ummareddy venkateswarlu
-
భస్మాసుర హస్తంగా... ట్రంప్!
సమస్యలను పరిష్కరించగలిగే అధికారం కలిగినవారే కొత్త సమస్యలను, సవాళ్లను కొనితెస్తే ఎలా ఉంటుంది? అచ్చు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారంలా ఉండదూ! ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఎన్నికలలో మళ్లీ గెలిచి 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్ పట్ట పగ్గాలు లేనివిధంగా తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం ఆర్థికంగా అల్లకల్లోలంగా మారుతున్నది. ట్రంప్ దేశాధ్యక్షుడు అయిన వెంటనే అమెరికాకు సంబంధించి పలు రక్షణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా పౌరసత్వంపై ఆంక్షలు, విదేశాలకు అందించే సహాయ నిధులలో కోత, అక్రమ వలసదారులపై వేటు, అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగుల కుదింపునకు, దుబారా నివారణకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ‘డోజ్’ ఏర్పాటు తదితర నిర్ణయాలకు చాలావరకు సానుకూల స్పందన వచ్చింది. కానీ వివిధ దేశాలతో జరిపే ఎగుమతులు, దిగుమతులలో సమాన స్థాయిలో సుంకాలు విధిస్తామనీ, టారిఫ్‌ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవనీ తెగేసి చెప్పడంతో అంతర్జాతీయ వాణి జ్యంలో అనిశ్చితి ఏర్పడింది. ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అనే ఓ ముతక సామెతను గుర్తు తెచ్చే విధంగా ట్రంప్ ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత దేశ ప్రజల పట్ల తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని చెబుతూనే భారత్ నుంచి దిగుమ తయ్యే సరుకులపై అధిక సుంకాలు వేస్తామని తేల్చేశారు.పరస్పర సుంకాల విధానం అంటే, ఏదైనా ఒక దేశం అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎంత మొత్తాన్నైతే దిగుమతి సుంకంగా విధిస్తుందో, అమెరికా కూడా సదరు దేశ ఉత్పత్తులపై అంతే సుంకం విధిస్తుందంటూ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తులపై 25%; చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అలాగే, భారత్ వద్ద చాలా సంపద ఉందనీ, అమె రికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది కనుక... ఆ మేరకు మేమూ సిద్ధమేనంటూ ట్రంప్ సాక్షాత్తూ మోదీ సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.సుంకాలకు శ్రీకారం చుట్టింది అమెరికాయే!ప్రపంచం మొత్తం ఓ అంతర్జాతీయ గ్రామంగా మారాలనీ, స్వేచ్ఛా ప్రపంచ వాణిజ్యం వల్ల అన్ని దేశాలూ లాభపడతాయంటూ తొలుత విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 1929 నుంచి ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది అమెరికాయే. దాంతో, అంత ర్జాతీయ వాణిజ్యంలో క్రమంగా అన్ని దేశాలూ పాల్గొనడం మొదలైంది. వాణిజ్య సుంకాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు ఏర్పరచడం తప్పనిసరి అని అన్ని దేశాలూ అంగీకారానికొచ్చిన నేపథ్యంలోనే 1948లో ‘గాట్’ (జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్) ఒప్పందం మొదలైంది. దాంతో ‘అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజం’ ఆవిర్భవించింది. 1994లో 117 దేశాలు గాట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందులో భారత్ కూడా ఉంది. ‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ (ప్రపంచ వాణిజ్య సంస్థ)లోని సభ్య దేశాల నడుమ వాణిజ్య ఒప్పందాలు జరగడం; సుంకాల విధింపునకు సంబంధించి పలు దఫాలు చర్చలు జరిగి ఆయా దేశాలపై విధించిన ఆంక్షల విషయంలో సడలింపులు చోటు చేసుకొన్నాయి. భారతీయ జౌళి ఉత్పత్తుల దిగు మతులపై అప్పటివరకు ఉన్న ఆంక్షల్ని చాలా దేశాలు ఎత్తి వేశాయి. ఇదంతా చరిత్ర!ఎవరికి నష్టం?‘అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం’ అనిట్రంప్ తన నిర్ణయాలను సమర్థించుకొంటున్నారు. పైగా, దీనికోసం అమెరికా అధ్యక్షుడిగా తనకున్న అసాధారణ అధికారాలను ఉపయో గించుకొని ‘అంతర్జాతీయ ఆత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈ ఈపీఏ)ను ఉపయోగించుకొంటున్నారు. దీనివల్ల అమెరికా న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికీ, ట్రంప్ నిర్ణయాలను సమీక్షించ డానికీ అవకాశం లేకుండా పోయింది. ప్రజల స్పందన ఎలా ఉన్నా, అమెరికా దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షల డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చౌకగా లభించే శ్రామిక శక్తి దూరమైంది. ఈ విపరిమా ణాలతో అమెరికా ద్రవ్యోల్బణ రేటు ప్రస్తుతం ఉన్న 2.9 శాతం నుంచి 3.3 శాతానికి చేరుకొంటుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. అమెరికాలోని భారతీ యులు కూడా ఆ మేరకు నష్టపోతారు.ట్రంప్ దూకుడును నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? రష్యా– ఉక్రెయిన్ యుద్ధంపై బైడెన్ అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ రష్యాకు అనుకూలంగా మారిపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనివార్యంగా ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా సభ్య దేశాలుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక దశలో డాలరు చెల్లింపుల వ్యవçస్థ నుంచి వైదొలగాలని భావించినప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకొనే అవకాశం ఉంది.‘అమెరికా హితం ప్రపంచ హితం, అమెరికా శోకం ప్రపంచ విషాదం’ అనే ఓ వ్యంగ్య నానుడి ఉంది. అంటే అమెరికా ఏది చేసినా ప్రపంచానికి మంచి చేస్తుంది కనుక అన్ని దేశాలూ గొర్రెల్లా తలలు ఊపాల్సిందే. కానీ ట్రంప్ తీసుకొంటున్న సమాన టారిఫ్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని చావుదెబ్బ తీసే పరిస్థితులు కనిపిస్తున్న నేప థ్యంలో మిగతా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరం.భారత రైతాంగానికి రక్షణ అవసరంనిజానికి, అభివృద్ధిలో వెనుకబడిన దేశాలు తమ దేశీయ ఉత్పత్తులను రక్షించుకోవడానికి అధిక సుంకాలు విధించడం సహజం. ఉదాహరణకు మన దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించనట్లయితే... దేశ రైతాంగానికి పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించక వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక ట్రంప్ హెచ్చరికలకు తలొగ్గి, అమెరికా వ్యవసాయ దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను తగ్గించినట్లయితే... భారతీయ మార్కెట్లను అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తుతాయి. ఫలితంగా భారతీయ రైతాంగం మరింతగా కష్టాల ఊబిలోకి కూరుకుపోతుంది.కాగా, అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతులలో వస్త్రాలు, ఔషధాలు, ఐటీ ఆధారిత సేవలు, అల్యూమినియం, ఉక్కు, ఇంకా కొన్ని రకాల వ్యవసాయ ఉత్పతులు ప్రధానంగా ఉన్నాయి. వీటిపై అమెరికా అధిక సుంకాలు వేస్తే మన దేశంలోని పరిశ్రమలు నష్ట పోతాయి. నష్టాన్ని నివారించాలంటే కొత్త మార్కెట్లను అన్వేషించాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల... దేశ పారిశ్రామిక రంగాన్ని ‘ట్రంప్’ సవాళ్ల నుంచి రక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే. ట్రంప్ ఏకపక్షంగా పెంచిన సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)కు ఫిర్యాదు చేసింది. భారత్ కూడా అమెరికా మీద ఒత్తిడి తేవడానికీ, తన ప్రయోజనాలను కాపాడుకోవడానికీ దృఢంగా వ్యవహరించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతూ...
‘మహిళల శక్తి సామర్థ్యాలు సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడితేనే అభివృద్ధి సాధ్యం’ అనే భావనను చాలామంది ప్రముఖులు వ్యక్తీకరిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచి ఉద్దేశంతో చేసిందే కావచ్చు గానీ... మహిళల శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా సమాజానికి ఉపయోగపడటం లేదనే అర్థం స్ఫురిస్తుంది. అనాదిగా మహిళలు తమ సంపూర్ణ శక్తి సామర్థ్యాలను తమ కుటుంబానికి, తద్వారా సమాజానికి అందిస్తూనే ఉన్నారు. కాకపోతే, వారు చేసే సేవ లను కొలిచే కొలమానం ఉండదు. వారి సేవలు అనేక రూపాల్లో కారు చౌకగా దోపిడీకి గురవుతున్నాయి. ఉదాహరణకు చట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో పురుష కూలీకి లభించే వేతనం మహిళా కూలీకి దక్కదు.మహిళల శక్తి సామర్థ్యాలను అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యంలో ఉపయోగించుకోగలిగితేనే సమాజం మరింత అభివృద్ధి చెందగలుగుతుందన్నది ఓ కఠోర వాస్తవం. తదనుగుణమైన కార్యాచరణకు పూనుకోవాల్సింది ప్రభుత్వాలే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కావాలని కలవరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరడం అన్ని రంగాలలో మహిళలను వినియోగించుకోవడం మీదనే ఆధారపడి ఉంది.భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోని అనేక దేశాలలో శతాబ్దాలపాటు కొనసాగిన సాంఘిక దురాచారాలు, కట్టుబాట్లు మహిళల మనో వికాసాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని దెబ్బ తీశాయి. రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించి నప్పటికీ ఆచరణలో ఆమడ దూరంలోనే ఉన్నాయి. సామాజిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని చట్టాల్ని అమలు చేయలేక ప్రభుత్వాలు నిస్సహాయంగా ఉండి పోతున్నాయి.అయితే, సానుకూల పరిస్థితులు క్రమేపీ నెల కొంటున్నాయి. ప్రపంచీకరణ మొదలై ప్రైవేటు రంగం ఆధిపత్యం, టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో పలు రంగాల్లో మహిళలు అగ్రభాగాన రాణిస్తున్నారు. ఉదాహరణకు చంద్రయాన్–3 ప్రాజెక్టులో వంద మందికిపైగా మహిళా శాస్త్రవేత్తలు పని చేశారు. 2018లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మహిళా శాస్త్రవేత్తల పథకం మంచి ఫలితాలు అందిస్తోంది. దాదాపు 2,000 మంది మహిళా శాస్త్ర వేత్తలు చేసే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ) చేస్తున్న కృషి కారణంగా, 2000– 01లో జరిగిన పరిశోధనలలో 13 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 30 శాతం దాటింది.దాంతోపాటు, మహిళల ఆరోగ్యం, భద్రత లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ వివరాల ప్రకారం, దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఏటా 8% మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత విషయంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో భారతదేశం 5వ స్థానంలో నిలవడం సిగ్గుచేటు. మన దేశంలో పర్యటించే విదేశీ మహిళా టూరిస్టులకు ఆ యా దేశాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది దేశ పర్యాటక రంగం అభివృద్ధికి అవరోధం. రాజకీయ భాగస్వామ్యం పెరగాలి!మహిళల శక్తి సామర్థ్యాలు మిగతా రంగాలలో కంటే రాజకీయ రంగంలో అతి తక్కువ స్థాయిలో వినియోగం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాను ఎంపిక చేసిన బీజేపీ... మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకొంది. అందుకు వారిని అభినందించాల్సిందే! కానీ, ఇది ఒక పార్శ్వం మాత్రమే. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎంపికైన మహిళలు కేవలం ఐదుగురే. లోక్‌సభలో సైతం మహిళల ప్రాతినిధ్యం గరిష్ఠంగా 15 శాతం మించడం లేదు. 17వ లోక్‌సభలో మహిళా సభ్యుల శాతం 14.4 శాతం కాగా, ప్రస్తుత 18వ లోక్‌సభలో అది 13.6 శాతానికి తగ్గడం గమనార్హం!లోక్‌సభ, శాసనసభలలో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లు 1996లో హెచ్.డి.దేవెగౌడ సారరథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినపుడు ఈ రచయిత కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కలిసిరాని రాజకీయ పార్టీల వైఖరి కారణంగా ఈ బిల్లు పలు పర్యాయాలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు 27 సంవత్సరాల తర్వాత మోదీ చొరవతో 2023లో పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా రూపొందింది. అయితే జనగణన, డీలిమిటేషన్ వంటి ప్రక్రియలను దాటాలి కనుక 2029 నుంచి మాత్రమే ఈ చట్టం అమలులోకి రాగలదు. కానీ చట్టం అమలయ్యే వరకు వేచి చూడకుండా, పార్టీల పరంగా 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించుకొంటే అందుకు జవాబు దొరకదు.అనేక దేశాలలో మహిళలకు లభించిన హక్కులు, స్వేచ్ఛ, ఇతర సామాజికపరమైన భద్రతలన్నీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే లభించాయి. మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ రాజకీయాల స్వరూపం మారుతుంది. బ్రిటన్‌కు చెందిన ‘వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్స్ రీసెర్చ్’... మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉందనీ, అక్కడి ప్రజలు సైతం తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నారనీ వెల్లడించింది. ‘ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం’ అంటూ మాటల్లో మాత్రమే మహిళలను అందలం ఎక్కించడం కాకుండా, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వారికి సముచిత ప్రాతినిధ్యం అందించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పథంలో వడిగా ముందుకు సాగుతుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
అన్నదొకటి... అయ్యిందొకటి!
కాలక్రమంలో వాడుకలో ఉన్న కొన్ని పదాలు అర్థం కోల్పోతాయని, పైగా వాటికి పూర్తి విరుద్ధమైన అర్థాలు పుట్టుకొస్తాయని ప్రముఖ రచయిత జార్జ్ ఆర్వెల్ అంటారు. 8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్– జీఎస్టీ)గా చెప్ప బడిన ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెడుతోంది.జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణ నీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వస్తు సేవల వినియోగం పెరుగుతుంది. దాంతో సహజంగానే పన్ను వసూళ్ల మొత్తం పెరుగుతుంది. ఇపుడు జరుగుతున్నది అదే! ఒక దశాబ్ద కాలంలో దేశస్థూల ఉత్పత్తి గణనీ యంగా పెరిగింది. ప్రజల తలసరి ఆదాయమూ హెచ్చింది. కనుక కేవలం జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయని, కేంద్రం చెబుతున్నట్లు జీఎస్టీ వల్ల దేశంలో ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందని చెప్పడం అర్ధసత్యమే. దేశంలో 8 ఏళ్ళుగా అమలవుతున్న జీఎస్టీ వల్ల అనేక సమ స్యలు వస్తున్నాయని పలు వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. సరళతరమైన పన్నుగా జీఎస్టీని చెప్పుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆ పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుద రకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతి పెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడానికి మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 50కి పైగా సమావేశాలు జరిపినప్పటికీ పలు అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చిక్కుముళ్లుజీఎస్టీ అమలులో అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఇందులో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. జీఎస్టీలో 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1400 పైబడిన వస్తువులు; 500 రకాల సేవలను ఈ 4 శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారుగానీ అందులో హేతు బద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. ఉదాహరణకు జీవిత బీమా (లైఫ్ ఇన్సూ రెన్స్), ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సహచర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై 18% జీఎస్టీ వేయడం వల్ల... వారందరూ జీవితం, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపుదారులకు, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య వివాదాలు తలెత్తి చివరకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు కేంద్రం అందించిన ఆర్థిక సహకారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. ఈ సెస్సును ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది.జీఎస్టీ పరిధిని క్రమంగా విస్తరిస్తూ పోతున్నారు. శ్లాబ్‌లను మారుస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపైన, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపైన కనిష్ఠంగా 5% జీఎస్టీని మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తు న్నారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తుల పైన, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల పైన 18% జీఎస్టీ విధించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ మండలి సమావేశంలో... పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పాప్ కార్న్‌పై 3 రకాల జీఎస్టీని విధించడాన్ని ప్రజలు తప్పుబట్టారు. ఎంఎస్ఎంఈలకు శరాఘాతంజీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న ప్రధాన రంగాలలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీరంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్ఎంఈ రంగం జీఎస్టీ కారణంగా కుదేలైందన్నది ఓ చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై అనేక ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతి మంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ... మరో వైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి జీఎస్టీ అప్పీ లేట్ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? ఇక, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆ యా ఉత్ప త్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది.ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవ కాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది. రాష్ట్రాల వినతులకు జీఎస్టీ కౌన్సిల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న వాదన ఉంది. జీఎస్టీకి సంబంధించి ఏ యే రాష్ట్రాలు ఎన్నెన్ని అభ్యర్థనలు అంది స్తోంది? అందులో వేటికి ఆమోదం తెలుపుతున్నారు? ఎన్నింటిని బుట్టదాఖలా చేస్తున్నారన్న సమాచారాన్ని వెల్లడించడం లేదు. నిజానికి, తగిన సన్నద్ధత లేకుండా జీఎస్టీని అమలులోకి తేవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. జీఎస్టీ అమలు లోకి వచ్చి 8 ఏళ్లు గడిచాయి. జీఎస్టీ మండలి 55 పర్యాయాలు సమావేశమైంది. అయినా అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసి పోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొంద రగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుక తోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరి కొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. ఈ రెండూ నిజమే కావొచ్చు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం. రచయిత జార్జ్ ఆర్వెల్ చెప్పినట్లు కొన్ని పదాలు అర్థం కోల్పోవడమే కాక వాటికి పూర్తి భిన్నమైన అర్థాలు పుట్టుకొస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ‘సంస్కరణ’ అనే పదం. ప్రపంచీకరణ తర్వాత ఈ పదా నికి అర్థం మారిపోయింది. సంస్కరణ అంటే ఆర్థిక భారంగా ప్రజలు భావిస్తు న్నారు. జీఎస్టీ అంశంలో కూడా సరళతరమైన పన్ను అనే భావన పోయి జీఎస్టీ అంటేనే మోయలేని భారం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.» జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీ యంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది.» పుట్టుకతోనే లోపాలున్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివ ర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం.» చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్నువల్ల... దాదాపు 20 కోట్ల మంది ఆధా రపడ్డ సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది.- వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి- డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
పడిపోతున్న వర్సిటీల ప్రమాణాలు
రాష్ట్రాల జాబితాలోని అంశాలు కొన్నింటిని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో మరి కొన్నింటిని క్రమంగా దొడ్డిదారిన తన ఖాతా ల్లోకి మళ్లించుకొంటూ ఇప్పటికే కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా రూపొందించిన ముసా యిదాను బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది, యూనివర్సిటీలపై పూర్తి స్థాయి పట్టుసాధించడానికి కేంద్రం అడుగులు వేయడంతో మరో కొత్త వివాదం మొగ్గ తొడిగింది.యూజీసీ ప్రతిపాదించిన సంస్కరణలు అమలులోకి వస్తే...ఎంతో కీలకమైన వైస్ ఛాన్స్లర్ల నియామకాల్లో రాష్ట్రాలకున్న హక్కు లుప్తమైపోతుంది. ఇప్పటివరకు ఉపకులపతులుగా అర్హులైన వారిని నియమించడానికి సెర్చ్ కమిటీ వేయడం ఆనవాయితీగా ఉంది. సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి ఒకరు ఉంటారు. సెర్చ్ కమిటీ ఎంతో కసరత్తు జరిపి 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే... దానిని పరిశీలించి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపుతుంది. కానీ, కొత్తగా వచ్చే సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయానికి కత్తిరింపు వేశారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించే సంస్కరణలు చాలానే యూజీసీ ప్రతిపాదించింది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా అన్న అంశం పక్కన పెడితే... అసలు యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి? నాణ్యతా ప్రమాణాలు పెంచే సంస్కరణలు కాకుండా పెత్తనం కోసం కేంద్రం వెంపర్లాడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.సంస్కరణలు ఏ రంగంలో చేపట్టాలి?మన దేశంలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళా శాలల విద్యా ప్రగతి ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయన్నది నిర్వివాదాంశం. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి బంగారు బాటలు వేయ డంలో ఉన్నత విద్య, పరిశోధన కీలకమైనవి. ఆరోగ్యం, ఆహారం, ఉపాధి తదితర రంగాలలో ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కారం అందించే పరిశోధనలు పురుడుపోసుకొనేది యూనివర్సిటీ ప్రాంగణాలలోనే. వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది. ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన యూనివర్సిటీలు పలు రుగ్మతలతో కునారి ల్లుతున్నాయి. నిధుల లేమి, రాజకీయ జోక్యం, బోధనా సిబ్బంది కొరత, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో యూనివర్సిటీల ప్రమాణాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ‘క్యూఎస్’ అనే ప్రఖ్యాత సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లోని 1,740 యూనివర్సిటీలను అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వగా అందులో భారత్‌కు చెందిన 78 యూనివర్సి టీలు మాత్రమే ఆ ప్రమాణాలు అందుకోగలిగాయి.ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశనం చేసి, వేల సంఖ్యలో గొప్ప విద్యావేత్తలను అందించిన నలంద, తక్షశిల, విశ్వభారతి, శాంతిని కేతన్ వంటి అత్యున్నత విద్యా పీఠాలు గలిగిన భారతదేశంలో నేడు అనేక యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు అడుగంటాయి. ఆవిష్కరణలకు మాతృమూర్తి వంటి విశ్వవిద్యాలయాలు విజ్ఞాన వెలుగులు ప్రసరించాలంటే అందుకు అనుగుణంగా మౌలిక సదు పాయాలు, నిష్ణాతులైన బోధనా సిబ్బంది ఉండాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా సమర్థత, అంకితభావం కలిగిన వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. విశ్వగురువు ఎలా అవుతాం?2047 నాటికి మన దేశం ‘విశ్వగురువు’గా అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంగా పెట్టుకొన్నారు. ఈ లక్ష్యం గొప్పదే. అందుకు తగిన కార్యాచరణ అన్ని రంగాలలో కనపడాలిగా! ప్రత్యేకించి ఉన్నత విద్యారంగంలో, పరిశోధనా రంగంలో అభివృద్ధి పథంవైపు అడుగులు పడాలి. అందుకు భిన్నంగా ఈ రంగంలో అడు గులు తడబడుతున్నాయి. అందుకు ఉదాహరణ దేశం నుంచి సుమారు 13 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం విదే శాల బాట పట్టడం. నాణ్యమైన ఉన్నత విద్యకు చిరునామాగా నేటికీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలే నిలుస్తు న్నాయి. వైద్య విద్య కోసం ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, అజర్జైబాన్, ఉక్రెయిన్ తదితర దేశాలకు భారతీయ విద్యార్థులు వేల సంఖ్యలో ‘క్యూ’ కడుతూనే ఉన్నారు. జబ్బు ఒకటయితే, మందు మరొకటి వేసినట్లుగా... దేశంలోని విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా బలోపేతం చేసే చర్యలను తీసు కోకుండా, దేశంలో విదేశీ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేయడం, యూనివర్సిటీలపై రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం విద్యావేత్తలను కలవరపరుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.దేశంలో విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని ఏర్ప రిస్తే... ఎటువంటి విదేశీ యూనివర్సిటీలు ఇక్కడకు వస్తాయి? ప్రపంచంలో పేరు బడిన తొలి 50 యూనివర్సిటీలు భారత్ కొస్తాయా? అని ప్రశ్నించుకొంటే స్పష్టమైన సమాధానం దొరకదు. పైగా ఇక్క డకు వచ్చే విదేశీ యూనివర్సిటీలపై తమ నియంత్రణ ఏదీ ఉండదనీ, కానీ పారదర్శకతతో ఉండాలని మాత్రమే కోరతామనీ యూజీసీ స్పష్టం చేసింది. అంటే... ఫీజుల వసూళ్ల విషయంలో విదేశీ వర్సిటీ లకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ప్రదానం చేసే డిగ్రీలకు, విదేశాలలో ఇచ్చే పట్టాలకు సమానమైన విలువ ఉంటాయన్నది ఒక్కటే విద్యార్థులను ఆకర్షిస్తోంది. విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో ముసాయిదా పత్రంలో నిర్దేశించకపోవడంతో అవి మన బ్యాంకుల నుంచే రుణాలు పొంది, వాటితోనే మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసి, లాభాల్ని మాత్రం తమ దేశానికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా విదేశీ యూనివర్సీటీలలో సంపన్నుల పిల్లలు మాత్రమే చదువు‘కొనే’ అవకాశం ఉన్నందువల్ల... దేశంలో ‘సంపన్న విద్యార్థి శ్రేణి’ మరొకటి నూతనంగా తయారవుతుంది.బోధన–పరిశోధనఒకప్పుడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో జరిపిన పరి శోధనలకు అంతర్జాతీయంగా పేటెంట్లు లభించాయి. ఒక అంచనా ప్రకారం... దేశంలోని మన వర్సిటీలు ఏటా 24,000 డాక్టరేట్ పట్టాల్ని ప్రదానం చేస్తున్నాయి. అంటే ఏటా వేల సంఖ్యలో పరిశో ధనా పత్రాలు వెలువడుతున్నాయి. కానీ... వాటిని దేశాభివృద్ధి కోసం ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నారనేదే ప్రశ్నార్థకం. అసలు రీసెర్చ్ ఈ అంశం మీద జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా... స్వదేశీ విశ్వవిద్యాలయాలకు రెండు కళ్లుగా భావించే బోధన, పరిశోధనలను పటిష్ఠం చేయాలి. విదేశీ విశ్వ విద్యాలయాల మోజులో స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలి. విశ్వ విద్యాలయాలపై రాష్ట్రాల హక్కుల్ని కొనసాగించాలి. ఉపకులపతుల నియామకం పూర్తిగా రాజకీయమై పోయింది. రాజకీయాలకు అతీతంగా విశ్వ విద్యాలయాలు పని చేయగలిగే సంస్కరణలు తేవాలి తప్ప కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా కేంద్రం వ్యవహరించడం సమ్మతం కాదు.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
‘కనీస’ చట్టబద్ధతే సంజీవని!
కాలచక్రంలో నెలలు, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. కొన్ని రంగాలు రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతున్నాయి. కానీ, మార్పు లేనిదల్లా వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల జీవితాలే. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు దాటిపోయినా, ఇంకా రైతులు తమ గోడు చెప్పు కోవడానికి రోడ్లపైకి వస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. ఇంతా చేసి రైతులు కోరుతున్నదేమీ అన్యాయమైన డిమాండ్లు కావు. ప్రభుత్వాలు నెరవేర్చగల సహేతుక డిమాండ్లే! ఆత్మగౌరవంతో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేంత వరకూ రైతులకు ఆత్మగౌరవం లభించదు. రైతాంగం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి కనీస మద్దతు ధరలు లభించాల్సిందే. వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందే.2024 ఏడాది ప్రారంభంలో పంజాబ్ రైతులు మరో పోరాటానికి ఉద్యుక్తుల య్యారు. ఏడాది గడిచినా ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమా నుష వైఖరి బహిర్గతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను తేవాలని ప్రతిపాదించడం, దానిపై అన్ని రాష్ట్రాల రైతాంగం ఢిల్లీలో చలికి, ఎండలకు, వానలకు తట్టుకొని చేసిన సుదీర్ఘ ఉద్యమం దరిమిలా కేంద్రం దిగొచ్చింది, ప్రతిపాదిత బిల్లుల్ని ఉప సంహరించుకుంది. అయితే, ఆ సందర్భంగా రైతులకు చేసిన వాగ్దానాలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు. ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ రైతాంగం చేసిన డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ లేదు. దాంతో 2024 ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హరి యాణా సరిహద్దుల్లోని శంభూ అంబాలా, అఖేరిజింద్ కూడళ్ల వద్ద బైఠాయించి ఉద్యమం నడుపుతున్నారు. రైతుల డిమాండ్ల పరిష్కా రానికి సహేతుక ముగింపు లభించాలన్న ఉద్దేశంతో రైతు నాయకుడు జగ్జీత్సింగ్ డల్లేవాల్ (నవంబర్ 26న) ఆమరణ దీక్ష మొదలు పెట్టాక, ఈ పోరాటానికి దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. నిజానికి ఓ పోరాటాన్ని విరమింపజేసే సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని కేంద్రం నెరవేర్చకపోవడం, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్‌తో రైతాంగం మరో పోరాటానికి దిగడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు.కనీస మద్దతు ధర ప్రాథమిక హక్కు లాంటిదే!మూడేళ్ల క్రితం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాల్ని కేంద్రం మరో రూపంలో తీసుకురాబోతోందన్న సంకేతాలతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 సంవత్సరాలలో పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక, సాగు గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో చిక్కుకొని గత్యంతరం లేక, తమ జీవితం పట్ల తమకే విరక్తి కలిగి ఇప్పటికి 7 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నా ప్రాణం పోతే పోతుంది. కానీ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల జాబితాలోకి మరికొన్ని పేర్లు చేరకూడదు’’ అన్న 70 ఏళ్ల డల్లేవాల్ మాటలు వ్యవసాయరంగ వాస్తవ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. దేశానికి ఆహార భద్రత అందించే రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకొనే దుఃస్థితి ఎందుకు ఉన్నదో పాలకులు ఆలోచించడం లేదు. గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు తాజాగా తెస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్కరణలు రైతుల పాలిట ఉరి తాళ్లుగా మారనున్నాయి. పంట ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (అగ్రి కల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లను రద్దు చేసి కాంట్రాక్టు సాగుకు పట్టం కట్టాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ప్రతిపాదనకు రైతాంగం ససేమిరా ఇష్టపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకురాదలిచిన సంస్కరణలకు సంబంధించి 2024లో విడుదల చేసిన ముసాయిదా పత్రంలో పేర్కొన్న అంశాలు దాదాపుగా అంతకుముందు విరమించుకొన్న వ్యవసాయ బిల్లుల్లోని అంశాలకు నకలుగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. అవి: 1. జాతీయ వ్యవసాయ మార్కెట్లను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం; 2. ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకు రావటం; 3. ఫీజు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయటం;4. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తించడం; 5. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు... ఇలా పలు ప్రతిపా దనలను ముసాయిదా బిల్లులో చేర్చి, వాటిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు రైతాంగ ప్రతినిధులతో చర్చించడం, వారిని భాగస్వాముల్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రం ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. తమకు అంగీకార యోగ్యం కాని నిర్ణయాలు చేయడం కోసమే కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఆశించడం రాజ్యాంగంలో ప్రజలకు దఖలు పడిన ప్రాథమిక హక్కు లాంటిదేనని డల్లేవాల్ పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం కల్పించింది. దేశవ్యాప్త డిమాండ్ కూడా అదే!తాము పండించే పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకొనే హక్కు ఎలాగూ రైతాంగానికి లేదు. కనీసం పండించే పంటకు ఎంత మొత్తం కనీస మద్దతు ధర (ఎంఎస్íపీ)గా ఇస్తారో ముందుగా తెలుసుకోవాలను కోవడం అత్యాశేమీ కాదు కదా? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటే పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటు లెక్క గట్టి ధరల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రానికి తగిన సూచనలు చేయాలని అభ్యర్థించారు. అయితే, ప్రజల జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని... కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించలేమనీ, అలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయనీ సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించిందన్నది నిర్వివాదాంశం.నిజానికి ఈ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరించాలని ఆశించడం కూడా సముచితం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్)లో చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ బ్యూరోక్రాట్లే. రైతాంగ ప్రతినిధులు ఉండరు. పేరుకు ‘సీఏసీపీ’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కనిపిస్తుంది గానీ, దానిపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఏసీపీ నిర్ణయించే కనీస మద్దతు ధరల విధానం ఆమోదయోగ్యం కాదని దశాబ్దాలుగా రైతాంగ సంస్థలు మొత్తుకొంటున్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే శిరోధార్యం అని ఎందరు చెప్పినా దానికి మొగ్గుచూపడం లేదు. పైగా, తాము అనుసరించే విధానాన్నే స్వామినాథన్ కమిషన్ సూచించిందనీ, ఆ ప్రకారం సాగు వ్యయంపై 50 శాతం జోడించి ఇస్తున్నా మనీ దాదాపు ఐదారేళ్ల నుంచి కేంద్రం బుకాయిస్తూనే ఉంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడ్డం జాతీయ రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిన నేపథ్యంలోనే రైతాంగ సమస్యలు నేటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్న దాతలతో తక్షణం చర్చలు జరపాలి (ఎట్టకేలకు ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానించింది). ‘మార్కెటింగ్ ఫ్రేవ్ువర్క్’ పేరుతో తెచ్చిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరు తున్నట్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం ఒక్కటే దేశ రైతాంగానికి సంజీవనిగా పని చేయగలుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -
పాతాళాన్ని తాకిన పార్లమెంట్ ప్రతిష్ఠ
మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను చర్చించి సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు దఖలు పర్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడం కోసమే ప్రతి యేటా భారత పార్లమెంట్ మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించడం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో దేశ ప్రజలకు బాధ్యత వహించడమేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.ఇంత ఘనమైన రాజ్యాంగ బాధ్యత ఉన్నది కనుకనే భారత పార్లమెంట్‌ను దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించే కార్య శాలగా పేర్కొంటారు. కానీ, గత రెండు దశాబ్దాల పైబడి భారత పార్లమెంట్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో గతంలో కూడా అప్పుడప్పుడు సభ్యులు నిగ్రహం కోల్పోయి అరుపులు, కేకలు పెట్టడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, తాజాగా డిసెంబర్ 20తో ముగిసిన 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలలో అన్ని హద్దులు దాటి సభ్యులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తోపులాట లకు దిగిన హీనస్థితికి లోక్‌సభ వేదిక కావడం దిగజారిన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.తగ్గిపోయిన ప్రశ్నోత్తరాల సమయందశాబ్ద కాలంగా పార్లమెంట్ సమావేశాల పని గంటలు తగ్గి పోతున్నాయి. 16వ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం నిర్దేశిత వ్యవధిలో 77 శాతం, అదేవిధంగా రాజ్యసభలో 44 శాతం మాత్రమే నమోదైంది. కారణం– పార్లమెంట్ ఉభయ సభల్లో అవాంతరాలు ఏర్పడి సభలు తరచుగా వాయిదా పడటమే. పార్లమెంట్ బిజినెస్‌లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పనిచేసే వెసులుబాటు ఉంది గానీ, ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే... ఆ సమయాన్ని పొడిగించరు. వాటికి కేవలం రాతపూర్వక జవాబుల్ని మాత్రమే సభ్యులకు పంపుతారు. సామాన్యంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొత్తగా ఎన్నికయిన సభ్యులు ఎక్కువగా సద్వినియోగ పర్చుకొంటారు. సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల సమయం రద్ద యితే... సభ్యులు తమ విలువైన అవకాశాన్ని కోల్పోవడమేగాక, వారు ఆశించి ఎదురు చూస్తున్న అంశాలపై సమాధానం పొంద లేకపోతారు.పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగకపోవడానికి ప్రతి సారీ ఒక్కో విధమైన కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలలో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు గట్టిగా పట్టుబట్టి ఉభయ సభల కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. ఈ సమావేశాలలోనే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్పై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొని పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ఆయన అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లడంతో... అదికాస్తా అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, ముష్టిఘాతాలకు దారితీసింది. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గలిగిన అధికార ఎన్డీఏ సైతం పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందంటూ ఆరోపణలు చేయడంతో ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కారణాలు ఏవైనా, ఈ శీతాకాల సమావేశాలలో లోక్‌సభ నిర్ణీత వ్యవధిలో 54.5 శాతం, అదేవిధంగా రాజ్యసభ 40 శాతం మాత్రమే పనిచేశాయి. శీతాకాల సమావేశాలు అతి తక్కువ వ్యవధిలో పని చేయడం ఇదే ప్రథమం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి.ఆమోదం పొందిన బిల్లు ఒక్కటే!నిజానికి, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు విలువైన పెద్ద ఎజెండానే సిద్ధం చేశారు. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెట్టిఅందులో మెజారిటీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని అధికార కూటమి భావించింది. కానీ, విమానయాన రంగానికి సంబంధించిన ‘భారతీయ వాయుయాన్ విధేయక్, 2024’ బిల్లు ఒక్కటే ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. ఆర్థిక రంగానికి సంబంధించి మొదటి విడత సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా ఆమోదం పొందవలసి ఉన్నాయి. అయితే కొన్ని బిల్లులు లోక్‌సభలో, మరి కొన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. దేశ ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి రావా ల్సిన కీలక అంశాలపై కూడా అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రాలేని అవమానకర దు:స్థితి నెలకొంది.చట్టసభలు క్రియాశీలంగా లేకపోవడం అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ‘చర్చల ద్వారా పాలన సాగించడమే ప్రజా స్వామ్యం’ అని పలువురు రాజనీతిజ్ఞులు చెప్పిన మాట మన దేశంలో క్రమేపి నవ్వులాటగా మారుతోంది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి పురుడుపోసిన ఇంగ్లాండ్ పార్లమెంట్ భారత్‌తో సహా అనేక దేశాలకు ఆదర్శప్రాయం. వెస్ట్‌మినిస్టర్ తరహా పాలనను అనుసరిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప... నిజానికి మన పార్ల మెంటరీ పద్ధతులు, విధానాలు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ప్రతిపక్షాల చర్చలకు ప్రత్యేకంగా 20 రోజులు కేటాయించే అవకాశాన్ని వారి రాజ్యాంగం కల్పించింది. ప్రధాన ప్రతిపక్షానికి 17 రోజులు, ఇతర విపక్ష పార్టీలకు 3 రోజులు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా, 40 మంది సభ్యుల మద్దతు కూడగడితే వారు కోరిన అంశాన్ని అనివార్యంగా సభ చర్చకు స్వీకరించాల్సిందే. మన పార్లమెంట్లో అటువంటి నిబంధనగానీ, ఆనవాయితీగానీ లేవు. నిజానికి మన రాజ్యాంగ కర్తలు భవిష్యత్తులో చట్టసభలలో విపరీత పరిణా మాలు చోటుచేసుకొంటాయని ఆనాడు ఊహించలేదు. విపక్షాలు నిరసన తెలపడం, వాకౌట్ చేయడం వారి హక్కుగా, ప్రజాస్వామ్యంలో ఓ భాగంగానే భావించారు గానీ... రోజుల తరబడి చట్టసభలు వాయిదా పడతాయనీ, బిల్లులు చర్చకు నోచుకోకుండా గిలెటిన్ అవుతాయనిగానీ వారు అంచనా వేయలేకపోయారు.కారణాలు ఏవైనా పార్లమెంట్ ఔన్నత్యం, ప్రతిష్ఠ నానాటికి తగ్గడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాప్రతినిధులు సభల నుంచి వాకౌట్ చేసి క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం సహించరానిది. చర్చకు నోచుకోకుండా బిల్లులు చట్టాలైతే అవి ప్రజలకు గుదిబండలుగా మారతాయి. అందువల్ల పార్లమెంట్ క్రియాశీలకంగా మారాలి. చట్టసభలు క్రియాశీలంగా పని చేయ డానికి, సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి అవసరమైన సంస్కరణలు తక్షణం చేపట్టాలి. అందుకు అన్ని పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలి. లా కమిషన్‌కు కూడా బాధ్యత అప్పగించాలి. ఆ విధంగా పాతాళానికి పడిపోయిన పార్లమెంట్ ప్రతిష్ఠను పున రుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. చట్ట సభలు అలంకార ప్రాయంగా మారిపోవడాన్ని ప్రజలు ఇకపై ఎంత మాత్రం సహించరని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
