‌ను నవంబర్ నెలలో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కా చెల్లెళ్లుగా కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
8 నిమిషాలు 60 కోట్లు!
సన్నివేశాల ప్రాముఖ్యతను బట్టి కొన్ని సార్లు భారీగా ఖర్చు పెడుతుంటారు. ‘సైరా: నర సింహా రెడ్డి’ క్లైమాక్స్ భాగానికి కూడా సుమారు 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట చిత్రబృందం. చిరంజీవి టైటిల్ రోల్లో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహా రెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ చిత్రీకరిస్తున్న యుద్ధ సన్నివేశాలు సుమారు 8 నిమిషాల పాటు ఉంటాయని సమాచారం. దీని కోసం ఏకంగా 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట. చిరంజీవి, జగపతిబాబు, సుదీప్ మరికొందరు నటీనటులు ఈ షూటింలో పాల్గొంటున్నారు. వీరితో పాటు ఈ భారీ క్లైమాక్స్ పోర్షన్లో 600 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ పాల్గొంటున్నారట. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. -
వినోదమే వినోదం
‘‘మా నాన్న (ఎల్వీ ప్రసాద్) పెద్ద భూస్వామి అయినా సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ సినిమాలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలు చాలా తీశాం’’ అన్నారు రమేశ్ ప్రసాద్. ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో వరం జయత్ కుమార్ నిర్మించారు. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాలపై తప్ప దేనిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేవారు కాదు. అందరికీ మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. మా ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’లో 50 శాతం మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమాను దసరాకు విడుదల చేస్తు న్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరం జయత్ కుమార్. ‘‘నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది’’ అన్నారు కె.ఇ. జ్ఞానవేల్ రాజా. ‘‘చక్కని హిలేరియస్ ఎంటర్టైనర్. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ఆర్య అన్నారు. -
ఎంత ఘాటు ప్రేమయో...
‘100% లవ్’ సినిమాలో మహాలక్ష్మీ పాత్రలో చికెన్ లవర్‌గా తమన్నా కనిపించారు. రోజులో ఏదో ఓ టైమ్‌లో మహాలక్ష్మీ చికెన్ లాగించాల్సిందే. ఆ పాత్రలానే తమన్నా రియల్ లైఫ్‌లో కూడా బీభత్సమైన నాన్ వెజ్ లవర్ అట. కానీ కొన్ని రోజుల పాటు మాంసాహారం ముట్ట కూడదని ఒట్టు పెట్టుకున్నారట. ఎందుకూ..? ఏదైనా దేవుడికి మొక్కా? కాదు. పాత్ర కోసం ఫిట్‌నెస్‌లో భాగమైన డైటా? కాదు.. కాదు. మరి ఎందుకూ అంటే.. తను ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కోసమట. తమన్నా పెట్ పేరు పెబ్బల్. ఈ మధ్యన కొంచెం అస్వస్థతకు గురైయిందట. పెబ్బల్ అలా బాధపడుతుంటే చూడలేకపోయారట తమన్నా. పెంపుడు కుక్కపిల్ల త్వరగా కోలుకునేందుకు తనకు బాగా నచ్చినదానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దాంతో తనకు కొన్ని రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం తమన్నా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సైరా: నరసింహారెడ్డి’, తమిళంలో ‘దేవి 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
మరో మంచి టీమ్‌తో...!
రెండేళ్ల క్రితం తమిళంలో రిలీజైన ‘దేవి’ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇందులో ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా కీలక పాత్రలు చేశారు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ లీడ్ రోల్‌ను తమన్నా చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉన్న ఈ సినిమాలో మరో ఇద్దరు నాయికలుగా నిత్యా మీనన్, నందితా శ్వేతా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో అమీ జాక్సన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారట. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా, కోవై సరళ పాల్గొనగా సీన్స్ తీస్తున్నారు. మరో బెస్ట్ టీమ్‌తో వర్క్ చేస్తున్నానని అంటున్నారు తమన్నా. -
కేజీఎఫ్ అంటే?
యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కె.జి.ఎఫ్’. తమన్నా ఓ ప్రత్యేక పాటలో నటించారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగధూర్ నిర్మించారు. చిత్ర సహనిర్మాత కైకాల రామారావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం రీ–రికార్డింగ్ జరుపుకుంటోంది. సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అక్టోబరు 14న ట్రైలర్, నవంబరు 16న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అమెరికా–రష్యాకు మధ్య జరిగిన యుద్ధ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడంతో మనుషుల్లో అత్యాశ పెరిగింది. అదే సమయంలో ‘కె.జి.ఎఫ్’ (కోలార్ బంగారు గనులు) భారత దేశంలోనే అతిపెద్ద బంగారు గని. అది ఒక్క మనిషి చేతిలోకి వెళితే ఏమవుతుంది? అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఫస్ట్ పార్టుగా రూపొందిస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్ నీల్. ‘‘1970 కాలంలో జరిగిన మాఫియా నేపథ్యంలో జరిగిన కథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని యాక్షన్ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు విజయ్ కిరగంధూర్. ఈ చిత్రానికి కెమెరా: భువన్ గౌడ, సంగీతం: రవి భసూర్. -
ప్రాగ్లో ఫన్ పూర్తి
సరదాగా కాలక్షేపానికి ప్రాగ్ వెళ్లిన తోడల్లుళ్ల వెకేషన్ ముగిసింది. పది రోజుల పాటు వాళ్ల వాళ్ల జోడీలతో పాటలు పాడుకోవడం కోసం వెళ్లిన వీరు ప్రాగ్కి బై బై చెప్పారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా కనిపిస్తారు.‘ఎఫ్ 2’ చిత్రబృందం కొన్ని సీన్స్, సాంగ్స్ కోసం ప్రాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ రీసెంట్గా కంప్లీట్ అయింది. ‘‘సక్సెస్‌ఫుల్‌గా ప్రాగ్లో షెడ్యూల్‌ని సూపర్ ఫన్‌తో కంప్లీట్ చేశాం’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారని తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్, ప్రియదర్శి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
రయ్ రయ్‌మంటూ...
ప్రస్తుతం బ్రేకులు లేని బండిలా తమన్నా రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. తెలుగులో ‘ఎఫ్ 2, సైరా నరసింహారెడ్డి’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ తాజాగా తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. సుందర్. సి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తారు. ‘‘చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి సుందర్ సార్ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. పక్కా యాక్షన్ చిత్రమిది. విశాల్‌తో సెకండ్ టైమ్ నటించనుండటం హ్యాపీ’’ అని తమన్నా పేర్కొన్నారని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఇంతకుముందు తమిళ సినిమా ‘కత్తి సండై’లో విశాల్, తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో రిలీజైంది. అయితే ప్రస్తుతం సుందర్. సి తెలుగు హిట్ ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. అలాగే విశాల్ కూడా తెలుగు హిట్ ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు ఈ ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్ చేసిన తర్వాత విశాల్–తమన్నా –సుందర్. సి కాంబినేషన్ సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్‌తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ షూటింగ్ నిమిత్తం యూరప్‌లోని ప్రాగ్లో ఉన్నారు తమన్నా. ‘క్వీన్’కి తెలుగు రీమేక్‌గా ఆమె నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’, తమిళంలో చేసిన ‘కన్నే కలైమానే’ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. సౌత్‌లో కాకుండా హిందీలో కునాల్ కోహ్లీ దర్శకత్వంలో తమన్నా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఆమె డైరీ ఫుల్‌గా ఉంది. కన్నడ ‘కేజీఎఫ్’లో ఐటమ్ సాంగ్ చేసిన తమన్నా, తెలుగులో ‘సవ్యసాచి’లో కూడా ఓ ఐటమ్ సాంగ్ చేయనున్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
ప్రాగ్లో సందడే సందడి
ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఫన్ కోసం ప్రాగ్ వెళ్లారు వెంకీ, వరుణ్. ఒంటరిగా వెళ్లలేదు తమ జోడీలను తోడుగా తీసుకెళ్లారు. మరి అక్కడ ఏం చేశారంటే.. వాళ్ల జోడీలతో కలసి డ్యూయెట్ పాడుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 2’ పేరుతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ కనిపించనున్నారు. ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ చెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రాగ్లో జరుగుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఓ సాంగ్, కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో తోడల్లుళ్లుగా వెంకీ, వరుణŠ. కనిపిస్తే, వాళ్లను ముప్పుతిప్పలు పెట్టే భార్యలుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
అవుకు రాజు అండీ... అవుకు రాజు
ఎవరీ అవుకు రాజు? ఏమా కథ? అంటే.. మరెవరో కాదు.. ఆయన అభినయ చక్రవర్తి. అబ్బా.. అవుకు రాజు ఎవరో తెలియదు.. మళ్లీ అభినయ చక్రవర్తి అని కొత్త ట్విస్ట్ ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. అభినయ చక్రవర్తి అంటే కన్నడ స్టార్, ‘ఈగ’ ఫేమ్ సుదీప్. అవుకు రాజు కూడా ఆయనే. సుదీప్ పుట్టినరోజు నేడు. కన్నడ చిత్ర సీమలో అభిమానులంతా ఆయన్ను ముద్దుగా అభినయ చక్రవర్తి అని పిలుస్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘సైరా’లో ఆయన అవుకు రాజు పాత్ర చేస్తున్నారు. చిరంజీవి టైటిల్ రోల్లో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. యుద్ధ సన్నివేశానికి సంబంధించినట్లుగా ఉన్న ఈ స్టిల్‌లో అవుకు రాజుతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిటిష్ సైన్యం కనిపిస్తోంది కదూ. సో.. అవుకు రాజు బ్రిటిష్ వైపు అని అర్థం చేసుకోవచ్చేమో. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ‘సైరా’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వరకర్త, రత్నవేలు ఛాయాగ్రాహకుడు. -
