Toilet construction
-
తాగునీటికి తిప్పలు.. ఒకటికొస్తే అవస్థలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన ప్రహసనంగా మారింది. సరైన వసతులు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ... నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు వేచి ఉండలేక ఇళ్లకెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని 7,021 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణం, 1,811 కేంద్రాలకు తాగునీటి వసతి ఏర్పాటు కోసం పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2024–25లో రూ.10 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. కానీ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియనున్నా వేగం పుంజుకోవడం లేదు. పురోగతి లేని పనులు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. వీటిల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తారు. సమగ్ర పౌష్టికాహారాన్ని అక్కడే వండి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల వండిన ఆహారానికి బదులుగా ముడిసరుకునే అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని కేంద్రాలకు వీటిని మంజూరు చేసింది. 7,021 కేంద్రాలకు టాయిలెట్లు మంజూరు చేయగా... ఇందులో కేవ లం 1,015 టాయిలెట్లకు సంబంధించిన నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 1,738 కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా..4,268 కేంద్రాల్లో పనులు ప్రారంభానికే నోచుకోలేదు.అదేవిధంగా 1,864 అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి వసతికి సంబంధించి పనులు మంజూరు కాగా కేవలం 289 మాత్రమే పూర్తయ్యాయి. మరో 406 కేంద్రాల్లో పనులు కొనసాగుతుండగా.. 1,169 కేంద్రాల్లో అసలు ప్రారంభమే కాలేదు. పాలకవర్గాలు లేకపోవడమే కారణం? ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పనులు ప్రారంభించకుంటే మంజూరైన నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక పాలన ప్రారంభమైంది. అంగన్వాడీల్లో వసతుల కల్పనలో స్థానిక సంస్థల పాత్రే కీలకం. కానీ పాలకమండళ్లు లేకపోవడం, ప్రత్యేక పాలన కొనసాగుతుండడంతో అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణ పనులపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొంటున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి అంగన్వాడీ కేంద్రం పరిస్థితి ఇదీ. ఇక్కడ 22 మంది చిన్నారులున్నారు. టాయిలెట్ అసంపూర్తిగా ఉండటంతో రోడ్డుపైనే లఘుశంక తీర్చుకుంటున్నారు. ఈ కేంద్రంలో తాగునీటి వసతి కూడా లేకపోవడంతో చిన్నారులు, ఈ కేంద్రానికి వచ్చే బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.కోటి స్వాహా!
చింతపల్లి : మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసే బిల్లుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆన్లైన్లో లబ్ధిదారులకు బిల్లు చెల్లించినట్లుగా చూపించి.. ఏకంగా సుమారు రూ.కోటికి పైగా స్వాహా చేశారు. చింతపల్లి మండలంలో అధికారులు మరుగుదొడ్ల బిల్లుల్లో మొదటి విడత చెల్లించి.. రెండో విడతలో మొండి చేయి చూపించారు. మరి కొందరికి అసలు బిల్లులే చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు వాటిని పంచుకు తిన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసినట్లు తెలియడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రూ.6వేల చొప్పున రెండు విడతల్లో.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చింతపల్లి మండలంలోని 34 గ్రామాల్లో 3,874 మందిని మరుగుదొడ్లు లేనివారిని లబ్ధిదారులుగా గుర్తించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రూ.12 వేలను లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తుంది. మరుగుదొడ్డి నిర్మాణ దశలను ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ చేసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి వద్ద లబ్ధిదారుడిని ఉంచి ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శి, సంఘబంధం అధ్యక్షురాలు, సర్పంచ్ సంతకం చేసి పరిశీలించి రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ధ్రువీకరణ అనంతరం గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ వెసులుబాటును అవకాశంగా చేసుకుని అంతా కుమ్మకై ్క బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు తెరలేపిన అధికారులు.. మరుగుదొడ్ల బిల్లులు బిల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఉండడం ఏమిటని అధికారులను ఇటీవల కొందరు లబ్ధిదారులు నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2018 సంవత్సరంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 2019లోపే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించింది. అయితే మొదటి విడత రూ.6 వేలు లబ్ధిదారులకు ఇచ్చి, మరో రూ.6 వేలు కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్టు మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారు మరుగుదొడ్లు నిర్మించుకోకున్నా నిర్మాణం జరిగినట్లుగా ఆన్లైన్ చేసి నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. పలు గ్రామాల్లో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి సొమ్మును సైతం మింగేశారు. అసలైన లబ్ధిదారులు డబ్బుల గురించి అడిగితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు మురిగిపోయాయని చెబుతూ వస్తున్నారు. పైసా ఇవ్వలేదు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నా తల్లి పిల్లి యాదమ్మ పేరు మీద 2019లో మరుగుదొడ్డి నిర్మించుకున్నా. ఇందుకు సంబంధించి బిల్లు ఇవ్వాలని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగేళ్లు కావస్తున్నా పైసా ఇవ్వలేదు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి. – పిల్లి లింగం, చింతపల్లి బిల్లులు ఇప్పించేలా చూస్తాం మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లు అందని కొందరు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకుని బిల్లులు పొందని వారిని ఏపీఓను సంప్రదించాలని సూచించాం. బిల్లులు అందని వారికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – రాజు, ఎంపీడీఓ, చింతపల్లి బిల్లులు అందలే.. చింతపల్లి మండల కేంద్రంలోనే 180 మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు రూ.6 వేలు అందగా.. రెండో విడతకు సంబంధించి రూ.6 వేలు రావాల్సి ఉంది. కుర్మేడు గ్రామంలో 130, కుర్రంపల్లిలో 130 మందికి రెండు విడతలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. వెంకటంపేట, నసర్లపల్లి గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మించుకోని వారి పేరిట బిల్లులు స్వాహా చేయగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి మాత్రం బిల్లులు అందించలేదు. నెల్వలపల్లి, ఉప్పరపల్లి, గడియగౌరారం, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, వింజమూరు గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
వాటిని కట్టకున్నా.. నిధులు కొట్టేశారు
సాక్షి, వరంగల్: ఖానాపురం మండలంలోని మంగళవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని కార్యదర్శిని సస్పెండ్ చేశారు. పూర్తి విచారణ, వివరాలు తెలియకముందే అతడికి ఆత్మకూరు మండలంలో పోస్టింగ్ సైతం ఇచ్చేశారు. ఈ క్రమంలో మరోసారి గ్రామంలో నిధుల గోల్‌మాల్‌పై దుమారం రేగింది. మరుగుదొడ్లు నిర్మించుకోకుండానే బిల్లులు కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఫోర్జరీ సంతకాలతో బిల్లులు కాజేసిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మించకున్నా బిల్లులు.. గతంలో మంగళవారిపేట పంచాయతీ కార్యదర్శిగా శ్రీధర్ పని చేశారు. అయితే, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో మే 4న ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు కొట్టేశారనే ఆరోపణలు గత రెండు రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు చేయకున్నా బిల్లులు ఎలా సాధ్యమయ్యాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగా.. తమకేమీ తెలియకుండానే ఇలా జరిగిందంటూ ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 మరుగుదొడ్లు మంజూరు కాగా, ఇందులో అసలు నిర్మించుకోని వారికి బిల్లులు వచ్చాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి మాత్రం సగం బిల్లులు, కొంత మందికి రెండుసార్లు బిల్లులు మంజూరయ్యాయి. పూర్తిగా కట్టుకున్న వారిలో కొంత మందికి మాత్రమే బిల్లులు రావడంతో ఇందులో ఎవరి హస్తం ఉందని, బిల్లులు ఎవరు కాజేసారో తెలియాల్సిందేననంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. రూ.6 లక్షలు డ్రా.. బిల్లుల విషయమై పాలకవర్గ సభ్యులు మాత్రం గతంలో పని చేసిన కార్యదర్శిపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిధుల గోల్మాల్ విషయంలో అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్చార్జ్ కార్యదర్శి ఆధ్వర్యంలో బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇందులో పాత కార్యదర్శి తమ సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు రూ.6 లక్షలు కాజేసి నర్సంపేటకు చెందిన నలుగురి ఖాతాల్లో జమచేసినట్లు సర్పంచ్ లావుడ్య రమేష్‌నాయక్, ఉప సర్పంచ్ ఉపేందర్ గుర్తించారు. ఈ మేరకు ఫోర్జరీగా గుర్తించిన చెక్కులను జిరాక్స్ తీయించి ఎంపీడీఓ సుమణవాణికి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే, సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సైతం ఫిర్యాదు చేశారు. కాగా, మరుగుదొడ్ల బిల్లులపై విచారణ జరిపి కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.440 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.440 కోట్లతో ప్రత్యేక నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేయించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విజయవాడలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేలా పాఠశాలల్లో విద్యార్థినులకు, మహిళా టీచర్లకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతారని.. వారి కోసం ఇంతలా ఆలోచించిన ప్రభుత్వాలు గతంలో లేవన్నారు. బుక్స్, బ్యాగ్స్, షూస్, డ్రస్, గ్రీన్ బోర్డు, కాంపౌండ్ వాల్స్, లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మంచినీరు, మధ్యాహ్న భోజనం.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని సీఎం స్వయంగా పరిశీలించడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఆయాకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి ఆదిమూలపు చెప్పారు. -
మరుగుదొడ్ల నిర్మాణం.. టీడీపీ అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్లు గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. మరుగుదొడ్లు కట్టుకోవడానికి రుణం కోసం వెళ్లిన వారికి ఇప్పటికే మీ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందంటూ అధికారులు ఇస్తున్న సమాధానంతో వారు కంగుతింటున్నారు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారుస్తున్నామంటూ హడావుడి చేసి జిల్లా వ్యాప్తంగా వేలాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లు లెక్కలు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. అటువంటి ఘటనే మరొకటి ఇటీవల వెలుగు చూసింది. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామంలో 2018లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.40 లక్షల మేర దుర్వినియోగం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..) అయ్యపరాజుగూడెం గ్రామానికి చెందిన పలువురు కొంత కాలంగా గ్రామ సచివాలయానికి వెళ్లి తాము మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పరిశీలించగా.. వారి పేర్లతో 2018లోనే మరుగుదొడ్ల కోసం రుణం తీసుకున్నట్లు ఉంది. దీంతో వారు మీపేరు మీద మరుగుదొడ్డి తీసుకున్నట్లుగా ఉంది. అసలు తాము మరుగుదొడ్డి ఇంటి వద్ద నిర్మించుకోకుండా ఎలా బిల్లులు చేశారు. కనీసం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయరా అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. (చదవండి: ఆ వదంతులు అవాస్తవం: రామసుబ్బారెడ్డి) గ్రామ టీడీపీ నేత చేతివాటం 2018లో గ్రామంలో సుమారు 266 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు పి.శ్రీనివాసరావు ఓ తాపీ మేస్త్రి పేరుతో కాంట్రాక్టు పొందారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.15 వేలు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఆ సమయంలో గ్రామంలో లేనివారు, చనిపోయినవారు, మరుగుదొడ్డి నిర్మించుకోని వారి ఆధార్ కార్డుల నంబర్లను తీసుకుని వారి పేర్లు మీద మరుగుదొడ్లు నిర్మించినట్లుగా నగదును డ్రా చేసినట్లు సమాచారం. ఇది అప్పట్లో ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పర్యవేక్షణలో జరిగాయి. ఈ నిర్మాణాల గురించి పట్టించుకోకుండా దొడ్లు కట్టించిన తెలుగుదేశం నాయకుడి మాటే వేదవాక్కుగా దొంగ సంతకాలు చేసి ఇచ్చిన లిస్ట్ ఆధారంగా అధికారులు బిల్లులు చెల్లించేశారు. మొత్తం 266 మరుగుదొడ్లలో రెండు వందలకుపైగా మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసినట్టు సమాచారం. దీనిపై పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగులు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించిన సదరు నేతను నిలదీస్తే తనకు సంబంధం లేదని, ఏం చేస్తారని బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్వాకం వల్ల ఇప్పుడు తాము మరుగుదొడ్డి నిర్మించుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు. మరుగుదొడ్డి నిర్మించినట్టు రికార్డుల్లో ఉంది మరుగుదొడ్డి నిర్మించుకుందామని గ్రామ సచివాలయానికి వెళ్లి నాపేరు అన్లైన్లో నమోదు చేయించుకోవడానికి దరఖాస్తు ఇచ్చాను. కంప్యూటర్లో నాపేరును నమోదు చేస్తుంటే మరుగుదొడ్డికి రుణం నేను గతంలో తీసుకున్నట్లు ఉంది. నాపేరు మీద మరుగుదొడ్డి డబ్బులు ఎవరు తీసుకున్నారని సచివాలయంలో అడగ్గా మరుగుదొడ్లు కాంట్రాక్టు చేసిన పిల్లల శ్రీను తీసుకున్నారని చెప్పారు. – చీదరాల కృష్ణకుమారి, అయ్యపరాజుగూడెం నిర్మించకుండానే డబ్బులు కాజేశారు నాకు మరుగుదొడ్డి నిర్మిస్తానని చెప్పి పిల్లల శ్రీను అనే వ్యక్తి ఆధార్ కార్డు తీసుకున్నాడు. అ తరువాత వచ్చి నీ కార్డు అన్లైన్ కావటం లేదు దొడ్డి రాదని చెప్పారు. తీరా ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్డి నిర్మించుకుందామని సచివాలయానికి వెళ్లి అడిగితే ఆధార్ నంబరు కొట్టి చూస్తే మరుగదొడ్డి కట్టినట్లుగా నాపేరు మీద రూ.15 వేలు నగదు తీసుకున్నట్లుగా ఉంది. – యర్రా జయమ్మ, అయ్యపరాజుగూడెం ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం అవకతవకలు విషయం ఇప్పటి వరకు నాదృష్టికి రాలేదు. లబ్ధిదారులు ఫిర్యాదుచేస్తే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, ఎంపీడీఓ, లింగపాలెం -
‘చెప్పుకోలేని బాధకు’..చలించిపోయారు..
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి.. టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. వాళ్లది చెప్పుకోలేని బాధ... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్‌లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్‌లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు. Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A — Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019 -
ఓడీఎఫ్ సాధ్యమేనా.?
సాక్షి, ఆదిలాబాద్ : పల్లెల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దానిని ఆచరణలో సాధ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించిన ప్రభుత్వాలు మూడేళ్లలో జిల్లాలో 73శాతం మార్పు తీసుకొచ్చాయి. మిగతా 27 శాతం ప్రగతి సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం)గా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఓడీఎఫ్‌గా ప్రకటించబడుతాయి. దీంతో జిల్లాలోని 13పాత మండలాల పరిధిలోని 589 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. అంటే మన జిల్లాలోని గ్రామాలన్నీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలని దానర్థం. జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు ఇంకా పక్షం రోజులే మిగిలింది. ఇందుకు అధికారులు గత నెల రోజులుగా తీరిక లేకుండా శ్రమిస్తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలతో మమేకమవుతున్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నా.. ఎందుకు పూర్తి కావడం లేదనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు. జిల్లాలో నిర్మాణాలు ఇలా.. 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాసాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్హెచ్ఎల్) ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 ఇళ్లకు లేవని అధికారులు తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. అదే ఏడాదిలో మరుగుదొడ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో మరో 10,292 మంది నిర్మించుకున్నారు. మిగతా 59,374 మంది నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే సొంత డబ్బులతో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం, కార్యాలయాలకు తిరిగి తిరిగి వేసారిపోవడం లాంటివి జరిగాయి. అంత పూర్తి అయినా.. ఆన్లైన్లో ఫొటోలను అప్లోడ్ చేయకపోవడంతో బిల్లులు ఆగిపోయిన సంఘటనలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న ప్రజలు మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు అప్పట్లోనే గుర్తించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో గత మూడేళ్ల క్రితం జిల్లాలో స్వచ్చభారత్ కింద 59,374 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటి వరకు 29,905 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 25,808 మరుగుదొడ్లు వివిధ స్థాయిలో నిర్మాణాల్లో ఉండగా, 3661 నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. పక్షం రోజుల్లో ‘లక్ష్యం సాధ్యమేనా’.? జిల్లాలో ఏ ఒక్క ఇంటిలో మరుగుదొడ్డి లేదని చెప్పేందుకు వీలులేకుండా అధికారులు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఇది వరకే పలుసార్లు ఆయా మండలాలను ఎంపీడీవోలను ఆదేశించారు. గతేడాది గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలకు, సర్పంచ్‌లకు, అధికారులకు గాందీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేసినా మార్పు కన్పించలేదు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 28 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందుకు పక్షం రోజులే గడువుంది. ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయని అధికారులు పేర్కొనగా ప్రస్తుతం నిర్మించుకున్న వాటికి బిల్లులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. (ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి రూ.16.20 కోట్లు విడుదల కావడంతో అప్పట్లో నిర్మాణాల్లో జాప్యం జరిగింది. కానీ ప్రస్తుతం సరిపడా నిధులు అందుబాటులో ఉన్న ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో నిర్మాణాలను వేగవంతం చేసేలా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, యువత, మిగతా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓడీఎఫ్‌గా ప్రకటిస్తే.. జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో మల విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. పరిశీలన చేసేందుకు గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ని నియమించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు కేంద్రం అందజేయనుంది. దీంతో పాటు మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగేలా ప్రజలను చైతన్యపరిస్తే స్వచ్ఛగ్రహీలకు ప్రభుత్వం నగదు పురస్కారం ఇవ్వనుంది. గోబర్‌గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 ప్రొత్సాహంగా అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజును అమలు చేయడం, అంకితభావంతో పని చేసే స్వచ్ఛగ్రహీలకు సత్కరాలు, అవార్డులు ఇవ్వనుంది. స్వచ్ఛగ్రహీ ఉద్యోగం శాశ్వతం కాకపోయిన ఇంటిలో మరుగుదొడ్డి ఉన్న యువతను మాత్రమే ఎంపిక చేసుకునేలా రాష్ట్రాలను ఆదేశించింది. -
మరుగుదొడ్లు నిర్మించకపోతే ప్రభుత్వ పథకాలు కట్
సాక్షి, నర్సాపూర్: మరుగుదొడ్లు నిర్మించకపోయినా, నిర్మించిన వాటిని వాడకపోయినా వారికి ప్రభుత్వం పథకాలు నిలిపివేస్తామని చేస్తామని డీపీవో హనోక్ తెలిపారు. గురువారం చిలప్‌చెడ్ మండలంలోని సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకోని పలు కుటుంబాల కరెంట్, నల్లా కనెక్షన్లు తొలగించారు. ఈ సందర్భంగా డీపీవో హనూక్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛత విషయంలో సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ అట్టడుగు స్థాయిలో ఉందని ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీలో మొత్తం 430 మరుగుదొడ్ల నిర్మాణాలకు గానూ కేవలం 350 మాత్రమే పూర్తయ్యాయని, ఎన్నిసార్లు అధికారులు స్వచ్ఛత గురించి అవగాహన కల్పించినా గ్రామస్తులు మారకపోవడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఉమ్మడి సోమక్కపేట్ నుంచి కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన సామ్లా తండా, రహీంగూడ గ్రామాలలో సైతం మరుగుదొడ్లు పరిశీలించి, నిర్మించుకోని పలు కుటుంబాలకు విద్యుత్, నల్లా కనెక్షన్లు తొలగించడంతో పాటు ప్రభుత్వ పథకాలైన రేషన్, పింఛన్ తదితర వాటిని కూడా తొలగిస్తామన్నారు. అదే విధంగా మరుగుదొడ్లు వెంటనే నిర్మించుకున్న వారికి కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దేవయ్య, ఎంపీడీఓ కోటిలింగం, ఏపీవో శ్యాంకుమార్, మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శులు, సామ్లా తండా సర్పంచ్ భిక్షపతి నాయకులు లక్ష్మణ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి మరుగుదొడ్డితో లింక్
సాక్షి, నల్లగొండ : మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే జూలై నుంచి సంక్షేమ పథకాలు కట్ అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకం కింద గ్రామీణ ప్రాంతంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు మరుగుదొడ్డి నిర్మించాలని 2014 సంవత్సరంలో పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.12వేలు చెల్లిస్తారు. అయితే పథకం ఈనెల చివరి నాటికి పూర్తవుతుంది. దాంతో ఆ తర్వాత నిర్మించుకున్న మరుగుదొడ్డికి కేంద్ర నిధులు అందే అవకాశం లేదు. ఆ స్కీం సమయం పూర్తవుతున్నందున ఈలోపు నిర్మించుకుంటేనే ఇటు మరుగుదొడ్డి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఈనెల 30లోపు ఎవరైతే మరుగుదొడ్లు మంజూరై నిర్మాణం చేసుకోకుండా ఉంటారో వారికి రేషన్ కట్ చేయడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ రుణాలను నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మలవిసర్జన గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఇంకా మరుగుదొడ్డి నిర్మించుకోకుండా బహిర్భూమికి వెళ్తున్నారు. సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా ఇంకా బహిర్భూమికి బయటికి వెళ్లడాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసి ప్రతి కుటుంబంలో మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అందుకు రెండు ప్రభుత్వాలు నూటికి నూరు శాతం ఉచితంగా లబ్ధిదారునికి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు డబ్బులు మంజూరు చేస్తున్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు చెల్లిస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60శాతం కింద రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాకింద రూ.4800 చెల్లిస్తున్నాయి. లబ్ధిదారునికి పూర్తిగా ఉచితంగానే నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. 2014లో పథకం ప్రారంభం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకాన్ని 2014 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. మొదట నీటి పారుదల, పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత దాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 95601 మరుగుదొడ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటివరకు 76309 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఇంకా 18847 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా పూర్తికాని నిర్మాణాలు ఐదేళ్లుగా పథకం కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు పదేపదే సమావేశాలు, సమీక్షలు నిర్వహించి చెప్తున్నప్పటికీ నిర్మాణాల్లో మాత్రం జాప్యం ఆగలేదు. ఇప్పటికే పూర్తి కావాల్సిన మరుగుదొడ్లు ఇంకా కొన్ని నిర్మాణ దశల్లోనే ఉన్నాయి. దీంతో ఇచ్చిన గడువుకూడా దగ్గర పడుతుండడంతో కలెక్టర్ గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్మాణంలో వెనుకబడిన మండలాలు జిల్లాలో అత్యధికంగా అనుముల మండలంలో 2580 మరుగుదొడ్లు నిర్మాణంలో వెనుకబడి పోగా దేవరకొండ మండలంలో 2242, కనగల్ మండలంలో 1270, నిడమనూర్ మండలంలో 1698, పెద్దవూర మండలంలో 2653, త్రిపురారం మండలంలో 1441, వేములపల్లి మండలంలో వెయ్యి మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే చిట్యాల, దామరచర్ల మండలాలు నూటికి నూరుశాతం పూర్తి చేయగా, గుడిపల్లి మండలంలో ఒక్క మరుగుదొడ్డి పెండింగ్‌లో ఉంది. గుర్రంపోడులో పది, మిర్యాలగూడలో 35, నకిరేకల్‌లో 15, నార్కట్‌పల్లిలో 2, శాలిగౌరారంలో 25 మరుగుదొడ్లు మాత్రమే పెండింగ్‌లో ఉండగా 100 నుంచి వెయ్యిలోపు పెండింగ్‌లో ఉన్నాయి. -
స్వచ్ఛత పనుల జోరు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు. 3600 మరుగుదొడ్లు మంజూరు మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసక్తి చూపుతున్న ప్రజలు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు. చెక్కుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి. స్వచ్ఛత పాటిస్తాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట -
15 రోజులే మిగిలింది ..
సాక్షి,నవాబుపేట: మరుగదొడ్లు వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్ విధించినా.. గ్రామాల్లో ఇంకా నత్త నడకన వాటి నిర్మాణం సాగుతుంది. దీంతో మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అది ఆచరణలో లేక పోవటం శోచనీయం. కేవలం రెండు, మూడు గ్రామాలు మినహయిస్తే మిగతా వాటిలో చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి725 మరుగుదొడ్లు ప్రారంభమే కాలేదు. కాగా అమ్మపూర్, కొండాపూర్, ఇప్పటూర్, పోమాల్, కొల్లూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు ని ర్మించాల్సి ఉంది. కాగా లబ్ధిదారులు మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించి మార్కవుట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఏర్పడింది. దీంతో మార్చి టార్గెట్ పూర్తి కావటం కష్టంగానే మారింది. కాగా మొత్తం 3432 మరుగుదొడ్లు మార్చిలో పూర్తిచేయాలని ఉండగా 1350 పూర్తయ్యాయి. నవాబుపేటలో 307, లోకిరేవులో 235, కూచూర్లో230, ఖానాపూర్‌లో 134, కాకర్జాలలో 250, హజిలాపూర్‌లో 188, చౌడూర్‌లో 122, గురుకుంటలో 188, కాకర్లపహడ్లో 128, కారుకొండలో 184, తీగలపల్లిలో130 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో మహిళా మేస్త్రీలు.. మండలంలో ప్రత్యేకంగా 25 మంది మహిళా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ప్రత్యేకంగా 5 రోజులు శిక్షణ ఇచ్చి, మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
దేన్నీ వదల్లేదు.. మొత్తం మింగేశారు
సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఐదేళ్లలో అందినకాడికి అవినీతి సొమ్మును వెనకేసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పాలకుల జేబులు నింపేందుకే అన్నట్లు వ్యవహరించారు. నీరు–చెట్టు, నీటికుంటలు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ ఇలా అన్ని పథకాలకు అవినీతి మరకలు అంటించారు. ప్రజలను అమాయకులను చేసి వారికి అందాల్సిన నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పెద్దారవీడు మండలంలోని ఒక్క మద్దలకట్ట పంచాయతీలోనే మరుగు దొడ్ల పేరుతో రూ. 27,15,500 సొమ్మును కాజేశారు. సగం సగం పనులు చేయించుకున్న లబ్ధిదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఖాతాల్లో నగదు జమ అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరగుదొడ్ల పథకం టీడీపీ అవినీతికి ఓ మచ్చు తునక. లబ్ధిదారులకు తెలియకుండానే వారికి రావాల్సిన నగదును దొడ్డిదారిన నాయకులు తమ అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. మండలంలోని మద్దలకట్ట గ్రామంలో లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 538 మందికి మరుగుదొడ్లు నమోదయ్యాయి. అధికారులు కూడా ధ్రువీకరించడంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించారు. కొంత మంది లబ్ధిదారులు గుంతలు తీయగా మరోకొంత మంది రింగులు, గోడల వరకు నిర్మాణం పూర్తి చేశారు. కానీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. అవి దారిమారి నాయకుల ఖాతాల్లో జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితులు ఏడాదిగా అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం విశేషం. ఎవరెవరు ఎంత దోచుకున్నారంటే..! మద్దలకట్ట పంచాయతీలో 181 మంది లబ్ధిదారుల పేరుతో - రూ. 27,15,500 అవినీతి యమా దాసయ్య 53 మందివి - రూ. 7,88,000 పత్తి శ్రీనివాసరావు 65 మందివి - రూ.9,88,500 ఔకు వెంకటేశ్వర్లు (ఎంపీటీసీ సభ్యుడు) 31మందివి - రూ. 4,70,000 ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మందివి - రూ. 1,80,000 దొడ్డా భాస్కరరెడ్డి 20 మందివి - రూ. 2,89,000 అంతా అవినీతిపరుల ఖాతాల్లోకి మద్దలకట్ట పంచాయతీలో 538 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వాటిలో 181 మంది లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణ నిధులు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కాజేశారు. మద్దలకట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దొడ్డా భాస్కరరెడ్డి 20 మంది రూ 2,89,000, చాట్లమడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు యమా దాసయ్య 53 మంది రూ 7,88,000 , మాచరాజుకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పత్తి శ్రీనివాసరావు 65 మంది రూ 9,88,500, చాట్లమడ గ్రామానికి చెందిన మద్దలకట్ట ఎంపీటీసీ సభ్యులు ఔకు వెంకటేశ్వర్లు 31 మంది రూ 4,70,000, చట్టమిట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మంది రూ. 1,80,000 నిధులను వారి సొంత బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. కొంత మంది తమ బ్యాంక్ ఖాతాలలో నిధులు జమకాలేదన్న కారణంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణాలను మధ్యలోనే అపివేసినప్పటికీ అదికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేసి, నిధులను తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి బిల్లులు ఇప్పించాలని లబ్దిదారులు కోరుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సైతం అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. బిల్లు ఇప్పించండి మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తీసి రింగులు వేశాను. బిల్లుల గురించి అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదు. మొత్తం 48 మంది గుంతలు, రింగులు, గోడలు నిర్మించాం. జనవరిలో జరిగిన జన్మభూమి గ్రాభసభలో కూడా ఫిర్యాదు చేశాం. స్థానిక టీడీపీ నాయకులు దొడ్డా భాస్కరరెడ్డి, యమా దాసయ్య, పత్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఔకు వెంటేశ్వర్లు, ఏర్వ రామాంజనేయరెడ్డి, అధికారులు కలిసి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు చేయించుకొని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నారు. మాకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ ఇవ్వలేదు. – జడ్డా దానియేలు, మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీ -
మరుగుదొడ్లలో అవినీతి కంపు
సాక్షి, రొద్దం: అవినీతి కాదేదీ అనర్హమంటున్నారు అధికార పార్టీ నాయకులు. ఏకంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకెళితే..మండలంలోని 19 గ్రామ పంచాయితీల్లోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 8700 మరుగుదొడ్లు మంజూరు కాగా 6,533 నిర్మాణాలను 2016 నుంచి 2019 ఫిబ్రవరి వరకూ విడతల వారీగా పూర్తి చేశారు. ఇందుకోసం రూ.9.78 కోట్ల చెల్లింపులు జరిగాయి. మరుగుదొడ్డి కట్టకుండానే బిల్లు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను అధికార పార్టీ నాయకులే చేయించారు. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ చిన్నప్పయ్య పనులు చేశారు. మిగతా పంచాయతీల్లో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో పనులు పూర్తి చేశారు. చాలా చోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పునాదులు తీసి వాటిని పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు దిగమింగినట్లు తెలుస్తోంది. ఇక పాతవాటికి కూడా బిల్లులు చేసినట్లు సమాచారం. ఒకే తలుపును మరుగుదొడ్లకు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా అవినీతి జరిగినట్లు సమాచారం. పెద్దగువ్వలపల్లి గ్రామంలోనే దాదాపు రూ.40 లక్షల దాకా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. బోగస్ బిల్లులు చేయడానికి ఒప్పుకోని ఒక ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్‌ను జెడ్పీటీసీ బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. నాణ్యతకు పాతర.. మరుగుదొడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకమైన ఇటుకలు వాడడంతోపాటు సిమెంట్ తగిన పాళ్లలో వాడలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక చాలావాటికి రింగులే ఇవ్వలేదు. నిర్మాణాలు నాసిరకంగా ఉండడంతో లబ్ధిదారులు వాటిని వినియోగించడానికి కూడా భయపడుతున్నట్లు సమాచారం. -
మరుగుదొడ్ల నిధులు గోల్మాల్!
గుంటూరు, వడ్లమూడివారిపాలెం(రొంపిచర్ల): ఇప్పటివరకు మండలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య లోలోన రగులుతున్న విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రచ్చకెక్కి కుమ్ములాటలకు దారితీస్తున్నాయి. మండలంలోని వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో జరిగిన అవినీతి మంగళవారం గుప్పుమంది. ఈ గ్రామంలో నాలుగున్నరేళ్లలో 400 మంది వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. నిర్మించిన మరుగుదొడ్లన్నింటికీ నిధులు విడుదలైనప్పటికీ, ఆ మొత్తం లబ్ధిదారులకు ఇప్పటివరకు నగదు చేరలేదు. దీంతో కొందరు టీడీపీ నాయకులే మరుగుదొడ్లు ఎవరెవరికి వచ్చాయి, నిధులు ఎంతవరకు విడుదలయ్యాయనే సమాచారాన్ని సేకరించారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వెనుకబడిన వర్గాల వారు పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం తమకు మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు రాలేదని గ్రామంలోని ఒక నాయకుడిని సంప్రదించారు. ఆ నాయకుడు దీనిపై ఆరాలు తీస్తుండగా నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్న వారు ఆ నాయకుడితో వాదనకు దిగటంతో పాటు దాడికి కూడా పాల్పడ్డారు. ఇప్పటివరకు 400 మరుగుదొడ్లు నిర్మించగా, అందులో 150 మందికి మాత్రమే నిధులు చేరాయి. మిగతా 250 మందికి మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు అందలేదు. అయితే కొంతమంది రూ.2వేలు ఇచ్చారని, రూ.3వేలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంమీద వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో రూ.30 లక్షల వరకు నిధులు గోల్మాల్ అయినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామంలో చోటుచేసుకున్న ఉద్రిక్త వాతావరణం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. మరుగుదొడ్ల నిధులు అందని లబ్ధిదారులకు త్వరలో ఆ నిధులు అందేటట్టు చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన మీదట కేసు నమోదుకాకుండా ఇరువర్గాల వారు రాజీపడినట్టు సమాచారం. -
బహిర్భూమికి వెళ్లి యువకుడి మృతి..
గౌతంనగర్: ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే సదరు వ్యక్తికి సమాజంలో ఉండే గుర్తింపే వేరు. పైగా దేశ రక్షణలో పాలుపంచుకునే కొలువంటే ఇంకా గౌరవం. అందుకోసమే ఆ యువకులు భరతమాత రక్షణ సేవలో తరించాలని, ఆర్మీలో కొలువు సంపాదించాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా ఇక్కడ మాత్రం కనీస ఏర్పాట్లు లేక ఎముకలు కొరికే చలిలో అల్లాడుతున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం వచ్చిన యువకుల బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మౌలాలిలోని ఆర్ఫీఎస్ సెంటర్లో ఈ నెల 28 నుంచి ఆర్మీలో జేడీ, టైలర్, చెఫ్ కమ్యూనిటీ, స్పెషల్ చెఫ్, వాషర్మెన్, హెయిర్ డ్రెస్సెస్, మెస్ కీపర్ తదితర ఉద్యోగాల నియామకం కోసం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ ఎంపికలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 10 వేల మందికి పైగా తరలివచ్చారు. వీరిలో 4,350 మందిని మాత్రం పరీక్షకు అనుమతిచ్చారు. సుమారు 6 వేల మంది రోడ్లపైనే ఉన్నారు. మంగళవారం రాజస్థాన్, మహారాష్ట్ర, అభ్యర్థుల ఎంపిక చేపట్టగా 2,945 మంది వచ్చారు. బుధవారం తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, డయ్యూ, డామన్, లక్షదీప్, మేఘాలయ, పుదుచేర్చి ప్రాంతాల నుంచి 4 వేల మందికి పైగా హాజరయ్యారు. అయితే, అన్ని రాష్ట్రాలకు కలిసి 85 పోస్టులు మాత్రమే ఉండగా.. మొత్తం 20 వేల మందికి పైగా యువకులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో యువకులు వస్తారని ఆర్మీ అధికారులు అంచనా వేయకపోవడం గమనార్హం. యువకులకు ఉచితంగా భోజనం పెడుతున్న మన క్యాటరింగ్ ప్రతినిధులు యువకుడు మరణించినా మేల్కోని యంత్రాంగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల కోసం టాయిలెట్లు, బాత్రూమ్లు ఏర్పాటు చేయాలనే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా బహిర్భుమికి వెళ్లిన వనపర్తి జిల్లా యువకుడు అరవింద్ విద్యుదాఘాతానికి బలైన విషయం తెలిసిందే. అయినా సరే మేల్కోని అధికారులు తాత్కాలికంగా మూడు మొబైల్ టైయిలెట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వేల మంది యువకులకు రెండు మూడు బాత్రూమ్లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలియాలి. ఇక వచ్చిన వారికి అనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదు. ఇప్పటికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువకులు చలిలో వణుకుతూ రాత్రివేళ రోడ్ల మీదనే పడుకుంటున్నారు. తమ గోడు పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ యువకుల బాధలు చూడలేక ‘మన క్యాటరింగ్’ నిర్వాహకులు సెంటర్ సమీపంలో తాగునీరు, అల్పాహారం, భోజనం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఎన్నో కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసే ప్రభుత్వం, అధికారులు ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడాన్ని పలు విమర్శలకు తావిస్తోంది. పట్టించుకునే వారు లేరు ఆర్మీ సెలక్షన్స్ కోసం కర్ణాటక నుంచి ఒక రోజు ముందే మౌలాలి జేటీఎస్ సమీపంలోని ఆర్పీఎస్కు చేరుకున్నాం. రాత్రి పడుకోవడానికి కనీస వసతి లేదు. చలిలో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించాం. మా గోడు పట్టించుకునేవారు లేరు.– విటల్, అరుణ్ నాయక్ (కర్ణాటక) -
అలాంటి ఇళ్లలో మీరుంటారా..?
ఒంగోలు టూటౌన్ :‘బాత్ రూములు, టాయిలెట్స్ లేకుండా మీరు ఉంటున్నారా..? మనం ఉంటున్నామా చెప్పండి.. మరి అలాంటి భవనాన్ని ఎందుకు అద్దెకు తీసుకున్నారు. బయటకు వెళ్లాలంటే పిల్ల్లలు ఎంత భయపడతారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా’ అంటూ గిద్దలూరు మండలంలోని క్రిష్టింశెట్టిపల్లె గిరిజన సంక్షేమశాఖ వసతి గృహ అధికారిపై జిల్లా డీటీడబ్ల్యూఓ మండిపడ్డారు. వెంటనే ఆ భవనాన్ని మార్చాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పిల్లలను మన పిల్లలుగా చూడాలని హితవు పలికారు. స్థానిక ప్రగతి భవనంలోని గిరిజన సంక్షేమశాఖ, వెల్ఫేర్ కార్యాలయంలో వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలతో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వెంకట సుధాకర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ వార్డెన్, గురుకుల పాఠశాలల హెచ్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వివరాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా వసతిగృహాల్లో ఎంత మంది పిల్లలు ఉంటున్నారనే విషయంపై చర్చించారు. తక్కువగా ఉంటే పిల్లలను ఎందుకు చేర్పించలేకపోయారంటూ ప్రశ్నించారు. ఎక్కువ మంది వార్డెన్లు వర్కర్స్ లేరని, గతంలో పనిచేసిన వర్కర్స్కు జీతాలు ఇవ్వాల్సి ఉందని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు రూములకు నిధులు మంజూరైనా చాలా ప్రాంతాల్లో ఇంత వరకు పనులు ప్రారంభించలేదని తెలిపారు. మార్కాపురం వసతి గృహంలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, అయితే వర్కర్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని వసతిగృహం హెచ్‌డబ్ల్యూఓ తెలిపారు. గిద్దలూరు బాయ్స్ హాస్టల్ కట్టలేదని సమీక్ష దృష్టికి వార్డెన్ తీసుకువచ్చారు. వసతి గృహాల్లో పిల్లలను పెంచమని అడుగుతుంటే సౌకర్యాలు లేవని చెబుతారేంటని అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఉన్న రెండు కళాశాల వసతి గృహాల్లో తక్కువ మంది పిల్లలు ఉండటంపై వార్డెన్లను నిలదీశారు. వందమంది పిల్లలకు అవకాశం కల్పిస్తుంటే 40 నుంచి 50 మంది పిల్లలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఈ సారి సమావేశానికి కల్లా ఒక్కో వసతి గృహంలో 80 మంది పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేయడంతో పాటు ప్రసార మాద్యమాల్లో ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో వసతి గృహాలను తనిఖీ చేస్తామన్నారు. మంచి ఫలితాలు సాధించాలి.. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను బాగా చదివించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనానికి 3,533 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అవ్వగా, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 900 రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లలో ఇంకా 242 మంది పిల్లల దరఖాస్తులకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉపకార వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి సమీక్షా సమావేశం నాటికి ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉండకూడదని సంబంధిత సెక్షన్ ఉద్యోగిని హెచ్చరించారు. ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ అధికారి జోజయ్య, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్వచ్ఛందంగా’ మెక్కేశారు!
ఆలూరు: మరుగుదొడ్ల నిర్మాణంలో హాలహర్వి మండలంలో జరిగిన అవినీతి బయటపడి కొద్ది రోజలు డవక ముందే హొళగుంద మండలం కూడా అదేబాట పట్టింది. థర్డ్‌పార్టీ ముసుగులో కొందరు అధికార పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసి నిజమైన లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండానే.. హొళగుంద మండలంలో స్వచ్ఛ భారత్ కింద మండలానికి 4,500 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైతే అందులో హొళగుంద గ్రామానికి 2 వేలు మంజూరయ్యాయి. అయితే కొందరు అధికార పార్టీ నేతలు థర్డ్‌పార్టీ ముసుగులో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసినట్లు సమాచారం. బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా థర్డ్‌పార్టీలుగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ఖాతాల్లో జమ అయ్యేలా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండానే బిల్లులకు ఓకే చెసినట్లు తెలుస్తోంది. దీంతో నిజమైన లబ్ధిదారులు బిల్లులు అందక బలైపోతున్నారు. ఇదిలా ఉండగా తమ పేరు మీద మరుగుదొడ్డి కట్టినట్లు, బిల్లులు కూడా మంజూరైనట్లు లబ్ధిదారులకు తెలియకపోవడం గమనార్హం. ఇలా ఒక్క హొళగుందలోనే వందలాది మరుగుదొడ్లకు సంబంధించి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా వాడుకున్నారంటే.. ఇంతకు ముందు మరుగుదొడ్డి కట్టుకున్న వారు, అసలు కట్టని వారి పేర్లను తెలుసుకొని ఇళ్ల వద్దకు వెళ్లి ఏవేవో చెప్పి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను సేకరించారు. వారికి తెలియకుండా లబ్ధిదారులుగా చేర్చి మరుగుదొడ్లు మంజూరు చేయించి పక్కా ప్రణాళికతో నిధులు కాజేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మరుగుదొడ్డికి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. అయితే అక్రమార్కులు టెక్నాలజీని ఉపయోగించి దొంగ రికార్డులు సృష్టించి భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అక్రమాలు బయట పడుతుండడంతో అక్రమార్కులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల డబ్బులు ఇచ్చేస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు సమాధానం ఇస్తున్నారని, గట్టిగా అడిగిన వారిని దబాయిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. చేతిలో బిల్లు పెట్టారు ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలనుకున్నాం. అయితే కొందరు వచ్చి మేము మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు చేతిలో బిల్లు కాగితం పెట్టారు. రూ.15వేలు బిల్లు కాజేశారు. దీంతో మేం మరుగుదొడ్డి నిర్మించుకునే వీల్లేకుం డాపోయింది.– శివప్ప, హొళగుంద గ్రామస్తుడు మా బిల్లు కాజేశారు మరుగుదొడ్డి నిర్మించుకుంటే బాగుంటుంది అనుకున్నాం. మొదటి మరగుదొడ్డి నిర్మించుకున్న వెంటనే బిల్లులు ఇస్తామన్నారు. అందుకని కొంత వరకు గుంతను తవ్వి రింగులు వేసుకున్నాం. తరువాత బిల్లు ఇవ్వకుండానే డబ్బు మీకుముట్టిందని చెప్పారు. దీంతో దొడ్డి నిర్మించుకోలేకపోయాం. మా డబ్బు తినేస్తారని అనుకోలేదు. బోయ నాగమ్మ, హొళగుంద -
బాలికను బలిగొన్న శౌచాలయం
కర్ణాటక, ముళబాగిలు: అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం నిర్మాణానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఉజ్వల భవిత శిథిలాల కింద నలిగిపోయింది. తరగతి పాఠశాల శౌచాలయానికి వెళ్లిన సమయంలో అది కుప్పకూలి జ్యోత్స్న (13) అనే 7వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన కోలారు జిల్లా ముళబాగిలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో జరిగింది. జ్యోత్స్న తాలూకాలోని ఎన్ బిసనహళ్లి గ్రామానికి చెందిన రైతు శంకరప్ప, విజయమ్మ దంపతుల కుమార్తె. బుధవారం ఉదయం పాఠశాలలో ప్రార్థనచేసిన అనంతరం జ్యోత్స్న శౌచాలయానికి వెళ్లింది. ఈ సమయంలో కట్టడం ఉన్నపలంగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కి చిన్నారి ఊపిరి వదిలింది. ఘటనతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఉపాధ్యాయులు, స్థానికులు బాలిక మృతదేహాన్ని కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరమే దేవరాయ సముద్రలో ఉన్న వసతి పాఠశాలను ఇక్కడి ప్రైవేటు కట్టడంలోకి మార్చడం జరిగింది. ఈ సమయంలో శౌచాలయాలను పక్కన ఉన్న రాజకాలువ వద్ద నాసిరకంగా నిర్మించడంతోనే కుప్పకూలిందని ఆరోపణలున్నాయి. కలెక్టర్ పరిశీలన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ జె మంజునాథ్, జడ్పీ సీఈఓ సి జగదీష్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. పాఠశాలను దేవరాయ సముద్రం నుంచి ఈ కట్టడంలోకి మార్చడానికి కారణమైన ప్రిన్సిపాల్ తదితరులపైన, కట్టడం యజమానిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలుహొళలి గ్రామం వద్ద నూతన భవన నిర్మాణం 90 శాతం పూర్తయింది, అంతా అయ్యాక అక్కడికి మారుస్తామని కలెక్టర్ తెలిపారు. ఘటనను ఖండించి ప్రతిఘటన కట్టడం కూలి విద్యార్థిని మరణించడంతో ఇది జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించి ఎస్ఎఫ్ఐ, రైతు సంఘం తదితర సంఘాల కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని కన్న తండ్రిపై..
వేలూరు: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించని తండ్రిపై చర్యలు తీసుకోవాలని రెండవ తరగతి చదివే విద్యార్థిని గత సోమవారం ఉదయం ఆంబూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వేలూరు జిల్లా రాజపురం వినాయకగుడి వీధికి చెందిన ఇసానుల్లా కుమార్తె హనిపా జార(7) అదే గ్రామంలోని ప్రవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతుంది. ఇంట్లో విద్యుత్ సరఫరా లేదు, మరుగుదొడ్డి లేదు. దీంతో కాలకృత్యాలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, మరుగుదొడ్డి నిర్మించాలని పలుమార్లు తండ్రి వద్ద తెలిపినా పట్టించుకోకపోవడంతో వారి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ రామన్ వెంటనే చిన్నారి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని ఆదేశించారు. దీంతో ఆంబూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్చభారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించే పనులు మంగళవారం ఉదయం ప్రారంభించారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు చిన్నారిని అభినందించారు. -
ఆరు బయటకు పరుగు తీయాల్సిందే...