మృత్యుకుహరంగా మహానగరం
‘కాలుష్యం రేపటి తరాలకు శాపం’ అన్నది ఒకప్పటి మాట. నేటి పరిణామాలు గమనిస్తే రేపు కాదు, నేడే ప్రాణాంతకంగా మారింది. అందుకు ఉదాహ రణ దేశ రాజధాని న్యూఢిల్లీ. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన, ఆహ్లాదకర నగరాలలో ఒకటి. దశాబ్ద కాలం పైబడి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా కాలుష్య కాసారంలో పడి మానవ మనుగడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిజానికి దేశంలోని అన్ని పెద్ద నగరాలూ ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. వాయుకాలుష్యాన్ని పర్యావరణ సమస్యగానే పరిగణించకుండా, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంగా చూసి, దాన్నుంచి బయటపడిన కొన్ని దేశాల అనుభవాలు మనకు ఆచరణీయం. కావాల్సిందల్లా తక్షణ నివారణ చర్యల్ని అమలు చేయగలిగే చిత్తశుద్ధి.ఎక్కడైనా గాలి నాణ్యత స్థాయి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) 50 నుంచి 100 వరకు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉన్నట్టు! దేశంలోని అనేక పట్టణాలు, నగరాలలో ఇది 150 దాటుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులలో ఏక్యూఐ ప్రమాద ఘంటిక లను మోగిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుత ఏక్యూఐ సగుటన 130గా నమోదవుతోంది. ఊపిరాడేనా?ఢిల్లీలో నవంబర్ రెండో వారం నాటికి ఏక్యూఐ 467 పాయింట్లకు చేరింది. అక్కడి జహంగీర్‌పూర్‌లో అయితే ఏకంగా 567 పాయింట్లు నమోదైంది. ఊపిరాడని కాలుష్య తీవ్రతకు తోడుగా శీతకాలంలో వచ్చే పొగమంచు ఢిల్లీ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్య గోచరత (విజిబిలిటీ) తగ్గిపోవడంతో, పలు విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే, ఢిల్లీ నుంచే బయలుదేరే రైళ్ల రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని స్కూళ్ల ప్రైమరీ క్లాసుల్ని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. రోడ్ల మీద పెట్రోల్, డీజిల్ వాహనాల రాకపోకలను నిలిపివేసి, కేవలం విద్యుత్, సీఎన్‌జీలతో నడిచే వాహనాలనే అనుమ తిస్తున్నారు. ప్రజారవాణా తప్ప సొంత వాహనాలలో బయటకు వెళ్లే అవకాశం లేని దయనీయ దుఃస్థితి ఏర్పడింది. ఒక్క సమస్య పలు ఇతర సమస్యలకు పుట్లిల్లు అవుతుందని ఓ సామెత. దశాబ్దకాలంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను వేధిస్తూ వస్తున్న వాయు, నీటి కాలుష్యాలు అనేక అనర్థాలకు దారితీశాయి. వాటిని పరిష్కరించక పోవడం వల్లనే నేడు కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, భవితవ్యం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్న ప్రజలలో చాలామందికి శ్వాసకోశ సమస్యలు మొదలుకొని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. నిజానికి, ఢిల్లీ వాయుకాలుష్యంపై అనేక సందర్భాలలో సర్వోన్నత న్యాయస్ధానం జోక్యం చేసుకోవడంతోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలనైనా చేపట్టాయి. ఈ అరకొర చర్యలు ప్రజానీకాన్ని రక్షించగలవా?విదేశాల అనుభవాలుప్రపంచంలోని అనేక నగరాలు ఏదో ఒక సమయంలో కాలుష్యం బారిన పడినవే. పరిశ్రమల ఏర్పాటు, భవన నిర్మాణాలు ముమ్మరం కావడం, పట్టణీకరణ పెరగడం తదితర అంశాల వల్ల వాయు, నీటి కాలుష్యాలు అన్నిచోట్లా తీవ్రస్థాయికి చేరాయి. 1952లో లండన్ నగరాన్ని కాలుష్య భూతం కాటేసింది. ‘గ్రేట్ స్మాగ్’ అని పిలిచే ఆ ఉత్పా తానికి 1,200 మంది బలయ్యారు. దాంతో, 1956లో బ్రిటిష్ ప్రభుత్వం ‘క్లీన్ ఎయిర్ యాక్ట్ 1956’ తెచ్చి కఠినంగా అమలు చేసింది. లండన్ నగరంలోని అన్ని పరిశ్రమలనూ సుదూర ప్రాంతా లకు తరలించింది. నగరంలోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరిచి పచ్చదనం పెంచింది. అలాగే, 2008లో ‘బీజింగ్ ఒలింపిక్స్’ నిర్వహించిన చైనా ప్రభు త్వానికి కూడా వాయుకాలుష్యం సవాలు విసిరింది. భారీ నిర్మాణాలు చేపట్టిన ఆ సందర్భంలో, గాలి నాణ్యత తగ్గకుండా చైనా ప్రభుత్వం అన్ని రకాల పరిశ్రమలనూ దూర ప్రాంతాలకు తరలించింది. వాహ నాలను క్రమబద్ధీకరించడమేకాక, ప్రజా రవాణాను ఉపయోగించుకొనేలా ప్రజలను సమాయత్తం చేసింది. బీజింగ్‌లో వాయు కాలుష్యం తగ్గాక, అక్కడి ప్రజల ఆయుర్దాయం సగటున నాలుగేళ్లు పెరిగిందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన అమెరికా, మెక్సికో, జపాన్‌లు ఒకప్పుడు వాయుకాలుష్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వేగంగా ఆ సమస్య నుండి బయటపడ్డాయి. ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడిగా ఆ సమస్యను ఎదుర్కొన్న తీరు అనన్య సామాన్యం. వాయు కాలుష్యాన్ని ఆ ప్రభుత్వాలు కేవలం పర్యావరణ సమస్యగానే పరిగ ణించలేదు, ప్రజారోగ్యానికి సబంధించిన అంశంగా చూశాయి. ప్రభు త్వంలోని అన్ని శాఖలు సమీకృతంగా సమస్యను ఎదుర్కోవడానికి కృషి చేశాయి. అటువంటి రోడ్ మ్యాప్ మన దేశంలో లేకపోవడంతోనే ‘ఇంతింతై వటుడింతౖయె...’ అన్నట్లు కాలుష్య సమస్య పెనుభూతంగా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాలు వెలజల్లే కార్బన్ డయాక్సైడ్, భవన నిర్మాణాల కారణంగా గాలిలో కలిసే ధూళి;ఎండిన చెట్లు, చెత్తా, చెదారాలన్నింటినీ తగల బెట్టడం ద్వారా వచ్చే పొగ... ఇవన్నీ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఢిల్లీకి పక్కనే ఉన్న యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదలడంతో ఆ ప్రాంతం పూర్తిగా కలుషితమైంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రతి వ్యవసాయ సీజన్ ముగి శాక పంట వ్యర్థాలను కాల్చడంతో... దట్టమైన పొగలు కమ్మేస్తు న్నాయి. వీటికితోడు దీపావళి, కొన్ని వివాహ వేడుకల సందర్భంగా వినోదం కోసం టపాసుల్ని పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.ప్రభుత్వాల ముందున్న కర్తవ్యంఢిల్లీని పీడిస్తున్న వాయుకాలుష్యం చాలావరకు స్వయం కృతమే. ఢిల్లీ పరిధిలో 9,000 హోటళ్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున బొగ్గు ఉపయో గిస్తున్నట్లు తేలింది. తందూరీ వంటకాలు చేసే హోటళ్లు బొగ్గును వాడుతున్నాయి. వంటకు గ్యాస్ బదులు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వాడుతున్నవారి సంఖ్య ఢిల్లీలో దాదాపు 20 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రోజుకు సగటున 500 టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఇళ్ల నుంచి సేకరించే వ్యర్థాల)ను కాలు స్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు, నిర్మాణ స్థలాల్ని పూర్తిగా కవర్ చేయడం; సిమెంట్, ఫ్లయ్ యాష్వంటి నిర్మాణరంగ మెటీరియల్స్‌ను కప్పి ఉంచడం తప్పనిసరిగా చేయాల్సి ఉన్నప్పటికీ... ఆ నిబంధనల్ని చాలావరకు పాటించడం లేదు. చమురు శుద్ధి ప్లాంట్ల నుంచి ప్రాణాంతకమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వెలువడుతుంటాయి. వీటిని నిరోధించే టెక్నాలజీని అమెరికా, చైనా ఉపయోగిస్తుండగా మనకు అందుబాటులోకి రాలేదు. కాలుష్యాన్ని ఎక్కువ వెదజల్లే పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను అభివృద్ధి చెందిన దేశాలు 30 శాతానికి తగ్గించాయి. అధునాతన ఫిల్టర్లను ఉపయోగిస్తూ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాయి. చాలా దేశాలలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా వాటిని బయోగ్యాస్ ఉత్పత్తికి, పశువుల దాణాకు వాడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నింపేటప్పుడూ(అన్లోడింగ్), వాహనాల్లో ఇంధనం పోసేటప్పుడూ గాలిలో ప్రమాదకర ఆర్గానిక్ వ్యర్థాలు కలుస్తాయి. చాలా దేశాలలో ఇంధనం లోడింగ్, అన్లోడింగ్ సమ యాలలో ‘వేపర్ రికవరీ సిస్టవ్‌ు’ టెక్నాలజీని ఉపయోగిస్తూ దీన్ని నివారించగలుగుతున్నారు.ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్య భూతం మాటేసిన మృత్యు వులా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన తక్షణ నివారణ చర్యల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేకుంటే, దేశ రాజధాని ఆరోగ్య భద్రతను కాపాడు కోలేకపోతోందనే అపప్ర«థ ప్రభుత్వంపై పడుతుంది. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు -
సమాఖ్య స్ఫూర్తికి తూట్లు
జాతీయ సమైక్యతకు, దేశాభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ హక్కులు, నిధులు, అధికారాలకు సంబంధించి ఘర్షణాత్మక వైఖరి కొనసాగు తూనే ఉంది. కేంద్రం వద్ద అపారమైన ఆర్థిక వనరులు సమకూర్చుకొనే అవకాశాలు ఉండగా, రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. పైగా కేంద్రం దొడ్డి దారిన రకరకాల సెస్సులు, సర్ చార్జీలను విధిస్తోంది. అందులో వాటాను మాత్రం రాష్ట్రాలకు పంచడం లేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమ న్వయం, సహకారం పెరిగేందుకు గతంలో ఏర్పడిన కమిషన్లు పలు కీలక సిఫార్సులు చేశాయి. అవి అమలునకు నోచుకోకపోవడంతోనే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగింది..‘నేతిబీరలో నెయ్యి చందం దేశంలో సహ కార సమాఖ్య స్ఫూర్తి’ అని అన్నారు ఎన్.టి. రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో. రాష్ట్రాలకు అందించే నిధులు, హక్కులకు సంబంధించికేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వపు పోకడల పట్ల విసిగి పోయి తమ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రులు గతంలో చాలా మంది ఉన్నారు. జాతీయ సమైక్యతకు, దేశాభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని భారత రాజ్యాంగంలోని 256–263 వరకు ఉన్న అధికరణలు నిర్దేశిస్తున్నాయి. అయినప్పటికీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు హయాం నుంచి నేటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలన వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ హక్కులు, నిధులు, అధికారాలకు సంబంధించి ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం పెరిగేందుకు గతంలో సర్కారియా కమిషన్, పూంఛ్ కమిషన్లు పలు కీలక సిఫార్సులు చేశాయి. కానీ, అవన్నీ అమలునకు నోచుకోకపోవడంతోనే... సహకారం కొరవడింది, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగింది.గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోదీ నాటి యూపీఏ ప్రభుత్వ కేంద్రీకృత విధానాలను విమర్శిస్తూ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకై బలంగా గొంతెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అనుసరించిన మార్గంలోనే పయనిస్తూ, సమాఖ్య స్ఫూర్తికి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరీముఖ్యంగా దక్షిణ భారతం పట్ల మోదీ వివక్ష చూపిస్తున్నారన్న భావన ప్రజలలో క్రమేపీ బలపడుతోంది. ఇది ఎంత దూరం వరకు వెళ్లిందంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపే ఈ వివక్ష ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దక్షిణ భారతాన్ని ఓ ప్రత్యేక దేశంగా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటుందని కర్ణాటకకు చెందిన కొందరు మంత్రులు ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతి ఐదేళ్లకు కేంద్ర ప్రభుత్వ పన్నులు, ఇతర ఆదాయాల్లో విభజించ దగ్గ మొత్తాలను (డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్) పంచడానికి, భారత రాజ్యాంగంలోని అధికరణ 290 ప్రకారం, 1951 నుంచి ప్రతి ఐదేళ్లకోమారు ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రాల అర్థిక అవసరాలు తీర్చడానికి పన్ను ఆదాయాల్లో గణనీయమైన భాగం రాష్ట్రాలకు అందాలని ఆర్థిక సంఘాలు ఎప్పటికప్పుడు సిఫార్సులు చేస్తూ వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని 32 నుంచి 42 శాతానికి పెంచింది. 15వ ఆర్థిక సంఘం దాన్ని 41 శాతంకు కుదించి, 1 శాతం పన్నును కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ, కశ్మీర్లకు బదలాయించాలని కేంద్రానికి సూచించింది. అయితే, పేరుకు 41 శాతంగా పైకి కనపడుతున్నప్పటికీ వాస్తవంగా 31 శాతం నిధులే అందుతున్నాయని బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.కేంద్రం వద్ద అపారమైన ఆర్థిక వనరులు సమకూర్చుకొనే అవకాశాలు ఉండగా, రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. అయినప్ప టికీ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఆదాయం పెంచుకొనేందుకు రక రకాల సెస్సులు, సర్ చార్జీలను విధిస్తోంది. వీటిద్వారా వచ్చే రాబడిని రాష్ట్రాలతో పంచుకోవడం లేదు. సర్‌చార్జీలు, సెస్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం పొందుతున్న మొత్తం పన్నుల వాటాలో 20 శాతం మేర ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక ఉగ్రవాదం అని పిలుస్తున్నాయి. అందువల్లనే ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం... రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని బీజేపీయేతర ప్రభు త్వాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 11న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ యేతర దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలు, చేసిన డిమాండ్లను పరిశీలిస్తే కేంద్రంతో రాజీలేని పోరాటం చేయడానికి ఈ రాష్ట్రాలు సమాయత్తం అయినట్లుగా కనబడుతుంది. నిధుల కేటాయింపునకు కేంద్రం అనుస రిస్తున్న విధివిధానాల్లో శాస్త్రీయత లోపించిందన్నది నిర్వివాదాంశం. తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు కేటాయిస్తు న్నది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నది దక్షిణాది రాష్ట్రాలే. చారిత్రకంగా మొదట్నుంచీ దక్షిణాది రాష్ట్రాలు... ఉత్తరాది రాష్ట్రాలకంటే ఆర్థికంగానూ, ఇతరత్రా పలు అంశాల్లోనూ మెరుగ్గా ఉన్నాయి. దేశ విభజన పరిణామాలు ఉత్తరాది రాష్ట్రాల మీద ప్రతి కూల ఫలితాలు చూపాయి. మత, కులపర వైషమ్యాల కారణంగా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అభివృద్ధి అడుగంటింది. అదే సమయంలో పలు సామా జిక, సాంస్కృతిక ఉద్యమాల కారణంగా దక్షిణాదిలో విద్యకు ప్రాధాన్యం లభించింది. 1990 దశకంలో దేశంలో ప్రారంభమైన సంస్కరణల ఫలితాలను, ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్, ఫార్మా తదితర రంగాలలో వచ్చిన విప్లవాలను దక్షిణాది రాష్ట్రాలు సద్వినియోగపర్చుకొని ఆర్థికంగా ముందంజ వేశాయి. నిధుల కేటాయింపునకు మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రాల పని తీరును, ప్రతిభను కొలమానంగా తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాలు గత రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.కాగా, వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికీ, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పర్చడానికీ... ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగానైతే అధిక నిధుల్ని ఖర్చుచేస్తాయో... అదే నమూనాను జాతీయస్థాయిలో అమలు చేసి వెనుకబడిన రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించడంలో తప్పేముందని ఉత్తరాది రాష్ట్రాల ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం... భారత కన్సాలిడేషన్ ఫండ్‌కు ఏటా జమ అవుతున్న లక్షల కోట్ల కార్పొరేట్ పన్నుల మొత్తం నుంచి ఖర్చు చేయవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అయింది.రాష్ట్రాలు తమ వాదనలను నీతి ఆయోగ్ సమావేశాలలోవిన్పించే అవకాశం ఉంది. కానీ, ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, దానిస్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ కేవలం కేంద్రానికి సలహా లిచ్చే ఓ సంఘంగానే మిగిలిపోయింది. ‘నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లడం శుద్ధదండగ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన 9వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని మమతా బెనర్జీతో సహా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించడం గమనార్హం!ఇక, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్వి భజించాలని కేంద్రం యోచిస్తున్న పూర్వరంగంలో దక్షిణాది రాష్ట్రా లకు తీరని నష్టం కలగడమేకాక... కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు పోషించే నిర్ణయాత్మక పాత్ర, వాటి పలుకుబడి గణనీయంగా తగ్గిపోతాయి. అదే జరిగితే ఎన్.టి. రామా రావు చెప్పినట్లు నేతిబీరలో నెయ్యి చందంగా సహకార సమాఖ్య వ్యవస్థ తయారవుతుంది. రాష్ట్రాల సూచనలను పట్టించుకోకుండా కేంద్రం ఒంటెత్తు పోకడలకు పోతే సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడటం తథ్యం!-డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు; కేంద్ర మాజీ మంత్రి -
అంబటిని టీడీపీ మట్టు పెట్టాలని చూస్తుంది: ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి
సాక్షి, గుంటూరు: సమాజంలోని న్యాయాలు, అన్యాయాలు వివరిస్తున్న మంత్రి అంబటి రాంబాబును టీడీపీ మట్టుపెట్టాలని చూస్తుందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంత్రి అంబటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడిని సమాజం చూస్తూ ఊరుకోదని, దుర్మార్గులని ఏరేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఇది పరిణితి చెందిన సమాజమని, దుర్మార్గులకు ఈ సమాజంలో తావులేదని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుడు హత్య దుర్మార్గమైన చర్య అని తెలిపారు. -
‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టోనని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎంతమంది పేదలను దనవంతులుగా చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్ధానాలు చేసి మోసగించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో.. చంద్రబాబు మోసఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని అన్నారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్థికరంగ విశ్లేషకులు పాపారావు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, యేసు రత్నం, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్. ఆయన పాలన ప్రజలకు స్వర్గం.. బాబు, ఎల్లో మీడియాకు నరకం. రాజకీయ నాయకులు భష్టు పట్టించిన మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చిన వ్యక్తి సీఎ జగన్. జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అందులో పేర్కొన్నట్లే సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నాం. మీకు మేలు చేస్తేనే ఓటేయమని అడుగుతున్నాం. పేదలకు మేలు చేస్తే ఓటేయండి...లేకపోతే వద్దని దమ్ముగా చెప్పిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్రెడ్డి’ అని అంబటి వ్యాఖ్యానించారు. చదవండి: ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు టీడీపీ కుట్రలను బహిర్గతం: డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాన్, భగవద్గీత అని ముఖ్యమంత్రి అన్నారని.. అందుకే మేనిఫెస్టో అంటే జగన్‌దేనని అన్నారు. ప్రజలను మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలోని ప్రజలకు నిజానిజాలు తెలిపి టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు చించేశారు: ఎమ్మెల్సీఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ‘రాజకీయ పార్టీలు తాము గెలిచిన తరువాత ప్రజలకు చేయబోయే పథకాలను తెలియజేస్తారు.కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో గెలిచిన తరువాత చించుతున్నారు. గతంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు చెక్ చేస్తే అప్పటికే దానిని చించారని గుర్తించారు. వైఎస్సార్సీపీ తీసుకు వచ్చిన మేనిఫెస్టోను నాయకుల ముందు ఉంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించి 98 శాతం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్’ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు: కొమ్మినేని శ్రీనివాసరావు గతంలో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా అమలు కాలేదని, 2019లో వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశం అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొమ్మినేని దుయ్యబట్టారు. ‘‘మేనిఫెస్టోను భగద్గీత,ఖురాన్,బైబిల్ గా భావించిన వ్యక్తి సీఎం జగన్. మేనిఫెస్టో అంటే సీఎం జగన్ దృష్టిలో ప్రజలకు ఇచ్చిన హామీ. మేనిఫెస్టో అంటే చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే ఓ కాగితం. దేశమంటే మట్టికాదోయ్.. మనుషులోయ్ అన్నారు గురజాడ.. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారు. సోనియా గాంధీని ఎదిరించి సీఎం జగన్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు’’ అని కొమ్మినేని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప: ఆర్ధిక రంగ విశ్లేషకులు పాపారావు వైఎస్ జగన్ మేనిఫెస్టోను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మేనిఫెస్టోను ఫాలో అవుతున్నాడు. ఏపీ శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప. జగన్ అవునన్నదల్లా చంద్రబాబు కాదన్నాడు. జగన్ ఎస్ అంటే నో అన్నాడు..నో అంటే ఎస్ అన్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోపై ఆయన పార్టీలోనూ చర్చ జరగడం లేదు. మేనిఫెస్టోలో చెప్పిందే జగన్ చేస్తున్నాడు. పేద ప్రజలను మోసం చేయడం లేదు. ఆయన వల్ల ఎవరూ దగాపడలేదు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తామంటే చంద్రబాబు చీదరించుకున్నాడు. పేదలు అమరావతిలో ఉండకూడదా? జనానికి ఉపయోగపడేలా రాజకీయం చేయాలి. పేదలకు వ్యతిరేకంగా భావజాలంతో ఉన్న వారిని తరిమికొట్టాలి మళ్లీ జగనే సీఎం: మర్రి రాజశేఖర్ మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎ జగన్ మేనిఫెస్టోకు ఒక విలువ తెచ్చారని ప్రశంసించారు. భారతదేశానికే ఆదర్శవంతమైన వైఎస్ జగన్.. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పుంటే 2014లో సీఎం అయ్యుండేవారని అన్నారు. ఒక్కరూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలు అందేలా చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని ఈ రాష్ట్రానికి మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
మేలుకోకపోతే ఆహార సంక్షోభమే!
ఈ ఏడాది భూతాపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయనీ, అందువల్ల రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తవచ్చుననీ ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక సమీప భవిష్యత్తులో మానవాళి భవిష్యత్తు మనుగడ పట్ల ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భూ ఉష్ణాన్ని రాబోయే 10 ఏళ్లల్లో కనీసం 2 డిగ్రీలు తగ్గించాలని దాదాపు 8 ఏళ్ల క్రితం పారిస్‌లో రూపొందించిన ‘వాతావరణ విధాన పత్రం’ ఓ చిత్తు కాగితంగా మారిన ఫలితంగానే ఈ సమస్య ముంచుకొచ్చింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే శిఖరాగ్ర సదస్సులలో చేసే తీర్మానాలకు సభ్యదేశాలు కట్టుబడకుండా వాటిని ఉల్లంఘించడం ఓ రివాజుగా మారింది. ఉమ్మడి ప్రయోజనాలను తాకట్టుపెట్టి సొంత ప్రయోజనాలకే అగ్ర దేశాలు మొగ్గుచూపడం వల్ల ప్రపంచంలో జీవ వైవిధ్యం, వాతావరణ సమతుల్యత అదుపుతప్పాయి. వ్యవసాయ రంగానికి చేటు చేసే గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలో మితి మీరిన మోతాదులో పెరిగిపోయాయి. భూమి మీద పర్యావరణ సమతుల్యత కాపాడడానికి అనేక రకాలైన మొక్కలు, జీవులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు నిర్దిష్ట సంఖ్యలో ఉండాలి. చిన్న, పెద్ద వృక్ష సంతతి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రాణవాయు వును సృష్టిస్తాయి. బ్యాక్టీరియా నీటిలోని లవణ సాంద్రతను కాపాడు తుంది. నదీ ప్రాంతాల అడవులు వరదల్ని నిరోధించి నీటి ప్రవాహ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాతావరణంలో ఉండవలసిన ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ పరిమాణాలను సమపాళ్లలో నియంత్రించే శక్తి జీవ వాతావరణానికి ఉంటుంది. అయితే నత్రజని, మీథేన్, క్లోరోఫోరో కార్బన్లు తదితర గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలోకి ప్రవేశించి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు అనూ హ్యంగా పెరిగిపోయి, అకాల వర్షాలు పడుతున్నాయి. కాలం కాని కాలంలో తుఫానులు సంభవిస్తున్నాయి. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కోతకు సంబంధించి లక్ష్యాల సాధనలో అగ్రదేశాలు దారుణంగా విఫలం అయ్యాయి. 1997లో వాయు ఉద్గారాలను అంతకుముందుకంటే దాదాపు 5 శాతం తగ్గించు కోవాలని లక్ష్యంగా ఏర్పరచుకొన్నారు. దానినే ‘క్యోటో ప్రోటోకాల్’గా పిలుచుకోవడం జరిగింది. అగ్రదేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా తదితర దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలకు విఘాతం కలుగుతుందనే సాకుతో తమ పారిశ్రామిక ఉత్పత్తుల నియంత్రణపై జాగ్రత్తలు పాటించలేదు. ఆ తర్వాత పర్యావరణంపై జరిగిన ‘కోపెన్ హాగన్’ సదస్సు, పారిస్‌లో జరిగిన ‘కాప్’ సదస్సులలో సైతం పాత కథే పునరావృతం అయింది. ప్రస్తుత పర్యావరణ సంక్షోభానికి ఏదో ఒక్క దేశమే కారణమని చెప్పలేనప్పటికీ ఆ దుష్ఫలితాలు భారత్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మన దేశానికి సంబంధించినంత వరకూ అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశంలో రసాయనిక ఎరు వులు, క్రిమిసంహా రకాలు, డీడీటీల వాడకం; గనుల తవ్వకం... రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం వంటి అవసరాల కోసం భారత్‌లో జీవ వైవిధ్యాన్ని సమూలంగా నాశనం చేయడం జరుగుతోంది. ఫలితంగా ఏటా సగటున 10 నుంచి 15 మీటర్ల వరకు హిమనీ నదాలు కరిగిపోతున్నట్లు వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘అంటార్కిటికా’పై శాస్త్రీయ పరిశోధన జరిపిన కమిటీ వెలువరించిన నివేదిక... 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు 1.4 మీటర్లు పెరిగే ప్రమాదం ఉందనీ... దానివల్ల తీరప్రాంత నగరాలైన చెన్నె, ముంబయి, కోల్‌కతా వంటి నగరాలతోపాటు ఇతర సముద్ర తీర ప్రాంతాలూ మునగడం ఖాయమనీ స్పష్టం చేసింది. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే వరి, గోధుమ, చెరకు వంటి పంటల దిగుబడి 15 శాతం మేర తగ్గిపోతుందని పలు శాస్త్రీయ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇంట ర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) విశ్లేషణ ప్రకారం... వరి వెన్ను పుష్పించే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లయితే, ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది. ‘యూనివర్సల్ ఎకొలాజికల్ ఫండ్’ నివేదిక ప్రకారం ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే రాబోయే దశాబ్దాల కాలంలో వ్యవసాయ దిగుబడుల్లో రమారమి 20 శాతం క్షీణత నమోదవుతుంది. ఉత్పత్తులు ఆ మేరకు తగ్గుతూ ఉంటే వ్యవసాయం గిట్టుబాటుగాక రైతాంగం ఇతర వృత్తులకు తరలిపోయే ప్రమాదం త్వరలోనే ఏర్పడవచ్చు. ఒకవైపు జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఆహార ధాన్యాలలో వృద్ధిని కాపాడుకోలేనట్లయితే, అది ఆహార సంక్షో భానికి దారి తీస్తుంది. ఒక అంచనా ప్రకారం... కరోనా వంటి ఉత్పాతం, అదేవిధంగా మలేరియా, టీబీ, ఎయిడ్స్ వంటి ప్రాణాం తక వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కంటే ఆకలి చావులతో చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉండవచ్చు. ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపంతో చనిపోతున్న 5 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య 50 లక్షలుగా ఉన్నదని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 మందిలో ఒకరికి ఆహార భద్రత ఇప్పటికే లేదు. ఇంత నాగరిక సమాజంలో కూడా ఆకలి చావులు సంభవించడానికి కారణం అందరికీ ఆహార భద్రత కల్పించే ప్రణాళికలు లోపించడమే. వాస్తవానికి, ఆహారం పొందడం మానవుని హక్కుగా ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాలూ గుర్తించాయి. ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం తమ బాధ్యతగా ప్రభుత్వాలు స్వీకరించాలనీ, ఆకలి రహిత సమాజాన్ని ఆవిష్కరించాలనీ ఐక్యరాజ్యసమితి చాలా కాలం క్రితమే పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలలో ఒకటైన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఏర్పరుచుకొన్న లక్ష్యాలలో ప్రధానమైనది 2050 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు 50 శాతం మేర పెంచాలన్నది! అప్పుడే పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత చేకూరుతుంది. కానీ, ఈ లక్ష్యాల సాధనకు శరవేగంగా విస్తరిస్తున్న వాతావరణ మార్పులు ప్రతిబంధకాలుగా మారాయి. (క్లిక్: అధికారులు ‘ఛాన్స్’ తీసుకోవడం లేదు!) ఈ నేపథ్యంలో భారత్ వీలయినంత మేర అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూనే... ఇంకోవైపు వాతావరణ, ఆహార సంక్షోభ సమస్యను తనకు తానుగానే పరిష్కరించుకోవడానికి తగిన వ్యూహాలతో కార్యాచరణ రూపొందించుకొనడమేగాక, చిత్తశుద్ధితో అమలు చేయగలగాలి. పర్యావరణంపై రైతాంగానికి అవగాహన కల్పించడం ద్వారా దేశంలో పంట నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. దేశంలో ఉన్న 7 వాతావరణ జోన్లకు అనుగుణంగానూ, అదే విధంగా రుతుపవనాల గమనం ఆధారంగానూ పంటల సాగు జరగాలి. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతాం గానికి కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. పర్యావరణానికి సంబంధించి దేశీయ వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతమైన చర్చలు, గోష్ఠులు నిర్వహించి నిపుణల సలహాలు, సూచనలు స్వీకరించి వాటిని ఆచరణలోకి తేవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం సహజ అటవీ సంపదను కాపాడుకోవాలి. రసాయనిక, క్రిమి సంహారక మందుల వాడకాన్ని నియంత్రించాలి. వాతావరణంలో ప్రవేశించే కర్బన ఊద్గారాలను తగ్గించడానికి బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ‘సౌరశక్తి’ని విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగాన్ని మరింత తగ్గించాలి. తరుముకొస్తున్న వాతావరణ ఆహార సంక్షోభాన్ని నివారించడానికి బహుముఖమైన కార్యాచరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమన్వయంతో కృషి చేయాలి. (క్లిక్: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!) - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
శాసనమండలిలో చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి
సాక్షి, అమరావతి/బాపట్ల: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమతులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి నియమితులు కావడం వరుసగా ఇది రెండో సారి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన ఉమ్మారెడ్డి ఇటీవల గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. దాంతో ఉమ్మారెడ్డిని మరోసారి మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా సీఎం వైఎస్ జగన్ నియమించారు. -
శాసనమండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: (గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి) -
వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం
వ్యవసాయరంగ ప్రగతి, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ర స్థానానికి చేరింది. 29 రాష్ట్రా లలో మొదటి స్థానంలో నిలి చింది. ఈ సంగతిని స్వయంగా కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కొక సారి ప్రకటించే గుడ్ గవర్నెన్స్ సూచీ తెలియజేసింది. అందుకు అనుగుణంగానే, వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్నందుకుగాను ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకమైన ‘‘స్కోచ్ గవర్నెన్స్’’ అవార్డు లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి హడావుడి, ఆర్భాటం, ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ సాధించిన ఓ అద్భుత విజయం ఇది. వ్యవసాయం గిట్టుబాటు వృత్తి కాదనీ, వ్యవ సాయం దండగనీ తనకంటే ముందు రాష్ట్రాన్ని 5 ఏళ్లపాటు పరిపాలించిన చంద్రబాబు నాయుడు రైతుల మైండ్‌సెట్‌ను మార్చడానికి ప్రయత్నించిన ఫలితంగా వ్యవసాయ రంగంలో స్తబ్దత నెలకొంది. అటువంటి నేపథ్యంలో... 2019 మేలో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో, స్పష్టమైన విధానాలతో, రైతాంగ సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో అమలు చేసిన పథకాలు నేడు సత్ఫలి తాలు అందించాయి. అయితే, వాస్తవాలు చూడలేకపోతున్న ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్‌లో వ్యవసాయమే కనుమరుగై పోయింద.ని ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడం ఆయనకు కొత్తకాదు. నిజానికి, వ్యవ సాయరంగం గురించి మాట్లాడేందుకు చంద్రబాబుకు నైతిక హక్కు లేదు. మొత్తం 14 సంవత్సరాలపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నది జగద్విదితం. చంద్రబాబు పాలనంటే రైతు లకు కంటిమీద కునుకు కరువవుతుంది. వ్యవ సాయ రంగాన్ని వ్యూహాత్మకంగా దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన పాలనలో వ్యవసాయ రంగంలో తీసుకున్న రైతాంగ వ్యతిరేక చర్యలే ఇందుకు నిదర్శనం. కరువు కారణంగా విద్యుత్ బిల్లులు చెల్లించలేని రైతాంగంపై కేసులు బనాయించడం, రైతుల చేతులకు బేడీలు వేయడం, వ్యవసాయరంగంలో ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అడ్డగోలుగా వాదించడం, భారీగా పెంచిన విద్యుత్ చార్జీల్ని తగ్గించాలని ఉద్యమించిన వారిపై పోలీసులతో కాల్పులు జరిపించి, గుర్రాలతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాల్ని పొట్టన పెట్టుకోవడం, వ్యవసాయ రంగం నుండి సేవల రంగానికి మరలాలంటూ రైతాంగానికి ఉచిత సలహాలివ్వడం, రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో ఏడాదికి 34 పంటలు పండే బంగారం లాంటి భూముల్ని 32,000 ఎకరాలు తీసుకొని... వాటిని సాగుకు పనికి రాకుండా నాశనం చేయడం... ఇలా ఎన్నో రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక చర్యలకు చంద్ర బాబు ఒడిగట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడికి రైతుల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టు కొస్తుంది. రైతాంగాన్ని రెచ్చగొట్టాలని అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ కోవలోనే ఇపుడు కూడా రాష్ట్రంలో అసలు వ్యవసాయరంగమే అదృశ్యం అయిందంటూ విపరీత అర్థాలతో అభూతకల్పనలు మాట్లాడు తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది? 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో చేపట్టిన చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించింది. ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా రైతాంగానికి పంట వేసుకొనే ముందే పెట్టుబడి అందజేసి, దానికి పీఎం కిసాన్ పథకం జోడించారు. రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, బలోపేతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు, వ్యవసాయ రంగానికి 9 గంటలపాటు ఉచిత విద్యుత్, విత్తన రాయితీ, ప్రతి జిల్లాలో ‘వైఎస్సార్ రైతు భవనాల’ నిర్మాణం వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలకు అను బంధంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించడం, వ్యవసాయ నిపుణులతో పంటల సాగులో సలహాలు ఇప్పించడం, పంటలకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసు కోవడం; ఆర్బీకేలు రైతులకు కావాల్సిన బ్యాంకింగ్ సేవలు అందించడం, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని అందజేసి రైతులకు దన్నుగా నిలబడటం, అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరు గైన ధర దక్కేలా చేయడం; వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్యశాఖ, పశు సంవర్ధకశాఖ, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ వంటివాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడం వంటి అనేక విప్లవాత్మక చర్యలు ఆంధ్ర ప్రదేశ్‌లో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కడానికి కారణమయ్యాయి. ఈ 33 నెలల కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది జగన్ ప్రభుత్వం. అంకెలు అబ ద్ధాలు చెప్పవు. అవార్డులు ఊరికే రావు. ఈ వాస్తవాల్ని చంద్రబాబు గ్రహించినా రాజకీయ లబ్ధి కోసం తనదైన శైలిలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని సంతృప్తిపర్చడం, వ్యవసాయాన్ని లాభ సాటి వృత్తిగా మలచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా ఫలితాలు అందు తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవసాయ రంగంలో నేడు నిశ్శబ్ద విప్లవం చోటు చేసుకొంది. - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ శాసన మండలి సభ్యులు -
మండలిలో ప్లేటు ఫిరాయించి టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే మరణాలపై చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు. దీంతో ఖంగుతున్న టీడీపీ నేతలు వెంటనే ప్లేటు ఫిరాయించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చి జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు మాటమార్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రే వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలన్న అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి రాదని అన్నారు. అయితే యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని రూల్ పొజిషన్లో చదివి వినిపించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు శాసనమండలి చైర్మన్‌ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ నడపాలని సూచించారు. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్ టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. -
రాజకీయాలకు సమాఖ్య బలి కాకూడదు!