స్క్రీన్ టెస్ట్
1. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరోచరిత్ర’ సినిమాలో కమల్‌హాసన్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) సరిత బి) జయప్రద సి) సుమలత డి) రేవతి 2. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌కు తల్లిగా నటించిన ప్రముఖ నటి ఎవరు? ఎ) జయసుధ బి) శారద సి) గీత డి) కవిత 3. ఈ ఏడాది ఆగస్ట్ 27వ తేదీతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఎ) కొదమ సింహం బి) కొండవీటి దొంగ సి) మాస్టర్డి) చూడాలని వుంది 4. ‘అల్లరి మొగుడు’ చిత్రంలో హీరో మోహన్‌బాబు సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ఒకరు మీనా. రెండో హీరోయిన్ ఎవరు? ఎ) వాణీ విశ్వనాథ్ బి) శోభన సి) దివ్యభారతి డి) రమ్యకృష్ణ 5. నటుడు చంద్రమోహన్ హీరోగా చేసిన మొదటి చిత్రం ‘రంగుల రాట్నం’. ఆ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శక–నిర్మాత? ఎ) బి.ఎన్. రెడ్డి బి) కె.వి. రెడ్డి సి) హెచ్.యం. రెడ్డి డి) ఆదుర్తి సుబ్బారావు 6. ‘జిల్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు రాధాకృష్ణ. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) నాని డి) వెంకటేశ్ 7. ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన నటుడు ఎవరు? ఎ) సుధీర్ బాబు బి) సందీప్ కిషన్ సి) వరుణ్ సందేశ్ డి) నిఖిల్ 8. ఇప్పటివరకు తెలుగులో 5 పాటలు పాడారు ఈ హీరో. ఆయన పాడిన అన్ని పాటలూ ప్రజాదరణ పొందాయి. ఆ టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్‌చరణ్ బి) రానా సి) నాగచైతన్య డి) యన్టీఆర్ 9. ‘శుభలగ్నం’ చిత్రంలో భర్తను కోటి రూపాయలకు అమ్మేసే క్యారెక్టర్లో నటించన నటి ఎవరు? ఎ) రోజా బి) ఆమని సి) భూమిక డి) సౌందర్య 10. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించిన నటి ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) జెనీలియాసి) సమీరా రెడ్డి డి) హన్సిక 11. ‘యమహా నగరి కలకత్తా పురీ.. నమహో హుబ్లీ హౌరా వారధీ...’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) భువనచంద్ర బి) వేటూరి సి) సుద్దాల అశోక్ తేజ డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 1.2 శ్రీదేవి సోదరి మహేశ్వరి నటించిన హిట్ చిత్రం ‘పెళ్లి’. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కోడి రామకృష్ణ బి) పి. వాసు సి) బి. గోపాల్ డి) ముత్యాల సుబ్బయ్య 13. వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనిల్ రావిపూడి బి) బాబీ సి) సంకల్ప్ రెడ్డి డి) సందీప్ రెడ్డి 14. ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘సినిమా సూపిత్త మామా... నీకు సినిమా సూపిత్త మామా.. సీను సీనుకి నీతో సీటీ కొట్టిస్త మామా...’ పాటను పాడిందెవరు? ఎ) అనుదీప్ బి) రేవంత్ సి) సింహా డి) హేమచంద్ర 15. ‘నర్తనశాల’ చిత్రంలో ద్రౌపదిగా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జయలలిత డి) అంజలీదేవి 16. రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రానికి సంగీత దర్శకుడు? ఎ) యస్.యస్. తమన్ బి) హిప్ హాప్ తమిళ సి) యువన్ శంకర్‌రాజా డి) దేవిశ్రీ ప్రసాద్ 17. దర్శకుడు సురేందర్ రెడ్డి తన కెరీర్లో ఇద్దరు హీరోలతో రెండు చిత్రాలకు పని చేశారు. కానీ ఓ హీరోయిన్‌కు మాత్రం రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఎవరా హీరోయిన్? ఎ) అమృతా రావు బి) ఇలియానా సి) శ్రుతీహాసన్ డి) రకుల్ ప్రీత్ సింగ్ 18. ‘బిగ్ బాస్2’ తెలుగు రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా నాని చేస్తున్నారు. మరి తమిళ ‘బిగ్ బాస్’ కి హోస్ట్‌గా ఏ హీరో చేస్తున్నారు? ఎ) విజయ్ బి) ధనుష్ సి) కమల్‌హాసన్ డి) శింబు 19. కృష్ణంరాజు, శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమా లోనిది? ఎ) త్రిశూలం బి) బాబులు గాడి దెబ్బ సి) బొబ్బిలి బ్రహ్మన్న డి) కటకటాల రుద్రయ్య 20. ఈ క్రింది ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) కమల్‌హాసన్ బి) హరీశ్ సి) రమేశ్‌బాబు డి) హరికృష్ణ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) డి 4) డి 5) ఎ 6) ఎ 7) ఎ 8) డి 9) బి 10) సి 11) బి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
వీరనారిగా...
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ స్టార్ క్యాస్ట్‌తో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో స్క్రీన్ అంతా ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా మారనుడటం పక్కా. ఇప్పుడీ భారీ చిత్రంలో టాలీవుడ్ టు బాలీవుడ్ వెళ్లి స్థిరపడిన టబు కూడా యాడ్ అయ్యారని సమాచారం. ‘సైరా’ సినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్గా కనిపించనున్నారట. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న పీరియాడికల్ మూవీ ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు ఓ ముఖ్య ఘట్టంలో ఝాన్సీ లక్ష్మీభాయ్ కూడా ఉన్నారట. దాంతో ఈ పాత్రకు టబును సెలెక్ట్ చేసుకున్నారట చిత్ర బృందం. పదేళ్ల గ్యాప్ తర్వాత టబు నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతిలతో నిండిపోయిన ఈ పీరియాడికల్ మూవీలో టబు కూడా జాయిన్ అవ్వడం కచ్చితంగా ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అమిత్ త్రివేది. -
స్క్రీన్ టెస్ట్
1. ‘దీవానా’ చిత్రం ద్వారా హీరో అయిన బాలీవుడ్ ప్రముఖ నటుడెవరు? ఎ) ఆమీర్ ఖాన్ బి) సల్మాన్‌ఖాన్ సి) షారుక్‌ఖాన్ డి) సోహైల్ ఖాన్ 2. సూపర్‌స్టార్ కృష్ణ తన నట జీవితంలో ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారో తెలుసా? ఎ) 19 బి) 14 సి) 10 డి) 17 3. చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రానికి సంగీత దర్శకునిగా ఇప్పుడు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పని చేస్తున్నారు. ఈ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) ఏ.ఆర్.రెహమాన్ బి) యస్.యస్. తమన్ సి) మణిశర్మ డి) దేవిశ్రీ ప్రసాద్ 4. రణŠ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఆ చిత్రంలో నటిస్తున్న తెలుగు హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రాజశేఖర్ బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) నాని 5. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘పైసా’ చిత్రంలో నాని సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) రెజీనా బి) క్యాథరిన్ సి) ప్రణీత డి) హెబ్బా పటేల్ 6. ‘సాహసవీరుడు– సాగరకన్య’ చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) శిల్పాశెట్టి బి) రవీనా టాండన్ సి) దీప్తి భట్నాగర్ డి) నగ్మా 7. ‘సతీ లీలావతి’ చిత్రంలో కమల్‌హాసన్ సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఊర్వశి బి) కోవై సరళ సి) హీరా డి) రమ్యకృష్ణ 8. ‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా.. గోవిందా హరి గోవిందా...’ అనే పాటను రచయిత ఎవరో గుర్తుందా? ఎ) శ్రీశ్రీ బి) దాశరథి సి) సముద్రాల డి) కృష్ణశాస్త్రి 9. ‘నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...’ అక్కినేని సూపర్íß ట్ సాంగ్ ఏ చిత్రంలోనిదో తెలుసా? ఎ) ప్రేమాభిషేకం బి) ప్రేమనగర్ సి) మేఘ సందేశం డి) దసరా బుల్లోడు 10. నాగార్జున హీరోగా నటించిన మొదటి చిత్రానికి దర్శకుడెవరో తెలుసుకుందామా? ఎ) బోయిన సుబ్బారావు బి) వి.మధుసూదన్ రావు సి) దాసరి నారాయణరావు డి) కె.రాఘవేంద్రరావు 11. ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రియా సుమన్ బి) పాయల్ రాజ్‌పుత్ సి) రష్మికా మండన్నా డి) కావ్యా థాపర్ 12. ‘నిన్నుకోరి’ చిత్ర దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో హీరో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ నూతన చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటిస్తున్న కథానాయిక ఎవరు? ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) సమంతా అక్కినేని సి) తమన్నా డి) రాశీ ఖన్నా 13. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ తేజ ఏ చిత్రానికి 6 నంది అవార్డులు అందుకున్నారో తెలుసా? ఎ) చిత్రం బి) జయం సి) నువ్వు నేను డి) నిజం 14. ఈమె ప్రముఖ నటి. ఆమె నిజమైన పేరు శ్రీలతారెడ్డి. మరి.. స్క్రీన్ నేమ్ ఏంటో తెలుసా? ఎ) విజయశాంతి బి) రోజా సి) జీవిత డి) వాణీ విశ్వనా«ద్ 15. ‘రోబో’ చిత్రంలోని ‘ఓ మరమనిషి నాలోకి రా! ఇనుములో హృదయం మొలిచెనే....’ పాటను పాడిందెవరో తెలుసా? ఎ) యస్పీ బాలసుబ్రహ్మణ్యం బి) కార్తీక్ సి) కారుణ్య డి) హేమచంద్ర 16. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సూత్రధారులు’ చిత్రంలో నటించిన ప్రముఖ కథానాయిక ఎవరు? ఎ) జయప్రద బి) రమ్యకృష్ణ సి) మీనా డి) శోభన 17. ‘కొండవీటి సింహం’ చిత్రంలో యన్టీఆర్ కుమారునిగా నటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీధర్ బి) హరికృష్ణ సి) శోభన్ బాబు డి) మోహన్ బాబు 18. సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రంలో తన చిన్నప్పటి పాత్రను చేసిన చరిత్ మానస్ ఏ హీరో తనయుడో తెలుసా? ఎ) రవితేజ బి) మహేశ్‌బాబు సి) సుధీర్‌బాబు డి) జయం రవి 19. రాజేంద్రప్రసాద్, రజనీ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) అహ నా పెళ్లంట బి) మాయలోడు సి) ఏప్రిల్ 1 విడుదల డి) మేడమ్ 20. ఈ కింది ఫొటోలో ఉన్న చిన్నారి నటి ఎవరో చెప్పుకోండి? ఎ) అనుష్కా శర్మ బి) చార్మి సి) రకుల్ ప్రీత్‌సింగ్ డి) భావన మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) బి 5) బి 6) ఎ 7) బి 8) ఎ 9) బి 10) బి 11) సి 12) బి 13) సి 14) బి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఇంటిలో పోరు.. బ్యాంకాక్‌లో జోరు