విజయనగరం అర్బన్: పట్టణంలోని 39వ వార్డు పరిధిలో శాంతినగర్ ఉర్దూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలలో నేటికీ మరుగుదొడ్లు నిర్మించలేదు. అలాగే ఆరో వార్డు పరిధిలోని హుకుంపేట ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నా మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మరుగుదొడ్లు నిర్మించమని పలుమార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 102 వరకు ఉన్నాయి. మరోవైపు నిర్మించిన మరుగుదొడ్లు విద్యార్థుల సంఖ్యకు సరిపడిక... రన్నింగ్ వాటర్ సౌకర్యం లేక సుమారు 60 శాతం వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం విద్యారంగానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థంచేసుకోవచ్చు. అత్యవసరం అయితే అంతే.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,034 పాఠశాలలుండగా ఇప్పటికీ మరుగుదొడ్లు నిర్మించని పాఠశాలలు 102 వరకు ఉన్నాయి. విజయనగరం పట్టణ పరిధిలోని రెండు పాఠశాలలకు ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఆయా పాఠశాలలో ఆ రెండింటికీ విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యమంలా నిర్మించిన మరుగుదొడ్ల వ్యవహారం తూతూమంత్రంగా కనిపిస్తోంది. ఆగస్టులో నిధులు వెనక్కి వెళ్లిపోవడం నిర్మాణ పనులు ఆగిపోయాయి. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల సంఖ్య నిర్మించడం లేదు. సీతానగరం మండలం గాదిలవలస ఉన్నత పాఠశాలలో 540 మంది విద్యార్థులుండగా ఒక్క మరుగుదొడ్డి మాత్రమే నిర్మించారు. మరోవైపు దానికి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించలేదు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 60 శాతం వరకు ఉన్నాయి. అమలు కాని ఆదేశాలు.. ప్రభుత్వ పాఠశాలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ ఒలకపోస్తోంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వాహణ లోపాలను సరిదిద్దుకోవాలని ఇటీవల జిల్లాలో పర్యటించిన సుప్రీంకోర్టు బృందం సూచనలతోకూడిన ఆదేశాలిచ్చింది. అదేవిధంగా పాఠశాలల్లోని తాగునీరు, మరుగుదొడ్ల నిర్వాహణకు నెలవారీ నిధులివ్వాలని సూచించింది. అయితే ప్రభుత్వం మాత్రం పాఠశాలలను మూసివేయడానికి చూస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలు చూస్తే అనుమానాలు కలగకమానవు.నిధుల్లేక నిలిచాయి.. జిల్లాలో 43 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. మరో వంద మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. నిధులు మంజూరు కాకపోవడం వల్లే పనులు ఆగాయి. త్వరలో నిధులు విడుదలవుతాయి.వెంటనే పనులు చేపడతాం. – డాక్టర్ బీ.శ్రీనివాసరావు, పీఓ, ఎస్ఎస్ఏ -
బహిర్భూమికి వెళ్లి విద్యార్థి మృత్యువాత
కర్నూలు, పగిడ్యాల: పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కేసీ కాలువలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవనగర్ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీలు గుండెపోగు నడిపి ఈశ్వరయ్య, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శివశంకర్ నందికొట్కూరులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడైన రాఘవేంద్ర స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లిన రాఘవేంద్ర.. స్నేహితుడు బోయ పార్థుతో కలిసి సమీపంలోని కేసీ కాలువ గట్టుకు బహిర్భూమికి వెళ్లాడు. కాలకృత్యాలు ముగించుకుని కాలువలో శుభ్రం చేసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయాడు. ఇది గమనించిన స్నేహితుడు పార్థు రక్షించేందుకు చేయి అందించానని పేర్కొన్నాడు. చేయి అందుకున్న రాఘవేంద్ర తనను కూడా నీటిలోకి లాగడంతో భయాందోళనకు గురై విడిచిపెట్టగా మూడు సార్లు పైకి లేచి మునిగిపోయాడని తెలిపాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనను గ్రామస్తులైన ముర్తుజావలి, చాకలి శ్రీనివాసులు శివాలయం వద్ద ఒడ్డుకు చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని కన్నీటి పర్యంతమయ్యాడు. పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం చెప్పగానే మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించడంతో హుటాహుటిన దేవనగర్ కాలనీవాసులు తరలివచ్చి కేసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. నందికొట్కూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఈశ్వరయ్య ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు జలవనురుల శాఖ అధికారులతో మాట్లాడి ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదలను బంద్ చేయించారు. అనంతరం వెదురు బొంగుకు ఇనుప కొక్కాలను కట్టి కేసీ కాలువలో అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో శివాలయం వద్దనే మృతదేహం లభ్యం కావడంతో ఒడ్డుకు చేర్చారు. ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుగుదొడ్ల కొరత: పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 268 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురు 163 మంది, బాలికలు 105 మంది ఉన్నట్లు పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి వెల్లడించారు. బాలురకు రెండు, బాలికలకు తొమ్మిది మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో బాలురు మల, మూత్ర విసర్జన చేసేందుకు బయటకు వెళ్తున్నారు. ఉదయం 8.20 గంటలకే పాఠశాలకు వచ్చానని, విద్యార్థులు కేసీ కాలువకు వెళ్లిన సంగతి తనకు తెలియదని ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి తెలిపారు. పాఠశాలలో రెండు మరుగుదొడ్లు వినియోగించుకోవాలని విద్యార్థులకు చెప్పామన్నారు. కన్నీరు మున్నీరుగావిలపించిన తల్లిదండ్రులు బడికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన కుమారుడు కొన్ని నిమిషాలకే మత్యువాతకు గురికావడం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘‘రెక్క లు ముక్కలు చేసుకుని పెద్ద చేస్తిమి కదా నాయనా.. అంతలోనే నీకు నూరేండ్లు నిండినాయా తండ్రీ’’ అంటూ తల్లి లక్ష్మీదేవి రోదించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. -
ఆత్మశుద్ధి లేని ‘స్వచ్ఛ’ ఉద్యమమేల?
గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగి నప్పుడు మనం తన్నులాడుకోవలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. గాంధీజీ నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అందజేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. భారత రిపబ్లిక్ కాస్తా నేడు అసహన భారతంగా రూపొందింది. 2010–18 మధ్య దేశ పౌరులపై 63 వేధింపులు, హత్యలు నమో దుకాగా, కేవలం 2014 మే తర్వాతనే 61 హత్య కేసులు నమోదయ్యాయి. ఇంతటి స్థాయిలో దేశపౌరులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ హింసాకాండను కళ్లతో చూస్తూ కూడా స్పందించలేనివారిగా మిగిలి పోతున్నాం. కాగా, మరోవైపున అసలు సంఘర్షణ జరుగుతున్నది సమా జంలో అణగారిన వర్గాలతో–కుల మతాలు, వ్యక్తిగత విశ్వాసాలు కల్గి అవతల గట్టున ఉన్న అసంఖ్యాక ప్రజలతోనని గ్రహించాలి. ఈ పరి ణామం మొత్తం గాంధేయ తాత్విక దృష్టిని బలవంతంగా పక్కకు నెట్టేసిన ఫలితమే.– జస్టిస్ (రిటైర్డ్) ఎ.పి.షా: హైదరాబాద్ ‘గాంధీ మంథన్ సంవాద్’లో ప్రసంగం, 2–10–18 గాంధీజీని పాలకులు నేడు ఒక టాయిలెట్ నినాదానికి, ఓ కళ్లజోడు ఫ్రేము కిందికి దిగజార్చి మానవశ్రమలోని హుందాతనాన్ని కేవలం కక్కూసు దొడ్లకు కుదించి, ప్రచారం కోసం పాలక పెద్దలు చీపుళ్లు చేత పట్టుకుని కొద్ది నిమిషాల సేపు వీధులు ఊడుస్తున్నట్టు చూపించే నాలుగు కెమెరాలకు దిగజార్చారు.– జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, 2–10–18 గాంధీజీ విదేశాల్లో ఉండగా, దక్షిణాఫ్రికా ఫీనిక్స్ సెటిల్మెంట్ టాల్ స్టాయ్ క్షేత్రంలో, ఎరవాడ జైల్లో తానున్న చోట కక్కూసు దొడ్లను (టాయిలెట్స్) తానే శుభ్రం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఆయనతో పాటు భార్య కస్తూరీబాయి కూడా అదే పనిచేశారు. స్వతంత్ర భారత పాలకులెవరూ అలాంటి జీవనవిధానం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచినవారని భావించలేం. టాల్‌స్టాయ్, తోరో, రస్కిన్ బోధల ఆధా రంగా ఏర్పడినదే ఫీనిక్స్ సెటిల్మెంట్ క్షేత్రం. తర్వాత దేశంలోని జైళ్లలో, సబర్మతీ ఆశ్రమం, ఇతర ఆశ్రమాల్లో గాంధీ అనుసరించిన జీవన విధా నానికి ఆయన మార్గంలో పయనిస్తున్నామని చెప్పే రాజకీయపక్షాల నేతల తీరుకూ పోలికే లేదు. ప్రస్తుత పాలకవర్గంలోని ‘భద్రమూర్తులు’ ఎన్నికల ముందు, ఆ తర్వాత ‘చిట్కా’ విధానాలతో కాలక్షేపం చేస్తు న్నారు. దక్షిణాఫ్రికాలో, మనదేశంలో అనుసరించిన సిద్ధాంత విలువల్లో గాంధీజీ ప్రత్యేకత కనిపిస్తుంది. విదేశాల్లోనూ, ఇక్కడా కూడా సత్యా గ్రహ ఆశ్రమాల్లో కామన్ వంటశాల ఉన్నప్పుడు అస్పృశ్యత పేరిట ఆశ్ర మవాసులు కొందరు దళిత కుటుంబీకులతో కలిసి భోజనం చేయడానికి సంకోచించి, పక్కన కూర్చోవడానికి నిరాకరించిన సందర్భాల్లో గాంధీ పాత్ర చాలా గొప్పది. దళితులతో కలిసి భోంచేయడం తప్పు కాదని, పాపం కాదనీ వారికి ఆయన ‘క్లాస్’ పీకవలసివచ్చింది. అన్ని ఆశ్రమ సమావేశాల్లోనూ రెండు పూటలా అన్ని మతాలవారినీ స్వయంగా కలు పుకుని ప్రార్థనలు నిర్వహించేవారు. అలా అన్ని మతాలవారితో కలిసి భోజనాలు, భజనలు చేసేవారు. మత ఛాందసులను సైతం కలుపుకు పోవడం ద్వారా గాంధీజీ మానవ జీవితాన్ని సమానత్వ పునాదులపై నిర్మించారు. ఆ ప్రాతిపదికన అన్ని కులాలు, మతాల వారి కుల దుర హంకారాన్ని, వివక్షను ఛేదించడానికి ఆయన కృషి చేశారు. ఇంతకీ దేవుడనేవాడు ఎక్కడున్నాడంటే–‘శ్రమలో మాత్రమే’ అని ఎన్నో సంద ర్భాల్లో ఆయన చెప్పేవారు. మానవునిలోని ఆ శ్రమైక జీవన సౌంద ర్యాన్ని ఆయన గుర్తించినందునే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కూడా స్వేచ్ఛగా పాల్గొనగలిగారు. ప్రచారం కోసమే శుద్ధి విన్యాసాలు! ఈనాటి దేశ పాలకులు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రచారం కోసమే చేపడుతున్నారు. స్వాతంత్య్రోద్యమ మౌలిక లక్ష్యాలైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సమూల పరివర్తనను విస్మరించారు. ఈ నేతలు సూటూ– బూటూ వేసుకుని వీధులు శుభ్రం చేస్తున్నట్టు నడుం వంచినట్టుగా కనిపించే కెమెరా షాట్లతో సరిపెట్టుకునే విన్యాసంగా మలిచారు. అదైనా దేశవ్యాప్తంగా శ్రద్ధగా అమలు చేశారా అంటే లేదని న్యూస్ వెబ్సైట్ ‘ద వైర్’ ప్రతినిధి కబీర్ అగర్వాల్ గాంధీ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం రోజునే వివరించారు. అంతేకాదు, 2014 నుంచి ఇప్పటి వరకూ గ్రామీణ భారతంలో ‘స్వచ్ఛ భారత్’’ పేరిట తలపెట్టిన టాయిలెట్స్ నిర్మాణ పథకం అమలు జరుగుతున్న తీరును వివిధ దేశీయ, ప్రపంచ సాధికార సర్వే సంస్థలు ఎండగట్టాయి. ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనకు ప్రధాన కారణం టాయ్‌లెట్ మరు గుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం. ఈ సమస్యను పరిష్కరించకుండా పారి శుద్ధ్య కార్మికుల(సఫాయి కర్మచారి)ఉపాధిని దెబ్బదీస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెంచకుండా పాలకులు టాయిలెట్స్ నిర్మించడానికి ఉత్తర్వులు జారీచేయడం వల్ల ఫలితం ఉండదని జాతీయ కర్మచారీ ఆందోళన్ సంస్థ ఎన్నోసార్లు ప్రకటించింది. ఆధునిక పరికరాల సాయంతో పౌర నివాసాల్లో మురికి నీళ్లు, బురద, మానవులు విసర్జించే మలమూత్రాలను క్షణాల్లో తొలగించే యాంత్రిక పద్ధతులు ప్రవేశపెట్టా లని జాతీయ కర్మచారీ సంఘం పదేపదే కోరుతూ వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులు తమ చేతులు ఉపయోగించి ఈ పనులకు దిగకుండా పైన చెప్పిన ప్రత్యామ్నాయాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఈ సంస్థ ఏళ్ల తరబడిగా మొత్తుకుంటోంది. మురుగు కాలువల్లోకి దిగి పనిచేస్తూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. అయినా, వంద లాది మంది సఫాయీ కార్మికులు ఇలా మరణిస్తూంటే కేవలం డజన్ల కేసుల్లో మాత్రమే నష్టపరిహారం చెల్లింపు జరిగింది. ఫలితంగా 2017లో ప్రతి ఐదు రోజులకు సగటున ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తున్నా డని తేలింది. పైగా పార్లమెంటు చట్టం ప్రకారం సఫాయీకర్మచారులకు జాతీయస్థాయిలో కమిషన్ ఏర్పడినా పరిస్థితుల్లో మార్పురాలేదు. గ్రామసీమల్లో జరిగింది అంతంత మాత్రమే! గ్రామ సీమల్లో టాయిలెట్ సౌకర్యాల గురించి అధికార స్థాయిలో వెలువ డుతున్న ప్రకటనలేగాని ఆచరణలో ఫలితాలు ప్రచారం జరిగినంతగా కనిపించలేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. గమ్మత్తేమంటే, ప్రభుత్వ టాయిలెట్స్ నిర్మాణ ప్రచారంలో చెప్పుకున్నట్టు దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ కమిషన్ లెక్కల ప్రకారం కేవలం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మాత్రమే కర్మచారుల మృతి వార్తలు నమోదయ్యాయి. పనిలో ఉన్న సఫాయీ కర్మచారులు ఎందరు చనిపోయారన్న వివరాలు ఇంగ్లిష్, హిందీ పత్రి కల్లో వచ్చినంతగా ప్రాంతీయ భాషా పత్రికల్లో రిపోర్టవుతున్న మరణాల సంఖ్య మాత్రం గణనలోకి రావడం లేదు. ఎందుకంటే, పారిశుద్ధ్య కార్మికుల ఉపాధి, పునరావాసానికి చెందిన 2013 నాటి ప్రభుత్వ లెక్కలే ఈ దుస్థితిని బహిర్గతం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భౌతికంగా చేతులు ఉపయోగించి నిర్వహించే పారిశుద్ధ్య పనులపై విధించిన నిషేధం నాటికి సమయంలో దేశంలో ఉన్నవి 7,40,078 ఇళ్లు. కాగా, సామాజిక, ఆర్థికపరంగా 2011లో కుల ప్రాతిపదిక ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం చేతులు ఉపయోగించి మరుగు దొడ్లు కడిగే కర్మచారుల కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే గ్రామీణ భార తంలో ఉన్నాయి. ఈ పరిస్థితికి తోడుగా, ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆర్భాటంగా ‘గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్’ అమలులోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లాంటి బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. అయితే, తాను దేశ ప్రధాని అయిన తరు వాత బిహార్‌లో ఎనిమిది లక్షల ఇళ్లకు టాయిలెట్లు అందించానన్న మోదీ ప్రకటనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండిస్తూ, అందులో 6 లక్షలకు పైగా టాయిలెట్లు తాను ఏర్పాటు చేసినవేనని బహిరంగంగా ప్రకటిం చాల్సి వచ్చింది. అనేక గ్రామాల్లో ఏ మేరకు టాయిలెట్ సౌక ర్యాలను ప్రభుత్వం కల్పించిందో లెక్కలు తీసేందుకు వెళ్లిన పరిశోధనా సంస్థలు అయిదు ఉత్తర భారత రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించగా వివిధ స్థాయిల్లో పంచాయతీ అధ్యక్షుల నుంచి ప్రభుత్వ అధికారుల దాకా ఎక్కువమంది వివరాలు తెలపడానికి జంకి నోరు మెదపలేదని తేలింది. గాంధీజీని హత్య చేసి, ఉరిశిక్షపడిన నాథూరాం గాడ్సే నీడను భారత ప్రజలు మాపేసుకున్నారు గానీ, దేశ పాలనా వ్యవస్థలోని కొందరు ఈ రోజుకీ వదిలించుకోలేకపోతున్నారు. ఆ నీడ చాటునే కొందరు బీజేపీ నాయకులు ఈ రోజుకీ దాగుడుమూతలాడుతున్నారు. గాంధీని గాడ్సే హత్య చేయడాన్ని మహాత్ముడి 150వ జయంతినాడే బీజేపీ నాయకురాలు ప్రీతీ గాంధీ సమర్థించారు. కానీ, ఆ ప్రకటనను గౌరవ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వార్తను ఇంత వరకు మనం చూడలేదు. నిజానికి గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే (1947 అక్టోబర్ 4న) దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగినప్పుడు మనం తన్నులాడుకో వలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. అందుచేత గాంధీజీ ఇంత విస్తృతమైన నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అంద జేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. ‘భాండశుద్ధిలేని పాకమదియేల’ అని వేమన అన్నట్టుగానే ఆత్మశుద్ధిలేని ‘స్వచ్ఛ భారత్’ ఏల అనుకోవాలి!! ఏబీకే ప్రసాద్(abkprasad2006@ahoo.co.in), సీనియర్ సంపాదకులు -
హీరోలా ప్రశ్నిస్తే ఏ పనీ జరగదు
అనంతపురం, గుంతకల్లు రూరల్: ‘ఏదైనా పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అధికారులను ప్రాధేయపడాలి. అంతేకానీ హీరోలా ప్రశ్నిస్తే పనులేమీ జరగవిక్కడ. ముందు ఆఫీస్‌లో నుంచి కాలు బయటకు పెట్టి మాట్లాడు. లేదంటే పోలీస్ కేసు పెడతా’ అంటూ గుంతకల్లు ఎంపీడీఓ శంకర్ వ్యక్తిగత మరుగుదొడ్డి లబ్ధిదారుపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకెళితే.. మొలకలపెంట గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య ఈశ్వరమ్మ పేరిట వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. అయితే ఆర్థిక స్థోమత లేక పనులు మొదలుపెట్టకపోయారు. దీంతో తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీఓ శంకర్లు దగ్గరుండి వారి ఇంటి దగ్గర మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంతలో నారాయణస్వామి అన్న మృతి చెందడంతో దాదాపు 40 రోజుల పాటు పనులను నిలిపివేయాల్సి వచ్చింది. జాబితా నుంచి పేరు తొలగింపు మరోవైపు త్వరితగతిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాకపోయినా, మధ్యలోనే నిలిచిపోయినా వాటిని జాబితాలోంచి తొలగించి.. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఉన్నతాధికారులకు లెక్కలు చూపించారు. నారాయణస్వామి తన అన్న మరణానంతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి మరుగుదొడ్డి పనులు పూర్తి చేశాడు. బిల్లు చేయలేం.. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లు రాకపోవడంతో నారాయణస్వామి శుక్రవారం ఎంపీడీఓను కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించుకున్నాడు. నిర్మాణం జాప్యం జరగడంతో జాబితాలోంచి పేరు తొలగించామని, ఇప్పుడు బిల్లు ఏమీ చేయలేమని ఎంపీడీఓ అసహనంతో చెప్పారు. దగ్గరుండి మీరే నిర్మాణ పనులు ప్రారంభించి.. ఇప్పుడు పేరు తొలగిస్తే ఎలా అని ప్రశ్నించిన నారాయణస్వామిపై ఎంపీడీఓ కోపోద్రిక్తులయ్యారు. నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ గద్దించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మంజూరు కాకపోతే ఏంటి పరిస్థితి అని డీలాపడిపోయిన నారాయణస్వామి ఒక అడుగు వెనక్కు తగ్గాడు. అప్పుడు ఎంపీడీఓ స్పందిస్తూ ‘ప్రాధేయపడి అడుక్కుంటేనే ఏదైనా పని జరుగుతుంది. గట్టిగా అడిగితే ఏ పనీ జరగదు’ అంటూ మందలించడంతో బాధితుడు నారాయణస్వామి కన్నీరుపెట్టుకుంటూ బయటకు నడిచాడు. -
మొబైల్ స్క్రీన్ కంటే మరుగుదొడ్డే నయం!
మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వస్తువుగా మొబైల్ ఫోన్ మారిపోయింది. మనలో చాలా మంది పొద్దున లేవగానే ఫోన్ ఎక్కడుందా అని వెతుక్కుంటాం. ఫోన్ చెక్ చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలు పెడతాం. అయితే మనం రోజూ పదులసార్లు టచ్ చేసే మన మొబైల్ స్క్రీన్‌పై టాయ్లెట్లో కంటే మూడు రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఫోన్ వినియోగదారుల్లో కనీసం 35 శాతం మంది ఎప్పుడూ తమ మొబైల్ స్క్రీన్లను ఎటువంటి లిక్విడ్లు ఉపయోగించి శుభ్రపరచలేదని ఇంగ్లండ్‌కు చెందిన ‘ఇన్య్సూరెన్స్ టూ గో’ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు స్కై.కామ్ వెబ్సైట్ పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు వాడే ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరు నెలలోపు తమ మొబైల్ స్క్రీన్లను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన మూడు ఫోన్ల స్క్రీన్లపై ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ఒక్కో స్క్రీన్‌పై సుమారుగా 84.9 యూనిట్ల క్రిములను గుర్తించారు. స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 30 యూనిట్ల క్రిములు, లాక్ బటన్‌పై 23.8 యూనిట్లు, హోమ్ బటన్‌పై సుమారుగా 10.6 యూనిట్ల క్రిములు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. టాయ్‌లెట్, ఫ్లష్‌పై 24 యూనిట్ల క్రిములు ఉంటాయి. ఆఫీసులో ఉపయోగించే కీ బోర్డులు, మౌస్లపై ఐదుశాతం క్రిములు ఉంటాయి. మొబైల్ ఫోన్ల స్క్రీన్లపై ఉన్న ఈ బ్యాక్టీరియా కారణంగా చర్మసంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు(40 శాతం), 35 సంవత్సరాల లోపు వారు 60 శాతం మంది లేచిన వెంటనే ఐదు నిమిషాల వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. అలాగే పడుకునే ఐదు నిమిషాల ముందు వరకు ఫోన్లను పరిశీలిస్తున్న వారిలోనూ 60 శాతం మంది 35 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. -
ఇల్లు లేకున్నా.. మరుగుదొడ్డి కట్టావ్.. భేష్!
దుగ్గొండి(నర్సంపేట) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటనలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత సోమవారం ఉదయం దుగ్గొండి మండలం తిమ్మంపేటకు వచ్చారు. ఇదే సమయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రదేశాన్ని ఎస్సై కాలనీలో పరిశీలిస్తున్నారు. సాధారణ మహిళలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్డు పక్కన కవర్లు పైకప్పుగా కట్టుకుని ఉన్న గుడిసె, దాని పక్కన నిర్మించిన ఉన్న మరుగుదొడ్డిని చూశారు. ఇంటి యజమాని ఎలుదొండ భిక్షపతి మరుగుదొడ్డి గుంతలకు ఓడలు వేసి మట్టి నింపుతుండగా కలెక్టర్ ఆగి అభినందించారు. ‘ఇల్లు లేకున్నా.. మరుగుదొడ్డి కట్టావు.. భేష్! నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా’నని చెప్పి వివరాలు నమోదు చేసుకోవాలని సీసీని ఆదేశించారు. -
సర్దుకు‘పోయా’ల్సిందే!
సాక్షి, అమరావతి బ్యూరో : ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు.. ‘మా స్కూల్లో చదివితే ఐఐటీ గ్యారెంటీ, నీట్ ర్యాంక్ పక్కా, సివిల్స్‌కు సెలక్ట్ అయినట్టే’.. ఇలా ఎన్నెన్నో మాటలు చెబుతాయి. మరి మౌలిక వసతుల మాటేమిటంటే బిక్కముఖం వేయాల్సిందే. ర్యాంకులు, మార్కుల మాయలో పడ్డ తల్లిదండ్రులు వాటి గురించి ఆలోచించే తీరికేది. వందల కొద్ది అడ్మిషన్లు తీసుకొని రూ.లక్షలు వెనకేసుకుంటున్న యాజమాన్యాలు పిల్లలకు సరిపడా మరుగుదొడ్డు ఉన్నాయా? లేవా? అన్న స్పృహను కోల్పోతున్నాయి. పట్టించుకోవాల్సిన పేరెంట్స్ అయినా చదువు ముఖ్యం గాని వాటితో పనేంటిలే అన్న ధోరణిలో పడిపోయారు. వీళ్ల నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల నిండు జీవితాలు. చాలీచాలని, అపరిశుభ్ర మరుగుదొడ్లను వినియోగించి అనారోగ్యాల పాలవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే సర్దుకుపోవాల్సి వస్తోంది. చట్టం ఏమి చెబుతోంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 60 మంది విద్యార్థులకు గాను బాలికలకు ఒక యూనిట్, బాలురకు ఒక యూనిట్ టాయిలెట్లను ప్రత్యేకంగా కేటాయించాలి. ఇక్కడ ఒక యూనిట్ అనగా నాలుగు యూరినల్, రెండు టాయిలెట్ బేసిన్లు. అయితే విజయవాడ నగరంలోని చాలా వరకు ప్రైవేట్ పాఠశాలల్లో నామమాత్రంగా ఒకటో, రెండో యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్ తరహాలోని పాఠశాలల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. ఒక్కో ఫ్లాట్‌లో కేవలం రెండు, మూడు టాయిలెట్స్ ఉంటుండగా విద్యార్థులు మాత్రం వందల్లో ఉంటున్నారు. లాభాపేక్షతోయాజమాన్యాలు నిబంధనలకు నీళ్లోదులుతున్నారు. సర్దుకోవాల్సిందే.. రెండు పీరియడ్లు అయిన తర్వాత యూరిన్ కోసం 10 నుంచి 15 నిమిషాల వరకు ఇంటర్వెల్ ఇస్తారు. రోజుకు రెండుసార్లు ఇంటర్వెల్స్ ఉంటాయి. ఈ కొంత సమయంలోనే వందల మంది పిల్లలు యూరిన్, టాయిలెట్‌కు వెళ్లాల్సిఉంటుంది. టాయిలెట్‌కు వెళ్లేందుకు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో టాయిలెట్‌కు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. కొందరు పిల్లలు టాయిలెట్, యూరిన్‌కు వెళ్లకుండా బిగబట్టుకుని ఇంటికి వెళ్లిన తర్వాత తీర్చుకుంటున్నారు. ఇంకొందరు పిల్లలు నీళ్లు తాగితే యూరిన్ వస్తుందని పాఠశాల సమయంలో నీళ్లు తాగడాన్ని మానేస్తున్నారు. రోగాలు తప్పవు.. పిల్లలు ఇలా చేయడం వల్ల రోగాల బారిన పడాల్సివస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో టాయిలెట్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. టాయిలెట్‌కు పోకుండా బిగబట్టడం వల్ల మలబద్ధకం, ఒకరి నుంచి మరొకరికి యూరిన్ ఇన్ఫెక్షన్లు సోకుతాయని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు ఉండాలని, అలాగే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కిడ్నీలపై ప్రభావం.. సకాలంలో మూత్ర విసర్జన చేయకుంటే యూరిన్ బ్లాడర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనర్థాలకు దారితీస్తుంది. అపరిశుభ్రమైన టాయిలెట్స్‌ను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అప్పటికే చిన్నచిన్న కిడ్నీ సమస్యలు ఉన్న పిల్లలకు ఇలాంటి సంఘటనలతో కిడ్నీ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. యూరిన్ వెళ్లాల్సి వస్తుందని కొందరు పిల్లలు నీళ్లు తాగడం మానేస్తున్నారు ఇది చాలా తప్పు. ప్రైమరీ స్థాయి పిల్లలకు సకాలంలో టాయిలెట్ రాదు.. వచ్చినప్పుడు వెళ్లాలి. బిగబడితే మలబద్ధకం వస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోలేరు. యాజమాన్యాలు తగినన్ని టాయిలెట్స్ ఏర్పాటుచేసి, శుభ్రతను పాటించాలి. – డా. కిరణ్‌కుమార్, యూరాలజిస్ట్, విజయవాడ -
మీరు చేస్తారా.. నన్నే చేయమంటారా?
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గాలో మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలకు రూ.కోట్లు ఖర్చు చేశారు.. నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని, మరుగుదొడ్లు పరిశుభ్ర పరిచి ఉపయోగంలోకి తెస్తారా లేక తానే శుభ్రం చేయమంటారా అని నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని బారాషహీద్ దర్గా ఆవరణలోని మరుగుదొడ్లు, ఘాట్ పనుల్లో లోపాలను శనివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషహీద్ దర్గా నెల్లూరుకు గర్వకారణమన్నారు. దేశవిదేశాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాను సందర్శిస్తుంటారని తెలిపారు. రూ.కోట్లు ఖర్చు చేసి మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని మండిపడ్డారు. మరుగుదొడ్లులో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. తాను వస్తున్నానని తెలుసుకుని అప్పటికప్పుడు తూతూమంత్రంగా పైపై పనులు చేశారని పేర్కొన్నారు. ఘాట్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వ తేదీ ఉదయం 10 గంటలలోపు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలసి రాజకీయాలకు అతీతంగా గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలుపుతానన్నారు. అధికారులు స్పందించకపోతే తానే స్వయంగా శుభ్రం చేస్తానని చెప్పారు. మహిళా మరుగుదొడ్లు పక్కన మందు సీసాలు ఉండటం గమనించిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరులో భాగంగా పచ్చదనం పెంపొందిస్తామని గోడలపై రాతలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. బారాషహీద్ దర్గాలో చెట్లు ఎండిపోవడంపై ఇదే మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌లు చేస్తున్న స్వచ్ఛ నెల్లూరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాటి వెంకటేశ్వరరావు, బొబ్బల శ్రీనివాసయాదవ్, అంజా హుస్సేన్, మాళెం సుధీకర్కుమార్రెడ్డి, ఎండీ అబ్దుల్ సలీమ్, డాక్టర్ స త్తార్, రియాజ్, మిద్దె మురళీకృష్ణయాదవ్, సందానీ బాషా, చిన్న మస్తాన్, అలీ నావాజ్, యాకసిరి శరత్చంద్ర, ఎం.శ్రీకాంత్‌రెడ్డి, టీవీఎస్ కమల్, రా మరాజు, మా దా బాబు, జగదీష్, సింహాచలం, మేఘనాధ్‌సింగ్, యనమల శ్రీహరియాదవ్, హ జరత్నాయుడు, తుమ్మల శీనయ్య, తాళ్లూరు సురేష్, కట్టా వెంకటరమణయ్య, ప చ్చారవి, మొయిళ్ల సురేష్, ఆండ్ర శ్రీనివాసులు, పేనేటి సుధాకర్, వే ల్పూలు అజ య్, గజరా నరేష్, కమల్‌రాజ్, హయద్ బాషా, పెద్ద మస్తాన్, తారీఖ్, మందాపెద్దబాబు, దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
సంక్షోభంలో సంక్షేమం
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పలుచోట్ల హాస్టళ్లు సమస్యల లోగిళ్లుగానే ఉన్నాయి. అస్తవ్యస్త మరుగుదొడ్లు, తాగునీటి కరువు, దోమల బాధ, ఉక్కపోతతో విద్యార్థులు అల్లాడుతున్నారు. గత నెల 25న జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సహా 20చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేపల్లె, తెనాలి, అమరావతి, చేబ్రోలు, గురజాల, గుంటూరు నగరం, నిజాంపట్నంలోని హాస్టళ్లను ఐదు బృందాలుగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక అక్రమాలు, సమస్యలు వెలుగు చూశాయి. 70 శాతానికి పైగా వసతి గృహాల్లో బోగస్ ఎన్రోల్మెంట్లు బయటపడ్డాయి. ఉన్న విద్యార్థుల కన్నా అధికంగా 20శాతం చూపించి వార్డెన్లు జేబులు నింపుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానం ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించగా.. సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు. భద్రత ప్రశ్నార్థకం బాలికల వసతి గృహాల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో చాలా వరకూ ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీ వాచ్మెన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు రాత్రయితే చాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరుగుదొడ్లకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కొన్నిచోట్ల విద్యార్థినులు అరుబయట కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేపల్లెలోని ఓ సంక్షేమ వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నప్పటికీ వాటికి కరెంటు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల వద్ద మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. పౌష్టికాహారం అందని ద్రాక్షే.. విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందని ద్రాక్షలానే మారింది. జిల్లాలోని చాలా వరకూ వసతి గృహాల్లో కొత్త డైట్ విధానం అమలు కావడం లేదు. వారానికి ఒక్కసారి కూడా కోడిగుడ్డు ఇవ్వడం లేదని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. పాలు కూడా విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. హాస్టళ్లలో ఎక్కడా ఆర్వో వాటర్ సిస్టమ్ అమలు కావడం లేదు. నేటికీ కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యి మీదనే వంటలు వండుతూ పొగ చూరిన ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. గురుకులాల్లో టీచర్ల కొరత విజిలెన్స్ అధికారుల తనఖీల్లో గురుకులాల్లో సిబ్బంది కొరత బయటపడింది. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు బోధించే సిబ్బందే ఎనిమిది, తొమ్మిది, పది విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రిన్సిపాళ్ల గైర్హాజరు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ అక్రమాలు జరుగుతున్నాయి. వంటలు చేసే సిబ్బంది నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. నిధుల దుర్వినియోగం తనిఖీల సమయంలో జిల్లాలోని చాలా హాస్టళ్లలో పలు సమస్యల్ని గుర్తించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను పరిశీలించాలి. అప్పుడే వార్డెన్లు అక్రమాలకు పాల్పడకుండా నిధులు వినియోగిస్తారు. – శోభామంజరి, విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ -
ఫెర్టిలిటీ
సాయంత్రం ఆరవుతోంది. దివ్యకు ఎందుకో అనీజీగా ఉంది. తనకిప్పుడు ఐదు నెలల గర్భం. చెమటలు పడుతున్నాయి. మాటిమాటికీ టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తోంది. టీవీ ఆఫ్ చేసి, మంచినీళ్ళు తాగింది. అత్తమ్మ, తను ఇందాకే టీ తాగారు. అపార్ట్మెంట్లో వినాయక నవరాత్రుల పూజలని ఆమె కిందికి వెళ్లారు. ఇంకో గంటకు గానీ రారు. సమయానికి భర్త అరుణ్ కూడా ఊళ్లో లేడు. ఉండీ ఉండీ పొత్తికడుపులో నొప్పి. చాలా భయమేస్తోంది. ముఖం కడుక్కుని, దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుంది. పెళ్ళైన ఏడేళ్లకు నిలిచిన గర్భం. ఏడుపొస్తోంది. ఊళ్లోనే ఉన్న అమ్మ సుమిత్రకు ఫోన్ చేసింది. వెంటనే అమ్మ, నాన్న, తమ్ముడు రాహుల్ వచ్చేశారు. దివ్య రెగ్యులర్‌గా చూపించుకునే హాస్పిటల్‌కి కాల్ చేస్తే, డాక్టర్ యూఎస్ వెళ్లారట. డ్యూటీ డాక్టర్స్ ఉన్నారట. డ్యూటీ డాక్టర్ తన డాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి ఇంకో హాస్పిటల్ రిఫర్ చేశారు. అక్కడ దివ్యకు గర్భం జారకుండా స్టిచ్ వేస్తారని చెప్పారు. అది యూసుఫ్‌గుడ లోపలి కాలనీల్లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్. వెతుక్కుంటూ వెళ్లేసరికి డాక్టర్ వెళ్లిపోబోతున్నారు. అడ్మిట్ చేసుకుని సెలైన్ పెట్టారు. యూరిన్ టెస్ట్ చేసి, స్కాన్ చేసి భయం లేదని, పొద్దున్నే గర్భసంచికి ‘సర్‌క్లాజ్ స్టిచ్’ వేస్తానని మెడిసిన్స్, థియేటర్‌కి కావాల్సిన లిస్ట్ రాసిచ్చారు. దివ్య అమ్మగారు దివ్యకు ఇడ్లీ తినిపించి, అన్నం తినేసి అటెండెంట్ బెడ్‌పై నడుం వాల్చారు. టైమ్ పది దాటింది. అరుణ్ ఫోన్ చేశాడు. దివ్య కొంచెంసేపు మాట్లాడింది. బయట హాల్లో దివ్య తమ్ముడు స్టీల్ చైర్లో పడుకున్నాడు. సలైన్ అయిపోవచ్చింది. సుమిత్ర లేచి సిస్టర్ని పిలుచుకొచ్చింది. సిస్టర్ నీడిల్ తీస్తూ దివ్యతో ‘మీరు జాబ్ చేస్తారా?’ అనడిగింది. దివ్య ‘అవును’ అని చిన్నగా నవ్వింది. ఏం జాబ్ అని సిస్టర్ అడగలేదు. లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయింది.దివ్య ఆమె భర్త అరుణ్ ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లు. వంద కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామంలో పోస్టింగ్. సున్నితంగా, మంచి చుడిదార్లు వేసుకుని, పెద్ద బ్యాగ్‌తో ట్రైన్ ఎక్కే దివ్యను చూసి ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అమ్మాయో అని అనుకుంటారు. ఎవరైనా ఆశ్చర్యపోతే దివ్య నవ్వుకుంటుంది. తాము తమ వృత్తిని ఎంతో ప్రేమిస్తారు. వైద్యం చేసిన పశువు కళ్లలో మనుషుల్లో లేని కృతజ్ఞత కనబడుతుంది. బాధతో నోరులేని మూగ జీవి విలవిల్లాడితే దానికి ఉపశమనం అందించడం ఎంత గొప్ప విషయం. ‘ట్రెవిస్’ పైకి తీసుకురాగానే కంగారులో పశువు వేసే పేడకు డ్రెస్ అంతా పాడవుతుంది. దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో అసిస్టెంట్లు ఉన్నా, దాదాపు ప్రతిసారీ గిట్టల చేత, కాళ్ల చేత డ్రెస్ చీరుకుపోవడమో, చేతులకు గాయాలవడమూ సహజమే. యానిమల్ తాలూకు తాళ్లు అరచేతుల్లో చీరుకుపోతాయి. అన్నింటికన్నా కష్టమైన పని పశువుల్లో ప్రెగ్నెన్సీ డిటర్మైన్ చేయడం. మనుషుల్లాగా యూరిన్ టెస్ట్ చేసి చెప్పడం సాధ్యపడదు. పొరపాటున పశువు గర్భం దాల్చలేదని చెబితే, రైతు దాన్ని అమ్మేసాక అది గర్భంతో ఉందని తెలిస్తే ఎంత పెద్ద గోలో! తనకు గర్భసంచి జారింది. జారదు మరి! ప్రతిరోజూ ప్లాట్‌ఫాం వైపు నుండి కాక ఎల్తైన మరో వైపు చిన్న స్టేషన్లో ఆగి ఆగకుండానే దూకడం, టైంకు అసిస్టెంట్ రాకుంటే చిన్నపాటి గుట్ట ఎక్కి దిగడం, తలచుకుంటేనే బాధ కలుగుతుంది. అరుణ్ ‘షీప్ గ్రవుండింగ్’కి కర్ణాటక వెళ్లాడు. మొన్నటివరకు తనూ వెళ్ళేది. ఒక్కోసారి వారం నుండి పదిహేను రోజులు. అదొక పెద్ద ప్రహసనం. మేలురకం గొర్రెల్ని సెలెక్ట్ చేసి, వాటిని ఫొటోలు తీసి, ఎక్సల్లో అప్లోడ్ చేయాలి. చెవుల కిందుగా ట్యాగ్ వేయాలి. తరువాత వాటి లబ్ధిదారుల ఆధార్‌తో గొర్రెల్ని అనుసంధానించాలి. పెద్ద తతంగం. అరుణ్ రేపు ఆపరేషన్ టైమ్ కల్లా వస్తానన్నాడు. తొందరగా వస్తే బావుండు. ఈ స్టిచ్ ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.అర్ధరాత్రి. బయట ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. దివ్యకు మెలకువ వచ్చింది. సెల్ ఆన్ చేసి టైం చూసింది. రెండు కావొస్తోంది. అమ్మను లేపబోయి ఊరుకుంది. బాటిల్లోంచి మంచినీళ్లు తాగి, మెల్లగా డోర్ తీసుకుని బయటకు వచ్చింది. హాల్లో ముగ్గురు లంబాడీ స్త్రీలు, తలపాగాతో ఒక వ్యక్తి. అచ్చం తను పనిచేసే తండా వారి లాగానే ఉన్నారు. డెలివరీ కేసేమో. గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. దగ్గరకు వెళ్లాలనుకుంది కానీ, తల్లి పిలవడంతో లోపలికి వెళ్లింది.‘ఏమైందమ్మా..’ తల్లి కంగారుగా అడిగింది.‘ఏమీ లేదమ్మా. బయట చప్పుడైతే లేచాను. నువ్వు పడుకో’. పొద్దున్న నాలుగు గంటలకు సిస్టర్ వచ్చి లేపింది. ఎనీమ ఇచ్చింది. నాలుగుసార్లు మోషన్‌కు వెళ్ళగానే సర్క్లాజ్కి కావలసిన ఏర్పాట్లు చేసింది. అరుణ్ వచ్చాడు. దివ్యను థియేటర్లోకి తీసుకెళ్లారు. గంటలో సర్జరీ అయిపోయింది. ఇంకా కొంచెం మత్తులోనే ఉంది. పూర్తిగా మత్తు వీడాక థియేటర్లో డాక్టర్, నర్సుల మధ్య సంభాషణ లీలగా విన్నట్టు అనిపించింది. తన శరీర కింది భాగమంతా మొద్దుబారినట్టు అనిపించింది. అలాగే కళ్లు మూసుకుంది.సాయంత్రం రూమ్‌లోకి షిఫ్ట్ చేశారు. తల్లి స్నానం చేసి భోజనం పట్టుకొస్తానని వెళ్లింది. పక్కన ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. సడెన్‌గా దివ్యకు రాత్రి లంబాడీ వాళ్ళ సంగతి గుర్తొచ్చింది. తనంటే చుట్టు పక్కల తండా వాళ్లకు చాలా అభిమానం. గేదెలు, ఆవులు ఈనితే జున్ను పాలు, స్వచ్ఛమైన నెయ్యి తెచ్చిచ్చేవారు. చుట్టాలు వస్తున్నారంటే ఫోన్ చేస్తే గ్రామంలో ఖాసీం మంచి మటన్ పంపించేవాడు. పశువు ఈనడం కష్టమైతే ఒక్కోసారి రాత్రిళ్లు వాటి తాలూకు ఓనర్ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చేది. అప్పుడు వారు తనపట్ల ఎంతో గౌరవం చూపేవాళ్లు. అవునూ! ఇది ఫెర్టిలిటీ సెంటర్ కదా. ల్యాబ్‌లు కానీ, అలాంటి ఎక్విప్మెంట్ కానీ లెవేంటి? ఐవీఎఫ్ చేస్తారా.. ఆర్టిఫిషల్ ఇన్సెమినేషన్ చేస్తారా.. లేదా సరోగేసీ చేస్తారా....తను పనిచేసే గ్రామంలో విష్ణురెడ్డి దగ్గర బలిష్టమైన ఎద్దు ఉంది. ప్రతీ రైతు దగ్గర చూడి కోసం వెయ్యి రూపాయలకు తక్కువ తీసుకోడు. డోర్ తెరుచుకుంది. సిస్టర్ బీపీ చెక్ చేసి సెలైన్ ఆపేసింది. పక్కన బెడ్‌పైకి ఒక అమ్మాయి వచ్చింది. జీన్స్ వేసుకుంది. పేషంట్లాగా లేదు. కూర్చుని ఫోన్ చూసుకుంటూ గడిపింది. ఒక గంటలో సిస్టర్ వచ్చి ఏవో పేపర్ల మీద ఆ అమ్మాయితో సంతకాలు పెట్టించుకుంది. దివ్య చాలా క్యూరియస్‌గా చూస్తోంది. ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా చూయింగ్ గమ్ నములుతూ ఫోన్ చూసుకుంటోంది. కాసేపటికి ఆమె భర్త కాబోలు, ‘ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మార్నింగ్ ఫైవ్‌కి ఫ్లయిట్.’ చెప్పాడు. ఇద్దరూ సిస్టర్‌కి చెప్పి బయటకు వెళ్లారు. దివ్య అమ్మ, అత్తమ్మ వచ్చి తనకు వేడి జావ తాగించారు. అత్త ఉంటానన్నా దివ్య తల్లి వారించి, ‘తెల్లారి ఎలాగో డిశ్చార్జ్ అవుతాం కదా’ అని పంపేసింది. అరుణ్ బయట సోఫాలో పడుకున్నాడు.రాత్రి ఒకటిన్నర అయినట్టుంది. ఏడుపు చప్పుడుకు దివ్య లేచింది. పక్కన ఉన్న చిన్న రూంలోనుండి గుసగుసలు. చిన్నగా అడుగులు వేస్తూ అక్కడికి వెళ్ళింది. నిన్న చూసిన పెద్దవయసు లంబాడీ స్త్రీ చేతిలో మాసిన గుడ్డల్లో ఎర్రటి పసికందు. ఒక్కరోజు వాడేమో! మధ్యాహ్నం చూసిన అమ్మాయి చేతికి అందించింది. ఆ అమ్మాయి ఎక్సయిట్ అయి.. ‘ఎత్తుకోవాలంటే భయం’ అని నవ్వుతూ తల్లికి అందించింది. కొద్దిసేపట్లో బిడ్డను తీసుకొని వాళ్లు బయటకు నడిచారు.దివ్య గుండె స్పీడ్‌గా కొట్టుకుంటోంది. ఎందుకో ఏడుపొచ్చింది. మెల్లిగా వచ్చి బెడ్ మీద కూర్చుంది.తెల్లారి సిస్టర్ని పిలిచి, ‘ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమా, ఎందుకు బిడ్డను తీసుకెళ్లారు?’ అని రహస్యంగా అడిగింది. ‘లేదమ్మా! కానీ వాళ్లు చాలా కోటీశ్వరులట. మేనరికం మాత్రమే చేసుకుంటారట. బయటి వాళ్లను నమ్మరట. పిల్లలు ఏమైనా లోపాలతో పుడితే ఎట్లా అని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ బంధువులకు గుడ్డి పిల్లవాడు పుట్టాడట. ఇంక రిస్క్ ఎందుకు అని ఇట్లా కొంటారు.’ చెప్పింది సిస్టర్. దివ్యకు అప్పుడు అర్థమయ్యాయి థియేటర్లో డాక్టర్ మాటలు – ‘ఏందట ముసల్దాని గోల. రెండు లక్షలు చాలవటనా’. - రజిత కొమ్ము -
విమానం టాయిలెట్లో మృతపిండం
న్యూఢిల్లీ: గువాహటి నుంచి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమానం టాయిలెట్లో మృత పిండం కనిపించడం ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. పిండం వయసు దాదాపు ఆరు నెలలు ఉండొచ్చని సమాచారం. విమాన టాయిలెట్లో పేపర్లలో చుట్టి ఉన్న పిండాన్ని గమనించిన సిబ్బంది.. ఈ పని ఎవరు చేశారో చెప్పాలంటూ మహిళా ప్రయాణికులను ప్రశ్నిస్తుండగా తనకు గర్భస్రావం అయినట్లు 19 ఏళ్ల వయసున్న తైక్వాండో క్రీడాకారిణి వెల్లడించింది. ఆమె ఓ టోర్నమెంట్ కోసం గురువారం తన కోచ్‌తో కలసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. టాయిలెట్లో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, పిండం కనిపించిందని ఎయిర్ ఏసియా అధికారులు తెలిపారు. పోలీసులు పిండాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, క్రీడాకారిణికి ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అయితే ఆమె గర్భంతో ఉన్న విషయమే తనకు తెలియదనీ, విమానమెక్కే ముందు విమానయాన సంస్థకు సమర్పించిన వివరాల్లోనూ ఈ విషయం లేదని ఆమె కోచ్ చెప్పారు. -
మరుగుదొడ్డి లేదని ‘రేషన్’ కట్
తాండూరు రూరల్ : స్వచ్ఛభారత్ కింద మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేదని అధికారులు రేషన్ సరుకులు నిలిపివేశారు. కనీసం తాత్కలికంగా రేషన్ సరుకులు నిలిపివేస్తే కొందరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటారని అధికారులు ఈ విధంగా చేసినట్లు సమాచారం. మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గ్రామంలోని లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన మాల శ్రీను, బంటు మొగులప్ప డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ రాములును కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రేషన్ డీలర్ లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదన్నారు. డీలర్ అశప్పను అడగ్గా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరుకులు ఇవ్వడం లేదని చెబుతున్నారని చెప్పారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. బియ్యం లేకపోతే ఎలా బతకాలి అని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో గ్రామంలో ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయమై తహసీల్దార్ రాములును ఫోన్లో సంప్రదిస్తే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల ఎంపీడీఓ డీలర్‌కు చెప్పి రేషన్ సరుకులు ఇవ్వొదని చెప్పారని తహసీల్దార్ బదులిచ్చారు. ఎంపీడీఓ జగన్మోహన్రావుకు ఫోన్ చేస్తే స్పందించలేదు. పంపిణీ చేస్తాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రేషన్ సరుకులు నిలిపివేశాం. అంతేకాకుండా డీలర్ ఆశప్ప అనార్యోగం కారణంగా కూడా సరుకులు ఆలస్యమయ్యాయి . మంగళవారం నుంచి ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందజేస్తాం. – ఇస్మాయిల్, సర్పంచ్ -
టాయిలెట్‌పై ఫన్నీ ట్వీట్ : నెటిజన్ల ఆగ్రహం
ఆసియాలోని టాయిలెట్లపై ఓ అమెరికన్ టీవీ స్టార్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. కొందరు అది అతనిది అమాయకత్వం అంటుంటే, మరికొందరు మాత్రం అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ఆసియా పర్యటనకు వచ్చిన డీన్ మైఖేల్ వాష్ రూమ్‌లోని మరుగుదొడ్డి పక్కన ఉన్నటువంటి హ్యాండ్ స్ప్రెయర్ గురించి ఓ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మాములుగా కడుక్కోవడానికి వాడే హ్యాండ్ స్ప్రెయర్‌ను దప్పిక తీర్చుకోవడానికి వాడతారని పేర్కొన్నాడు. ‘నేను ఇక్కడి టాయిలెట్లను ఇష్టపడుతున్నానను ఎందుకంటే.. వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ దాహం వేస్తే తాగాడానికి వీలుగా వాటర్ పంప్(హ్యాండ్ స్ప్రెయర్‌ను ఉద్దేశించి) అందుబాటులో ఉంచార’ని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మైఖేల్ వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌తో పాటు, పలు ఆసియా దేశాలకు చెందిన నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా అని నీకు ఎవరు చెప్పారు, రెస్ట్‌రూమ్‌లలో పేపర్స్ ఉండేది మీరు నవలలు రాసుకోవడానికా?, మేము నీకు వాటర్‌కు బదులు జూస్ పెడతాం.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. I love how bathrooms here have this water hose next to the toilet incase you get thirsty while in the restroom pic.twitter.com/xsfrFeYkzh — Dean Michael Unglert (@deanie_babies) July 10, 2018 -
ఇంటి కిటికీ పక్కన మూత్ర విసర్జన చేసాడని..