తెలంగాణ రైతాంగం పండిం చిన ధాన్యం మొత్తాన్ని కొను గోలు చేయడానికి కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో తెలం గాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావుకూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ నడుమ మొదలైన మాటల యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై చర్చ మరో సారి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్య మంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, స్టాలిన్; బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారు రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ‘‘దేశ ఫెడరల్ వ్యవస్థను కేంద్రం దౌర్జన్యం నుండి కాపాడాల్సిన సమయం ఇది’’ అని మమతా బెనర్జీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం నియంతృత్వ ధోరణిని ప్రతిఫలిస్తు న్నాయి. ఇదే సమయంలో సమీప భవిష్యత్తులో దేశంలో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాల్ని సైతం ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించకుండా కొన్ని అంశాల్లో ఏకపక్షంగా తీసు కొంటున్న నిర్ణయాల నేపథ్యంలో మమతా బెనర్జీ ‘ఫెడ రల్ వ్యవస్థకు రక్షణ’ అని అనడంలో విస్తృతార్థాలు ఇమిడి ఉన్నాయని పిస్తోంది. దేశ పాలనా వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు తమతమ అధికార పరిధులకు లోబడి ఉమ్మడి లక్ష్యాలతో సమన్వ యంతో పని చేయాలని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ... కేంద్రంలో ఇటీవల వరకూ ఎవరు అధికారంలోకి వచ్చినా ఏకపక్ష పోకడలు పోవడం ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు... రాష్ట్రాలను చిన్న చూపు చూసే ధోరణి మొలకెత్తింది. రాజ్యాంగం నీడలోనే ప్రజామోదం గలిగిన రాష్ట్ర ప్రభుత్వాలను లెక్కలేనన్ని సార్లు కూల్చేసింది కాంగ్రెస్. రాజకీయ ఫిరాయింపులను ప్రోత్స హించింది. దీంతో దానికి వ్యతిరేకంగా దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ అనే అంశాల ఆధారంగానే అవి ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి రాగలిగాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకాలను ఎండగడుతూ వచ్చిన బీజేపీ సైతం నేడు తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. ఇందుకు 2014లో ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన అనంతరం... విభజిత ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకపోవడం తాజా ఉదాహరణ. ఏడున్నరేళ్ల నరేంద్రమోదీ నేతృత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయక పోగా, ‘పునర్వ్యస్థీకరణ చట్టం–2014’లో పేర్కొన్న రెవెన్యూలోటు భర్తీ, వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వేజోన్ తదితర కీలకమైన అంశాలను; పార్లమెంట్ సాక్షిగా ఇస్తామని వాగ్దానం చేసిన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అంశాన్ని పక్కన పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం–2014 ప్రకారం 9వ షెడ్యూల్లో 91 సంస్థలు, 10వ షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన; ఉద్యోగుల విభజన; ఆస్తులు, అప్పులు, ఆదాయ విభజన వంటి అంశాలు ఇంకా పూర్తికాని నేపథ్యంలో... వాటిని పరిష్కరించడానికిగాను 9 అంశా లతో ఎజెండాను రూపొందించి... కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్‌కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉపకమిటీని ఏర్పాటు చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే 9 అంశాలలో ప్రధానమైన 1) ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 2) పన్ను రాయితీలు 3) ఉత్తరాంధ్ర, రాయల సీమలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు 4) రెవెన్యూ లోటు అంశాలను ఎత్తివేశారు. అజెండాలో కేవలం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలను మాత్రమే ఉంచి అజెండాను సవరించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ; ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నిం చిన తెలుగుదేశం పార్టీలు లోపాయికారీగా కుట్రపన్ని త్రిసభ్య కమిటీ అజెండాను కుదించారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్ని ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తే ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కు తుందన్న దుగ్ధ తెలుగుదేశం అధినేతకు ఉండొచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాల్సిందేనని విభజన బిల్లు ఆమోదం పొందే సంద ర్భంలో రాజ్యసభలో పట్టుబట్టి, గొంతెత్తి పోరాడిన బీజేపీ నేతలు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదనీ, అది ముగిసిన అధ్యాయం అనీ ప్రచారం చేయడం ఏపాటి ప్రజా స్వామ్యం? కానీ, ఇటీవల బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు బీజేపీ చెప్ప డంతో... రాజకీయ కారణాల వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రజలకు అర్థమైంది. విభజన హామీలను నెరవేర్చే విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌తోపాటు తెలంగాణకూ న్యాయం జరగలేదు. ఇందుకు కూడా రాజకీయాలే కారణం. విభజన బిల్లులో పేర్కొన్న ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా; నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ. 24,000 కోట్ల ఆర్ధిక సాయం వంటివి అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలకు దిగారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి రాజకీయ ఫ్రంట్లను ఏర్పాటుచేసి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడంవల్ల తక్షణం నెరవేరాల్సిన సమస్యలు పరిష్కారమవుతాయా అనేది ఆలోచించవలసిన అంశం. ఇదే సమయంలో రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం ఆర్థికంగా పటిష్ట మవుతుందని కేంద్రం గ్రహించాలి. రాష్ట్రాలను బలహీన పర్చడం వలన సాధించేదేమీ ఉండదని, ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించి ఇప్పటికైనా ఆ దిశగా నిర్మాణాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రాలకు లభించాల్సిన నిధులు, హక్కులు బదలాయించి సమాఖ్య స్ఫూర్తిని చాటాలి, ఫెడరల్ వ్యవస్థను పటిష్ట పర్చాలి. వ్యాసకర్త: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ శాసన మండలి సభ్యులు -
రంధ్రాన్వేషణే... ప్రతిపక్షం పనా?
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ ప్రాధాన్యం ప్రజల సంక్షేమమేనని చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. అణగారిన వర్గాలు ఉన్నతస్థాయికి చేరుకొనేందుకు ప్రజలందరికీ కులమత, వర్గ రహితంగా చదువుకొనే అవకాశాలను కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ, మాతాశిశు సంరక్షణలను ప్రాధాన్యంగా స్వీకరించి, వాటికి అనుగుణమైన కార్యక్రమాలు అమలు చేయా లని సూచించింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి నుంచి పేద వర్గాలకు, అట్టడుగు ప్రజానీకానికి పలు వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతోంది. దీన్ని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన తెలుగు దేశం పార్టీ... నేటి ప్రభుత్వం ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచుతోందని దుష్ప్రచారం సాగిస్తూ... పేద వర్గాలకు అందుతున్న రాయితీలను, సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును పేద వర్గాలకు దోచి పెడుతున్నారన్న అడ్డగోలు వాదనను తారస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలలో ప్రతి ఒక్కరూ పన్ను చెల్లింపుదారులే! అత్యధికశాతం ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తుంటారు. జనాభాలో ప్రత్యక్ష పన్ను చెల్లించేవారి శాతం చాలా తక్కువ. నిత్యావసర వస్తువులు మొదలుకొని దైనందిన జీవితంలో అవసరమయ్యే ఏ వస్తువును కొనుగోలు చేసినా వాటిపై ఉండే పన్నులను ప్రజలు చెల్లించాల్సిందే! జనాభాలో అధికంగా ఉన్న పేద ప్రజలు పరోక్షంగా చెల్లించే పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎవరికి ఖర్చు చేయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో రైతులు అప్పులపాలై 10,000 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. బలన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి కొంత మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని ఆనాటి ప్రతిపక్షాలు కోరితే ‘ఎక్స్‌గ్రేషియా ఇస్తే ప్రత్యేకంగా ఎక్స్‌గ్రేషియా కోసమే మరింత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటారు’ అంటూ రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకొని పోయింది. వ్యవసాయరంగాన్ని నిరుత్సాహ పర్చి, సేవల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సేవల రంగానికే భవిష్యత్తు ఉందని వ్యవసాయం దండుగమారిది అన్న విధానాన్ని పాటించడంతో ఉపాధి కోల్పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలు పొట్టచేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వలసబాట పట్టారు. ఉచిత కరెంటు ఇవ్వకపోగా, కరెంట్ చార్జీలు పెంచారు. తగ్గించమంటే ప్రజలను గుర్రాలతో తొక్కించి చంపారు. (చదవండి: రెండు నాల్కలు-పొల్లు మాటలు) ఇంజనీరింగ్ కాలేజీలను ఇబ్బడిముబ్బడిగా స్థాపించి అధిక ఫీజులు, డొనేషన్లు నిర్ణయించి పేదలకు ఆ విద్యను దూరం చేశారు. ఈ దుఃస్థితి నుంచి సామాన్య వర్గాలను కాపాడాలనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించారు. ఆ కారణంగానే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం లభించింది. ఫలితంగా పేద వర్గాల కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. విద్యతోపాటు ఆరోగ్య రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటుపరం చేసిన ఘనత బాబుదే! కార్పొరేట్ ఆసు పత్రుల సంస్కృతిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి... ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య సేవలను గాలికి వదిలేశారు. 2004లో వైఎస్సార్ సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పేదల పాలిట కల్పతరువుగా మారింది. లక్షలమంది పేదలు గుండె ఆపరేషన్లతో సహా ఖర్చులతో కూడుకొన్న అనేక జబ్బులను ఖర్చు లేకుండా నయం చేసుకోగలిగారు. ఆరోగ్యశ్రీతోపాటు ఆనాడు ప్రవేశపెట్టిన 104, 108 వంటి సేవలతో రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ వైద్య సేవల్ని విస్తరించి సామాన్య ప్రజల జీవితాల్లో భరోసా నింపారు. సంపద పెంచానంటూ అసత్యాలు చెప్పడం ద్వారా చంద్రబాబునాయుడు సెల్ఫ్‌గోల్ చేసుకొన్నట్లయింది. కారణం చంద్రబాబు పాలనలో రైతుల ఆదాయం పెరగ లేదు సరికదా... మరింత అప్పుల్లో కూరుకొనిపోయారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకోకుండా నిరాశకు గురిచేశారు. విద్యార్థుల, యువతీ యువకుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. పేదలకు అందించే సబ్సిడీల్లో కోత పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదించాలంటూ... వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను కూడా అలాగే గాలికి వదిలేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను అనేక వేధింపులకు గురిచేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే... చంద్రబాబు పాలనలో ఎవరికి మేలు జరిగినట్లు? ఆయన పెంచానని చెప్పుకొనే సంపద ఎవరి జేబుల్లోకి వెళ్లింది? (చదవండి: చెప్పేటందుకే చంద్రబాబు నీతులు...) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ తప్పుల్ని వెతుకుతున్నారు, వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. రైతులకు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేయడం, పేదలకు ఉచితంగా 32 లక్షల ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం, వాటిలో ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం దోహదం చేయడం, మధ్యతరగతి వర్గాలకు జగనన్న ఇండ్ల కాలనీల పథకం ప్రవేశపెట్టడం... ఇలా పేద వర్గాల అభ్యున్నతికి ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతిపక్షానికి కంటగింపుగా తయాౖ రెంది. కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. సాధికారతే పరమావధిగా పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్తు లోనూ దీర్ఘకాలం ఉంటాయనేది నేటి వాస్తవం! (చదవండి: పనిమంతుడికి అక్కర్లేదు ప్రచారం) - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు
-
రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం
జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకొన్న వివాదాలు ఇప్పట్లో వీడేట్లు లేవు. పార్లమెంట్లో ఆమోదించిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను బేషరతుగా రద్దు చేస్తున్నట్లు నవంబర్ 19న నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ, ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ఉద్యమం విరమించలేదు సరికదా... మరో ప్రధాన డిమాం డ్‌పై పట్టుబట్టాయి. అన్ని పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర ప్రకటించాలని, లేదంటే ఉద్యమం విరమించ మని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. పోరాడి తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ప్రజాస్వామ్యంలో నిజమే గానీ అన్ని పంటల ఎంఎస్పీకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పించినట్లయితే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయా? వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ 2006లో సూచించిన విధానంలో ప్రధాన పంటలకు సి2+50 శాతంతో కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న డిమాండ్‌ను మరుగునపర్చి.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంఎస్పీకి చట్టబద్దత కోరడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? సాగు చట్టాలను రద్దు చేయడం వరకు ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. ఉద్యమాన్ని చల్లార్చడా నికే తప్ప రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాలు కనపడటం లేదు. 2014 ఎన్నికల ముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామనీ, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే బాణీ మార్చింది. స్వామినాథన్ కమిషన్ పేర్కొన్న విధానంలో అమలు చేస్తే వినియోగదారుడిపై అధికభారం పడుతుంది కనుక ఆ పద్ధతితో ‘ఎంఎస్పీ ఇవ్వం’ అని కరాఖండీగా చెప్పడమే కాదు... ఆ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. పైగా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే పంటల ఉత్పత్తి ఖర్చులను కేంద్ర ప్రభుత్వం తక్కువచేసి చూపడమో, తిరస్కరించడమో చేస్తూ... తక్కువ స్థాయిలో మద్దతు ధరలను నిర్ణయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఎంఎస్పీలో శాస్త్రీయత పాళ్లు 1% కూడా లేవని చెప్పడం అతిశయోక్తి కాబోదు. హెక్టారు వ్యవసాయ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల భత్యం, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలకు చెల్లించే అద్దె మొత్తం, రైతు కుటుంబ సభ్యులు భూమిలో చేసిన శ్రమ, భూమి కౌలు ధర, సొంత పెట్టుబడి పెట్టినపుడు దానిపై వచ్చే వడ్డీ... వీటన్నింటిని కలిపి మద్దతు ధర నిర్ణయించాలని స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు చేయగా... వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) కొన్ని అంశాలనే పరిగణనలోకి తీసుకొని ఆ ధరలనే సిఫారసు చేయడం, వాటినే కేంద్రం ఆమోదించడం ఓ తంతుగా ఇన్నేళ్లూ నడిచి పోతోంది. ఈ విధానం రైతులకే కాదు ఎవరికీ ఆమోద యోగ్యం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పంటల సాగు వ్యయాలు తీసుకొని వాటిని కలిపి జాతీయ సగటుగా లెక్కించి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి అన్యాయం జరుగుతోంది. దేశం మొత్తాన్ని 4 లేదా 5 జోన్లుగా విభజించి, జోన్ల వారీగా కనీస మద్దతు ధరలను లెక్కించాలన్న హేతుబద్ధ సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. పంటల ఉత్పత్తి ఖర్చులను అంచనా వేయడానికి, వాటికి మద్దతు ధరలు నిర్ణయించడానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రమేష్‌చంద్ కమిటీని నియమించింది. ఆ కమిటీ దాదాపు ఏడాది తర్వాత, కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక 23 సూచనలతో ఓ నివేదిక సమర్పించగా దానిని బుట్టదాఖలా చేశారు. 2018–19 నుంచి ఎఫ్2+50 శాతం విధానంలో మద్దతు ధరను అమలు చేస్తూ... అదే స్వామినాథన్ సూచించిన ఎంఎస్పీ అంటూ నమ్మబలికారు. దేశంలో 51 రకాల ప్రధాన పంటలు పండుతోంటే కేంద్ర ప్రభుత్వం 14 నుంచి 23 రకాల పంటలకు మాత్రమే అరకొరగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తోంది. కనీస మద్దతు ధరలు సక్రమంగా లభించని కారణంగా దేశ రైతాంగానికి సాలీనా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయోత్పత్తుల విలువలో గరిష్టంగా 25 శాతం మేర వివిధ సబ్సిడీల రూపంలో రైతులకు అందిస్తుండగా, భారతదేశంలో అన్ని రకాల సబ్సిడీలు 4 శాతం మించడం లేదు. కనీస మద్దతు ధరలు కూడా మిగతా దేశాలతో పోలిస్తే ప్రపంచ మార్కెట్లో 17 శాతం తక్కువగా ఉన్నట్లు ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) వ్యవసాయ నివేదిక తెలియజెప్పింది. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ కనీస మద్దతు ధరలను సి2+50 శాతం ప్రకారం ఇవ్వాలని, అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని దాదాపు 15 ఏళ్ల క్రితమే స్పష్టం చేసింది. ఆహార ధాన్యాల దీర్ఘకాల విధానంపై ప్రొఫెసర్ అభిజిత్‌సేన్ కమిటీ 2002లో అందించిన నివేదిక సైతం ఇదే సూచనను బలపర్చింది. స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు వాస్తవ సాగువ్యయానికి 50% కలిపి (సి2+50 శాతం) కనీస మద్దతు ధరను అందిస్తే ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు మాత్రమేనని కిసాన్ స్వరాజ్ స్థాపకుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్లో దాదాపు 8%. పారిశ్రామిక రాయితీల రూపంలో, బ్యాంకుల మొండి బకాయిల రద్దు రూపంలో ఏటా లక్షలాది కోట్ల ఆదాయాన్ని వదులుకొంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ మొత్తం పెద్ద లెక్క కాదు. పంటలకు మద్దతు ధర పెరిగితే రైతు కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గు తాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, నీతి ఆయోగ్ ఆశించేటట్లు రైతు ఆదాయం రెట్టింపు కావడానికి ఆస్కారం కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాలలో అతిపెద్ద రాజకీయ సంకల్పానికి సంబంధించిన అంశం ఇది. గట్టి రాజకీయ సంకల్పంతోనే అనేక చారిత్రా త్మక మార్పులు జరిగాయి. 2004లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని తీసుకొన్న నిర్ణయం దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. అందువల్ల స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ గట్టి రాజకీయ సంకల్పం తీసుకోవాలి. అది చేయ గలిగితే ఆయన చరిత్రలో నిలిచిపోతారు. -డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
బాబు ఇంటికి పాదయాత్ర చేయండి
పొన్నూరు: రాజధాని రైతులు పాదయాత్ర తిరుపతికి కాకుండా చంద్రబాబు ఇంటికి చేస్తే ఆయనకు బుద్ధొస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పొన్నూరులోని అంబేడ్కర్ కాలనీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని రైతుల సమస్యలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించాలన్నారు. ఆనాడు పేదలకు ఇచ్చిన పొలాలను, స్థలాలను బలవంతంగా జీవోలు ఇచ్చి మరీ తీసుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలకు మేలు జరుగుతుంటే.. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని కోర్టుల్లో కేసులు వేసి నిలుపుతుంది నిజం కాదా అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
YS Jagan: బడుగుల హృదయాల్లో శాశ్వత స్థానం
సామాజిక విప్లవాలు కేవలం నినాదాలు, డిమాండ్లు, డిక్లరేషన్లలతో ఉద్భవించవని.. పాలకుడి చిత్తశుద్ధితోనే సాధ్యం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి తాజాగా రుజువు పరిచారు. సుదీర్ఘకసరత్తు చేసి అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం 135 రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్ పదవులను, ఇతర కీలక పదవులను భర్తీ చేసి అందులో 57% పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని నియమించడం ద్వారా ఓ నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని ఓ గొప్ప సామాజిక విప్లవానికి అంకురార్పణ చేశారు. ఈ గౌరవాభి మానాలకు బడుగువర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆనందంతో వారు సంబరాలు జరుపుకున్నారు. అయితే, సామాజిక న్యాయానికి నిజమైన అర్థం తెలియని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయనకు వంత పాడుతున్న కొన్ని మీడియా సంస్థలు.. ఇందులో కూడా మంచిని గ్రహించలేకపోయాయి. కువిమర్శలకు పాల్పడ్డారు. నిధులు లేని కార్పొరేషన్లను బలహీనవర్గాలకిచ్చారని సత్యదూర ప్రచారం చేశారు. 2007లో టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్‌లో బీసీల సదస్సు నిర్వహించి.. 2009 సాధారణ ఎన్నికలలో తమ పార్టీ తరఫున బీసీలకు 100 టికెట్లు ఇస్తామని ఓ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీల్లో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించారు. ఆ వర్గాలను తన చుట్టూ తిప్పుకొన్నారు. తీరా ఎన్నికలొచ్చేసరికి.. తన సహజ ప్రవత్తిని చాటుకొంటూ బీసీలకు మొండిచేయి చూపించారు. బీసీలకు కనీసం 60 పార్టీ టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. పైగా, 100 సీట్లు బీసీలకు ఇస్తే వారు గెలవలేరంటూ ఓ కుంటి సాకు చెప్పారు. మాట తప్పినందుకు చంద్రబాబు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. బీసీలకు క్షమాపణ చెప్పలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్లపాటు అధికారం అనుభవించిన చంద్రబాబు ఏనాడూ సమాజంలో దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురౌతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన దాఖలాలులేవు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన క్యాబినెట్లో దాదాపు 4 ఏళ్లకుపైగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించకుండా అవమాన పరి చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను భర్తీచేస్తే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు భాగస్వామ్యం కల్పించాల్సి వస్తుందనే దుర్బుద్ధితో.. అనేక పదవులను భర్తీ చేయకుండా ఖాళీగా వదిలేశారు. బడుగులకు సముచిత భాగస్వామ్యం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించారు. అధికారంలోకి వస్తే వివిధ బీసీ వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ‘నవరత్నాలు’గా పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. బలహీన వర్గాలకు సముచిత రాజకీయ భాగస్వామ్యం కల్పించడానికి 2019 ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిల్లో 41 సీట్లు బీసీ వర్గాలకు కేటాయించారు. ఎన్నికల సమయంలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులలో 50% బలహీన వర్గాలకు కేటాయిస్తామని చెప్పారు. నామినేటెడ్ పదవులలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. బీసీవర్గాలకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక కార్పొరేషన్ ఉంటే.. వైఎస్ జగన్ తొలిదశలో 57 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వాటన్నింటికి పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల కూర్పులో 50 శాతం రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు దాదాపు 1.80 లక్షల మంది ఉండగా అందులో 80 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారితోనే భర్తీ చేశారు. నేతన్నలు, మత్స్యకారులు, నాయిబ్రాహ్మణులు, యాదవులు, విశ్వబ్రాహ్మణులు, వడ్రంగులు.. ఇలా ప్రతి బడుగు వర్గానికి ప్రత్యేక పథకాలు ఏర్పరిచి వారిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకొంటున్నారు. బీసీలను హేళన చేసిన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పేదలైన బహుజన వర్గాలవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడి సామాజిక జీవనంలో సమతుల్యత దెబ్బతింటుందని.. సంపన్నులు నివాసం ఉండేచోట బహుజనులు ఉండరాదన్న ఫ్యూడల్ మనస్తత్వంతో.. స్వయంగా జీవో జారీచేసిన దారుణ చరిత్ర చంద్రబాబుది. ‘న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు’ అంటూ సుప్రీంకోర్టుకు అధికార హోదాలో చంద్రబాబు లేఖలు రాసిన సంఘటనను ‘ది ఎకనమిక్స్ టైమ్స్’ అనే జాతీయ పత్రిక బయటపెట్టింది. చంద్రబాబులో పడగవిప్పిన అగ్రకుల దురంహంకారం బీసీలను ఎంతో బాధించింది. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు చంద్రబాబును ఎన్నటికీ క్షమించబోమని వారు ఆనాడే శపథం చేశారు. ఇక, తమ సమస్యలను చెప్పుకోవడానికి సచివాలయానికి వెళ్లిన పేద బీసీ కుల వృత్తులవారిని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వేలు చూపిస్తూ బెదిరించిన సంఘటన మరో చీకటి అధ్యాయం. అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా కుల, ప్రాంత, ఆర్థిక వివక్షను చూపించిన చంద్రబాబును బీసీలు ఇకపై ఎందుకు నమ్మాలి? నమ్మించి గొంతు కోసినందుకా? రాజ్యసభ పదవులను ఎస్సీ నేతలకు ఇస్తానని చెప్పి చివరి క్షణం వరకు ఊరించి.. సొంత వారికి ఇచ్చుకున్న చంద్రబాబును ఎస్సీలు ఇకపై నమ్ముతారా? క్రిందటేదాడి 4 రాజ్యసభ సీట్లు ఖాళీకాగా సీఎం జగన్ అందులో రెండింటిని పార్టీలోని సీనియర్ బీసీ నేతలకు ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం చేయడం కాదా? గతాన్ని మరింత తవ్వితే చంద్రబాబు చేసిన తప్పులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి న్యాయంగా దక్కాల్సిన ఫలాలను ఏవిధంగా అందకుండా చేశారో బయటపడతాయి. మరోపక్క అవకాశం వచ్చినప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక న్యాయం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వర్గాల వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా చంద్రబాబు, టీడీపీ నాయకులు సామాజిక న్యాయానికి కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారాన్ని సాగించినంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండాపోతాయా? - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
AP: విశాఖ అభివృద్ధికి చంద్రబాబే అడ్డు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నిరంతరం అడ్డుపడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సోమవారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన పది మంది కార్పొరేటర్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలం లేకపోయినా పోటీకి దిగడం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. కార్పొరేటర్లను కులం పేరుతో ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ సభ్యులు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే.. కాస్త గౌరవమైనా ఉంటుందని సూచించారు. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి గానీ.. అభివృద్ధిని అడ్డుకోకూడదన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మట్లాడుతూ.. 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. భారీ విజయంతో ఏలూరు కార్పొరేషన్‌నూ కైవసం చేసుకుందన్నారు. ప్రజల్లో సీఎం జగన్‌కున్న విశ్వసనీయతకు, నిబద్ధతకు, నమ్మకానికి ఇవన్నీ నిదర్శనమని చెప్పారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్సీపీకి చెందిన సభ్యులే గెలుస్తారన్నారు. జీవీఎంసీలో వైఎస్సార్సీపీకి 61 మంది కార్పొరేటర్లున్నారని చెప్పారు. వీరిలో 58 మంది వైఎస్సార్సీపీ సభ్యులని, ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారని వివరించారు. -
దొంగ దీక్షలు... కొంగ జపాలు మెప్పిస్తాయా?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పక్షాల పనితీరును ఎల్ల వేళలా నిశితంగా గమని స్తూనే ఉంటారు. పార్టీల గెలుపు, ఓటములు దాని మీదే ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2019 ఎన్నికలలో తమ రాజకీయ పరిపక్వతను చాటుకొన్న ఫలితంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు లభించగా, టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఓటమి చవిచూశాక సహజంగానే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకొంటారు. కానీ అధి కారంలో ఉండగా పొరపాట్లు చేశానన్న పశ్చాత్తాపం చంద్రబాబులో ఏ కోశానా కనబడటంలేదు. ప్రభుత్వానికి ప్రతి దశలో ఇబ్బందులు కలుగ జేయకుండా కొంతకాలం వేచిచూద్దామన్న ప్రజా స్వామిక లక్షణమూ లేదు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ, మీడియాలో హడావుడి చేయడానికి కృత్రిమమైన కార్యక్రమాలు చేపడితే జనంలో నవ్వుల పాలవుతారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ చేసిన ‘3 గంటల దీక్ష’ (ఉదయం అల్పాహార సమయం నుండి మధ్యాహ్నం భోజనం చేసేవరకు) అభాసు పాలయింది. ఓ రాజకీయ పార్టీ కేవలం 3 గంటల పాటు దీక్ష చేయడం గతంలో ఎన్నడూ లేదు. తెలుగుదేశం చేపట్టిన దీక్షలో వారు చేసిన తీర్మా నాలు చూస్తే 1) రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాగా కోవిడ్ బాధితులకు రూ. 10,000 చొప్పున ఇవ్వాలి. 2) కోవిడ్‌తో మరణించిన పేషెంట్ల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి. 3) ఆక్సిజన్ అందక మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలి. బాధితులకు పరిహారంగా ఎంత మొత్తం ఇచ్చినా తప్పులేదు. కానీ, తను అధికారంలో ఉన్నప్పుడు సమంజసమైన నష్టపరిహారం ఇవ్వడానికి ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు భారీ ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేయడానికి ఏమి నైతిక హక్కు ఉంది? ఆశ్చర్యం ఏమిటంటే, జాతీయ పార్టీకి అధ్యక్షుడినని చెప్పుకొనే చంద్రబాబు కోవిడ్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. ప్రతి దేశం కోవిడ్‌ను జాతీయ విపత్తుగానే పరిగణించాయి. దేశంలో విపత్తులు సంభవించినపుడు వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని సాయం అందించడం కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత. తన బాధ్యతను విస్మరించిన కేంద్రాన్ని తప్పుపడుతూ న్యాయం చేయాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో దాఖలైంది. అయితే, కేంద్రం ‘కోవిడ్ మరణాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి మా వద్ద నిధులు లేవు’ అంటూ ఓ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దులుపుకుంది. కేంద్రం మాదిరిగా ప్రత్యేకంగా విరాళాలు సేకరించే వెసులుబాటు రాష్ట్రాలకు లేదు. ‘సీఎం రిలీఫ్ ఫండ్’కు అందే అరకొర నిధులతోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరిపెట్టుకొంటున్నాయి. ఒకవైపు అని వార్యంగా లాక్డౌన్లు విధించడం వల్ల రాబడి పడిపోయింది. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని నిలుపుదల చేయకుండానే, వైద్య ఆరోగ్య రంగానికి అదనపు నిధులు సమకూర్చి ప్రజల్లో భరోసా నింపుతూ వస్తోంది. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన కేంద్రం ఆ బాధ్యత నుండి తప్పుకున్నప్పటికీ, ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తామని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. సంక్షేమంలో చంద్రబాబునాయుడా పాఠాలు చెప్పేది? అప్పుల ఊబిలో కూరుకొని గత్యంతరంలేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడితే ‘ఎక్స్‌గ్రేషియా ఇస్తే దానికోసం రైతులు ఆత్మ హత్యలు చేసుకొంటారు’ అని రైతాంగాన్ని కించ పర్చేవిధంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన అమాన వీయ చరిత్ర చంద్రబాబుకు గుర్తులేదా? 1996లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు చేపట్టిన చర్యలేమిటి? సబ్సిడీ బియ్యం ధరను ఎన్టీఆర్ నిర్ణయించిన రూ. 2 నుంచి రూ. 5.50కు పెంచారు. తెల్లరేషన్ కార్డులను ఏరివేశారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. సబ్సిడీలలో కోత పెట్టారు. సంపన్నులను శిక్షించి సామాన్యులను ఆదుకోవడం ప్రభుత్వాల ధర్మం అని చాణక్యుడు చెప్పాడు. క్రాస్ సబ్సిడైజేషన్కు మూలం ఈ సూత్రం. కానీ, అభినవ చాణక్యుడిగా చెప్పదగ్గ చంద్రబాబు అందుకు భిన్నంగా పేదలను శిక్షించి సంపన్న వర్గాలకు మేలు చేశారు. పారిశ్రామికీ కరణ పేరుతో, ఐటీ పేరుతో ప్రభుత్వ భూములను అస్మదీయులకు అప్పనంగా అందించారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానన్న రైతుల రుణమాఫీని ఎన్ని విధాలుగా కుదించారో ప్రత్యే కంగా ప్రస్తావించనక్కర్లేదు. ఆయన నిఘంటువులో సంక్షేమం అనే పదానికి భిన్నమైన అర్థం కనపడుతుంది. సంక్షేమ హాస్టళ్లను మెరుగు పర్చడానికి రూ. 100 కోట్లు కోరితే, దానిని పక్కన బెట్టి 400 కోట్లతో ఆఫ్రో ఆసియన్ క్రీడలను నిర్వహించడం ద్వారా తనకు ప్రచారం తప్ప ప్రజల కష్టాలు పట్టవని చంద్రబాబు చాటుకున్నారు. అధికారంలో ఉండగా చేయగలిగిన పనులను కూడా చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చాక దొంగ దీక్షలు, కొంగ జపాలు చేయడం చంద్ర బాబుకే చెల్లింది. - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీమంత్రి -
తండ్రి సంకల్పం... తనయుడి సాకారం
సంకల్పశుద్ధికి చిత్తశుద్ధి తోడయితే ఎంతటి కష్టసాధ్యమైన పనైనా సాకారం అవుతుందని చెప్పడానికి ఓ ఉదాహరణ ‘పోలవరం’ బహుళా ర్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం ముగింపు దశకు చేరడం. ప్రపంచం లోనే అతిపెద్ద స్పిల్‌వేతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఫలాలు అనతి కాలంలోనే ప్రజలకు అందను న్నాయి. గోదావరి డెల్టాకు తొలిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్రక్రియకు జూన్ 11న అంకురార్పణ జరిగింది. అప్పర్ కాఫర్ డ్యావ్‌ు పూర్తి చేసి స్పిల్‌వే మీదుగా నీరు విడుదల కాబోతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్ ద్వారా స్పిల్‌వేకు మళ్లించే పనులు ముమ్మరమయ్యాయి. గోదావరి నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల చేయడం వల్ల ఆ నీరు స్పిల్‌వే, రివర్‌స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతోపాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే ఇది పోలవరం అందించే తొలిఫలితం అవుతుంది. ‘పోలవరం’కు ఎదురైన అడ్డంకులు బహుశా భారత దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకూ ఎదురు కాలేదనడం అతి శయోక్తి కాదు. వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలు కాకుండా వాటిని గరిష్ఠంగా ఉపయోగించుకోవడా నికి పోలవరం ప్రాజెక్టును నిర్మించాలన్న ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడే తెరపైకి వచ్చింది. అయితే, రాష్ట్రం ఏర్పడిన 2 దశాబ్దాల తర్వాత 1979లో నాటి ముఖ్య మంత్రి టి.అంజయ్య పునాదిరాయి వేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదంటే పరిపాలన ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, 2004లో వైఎస్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సాగునీటి ప్రాజెక్టులను కట్టా లని జలయజ్ఞం అనే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. 2005లో పోలవరం నిర్మాణానికి చొరవ తీసుకొన్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టు కడితే ఆ ఘనత రాజశేఖరరెడ్డికి చెందుతుందనే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులు పన్ని పలు ఆటంకాలు సృష్టించారు. తమ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులతో న్యాయస్థానంలో కేసులు వేయించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు పార్టీ పరంగా లేఖలు రాసి రెచ్చగొట్టారు. వైఎస్ ఉక్కు సంకల్పం ముందు ఎవరి కుయుక్తులు పనిచేయలేదు. ఆయన అధికా రంలో ఉన్న కాలంలోనే 2005–2009 మధ్యకాలంలో కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు 90 శాతం పూర్తి చేశారు. 2018 నాటికే పోలవరం పూర్తి కావల్సి ఉంది. కానీ, ఆలస్యం కావడానికి కారణం చంద్రబాబు చూపిన ఉదా సీనతతోపాటు, జరిగిన అవినీతి. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి నివేదికలు పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ‘పోలవరంను చంద్రబాబు ఒక ఏటీఎంగా మార్చారు’ అని ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోల వరం నిర్వాసితుల సమస్యను నిర్లక్ష్యం చేసింది. 2013 భూసేకరణ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించింది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి రాష్ట్ర చరిత్రను తిరగరాయడానికి దోహదం చేసింది. సీఎం వైఎస్ జగన్ పోలవరం పనుల్లో పారదర్శకత తెచ్చారు. కేంద్రానికి సంపూర్ణ నమ్మకం కలిగించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు సెటిల్మెంట్ కల్పించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా ఇంజనీరింగ్‌కు లక్ష్యాలు నిర్దే శించారు. ఫలితంగానే ఈ రెండేళ్లల్లో నిర్మాణపు పనులు పరుగులు తీయడమేకాక, ఈ సీజన్లోనే వరదను మళ్లించ డానికి అనుగుణంగా అప్రోచ్ చానెల్, స్పిల్‌వే గేట్ల ఏర్పాటు, స్పిల్ చానెల్, పైలెట్ చానెల్ దాదాపు పూర్తయ్యాయి. గోదా వరికి అప్రోచ్ చానెల్ ప్రారంభయ్యే చోట తాత్కాలికంగా ఉన్న బండ్‌ను తొలగించడంతో గోదావరి ప్రవాహాన్ని కుడి వైపునకు పంపించి నదినే 6.6 కిలోమీటర్ల మేర మళ్లించారు. భారీ వరదలు వచ్చినపుడు రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇలా స్పిల్‌వే నుంచి స్పిల్ చానెల్లోకి విడుదల చేసిన నీరు పైలెట్ చానెల్ ద్వారా తిరిగి గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తుంది. దేశంలో రెండో పెద్ద నది అయిన గోదావరికి వరదలు వస్తే 35 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి నదిని 6.6 కిలోమీటర్లు మళ్లించడం సామాన్యం కాదు. అదొక ఇంజినీరింగ్ అద్భుతం. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్టు పూర్తయిన తరువాత కూడా అలాగే కొనసాగు తుంది. నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) ఉంటాయి. అందులో గ్యాప్2గా పిలిచే ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కవ్‌ు ర్యాక్ ఫిల్ డ్యాం) అతి పెద్దది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునే విధంగా దీనిని నిర్మిస్తున్నారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి అవసరమైన పనులు రికార్డ్ సమయంలో జరిగాయి. ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్‌వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ చానెల్‌ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వే శారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో కోటి 54 లక్షల 88 వేల ఘనపు మీటర్ల మట్టి త్రవ్వకం పనుల్లో ఇప్పటికి 1 కోటి 4 లక్షల 88 వేల ఘనపు మీటర్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రేయింబవళ్లు యంత్రాంగం పని చేయడం విశేషం. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖామా త్యులు అనిల్ కుమార్ యాదవ్ సమకూర్చిన ప్రోత్సాహం అద్భుతం. మొత్తం మట్టి పని 5 కోట్ల 92 లక్షల పనికి గాను 5 కోట్ల 24 లక్షల ఘనపు మీటర్ల మేర పూర్తయ్యింది. మొత్తం సిసి బ్లాకులు (స్పిల్‌వే) 17 లక్షల ఘనపు మీటర్లు కాగా 15.17 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయ్యింది. ఇందులో స్పిల్‌వే కీలకమైనది. 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని నియం త్రించి గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తుంది. ప్రపం చంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్వేగా చైనా లోని త్రిగాడ్జెస్ జలాశయానికి పేరుంది. ఇప్పుడు దాని కంటే పోలవరం జలాశయం సామర్థ్యం 3 లక్షల క్యూసె క్కులు అధికం. ఇంతపెద్ద వరద నీటిని తట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఇందు కోసం 15.17 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనులు చేశారు. గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో నిర్వహిస్తారు. అందులో భాగంగా 22 పవర్ ప్యాక్‌లను 44 గేట్లకు అమర్చారు. 28 రేడియల్ గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో ఈ సీజన్లో వరద వచ్చినా విడుదల చేసే విధంగా 28 గేట్లను ఎత్తి ఉంచారు. వైఎస్ చొరవ వల్లనే నాడు పోలవరం అడుగులు ముందుకుపడ్డాయి. రెండేళ్లల్లో జగన్ కృషితో దశాబ్దాల కల సాకారం కానుంది. చరిత్రలో ఓ తండ్రి మొదలుపెట్టిన ప్రాజెక్టును కుమారుడు పూర్తి చేయడం ఇదే మొదలు. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీమంత్రి -
అభ్యర్థులు దొరకక... బరిలో నిలవలేక...