బయటికేమో గంభీరంగా కనిపిస్తారు ఈ కో–బ్రదర్స్. కానీ ఇంట్లో మాత్రం భార్యలంటే బెదుర్స్ అంట. మరి ఈ పెళ్లాల టెన్షన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా అని ప్లాన్లు మొదలుపెట్టారు. వెంటనే బ్యాంకాక్ బెస్ట్ ఐడియా అనిపించిందట. దాంతో ఛలో బ్యాంకాక్ అనుకున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది క్యాప్షన్. ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారని సమాచారం. భార్యలు పెట్టే టెన్షన్‌తో ఫ్రస్ట్రేట్ అయ్యే భర్తలుగా కామెడీ పంచుతారట. రీసెంట్గా హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ని బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. సుమారు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ బ్యాంకాక్‌లోనే సాగనుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
స్క్రీన్ టెస్ట్
1. మహేశ్‌బాబు ఏ సంవత్సరంలో పుట్టారో కనుక్కోండి? ఎ) 1974 బి)1976 సి)1975 డి)1979 2. మహేశ్‌బాబును ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన నిర్మాత ఎవరు? ఎ) యం.యస్. రాజు బి) సి. అశ్వనీదత్ సి) మంజుల డి) అల్లు అరవింద్ 3. ‘నానీ’ చిత్రంలో మహేశ్‌బాబు సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) అమీషా పటేల్ బి) సోనాలీ బింద్రే సి) బిపాసా బసు డి) ప్రీతీ జింటా 4. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..’ అని మహేశ్ చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎ) అతడు బి) ఖలేజా సి) పోకిరి డి) సైనికుడు 5. మహేశ్‌బాబు తనని తాను మొదటిసారి స్క్రీన్ మీద చూసుకున్న చిత్రం ‘నీడ’. ఏ దర్శకుడు మహేశ్‌ను అరంగేట్రం చేశారో తెలుసా? ఎ) దాసరి నారాయణరావు బి) కె. మురళీ మోహన్‌రావు సి) కోడి రామకృష్ణ డి) కృష్ణ 6. రాక్‌స్టార్ పాత్రలో మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఆ చిత్రానికి కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎ) కేకే సెంథిల్ కుమార్ బి) మధి సి) ఛోటా.కె. నాయుడు డి) రత్నవేలు 7. మహేశ్‌బాబు నటి నమ్రతను ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఎ) వంశీ బి) ఒక్కడు సి) మురారీ డి) అతడు 8. మహేశ్‌బాబు ‘పోరాటం’, ‘గూఢచారి 117’ సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండ రామిరెడ్డి సి) కేయస్ఆర్ దాస్ డి) కె.బాపయ్య 9. ఈ దర్శకుడు మహేశ్‌బాబుకు క్లోజ్ ఫ్రెండ్. మహేశ్‌బాబు ఫ్యామిలీతో విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఈ దర్శకునికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎవరా దర్శకుడు తెలుసా? ఎ) పూరి జగన్నాథ్ బి) మెహర్ రమేశ్ సి) శివ కొరటాల డి) త్రివిక్రమ్ 10. ‘శ్రీమంతుడు’ సినిమాలో చేసిన పాత్ర ఇన్సిపిరేషన్‌తో మహేశ్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం తెలంగాణా ప్రాతంలోని ఏ జిల్లాలో ఉందో తెలుసా? ఎ) మహబూబ్ నగర్ బి) అదిలాబాద్ సి) వరంగల్ డి) రంగారెడ్డి 11. మహేశ్‌బాబు ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారో కనుక్కోండి? ఎ) 2 బి) 1 సి) 6 డి) 4 12. మహేశ్‌బాబు తన కెరీర్లో ఒకే ఒక్క దర్శకునితో మూడు సినిమాల్లో నటించారు. ఆ దర్శకుడెవరు? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) పూరి జగన్నాథ్ సి) శ్రీను వైట్ల డి) గుణశేఖర్ 13. మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’.. ఈ రెండు సినిమాల్లోని పాటలన్నీ రాసిన రచయిత ఎవరో తెలుసా? ఎ) శ్రీమణి బి) రామజోగయ్య శాస్త్రి సి) సిరివెన్నెల డి) చంద్రబోస్ 14. ‘పోకిరి’ సినిమాలోని ‘గల గల పారుతున్న గోదారిలా...’ పాటను పాడిన సింగర్ పేరేంటి? ఎ) హేమచంద్ర బి) నిహాల్ సి) సింహా డి) కార్తీక్ 15. బెస్ట్ డెబ్యూ హీరో, బెస్ట్ హీరో, స్పెషల్ జ్యూరీ అన్ని కేటగిరీలకు కలిపి మహేశ్‌బాబు మొత్తం ఎన్ని నందులను అందుకున్నారో తెలుసా? ఎ) 4 బి) 8 సి) 6 డి) 9 16. మహేశ్‌బాబుని ట్వీటర్లో దాదాపు 68లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన ట్వీటర్ హ్యాండిల్ ఏంటో తెలుసా? ఎ) మీ మహేశ్ బి) యువర్స్ మహేశ్ సి) మహేశ్ డి) యువర్స్ ట్రూలీ మహేశ్ 17. మహేశ్ కెరీర్లో ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే రెండుసార్లు నటించారు. ఆ ఇద్దరిలో ఓ హీరోయిన్ త్రిష. మరి రెండో హీరోయిన్ ఎవరు? ఎ) నమ్రతా శిరోద్కర్ బి) భూమిక సి) తమన్నా డి) సమంతా 18. మహేశ్‌బాబు స్కూలింగ్ చెన్నైలో జరిగింది. అదే స్కూల్లో చదువుకున్న తన జూనియర్ తమిళ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) సూర్య బి) విజయ్ సి) ధనుష్ డి) కార్తీ 19. ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’లో కీలక పాత్ర చేస్తున్న కామెడీ హీరో ఎవరు? ఎ) ‘అల్లరి’ నరేశ్ బి) రాజేంద్రప్రసాద్ సి) సునీల్ డి) సప్తగిరి 20 మహేశ్‌బాబు బాలనటుడిగా నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) నీడ బి) కొడుకు దిద్దిన కాపురం సి) బాలచంద్రుడు డి) పోరాటం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) డి 8) ఎ 9) బి 10) ఎ 11) డి 12) డి 13) బి14) బి 15) బి 16) డి 17) డి 18) డి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
గుమ్మడికాయ కొట్టారు
ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లు నలుగురు రాణులు ఒకేసారి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారట. హిందీ హిట్ ‘క్వీన్’ సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రధారిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’ రూపొందింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహారావు, మాస్టర్ సంపత్ కీలక పాత్రలు చేశారు. బాలీవుడ్ స్టార్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తమిళ క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్, కన్నడ వెర్షన్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ నటించారు. మలయాళంలో మంజిమా మోహన్ నాయికగా ‘జామ్ జామ్’ టైటిల్‌తో రీమేక్ అయింది. -
సైరాకి సై
నరసింహారెడ్డి చేసే సాహసాలకు తెరపై సంగీతం అందించడానికి సంగీత దర్శకుడు దొరికారట. ఆల్రెడీ నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయట. చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. షెడ్యూల్ బిజీ కారణంగా ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణి, యస్.యస్. తమన్ అని పలు పేర్లు వినిపించాయి. కానీ ఎవరి పేరూ కన్ఫర్మ్ అయినట్లు న్యూస్ రాలేదు. లేటెస్ట్గా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ‘సైరా’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సై అన్నట్లు సమాచారం. ‘సీక్రెట్ సూపర్‌స్టార్, క్వీన్, డియర్ జిందగీ, ప్యాడ్‌మ్యాన్’ వంటి పాపులర్ సినిమాలకు సంగీతం అందించారాయన. త్వరలో స్టార్ట్ కానున్న ప్రభాస్– రాధాకృష్ణ కుమార్ సినిమాకు కూడా అమిత్‌నే సంగీతం సమకూర్చనున్నారు. ‘సైరా’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ కూడా స్టార్ట్ చేశారట అమిత్. ఈ సినిమాలో మూడు పాటలకు ట్యూన్స్ ఇచ్చే పనిలో పడ్డారాయన. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కానున్న చిత్రం టీజర్‌కు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ పనిలో ప్రస్తుతం బిజీ ఉన్నారట. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేస్తున్నారు. -
ఆనందం.. వినోదం
ఆడుతూ పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు ‘ఎఫ్ 2 ఫ్యామిలీ’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘‘తొలి షెడ్యూల్ కంప్లీట్ చేశాం. వెంకటేశ్‌గారు అమేజింగ్. బ్రదర్ వరుణ్ తేజ్ లాస్ట్డే మిస్ అయ్యాడు కానీ సెట్లో రాకింగ్ పెర్ఫార్మెన్స్. తమన్నా మీ ఆన్‌స్క్రీన్ సిస్టర్ మోహరీన్ను జాగ్రత్తగా చూసుకోండి. మళ్లీ మీరు ఇద్దరు కలుస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఫస్ట్ షెడ్యూల్లో లాస్ట్ డే మిస్సయ్యాను. వెంకటేశ్‌గారు, అందరితో నటించడం ఆనందంగా ఉంది. సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘ఎఫ్ 2’ షూటింగ్లో ఫన్ అన్లిమిటెడ్. అనిల్ సర్ దర్శకత్వంలో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మెహరీన్‌ని నేను కలిసినప్పుడు తప్పకుండా మీకు ఆ ఫొటోలు పంపిస్తాను’’ అని తమన్నా పేర్కొన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడు అల్లుళ్ల పాత్రలో నటిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని హింట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ -
వేడి తగ్గలేదు
రుతువు మారి వర్షాకాలం వచ్చిన తర్వాత వెదర్ చల్లగా మారింది. కానీ ‘సైరా’ సెట్లో మాత్రం వార్ వేడి ఇంకా చల్లారలేదు. పైగా వేడి ఇంకా పెరుగుతోంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. ఇప్పటివరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయిందట. గత 30 రోజుల నుంచి వార్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్ సీన్స్నే తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి, సుదీప్‌లపై ఈ పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ వార్ బ్యాక్‌డ్రాప్ షెడ్యూల్ ఈ నెల 25 వరకు కొనసాగనుందని సమాచారం. ‘సైరా’ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గ్యారీ పావెల్ వర్క్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు రత్నవేలు ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘సైరా’కి సిద్ధం
‘‘సినిమా నా మీద ఎప్పుడూ ప్రేమనే చూపిస్తుంది. రెగ్యులర్‌గా నా జర్నీలోకి సర్ప్రైజులు ప్లాన్ చేస్తుంది. వాటిలో ‘సైరా’లో లెజెండ్ చిరంజీవిగారితో యాక్ట్ చేయడం ఒకటి’’ అంటున్నారు కన్నడ నటుడు, ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్‌సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘సైరా’లో యాక్ట్ చేయడం, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి సుదీప్ మాట్లాడుతూ – ‘‘సైరా’ నా ఫస్ట్ హిస్టారికల్ పిక్చర్. చాలా ఎగై్జటెడ్‌గా, అదే సమయంలో కొంచెం వర్రీగా ఉన్నాను’’ అన్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. -
కామెడీ డోస్ డబుల్