పుత్తూరు: ఒక యువకుడు ఇంటి కిటికీ పక్కన మూత్ర విసర్జన చేయడంతో రేగిన వివాదం ఇరువర్గాల మధ్య దాడులకు దారి తీసింది. దీంతో పుత్తూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ హనుమంతప్ప కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న గాంగ్మాన్ వేలాయుధం ఇంటి కిటికీ పక్కన గుర్తు తెలియని యువకుడు గురువారం మధ్యాహ్నం మూత్రవిసర్జన చేశాడు. దీనిపై వేలాయుధం కుటుంబ సభ్యులతోపాటు చుట్టు పక్కల కాపురముంటున్న వారు ఆ యువకుడిని నిలదీశారు. మాటామాటా పెరగడంతో యువకుడికి వేలాయుధం దేహశుద్ధి చేశాడు. కొంత సేపటి తరువాత ఆ యువకుడు పట్టణంలోని దళితవాడకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి వేలాయుధం ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు వేలాయుధంతోపాటు ఆయన భార్యపై భౌతిక దాడికి దిగారు. వేలాయుధంకు స్వల్ప గాయాలు కాగా భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతోంది. వేలాయుధం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం వేలాయుధంకు మద్దతుగా రైల్వే సిబ్బంది వచ్చారు. మరో వైపు పుత్తూరు దళితవాడకు చెందిన వ్యక్తులు పోలీస్‌స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
పిల్లలతో మరుగుదొడ్డి శుభ్రం చేయించారు
శివాజీనగర: పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్డి శుభ్రం చేయించిన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా శిరడాణ క్రాస్ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులను ఇతర పనులకు ఉపయోగించుకోవటం నేరమని తెలిసినా కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలతో మరుగుడొడ్లు పరిశుభ్రం చేయించే సాహసానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఉపాధ్యాయుల మెడకు చిక్కుకుంది. జిల్లా ఉన్నతాధికారులకు విషయం తెల్సినా కూడా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఈఓ ఉమాదేవిని అడగ్గా పిల్లలే స్వచ్ఛందంగా వచ్చి శుభ్రం చేశారని, ఈ విషయం ఉపాధ్యాయులు, స్థానికులు చెప్పారని ఆమె సమర్థించుకున్నారు. ఈ సంఘటనకు కారకులైన ప్రధానోపాధ్యాయుడు,, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
బాత్రూంలో 2.8 కిలోల బంగారం
సాక్షి బెంగళూరు: అక్రమంగా తరలిస్తున్న 2.8 కేజీల బంగారాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.87.69 లక్షలుగా లెక్కగట్టారు. విమానాశ్రయంలోని శౌచాలయాన్ని శుభ్రపరిచే సిబ్బంది ఈ నెల 4వ తేదీన బాత్రూంలోని చెత్తబుట్టలో ఒక పాలిథీన్ బ్యాగ్ ఉండటాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా 2.8 కేజీల బంగారు ఆభరణాలు లభించాయి. దీనిపై కస్టమ్స్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఎవరో అక్రమంగా బంగారాన్ని దేశానికి తీసుకొచ్చి, విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లలేక వదిలేసి ఉంటారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. -
స్వచ్ఛమేస్త్రీలు
అవసరం నడిపించినంత అభ్యుదయ పథంలో మనిషిని మరే ఇజమూ నడిపించలేదు. అందుకే బతికి బట్టకట్టి తీరాలనే పట్టుదల వారి చేత తాపీ పట్టించింది. స్వచ్ఛభారత్ వారికి తోడయ్యింది. సాధారణంగా నిర్మాణ రంగంలో మగవాళ్లు తాపీ పట్టుకుని ఇటుక పేర్చి, సిమెంట్ రాస్తుంటే... ఆడవాళ్లు తాపీ మేస్త్రీలకు సిమెంట్, ఇటుక అందించే పనిలో ఉంటారు. అయితే అస్సాంలోని బార్పేట జిల్లాలో ఏకంగా మూడువందలకు పైగా మహిళలు తాపీ పని చేస్తున్నారు. వీళ్లలో బెంగాల్నుంచి అస్సాంకు వలస వచ్చిన ముస్లిం మహిళలున్నారు. ఇంకా.. స్థానిక బోడో మహిళలు, బెంగాలీ హిందువులు... ఇలా రకరకాల సాంస్కృతిక నేపథ్యాల మహిళలున్నారు. తాపీ పని నేర్చుకున్న తర్వాత వాళ్ల జీవితాలు ఎంత మెరుగయ్యాయో చెప్పడానికి బార్పేట జిల్లాలోని భులుకాబారీ పత్తర్ గ్రామంలో నూర్ నెహర్ బేగం జీవితమే ఉదాహరణ. భార్యపై భర్తకు ఫిర్యాదు చేశారు! ‘‘ఊళ్లో పనుల్లేవు, మగవాళ్లు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. వాళ్లు వచ్చే వరకు ఇంటిని నెట్టుకొచ్చేదెలాగ? పొట్ట నింపడానికి ఎలాగో తిప్పలు పడతాం. కానీ పిల్లల ట్యూషన్‌కి ఫీజు కట్టాలంటే డబ్బెలా? అందుకే ఈ పని నేర్చుకున్నాను. ఇప్పుడు ఇల్లు గడిచేదెలాగ అనే బెంగ లేదు. నేను తాపీ పని నేర్చుకున్నానని ఊళ్లో మగవాళ్లు నా భర్త వచ్చినప్పుడు ‘మగవాళ్లు చేయాల్సిన పనులు చేస్తోంది నీ భార్య ’ ఆయన్ను నిలదీశారు. ‘అలా నిలదీసిన వాళ్లలో ఎవరైనా నా బిడ్డల కోసం ఒక్క రూపాయి ఇచ్చారా’ అని నేను నా భర్తను అడిగాను. పోయినేడాది నేను తాపీ పని నేర్చుకున్నప్పుడు నేనొక్కర్తినే, ఇప్పుడు మా ఊరు, ఆ చుట్టు పక్కల 11 గ్రామాలకు కలిసి మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు’’ అంటోంది నూర్ నెహర్ బేగం. పని ఇచ్చింది స్వచ్ఛ భారత్ మగవాళ్లే పనుల్లేక పరాయి రాష్ట్రాలకు వలస పోతున్న ఆ చిన్న గ్రామాల్లో అంతమంది మహిళలు తాపీ పని నేర్చుకున్నారు సరే, వాళ్లకు పని ఎలా? స్వచ్ఛభారత్ ఉద్యమం వీళ్లకు పని కల్పిస్తోంది. స్వచ్ఛభారత్‌లో టాయిలెట్లు కట్టడం ఒక ఉద్యమంలా సాగుతోంది. నిర్ణీత సమయంలో టార్గెట్‌ను చేరుకోవడానికి అధికారులకు చేతినిండా పని వాళ్లు కావాలి. మగవాళ్లు వలస పోయిన కారణంగా అందుబాటులో ఉన్న మహిళా తాపీ మేస్త్రీలను ప్రోత్సహించారు అధికారులు. డిస్ట్రిక్ట్ వాటర్, శానిటేషన్ అధికారి అపర్ణా అధికారి ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. మగవాళ్లు కట్టిన టాయిలెట్ల కంటే ఆడవాళ్లు కట్టినవే బాగున్నాయనే ప్రశంసలు కూడా వస్తున్నాయి స్థానికుల నుంచి. ఎక్కడా మొక్కబడిగా చేయలేదు నేర్చుకునే దశలో ఉండడంతోనో లేక మహిళల్లో స్వతహాగా ఉండే సమగ్రత వల్లనో కానీ నిర్మాణం రూపం వచ్చిన తరవాత మా పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకోవడం లేదు బార్పేట జిల్లా మహిళలు. సిమెంట్ నిర్మాణానికి నీరు పట్టి, లీక్‌లు చెక్ చేయడం, వాటర్ క్యూరింగ్ వంటివన్నీ తమ బాధ్యతే అన్నట్లుగా చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌నాటికి జల్కారా గ్రామంలో పదిహేడు ఇళ్లకు మాత్రమే టాయిలెట్ ఉండేది. ఇప్పుడు అదే గ్రామంలో 106 ఇళ్లలో పక్కా టాయిలెట్లున్నాయి. వీళ్లు మొత్తం ఐదు పంచాయితీలకు గాను 1,423 టాయిలెట్లు నిర్మించారు. ఈ స్ఫూర్తితో ఈ మహిళలు తమ ఇళ్లలో కూడా పక్కా టాయిలెట్‌ను నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఐదారుగురు బృందాలుగా ఏర్పడి, ఎవరికి ఎవరూ డబ్బిచ్చే పని లేకుండా, ఒకరి ఇంటి టాయిలెట్ నిర్మాణంలో మిగిలిన వాళ్లు సహాయం చేసుకుంటున్నారు. – మంజీర -
టాయ్లెట్లో విద్యార్థి అనుమానాస్పద మృతి
బెంగళూరు: గుజరాత్లో తొమ్మిదో తరగతి విద్యార్థి హత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద మృతి కర్ణాటకలో కలకలం రేపింది. కొడగు జిల్లాలోని సైనిక పాఠశాల్లోని టాయ్లెట్లో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడగులో సైనిక పాఠశాలలో తొమిదో తరగతి విద్యార్థి(14) శనివారం సాయంత్రం టాయ్‌లెట్ వద్ద అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే విద్యార్థి మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. విద్యార్థి తండ్రి అదే పాఠశాలలో హాకీ కోచ్‌గా పనిచేస్తున్నారు. పాఠశాలలోని కొంత మంది ఉపాధ్యాయులు తన కొడుకుని వేధించినట్లు విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఈ విషయంపై పాఠశాల వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ కొడుకు మృతికి వైస్ ప్రిన్సిపాల్ కారణం మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానికులతో కలిసి పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. కాగా పాఠశాల ప్రిన్సిపాల్, మరో నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
స్కూలుపై పగ; 90 సెకన్లలో విద్యార్థి హత్య..!
వడోదర: గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. యాజమాన్యంపై పగ పెంచుకున్న 10వ తరగతి విద్యార్థి ఎలాగైనా స్కూలును మూసేయించాలని పథకం పన్నాడు. పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని హత్య చేస్తే తన లక్ష్యం నెరవేరుతుందనుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 9వ తరగతి చదువుతున్న దేవ్ తాడ్వి(14)ని హత్య చేసి టాయ్లెట్లో పడేశాడు. వడోదర ఎస్పీ మనోజ్ శశిధర్ ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు.. నిందితుడు శ్రీ భారతీ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రవర్తన సరిగా లేనందున అతన్ని టీచర్లు పలుమార్లు మందలించారు. దాంతో అతడు పాఠశాలపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. ఎవరినైనా హత్య చేస్తే స్కూలు మూతపడుతుందని భావించాడు. శుక్రవారం మధ్యాహ్నం టాయ్లెట్ల వద్దకు వచ్చిన దేవ్ తాడ్విపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. 90 సెకన్ల కాలంలోనే నిందితుడు తాడ్వి ప్రాణాలు తీశాడని ఎస్పీ తెలిపారు. మృతుడి శరీరంపై 31 కత్తిగాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించామని అన్నారు. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను గుర్తించామన్నారు. హత్యానంతరం ఇల్లు విడిచి పారిపోయిన బాలున్ని మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, పాఠశాలను శాశ్వతంగా మూసేయాలని మృతుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడి మానసిక స్థితి సరిగా లేనందున అతనిపై చర్యలకు అప్పుడే డిమాండ్ చేయలేమని గుజరాత్ మహిళా, శిశు సంక్షేమ బోర్డు చైర్మన్ జాగృతి పాండ్యా అన్నారు. ఇదే తరహా ఉదంతం గతేడాది హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పాఠశాలను మూసేయించాలనే పన్నాగంతో అక్కడే చదువుతున్న ఓ ఏడేళ్ల బాలున్ని గొంతుకోసి చంపేశారు. -
రైళ్లలోనూ వాక్యూమ్ టాయిలెట్లు
న్యూఢిల్లీ: రైళ్లలోనూ విమానాల తరహాలో వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా తొలిదశలో రైళ్లలో 500 వాక్యూమ్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మొత్తం రైళ్లల్లో 2.5 లక్షల వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.2.5లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. వీటి వల్ల 1/20 వంతు నీటి ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. -
‘టాయిలెట్’ తెచ్చుకున్న కిమ్
సింగపూర్ : ప్రపంచంలో చాలా దేశాల అధ్యక్షులు ఉన్నా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. విలక్షణమైన చేష్టలతో ఆయన తరచూ వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఇందుకోసం సింగపూర్ వచ్చిన కిమ్ ఆయన వెంట ఒక టాయిలెట్‌ను తీసుకొచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా చూసుకునేందుకే ఇలా చేశారని తెలుస్తోంది. కిమ్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సదరు కథనం పేర్కొంది. స్థూలకాయత్వంతో బాధపడుతున్న కిమ్‌కు ఫాటీ లివర్ ఉందని, మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పత్రిక ఒకటి పేర్కొంది. వీటన్నింటిని పాశ్చాత్య మీడియా దృష్టిలో పడకుండా చూసుకునేందుకే ప్రత్యేక మొబైల్ టాయిలెట్‌ను కిమ్ జాంగ్ ఉన్ సింగపూర్‌కు తన వెంట తెచ్చుకున్నారని వెల్లడించింది. -
1500 కిలోమీటర్లు ప్రయాణించిన శవం
పాట్నా : రైలులో ప్రయాణిస్తూ గుండెపోటుకు గురై మరణించిన ఓ వ్యాపారి శవం ఎవరూ గుర్తించకపోవడంతో ఏకంగా 1500 కిలోమీటర్లు ప్రయాణించింది. దాదాపు 72 గంటల తర్వాత శవాన్ని గుర్తించటంతో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజయ్ కుమార్ అగర్వాల్ అనే వ్యాపారి ఈ నెల 24న పాట్నా-కోట ఎక్స్‌ప్రెస్‌లో ఆగ్రాకు బయలుదేరాడు. ఉదయం 7-30 గంటల సమయంలో తన భార్యకు ఫోన్ చేసి ఆరోగ్యం సరిగాలేదని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అతని భార్య ఫోన్ చేసినప్పటకీ భర్త నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భార్యకు ఫోన్ చేసిన తర్వాత టాయ్‌లెట్‌కు వెళ్లిన సంజయ్ గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు. టాయిలెట్లో శవం ఉన్న సంగతి ఎవరూ గుర్తించకపోవడంతో అలా 1500 కిలోమీటర్లు ప్రయాణించి పాట్నా చేరుకుంది. పాట్నా చివరి స్టేషన్ కావడంతో ప్రయాణికులు దిగిన తర్వాత రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించారు. బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బందికి టాయిలెట్లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించారు. టాయిలెట్ తలుపులు తెరచి చూడగా అందులో శవం ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. శవం దగ్గర ఉన్న ఐడీ కార్డు సహాయంతో మృతుడిని సంజయ్ కుమార్ అగర్వాల్‌గా పోలీసులు గుర్తించారు. బోగిలోని టాయ్‌లెట్ లోపలి నుంచి లాక్ అయ్యిందని 1500 కిలోమీటర్లు ప్రయాణించినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
గున్న గున్న మామిడి... గూడ్సుబండి దోపిడి!
మాది రైల్వేస్టేషన్ ఉన్న ఊరు. మా ఊరు మీదుగా ప్రయాణికులను తీసుకువెళ్లే రైలుబండ్లతో పాటు రకరకాల వస్తువులను ఒకచోటు నుంచి మరొకచోటికి రవాణా చేసే మాల్‌గాడీలు కూడా వెళుతుంటాయి.ఒక ఎండాకాలంలో నిమ్మకాయలు రవాణా చేస్తున్న ఒక మాల్గాడి(గూడ్స్‌బండి) అగ్నిప్రమాదానికి గురైంది.ఆ బండిని లూప్లైన్లో పెట్టారు.బాగా కాలిపోయిన బోగీలతో పాటు పెద్దగా ఏమీ కాని బోగీలు కూడా ఈ లూప్లైన్లో ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గురైన మాల్గాడి డబ్బాలను చూడడానికి మా ఊరు నుండే కాకుండా చుట్టు పక్కల ఊళ్ల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు.అగ్నిప్రమాదానికి గురైన గూడ్స్ డబ్బాలను చూడడానికి వాళ్లు అలా వస్తున్నారని పుసుక్కున్న మీరు అనుకొని ఉంటే వేడి వేడి నిమ్మకాయ తొక్కులో కాలేసినట్లే!లూప్లైన్లో ప్రమాదానికి గురైన డబ్బాలతో పాటు పెద్దగా ప్రమాదానికి గురి కాని డబ్బాలతో పాటు... అసలు ఏమీ కాని డబ్బాలు కూడా ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి. డబ్బాలను చూడడానికి వచ్చిన వాళ్లు.... వాటిని చూసినట్లే చూసి నిమ్మకాయలను నొక్కేయడం మొదలు పెట్టారు. జేబులతో మొదలైన దోపిడి సంచుల వరకు వెళ్లింది. అలా ఏ వీధిలో చూసినా నిమ్మకాయ ముచ్చట్లే.ఏ ఇంటిలో చూసినా నిమ్మకాయ పచ్చడే.నిమ్మకాయల బండి ఎపిసోడ్‌కు ముందు మా ఊరికి బిచ్చగాళ్ల తాకిడి విపరీతంగా ఉండేది. ఈ నిమ్మకాయ పచ్చడి పుణ్యమా అని ఒక్కరు కనబడితే ఒట్టు!‘ఒకప్పుడు.... అమ్మా ఇంత బువ్వెయమ్మా... అని అరిస్తే చాలు.... నూటొక్క రకాల కూరలు బొచ్చెలో పడేవి. ఇప్పుడు... ఏ ఇంటికి వెళ్లినా నిమ్మకాయ పచ్చడే వేస్తున్నారు. ఇక ఈ ఊరికి సచ్చినా రాకూదు’ అని ఒక సీనియర్ బిచ్చగాడు మా ఊరివాళ్ల మీద నిప్పులు చెరిగాడు కూడా!మరో విషయం ఏమిటంటే ఈ నిమ్మకాయలు కొన్ని సంసారాల్లో నిప్పులు కూడా పోశాయి. ఉదాహరణకు గొట్టిముక్కల లింగమూర్తి కేసు.ఒకరోజు పొరుగింటామె లింగమూర్తి భార్యతో....‘‘ఏమమ్మా... ఎన్ని నొక్కారు? సంచా? రెండు సంచులా?’’ అని అడిగింది. అంతే! కోపంతో లింగమూర్తి భార్య కళ్లు ఎర్రబడ్డాయి.తన భర్తను తిట్టిన తిట్టు రిపీట్ కాకుండా తిట్టడం మొదలు పెట్టింది...‘‘మా ఆయన సంగతి నీకు తెలియదా! ఒట్టి దద్దమ్మ.... చేసి పెడితే తినడం తప్ప... ఊళ్లోకి నిమ్మకాయల బండి వచ్చిందనిగానీ, అది మన కోసమే వచ్చిందనిగానీ, అలా చూసినట్లు చూసి ఇలా సంచి నిండా నిమ్మకాయలు కొట్టేయ వచ్చనిగానీ... ఇలాంటి కనీసం జ్ఞానం ఈయనకు ఉండి చచ్చిందా!మన ఇంటెనక ఈరయ్య ఇంటి నిండా నిమ్మకాయలేనట.ఈయన ఉన్నాడెందుకు... మనిషి జన్మ పుట్టినందుకు దమ్ము, ధైర్యం ఉండాలా... గొడ్డులా తినడం కాదు...’’ నాన్‌స్టాప్‌గా తిట్టడం మొదలు పెట్టింది.ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏమిటంటే...భర్త బజారుకు వెళ్లాడని ఆమె తిట్లు అందుకుంది.కానీ ఆయన బజారుకు వెళ్లినట్లే వెళ్లి ‘స్టమక్ నెట్వర్క్’ నుంచి అర్జెంట్‌గా మెసేజ్ రావడంతో ఉరుకులు పరుగుల మీద వెనక్కి వచ్చి టాయిలెట్లో దూరాడు. పాపం ఈ దృశ్యాన్ని ఆయన భార్య చూడలేదు. టాయిలెట్లో ఉన్న లింగమూర్తి మాత్రం భార్య తిట్లను ఆకాశవాణి వార్తల్లా శ్రద్ధగా విన్నాడు.బయటకి వచ్చాడో లేదో...‘‘ఏమాన్నావు? నేను గొడ్డునా?’’ అని లుంగీ సర్దుకుంటూ భార్య వైపు ఆవేశంగా అడుగులు వేశాడు. అంతే! ఆయన భార్య జంప్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు లింగమూర్తి భార్య పుట్టింటి నుంచి తిరిగిరానేలేదు! అవసరానికి మించి, అవసరం లేకపోయినా నిమ్మకాయలు వాడడం వల్ల కొందరికి ‘నీంబోరియా’ అనే వ్యాధి ఎటాక్ కావడంతో ఊళ్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే... ఒక వ్యక్తి అప్పటి వరకు ఏ టాపిక్ మాట్లాడుతున్నా సరే... సడన్‌గా నిమ్మకాయాల టాపిక్‌లోకి దూరిపోయి ఏదో ఒకటి వాగుతుంటాడు. ఉదాహరణకు ‘నీంబోరియా’ సోకిన పెంచలయ్యను తీసుకుందాం.సపోజ్ ఈయనను ‘కర్నాటక రాజకీయాల గురించి నీకు ఏమైనా అవగాహన ఉందా?’ అని అడిగాము అనుకుందాం. ఆయన ఇలా స్పందిస్తాడు.‘‘కర్నాటక రాజకీయాలు ఊహకు అందనివేమీ కావు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని... హంగు వస్తుందని అందరూ అనుకున్నదే. అయితే రిజల్ట్ తరువాత ఇంత హంగామా ఉంటుందని ఎవరూ అనుకోలేదు... లింగాయత్ ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే... నిమ్మ కాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపురంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. ఇంతకీ కర్నాటకలో ఏ పార్టీ గెలిచినట్లు, ఏ పార్టీ ఓడినట్లు! సీట్లు తక్కువ వస్తేనేం... ఓట్ల శాతం ఎక్కువ అని సంతోషించాలా? ఓట్ల శాతం తక్కువ అయితేనేం... సీట్లు ఎక్కువ వచ్చాయని సంతోషించాలా? నిమ్మ గురించి మొదటిసారిగా పదవ శతాబ్దంలో అరబ్ సాహిత్యంలో పేర్కోబడింది. అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా నిమ్మకాయలు పండించారు. కర్నాటక రాజకీయాలు, వాటి ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి పరిమితమైన వ్యవహరం అనేది వాస్తవం కాదు. దేశరాజకీయాలు సరికొత్త సమీకరణలతో ముందుకు వెళతాయి... నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి పది అడుగుల ఎత్తు పెరుగుతుంది. పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిలా ఉంటుంది...’‘నీంబోరియా’ వ్యాధి చాలాముంది యువకులకు ఎటాక్ కావడంతో... మా ఊళ్లో అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా భయపడేవారు.ఏదైనా పని సులువుగా అయిపోతుందని చెప్పడానికి... ‘అరచేతిలో నిమ్మకాయ పట్టినంత సులభంగా పని అయిపోతుంది’ అనేది మన జాతీయం. ఈ దొంగ నిమ్మకాయలు మాత్రం రకరకాల సంఘటనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేంత పనిచేశాయి! – యాకూబ్ పాషా -
టాయిలెట్ ఉంటేనే జీతం ఇస్తాం
సీతాపూర్, యూపీ : మీరు యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగా...? అయితే మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా...? మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే మీకు నెల జీతం అందుతుంది. మరుగు దొడ్డి ఉన్నట్లు చెప్తే సరిపోదు...దానికి సంబంధించిన ఫోటోతోపాటు ప్రమాణ పత్రాన్ని ఇస్తేనే మీకు మీ నెల జీతం అందుతుందనే నూతన నిబంధనను తీసుకు వచ్చింది యూపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతొంది. ఈ ఫోటో యూపీకి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భగవత్ ప్రసాద్‌ది. ఇది అతను తన ఇంటి టాయిలెట్లో ఒక స్టూలు మీద కూర్చుని దిగిన ఫోటో. ఫోటోతో పాటు ప్రమాణ పత్రంలో అతని ఆధార్ కార్టు నంబరు, కుటుంబ వివరాలు కూడా ఉన్నాయి. భగవత్ ప్రసాద్ ఇంట్లో మరుగుదొడ్డి ఉందనే దానికి నిదర్శనం ఈ ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రాన్నిపంచాయితీ ఆఫీసులో ఇవ్వాలి. తర్వాతే అతనికి ఈ నెల జీతం అందుతుంది. ప్రధాని మోదీ 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ పథకం అమలులో భాగంగా యూపీ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం సీతాపూర్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రీట్ శీతల్ వర్మ సీనియర్ అధికారులకు ఒక నోటీసు జారీ చేసారు. మీ సిబ్బంది ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా, ఉంటే వాటి ఫోటోలను తీసి జిల్లా పంచాయితీ రాజ్ అధికారులకు పంపిచమని, అలా చేసిన వారికి మాత్రమే జీతం ఇస్తామని ఆదేశించారు. ఈ విషయం గురించి శీతల్ వర్మ ’ప్రధాని మోదీ 2018, అక్టోబరు 2 నాటికి మన దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చాలనే ఉద్ధేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం తపప్పనిసరిని తెలిపారు. ప్రజలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలంటే ముందు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపారు. ఈ నెల 27 నాటికి ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నట్లు ఫోటో పంపించకపోతే వారికి ఈ నెల జీతం ఆపేస్తామన్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
కాలేజీ టాయిలెట్లో సీసీటీవీ కెమెరాలు
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఓ కళాశాల వింత చర్య తీసుకుంది. అలీగఢ్‌లోని ధర్మ్‌సమాజ్ డిగ్రీ కాలేజీ మూడ్రోజుల క్రితం అబ్బాయిల టాయిలెట్ గదిలో సీసీటీవీ కెమెరాలను అమర్చింది. చివరికి ఈ విషయం బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ హేమ్‌ప్రకాశ్ గుప్తా స్పందిస్తూ.. పరీక్షల సందర్భంగా పలువురు విద్యార్థులు జేబుల్లో, అండర్‌వేర్‌ల్లో స్లిప్పులు దాస్తున్నారని తెలిపారు. టాయిలెట్లోకి వచ్చి స్లిప్పుల ద్వారా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని వెల్లడించారు. టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటుతో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. కాగా, టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటును ఇంతటితో వదిలిపెట్టబోమనీ, కోర్టుకు ఈడుస్తామని పలు విద్యార్థి సంఘాల నేతలు సదరు కళాశాలను హెచ్చరించారు. -
ప్రిన్సిపాల్ వినూత్న ఆలోచన.. విమర్శలు!
లక్నో : విద్యార్థులు కాపీ కొడుతున్నారని వీటిని అరికట్టేందుకు ఓ కాలేజీ ప్రిన్సిపాల్ వినూత్నంగా ఆలోచించారు. కాలేజీ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు సెట్ చేయించారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని ధరం సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేం ప్రకాష్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. డ్రెస్సుల్లో ఏదో విధంగా స్లిప్స్ తీసుకొస్తున్నారని, వీటిని అరికట్టేందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లదని, దాంతో విద్యార్థులు ధర్నాలు చేపట్టే అవకాశం లేదన్నారు. విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారని బాయ్స్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. అయితే కేవలం అబ్బాయిలే పరీక్షల్లో కాపీయింగ్ చేస్తారా అని కొందరు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టాలన్నది మా ఉద్దేశం కాదని, అయితే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాలులోకి అనుమతించాలని సూచించారు. కాపీయింగ్ చేస్తూ దొరికిపోయే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ అబ్బాయిలను అవమానించే ఇలాంటి పనులు మంచివి కాదంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు. -
పోలీస్ స్టేషన్లో నాగుపాము
కడప , ఓబులవారిపల్లె : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి నాగుపాము కనిపించింది. స్టేషన్ బయట ఉన్న మరుగుదొడ్డి పక్కనే శబ్దం రావడంతో అటువైపు వెళుతున్న కానిస్టేబుల్ అమర్ చూశాడు. ఆయన గమనించి తోటి సిబ్బందికి తెలిపాడు. పాము పడగవిప్పి బుసలు కొడుతుండటం, రాత్రి కావడంతో దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. రెండు గంటల సేపు అలాగే ఉన్న పాము పక్కనే ఉన్న వాహనాల్లోకి వెళ్లింది. పట్టుబడ్డ వాహనాలను రైల్వేకోడూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన వారు పోలీసు క్వార్టర్స్‌లో ఉంచారు. అవి తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. పరిసరాలు పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. విషసర్పాలకు అడ్డాగా మారాయి. తరచూ క్వార్టర్స్‌లోకి వస్తుండటంతో పోలీసు కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాహనాలను మరో చోటుకు తరలించాలని పోలీసులు కోరుతున్నారు. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన.. రైల్వే యాక్షన్..
సాక్షి, హైదరాబాద్ : రైలులో అమ్మే టీలో బాత్ రూం నీళ్లను కలిపిన వీడియోపై భారతీయ రైల్వే చర్యలకు ఉపక్రమించింది. బాత్రూం నీళ్లను టీ క్యాన్‌లో కలిపిన కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతేడాది డిసెంబర్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వస్తోన్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. ఇద్దరు టీ అమ్మే వ్యక్తులు మూడు టీ క్యాన్లు తీసుకొని రైలులోని ఓ బోగీలోకి ఎక్కారు. ఒక వ్యక్తి ఆ మూడు క్యాన్లను టాయిలెట్లోకి తీసుకెళ్లగా.. మరో వ్యక్తి బయట కాపలాగా నిలుచున్నాడు. టీ క్యాన్లలో నీళ్లు నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బోగీ తలుపు వద్ద నిలుచున్న ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఘటనను చిత్రీకరించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజులుగా వైరల్‌గా మారిన ఈ వీడియోపై రైల్వే శాఖ ఎట్టకేలకు స్పందించింది. రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ అధికారులు వీడియోలోని టీ అమ్మే వ్యక్తులను గుర్తించారు. సికింద్రాబాద్-ఖాజీపేట జంక్షన్ల మధ్య రైళ్లలో ఆహార విక్రయ కాంట్రాక్టును సొంతం చేసుకున్న పి.శివప్రసాద్ అనే కాంట్రాక్టర్‌కి చెందిన ఉద్యోగులే ఇందుకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో శివప్రసాద్‌కు దక్షిణ మధ్య రైల్వే లక్ష రూపాయల జరినామా విధించింది. శివప్రసాద్‌కు ఉన్న ఐఆర్సీటీసీ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. -
అయ్యా.. మీ కాళ్లు కడుగుతాం !
నవాబుపేట (జడ్చర్ల): బాబ్బాబు మీ కాళ్లు కడుగుతాం.. ఎలాగైనా సరే ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోండి.. అంటూ గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిల్లాను వంద శాతం ఓడీఎఫ్‌గా మార్చాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఇళ్లిళ్లూ తిరుగుతూ మరుగుదొడ్డి లేని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని నవాబుపేట మండలం పోమాల్ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం వినూత్న ప్రచారం చేశారు. మరుగుదొడ్డి లేని ఇళ్లను గుర్తించి ఆ ఇంటి యాజమాని కాళ్లు కడిగి విజ్ఞప్తి చేయడంతో పాటు పాటు ఇంటి మహిళకు బొట్టు పెట్టి యజమానిని ఒప్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, శ్రీశైలం, రాజు, శ్రీౖశైలం, చంద్రయ్య, ఎస్బీఎం బృందం మల్లికార్జున్, రవితో పాటు అంగన్వాడీ, ఆశ, సాక్షరభారత్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళల సమాధానం.. సీఎం షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కి తన పర్యటనలో ఊహించని పరిణామం ఎదురైంది. గ్రామ స్వరాజ్ యోజన పథకాన్ని రాష్ట్రంలో 50,000 పంచాయతీల్లో విస్తరించాలనేది యోగి ప్రభుత్వం లక్ష్యం. ఈ పథకం అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించడానికి యోగి గతకొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదిత్యానాథ్ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కందీపూర్, మధుపూర్ గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలో స్థానిక అధికారులు ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోని వచ్చాక అందరికీ మరుగుదొడ్లు నిర్మించిందా? లేదా? అని ప్రశ్నించగా... అక్కడున్న మహిళలంతా లేదు అని బిగ్గరగా అరవడంతో సీఎం షాక్‌తిన్నారు. ఈ ఘటనతో తీవ్ర అసహనానికి గురైన యోగి వెంటనే అక్కడున్న అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలకు 24 గంటల్లో వారి ఖాతాలో నగదు జమచేసి, మరుగుదొడ్లు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం దళితవాడలో పర్యటించి, వారితో కలిసి భోజనం చేశారు. -
పథకాల లక్ష్యాలను సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలను సాధించి బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారులు, విద్యాధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం 1.42 లక్షలు కాగా.. ఇప్పటివరకు 1.10 లక్షలు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించే ఉద్దేశంతో ఇప్పటివరకు జిల్లాలో రూ.21 కోట్లు ఖర్చు చేశామన్నారు. దండేపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, వేమనపల్లి మండల అభివృద్ధి అధికారులను మినహాయించి మిగతా మండల అభివృద్ధి అధికారులకు ఓపెన్ బావులు, ఫామ్‌పాండ్స్ నిర్మించడంలో జాప్యం జరిగినందున షోకాజ్ నోటీసులు జారీ చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేస వి సెలవులు ముగిసే లోగా పాఠశాలల్లో వంటశాలలు, మూత్రశాలలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మే 10న రైతుబంధు పథకం మొదటి విడత చెక్కుల పంపిణీకి మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు సంబంధిత శాఖల సమన్వయంతో ఎ లాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి మరణధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని, పట్టాదారు పా సుపుస్తకం, ఆధార్ అనుసంధానంతో పాటు రైతుల వివరాలను పునఃపరిశీలించాలని తహసీల్దార్, మండ ల స్థాయి అధికారులకు సూచించారు. వ్యవసాయ వి స్తరణ అధికారులు ఉద్యానవన సిబ్బంది కలిసి ఫామ్‌పాండ్స్, ఓపెన్ బావుల లక్ష్యాలను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ కింద తొమ్మిది మండలాల్లోని 18 గ్రామాల్లో ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారులకు సూ చించారు. వేసవికాలంలో కలుషిత నీరు తాగడం వల్ల కన్నెపల్లి ఎస్టీ కాలనీలో జ్వరాలు ప్రబలి నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. మండలంలోని గ్రామపంచాయతీల పరిధిలో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు కేటాయించిన ఫార్మాట్లో నివేదిక పంపించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమ పథకాలపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు, మండల అభివృద్ధి అధికారులు బ్యాంకు అధికారులతో కలిసి ప్రభుత్వ ఆర్ధిక చేయూత పథకాలపై ఈనెల 24వ తేదీలోపు లబ్దిదారులతో గ్రామçసభ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ, ఎక్సైజ్, ఉద్యానవనశాఖ, పేదరిక నిర్మూలన సంస్థ, గిరిజనాభివృద్ధి శాఖ, సింగరేణి తదితర శాఖల సమన్వయంతో నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలన్నారు. నర్సరీలు, మొక్కల ప్లాంటేషన్‌ను వర్షాకాలం ప్రారంభం నాటికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల సంక్షేమాధికారులు రవూఫ్‌ఖాన్, ఖాజా నజీమ్ అలీ అఫ్సర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్‌కే లేదు..మాకెందుకు?
మూసాపేట: సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదు.. మాకెందుకు అంటూ మండల పరిధిలోని తుంకినీపూ గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. వంద శాతం ఓడీఎఫ్ సాధించాలన్న లక్ష్యంతో అధికారులు పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు తుంకినిపూ గ్రామానికి ఎంపీడీఓ నర్సింహారావు, ఈఓఆర్డీ ప్రభాకర్ తదితరులు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడగా.. పలువురు ఎదురుతిరిగారు. సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదని.. మేమేందుకు కట్టుకోవాలని అడగడంతో అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మమ్మ అధికారుల ముందే గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. ‘నా ఇంటి విషయం మీకెందుకు’ అని అడగడంతో అధికారులు ఎవరికీ సర్దిచెప్పలేకపోయారు. -
ఐఎస్ఎల్ సొమ్ము స్వాహాపై విజిలెన్స్ విచారణ
తొండంగి(తుని) : కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అమలులో భాగంగా అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు నిర్మించినట్టు చూపించి నిధులు కాజేసిన వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం విచారణ ప్రారంభించారు.పైడికొండ పంచాయతీలో పైడికొండతోపాటు ఆనూరు గ్రామాల్లో అధికారులు, కాంట్రాక్టర్ కలిసి 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్లైన్ రికార్డుల్లో చూపించారు. వీటిలో సగానికి పైగా లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు లేని ఇళ్ల వద్ద, దీర్ఘకాలం క్రితం సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి వివరాలు నిర్మించినట్టు చూపారు. ఈ విధంగా ఒక్కో లబ్ధిదారుడి పేరు మీద రూ.15వేల చొప్పున సుమారు పైడికొండ పంచాయతీ పరిధిలో సుమారు రూ.60 నుంచి 70 లక్షల వరకు నిధులు కాజేసినట్టు ‘సాక్షి’ ఈ బాగోతాన్ని గతేడాది డిసెంబర్లో ప్రత్యేక కథనంతో వెలికితీయడం అప్పట్లో దుమారం రేగింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆనూరు గ్రామంలోని బాధిత ప్రజలు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పైడికొండలో బాధిత గ్రామస్తులందరూ వ్యవహారానికి కారకులైన గ్రామ కార్యదర్శి బుచ్చిరాజు, ఇతర అధికారులతోపాటు స్థానిక అ«ధికార పార్టీ నేతలను నిలదీసి జరిగిన అవినీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్ ద్వారా కొంచెం నోరున్న నాయకుల నోరు మూయించేందుకు నేరుగా డబ్బులు పంపిణీ నిర్వహించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ ఆదేశాలతో జెడ్పీ సీఈవో ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం ఎంపీడీఓతో డ్వామా ఏపీఓ, ఇతర 34 మంది కూడిన బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో ఆన్లైన్ లబ్ధిదారుల రికార్డుల ప్రకారం ఇంటింటా పర్యటన నిర్వహించి వాస్తవ విషయాలను సేకరించి నివేదిక రూపొందించింది. ఈ ప్రక్రియకు ముందు సదరు కాంట్రాక్టర్, అధికారులు కలిసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించని వారి ఇళ్ల వద్ద ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు. కొన్నింటిని పూర్తి చేసినా అందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. కాగా సొంత ఖర్చులతో మరుగుదొడ్డిని నిర్మించుకున్న వారికీ తమకు తెలియకుండా పేరు వాడుకున్నందుకు కూడా కాంట్రాక్టర్ నయానా, భయానా సొమ్ములు ముట్టజెప్పారని సమాచారం. ప్రారంభమైన విచారణ పైడికొండ పంచాయతీలో జరిగిన ఐఎస్ఎల్ నిర్మాణ పథకంలో నిధుల దుర్వినియోగం, అవినీతి బాగోతాలపై విచారణ జరపాలంటూ ఆనూరుకు చెందిన బాధిత గ్రామస్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఈ డీఎస్ఎన్ మూర్తి, మరికొంత మంది అధికారుల బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో విచారణ ప్రారంభించారు. పైడికొండ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల్లో వివరాలు సేకరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా లబ్ధిదారుల పేర్లు ఆధారంగా అధికారుల బృందం స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలతోపాటు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈ మూర్తి తెలిపారు మరో రెండు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఇదే తంతు? పైడికొండ అక్రమాలు బయటపడడంతో మిగిలిన పంచాయతీల్లో ప్రజలు కూడా తమ వివరాలు దుర్వినియోగమయ్యాయేమోనని వెతుకులాటలో పడ్డారు. దీంతో పి.ఇ.చిన్నాయపాలెం, బెండపూడి తదితర గ్రామాల్లో కూడా లబ్ధిదారుల పేరుమీద భారీస్థాయిలో నిధులు కాజేసినట్టు తెలిసింది. దీంతో బాధిత ప్రజలు ఇప్పటికే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరికొంత మంది ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
మరుగుదొడ్లు నిర్మించుకోవడం లేదని..
అడ్డాకుల (దేవరకద్ర): మండలంలోని గుడిబండలో గురువారం అధికారులు పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావు, స్థానిక సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి యశోద, అంగన్వాడీ, ఆశలు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ నిర్మాణాలు మొదలుపెట్టని వారిని కలిశారు. నిర్మాణాలు మొదలు పెట్టి మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీఓ సూచించారు. నిర్మాణాలు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ల ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. మొండికేసిన వారి ఇళ్లకు విద్యుత్ శాఖ సిబ్బందితో కరెంటు కనెక్షన్లను తొలగింపజేశారు. నిర్మాణాలు పూర్తిచేసిన 5 మంది లబ్ధిదారులకు పంచాయతీ కార్యాలయం వద్ద చెక్కులను అందజేశారు. మూడు రోజుల్లో గ్రామంలో నిర్మాణాలు పూర్తి కావాలని ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావు సూచించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. -
రైతును 4 కి.మీ పాటు బానెట్‌పై ఉంచి..
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండో విడతగా ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని బ్లాక్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌నగర్ బ్లాక్‌కు చెందిన ప్రజలు టాయిలెట్ల నిధుల కోసం అధికారి కార్యాలయానికి వెళ్లారు. తమ సమస్యపై బీడీవో మాట్లాడాలని చెప్పగా కార్యాలయంలో ఎవరూ స్పందించలేదు. దీంతో సాయంత్రం వరకూ ఎవరైనా వస్తారని కార్యాలయం వద్దే వేచి చూశారు. సాయంత్రం 5 గంటల సమయంలో బీడీవో పంకజ్ కుమార్ గౌతమ్ కార్యాలయం బయటకు వచ్చి రైతుల వైపు కన్నైత్తైనా చూడకుండా వెళ్లిపోసాగారు. ఇది గమనించిన రైతులు పంకజ్ వెనుక వెళ్లగా.. ఆయన కారులో ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేశారు. అధికారి కారును అడ్డుకున్న రైతులు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల వినతిని లెక్కచేయని అధికారి కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో రైతుల్లో కొందరు కారుకు అడ్డుతప్పుకోగా.. ఒక యువ రైతు మాత్రం అలానే అడ్డుపడి కారు బానెట్‌ను పట్టుకున్నాడు. కానీ పంకజ్ కారును ఆపకుండా అలానే నాలుగు కిలోమీటర్లు పాటు పోనిచ్చాడు. ఈ ఘటనను మొత్తం పంకజ్ తన ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత ఇరువురూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. పంకజ్ రికార్డు చేసిన వీడియో సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన చీఫ్ బ్లాకడెవలప్మెంట్ ఆఫీసర్ విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. -
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు చేదు అనుభవం
-
మోదీపై ఆర్జేడీ నేత సెటైర్లు
సాక్షి, పాట్నా : బిహార్‌లో కేవలం వారంలోనే 8.5 లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించారని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. బిహార్‌లో గంటకు 5059 మరుగుదొడ్లు నిర్మించడం సాధ్యమా అని ప్రశ్నించారు. మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కనీసం బిహార్ సీఎం కూడా దీన్ని అంగీకరించరని తేజస్వి ట్వీట్ చేశారు. వారానికి ఏడు రోజులు..రోజుకు 24 గంటలు..అంటే ఏడు రోజుల్లో 168 గంటలకు గాను ఒక్కో గంటలో 5059 మరుగుదొడ్లు నిర్మించారన్నది ప్రధాని వ్యాఖ్యల సారాంశమని, బిహార్‌లో ఇది సాధ్యమేనా అని తేజస్వి ప్రశ్నించారు. ప్రధాని నుంచి ఇలాంటి బూటకపు ప్రచారం ఆశించలేమన్నారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను బిహార్ సీఎం కూడా అంగీకరించబోరని తేజస్వి ఆక్షేపించారు. స్వచ్ఛభారత్ మిషన్‌కు స్ఫూర్తినిచ్చేలా బిహార్ ప్రభుత్వం వారంలోనే 8.5 లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించిందని సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలను మంగళవారం ప్రధాని మోదీ ప్రశంసించిన క్రమంలో తేజస్వి ట్వీట్ చేశారు. -
నేరవేరని లక్ష్యం..!
బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు ఆర్భాటం చేస్తున్నాయి. కానీ అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదు. నిర్మాణాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. గత మార్చి 31 వరకు సుమారు 50 శాతం కూడా పూర్తి చేయలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల్వంచరూరల్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మొత్తం 81,172 వేల మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 19,006 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వివిధ దశల్లో 49వేల682 మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంకా 12వేల484 మరుగుదొడ్ల నిర్మాణపనులు ప్రారంభించలేదు. మార్చి 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా లక్ష్యాన్ని సాధించలేకపోయారు. లబ్ధిదారులకు పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించకపోవడంతో నిర్దేశితి గడువులో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మూడు గ్రామాలనే ఓడీఎఫ్(బహిరంగ మల, మూత విసర్జన రహిత ప్రాంతం)గా మార్చారు. రూ. 12 వేలు సరిపోవడంలేదు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున మంజూరు చేసింది. పెరిగిన ధరల నేపథ్యంలో ఆ మొత్తం సరిపోవడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సిమెంట్, ఇటుకలు, మేస్త్రీ కూలీ ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో ప్రభుత్వం ఇస్తున్న రూ.12వేల సరిపోవడం లేదని చెబుతుఆన్నరు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిధుల వ్యయాన్ని పెంచాలని కోరుతున్నారు. జూన్‌లోగా పూర్తిచేయాలి జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్కింద మొత్తం81,172 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 19,006 మరుగుదొడ్లు మార్చి నాటికి పూర్తయ్యాయి. మార్చి 31నాటికి పూర్తికాని మరుగుదొడ్లను జూన్‌నాటికి పూర్తి చేయాలి. లక్ష్యసాధనకోసం చర్యలు తీసుకుంటున్నాం. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. లబ్దిదారులు నిర్మాణంలో తీవ్రజాప్యం చేయడంతో జిల్లాలో మూడు గ్రామపంచాయతీలు మాత్రమే ఓడీఎఫ్‌గా ప్రకటించాం. ఏప్రిల్ నెలాఖరుకు వంద గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చుతాం. –విజయచంద్ర, ఏపీడీ -
మరుగుదొడ్ల అక్రమాలపై విచారణ
బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలలో జరిగిన అక్రమాలపై ఈఓపీఆర్డీ సీహెచ్‌ఎస్‌ఎన్‌ఎం రాజు, మండల జేఈ బర్ల భాస్కరరావు మంగళవారం విచారణ చేపట్టారు. గ్రామంలో కొందరిని విచారణ చేసే సమయంలో అక్రమాల అనకొండ, టీడీపీ నాయకుడు అక్కడే ఉండి అందరినీ భయబ్రాంతులకు గురిచేసే యత్నం చేశాడు. దీంతో కొందరు బయటకు రాలేకపోయారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నాయకులు అల్లాడ నగేష్ వివరాలు చెబుతుండగా ముప్పేట దాడికి యత్నించారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకొంది. అక్రమాల చిట్టా వివరించిన నగేష్ సాంకేతికంగా కొన్ని వివరాలు విచారణాధికారులు నమోదు చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడ్డవారు అక్కడే ఉంటే విచారణ ఎలా చేస్తారని, మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించే యత్నాలు టీడీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. విచారణాధికారులు మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. విచారణ కొనసాగిస్తామని తెలిపారు. విచారణాధికారిని మార్చిన నాయకులు... పారాది అక్రమాలపై ఆర్డీఓ సుదర్శనదొర ఆర్డబ్ల్యూఎస్ జేఈ శంకరరావును నియమించగా, టీడీపీ నాయకులు డమ్మీ ఎంపీపీ కలిపి మండల జేఈ బర్ల భాస్కరరావును నియమించారు. శంకరరావు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడతారని, తిరిగి తమకు నష్టం కలుగుతుందనే భావంతో రాత్రికి రాత్రి విచారణాధికారి పేర్లు మార్చి తక్షణమే విచారణ చేయించేలా చర్యలు చేపట్టారు. ఏదోలా తూతూమంత్రంగా విచారణ చేయిస్తే ఊరుకోబోమని, ఆర్డబ్ల్యూఎస్ జేఈ శంకరరావును విచారణాధికారిగా ఆర్డీఓ నియమిస్తే ఆయనను ఎందుకు తప్పించారని పలువురు ప్రశ్నిస్తూ ఈ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము లోకాయుక్తకు వెళ్తామని, న్యాయవాది, వైఎస్సార్ సీపీ నాయకులు అల్లాడ నగేష్ తెలిపారు. -
మరుగుదొడ్లు రెట్టింపు.. సదుపాయాలు శూన్యం
ఇంటింటికీ టాయిలెట్ సౌకర్యం అంశంలో సంఖ్యాపరంగా మంచి ఫలితాలనే సాధిస్తోంది. మహాత్మా గాంధీజీ కన్న కలలు నిజమయ్యేలా భారత్‌ను అద్దంలా తళతళలాడేలా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడున్నరేళ్ల క్రితం స్వయంగా చీపురు పట్టి రాజధాని వీధుల్ని తుడిచి మరీ ప్రకటించారు. బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించి అక్టోబర్ 2, 2019 గాంధీజీ 150వ జయంతిన స్వచ్ఛ భారత్‌తో ఘనంగా నివాళులర్పిస్తామని అన్నారు. ఇప్పుడు ఆ లక్ష్యసాధన దిశగా మెరుగైన ఫలితాల్ని సాధిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెబుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ మొదలైన ఇన్నేళ్లలో నివాస గృహాలకు మరుగుదొడ్ల సదుపాయం రెట్టింపైందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ లోక్‌సభకు సమర్పించిన నివేదికలో తెలిపింది. 2014 అక్టోబర్ 2 నాటికి దేశంలో 38.7 శాతం నివాసాలకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంటే, 2018 మార్చి నాటికి 78.98శాతం నివాసాలకు ఈ సదుపాయం పెరిగింది. ఈ మూడున్నరేళ్లలో 6.4 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఒడిఎఫ్‌ను సాధించాయి. ఒడిఎఫ్ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ మహారాష్ట్ర, మేఘాలయా, సిక్కిం, ఉత్తరాఖండ్ కేంద్రపాలిత ప్రాంతాలు దాదా నాగర్ హవేలి, డయ్యూ డామన్ , చండీగఢ్ ఇక టాయిలెట్లు సదుపాయం ఘోరంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఒడిశా, జమ్ము కశ్మీర్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్‌లో కేవలం 41 శాతం ఇళ్లకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంటే, ఒడిశాలో 48 శాతం, కశ్మీర్లో 51శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సదుపాయం ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. తెలంగాణలో దాదాపుగా 19 లక్షల టాయిలెట్స్‌ను నిర్మిస్తే ఒడిఎఫ్ రాష్ట్రాల జాబితాలో నిలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆ లక్ష్యం చేరుకోవాలంటే 22 లక్షల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలో 9 కోట్ల 80 లక్షల టాయిలెట్స్‌ను నిర్మించాలన్నదే స్వచ్ఛ భారత్ లక్ష్యంగా పెట్టుకొని భారీగా నిధులు కూడా కేటాయించారు సదుపాయాల సంగతేంటి? ఇంటింటికి టాయిలెట్స్ విషయంలో సంఖ్యాపరంగా రెట్టింపైనప్పటికీ సదుపాయాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల నీటి సదుపాయం లేక టాయిలెట్ ఉన్నప్పటికీ బహిర్భూములకే వెళుతున్నారు. మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, టాయిలెట్‌కి సరైన పద్ధతిలో ట్యాంకులు నిర్మించకుండా ఏదో ఒక గొయ్యిని తవ్వడం వల్ల దానిని వినియోగించుకోలేకపోతున్నారు. నాలుగు గోడలు కట్టేసి పైపు లైన్ల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా టాయిలెట్లను వినియోగించుకోలేని పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గోపాల్‌పుర గ్రామంలో 330 ఇళ్లకు గాను 100 టాయిలెట్స్‌ను కట్టించారు. కానీ వారిలో ఒక్కరు కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడం లేదు. దీనికి నీటి వసతి లేకపోవడం, నాసిరకం నిర్మాణాలే కారణం.. కొంతమంది ఆ టాయిలెట్స్‌ని గోడౌన్లుగా ఉపయోగిస్తున్నారు. ఇలాగైతే కోట్లలో అంకెలే కనిపిస్తాయి తప్ప అసలు లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం వినిపిస్తోంది. -
ఒట్టేసి చెబుతున్నా.. నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..
వరదయ్యపాళెం/పిచ్చాటూరు/కేవీబీపురం: ‘ఒట్టేసి చెబుతున్నా..మహిళల ఆత్మగౌరవం పేరుతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులైన ఇళ్లకు పంపడంలో వెనుకడుగు వేసేది లేదు’ అని జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వరదయ్యపాళెంలోని ఒన్నెస్ కోచింగ్ సెంటర్లో సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకు చెందిన అధికారులతో ఓడీఎఫ్, నరేగా పథకాల గురించి జిల్లా కలెక్టర్ సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ రుగుదొడ్డి నిర్మాణాల నిధులకు కొరత లేదని ప్రస్తుతం జిల్లాకు రూ.625 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 2లక్షల మరుగుదొడ్లు నిర్మించామని, మరో 80వేల మరుగుదొడ్లు నిర్మిస్తే ఓడీఎఫ్ ఖాతా లోకి చేరుకుంటామన్నారు. శ్రమకు తగి న ఫలితం రావాలంటే ఈనెల 30 లోపు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సత్యవేడు మండలంలోని కన్నవరం, మల్లవారిపాళెం, పెద్దఈటిపాకం, సత్యవేడు, వానెల్లూరు పంచాయతీలలో 1012 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్యం పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం కేవీబీపురం మండలంలోని ఐకేపీ(వెలుగు)కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 29 పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందితో మరుగుదొడ్డి నిర్మాణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిచ్చాటూరు మండలం ఎంపీడీఓ కార్యాలయలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లు టార్గెట్లను తప్పక పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. కీళపూడి, ముడియూరు పంచాయితీలలో నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. -
వైరల్.. లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య
బీజింగ్ : చైనాలో ఓ బాలుడు చేసిన బిత్తిరి చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండరు. ‘బాగైందంటూ.. భుజాలు ఎగురేస్తారు’. ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడ్డట్లుంది ఆ బాలుడి చేసిన పని. లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్తున్న ఆ బాలుడికి ఓ తీట పని చేయాలని తోచింది. లిఫ్ట్ బటన్స్‌ను ఇతరులు కూడా ఉపయోగిస్తారనే ఉద్దేశంతో వాటిపై టాయిలెట్ పోసాడు. తీరా ఆ బటన్స్‌ను తానే ఉపయోగించాల్సి వచ్చింది. తాను దిగాల్సిన ఫ్లోర్ వచ్చే సరికి బటన్స్ వాటంతటవే పని చేయడంతో లిఫ్ట్ ఒక్కసారిగా స్ట్రక్ అయింది. దీంతో లిఫ్ట్ డోర్ తెర్చుకోవడం.. మూసుకోవడంతో ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలెట్టాడు. చివరకు తానే ఆ బటన్లను ప్రెస్ చేసి బయటకి వచ్చాడు. ఇతరులకు కీడు చేయాలనుకుంటే తనకే కీడు జరుగుతుందనే కర్మ సిద్దాంతం రుజువైంది. ఈ తతంగం అంతా అందులోని సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. -
లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య.. వీడియో హల్ చల్
-
ఓ వైపు లక్ష్యం.. మరోవైపు నిర్లక్ష్యం
కాశీబుగ్గలోని హడ్కో కాలనీకి చెందిన ఈ బాలుడు మూడు నెలలుగా ఇలాగే నిచ్చెన ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు. నిచ్చెన కింద పది అడుగుల గొయ్యి ఉంది. కుటుంబమంతా ఇలాగే అవస్థలు పడుతోంది. ఎందుకంటే.. శ్రీకాకుళం ,కాశీబుగ్గ: మరుగుదొడ్ల నిర్మాణం నిరుపేదలను ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. కట్టేందుకు సరైన స్థలం, సరిపడా డబ్బులు లేకపోయినా సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారన్న భయం, బిల్లులు మంజూరు చేస్తారన్న ఆశతో గొయ్యిలు తవ్విన వారికి నిరాశే ఎదురవుతోంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు హడ్కోకాలనీలో పాలక శ్యామల, శంకరరావులు తమకు సరైన స్థలం లేకపోయినా మరుగుదొడ్డి కోసం ఇంటి ముందే భారీ గొయ్యిలు తవ్వారు. అయితే మొదటి విడత బిల్లులు ఇంతవరకు రాకపోవడంతో తదుపరి పనులు చేపట్టలేదు. ఇప్పటికి మూడు నెలలవుతున్నా అధికారులు స్పందించకపోవడంతో నిచ్చెనలు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉండటంతో గోతుల్లో పడే ప్రమాదముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
చేతితో టాయిలెట్‌ను శుభ్రపరిచిన ఎంపీ
భోపాల్ : చేతితో టాయిలెట్‌ను శుభ్రపరిచి సోషల్ మీడియాలో హీరో అయ్యారు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా. మధ్యప్రదేశ్‌లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో ఉపయోగించడంలేదని, బయటకే వెళ్తున్నామని చెప్పారు. దీంతో వెంటనే వాటిని పరిశీలించిన ఆయన చీపురు చేత పట్టి టాయిలెట్స్‌ను శుభ్రపరిచారు. ఏకంగా తన ఎడమ చేతితో లోపల కూరుకుపోయిన చెత్తను తీసి స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఫొజులివ్వడం కాదు.. చేసి చూపించాలని చాటి చెప్పాడు. ఈ వీడియోను ఆయనే స్వయంగా ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ గత బుధవారం జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఇక ఈ విషయాన్ని సైతం నెటిజన్లు ప్రస్తావిస్తూ జనార్థన్ మిశ్రాను కొనియాడుతున్నారు. -
చేతితో స్కూల్ టాయిలెట్ శుభ్రపరిచిన ఎంపీ
-
లేనిది ఉన్నట్టు... అంతా కనికట్టు...
ఒకే ఇంట్లో నిర్మించిన మరుగుదొడ్డికి ముగ్గురి పేర్లతో బిల్లులు కాజేశారు. తాత్కాలికంగా గుడ్డతో కట్టుకున్న దొడ్డి ఉంటే దానికి డబ్బులు గుంజేశారు. చనిపోయినవారి పేర్లను చేర్చి వారి పేరున స్వాహా చేశారు. ఇదీ కొత్తవలస మండలం చినరావుపల్లిలో జరిగిన బిల్లుల మాయాజాలం. కొత్తవలసరూరల్(శృంగవరపుకోట): స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఓ వైపు జిల్లా కలెక్టర్ ఓ ఉద్యమంలా కార్యక్రమాలు చేపడుతుంటే అందులోనూ కాసులు కాజేసేవారు పుట్టుకొస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయడానికి తప్పుడు లెక్కలతో బిల్లులు కాజేసేశారు. ఈ స్కాం వెనుక మండలానికి చెంది న ఓ అ«ధికారి టీడీపీ ప్రతినిధుల అండదండలతో ఉన్నట్టు తెలుస్తోంది. మండలంలోని చినరావుపల్లిలో జరిగిన బిల్లులే అక్రమాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. 40శాతానికి పైగా బిల్లులు స్వాహా చినరావుపల్లిలో చనిపోయినవారి పేరిట చెల్లింపు, అస్సలు నిర్మాణాలే లేకుండా డ్రా చేయడం, అసంపూర్తిగా వదిలేసిన వాటికీ, ఒకే నిర్మాణంతో ముగ్గురికి బిల్లులు చెల్లించిన సంఘటనలు వెలుగు చూశాయి. గ్రామంలో 182 మరుగుదొడ్లు నిర్మించినట్టు బిల్లులు తీసేసుకున్నా... 40 శాతానికి పైగా బిల్లులు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. గ్రామానికి చెందిన సింగంపల్లి వాసు, బూసాల వెంకటరమణతో పాటు గ్రామంలోగల తెలుగు తమ్ముళ్లు తదితరులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో 182 మంది లబ్దిదారులను ఓడీఎఫ్‌కు ఎంపికచేసి దాదాపు రూ. 27 లక్షలు మంజూరు చేశారు. అందులో ఎన్జీఓ అకౌంట్లో రూ. 24 లక్షలు, వెలుగు సీసీ వీఓ అకౌంట్లో 2 లక్షలు, లబ్ధిదారుల అకౌంట్లో సుమారు 84 వేలు చేరింది. పనులు పర్యవేక్షించాల్సిన కార్యదర్శి మరో గ్రామం బాధ్యతలు చూస్తున్నందున దీనిపై దృష్టిసారించలేకపోయారు. ఉపాధి టీఏ సూర్యకుమారి జియోట్యాగింగ్ వంటి పనులు చూశారు. అయితే అనుమానం వచ్చి ఆమె అభ్యంతర పెట్టినా కొందరి ఒత్తిళ్లతో తలూపక తప్పలేదు. రకరకాలుగా అక్రమాలు ∙గ్రామానికి చెందిన కొయ్యాన లక్ష్మి, కొయ్యాన కొండమ్మ, కొయ్యాన గౌరి ఒకే కుటుంబంగా నివసిస్తున్నారు. ఇక్కడ ఒకే మరుగుదొడ్డి నిర్మించినప్పటికీ వీరి ముగ్గురి పేరిట మూడు బిల్లులుగా రూ. 45 వేలు ఆన్లైన్లో చెల్లించేశారు. ∙గంధం సరళ అనే ఆమె కేవలం ఒక గుడ్డమాత్రమే కట్టుకుని మరుగుకు వినియోగిస్తున్నారు. ఈమెకు తెలీకుండానే బిల్లు చెల్లించినట్టు నమోదైంది. ∙అడ్డాల లక్ష్మికి అసలు ఇల్లే లేదు. అయినా లెక్కకోసం నందలు తీసి వదిలేశారు. ∙చనిపోయిన యర్ర బంగా రమ్మ పేరిట నిర్మించిన బాత్రూంను అసంపూర్తిగా వదిలే సి లబ్ధిదారునికి చేరాల్సిన బిల్లులు పక్కదారి పట్టించేశారు. కంప్యూటర్ మాయాజాలం గ్రామంలో జరిగిన బిల్లు చెల్లింపుల వ్యవహారంలో సాంకేతిక మాయాజాలం కూడా వెలుగు చూసింది. బాత్రూం ఐడీ 30311073 కొయ్యానగౌరి అని నమోదైతే రేషన్ కార్డు కొయ్యాన అచ్చుతరావుగా చూపుతోంది. లబ్ధిదారుల జాబితాకు రేషన్‌కార్డులకు అసలు పొంతన ఉండట్లేదు. మరుగుదొడ్డి నిర్మించకుండానే తినేశారు మా ఇంటికి మరుగు లేదు. గుడ్డ కట్టుకుని మరుగుగా వాడుకుంటున్నాం. నుయ్యి పక్కనే బాత్ రూం కడతామంటే వద్దన్నాం. వేరే దగ్గర కట్టుకుంటామని తెలిపాం. మాకు తెలీకుండానే మరుగు కట్టినట్లు రూ. 15 వేలు నిధులు తినేశారు. – గంధం సరళ కుమార్తె మూడువేలు తీసుకున్నారు మేము కట్టుకున్న మరుగుకు 15వేలు మంజూరయ్యారన్నారు. రూ. 12వేలే ఇచ్చారు. మిగతా మొత్తంకోసం జన్మభూమి సభలో అధికారుల్ని నిలదీసినా ఫలితం లేకపోయింది. పైగా ఖర్చులు ఉంటాయంటున్నారు. – కర్రి పార్వతి అసలు లిస్టే నాకు తెలీదు గ్రామంలో ఎన్ని మరగుదొడ్లు నిర్మించారో ఎంతమందికి బిల్లులు ఇచ్చారో ఆ లిస్టే నాకు తెలీదు. అధికారులు ఎలా చెయ్యమంటే అలాచేశాను. కొన్ని నిర్మాణాలు పూర్తికాక, ప్రభుత్వం నుంచి బిల్లులు రావటం ఆలస్యమైంది. గ్రామంలో కొంతమంది వీధికుళాయిల వద్ద వచ్చిన చిన్నగొడవతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా సొంత డబ్బులు చెల్లించి మరీ నిర్మాణాలు చేపడుతున్నాను. – బొబ్బిలి రమణ, సర్పంచ్ -
టాయిలెట్ కోసం ఆమె ఏం చేశారంటే..
పట్నా: సంకల్ప సిద్ధికి, నిబద్థతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు బిహార్‌కు చెందిన ఓ మహిళ. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న అమీనా ఖటూన్ (40) అత్యంత పేదరికాన్ని సైతం ఎదిరించి టాయిలెట్ నిర్మాణం పూర్తి చేసిన వైనం ప్రముఖంగా నిలిచింది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎలా వున్నప్పటికి.. ఆమె సంకల్పానికి మాత్రం స్థానికులు, అధికారులు జేజేలు పలికారు. అంతేకాదు స్వచ్ఛ్ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణంకోసం ఆశ్రయిస్తే ఉదాసీనత ప్రదర్శించిన అధికారులకు చెంపపెట్టులా ఆ పనిని పూర్తి చేసి.. వారి ప్రశంసలందుకోవడం విశేషం. సౌపాల్ జిల్లా పత్రా గ్రామానికి చెందిన అమీనా స్వచ్ఛ్ భారత్ పథకం కింద టాయిలెట్ నిర్మించుకునేందుకు అధికారులను ఆశ్రయించారు. పలుమార్లు సంబంధిత అధికారులు చుట్టూ తిరిగినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తానే స్వయంగా రంగంలో దిగి చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షమెత్తుకుని మరీ తన ఇంట్లో టాయిలెట్ నిర్మించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆమె పట్టుదలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, ఇతర కార్మికులు టాయిలెట్ నిర్మాణ పనులను ఉచితంగా చేసిపెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే విషయం తెలుసుక్ను జిల్లా అధికారులు ఆదివారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఒక చిన్న పిల్లవాని తల్లి, తన జీవనోపాధికోసం కార్మికురాలిగా పని చేస్తున్న నిరుపేద మహిళ చేసిన ప్రత్యేక ప్రయత్నం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు బిహార్ రాష్ట్రం స్వచ్ఛ భారత్ లక్ష్యం అమలులో దిగువ స్థాయిలో ఉంది. లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలమూత్ర విసర్జన పద్ధతినే అనుసరిస్తున్నారు. అయితే, అక్టోబర్ 2, 2019 నాటికి బిహార్‌ను ఓడీఎఫ్‌గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. కానీ...ఒక్క జిల్లాగా కూడా ఓడీఎఫ్ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ) గా ప్రకటితం కాకపోవడం గమనార్హం. కాగా మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా, 2014, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
అవినీతి కంపు!
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి కంపుకొడుతోంది. అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులు కుమ్మక్కై పథకం ఉద్దేశాన్ని పక్కదారి పట్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. కోవెలకుంట్ల మండలంలో ఏకంగా పాతమరుగుదొడ్లు చూపి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గత రెండేళ్ల కాలంలో రెండు వందలు దాటని మరుగుదొడ్ల నిర్మాణాలు రెండు నెలల్లోనే కొత్తగా 300 నిర్మాణాలు పూర్తైనట్లు రికార్డుల్లో చూపడం అనుమానాలకు తావిస్తోంది. కోవెలకుంట్ల: పల్లెలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోకేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరుగుదొడ్డి మంజూరైన తర్వాత లబ్ధిదారుడు దానిని నిర్మించే ప్రదేశాన్ని అధికారులు జియోట్యాగింగ్ చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. మరుగుదొడ్డి బేస్మెంట్ దశలో నిర్మాణ ఫొటో జత చేసి మొదటి విడత బిల్లుకు ప్రతిపాదిస్తే రూ. 6వేలు లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది. మరుగుదొడ్డి పూర్తి అయ్యాక అధికారులు పరిశీలించి రికార్డుల్లో నమోదు చేసి మిగిలిన రూ. 9వేలు జమ చేస్తారు. ఇందులో ఎలాంటి అవకగతవకలు జరగకుండా సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఒక్కో గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. అయితే, కోవెలకుంట్ల మండలంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఈ నిబంధనలను తుంగలో తొక్కి చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పాతవాటికే బిల్లులు: కోవెలకుంట్ల పట్టణంలో గత రెండళ్లలో కేవలం 240 లెట్రిన్లు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 15 నాటికి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఇటీవల లక్ష్యాన్ని నిర్దేశించగానే ఏకంగా 300కు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ రెండు నెలల్లో అదేలా సాధ్యమని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని టీడీపీ కమిటీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు, కొందరి అధికారులతో కుమ్మక్కై గతంలో నిర్మించిన పాత మరుగుదొడ్లకే బిల్లులు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇదే తంతు నిర్వహించి సుమారు రూ. రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ఆ నిధులను కొందరు అధికారులు, టీడీపీ నాయకులు, బోగస్ లబ్ధిదారులు కలిసి వాటాలు పంచుకున్నట్లు చర్చ జరుగుతోంది. బిల్లులు చేయాలంటూ అధికారులపై ఫైర్: తాము సూచించిన వ్యక్తులకే వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయాలని, టీడీపీ నాయకులు ఇటీవల మండల అధికారులపై ఫైర్ అయ్యారు. అలాగే గుళ్లదూర్తి గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాలు మరుగుదొడ్ల కేటాయింపులో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఒక వర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా తమ వర్గానికి 50 కేటాయించాలని అధికారులకు లబ్ధిదారుల జాబితా అందజేశారు. ఉన్నతాధికారులు మండలంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పాత మరుగుదొడ్లకు బిల్లుల చెల్లింపు జరిగినవి మచ్చుకు కొన్ని ► కోవెలకుంట్ల గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్‌పై పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత మరుగుదొడ్లు చూపించి తమ బంధువుల పేరుతో మూడు బిల్లులు డ్రా చేసుకున్నాడు. ► ఇదే కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి రెండు బిల్లులు తీసుకున్నాడు. ► స్వామినగర్ కాలనీలో ఒకే ఇంటిపేరు మీద ఆరుగురికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో రెండింటికి పాత వాటికే బిల్లులు చేశారు. ► పట్టణంలోని గుదేట్టి వీధి, బసిరెడ్డి బావి వీధి, సంతపేట కాలనీల్లో 50 నుంచి 60 దాకా పాత మరుగుదొడ్లకే బిల్లులు చెల్లించారు. -
మరుగుదొడ్లలో అవినీతి కంపు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓడీఎఫ్ (బహిరంగ మల, మూత్ర విసర్జన నివారణ)లో ప్రధాని నుంచే ప్రసంశలం దుకున్న విజయనగరం జిల్లాలో వాస్తవ పరి స్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లాకు 3.70 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకాగా వాటిలో ఇప్పటి వరకు 3.30 లక్షలు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పూర్తయ్యాయని చెబుతున్న వాటిలో 20 శాతం మరుగుదొడ్లు లేనే లేవు. 30 శాతం మరుగుదొడ్లు అరకొరగా వినియోగానికి పని కి రాకుండా ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.15 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రూ.కోట్లల్లో నిధులు అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోయాయి. చచ్చిపోయిన వారిపేరున కూడా మరుగుదొడ్లు కట్టేసి, నిధులు కాజేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే సాకుతో కాంట్రాక్టర్లు, అధికా రులు కుమ్మకై చేయని పనులను చేసినట్లు, లేని లబ్ధిదారులను ఉన్నట్లు చూపించి నిధులు మింగేశారు. నిర్మించకుండానే.. నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామం.. చుట్టూ పచ్చని చెట్లు.. పంట చేల సుగంధం నడుమ ఆధునికతకు కాస్త దూరంగా ఉంటారు ఇక్కడి జనం. వీరికి సర్పంచ్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అతను అన్యాయం చేస్తున్నాడని కూడా తెలుసుకోని అమాయకత్వం వారిది. దీనినే ఆసరాగా చేసుకుని పాలకులు, కాంట్రాక్టర్లు కుమ్మకయ్యారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా జిల్లాలను సంపూర్ణ ఓడీఎఫ్‌గా మార్చాలని జిల్లా అధికారులకు గట్టిగా ఆదేశాలివ్వడంతో వారు లక్ష్యాలను చేరుకోవడంపైనే దష్టి సారించారు. ఈ ఒక్క పంచాయతీలోనే 310 మంది లబ్ధిదారులకు రూ.45.90 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో లెక్కల్లో మా యలు చేసి మరుగుదొడ్లు నిర్మించకుండా, పాత మరుగుదొడ్లకు బిల్లులు చేసుకుని ఈ మొత్తంలో సగానికిపైగా ప్రభుత్వ ధనాన్ని కొందరు కాజేస్తున్నారు. ఒకే మరుగుదొడ్డికి రెండేసి బిల్లులు.. గ్రామంలో అప్పటికే నిర్మించిన మరుగుదొడ్డికి మరలా దరఖాస్తు చేసి, ఒక సారి నిధులు తీసుకున్నదానికి మరలా నిధులు మంజూరు చేయిం చుకుని సొమ్ము చేసుకున్నారు. పప్పలరాము, పప్పల రాజినాయుడు, పొట్నూరు అప్పలనాయుడు, పొట్నూరు కళావతి, పప్పల వరహా లమ్మ, పప్పల శ్రీనివాసరావు, పల్లి అప్పలనర్సి, పల్లి పైడిరాజు, కర్నపు రాజప్పడు, పొట్నూ రు నారాయణమ్మ, దుర్గాసి రాముల పేరుమీద రెండేసి సార్లు నిధులు డ్రా చేసేశారు. ఒకే రేషన్‌కార్డుపై రెండు మరుగుదొడ్లు బిల్లులు చేశారు. రెడ్డి స్వామినాయుడు, రెడ్డి సుబ్బలక్ష్మి భార్యభర్తలు పేరుపై రెండు మరుగుదొడ్లు నిర్మించినట్లు నిధులు తీసేసుకున్నారు. ఇదంతా ఎలా చేశారు.. ఇంత దారుణంగా జనాన్ని మోసం చేసి, ప్రభుత్వ ధనాన్ని దర్జాగా కాజేయడానికి అక్రమార్కులు ఎంచుకున్న మార్గాలను అన్వేషిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల గహాల వద్ద వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే ప్రదేశాన్ని ట్యాబ్‌లో ఫొటోతీసి ఆర్‌డబ్య్లూఎస్ వెబ్సైట్లో నమోదు చేయాలి. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులతో గుంత ఫొటో, పూర్తి చేసిన తర్వాత మరో ఫొటోను వెబ్సైట్లో ఉంచాలి. అయితే ఈ గ్రామంలో లబ్ధిదారులకే తెలియకుండా వారి ఫొటోలు వెబ్సైట్లోకి చేరిపోయాయి. కొందరికి పాత మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటినే కొత్తవిగా చూపించారు. ఇంత జరుగుతుంటే పంచాయతీ స్పెషల్ æఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవటాన్ని బట్టి వారికి తెలిసే ఈ వ్యవహారం జరిగినట్లు అర్థమవుతోంది. ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలి: మా గ్రామంలో ఓడీఎఫ్ నిర్మాణాల్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు సష్టంగా తెలు స్తోంది. అలాగే, మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పజెప్పడంతో పనులన్నీ నాసిరకంగానే జరిగాయి. చాలా మరుగుదొడ్లను అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడితే జరిగిన అక్రమాలు బయటపడతాయి. –రెడ్డి అప్పలనాయుడు, మాజీ సర్పంచ్, మల్యాడ గ్రామం లబ్ధిదారులకు తెలియకుండానే.. తమ పేరుమీద మరుగుదొడ్డి మంజూరైందని, నిధులు కూడా వస్తే తీసుకుని వాడుకున్నామనే విషయాలు లబ్ధిదారులకే తెలియదు. ఈ గ్రామంలోని మామిడి అచ్చియ్యమ్మ, యడ్ల అసిరి నాయుడు, రెడ్డి అప్పలనాయుడు, గేదెల రాము, గేదెల లక్ష్మణరావుల ఒక్కొక్కరి పేరుమీద రూ.15వేలు చొప్పున మరుగుదొడ్ల నిధులు మంజూరైనట్లు తేలింది. వారిని విచారించగా తమకసలు ఆ నిధులు వచ్చినట్లుగానీ, మరుగుదొడ్డి మంజూరైనట్లుగానీ తెలియదని స్పష్టం చేశారు. తమ ఇళ్ల వద్ద మరుగుదొడ్లు కూడా నిర్మించలేదని వాపోయారు. ఇదెలా సాధ్యమో అక్కిడి పాలకులు, అధికారులే అడగాలి. -
బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా?
బీజింగ్ : బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. పొరుగు దేశం చైనాలో ఓ కుర్రాడు బాత్రూంలో వీడియోగేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గంటల కొద్దీ బాత్రూంలో గేమ్ ఆడుతూ ఉండటంతో అతని మలద్వారం తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే రెక్టమ్ (పెద్ద పేగు చివరి భాగం) కిందికి వేలాడటమే కాకుండా అతని మలద్వారం నుంచి ఓ రక్తం ముద్ద కిందికి జారిపోయింది. వైద్య పరీక్షల్లో అతని రెక్టమ్ శరీరంతో విడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. చివరకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను రక్షించారు. గంటలకొద్ది కూర్చోని ఉండటంతో అతని పురుషనాళ కండరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచే మలబద్దకం సమస్యతో బాధపడుతున్నాడని, ఇంతవరకు చికిత్స చేసుకోకపోవడంతో పరిస్థితి తీవ్రమై ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. అలానే వీడియో గేమ్స్ ఆడుతూ బాత్రూంలో ఎక్కువ సమయం గడపడంతో వ్యాధి తీవ్రమైందన్నారు. ఆ కుర్రాడు మాత్రం 30 నిమిషాలు మొబైల్లో గేమ్ ఆడుతూ బాత్రూంలో కూర్చున్నానని డాక్టర్లకు తెలిపాడు. -
హా...ర్టీసీలో... అన్నీ అవస్థలే...
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రగతి రథ చక్రాలకు వేదికైన ఆర్టీసీ బస్సు కాంపెక్సుల్లో సమస్యలు తిష్టవేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని తొమ్మిది కాంప్లెక్సుల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. సరిపడా మరుగుదొడ్లు, కూర్చునేందుకు, అవసరమైనన్ని బెంచీలు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, క్యాంటీన్లలో బెంబేలెత్తించేలా టీ, టిఫిన్ల ధరలు, తాగడానికి మంచినీరు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన డంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో చోటుచేసుకున్న లోపాలు ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూశాయి. ముక్కు మూసుకోవాల్సిందే... గోకవరం, రావులపాలెం కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేకపోవడంతో ఆరుబయటే మూత్రశాలగా మారింది. ప్రయాణికులు ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తుండడంతో డిపో ఆవరణల్లో దుర్గంధం వెదజల్లుతోంది. రావులపాలెంలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోకవరంలోని మూత్రశాల వద్ద నీటి సమస్య నెలకొంది. నీరు రాకపోవడంతో మూత్రశాలలో దుర్వాసన వస్తోంది. అమలాపురంలో పార్కింగ్ స్టాండ్ పక్కన డ్రైనేజీ నీరు ఆవరణలో నిల్వ ఉంటుండడంతో ఆ పరిసరాలు మురికికూపంలా మారాయి. ప్రమాదం జరిగితే బూడిదే... గోకవరం బస్టాండ్‌లో తాటాకుల పందిరిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగితే భారీ ఆస్తినష్టం వాటిల్లుతుంది. రావులపాలెం డిపోలో రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యం లేదు. బస్టాండ్ ఆవరణంతా ఆటోలు, వ్యాన్ల స్టాండ్లతో ఆక్రమణలో ఉంది. పార్కింగ్ సదుపాయం సరిపోకపోవడంతో డిపో చుట్టూ మూడు ప్రైవేటు పార్కింగ్ స్టాండ్లు వెలిశాయి. జాతీయ రహదారి, లొల్ల ప్రధాన కాలువ ఆధునికీకరించడంతో బస్టాండ్ వర్షాకాలంలో చెరువును తలపిస్తోంది. ఆ సయమంలో రెండు మోటార్లు పెట్టి వర్షపు నీటిని తోడుతారు. ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా సదుపాయం లేదు. డీలక్స్ ఫ్లాట్‌ఫాంపై సరిపడా బల్లలు లేవు. బస్సులు ఆగేందుకు సరైన ఫ్లాట్‌ఫాం లేదు. డ్రైవర్ ఆదమరిచినా, బస్సు బ్రేక్ విఫలమైనా ప్రయాణికులపై దూసుకొచ్చే ప్రమాదం ఉంది. రామచంద్రపురంలో పార్కింగ్ స్టాండ్ నిర్వహించడం లేదు. ఒక్కో కాంప్లెక్సులో ఒక్కోలా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ కాంప్లెక్సుల్లో ప్రతి నాలుగు గంటలకు రూ.5 లెక్కన రోజుకు రూ.30 వసూలు చేస్తున్నారు. గోకవరం, రాజోలు డిపోల్లో రోజుకు రూ.20లñ చొప్పున తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్న సమస్యలున్నా ప్రయాణికులను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దడపుట్టిస్తున్న ధరలు.... అన్ని ఆర్టీసీ కాంప్లెక్సుల్లోని దుకాణాల్లో తినుబండారాలు, కూల్ డ్రింకులు, కంపెనీ చిప్స్ ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నారు. అర లీటర్ కూల్ డ్రింక్ ఎమ్మార్పీ రూ.38 ఉంటే రూ.42, రూ.18 లేస్చిప్స్ రూ.20, రూ.15 గుడ్ డే బిస్కట్ ప్యాకెట్ రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక క్యాంటీన్లలో టీ తాగినా, టిఫిన్ చేసినా జేబులు గుల్ల అవ్వాల్సిందే. రాజమహేంద్రవరం కాంప్లెక్సులోని క్యాంటిన్లో టిఫిన్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. రెండు ఇడ్లీ రూ.30, చపాతి రూ.40, దోసె రూ.35, మైసూర్ బజ్జీ రూ.30 (నాలుగు), పేపర్ కప్పులో టీ రూ.15 లెక్కన విక్రయిస్తున్నారు. కాకినాడ కాంప్లెక్సులోని క్యాంటీన్లో రెండు ఇడ్లీ రూ.25, చపాతి రూ.30, దోసె రూ.30, మైసూర్ బజ్జీ రూ.25, టీ రూ.10 లెక్కన అమ్ముతున్నారు. హోటళ్లు, ఆర్టీసీ డిపో ఎదరుగా ఉన్న హోటళల్లో కన్నా డిపోల్లో 25 నుంచి 35 శాతం అధికంగా ధరలున్నాయి. మౌలిక సౌకర్యాలు మాటుమాయం... ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిర్వహణకు వివిధ పేర్లతో టికెట్లపై అదనంగా వసూలు చేస్తున్నా ఆర్టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, రావులపాలెం, తుని, ప్రత్తిపాడు, గోకవరం, రాజోలు కాంప్లెక్సుల్లో తాగునీటి సదుపాయం లేదు. మంచినీరు కావాలంటే అక్కడ దుకాణాల్లో రూ.20 వెచ్చించి బాటిల్ కొనుగోలు చేయాల్సిందే. అది కూడా స్థానికంగా తయారు చేసే సంస్థ బాటిళ్లు విక్రయిస్తున్నారు. రావులపాలెం, గోకవరంలలో ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు. ప్రత్తిపాడు, రామచంద్రపురాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. రామచంద్రపురం డిపోలో ఫ్యాన్లు తిరగకపోవడంతో పగటి పూటే ప్రయాణికులపై దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. -
ఇవేం బస్టాండ్లు బాబోయ్
ఇదీ జిల్లాలో బస్టాండ్ల పరిస్థితి. పైకి మాత్రం హైటెక్ హంగులంటూ టీవీలు, స్టీలు బెంచీలు వేశారు. కానీ ప్రాంగణాలు మొత్తం కంపుకొడుతున్నాయి. మరుగుదొడ్లు ఉన్నా దారుణం. అంతా వసూళ్లే. ఇక దుకాణాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. సాక్షి, కడప : ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలావరకు బస్టాండ్లకు సోకులు చేసినప్పటికి కొన్ని మౌలిక వసతులను ఇంకా కల్పించలేదు. బస్టాండ్లలోకి వెళ్లే రోడ్లు గుంతలమయంగా మారాయి. ఆవరణలు కంపుకొడుతున్నాయి. ధరల మోత మోగుతోంది. అయినా అధికారులు మాత్రం అంతా బాగుందనే చెబుతున్నారు. ఉదాహరణకు.. కడప నగరంలోని పాత బస్టాండ్ ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఇప్పటికే పెచ్చులు రాలుతున్నా..పైకప్పు అంతా నెర్రెలు చీలి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా....గోడలకు చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునేవారే లేరు. పరిస్థితి చేయదాటకమునుపే అధికారులతోపాటు అందరూ అప్రమత్తం కావాలి. ప్రతినిత్యం వేలాది మంది కడప పాత బస్టాండులో బస్సుల కోసం వేచి ఉండడంతో ఆ ప్రాంతం రద్దీగా ఉంటోంది. అయితే పరిస్థితి చూస్తే భయానకంగా ఉంది. ఇలా జిల్లాలో రాయచోటి, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పోరుమామిళ్ల తదితర బస్టాండ్లలో సమస్యలమయంగా మారడంతో పాటు విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు.. జనం మధ్యలో మూత్ర విసర్జన జిల్లాకేంద్రమైన కడపలో ప్రతినిత్యం వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత బస్టాండు మీదుగానే ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో పాత బస్టాండులో ఎక్కడ చూసినా జనమే జనం. అయితే అనువైన వసతులు సరిగా లేకపోవడంతో బహిరంగంగానే మూత్ర విసర్జన చేస్తుంటారు. జనం చూస్తున్నా....గోడల మీద రాతలు కనిపిస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని కానిస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా...కనీసం జనం సమీపంలోకి వస్తే జరిమాన విధిస్తారన్న భయం కూడా ప్రజల్లో లేదు. దీంతో పాత బస్టాండులో పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడ చూసినా మూత్ర విసర్జన కంపుతో జనం అల్లాడిపోతున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లే దిక్కుకూడా లేదు. అలాగే కొత్త బస్టాండ్‌లోనూ పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి. వర్షం కురిస్తే అంతా జలమయమే. ఆవరణలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. పారిశుద్ద్యం అంతంతమాత్రమే ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పాత బస్టాండులోనూ పారిశుధ్యం అధ్వానంగా కనిపిస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల నీరు రోడ్లమీదనే పారుతుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే, దిగే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండులో టాయ్లెట్ల వద్ద తప్పనిసరిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 తీసుకుంటున్నారు. అయినా పరిశుభ్రంగా ఉంచడ లేదు. దుర్వాసన భరించలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్పీకి ఎసరు జిల్లాలోని బస్టాండ్లలో ఎమ్మార్పీకి ఎసరు పెట్టి తినుబండారాలపై దోపిడీ చేస్తున్నారు. మినరల్ వాటర్ ఒక లీటరు ఎమ్మార్పీ ధర రూ.20 అయితే రూ.25 వరకు రాబడుతున్నారు. ఒక్క వాటరే కాదు, మిగతా వాటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బస్టాండు ప్రాంగణంలోని హోటళ్లలో దోపిడీపర్వం మరింత అధికంగా కొనసాగుతోంది. బస్టాండ్లలో ఉన్న అధికభాగం షాపులలో ఎమ్మార్పీని పక్కనపెట్టి దోచుకుంటున్నా అడిగే అధికారులు లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాలోని బస్టాండ్ల తీరిది.. ♦ మైదుకూరు బస్టాండ్‌లో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. అందులోనూ నీటి సౌకర్యం లేదు. దీంతో ఎప్పుడూ మూత వేసి ఉంటారు. ఇబ్బందిగా మారింది. పైగా చుట్టుపక్కల వారు కూడా బస్టాండు ఆవరణంలోని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన సాగిస్తున్నారు. రోడ్లు బాగా లేకపోవడంతో బస్సులు గుంతలో వెళుతున్నప్పుడు ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ♦ ప్రొద్దుటూరు బస్టాండులో మరుగుదొడ్లు ఉన్నా సరిగా లేవు. దీంతో ప్రయాణికులకు మరుగు కంపుతో అల్లాడుతున్నారు. ♦ రాయచోటి బస్టాండ్‌లో మరుగుదొడ్లు త లుపులకు రంధ్రాలు పడి వాడకానికి ఇబ్బం దిగా ఉంది. చుట్టూ దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలోని దుకా ణాల్లో అధికధరలు వసూలు చేస్తున్నారు. ♦ బద్వేలు బస్టాండ్‌లో తాగునీటి సమస్య వెంటాడుతోంది. పైగా ఎప్పుడు చూసినా పందులు నిత్య సంచారంగా మారింది. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. -
బిల్లులకు నిరీక్షణ
ఊట్కూర్ : మండలంలో మరుగుదొడ్లు నిర్మించుకొని రెండేళ్లైయినా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో నిర్మల్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా ఆర్‌డబ్లూఎస్, ఈజీఎస్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 638 మరుగుదొడ్లు మంజూరు మండలంలో 638 మరుగుదొడ్లు మంజూరు కాగా వాటిలో 508 మరుగుదొడ్లు నిర్మించారు. వివిధ కారణాలతో 130 పెండింగ్‌లో వున్నాయి. ఊట్కూర్‌లో 102, పెద్దపొర్లలో 42, చిన్నపొర్లలో 22, అవుసలోనిపల్లిలో 44, ఎడివెళ్లిలో 20 తదితర గ్రామాలలో లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నిర్మించుకున్న లబ్ధిదారులకు విడతల వారీగా ఉపాధిహామీ పథకం ద్వారా రూ.9 వేలు వారి ఖాతాలో జమచేయాల్సివుంది. 200 మందికి అందని బిల్లులు రెండేళ్లు గడిచినా బిల్లులు రాలేదు. మం డలంలో దాదాపు 200 మంది లబ్ధిదారులకు బిల్లులు రావాల్సివుందని, అధికారులకు అడిగితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి బిల్లులు మంజూరు చేయాలని వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నారు. నిధులొస్తే ఇస్తాం లబ్ధిదారులు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంతమందికి బిల్లులు రావాల్సి ఉందో ఆన్లైన్లో ఖచ్చితంగా చూపడంలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. బిల్లులు ఇప్పటికీ అందలేదు. విడుదలైతే లబ్ధిదారులు ఎందరో తెలుసుకొని వారి ఖాతాల్లో జమ చేస్తాం. – జయమ్మ, ఏపీఓ, ఊట్కూర్ 18నెలలు గడిచింది మరుగుదొడ్డి నిర్మించి 18 నెలల అవుతుంది. బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రాలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా ఉంది. సంబంధత అధికారులూ పట్టించుకోవడంలేదు. మా గ్రామంలో 20మందికి రావాల్సి ఉంది. అధికారులు వెంటనే బిల్లులు మంజూరుచేయాలి. – డీలర్ వెంకటయ్య, పెద్దపొర్ల, , ఊట్కూర్ -
రెంటికీ బయటికే..!
నేలకొండపల్లి : చిన్నోళ్ల బడంటే చిన్నచూపే.. ఒకటి, రెండుకు వెళ్లాలంటే ప్రమాదమైనా రోడ్డు దాటక తప్పడంలేదు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక.. ఉన్నవి శిథిలావస్థకు చేరి గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా యంత్రాంగం వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని.. బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నా.. అంగన్వాడీ కేంద్రాలను మాత్రం ‘చిన్న’చూపు చూస్తున్నాయి. కేంద్రాలకొచ్చే చిన్నారులకు చిన్నతనం నుంచే మరుగుదొడ్లకు వెళ్లే అలవాటు నేర్పితే బాగుంటుందని, ఈ విషయాన్ని అధికారులు గ్రహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీల్లో స్వచ్ఛభారత్ లేదా..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయటం లేదు. పిల్లలకు బాల్యంలో ఏ అలవాటు నేర్పుతారో దానినే జీవితాంతం పాటిస్తారు. ఈ చిన్నపాటి విషయాన్ని కూడా అధికారులు గుర్తించటం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి సారించటం లేదు. జిల్లాలో ఉన్న 1,896 కేంద్రాల్లో చాలా వరకు కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు. దీంతో చిన్నారులు బహిరంగ మల, మూత్ర విసర్జన కోసం రోడ్డు ఎక్కుతున్నారు. పౌష్టికాహారం కోసం వచ్చే బాలింతలు, గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో చెప్పుకోలేని పరిస్థితి. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటి సరఫరాలేక నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 369 కేంద్రాల్లో మాత్రం చిన్నారులు పాఠశాల మరుగుదొడ్లను వినియోగించుకుంటున్నారు. చాలా అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాల్లో చిన్నారులు రహదారులు వెంట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. పిల్లలు రోడ్లపైకి వెళ్తుండడంతో ఎప్పుడు ఏమవుతుందోనని తల్లిదండ్రులు, కార్యకర్తలు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. 922 మరుగుదొడ్లు కావాలని ఐసీడీఎస్ జిల్లా అధికారులు నివేదిక కూడా అందించారు. సౌకర్యాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని పలువురు అంటున్నారు. కలెక్టర్‌కు నివేదించాం మరుగుదొడ్లు లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదించాం.అత్యవసరంగా జిల్లాలో 922 కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పం దించింది. త్వరలోనే చర్యలు తీసుకుంటుంది. – రాయపూడి వరలక్ష్మి, ఐసీడీఎస్, పీడీ మరుగుదొడ్లు నిర్మించాలి అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చి న్నారులు, కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. బాల్యం నుంచే పిల్లలకు మరుగుదొడ్ల వినియోగం గురించి వివరిస్తే జీవితాంతం అలవాటు మరిచిపోరు. – కోటేశ్వరి, చెరువుమాధారం, అంగన్వాడీ టీచర్ కేంద్రాలపై నిర్లక్ష్యం అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేది అంతా నిరుపేదలు, కార్మికుల పిల్లలే. అందుకే ప్రభుత్వానికి నిర్లక్ష్యం. రోడ్ల వెంట మల విసర్జన వదంటారు. మరి చిన్నారులు ఎక్కడికి పోవాలి. వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలి. – కాశిబోయిన అయోధ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు -
మరుగుదొడ్డి కట్టనీయలేదని మామపై కోడలి ఫిర్యాదు
చిత్తూరు, పూతలపట్టు : మరుగుదొడ్డి కట్టనీయకుండా మామ అడ్డుకుంటున్నాడని ఓ కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పేటఅగ్రహారం దళితవాడకు చెందిన ఎర్రయ్య కుమారుడు బాబయ్య 20 ఏళ్ల క్రితం పీలేరుకు చెందిన విజయకుమారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బాబయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి విజయకుమారి తన కుమార్తెతో పాటు పూరిగుడిసెలో ఉంటూ కూలి చేసుకుని జీవనం సాగి స్తోంది. ప్రస్తుతం మరుగుదొడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలైన పింఛను, రేషన్ బియ్యం, ఇతర సౌకర్యాలు అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు నెలలుగా పింఛను కూడా ఇవ్వడం లేదు. తీరా మరుగుదొడ్డి నిర్మించుకోబోతే మామ ఎర్రయ్య అడ్డుపడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది ద్వారా గ్రామంలో విచారించిన ఎస్ఐ మురళీమోహన్ ఎర్రయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అడ్డుపడొద్దని హెచ్చరించి పంపారు. -
మరుగేది..!