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట ములు సహజం. ప్రజల తీర్పును ఎవరైనా హుందాగా స్వీకరించా ల్సిందే. 40 యేళ్ల రాజకీయ అను భవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆ మాటను పదేపదే చెప్పుకొంటారే తప్ప, ఆ రాజకీయ పరిపక్వతను చేతల్లో చూపరు. 2014 ఎన్నికలలో కేవలం 5 లక్షల ఓట్ల వ్యత్యాసంతో విజయం చేజారినా ఆనాడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటనే ప్రజాతీర్పును శిరసావహిస్తామనీ, ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామనీ వినమ్రంగా తెలిపారు. కానీ చంద్రబాబు 2019 ఎన్నికలలో కేవలం 23 సీట్లకు పరిమితమైతే ‘మరీ ఇన్ని తక్కువ సీట్లా’ అంటూ ఆశ్చర్యం ప్రదర్శించారే తప్ప, ప్రజాతీర్పును గౌరవించ లేకపోయారు. ఆ ధోరణి ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపారు. పంచాయితీ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాచి పనులు చేసు కోవడానికి ఇతర రాష్ట్రాలకు పోతున్నారంటూ సామాన్య ప్రజలను చులకన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పట్ల విసుగెత్తిపోయి దూరం జరిగారని అందదరికీ అర్థం అయిందిగానీ, తనకు అర్థం కానట్లు ఆయన నటిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభించిన చారిత్రక విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉక్రోషంతో, ఉడుకుమోతుతనంతో మాట్లాడుతున్న మాటలు ఆయన అపసవ్య మానసిక స్థితికి, దెబ్బతిన్న మానసిక స్థయిర్యానికి ప్రతీక. అధికార పార్టీ చేసే ప్రతి పనిని తప్పుపట్టాలని, వాటిని భూతద్దంతో సొంత మీడియాలో చూపించి ప్రజల సానుభూతి పొందాలని భావిస్తున్నారే తప్ప వేసిన తప్పటడుగుల్ని సరిచేసుకోవాలనే ఉద్దేశం ఎక్కడా కనబడదు. చంద్రబాబు 2014–19 మధ్య అధికారంలో ఉండగా చేసిన తప్పులు సామాన్యమైనవి కావు. తెలంగాణలో అధి కారంలో ఉన్న టీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ‘ఓటుకు కోట్లు’ వంటి అనైతిక చర్యకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలన్న దుర్బుద్ధితో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఆయన పరిభాషలోనే చెప్పాలంటే సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. అంతకుముందే ప్రతిపక్షనేత జగన్‌పై కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయించారు. ప్రజ లందర్నీ సమానంగా చూడకుండా ఒక వర్గానికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించడానికి అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రజల్లో తన విశ్వసనీయతను తనే దెబ్బ తీసుకొన్నారు. స్థానిక సంస్థలకు 2018లోనే ఎన్నికలు జరగాలి. కానీ, ఆనాడు తన పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి ఎన్నికలను జరపలేదు. అందుకు వంతపాడి నట్లుగా బాబు సొంతమనిషి రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా మారు మాట్లాడలేదు. నిజానికి, దేశంలోని ఐదంచెల స్థానిక సంస్థలకు నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు జరిగి స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలన్న ఉద్దేశంతో 1992లో భారత పార్లమెంట్ 73, 74 రాజ్యాంగ సవరణలు తెచ్చింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏర్పా టయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1992 తర్వాత రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిర్ణీత గడువులో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం, ఏడాదిలోగా తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామకం సజావుగా సాగింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేసింది. ఏడాదిన్నర తర్వాత జనవరి 30, 2016న రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవస్థ ఏర్పాటైంది. అయితే, ఎన్నికల కమిషనర్‌ను మాత్రం నియమించలేదు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31, 2016న పదవీ విరమణ చేశారు. 24 గంటలు తిరగకముందే ఆయన్ని చంద్రబాబు కుర్చీలో కూర్బోబెట్టారు. తన సొంత మనిషిని నియమించడం కోసమే అంతకాలం వేచి చూశారన్నది స్పష్టం. స్థానిక సంస్థలకు గడువు పూర్తయినా ఎన్నికల కమిషనర్ నోరు విప్పలేదంటే అప్పటి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసినట్లు తేటతెల్లం అవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ అధికారంలో ఉన్నంతవరకూ ఆయనను కవచంగా పెట్టుకొని చంద్ర బాబు ప్రభుత్వంపై అధర్మ యుద్ధానికి దిగిన వైనం దేశమంతా చూసింది. మార్చి 15, 2020న రాష్ట్ర ప్రభుత్వంతోగానీ, ఏ రాజకీయ పార్టీతోగానీ సంప్రదించకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు ఎన్నికల కమిషనర్. ఎంపీటీసీ స్థానాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం కావడం చంద్రబాబు సహించలేక పోయారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు నిమ్మగడ్డ ఏకగ్రీవాలు జరగడంపై అనుమానాలు ఉన్నాయంటూ, ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో రూపొందిన వాస్తవం సీఐడీ దర్యాప్తులో బయటపడింది. ఎంపీటీసీ ఏకగ్రీవాలు బల వంతంగా జరిగివుంటే నిమ్మగడ్డ వెంటనే స్పందించి ఉండే వారు. కానీ తెలుగుదేశం అధినేత ఒత్తిడిపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారని స్పష్టంగా బయటపడింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నిక లను నిర్వహించారు. మార్చి 31, 2021న పదవీ విరమణ చేసేముందు తగిన సమయం ఉన్నప్పటికీ తెలుగుదేశానికి మేలు చేయాలన్న దురుద్దేశం నిమ్మగడ్డలో స్పష్టంగా కని పించింది. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పాల్గొ నకుండా వాటిని బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం చేసిన ప్రకటన ఎవర్నీ ఆశ్చర్యపర్చలేదు. కనీసం అభ్యర్థులను నిలబెట్టలేక కొత్త డ్రామాకు తెర తీసింది. నిమ్మగడ్డ కమి షనర్‌గా ఉండగా తీసుకున్న నిర్ణయాలను సమర్థించిన తెలుగుదేశం నూతన కమిషనర్ నిర్ణయాలను తప్పు పట్టడం ద్వంద్వ నీతి. తమ తప్పులను కప్పిపుచ్చుకొని, తమ వైఫ ల్యాలకు కారణం ప్రజలేనని నిందించిన వారు చరిత్ర హీను లుగా మిగిలిపోయారు. ఇందుకు ఏ ఒక్కరూ అతీతం కాదని ప్రతిపక్షనేత గ్రహిస్తే మంచిది. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
పాలనలో, పార్టీలో మానవీయ ముద్ర
సరిగ్గా దశాబ్దకాలం క్రితం.. మార్చి 12, 2011న కడప జిల్లా ఇడుపులపాయ గడ్డ వైఎస్సార్ (యువజన, శ్రామిక, రైతు) కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. ప్రజల ఈతిబాధల పట్ల సహానుభూతి, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం వంటి సుగుణాలే.. 2019లో వైఎస్ జగన్‌కి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించాయి. ఈ 21 నెలల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్... క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా.. నవరత్నాలలోని పథకాలను అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్ర పరిపాలనలో, పార్టీ వ్యవహారాలలో తనదైన మానవీయ ముద్ర వేసిన వైఎస్ జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో, అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించడం తథ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తదుపరి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గత దశాబ్దకాలం ఓ మహత్తర చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది. సరిగ్గా దశాబ్దకాలం క్రితం.. మార్చి 12, 2011న కడప జిల్లా ఇడుపులపాయ గడ్డ వైఎస్సార్ (యువజన, శ్రామిక, రైతు) కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. ఆ రోజున పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా యువజనులు, శ్రామికులు, రైతులు, మహిళల ఆశల్ని, ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం పొందిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి నుంచి పుణికిపుచ్చుకొన్న విశిష్ట లక్షణాలు, రాజీపడని వ్యక్తిత్వమే ప్రాంతీయ పార్టీగా ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ఏర్పాటు చేయడానికి ఆయనను పురిగొల్పింది. ప్రజల ఈతిబాధల పట్ల సహానుభూతి, ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం వంటి సుగుణాలే.. 2019లో వైఎస్ జగన్‌కి చరిత్రాత్మకమైన విజయాన్ని అందించాయి. ఆదర్శ నాయకుని కుటుంబంపై కుట్రలు, కుతంత్రాలు రెండు పర్యాయాలు 2004లో, 2009లో పార్టీని అధికారంలోకి తెచ్చిన మహా నాయకుడి కుమారుడి పట్ల అత్యంత అమానుషంగా ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై కుట్ర చేసిన ఫలితంగానే జాతీయ పార్టీ కాంగ్రెస్ నేడు ఆంధ్రప్రదేశ్‌లో మట్టికొట్టుకు పోయింది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళుతూ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సెప్టెంబర్ 2, 2009న పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురై విషాదకర పరిస్థితులలో మరణిం చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మహా నేత డాక్టర్ వైఎస్సార్ మరణాన్ని ఆయన సహచరులు, అభిమానులు, కార్యకర్తలు, పేదలు, సామాన్యులు.. ఇలా ప్రతి వర్గం తట్టుకోలేకపోయింది. ‘కాంగ్రెస్ పార్టీ ఇక బ్రతకదు.. దానికి నూకలు చెల్లాయి’ అని అందరూ అంటున్న సమయంలో ఆ పార్టీకి ప్రాణం పోసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజలలో నమ్మకం కల్పించి కాంగ్రెస్ పార్టీకి 2004 మే ఎన్నికలలో అఖండ విజయం సాధించి పెట్టారు. తను అమలు చేసిన వినూత్న సంక్షేమ, అభివృద్ధి పనులతో ప్రజల హృదయాలను గెలుచుకొని తిరిగి 2009లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. అంతేకాదు.. 2004లో 27 మంది లోక్‌సభ సభ్యులను, 2009లో 33 మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ-1, యుపీఏ-2 ప్రభుత్వాలు ఏర్పడటానికి దోహదం చేశారు. అంతటి గొప్ప ప్రజా నాయకుడు చనిపోయిన తరువాత సొంత పార్టీలోకి కొన్ని శక్తులు, ప్రత్యర్థి పార్టీలోని నాయకులు, మీడియాలోని ఓ వర్గం కుమ్మక్కై వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం సాగించారు. ఓదార్పు నిర్ణయం ఆటంకాలు 2009లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాక.. ఆమె అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం.. డాక్టర్ వైఎస్సార్ అభిమానుల్ని కదిలించింది. ముఖ్యంగా వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక గుండె ఆగి కొందరు, ఆత్మహత్యలు చేసుకొన్న మరికొందరు తమ కుటుంబాలను అనాథలుగా మిగిల్చి వెళ్లారని, అటువంటి వారందర్నీ ఆదుకోవడం తమ ధర్మమని విజయమ్మ చెప్పడం ఆ కుటుంబాలకు గొప్ప ఊరట నిచ్చింది. మృతుల కుటుం బాలను పరామర్శించడానికి వైఎస్ జగన్ ఏప్రిల్ 9, 2010న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. అయితే, జగన్‌కు ప్రజల్లో లభించిన ఆదరణ చూసి తట్టుకోలేని కొన్ని వర్గాలు.. పార్టీ విభేదాలు పక్కన పెట్టి చేతులు కలిపాయి. డాక్టర్ వైఎస్సార్ కుటుం బంపై కుట్రలు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఓదార్పు యాత్రకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. మలివిడత యాత్రను కూడా చేయొద్దని చెప్పడంతో.. ఇక కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తల వంచకుండా బయటపడుతూ నవంబర్ 29, 2010న విజయమ్మ, వైఎస్ జగన్ ఇరువురూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు వేయించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయించింది. 2014 ఎన్నికలS సమయంలో నరేంద్ర మోదీ గాలి దేశవ్యాప్తంగా వీస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీలు అవకాశవాద పొత్తు పెట్టుకోవడమేకాక.. ‘జనసేన’ అంటూ బయలుదేరిన సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇంటికి బాబు వెళ్లి తనకు సహకరించమని ఒప్పందం చేసుకోవడతో ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 5 లక్షల ఓట్ల వ్యత్యాసంతో 63 సీట్లు పొంది ప్రతిపక్షంలో కూర్చుంది. 2014, మే 17న ఎన్నికల ఫలితాలు వెలువడిన స్వల్ప వ్యవధిలోనే ఆనాడు వైఎస్ జగన్ ప్రజల ముందుకొచ్చి ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఓటమికి బాధ్యులుగా ఎవ్వరినీ వేలెత్తి చూపలేదు. సహచర ఎమ్మెల్యేలలో, నాయకులలో, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అయితే, 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్‌పై కత్తి గట్టినట్లు ప్రవర్తించింది. ఫిరాయింపుల్ని ప్రోత్సహించి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది. అసెంబ్లీలో సైతం వైఎస్సార్సీపీ నేతలను మాట్లాడనివ్వకపోవడం, దూషించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడింది. నవంబర్ 6, 2017న వైఎస్ జగన్ మొదలు పెట్టిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇడుపులపాయ నుండి మొదలై 13 జిల్లాల్లో 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియడం దేశ రాజకీయాలలోనే ఓ సంచలనం. పాదయాత్ర పొడవునా జగన్.. సమాజంలోని రైతాంగాన్ని, చేతివృత్తుల వారిని, యువతను, మహిళలను.. ఇలా ప్రతి ఒక్కరినీ కలుసుకొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈతిబాధలను అర్థం చేసుకొన్నారు. నవరత్నాలతో మెరుగైన జీవన ప్రమాణాలు అధికారంలోకి రాగానే.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ‘నవరత్నాలు’ అమలు చేస్తామంటూ వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను ఆకర్షిం చింది. ఇచ్చిన మాటకు కట్టుబడతారని పేరు తెచ్చుకొన్న వైఎస్ జగన్.. ఎన్నికల మేనిఫెస్టోను ‘పవిత్ర భగవద్గీతగా, పవిత్ర బైబిల్‌గా, పవిత్ర ఖురాన్’ గా భావించి అమలు చేస్తామని ఇచ్చిన హామీ, పార్టీ అభ్యర్థుల ఎంపికలో చేసిన సామాజిక న్యాయం మొదలైన అంశాల కారణంగానే.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 50% ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగారు. 22 లోక్‌సభ సీట్లలో విజయకేతనం ఎగరవేశారు. చెక్కు చెదరని ప్రజాభిమానం అధికారం చేపట్టిన ఈ 21 నెలల్లో సీఎంగా వైఎస్ జగన్.. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా.. నవరత్నాలలోని పథకాలను అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. అనేక వినూత్న సంక్షేమ పథకాలను పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేయడం వల్లనే ఆయా వర్గాల ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతూనే.. పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలో, పార్టీ సంస్థాగత వ్యవహారాలలో తనదైన మానవీయ ముద్ర వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో, అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించడం తథ్యం. వ్యాసకర్త డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెడన శాసనసభ్యుడు జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం రూ.87 వేల కోట్ల ఖర్చుతో వైకుంఠ ఏకాదశి రోజు ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. చదవండి: (ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణం) ఆలయాలపై వరుస దాడుల గురించి స్పందిస్తూ రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని, అయితే దానిపై ప్రతిపక్షాలు లేనిపోని హడావిడి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడి జరగకుండా ఉండేందకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. -
బైడెన్ గెలుపు పర్యావరణ హితానికి కీలక మలుపు
చరిత్రాత్మక ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు 2016లో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండో సారి గెలిచి ఉంటే, పర్యావరణానికి సంబంధించి యావత్ మానవాళికి ముప్పు వాటిల్లేదని ప్రజాభి ప్రాయం. అభివృద్ధి, నాగరికత, పారిశ్రామికీకరణల పేరుతో పర్యా వరణానికి చేజేతులా ముప్పు తెచ్చిన ప్రపంచ దేశాలు ఆలస్యంగా మేలుకొని చేసిన తప్పులు దిద్దుకోవడానికి గత 3 దశాబ్దాలుగా పాట్లు పడుతున్నాయి. భారీ డ్యాముల నిర్మాణం, ఖనిజాల త్రవ్వకం, అడవుల నరికివేత, అణు రియాక్టర్ల నిర్మాణం, బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం, డీజిల్ పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల్ని అడ్డూఅదుపూ లేకుండా మండించడంతో జీవవైవిధ్యం దెబ్బతింది. మాన వుని మనుగడకే ప్రమాదం వాటిల్లే దుస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 190 దేశాలు సమావేశమై ‘వాతావరణ విధాన పత్రం’ను రూపొందిం చాయి. ఈ ఒప్పందంలో భూతల వేడిమిని వచ్చే 100 ఏళ్లలో ఇప్పుడున్న ఉష్ణోగ్రత స్థాయికి 2 డిగ్రీల సెల్సియస్ కంటే మించకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని తీర్మా నించాయి. పారిస్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరై భారత్ తరఫున ఒప్పందం మీద సంతకం చేశారు. 2016 నవంబర్ నుంచి పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి విస్మ యానికి గురిచేశాడు. వాతావరణంలో కలుస్తున్న గ్రీన్ హౌస్ వాయువులలో అమెరికా వాటా 15 శాతం. ఇంత పెద్ద మొత్తంలో నియంత్రించే చర్యలు చేపట్టాలంటే పారి శ్రామిక ఉత్పత్తులను తగ్గించాల్సి వస్తుందనీ, దానివల్ల అమెరికాలో నిరుద్యోగం పెరగడమే కాకుండా ఆర్థికాభి వృద్ధి దెబ్బతింటుందనీ ట్రంప్ వాదించాడు. పైగా చైనా, భారత్ పారిశ్రామికీకరణను వేగవంతం చేస్తూ తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకొంటున్నాయి కనుక, తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటామని అన్నాడు. 2017 జూన్‌లో అధికారికంగా పారిస్ వాతావరణ ఒప్పందానికి చెల్లుచీటీ రాశాడు. ఒప్పందం నుండి బయటకు రావా లంటే మూడు సంవత్సరాల వ్యవధి పడుతుంది. ఈ నిబం ధన వల్ల నవంబర్ 4, 2020న అమెరికా ఒప్పందం నుండి బయటకొచ్చినట్లయింది. యాదృచ్ఛికంగా నవంబర్ 4నే ట్రంప్ అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోవటం విశేషం. అమెరికాలో మొదట్నుంచీ డెమొక్రాట్లు పారిస్ ఒప్పం దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక యిన వెంటనే తొలి నిర్ణయం పారిస్ వాతావరణ ఒప్పం దంలోకి పునఃప్రవేశించే దానిపైనే ఉంటుందని జోబైడెన్ ప్రకటించాడు. గత 4 ఏళ్లలో ‘గ్లోబల్ వార్మింగ్’ అమెరికాను అతలాకుతలం చేసింది. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభ వించాయి. దీంతో, క్షీణిస్తున్న దేశ వాతావరణాన్ని రక్షిం చుకోవాలన్న ఆకాంక్ష సగటు అమెరికన్లలో పెరిగింది. చైనా, భారత్ పర్యావరణ హితాన్ని విస్మరిస్తున్నా యంటూ ట్రంప్ చేసిన విమర్శల్లో కొంత నిజం లేక పోలేదు. కర్బన పదార్థాల వినియోగంలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ది 4వ స్థానం. రష్యా 5వ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరి చాలా కాలమైంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలాంటి మెట్రో నగరాలలో ఆక్సి జన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2008లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ వాతావరణ మార్పు’పై విధా నాన్ని ప్రకటించింది. కాలుష్యరహిత బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని క్రమేపీ తగ్గించి బ్యాట రీలతో నడిచే వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. మోదీ ప్రధానమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టాక ‘సౌర శక్తి’ వినియోగంలో చొరవ చూపారు. ‘అంతర్జాతీయ సౌరశక్తి కూటమి’ ఏర్పాటు చేశారు. దేశంలో వ్యవసాయ పంపుసెట్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపుసెట్లను దశలవారీగా సమకూర్చే ప్రక్రియ వేగవంతంగా అమలు అవుతోంది. దేశంలో రుతుపవనాల ఆగమనం, క్రమం తారు మారు అవుతున్నాయి. వర్షాకాలం 4 నెలలపాటు కొనసాగి నిర్ణీత వ్యవధిలో వర్షాలు పడటం ఆనవాయితీ. కొన్ని సంవత్సరాలుగా ఏకధాటిగా రెండు, మూడు రోజులపాటు కురియడం, ఆ తర్వాత వర్షాల జాడ లేకపోవడం వంటి వాతావరణ మార్పులతో వ్యవసాయరంగం ఆటుపోట్లకు గురవుతోంది. వరి వెన్ను పుష్పించే సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లయితే ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది. ‘యూనివర్సల్ ఎకొలాజికల్ ఫండ్’ నివేదిక ప్రకారం 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే వరి, గోధుమ దిగుబడుల్లో రమారమి 30 శాతం క్షీణత నమోదవుతుంది. ఉష్ణోగ్రత పెరుగుదల ప్రభావం అన్ని పంటల్లోకెల్లా వరి, గోధుమ, మొక్కజొన్నలపై ఎక్కువ ప్రతికూలత చూపుతుంది. అత్యధిక దేశాలలో ప్రజలు ఈ మూడు పంటల్నే ప్రధానాహారంగా తీసుకుంటారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మొక్కజొన్న పంటను కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నను ఆహారంగా తీసుకొనే ఆఫ్రికా ఖండంలోని జాంబియా, కాంగో, జింబాబ్వే, మొజాంబిక్, మడగాస్కర్ తదితర దేశాలలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం చేసే బాధ్యతను స్వీకరిస్తున్న ప్రభుత్వాలు పర్యావరణ ‘న్యాయం’ కూడా చేయాలి. స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహ్లాదకరమైన పరిసరా లను అందుబాటులోకి తేవడమే ‘పర్యావరణ న్యాయం’. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి. ఆ పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ కీలకం కానున్నది. వాతావరణ ఆంక్షల్ని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుద్ది, సంపన్న అగ్ర దేశాలు తప్పించుకోవాలని చూస్తే అంతకంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదు. భూగోళాన్ని కాపాడేందుకు ఎవరివంతు పాత్ర వారు పోషించాలి. ఆ దిశగా భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. అమెరికా తిరిగి పారిస్ ఒప్పందంలోకి ప్రవేశించడం ఆహ్వానించదగినది. వ్యాసకర్త: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు: బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణను వీధి రౌడీ అంటూ అనుచితవ్యాఖ్యలు చేశారు. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు జగదీశ్వరరావు, అంగర రామ్మోహన్ మంత్రులపైకి దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. మమ్మల్ని వీధి రౌడీలని టీడీపీ సభ్యులు ఎలా అంటారు. మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చూడలేదు. టీడీపీ సభ్యులు నోటికెంత వస్తే అంత మాట్లాడుతున్నారు. చదవండి: (బాబూ వంద కోట్ల ఫైన్ అప్పుడే మర్చిపోయారా..?) మేము రన్నింగ్ కామెంటరీ చేసే వ్యక్తులం కాదు. ప్రభుత్వం తరపున మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఇది మంచి పద్దతి కాదు' అంటూ బొత్స హెచ్చరించారు. సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. ఇది పెద్దల సభ. సభ్యులు హుందాగా వ్యవహరించాలి. టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు సభాసంప్రదాయాలు కూడా పాటించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లులు ఆమోదం) -
పార్లమెంట్ క్రియాశీలతే ప్రజాస్వామ్య మనుగడ
ప్రజలకు మేలు చేసే చట్టాల రూప కల్పన బాధ్యతే కాకుండా అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు ఆదర్శప్రా యంగా నిలవాల్సిన గురుతర బాధ్యత పార్లమెంట్‌పై ఉంది. భిన్న ఆలోచనల సంఘర్షణతో, మేలిమి చర్చ సంవాదాలతో ఏకాభిప్రాయ సాధన ద్వారా ఆమోదం పొందా ల్సిన కీలక బిల్లులు, యాంత్రికంగా సంఖ్యాబలంతో ఆమోదం పొందడం ప్రజాశ్రేయస్సుకు గొడ్డలిపెట్టు. ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో అత్య ధికశాతం ఆర్డినెన్సులు తగిన చర్చ లేకుండానే చట్టాలుగా రూపొందాయి. కీలక బిల్లులపై సమగ్ర చర్చ లేకుంటే చట్టంలో తప్పులు దొర్లుతాయి. తిరిగి సవరణలు చేయా ల్సిన అవసరం ఏర్పడుతుంది. వ్యవసాయరంగానికి సంబం ధించిన మూడు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టినపుడు జరిగినంత గందరగోళం గతంలో ఎన్నడూ జరగలేదు. పర్య వసానంగా సభ్యులను సస్పెండ్ చేశారు. తమ భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్, అన్నాడీఎంకే వంటి పార్టీలు సైతం బిల్లును వ్యతిరేకించడాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తేలిగ్గా తీసు కోవడం ఆశ్చర్యం. రైతాంగంలో నెలకొన్న భయాందోళనల్ని తొలగించడానికి, ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ను ఓ చక్కని వేదికగా మలుచుకొని ఉంటే ప్రయోజనం కలిగేది. ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్లనే పాలకపక్షం ఆత్మరక్షణలో పడిపోయిందనే భావన సర్వత్రా వ్యక్తం అయింది. పార్లమెంట్ సమావేశాలలో దిగజారుతున్న ప్రమా ణాలను దృష్టిలో ఉంచుకొని 1993లో 24 శాశ్వత పార్లమెం టరీ స్టాండింగ్ కమిటీల్ని ఏర్పాటు చేశారు. అయితే, పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు సైతం నామమాత్రంగా పనిచేస్తున్నా యని పలు అధ్యయనాలలో వెల్లడయింది. గత పదేళ్లలో పార్లమెంట్ సమావేశాల సంఖ్య సగటున 67 రోజులకు కుదించుకుపోయింది. పార్లమెంట్ ఏర్పడిన మొదట్లో బడ్జె ట్‌పై సగటున 132 గంటలు చర్చ జరగగా గడచిన దశా బ్దంలో ఆ వ్యవధి 39 గంటలకు క్షీణించింది. 35% బిల్లుల్ని గంటసేపు కూడా చర్చించకుండానే ఆమోదించారు. ప్రభు త్వంలోని కీలకమైన రక్షణ, ఆర్థికం, వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, విదేశీ వ్యవహారాలు, పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్, రైల్వేస్ మొదలైన 24 ప్రభుత్వశాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ప్రధానంగా 1) ప్రభుత్వం పార్లమెం ట్లో ప్రవేశపెట్టే బిల్లుల పరిశీలన 2) మంత్రిత్వశాఖలకు జరిపే బడ్జెట్ కేటాయింపులపై వాస్తవిక పరిశీలన 3) నిర్దిష్ట అంశాలపై నివేదికల రూపకల్పన చేస్తాయి. ఈ స్టాండింగ్ కమిటీలలో అధికార, విపక్ష పార్టీల సభ్యులు కలిపి ఒక్కో కమిటీలో 31 మంది వరకు ఉంటారు. 10 మంది రాజ్యసభ నుండి, 21 మంది లోక్‌సభ నుంచి నామినేట్ అవుతారు. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్ వంటి కమిటీలకు చైర్మన్లుగా వివిధ పార్టీల సీనియర్ సభ్యులను నియమించడం మన ప్రజాస్వామ్య విశిష్టత. ఇటీవల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల కాలవ్యవధిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించాలని కీలక ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలోనే స్టాండింగ్ కమిటీలలో సభ్యులుగా ఉన్న వారి హాజరీ ఏవి ధంగా ఉంది, సమావేశాలు సజావుగా సాగుతున్నాయా, లేదా? అనే అంశాలపై ‘ఇండియాస్పెండ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఓ అధ్యయనం జరిపినపుడు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఎన్డీఏ గత ఐదేళ్ల తొలివిడత పాలనలో, అంటే 16వ లోక్‌సభ సమయంలో వ్యవసాయ రంగంపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆ ఐదేళ్లలో గరిష్టంగా 120 గంటలపాటు సమావేశం కాగా, పబ్లిక్ అండర్ టేకింగ్స్ స్టాండింగ్ కమిటీ కనిష్టంగా 40 గంటలు మాత్రమే సమావేశమయ్యింది. 15వ లోక్‌సభ కాలంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సమావేశ మొత్తం కాలంకంటే 16వ లోక్‌సభ కాలంలో 22% తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కమిటీలలో ఉండే సభ్యులకు చైర్మన్‌తో సహా అందరికీ విమాన టికెట్లు, హోటల్ వసతి, ఇతర అలవెన్స్‌లు కల్పిస్తున్నప్పటికీ వారి హాజరీ సగటున 70% మించడం లేదని తేలింది. 16వ లోక్ సభలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల పరిశీలనకు 41 బిల్లులు, 331 గ్రాంట్స్ అభ్యర్థనలు, 503 యాక్షన్ టేకెన్ రిపోర్టులు పంపించగా ప్రస్తుత 17వ లోక్‌సభ మొదలై 15 నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఏర్పడకపోవడం ఆశ్చర్యం.లాక్డౌన్ నుంచి ఆగస్ట్ చివరి వరకూ ఏ ఒక్క స్టాండింగ్ కమిటీ కూడా సమావేశం జరగలేదని వెల్లడయింది. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని స్టాండింగ్ కమిటీ సమావే శాలు నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ కూడా స్కైప్, జూవ్ు వంటి సాధనాల ద్వారా పలువురు ఎంపీలు టీవీ చానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ, వర్చువల్‌గా నిర్వహించుకునే అవకాశం ఉన్నా స్టాండింగ్ కమిటీల సమా వేశాలను మాత్రం నిర్వహించడం లేదు. ఈ సమావేశాలు జరగనట్లయితే ఆయా మంత్రిత్వశాఖలకు అందించే బడ్జె ట్లను వాస్తవిక ప్రాతిపదికన రూపొందిస్తున్నారా? ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నాయా? సంబంధిత శాఖలో దేనిని ప్రాధాన్యతగా తీసుకున్నారు? తదితర కీలక అంశా లను పరిశీలించే అవకాశం కమిటీలకు లేకుండాపోతుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకున్న విశిష్టత ఏమి టంటే వివిధ బిల్లుల్లో సాంకేతిక అంశాలు ఉన్నట్లయితే వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మార్పులుచేర్పులు సూచించడానికి ఆయా అంశాల్లో నిష్ణాతులైన వ్యక్తుల సేవ లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టే ‘బిల్లు’ ఏ వర్గానికైతే లాభం లేదా నష్టం కలిగించే అవకాశం ఉంటుందో ఆ ‘స్టేక్‌హోల్డర్స్’ను పిలిపించుకొని వారి అభిప్రాయాలు స్వీకరిస్తాయి.అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఇటీవలికాలంలో రాజకీయ వైరుధ్యాలు పెరిగిపోవడంతో చాలామంది సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకావడం లేదు. అసమ్మతిని తెలియజేయడానికి కమిటీ సమావేశాలను బహిష్కరించడం అంటే రాజ్యాంగ బాధ్యత నుండి సభ్యులు వెనక్కు మరలడంగానే పరిగణించాలి. పార్లమెంట్ సమా వేశాలు అర్థవంతంగా జరగడానికి అన్ని పార్టీలు బాధ్యత స్వీకరించాలి. పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుల చర్చ లకు ప్రసార మాధ్యమాల్లో అధిక ప్రాధాన్యం కల్పించాలి. పార్లమెంట్ ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తే ప్రజాస్వా మ్యానికి అంత మేలు జరుగుతుంది. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
‘ఇది ప్రజలకు దక్కిన గౌరవం’
సాక్షి, విజయవాడ: దేశంలోనే ప్రతిభ గల ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో స్ధానంలో నిలవడం గర్వకారణమని మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలో శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ వైఎస్ జగన్ దేశంలోనే ప్రతిభగల ముఖ్యమంత్రుల్లో మూడో స్థానంలో ఉండటం రాష్ట్రానికే గర్వకారణం. ప్రతి చిన్న విషయాన్ని అడ్డుకోవాలని చూసేవారికి, విమర్శించేవారికి ఇది కనువిప్పు కావాలి. మొదటి సారి సీఎం అయినా, పెద్ద పెద్ద నేతలకంటే మెరుగైన పరిపాలన అందించారు. ఎంతో మంది అనుభవం ఉన్న సీనియర్ సీఎంలు ఉన్నా జగన్ ముందు వరుసలో ఉన్నారు. 15 నెలల్లోనే ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత చూపించారు. అందుకే ఇది ప్రజలకు దక్కిన గౌరవం అని చెప్పాలి’ అని కొనియాడారు. చదవండి: 'చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం' -
‘ఇలాంటి వాటిని సీఎం జగన్ సహించరు’
సాక్షి, అమరావతి : నేతల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివేదిక తెప్పించుకున్నారన్నారు. శాసన మండలి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహించరని స్పష్టం చేశారు. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. (శాసన మండలిలో టీడీపీ హడావుడి) ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు వెల్లడించారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్ విసురుకోవడం మానుకోవాలని హితవు పలికారు. నరసాపురంలో జరిగిన సంఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పెవరిది అనే దానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటుందని, పార్టీ అనుమతి లేనిదే ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే వర్తిస్తుందని తెలిపారు. సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. (ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం) ఎంపీ వ్యవహారం అందరూ చూశారు: ప్రసాదరాజు ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పోల్చడం సరికాదని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారని, ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎంపీ వ్యవహారాన్ని అందరూ చూశారని, ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ లేకపోతే రఘురామ కృష్ణంరాజు గడ్డి పరకతో సమానమన్నారు. (‘ఎంతమందికి చికిత్స అయినా ప్రభుత్వం సిద్ధం’) -
మండలి ముందుకు కీలక బిల్లులు
సాక్షి, అమరావతి : మరి కొద్దిసేపట్లో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మండలిలో అవలంభించాల్సిన వ్యూహం గురించి వారితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇచ్చే అవకాశం లేదు. గతంలోనే రూల్ ప్రకారం జరగలేదని చైర్మన్ చెప్పారు. కేవలం విచక్షణ అధికారం ఉందనే సెలెక్ట్ కమిటీ పంపిస్తానని చెప్పారు. సభ అభిప్రాయం తీసుకోకుండానే వాయిదా వేసి వెళ్లిపోయారు. యనమల ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చి చెబుతున్నారు. ఆయన చెప్పిందే రూల్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు. యనమల వాదనలకు తలా తోక ఉండదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్ పెట్టి రిజెక్టు చేసినా నెలలో బిల్లులు పాస్ అయిపోతాయ’ని అన్నారు. చదవండి : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
శాసనసభ్యులకు కోవిడ్–19 పరీక్షలు
సాక్షి, గుంటూరు: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. మంగళవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలలో భాగంగా సోమవారం నగరంపాలెంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించారని చెప్పారు. చదవండి: అక్రమాలకు అంతే లేదు.. కరోనా పరీక్ష చేయించుకున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన సభ్యులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని సమావేశాలకు హాజరుకావాలని అన్నారు. పరిమితికి మించి సిబ్బందిని తీసుకురావద్దని సభ్యులకు సూచించారు.అనివార్య కారణాల వలన పరీక్షలకు హాజరుకాని వారికి అసెంబ్లీ వద్ద పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. కరోనా పరీక్షకు హాజరైన ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా -
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏదో విధంగా కించపరుస్తూ మాట్లాడటమే టీడీపీ అధినేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రతి దాన్నీ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► టీడీపీ మహానాడులోని 68 తీర్మానాలు మొన్నటి ఎన్నికల్లో ముద్రించిన 60 పేజీల మేనిఫెస్టో ప్రతిబింబిస్తున్నాయి తప్ప మరేమీ లేదు. ► టీడీపీ మేనిఫెస్టోను 2019లో ప్రజలు తిరస్కరించి వారిని ఓడించిన విధంగానే ఈ మహానాడు తీర్మానాలను కూడా ప్రజలు స్వీకరించరు. ► మహానాడులో 2014–19 వరకూ తాను చేసిన తప్పులపై చంద్రబాబు చర్చించాలి. ► తుగ్లక్ పాలన అని దిగజారి మాట్లాడటంతో పాటు బలిపీఠంపై బడుగుల సంక్షేమం అంటూ తీర్మానం పెట్టాలనుకోవడం దుర్మార్గం. ► గతంలో జరిగిన బీసీ సదస్సులో బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు కేవలం 29 శాతం మాత్రమే ఇచ్చారు. ఆయనకు ఎంత సేపూ ఇతరులను విమర్శించడమే తప్ప తాను ఏం చేశాననేది ఆలోచించరు. ► సీఎం వైఎస్ జగన్ 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం దాకా సీట్లు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల అనంతరం మంత్రివర్గంలోనూ అదే స్థాయిలో కేటాయించి కీలకమైన శాఖలను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు. ► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో మైనారిటీలు, ఎస్టీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు. ► రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి చివరకు ఏం చేశారో అందరికీ తెలుసు. ► మహానాడును ఒక క్రతువులాగా నిర్వహిస్తున్నారు తప్ప వాస్తవాలకు అనుగుణంగా జరపాలనే యోచన లేకుండా పోయింది. ► చంద్రబాబు తన తొలి సంతకానికి తూట్లు పొడిస్తే జగన్ తాను చేసిన తొలి సంతకాలను అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీతో సహా చంద్రబాబు పెట్టి పోయిన బకాయిలన్నీ జగన్ తీర్చేశారు. -
ఆ హామీని చంద్రబాబు ఎందుకు నెరవేర్చలేదు!