ఇక నుంచి ఫన్ డబులవ్వనుంది. కామెడీ డోస్ రెండింతలు కానుంది. ఎందుకంటే వెంకటేశ్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఈ ఫన్ రైడ్‌లో ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ రూపొందుతోంది. వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ యాక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల స్టార్ట్ అయిన ఈ షూటింగ్లో ఆల్రెడీ వరుణ్, మెహరీన్ జాయిన్ అయ్యారు. లేటెస్ట్గా వెంకటేశ్ కూడా ఎంట్రీ ఇచ్చి డబుల్ ఫన్ సృష్టించనున్నారు. ‘‘ఈరోజు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇవాళ (సోమవారం) వెంకటేశ్‌గారు షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ టైమ్ వెంకటేశ్‌గారితో వర్క్ చేయడం హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
వెంకీ ఎంట్రీ
ఫన్ రైడ్‌ని వెంకటేశ్ లేకుండా స్టార్ట్ చేశారు వరుణ్ తేజ్. ఇప్పుడు ఈ ప్రయాణంలోకి వెంకీ కూడా ఎంటర్ అవుతారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ చిత్రం షూటింగ్లో వెంకటేశ్ పాల్గొననున్నారని సమాచారం. ఆల్రెడీ వరుణ్ తేజ్, మెహరీన్‌లు ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన తమన్నా యాక్ట్ చేయనున్నారు. -
ఫన్లోకి ఎంట్రీ
ఫన్ను డబుల్ నుంచి ట్రిపుల్ చేయడానికి ఫన్ రైడ్‌లో జాయిన్ అయ్యారు కథానాయిక మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌లోకి రీసెంట్గా వరుణ్ తేజ్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సెట్లోకి మెహరీన్ ఎంట్రీ ఇచ్చారు. వరుణ్‌తేజ్, మెహరీన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. హాస్యనటుడు ప్రియదర్శి కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా నటించనున్నారన్న విషయం తెలిసిందే. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమాలో మహేశ్‌బాబు కబడ్డీ ఆటగాడిగా కనిపించారు. ఏ చిత్రంలోనో గుర్తుందా? ఎ) అతడు బి) ఒక్కడు సి) ఖలేజా డి) నిజం 2. ‘నాయకి’ ద్విభాషా చిత్రంలో నటిగా, దెయ్యంగా రెండు పాత్రల్లో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) సిమ్రాన్ సి) చార్మీ డి) జ్యోతిక 3. ‘‘చిరు చిరు చిరు చినుకై కురిశావే, మరుక్షణమున మరుగైపోయావే’’... అనే పాట ‘ఆవారా’ చిత్రంలోనిది. హీరోగా కార్తీ నటించారు. హీరోయిన్? ఎ) తమన్నా బి) శ్రియ సరన్ సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి 4. ఇలియానా 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో హీరో రవితేజ సరసన నటించారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ 2018లో ఆమె ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎవరి సరసన హీరోయిన్గా నటిస్తున్నారో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) అల్లు అర్జున్ సి) ప్రభాస్ డి) రవితేజ 5. ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో హీరోగా నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 20 6. మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్ సి) విజయ్‌కాంత్ డి) శరత్‌కుమార్ 7. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిన ప్రఖ్యాత రచయితెవరో తెలుసా? ఎ) అనంత శ్రీరామ్ బి) శ్రీమణి సి) చంద్రబోస్ డి) రామజోగయ్య శాస్త్రి 8. నిర్మాత కె.యస్ రామారావు తన సొంత నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్‌లో చిరంజీవితో ఎన్ని సినిమాలు నిర్మించారో తెలుసా? ఎ) 8 బి) 9 సి) 10 డి) 5 9. ‘ఇంద్ర’ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ. కానీ ఆ చిత్రంలోని ఓ సూపర్‌హిట్ సాంగ్ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో.. చెలికాడు చంపేస్తున్నాడే’ అనే పాటకు సంగీత దర్శకుడు మాత్రం మణిశర్మ కాదు. మరి ఆ పాటకు సంగీత దర్శకుడెవ్వరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఆర్పీ పట్నాయక్ సి) ఇళయరాజా డి) యం.యం. కీరవాణి 10. ఓ పక్క యన్టీఆర్‌తో, మరో పక్క మహేశ్ బాబు సరసన సినిమా చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) పూజా హెగ్డే సి) శ్రుతీహాసన్ డి) కాజల్ అగర్వాల్ 11. ‘మల్లెల తీరంలో’ అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా? ఎ) శ్రీదివ్య బి) అంజలి సి) మాధవీలత డి) మధుశాలిని 12. పవన్‌కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం రీమేక్‌ను కన్నడలో శివరాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కించిన తెలుగు దర్శకుడెవరో తెలుసా? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) దశరథ్ డి) పూరి జగన్నాథ్ 13. దర్శకుడు యస్.యస్. రాజమౌళి ట్వీటర్ ఐడీ ఏంటో? ఎ) మీ రాజమౌళి బి) యస్‌యస్ రాజమౌళి సి) యువర్స్ రాజమౌళి డి) రాజమౌళి సేస్ 14. చిరంజీవి అల్లుడు హీరోగా పరిచయమవుతన్న చిత్రానికి కెమెరామెన్ ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) ఛోటా కె.నాయుడు బి) కేకే సెంథిల్ కుమార్ సి) రత్నవేలు డి) మది 15. జూలై 3న పుట్టిన ప్రముఖ నటుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) కాంతారావు బి) యస్వీ రంగారావు సి) రామారావు డి) నాగేశ్వరరావు 16. ‘మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు’ అనే డైలాగ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం లోనిది. ఈ డైలాగ్‌ను ఏ ఆర్టిస్ట్ చెబుతారో తెలుసా? ఎ) ప్రకాశ్‌రాజ్ బి) సుహాసిని సి) వెంకటేశ్ డి) ఆర్తీ అగర్వాల్ 17. ‘నేనే నానీనే నీ నానీని నేనే..’ అనే పాట రచయితెవరో తెలుసా? ఎ) యం.యం. కీరవాణి బి) శివశక్తి దత్తా సి) రాజమౌళి డి) కల్యాణ్ రమణ కోడూరి 18. ‘అలా మొదలైంది’తో తన సినిమా దర్శక ప్రస్థానాన్ని ప్రారంభించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె ప్రస్తుతం ఏ హీరోతో సినిమా చేయనున్నారో తెలుసా? ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగశౌర్య డి) అల్లు శిరీష్ 19 ఈ క్రింది ఫొటోలోని బాలనటుడు ఓ పెద్ద హీరో. గుర్తుపట్టారా? ఎ) కమల్‌హాసన్ బి) మహేశ్‌బాబు సి) నాగార్జున డి) ఎన్టీఆర్ 20. ఎన్టీఆర్ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో చెప్పుకోండి? ఎ) శ్రీ కృష్ణావతారం బి) శ్రీ కృష్ణ లీలలు సి) మాయాబజార్ డి) శ్రీ కృష్ణ సత్య మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) ఎ 4) డి 5) ఎ 6) ఎ 7) డి 8) డి 9) బి 10) బి 11) ఎ 12) డి 13) బి 14) బి 15) బి 16) బి 17) ఎ 18) బి 19) ఎ 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
ఫన్ రైడ్
... స్టార్ట్ చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్ అండ్ టీమ్. ఈ రైడ్‌లో ఎవరి అల్లరి ఎక్కువగా ఉంది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉపశీర్షిక. ఇందులో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో గురువారం హీరో వరుణ్ తేజ్ జాయిన్ అయ్యారు. ‘‘ఎఫ్ 2’ మొదలైంది. మరో అందమైన రోజున సరికొత్త అధ్యాయం మొదలుపెట్టాను. ఎగై్జటింగ్ రోల్ చేస్తున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. ఈ షెడ్యూల్ ఈ నెల 21 వరకు సాగుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తోడల్లుళ్ల పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. టైటిల్‌ని బట్టి ఇది పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని ఊహించవచ్చు. -
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ప్రారంభం
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో సందడి సందడిగా స్టార్ట్ అయింది. వైవిధ్యమైన చిత్రాలతో జోరు మీదున్న వెంకటేశ్, ఫిదా, తొలి ప్రేమ సినిమాల విజయాలతో మంచి ఊపు మీదున్న వరుణ్ తేజ్ ఈ ఎఫ్ అండ్ ఎఫ్కి హీరోలు. ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది చిత్రానికి ఉపశీర్షిక. హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగింది. తొలి సన్నివేశంలో పాల్గొన్న ఇద్దరు హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లపై నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. అనంతరం అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, శిరీష్, వెంకటేశ్, వరుణ్ తేజ్ అందరూ కలిసి సినిమా స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడికి అందించారు. జూలై 5న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. తమన్నా, మెహరీన్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తారు. సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో లవ్లీగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేసి, ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించారు. ఎవరామె? ఎ) తమన్నా బి) క్యాథరిన్ సి) ఇలియానా డి) లావణ్య త్రిపాఠి 2. భారతీయ చలనచిత్ర రంగం గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన దర్శకుడవ్వక ముందు ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఆడియోగ్రఫీ బి) ఎడిటింగ్ సి) కెమెరా డిపార్ట్మెంట్ డి) ఆర్ట్ డిపార్ట్మెంట్ 3. ‘షేక్ మోజెస్ మూర్తి’ పేరు భలే తమాషాగా ఉంది కదూ. 1972లో విడుదలైన ‘మల్లె పందిరి’ సినిమాలో ఈ పేరుతో ఉన్న క్యారెక్టర్‌ను పోషించిన గాయకుడెవరో తెలుసా? ఎ) ఎస్పీ బాలు బి) రామకృష్ణ సి) ఘంటసాల డి) ఇళయరాజా 4. కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ఏ నటుని సరసన నటిస్తున్నారు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాని డి) సందీప్ కిషన్ 5. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఓ సినిమాలో హీరో ‘అల్లరి నరేశ్’ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్ ఏ హీరోతో కలిసి నటిస్తున్నారో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) వెంకటేశ్ 6. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అరంగేట్రం చేసిన ‘అల్లుడు శీను’ చిత్రదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) బోయపాటి శ్రీను డి) శ్రీవాసు 7. 1998లో మోహన్‌బాబు నటించిన ‘రాయుడు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన నటì ఎవరో తెలుసా? 2001లోనే ఆమె చనిపోయారు? ఎ) దివ్యభారతి బి) ప్రత్యూష సి) సౌందర్య డి) భార్గవి 8. ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ శరన్ బి) త్రిష సి) సోనాలి బింద్రే డి) రవీనా టాండన్ 9. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... అనే పాటతో Ðð లుగులోకి వచ్చిన హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) హంసా నందిని బి) ర మ్యశ్రీ సి) అభినయశ్రీ డి) ముమైత్ ఖాన్ 10. ‘గులాబి’ చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఆ చిత్రనిర్మాత ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) కృష్ణవంశీ బి) జేడీ చక్రవర్తి సి) రామ్‌గోపాల్ వర్మ డి) సురేశ్ బాబు 11. శ్రీదేవి చెల్లెలిగా హీరోయిన్ మహేశ్వరి అందరికీ పరిచయమే. ఆమెను సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) భారతీరాజా బి) కోడి రామకృష్ణ సి) బాలచందర్ డి) కె. రాఘవేంద్రరావు 12. రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ చిత్రంలో ఆయన సరసన నటించిన బాలీవుడ్ భామ ఎవరో కనుక్కోండి? ఎ) ఐశ్వర్యారాయ్ బి) సోనాక్షి సిన్హా సి) దీపికా పదుకోన్ డి) అమీ జాక్సన్ 13. ‘‘క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాక ముందు చచ్చిపోవటమే’’... అనే డైలాగ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోనిది. రచయితెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) వక్కంతం వంశీ సి) అబ్బూరి రవి డి) కోన వెంకట్ 14 ‘దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల భేరే చూడు’ అనే పాటను పాడిందెవరో తెలుసా? ఎ) అనుదీప్ బి) హేమచంద్ర సి) హిప్ హాప్ తమిళ డి) పెంచల్ దాస్ 15. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, అక్కినేని మనవరాలు సుప్రియ ఇద్దరికీ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ చిత్ర దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) ఈదర వీర వెంకట సత్యనారాయణ సి) ఎ. కోదండ రామిరెడ్డి డి) యస్.జె. సూర్య 16. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్’ అనే పాటను హమ్ చేసింది సింగర్ కాదు. ఆమె ఓ నటి. ఎవరామె? ఎ) కలర్స్ స్వాతి బి) రాశీ ఖన్నా సి) తమన్నా భాటియా డి) అనుపమా పరమేశ్వరన్ 17. తెలుగు అగ్ర హీరోల్లో ఓ హీరో ఇప్పుడు సౌదీలో షూటింగ్ జరుపుకుంటున్నారు. నెలకుపైగా అక్కడే షూటింగ్లో ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) రామ్ డి) వరుణ్‌తేజ్ 18. ‘జంబలకడి పంబ’ అనే సినిమా 1993లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి సినిమాలో హీరో నరేశ్, ఇప్పుడు అదే పేరుతో తయారైన ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) ‘షకలక’ శంకర్ సి) ధన్‌రాజ్ డి) శ్రీనివాసరెడ్డి 19. ఈ కింది ఫొటోలోని బాలీవుడ్ హీరో ఎవరో చెప్పండి? ఎ) సల్మాన్‌ఖాన్ బి) షారుక్ ఖాన్ సి) ఆమిర్ ఖాన్ డి) సైఫ్అలీ ఖాన్ 20. ఈ ఫొటోలో మేకప్ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుహాసిని డి) జయప్రద మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (బి) 5) (సి) 6) (ఎ) 7) (బి) 8) (సి) 9) (డి) 10) (సి) 11) (ఎ) 12) (సి) 13) (బి) 14) (డి) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (డి) 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
మా ఆవిడ, అబ్బాయికి నచ్చాను
‘‘కమర్షియల్ హీరోకు ఫిజికల్‌గా కష్టం ఉంటుంది. ఫైట్స్ చేయాలి, దూకాలి, అరవాలి. రొమాంటిక్ హీరోకి మైండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మనసులోనే ఆలోచించుకొని యాక్ట్ చేయాలి. దేని కష్టం దానిలో ఉంది. రెండూ రెండే. కాకపోతే.. హీరోయిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే రొమాంటిక్ హీరోగా చేయడం ఈజీ’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ పంచుకున్న సంగతులు... ► కమర్షియల్ సినిమాల్లో హీరో బాడీలాంగ్వేజ్ స్పీడ్‌గా ఉంటుంది. ‘నా నువ్వే’లాంటి రొమాం టిక్ సినిమాలు చేసేటప్పుడు కొంచెం సెటిల్డ్‌గా ఉండాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. తల ఎక్కు వ ఊపకూడదు. డైలాగ్స్ మధ్య గ్యాప్ ఇవ్వాలి. డైలాగ్ కంటే ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నాకు కొత్తగా అనిపించాయి. ► నా పాత్ర కోసం ఎవర్నీ ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. జయేంద్రగారి మైండ్ నుంచి వచ్చిన పాత్ర ఇది. క్యారెక్టర్‌తో సింక్ అవ్వడానికి నాకు చాలా టైమ్ పట్టింది. ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. ‘నా నువ్వే’ లాంటి రొమాంటిక్ సినిమా చేయడం నాకు ఫస్ట్ టైమ్. ‘గీతాంజలి’ సినిమా చూసినప్పటి నుంచి పీసీ శ్రీరామ్‌గారితో పని చేయాలనుకునేవాణ్ణి. ‘నా నువ్వే’తో నా కల నెరవేరింది. ► అమెరికాలో జాబ్ కోసం వెళ్తున్న ఓ కుర్రాడిగా నేను కనిపిస్తాను. నా పాత్రలో కాస్త స్వార్థం కూడా ఉంటుంది. నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘నా నువ్వే’ లాంటి సినిమా చేసుంటే బాగుండేది. ఈ సినిమాలో నా లుక్ అందరికీ నచ్చింది. నా కొడుకు కూడా నేను చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నాడు. నాకొచ్చిన పెద్ద కాంప్లిమెంట్ అదే. నేను మీసం తీసేయడం నా భార్యకు కూడా నచ్చింది. ► తమన్నాతో పని చేయడం చాలా బాగుంది. ఆమె చాలా ప్రొఫెషనల్. సెట్స్‌లో టైమ్‌కు ఉంటుంది. టోటల్ సీన్‌ను సింగిల్ షాట్లో తీయడం జయేంద్రగారికి అలవాటు. మొత్తం సీన్ అయ్యాకే కట్ చెబుతారు. అందుకే తమన్నా, నేను షూటింగ్‌కు ముందు చాలా ప్రాక్టీస్ చేశాం. కిరణ్, విజయ్, మహేశ్ ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ► ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకోలేదు. నా మైండ్ సెట్ ప్రకారం చేస్తుంటా. ఓ సినిమా చేస్తున్నప్పుడు మరో కథ నచ్చితే చేసేస్తా. ప్రస్తుతం కేవీ గుహన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది పూర్తిగా కొత్త కాన్సెప్ట్. ఏదో ఒక ఫ్రేమ్‌కు ఫిక్స్ అయిపోవడం నాకిష్టం ఉండదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పవన్ సాదినేని దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ ఉంటుంది. గుణ్ణం గంగరాజుగారు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తారు. వచ్చే ఏడాది తారక్‌తో కూడా ఓ సినిమా ఉంటుంది. -
బాగా నటించాడ్రా అంటే చాలు
‘‘కల్యాణ్ అన్నను చూస్తుంటే మూడేళ్ల కిందట నేను పడిన టెన్షన్ ఆయనలో కనిపిస్తోంది. నేను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసినప్పుడు.. ముఖ్యంగా ఆ గెటప్ ఛేంజ్ చేసినప్పుడు.. అప్పటి వరకూ నేను చేసిన సినిమాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనిపించింది. ప్రతి నటుడూ స్టీరియో టైప్ పాత్రలు, సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఆ నటుడికే కాదు.. అభిమానులు, ప్రేక్షకులకూ సంతృప్తి ఉండదు’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఓ నటుడిగా సినిమా హిట్ అయిందా? లేదా? అన్నదానికంటే ‘బాగా నటించాడ్రా’.. అనే చప్పట్లే ఎంతో ముఖ్యం. కొత్తగా ట్రై చేసినప్పుడు ఈ టెన్షన్లు సర్వసాధారణం. కానీ మీరు (కల్యాణ్‌రామ్) టెన్షన్ పడాల్సిన పనిలేదు. మన ప్రేక్షక దేవుళ్లది, మన అభిమానులది చాలా పెద్ద హృదయం. జెన్యూన్‌గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్ద పీట వేయడం ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్తేమీ కాదు. అలాంటి కోవకు చెందిన చిత్రాల్లో ‘నా నువ్వే’ కూడా తప్పకుండా నిలుస్తుందని నా నమ్మకం. మీరు పడిన కష్టం, టెన్షన్ వృథా పోదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత గంట మాట్లాడతానని అన్న చెప్పారంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతోంది. ఆ కాన్ఫిడెన్స్ యాక్టర్‌కి అవసరం. జయేంద్ర సార్‌కి చాలా గట్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఓ ఛాలెంజ్‌లా భావించి చేశారాయన. షరెత్గారి కెరీర్లో ‘నా నువ్వే’ బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. అనంత శ్రీరామ్‌గారు చక్కటి సాహిత్యం అందించారు. ఈ సినిమా నిర్మాతలు విజయ్‌గారు, కిరణ్‌గారు, మహేశ్‌లకు థ్యాంక్స్. ఇలాంటి ఓ ప్రయత్నం చేసేటప్పుడు చాలా దమ్ముండాలి. రిజల్ట్ గురించి మాట్లాడుకోకుండా కథను నమ్మి ఈ సినిమా తీశారు. ఈ చిత్రం అందరి కెరీర్లో.. ముఖ్యంగా మా కల్యాణ్ అన్న కెరీర్లో మైలురాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఆయన చేయాలి. మరిన్ని ప్రయోగాలు చేసే ఎంకరేజ్మెంట్ ఈ సినిమా అన్నకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. జయేంద్ర మాట్లాడుతూ– ‘‘నిర్మాతలకి లాస్ ఏంజెల్స్‌లో ‘నా నువ్వే’ కథ చెప్పాను. వెంటనే సినిమా చేద్దామన్నారు. కల్యాణ్‌రామ్‌గారు నాపై నమ్మకంతో ఒకే సిట్టింగ్‌లో కథ ఓకే చేశారు. ఇప్పటి వరకూ ఆయన యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఇది రొమాన్స్ జానర్లో ఉంటుంది. 14న సినిమా చూశాక ప్రేక్షకులు కల్యాణ్‌రామ్‌ని ‘వాట్ ఏ లవర్ బోయ్’ అంటారు. గత చిత్రాలకంటే ఈ చిత్రంలో తమన్నా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో రెండు పెద్ద సర్‌ప్రైజ్‌లున్నాయి. ఒకటి కల్యాణ్ మేకోవర్, రెండోది తమన్నా పాత్ర. ఇది పూర్తి రొమాంటిక్ ఫిల్మ్ కాదు. యువతరంతో పాటు కుటుంబ సభ్యులందరూ కలసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. సమర్పకులు మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ఎక్స్ట్రా స్పెషల్ అని చాలాసార్లు చెప్పా. సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో కొత్త కల్యాణ్‌రామ్‌గారు కనిపిస్తారు. మాస్ హీరోగా ఇప్పటికే మార్క్ తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్‌కి మరింత దగ్గరవుతారని చాలా నమ్మకంగా ఉంది’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నా నువ్వే’ చిత్రం పాటలు చాలా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చినందుకు షరెత్ సార్‌కి థ్యాంక్యూ. ‘నా నువ్వే’ థీమ్ సాంగ్ ఇప్పటికీ రోజుకి పదిసార్లు వింటూ ఉంటాను. జయేంద్రగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. అప్పుడు ఆయన్ని ఒక్కటే ప్రశ్న అడిగా. ఈ రోల్‌కి నేను ఎలా సరిపోతారని మీరు భావిస్తున్నారు? అని. నా కెరీర్లో నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశా. ఎక్కువమంది అటువంటి చిత్రాలతోనే నన్ను కలుస్తున్నారు. ఇదొక ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఫిల్మ్. నేనెప్పుడూ ఇలాంటి చిత్రం చేయలేదు. అప్పుడు ఆయన నాతో అన్నారు. ‘ఓ రొమాంటిక్ హీరోతో రొమాంటిక్ సినిమా చేయొచ్చు. దట్స్ సింపుల్ అండ్ ఈజీ. కానీ ప్రేక్షకులకు ఏం కొత్తగా ఉంటుంది? కానీ, ఇప్పటి వరకూ మీరు చేయని ఈ రోల్ చేసి ప్రేక్షకులకు నచ్చితే అది నాకు పెద్ద సక్సెస్’ అన్నారు. నాపై ఆయన నమ్మకం చూసి ఈ సినిమా చేశా. నా వద్దకి ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడంతో పాటు పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరోయిన్ని తీసుకొచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. చాలా ఏళ్లుగా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తున్నారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదు. నా ఈ ప్రయత్నాన్ని మీరు మళ్లీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. సినిమా విడుదలయ్యాక గంట సేపు మాట్లాడతా. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తారక్ టోటల్‌గా ఛేంజోవర్ అయ్యాడు. నేను కూడా ఇలా ఓ సినిమాకి చేయాలనుకున్నా. ఆ దేవుడు, మా తాతగారు (ఎన్టీఆర్) విని, నాకు ఈ సినిమా ఇచ్చారని నమ్ముతున్నా’’ అన్నారు. చిత్రనిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు షరెత్, పాటల రచయిత అనంత శ్రీరామ్, నిర్మాతలు నాగవంశీ, పీడీవీ ప్రసాద్, విజయ్ చిల్లా తదితరులు పాల్గొన్నారు. -