టేకులపల్లి : మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో బాలికలకు టాయిలెట్, మరుగుదొడ్లు లేక వారు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయమై సంవత్సర కాలంలో పలుమార్లు సాక్షిలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. సుమారు నాలుగు నెలల క్రితమే బాలికలకు టాయిలెట్, మరుగొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. నిర్మాణం కూడా మొదలు పెట్టారు. నెల రోజుల్లోనే పూర్తి కావాల్సి ఉండగా నాలుగు నెలలు అవుతున్నా నేటికీ పూర్తి చేయకపోవడం గమనార్హం. రెండు నెలలుగా పనులు జరగడం లేదు. బాలికల పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
దేశ రాజధానిలో దారుణం
-
దేశ రాజధానిలో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : గుర్గావ్ బాలుడు ప్రద్యుమన్ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి టాయ్లెట్లో శవమై కనిపించాడు. డయేరియాతోనే విద్యార్థి చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతుండగా.. తోటి విద్యార్థుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తర ఢిల్లీ కారావల్ నగర్‌కు చెందిన తుషార్(16) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన తుషార్ అస్వస్థతకు గురికావటంతో స్కూల్ యాజమాన్యం జీటీబీ ఆస్పత్రిలో చేర్పించింది. ఆపై బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు ఆస్పత్రికి వెళ్లాక బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. అయితే వైద్యులు మాత్రం ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. ముమ్మాటికీ హత్యే... తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని వాదిస్తున్నారు. తోటి విద్యార్థులే అతన్ని కొట్టి చంపేసి.. టాయ్లెట్లో పడేశారని, కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని తమకు తెలియజేశారని వారంటున్నారు. విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు, నిందితులను తప్పించేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక తుషార్ బందువులతోపాటు స్థానికులు కొందరు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ ఒక్కసారిగా స్కూల్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా.. స్థానిక ఎమ్మెల్యే కపిల్ మిశ్రా జోక్యం చేసుకోవటంతో వారు వెనక్కి తగ్గారు. సీసీ ఫుటేజీ ఆధారంగా... తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ లను పరిశీలించారు. అందులో తరగతి గది బయట ముగ్గురు విద్యార్థులు తుషార్‌ను చితకబాదినట్లు ఉంది. ఆపై వారు అతన్ని పరిగెత్తిస్తూ కొడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీడియోలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు సమాచారం. ఒంటిపై గాయాలు లేకపోవటంతో పోస్టు మార్టంలో అసలు నిజాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. సంచలనం సృష్టించిన గుర్గావ్ బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశరాజధానిలో మరో ఘటన చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
మరుగు కరువు!
రాయచోటి: బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేయడానికి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆ సంకల్పం రాయచోటి పట్టణంలో అభాసుపాలవుతోంది. 2005లో పంచాయతీ స్థాయి నుంచి పురపాలక సంఘంగా మార్పు చెందింది. ఈ పట్టణాన్ని 2012లో జాతీయస్థాయిలో మురికివాడలు లేని పురపాలికగా ఎంపిక చేశారు. ఈ విషయం చెప్పుకోవడానికి బాగున్నా పట్టణంలో మల, మూత్ర విసర్జన చేసుకోవడానికి ఒక్క మరుగుదొడ్డి లేదంటే అతిశయోక్తి కాదు. పేరుకు బస్టాండు సమీపంలోని గాలివీడు మార్గంలో ఒక చోట ఉన్నా సిబ్బంది చేతివాటం కారణంగా వాటిని వేరే అవసరాలకు ఉపయోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అక్కడ మరుగుదొడ్లు ఉన్నా అవి ఎవ్వరికి కనిపించ వు కాబట్టి లేనేట్లే . అవసరాల రీత్యా నిత్యం పరిసర మండలాలు, గ్రామా ల నుంచి వేల సంఖ్యలో ప్రజలు రాయచోటి పట్టణానికి వచ్చి వెళుతుంటా రు. పట్టణ జనాభా లక్షకు పైమాటే. రెండు గంటల పాటు గడిపే సినిమా హాళ్లల్లో మరుగుదొడ్లు ఉంటాయి. ప్రతి పనికి, వస్తువుకు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్న మున్సిపాలిటీలో మాత్రం మరుగుదొడ్లను ఏర్పాటు చేయకపోవడం దారుణం. ప్రజలు తమ ఇంట్లో మరుగుదొడ్డి కట్టకపోతే ఇంటి ముందు ధర్నా చేస్తామనే జిల్లా అధికారులకు ఈ వ్యవహారం కనపడలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయలేని ఈ పనిని ఎక్కడబడితే అక్కడ కానిచ్చేస్తున్నా రు. ముఖ్యంగా మహిళ పరిస్థితి వర్ణణా తీతం. వస్తువుల కొనుగోళ్లు, విక్రయాల కోసం వచ్చే మహిళలకు మరుగుదొడ్లు కని పించవు. కొన్ని సమయాల్లో మహిళలు తట్టుకోలేక చిన్నపాటి సందు, గొందులను ఆసరాగా చేసుకుని బహిరంగంగా ఉపయోగించుకుంటూ తమ ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నారు. పురుషులైతే పట్టణ పరిధిలో ఉన్న చిన్నపాటి చాటు కనిపించినా బహిరంగ మూత్ర విసర్జనను చేస్తుంటారు. దీంతో పట్టణంలోని రద్దీ ప్రాంతాలైన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం, జూనియర్ కళాశాల, డైట్ ప్రాంగణం, నేతాజీ సర్కిల్, గున్నికుంట్ల రోడ్డు, రవి థియేటర్, ఠాణా, మార్కెట్, గాంధీ బజారు లాంటి చాలా ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన కారణంగా ఆ ప్రాంతాలన్నీ అత్యంత దుర్గంధ భరితంగా తయారవుతున్నాయి. వీటి వల న అనేక వ్యాధుల వ్యాప్తికి బహిరంగ మూ త్ర విసర్జనే కారణమవుతోంది. ఇలాగే కొనసాగితే రాయచోటి మొత్తం మురికివాడగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా తయారు చేయడానికి అవసరమైన మరుగుదొడ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది. వ్యాధులతో భయమేస్తోంది రద్దీ ప్రదేశంలో సినిమా థియేటర్ ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో మూత్ర విసర్జనకు లోనికి వచ్చేస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవడంతో పాటు అనేక వ్యాధులు సైతం వ్యాపిస్తున్నాయి. వీరిని వారించడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. అయినా మానవతా దృక్పథంతో దీనిని భరించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ప్రజలకు ఉపయోగపడేలా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి బాగుంటుంది. –జి.కలీమ్, సోనిరాజ్ థియేటర్ యజమాని నిర్మాణానికి నిధులున్నా నిర్మించలేకపోతున్నాం పట్టణంలో మరుగుదొడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. మరుగుదొడ్ల నిర్మాణానికి ఏడాది కింద ట నిధులు మంజూరయ్యాయి. ని ర్మించడంలో ఆలస్యం చోటు చేసుకొంటోంది. త్వరలోనే ఠాణా, గాం« దీ బజారులలో నిర్మించే ప్రయత్నాలు చేస్తాం. గాలివీడు మార్గంలో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.–ప్రసాద్‌రాజు, కమిషనర్ -
మధ్యలోనే వెనక్కి వెళ్లిన విమానం
నార్వే : టాయిలెట్లలో సమస్య ఏర్పడి దాదాపు సగం దూరం వెళ్లిన విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి దింపేశారు. ఆ విమాన ప్రయాణీకుల్లో టాయిలెట్స్‌లో సమస్య ఏర్పడితే పరిష్కరించే ప్లంబర్స్ 60మందికి పైగా ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో దాదాపు రెండున్నరగంటలపాటు రివర్స్ జర్నీ చేసి సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చింది. నార్వే ఎయిర్ విమానంలో ఈ సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. నార్వేలోని ఓస్లో నుంచి డీవై 1156 అనే విమానం జర్మనీలోని మ్యూనిచ్కు బయలుదేరింది. అది సరిగ్గా స్వీడన్ బోర్డర్ దాటే సమయంలోనే టాయిలెట్లలో సమస్య ఉన్నట్లు తెలిసింది. అయితే, అదే విమానంలోమ మొత్తం 186మంది ప్రయాణీకులు ఉండగా కనీసం 60 నుంచి 70మంది ప్లంబర్లు ఉన్నారు. వారంతా రార్క్జాప్ అనే కంపెనీలో పనిచేసేందుకు మ్యూనిచ్కు వెళుతున్నారు. పైగా వారందరికీ మంచి సుశిక్షితులుగా గుర్తింపు ఉంది. కానీ, వారిలో ఏ ఒక్కరు కూడా టాయిలెట్లో సమస్యను పరిష్కరించి తమను తాము నిరూపించుకోలేకపోయారు. దీనిపై వర్కర్లను తెప్పించుకున్న కంపెనీ సీఈవో ఫ్రాంక్ ఓల్సెన్ మాట్లాడుతూ సహాయం చేసేందుకు తమవాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటికి విమానం 10వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, ఆ సమస్య వెలుపల నుంచి పరిష్కరించాల్సింది కావడంతో తమ వారెవరూ కూడా ఆ పనిచేయలేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి దాదాపు రెండుగంటలపాటు ప్రయాణించిన విమానాన్ని తిరిగి ఓస్లోకు మళ్లించి సమస్య పరిష్కరించి మరోసారి ప్రయాణం ప్రారంభించారు. -
లక్ష్యం సాధ్యమా!
కడప : వైఎస్సార్‌జిల్లాను 2018 మార్చి నాటికి స్వచ్ఛజిల్లాగా ప్రకటించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు అధికారులు ఆపసోపాలు పడక తప్పడం లేదు. కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి కృషి చేస్తున్నారు. ఈనెలాఖరుకల్లా వైఎస్సార్‌జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా(ఓడీఎఫ్)గా ప్రకటించాలని సీఎం అధికారులను అదేశించారు. కేవలం పదిరోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించగలగాలి. అ దిశగా అధికారులు కృషి చేస్తున్నా కింది స్థాయిలో అది సాధ్యం అవుతుందా అన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం 3వేల మరుగుదొడ్లకు సంబంధించి హార్డ్‌కోర్ కింద ( పలు కారణాల చేత ఆగిపోయినవి, ఉదాహరణకు గట్టి నేల ఉండటం, ఇంటిలో గర్భిణులు,బాలింతలు ఉండటం, ఇంటి పెద్దలు చనిపోవడం వంటి వి) పనులు అగిపోయాయి. అడుగడుగునా అడ్డంకులే జిల్లాలో స్వచ్చ భారత్ మిషన్ పథకాన్ని 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించి 3,04, 992 మరుగుదొడ్లు అవసరమని గుర్తించారు. పథకం ప్రారంభంలో లబ్థిదారులకు బిల్లుల చెల్లింపు సరిగా లేదు. ఫలితంగా మరుగుదొడ్ల నిర్మాణానికి చాలామంది ఆసక్తి చూపలేదు.దీంతో పథకం లక్ష్యం కుంటుపడుతూ వచ్చింది. గ్రామీణ ప్రజలకు మరుగుదొడ్డి నిర్మాణం గురించి సరైన అవగాహన కల్పించక పోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కేటాయించిన టార్గెట్లను పూర్తి చేయలేక అధికారులు ఆపసోసాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ స్వచ్చభారత్ మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ బాబురావునాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేసి లక్ష్యాన్ని కేటాయించారు. దీనిపై నిత్యం పర్యవేక్షించడంతోపాటు నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులతోపాటు 9వ తరగతి చదివే విద్యార్థులను కూడా మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నారు. లక్ష్యం సాధించేందుకు కృషి మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో స్పీడ్‌గా ఉంది.కలెక్టర్ చొవర తీసుకోవడంతోపాటు నిత్యం పర్యవేక్షించడం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. లక్ష్యం సాధించేందుకు కృషి చేస్తున్నాం. – సంజీవరావు, ఆర్‌డబ్లూఎస్, ఎస్ఈ -
మరుగుదొడ్లలో అవినీతి కంపు
జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ పరిధిలోని వెంటకరాజపురం, గవరమ్మపేట, ఎరుకులపేట తదితర గ్రామాల్లోని మరుగుదొడ్ల నిర్మాణాలను చూసి కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విస్తుపోయారు. ఇవెక్కడి నిర్మాణాలంటూ ముక్కున వేలేసుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యేకు మూడు అడుగుల లోతులో నిర్మించిన ట్యాంకులు.. పైపులు, మరుగుదొడ్డి షీట్లు అమర్చని గదులు.. బీటలు వారిన గోడలు.. అస్తవ్యస్తం గా ఉన్న మరుగుదొడ్లే దర్శనమిచ్చాయి. ఆమె లబ్ధిదా రుల గోడును ఆలకించారు. తమ ఇంటివద్ద మరుగుదొడ్డి నిర్మించకుండానే బిల్లు చెల్లించామని అధికారులు చెబుతున్నారని, కొత్తగా నిర్మించుకుందామంటే బిల్లు మంజూ రు కాదని చెబుతున్నారంటూ వెంకట రాజురం వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వాస్తవంగా పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరైంది. మరుగుదొడ్లు నిర్మి స్తామంటూ దాసరి కృష్ణంనాయుడు, చింతాడ శ్రీను ముందుకొచ్చారు. నాణ్యతతో, లబ్ధిదారులు మెచ్చుకునేలా నిర్మిస్తామని అధికారులను ఒప్పిం చారు. కాంట్రాక్టు చేతికి దక్కాక ప్లేటు ఫిరాయించారు. నాసిరకం నిర్మాణాలకు తెరతీశారు. కొందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద నిర్మించకుండానే నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి నిధులు నొక్కేశారు. ఇప్పుడు వారు మరుగుదొ డ్లు నిర్మించుకుందామంటే బిల్లులు చెల్లించబోమని, ఇప్పటికే మీకు మరుగుదొడ్లు మంజూ రయ్యాయంటూ అధికారులు చెబుతుండడంతో గగ్గోలు పెడుతున్నారు. గవరమ్మపేటలో.. గవరమ్మపేటలో వాడుకకు పనికిరాని మరుగుదొడ్లను చూసి ఎమ్మెల్యే ముక్కున వేలేసుకున్నా రు. ఇలాంటి నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవన్నారు. కొన్నిచోట్ల గుంతలకు, రూమ్‌కు సంబంధం లేదని, కొన్నిచోట్ల ట్యాంకులే లేవని, నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేసినట్టు గుర్తించామన్నారు. ఇంత స్థాయిలో అవినీతి జరుగుతున్నా అధికారులు సహకరించడం విచా రకరమన్నారు. ప్రజల సొమ్ము కాజేసే కాంట్రా క్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని మరుగుదొడ్లు నిర్మించారో చెప్పాలని ఏపీవో సురేష్నాయుడును ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకం నుంచి 124 మందికి బిల్లులు చెల్లించామని, అందులో 67 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారని, మిగిలినవి సగంలో ఉన్నాయని తెలిపారు. ఇందులో కాంట్రాక్టర్లే కాకుండా సొంతంగా కట్టుకున్నవారు ఉన్నారన్నారు. బాధ్యత అంతా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నిక ల్ అసిస్టెంట్, ఈసీలదేనని, వారు రికా ర్డు చేస్తే నేను బిల్లు చేయాల్సిందేనని తెలపడం గమనార్హం. ఏది ఏమైనా పూ ర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టిన వారికే బిల్లులు చెల్లిస్తామని, ఒకవేళ చెల్లించి ఉంటే రికవరీ చేస్తామని తెలిపారు. అవినీతి జరిగిందని ఎంపీడీవో ఒప్పుకున్నారు.. మరుగుదొడ్ల పరిశీలనకు వెళ్లేముందు ఎంపీడీవో శ్యాంసుందర్‌తో మాట్లాడినట్టు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తెలిపారు. గవరమ్మపేట పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎంపీడీవో అంగీకరించారన్నారు. పరి శీలన అనంతరం ఎంపీడీవోతో ఎమ్మె ల్యే ఫోన్లో మాట్లాడారు. అవినీతి జరిగిందని, వారి నుంచి రికవరీ చేస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు. మరుగుదొడ్లు మంజూరు చేయాలంటూ మావిడి గంగమ్మ, గుంట్రెడ్డి సత్యంనా యుడు, మర్రాపు లకు‡్ష్మనాయుడు, మూడడ్ల శ్రీరాములనాయుడు, బడే తాతబాబు, బడే రామినాయుడు, కర్రి తులసమ్మ తదితరులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి... మరుగుదొడ్ల పరిశీలనకు ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి దాసరి కృష్ణంనాయుడు అనే కాంట్రాక్టర్ మరుగుదొడ్లకు మరమ్మతులు చేయడం ఆరంభించారు. ఇలా ముందుగానే చేస్తే బాగుండేదని స్థానికులు అనుకోవడం గమనార్హం. ఇలా సగంలో ఉన్నవాటికి కూడా బిల్లులు చెల్లించడం అధి కారుల బాధ్యతా రాహిత్యమని ఎమ్మెల్యే తెలిపారు. -
అంబా... గొయ్యి తీసి వదిలేశారేమయ్యా!
ముంచంగిపుట్టు : మండల కేంద్రంలో స్థానిక దూర్గదేవి ఆలయ సమీపంలో మరుగుదొడ్డి కోసం తీసిన గోతిలో ఓ ఆవు పడిపోయి పైకి రాలేక అరుస్తూ సుమారు మూడు గంటలపాటు నరకయాతన పడింది. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గోతిలో నుంచి ఆవు అరుపులు విని దగ్గరకు వెళ్లి చూశారు. పైకి వచ్చేందుకు ఆవు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. దీంతో స్థానికులు తాళ్లను తీసుకు వచ్చి గంటకుపైగా శ్రమించి అతికష్టం మీద ఆవును బయటకు తీశారు. చిన్నచిన్న గాయలతో ఆవు ఉండడం బయటకు వచ్చిన వెంటనే కన్నీరు కారుస్తుండడం స్థానికులను ఒక్కింత అవేదనకు గురి చేసింది. మరుగుదొడ్ల కోసం తీసే గోతులపై పైకప్పులు ఏర్పాటు చేయాలని, ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే మూగజీవులతో పాటు చిన్నరులు సైతం గోతుల్లో పడి గాయాలు పాలు అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని స్థానికులు అంటున్నారు. -
'టాయిలెట్లో ముద్దు ఎవరు పెట్టారబ్బా..?'
ట్విటర్‌ను ఓ ప్రశ్న వేధిస్తోంది. ఆ ప్రశ్న విన్నాక సిల్లీగా అనిపించినా.. నిజంగానే ఆ పని ఎవరు చేసుంటరబ్బా అని అనుకోవడం మాత్రం పక్క. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటని అనుకుంటున్నారా? టాయిలెట్ బేసిన్ లోపలి అంచుకు ముద్దెవరు ఇచ్చారు? ఇది నిజానిక ప్రశ్న కాదు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత మాత్రం ఇదే ప్రశ్న వస్తుంది. ఆ దృశ్యం ఏమిటంటే ఓ టాయిలెట్‌లోని సిట్టింగ్ బేసిన్ లోపలి అంచుకు పింక్ లిప్‌స్టిక్ మార్క్ కనిపించింది. సాధారణంగా టాయిలెట్ అనగానే గబ్బు అనే ఆలోచన వస్తుంది. ఎవరు ఎంత శుభ్రం చేసినా టాయిలెట్‌ను టాయిలెట్గానే చూస్తాం తప్ప అదేదో విశ్రాంతి మందిరం అని మాత్రం అస్సలు అనుకోము. అందులోని వస్తువులను కూడా దగ్గరగా పట్టుకునే సాహసం చేయము. అలాంటిది ఓ యువతి తన అందమైన పెదాలతో గులాబీ రంగు లిప్‌స్టిక్ పెట్టుకొని టాయిలెట్ బేసిన్ లోపలి అంచుకు ఎలా ముద్దు పెట్టింది. ఇంత సాహసం ఆ యువతి ఎలా చేసింది. అసలు ఆ యువతి ఎవరు? అంటూ ట్విటర్లో నెటిజన్లు తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి ఓ 5వేలమంది రీ ట్వీట్ చేయగా పది వేల షేర్లు వచ్చాయి. Stranger Things - 2018 pic.twitter.com/WfLrTgGthd — ✪ Veer ✪ (@ClawedHumor) 10 January 2018 me after 12 sangrias — Sushri Sahu (@SushriSahu) 10 January 2018 pic.twitter.com/JYqxwcREdZ — Vinay (@vnay85) 10 January 2018 I'll be happy to spend the rest of my existence not knowing how this happened. — Matthew Palumbo, MBA (@MattGPalumbo) 10 January 2018 This is the story. Period. pic.twitter.com/j7MBWHsczE — Feel it Tweet it!❤✋ (@LiZaisatweetie) 10 January 2018 -
టాయ్‘లేట్’
మహబూబ్‌నగర్ న్యూటౌన్: స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యసాధనలో నిధుల కొరత వెంటాడుతోంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న అధికారులను నిధుల విడుదలలో జాప్యం వెనక్ కలాగుతోంది. అధికారుల ప్రోత్సాహం, కళాజాతాల ద్వారా అవగాహన ఇతరత్రా కార్యక్రమాలతో ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొస్తుండగా.. నెల రోజులుగా నిధులు నిలిచిపోవడం వారిలో నిరుత్సాహాన్ని నింపింది. తద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామా, లేదా అని అధికారుల్లో ఆవేదన నెలకొంది. అక్టోబర్ 2 నాటికి ఓడీఎఫ్ జిల్లా జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామాన్ని మాడల్‌గా ఎంపిక చేసి 24 గంటల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి రాష్ట్రంలోనే చరి త్ర సృష్టించారు. అనంతరం మొదటి విడతగా 84 గ్రామాలను ఎంపిక చేయగా, గత ఏడాది అక్టోబర్‌లో 48 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. ఇలా ప్రారంభమైన మరుగుదొడ్ల నిర్మాణ ఉద్యమం జిల్లాలో ఉధృతమైంది. ఈ మేరకు రెండో విడతలో జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించి అధికారులు ముందుకు సాగారు. మొదటి విడతలో పూర్తయిన మరుగుదొడ్ల నిర్మాణాలు పోను ఇంకా జిల్లాలో అవసరమైన 1,67,033 మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి సిద్ధం కాగా.. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడం అధికారులు, లబ్ధిదారుల్లో నిరుత్సాన్ని నింపుతోంది రెండు విడతలుగా నిధుల విడుదల... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్‌లో నిర్మించే మరుగుదొడ్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తారు. ప్రభుత్వం అనుమతించిన మరుగుదొడ్డి నిర్మాణానికి మార్కింగ్, జియో ట్యాగింగ్, అప్లోడ్ పూర్తయ్యాక రూ.6వేల మొదటి విడతగా వస్తాయి. నిర్మాణం పూర్తయ్యాక రెండో ఫొటో అప్లోడ్ చేయగానే మిగతా రూ.6వేలు అం దాలి. కానీ అలా జరగకపోవడంతో లక్ష్యాన్ని చేరతామా, లేదా అనే మీమాంసలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక బయట అప్పు లు ఎలా తీర్చాలా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండో విడత నిధులు వస్తాయి కదా అనే ధీమాతో వారు బయట రింగ్‌లు, తలుపులు, సిమెంట్ తెప్పించారు. కానీ నిధులు రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది పక్కన పెడితే బిల్లులు రావడం తెలి యడంతో కొత్త నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నిధుల విడుదలలో జాప్యం నిజమే... స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లకు బిల్లుల విడుదలలో కాస్త జాప్యం జరుగుతున్న మాట వాస్తమే. వారం క్రితం రూ.1.20కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.70 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఆలస్యమైనా నిధులు విడుదలవుతాయనే నమ్మకం ఉంది. ఈ విషయమై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ పనులు నిలిపివేయకుండా చూస్తున్నాం. ఏది ఏమైనా నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. – ఉదిత్, జిల్లా మేనేజర్, స్వచ్ఛ భారత్ మిషన్ -
పక్క తడుపుతోందని..
హైదరాబాద్ , అడ్డగుట్ట: పక్క తడుపుతుందని ఓ చిన్నారికి కన్నతండ్రే విచక్షణారహితంగా అట్లకాడతో వాతలు పెట్టిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గణేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి....అడ్డగుట ఏ సెక్షన్ ప్రాంతానికి చెందిన రాజు కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె వైష్ణవి(8) స్థానిక ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు నిద్రకు ఉపక్రమించగా కూతురు వైష్ణవి పక్కలో మూత్రం చేసిందని కొట్టాడు. అక్కడితో ఆగకుండా సరాతం(అట్లకర్ర)తో ఒంటిపై వాతలు పెట్టాడు. దీంతో ఆమె కాళ్లు, వీపుపై తీవ్రగా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం ప్రతినిధులు నార్త్‌జోన్ డీసీపీ దృష్టికి తీసుకెళ్లగా, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డీసీపీ తుకారాంగేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి, వాతలు తేలిన దృశ్యం -
మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి ‘కంపు’
సాక్షి, గుంటూరు: మండలంలోని ఊడిజర్లలో సుమారు 450 కుటుంబాలు జీవిస్తున్నాయి. అయతే.. గ్రామంలో 480 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉండటం గమనార్హం. నిర్మాణ బాధ్యతను అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ చేజిక్కించుకుని అధికారులతో కుమ్మక్కయ్యాడు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లకు బిల్లులు మార్చుకోవడం ఒక ఎత్తయితే, అసంపూర్ణంగా ఉన్న మరుగుదొడ్లకూ బిల్లులు చేయడం విశేషం. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా ఉండటం గర్హనీయం. ఇలా గ్రామంలో రూ.30 లక్షల వరకూ అక్రమం జరిగినట్లు తేలింది. మండల కేంద్రంతో పాటు కొండ్రముట్ల, వనికుంట, కొండాయపాలెం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకేఇంటిలో ఏడు నిర్మాణాలకు బిల్లులు.. గ్రామస్తుడు యాతకుంట పుల్లారెడ్డి పేరుపై ఒక మరుగుదొడ్డి నిర్మించగా ఆయన భార్య అరుణ పేరుపై కూడా మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. యాతకుంట వెంకటేశ్వరరెడ్డి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించనప్పటికీ రెండు పేర్లతో బిల్లులు మార్చారని తెలుస్తోంది. గ్రామానికి చెందిన శాగంరెడ్డి సైదమ్మ, వెంకాయ్మ, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డితో పాటు అదేఇంట్లో మరోఇద్దరి పేర్లతో ఐదు మరుగుదొడ్లు నిర్మించినట్లుగా చూపి బిల్లులు పొందినట్లు రికార్డుల్లో నమోదైంది. గ్రామానికి చెందిన పాలూరి శ్రీనివాసరెడ్డి, రమణమ్మ, పాలమ్మ పేరుతో ఒకే ఇంటికి మూడు బిల్లులు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. యర్రంశెట్టి శేషమ్మ, పుల్లయ్య, వెంకటరామయ్య, తిరుమలయ్యతో పాటు మరో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఒక్క మరుగుదొడ్డి నిర్మించి ఏడు మరుగుదొడ్లకు బిల్లులు పొందినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే పంచాయతీ పరిధిలో సుమారు 200 మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మార్చుకున్నట్లు తేలింది. లబ్ధిదారులకు తెలియకుండా బిల్లులు.. కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై లబ్ధిదారులకు కూడా తెలియకుండా వారి పేరుతో బిల్లులు తయారు చేసుకుని నేరుగా కాంట్రాక్టరు ఖాతాకే నగదు జమ చేయించుకున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై పూర్తి విచారణ చేపడితే భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఒకే ఇంటికి 42 టాయిలెట్లు!
పట్నా: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పేరుతో ఓ ప్రబుద్ధుడు 42 సార్లు దరఖాస్తు చేసి ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు కుచ్చుటోపి పెట్టిన ఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైశాలీ జిల్లాలోని విష్ణుపూర్ రామ్ గ్రామానికి చెందిన యోగేశ్వర్ చౌధరీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం 42 సార్లు దరఖాస్తు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రతిసారీ కొత్త గుర్తింపు పత్రాలు దాఖలుచేయడం ద్వారా దాదాపు రూ.3,49,600 తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే విశ్వేశ్వర్ రామ్ అనే వ్యక్తి మరుగుదొడ్డి కోసం 10 సార్లు దరఖాస్తు చేసి రూ.91,200 నొక్కేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలు 2015 ప్రథమార్ధంలో జరిగినట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయడంపై విచారణ చేయాల్సిందిగా సామాజిక కార్యకర్త రోహిత్ కుమార్ శనివారం వైశాలీ జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరారు. ఉన్నతస్థాయి విచారణ అనంతరమే ఈ ఘటనపై స్పందిస్తామని జిల్లా ఉప అభివృద్ధి అధికారి సర్వణయాన్ యాదవ్ తెలిపారు. బిహార్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12,000 ఇస్తోంది. -
టాయిలెట్ పేరుతో మహా మోసం
సాక్షి, పట్నా : ఒక టాయిలెట్ నిర్మాణం నిధుల కోసం ప్రజలు చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులున్నాయి. అటువంటిది ఏకంగా 42 సార్లు టాయిలెట్ల నిర్మాణం పేరుతో నిధులు స్వాహా చేశాడో ప్రబుధ్దుడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. స్వచ్ఛభారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని.. బీహార్‌లోని హాజీపూర్ బ్లాక్ విష్ణుపురానికి చెందిన యోగేశ్వర్ చౌదరీ అనే వ్యక్తి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. కేవలం మరుగుదొడ్డి నిర్మాణం పేరుతో.. 2015 నుంచి 42 సార్లు నిధులు తెచ్చుకున్నాడు. అధికారిక అంచనాల మేరకు యోగేశ్వర్ చౌదరి.. 3,49,600 రూపాయలను ప్రభుత్వం నుంచి లబ్దిపొందాడు. ఇందుకోసం అతను ప్రతిసారి కొత్త గుర్తింపు కార్డులను, చిరునామా పత్రాలను, బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆశ్చర్యపోయే విషయమేమిటంటే.. ఆతను టాయిలెట్ల నిధులతో తన పాత ఇంటిని పూర్తిగా ఆధునీకరించుకున్నాడు. ఈ వ్యవహారం కాస్తా.. యోగేశ్వర్ అంటే గిట్టని కొందరు సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించేందుకు యోగశ్వర్ నిరాకరించారు. ఇదిలావుండగా.. ఈ ఘటనపై వైశాలి డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ స్పందిస్తూ.. ఇది పాత వ్యవహరమని కొట్టి పారేశారు. ఇదిలావుండగా.. యోగేశ్వర్‌ను ఆదర్శంగా తీసుకున్న విశ్వేశ్వర్ రామ్ మరో వ్యక్తి టాయిలెట్ నిర్మాణం పేరుతోనే.. 10 సార్లు అక్రమాలకు పాల్పడ్డాడు. ఇలా విశ్వేశ్వర్ రామ్.. 91 వేల రూపాయల నిధులను స్వాహా చేశారు. -
చెంబుతో కొట్టింది
షాజాహాన్ తాజ్‌మహల్ కడితేఈ అభినవ షాజాహాన్ భార్య కోసంటాయ్లెట్ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు.నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్ చేస్తారుఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోనికేశవ్ చివరకు టాయ్‌లెట్ కట్టేస్తాడు.ఓ రాత్రి తన మనుషులతో దాన్నికూలగొట్టిస్తాడు తండ్రి. యూజువల్లీ తప్పు చేస్తే చెప్పుతో కొడ్తారు. కాని ఇంట్లో టాయ్‌లెట్ ఏర్పాటు చేయకపోతే చెంబుతో కొడ్తుంది ఈ మహిళ ఈ సినిమాలో. పదిమందికీ కనపడేలా భార్యనో, ఇష్టసఖినో ముద్దుపెట్టుకుంటే తప్పు మన దేశంలో. అదే భార్యను లేదా ఇష్టసఖిని పదిమంది తిరుగుతున్న చోటకు చెంబుతో పంపిస్తే తప్పు లేదు! ఇది మన న్యాయం! ఎంత అన్యాయం ఇది? అని నిలదీస్తుంది టాయ్‌లెట్. మహిళను పూజించే సంస్కారం మనదని చెప్తూనే ఆమె ఆత్మాభిమానాన్ని పోస్ట్‌మార్టమ్ చేస్తున్నాం ఇంట్లో టాయ్లెట్లు కట్టకుండా! ఆమె మొహం మీద నుంచి కొంగు తొలిగితే కొంపలేంటుకుపోవు.. కాని బహిర్భూమి కోసం ఆమె బయటకు వెళితేనే కాపురం కూలిపోతుంది అని చూపిస్తుందీ ఈ సినిమా! అవును.. ఇంట్లో టాయ్‌లెట్ కట్టించకపోతే మొగుడిని సైతం వదులుకోవడానికి సిద్ధపడుతుంది జయ (భూమి పడ్నేకర్). ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రియాంక అనే అమ్మాయి అత్తింట్లో టాయ్‌లెట్ లేదని తెలిసి పీటల మీద పెళ్లిని వద్దనుకుంటుంది. తర్వాత ఆ అత్తామామా టాయ్‌లెట్ కట్టిస్తామని ప్రమాణం చేస్తే.. మూడు ముళ్లు వేయించుకుంది. ఈ నిజ జీవిత కథనే రీల్‌గా చుట్టుకుని వచ్చింది టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ. ఆ సినిమా కథ క్లుప్తంగా... ఎడ్డెం అంటే తెడ్డెం కేశవ్ (అక్షయ్ కుమార్)... ఇంటర్ ఫెయిల్డ్.. పెళ్లికాని ప్రసాద్ కేటగరీ 36 ఏళ్ల క్యాండిడేట్. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వరుడు. ఎంతటి సనాతనం అంటే అశుద్ధం ఇంట్లో జరక్కూడదని(ఉండకూడదని) టాయ్‌లెట్ కట్టించడు వాళ్ల నాన్న (సుధీర్ పాండే). సనాతనం పేరుతో అలాంటి చాలా అంధవిశ్వాసాలను పాటిస్తుంటాడు ఆయన. అందుకే 36 ఏళ్లు వచ్చినా కేశవ్ పెళ్లికాకుండా ఉంటాడు. ఆ సమయంలోనే కనిపిస్తుంది జయ. చదువుకున్నది, లోకజ్ఞానం తెలిసింది. ఈ ఇద్దరిదీ ఎడ్డెం అంటే తెడ్డం అనే వ్యవహారం. పట్టణంలో పుట్టి పెరిగిన పిల్ల. ఇంట్లో కాస్త ఆధునిక వాతావరణం.. అటాచ్డ్ బాత్ వగైరాతో సహా! ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికీ దారితీస్తుంది. లోటా పార్టీ శోభనం తెల్లవారు ఝామున ఊసులాడుకుంటున్న ఈ జంటను కొందరు ఆడవాళ్లు కిటికీలోంచి చూసి డిస్టర్బ్ చేస్తారు. ఆ అంతరాయం సహజంగానే జయకు చిరాకు తెప్పించి వాళ్లను అడుగుతుంది ‘‘ఏంటీ’’ అని. అప్పుడు వాళ్ల చేతుల్లో ఉన్న లోటాలను చూపించి ‘‘రావా.. తెల్లవారితే వెళ్లలేవు.. రా త్వరగా వెయిట్ చేస్తాం’’ అంటారు. అర్థంకాని జయ అయోమయంగా భర్త వంక చూస్తుంది. నీళ్లు నమిలి చెప్తాడు.. ‘‘వాళ్లు పొలాల్లోకి టాయ్‌లెట్‌కి వెళ్తున్నారు. నువ్వూ వెళ్లు త్వరగా’’ అని. ‘‘ పొలాల్లోకి వెళ్లడం ఏంటీ? ఇంట్లో టాయ్‌లెట్ లేదా?’’ అని అడుగుతుంది అంతే అమాయకంగా. తల అడ్డంగా ఊపుతాడు. కోపాన్ని దిగమింగి లోటాతో ఆ పార్టీలో జాయిన్ అవుతుంది జయ. అక్కడి నుంచి ఆమెకు, ఆమెతో కేశవ్కూ కష్టాలు మొదలవుతాయి టాయ్‌లెట్ కోసం! తండ్రి.. తాను.. భార్య జయ కోసం లోటా పార్టీ వస్తుందంటే చాలు కేశవ్‌లో వణుకు మొదలయ్యేది. చేత్తో లాంతరు, ఇంకో చేత్తో లోటాతో ఆ పార్టీతో కలవడం... అసలు బహిర్భూమికి ఊరు అవతలున్న చేను, చెలకలను ఎంచుకోవడం జయకు అసహ్యంగా అనిపించేది. దాంతో కేశవే భార్యను బయటకు తీసుకెళ్లడం మొదలుపెడ్తాడు.అలా ఒకసారి గుబురు పొద మాటున జయ ఉండగా.. బండీ మీద హెడ్‌లైట్‌తో ఆమె మామగారు వస్తుంటారు... ఆయన కంట కోడలు పడ్తుంది... ఆ కంగారులో బండీ బ్యాలెన్స్ తప్పి ఆయనా పడిపోతాడు. ఆ సమయంలో మామగారు తనను చూడ్డంతో సిగ్గు, అవమానంతో దహించుకుపోతుంటుంది జయ. అత్తలేని సంసారం కావడంతో వంటిల్లు జయదే. లోటా అవమానాన్ని కోపంగా వంటింటి పాత్రల మీద తీరుస్తుంటుంది. నిస్సహాయ స్థితిలో కేశవ్ ఉంటాడు. అప్పుడే మామగారూ వస్తారు బయట నుంచి. తనను చూసి కోడలు తల మీదకు పైట లాక్కోలేదని, లాక్కోమని కొడుకుకు సైగలతో చెప్తుంటాడు. కేశవ్ భార్యను హెచ్చరిస్తాడు. పొద్దున పూట జరిగిన విషయాన్ని ఎత్తిపొడుస్తుంది జయ ‘అప్పుడు పోని మర్యాద ఇప్పుడు తల మీద పైట లాక్కోకపోవడం వల్ల పోతుందా?’’ అని. అది కోడలి పొగరుగా వినిపిస్తుంది, కనిపిస్తుంది మామగారికి. కొడుకుకు చెప్తాడు భార్యను హద్దుల్లో పెట్టుకోమని. భార్యా చెప్తుంది ఇంట్లో టాయ్‌లెట్ కట్టించమని. ట్రైన్లో.. భార్య ఎలాంటి అభాసుపాలవకుండా.. హాయిగా పనికానిచ్చుకునే మార్గాన్ని అన్వేషించడంలోనే కేశవ్ జీవితం తెల్లారుతుంటుంది. అలాంటి ప్లాన్స్లోనిదే ట్రైన్. ఒక ట్రైన్ తెల్లవారు జామునే వాళ్ల ఊళ్లో ఏడు నిమిషాలు ఆగుతుంది. ఆ ట్రైన్ టాయ్లెట్లోకి వెళ్లొచ్చని భార్యకు సలహా ఇవ్వడమే కాక రోజూ తీసుకెళ్తుంటాడు. అలా ఒకరోజు టాయ్లెట్లో ఉన్నప్పుడునే ఆ బాత్రూమ్ బయట కొంతమంది ప్యాసెంజర్స్ తమ సామానంతా నింపేసి నిలబడ్తారు కంపార్ట్మెంట్లో జాగ దొరక్క. ఈలోపు ట్రైన్ కదుల్తుంది. ఆమె లోపలి నుంచి ఎంత ప్రయత్నించినా తలుపు రాదు. అరుస్తుంది. అయినా ఇవతల వాళ్లకు వినిపించదు. ట్రైన్ ప్లాట్‌ఫామ్ వీడి పోతుంటే అప్పుడు బాత్రూమ్ డోర్ దగ్గర ఉన్న వాళ్లకు తెలుస్తుంది లోపల ఎవరో ఉన్నట్లు. గబగబ సామానంత తీసి తలుపు తెరుచుకునే వెసులుబాటు చేస్తారు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటుంది. బాత్రూమ్లోంచి కంపార్ట్మెంట్ ఎగ్జిట్ దగ్గరకు వస్తుంది జయ.. ఎర్రబడ్డ మొహంతో. ప్లాట్‌ఫామ్ మీద నుంచి అరుస్తుంటాడు కేశవ్.. చైన్ లాగమని. కాని జయ లాగదు. ఆ రైలు ఆగి తాను దిగితే తన అత్తింట్లో టాయ్‌లెట్ రాదని ఆమెకు తెలుసు. అందుకే లాగదు.. భర్త మాటలను వింటూ అలాగే ఆ రైల్లో సాగిపోతుంది తన ఊరికి. అభినవ షాజాహాన్.. ఇంట్లో టాయ్‌లెట్ కట్టించేంత వరకు రానని భీష్మించుకుంటుంది జయ. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా తనేం చేయనని స్పష్టం చేస్తాడు కేశవ్. అయితే అత్తింటికి వచ్చే సమస్యే లేదని అంతకన్నా స్పష్టంగా చెప్తుంది ఆమె. పంతానికి సరే అన్నా చింత పడుతుంటాడు కేశవ్ పండిత్. టాయ్‌లెట్ సమస్య తీర్చి భార్యను రప్పించడం కోసం ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి టైమ్‌లోనే ఆ ఊళ్లో షూటింగ్ అవుతుంటుంది. అక్కడ రెడీమేడ్ టాయ్‌లెట్స్‌ను చూస్తాడు. మనసు పారేసుకుంటాడు. ఓ రాత్రి వాటిల్లో ఒకదాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో పెడ్తాడు. సినిమావాళ్లకు తెలిసి పోలీస్ కంప్లయింట్ ఇస్తారు. ఈ విషయం తెలియని కేశవ్ భార్యకు ఫోన్ చేసి టాయ్‌లెట్ వచ్చేసింది ఇంటికి రమ్మంటాడు. ఆమె ఆ ఏర్పాట్లలో ఉన్నప్పుడే కేశవ్‌ను పోలీసులు లాకప్‌లో వేస్తారు. ఈ సంగతి తెలిసిన జయ భర్తను అసహ్యించుకుంటుంది. టాయ్‌లెట్ కట్టించకపోతే విడాకులు ఇస్తాను అని అల్టిమేటం జారీ చేస్తుంది. తన చేతకాని తనానికి కేశవ్ సిగ్గుపడ్తాడు. లాభంలేదు.. సీరియస్‌గానే తీసుకోవాలి అని అనుకొని తండ్రి కట్టుబాటును ధిక్కరిస్తూ ఇంట్లో టాయ్‌లెట్ ఉండాలనే అభిప్రాయాన్ని చెప్తాడు. తండ్రి కోపగించుకుంటాడు. అయినా కొడుకు లెక్క చేయడు. ఊళ్లో వాళ్లంతా కూడా కేశవ్‌ను గేలి చేస్తుంటారు.. పెళ్లామ్కు బానిస అని. షాజాహాన్ తాజ్‌మహల్ కడితే ఈ అభినవ షాజాహాన్ భార్య కోసం టాయ్‌లెట్ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు. నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్ చేస్తారు ఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోని కేశవ్ చివరకు టాయ్‌లెట్ కట్టేస్తాడు. ఓ రాత్రి తన మనుషులతో దాన్ని కూలగొట్టిస్తాడు తండ్రి. డైవోర్స్.. ఇది తెలిసిన జయ విడాకులు ఖాయం చేస్తుంది. అది దేశమంతా వార్త అవుతుంది. టాయ్‌లెట్ కోసం ఓ భార్య విడాకులిస్తోందని టీవీలు, పేపర్లు ఊదరగొడ్తాయి. అత్తగారి ఊరు ఆడవాళ్లు జయను కలుస్తారు. ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతమా అంటారు. ‘‘కాదు సిగ్గుచేటు. మీరూ నాతో కలిస్తే ఇంటింటికీ టాయ్‌లెట్ వస్తుంది లేకపోతే నా ఇంట్లోనే వస్తుంది. అదీ లేకపోతే టాయ్‌లెట్ ఉన్న మా అమ్మవాళ్లిల్లే నా సొంతిల్లు అవుతుంది’’ అని అంటుంది. భార్య అంటే ఆలోచన ఉన్నవాడు ఇంట్లో టాయ్‌లెట్ కడ్తాడు అని నినదిస్తుంది జయ. సోచ్ హోతో శోచాలయ్ హోగా అని. అది ఊరంతా వ్యాపిస్తుంది ఓ ఉద్యమంలా. చివరకు టాయ్‌లెట్ సాధిస్తుంది. ఆ ప్రేమ కథ సుఖాంతమవుతుంది. టాయ్‌లెట్.. నాలుగు అడుగుల విస్తీర్ణంతో నాలుగు గోడల గది మాత్రమే కాదు. స్త్రీ మానాభిమానాలు, ఆమె ఆరోగ్యం, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడే ఓ చూరు అని చాటుతుంది ఈ సినిమా! అంతేకాదు స్వచ్ఛ్భారత్కి అసలైన నిర్వచనం.. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండడమే అనీ చెప్తుంది! మూఢనమ్మకాలను మరుగుదొడ్లలో వేసి ఒంటిని, ఇంటిని శుభ్రపరిచే తీరును చూపిస్తుంది. కేశవ్‌గా అక్షయ్‌కుమార్, జయగా భూమి పడ్నేకర్లు జీవించారు. మిగిలిన వాళ్లూ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. రిషికేష్ ముఖర్జీ కిసీసే నా కహెనా తరహాలో ఈ సినిమాను ఫ్రేమ్ చేయాలనుకున్న నారాయణ్ సింగ్ ప్రయత్నమూ కనిపిస్తుంది. ఈ సినిమాకు సహ నిర్మాతలు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండేలు. ఒక కమర్షియల్ హీరో ఇలాంటి సామాజిక అంశాలను తెరకెక్కించడంలో చూపించిన చొరవ ప్రశంసనీయం. -
నిబంధనలపై పెట్రోల్
సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చమురు సంస్థల నిబంధనలను పాతరేస్తున్నాయి. బంకుల్లో సౌకర్యాల కల్పనలో విఫలమవుతున్నాయి. వాహనదారులకు ఇంధనం తప్ప ఇతర సేవలు అందని ద్రాక్షగానే మారాయి. బంకులకు వచ్చిన వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయడమే కాదు.. వాటికి ఉచితంగా గాలి, వాహనదారులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కచ్చితంగా కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ వసతి కల్పించాలి. కానీ.. ఇవేవీ పెట్రోల్ బంకుల్లో కనిపించడంలేదు. వీటి పట్టింపేలేదు.. పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ, అగ్ని ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవడానికి అనువుగా ఉండాలి. బకెట్లలో ఇసుక. సమీపంలో నీరు అందుబాటులో ఉండాలి. మరోవైపు ప్రథమ చికిత్స పెట్టెలు అత్యవసరం. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయాల్లో వాటిని ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ యాజమాన్యం వద్ద తప్పకుండా ఉండాలి. బంకుల వద్ద విద్యుత్ తీగలు, హైటెన్షన్ తీగలు లేకుండా చూసుకోవాలి. పొగ తాగరాదు అనే బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఇవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు. కనిపించని నాణ్యత పరిశీలన.. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరిశీలన కనిపించడం లేదు. ఇంధన నాణ్యతను పరీక్షించేందుకు హైడ్రో ధర్మా మీటర్లు అందుబాటులో లేకుండాపోయాయి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల డీజిల్ నిల్వ నిరంతరం ఉండాలి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసులకు, వికలాంగులకు ఇంధనం లేదనకుండా పోయాలి. హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, ఐదు లీటర్ల క్యాన్ అందుబాటులో ఉండాలి. వినియోగదారులు అడిగిన సమయంలో వెంటనే వీటిని అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌లో హైడ్రోమీటర్ పెట్టినప్పుడు సాంద్రత 700–760 మధ్యలో , డీజిల్ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్‌లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కానీ దానిని పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు. వినియోగదారులుఇలా తెలుసుకోవచ్చు.. ఇంధనం నాణ్యతను పరీక్షించే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అందుకు సంబంధించిన కిట్లను వారు కోరినప్పుడు బంక్ సిబ్బంది అందించాలి. కిట్లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి వెనుకాడినా మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఫిల్టర్ పేపర్‌పై ఒక్క చుక్క ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది. ఆరిన తర్వాత పేపర్ప మరక కనిపించకూడదు. మరక కనిపిస్తే కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు. నగరంలో 49 లక్షల వాహనాలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 49 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు కలిపి సుమారు 20 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 460 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. -
మరుగున అవినీతి
జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆశయం అధికార పార్టీ నేతలు, అవినీతి అధికారుల జేబులు నింపుతోంది. జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన మరుగుదొడ్ల నిర్మాణం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. మండల స్థాయిలోని పలువురు అధికారులు లక్షల్లో సొమ్ములు వెనకేసుకుంటున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్లు లెక్కలు చూపుతూ బిల్లులు డ్రా చేసుకునే వారు కొందరైతే, ఒకే బ్యాంకు ఖాతాను నలుగురైదుగురు లబ్ధిదారులదిగా చూపి లక్షల్లో మింగేసిన అధికారులూ ఉన్నారు. జరిగిన మోసాలు ఇప్పటికే కొన్ని మండలాల్లో వెలుగులోకి రాగా, మరికొన్ని మండలాల్లో విచారణ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న పదేపదే మండల అధికారులకు చెబుతున్నారు. అంతేకాకుండా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి అధికారులను పరుగులు తీయిస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఎంపీడీఓ, ఆర్‌డబ్లు్యఎస్ ఏఈ, ఫీల్డ్ అసిస్టెంట్లదే ప్రధాన పాత్ర. నిర్మాణ పనులు, నిధుల డ్రా విషయాల్లో వీరే కీలకంగా వ్యవహరించాలి. ఇదే అదునుగా తీసుకున్న కొంతమంది అధికారులు స్థానికంగా ఉండే అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై దొంగ లెక్కలు చూపుతున్నారు. ఉదాహరణకు పుంగనూరు నియోజకవర్గం కల్లూరు, చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. రూ.5 కోట్లకు పైగా నిధులు జేబుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పంచాయతీ అధికారి ప్రభాకర్ ద్వారా విచారణ చేయించిన కలెక్టర్ ప్రద్యుమ్న ఒకరిద్దరు అధికారులు, ఎంపీడీఓలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా అధికారులు అవినీతికి పాల్ప డవద్దని చెప్పిన కలెక్టర్ ప్రద్యుమ్న అనుమానమున్న పలు మండలాల్లో జరిగే మరుగుదొడ్ల నిర్మాణ పనులపై ఆరా తీస్తున్నారు. సత్యవేడు, పీలేరు, మదనపల్లి, నగరి, కుప్పం నియోజకవర్గాల్లోనూ కొన్ని మండలాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా సుమారు పాతిక కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు సమాచారం. టీడీపీ జిల్లా నాయకులు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిన విషయం నిజమేనన్నారు. జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. భగ్గుమంటున్న విపక్షాలు.. జిల్లాలో చోటుచేసుకున్న మరుగుదొడ్ల అవినీతిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అవినీతికి పాల్పడిన అధికార పార్టీ నేతలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని, పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాకు పిలుపునిచ్చింది. చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు నేతృత్వంలో ధర్నాకు ఏర్పాట్లు జరిగాయి. జిల్లా పార్టీ ప్రముఖులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్శదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కె. నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజా, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, చంద్రమౌళి, ఆదిమూలం, బియ్యపు మ«ధుసూదన్రెడ్డిలతో పాటు పార్టీ అనుబంధ సంఘ నేతలు, మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఇదిలా ఉండగా ఇదే సమస్యను లేవనెత్తుతూ చిత్తూరు బీజేపీ నేత సీకే బాబు మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టాయిలెట్ కట్టాలంటే కోరిక తీర్చమన్నాడు..