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారన్నారని, ప్రతి విషయాన్ని రాద్దంతం చేయాలన్నదే బాబు ప్లాన్ అని విమర్శించారు. మేనిఫెస్టోలోని హామీలను చంద్రబాబు ఏనాడూ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టో 65 పేజీలు మహానాడు తీర్మానాలు 60 పేజీలతో పెట్టారన్నారు. బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని చంద్రబాబు వరంగల్ సదస్సులో చెప్పారు. కానీ 29 శాతం మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పిన మాటలకు పనులకు పొంతన లేదని, పదవి దిగిపోయే ముందు చంద్రబాబు మైనార్టీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ అలా పదవులు ఇవ్వకుండా బడుగు బలహీన వర్గాలకు 60 శాతం మంత్రి పదవులు కట్టబెట్టారని, మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. (అప్పుడు కన్నా ఎందుకు మాట్లాడలేదు) చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకొని సీఎంపై విమర్శలు చేశారని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు బాబు దుష్ప్రచారం చేస్తున్నారని, బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తానన్న హామీని చంద్రబాబు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీసీలకు 60 శాతం సీట్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిది అని ప్రశంసించారు. మంత్రివర్గంలో కూడా సీఎం జగన్ బీసీలకు చోటు కల్పించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నలుగురికి డిప్యూటీ సీఎం పదవులిచ్చారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. (లొంగిపోయిన టీడీపీ నేత కూన రవికుమార్) తొలి సంతకం అమలు చేయలేదు మహానాడు పెట్టాలి కాబట్టి క్రతువుగా చంద్రబాబు పెడుతున్నాడని ఉమ్మారెడ్డి విమర్శించారు. మహానాడు వాస్తవానికి ప్రతిబింబంగా ఉండదన్నారు. ఇచ్చిన హామీలపై మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని పరిశీలించమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ‘రుణమాఫీ’ అమలు చేయలేకపోయారని, 87 కోట్లు రైతు రుణాల ఉంటే 24 వేల కోట్లకు కుదించారని దుయ్యబట్టారు. చంద్రబాబు తొలి సంతకంకు విలువ లేదని, ఆయన పాలనలో ప్రజలు ఆమోదం పొందిన పథకం ఒకటైన ఉందా అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం భావించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ('ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు') ‘‘గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం జగన్ గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామ వార్డు, సచివాలయం వ్యవస్థ, వలంటర్లు అద్భుతంగా పని చేస్తున్నాయి. సంక్షేమాన్ని ప్రతి గడపకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, విద్య వైద్యానికి సీఎం జగన్ పెద్ద పీఠ వేశారు. పేద పిల్లల భవిష్యత్ కోసం ఇంగ్లీషు మీడియం సీఎం ప్రవేశపెట్టారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిది ఏర్పాటు చేశారు. దళారి వ్యవస్థను సీఎం జగన్ రూపుమాపారు. 27 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సీఎం జగన్ ఇస్తున్నారు. సంక్షేమం మూల పడింది అని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను చంద్రబాబు పాటించలేదు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి పరిహారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రాయలసీమ ప్రాజెక్టులు పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదు. చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పట్టుకొని కృష్ణా గోదావరి నదులు అనుసంధానం చేశానని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. (టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే) చంద్రబాబు తప్పులు చర్చించాలి రాష్ట్ర విభజనకు మూల పురుషుడు చంద్రబాబు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది టీడీపీ. హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఓటుకు కోట్లు కేసులో నేను లేనని చంద్రబాబు చెప్పాలి. మహానాడును చంద్రబాబు ఇతర పార్టీలు తిట్టడానికి పెట్టొద్దు. నువ్వు ప్రజలకు ఏమి చేస్తావో మహానాడు ద్వారా చెప్పు. ఇతర పార్టీలపై బురద జల్లితే చంద్రబాబు బోర్ల పడతాడు. మహానాడులో చంద్రబాబు చేసిన తప్పులు గురించి చర్చించాలి. అయిదేళ్లలో ఏమి తప్పులు చేసారో సమీక్ష చేయాలి. ప్రభుత్వం మీద బురద జల్లలని చూస్తే అది మీ మొహం మీదనే పడుతుంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో 53 నిరార్ధక ఆస్తులు అమ్మలని టీటీడీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జరిగిన వాస్తవాలను సుబ్రహ్మణ్యం స్వామి బైట పెట్టారు. ఆస్తులు అమ్మడానికి మూల పురుషుడు చంద్రబాబే నని సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. అని ప్రతిపక్షనేత చంద్రబాబు బాగోతాన్ని బట్టబయలు చేశారు’’. -
వాలంటీర్ వ్యవస్థ సేవలు వెలకట్టలేనివి
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన పరిపాలనకు స్వీకారం చుట్టారని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని మోపిదేవి చెప్పారు. ఈ సంవత్సర కాలంలో 46 వేల కోట్లు ఖర్చు చేసి 3 లక్షల మంది లబ్దిదారులకు వివిధ పథకాలు అందించామని ఆయన అన్నారు. జగన్ పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్) అదే విధంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ఏడాదిలో 3 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశామని ఆమె చెప్పారు. కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ సేవలు వెల కట్టలేనివని మంత్రి గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చామని మేకతోటి సుచరిత అన్నారు. (సీఎం జగన్ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’) ఏడాది పరిపాలనను ప్రజా పరిశీలనలో పెట్టిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పరిపాలనలో రాజకీయాలు ఉండవని సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్ అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. -
ఇదేనా చంద్రబాబు చిత్తశుద్ధి: ఉమ్మారెడ్డి
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన బాధాకరమని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారని తెలిపారు. (‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’) ప్రతిపక్షాలన్నీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాయని.. కానీ చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రజలను వదిలేసి నేరుగా ఫ్యాక్టరీకే వెళ్తానన్నప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. విచారణ అనంతరం కంపెనీపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కంపెనీకి అనుకూలంగా మాట్లాడాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుబట్టారు. (‘అవే ఆయనకు దినచర్యగా మారాయి’) -
‘ఏపీ నాశనానికి చంద్రబాబు కంకణం’
సాక్షి, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్లకు పైగా నిధులు ఆగిపోతున్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే అంశం అని పేర్కొన్నారు. కరోనా బూచి చూపించి ఎన్నికలను వాయిదా వేయడం దారుణమన్నారు. అసలు ఏపీలో కరోనా వైరస్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. (‘కుట్రలకు చంద్రబాబు మారుపేరు’) ఎలా వాయిదా వేస్తారు..? కనీసం హెల్త్ సెక్రటరీ, సీఎస్ ను సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం సరికాదన్నారు. రాజ్యాంగ విలువలు పాటించలేదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. రాజ్యాంగ విలువలు గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసంతో ప్రజలు గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. మార్చి నెలాఖరులోపు ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావని తెలిసి కుట్రపూరితంగా ఎన్నికలను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన నీచపు పనిని ఆయన సమర్థించుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. (బెదిరించ లేదు, ఇది వాస్తవం: అంబటి) చంద్రబాబుకు కడుపు మండి పోతుంది.. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథాన నడవడం చూసి చంద్రబాబుకు కడుపుమండిపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని’ ఆయన విమర్శించారు. ‘‘చంద్రబాబు హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏకగ్రీవాలు జరగలేదా.. గతంలో 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి.. నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది నువ్వు కాదా’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి వాయిదా వేయించిన అసమర్థుడిగా చంద్రబాబును ఉమ్మారెడ్డి అభివర్ణించారు. ‘‘ప్రజా బలంతో 151 స్థానాలు సాధించాం. సీఎం వైఎస్ జగన్‌పై చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే’ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్..) -
ఇంత జరిగినా తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు
-
ఆ నిప్పుకు తుప్పు పట్టింది..!
సాక్షి, అమరావతి: రెండు వేల కోట్ల బాగోతం బయటపడితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత జరిగినా తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారని.. దీని వెనుక అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. నిప్పు లాంటి వాడినని చంద్రబాబు చెప్పుకుంటారని.. ఇప్పుడు ఆ నిప్పుకు తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్ని అక్రమాలు జరిగాయో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగి వద్దే రూ.2 వేల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా పరిపాలించాడో అర్థం చేసుకోవచ్చన్నారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!) దేశమంతా కోడై కూసింది.. ‘గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అక్రమాలపై దేశమంతా కోడై కూసిందని.. ఇవాళ ఆ బండారం అంతా బయటపడిందని’ ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. బయటపడిన అక్రమాలు చాలా తక్కువని ముఖ్యమైన వారిపై దాడులు జరిగితే లక్షల కోట్లు అక్రమాలు బయటకు వస్తాయన్నారు. ఓటుకు నోటు కేసు కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆ విషయంపై ఆలోచన చేస్తాం.. వికేంద్రీకరణ బిల్లులపై ఆర్డినెన్స్ ఇవ్వాలా..? గవర్నర్ ఆమోదానికి పంపాలా..? అనేది ఆలోచన చేస్తామని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్‌కు పంపలేదని చెప్పారు. ‘టీడీపీ తన వాదనలను వినిపిస్తోంది.. మేం మా వాదనలను వినిపిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దామని’ ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పారు. (చంద్రబాబు అవినీతి బట్టబయలు) ధిక్కారం ఎలా అవుతుంది..? అసెంబ్లీని ప్రొరోగ్ చేసినా బిల్లులు లైవ్‌లోనే ఉంటాయని తెలిపారు. తన ఆదేశాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటానని మండలి ఛైర్మన్ షరీఫ్ సెక్రటరీకి లేఖ రాశారని వెల్లడించారు. సభలో నిర్ణయం తీసుకునే సమయంలో విధిగా ఓటింగ్ జరపాలని ఆర్టికల్ 189/1 ప్రకారం రాజ్యాంగం చెబుతోందని వివరించారు. తప్పులు జరుగుతుంటే.. సరి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నిబంధనల ప్రకారం చెల్లదని చెబితే ధిక్కారం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్టు రుజువు అవుతుందనే మండలి ఛైర్మన్ సభ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మండలి కార్యాలయం తోసిపుచ్చింది. సెలెక్ట్ కమిటీని నియమించాలని చైర్మన్ ఎంఏ షరీఫ్ పంపిన ఫైలును లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 154వ నిబంధన కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆయన ఫైలుపై రాసి పంపినట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, నాగ జగదీష్, అశోక్‌బాబు లెజిస్లేచర్ కార్యదర్శిని కలిసి సెలెక్ట్ కమిటీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. చైర్మన్ ఆదేశాలను పాటించాల్సిందేనని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉంది కనుకే కమిటీ నియామకం సాధ్యం కాదని కార్యదర్శి వారికి వివరించినట్లు తెలిసింది. ఉమ్మారెడ్డి అభ్యంతరం సెలెక్ట్ కమిటీ నియామకానికి తన నిర్ణయానుసారం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా చైర్మన్ షరీఫ్ లెజిస్లేచర్ కార్యదర్శికి ఆదేశాలివ్వడాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సెలెక్ట్ కమిటీ సభ్యులను వారి అనుమతి లేకుండానే షరీఫ్ ప్రకటించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉన్నాయని, వాటిని పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను నియమించరాదని కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. అందులో ఆయన నిబంధనలను ఉటంకిస్తూ.. సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయంపై మండలిలో ఓటింగ్ తీసుకోలేదని, సభ్యులను నియమించేటప్పుడు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, వారు అంగీకరిస్తేనే ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీలో ఉండటానికి సంబంధిత సభ్యులు సమ్మతిని తెలపడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని తేల్చిచెప్పారు. ఇదే విధంగా అభ్యంతరం తెలుపుతూ మండలి సభా నాయకుడైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా లేఖ రాశారు. మండలి తనకు అధికారం ఇచ్చింది కాబట్టి సెలెక్ట్ కమిటీ వేస్తానంటే కుదరదని, దానికి సాంకేతికంగా ఓటింగ్ జరిగి ఆమోద ముద్ర పడాలని పేర్కొన్నారు. కాగా.. సెలెక్ట్ కమిటీ, మరో కమిటీలో సభ్యులుగా ఉండటానికి నిరాకరిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును వెనక్కి పంపారని సమాచారం. మండలి చైర్మన్ నిర్ణయంతో వివాదం పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. (చదవండి: మూడు రాజధానులతోనే మేలు) -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
సాక్షి, తాడేపల్లి : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి గణతంత్ర దినోత్సవం ఇది. ఈ లోపే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చారు. సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే హామీలు అమలు చేయడం మొదలుపెట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రతి గడపకు ఆయన సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలుకుపైగా ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టకోలేదు’ అని తెలిపారు. -
ఆర్థిక సంక్షోభానికి విరుగుడు వ్యవసాయమే
డిసెంబర్ 3న జరిగిన వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘మనిషి జీవితంలో, దేశాభి వృద్ధిలో వ్యవసాయం ప్రాముఖ్యత’’ అనే అంశంపై జరిగిన విస్తృ తమైన చర్చల్లో పలు మౌలిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా, నేడు ప్రతి మనిషి తన జీవితంలో వ్యవసాయానికి ఉన్న స్థానాన్ని, ప్రాముఖ్యతను గుర్తించగలుగుతున్నాడా? తమ ఆహార భద్రత వ్యవసాయంతోనే ముడిపడి ఉందన్న వాస్తవం ఎంతమంది ప్రజలకు తెలుసు? వ్యవసాయ ప్రాముఖ్యతను ప్రభుత్వాలే విస్మరిస్తున్నప్పుడు.. ప్రజలను తప్పుపట్టాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశం అయ్యాయి. నేటికీ 70% మందిపైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే అతిపెద్ద రంగం వ్యవసాయమని.. ఇందులో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అవగాహన ఉన్న వారు కొంతమందే. కొన్ని దేశాల్లో వ్యవసాయ విద్యకు ఉన్న డిమాండ్ ఇతర రంగాల్లోని విద్యకు లేదు. వివిధ పంటలపై పరిశోధన, నూతన వంగడాల వృద్ధి, చిరుధాన్యాలసాగు, నూనెగింజల పరిశోధన, అభి వృద్ధి.. మొదలైన అంశాలలో పుష్కలమైన అవకాశాలు ఇక్కడి విద్యార్థులకు కూడా ఉన్నాయి. కానీ, వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే సాహసం చాలామంది చేయడం లేదు. ప్రైవేటీకరణ, ఉదారవాద విధానాలు, ప్రపంచీకరణల మేలు కలయికగా చెప్పబడే ఈ నయా ఉదార ఆర్థిక విధా నాలు దేశంలో మొదలైన క్షణం నుంచే వ్యవసాయ రంగానికి పెను సవాళ్లు మొదలయ్యాయి. సన్న, చిన్నకారు రైతాంగం నడ్డి విరగడం మొదలైంది అప్పుడే. రైతాంగానికి ఇన్పుట్స్ అందించడంలో ప్రభుత్వ చొరవ తగ్గింది. పారి శ్రామికాభివృద్ధి పేరుతో వ్యవసాయోగ్యమైన భూములను రైతుల నుండి బలవంతంగా సేకరించి పారిశ్రామిక వేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ఆర్థిక సంస్కరణల్లో ప్రధాన ఎజెండాగా మారింది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా క్రమేపీ 14 శాతానికి దిగజారింది. వ్యవసాయాభివృద్ధి రేటు ఇతర రంగాల కంటే కనిష్టంగా నమోదు కావడం 1995 తర్వాత ఎక్కువైంది. బ్యాంకింగ్ రంగంపై అంతకుముందున్న నియంత్రణ సడలిపోవడంతో జాతీయ బ్యాంకులు సైతం తమ సామాజిక బాధ్యత నుండి వైదొలగాయి. చిన్న, సన్నకారు రైతులకు రుణాలు అందించడం తగ్గించి.. పారిశ్రామిక వేత్తలకు నామమాత్రపు షూరిటీపై వందలకోట్ల రుణాలు ఉదారంగా అందించడం, పర్యవసానంగా వారు వేలకోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం పెట్టడం పరిపాట య్యింది. దీంతో, గ్రామీణ ప్రాంత రైతాంగం విధిలేని పరిస్థితుల్లో అధిక వడ్డీపై అప్పులు చేస్తున్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగంగా ఏర్పాటైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)తో 1995లో చేసుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు దేశ వ్యవసాయరంగాన్ని సంక్షోభ స్ధాయికి చేర్చాయి. దేశంలోకి ఆహార ధాన్యాలతోపాటు హార్టికల్చర్, వంటనూనెలు, డెయిరీ, ఫిషరీస్ ఉత్పత్తులు కూడా దేశంలోకి కుప్పలుతెప్పలుగా వచ్చి పడటం మొదలైంది. ఎగుమతుల అవకా శాలు పెరుగుతాయని మభ్యపెట్టినప్పటికీ.. అటువంటి అవకాశాలు దేశ రైతాంగానికి దక్కలేదు. మరోపక్క సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించి అధిక ఉత్పత్తి కోసం పంటపొలాల్లో హానికర రసాయనిక ఎరువులు, నియంత్రణ లేకుండా పురుగు మందుల్ని విని యోగించే విధానాలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం పెరిగింది. ఫలితంగా భూసారం తగ్గిపోయింది. పర్యావరణ సమస్యలు ఎక్కువయ్యాయి. వీటన్నింటి కారణంగానే.. గత 10 సంవత్సరాలలో దేశంలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 నుండి నేటి వరకు దేశంలో దాదాపు 8 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ సందర్భంలో ‘వ్యవసాయం దండగకాదు.. పండుగ’ అని చాటిచెప్పి, రైతులలో భరోసా నింపిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2003లో వైఎస్ చేపట్టిన పాదయాత్రలో.. వ్యవసాయ రంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చాక నిలు పుకొన్నారు. నాటి నుంచి నేటివరకు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అన్నది ఆక్సిజన్‌లా పనిచేస్తూనే ఉంది. 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం అందించే నగదుకు తోడుగా ప్రకటించిన ‘వైఎస్సాఆర్ రైతు భరోసా’ ఓ వినూత్న పథకం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసి రైతాంగానికి ఏడు మార్గాల ద్వారా రైతులకు ఆదాయం అందించడంపై దృష్టి పెట్టింది. అనేక కోణాల నుంచి ముప్పేటన దేశాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం దేశ ప్రజలకు శరాఘాతమే. దీన్ని అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా తమవంతు సామాజిక బాధ్యతగా వ్యవసాయ రంగంలో విరివిగా పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. క్యూబాలో సంక్షోభం ఏర్పడినప్పుడు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎంత చిన్న స్థలం ఉన్నా.. ఆహార పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం మొదలుపెట్టారు. తమ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా.. సహకార పద్ధతిలో ఇచ్చిపుచ్చుకోవడం, మిగు లును మార్కెట్లో అమ్మి లాభాలను పంచుకోవడం చేశారు. జపాన్‌లో కూడా ఇదే విధానంలో రెండో ప్రపంచయుద్ధం మిగిల్చిన విషాదాన్ని అధిగమించి తొలినాళ్లలో వ్యవసాయరంగం ద్వారానే తమ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసుకున్నది. ప్రజా భాగస్వామ్యంతో వ్యవసాయం అనే విధానం క్రమంగా అనేక దేశాలకు విస్తరించింది. పొలం నుంచి పళ్లెం వద్దకు అనే ప్రాతిపదికపై సీఎస్ఏ (కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్)లు పనిచేస్తున్నాయి. ఈ విధానాన్ని దేశంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలి. పౌర సమా జం భాగస్వామ్యం వహించాలి. ఆర్థిక మాంద్యం తట్టుకోవడానికి వ్యవసాయాన్ని ఆలంబనగా చేసుకోవాలి. వ్యాసకర్త, చీఫ్ విప్, ఏపీ శాసనమండలి, డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. -
బ్యాంకింగ్ రంగానికి ప్రాణం.. ప్రాధాన్యతలే!
భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తున్న దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం సడలిపోతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ ప్రభుత్వరంగ బ్యాంకులకు అతిపెద్ద సవాల్‌గా మారింది. 2016లో జరిగిన పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలలో బ్యాంకులలో తాము దాచుకున్న డబ్బును సకాలంలో వెనక్కు తీసుకోలేకపోయిన రైతులు, మధ్యతరగతి వర్గాల వారు తమ పొదుపును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సంశయిస్తున్నారు. బ్యాంకుల వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిపోవడం, కొన్ని జాతీయ బ్యాంకులు ఉదారంగా కొంతమంది పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రూ. వేల కోట్ల మొండి బకాయిలుగా మారాయన్న సమాచారంతో ప్రభుత్వరంగ బ్యాంకుల విశ్వసనీయతపై అనుమానాలు కలుగుతున్నాయి. 1990వ దశకంలో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టే ముందువరకూ అటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇటు గ్రామీణ బ్యాంకులు.. సామాన్య ప్రజలకు చేరువై ఆర్బీఐ నియంత్రణతో ఆర్థికంగా, పరిపుష్టిగానే ఉన్నాయి. బ్యాంకుల నిరర్థక ఆస్తులు సైతం నామమాత్రమే. అయితే, ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు దేశ బ్యాంకింగ్ రంగ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. ప్రైవైటు రంగ బ్యాంకుల నుండి ఎదురయిన పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం వ్యవస్థాగతంగా అనేక మార్పులు చేసుకొన్నాయి. స్టాక్ మార్కెట్ నుండి నిధులు సమీకరించి పెద్ద ఎత్తున రుణ వితరణ కార్యకలాపాలు చేపట్టాయి. అయితే, ఆక్రమంలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు అధిక వడ్డీకి ఆశపడి ఊరు పేరులేని కంపెనీలకు రుణాలందించాయి. బ్యాంకుల నుండి రుణాలు పొంది.. వాటిని ఎగ్గొట్టొచ్చనే భావన క్రమంగా బలపడటానికి కారణం.. మొండి బకాయిల పేరుతో.. కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయడం. ఒక అంచనా ప్రకారం గత 70 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్లకుపైగా బ్యాంకుల మొండి బకాయిలను కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. దీంతో.. దేశంలో నష్టాలు రాకున్నా రుణాలు పొంది ఎగవేసే వాళ్లు పుట్టుకొచ్చారు. గత ఏడాది పార్లమెంట్లో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం.. విల్‌ఫుల్ డిఫాల్డర్లు దాదాపు 55 వేల కోట్లకు బ్యాంకులకు ఎగనామం పెట్టారు. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మొదలైన కార్పొరేట్ దిగ్గజాల పేరును చూసి ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు అందించినట్లుగానే కనపడుతుంది గానీ.. వారి సంస్థల పనితీరును కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తుంది. ఇటీవల కేంద్రమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లు ‘‘నాయకులు ఫోన్లు చేస్తే కొన్ని జాతీయ బ్యాంకులు రుణాలు అందించాయి’’. బ్యాంకు రుణాలను ఎగవేసిన డిఫాల్టర్లు దర్జాగా దేశం దాటిపోతుంటే.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఫలితంగానే, ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి కాయిలు అంతకంతకూ పెరిగి జూన్ 30, 2014 నాటికి (యూపీఏ పరిపాలన ముగిసిన నాటికి) రూ. 2,24,542 కోట్లు చేరాయి. కాగా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల మొత్తం ఆరేళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగాయి. 2018 డిసెంబర్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థ్ధక ఆస్తులు రూ. 8,64,433 కోట్లకు చేరాయి. నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక.. దేశంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి అవసరమైన పెట్టుబడిని అతితక్కువ వడ్డీతో అందించాలన్న గొప్ప లక్ష్యంతో ప్రారంభించబడిన పథకం.. ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’. కారణం బ్యాంకుల ద్వారా లభించే ‘ముద్ర’ రుణాలతో కోట్లాది మందికి ఉపాధి అందించే సూక్ష్మ, కుటీర రంగ పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతాయని అంచనా వేయడం జరిగింది. పెరుగుతున్న నిరుద్యోగితకు ఇది పరమౌషధంగా పని చేస్తుందని ఆర్థిక వేత్తలు కూడా భావించారు. ‘ముద్ర’ పథకం ద్వారా రుణాలు పొందడానికి ష్యూరిటీలు, గ్యారెంటీలు, ప్రాసెసింగ్ రుసుములు వంటివి లేకుండా.. తక్కువ వడ్డీతో సాయం అందించే పథకం కావడంతో.. ‘ముద్ర’ పథకం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం కానున్నదని అందరూ ఆశిం చారు. అయితే, ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం లేదు. బ్యాంకులు రుణాలు అందించడానికి య«థావిధిగా పూచీకత్తులు, ఆస్తుల తనఖా వంటివి అడుగుతున్నాయి. బడా పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి.. ఎటువంటి పూచీకత్తులు లేకున్నా.. వందల వేల కోట్లు మేర రుణాలు అందిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు.. ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ పథకాన్ని కూడా చతికిలపడేట్లు చేశాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న మోసాలు, పెరిగిపోతున్న వాటి నిరర్థక ఆస్తుల నేపథ్యంలో.. అవి స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నాయన్నది నిజం. ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు నియంత్రణతో పాటు వాటిని కేంద్ర విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి తేవడంతో.. బ్యాంకర్లు రుణాల్ని నిర్భీతిగా ఇవ్వలేకపోతున్న పరిస్థితి కూడా దాపురించింది. ఏదైనా జరిగితే.. తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ.. ప్రాధాన్యతా రంగాలకు సైతం రుణాలివ్వడానికి బ్యాంకర్లు సంశయిస్తున్నారు. సంస్థాగత రుణాలు పొందుతున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య సగటున 20% దాటడం లేదని నాబార్డు జాతీయ ఆర్థిక సమ్మిళిత అధ్యయనం (2016–17) పేర్కొంది. పలు రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాల వల్ల పంట రుణాల పంపిణీ పడిపోయింది. రుణమాఫీ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులు సమకూర్చడం లేదు. ప్రభుత్వం మాఫీ చేసిందనుకొని రైతులు బకాయిలు కట్టడం లేదు. దీంతో.. రైతులను బ్యాంకులు ‘ఎగవేతదారుల జాబితా’లో చేరుస్తున్నాయి. దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికావసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు నిస్వార్థంగా పనిచేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతం అవుతుంది. ఒకప్పుడు ఆర్థిక జీవనాడులుగా పనిచేసిన ప్రభుత్వ బ్యాంకులు నేడు కష్టాల ఊబిలో కూరుకుపోవడానికి కారణం స్వయంకృతమే. తగిన నియంత్రణ, పర్యవేక్షణలతోపాటు.. ప్రాధాన్యతలను పాటిస్తేనే ప్రభుత్వరంగ బ్యాంకుల పట్ల సామాన్య ప్రజలకు తిరిగి విశ్వాసం ఏర్పడుతుంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడితే దానిని మించిన ఆర్థిక సంక్షోభం మరొకటి ఉండబోదు. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి, చీఫ్ విప్, ఏపీ శాసనమండలి) -
చంద్రబాబుపై మండిపడ్డ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
-
బాబు కట్టు కథలు చెప్పించారు : ఉమ్మారెడ్డి
సాక్షి, విశాఖపట్నం : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బ్యాలెన్స్ తప్పినట్లుగా కనిపిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. అరగంట కూడా గడవకముందే చంద్రబాబు పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్లెక్సీల పేరిట చంద్రబాబు కట్టు కథలు చెప్పించారని తెలిపారు. టీడీపీ హయాంలో చింతమనేని అక్రమాలు చంద్రబాబుకు కనబడలేదా అని నిలదీశారు. విశాఖలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పరిణామాలను బట్టి చూస్తే టీడీపీకి భవిష్యత్తులో సైతం గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతందన్నారు. టీడీపీ నాయకులు పార్టీని వీడుతుంటే చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును ఏమి అనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ అంశాన్ని ఢిల్లీలో నివేదిస్తే తప్పుపట్టడమే కాకుండా టీడీపీ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 840 కోట్లు ఆదా చేశామన్నారు. పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదని టీడీపీ నాయకులకు హితవు పలికారు. చంద్రబాబు వేధింపులు తట్టుకోలేకే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చనిపోయారని ఆరోపించారు. ఎన్నికల్లో కోడెల ఓడిపోతే.. ఆ తరువాత చంద్రబాబు ఒక్కరోజు కూడా పిలవకుండా ఆయన్ని అవమానించారని అన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ పోవడంపై వైఎస్సార్సీపీ కేసు పెట్టలేదని గుర్తుచేశారు. కోడెల కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెట్టారని విమర్శించారు. బాబు ప్రోత్సాహంతోనే కుటుంబ సభ్యులు, కోడెలకు వివాదం రేగిందన్నారు -
మాంద్యానికి ‘మౌలిక’మే విరుగుడు
దేశ ఆర్థిక రథం పరుగు మందగించి చాలా కాలం అయింది. ప్రపంచంలో 4వ అతిపెద్దదైన భారత్ ఆటోమొబైల్ రంగం చతికిల పడింది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, మౌలిక సదు పాయాలు, బొగ్గు, సహజవాయువు, ముడిచమురు ఇలా ఆర్థిక రంగానికి వెన్నెముకలా నిలిచే ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధిరేటు ఆనూహ్యంగా 2.1%కి పడిపోయింది. మరికొన్ని రంగాల్లో నెగటివ్ వృద్ధిరేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి, భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకొనేది దేశీయ వినియోగమే. కానీ,ప్రజలలో నెలకొన్న భయాందోళనలను పాలకులు తొలగించే ప్రయత్నం చేయకపోవడం వల్ల అధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఆర్థిక రంగానికి పొంచి ఉంది. ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియలతో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం సాధ్యంకాదు. మొత్తంగా చూస్తే భారత ఆర్థిక రంగంలో నెలకొన్న ఈ సంక్షోభం తాత్కాలికమా? సుదీర్ఘ కాలమా? అనే అంశం కీలకంగా మారింది. సంక్షోభం తాత్కాలికమైతే తీసుకొనే చర్యలు ఒకలా ఉంటాయి. సుదీర్ఘకాలం కొనసాగే సూచనలు ఉంటే.. కఠోర నిర్ణయాలు తప్పవు. 1991లో, 2008లో ఆర్థిక సంక్షోభాలు అనేక సవాళ్లు విసిరాయి. 1991లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మన దేశానికే పరిమితమైంది. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థ్ధిక వ్యవస్థలతో అనుసంధానం కాలేదు. దాంతో, దశాబ్దాలపాటు భారత ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛగా విస్తరించకుండా పట్టి ఉంచిన ఆంక్షల సంకెళ్లను, తెంచుకోవడం వల్ల క్రమంగా సత్ఫలితాలు అంది వచ్చాయి. తొలి దశ ఆర్థిక సంస్కరణలతోపాటు వివిధ రాష్ట్రాలు 2000 సంవత్సరం తర్వాత మలి దశ సంస్కరణలను చేపట్టి అన్ని రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం మొదలు పెట్టాయి. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏడీబీ వంటి సంస్థలు, బ్యాంకులు పెద్ద ఎత్తున రుణవితరణ చేశాయి. ఆ నిధులతోనే దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల రంగాన్ని విస్తరించడం సాధ్య పడింది. నిధుల లభ్యతతో పారిశ్రామిక రంగం విస్తరించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. పెట్టుబడుల కల్పనతో ఆర్థిక రంగం పుంజుకుంది. 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఆ దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన లీమన్ బ్యాంక్ దివాలా తీసింది. ఆ దశలో అమెరికాలో 87 లక్షల ఉద్యో గాలు పోయాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రతికూల ఫలితాలు చూపిన నేపథ్యంలో భారత్ తాత్కాలిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గట్టిగానే నిలబడగలిగింది. అయితే, ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న ఆర్థిక మందగమనం దుష్ఫలితాలు మన దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం కాస్తా మాంద్యంగా రూపుదిద్దుకుంటోంది. 2016లో ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా చేసిన పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను కకావికలు చేసింది. అదే సమయంలో హేతుబద్ధత లోపించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేయడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది. అసంఘటితరంగం కార్యకలాపాలు ఎక్కువగా నగదు లావాదేవీలతో ముడిపడి ఉంటాయి. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 15% వాటా కలిగిన వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం నగదు లభ్యత లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు అందలేదు, ప్రైవేటు రుణాలు పుట్టలేదు. అదేవిధంగా, వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మగా వచ్చిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన రైతాంగానికి సకా లంలో నగదు తిరిగి తీసుకొనే అవకాశం లేక పోయింది. పెద్దనోట్ల రద్దుతో 2017 జనవరి, ఏప్రిల్ మాసాల్లో అసంఘటిత రంగంలో 15 లక్షల ఉద్యోగాలు ఆవిరైపోయాయి. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో వినియోగ వస్తువుల రంగాల్లో అమ్మకాలు పడిపోయాయి. ఆగస్టు 15న దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో వచ్చే ఐదేళ్లనాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్లకు చేర్చడం అన్నది ప్రధాన అంశంగా నిలిచింది. ప్రస్తుతం ఎగుమ తులు తగ్గాయి, దిగుమతులు పెరుగుతున్నాయి. జీఎస్టీ గరిష్టంగా 18%గా ఉన్న స్థిరాస్తి, గృహ నిర్మాణరంగాల్లో స్తబ్దత ఏర్పడింది. ఫలితంగా వాటికి అనుబంధంగా ఉండే సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఎలక్ట్రికల్ పరికరాలు.. ఈ విధంగా అనేక రంగాల్లో అమ్మకాలు క్షీణించాయి. జీఎస్టీ 28%గా ఉన్న ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు క్షీణించాయి. వాహనాల కొనుగోళ్లకు 55 నుండి 65 శాతం వరకు రుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) నగదు కొరతతో కునారిల్లుతున్న కారణంగా ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాల అమ్మకాలు తగ్గాయి. మోటారు వాహనాల ఉత్పత్తి ప్లాంట్లలో కొన్ని విభాగాలు మూసి వేశారు. దాంతో, ఆటో విడిభాగాల పరిశ్రమలు సైతం పాక్షికంగా మూతపడ్డాయి. దేశంలో నెలసరి ఉపాధి కల్పన రేటు 26% క్షీణించిందని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ ఆర్థ్ధికాభివృద్ధి రేటు 5% దాటే పరిస్థితి లేని నేపథ్యంలో కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించగలగాలి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే జీడీపీలో 7 నుండి 8 శాతం నిధుల్ని మౌలిక రంగాలకు కేటాయించాలి. అంటే ఏటా రూ.20 లక్షల కోట్ల చొప్పున రాబోయే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల రంగంలో వ్యయం చేయాల్సి ఉంది. అయితే, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ ఏడాది ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతం మౌలికరంగాలలో చేస్తున్న వ్యయం రూ. 7 లక్షల కోట్లు మాత్రమే. అంటే, ప్రైవేటు పెట్టుబడులు ఈ రంగంలో బాగా పెరగాలి. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం బ్యాంకులు తమ రుణ వితరణలో 17% మేర మౌలిక సదుపాయాల రంగానికి రుణాలుగా అందిస్తున్నప్పటికీ.. అందులో చాలావరకు మొండి బకాయిలుగా మారడం వల్ల.. ఈ రంగానికి రుణాలివ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని సరిదిద్దాలి. మాంద్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే రంగాలవైపు దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటురంగంలో ప్రయోజనం లేని ఆర్ధిక ఉద్దీపనలు అందించే బదులు ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టపర్చుకోవడం మేలన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో 6.8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్ష వరకు పారామిలటరీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ తక్షణమే భర్తీ చేయగలిగితే.. నిరుద్యోగ సమస్య తీవ్రత తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ప్రభుత్వం 100 రోజుల్లోపే 4 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించగలిగింది. మరిన్ని పెట్టుబడులు పెట్టి.. వ్యవసాయరంగం ఉత్పత్తుల్ని పెంచుకోవడం అనివార్యం. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులతో ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు పొందాలి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి, చీఫ్ విప్, ఏపీ శాసనమండలి -
4 లక్షల ఉద్యోగాలిస్తే విమర్శలా!