వెంకీ వెంటనే వరుణ్
సీనియర్స్ ఫస్ట్. ఆ తర్వాతే జూనియర్స్ అంటున్నారు ‘ఎఫ్ 2’ టీమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్లోకి ఫస్ట్ వెంకటేశ్ ఎంటర్ అవుతారు. ఆ వెంటనే వరుణ్ తేజ్ ఎంట్రీ ఇస్తారట ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ జర్నీలోకి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ పక్కన మెహరీన్ హీరోయిన్లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ వెంకీ ఎంట్రీ ఇస్తారట. జూలై ఫస్ట్ వీక్‌లో వరుణ్ కూడా జాయిన్ అవుతారట. ఫన్ అండ్ ఫ్రస్ట్రేటింగ్‌గా సాగే ఈ కథలో ఫన్నీ కఫుల్ ఎవరో, ఫ్రస్టేటింగ్ పెయిర్ ఎవరో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకు సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
22న స్పెషల్ గిఫ్ట్
‘జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్‌లో గ్యాప్ ఉండదు’ అంటూ ‘బ్రూస్లీ’ చిత్రంలో అతిథిగా మెరిశారు చిరంజీవి. ‘పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ అంటూ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో హీరోగా గ్రాండ్‌గా రీ–ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ చిరు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. ఆ మధ్య అమితాబ్ బచ్చన్ షూటింగ్లో పాల్గొనగా చిరు, నయన హోమం చేస్తున్న ఫొటోలు బయటికొచ్చాయి. ఆ లుక్‌లో చిరుని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. అయితే సినిమా మొత్తం చిరు ఇలాగే ఉంటారా? లేక వేరే లుక్‌లో ఉంటారా? అన్న డౌట్ లేకపోలేదు. అందుకే.. ‘సైరా’లో చిరంజీవి ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జస్ట్ రెండు నెలలు వెయిట్ చేస్తే చాలు.. ఆ లుక్‌ని చూడొచ్చన్నది తాజా ఖబర్. ఆగస్ట్ 22 చిరు పుట్టినరోజుకి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందట. -
దటీజ్ మహాలక్ష్మి
... అనగానే టక్కున తమన్నా గుర్తుకు రాక మానరు. నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100 పర్సెంట్ లవ్’ చిత్రంలోని ‘దటీజ్ మహాలక్ష్మి..’ పాట, తమన్నా చెప్పిన ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. మహాలక్ష్మి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు మిల్కీ బ్యూటీ. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అ’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘మీ సినిమా టైటిల్ ‘ఇట్స్ మీ మహాలక్ష్మి’, ‘దటీజ్ మహాలక్ష్మి’.. ఈ రెంటిలో ఏది? అని ఓ అభిమాని ట్వీటర్లో అడిగిన ప్రశ్నకు ‘కన్ఫ్యూజ్ అవ్వొద్దు... ‘దటీజ్ మహాలక్ష్మి’ అని క్లారిటీ ఇచ్చారు తమన్నా. ‘క్వీన్’ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ అవుతోంది. తమిళంలో కాజల్ అగర్వాల్ చేస్తోన్న ఈ చిత్రానికి ‘ప్యారిస్ ప్యారిస్’ టైటిల్ కన్ఫార్మ్ చేశారు. కన్నడ వెర్షన్‌కి ‘బటర్‌ఫ్లై’ అని పెట్టారు. ఇందులో పరుల్ యాదవ్ కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ రీమేక్‌లో మంజిమా మోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జామ్ జామ్’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. మరి.. నాలుగు భాషల్లో ఏ ‘క్వీన్’ బెస్ట్ అనిపించుకుంటారో వేచి చూద్దాం. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమా కోసం మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్ చేశారు. ఆ సినిమా ఏదో తెలుసా? ఎ) 1 నేనొక్కడినే బి) బిజినెస్ మేన్ సి) పోకిరి డి) ఖలేజా 2. భారతదేశ విశిష్ట పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్... ఈ మూడు పురస్కారాలను దక్కించుకున్న ఏకైక భార తీయ సినీ నటుడెవరు? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) యన్టీ రామారావు సి) చిరంజీవి డి) అమితాబ్ 3. ‘వీర మహాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్న హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) షెర్లిన్ చోప్రా బి) సన్నీ లియోన్ సి) మల్లికా శెరావత్ డి) పూనమ్ పాండే 4. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) శ్రుతీహాసన్ బి) కృతీ సనన్ సి) పూజా హెగ్డే డి) అదితీరావ్ హైదరీ 5. దర్శకుడు కోడి రామకృష్ణ.. దాసరి నారాయణరావు శిష్యుడు. గురువుకు, శిష్యునికి దర్శకులవ్వటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఒక్కరే. ఆ నిర్మాత ఎవరు? ఎ) నాగిరెడ్డి–చక్రపాణి బి) దుక్కిపాటి మధుసూదనరావు సి) కె. రాఘవ డి) డి. రామానాయుడు 6. ‘అవతలి వాళ్లని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్లల్లో కనిపించాలి’.. అనే డైలాగ్ రాసిన రచయితెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఈ డైలాగ్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోనిది) ఎ) అబ్బూరి రవి బి) కోన వెంకట్ సి) మేర్లపాక గాంధీ డి) బుర్రా సాయిమాధవ్ 7. బాలీవుడ్లో నానాపటేకర్ నటించిన ‘క్రాంతివీర్’ తెలుగు రీమేక్‌లో నానా స్థానంలో నటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) శోభన్ బాబు బి) మోహన్ బాబు సి) నాగార్జున డి) వెంకటేశ్ 8. ‘ఓ సుబ్బారావో, ఓ అప్పారావో, ఓ వెంకట్రావో, ఓ రంగారావో ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..’ అనే పాటను రాసింది పాటల రచయిత కాదు ఓ దర్శకుడు. ఆ దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) కోడి రామకృష్ణ సి) కె. రాఘవేంద్ర రావు డి) దాసరి నారాయణరావు 9. హీరో కృష్ణతో ఎక్కువ సినిమాల్లో (50 చిత్రాలు) హీరోయిన్గా నటించిన హీరోయిన్ విజయనిర్మల. ఆమె తర్వాత ఆయన సరసన ఓ హీరోయిన్ 45 సినిమాల్లో నటించారు. ఆ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శారద బి) జయప్రద సి) విజయశాంతి డి) జయసుధ 10. ‘చారులత’ సినిమాలో అవిభక్త కవలలుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) అంజలి బి) ప్రియమణì æ సి) స్నేహ డి) హన్సిక 11. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పటివరకు చేసిన తెలుగు సినిమాలెన్నో ఓ సారి లెక్కెట్టండి? ఎ) 12 బి) 15 సి) 18 డి) 19 12. వేల్ రికార్డ్స్ ఆడియో కంపెనీ అధినేత ఎవరో తెలుసా? చిన్న క్లూ: ఆమె ఓ ప్రముఖ సంగీత దర్శకుని సతీమణి. ఎ) వల్లీ బి) రమా సి) సునీత డి) కౌసల్య 13. ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు బాలీవుడ్లో వచ్చిన ‘క్వీన్’ సినిమా తెలుగు రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. ‘అ’ని నిర్మించింది ఓ ప్రముఖ తెలుగు హీరో. ఎవరా హీరో? ఎ) సందీప్ కిషన్ బి) నాగశౌర్య సి) నాని డి) నాగచైతన్య 14. నాగార్జున, అమల వివాహ తేదీ జూన్ 11. ఏ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది? ఎ) 1990 బి) 1989 సి) 1995 డి) 1992 15. ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. అందులో ఒకరు రకుల్ ప్రీత్‌సింగ్, మరో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) తమన్నా సి) సోనాల్ చౌహాన్ డి) మాళవికా శర్మ 16. ఈ మధ్యే 75 చిత్రాల క్లబ్లో చేరిన సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్.యస్. తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) సాయి కార్తీక్ 17. ఇటీవల రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘రాజీ’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) కత్రినా కైఫ్ సి) ఆలియా భట్ డి) డయానా పెంటీ 18. 1961లో ఎన్టీఆర్ నటించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఆయన నటుడు కూడా. ఎ) ఎన్టీఆర్ బి) అక్కినేని సి) కాంతారావు డి) యస్వీ రంగారావు 19. ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు? ఎ) నిత్యామీనన్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) ఆలియా భట్ డి) శోభన 20. ఈ స్టిల్ ఏ సినిమాలోదో చెప్పుకోండి? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మకథ సి) అన్నపూర్ణ డి) దొంగరాముడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) బి 4) సి 5) సి 6) సి 7) బి 8) డి 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి 14) డి 15) సి 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
‘అ’ దర్శకుడేనా?
కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘క్వీన్’ సినిమా ఎంతటి భారీ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి నీలకంఠ దర్శకుడు. అయితే.. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవడంతో కొత్త దర్శకుడు ఎవరా? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. గతంలో కొందరి దర్శకులు పేర్లు వినిపించినా తాజాగా ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన ‘అ’ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ దర్శకుడితో ‘క్వీన్’ తెలుగు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. -
హృదయాన్ని హత్తుకునేలా...