రాయ్‌గఢ్: మరుగుదొడ్డి నిర్మించడానికి అనుమతి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని ఓ మహిళ(32)ను ప్రభుత్వాధికారి వేధించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. రాయ్‌గఢ్‌లోని తెందూదిపాలో ‘క్లీన్ ఇండియా’ పథకం కింద బాధితురాలి ఇంట్లో నిర్మిస్తున్న మరుగుదొడ్డి అక్రమమనీ, దాన్ని వెంటనే నిలిపివేయాలని రాయ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో నోటీసులిచ్చింది. దీంతో బాధితురాలు అన్ని ఆధారాలను సబ్ ఇంజినీర్ ఐపీ సారథికి సమర్పించారు. మరుసటి రోజు బాధితురాలికి ఫోన్‌చేసిన సారథి.. మరుగుదొడ్డి నిర్మాణానికి అనుమతి కావాలంటే తన కోరిక తీర్చాలన్నాడు. ఒప్పుకోకుంటే అక్రమ నిర్మాణం పేరుతో ఇంటినీ కూల్చేస్తానన్నాడు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సారథిపై కేసు నమోదుచేశారు. -
ఛీ.. ఛీఛీ!
కొన్నాళ్ల క్రితం అధికారులంతా వేకువనే రోడ్డెక్కేవారు. ఎవరైనా చెంబుతో కనిపిస్తే చాలు చెలరేగిపోయేవారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన చేసేవారిపై కన్నెర్ర చేసేవారు. మరోసారి కనిపించారో ఖబడ్దార్.. అని హెచ్చరించేవారు. మరుగుదొడ్లు నిర్మించుకోండని ఉపదేశించేవారు. స్వచ్ఛభారత్‌పై అలవోకగా ప్రసంగించేవారు. ఇప్పుడు ఫైళ్లన్నీ పక్కన పడేసి.. పనులన్నీ మానేసి ఊరూవాడా తిరుగుతున్నారు. మరుగుదొడ్ల లక్ష్యం పూర్తికి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఊరందరికీ మరుగుదొడ్ల ఉపయోగాలు వివరించే అధికారుల కార్యాలయాల్లో దృశ్యం దారుణంగా ఉంటుంది. ఎక్కడో తప్ప.. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో సైతం మరుగుదొడ్లు లేవు. మిగిలిన సిబ్బంది సంగతి సరేసరి. ఏ చెట్టోపుట్టో చూసుకోవలసిందే. మహిళా ఉద్యోగుల పరిస్థితి పరమ దారుణం. అర్జీదారుల అవస్థలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్డి సదుపాయం లేని అధికారుల కార్యాలయాలపై కథనాలివి. బయటికెళ్లాల్సిందే చీపురుపల్లి: చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు మాత్రమే మరుగుదొడ్డి ఉంది. మిగిలిన అధికారులు ఆరుబయటికి పోవలసిందే. చీపురుపల్లి గృహనిర్మాణ శాఖ కార్యాలయంలోను అదే పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి రక్షిత మంచినీటి సరఫరా విభాగం డీఈ కార్యాలయానికి మరుగుదొడ్లు లేకపోతే వెనుకనున్న పురాతన మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి అరకొరగా వినియోగిస్తున్నారు. చీపురుపల్లి మండల విద్యాశాఖ కార్యాలయంలో మరుగుదొడ్లు లేవు. ఉన్నవి పని చేయడం లేదు. గుర్ల మండల పరిషత్, గృహ నిర్మాణం, పీహెచ్సీ, విద్యాశాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. గరివిడి వ్యవసాయశాఖ, మెరకముడిదాం తహసీల్దార్ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. అత్యవసరమైతే నరకమే పార్వతీపురం/సీతానగరం/బలిజిపేట: జిల్లా వ్యాప్తంగా ఓడీఎఫ్ మరుగుదొడ్లను నిర్మించాలని అన్ని శాఖాధికారులు ప్రజలపై ఒత్తిడి తెచ్చి మరుగుదొడ్లను కట్టిస్తున్నారు. ఫిబ్రవరి 15 నాటికి ఓడీఎఫ్ జిల్లాగా విజయనగరాన్ని చేయాలని కలెక్టర్ లక్ష్యం చేసుకున్నారు. కానీ వారు విధులు నిర్వర్తించే ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లను నిర్మించడం లేదు. పార్వతీపురం ఐటీడీఏ, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం అర్జీదారులు సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు.మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక నరక యాతన పడుతున్నారు. ♦ సీతానగరం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మరుగుదొడ్డి లేకపోవడంతో అక్కడికి వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ♦ తహసీల్దార్ కార్యాలయంలో తడకలతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్డే ఉద్యోగులకు శరణ్యం. ♦ అర్జీదారులు మాత్రం ఆరుబయటికి వెళ్లాల్సిందే. ♦ బలిజిపేట వ్యవసాయ శాఖ కార్యాలయంలో పూర్తిగా మరుగుదొడ్లు లేవు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. బలిజిపేట ఎమ్మార్సీ భవనంలో రెండు మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి నిరంతర నీటి సదుపాయం లేక నిరుపయోగమయ్యాయి. ♦ ఇక్కడ కూడా ఉద్యోగులు ఆరుబయటికెళ్లాల్సిందే. మహిళ ఉద్యోగులు, అర్జీదారుల పరిస్థితి దారుణం. ♦ చాలా మంది ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి కార్యాలయానికి వెళ్తున్న సందర్భాలున్నాయి. అధికారుల అగచాట్లు శృంగవరపుకోట/జామి: ఎస్.కోట గ్రామీణ నీటిసరఫరా శాఖ, ఉపఖజానాధికారి, ధర్మవరం పంచాయతీ కార్యాలయాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు. జామి వ్యవసాయశాఖ, పశు వైద్య కేంద్రం, ఆర్డబ్ల్యూఎస్, 15 పంచాయతీ కార్యాలయాలకు మరుగుదొడ్లు లేవు. అత్యవసరమైతే ఎంతటి అధికారి అయినా బయటికి పోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పాపం.. ఉద్యోగినులు సాలూరు: సాలూరు నియోజకవర్గం మక్కువ మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో మరుగుదొడ్లను నిర్మించలేదు. అత్యధిక సంఖ్యలో మహిళలు విధులు నిర్వర్తించే కార్యాలయం ఇదే అయినా మరుగుదొడ్లను నిర్మించక అవస్థలు పడుతున్నారు. మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో పరిస్థితి మరోలా ఉంది. శిథిలమై కూలిపోయే స్థితికి చేరుకున్నా విధిలేక దాన్నే వినియోగిస్తున్నారు. ♦ మెంటాడ ఎమ్మార్సీ భవనంలో మరుగుదొడ్లకు నిరంతర నీటి సదుపాయం లేకపోవడంతో వినియోగించలేకపోతున్నారు. గృహనిర్మాణ, వ్యవసాయశాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరగలేదు. ♦ పాచిపెంట ఎంపీడీఓ కార్యాలయంలో మరుగుదొడ్ల పైపులు విరగడంతో వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఎంఈఓ కార్యాలయంలో కూడా వినియోగించేందుకు వీల్లేక తాళాలు వేసేశారు. తహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల పరిస్థితి కూడా దాదాపు అదే. తలుపు విరిగిపోవడంతో ఆఖరికి కర్టెన్ కట్టుకున్నారు. ♦ సాలూరు మండలం స్త్రీశక్తి భవనంలో ఒక్క మరుగుదొడ్డి మాత్రమే ఉండటంతో అత్యవసర వేళ మహిళలు అవస్థలు పడుతున్నారు. గృహనిర్మాణశాఖ కార్యాలయంలో మరుగుదొడ్డిని నిర్మించినా నీటి సదుపాయం లేక వినియోగించుకోలేకపోతున్నారు. వినియోగించకముందే శిథిలం కురుపాం/గుమ్మలక్ష్మీపురం/కొమరాడ/జియ్యమ్మవలస/గరుగుబిల్లి: కురుపాం గ్రామీణ తాగునీటి విభాగం (ఆర్డబ్ల్యూఎస్ ) కార్యాలయంలో మరుగుదొడ్లు లేవు. జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ, ఎంపీడీఓ కార్యాలయాల్లో మరుగుదొడ్లు వినియోగించకముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్, వ్యవసాయ శాఖ, పశు సంవర్థక శాఖ, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. కేవలం ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీడీఓ, ఎంపీపీ చాంబర్లలో మరుగుదొడ్డి సదుపాయం ఉంది. దీంతో ఈ కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బంది తప్పడం లేదు. కొమరాడ మండల పరిషత్ కార్యాలయంల్లో మరుగుదొడ్లు నిర్మించినా వినియోగించడం లేదు. తహసీల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. పనికిరాని మరుగుదొడ్లు జియ్యమ్మవలస తహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్లున్నా వినియోగానికి పనికిరావు. ఉన్న రెండు మరుగుదొడ్లలో ఒకటి శిథిలావస్ధకు చేరుకోగా రెండోది నీటి సదుపాయం లేక మూలకు చేరింది. ఎంపీడీఓ కార్యాలయంలో ఇటీవల నిర్మించిన మరుగుదొడ్డి కూడా పనిచేయక అధికారులకు అవస్థలు తప్పడం లేదు నీటి సదుపాయం లేదు గరుగుబిల్లి తహసీల్దార్, ఎంపీడీఓ, గృహ, ఎంఆర్సీ, వ్యవసాయం, విద్యుత్ సబ్స్టేషన్లు తదితర కార్యాలయాల్లో ఎక్కడా మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మండల పరిషత్‌లో గతంలో మరుగుదొడ్లు నిర్మించినా నీటి సదుపాయం లేకపోవడంతో నిరుపయోగమై మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సిబ్బంది, సందర్శకులకు అవస్థలు తప్పడం లేదు. నీళ్లు లేక నిరుపయోగం నెల్లిమర్ల: నెల్లిమర్ల ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలకు గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలం కావడం, నీటిసరఫరా లేకపోవడంతో నిరుపయోగమయ్యాయి. తహసీల్దార్, విద్య, వ్యవసాయం, నీటిపారుదల, కార్యాలయాలకు అసలు మరుగుదొడ్లే నిర్మించలేదు. దీంతో ఈ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు, సందర్శకులూ నానాపాట్లు పడుతున్నారు. డెంకాడ గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి కూడా మరుగుదొడ్లు నిర్మించనే లేదు. మిగిలిన కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికి మరుగుదొడ్లున్నా సందర్శకులకు అందుబాటులో లేవు. భోగాపురం మండల గృహ నిర్మాణ శాఖ, గూడెపువలస పంచాయతీ కార్యాలయాలకు మరుగుదొడ్లను నిర్మించలేదు. దీంతో ఈ రెండు కార్యాలయాల సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు. -
రైలు ప్రయాణికులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైళ్లు అపరిశుభ్రంగా ఉండడానికి ప్రధాన కారణం.. టాయిలెట్లే. సరిగ్గా పనిచేయని టాయిలెట్లు, మురికి వాతావరణంతో రైలు మొత్తం చెత్తగా మారిపోతోంది. రైళ్లలో టాయిలెట్లను క్లీన్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటోందని సిబ్బంది కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రైళ్లలోని టాయిలెట్లను పూర్తిగా ఆధునీకరించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రైళ్లలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విమానాళ్లో ఉపయోగించే బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను రైళ్లలోనూ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది. తొలివిడతలో భాగంగా శతాబ్ది, రాజధాని రైళ్లలో వీటిని బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రకించారు. -
టాయిలెట్ ఏదైనా..కంపు కామనే!
రైళ్లలోని టాయిలెట్లు.. వాటి పేరెత్తితే చాలు.. మొహం చిట్లించే వారెందరో.. తలుపు తీస్తే.. కంపు తప్ప ఇంకేమీ ఉండదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇక ట్రాకుల మీద పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు.. వీటన్నిటికీ చెక్ పెట్టేలా.. స్వచ్ఛ భారత్ ప్రాజెక్టులో భాగంగా తెచ్చినదే.. బయో టాయిలెట్లు.. ఇందుకోసం నాలుగేళ్లలో సుమారు రూ.1,305 కోట్లను భారత రైల్వే ఖర్చు చేసింది. అయితే.. సెప్టిక్ ట్యాంక్‌లతో పోలిస్తే.. ఇవి ఏమాత్రం మెరుగైనవి కావని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ తేల్చి చెప్పింది. రెండేళ్ల పాటు రైలు బోగీల్లోని బయో టాయిలెట్లపై అధ్యయనం చేసి మరీ.. ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఐఐటీ మద్రాస్ నిర్వహించిన ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ఇటీవలే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేశారు. బయో టాయిలెట్స్ అంటే.. ప్రధానమైన ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో సుమారు 93,537 బయో–డైజెస్టర్స్(బయో టాయిలెట్స్)ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. బయో టాయిలెట్లలో టాయిలెట్ సీటు కింది భాగంలో చిన్న స్థాయి మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఉంటుంది. ట్యాంకు ఆకారంలో ఉండే ఈ బయో డైజెస్టర్లలో మనుషుల మల వ్యర్థాలను తినే బ్యాక్టీరియాను ఉంచుతారు. మలవ్యర్థాలను ఈ బ్యాక్టీరియా స్వీకరించడమే కాకుండా నీరు వాసన రాకుండా శుభ్రం చేస్తుంది. ఈ నీటిని బయటకు వదిలేసినా(అంటే రైలు వెళ్తున్నప్పుడు పట్టాలపై) ఏ విధమైన సమస్యలు రావు. వాస్తవంలో ఈ ప్రక్రియ సక్సెస్ కావట్లేదని శానిటేషన్ నిఫుణులతో పాటు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కమిటీలు కూడా చెపుతున్నాయి. శుద్ధి కాకుండానే బయటకు.. బయో టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని, అందువల్ల బయటకు వదులుతున్న వ్యర్థాలు శుభ్రం కాకుండా ఉండిపోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బయో డైజెస్టర్ల నుంచి తాము సేకరించిన మల వ్యర్థాలు ఎటువంటి శుద్ధికీ నోచుకోలేదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ లిజీ ఫిలిప్ స్పష్టం చేశారు. సెప్టిక్ ట్యాంకుల్లో మాదిరిగానే మల వ్యర్థాలు నీటిలో కలసిపోయి బయటకు విడుదల అవుతున్నాయని చెప్పారు. బయో టాయిలెట్ల వినియోగంపై విమర్శలు వస్తున్నప్పటికీ 2018 డిసెంబర్ నాటికి 1,20,000 బోగీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), భారత రైల్వే శాఖ సిద్ధమవుతున్నాయి. దీనికి రూ.1,200 కోట్లు వ్యయం కానున్నట్టు ఇటీవల సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ చెప్పింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
చెప్పుకోలేని బాధ
ప్రైవేటు కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో టాయిలెట్ల సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎవరూ సీరియస్‌గా పరిగణించకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. తరగతుల విరామ సమయంలో చాంతాడంత క్యూలో ఇబ్బందులు పడలేక నీరు తాగడం తగ్గించుకుని అనారోగ్యానికి గురవుతున్నారు. సాక్షి, రాజమండ్రి: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జూనియర్ కళాశాలల్లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు అక్కడి వాతావరణం నివ్వెరపోయేలా చేస్తోంది. ఇరుకైన గదులు, కనిపించని పరిశుభ్రత, ప్రతి నిమిషం చదువుకే అంకితం కావాల్సిన పరిస్థితిలో విద్యార్థులు యాంత్రికంగా తయారవుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. రోజులో కాసేపైనా ఆటవిడుపునకు నోచుకోక పోవడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. చాలా కళాశాలలు, హాస్టళ్లల్లో టాయ్లెట్లు సరిపడా లేక విద్యార్థినులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలకు అనుమతి ఇవ్వాలంటే విశాలమైన తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్టాఫ్‌రూమ్, ప్రిన్సిపాల్ రూమ్, ఆఫీసురూమ్, ఆటస్థలం, టాయ్‌లెట్స్ తప్పనిసరి. ప్రైవేటు కళాశాలలు మాత్రం ఈ నిబంధనలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. గాలి, వెలుతురు లేని ఇరుకుగదులు, నాలుగు ట్యూబ్‌లు, ఐదు ఖాళీ బాటిళ్లతో మమ అన్పించే ల్యాబ్‌లతో నెట్టుకొస్తున్నారు. ఎంత మంది విద్యార్థులున్నా రెండే బాత్రూమ్లు. ఇక ఆట స్థలం అంటారా.. ఆ ఊసే లేదు. హాస్టల్ విద్యార్థుల పరిస్థితి ఘోరం.. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఒక్కో గదికి పది నుంచి 20 మందిని కేటాయిస్తున్నారు. గదిలో నడవడానికి సైతం దారి ఉండదు. ఒక్కోసారి మంచాలపైకి ఎక్కి నడవాల్సి ఉంటుంది. ఉదయం పూట బాత్రూమ్ కోసం బకెట్ పట్టుకుని క్యూలో నిల్చోవాలి. ఎవరికైనా అత్యవసరమైతే రిక్వెస్ట్ చేసుకుని ముందు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో విద్యార్థుల మధ్య గొడవలవుతున్నట్టు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు ఫీజుల రూపంలో దండుకుంటున్న యాజమాన్యాలు.. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బాత్రూమ్లు నిర్మించాలన్న ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నాయని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అవన్నీ చిన్న విషయాలు.. చదువు ముఖ్యం.. అలా కాదంటే టీసీ ఇచ్చేస్తాం వేరే చోట చదివించుకోండంటూ ఎదురుదాడికి దిగుతున్న సందర్భాలున్నాయి. ఇటువంటి పరిస్థితి చక్కదిద్దాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మంచినీరు తాగడం తగ్గిస్తున్నారు కొంతమంది విద్యార్థులు చెబుతున్న దాని ప్రకారం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాల వద్ద క్యూ కట్టే పరిస్థితి నెలకొంటుంది. అక్కడి పరిస్థితికి జడిసి పలువురు విద్యార్థులు మంచినీరు తాగడం బాగా తగ్గించేస్తున్నట్టు సమాచారం. మరికొందరు మూత్రం ఆపుకుంటూ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయాన్ని చెబుతున్నా యాజమాన్యాలను అడిగే సాహసం చేయలేక పోతున్నారు. ప్రశ్నిస్తే యాజమాన్యం తమ పిల్లలను వేధిస్తుందన్న కారణంతో ఏ ఒక్కరూ సమస్య తెలిసినా మిన్నకుండిపోతున్నారు. అందరికీ అవస్థలే.. జిల్లాలో 43 ప్రభుత్వ, 18 ఎయిడెడ్, ఒకేషనల్ 1, సాంఘిక సంక్షేమం 12, ట్రైబల్ వెల్ఫేర్ ఆరు, రెసిడెన్షియల్, మోడల్ రెండు వంతున, 219 ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం 50,332, ద్వితీయ సంవత్సరం 45,944 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. తనిఖీలు ముమ్మరం చేస్తాం ప్రైవేటు కళాశాలల్లో కొన్నిసమస్యలు మా దృష్టికి వచ్చాయి. వరుసగా కళాశాలలను తనిఖీ చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం. - ఎం.వెంకటేష్, ఆర్ఐవో, రాజమహేంద్రవరం -
హిజ్రాలకు ప్రత్యేక మరుగుదొడ్లు
తిరువళ్లూరు: తిరువళ్లూరు బస్టాండ్‌లో హిజ్రాల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. వీటిని బీసీ సంక్షేమ శాఖ అధికారి మీనా గురువారం ప్రారంభించారు. తిరువళ్లూరు బస్టాండులో స్త్రీలు, పురుషులకు, దివ్యాంగులకు మరుగుదొడ్లు నిర్మించారు. స్త్రీల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను హిజ్రాలు ఉపయోగించే వారు. అయితే ఇటీవల హిజ్రాలను అనుమతించకపోవడంతో వారు మున్సిపల్ కమిషనర్ సెంథిల్కుమారన్ను కలిసి ప్రత్యేక మరుగుదొడ్డి నిర్మించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కమిషనర్ హిజ్రాల కోసం ప్రత్యేక మరుగుదొడ్డిని నిర్మించారు. దీనిని బీసీ సంక్షేమ శాఖ అధికారి మీనా గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడులో హిజ్రాల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను గతంలో సేలం జిల్లాలో ప్రారంభించారని, ప్రస్తుతం తిరువళ్లూరులో ప్రారంభించడం రెండో ప్రాంతమని వివరించారు. -
ఆగిన టాయిలెట్ నిర్మాణం.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, బెంగళూరు : మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రభుత్వాధికారులు నిలిపివేయడంతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి దిగింది. ఈ ఘటన కర్నాటకలో సంచలనం సృష్టిస్తోంది. కర్నాటకలోని దావణగెరె జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో.. ఒక కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకుంటోంది. ఇందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిధులు కూడా విడుదలయ్యాయి. మొదట్లో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన గ్రామ పంచాయితీ తరువాత.. సరైన పత్రాలు లేవని నిర్మాణాన్ని నిలిపివేసింది. టాయిలెట్ నిర్మాణాన్ని గ్రామపంచాయితీ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అనూహ్య ఘటనతో గ్రామపంచాయితీ అధికారులు అక్కడనుంచి పరారయ్యారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై దావణగెరె జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే.. నిర్మాణంలో ఉన్న టాయిలెట్‌ని ఆపడమేంటని జిల్లా అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు కారణమైన 14 మంది గ్రామ పంచాయితీ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థినితో టాయిలెట్ కడిగించిన టీచర్.. వైరల్
సాక్షి, తిరువల్లూర్(తమిళనాడు): విద్యార్థినితో టాయిలెట్ కడిగించిన టీచర్ ఉదంతం తమిళనాట కలకలం రేపింది. తిరువళ్లూర్‌లోని ఆర్ఎం జైన్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆరు నుంచి పదో తరగతి వరకు దాదాపు వెయ్యిమంది బాలికలు చదువుకుంటున్న ఈ పాఠశాలకు చెందిన విద్యార్థినిని టాయిలెట్ కడగాలంటూ టీచర్ అదేశించింది. ఆపై విద్యార్థిని టాయిలెట్ కడుగుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఇందులో ఓ విద్యార్థిని చేతితో బట్ట ముక్కను పట్టుకుని తుడుస్తున్నట్లు, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు ఉంది. పక్కనే ఉన్న మరో బాలికతో నీరు తీసుకురావాలని అడగ్గా ఆమె తీసుకువచ్చిన నీటితో టాయిలెట్ కడుగుతున్నట్లుగా ఉంది. దీనిపై సదరు టీచరు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు విచారణ చేపట్టి, సదరు బాలికలతో మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని కూడా ప్రశ్నించారు. ఆ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని డీఈవో తెలిపారు. -
చైనాలో టాయిలెట్ల విప్లవం
బీజింగ్ : పర్యాటక వసతులను మెరుగుపర్చడానికి చైనా టాయిలెట్ల విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తోంది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా అన్ని టాయిలెట్లను ఆధునీకరించాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వసతుల అభివృద్ధిలో కొత్త టాయిలెట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. ప్రపంచ పర్యాటక సంస్థ గణాంకాల ప్రకారం అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన నాలుగు దేశాల్లో చైనాకు చోటు దక్కింది. ఈ దేశంలో గత ఏడాది 5.93 కోట్ల మంది పర్యటించారు. వివిధ పర్యాటక ప్రదేశాల్లో ఈ అక్టోబరు నాటికి చైనా 68 వేల టాయిలెట్లను నిర్మించింది. 2020 వరకు మరో 64 వేల టాయిలెట్లను ఆధునీకరించాలని సంకల్పించారు. టాయిలెట్ విప్లవం పర్యాటక ప్రాంతాల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తోందని చైనా మీడియా పేర్కొంది. మరుగుదొడ్లతోపాటు రోడ్ల వంటి ఇతర సదుపాయాలనూ విస్తరిస్తున్నారు. -
చరిత్ర అడుగు.. చెప్పింది చెయ్
స్టూడెంట్స్‌ను సైన్స్ మ్యూజియంకు తీసుకువెళతారు. లేదా కళాత్మక అంశాలు ఉన్న మ్యూజియంకు తీసుకువెళతారు.మరి టాయిలెట్ మ్యూజియంకు తీసుకువెళతారా?‘తీసుకు వెళ్లాలి’ అంటున్నారు ఢిల్లీలో టాయిలెట్ మ్యూజియంను నిర్వహిస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్లు. అలా తీసుకువెళితేనే వాళ్లకు టాయిలెట్ల ఉపయోగం, నిర్మాణం పట్ల అవగాహన కలుగుతాయని అంటున్నారు.కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అంశాన్ని ఒక విధానంగా స్వీకరించడానికి చాలా ఏళ్ల ముందే సులభ్ సంస్థ వ్యవస్థాపకుడైన డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ దేశవ్యాప్తంగా ప్రజా మరుగుదొడ్ల వ్యవస్థాపన ఉద్యమాన్ని స్వీకరించాడు. మన దేశంలోని నగరాల్లో, పట్టణాల్లో బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జనకు పబ్లిక్ టాయిలెట్లు ఏ మాత్రం లేకపోవడం వల్ల కలిగే తీవ్ర అసౌకర్యం ఒక సమస్యైతే వాటి లేమి వల్ల సాగే బహిరంగ విసర్జన వల్ల వ్యాపించే అపరిశుభ్ర పరిస్థితులు మరో సమస్య. వీటి కంటే ఎక్కువగా చేతులతో వ్యర్థాల్ని ఎత్తిపోసే ‘డ్రై లెట్రిన్ల’ వాడకం వల్ల కొన్ని నిమ్న జాతులు ఆ అమానవీయమైన వృత్తికి అంకితమై ఇతరులచే ఏహ్యభావనతో చూడబడే పరిస్థితిలో ఉండటం ఇంకా పెద్ద సమస్య. ఈ సమస్యలన్నింటి సమాధానం సక్రమమైన టాయిలెట్ల వ్యవస్థాపన అని సులభ్ సంస్థ భావించింది. అందుకు తగినట్టుగా చేసిన కృషికి తగిన ఫలితాలు కూడా ఈ దేశం చూసింది. అంతకుమించి సులభ్ సంస్థ స్థాపించిన ‘టాయిలెట్ మ్యూజియం’ ఈ దేశ యువతరానికి టాయిలెట్ల చరిత్రనే కాదు వాటి ఆధునిక వ్యవస్థాప నకు సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగిస్తోంది. ఆధునిక టాయిలెట్లు టాయిలెట్ మ్యూజియంలో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడ తక్కువ ఖర్చుతో మరింత ఉపయోగకరంగా టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నదో ఆ మోడల్స్ అన్నీ ఉన్నాయి. మానవ విసర్జకాలను కంపోజ్ చేసి ఎరువుగా మార్చే టాయిలెట్ల నిర్మాణాన్ని ఇక్కడ నిర్వాహకులు ఒక కార్యక్రమంగా వివిధ రంగాల విద్యార్థులకు తెలియపరుస్తున్నారు. ఫలితంగా వారి ద్వారా టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రచారం చేస్తున్నారు. టాయిలెట్ మ్యూజియంలో ఉన్న ఆధునిక టాయిలెట్లలో చైనా ‘టాయ్ కమోడ్’, అమెరికా ఎలక్ట్రిక్ టాయిలెట్, జపాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ టాయిలెట్ ఉన్నాయి. వీటిని చూడటానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ మ్యూజియం ప్రతిరోజూ తెరిచే ఉంటారు. ఈసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ముక్కు మూసుకోకుండానే హాయిగా దర్శించండి. మ్యూజియం స్థాపించి.. భారతీయ సంస్కృతిలో విసర్జన అవసరాల గురించి మాట్లాడటం నిషిద్ధం. అందువల్ల మనదేశంలో పూర్వికుల టాయిలెట్ అలవాట్లు దాదాపుగా నమోదు కాకుండా పోయాయి. హరప్పా నాగరికతలోనే మనవాళ్లు చాలా శాస్త్రీయత కలిగిన మరుగుదొడ్లు నిర్మించుకున్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ నాగరికత అంతరించి మన దేశంలో టాయిలెట్ల నిర్మాణం లేకుండా పోయి బహిరంగ విసర్జన అలవాటైంది. అయినప్పటికీ రాజుల, మహరాజుల కాలంలో టాయిలెట్ల వాడకం గురించి అప్పటి నిర్మాణాల గురించి ఉన్న కొద్దో గొప్పో ఆచూకీ తీసి ఒకచోట చేర్చే గొప్ప ప్రయత్నం ‘టాయిలెట్ మ్యూజియం’ స్థాపన ద్వారా సులభ్ సంస్థ చేసింది. ఢిల్లీ శివార్లలో ఉన్న ఈ మ్యూజియంలో ‘ప్రాచీన’, ‘మధ్యయుగ’, ‘ఆధునిక’ అనే మూడు విభాగాలలో నాటి టాయిలెట్ల ఆనవాళ్లు, రిప్లికాలు చూడవచ్చు. కింగ్ లూయిస్ 14 వాడిన సింహాసనం వంటి టాయిలెట్ ఈ మ్యూజియంలో ఉంది. దాదాపు యాభై దేశాల టాయిలెట్ల నిర్మాణాల ఫొటోలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. విసర్జకాలను ఏ విధంగా నిర్వహించవచ్చో కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు. -
‘మరుగు’లో మెరుగయ్యేదెన్నడు?
రాయ్‌చూర్‌కు చెందిన 25 ఏళ్ల మహేశ్వరి అన్న ఈ మాటలు దేశంలో సామాన్యుల ‘టాయిలెట్’కష్టాలకు అద్దం పడుతున్నాయి! స్వచ్ఛభారత్ అభియాన్ పేరిట కేంద్రం కోట్లు వెచ్చించి మరుగుదొడ్లను నిర్మిస్తున్నా పరిస్థితి తీసికట్టుగానే ఉంది. ఐదు.. పది కోట్లు కాదు.. మన దేశంలో ఏకంగా 73.22 కోట్ల మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంటే 130 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో సగానికిపైగా (56 శాతం) ప్రజలు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉన్నట్టు వాటర్ ఎయిడ్ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ నెల 19న ‘వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ‘ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్–2017’ పేరిట మూడో వార్షిక నివేదికను వెలువరించింది. ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 34.35 కోట్ల మంది(జనాభాలో 25%)కి టాయిలెట్ సౌకర్యం లేదని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా(12.28 కోట్లు– దేశ జనాభాలో 67%), ఇథియోఫియా(9.24 కోట్లు– జనాభాలో 93%), బంగ్లాదేశ్(8.55 కోట్లు– జనాభాలో 85.5%) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది. అలాగే మరుగుదొడ్లు లేక ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది మహిళలు, అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చదువుకు సైతం దూరమవుతున్నారని, అనారోగ్య సమస్యలు, వేధింపులు, దాడుల బారిన పడుతున్నారని పేర్కొంది. మా ఇంట్లో టాయిలెట్ లేదు. గర్భిణిగా ఉన్న సమయంలో మరుగుదొడ్డికి వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఆరుబయటకు వెళ్లాల్సిందే. ఆ దారేమో అంత సురక్షితం కాదు. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా సాయం కావాలి కదా.. అందుకే వెంట మా అత్తమ్మను తోడుగా తీసుకెళ్లేదాన్ని.. మార్పు వస్తోంది.. కానీ.. దేశంలో పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా దేశంలో 39 శాతంగా ఉన్న ‘పారిశుధ్య కవరేజీ’ని 65 శాతానికి చేర్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ భారతంలో గత మూడేళ్లలో 5.2 కోట్ల మరుగు దొడ్లను నిర్మించినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినట్టు వాటర్ ఎయిడ్ సంస్థ కూడా ధ్రువీకరించింది. పారిశుధ్యంపై ప్రచారంతో బహిరంగ మల విసర్జన 40 శాతం మేర తగ్గిందని, కొత్తగా 10 కోట్ల మందికిపైగా టాయిలెట్లు వినియోగిస్తున్నారని వివరించింది. కనీస పారిశుధ్య సౌకర్యానికి నోచుకోని ప్రజలు 2000లో 78.3 శాతం ఉంటే 2015 కల్లా 56 శాతానికి తగ్గారని తెలిపింది. అలాగే బహిరంగ మల విసర్జనను నిర్మూలించి, పారిశుధ్య సౌకర్యాలు పెంచేందుకు కృషి చేస్తున్న ప్రపంచంలోని తొలి పది దేశాల్లో భారత్ ఆరో స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015–16 వివరాల ప్రకారం... తెలంగాణలో మొత్తం 50.2 శాతం (పట్టణ ప్రాంతాల్లో 64.4%, గ్రామీణ ప్రాంతాల్లో 38.9%) కుటుంబాలకు మెరుగైన పారిశుధ్య వసతి ఉంది. ఏపీలో 53.6% కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 77.4 %, గ్రామీణ ప్రాంతాల్లో 43.1 % ) మెరుగైన పారిశుధ్య వసతి ఉంది నివేదికలో మరిన్ని అంశాలు - భారత్‌లో టాయిలెట్ సౌకర్యానికి నోచుకోలేని 35.50 కోట్ల మంది మహిళలు, ఆడపిల్లలను వరుసగా నిలబెడితే.. ఆ వరుస భూమిని నాలుగు సార్లు చుట్టి వచ్చేంతగా ఉంటుంది! - అపరిశుభ్రత వల్ల డయేరియా ప్రబలి దేశంలో ఏటా 60,700 మంది చిన్నారులు మరణిస్తున్నారు. వీరిలో తొలి ఐదేళ్లలో చనిపోతున్నవారే ఎక్కువ. - 2015 నాటికి ప్రతిరోజు 321 మంది పిల్లలు డయేరియాతో మృతి చెందుతున్నారు - బహిరంగ మల విసర్జన కారణంగా కొంకిపురుగుల ఇన్ఫెక్షన్తో డయేరియా వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల మహిళలు రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు - ఐదేళ్ల వయసు చిన్నారుల్లో 38% మంది ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. (2015–16 జాతీయ కుటుంబ, ఆరోగ్య లెక్కలు) - నెలసరి సమస్య వల్ల భారత్‌లో 23 శాతం మంది అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లకుండా డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. స్కూళ్లలో తమకు ఎలాంటి పారిశుధ్య వసతులు ఉండటం లేదని వారిలో 28% మంది తెలిపారు. (ఇండియాస్పెండ్ నివేదిక) - అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలి ప్రపంచంలో ఏటా 2,89,000 మంది ఐదేళ్ల లోపు పిల్లలు చనిపోతున్నారు. రోజుకు 800 మంది, ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున మరణిస్తున్నారు. - మంచినీరు, టాయ్లెట్ల కోసం ఖర్చు చేసే ప్రతి డాలర్‌కు సగటున 4 డాలర్ల చొప్పున ఉత్పాదకతను పెంచవచ్చు – సాక్షి నాలెడ్జ్ సెంటర్, తెలంగాణ డెస్క్ -
బయటకే వెళ్తాం!
నిజామాబాద్ జిల్లా నుంచి పాత బాలప్రసాద్: వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగానికి వృద్ధులు నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. మరుగుదొడ్లలో మలవిసర్జన చేయడం వాళ్లకు ముందు నుంచీ’ అలవాటు లేకపోవడంతో వీటిని వినియోగిం చడం లేదని వృద్ధులు చెబుతున్నారు. వంద శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబులిటీ, ట్రాన్స్పరెన్సీ (ఎస్‌ఎస్‌ఏఏపీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సామాజిక తనిఖీ జరుగుతోంది. ప్రత్యేక ఆడిట్ బృందాలు గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకున్నారా? కుటుంబసభ్యులందరూ వాడుతున్నారా? వంటి వివరాలు సేకరిస్తున్న సమయంలో వృద్ధులు వీటి వినియోగానికి ఆసక్తి చూపడం లేదన్న విషయం బయటపడింది. ఇప్పటికే వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ సామాజిక తనిఖీ పూర్తయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్, మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద.. బహిరంగ మల విసర్జనతో అంటు వ్యాధులు ప్రబలి.. ప్రజలు అనారోగ్యం పాలవుతుండడంతో ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉపాధిహామీ పథకం కింద కూడా లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్పటికీ చాలా కుటుంబాలు వాటిని వినియోగించడం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. కుటుంబంలో ఒకరిద్దరు బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు వీరి పరిశీలనలో తేలింది. రాష్ట్రంలో మరుగుదొడ్ల వినియోగంపై 2012లో ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 43.91 లక్షల కుటుంబాల్లో 11.49 లక్షల కుటుంబాలకే వ్యక్తి గత మరుగుదొడ్లు ఉన్న ట్లు తేలింది. మిగిలిన 32.42 లక్షల కుటుంబా లు కూడా మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభు త్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఇప్ప టివరకు 16.42 లక్షల టాయిలెట్స్ నిర్మించారు. ఇదీ మరుగుదొడ్ల లెక్క.. మరుగుదొడ్లు ఉన్న కుటుంబాలు : 11.49 లక్షలు (2012 సర్వే) ఐదేళ్లలో నిర్మించిన మరుగుదొడ్లు : 16.42 లక్షలు ఓడీఎఫ్ జిల్లాలు : నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, రాజన్న సిరిసిల్ల ఆరు జిల్లాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగినట్లు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రకటించింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, సిరిసిల్లలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) జిల్లాలుగా పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించు కునేలా లబ్ధిదారులను ప్రోత్సహించారు. నిర్మించు కోని వారికి పింఛన్లు, రేషన్ సరుకులు నిలిపివేస్తామనీ ప్రకటించారు. దీంతో అన్ని కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నాయి. -
మరుగుదొడ్లు కట్టుకోండి.. బిల్లులు నేనిస్తా..
శాయంపేట(భూపాలపల్లి): ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోండి..నెల రోజుల్లో మీ బిల్లులు ప్రభుత్వం ఇవ్వకపోతే నా సొంత డబ్బులు ఇస్తా...పాత బిల్లులకు లింకులు పెట్టకుండా మరుగు దొడ్లు వంద శాతం నిర్మించుకుని వాడితేనే చెల్తిసా..ఒకవేళ డబ్బులివ్వకపోతేనా ఆఫీసు ముందు కూర్చోండి..ఇవ్వకపోతే అక్కడి నుంచి వెళ్లకండి.. అది కూడా నెల రోజుల్లో పూర్తి చేయాలి. అంతేకాదు అనుకున్న సమయానికి పూర్తి చేస్తే నా నిధుల నుంచి రూ.5 లక్షలు అభివృద్ధికి కేటాయిస్తానని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. మండలంలోని గోవిందాపూర్, గట్లకానిపర్తి గ్రామాల్లో మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ముందుగా గట్లకానిపర్తిలో మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం, పారిశుద్ధ్యంపై ప్రజలతోపాటు అధికారులు, కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్వచ్ఛభారత్‌పై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్డి అనేది ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తి అన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడే వంద శాతం ఓడీఎఫ్ సాధించగలుగుతున్నామన్నారు. ఏ గ్రామంలోనైతే ప్రజాప్రతినిధుల సహకారం అందదో అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యంకాదని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నాటికి వంద శాతం ఓడీఓఫ్ గ్రామాలుగా చేయాలని కోరారు. ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. డిసెంబర్‌లోగా మండలాన్ని ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. జిల్లాలోనే శాయంపేట మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటికల కోసం రూ.10 నుంచి 12 లక్షల ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. దాతలు గ్రామాల్లో ముందుకు వచ్చి 20 నుంచి 30 గుంటల స్థలాన్ని దానం చేస్తే ప్రభుత్వం శ్మశానవాటికను నిర్మిస్తుందని వివరించారు. క్రమబద్ధీకరణకు మరో అవకాశం.. సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకోని రైతులకు ప్రభుత్వం మరోసారి భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో చేపట్టిన భూప్రక్షాళనలో రైతులు మళ్లీ సాదాబైనామాకు ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.4వేల పెట్టుబడి ఖర్చులను అందుకునే విధంగా చూడాలన్నారు. క్లియర్‌గా ఉన్న భూములకే ప్రభుత్వ పెట్టుబడి వస్తుందని స్పష్టం చేశారు. కాగా గోవిందాపూర్ వీఆర్వో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మొక్కలను కాపాడుకోవాలి.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మనమే కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రీన్‌డేను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ హరిప్రసాద్, ఎంపీపీ రమాదేవి, సర్పంచ్‌లు చింతనిప్పుల భద్రయ్య, వైనాల విజయ, ఇమ్మడిశెట్టి రవీందర్, ఎంపీటీసీ సభ్యులు బొమ్మకంటి సుజాత, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ వెంకటభాస్కర్, ఆర్ఐ హేమానాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీలత, వీఆర్వోలు రఘు, శివప్రసాద్ పాల్గొన్నారు. -
చిచ్చు రాజేసిన టాయ్‌లెట్, మత ఘర్షణలు
లక్నో : మరుగుదొడ్డి విషయంలో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకంగా మత ఘర్షణలకు దారితీసి ఉత్తర ప్రదేశ్‌లో ఒకరి ప్రాణాలు బలిగింది. అలీగఢ్ జిల్లా, విజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుర్రమ్పూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓమ్ ప్రకాశ్ శర్మ అనే రైతు 7 ఏళ్ల క్రితం స్థానికంగా కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిలో ఓ మసీదుకు చెందిన టాయ్‌లెట్ ఉండటంతో అక్రమంగా నిర్మించారంటూ శర్మ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆ మరుగుదొడ్డిని తొలగించాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. దీంతో శనివారం ప్రకాశ్ మద్దతుదారులు.. మసీదు నిర్వాహకులు వివాదాస్పద స్థలానికి చేరుకుని వాదించుకున్నారు. ఆ సమయంలో కొందరు మరుగుదొడ్డిని కూల్చేందుకు యత్నించగా.. అది హింసాత్మకంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆపేందుకు యత్నించిన స్థానికులను చితకబాదినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసులను చూసి రెచ్చిపోయిన ఇరు వర్గాల వారు అక్కడ ఉన్న వాహనాలను తగలబెట్టారు. పరిస్థితి చేజారిపోయిందని భావించిన పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో హసీన్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. ఓమ్ ప్రకాశ్ శర్మతోపాటు గాయపడ్డ అతని సోదరులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘర్షణ అనంతరం ఉన్నతాధికారులు, పోలీస్ బెటాలియన్ ఆ ఊరికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక ఈ ఘర్షణ జరిగిన విధానాన్ని అలీగఢ్ జిల్లా కలెక్టర్ రిషికేష్ భాస్కర్ వివరించారు. కొంత కాలం క్రితమే ఇరు వర్గాల ఆ స్థల విషయంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని ఆయన చెప్పారు. అల్లర్లపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉంటే అవతలి వర్గం వాళ్లు మసీదును నాశనం చేశారని మైనార్టీ వర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ లో మసీదు గోడను కూల్చేశారంటూ ఫిర్యాదు చేశారు. -
రాత్రి పూట టాయ్‌లెట్ రాకూడదా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథా’ చిత్రంలోని స్ఫూర్తి ఏమిటో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు అర్థం కాకపోయి ఉండవచ్చు. అందులోని టాయ్‌లెట్ ప్రాధాన్యత గురించి, దాని అవసరం 24 గంటలపాటు ఉంటుందన్న విషయమైనా అర్థం కావాలి. అది అర్థమైతే ఢిల్లీలోని అన్ని పబ్లిక్ టాయ్లెట్లను రాత్రి 9 గంటలకే మూసివేస్తారు. రాత్రి పూటి వాటి అవసరం మనిషికి ఉండదనా, ఉండకూడదనా? అందరు ఒకే వేళల్లో పనిచేసి, అందరూ ఒకే వేళల్లో నిద్రించే పరిస్థితి ఉన్న పల్లెల్లో అది సాధ్యమేమోగానీ 24 గంటలపాటు జీవన చక్రం తిరిగే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో అదెలా సాధ్యం! దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ రెండవ తేదీన తన పరిధిలోని మున్సిపల్ ప్రాంతాన్ని బహిరంగ విసర్జన నుంచి విముక్తి పొందిన ప్రాంతంగా ప్రకటించుకుంది. మరి ఆ పరిస్థితి కనిపిస్తుందా! రాత్రిపూట ఏరులై పారుతున్న బహిరంగ మూత్ర విసర్జన తాలూకు ఛాయలు మరుసటి రోజు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రాంతాల్లో 700 బహిరంగ మరుగుదొడ్లు కట్టించామని, 500 అడుగులకు ఒకటి చొప్పున 25 మొబైల్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశామని మున్సిపల్ కార్పొరేషన్ గర్వంగా చెప్పుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాటిలో ఎక్కువ మరుగు దొడ్లకు సీవరేజి కాల్వలకు కనెక్షన్లు ఇవ్వలేదు. ఇక మొబైల్ టాయ్లెట్ల విషయం మరింత దారుణంగా ఉంది. వాటిని తీసుకొళ్లి ఓ లోతైన గోతిలో పోస్తున్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద టాయ్లెట్ల నిర్మాణ పథకాన్ని తీసుకొస్తే కార్పొరేషన్ మరుగుదొడ్లతో పరిసర ప్రాంతాలను చెడగొడ్తున్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రాత్రి 9 గంటలకే మరుగుదొడ్లను మూసివేస్తే ఎలా అని మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా, శానిటేషన్ సర్వీస్‌ను కాంట్రాక్టుకు తీసుకున్న బీవీజీ కంపెనీ రాత్రిపూట సర్వీసుకు ముందుకు రావడం లేదని చెప్పారు. ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిప్టుల్లోనే కార్మికులను పంపిస్తున్నారని, రాత్రి షిప్టుకు పంపించడం లేదని చెప్పారు. రాత్రిపూట అల్లరి మూకలు తాగి గొడవ చేస్తాయన్న కారణంగా వీటిని మూసి ఉంచుతున్నట్లు తెలిపారు. ఇదంతా నిజమే కావచ్చు. పోలీసు భద్రతను తీసుకొనైనా వీటి సర్వీసులను కొనసాగించడం అధికారుల విధి. రాత్రి పూట కూడా శానిటేషన్ సర్వీసులను అందించే కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడం కూడా వారి బాధ్యత. ఎక్కువ వరకు ఈ ప్రభుత్వ మరుగుదొడ్లు మురికి వాడల్లో ఉన్నాయి. రాత్రి పూట వీటి బాధ్యతను స్వీకరించేందుకు స్థానిక యువకులు ముందుకువస్తే వారికి అప్పగిస్తామని మున్సిపల్ అధికారులు అంటున్నారు. అసలే మురికి వాడల్లో బతికే బడుగు జీవులు. స్వచ్ఛంద సేవకు ముందుకు రమ్మంటే ఎలా వస్తారు. వారికి నెలసరి జీతం కింద ఉపాధి కల్పిస్తే తప్పకుండా ముందుకు వస్తారు. -
పెట్రోల్ బంక్‌లో మరుగుదొడ్లు తప్పనిసరి
బీచ్‌రోడ్డు(విశాఖతూర్పు): జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్‌ల్లో మరుగుదొడ్లు తప్పనిసరి అని ఇన్చార్జి కలెక్టర్ జి.సృజన అన్నారు. కలెక్టరేట్లో సోమవారం పెట్రోల్ బంక్‌ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌లో భాగంగా అన్ని పెట్రోల్ బంక్‌ల్లో మరుగుదొడ్లు తప్పని సరిగా ఉండాలన్నారు. జీవీఎంసీ పరిధిలో 72 పెట్రోల్ బంక్‌లు ఉండగా, వాటిలో 10 బంక్‌ల్లో మరుగుదొడ్లు లేనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణాలను చేపట్టాలన్నారు. నిరంతరం నీటి సౌకర్యం కల్పించడంతో పాటు మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, డీఎస్వో నిర్మలాబయ్ తదితరులు పాల్గొన్నారు. -
రేయ్.. ఇక ప్రజెంట్ సార్ అనొద్దండర్రా!