సాక్షి, అమరావతి: నాలుగు నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 4 లక్షల మందికి ఉద్యోగాలిస్తే, ఉద్యోగాలు తీసేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాయడం దారుణమని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. కళ్లు మూసుకున్న వారికే ప్రస్తుతం జరిగిన నియామకాలు కనిపించవని ఎద్దేవా చేశారు. గ్రామ స్వరాజ్యం రావాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కలలను సాకారం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తే అభినందించాల్సింది పోయి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకున్న వారెవరూ గ్రామ సచివాలయ వ్యవస్థను విమర్శించరని అన్నారు. టీడీపీ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా పక్కనపెట్టి, వాటి స్థానంలో జన్మభూమి కమిటీలను తెచ్చి అరాచకాలు సృష్టించారని దుయ్యబట్టారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చిన వారు ఆనందోత్సాహాలతో ఉంటే, ఉద్యోగాలు తీసేస్తున్నారని చంద్రబాబు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంతటితో ఆగదని, ప్రతిఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రకటించి, నియామకాలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ప్రధాన కారణం స్వపక్షం వారి వెన్నుపోటేనని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని, నిర్బంధిస్తున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారని, అసలు ఈ వ్యవహారానికి కారణం ఆయనేనని దుయ్యబట్టారు. -
‘ఆ సంస్కారం చంద్రబాబుకు లేదు’
సాక్షి, అమరావతి: మంచిని.. మంచి అని చెప్పే సంస్కారం చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో గ్రామ పంచాయతీలను పక్కన పెట్టి.. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుతిన్నారని మండిపడ్డారు. గ్రామ సచివాలయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలందరికీ అందించాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీల తర్వాత నేడు గ్రామాల్లో సచివాలయాలు కనిపిస్తున్నాయన్నారు. విమర్శలు చేసేవారు ఒక్కసారి రాజ్యాంగ స్ఫూర్తిని చదుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పండగ వాతావరణం నెలకొందని.. 4 నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఖాళీ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. గ్రామ వలంటీర్ వ్యవస్థ ప్రజలతో మమేకమయ్యే వ్యవస్థ అని పేర్కొన్నారు. గర్వంగా చెప్పుకుంటున్నారు.. కేవలం 8 రోజుల్లో పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు జరపడం ఒక చరిత్ర అని.. అభినందించాల్సింది పోయి చంద్రబాబు విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మా స్వశక్తిపై ఉద్యోగం సంపాదించాం అని అభ్యర్థులు గర్వంగా చెబుతున్నారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకుని.. ఆయన తనయుడు వైఎస్ జగన్ చలువతో ఉద్యోగాలు సంపాదించామని ఎంతో సంతోషంగా చెబుతున్నారన్నారు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని చంద్రబాబు లేఖ రాశారని.. ఎక్కడ తీసేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు సీఎం జగన్ లక్షల ఉద్యోగాలను కల్పిస్తే.. అనుభవం గల వ్యక్తినని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బాబోస్తే.. జాబొస్తుందని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ టోకెన్లను బ్యాంక్‌లు తిరస్కరిస్తున్నాయని తెలిపారు. 42 వేల కోట్ల కాంట్రాక్ట్ బకాయిలు ఉన్నాయన్నారు. (చదవండి: వైఎస్ జగన్ పాలన @ గ్రామ స్వరాజ్యం) చావును కూడా రాజకీయం చేయలేదా..? కోడెల శివప్రసాదరావు మృతి చెందిన మరుసటి రోజున టెలికాన్ఫరెన్స్ పెట్టి.. ఆయన మరణాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. స్వపక్షం వెన్నుపోటు వలనే కోడెల చనిపోయారని విమర్శించారు. చలో ఆత్మకూరుకి కోడెలను పిలవకుండా ఆయన్ని కుమిలిపోయేవిధంగా చేశారన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కోడెలకు అంత్యక్రియలు వద్దంటూ చంద్రబాబు రాజకీయాలు చేశారని విమర్శించారు. 1000 పింఛన్ ఇస్తే.. మీ పార్టీ సభ్యత్వం కోసం వృద్ధుల నుంచి 100 రూపాయలు కట్టించుకున్న చరిత్ర మీదని చంద్రబాబును దుయ్యబట్టారు. వలంటీర్ల వ్యవస్థపై వైఎస్ జగన్‌కు మంచిపేరు రావడంతో చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. నాలుగు నెలల్లోనే పరిపాలన బాగోలేదంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని... మీరు పరిపాలన బ్రహ్మాండంగా చేసి ఉంటే ఎందుకంతా బ్రహ్మాండంగా ప్రజలు చీ కొట్టారని ఎద్దేవా చేశారు. గ్రామ స్వరాజ్యం పాలననే లక్ష్యంగా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
కశ్మీరీల భాగస్వామ్యంతోనే ముందడుగు
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి 370, 35(ఎ) అధికరణల ద్వారా దశాబ్దాల క్రితం దఖలు పడిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే సువర్ణావకాశం ఏర్పడటం దేశ చరిత్రలో ఓ అపురూప ఘట్టం. ఎంతో సాహసోపేతంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు బేషరతుగా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించి, దేశ ప్రయోజనాలు అన్నింటికంటే అత్యంత ప్రధానమైనవని చాటి చెప్పాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేకపోవడం ఆ పార్టీ డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ఆ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎన్డీఏ చర్యను సమర్థించడం గమనార్హం. కాంగ్రెస్ బలహీనతను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. భారత్‌ను ఇరుకున పెట్టడానికి అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టాలని ప్రయత్నించి పాకిస్తాన్ భంగపాటుకు గురయ్యింది. కశ్మీర్ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు తగిన నమ్మకాన్ని కల్పించలేకపోయాయి. పాకిస్తాన్ తయారు చేసిన ఉగ్రవాద మూకలు రాష్ట్రంలోకి చొరబడకుండా నిలువరించలేకపోయాయి. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మతవాద రాజకీయాలకు పరోక్షంగా సహకరించాయి. కశ్మీర్ అంశంలో స్పష్టమైన వైఖరి అవలంబించింది ఒక్క బీజేపీయే అన్నది నిర్వివాదాంశం. కేంద్రంలో కనుక తాము అధికారం చేపడితే 370 ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్‌ను జాతీయ స్రవంతిలోకి తీసుకువస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది. కశ్మీర్‌పై ఉదారవాద వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ‘దీనికి రాజకీయ పరిష్కారం’ అనివార్యం అనే విధానాన్ని అవలంబించింది. కానీ, రాజకీయ పరిష్కారం అంటే ఏమిటో ఏనాడూ స్పష్టం చేయలేకపోయింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ‘సిమ్లా ఒప్పందం’ ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. ఇక, జమ్మూ కశ్మీర్‌లోని ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటైన నేషనల్ కాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు కప్పదాట్ల వైఖరితో వ్యవహరిస్తూ స్థానిక ప్రజల ఆదరణ సంపాదించలేకపోయింది. ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేవారు. ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాదీ అదే పాట. అధికారం పోయాక నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు మాట మార్చారు. హురియత్ కాన్ఫరెన్స్‌ను చర్చల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. జమ్మూ కశ్మీర్లో మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ విధానం మొదట్నుంచీ వేర్పాటువాదులకు అనుకూలమే. 2015లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించని నేపథ్యంలో పీడీపీతో బీజేపీ జత కలిసింది. మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం కశ్మీర్లో శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా విఫలం చెందడమే కాకుండా.. స్థానిక పోలీస్ యంత్రాంగానికి, సైన్యానికి మధ్య సమన్వయం లోపించిన పరిస్థితి ఉత్పన్నమైంది. భద్రతా బలగాలపై రాళ్లు విసిరినందుకు స్థానిక యువతపై నమోదైన క్రిమినల్ కేసులను ముఫ్తీ ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చావు దెబ్బ తిన్నప్పటికీ..ఆ సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తగిన చొరవ చూపలేకపోయింది. 2014లో ఆ దిశగా అడుగులు వేయడానికి బీజేపీకి కొన్ని పరిమితులు ఎదురయ్యాయి. లోక్‌సభ ఎన్నికలలో సంపూర్ణ మెజార్టీ సాధించిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి వేగంగా అడుగులు ముందుకు వేసింది. పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ మీదుగా కొనసాగుతున్న వాణిజ్యాన్ని నిలిపేశారు. జమ్మూ లోయలో ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు. కశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పంజాబ్‌ల్లో సరిహద్దులన్నింటినీ కలుపుతూ ఏర్పర్చిన చొరబాటు నిరోధక గ్రిడ్‌కు ‘ఆపరేషన్ సుదర్శన్’ అనే పేరు పెట్టి చొరబాటుదారులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం మొదలు పెట్టారు. సరిహద్దులను దుర్భేద్యం చేసేందుకు దాదాపు 15,000 బంకర్లను నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేశారు. ఉగ్రవాదుల బెడద అధికంగా ఉన్న దోడ, కిష్వ, రాంబా, రాజౌరి, కఠువా, పూంచ్ వంటి తదితర జిల్లాల్లో గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు ఆయుధాలు సమకూర్చాలని నిర్ణయించారు. మరోవైపు, రాష్ట్రంలో సర్వాధికారిగా ఉన్న గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను పటిçష్టపరుస్తున్నారు. ప్రాంతాల వారీగా రిజర్వేషన్లలో ఉన్న అసమానతలను తొలగించడానికి నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఇక, 1989 తర్వాత జమ్మూ లోయ నుండి పెద్దఎత్తున తరలిపోయిన పండిట్లను స్వస్థలాలకు తిరిగి రప్పించి అవసరమైతే వారికోసం ప్రత్యేక కాలనీల నిర్మాణం చేపట్టి వాటి చుట్టూ కంచెలు నిర్మించి పటిష్ట భద్రత కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ చర్యలకు తోడుగా అంతిమంగా జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35(ఎ) అధికరణలను రద్దు చేసే బిల్లును తొలుత రాజ్యసభలో, తదుపరి లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడంలో చోటుచేసుకున్న ఉత్కంఠ, బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించిన తీరు వ్యూహాత్మకమైనది. మోదీ ప్రారంభించిన ‘మిషన్ కశ్మీర్’లో ప్రథమ అధ్యాయం సజావుగా సాగింది. మిగిలిందల్లా ద్వితీయ అధ్యాయం. ఇది విజయవంతం కావాలంటే జమ్మూకశ్మీర్ ప్రజల సహకారం, తోడ్పాటు, భాగస్వామ్యం అవసరం. ఆ దిశగా కేంద్రం కృషి చేయాలి. అందరి సహకారాన్ని స్వీకరించాలి. ప్రజలకు త్వరితగతిన సత్ఫలితాలు అందగలిగితే ఏ లక్ష్యం కోసమైతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ‘మిషన్ కశ్మీర్’ ను ప్రారంభించారో అది దిగ్విజయం అవుతుంది. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి -
చంద్రబాబూ.. భాష మార్చుకో!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడుతున్న భాష ఆయన వయసుకు, అనుభవానికి తగ్గట్టు లేదని.. ఇకనైనా సంస్కారవంతంగా మాట్లాడాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వాడుతున్న పదజాలం ఆయన స్థాయికి తగ్గట్టు లేదన్నారు. భారీ ఓటమితో బాబు వైఖరి బాగా దిగజారిందన్నారు. తనను గెలిపించకపోవడం ప్రజల తప్పు అని, పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని చంద్రబాబు అనడం ఆయన వైఖరికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ఆయన పాలిస్తే ప్రజలు ఎందుకు మర్చిపోతారని ప్రశ్నించారు. ప్రజలు వివేకవంతులని.. పాలిచ్చే ఆవు ఏదో తన్నే దున్నపోతు ఏదో వారికి తెలుసన్నారు. పరిపాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొస్తానని వైఎస్ జగన్ చెప్పారని, ఆయనపై నమ్మకంతోనే పాలిచ్చే ఆవుగా భావించి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. ఆయన చీకటి చంద్రుడు 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును విడదీసి మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు గురించి చాలామంది చాలా అన్నారని, చంద్రబాబు వెన్నెల లేని చంద్రుడని గతంలో ఎంతోమంది కామెంట్ చేశారని గుర్తు చేశారు. బాబు చీకటి చంద్రుడే తప్ప ఆయన మొహంలో వెలుగు కనబడదని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో అక్రమాలు, అన్యాయాలు సహించరని.. వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మొండితనంతోనే ఉంటారన్నారు. ఇన్ని లక్షలమందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెబితే అది ఏ పరిస్థితుల్లోనైనా జరిగి తీరాల్సిందే అనే తత్వంతో వైఎస్ జగన్ ఉంటారన్నారు. దానిని మొండితనం అనరని, వివేకంతో కూడిన దృఢసంకల్పం అంటారని చెప్పారు. ప్లాన్డ్గా ట్రాప్ చేయాలని... చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కరకట్ట లోపల అక్రమ కట్టడాలు నిర్మించిన వారందరికీ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజావేదికను చంద్రబాబుకు ఇస్తే ఆ భవనం సక్రమమైనదేనని సీఎం వైఎస్ జగన్ ఒప్పుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో ప్లాన్డ్గా ట్రాప్ చేసి మరీ దానిని తనకు కేటాయించాలని కోరారన్నారు. అది అక్రమ కట్టడం కాబట్టే వైఎస్ జగన్ తొలగించి.. ఆ సామగ్రి భద్రపరిచి మరో ప్రాంతంలో దానిని కట్టబోతున్నారని తెలిపారు. హుందాగా వ్యవహరించే సీఎం వైఎస్ జగన్ విషయంలో చంద్రబాబు మరోసారి ఇటువంటి పదజాలం వాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్, విప్‌లకు క్యాబినేట్ హోదా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభ చీఫ్ విప్, విప్‌లకు క్యాబినేట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్‌లు బుడి ముత్యాల నాయుడు, దాడి శెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు క్యాబినేట్ హోదా దక్కింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు కూడా క్యాబినేట్ హోదా దక్కింది. -
అవినీతిపై చర్యలు తీసుకుంటే భయమెందుకు?
విజయవాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలంతా హర్షిస్తుండగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి పరిపాలన చేపట్టి పక్షం రోజులు కూడా కాకముందే ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేదేమోనని ఎద్దేవా చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయవాడలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చెబితే, చంద్రబాబు నాయడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే కేబినెట్ సమావేశాలు నిర్వహించి.. నిధుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు చేసిన చరిత్ర చంద్రబాబుది. సాగునీటి ప్రాజెక్టులను ఏకపక్షంగా నిలిపివేయడం సరికాదని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉంది. నిలిపివేసిన ప్రాజెక్టులు ఒక్కటి చూపించగలరా? టీడీపీ పాలనలో ప్రాజెక్టుల అంచనా వ్యయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారని, దీన్ని సమీక్షించి చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ చెప్పారు. పెంచిన అంచనాలను సమీక్షించవద్దనేది చంద్రబాబు ఉద్దేశమా? ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపుతోందంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్యలు బాబుకు కనిపించలేదా? రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, అక్రమంగా కేసులు పెడుతున్నారని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి హత్య, చిత్తూరులో జంట హత్యలు జరిగాయి. అవి చంద్రబాబుకు చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయా? అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చిపారేస్తే చంద్రబాబుకు అది చిన్న విషయంగా కనిపించింది. దాదాపు 800 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టిన విషయం చంద్రబాబుకు గుర్తుకురాలేదా? నరసరావుపేటలో దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు అంటున్నారు.. ఆయన వాటిని ఆధారాలతో నిరూపించాలి. గతంలో చంద్రబాబు చేయించిన హత్యలు, అరాచకాలు, అవమానాలు, అక్రమ కేసులపై ఎప్పుడైనా విచారణ జరిగిందా?విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగింది. దానిపై విచారణ జరిపించండి అని కోరితే కోడి కత్తి అంటూ హేళనగా మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు? ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు తేలితే రివర్స్ టెండరింగ్ చేపడతామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెబితే చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారు? ఆనాడు కృష్ణా నది కరకట్ట దగ్గర అక్రమ కట్టడాలు నిర్మించారని చంద్రబాబు చెప్పారు. అక్కడ ఉన్న వారికి జిల్లా కలెక్టర్‌తో నోటీసులు ఇప్పించిన విషయం వాస్తవం కాదా? 21 కట్టడాలను తొలగిస్తామని అప్పటి జల వనరుల శాఖ మంత్రి చెప్పలేదా? ఆనాడు చంద్రబాబు చెప్పిన మాట ఆచరణకు నోచుకోలేదు. పైగా రూ.4.3 కోట్లతో కరకట్ట పక్కన అనుమతి లేని స్థలంలో ప్రజావేదిక నిర్మించారు. కరకట్టపై అక్రమ కట్టడాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించినా టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కృష్ణా నదిని ఆక్రమించి కొత్త ఐలాండ్ నిర్మించాలని కుట్ర చేశారు. ప్రజా వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు అనడం దుస్సాహసమే’’ అని ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. -
‘జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం’
సాక్షి, తాడేపల్లి : కేబినెట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో సంచలనమని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు. వైఎస్సార్ఎల్పీ సమావేశంలో అందరికీ సమ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూస్తారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పదవులను బాధ్యతగా తీసుకోవాలని వైఎస్ జగన్ చెప్పారని, ధర్మానికి, న్యాయానికి అండగా ఉండాలని చెప్పారన్నారు. చదవండి : ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. -
ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చరిత్రాత్మకం
-
‘టార్గెట్ పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నారు’
సాక్షి, గుంటూరు : మద్యం వల్ల అత్యాచారాలు, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వాలు మద్యాన్ని అమ్మిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో.. దశలవారీగా మద్యనిషేధం అమలుపై చర్చా వేదికలో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్న దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ వల్ల చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారని పేర్కొన్నారు. మద్యంపై అందరికీ అవగాహనం కలిగించినప్పుడే మార్పు వస్తుందని, వైఎస్ జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేస్తానన్నారని పునరుద్ఘాటించారు. ఇదే కార్యక్రమాని హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తానంటే మహిళలు చాలా ఆనందించారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే వరకు దిగజారాయి. అనంతపురంలో మంచి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మద్యం వల్ల ప్రభుత్వం రూ.244 కోట్లు ఆదాయం పొందింది. ఆ డబ్బుతో మంచి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంది. చిన్నపిల్లలు సైతం తాగుడుకు అలవాటు పడుతున్నారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ వుండాలి. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తే మద్యాన్ని నిర్మూలించవచ్చ’న్నారు. మాజీ సీఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ.. ‘మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. సమాజం మీద బాధ్యత లేనట్టు వ్యహరించకూడదు. మద్యపాన నిషేధంపై స్వచ్చంద సంస్థలు పోరాటం చేయాలి. దశలవారీగా మద్యపాన నిషేధంపై సమగ్ర చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. ‘మద్యం వల్ల చిన్న చిన్న కుటుంబాలు మరింతగా ఛిన్నాబిన్నం అవుతున్నాయి. డ్రైవర్లు తాగి వాహనం నడిపితే ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డుప్రమాదాలపై సమీక్ష చేస్తే మద్యం వల్ల జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువని తేలాయి. మద్యపాన నిషేధం అమలు చేయలేరా? అని నన్ను చాలామంది అడుగుతుంటారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా అమలు చేయవచ్చ’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. -
ఆయన లేని లోటు పూడ్చలేనిది
సాక్షి, పులివెందుల : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు. వివేకా లేకపోవడం ఆయన కుటుంబానికి ఎంత లోటో.. వైఎస్సార్సీపీకి అంతే లోటు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ‘వివేకా లేని లోటు తీర్చలేనిది. ఆయన మచ్చ లేని, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు కాదు’ అని వ్యాఖ్యానించారు. (వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత) నెల్లూరు : వైఎస్ వివేకానందరెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు.. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతపురం : వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణంపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘వివేకా మరణం వైఎస్సార్సీపీకి తీరని లోటు, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన నేత వైఎస్ వివేకా’ అని అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. -
హామీలను నిజాయితీగా ఇద్దాం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘మన పార్టీ తరపున ప్రకటించబోయే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చే అన్ని హామీలను నిజాయితీగా ఇద్దామని, రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపొందిద్దాం’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. వాగ్దానాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ పోటీ లేదని, ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళదామని జగన్ అన్నారు. మేనిఫెస్టోను రూపొందించేటప్పటపుడు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాను ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థం అయ్యేలా ఉండాలన్నారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా మన పథకాలు ఉండాలని కూడా ఆయన కమిటీ సభ్యులతో అన్నారు. చేసిన ప్రతి వాగ్దానాన్ని నిజాయితీతో నూటికి నూరు శాతం అమలు చేద్దామని జగన్ స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు కమిటీ సభ్యులు 31 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగంలో దాదాపు 70 శాతం వరకు ఉన్న కౌలు రైతులకు అండగా ఉండేందుకు తగిన సహాయం చేసేలా ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో నాలుగు అంశాల ఆధారంగా చర్చ జరిగిందని ఉమ్మారెడ్డి వివరించారు. ‘నవరత్నాలు’లో ప్రకటించిన పథకాలను మరింత మెరుగుపర్చి తీర్చిదిద్దడం, సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వచ్చిన అంశాలు, సమస్యలు, ఆయనకు వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలు, సభలు, సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు గత నెల 26న విజయవాడలో జరిగిన సమావేశం తర్వాత ప్రజల నుంచి వచ్చిన దాదాపు 300 వినతి పత్రాల్లోని అంశాలను సమావేశంలో చర్చించామన్నారు. అన్నిటినీ క్రోడీకరించి చాలా బ్రీఫ్‌గా పాయింటెడ్‌గా మేనిఫెస్టో రూపొందించనున్నామని ఉమ్మారెడ్డి చెప్పారు. అంతేకాకుండా అవి వందకు వంద శాతం ఒక షెడ్యూల్ ప్రకారం అమలు చేయనున్నామని తెలిపారు. అదే విధంగా హామీలు అమలు చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? తదితర అంశాలు పరిశీలించడంతో పాటు అవన్నీ నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి సూచించారని, ఆ మేరకు అన్నింటినీ సమీక్షిస్తామని వివరించారు. భూ యజమానులు– కౌలు రైతులకు నష్టం లేకుండా ఫార్ములా దేశంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడిన రంగం వ్యవసాయం అని, ఇందులో కౌలు రైతులదే ప్రధాన భూమిక అని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తనాలతో పాటు పరిహారం ఇచ్చే విషయంలో భూ యజమాని, కౌలు రైతు ఇరువురికీ నష్టం కలగకుండా ఒక ఫార్ములా తయారు చేయాలని పార్టీ అధ్యక్షలు జగన్ నిర్ధేశించారని తెలిపారు. అందుకే కౌలుదారీ చట్టంలో ఏముంది? అన్నది కూడా సమీక్షించనున్నామన్నారు. ఇంకా ప్రతికూల పరిస్థితుల్లో రైతులను ఎలా ఆదుకోవాలన్న దానిపైనా అన్ని కోణాల్లో చర్చించనున్నట్లు చెప్పారు. సీడ్ యాక్ట్, పెస్టిసైడ్ యాక్ట్ ఇప్పటికే ఉన్నాయని, వాటి మేరకు తప్పు చేసిన వారిని శిక్షించాల్సి ఉంటుందని, వాటిని మేనిఫెస్టో కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను కూడా పరిశీలించబోతున్నామన్నారు. వీటి ఆధారంగా రైతులకు గిట్టుబాటు ధరల కల్పన, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి, ధరల స్థిరీకరణ నిధి అన్నింటిపై సమగ్ర డాక్యుమెంటరీ తయారు చేస్తున్నట్లు ఉమ్మారెడ్డి వివరించారు. అదే విధంగా పథకాల అమలుతో ప్రభుత్వంపై పడే భారం తదితర అంశాలను చర్చిస్తామని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తరచూ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆ ప్రక్రియలో భాగంగా ఈ నెల 12న విజయవాడలో భేటీ కానున్నామని ఉమ్మారెడ్డి ప్రకటించారు. ఆ లోపు కూడా ప్రతి రోజూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, ఎవరైనా సూచనలు, వినతి పత్రాలు ఇవ్వొచ్చని సూచించారు. వ్యవసాయం, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బీసీ గర్జన సదస్సులో చేసిన ప్రకటన, ఆ సభలో ఇచ్చిన హామీలను కూడా పరిగణించబోతున్నామన్నారు. -
‘చిత్తూరు ఎస్పీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు’
-
‘నూటికి నూరుపాళ్లు మ్యానిఫెస్టో అమలు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : ప్రజలు కట్టే ప్రతి ఒక్క రూపాయి పన్నును అభివృద్ధి కోసమే వినియోగిస్తామని, నూటికి నూరుపాళ్లు మ్యానిఫెస్టో అమలు చేస్తామని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో మ్యానిఫెస్టో అమలు కమిటీ ప్రవేశ పెట్టి.. ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో తయారీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 31 మందితో కమిటీ వేశారని, కమిటీ సమావేశం 26న విజయవాడలో జరుగుతుందని తెలిపారు. మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్రలో 13 జిల్లాల్లోని అనేక వర్గాల ప్రజలని వైఎస్ జగన్ కలిశారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు ఆకళింపు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో తయారీకి వైఎస్ జగన్ పలు సూచనలు చేశారన్నారు. మ్యానిఫెస్టో రూపకల్పనలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు ప్రతిబింబించాలని వైఎస్ జగన్ సూచించినట్లు తెలిపారు. మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేసేలా, ప్రజలకు భరోసా కల్పించేలా ఉండాలని సూచించారన్నారు. నవరత్నాలతో ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో వివరించాలని వైఎస్ జగన్ చెప్పారన్నారు. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు మ్యానిఫెస్టోలో పెట్టబోతున్నామన్నారు. జలయజ్ఞం కొనసాగింపు ప్రక్రియను మ్యానిఫెస్టోలో చేరుస్తామని, మధ్య నిషేధం మ్యానిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉండబోతోందని చెప్పారు. అమ్మ ఒడి పథకం, వైఎస్సార్ ఆసరా పథకం, పేదలందరికీ ఇంటి పథకం మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. పింఛన్లు పెంచడం, వయస్సు తగ్గించడం, మ్యానిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. ఈ హామీలన్నీ మ్యానిఫెస్టోలో చేర్చడమే కాకుండా.. ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తామన్నారు. -
వంద శాతం మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తాం
-
ఉమ్మరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు
-
ఓట్ల తొలగింపుపై విచారణ జరిపించాలి
-
‘చంద్రబాబు నాయకత్వంలోనే ఓట్ల తొలగింపు’
సాక్షి, అమరావతి : ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే ఓట్ల తొలగింపు జరుగుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డిలు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిశారు. గురజాల నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపుపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. గురజాలలో 9500 ఓట్లు తొలగించారని తెలిపారు. పోలీసులు యరపతినేని చెప్పుచేతుల్లో ఉన్నారు : కాసు మహేష్ రెడ్డి గురజాలలో కొంతమంది పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ చెప్పు చేతల్లో ఉన్నారని వైఎస్సార్ సీపీ నేత, గురజాల ఇంచార్జి కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ఓటర్ల అనుమతి లేకుండా ఓట్లు తొలగించాలని ఫారం 7ను ఇస్తున్నారని తెలిపారు. సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారిని కోరినట్లు వెల్లడించారు. -
ప్రశ్నించినందుకే పోలీసుల దాడి
-
నరహంతక సర్కారు
సాక్షి, అమరావతి బ్యూరో: వెనుకబడిన తరగతులకు చెందిన కౌలు రైతు పి.కోటేశ్వరరావు(కోటయ్య) హత్య ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. పోలీసుల దాడి వల్లే రైతు ప్రాణం పోగొట్టుకున్నాడని చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటైన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు బుధవారం రైతు కోటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో రైతు హత్య జరిగిన తోట ప్రాంతాన్ని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రశ్నించినందుకే పోలీసుల దాడి రైతు కోటయ్య మృతికి గల కారణాలను ఆయన భార్య, కోడలు, పిల్లలను అడిగి తెలుసుకున్నామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొండవీడు సంబరాల సందర్భంగా కోటయ్య 0.50 సెంట్ల స్థలాన్ని పోలీసు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చాడని చెప్పారు. పోలీసులు కోటయ్య బొప్పాయి తోటలో కాయలు కోసి ధ్వంసం చేయడంతోపాటు కనకాంబరం తోటలో వాహనాలు తిప్పారని తెలిపారు. కోటయ్య అనుమతి లేకుండానే మునగ తోటలో చెట్లను తొలగించి, వాహనాల పార్కింగ్ కోసం చదును చేశారని అన్నారు. పోలీసుల ప్రవర్తన చూసి రెండు రోజులుగా కోటయ్య తీవ్ర ఆవేదన చెందాడని వెల్లడించారు. అదేమిటని గట్టిగా ప్రశ్నించగా పోలీసులు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి పోలీసుల దాడిలో ప్రాణం పోగొట్టుకున్న కోటయ్య మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి కట్టుకథలు అల్లారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటయ్యకు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అప్పులు ఉంటే గతంలోనే తీర్చేశాడని అన్నారు. 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కష్టపడి సాగు చేసుకుంటున్న ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. పోలీసు దర్యాప్తుతో వాస్తవాలు బయటకు రావని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పంచనామా మొదలు పోస్టుమార్టం వరకు సక్రమంగా జరగలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రి దుశ్చర్య వల్లే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దుశ్చర్య వల్లే కోటయ్య మృతి చెందాడని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తాము రూ.3 లక్షలు, చంద్రన్న బీమా కింద రూ.2 లక్షలు ఇస్తామంటూ ఆర్డీవో, డీఎస్పీ బేరసారాలు సాగించారని చెప్పారు. వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికే డబ్బులు ఎర వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పెడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల ఒక బీసీ రైతు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. దీనిపై వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారని తెలిపారు. కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, పాదర్తి రమేష్‌గాంధీ, శ్రీనివాసులురెడ్డి తదితరులు ఉన్నారు. కోటయ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం కష్టాల్లో ఉన్న కోటయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ తరుపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. సంఘటన జరిగిన రోజు చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బాధిత కుటుంబానికి రూ.లక్ష ఇచ్చారు. మిగిలిన రూ.4 లక్షలను నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అందించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం కోటయ్య కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. మొత్తం మీద వైఎస్సార్సీపీ తరుపున రూ.10 లక్షలు అందజేశారు. టీడీపీకి రైతులు, బీసీలంటే చులకన ‘‘కోటయ్య మృతి ఘటనతో తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి బయటపడింది. ఆ పార్టీ రైతులు, బీసీల పట్ల చులకనభావం ప్రదర్శిస్తోంది. పోలీసులు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడం వల్లే కోటయ్య చనిపోయాడు. పరామర్శకు వచ్చేవారిని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి. రైతు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే కారణం. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, కౌలు రైతు అని చులకన భావం ఉండబట్టే ఈ సంఘటన జరిగింది. ఈ హత్యోదంతాన్ని ఇంతటితో వదిలిపెట్టం, పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం’’ – కొలుసు పార్థసారథి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ప్రచార్భాటాలకు నిండు ప్రాణం బలి ‘‘ప్రభుత్వ పెద్దలు తమ ప్రచార ఆర్భాటాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. పోలీసుల దాష్టీకం వల్లే రైతు కోటయ్య చనిపోయాడు. రైతు ప్రాణానికి టీడీపీ నాయకులు రేటు కట్టే యత్నం చేశారు. ఈ వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మొదటి ముద్దాయి. రైతు మరణంపై న్యాయ విచారణ జరిపించాలి’’ – మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి, మంత్రి బాధ్యత వహించాలి ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పుల్లారావు బాధ్యరాహిత్యం కారణంగానే రైతు కోటయ్య చనిపోయాడు. కోటయ్యకు చెందిన బొప్పాయి, మునగ, కనకాంబరం తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. బలవంతంగా పొలాన్ని ఆక్రమించుకున్నారు, అదేమని ప్రశ్నిస్తే భౌతికంగా దాడి చేశారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఏమీ చేయలేడన్న అహంభావంతో ఈ హత్య చేశారు. దీనికి ముఖ్యమంత్రి, మంత్రి పుల్లారావు బాధ్యత వహించాలి’’ – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదయ్యా.. వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ఎదుట కోటయ్య భార్య ప్రమీల తమ గోడు వెళ్లబోసుకుంది. ‘‘మా ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదయ్యా.. పది మందికి చెప్పేవాడయ్యా.. గుండె నిబ్బరం ఎక్కువ. భయమంటే ఎరుగనివాడు’’ అంటూ బోరున విలపించింది. పోలీసులు కొట్టిన దెబ్బలకే చనిపోయాడని రోదించింది. తమ నాన్న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోలేదని కోటయ్య వెంకటలక్ష్మి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రమంతటా అందరికీ తెలిసేలా చెప్పాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులను కోరారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు ‘‘మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో పెద్ద మనుషులను తీసుకుని ఆటోలో పొలం వద్దకు వెళ్లాం. అయితే, ఆటో వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. ముఖ్యమంత్రి వస్తున్నాడు, వెళ్లడానికి కుదరంటూ కదలనీయలేదు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరం చూపలేదు. ఈలోపు పోలీసులు విద్యుత్ శాఖ వాహనంలో నా తండ్రి శవాన్ని తీసుకొచ్చి చెక్‌పోస్టు వద్ద వదిలేశారు. మేము డాక్టర్ వద్దకు తీసుకెళితే చనిపోయాడని చెప్పారు. పురుగు మందు తాగితే నురుగు వస్తుంది. కానీ, మా నాన్న నోటి నుంచి రక్తం వచ్చింది. ముఖం వాచి ఉంది. పొలంలోకి వెళ్లిన గంటలోపే నాన్న చనిపోయాడు’’ అంటూ రైతు కోటయ్య కుమారుడు వీరాంజనేయులు విలపించారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు పోలీసుల దాడిలో మరణించిన రైతు కోటయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కొత్తపాలెం గ్రామానికి వెళ్లే దారుల్లో ఐదు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోట గ్రామం వద్ద డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు సభ్యులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరామర్శకు వెళితే తప్పేంటి? ఆంక్షలు ఎందుకని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వాహనాలను అనుమతించకపోయినా కాలినడకనైనా గ్రామానికి వెళ్లి తీరుతామంటూ బయల్దేరారు. చివరకు కమిటీ సభ్యుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. మిగతా వారు వెళ్లకూడదా అని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీయడంతో వారి వాహనాలను కూడా అనుమతించారు. కొత్తపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, వందలాది మంది పోలీసులు గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం
-
ఇంటికి వచ్చి బేరం చేయాల్సిన అవసరమేంటి?
సాక్షి, అమరావతి : రైతు కోటయ్య విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ప్రభుత్వం కూడా ఈ విషయంలో వాస్తవాలను కప్పిపెడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య మృతి చెందాడని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ సందర్భంగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పోలీసుల దౌర్జన్యం వల్ల బీసీ రైతు పిట్టల కోటేశ్వరరావు సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చేందుకు ఉమ్మారెడ్డి నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ బుధవారం కొండవీడును సందర్శించింది. కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ తరఫున లక్ష ఆర్థిక సాయం అందించారు. (చంద్రబాబు సర్కారుకు రైతంటే ఇంత అలుసా?) అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...‘రైతు కోటయ్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అతడి తోటను ధ్వంసం చేశారు. పంట పాడు చేయొద్దన్న కోటయ్యను పోలీసులు కొట్టారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవాలు తెలుసుకునేందుకు కోటయ్య మృతిపై నిజనిర్థారణ కమిటీ వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుటుంబానికి మొత్తం రూ.10 లక్షలు సాయం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అన్నమాటకు కట్టుబడి ఉండాలి. పోలీసులు పెట్టిన ఇబ్బందుల వల్ల కూడా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అన్నారు. నిజం కోటయ్య పురుగుల మందు తాగి చనిపోయాడా? లేక పోలీసులు కొట్టిన దెబ్బలతో చనిపోయాడా? అనే దానిపై విచారణ జరపాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవమా? పోలీసులు చెప్పింది నిజమా అనే దానిపై జ్యుడీషియల్ విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలి. పోలీసుల తప్పు ఏమీ లేకుంటే జరిగిందే జరిగిపోయింది... రూ.3 లక్షలు ఇస్తామంటూ కోటయ్య ఇంటికి వచ్చి బేరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?. పోలీసుల భిన్నవాదనలపై విచారణ చేయించి, కోటయ్య వద్ద పనిచేసే పున్నారావును విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు. కోటయ్య పిరికివాడు కాదు: పార్థసారధి రైతు కోటయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి అన్నారు. అతడి మరణానికి ముఖ్యమంత్రి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించి వాస్తవాలు వెలికితీయాలని, కోటయ్య మృతిపట్ల పోలీసులు అసత్యాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. (కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్ జగన్) నిజనిర్ధారణ కమిటీలో బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్ జగన్
-
కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోటయ్య మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా పంట నాశనం చేయొద్దని బతిమిలాడిన కోటయ్యపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అక్కడే వదిలేశారని ఆరోపించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కోటయ్య మృతి, ఉద్యోగులకు మధ్యంతర భృతి పేరుతో చంద్రబాబు మోసంపై నాయకులతో చర్చించారు. (సీఎం సభ కోసం రైతును చంపేశారు) కోటయ్య మృతి వెనుక అసలు కారణాలేమిటి? అనేది తేల్చేందుకు, మృతుని కుంటుంబానికి భరోసానిచ్చేందుకు సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేశారు. కొండవీడులో ఈ కమిటీ రేపు (బుధవారం) పర్యటించనుంది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతిలో నిజాయితీ లేదని అన్నారు. భృతి ఇప్పుడు ప్రకటించి జూన్‌లో ఇస్తామనడం మోసమేనని వ్యాఖ్యానించారు. తనకు అధికారంలేని బడ్జెట్‌పై బాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు, దేవుడి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేది తమ ప్రభుత్వంలోనే అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. కమిటీలో సభ్యులు వీరే.. నిజనిర్ధారణ కమిటీలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుదురు ఎమ్మెల్యేలు.. ముస్తాఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారథి, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజనీ, శ్రీ కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ, మేరుగ నాగార్జున ఉన్నారు. బాధిత రైతు కుంటుంబాన్ని పరామర్శించడమే కాకాండా వారికి అండగా నిలబడాలని పార్టీ అధ్యక్షుడు నాయకులను ఆదేశించారు. -
బాబుది ధర్మ పోరాటం కాదు దొంగ పోరాటం
సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టింది ధర్మపోరాట దీక్ష కాదని అది దొంగ పోరాట దీక్ష అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే ముఖ్యమన్న చంద్రబాబు మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కలిసి ఏపీని భ్రష్టు పట్టించాయన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఉమ్మారెడ్డి సూచించారు. 17న ఏలూరులో వైఎస్సార్ సీపీ ‘బీసీ గర్జన’ రాష్ట్రంలోని బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 17న ఏలూరులో బీసీ గర్జన మహాసభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏలూరు సభలోనే బీసీ అధ్యయన కమిటీ సమర్పించిన నివేదికను వైఎస్ జగన్ ప్రకటిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు దృష్టిలో బీసీలు ఓటు బ్యాంకు మాత్రమేనని విమర్శించారు. అధికారం కోసం రకరకాల హామీలివ్వడం, అనంతరం వదిలేయడం ఆయనకే చెల్లుతుందన్నారు. రోజుకో నాటకంతో బీసీలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బీసీలే తగిన బుద్ధి చెప్పాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. -
కాపులు బీసీలా..? ఓసీలా..?