కల్యాణ్ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్‌లో చూపించే చిత్రం ‘నా నువ్వే’. ఇద్దరూ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారు. హృదయాన్ని హత్తుకునే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’’ అన్నారు చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర రూపొందించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘నా నువ్వే’. మహేశ్ కోనేరు సమర్పణలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్, కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వటికూటి నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘జయేంద్రగారు అద్భుతమైన ఫీల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పీసీ శ్రీరామ్‌గారు ప్రతీ ఫ్రేమ్‌ను ఎక్స్ట్రాడినరీగా చూపించారు. శరత్ సంగీతానికి మంచి స్పందని లభిస్తోంది’’ అని అన్నారు. -
తొలకరిలో తిరుగుబాటు
జూన్ మొదటివారం నుంచి నర్సింహా రెడ్డి సమరానికి సిద్ధం అవుతారట. తొలకరి జల్లులు కురిసే సమయానికి తిరుగుబాటు మొదలు పెట్టనున్నారట. చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ‘సైరా’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జూన్ 5నుంచి స్టార్ట్ కానుంది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ షెడ్యూల్లో చిరంజీవి, మరికొందరు ముఖ్య నటీనటులు పాల్గొంటారు. ‘సైరా’ మూవీలోకి లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఈ షెడ్యూల్లో జాయిన్ అవ్వరట. ఆగస్ట్‌లో జరగబోయే మరో కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
మమ్మమ్మాస్..
స్పెషల్ సాంగ్స్‌లో మరింత స్పెషల్‌గా కనిపించడమే కాదు డ్యాన్స్‌లో రెండింతలు రెచ్చిపోతారు తమన్నా. మళ్లీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ మమ్మమాస్ అనేలా దుమ్మురేపిన ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్‌ను ‘సవ్యసాచి’ చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లోనే చైతూతో కలిసి స్టేజ్‌ను అదరగొట్టనున్నారు తమన్నా. ఈ సాంగ్‌ను వచ్చే నెలలో షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఆల్రెడీ తమన్నా ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటల్లో ఆమె స్టెప్స్ అదుర్స్. ఇప్పుడీ పాటలోనూ మాస్ స్టెప్స్‌తో మెస్మరైజ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ మిల్కీ బ్యూటీ చైతూకు జోడీగా ‘100 పర్సెంట్ లవ్’, ‘తడాఖా’ చిత్రాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
సత్తా చూపిస్తా
విల్లు ఎక్కుపెట్టినా, కత్తి విసిరినా టార్గెట్ మిస్సవ్వరు తమన్నా. వీరనారి పాత్రలో ఆమె గురి ఎలా ఉంటుందో, ధైర్య సాహసాలు ఎలాంటివో ‘బాహుబలి’ సినిమాలో చూశాం. ఇప్పుడు ‘సైరా’ చిత్రం కోసం ఆమె కత్తి పట్టి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్నారు. బ్రిటీషర్లకు భారతీయ మహిళల సత్తా ఏంటో చూపిస్తున్నారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సైరా’. సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు–నిర్మాత రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సైరా’ షూటింగ్లో తమన్నా పాల్గొంటున్నారు. చిత్రంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది
‘ఏ బోండాం. ఖాళీగానే ఉన్నావు కదా? ఇంకో వన్ మినిట్ తనని వెళ్లకుండా ఆపుంటే నీ సొమ్మేం పోయేది.. ఏంటే లవ్వా? చేస్తే తప్పేంటి?... ఇదేం ట్విస్ట్ బావా.. జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది... నా ప్రేమ, నా బాధ అందరికీ వినపడుతుంది. నీకు వినిపించటం లేదా?’ వంటి డైలాగులు ‘నా నువ్వే’ సినిమాపై క్రేజ్ పెంచుతున్నాయి. కల్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.జయేంద్ర మాట్లాడుతూ –‘‘ఎగ్జయిటింగ్ ఫిల్మ్ ఇది. కల్యాణ్‌రామ్ గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. తమన్నా లాంగ్ కెరీర్లో ఇందులో చాలా కొత్తగా కనపడుతుంది. సినిమా చూసే ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’’ అన్నారు. ‘‘లవబుల్, రొమాంటిక్ మూవీ ఇది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. సెన్సార్ ప్రాసెస్ స్టార్టయ్యింది. 25న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ‘‘నా నువ్వే’ టీమ్‌తో యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాం’’ అన్నారు కిరణ్ ముప్పవరపు. -
ఎఫ్2 పెయిర్ ఫిక్స్
ఒకరేమో ఫన్నీ. మరొకరు ఫ్రస్ట్రేటింగ్. మరి వీళ్లకు జోడి కుదిరితే ఎలా ఉంటుంది? ఒకరు ఫన్నీ పెయిర్ అవుతారు. మరొకరు ఫ్రస్ట్రేటింగ్ పెయిర్‌లా తయారవుతారు. ఇందులో ఫన్ క్రియేట్ చేసే ఫన్నీ పెయిర్ ఎవరు? ఫ్రస్ట్రేట్ అయ్యే ఫ్రస్ట్రేటింగ్ పెయిర్ ఎవరు? అనే విషయం తెలియాలంటే మాత్రం మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్‌తేజ్‌కు జోడీగా మెహరీన్‌లను ఫిక్స్ చేసింది చిత్రబృందం. ‘‘ఈ ఫన్ రైడ్‌లో భాగమైనందుకు సూపర్ హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు మెహరీన్. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. -
జయేంద్రగారు ఆ కల నేరవేర్చారు
‘‘జయేంద్రగారు కథ చెబుతారు అని మహేశ్ చెప్పగానే, ఆయన ప్యూర్ లవ్‌స్టోరీలు చేస్తారు. మనం మాస్ సినిమాలు చేస్తాం. ఆయన నాకు స్క్రిప్ట్ చెప్పడమేంటీ? అనుకున్నాను. ‘మిస్ కమ్యూనికేషన్ అనుకుంటా. నేను నమ్మను’ అన్నాను. కాదు.. జయేంద్రగారు కథ చెబుతారట. పీసీ శ్రీరామ్ కెమెరామేన్‌గా చేస్తారనగానే షాక్ అయ్యాను. పీసీగారితో వర్క్ చేయడం కలగా మిగిలిపోతుంది అనుకున్నాను. జయేంద్రగారు ఆ కల నెరవేర్చారు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్, తమన్నా జంటగా రూపొందిన చిత్రం ‘నా నువ్వే’. కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్ పై మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించారు. శరత్ సంగీత దర్శకుడు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘నా చేంజ్ ఓవర్‌కు జయేంద్ర, పీసీగారే కారణం. చాలా ఇబ్బంది పెట్టాను, ఎంతో ఓపికగా చేశారు. పీసీగారి కెమెరాను ఫేస్ చేయాలంటే భయమేసింది. ఈ సినిమాకు శరత్‌గారే హీరో. మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. పాటలు చాలా బాగా ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్. మేం ఏం అడిగితే అది ఇచ్చారు. హీరోయిన్గా తమన్నా కాకుండా ఎవ్వర్నీ ఈ సినిమాలో ఊహించుకోలేను. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కల్యాణ్‌గారు తన యాక్షన్, థ్రిల్లర్ జానర్ నుంచి బయటికొచ్చి రొమాంటిక్ సినిమా చేయడానికి నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్ ప్యాషన్ వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది’’ అన్నారు జయేంద్ర. ‘‘ఇష్క్’ తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది. కల్యాణ్, తమన్నా, ప్రొడ్యూసర్స్ అందరితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది జయేంద్ర బెస్ట్ సినిమా అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు పీసీ శ్రీరామ్ .‘‘నేను ఎక్కువ కష్టపడలేదు. అంతా నా పార్టనర్ కిరణ్ చూసుకున్నారు. పీసీ–జయేంద్రగారి కాంబినేషన్ మ్యాజికల్. అందరూ స్క్రీన్ మీద చూస్తారు. కల్యాణ్‌రామ్‌గారు ఈ సినిమా చేయడమేంటీ? అని ఆశ్చర్యపోయాను. జయేంద్రగారు, పీసీ కలసి కల్యాణ్‌గారిని చూపించిన విధానంతో నా ఒపీనియన్ మార్చుకున్నాను. తమన్నా మరోసారి అందర్నీ ప్రేమలో పడేస్తారు. హానెస్ట్ ఫిల్మ్ చేయాలని కష్టపడ్డాం. నచ్చుతుందనే నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత విజయ్.‘‘జయేంద్రగారితో వర్క్ చేయడం హ్యాపీ. బ్యూటీఫుల్ మూమెంట్స్‌ను యాక్ట్ చేయడానికి మంచి స్క్రిప్ట్ ఇచ్చిన జయేంద్రగారికి థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్. కల్యాణ్ రామ్ మోస్ట్ సపోర్టీవ్ అండ్ డెడికేటెడ్ యాక్టర్’’ అన్నారు తమన్నా. ‘‘ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ అయినా మమ్మల్ని నమ్మినందుకు కల్యాణ్ రామ్‌గారికి థ్యాంక్స్. జయేంద్రగారు, పీసీగారు తమ మ్యాజిక్ చూపిస్తారు’’ అని అన్నారు మహేశ్ కోనేరు. -
ఘనంగా నానువ్వే ఆడియో రిలీజ్
-
చాలెంజ్‌కు రెడీ
యాక్టర్‌గా తమ పరిధిని పెంచుకోవాలనుకునే వారు కొత్త చాలెంజ్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త చాలెంజ్‌లను తీసుకొని తమని తాము ఇంప్రూవ్ చేసుకుంటారు. ‘నేను కూడా అదే కోవకు చెందుతాను’ అంటున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవి సరసన ‘సైరా’ సినిమాలో యాక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర గురించి, అందులోని చాలెంజ్ గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు, అమితాబ్ బచ్చన్‌గారు వంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ యాక్టర్స్‌తో యాక్ట్ చేయడం హానర్‌గా ఫీల్ అవుతున్నాను. నేను చేయబోయే పాత్రకు రిఫరెన్స్‌గా తీసుకోవడానికి, ఆన్లైన్లో చదవడానికి కూడా ఎక్కువ మెటీరియల్ లేదు. చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇది చాలా చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. ఇలాంటి చాలెంజ్‌లకు నేను ఎప్పుడూ రెడీ. ఈ క్యారెక్టర్‌ను వీలైనంత రియల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాను’’ అని తమన్నా పేర్కొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆల్రెడీ నయనతార ఒక హీరోయిన్గా చేస్తున్నారు. -
చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి
కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా.. నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, మే నెలాఖరులో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలోని తొలి పాట ‘చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి..’ ప్రోమోని రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన కిరణ్ ముప్పవరపు మాట్లాడుతూ– ‘‘చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి’ పాట మా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కల్యాణ్, తమన్నా కాంబినేషన్, పి. సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, షరెత్ సంగీతం, బృందా మాస్టర్ సమకూర్చిన నృత్యాలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్, ఎంటరై్టన్మెంట్ ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో కల్యాణ్‌రామ్ టోటల్ ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తారు’’ అని సమర్పకుడు మహేష్ కోనేరు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి. -