నగరి (చిత్తూరు జిల్లా) : పాఠశాలల్లో విద్యార్థుల హాజరును లెక్కించడానికి ఇకపై ‘ప్రెజెంట్ సార్../ఎస్ సార్’ అని అనరాదు. ఇందుకు బదులుగా ‘మరుగుదొడ్డి కట్టాము సార్../ మరుగుదొడ్డి కట్టలేదు సార్’ అని మాత్రమే విద్యార్థులతో చెప్పించాలి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యం చేరుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని కూడా వాడుకోవాలని నిర్ణయించింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉన్న విద్యార్థులు ‘ప్రెజెంట్ సార్’కు బదులు ‘కట్టాము’ అని, ఇంట్లో మరుగుదొడ్డి లేని విద్యార్థులు ‘కట్టలేదు’ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రొసీడింగ్స్ నంబరు 448 మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఈ ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాలని చిత్తూరు జిల్లా డీఈవో పాండురంగ స్వామి పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై ఉపాధ్యాయుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే అంశం అని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినులకు ఈ అంశం ఇబ్బందికరమని, తోటి విద్యార్థుల మధ్య వారు కుంగిపోతారంటున్నారు. ఈ పద్ధతి బాగోలేదు.. అన్ని ఇళ్లలోనూ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలనేది మంచి నిర్ణయమే. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే దీనిని అమలు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పటికే పశు వైద్యులను పూర్తి సమయం ఈ పని కోసమే వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయులనూ భాగస్వాములను చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో పెద్దలకు అవగాహన కలిగించడానికి పలు మార్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలిపెట్టి పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టడం ద్వారా పెద్దల్లో మార్పు తేవాలనుకోవడం సరికాదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘హాజరు వేసే సమయంలో విద్యార్థులను మీ ఇంట్లో మరుగుదొడ్డి కట్టారా, లేదా అని రోజూ అడిగితే గ్రామాల్లో పలు సమస్యలు తలెత్తుతాయి. కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యి.. పాఠశాలకు రావడం మానేసే ప్రమాదం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారుల ద్వారా అవగాహన కల్పించాలి. అంతేకాని ఉపాధ్యాయులు, విద్యార్థులపై రుద్దడం తగద’ని చిత్తూరు జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి మునిరత్నం ఆందోళన వ్యక్తం చేశారు. -
కట్టాము, కట్టలేదు!
బి.కొత్తకోట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం నుంచి విద్యార్థుల హాజరు మారబోతోంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ప్రజంట్ సార్, ప్రజంట్ మేడమ్ అని పలుకుతారు. ఇకపై ఈ మాటలు వినబడవు. జిల్లాను మరుగుదొడ్లరహితంగా మార్చే ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలలకు చేరింది. విద్యార్థుల ఇళ్లలో మరుగుదొడ్డి కట్టారా లేదా అని తెలుసుకునేం దుకు జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగారావు శని వారం ఓ ఉత్తర్వును జారీ చేశారు. తరగతి గదిలో హాజరు వేసేటప్పుడు విద్యార్థులు కట్టాము సార్ లేకపోతే లేదు సార్ అనాలి. అంటే విద్యార్థి ఇంటిలో మరుగుదొడ్డి ఉంటే కట్టాము అనాలి, మరుగుదొడ్డి లేకపోతే కట్టలేదు అనాలి. ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ వచ్చే మార్చి 31 వరకు ఇదేవిధంగా హాజరు నమోదు సాగుతుంది. -
ఈ సర్పంచ్‌లు సాధించారు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్వచ్ఛత సాధించేందుకు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నడుం బిగించారు ఇద్దరు మహిళా సర్పంచ్‌లు. టాయిలెట్ల నిర్మాణం చేసుకోవాలంటూ ఇం టింటా తిరిగి చెప్పారు. ఆరుబయటకు వెళ్లొ ద్దంటూ ఉదయాన్నే డప్పు చాటింపు వేయించారు. టాయిలెట్లు నిర్మించుకోం అని ఎవరైనా అంటే వారికి కరెంటు కనెక్షన్ నిలిపి వేయించారు. ఆఖరికి టాయిలెట్ల నిర్మాణానికి నిధులు తక్కువైతే ఒకరు ఒంటిపై బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ నిర్మించారు. మరొకరు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం సర్పంచ్ కొర్రా భారతి, బొల్లోనిపల్లి సర్పంచ్ పొన్నం వనజ తమ గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఓడీఎఫ్) గ్రామాలుగా మార్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ముహూర్తాలు లేవు.. ముత్తారం గ్రామపంచాయతీ çపరిధిలో 1,200 మంది జనాభా, 329 గడపల ఇళ్లు ఉన్నాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలం గట్లు, ఊరిబయట నిర్జన ప్రదేశాలు, బావి గట్లకు వెళ్లడం రివాజు. స్వచ్ఛభారత్ మిషన్ మొదలుకాక ముందు ముత్తారంలో 70 ఇళ్లలో టాయిలెట్లు ఉన్నాయి. ఆ తర్వాత మరో 100 టాయిలెట్ల నిర్మాణం జరిగింది. మిగిలిన వారిలో కొందరికి ఆర్థిక కారణాలు అడ్డంపడితే, మరికొందరికి టాయిలెట్ల నిర్మాణం ఓ అనవసర అంశంగా మారింది. 2 నెలలుగా ఇళ్లలో టాయిలెట్లు నిర్మించుకోవాలంటూ సర్పంచ్ భారతి ఇంటింటికి ప్రచా రం నిర్వహించారు. ఈ క్రమంలో మా ఇళ్లలో టాయిలెట్లు కట్టాలంటూ ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో మీకు ఏం లాభం ఉంది అంటూ ప్రజలు ప్రశ్నించారు. మరికొన్ని చోట్ల మా ఇంట్లో వాస్తు ప్రకారం టాయిలెట్ కట్టకూడదంటూ ఎదురు తిరిగారు. ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవు. మంచి టైం చూసి కట్టుకుంటామంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. డప్పు పట్టుకుని.. రోజూ తెల్లవారుజామున 4 నుంచి 7 గంటల వరకు గ్రామంలో డప్పు కొడుతూ, విజిల్స్ వేస్తూ ఎవరూ ఆరుబయటకు వెళ్లొద్దంటూ భారతి పంచాయతీ సిబ్బందితో దండోరా వేయించారు. రెండు నెలల పాటు ఈ తంతు కొనసాగింది. ఇంటింటికీ తిరుగుతూ టాయిలెట్ నిర్మాణం కోసం కుటుంబాల వారీగా దరఖాస్తులు చేయించారు. ఎవరైనా మొండికేస్తే కరెంటు కనెక్షన్ తొలగించారు. దీంతో కొందరు గ్రామస్తుల్లో వ్యతిరేకత వచ్చినా క్రమంగా టాయిలెట్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. ఎస్సీ కాలనీలో నిధుల కొరతతో పనుల పురోగతి లేదు. దీంతో గ్రామంలో మరో 50 ఇళ్లకు టాయిలెట్లు లేని పరిస్థితి నెలకొంది. బొల్లోనిపల్లిలో.. బొల్లోనిపల్లి సర్పంచ్ పొన్నం వనజ ఇదే తీరుగా 100 శాతం ఓడీఎఫ్ కోసం శ్రమించారు. ఈ గ్రామంలో 180 కుటుంబాలుండగా అందులో 70కి పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. దీంతో ఇతరుల వద్ద రూ. 30 వేలు అప్పు తెచ్చింది. మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు చేయూతనందించింది. దీంతో ఈ గ్రామంలోని అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించగలిగారు. పదిరోజుల్లో 2017, అక్టోబరు 17న వరంగల్‌లో ఓడీఎఫ్‌పై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సతీశ్‌బాబు, జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి.. గ్రామంలో అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ భారతి మాట్లాడుతూ పది రోజుల్లో లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. దీంతో అప్పటికే పంచాయతీ పరిధిలో మరో యాభై ఇళ్లకు టాయిలెట్ల నిర్మాణం మధ్యలో ఉంది. అప్పటికే భారతి శ్రమను చూసిన గ్రామస్తులు ముందు పెట్టుబడి పెడితే బిల్లులు వచ్చాక డబ్బులు తిరిగి ఇస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో చివరి ప్రయత్నంగా తన మూడు తులాల బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన రూ. 43 వేలతో అప్పటికప్పుడు మెటీరియల్ తెప్పించింది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం అన్ని ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశారు. ముల్కనూరు డెయిరీకి పాలు అమ్మగా వచ్చిన రూ. 2 లక్షలతోపాటు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మొత్తం రూ.4 లక్షల వరకు గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భారతి వెచ్చించింది. -
మరుగుదొడ్లు నిర్మించలేదని కరెంట్ కట్
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో మరుగుదొడ్ల నిర్మాణంపై అలసత్వం వహిస్తున్న లబ్ధిదారుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను శుక్రవారం నిలిపివేశారు. గ్రామంలో మొత్తం 347 మరుగుదొడ్లు మంజూరుకాగా.. 64 మంది లబ్ధిదారులు వాటిని నిర్మించుకోలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామకార్యదర్శి అనురాధ పదిమంది లబ్ధిదారుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. మరికొందరికి రేషన్ సరుకులు ఇవ్వకుండా నిలిపివేశారు. దీంతో అప్పటికప్పుడు 16 మంది మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించారని, వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని గ్రామ కార్యదర్శి తెలిపారు. -
పనిదొంగలపై 420 కేసు నమోదుచేయిస్తా
ముద్దనూరు/ఎర్రగుంట్ల: ప్రజల డబ్బును జీతంగా తీసుకుంటున్నారు.. వారం రోజులనుంచి చెబుతున్నా మీకు బుర్రకెక్కలేదు..,గ్రామాల్లోకి వెళ్లి మరుగుదొడ్లు లేని వారి జాబితా సేకరించలేదు..మీరు దొంగలైతే నేను గజదొంగని, స్థానికంగా నివాసం లేకుండా హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు.. విధులనుంచి తప్పిం చుకోవడానికి ఎవరైనా మెడికల్ లీవ్‌లో వెళితే, మెడికల్ బోర్డుకు రెఫర్చేస్తా.. తప్పని తేలితే అటువంటివారి పై 420 కేసు నమోదుచేయిస్తా అని జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.బుధవారం సాయంత్రం ముద్దనూరు, ఎర్రగుంట్లలో మండల మరుగుదొడ్ల నిర్మాణంపై సమీ క్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ మరుగుదొడ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులు ప్రణాళిక లేకుండా జాబితాను తయారుచేశారని,గ్రామాల్లోకి వెళ్లకపోతే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్నారు. గడువులోగా లక్ష్యాన్ని సాధించలేకపోతే అధికారులపై కఠిన చర్యలుంటాయని అన్నారు. ఈనెల 20వతేదీనుంచి నేనే స్వయంగా గ్రామాల్లోకి వెళ్తానని,తన అనుమతి లేకుండా ధీర్ఘకాలిక సెలవులో ఏ అధికారి వెళ్లకూడదని కలెక్టర్ హెచ్చరించారు.వార్డు స్థాయినుంచి ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాలి.. కేటాయించిన అధికారి పేరు..ఇంటి నంబరు తదితర వివరాలు పొందుపరుస్తూ జాబితా సిద్ధంచేయాలని చెప్పారు. 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ స్పెషల్ఆఫీసర్ ఇన్నయరెడ్డి, తహసీల్దారు రమ,ఎంపీడీవో మనోహర్రాజులను ఆదేశించారు. సర్వేలు అవాస్తమని తెలితే చర్యలు జమ్మలమడుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారులు మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి చేసిన సర్వే అవాస్తమని తేలితె సర్వే నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాబూరావు నాయుడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషలాఫీసర్ విజయలక్ష్మీ ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. నవంబర్ చివరి నాటికి లక్ష్యం పూర్తి చేసేవిధంగా అధికారులు కృషి చేయాలన్నారు. వీరేమన్నా లెక్కల మాస్టార్లా! ఎర్రగుంట్ల: మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా మండలస్థాయి అధికారులు తయారు చేసిన ముందస్తు ప్రణాళిక తప్పుగా ఉందని కలెక్టర్ బాబూరావునాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎర్రగుంట్లలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే జాబితాల్లో అన్నీ అంకెలు పెట్టారు.మీరేమన్నా లెక్కల మాస్టార్లా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాలకు సర్వే సక్రమంగా చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీఓ శివకుమారిలతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గడువులోగా పూర్తి చేయాలి మైలవరం: గ్రామాల్లో గడువులోగా మరుగుదొడ్లను పూర్తి చేయాలని కలెక్టర్ బాబూరావు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీఓ సభా భవణంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం పూర్తి చేయకపోతే అధికారులు ఇంటిబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మండల స్పెషల్ అఫీసర్ అనిత, ఎంíపీyీఓ నారాయణరెడ్డి, సాయినాధరెడ్డి, పర్వతరెడ్డి, సరస్వతి, ఏఇ విశ్వనాథ్, పంచాయితీ సెక్రటరీలు, వీఆర్ఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
చేతులు జోడించి చెప్తున్నాం..
నిజామాబాద్, మద్నూర్(జుక్కల్): ‘మరుగుదొడ్డి కట్టుకోండి.. మా ప్రాణాలు కాపాడండి’.. అంటూ విద్యార్థులు బహిర్భూమికి వచ్చినవారికి విన్నవించారు. ‘చేతులు జోడించి చెప్తున్నాం.. ఆరు బయట మలవిసర్జన చేయకండి’.. అంటూ బహిర్భూమికి వచ్చినవారికి విద్యార్థులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. మద్నూర్లోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంపీడీవో నాగరాజు కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గురుకుల పాఠశాల గ్రామానికి దగ్గర ఉంది. దీంతో గ్రామస్తులు రోజూ పాఠశాల చుట్టూ బహిర్భూమికి వస్తుంటారు. విద్యార్థులు ముక్కుముసుకోవాల్సిందే. వారు నిత్యం దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు. బహిర్భూమికి వచ్చినవారికి పలుమార్లు సముదాయించినా ఫలితం లేదు. దీంతో శుక్రవారం విద్యార్థులు ఇందుకు పూనుకున్నారు. 200 మంది విద్యార్థులు, సిబ్బంది వేకువజామున పాఠశాల చుట్టూ వరుసగా నిలబడి బహిర్భూమి కోసం వచ్చినవారికి చేతులు జోడించి నమస్కరించి విన్నవించారు. ప్రభుత్వం రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నా ఇంట్లో మరుగుదొడ్లు ఎందుకు నిర్మించుకోవడం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. కొందరు త్వరలో నిర్మించుకుంటామని హామీ ఇవ్వగా మరికొందరు విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. మరో మూడు రోజులపాటు ఈ కార్యక్రమం చేపడతామని విద్యార్థులు చెప్పారు. దీనిపై గ్రామస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయాపడుతున్నారు. వేకువజామున పాఠశాల చుట్టూ నిలబడిన విద్యార్థులు -
మరుగుదొడ్డిలో ‘పురిటి బిడ్డ’
తిరుపతి (అలిపిరి) : పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో దారుణం చోటుచేసుకుంది. పురిటి బిడ్డను అత్యంత దారుణంగా మరుగుదొడ్డి బేసిన్లో దూర్చేశారు. శిశువు తల పట్టకపోవడంతో అలాగే వదిలి వెళ్లారు.. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్డికి వెళ్లిన భక్తులకు టాయిలెట్లో మృతిచెంది ఉన్న పురిటి బిడ్డ తల కనిపించింది. దీంతో కంగారుపడ్డ భక్తులు కేకలు వేసుకుంటూ బయటకొచ్చారు. విషయాన్ని భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు వచ్చి టాయిలెట్‌లోని మృత శిశువును బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన భక్తులు చలించిపోయారు. కన్నీళ్లపర్యంతమయ్యారు. అనంతరం శిశువు మృతదేహాన్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరుగుదొడ్డిలో పురిటి బిడ్డ మృతిపై తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. -
బాత్రూమ్లో ప్రసవం
విజయనగరం, సాలూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవం చేయించుకోండని ప్రచారాలు చేస్తోంది సర్కార్. తీరా అక్కడకు వెళితే ఎంత సురక్షితమో సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన రుజువు చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలం పెద చీపురువలస గ్రామానికి చెందిన చెల్లూరి సంధ్య అనే గర్భిణి తొలికాన్పు కోసం సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి సంధ్యకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో స్థానిక ఆశ వర్కర్ సాయంతో 108కు ఫోన్ చేసి సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి రాత్రి 11 గంటల సమయంలో చేర్చారు. వేకువ జామున 3.30 గంటల సమయంలో ఆమె బాత్రూమ్కు వెళ్లారు. అనుకోకుండా అక్కడే ప్రసవం జరరగడంతో ఆమె పెద్ద కేకలు వేసి అక్కడే కుప్ప కూలిపోయింది. అయితే ఆమె ఆస్పత్రిలో చేరే సమయంలో స్థానిక సిబ్బంది ఎవరూ విధుల్లో లేరు. గర్భిణితో వచ్చిన ఆమె పెద్దమ్మ బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పట్టుకున్నారు. ఆశ వర్కర్ సపర్యలు చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైన తమకు బిడ్డ దక్కేవాడు కాదని, లెట్రిన్ డొక్కులో పడిపోయేవాడని వారు చెబుతున్నారు. ఆ సమయంలో ఆస్పత్రి మొత్తం సిబ్బంది కోసం పరుగులు తీసినా ఎవరూ కనిపించ లేదని ఆశవర్కర్ సుశీల తెలిపారు. తీరా అంతా జరిగిన అరగంట తర్వాత నర్సులు, డాక్టర్ వచ్చి పరిశీలించారని పేర్కొన్నారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉండడం వల్ల తనకు ఇబ్బంది లేదని, ఒక వేళ జరగరానిది జరిగితే తన పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది కనిపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలని ఆమె తెలిపారు. ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది విజయనగరం, సాలూరురూరల్ (పాచిపెంట): కళ్లు తెరవకముందే ఓ పసిగుడ్డు కన్నుమూసింది. నవ మాసాలు కనిపెంచిన బిడ్డ తన కళ్లేదుటే విగత జీవుడై పడి ఉండడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేక పోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ తనకు కడుపు కోతే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలం కర్రివలస గ్రామానికి కొంపంగి సరస్వతి కాన్పు కోసం పుట్టిల్లు అయిన మోసూరు వచ్చారు. ఆమెకు సెప్టెంబర్ 29న పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబీకులు 108 వాహనంలో రాత్రి 8.30 గంటల సమయంలో సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 10.30 సమయంలో ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. ఏమైందో ఏమో మరుసటి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో ఆ పాప చనిపోయింది. దీంతో ఆ తల్లి పెద్ద పెట్టున రోదిస్తున్నారు. అయితే పాప మరణానికి గల కారణాలు తెలియరాలేదు. -
మామను పీఎస్‌కు రప్పించిన కోడలు
పట్నా: ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో అవమానాలు ఎదుర్కొన్న ఓ మహిళ ఏకంగా తన మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానని మామతో బాండ్ పేపర్‌పై సంతకం చేయించి.. విజయం సాధించింది. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా ఛగన్నౌరా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో టాయ్‌లెట్ కట్టాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా తన మామ, బావ పట్టించుకోలేదని, దీనిపై తనకు న్యాయం చేయాలంటూ మహిళ సెప్టెంబర్ 25న ముజఫర్‌పూర్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంట్లో టాయ్‌లెట్ లేకపోవడంతో ఎదురవుతున్న కష్టాలను తట్టుకోలేక.. ఆమె తన భర్త పని కోసం తమిళనాడు వెళ్లగానే.. పుట్టింటికి వెళ్లిపోయేది. మళ్లీ తన భర్త తిరిగొస్తే.. ఆమె అత్తింటికి వచ్చేది. అయినా, పరిస్థితిలో ఏమార్పు కనిపించకపోవడంతో మామ, బావకు వ్యతిరేకంగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు నిందితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానని హామీ ఇస్తూ మామ బాండ్ పేపర్ మీద సంతకం చేయడంతో ఈ కథ సుఖాంతం అయిందని మహిళా పోలీస్ స్టేషన్ అధికారి జ్యోతి తెలిపారు. -
టాయిలెట్ లేదని అత్తారింటిపై అలిగాడు
రాంచి: అత్త వారింట్లో మరుగుదొడ్డి లేకపోవటంతో అలిగిన అల్లుడు అది నిర్మించే వరకు తాను వెళ్లబోనని, భార్యను వెళ్లనిచ్చేది లేదని భీష్మించాడు. జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భులి పట్టణానికి చెందిన ప్రమోద్‌కుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 15 వ తేదీన గిరిదిధ్ జిల్లా జోగ్తియాబాద్ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరునాడే అత్తవారింటికి వెళ్లిన ప్రమోద్ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో టాయిలెట్ ఎక్కడుందని అత్త వారింట్లో వాకబు చేయగా.. వారు అతనికి నీళ్ల చెంబు అందించి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లాలని సూచించారు. దీంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాత భార్యతో తన స్వగ్రామానికి చేరుకున్న అతడు.. టాయిలెట్ కట్టేదాకా అత్తవారింటికి వెళ్లేది లేదని తెగేసి చెప్పాడు. అంతేకాదు, భార్యను కూడా వెళ్లనిచ్చేది లేదని అడ్డుపడ్డాడు. దీంతో దిగివచ్చిన మామ జగదేశ్వర్ పాశ్వాన్... అల్లుడి కోరిక మేరకు మరుగుదొడ్డి నిర్మించేందుకు ఏర్పాట్లు చేపట్టాడు. దీంతో త్వరలోనే కూతురు, అల్లుడు తమ ఇంటికి వస్తారని పాశ్వాన్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 2018 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా మారేందుకు జార్ఖండ్ కృషి చేస్తోంది. -
టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో యాప్ చెప్పేస్తుంది!
న్యూఢిల్లీ: టెక్నాలజీ మనుషుల ఎన్నో అవసరాలను తీరుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక సామాన్యుడికి సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించింది. అదే స్మార్ట్‌ఫోన్ మరో కీలకమైన సమస్యను పరిష్కరించనుంది. అదేం టంటే... టాయిలెట్ల అడ్రస్ చెప్పడం. నిజమే... మహానగరంలో ‘అత్యవసర’ పరిస్థితి ఏర్పడితే ఎక్కడికెళ్లాలో తెలియక నానా అవస్థలు పడేవారు ఎందరో. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా.. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మహానగర పాలక సంస్థ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. పబ్లిక్ టాయిలెట్లను జియోట్యాగింగ్ చేయడం ద్వారా నగరవాసులు తమకు సమీపంలోనే ఉన్న మరుగుదొడ్లను సులభంగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛభారత్ కల సాకారం కావడానికి కూడా ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎం తో అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
మరుగుదొడ్డే పక్కాఇల్లు!
ఆత్మగౌరవం సిగ్గు పడింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (ముత్తుకూరు) : ఉన్న ఇల్లును కూలగొట్టుకొని, నిలువ నీడ లేక మరుగుదొడ్లనే నివాసాలుగా మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మండలంలోని పైనాపురం పంచాయతీలో గిరిజనకాలనీలో ఈ దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. గత ఏడాది మండలానికి 1,250 పక్కాగృహాలు మంజూరుకాగా వీటిల్లో ఒక్క ఇల్లు కూడా నేటి వరకు పూర్తికాలేదు. పైనాపురం పంచాయతీకి 63 గృహాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం 10 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. వీటిల్లో గిరిజనకాలనీకి 7 ఇళ్లు కేటాయించారు. టీడీపీ నాయకులు మంజూరు విషయం ప్రకటించడంతో తుపాకుల లచ్చమ్మ అనే మహిళ ఉన్న పూరిల్లును కూలగొట్టుకొంది. పనులు మొదలుకాకపోవడంతో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డినే నివాసంగా మలుచుకొంది. ఇంటి సామాన్లను మరుగుదొడ్డిలో సర్దేసింది. వెలుపల తాటాకుల పంచ వేసుకొని, రాత్రి వేళ లచ్చమ్మ దంపతులు దీని కింద నిద్రిస్తున్నారు. ఈ కాలనీలో పట్టలు కప్పిన పూరిపాకల ముందు కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లు వెక్కిరిస్తున్నట్టు నిల్చున్నాయి. -
అప్పుడే..గుర్తుకొస్తాయి..
♦ జాతర నాలుగు రోజులే వినియోగం ♦ ఆ తర్వాత నిరుపయోగమేనా? ♦ శాశ్వత మరుగుదొడ్లు అధ్వానం ♦ భక్తులకు వినియోగంలోకి రాని వైనం ♦ నిరుపయోగంగా షాపింగ్ కాంప్లెక్స్ ♦ పట్టించుకోని అధికారులు మేడారంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు జాతర జరిగే నాలుగు రోజులు మాత్రమే గుర్తుకొస్తాయి. 2016 జాతరలో మల విసర్జన కోసం శాశ్వత మరుగుదొడ్లు నిర్మించారు. అవి ఆ జాతర జరిగే నాలుగు రోజులు మాత్రమే వినియోగంలోకి రాగా జాతర ముగిసిన అనంతరం నిరుపయోగంగా మారాయి. మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి నిరంతరం భక్తులకు వినియోగంలోకి తీసుకురావాలని లక్షల నిధులు వెచ్చించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు): మేడారంలో 2016 జాతరలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో 40 మరుగుదొడ్లు, ఐటీడీఏ క్యాంప్ ఆఫీసు ఆవరణలో 20 మరుగుదొడ్లు నిర్మించారు. ఆ జాతరలో నాలుగు రోజులు వినియోగంలోకి వచ్చిన టాయిలెట్లు జాతర తర్వాత నిరుపయోగంగా మారడంతోపాటు తలుపులు ఊడిపోవడంతోపాటు బేష న్లు పగిలిపోయాయి. జాతర తర్వాత కూడా వచ్చే భక్తులకు వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్ధేశ్యంతో నిర్మించిన మరుగుదొడ్లకు మెయింటనెన్స్ చర్యలు తీసుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. మేడారాన్ని పారిశుద్ధ్య మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే అధికారుల లక్ష్యం నిర్లక్ష్యంగా నీరుగారిపోతోంది. మరుగుదొడ్లు నిర్మించి రెండేళ్లు గడవక ముందే అధ్వానంగా మారడంతో భక్తులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఈ మరుగుదొడ్లకు మరమ్మతు చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. జాతర నాలుగు రోజులే కాదా..? అన్నట్లు అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారే తప్పా. తర్వాత పట్టించుకున్న నాథులే లేరు. రూ.40లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్‌లు.. మేడారంలో నిర్మించిన చేసిన షాపింగ్ కాంప్లెక్స్ గదులు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. 2016 జాతరలో స్థానిక గిరిజనుల వ్యాపారాల షాపుల ఏర్పాటు కోసం రూ. 40 లక్షలతో 27 షాపింగ్ కాంప్లెక్స్ గదులు నిర్మించి జాతరలో వ్యాపారాలకు కేటాయించిన అధికారులు జాతర అనంతరం స్థానికంగా ఉండే వ్యాపారులకు కేటాయించలేదు. దీంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. కానీ వ్యాపారులు మాత్రం రోడ్ల పక్కన గుడిసెలు వేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వాటిని ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారోననే ప్రశ్న గిరిజన వ్యాపారుల్లో తలెత్తుతోంది. అధికారుల నిర్లక్ష్యంతోనే వినియోగంలోకి తీసుకురాలేదని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, షాపింగ్ కాంప్లెక్స్ గదులను పరిశీలిస్తే మేడారంలో భక్తుల కోసం నిర్మించిన శాశ్వత నిర్మాణాలు ఏమేరకు అధికారులు వినియోగంలోకి తీసుకువస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి వీటిని భక్తులకు వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఎంతైన ఉంది. -
టాయ్‌లెట్ ఉపయోగించే ఈ కుక్కను చూశారా?
-
టాయ్‌లెట్ ఉపయోగించే ఈ కుక్కను చూశారా?
సాక్షి, ముంబై: అక్షయ్ కుమార్ నటించిన ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’ అనే బాలివుడ్ చిత్రానికి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. అది ఓ పెంపుడు కుక్క. దానికున్న క్రమశిక్షణ చూస్తుంటే కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకపాయెనా! అనిపిస్తోంది. అది మూత్రం వచ్చినప్పుడల్లా సరాసరి బాత్రూమ్లోకి వచ్చి తన కోసం ఏర్పాటు చేసిన కమోడ్‌లో మూత్రం పోయటమే కాకుండా ఎంచక్కా దాన్ని ఫ్లష్ అవుట్ కూడా చేస్తోంది. ఈ కుక్కకు ఇంత బుద్ధిగా నడుచుకునేలా ఎవరూ శిక్షణ ఇచ్చారోగానీ అక్షయ్ కుమార్ మాత్రం కుక్క మూత్రంపోసి, ఫ్లష్ అవుట్ చేయడాన్ని వీడియో తీసి పోస్ట్ చేయగా ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘లుక్ వూ ఈజ్ ఏ గుడ్ బాయ్’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ కూడా చేశారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - టాయిలెట్
-
మరుగుదొడ్లకు అత్యంత ప్రాధాన్యత : కలెక్టర్
అనంతపురం అర్బన్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. అశ్రద్ధ వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై శనివారం కలెక్టరేట్ నుంచి ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాము ఎంత తోడ్పాటు అందించినా పెద్దగా పురోగతి లేదంటూ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి చేసిన వాటిని జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేస్తేనే బిల్లులు చెల్లించేందుకు వీలవుతుందని, సాకులు చెప్పకుండా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, జెడ్పీ సీఈఓ సూర్యనారాయణ, డ్వామా పీడీ నాగభూషణం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘స్వచ్ఛ’ సైన్యం!
- మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతానికి సర్కారు నిర్ణయం - పదివేల మంది తాపీ మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారతమిషన్లో భాగంగా రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తం గా గుర్తించిన పదివేల మంది తాపీ మేస్త్రీలతో ‘స్వచ్ఛ’సైన్యాన్ని ఏర్పాటు చేస్తోంది. మరుగుదొడ్డి కోసం గది నిర్మాణంతోపాటు కమోడ్, పైప్లైన్ల అనుసం ధానం, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు వరకు అన్నీ ఒక్కరే పూర్తి చేసేలా ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)’ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర నిధులతో..: బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకు, ఇంటింటా మరు గుదొడ్డి ఉండేలా కేంద్రం స్వచ్ఛభారత్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర నిధులతో మన రాష్ట్రంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో సుమారు 10 లక్షల మరుగుదొడ్లు నిర్మించి నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మరో 1.58 లక్షల మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మా ణం ఆశించిన స్థాయిలో లేదు. లక్ష్యంలో కేవలం 40 శాతమే సాధించారు. మరో 9 జిల్లాల్లో 70 శాతం వరకు పూర్తి చేయగా.. మిగతా జిల్లాల్లో 70 శాతానికి పైబడి పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ‘స్వచ్ఛ’సైన్యంతో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం కానుంది. మూడు పనులు ఒక్కరే..: మరుగుదొడ్డి ఏర్పాటుకు కావాల్సిన గది నిర్మాణాన్ని మేస్త్రీ చేపట్టాలి, అందులో కమోడ్, పైపులు తదితర పనులు ప్లంబర్ చేస్తే... విద్యుత్ బల్బు, వైరింగ్ పని ఎలక్ట్రీషియన్ది. ఈ మూడు పనులకు ముగ్గురిని పిలిపించటం సమస్యగా మారింది. ఆర్థిక భారమనో, వేళకు వారు రాకపోవడమో.. ఇలా పలు కార ణాలతో ఆ పనులు సరిగా జరగటం లేదు. దీంతో తాపీ మేస్త్రీ ఒక్కరే ఈ మూడు పను లు చేస్తే సమస్య ఉండదని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనుల్లో మేస్త్రీలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం ఈ శిక్షణ బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)కు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 10 వేల మంది తాపీ మేస్త్రీలకు ఈ శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. వారం పాటు శిక్షణ: ప్రతి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాలోని మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత వారికి పనులు పురమాయిస్తారు. మొత్తంగా ఈ పది వేల మంది రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. -
మరుగుదొడ్ల వేగవంతానికి అధికారుల నియామకం
అనంతపురం టౌన్ (అనంతపురం): స్వచ్ఛభారత్ మిషన్ కింద డ్వామాకు కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్ 28,710 యూనిట్లు కేటాయించారని, వీటిని ఈనెల 19లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కళ్యాణదుర్గం డివిజన్‌కు రాజేంద్రప్రసాద్, కదిరి డివిజన్‌కు విజయ్‌కుమార్, పెనుకొండకు నరసింహారెడ్డి, ధర్మవరానికి చంద్రశేఖర్‌రావు, అనంతపురానికి రంగన్నను నియమించామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి సామగ్రిని అందుబాటులో ఉంచుకుని నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. రోజు వారీ నివేదికలను తెప్పించుకుని గడువులోగా లక్ష్యం సాధిస్తామన్నారు. -
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. నాగభూషణం
టైటిల్ : అనంత శివారులో...! తారాగణం : నాగభూషణం, జబర్దస్త్ సాయి, ఆనంద్, నవీన్ స్పెషల్ అప్పియరెన్స్ : నరసింహ స్టోరీ లైన్ : ‘వంద గంటల్లో 12 వేల మరుగుదొడ్ల నిర్మాణం’ అనంతపురం టౌన్: ఇటీవల కాలంలో జిల్లాలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కథ ‘100 గంటల్లో 12వేల మరుగుదొడ్ల నిర్మాణం’. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను గంటల వ్యవధిలో పూర్తి చేయాలనుకోవడం..అందుకు తగ్గట్టు క్షేత్రస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను హీరో/ దర్శకుడు నాగభూషణం (డ్వామా పీడీ) అందుకున్నారా? లేదా?.. ఊహించని ట్విస్ట్ లేంటి?.. కథలోకి వెళ్తే... దేశ వ్యాప్తంగా ఘన విజయాలు సాధిస్తున్న కథ (వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం)కు దాదాపు ఎలాంటి మార్పు లేకుండానే తెరకెక్కించారు. ముందుగా జూలై 21న జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్వామా ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, ఐబ్ల్యూఎంపీ పీఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ‘హీరో’ 306 పంచాయతీల్లో ‘100 గంటల్లో 12 వేల మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ’పై చర్చిస్తారు. అదే నెల 26, 27, 28, 29 తేదీలను టార్గెట్‌గా పెట్టుకుంటారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటివ్ అధికారి రంగన్న, డ్వామా విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్‌రావు, జనరల్ సూపరింటెండెంట్ హబీబాబేగం, ‘మీ కోసం’ సూపరింటెండెంట్ అమృతవాణి, ఎంఅండ్‌డీ (మానిటరింగ్, ఎవాల్యుయేషన్) సూపరింటెండెంట్ ప్రకాశ్‌రావు, ఈ–2 సెక్షన్ అధికారి నిర్మల, హార్టికల్చర్ సూపరింటెండెంట్ పద్మావతి, ఎన్టీఆర్ జలసిరి సూపరింటెండెంట్ మంజునాథ్, హెచ్ఆర్ సిబారాణి, ప్రహ్లాద, పర్వీశ్, తహసీల్దార్ వేణుగోపాల్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఏ రోజుకారోజు నిర్మాణాల ప్రగతిపై సమీక్ష చేస్తారు. తీరా అనుకున్న గడువు ముగిసిపోతుంది. కానీ నిర్మాణాలు మాత్రం నత్తనడకే. వాస్తవానికి జిల్లాకు 36,216 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరై ఉంటాయి. కానీ ‘డ్వామా’ నిర్లక్ష్యంతో అవన్నీ కూడా నిర్మాణాలకు నోచుకోవు. తీరా ‘వంద గంటల’ కథ సిద్ధం చేసే నాటికి ప్రగతిలో ఉన్న 12 వేలను తీసుకుని మిగిలినవన్నీ ‘స్వచ్ఛ భారత్ మిషన్’ కింద ఆర్డబ్ల్యూఎస్ శాఖకు ఇచ్చేస్తారు. ఈ 12 వేలను పూర్తి చేసేందుకు పెట్టుకున్న గడువు ముగియడంతో మళ్లీ ఆగస్టు 1వ తేదీన ‘టీం’ సమావేశమవుతుంది. 17 మండలాల పరిధిలో చిన్న పాటి వర్షం కురవడం కలిసొస్తుంది. ఆ వెంటనే రెండ్రోజులు గడువు పొడిగించుకుని శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తారు. ‘హీరో’కు పట్టలేనంత సంతోషం. ఆగస్టు 3వ తేదీన ఉపాధి, వాటర్‌షెడ్ సిబ్బందికి సమాచారం పంపుతారు. అట్టహాసంగా రిలీజ్ ఫంక్షన్ ఆగస్టు 5వ తేదీన ‘అనంత శివారులో..(టీటీడీసీ)’ (మరుగుదొడ్ల నిర్మాణాల పూర్తి మహోత్సవం) రిలీజ్ ఉంటుందంటారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం, జాబ్‌కార్డుల సీడింగ్‌పై ‘వర్క్‌షాప్’ ఉంటుందని, అందరూ రావాలని పేర్కొంటున్నారు. ఏపీడీ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ఆహ్వానం వెళ్తుంది. తీరా ఆగస్టు 5 వచ్చేస్తుంది. ఉదయాన్నే ఒక్కొక్కరుగా టీటీడీసీకి చేరుకుంటారు. ‘కథ’లో ట్విస్ట్ తెలిసిన వాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంటారు. సాయంత్రానికి ఓ సమావేశం.. కూలీలకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఆధార్ సీడింగ్‌పై దృష్టి పెట్టాలన్నది దాని సారాంశం. అప్పటికే సాయంత్రం 6 గంటలవుతుంటుంది. కలెక్టర్ వీరపాండియన్ ‘షో’ చూడ్డానికి ముఖ్య అతిథిగా వస్తారని ఉదయం నుంచి ప్రచారం జరుగుతుంటుంది. కానీ ఆయన రారు. జబర్దస్త్‌తో కీలక మలుపు : ‘మహోత్సవం’ చప్పగా సాగుతున్న సమయంలో దర్శకుడు/యాంకర్ (డ్వామా పీడీ నాగభూషణం) కథకు ప్రాణంపోస్తారు. ‘ఉపాధి సిబ్బంది వీరుల్లా పని చేశారు.. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేద్దాం’ అంటూ హుషారెత్తిస్తారు. అంతలోనే జబర్దస్త్ నటులు సాయి, ఆనంద్, నవీన్‌ను అందరికీ పరిచయం చేయడంతో ఈలలతో ఒక్కసారిగా ఊపోస్తుంది. 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక స్కిట్లు, డాన్సులతో టీటీడీసీ ఉత్సాహంగా మారిపోతుంది. ‘వ్యక్తిగత మరుగుదొడ్ల’ కథాంశాన్ని వదిలేసి ‘జబర్దస్త్’ తరహా కామెడీతో సాగిపోతుంది. చివరగా నటులు ‘ఎక్ట్సార్డినరీగా పర్ఫార్మెన్స్’ చేశారంటూ డ్వామా తరఫున గిఫ్ట్స్ ఇచ్చి పంపుతారు. గతంలో ఇక్కడికొచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ శాంతకుమారే నటులను ఇక్కడికి పంపారని దర్శకుడు రివీల్ చేస్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన అధికారులను వాళ్ల ఇళ్ల వద్దకు చేర్చే బాధ్యత ‘ట్రాన్స్పోర్ట్’ వాళ్లు చూసుకోవాలని, రాత్రి వేళ ఇబ్బంది లేకుండా చూడాలని సూచించి కథకు శుభం కార్డు వేస్తారు. అయితే డ్వామా సినిమాకు నిర్మాత ఎవరన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ప్లస్ పాయింట్స్ : డ్వామా పీడీ నాగభూషణం యాంకరింగ్, స్క్రీన్ ప్లే. ఎక్కడా ఖర్చుకు తగ్గకుండా రిచ్‌గా తీసిన తీరు ఆకట్టుకుంటాయి. స్పెషల్ అప్పియరెన్స్ : ‘వానవాన వెల్లువాయే పాట’కు జబర్దస్త్ నటుడు సాయితో కలిసి ఉపాధి హామీ ఉద్యోగి ‘నరసింహ’ డ్యాన్స్ వేయడం (ఎక్కువ మరుగుదొడ్లు కట్టించడంతో అవకాశం దక్కించుకుని ఉంటాడు.) – తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలోని ఓ పాటకు మహిళ డ్యాన్స్ చేయడం. మైనస్ పాయింట్స్ : ‘వంద గంటల్లో 12 వేల మరుగుదొడ్ల’ కథతో సంబంధం లేకుండా ‘మహోత్సవం’ జరపడం. – ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రులో..కలెక్టరో రాకపోవడం.. – పనితీరు కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు, ప్రశంసాపత్రాలిస్తామని చెప్పి ఇవ్వకపోవడం. – మీడియా కూడా పెద్దగా కవరేజీ చేయకపోవడం. – డ్వామా ఉద్యోగులే విమర్శలు చేయడం. ఓవరాల్‌గా.. : ‘అనంత శివారులో..’.. డ్వామా ఉద్యోగులను అలరించిన ‘సస్పెన్స్’ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. డ్వామా పీడీ నాగభూషణం అభిమానులను కచ్చితంగా అలరించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాకపోతే ‘పబ్లిసిటీ’ లేకపోవడంతో ‘అందరూ’ తిలకించలేకపోయారు. బయట టాక్ ఎలా ఉంది? : ఉపాధి పనులు చేసినా డబ్బులు ఖాతాలో పడక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారి కష్టాలను తమవిగా భావించే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించే తీరును బట్టి ‘టాక్’ డిసైడ్ అవుతుంది. -
రక్షాబంధన్ కానుకగా మరుగుదొడ్డి
రక్షాబంధన్... ఈ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేదేమిటంటే అన్నాచెల్లెళ్లు ఆ రోజు ఒకచోటికి చేరుకుని తమ బంధాన్ని నెమరువేసుకోవడం. ఇంకా చెప్పాలంటే వారికి ఓ పర్వదినం. ఆ రోజున రాఖీ కట్టిన సోదరికి వారి వారి స్తోమతను బట్టి సోదరుడు కానుకలు ఇవ్వడం ఆనవా యితీ. అది వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు దోహదం చేస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా వాసులు మాత్రం రాఖీ పండుగను విభిన్నంగా జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రక్షాబంధన్ సమీపిస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై జిల్లా స్వచ్ఛతా సమితి ‘విభిన్న అమేథీ–విభిన్న సోదరుడు’ అనే ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ మొత్తం 854 మంది సోదరులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా వీరంతా తమ సోదరీమణులకు మరుగుదొడ్డిని కానుకగా ఇవ్వనున్నారు. సోదరులు ఇచ్చే డబ్బుతో సోదరీమణుల ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్
- వారంలోపు 1.55 లక్షల నిర్మాణాలు పూర్తి చేయాలి – ప్రతిరోజూ 21,700 నిర్మించాలి – అధికారులకు కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. వారంలోపు 1,55,834 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. ప్రతి రోజూ 21,700 నిర్మించాలన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత అ«ధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం మరుగుదొడ్ల నిర్మాణంపై ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్డీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్కా ప్రణాళిక రూపొందించి మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఏపీఓ, ఏపీఎం, ఏఈఓలను భాగస్వాములను చేయాలన్నారు. ఒక్కో అధికారికి రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలను అప్పగించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, పూర్తి బాధ్యత వీరిపైనే ఉంటుందన్నారు. ఈనెల 8న ప్రతి పంచాయతీలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. 9న నిర్మాణానికి అవసరైన ఇటుకులు, సిమెంట్, ఇసుక, తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, 10వతేదీ నుంచి పనులు ప్రారంభించాలన్నారు. రోజూ 21,700 నిర్మాణాలు పూర్తవ్వాలన్నారు. వీటి పురోగతిపై ప్రతి రోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, డీఈలు కూడా తమ పరిధిలో రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యత తీసుకొని నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన వాటిని జియోట్యాగింగ్ చేసి, అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాంనాయక్, డీఆర్డీఏ, డ్వామా పీడీలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, జెడ్పీ సీఈఓ సూర్యానారాయణ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పీఎస్ టాయిలెట్లో వ్యక్తి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి టాయిలెట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేశ రాజధానిలో బుధవారం వెలుగుచూసింది. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి పోలీస్‌స్టేషన్ మరుగుదొడ్లో రాజ్‌కుమార్(32) అనే వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ ఓ కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఏమైంతో తెలియదు, అనూహ్యంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్‌రామ్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. -
మరుగు లేక...