సాక్షి, హైదరాబాద్: కాపులు బీసీలా... ఓసీలా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని శాసన మండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు కాపులను దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు ఎన్నిసార్లు రిజర్వేషన్లు ఇస్తారు చంద్రబాబూ.. అని ప్రశ్నిం చారు. అసెంబ్లీలో కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కేటాయిస్తున్నట్లుగా బిల్లు పెట్టారన్నారు. కాపులకు రిజర్వేషన్ల అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారా..? లేక వారు అమాయకులని అనుకుం టున్నారా? అని నిలదీ శారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేర్చుతామంటే నమ్మి ఓట్లేశారని, మళ్లీ ఇప్పుడు ఐదు శాతం అంటే ఓట్లు వేస్తారని చంద్రబాబు మరో కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లపై మంజునాథ కమిటీ వేయడానికి చంద్రబాబుకు ఏడాదిన్నర పట్టిందన్నారు. అయితే కాపులను బీసీల్లో చేర్చాలని చెప్పలేదని, బీసీల్లో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉందో సర్వే చేయమన్నారని కమిటీ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. -
‘గవర్నర్ అబద్ధాల ప్రసంగం చేశారు’
సాక్షి, గుంటూరు : అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ అబద్ధాల ప్రసంగం చేశారని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా ప్రభుత్వం అని చెప్పుకునే గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా చూస్తుండిపోయారన్నారు. గవర్నర్ వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారని తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో మూడు శాతం ఉండాల్సిన ఆర్ధిక క్రమశిక్షణ ఇప్పుడు 5.6 శాతానికి పెరిగిందని వెల్లడించారు. వచ్చే ప్రభుత్వాల ఆర్ధిక క్రమశిక్షణ కూడా చంద్రబాబు అధిగమించారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో నిందితులు టీడీపీ నేతలేనని, అందుకే ఎన్ఐఏ విచారణను అడ్డుకుంటున్నారని అన్నారు. -
‘ఆ అధికారం చంద్రబాబుకు లేదు’
సాక్షి, గుంటూరు : రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. అసాధ్యమైనదాన్ని సాధ్యమని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. కాపుల ఆశలు అలాగే ఉంచి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బంగారం, డబ్బులు దోచుకునే దొంగలు ఉంటే.. ఇప్పుడు నవరత్నాల పథకాలను దొంగిలించే దొంగలు తయారయ్యారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి పెన్షన్‌ను రెండు వేలకు పెంచారని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణకు సహకరించకపోగా, ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. జగన్‌పై జరిగిన దాడిలో రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. -
బాబు అవినీతి చిట్టాను పార్లమెంట్ సాక్షిగా చాటుతాం
సాక్షి, గుంటూరు : భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబుకు చట్టాల మీద నమ్మకం లేదని, ఆయనకు దమ్ము, ధైర్యం లేకనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏకు సహకరించడం లేదని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీ వెళ్తున్నామని, అవినీతి చక్రవర్తి చంద్రబాబు పాల్పడిన రూ. ఆరు లక్షల 17వేల కోట్ల అవినీతి చిట్టాను పార్లమెంట్ సాక్షిగా వివరిస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు కోసం ఎన్ఐఏ రంగంలోకి దిగగానే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగపరంగా ఉన్న ఏజెన్సీలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ, నిన్న (శనివారం) విశాఖపట్నం వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందానికి పోలీసులు సహరించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను చంద్రబాబు అడుగుపెట్టనివ్వడం లేదని, కానీ, టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వర్రావు, సోమ హత్య కేసులో మాత్రం ఎన్ఐఏ విచార జరపాలని చంద్రబాబు కోరుతున్నారని, ప్రభుత్వం వైఖరిని వైఎస్సార్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
‘కుట్రలో ఎవరున్నారో తేలాలి?’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వక్రమార్గంలో గెలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని వక్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే ఈ హత్యాయత్నం కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో ఎవరున్నారో తేలాలన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని, ఇప్పటికైన ప్రభుత్వానికి కనివిప్పు కావాలన్నారు. వాస్తవాలు బయటకి వస్తే అసలు కుట్ర దారులు ఎవరో తెలస్తుందన్నారు. ప్రతిపక్షనేతపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే ప్రజలు భావించారన్నారు. దాడి జరిగిన గంటలోపే డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎలాంటి విచారణ చేయకుండా కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడిని ఎవరు చేశారో పోలీసులు విచారణ చేసి చెప్పాలని కానీ డీజీపీకి కనీస అవగాహన లేదని ఎద్దేవ చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి, డీజీపీలు వైఎస్ జగన్‌ను కనీసం పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగితే అప్పటి ప్రతిపక్షనేత, దివంగత నేత వైఎస్సార్.. గాంధీ విగ్రహం దగ్గర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. అది మానవత్వమంటే అని అన్నారు. కానీ ప్రస్తుత సీఎం తీరు చూస్తుంటే.. బాధ్యులను రక్షించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు శ్రీనివాసరావుపై 307 సెక్షన్ వేసి వదిలేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుట్రలో ఎవరున్నారో తేలాలి
-
‘బాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారు’
ఢిల్లీ: తెలంగాణ ప్రజలు పరిపక్వతతో మంచి తీర్పు ఇచ్చారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. నాయకులు దారి తప్పినా ప్రజలు సరైన విధంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎత్తుగడలు, మోసాలతో నారా చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు. బాబు విన్యాసాలు బెడిసికొట్టాయి: ఉమ్మారెడ్డి చంద్రబాబు విన్యాసాలు తెలంగాణాలో బెడిసికొట్టాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అనైతిక పొత్తు వల్ల నష్టపోయామని కాంగ్రెస్, టీడీపీలోనే అనేక మంది నాయకులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. పొత్తులు లేకుండా చంద్రబాబు రాజకీయాలు చేయలేదని మండిపడ్డారు. పొత్తుకు పరాకాష్టగా కాంగ్రెస్‌తో జత కట్టారని దుయ్యబట్టారు. హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు: వైవీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తొలి రోజునే ధర్నాకు దిగామని, ఎంపీలందరూ రాజీనామా చేసి నిరవధిక దీక్షకు దిగి పోరాటం చేశామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుదని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఓటమిని ఏ పార్టీ కూడా రక్షించలేదన్నారు. ఆయనకు ఏ పార్టీ కూడా మద్ధతిచ్చే అవకాశం లేదన్నారు. తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలతో కలిసినా ప్రజలు చంద్రబాబును, కాంగ్రెస్‌ను ఓడించారని ఎద్దేవా చేశారు. సీబీఐ నుంచి కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కొత్తపాట పాట పాడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే చంద్రబాబును ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, సైకిల్ రెండు చక్రాల్లో ఇప్పటికే గాలిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో గెలిస్తే నా వల్లే గెలిచావని చెప్పావు బాబూ! స్పష్టమైన ఆధిక్యంతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే నావల్లే గెలిచారని చంద్రబాబు జబ్బలు చరుచుకున్నారని చెప్పారు. తెలంగాణలోనూ ఓటమికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
బాబు పాలనలో పేదల బతుకుల్లో చీకటి
కంఠంరాజుకొండూరు(దుగ్గిరాల): చంద్రబాబు పాలనలో పేదల బతుకుల్లో చీకటి అలుముకుందని ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కంఠంరాజుకొండూరులో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహా పునఃప్రతిష్టమహోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా హాజరైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి వెంకటరోశయ్యలు వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యురాలు యేళ్ల జయలక్ష్మి అధ్యక్షత వహించిన సభలో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ప్రజల సంక్షేమం కంటే పాలకుల సంక్షేమమే ముఖ్యం అన్నట్లుగా టీటీపీ పాలన సాగుతోందని విమర్శించారు. ఏపార్టీకైతే వ్యతిరేకంగా నాడు టీడీపీని స్థాపించారో అలాంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జత కట్డడంతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ కాలం రాజన్నను దూరం చేసినా... నేనున్నాను అంటూ జగనన్న మన అందరికి కోసం ముందుకు వచ్చారన్నారు. రాబోయే ఎన్నికలలో జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాజన్న రాజ్యం రావాలన్నా... రైతు రాజు కావాలన్నా జగన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం రైతుల నుండి 33 వేల ఎకరాలు బలవంతంగా సేకరించి ఫలసాయాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజల్ని, రైతుల్ని మోసగించిన టీడీపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, దుగ్గిరాల ఎంపీపీ చల్లపల్లి భారతీదేవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుగ్గిరాల, మంగళగిరి పట్టణ, రూరల్, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు యడ్ల సాయికృష్ణ, మునగాల మల్లేశ్వరరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బుర్రుముక్క వేణుగోపాలస్వామిరెడ్డిజెడ్పీటీసీ మాజీ సభ్యుడు యడ్ల వెంకట్రావ్, తాజా మాజీ సర్పంచ్ షేక్ నూర్జహాన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు పాల్గొన్నారు.తొలుత తెనాలి–విజయవాడ ప్రధాన రహదారి వద్ద నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు ఘనస్వాగతం పలికారు. బైక్ ర్యాలీలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జోహార్ వైఎస్సార్... జై జగన్.. జై ఆర్కే నినాదాలతో హోరెత్తించారు. -
అంబేడ్కర్ ఆశయాలకు బాబు తూట్లు పొడుస్తున్నారు
-
బాబు తప్పిదాలపై నోరు పెగలదేం పవన్?
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం అపహాస్యం, ఆర్థిక నేరస్తులకు అండ, రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌కు ప్రస్తుత రాజకీయ పరిణామాలు కనిపించడం లేదా? లేక స్పష్టత లోపించిందా? లేక మరెవరి డైరెక్షన్ కోసమైనా ఎదురుచూస్తున్నావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. - ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా? - ప్రత్యేక హోదాపై జగన్ పోరాటం చేస్తూ యువభేరీలు నిర్వహిస్తుంటే వాటిల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ పెడతామని చంద్రబాబు హెచ్చరిస్తుంటే పవన్ నోరు విప్పాల్సిన అవసరం ఉందా? లేదా? పవన్ ప్రశ్నించలేదంటే వారిద్దరి మధ్య అనుబంధం ఉన్నట్టే కదా? - జనసేన పుట్టిన తరువాత సొంతంగా పోటీకి దిగాలి. లేదా ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటే సీట్ల సర్దుబాటు జరగాలి. కానీ పవన్ సొంతంగా అభ్యర్థులను పెట్టలేదు. టీడీపీకి మద్దతిచ్చారు. - రాజధాని పేరిట 19 గ్రామాల్లో భూసేకరణ చేస్తుంటే బేతపూడి గ్రామంలో మల్లెపూల తోటల్ని సాగుచేస్తున్న రైతులు తమ భూములు ఇవ్వబోమని ఆందోళన చేశారు. జేసీబీలు, బుల్డోజర్లతో భూములు అక్రమంగా దున్నుతున్న విధానాన్ని చూసిన పవన్.. సీఎంని ప్రశ్నిస్తానంటూ మల్లెపూల తోటల రైతులకు వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి భూసేకరణ మంచిదని ప్రకటన ఇచ్చిన మాట నిజం కాదా? అది టీడీపీకి అందించిన స్నేహహస్తం కాదా? - సర్పంచ్‌లను పక్కకునెట్టి జన్మభూమి కమిటీలు వేసి పాలన చేస్తుంటే ప్రశ్నించావా? జన్మభూమి కమిటీల అక్రమాలపై ఏనాడైనా మాట్లాడావా? ఇసుక దగ్గర నుంచి నీరు–చెట్టులో మట్టి అమ్మకాలు, బెల్టుషాపులు, ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోచుకుంటున్నా, పోలవరంపై కాగ్ ఇచ్చిన రిపోర్టుపై, అమరావతి భూసేకరణ, విశాఖ భారీ భూ కుంభకోణంపై ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా? - చంద్రబాబుతో స్నేహబంధం సజావుగా ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ రాజకీయం చేస్తున్నది నిజంకాదా?. - స్థానిక సంస్థలు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు సర్కార్ తూట్లు పొడుస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్‌కు లేదా? - మీకు ఇల్లు, స్థలం ఇచ్చిన లింగమనేని వారు దౌత్య నడుపుతూ ఉంటే వాళ్లు ఏమి చెబితే అదే చేస్తావా? - బాబే నిన్ను (పవన్) అడ్డంపెట్టి నాటకాలు ఆడుతున్నట్టు జనం అనుకుంటున్నారు. అది నిజమా? కాదా? - పన్నులు ఎగ్గొట్టిన వాళ్లపై ఐటీ దాడులు చేస్తుంటే నీవు నోరు మెదపకపోవడానికి కారణం నీ వాళ్లకు ఉపయోగపడుతుందనా? - సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వనని సీఎం అంటుంటే అది మంచిది కాదని ఎందుకనలేదు? - రూ.6వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సుజనాకి ఈడీ ఇస్తే ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్పలేదు? - గత నెల 25న వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే దానిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్నడైనా ముఖ్యమంత్రిని డిమాండ్ చేశావా? దాన్ని కోడికత్తి డ్రామా అన్నప్పుడైనా ప్రజాజీవితంలోకి వస్తున్న పవన్ కళ్యాణ్ ఖండించాల్సిన పని లేదా? చంద్రబాబుకు కోపం వస్తుందని మాట్లాడడం లేదా? - జనసేనను పిల్ల టీడీపీగా భావించాలా? బాబు రుణమాఫీ చేయకపోయినా, కాపుల్ని బీసీల్లో చేర్చకపోయినా పవన్ మాట్లాడలేదన్నది నిజంకాదా? - నాలుగేళ్లు చంద్రబాబును ఎందుకు పొగిడారో, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో పవన్ చెప్పాలి? ఇద్దరి మధ్య అవినాబంధం లేకుండానే చంద్రబాబు పంపిన ప్రత్యేక హెలికాఫ్టర్లు, విమానాలలో ఎందుకు తిరిగారు? రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడకపోవడం అంటే బాబుకు ఆమోద ముద్ర వేస్తున్నట్టు కాదా? - టీడీపీ అన్యాయాలు, అక్రమాలపై నాలుగున్నర ఏళ్లుగా వైఎస్సార్సీపీ పోరాడుతుంటే సమర్థించాల్సింది పోయి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తావా? - రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రిని వదిలి ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం ఎందుకో ఆత్మవిమర్శ చేసుకో అంటూ పవన్‌కు ఉమ్మారెడ్డి సూచించారు. జనసేన టిక్కెట్లు బాబే ఇస్తారేమో! రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య మిత్రుడని, వచ్చే ఎన్నికల్లో జనసేన టిక్కెట్లను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు రూ. 6,700 కోట్లను దోచుకున్న సుజనా చౌదరి లాంటి వాళ్ల మోసాన్ని ఖండించడానికి కూడా పవన్ కళ్యాణ్‌కు నోరు రావడం లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ దోపిడీకి సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోకి సీబీఐని ఎందుకు రానివ్వనని చంద్రబాబు చెప్పారో, సీబీఐ, ఈడీ అంటే ఎందుకు కంగారు పడుతున్నారో సుజానా చౌదరి కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమవుతోందన్నారు. 126 డొల్ల కంపెనీలతో ప్రజల సొమ్మును టీడీపీ ఎంపీ దోపిడీ చేసినట్టు అంకెలు, సంఖ్యలతో సహా బయటకు వస్తుంటే దాన్ని పట్టించుకోకుండా.. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్‌ను పవన్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం ఏరులై పారుతున్నా, మైనింగ్ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోకుండా రాజకీయం చేస్తావా పవన్ అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకే ఆ పార్టీతో విడిపోయినట్టుగా నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పవన్‌పై మండిపడ్డారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని రూ. 20 లక్షలకే లింగమనేని రమేష్ జనసేన అధినేత పవన్‌కు ఎందుకిచ్చారో ప్రజలు అర్థంచేసుకున్నారని, పవన్ నిర్మాత ఎవరో తేలిపోయిందని వివరించారు. ఇవన్నీ మరిచి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లే.. స్కూటర్‌పై తిరిగిన తాను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘పవన్ కల్యాణ్‌వి వింత రాజకీయాలు’
సాక్షి, హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వింత రాజకీయాలు అనుసరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలపై పవన్‌కు క్లారిటీ ఉందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్ని సభలు పెట్టినా.. పవన్ మద్దతు తెలుపలేదని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ ఏనాడూ విమర్శించలేదని.. ఎందుకంటే వారి మధ్య అనుబంధం అలాంటిందని వ్యాఖ్యానించారు. రైతులకు వ్యతిరేకంగా చంద్రబాబు భూసేకరణ చేసిన పవన్ ప్రశ్నించలేదు.. పైగా సమర్థించే ప్రయత్నం చేశారని అన్నారు. జన్మభూమి కమిటీల్లోని అక్రమాలపై, ఇసుక అక్రమాలపై పవన్ చంద్రబాబును ప్రశ్నించారా అని నిలదీశారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడితే పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం వల్లే పవన్, చంద్రబాబును ఏనాడు ప్రశ్నించలేదని అన్నారు. నాలుగేళ్లు నోరు ఎత్తకుండా.. ఇప్పుడు వచ్చి ప్రతిపక్షనేతపై మాట్లాడం ఎమిటని ఆయన పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అది డ్రామా అని డీజీపీ ప్రకటన చేస్తే, పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. -
‘పవన్ కల్యాణ్‌వి వింత రాజకీయాలు’
-
రాష్ట్రపతి కోవింద్‌ను కలవనున్న వైఎస్ఆర్సీపీ నేతలు
-
గుంటూరులో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సదస్సు
-
‘ఎవరికి టికెట్ ఇవ్వాలో చంద్రబాబే నిర్ణయిస్తున్నాడు’
సాక్షి, గుంటూరు : తెలంగాణలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది చంద్రబాబు నిర్ణయిస్తున్నారంటే కాంగ్రెస్ బతికి ఉంటే ఏంటి.. చనిపోతే ఏంటి అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శించారు. వైఎస్సాఆర్సీపీ ఆత్మీయ సదస్సులో పాల్గొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇవాళ రాష్ట్రంలో దుర్మార్గపు రాజకీయం నడుస్తోందంటూ మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన టీడీపీ కాంగ్రెస్‌పార్టీతో కలవటం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌పార్టీ కలవటాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతున్నారు..కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నది దేశం కాదు చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబుతో తాను చాలా కాలం పనిచేశానని, ఆయన మనస్తత్వం తనకు బాగా తెలుసునన్నారు. అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ విమర్శించారు. ఈ రాష్ట్రంలో సిట్ విచారణ అంటే సిట్టింగ్ పొజిషన్ అని, జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ మండిపడ్డారు. -
కావాల్సింది ‘పౌష్టికాహార భద్రత’
‘ఈసురోమని మనుషులుంటే.. దేశమేగతి బాగు పడునోయ్’ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ జాతి నిర్మాణానికి అక్కరకొచ్చే ఆరోగ్యవంతులు ఎంతమంది అన్నది ప్రశ్నార్థకం. దేశంలో మెజారిటీ ప్రజ లకు సమతులాహారం, ఆహార భద్రత మాట అటుంచి కనీసం పొట్ట నింపుకోవడానికి కనీస పోషకాహారం కూడా దొరకని దుస్థితి ఈనాటికీ సమాజంలో తొలగిపోలేదు. అక్టోబర్ 16న జరిగిన ‘ప్రపంచ ఆరోగ్య దినం’ సందర్భంగా వివిధ దేశాల ఆహార భద్రతపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదిక భారతదేశానికి సంబంధించి మింగుడుపడని ఓ చేదు మాత్ర. ఈ నివేదికలో అనేక ఆందోళనకర వాస్తవాలు వెలుగుచూశాయి. 130 కోట్లమంది భారతీయుల్లో 14% మంది ప్రజలు ప్రతిరోజూ కడుపునిండా తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. దేశంలోని ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు పోషకాహారలేమితో బాధపడుతుంటే, 5 ఏళ్లలోపు పిల్లల్లో 20% మంది పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. ఏటా దేశంలో 10 లక్షల 95 వేల మంది పోషకాహార లేమికి సంబంధించిన జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధిక శాతం ప్రజలకు కేవలం పోషకవిలువలున్న సమతుల ఆహారం అందుబాటులో లేదు. ఆర్థిక ప్రగతిలో భారత్ వేగం రెండంకెలు దాటుతున్న మాట నిజం. గత రెండు దశాబ్ధాలకుపైగా భారతదేశం సాంకేతికంగా, వైజ్ఞానికంగా వడివడిగా ముందుకు సాగుతున్నది. 2022 నాటికి భారత్ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్ను దాటుతుందని ప్రపంచ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రగతిని చూసి సగటు భారతీయుడు మురిసిపోవాలా? లేక ఆర్థికాభివృద్ధి రేటుతో సమాంతరంగా పెరుగుతున్న సగటు మానవుని ఆకలి కేకల్ని చూసి బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితి దేశంలో నెలకొంది. ఇందుకు ఆర్థిక అసమానతలు పెరగడం, పేద, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తి క్షీణించడమే. 2014–2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆకలికి బలైపోయిన వారి సంఖ్య 82 కోట్లకు చేరగా అందులో భారత్‌లో 32 లక్షల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఆహారధాన్యాల లభ్యత, పౌష్టికాహార లోపం, అస్తవ్యస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తయారుచేసిన ఈ నివేదికలో.. 119 దేశాల ఆకలి సూచీలో భారత్ 100వ స్థానంలో నిలిచింది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ మనకంటే మెరుగ్గా 88వ ర్యాంకులో నిలువడం గమనార్హం! తలసరి ఆదాయాలు పెరుగుతున్నా, కేంద్ర బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు చేరుతున్నదని గొప్పగా చెప్పుకున్నా అవేవీ దేశ ప్రజల ఆకలిని సంపూర్ణంగా తీర్చలేకపోతున్నాయి. పరిస్థితి చేయి దాటుతోం దంటూ ఐక్యరాజ్య సమితి భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 60వ దశకం చివర్లో సాధించి, అమలులోకి తెచ్చిన హరితవిప్లవం 90వ దశకం వరకూ దేశ ఆహార భద్రతను పెంచింది. అయితే, ఆ తర్వాత దేశంలో, అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీశాయనే చెప్పాలి. 1954లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత సగటున ఏడాదికి 167.1 కిలోలు ఉండగా, హరిత విప్లవం వచ్చాక అది గరిష్టంగా 1968లో 187.2 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత ఆ మొత్తం తగ్గుతూ 2005 నాటికి 154.2 కిలోలకు పడిపోయింది. 2016–17 నాటికి దేశంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఏడాదికి 160 కిలోల వద్దకు చేరుకొంది. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగడం లేదన్నది సుస్పష్టం. ఐక్యరాజ్య సమితి రూపొందించిన 17 అభివృద్ధి లక్ష్యాలలో ప్రజ లందరికీ ఆహార భద్రత ప్రధానమైనది. నిజానికి, దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పించడమే కాకుండా పోషకాహార భద్రతపైకి దృష్టి మళ్లిం చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలు అన్నీ వ్యవసాయ, ఆరోగ్య, పోషకాహార రంగాలను అనుసంధానం చేసి అమలు చేస్తే.. దేశంలో ఆహార భద్రతతోపాటు పౌష్టికాహార భద్రత కూడా సాధించవచ్చు. వ్యాసకర్త: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చి అమరావతిలో చేసే కాంక్రీట్ నిర్మాణాల వల్ల.. పరిశ్రమలు వస్తాయా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయా? వ్యవసాయరంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతాయా? రాజధాని ప్రాంతంలో బలవంతంగా రైతులనుండి ‘‘ల్యాండ్ పూలింగ్’’ పేరున భూములు పోగొట్టుకొన్న రైతాంగానికి కడుపు నింపుతుందా లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. కానీ, ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదేశం ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న ఈ అప్పులు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారి, భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు, ప్రభుత్వాలకు పెనుశాపాలుగా కానున్నాయి. ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తల్లా వ్యవహరించాలన్నది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. ప్రజలు కట్టే పన్నులే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయవనరులు కనుక ప్రభుత్వ నిర్వహణలో ఎటువంటి దుబారా లేకుండా ఆచితూచి ఖర్చు చేస్తూ... పొదుపు చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు విషయానికి వస్తే ఇతర దేశాలు, రాష్ట్రాలు అనుసరిస్తున్న పొదుపు పంధాకు విరుద్ధంగా ఇక్కడి పాలకులు వ్యవహరించడం గత నాలుగున్నరేళ్ళుగా గమనిస్తున్నాం. రాష్ట్రం విడిపోయాక.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం తగ్గింది. రోజువారీ ఖర్చులక్కూడా తడుముకోవాల్సి వస్తున్నదని తొలిరోజు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టిన రెండో మాసంలోనే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని ప్రజల ముందుంచింది. 2014 జూలైలో ఆర్థిక రంగంపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం 22వ పేజీలో ఉదహరించిన అంకెల ప్రకారం 2014 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 1,61,014 కోట్లు. అందులో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సంక్రమించిన అప్పు రూ. 92,461 కోట్లు. ఈ మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 19. 4%గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ. 15,850 కోట్ల మేర అప్పులు స్వీకరించే అవకాశం ఉందని కూడా అందులో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి’’ అని స్పష్టం చేశారు. నిజానికి, 2004–2014 మధ్య పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా అంచులకు చేరిందని, సహేతుకమైన రీతిలో రాష్ట్రాన్ని విభజించనందువల్ల ఆర్థిక కష్టాలు పెరిగాయని ప్రచారం చేయడానికే ‘శ్వేతపత్రం’ విడుదల చేశారన్నది నిర్వివాదాంశం. ఇక, శ్వేతపత్రంలో పేర్కొన్నట్లు వట్టిపోయిన ఏపీ ఖజానాను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారని, పొదుపు మంత్రం జపిస్తారని, ఆర్థిక పరిస్థితిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దారని, పరిపాలన పారదర్శకంగా ఉంటుం దని అందరూ భావించారు. కానీ, అధికారం చేపట్టిన తొలిరోజునుంచే చేతికి ఎముకేలేదన్నట్లు నూతన ప్రభుత్వం ధారాళంగా దుబారా చేయడం చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పరిపాలన మొదలుపెట్టిన ప్రారంభంలోనే సెక్రటరియేట్లో ముఖ్యమంత్రి, మంత్రులు చాంబ ర్లను వందల కోట్లు ఖర్చుచేసి ఆధునీకరణ పనులు చేపట్టారు. హైదరాబాద్ సెక్రటరియేట్లో సీఎం, మంత్రుల చాంబర్లు ముస్తాబయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ‘ఓటుకు కోట్లు’ ఉదంతం బయటపడింది. ‘‘పదేళ్లకు ఒక్క రోజు తక్కువ కాకుండా హైదరాబాద్‌లోనే ఉంటాం.. ఎవరేమి చేస్తారో చూస్తాం’’ అని టీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసిరిన ఏపీ మంత్రులు సీఎం ఆదేశాలతో మూటాముల్లె సర్దుకొని మారు మాట్లాడకుండా విజయవాడకు తరలివెళ్లిపోయారు. అమరావతిలో తాత్కాలిక సెక్రరియేట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెక్రటేరియేట్‌లో సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఏపీ సీఎం, మంత్రుల చాంబర్లు వినియోగంలో లేక బూజులు పట్టాయి. కానీ, వాటికి గత నాలుగేళ్లుగా కరెంట్, నీళ్లు ఇతరత్రా సౌకర్యాలకు బిల్లులు మాత్రం చెల్లిస్తూనే ఉన్నారు. ప్రాధాన్యతల విస్మరణ రాష్ట్ర ప్రభుత్వం చేసే దుబారా ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. సాగునీటి రంగంలో ప్రాజెక్టులకు పెంచేసిన అంచనాలు, చేస్తున్న ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఏపీ విభజన బిల్లు ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉండగా దానిని రెండున్నరేళ్లపాటు పక్కనపెట్టి.. తమ పార్టీ మేనిఫెస్టోలోగానీ, ఎన్నికల ప్రచార సభల్లో గానీ కనీస ప్రస్తావనలేని పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. పట్టిసీమ అంచనాలు రూ. 1300 కోట్లుగా నిర్ధారించి.. సకాలంలో దానిని పూర్తిచేస్తే కాంట్రాక్టర్‌కు ప్రాజెక్టు అంచనాల మీద 22% అదనంగా బోనస్ ఇస్తామన్న నిబంధన పెట్టి.. నిర్ణీత గడువులోగా.. ప్రాజెక్టు పేర్తి అయినట్లు చూపించడానికి పాత పంపులు రెండు తెచ్చి బిగించి.. వాటి ద్వారా నీళ్లు వదిలి.. కాంట్రాక్టర్‌కు బోనస్‌గా దాదాపు రూ. 300 కోట్లు చెల్లించేశారు. సహజంగా సకాలంలో కాంట్రాక్టర్ పనిపూర్తి చేయకపోతే పెనాల్టీ నిబంధన ఉంటుంది గాని, పూర్తిచేస్తే ‘‘బోనస్ ఇస్తాననడం, ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఇది ప్రజాధనాన్ని దుబారా చేయడం కాదా! ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇలా చేయడం సబబా? ఇటీవల ‘కాగ్’ తన నివేదికలో ‘పట్టిసీమ ప్రయోజనం శూన్యం’ అని తేల్చిన విషయం గమనార్హం! అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అప్పులు చేస్తున్నది. అమరావతి రాజధానిని 3 దశల్లో నిర్మించడానికి రూ. 48,110 కోట్లుగా అంచనావేసి.. అందులో 36 పనుల్ని రూ. 26,600 కోట్లతో చేపట్టారు. ప్రభుత్వ వివరాల ప్రకారం ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్, విజయబ్యాంక్ల నుంచి రూ. 2,060 కోట్లు; హడ్కో నుంచి రూ. 14,050 కోట్లు అప్పులు తీసుకున్నారు. బాండ్ల ద్వారా రూ. 2,000 కోట్లు సేకరించారు. కేంద్రం ఇచ్చింది రూ. 1500 కోట్లు. ఇవికాక ప్రపంచ బ్యాంకు నుండి మరో రూ. 8,300 కోట్లు, హడ్కో నుంచి రూ. 6,200 కోట్లు, వివిధ బ్యాంకుల నుంచి రూ. 10,000 కోట్లు మొత్తం రూ. 24,500 కోట్లు అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అప్పుల వివరాల సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచడం లేదు. అప్పులు తెచ్చి చేస్తున్న వ్యయానికి లెక్కలు లేవు. రాజధాని నిర్మాణం పనులకోసమని తెస్తున్న అప్పులతో చేపట్టిన పనులను కేవలం 5 సంస్థలకే కట్టబెట్టారు. ఇన్ని అప్పులు చేసి చేస్తున్న పనులను చూస్తే.. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్లు, 7 ప్రయార్టీ రోడ్లు, 3 అడిషినల్ ప్రయార్టీ రోడ్లు, బ్రిడ్జి, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియేట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఎక్కడాలేని విధంగా ఒక్కో కిలోమీటర్ రోడ్డుకు అత్యధికంగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. దొండపాడుఉండవల్లి రోడ్డుకు కిలోమీటర్‌కు రూ. 12 కోట్లు; కృష్ణాయపాలెంనెక్కల్ని రోడ్డుకు కిలోమీటర్‌కు రూ. 18 కోట్లు; ఉద్దండరాయపాలెంనిడమర్రు రోడ్డుకు కిలోమీటర్‌కు రూ. 17 కోట్లు చొప్పున చెల్లిస్తున్నారు. పప్పు బెల్లాలు పంచినట్లు ఇష్టానుసారం పనుల్ని అప్పజెప్పారు. ఎక్కడా పారదర్శకత లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో తెలియదు. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ ! అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే విభజిత ఆంధ్రప్రదేశ్ త్వరలో కోలుకోగలుగుతుందన్న ఏకపక్ష వాదనను ఒక వర్గం మీడియా సహకారంతో తెరపైకి తెచ్చి ప్రజలు భావోద్వేగాలను సొమ్ము చేసుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు.. నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనేది ఈనాటి ప్రజాభిప్రాయం. బాబు సీఎంగా అయ్యేనాటికి విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 92,461 కోట్లు ఉండగా.. 2018 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 2,25,234 కోట్లుకు చేరింది. నాలుగేళ్లల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం రూ. 1,32,773 కోట్లు. విభజన నాటికి అప్పు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 19.4% ఉండగా ప్రస్థుతం అది 28.79% నికి పెరి గింది. ‘‘ఎఫ్ఆర్బిఎం’’ నిబందనల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏటా చేసే అప్పుల శాతం 3% మించరాదు. కానీ, ఆ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. ఈ అప్పులతోనే రాష్ట్రం సరిపెట్టుకోవడం లేదు. అమరావతి బాండ్ల రూపంలో ఇప్పటికే రూ. 2,000 కోట్లు సేకరించింది. తాజాగా మొత్తం రూ. 20,000 కోట్ల మేర సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తమే కాక.. రాజధాని కోసం ప్రత్యేకంగా బాండ్ల పేరుతో రుణాలు సేకరణకు శ్రీకారం చుట్టారు. వాటి వివరాలను బయట పెట్టడం లేదు. పరిమితంగా అప్పులు తెచ్చి వాటిని ఆస్తుల కల్పనకు ఉపయోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, తెచ్చిన అప్పులను సహేతుకంగా ఖర్చు చేయకుండా మితిమీరిన దుబారా చేయడాన్ని ఆర్థిక నిపుణలు తప్పు పడుతున్నారు. అమరావతి బాండ్ల ద్వారా నిధులను సేకరించడం కోసం 10.32% వడ్డీ చెల్లించాలని నిర్ణయించడంతో అసలు కంటే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ విడుదల చేసిన బాండ్లపై 8.9% వడ్డీ చెల్లిస్తుండగా, పూణే మున్సిపల్ బాండ్లపై 7.59% మాత్రమే చెల్లిస్తున్నారు. కాగా, అమరావతి బాండ్లను విడుదల చేసిన సిఆర్డిఐకు ఆదాయం ఏవిధంగా లభిస్తుందన్నది ప్రశ్నార్థకం. చంద్రబాబునాయుడు నిర్మించ తలపెట్టిన రాజధానిలో అడుగడుగునా ప్రజలపై పన్నులు విధిస్తారని అర్థమవుతూనే ఉంది. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చి అమరావతిలో చేసే కాంక్రీట్ నిర్మాణాల వల్ల.. రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటన్నది ప్రశ్నార్థకం. ప్రపంచస్థాయి రాజ ధాని వల్ల పరిశ్రమలు వస్తాయా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయా? వ్యవసాయరంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతాయా? రైతుల ఆదాయం పెరుగుతుందా? గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగవుతాయా? గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయా? రాజధాని ప్రాంతంలో బలవంతంగా రైతుల నుండి ‘‘ల్యాండ్ పూలింగ్’’ పేరున భూములు పోగొట్టుకొన్న రైతాంగానికి కడుపు నింపుతుందా లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. కానీ, ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదేశం ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న ఈ అప్పులు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారి, భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు, ప్రభుత్వాలకు పెనుశాపాలుగా మారనున్నాయి. - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది : సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వీరితో పాటుగా కిలారి రోశయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, ముస్తఫా, ఆర్కే తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా వైఎస్ జగన్ సీఎం కావాలంటున్నారు : సజ్జల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. అయినా గానీ మళ్ళీ అధికారం కోసం చంద్రబాబు దింపుడు కళ్లం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని సజ్జల వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన వస్తుందో జగన్ చెప్పిన మాటలను ప్రజలు నమ్ముతున్నారని, అందుకే అన్ని సర్వేల్లోనూ 50 శాతం మంది ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుది నీచపు రాజకీయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది నీచపు రాజకీయమని సజ్జల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ పాలన మాఫియా ముఠాలా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలవదని తెలిసే మరో మోసపూరిత పార్టీ కాంగ్రెస్‌తో బాబు చేతులు కలిపారని.. ఈ అనైతిక పొత్తు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని రామకృష్ణా రెడ్డి విమర్శించారు. టీడీపీని ప్రజలు చీదరించుకుంటున్నారు : ఉమ్మారెడ్డి విలువలు లేకుండా ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కున్న టీడీపీని ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాజధాని నిర్మాణం దగ్గరి నుంచి పోలవం వరకూ అన్నింటా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సింగిల్‌గా పోటీచేయడం చేతకాకే చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ కాళ్లు పట్టుకుని మద్దతు కోరారని ఎద్దేవా చేశారు. వాగ్దానాలను తుంగలో తొక్కిన చంద్రబాబును క్షమించే స్థితిలో ప్రజలు లేరని విమర్శించారు. -
'నిజాలు బయటకొస్తాయని టీడీపీకి భయం'
-
కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : నరసరావుపేటలోని గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తవాతావరణం నెలకొంది. అక్రమ గునుల పరిశీలనకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు. యరపతినేని కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని, అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తుంటే వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకొస్తాయని యరపతినేనికి భయం పట్టుకుందన్నారు. కూలీలు, డ్రైవర్లపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారన్నారు. ఇల్లు, పొలం కూడా లేని వ్యక్తి రూ.80 కోట్ల స్కాం చేస్తాడా అని ధ్వజమెత్తారు. అమాయకులపై కేసులు పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని హైకోర్టు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అమాయకులపై కేసులు పెట్టి యరపతినేని ఈ కేసులనుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్ క్వారీలను తాము పరిశీలిస్తే నిజాలు బయటకోస్తాయని టీడీపీకి భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ఖచ్చితంగా అక్రమమైనింగ్ క్వారీలను పరిశీలిస్తామని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసును తప్పుదారిపట్టించాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అక్రమ మైనింగ్ పాల్పడ్డవారు ఎవరైనా శిక్షపడాల్సిందేనన్నారు. నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడం సరికాదన్నారు. -
బీజేపీతో లాలూచీపడి ప్రజలను వంచించారు
-
అవిశ్వాసం.. అంతా ఓ డ్రామా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీపీడీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు ఇంకా లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, టీడీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రజలను మరోసారి మోసం చేసుందుకు కుట్ర చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం.. అంతా ఓ డ్రామా!. ప్రజలు వాళ్లకి సరైన బుద్ధి చెప్తారు’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ‘లోక్‌సభలో 13సార్లు వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా చర్చకు రాలేదు. కానీ, టీడీపీ అవిశ్వాసంపై చర్చకు అనుమతిచ్చారు. వైఎస్సార్ సీపీ సభలో లేదుగనుకే బీజేపీ-టీడీపీలు డ్రామాలాడుతున్నాయి’ అని ఉమ్మారెడ్డి ఆక్షేపించారు. -
బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలు
-
జమిలి ఎన్నికలకు సై : వైఎస్సార్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలను(జమిలి ఎన్నికలు) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మంగళవారం లా కమిషన్‌తో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. జమిలి ఎన్నికలను ఉద్దేశించి పార్టీ తరఫున తొమ్మిది పేజీల సూచనలను సమర్పించారు. సమావేశ అనంతరం విజయసాయి రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉమ్మడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమి కాదని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ ఏపీలో ఎన్నికలు అలానే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలను వైఎస్సార్ సీపీ సమర్ధిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, అవినీతి బాగా తగ్గుతుందని, అప్పుడే ఓటుకు కోట్లు లాంటి కేసులు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల నిరోధక చట్టం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని లా కమిషన్‌కు సూచించినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఫిరాయింపుల చట్టాన్ని వినియోగించి స్పీకర్ తన విధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపుల విషయంలో అనర్హత వేసే అధికారం నుంచి స్పీకర్‌ను తప్పించి, ఆ స్థానంలో ఎన్నికల కమిషన్‌కు పవర్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరినట్లు వివరించారు. జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకే అధిక లాభం చేకూరుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినకుండా వాటికి స్పష్టమైన భరోసా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ముందుగా లోక్‌సభ లేదా అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారని లా కమిషన్‌ను ప్రశ్నించగా.. రద్దు అయిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ సభ్యులు చెప్పారని వివరించారు. జమిలి ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయ సాధన చేయాలని కోరినట్లు తెలిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వం.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దుతు ఇచ్చే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ, దాని తరఫు మిత్ర పక్షాలకూ మద్దతు ఇవ్వబోమని వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ మోసం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇస్తారనే ఆశతోనే ఆనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫు అభ్యర్థికి మద్దుతు ఇచ్చామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఏనాడు రాజీపడలేదని గుర్తు చేశారు. 2014 నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనే అని పేర్కొన్నారు. -
స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి
-
జైళ్లలో వేస్తామని చంద్రబాబు బెదిరించారు
-
5నిమిషాల్లో చంద్రబాబు రక్తం చల్లబడిందా!