ఫన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్... తొలకరిలో స్టార్టవ్వున్
ఫన్ ఒకరిది. ఫ్రస్ట్రేషన్ మరొకరిది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆడియన్స్‌ది. ఈ ఎంటర్టైన్మెంట్ను సిల్వర్‌స్క్రీన్‌పై అందించేందుకు ‘ఎఫ్2’లో జాయిన్ అవ్వడానికి వీ2 రెడీ అవుతున్నారు. వేసవిలో ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని వర్షాకాలంలో షూటింగ్‌కు కొబ్బరికాయకొట్టి చలికాలంలో చిత్రానికి గుమ్మడికాయ కొట్టేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అయితే ఎవరు ఫన్ క్యారెక్టర్ చేయబోతున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్లో నటించనున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్గా ఈ సినిమా టైటిల్ లోగోను అధికారికంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లు... వీ2 అంటే వెంకీ ప్లస్ వరుణ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేయనున్నారు.‘‘ఎఫ్2’ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సెట్లో ఫుల్ ఫన్ స్టార్ట్ అవ్వబోయేది అప్పుడే’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదు వెంకీ, వరుణ్, ‘దిల్’ రాజుతో ఉన్న ఫొటోను అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించనున్నారని టాక్. -
ఆ అవార్డు రావడం నా అదృష్టం : తమన్నా
సాక్షి, హైదరాబాద్ : దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక తమన్నా. అతిలోక సుందరి, దిగ్గజ నటి శ్రీదేవి పురస్కారం తమన్నా అందుకోనున్నారు. సినిమా రంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు ప్రతి ఏడాది ‘అప్సర అవార్డ్స్’ను అందజేస్తున్న విషయం తెలిసిందే. 2018 ఏడాదికిగాను నటి తమన్నా అప్సర అవార్డుకు ఎంపికయ్యారు. దీనిలో భాగంగా ఆమెకు దివంగత నటి శ్రీదేవి అవార్డును ఆదివారం సాయంత్రం హైదరాబాదలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ‘నేను ఇండస్ట్రీకొచ్చిన తొలినాళ్ల నుంచి శ్రీదేవిని చూస్తున్నాను. ఆమె పేరుతో ఇచ్చే అవార్డుకి నేను ఎంపికవ్వడం నిజంగా నా అదృష్టం. శ్రీదేవి మేడం లాగానే నేను కూడా చిన్నతనంలోనే సినీ పరిశ్రమకొచ్చాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకంటూఘో గుర్తింపు తెచ్చుకోవడం వెనక ఎన్నేళ్ల కృషి, శ్రమ ఉంటుందో చెప్పడానికి శ్రీదేవి జీవితమే ఒక ఉదాహరణ’ అని తమన్నా అన్నారు. 1983లో శ్రీదేవి నటించిన సూపర్ హిట్ మూవీ ‘హిమ్మత్ వాలా’ రీమేక్‌లో నటించి తమన్నా మంచి పేరు తెచ్చుకుంది. కన్నె కలై మన్నె, నా నువ్వే, క్వీన్ వన్స్ ఎగైన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న తమన్నా ఈ అవార్డుకు ఎంపికైన ఆనందంలో మునిగితేలుతున్నారు. ‘జీ తెలుగు చానల్’ ఈ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. -
యోగా.. బాగా
మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనల వల్ల జీవితంలో సమస్యలు తగ్గతాయి. ఇలామనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు ఉదయాన్నే యోగా చేస్తారు. మరికొందరు వాకింగ్ ఎంచుకుంటారు. తమన్నా యోగా చేసేవారి కోవలోకి వస్తారు. తాను యోగా చేస్తున్న ఫొటోలను ట్వీటర్లో షేర్ చేశారామె. ‘‘ప్రతిరోజూ ఓ కొత్తరోజు. లైఫ్‌లో నిన్ను నువ్వు డెవలప్ చేసుకునే ప్రోగ్రెస్ ఎవ్రీడే ప్రాసెస్‌లో ఉండాలి. ఇలా జరగాలంటే మైండ్ అండ్ శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇందుకు యోగాను మించింది లేదు. శారీరకంగా, మానసికంగా యోగా బెస్ట్’’ అని పేర్కొన్నారు తమన్నా. -
స్క్రీన్ టెస్ట్
► అక్కినేని నాగార్జున సరసన తొలిసారి హీరోయిన్గా నటించిన నటి ఎవరు? ఎ) అమలా అక్కినేని బి) గౌతమి సి) సుహాసిని డి) శోభన ► శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ‘రాధాగోపాళం’ చిత్రానికి బాపు దర్శకుడు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో? ఎవరా హీరో? ఎ) నాని బి) విజయ్‌కృష్ణ సి) నరేశ్ డి) విజయ్ దేవరకొండ ► చిరంజీవితో 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండరామిరెడ్డి బి) బి. గోపాల్ సి) దాసరి నారాయణరావు డి) కె. రాఘవేంద్రరావు ► ‘ప్రేమనగర్’ అనే చిత్రం ద్వారా తన సురేశ్ ప్రొడక్షన్ సంస్థ నిలబడిందని నిర్మాత డి.రామానాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఆ చిత్రదర్శకుని కుమారుడు కూడా ప్రముఖ దర్శకుడే) ఎ) బోయిన సుబ్బారావు బి) కె. విశ్వనాథ్ సి) కె.యస్. ప్రకాశరావు డి) వి.మధుసూదన్‌రావు ► ‘విన్నర్’ సినిమాకి యాంకర్ సుమ ఓ పాట పాడింది. ఆమె పాడిన పాటలో ఓ యాంకర్ నటించారు. ఎవరా యాంకర్? ఎ) రేష్మి గౌతమ్ బి) అనసూయ సి) ఝాన్సీ డి) శిల్పా చక్రవర్తి ► ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే’ అనే పాటలో నటించిన తార ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) రిచా గంగోపాధ్యాయ సి) హంసా నందిని డి) ముమైత్‌ఖాన్ ► చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ హీరోయిన్ చిరంజీవితో మొదటిసారిగా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) రమ్యకృష్ణ బి) మీనా సి) నయనతార డి) టబు ► హీరో నాని ‘కృష్ణార్జున యుద్ధం’అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంతో కలిపి ఇప్పటివరకు నాని ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో గుర్తు తెచ్చుకోండి? ఎ) 3 బి) 2 సి) 4 డి) 1 ► యోగా గురువు ‘భరత్ ఠాగుర్’ తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో నటించిన హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీరోయిన్ పేరేంటో చెప్పేయండి? ఎ) సంగీత బి) సిమ్రాన్ సి) స్నేహ డి) భూమిక ► దర్శకుడు మణిరత్నం 1983వ సంవత్సరంలో మొదటిసారిగా దర్శకునిగా అరంగేట్రం చేశారు. ఆయన ఏ భాషలో తన మొదటి సినిమాను తెరకెక్కించారో తెలుసా? ఎ) కన్నడ బి) మలయాళం సి) తమిళ్ డి) తెలుగు ► ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఈ హీరోయిన్, అజయ్ దేవ్గన్తో ‘హిమ్మత్వాలా’లో కూడా నటించింది? ఎ) రాశీ ఖన్నా బి) లావణ్య త్రిపాఠి సి) తమన్నా భాటియా డి) శ్రియ శరన్ ► హీరో నాగచైతన్య ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) ఐయామ్ చే బి) అక్కినేని చైతన్య సి) చే అండర్స్కోర్ అక్కినేని డి) దిస్ ఈజ్ చే ► శ్రీ విష్ణు నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఓ దర్శకుడు నటుడయ్యారు, ఆయన పేరేంటో తెలుసా? ఎ) దేవి ప్రసాద్ బి) పరశురామ్ సి) కోన వెంకట్ డి) తరుణ్ భాస్కర్ ► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం పేరు ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన నటి పేరేంటి? ఎ) సమంత బి) కీర్తీ సురేష్ సి) నిత్యామీనన్ డి) అనుష్క ► దర్శకుడు శ్రీను వైట్ల భార్య కూడా సినీ రంగంలోని ఓ విభాగంలో పని చేస్తున్నారు. అమె పని చేస్తున్న విభాగం పేరేంటి? ఎ) ఫ్యాషన్ డిజైనర్ బి) ఆర్ట్ డిపార్ట్మెంట్ సి) ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డి) ఎడిటింగ్ ► ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అనే పాట రచయిత ఎవరు? ఎ) వరికుప్పల యాదగిరి బి) మాస్టర్జీ సి) కేదారేశ్వర్ డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి ► ‘లైఫ్‌లో ఎపుడైనా ఏమైనా జరగొచ్చు, అది జరిగినప్పుడు దాన్ని మనం ఫేస్ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామా.. లేదా అన్నదే ముఖ్యం’.. ఈ డైలాగ్ చెప్పింది హీరో నాగచైతన్య. ఇది ఏ సినిమాలోని డైలాగో చెప్పుకోండి? ఎ) యుద్ధం శరణం బి) బెజవాడ సి) ఆటోనగర్ సూర్య డి) సాహసం శ్వాసగా సాగిపో ► అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలోని బంగళా సెట్‌కి మంచి పేరొచ్చింది. ఆ బంగళాను డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఎవరు? ఎ) ఆనంద్ సాయి బి) రవీందర్ రెడ్డి సి) అశోక్ కుమార్ డి) బ్రహ్మ కడలి ► కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) నాలుగు స్తంభాలాట బి) రెండు రెళ్ల ఆరు సి) సీతాకోక చిలుక డి) స్వరకల్పన ► ఈ క్రింది ఫోటోలోని నటుడెవరో గుర్తు పట్టండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాగశౌర్య డి) ప్రభాస్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) ఎ 3) ఎ 4) సి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) ఎ 16) డి 17) డి 18) బి 19) సి 20) ఎ -
లెక్క చెప్పాల్సిందే!
కథానాయిక తమన్నా చేతి నిండా క్యాష్ ఉంది. కానీ ఆ క్యాష్ ఆమెది కాదు. ఓన్లీ కౌంట్ చేయడమే ఆమె పని. పైగా పైవాళ్లకు లెక్క చెప్పాలి. ఇదేం జిమ్మిక్కు అంటే.. అవును బ్యాంక్ ఉద్యోగి అంటే అంతేగా మరి. శీను రామస్వామి దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్, తమన్నా జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘కన్నే కలైమానే’. షూటింగ్ పూరై్తంది. ఈ సినిమాలో తమన్నా బ్యాంక్ ఉద్యోగి పాత్ర చేశారని కోలీవుడ్ టాక్. ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. హీరో ఉదయ్‌ను స్కూటర్‌పై ఎక్కడికో తీసుకెళ్తున్నారు తమన్నా. వీళ్ల ప్రయాణం ఎక్కడికి అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ‘‘శీను రామసామి దర్శకత్వంలో నటించినందుకు ఆనందంగా ఉంది. నాలోని యాక్టింగ్ స్కిల్స్‌ను ఎక్స్ప్లోర్ చేయగలిగే క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. ఉదయనిధి స్టాలిన్ చాలా సెన్సిటివ్ యాక్టర్. కెమెరామేన్ జలంధర సార్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయన తీసిన విజువల్స్ సినిమాకు హైలైట్’’ అని ఈ సినిమా జర్నీ గురించి పేర్కొన్నారు తమన్నా.