♦ మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల అవస్థలు ♦ బదిలీ కౌన్సెలింగ్‌లో నరకయాతన ♦ ‘ఐ టాయిలెట్స్’ ఉన్నా వినియోగానికి అనుమతి ఇవ్వని జెడ్పీ యంత్రాంగం! ♦ సౌకర్యాల కల్పనలో చేతులెత్తేసిన విద్యాశాఖ ♦ తొలిరోజు∙789 ఎస్జీటీలకు బదిలీ విజయనగరం అర్బన్: జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే మహిళా టీచర్లకు చెప్పుకోలేని సమస్య ఎదురవుతోంది. మరుగుదొడ్లు లేకపోవడం.. కౌన్సెలింగ్‌కు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో నరకయాతన పడుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 22వ తేదీ నుంచి జరుగుతున్నా రోజూ ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరించడంలో విద్యాశాఖ విఫలమయింది. ప్రతిరోజూ జెడ్పీ ప్రాంగణం ఉపాధ్యాయులతో కిటకిటలాడుతోంది. రోజుకు కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా మహిళా ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ఆదివారం అత్యధికంగా 12 వందల మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు తోడుగా వచ్చిన భర్త/భార్యలను కలుపుకుని సుమారు 2,400 మందితో ప్రాంగణం నిండిపోయింది. సీరియల్ ప్రకారం ఆ రోజుకి చివర్లో ఉన్న వారయినా ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీల తెలుసుకోవడానికి కౌన్సెలింగ్ మొదటి నుంచి ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రారంభం నుంచి ఉపాధ్యాయులతో ఆ ప్రాంగణం నిండిపోతుంది. ‘ఐ టాయిలెట్స్’ ఉన్నా ఇవ్వని జెడ్పీ యంత్రాంగం మరుగుదొడ్ల ఇబ్బందులను తీర్చడానికి ప్రాంగణంలోని ఉన్న ‘ఐ–టాయిలెట్స్’ను వినియోగా నికి అనుమతి ఇవ్వాలని జిల్లా పరిషత్ యం త్రాంగానికి విద్యాశాఖ విన్నవించినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు వేలాది మంది మహిళా ఉపాధ్యాయులకు ఇవ్వలేమని జెడ్పీ అధికారులు ఖరాకండిగా చెప్పినట్టు సమాచారం. కనీస సౌకర్యాలను అందించడంలో విద్యాశాఖ చేతులెత్తేసింది. స్వచ్ఛభారత్ పేరుతో రూ.లక్షలు వెచ్చి ఆర్భాటంగా ప్రారంభించి న ఈ సౌకర్యం ఇలాంటి సమయాల్లో ఉపయోగపడకపోవడం అన్యాయమని వాపోతున్నారు. తొలిరోజున 789 ఎస్జీటీలకు బదిలీ జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో తొలిరోజున 789 మంది బదిలీ సద్వినియోగం చేసుకున్నారు. శనివారం రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ ప్రక్రియలో 800 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివారం 1,200 మందికి నిర్వహించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 8.00 గంటలకే ప్రారంభించాల్సి ఉండగా 1.30 గంటల ఆలస్యంగా సర్వర్ లింక్ అయింది. దీంతో రెండో రోజు ముగిసే సరికి రాత్రి 11 గంటల అయిం ది. బదిలీ ప్రక్రియలో డీఈఓ ఎస్.అరుణకుమారి, డిప్యూటీ ఈఓలో బి.లింగేశ్వరరెడ్డి, సత్యన్నారాయణమూర్తి, ఏడీలు నాగేశ్వరరా వు, సత్యన్నారాయణ పాల్గొన్నారు. -
స్వచ్ఛత.. మరుగు
నాలుగు రోజుల్లో 10,483 మరుగుదొడ్లట! - డ్వామా అధికారుల అత్యాశ - రేపటితో ముగియనున్న గడువు - ప్రజాప్రతినిధులూ ఆరుబయటకే.. - ఆర్‌డబ్ల్యు ఎస్ ఆధ్వర్యంలో 1.93లక్షల మరుగుదొడ్లు.. పూర్తయినవి 41,240 సాక్షిప్రతినిధి, అనంతపురం: స్వచ్ఛ భారత్... స్వచ్ఛ ఆంధ్ర...స్వచ్ఛ అనంత...పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఇటు ప్రభుత్వాలు, యంత్రాంగం జపిస్తున్న మంత్రాలివి. బహిరంగ మలవిసర్జనను అరికట్టి, ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నది వీరి ధ్యేయం. అయితే నేటికీ మరుగుదొడ్డి లేని కుటుంబాలు జిల్లాలో లక్షల్లో ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులకే మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవంటే సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పేరుకు వేలు...లక్షల్లో మరుగుదొడ్లను మంజూరు చేశామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్డి లేనివారు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం సర్వే చేసింది. సర్వే ఆధారంగా ఏటా కొన్ని పంచాయతీలను ఎంచుకుని మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపక్రమిస్తోంది. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 15 వేల చొప్పున మంజూరు చేస్తోంది. అయితే ఈ మొత్తం సరిపోవడం లేదు. ఇతర జిల్లాలతో పోలిస్తే ‘అనంత’ పల్లెసీమల్లోని కుటుంబాల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగేళ్లుగా వరుస కరువులతో అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలతో పాటు సొంతంగా మరింత ఖర్చు చేసుకుంటే తప్ప మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి కాని పరిస్థితి. అందువల్లే చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. దీనికి తోడు ప్రజలను చైతన్యం చేయడంలో అధికారులు కూడా విఫలమయ్యారు. లక్ష్యానికి సగం కూడా గగనమే ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 2016–17 నుంచి 2019–20 వరకూ విడతల వారీగా జిల్లాలోని పంచాయతీలను ఎంపిక చేసుకుని మరుగుదొడ్లు పూర్తి చేయాలని యంత్రాంగం భావించింది. అయితే ఏటా ప్రభుత్వం మంజూరు చేస్తున్న మరుగుదొడ్ల సంఖ్య, పురోగతి చూస్తుంటే పెద్దగా మార్పు కనిపించ లేదు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి 340 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకుంటే... అందులో 184 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని అధికారులే చెబుతున్నారు. ఈలెక్కన తక్కిన 156 పంచాయతీల్లో పురోగతి లేదు. డ్వామా అధికారులూ అంతే.. స్వచ్ఛభారత్ మిషన్ పేరుతో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మరోవైపు డ్వామా కూడా ఈ బాధ్యతను అప్పగించింది. ఉపాధిహామీ పథకం ద్వారా 36, 216 మరుగుదొడ్లు మంజూరు చేసింది. ఇందులో 10, 483 మరుగుదొడ్లు పురోగతిలో ఉన్నాయని డ్వామా గణాంకాలు చెబుతున్నాయి. తక్కిన 20,804 మరుగుదొడ్లు ప్రారంభం కాలేదు. దీంతో వీటిని రద్దు చేసిన ప్రభుత్వం ఇక వాటిని ప్రారంభించొద్దని డ్వామా అధికారులకు సూచించింది. ఇలా రద్దయిన వాటిని స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేపట్టనున్నారు. డ్వామా అధికారులు చేపట్టే వాటిలో యూనిట్‌కు రూ.13 వేలు ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చు చేస్తున్నారు. తక్కిన రూ.3 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటిని 26వ తేదీ నుంచి 29 వరకూ నాలుగురోజుల్లో పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే నాలుగురోజుల్లో ఇన్ని మరుగుదొడ్లు పూర్తి చేస్తారా? లేదా? అనేది రెండురోజుల్లో తేలిపోతుంది. 1,500 మరుగుదొడ్లు పూర్తికాకపోవచ్చు జిల్లాకు 36,216 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 10,483 డ్వామా ఆధ్వర్యంలో ప్రారంభించాం. ప్రారంభం కాని వాటిని రద్దు చేసి ఆర్డబ్ల్యూఎస్ శాఖకు బదలాయించారు. ఈ నెల 29వ తేదీలోపు మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. వీటిలో 1,500 దాకా పెండింగ్ ఉండొచ్చు. తక్కినవి పూర్తి చేయగలమనే నమ్మకం ఉంది. - నాగభూషణం, డ్వామా పీడీ జిల్లాలో మరుగుదొడ్లు లేని ప్రజాప్రతినిధులు: ప్రజాప్రతినిధులు మరుగుదొడ్లు లేనివారి సంఖ్య జెడ్పీటీసీ సభ్యులు 19 ఎంపీపీలు 19 ఎంపీటీసీ సభ్యులు 479 సర్పంచ్‌లు 581 వార్డు సభ్యులు 6075 -
స్టార్ హీరో సరదా బెడిసి కొట్టింది..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీ లైఫ్ మాత్రం మిస్ చేసుకోడు. ముఖ్యంగా తన పిల్లలు ఆరవ్, నిటారాలతో గడపటం అంటే అక్షయ్ కి చాలా ఇష్టం. కొద్ది రోజులుగా టాయిలెట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అక్షయ్, ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకటంతో తన కూతురు నిటారాతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. భార్య ట్వింకిల్ విహారయాత్రకు ఆస్ట్రియా వెల్లటం, కొడుకు ఆరవ్ ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉండటంతో నిటారాను అక్షచే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూతురితో ఆడుకుంటున్న అక్షయ్ సరదా బెడిసి కొట్టింది. నిటారాను ఉయ్యాల ఎక్కించి ఆడిస్తున్నారు. పాప ఉయ్యాల ఊగుతున్నప్పుడు అక్షయ్ ఎదురుగా నిలబడ్డారు. ఉయ్యాల వేగంగా ఊగుతుండటంతో పాప కాళ్లు ఏకంగా అక్షయ్ ముఖం మీదకు వచ్చాయి. దీంతో ఉలిక్కి పడిన కిలాడీ స్టార్, వెంటనే తెరకొని కిందపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అక్షయ్'డ్యాడీస్ డే అవుట్ బెడిసికొట్టింది' అని కామెంట్ చేశాడు. Daddy's day out gone wrong #ParentLife pic.twitter.com/qygsDRsF2U — Akshay Kumar (@akshaykumar) 25 July 2017 -
స్టార్ హీరో సరదా బెడిసి కొట్టింది..!
-
దా‘రుణం’
►రైతులను వెంటాడుతున్న రుణమాఫీ అనంతర కష్టాలు ►మరుగుదొడ్ల నిధులు.. ఉపాధి హామీ వేతనాలు బకాయిలకు జమ చేస్తున్న బ్యాంకర్లు ►ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిక నాయుడుపేట మండలం భీమవరం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కోటపూరి చినపెంచలయ్య. 2007 మే నెలలో 3.20 ఎకరాల భూమిపై రూ.10 వేలను వ్యవసాయ రుణంగా తీసుకున్నాడు. 2010లో రూ.40 వేలు తీసుకుని.. రుణాన్ని రీ షెడ్యూల్ చేయించుకున్నాడు. 2013 నాటికి వడ్డీతో కలిపి అప్పు రూ.90 వేలకు చేరింది. పంటలు పండకపోవడంతో రుణం తీర్చలేకపోయాడు. 2014లో రైతులకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా రుణ ఉపశమనం పేరిట రూ 26,450 అతని ఖాతాలో జమ అయ్యింది. మిగిలిన మొత్తం మంజూరు కాకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో అతని అప్పు తీరలేదు. బకాయి మొత్తం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు చినపెంచలయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. వర్షాలు లేక పంటలు పండని స్థితిలో ఉన్న ఈ రైతు బకాయి చెల్లించే పరిస్థితిలో లేడు. అయినా.. బ్యాంకు అధికారులు కనికరం చూపడం లేదు. అప్పు మొత్తం కట్టాల్సిందేనంటున్నారు. లేదంటే ఆస్తిని జప్తు చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చినపెంచలయ్య ఆందోళన చెందుతున్నాడు. ఈ పరిస్థితి ఇతడొక్కడికే పరిమితం కాదు. రుణాలు మాఫీ కాకపోవడంతో జిల్లాలో చాలామంది రైతులు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. నాయుడుపేట : రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాలకు పూర్తిగా జమ కాకపోవడం.. తీసుకున్న అప్పు తడిసి మోపెడు కావడంతో రైతులు అల్లాడిపోతున్నారు. తక్షణమే బకాయిల్ని చెల్లించాలని.. లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని బ్యాంకుల అధికారులు హెచ్చరిస్తున్నారు. కరువు కాటకాలతో తల్లడిల్లుతూ.. పంటలు పండక పూటగడవని దుస్థితిలో ఉన్న రైతులు బ్యాంకు అధికారుల తీరుతో చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. నాయుడుపేట మండలం భీమవరం గ్రామానికి చెందిన కోటపూరి రత్నమ్మ అనే మహిళా రైతు 3.20 ఎకరాల భూమియ పత్రాలను 2007 నెలలో మేనకూరు ఆంధ్రాబ్యాంక్‌లో పెట్టి రూ.10 వేలు పంట రుణం తీసుకుంది. ఆ తరువాత 48 గ్రాముల బంగారాన్ని కుదువపెట్టి రూ.50 వేలు రుణం తీసుకుంది. ఆ మొత్తాన్ని వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు వినియోగించింది. రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఆనందపడింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలువ లేదు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు తలెత్తి పంటలు పండటం లేదు. పెట్టిన పెట్టుబడులు సైతం చేతికి రాక ఇబ్బందులు పడుతోంది. రుణమాఫీ కింద రూ.26,450 మంజూరైనా ఉపయోగం లేకుండాపోయింది. వాయిదాలు సకాలంలో చెల్లించలేదన్న కారణంగా వడ్డీలపై వడ్డీలు పడ్డాయి. రత్నమ్మ ఇంకా రూ.1,05,800 బకాయి పడింది. పంటలు బాగా పండితే బకాయి మొత్తం తీర్చేద్దామనుకుంది. కానీ.. పరిస్థితి తారుమారైంది. రుణ ఉపశమన పత్రం అక్కరకు రాకుండాపోయింది. తక్షణమే బకాయి చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రత్నమ్మతోపాటు ఆమె కుటుంబ సభ్యులపైనా ఒత్తిడి తెస్తున్నారు. కూలి సొమ్మునూ జమ చేసుకుని.. భీమవరం గ్రామానికే చెందిన అన్నంరెడ్డి అనసూయమ్మ, ఆమె కుమారుడు బాలాజీరెడ్డిపైనా బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం మంజూరైన సొమ్మును, ఉపాధి హామీ పనులు చేయగా వచ్చిన కూలి డబ్బులను సైతం బ్యాంకు అధికారులు బకాయిల నిమిత్తం జమ చేసుకున్నారు. అదేమని అడిగితే అప్పు తీసుకున్నప్పుడు చెల్లించాలని తెలీదా అని నిలదీస్తున్నారు. -
నిర్వాసితులతో పరిహాసం
►పునరావాసం కింద అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ►ఒక్కోఇంటి నిర్మాణానికి రూ.2 లక్షల వ్యయం ►మొత్తం నిర్వాసిత కుటుంబాలు 29,545 ►పాఠశాలల్లో మరుగుదొడ్లకు రూ.1.85 నుంచి రూ. 7.5 లక్షల వ్యయం ►నిర్వాసితులకు నిర్మించే ఇళ్ల విలువ రూ.2 లక్షలే ►సర్కారు చిన్నచూపుపై విమర్శలు వేలేరుపాడు : సొంత గూడు చెదిరిపోతున్న పోలవరం నిర్వాసితులను కష్టాల పీడ కలలా వెంటాడుతూనే ఉంది. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం నిర్వాసితులను చిన్నచూపు చూస్తోంది. ఇక్కడ ఎవరూ అడిగే వారు లేరనే ధోరణిలో వ్యవహరిస్తోంది. మెజార్టీ గిరిజనులు నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు కావడంతో వారి బలహీనతలను ఆసరాగా తీసుకొని, నామమాత్రపు పరిహారాలతో చేతులు దులుపుకుంటోంది. తమకు అన్యాయం జరుగుతోందని ఒక వైపు నిర్వాసితులు అనేక సందర్భాల్లో గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారు. ఇన్నాళ్ళు తమకు ఏదో రకంగా న్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నిర్వాసితులు కొండంత విశ్వాసంతో ఉన్నారు. తమకిచ్చే రెండు లక్షల విలువ చేసే ఇళ్లు చూసి, తాము నివశించబోయే ఇల్లు మరుగుదొడ్డి విలువ కూడా చేయదా అని కుమిలిపోతున్నారు. గ్రామాల్లో విశాలమైన ఇండ్లల్లో ప్రశాంతంగా బతికే నిర్వాసితులు ఆ కాస్త మనశ్శాంతి కూడా కోల్పోయో పరిస్ధితులు నెట్టుకొస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు నిర్వాసితులు కానున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలున్నాయి. ఈ రెండు మండలాల్లో నిర్వాసితులు సర్వస్వం కోల్పోయి, ఆకస్మిక అగ్ని బాధితుల్లా కట్టుబట్టలతో బయటికొచ్చే పరిస్థితి. ముంపు మండలాల వాసులు తాము ఇక ముందు రెండులక్షల వ్యయంతో నిర్మించే ఇరుకిరుకు బందీ ఖానాల్లో ముడుచుకు పడుకోవాల్సివస్తుందనే దుస్దితి జీర్ణించుకోలేకపోతున్నారు. ముంపు మండలాల్లో ఏ గ్రామంలో చూసినా, పేద, గొప్ప అన్న తేడాలేకుండా ప్రతి ఇల్లు కనీసం పదిసెంట్ల జాగాలో కొలువుదీరి ఉంటుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ పుణ్యమా అని ఇదంతా ఒక కలలా, ఒక గతంలా మారిపోబోతోంది. ఇంత విశాలంగా జీవించిన ప్రజల్ని ప్రభుత్వం గిరిజనులకు ఐదు, గిరిజనేతరులు మూడు సెంట్ల జాగాల్లో మగ్గిపోవాలని నిర్దేశిస్తోంది. మరుగుదొడ్లకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో ఇళ్లు కట్టి æఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ళు కోల్పోయే నిర్వాసితులకు కేవలం రెండు లక్షల వ్యయంతో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పధకం కింద 22 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో చిన్న కాలనీలా ఇళ్లు నిర్మిస్తోంది. విచిత్రమేమిటంటే ప్రాధమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 18 అడుగుల 6అంగుళాల పొడవు, 8 అడుగుల 5అంగుళాల వెడల్పుతో నిర్మించే మరుగుదొడ్లకు మాత్రం లక్షా 85 వేల రూపాయల నుంచి ఏడున్నర లక్షల వరకు వెచ్చిస్తోంది. నిర్వాసితుల విషయాని కొస్తే, రెండు లక్షలు కేటాయించడం ప్రభుత్వ చిన్న చూపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అక్కడి ముఖ్యమంత్రి 5లక్షల 4వేలతో నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కానుకగా ఇస్తున్నారు. 560 స్కేర్ ఫీట్ (చదరపు అడుగులు)లలో స్లాబ్ ఏరియా ఉన్న భవనం నిర్మించి, ఆ ఇంటికి మంచినీరు, రహదారి సౌకర్యం కల్పించుకోవడానికి మరో లక్షా25వేలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపు ప్రాంతంలో నిర్వాసితుడికి అన్యాయం చేస్తోంది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంత నిర్వాసితుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పోలవరంలో 3లక్షల 15 వేలు... ఇక్కడ రెండు లక్షలే.. అంతా ఒకే ముంపు ప్రాంతమైనప్పటికీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. పోలవరం మండలంలో దేవరగొంది, తోటగొంది, రామన్నపేట, చేగుండపల్లి, పైడిపాక, మామిడిగొంది, లింగనపల్లి, దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామాల నిర్వాసితులకు 90 జీఓ ప్రకారం ఒక్కోఇంటికి 3లక్షల 15వేల వ్యయంతో కాలనీలు నిర్మించారు. 2015 వ సంవత్సరంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ జీఓ వచ్చేలా చేసారు. ఇక్కడ 315 స్కేర్ ఫీట్ (చదరపు అడుగులు)లలో 17 అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు, 17 అడుగుల ఆరు అంగుళాల వెడల్పుతో ముందు హాలు వచ్చేలా కాలనీలు నిర్మించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వచ్చేటప్పటికి కేవలం రెండు లక్షలతో సరిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కనీసం 5లక్షల వ్యయంతో గదులు పెరిగేలా ఇళ్లు నిర్మించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో రోగులకు అసౌకర్యాలు
-
‘స్వచ్ఛత’ వెనుకడుగు!
ఇప్పటికీ ఆరుబయటకే.. - మరుగుదొడ్ల నిర్మాణంలో ఆటంకాలు - మంజూరులోనూ అధికార పార్టీ వివక్ష - పట్టణ ప్రాంతాల్లోనూ అవస్థలే.. - కాకిలెక్కలతో సరిపెడుతున్న అధికారులు - రెండు రోజుల క్రితం పందుల దాడిలో గాయపడిన తల్లీకుమారుడు 1003 జిల్లాలోని పంచాయతీలు 340 స్వచ్ఛ భారత్ లక్ష్యం 150 లక్ష్యం పూర్తయిన పంచాయతీలు మరుగుదొడ్డి నిర్మించుకోని ప్రజాప్రతినిధులు 19 మంది జెడ్పీటీసీ సభ్యులు 19 ఎంపీపీలు 479 మంది ఎంపీటీసీ సభ్యులు 581 మంది సర్పంచులు 6,075 మంది వార్డు మెంబర్లు మరుగుదొడ్డి మంజూరు చేయలేదు నేను కనగానపల్లి మండలంలోని దాదులూరు గ్రామ ఎంపీటీసీ సభ్యుడిని. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా. ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మంజూరు చేయడం లేదు. సరైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో సొంతంగా నిర్మాణాన్ని చేపట్టలేకపోతున్నా. ఈ పరిస్థితి నా ఒక్కడిదే కాదు.. నేను నివసించే ఎస్సీ కాలనీలో చాలా మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. - రామాంజినేయులు, ఎంపీటీసీ సభ్యుడు, దాదులూరు, కనగానపల్లి మండలం ‘మిషన్...స్వచ్ఛత వైపు ఒక్క అడుగు’ అంటూ ప్రభుత్వాలు ప్రచారం హోరెత్తిస్తుండగా.. జిల్లాలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడఽడం లేదు. రోడ్లను శుభ్రం చేసి ‘స్వచ్ఛ భారత్’ అంటూ నాయకులు గొప్పలు చెప్పుకుంటుండఽగా.. యంత్రాగం కూడా అంకెలతో గారడీ చేస్తూ వందశాతం లక్ష్యం చేరుకున్నట్లు గిమ్మిక్కులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోని జనం తప్పనిసరి పరిస్థితుల్లో బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా మరుగుకు నోచుకోని వారిలో చాలా మంది ప్రజాప్రతినిధులూ ఉండడం గమనార్హం. - అనంతపురం సిటీ/న్యూసిటీ అక్షర క్రమంలో ఆదిలో ఉన్న అనంతపురం జిల్లా ‘స్వచ్ఛత’లో మాత్రం అధమ స్థానంలో నిలుస్తోంది. జిల్లాలోని చాలా గ్రామాల్లోనే కాదు.. పట్టణాల్లోనూ వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోని జనం బహిర్భూమికి చెంబు పట్టుకుని వెళ్తున్నారు. దీనివల్ల రోగాలు వ్యాప్తి చెందడంతో పాటు ఆరుబయటకు వెళ్తున్న వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. రెంఽడురోజుల క్రితం ఇలా బహిర్భూమికి వెళ్లిన అనంతపురం నగరంలోని చంద్రబాబు కాలనీకి చెందిన తల్లీబిడ్డపై పందిదాడి చేయడంతో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. జనం స్వచ్ఛందంగా మరుగదొడ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చినా అధికారులు మంజూరులో అలసత్వం వహిస్తుండడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. 350 పంచాయతీలకే అవకాశం జిల్లా వ్యాప్తంగా 3314 గ్రామాలు, 1003 గ్రామ పంచాయతీలున్నాయి. నాలుగేళ్ల్ల కాలానికి ఆర్డబ్ల్యూఎస్ శాఖకు ప్రభుత్వం 350 పంచాయతీల్లో మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం విధించింది. 2016 నుంచి 2017 నాటికి 150 గ్రామ పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తి చేశారు. అందుకు గాను ఆర్డబ్ల్యూఎస్ రూ.67 కోట్లు ఖర్చుచేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక 2017 నుంచి 2018 లోపు మరో 190 గ్రామ పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అప్పటి దాకా అటు గ్రామీణులు, ఇటు పట్టణ వాసులు మరుగులేక పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులూ ఆరుబయటకే.. స్వచ్ఛత పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన చాలా మంది ప్రజా ప్రతినిధులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆరుబయటకే వెళ్తున్నారు. జిల్లాలో 19 మంది జెడ్పీటీసీలకు, 19 మంది ఎంపీపీలకు, 479 మంది ఎంపీటీసీలకు, 581 మంది సర్పంచులకు, 6075 మంది వార్డు మెంబర్లకు మరుగు దొడ్లు లేవు. గతేడాది ఈ లెక్కల వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మరుగుదొడ్లు లేని ప్రజాప్రతినిధులకు చెక్ పవర్‌ను రద్దు చేస్తానని హెచ్చరించారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. మరుగు దొడ్ల నిర్మాణాల్లో మాయాజాలం జిల్లా వ్యాప్తంగా మరుగు దొడ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో పథకం లక్ష్యం నీరుగారి పోతోంది. చాలా చోట్ల నిర్మాణాలు చేపట్టకుండానే ఎవరో ఒక లబ్ధిదారుడి పేరుతో డబ్బు డ్రా చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అందువల్లే సాంకేతిక కారణాలను సాకుగా చూపి మరుగుదొడ్లకు జియో ట్యాగింగ్ చేయడం లేదని తెలుస్తోంది. అంతా లెక్కల్లోనే జిల్లాలోని 11 మున్సిపాలిటీలు, అనంతపురం నగరపాలక సంస్థలో వందశాతం లక్ష్యాలను అధిగమించామని అధికారులు లెక్కల్లో చూపారు. నిర్దేశించిన లక్ష్యంలో అనంతపురం నగరపాలక సంస్థ 98 శాతం, ధర్మవరం మున్సిపాలిటీలో 99 శాతం, గుత్తి 97, గుంతకల్లు 96, కదిరి 98, కళ్యాణదుర్గం 99, పామిడి 98, పుట్టపర్తి 98, రాయదుర్గం 95, మడకశిర 94, హిందూపురం 98, తాడిపత్రి మున్సిపాలిటీలో 100 శాతం మరుగుదొఽడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 90 శాతం లక్ష్యం చేరుకున్నట్లు రికార్డులు చెబుతుంటే... మరుగుదొడ్లు మంజూరు చేయాలని ఆయా మున్సిపాలిటీల ఎదుట జనం బారులు తీరుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే మంజూరు మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి గతేడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాం. మరుగుదొడ్డి లేని వారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తారు. – రవీంద్రబాబు, మున్సిపల్ ఆర్డీ -
కుట్టుకూలి అరకొరే..!
♦ గతంలో జతకు రూ.40 చెల్లింపు ♦ ఈసారి పెంచింది రూ.10 మాత్రమే ♦ గిట్టుబాటు కాని స్టిచ్చింగ్ చార్జీలు ♦ కుట్టడానికి ముందుకు రాని దర్జీలు ♦ గత్యంతరం లేక ఏజెన్సీలకు అప్పగింత ♦ యూనిఫాంలు సరిగా కుట్టడం లేదని ఆరోపణలు ♦ సర్కారు స్కూళ్ల విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ♦ పట్టించుకోని అధికారులు, పాలకులు గీసుకొండ(పరకాల): సర్కారు స్కూళ్లను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నాం.. వంట గదులు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం.. వీటికోసం రూ.కోట్లు ఖర్చుచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పేద విద్యార్థుల యూనిఫాంల కుట్టుకూలీ విషయంలో పిసినారి తనం చూపిస్తోంది. పిల్లలకు దుస్తుల పంపిణీ ప్రారంభించిన నాటి నుంచి గత పాలకులు కుట్టుకూలి ధర పెంచలేదు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా పెంచినప్పటికీ అదీ రూ.10లతో సరిపెంట్టింది. అరకొర పెంపుతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. ఫలితంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు నాసిరకం కుట్లతో దుస్తులను పంపిణీ చేయనున్నారు. కొన్ని రోజులకే కుట్లు పోయే స్థితిలో ఏజెన్సీలు అంగడి కుట్లతో దుస్తులను తయారు చేయిస్తున్నారని స్వయంగా ఆయా పాఠశాలల హెచ్ఎంలే చెబుతున్నారు. అధ్వానంగా దుస్తులు..! ప్రభుత్వ పాఠశాల పిల్లల దుస్తులు కుట్టివ్వడానికి స్థానికంగా ఉన్న టైలర్లు ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం కుట్టుకూలి గిట్టుబాటు కాకపోవడమే. ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల దుస్తులను అందిస్తుండడగా ఒక్కో జత కుట్టడానికి గతంలో ప్రభుత్వం రూ.40 ఇచ్చేది. ఇటీవల ఆ ధరకు మరో రూ.10 పెంచడంతో మొత్తం రూ.50 అయింది. ఈ లెక్కన రెండు జతలకు రూ.100 కుట్టుకూలి ఇస్తున్నారు. బయట ఒక్కో డ్రెస్ కుట్టాలంలే రూ.200 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంత తక్కువ ధరతో కుట్టించిన యూనిఫాంలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ అధికారులను అడిగితే కుట్టుకూలి విషయంలో ప్రభుత్వ నిబంధన అలా ఉంది.. అంతకు మించి ఏమీ చేయలేమని అంటున్నారు. దీంతో దర్జీలు ఎవరూ ముందుకు రావడం లేదని హెచ్ఎంలు చెబుతున్నారు. కొన్ని ఏజెన్సీల వారు ముందుకు వస్తున్నా ఆ ధరకు తగినట్టుగానే దుస్తుల కుట్లు నాసిరకంగా(అంగడి కుట్టు) ఉండటం, సైజుల్లో తేడాలు, కుట్టిన కొన్ని రోజులకే కుట్లు పోతున్నాయని అంటున్నారు. వాటిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తమను నిందిస్తున్నారని హెచ్ఎంలు వాపోతున్నారు. పిల్లలకు పంపిణీ చేసిన దుస్తులను తల్లిదండ్రులు మళ్లీ దర్జీల వద్దకు తీసుకెళ్లి సరిచేయిస్తుండడంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది, గడిచిన రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని సైజుల్లోనే దుస్తుల తయారీ 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు సాధారణంగా సిరిపోయే నాలుగైదు సైజుల్లోనే ఏజెన్సీల వారు దుస్తులు తయారు చేస్తున్నారు. అందులో కొంచెం పెద్దవాటిని 9, 10 తరగతుల వారికి అందిస్తున్నారు. దుస్తుల సైజులు సరిగా లేకపోవడంతో పొడవుగా ఉన్న వారికి పొట్టి దుస్తులు, చిన్నగా ఉన్న వారికి పెద్ద సైజు దుస్తులు అందుతుండటం పరిపాటిగా మారింది. ఈ సారి ముందుగానే పంపిణీ గడిచిన విద్యా సంవత్సరం ముగిసే సమయంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాఠశాలలకు దుస్తులు చేరుకున్నాయి. అయితే ఈసారి అంత ఆలస్యం కాకుండా ముందుగాగే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 454, యూపీఎస్‌లు 78, ఉన్నత పాఠశాలలు 133 ఉన్నాయి. వీటితో పాటు మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందిస్తారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలకు కుట్టిన దుస్తులు అందుబాటులోకి రాగా విద్యార్థులకు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. చాలా పాఠశాలలకు అవసరమైన వస్త్రాన్ని అందజేయగా కుట్టిన దుస్తులు ఇంకా అందలేదు. -
స్వచ్ఛ జ్యోతి
అహ్మదాబాద్ యూనివర్సిటీ (గుజరాత్) ‘గాంధీ పాద్రయాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది గ్రామాలకి తరలి వెళ్లారు. అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.‘గాంధీ పాదయాత్ర’లో భాగంగా గ్రామాలకు వెళ్లిన ప్రొఫెసర్ జ్యోతికి ఒక చేదు నిజం తెలిసింది. చాలా గ్రామాల్లో ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. గ్రామ పెద్దలకు అదొక సమస్యగానే అనిపించడం లేదు. మరోవైపు స్త్రీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడితేకానీ కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి లేదు. యూనివర్సిటీకి తిరిగి వచ్చిన తరువాత వైస్‌చాన్స్‌లర్ డా.సుదర్శన్ అయ్యంగార్తో ఈ సమస్య గురించి ప్రొఫెసర్ జ్యోతి చర్చించారు. ‘గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించడానికి ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టండి’ అని వీసీ సూచించారు. ఉత్సాహంగా అంగీకరించారు జ్యోతి. అయితే ఆమెను నిరాశపరచి వెనక్కిలాగే మాటలు తప్ప ఉత్సాహపరచే మాటలు ఎక్కడా వినిపించలేదు. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు జ్యోతి. గ్రామాలకు వెళ్లి మరుగుదొడ్ల ఆవశక్యత గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే ఎక్కడా స్పందన లేదు. ఏదో యాంత్రికంగా వింటున్నారు అంతే! అయినా సరే... తన బాధ్యత నుంచి వెనక్కి తగ్గలేదు. కాలికి బలపం కట్టుకొని ఊరూరూ తిరుగుతూ మరుగుదొడ్ల ప్రయోజనాల గురించి ఏడు నెలల పాటు ప్రచారం చేశారు. ఆ కృషి వృథా పోలేదు. గ్రామస్తుల్లో కదలిక మొదలైంది. ప్రభుత్వ పథకం కింద తమ ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి గ్రామస్తులు చొరవ చూపడం మొదలైంది. మరుగుదొడ్డి నిర్మించుకునేవారికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చేవారు జ్యోతి. తన పొదుపు మొత్తాల నుంచి డబ్బును వెచ్చించేవారు. తన వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకునేవారు. జ్యోతి కృషి వల్ల 34 గ్రామాల్లో 6000లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. అయితే ఆమె ఈ పని మొదలుపెట్టినప్పుడు కొందరు చాటు మాటుగా వెక్కిరించేవాళ్లు. ‘హాయిగా యూనివర్శిటీలో పాఠాలు చెప్పుకోకుండా ఈ పనేమిటి?’ అనే వాళ్లు. అయితే తాను చేస్తున్నది హుందాతనం లోపించిన పని అని ఎప్పుడూ అనుకోలేదు జ్యోతి. జాతికి సేవ చేసుకోవడానికి తనకు లభించిన గొప్ప అవకాశంగా భావించారు.‘‘ ప్రభుత్వం, ప్రజలు కలసి పనిచేసినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది’’ అంటున్నారు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమస్థాయికి తీసుకెళ్లిన ప్రొఫెసర్ జ్యోతిలాంబ. -
బహిర్భూమికెళితే ఫొటోలు తీస్తారా?
జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ పథకాన్ని అమలు చేయడంలో బాగా వెనకబడి పోయిన రాజస్థాన్‌లో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ముఖ్యమంత్రి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. తరతరాలుగా ఇంటి వెలుపల బహిర్భూమికి వెళ్లే అలవాటున్న రాష్ట్రంలో ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలంటే అలా బహిర్భూమికి వెళ్లే వాళ్ల ఫొటోలు తీయాలని, వారెవరే గుర్తించి అవమానపర్చాలని గతేడాది ఆమె ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో మున్సిపల్ కమిషనర్ అశోక్ జైన్ ఆధ్వర్యంలో ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు బహిర్భూమికి వెళుతున్న మహిళల ఫొటోలు తీశారు. అసభ్యంగా ఇలా ఫొటోలు తీయడం ఏమిటంటూ సీపీఎం (ఎంఎల్)కు చెందిన 52 ఏళ్ల జఫర్ ఖాన్ అడ్డుకుంటే ఆయన్ని కొట్టారు. దాంతో ఆయన మరణించడంతో ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. ఆరుబయట బహిర్భూమికి వెళ్లడం సరైన సంస్కృతి కాదని, అయితే అలాంటప్పుడు మహిళలను ఫొటోలు తీయడం ఏ సంస్కృతని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 22 శాతం ఇళ్లకు ఇంకా టాయ్లెట్లు లేనప్పుడు వారంతా ఎక్కడికెళ్లాలలని ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా 80 లక్షల టాయ్లెట్లను నిర్మించామని, అందులో రాజస్థాన్‌లోనే ఎక్కువ నిర్మించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వం స్వచ్ఛతలో దారుణంగా వెనకబడి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలోని 434 నగరాలో ‘స్వచ్చ్ సర్వేక్షన్ (సర్వే)–2017’ పేరిట నిర్వహించిన సర్వేనే తెలియజేస్తోంది. రాజస్థాన్‌లోని కిషాన్గఢ్ 419వ స్థానంలో ఉండగా, 29 నగరాలకుగాను 18 నగరాలు 300 నగరాలకన్నా వెనకబడ్డాయి. స్వచ్ఛ భారత్‌ను ముందుకు తీసుకెళ్లడం కోసం పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థుల ఇళ్లలో తప్పనిసరిగా టాయ్లెట్లు ఉండాలని, అభ్యర్థి కుటుంబ సభ్యులెవరూ బహిర్భూమికి వెళ్లరాదంటూ పంచాయతీ రాజ్ చట్టంలో వసుంధర రాజె ప్రభుత్వం గతేడాది సవరణను తీసుకొచ్చింది. ఈ సవరణ స్ఫూర్తితో కొంతమంది మహిళా సర్పంచ్‌లు ‘నో టాయ్‌లెట్, నో మ్యారేజ్’ నినాదంతో ప్రచారోద్యం చేపట్టారు. చట్ట సవరణను చిత్తశుద్ధితో అమలు చేస్తూ మహిళా సర్పంచ్‌లు చేపట్టిన ఉద్యమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా అసభ్యంగా ఫొటోలు తీయడం వల్ల దుష్ఫలితాలే ఎక్కువ ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. -
స్వచ్ఛ పందిల్ల
►నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో జాతీయస్థాయి గుర్తింపు ► సమష్టి కృషితో సక్సెస్ ► కేంద్ర బృందం సర్వే పూర్తి ► అధికారుల ప్రశంసలు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి):కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ స్వఛ్చభారత్‌మిషన్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల గ్రామ పంచాయతీ నూటికినూరు శాతం పూర్తి చేసుకుని సక్సెస్ సాధించిం ది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యంతో ఐఎస్ఎల్ నిర్మాణంలో జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దేశంలో నూరు శాతం ఐఎస్ల్ పూర్తి చేసుకున్న గ్రామాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈమేరకు ఈనెల 28న కేంద్ర బృందం గ్రామంలో ఇంటింటి సర్వే పూర్తి చేసుకుని నివేదికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆప్‌లో పొందుపరిచింది మండలంలోని మారుమూల గ్రామం పందిల్ల. ఇక్కడ 2,226 జనాభా, 1305 మంది ఓటర్లు ఉన్నారు. 564 నివాసగృహాలున్నాయి. 559 గృహాల్లో ఐఎస్ఎల్ నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలిన ఐదు వివిధ దశల్లో ఉన్నాయి. గుడిసెల్లో ఉన్నా.. ఇల్లు లేకున్నాస్వచ్ఛ పందిల్ల మరుగుదొడ్డి మాత్రం నిర్మించుకున్నారు. గ్రామస్తుల సమష్టి నిర్ణయంతోనే ఐఎస్ఎల్ సక్సెస్ అయింది. గ్రామంలో ప్రస్తుత పాలక వర్గంతోపాటు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, స్వశక్తి మహిళలు ఇందులోభాగస్వామ్యం అయ్యారు. మరుగు దొడ్ల నిర్మాణం ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం ఉండాలని గ్రామసభ తీర్మానించింది. మరుగుదొడ్డి నిర్మించుకోని ఇంటికి నల్లా, రేషన్ సరుకులు నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, స్వశక్తి మహిళలు, వాస్తు నిపుణులందరూ కలిసి ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్ల నిర్మాణాలకు ముగ్గు పోశారు. నిర్మాణానికి అవసరమైన సిమెంట్, గాజులు, ఇటుకలు, రేకులు, కుండీలు అన్నీ సమకూర్చారు. మేస్త్రీలూ ముందుకొచ్చి నిర్మాణాలను వేగవంతం చేశారు. మరికొందరు లబ్ధిదారులు స్వయంగానిర్మాణాలు చేసుకున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న లబ్ధిదారులకుప్రభుత్వం రూ.12వేల చొప్పున అందించింది. అదే స్ఫూర్తితో ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకుని గ్రామ అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం విజయవంతం అయింది. ప్రజల చైతన్యంతోనే ఇది సాధ్యమైంది. పందిల్లను ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాం. మిగిలిన నిర్మాణాలు కూడా త్వరితగతిన పూర్తిచేస్తాం. మొత్తంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. బిల్లులు రాకుంటే లబ్ధిదారులు తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. – ఎంపీడీవో పోలు సురేశ్ ప్రజల ఆరోగ్యం కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రజల ఆరోగ్యం బాగుపడింది. సీజనల్ వ్యాధులు తగ్గాయి. నిరుపేదలకు సైతం ప్రభుత్వం నిధులు సమకూర్చడంతో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. ప్రజలు కూడా ముందుకొచ్చారు. ప్రతిఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. విజయం సాధించాం. – సారయ్యగౌడ్, ఎంపీపీ వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం ఐఎస్ఎల్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత. మరుగు దొడ్డి ఉన్న ఇంట్లో మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చినట్లే. ఆరుబయట బహిర్భుమికి వెళ్తే ప్రజలు రోగాల బారిన పడుతారు. ఈవిషయం ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రజలు సహకరించారు. మండలవ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేస్తే ఆదర్శమండలంగా మార్గదర్శకులమవుతాం. – లంక సదయ్య, జెడ్పీటీసీ గుడెసె ఉన్నా మరుగుదొడ్డి మేం గుడిసెలు ఉంటున్నం. వర్షం పడితే అంతా ఉరుసుడే. గాలివస్తే గడ్డి ఎగిరిపోతది. మాకు ఇల్లులేదని, ఇల్లు కట్టియ్యాలని సార్లను అడిగినం. ఇత్తమన్నరు. అప్పటిదాక మరుగుదొడ్డి లేకుంటే ఎట్ల అన్నరు. మరుగుదొడ్డి కట్టుకోమని సార్లు, ఊరోళ్లు అందరూ చెప్పిండ్రు. కట్టుకున్నం. బిల్లుకూడా ఇచ్చిండ్రు. ఎండల పూరవతలకు పోవుడు తప్పింది. – ఇల్లందుల పుష్పలత, లబ్ధిదారు పట్నపోళ్లు నవ్వేటోళ్లు మరుగుదొడ్డి కట్టుకున్నంక తిప్పలు తప్పినై. ఎండకాలం ఆరుబయటకు బహిర్భూమికి పోవాలంటే ఇబ్బందిపడేటోళ్లం. విరోచనాలు పెడితే ఆ బాధ వర్ణణాతీతం. పట్నంల ఉన్న సుటాల్లు వస్తే నామోషయ్యేది. అందుకే మరుగుదొడ్డి కట్టుకున్నం. సుట్టాలందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నరు. ఇప్పుడు జరంత మాకు ఇలువ పెరిగింది. – దబ్బెల రాధ, లబ్ధిదారు ఆత్మగౌరవం కాపాడుకున్నారు మరుగుదొడ్లు నిర్మించుకుని మహిళలు ఆత్మగౌరవం కాపాడుకున్నారు. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆప్యాయత బాగున్నాయి. మహిళల కళ్లలో ఆనందం కనబడుతోంది. ప్రభుత్వం పల్లెల్లో పక్కాగృహాలు కట్టిస్తే మరింత సౌకర్యం ఉంటుంది. నూరుశాతం టాయిలెట్లు కట్టిన గ్రామంగా పందిల్ల గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. – గురువయ్య, కేంద్ర పరిశీలకులు -
డల్లాస్‌లో భట్టి విక్రమార్క
డల్లాస్ : టెక్సాస్‌లోని డల్లాస్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మూడు రోజులు పర్యటించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఏపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినందుకు గానూ టీఓఐఎన్సీ(తెలంగాణ ఓవర్సీస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) మల్లు బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపింది. టీఓఐఎన్సీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు పాల్గొని, రైతు వ్యతిరేక పాలసీలు, ఖమ్మం మిర్చి యార్డు సమస్య, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల కలిగే నష్టాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీఏడీ, డీఏటీఏ, ఆటా, టాంటెక్స్ సంఘాలు కూడా పాల్గొన్నాయి. డల్లాస్‌లోని గాంధీ విగ్రహానికి మల్లు భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. టీఓఐఎన్సీ కన్వీనర్ ఫణీందర్ రెడ్డి బద్దం, సురేష్ గొట్టిముక్కుల, నిఖిల్ గూడూరు, వాణీ గీట్ల, సబితా గీట్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు. -
టాయిలెట్ విప్లవం.. ఇక్కడ కాదు!
అభివృద్ధిలో చైనా చాలా దూసుకెళ్లిపోతోందని అనుకుంటాం. అక్కడంతా అత్యాధునిక నిర్మాణాలు ఉన్నాయని చెప్పుకొంటాం. కానీ, అక్కడ పందుల పెంపకం కేంద్రాలకు సమీపంలోనే బహిరంగ మల విసర్జన జరుగుతోందట. ఇలాంటి వాటిని నివారించడానికి గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ విప్లవం' ఒకటి మొదలుపెట్టి, సుమారు 52 వేల టాయిలెట్లను అప్‌గ్రేడ్ చేయడం లేదా కొత్తగా నిర్మించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తమకిచ్చిన లక్ష్యంలో 92.7 శాతాన్ని చేరుకున్నామని చైనా నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ (సీఎన్టీఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక పేరు.. 'ప్రోగ్రెస్ ఆఫ్ ద టాయిలెట్ రివల్యూషన్'. 2015 సంవత్సరంలో చైనా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ రివల్యూషన్' ప్రారంభించింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లోను, పర్యాటక ప్రాంతాల వద్ద ఉన్న టాయిలెట్ల వల్ల ఆ దేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతోందని గుర్తించారు. చైనా గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు సరైన టాయిలెట్లు లేవు. పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్లు తగినంతగా లేకపోవడం, పారిశుధ్య కార్మికులు కూడా సరిపడ సంఖ్యలో లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. 2015 నుంచి 2017 మధ్య కాలంలో 33వేల టాయిలెట్లను కొత్తగా కట్టాలని, 24 వేల టాయిలెట్లను పునర్నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న టాయిలెట్లను త్రీ స్టార్ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్తామని సీఎన్టీఏ అప్పట్లో చెప్పింది. -
80ఏళ్ల బామ్మ.. 102 ఏళ్ల అత్తకు గిఫ్ట్‌గా..!
కాన్పూర్: అత్తనే అమ్మగా భావించిన 80 ఏళ్ల కోడలు.. మాతృ దినోత్సవం రోజున 102ఏళ్ల అత్తకు బహుమతి ఇచ్చింది. బహిర్భుమికి బయటకు వెళ్లకుండా ఉండేందుకు టాయిలెట్‌ను నిర్మించి బహుమతిగా అందించింది. ఇందుకోసం తనకున్న ఆరు మేకలను అమ్మిసేంది. అత్త అనుకోకుండా ఓ రోజు జారి పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో ఆమెకు టాయిలెట్‌ను నిర్మించి ఇవ్వాలని కోడలు నిర్ణయించుకుంది. అందుకోసం జీవనోపాధి అయిన మేకలను అమ్మడానికి కూడా ఆమె వెనుకాడలేదు. -
మరుగుదొడ్లు దొంగిలించారట!
బిలాస్పూర్: వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమ మరుగుదొడ్లు కనిపించడం లేదని, కాస్త వెతికిపెట్టాలంటూ ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. వివరాల్లోకెళ్తే... బిలాస్‌పూర్‌లోని అమర్పూర్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల బేలాబాయ్ పటేల్.. తన కూతురు చందాతో కలిసి కేసు పెట్టారు. తమ మరుగుదొడ్లను ఎవరో ఎత్తుకెళ్లారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తమకు స్వచ్ఛభారత్ అభియాన్ కింద మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు డబ్బులు ఇవ్వాలంటూ బేలాబాయ్, చందాలు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు వారి దరఖాస్తును తిరస్కరించారు. కారణమేంటని ఆరా తీయగా... ఇదివరకే వారికి మరుగుదొడ్లు మంజూరయ్యాయని, నిర్మాణం కూడా పూర్తయిందని, అందుకు సంబంధించిన ఫొటోలను చూపిస్తూ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని తల్లీకూతుళ్లు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ మరుగుదొడ్లు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో అసలు మరుదొడ్లే లేకుండా అవి పోయాయంటూ ఎలా ఫిర్యాదు చేస్తారంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో గ్రామపంచాయతీ రికార్డులను, ఫొటోలను ఆధారంగా చూపారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఆ ఊరిలోని వారందరికీ మరుగుదొడ్లు మంజూరైనా ఎవరెవరివో ఫొటోలు జతచేసి, అందరికీ మరుగుదొడ్లు నిర్మించినట్లు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు రికార్డులు సృష్టించారు. పేదల కోసం మంజూరైన సొమ్మునంతా నొక్కేశారు. ఈ భాగోతమంతా తల్లీకూతుళ్ల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అసలు మరుగుదొడ్లే నిర్మించలేదంటే గ్రామ పంచాయతీ అధికారులు చిక్కుల్లో పడక తప్పదు. నిర్మించారని రికార్డులు చూపితే.. వాటిని వెతికి పెట్టక పోలీసులకు తప్పదు. తల్లీకూతుళ్లిద్దరూ అటు అధికారులను, ఇటు పోలీసులను భలే ఇరికించారు. -
రెండేళ్ల క్రితం నిర్మించుకున్న మరుగుదొడ్లకూ బిల్లులు
► ఎస్ఎంసీ మెప్మా రాష్ట్ర అధికారి డాక్టర్ సుజాత జోగిపేట: మున్సిపాలిటీల్లో రెండేళ్ల క్రితం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికీ బిల్లులు చెల్లిస్తామని ఎస్ఎంసీ మెప్మా రాష్ట్ర అధికారి డాక్టర్ సుజాత తెలిపారు. సోమవారం జోగిపేట నగర పంచాయతీ ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కళాకారుల బృందంచే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుజాత పాల్గొన్నారు. కార్యక్రమానికి చైర్పర్సన్ కవిత సురేందర్‌గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. నగర పంచాయతీ పరిధిలో దాదాపు 400 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, 10 రోజుల్లో వాటి నిర్మించుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు మరుగుదొడ్లు నిర్మిస్తున్నా.. లబ్ధిదారులు సమైఖ్య గ్రూపుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు రుణాలు తీసుకొని గుంతలు, పైపులు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం నగర పంచాయతీ చైర్పర్సన్ కవిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. మెప్మా డీఎంసీ ఇందిర మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ దేవేందర్, మెప్మా ఏఓ ఆదిలక్ష్మి, కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, సునీల్‌కుమార్, గాజుల నవీన్‌కుమార్, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన మరుగుదొడ్ల నిర్మాణాలపై నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాబృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు ఎన్.దుర్గేశ్, డి.రమేశ్, ఎస్.మల్లేశ్, ఎ.వినేశ్, బి.నవీన్, ఎ.సునీల్ తమ ఆటపాటలతో అలరించారు.