సాక్షి, విజయవాడ : దేశంలో 10కి పైగా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని ఏపీ శాసనమండలి విపక్షనేత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. హోదా కనుక ‘ఇస్తే కేవలం నిరుద్యోగులకే కాదు అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఆనాడు కలుగుతుందని పార్లమెంట్లో చెప్పారు. వెంకయ్య నాయుడు సైతం 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని కావాలని భావించిన నరేంద్ర మోదీగానీ మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, చంద్రబాబులు హోదాపై మాట మార్చారని’ ఉమ్మారెడ్డి గుర్తుచేశారు. 2014 ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వాలు ఏర్పాటు తర్వాత 7 నెలలపాటు ఉన్న ప్లానింగ్ కమిషన్‌కు, ఆపై ఏర్పడిన నీతి ఆయోగ్‌కు అధ్యక్షుడు మోదీ అయినా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్యాకేజీ, హోదాలలో చంద్రబాబు అడిగారన్న కారణంగా ప్యాకేజీ ఇస్తామని ఒప్పుకున్నట్లు కేంద్రం ఎన్నోమార్లు చెప్పింది. ప్యాకేజీ ప్రకటన వినగానే రక్తం మరిగిందన్న చంద్రబాబు.. 5 నిమిషాల్లో ఎందుకు చల్లపడ్డారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయాలను సాదరంగా స్వాగతిస్తూ ఏపీ ప్రజలకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. జైళ్లలో వేస్తామని చంద్రబాబు బెదిరించారు ఎట్టిపరిస్థితుల్లోనైనా రాష్ట్రానికి హోదా ఇస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మా దీక్షలు, ధర్నాలను పలుమార్లు సీఎం చంద్రబాబు ఎగతాళి చేశారు. బెదిరింపుల ధోరణితో ఉండి, నిరుద్యోగులను సైతం బెదిరించారు. హోదా మీటింగ్‌లకు వెళ్తే జైళ్లలో వేస్తాం. మీ పిల్లలపై పీడీ యాక్ట్ పెడతామంటూ నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులను భయపెట్టారు. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్తుంటే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకోవడం దారుణం కాదా. గవర్నర్, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లాంటి కీలక రాజ్యాంగ నేతలు అందరి దగ్గరికి వెళ్లి వైఎస్ జగన్ ఏపీలో పరిస్థితిని వివరించారు. హోదా ఆవశ్యకతను వారితో చర్చించారు. కానీ టీడీపీ మాత్రం హోదా పోరాట చర్యలను అడ్డుకున్నారు. హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెబితే.. ఏ పార్టీని అవమానించినట్లు కాదని, ఏపీ ప్రజలు మొత్తాన్ని అవమానపరిచినట్లేనని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం హోదా ఏమైనా సంజీవనా. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించారు. ఆపై కేంద్రం ఏ ప్రకటన చేసినా శాలువాలు కప్పి వారికి ధన్యవాదాలు తెలిపారు. సిగ్గు లేకుండా టీడీపీ అలాంటి చర్యలకు పాల్పడింది. దేశంలోనే సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు. అవిశ్వాసంలోనూ కపట నాటకమే అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడితే 50 మంది ఎంపీల మద్దతు లభిస్తే చర్చ జరుగుతుందని చంద్రబాబుకు తెలుసు. తొలుత ఎవరు పోరాడినా మద్దతిస్తామన్న చంద్రబాబు 10 గంటల్లోనే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. వైఎస్సార్సీపీకి మేం ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. సభ ఆర్డర్లో లేదని సాకుగా చూపించి అవిశ్వాస తీర్మానాన్ని పక్కనపెట్టిన స్పీకర్.. ఇతరత్రా కీలకబిల్లులని ఆమోదించారని గుర్తుచేశారు. చివర్లో ఏదైనా ప్రకటన వస్తుందని ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 6న వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టగా ఏదో ఓ సాకు చూపిస్తూ ఒక్కో రోజు ఒక్కరిని ఆస్పత్రికి తరలించి మా దీక్షను భగ్నం చేశారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే.. ఏపీకి హోదా సాధన కోసం టీడీపీ, బీజేపీ ఎంపీలను సైతం రాజీనామా చేయాలని అప్పీల్ చేశాం. కానీ వారు రాజీనామా అనగానే దూరం జరిగారు. వాళ్లు సహకరిస్తే పరిస్థితి మరోలా ఉండేది. అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గింది, డ్రామాలాడింది టీడీపీయేనంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : టీడీపీ భయపడుతోంది : మిథున్ రెడ్డి ‘రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టం’ ఒకటే మాట.. ఒకటే బాట ‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’ ‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’ వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
దమ్ముంటే అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి
-
బాబు సాధించింది సున్నా
హైదరాబాద్/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. బాబు హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆయన అన్ని రంగాల్లో దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ రూపొందించిన చార్జిషీట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తమ్మినేని సీతారాం, జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు విడుదల చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో అభివృద్ధి సున్నా అని ధ్వజమెత్తారు. అనినీతి, అరాచకాలు ఆకాశాన్నంటాయని అన్నారు. అందుకే చంద్రబాబు పాలనా వైఫల్యాలను చార్జిషీట్లో పొందుపరిచామని తెలిపారు. ఉమ్మారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిలపడ్డారు. వైఎస్సార్సీపీ చార్జ్‌షీట్, టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు సరిచూసుకోవాలి. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాను ముఖ్యమంత్రి పెంచి పోషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు పెట్టిన మొదటి ఐదు సంతకాలకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. మొదటి సంతకాలకు ఉన్న ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించారు. రుణాలను మాఫీ చేయకుండా రైతాంగానికి వెన్నుపోటు పొడిచారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు సిగ్గుపడాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక్క పంటకైనా మద్దతు ధర ఇచ్చారా? మద్యం బెల్టు దుకాణాలు మూసి వేస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్కటైనా మూసివేయించారా? రూ.2కే 20 లీటర్ల మంచినీరు ఇస్తామని సంతకం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క చోటైనా నీరు ఇచ్చారా? గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం రాజధాని నిర్మాణాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు బ్రహ్మాండమైన గ్రాఫిక్ చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. మూడు పంటలు పండే పొలాలను రాజధాని కోసం బలవంతంగా తీసుకున్నారు. అమరావతిలో ఇంతవరకు ఒక్క శాశ్వత భవన నిర్మాణం కూడా నిర్మించలేదు. 13 జిల్లాలకు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. అందులో కనీసం 10 శాతమైనా అమలు చేసినట్లు చూపిస్తే చంద్రబాబుకు సెల్యూట్ చేస్తాం. అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని ఉమ్మారెడ్డి తేల్చిచెప్పారు. బాబు నాలుగేళ్ల సినిమా అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాలుగేళ్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ప్రమోషన్లతో కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని అన్నారు. రాజ్యంగబద్ధంగా గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు హీనంగా చూస్తున్నారని ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పాలనలో అరాచకాలు, భూ కబ్జాలు, కమీషన్ల వ్యాపారం రాజ్యమేలుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు వాసిరెడ్డి పద్మ, నారమల్లి పద్మజ, చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మరణమే శరణ్యం: తమ్మినేని సీతారాం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా ఐసీయూలో ఉందని, దీనికి మరణమే శరణ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన తొలి సంతకం ఇప్పటికీ చివరి సంతకంగానే మిగిలిపోయిందన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయలేదని ఆరోపించారు. అన్ని హామీలకు తూట్లు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలనూ దగా చేశారని విమర్శించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేశారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఓ సంస్థ వెల్లడించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని మరో సంస్థ ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రాలు విడుదల చేయాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. అవినీతిపై విచారణ జరిపించాలి పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని చంద్రబాబు పాలనపై విడుదల చేసిన చార్జిషీట్లో వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటనకు ముందే బాబు తన బినామీలతో అక్కడ భూములు కొనిపించారని, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అందులో పేర్కొన్నారు. అమరావతి భూ కేటాయింపుల్లో మూడేళ్లుగా రూ.వేల కోట్లు చేతులు మారాయని, ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబం సాగించిన విదేశీ లావాదేవీలు, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్, ఓటుకు కోట్లు కేసు, ఐఎంజీ భారత్ స్కాం, అగ్రిగోల్డ్ స్కాం, చంద్రబాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు, మంత్రి నారా లోకేశ్ సంపాదన, తిరుమలలో అరాచకాలు, సింగపూర్ కంపెనీలకు రాజధాని భూముల అప్పగింత, నీరు–చెట్టు, భూ సేకరణ, భూ సమీకరణ పేరుతో చేసిన అరాచకాలపై తక్షణం విచారణ చేపట్టాలని చార్జిషీట్లో డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి దక్కిన కిరీటాలు ‘‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4, రైతుల అప్పుల్లో నెంబర్ 1, దొంగతనాలు, దోపిడీల్లో నెంబర్ 6, ప్రమాదాల్లో నెంబర్ 7, హెచ్ఐవీ కేసుల్లో నెంబర్ 1. ఇలా రాష్ట్రానికి ఎన్నో కిరీటాలు దక్కాయి. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికి కాదని టీడీపీ నేతలకు కట్టబెడుతూ ఏకంగా జీవోలు జారీ చేశారు’’ అని చార్జిషీట్లో పేర్కొన్నారు. -
పోలింగ్ బూత్ కమిటీ సభ్యులే ఎన్నికల్లో కీలకం
-
రాష్ట్ర ప్రయోజనాలను వంచించి...ఇప్పుడు దీక్షలు చేస్తారా ?
-
ఏపీ ప్రజల్నిమోసం చేస్తున్నచంద్రబాబు
సాక్షి, కర్నూలు : వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు తన ప్రభుత్వంలో అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీనిచ్చిన చంద్రబాబు ఇప్పుడా ఊసే ఎత్తడంలేదన్నారు. సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైఎస్సార్ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు నిర్వాకం వల్ల రుణమాఫీ జరగకపోవడంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. -
చంద్రబాబు దీక్ష ఎవరి ప్రయోజనం కోసం ?
-
ఏపీ బంద్ భగ్నానికి టీడీపీ విన్యాసాలు..
సాక్షి, హైదరాబాద్: ఏపీ బంద్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ సీపీ, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇవాళ (సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టామని, ఇందులో బీజేపీ, టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నారన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమ ఆకాంక్షను బంద్ ద్వారా చాటి చెప్పారన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేశారని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, రిలే దీక్షలు చేపట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ రోజు కూడా బంద్‌లో పాల్గొన్న నాయకులను చంద్రబాబు అరెస్టు చేయించారని, మహిళలను బలవంతంగా లాక్కెళ్లి స్టేషన్లో వేయించారన్నారు. ఈ ఘటనలతో చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతమా? రెండు నాల్కల దోరణీనా చెప్పాలన్నారు. టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయించి అందరం కలిసి పోరాడుదామని కోరితే ఎలాంటి స్పందన లేదన్నారు. అందరం కలిసి పోరాటం చేస్తే కేంద్రం దిగిరాక తప్పదన్నారు. అలాంటి పోరాటాలు చేయకుండా బంద్‌లో పాల్గొన్న వారిని అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కోరారు. మోదీ దీక్ష విడ్డూరం గతంలో ఎన్నడు లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరాహార దీక్ష చేశారన్నారు. 13 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్‌ను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రధానిది కాదా అన్నారు. ఇదే ప్రభుత్వం గతంలో పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్న వారిని సస్పెండ్ చేసి సమావేశాలు కొనసాగించారన్నారు. ప్రధాని, బీజేపీ నాయకత్వం ఫెయిల్యూర్ అయి దీక్షకు కూర్చోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధాని కూర్చున్నారని చంద్రబాబు కూడా దీక్షకు దిగడం దారుణమన్నారు. ఎవరి మీద చంద్రబాబు దీక్ష చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. దీక్ష చేసే బదులు టీడీపీ కూడా బంద్‌లో పాల్గొని ఉంటే బాగుండేది కదా అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే కదా మేం బంద్ చేపట్టిందన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి బంద్‌ను భగ్నం చేసేందుకు టీడీపీ చేసిన విన్యాసాలు సరైంది కాదన్నారు. గతంలో పీవీ నరసింహరావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నంద్యాలలో ఆయన పోటీ చేశారన్నారు. ఆంధ్రుడు ప్రధాని అయ్యాడని ఎన్టీ రామారావు తన అభ్యర్థిని నిలపలేదన్నారు. కేంద్రం అన్యాయం చేస్తే..వారికి వ్యతిరేకంగా బంద్ చేపడితే ఆ బంద్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే..చంద్రబాబు రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయడం లేదని అనడం బాధాకరమన్నారు. ఏ నాడు కూడా రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన ఘటన లేదన్నారు. నాడు భోఫోర్స్ కుంభకోణంపై నాడు ఎన్టీ రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలోని 12 పార్టీలోని 148 మంది ఎంపీల్లో 106 మంది లోక్‌సభ సభ్యులతో మాత్రమే రాజీనామా చేయించారని, అక్కడ కూడా రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయలేదన్నారు. నీవు ఎన్టీ రామారావు వారసత్వం అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లా్లడవని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రమంతా ఒకే దోరణిలో వెళ్లి నిరసన వ్యక్తం చేయాలన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడదామంటే చంద్రబాబు కలిసి రాలేదని, ఇవాళ అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునిస్తే..టీడీపీ కలిసి రాలేదన్నారు. ఏ విధంగా ప్రజలు చంద్రబాబును నమ్ముతారని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలను చంద్రబాబు మానుకోవాలని, ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబువి స్వార్థ రాజకీయాలు
-
హోదానే ఏపీకి సంజీవని
-
వైఎస్ జగన్‌ది అలుపెరగని పోరాటం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి రాజీ పడకుండా పోరాటం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. హోదానే ఏపీకి సంజీవని అని వైఎస్ జగన్ ఉద్యమిస్తున్నారన్నారు. గుంటూరు వేదికగా ఆయన ఆమరణ దీక్ష కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం హోదాను వదిలిపెట్టి ప్యాకేజీకి అంగీకరించారని మండిపడ్డారు. హోదాతోనే ఏపీకి అభివృద్ధి సాధ్యమంటూ నాలుగేళ్లుగా వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఉమ్మారెడ్డి అన్నారు. -
శల్యసారథ్యం రాష్ట్రానికి శాపం
టీడీపీ మంత్రుల రాజీనామాలను, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొన్న నిర్ణయంగా కాక.. 2019 ఎన్నికల వ్యూహంలో భాగమేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం టీడీపీకి ఊహించని దెబ్బ. నాలుగేళ్లుగా ఏ దశలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం.. చివరకు అనివార్యంగా మంత్రులతో రాజీనామా చేయించడం తెలుగుదేశం బలహీనత, తప్పిదంగానే యావత్ దేశం పరిగణిస్తోంది. విసిరిన పాచికలు అన్నిసార్లూ అనుకొన్నట్టు పారవు ఎవరికైనా! ప్రతి అడుగును రాజకీయంగా ఆచితూచి వేసే ఏపీ సీఎం చంద్రబాబు అందుకు మినహాయింపు కాదు. కేంద్రంలో తమ ఇద్దరు మంత్రులు అశోక గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించగానే.. రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా మారతాయని ఊహించిన టీడీపీకి జరుగుతున్న పరిణామాలు, వస్తున్న విమర్శలు మింగుడుపడటం లేదు. అయితే, మంత్రులతో రాజీనామా చేయించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని ప్రధాని మోదీ గానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా గానీ సీరియన్‌గా తీసుకోలేదు. తెలుగుదేశం తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తేలిగ్గా తిప్పికొట్టవచ్చునన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కనిపిస్తున్నది. బాబు ప్రభుత్వం చేసిన తప్పుల చిట్టా కేంద్రం వద్ద ఉండి ఉండొచ్చు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న బీజేపీ.. ఏపీలో కూడా తెలుగుదేశాన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు కన్పిస్తోంది. టీడీపీ మంత్రుల రాజీనామాల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొన్న నిర్ణయంగా కాక.. 2019 ఎన్నికల వ్యూహంలో భాగమేనని జాతీయ మీడియా కథనాలు పేర్కొనడం తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ. నాలుగేళ్లుగా ఏ దశలో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం.. చివరకు అనివార్యంగా మంత్రులతో రాజీనామా చేయించడం టీడీపీ బలహీనత, తప్పిదంగానే యావత్ దేశం పరిగణిస్తోంది. ప్రజల ఆకాంక్షల్ని నాలుగేళ్లుగా గుర్తించలేదా? ప్రజల ఆకాంక్షల మేరకు మోదీ మంత్రి వర్గం నుండి తమ ఇరువురు నేతలు తప్పుకొన్నారని, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించే ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలుగుదేశం నేతలు ప్రచారం చేస్తున్నారు. తద్వారా తప్పంతా బీజేపీ మీదకు నెట్టి... కడిగిన ముత్యంలా బయటపడటం టీడీపీ వ్యూహం! కానీ.. ఏం చెప్పినా నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు కదా? గత 4 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీ పరిపాలిస్తోందా? నిర్ణయాలు తీసుకొంటున్నదా? ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా’ అన్నది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదిగా ప్రజలందరూ పరిగణిస్తే.. తెలుగుదేశం దానిని రాజకీయాంశంగానే పరిగణించిందని ప్రజా బాహుళ్యానికి పూర్తి అవగాహన ఉన్నది కదా! రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ నిరసిస్తూనే ఉంది. వైఎస్సార్సీపీ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా చేసినప్పుడు, రాష్ట్ర బంద్ చేసినపుడు.. గుంటూరులో అమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, ప్రతి జిల్లాలో యువగర్జన సదస్సులు జరిపినప్పుడు, పాదయాత్రలో పదేపదే ప్రత్యేకహోదా విషయం ప్రస్తావిస్తున్నప్పుడు... ఇంకా అనేక సందర్భాలలో ఈ అంశంపై పలు రకాలుగా ఉద్యమాలు చేసిన సందర్భాలలో అధికారంలో ఉన్న టీడీపీ ఎదురుదాడికి దిగింది. అక్రమ కేసులు బనాయించింది. ఏ రాజకీయ పార్టీకీ చెందని విద్యార్థులు ఆందోళనకు దిగితే.. వారిపై పి.డి. యాక్ట్ కింద కేసులు పెడతామని, జైళ్లకు పంపిస్తామని, భవిష్యత్తు నాశనం అవుతుందని బెదిరించింది టి.డి.పి. ప్రభుత్వం. విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించింది. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ అడ్డగోలుగా విభజించిందన్న వాదనను ప్రజ ల్లోకి బీజేపీ, టీడీపీలు బలంగా తీసుకువెళ్లడం, ఆనాడు దేశవ్యాప్తంగా మోదీకి లభించిన ఆదరణ తదితర అంశాలు తోడు కాగా స్వల్ప ఓట్ల తేడాతోనే చంద్రబాబు ఏపీకి సీఎం కాగలిగారు. అయితే, విభజన కారణంగా రాష్ట్రానికి సంక్రమించిన కష్టాలను పరిష్కరించవలసిన ప్రభుత్వం.. దానికి బదులుగా కొత్త కష్టాలను ప్రజలపై మోపింది. రుణమాఫీ హామీ ఇచ్చి.. దానిని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రైతాంగం అప్పుల్లో కూరుకు పోయింది. డ్వాక్రా రుణాలమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అమలు వంటి ప్రధాన ఎన్నికల హామీల్ని నెరవేర్చలేదు. దశల వారీ మద్యపాన నిషేధం కాస్తా.. దశదిశల మద్యపానంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. హక్కుగా లభించవలసిన విభజన చట్టంలోని ప్రధాన హామీల్ని కేంద్రం నుంచి సాధించుకోవడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేక పోయింది. చివరి వరకు ప్యాకేజీనే ముద్దు అన్నారు రెవెన్యూలోటును రాష్ట్ర ప్రభుత్వం రూ.16,078 కోట్లుగా చూపితే, కేంద్రం ఇచ్చింది రూ.4,117 కోట్లు మాత్రమే! రాష్ట్ర ప్రభుత్వం చూపిన రెవెన్యూలోటు లెక్కల్లో తేడాలున్నాయని కేంద్రం ఎన్నోసార్లు స్పష్టం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధ్యులైన ఆర్ధికశాఖమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి ఆ లెక్కల్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు. రాజధాని నిర్మాణానికి తొలుత 5 లక్షల కోట్ల రూపాయిలు కావాలని అడిగి, రూ.43,000 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, అందులో కేంద్రం ఇచ్చింది. రూ.2,500 కోట్లు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణం మొదలైన ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలను.. కేంద్రాన్ని ఒప్పించి పరిష్కరించుకునే చొరవ సీఎంగానీ, టీడీపీ ఎంపీలుగానీ చేయలేదు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, జిల్లాలకు కోరాపుట్, బుందేల్ ఖండ్ ప్యాకేజీ వంటిది అందిస్తామని విభజనచట్టంలో ఉండగా, ఆ పద్దు కింద 4 ఏళ్లలో జిల్లాకు రూ.5 కోట్లు చొప్పున 7 జిల్లాలకు కేవలం రూ.105 కోట్లుతో కేంద్రం సరిపుచ్చగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు సరికదా.. ఆ నిధుల్ని కూడా పూర్తిగా ఆయా జిల్లాలకు ఖర్చు చేయకుండా దారి మళ్లించింది. ఇక కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు అర్ధరాత్రి విలేకర్ల సమావేశం పెట్టి..విభజన చట్టంలోని హామీల్నీ చదివేసి వాటిని రీప్యాకేజీ చేస్తే.. అందులో ఏమున్నదో కూడా చూడకుండానే సీఎం బాబు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్యని ఓపెన్ జీపులో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఓపెన్‌టాప్ జీపులో ఎక్కించుకొని విజయవాడ నగరంలో తిప్పారు. ప్రత్యేకహోదా నిరాకరించడానికి కేంద్రం సాకులు చూపుతున్నా, ప్రత్యేకహోదా లభించకుంటే ఎన్నికల్లో తాను చేసిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలిసినా.. చంద్రబాబు మహా మౌనిలా వ్యవహరించారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా లభిస్తే చేకూరే ప్రయోజనాలకు, ప్రత్యేక ప్యాకేజీ వల్ల పరిమితంగా కలిగే చిరు లాభానికి తేడా తెలియదని అనుకోవాలా? రాష్ట్రానికి నష్టం జరిగిందని, దానికి కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ పదేపదే జరిగిపోయిన వాటిపై ఆక్రోశించిన చంద్రబాబు.. పార్లమెంట్ ఆమోదించిన పునర్విభజన బిల్లులో పేర్కొన్న అంశాలు, బీజేపీ నేతలు ఇచ్చిన హామీల అమలుపై కంటితుడుపుగా విజ్ఞాపన ప్రత్రాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప ఏనాడూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదు. కేవలం కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడినట్లుగా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తే.. కేసులు బనాయించారు, హేళన చేశారు. ప్రత్యేకహోదా వల్ల ఫలితంలేదని, అది సంజీవని కాదని, ప్యాకేజీయే మేలని.. ఇలా రకరకాల వాదనల్ని విన్పించారు. కేంద్రం 2017–18 బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత.. రాష్ట్రానికి అన్నీ వచ్చేశాయని సి.ఎం. చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ఇంతకుమించి అడగలేం’’ అని కూడా తేల్చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా మీడియా సమావేశంలో ‘‘అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించాం.. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి’’ అని సాధికారంగా చెప్పారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జిగా సిద్ధార్ధనాథ్ సింగ్ చంద్రబాబు తమను ఏనాడు ప్రత్యేకహోదా కావాలని అడగనేలేదని, ప్రత్యేక ప్యాకేజికే మొగ్గుచూపారని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించవలసిన వారే శల్య సార«థ్యం వహించారు. పోరాడింది వైఎస్సార్సీపీ, వామపక్షాలే ప్రత్యేకహోదా అంశాన్ని మరుగుపర్చడానికి అధికార తెలుగుదేశం ఎంతగా ప్రయత్నించినా.. ఎప్పటికప్పుడు నిర్విరామంగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ దానిని ఓ ఆశాదీపంగా నిలిపింది వైఎస్సార్ సీపీయే! వైసీపీ అధ్యక్షులు వై.యస్.జగన్ ‘‘ప్రత్యేకహోదా’’ కల్పించాలంటూ ఢిల్లీలో ధర్నాచేశారు. అసెంబ్లీలో సమర్ధవంతంగా తన వాదనల్ని విన్పించారు. ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పారు. కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఉద్యమాలు చేశాయి. అయితే, కేంద్రంలో ఐదవ బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత.. పార్లమెంట్ వెలుపల, లోపల తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు మొక్కుబడిగా సాగించిన నిరసనను సీఎం చంద్రబాబు ‘పోరాటం’గా అభివర్ణిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన పార్లమెంట్ సమావేశాలకు ఇచ్చిన విరామంలో.. టీడీపీ ఏ ఒక్క కార్యక్రమమైనా చేయగలిగిందా? ఫిబ్రవరి 8న వామపక్షాలు ప్రతిపాదించగా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్ధతు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ను విఫలం చేయాలని శతవిధాలా ప్రయత్నించింది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు విధిలేక బంద్‌లో తామూ పాల్గొన్నట్లు ప్రచారం చేసుకున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటానికి మోదీకి సాగిలపడిపోయిన ఫలితంగానే.. టీడీపీ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రతిష్ట పోగొట్టుకొందని ప్రజాబాహుళ్యం చెవులు కొరుక్కోవడం, చర్చించుకోవటం, నిరసనలు తెలపడం ప్రభుత్వానికి వినపడటం లేదా, లేక కనపడటం లేదా! కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన ప్రత్యేకహోదా రాకుండా ఎవరు అడ్డుపడ్డారు? విభజన బిల్లు అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలు, ప్రతిపక్ష నేతగా వెంకయ్య ప్రత్యేకహోదా కోసం గర్జించిన విధానం, తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగిన ఎన్నికల సభలో ఆనాడు మోదీ, వెంకయ్య, బాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకతను గురించి చేసిన భీకర ప్రసంగాలు ఏమైపోయాయి? పాలకులు మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోలేదు. టీడీపీ దోబూచులాటలను ఇకనైనా కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సమాయత్తం కావటం విజ్ఞత అనిపించుకొంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు 184వ నిబంధన క్రింద పార్లమెంటుకు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో భాగస్వాములు కావడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల పట్ల టీడీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన పరీక్షా సమయమని గుర్తిం చుకోవాలి. వైఎస్సార్ సీపీ తీర్మానానికి పోటీగా అవిశ్వాస తీర్మానం చేసిన టీడీపీ కనీసం దాన్నయినా నిజాయితీగా ముందుకు తీసుకుపోతుందా అనేది సందేహాస్పదమే. రాష్ట్రానికి ప్రస్తుత తరుణంలో కావాల్సింది శల్య సార«థ్యం కాదు... చిత్తశుద్ధితో కూడిన సారథ్యం. వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మొబైల్ : 99890 24579 -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే
-
వేటు వేయాల్సిందే
సాక్షి, విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు రెండోసారి విజ్ఞానపత్రం ఇచ్చామని వైఎస్సార్సీపీ నాయకులు వి. విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీరిరువురు విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చింతమనేనికి కోర్టు రెండేళ్లకుపైగా జైలు శిక్ష విధించినందున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా పేర్కొంటూ స్పీకర్ నోటిఫై చేయాల్సివుందన్నారు. దీనిపై గతంలో స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ వ్యవహరించాలని కోరామన్నారు. ఈ నెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పునరుద్ఘాటించారు. ముందుగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. -
రైతు బడ్జెట్... అబ్రకదబ్ర
విశ్లేషణ ఒకవైపు రైతు ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నా.. రైతుల ఆదాయాలు దిగజారిపోతున్నాయి. ప్రత్యామ్నాయం ఉంటే 69% మంది రైతులు వ్యవసాయం నుంచి బయటకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ‘‘ముసుగుల్ని తొలగిస్తేనే గానీ వాస్తవాలు బయటపడవన్నది ఓ నానుడి’’. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ యేడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌కు ‘రైతు బడ్జెట్’ అనే ముసుగు తగిలించారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జైట్లీ బడ్జెట్ రైతులకు మేలు చేసేదే అయితే సంతోషమే! రైతాంగాన్ని మభ్యపెట్టేది అయితే మాత్రం.. అది ఆత్మవంచనే అవుతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఏ మేరకు ఉంటుందో... ఆ చందంగానే జైట్లీ బడ్జెట్లో రైతు సంక్షేమం ఉందని రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిట్టూర్చుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కంటే ఒకరోజు ముందుగా విడుదలైన ఆర్థిక సర్వే దేశ వ్యవసాయరంగ స్థితిగతుల్ని ఎత్తిచూపింది. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ, ఇప్పటికీ అది మెజారిటీ ప్రజల జీవనాధారంగానే కొనసాగుతున్నదని, భారత ఆర్థిక వ్యవస్థకు అదొక చోదకశక్తి అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కొన్ని జాతీయ పత్రికలు సైతం వ్యవసాయ బడ్జెట్ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. నిధుల కేటాయింపులను, కనీస మద్దతు ధరలను ఖర్చులపై 50% (డా. స్వామినాథన్ సిఫార్సు మేరకు) పెంచి ఇస్తామంటూ చేసిన ప్రకటనల నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాలు, ఆఖరుకు మీడియాతో సహా భ్రమల్లో మునిగిపోయారు. కేటాయింపుల పరంగా చూస్తే.. దాదాపు పాతిక లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించి ఇచ్చింది రూ. 68,836 కోట్లు. ఈ అంకెలు ఘనంగా మేడిపండును తలపించేటట్లున్నాయి. ఉదాహరణకు పంటల బీమా పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయింపులు చేశారు. రెండేళ్ల క్రితం 2016–17 బడ్జెట్లో ఇదే పథకానికి రూ. 5,500 కోట్లు కేటాయించారు. ఈ సొమ్ముతో దేశవ్యాప్తంగా 30% సాగు విస్తీర్ణానికి బీమా చేయించాలన్నది అప్పటి లక్ష్యం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 22%, తెలంగాణలో 10% విస్తీర్ణానికే రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. దేశం మొత్తంమీద 30% విస్తీర్ణానికి రైతులు ప్రీమియం కట్టారని ఇందుకోసం చివరికి రూ. 13,240 కోట్లు ఇచ్చినట్లు సవరించిన 2016–17 బడ్జెట్ లెక్కల్లో చూపించారు. 30% విస్తీర్ణానికి బీమా చేయిస్తేనే కేంద్రానికి రూ. 13,240 కోట్లు అవసరం అయినప్పుడు బీమా పరిధిలోకి ఈ ఏడాది 50% సాగు విస్తీర్ణాన్ని తేవాలని పెట్టుకున్న లక్ష్యానికి రూ. 13,000 కోట్లు ఏవిధంగా సరిపోతాయి? కనీసం 22,000 కోట్లు పైనే కావాలి గదా! ఇటువంటి విచిత్రాలు జైట్లీ బడ్జెట్లో చాలానే కనిపిస్తాయి. కౌలుదారులకు బ్యాంకుల రుణ వితరణ ఈ సారి కూడా ఎండమావిగానే మిగిలిపోనుంది. దేశంలో కౌలుదారీ వ్యవసాయం గణణీయంగా పెరిగిన విషయం తెలిసికూడా వరుస ప్రభుత్వాలు కౌలుదారులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నాయి. గుర్తింపుకార్డులు లేవనే నెపంతో బ్యాంకులు వారికి రుణాలివ్వడం లేదు. కౌలు దారులకు గుర్తింపు కార్డులిచ్చే ప్రక్రియ నత్తనడక కంటే హీనంగా తయారైంది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, రెట్టింపు చేయడానికి ఏకైక మార్గం.. డా.ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి కనీస మద్దతు ధర ఇవ్వడమే! అయితే, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే.. ఉత్పత్తి వ్యయంపై 50% కలిపి ఇవ్వడం సాధ్యపడదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే.. తాజా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పంట ఉత్పత్తి ఖర్చుపై 50% కలిపి ఇస్తామంటూ ప్రకటన చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయిన మాట నిజం. ఎంఎస్పీ నిర్ధారణకు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ఎంతమాత్రం అంగీకారం కాదు. సమగ్రమైన ఉత్పత్తి ఖర్చు డా.స్వామినాథన్ అంచనావేసిన సి2 కాకుండా, కొన్ని ఖర్చులను మినహాయించి ఏ2+ఎఫ్‌ఎల్‌ను ప్రాతిపదికన తీసుకోవడం రైతాంగాన్ని మోసగించడమే. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నిర్ణయిస్తున్న మద్ధతుధరలు.. ఏ2 పద్ధతి ప్రకారం కూడా ఉండడంలేదు. ఉదాహరణకు, వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి సీఏసీపీకి పంపిన నివేదికలో ఏ2 ప్రాతిపదికనే ధాన్యం ఉత్పత్తి ధర క్వింటాల్‌కు రూ. 2,022గా ఉంది. కానీ, ప్రస్తుతం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు కేవలం రూ. 1,590గా ఉంది. అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ధరల సరాసరి క్వింటాల్‌కు రూ. 1,100గా నిర్ణయించి.. ఆ మేరకు మద్దతు ధరను కేంద్రం నిర్ణయిస్తున్నది. దాని ప్రకారమే మద్దతు ధరలు ఒకటిన్నర రెట్లు ఉన్నాయని ఆర్థికమంత్రి జైట్లీ చెప్పుకుంటున్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుకు భరోసా లభించిందని, క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వ్యవసాయరంగానికి ఊతమిచ్చేదిలా ఉందంటూ చేస్తున్న శాస్త్రీయత లేని ప్రకటనలు మోసపూరితమైనవి. ఇవే విధానాలు కొనసాగితే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఎన్డీఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వ్యాసకర్త ఏపీ శాసనమండలి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రతిపక్ష నాయకులు ‘ 9989024579 -
మోదీతో చంద్రబాబు భేటీ.. అందుకేనా!
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టి కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోనున్నారని వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏమి సాధించారని బొత్స ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు.. చంద్రబాబు పై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణకు రాకుండా మోదీని ప్రసన్నం చేసుకొనేందుకు చంద్రబాబు భేటీ కాబోతున్నారని అభిప్రాయపడ్డారు. గుంటూరులో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో పరిపాలన ఆశ్చర్యకరంగా ఉంది. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పది లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసి మరీ జన్మభూమిని నిర్వహిస్తున్న విషయం నిజం కాదా?. వైఎస్ఆర్ హయాంలో ఇల్లు లేని లక్షలమందికి ఇళ్లు కట్టించి ఇచ్చాం. గుడిసె లేని రాష్ట్రం కోసం ఎంతగానో శ్రమించాం. మూడున్నరేళ్లు గడిచినా ఒక్క ఇళ్లయినా కట్టించి ఇచ్చారా’ అని చంద్రబాబు పాలనపై మండిపడ్డారు. కల్తీకి కేంద్రంగా గుంటూరు తయారు అయ్యిందని, ఆ కల్తీలో ఏపీ మంత్రులు, అధికారులకు ప్రమేయం ఉందని బొత్స ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, కిడ్నీ రాకెట్ కు కూడా గుంటూరు కేంద్రంగా మారిందన్నారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దల అండదండలతో కిడ్నీ రాకెట్ నడస్తుండటం కన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. కిడ్నీ రాకెట్ పై సమగ్రమైన విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వానికి ఆఖరి రోజులు వచ్చాయని, మంత్రులు, నేతల అవినీతే అందుకు నిదర్శనంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మార్చి మొదటివారంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనుందని వివరించారు. ఆత్మవంచన చేసుకొని టీడీపీ పాలన రాష్ట్రంలో అవినీతిని చట్టపరమైన కార్యక్రమంగా చేశారని ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. జన్మభూమి వినతులు కట్టలు కట్టి పక్కన పారేస్తున్నారని చెప్పారు. కల్తీతో రైతులు పూర్తిగా నష్టపోయినా.. చంద్రబాబు సర్కార్ తమ వైఖరి ఏంటో చెప్పటం లేదన్నారు. గత మూడేళ్ల కాలంలో రైతాంగం ఆదాయం 8.5శాతం తగ్గిందని గుర్తుచేశారు. ఇంకా రైతులను మోసగించి, తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ సర్కార్ ఆత్మవంచన చేసుకొని పాలన సాగించవద్దని ఉమ్మారెడ్డి హితవు పలికారు. -
ప్రశ్నిస్తే గృహ నిర్బంధం చేస్తారా?: ఉమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐదోవిడత జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి ఇప్పటి వర కూ ఏడున్నర లక్షలకు పైగా అర్జీలు వచ్చా యంటేనే గత నాలుగేళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అర్థమని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జన్మ భూమి కార్యక్రమాలు రసాభాసగా జరుగు తున్నాయని, ప్రశ్నించే వారిని సభల్లో ఉండనివ్వడం లేదన్నారు. సమస్యల పరి ష్కారం కోసం జన్మభూమి కార్యక్రమా లకు వెళ్తున్న ప్రతిపక్షనేతలను హౌస్ అరెస్టులు చేయడం దారుణమన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోల వెన్నులో జన్మభూమి సమావేశానికి వెళ్తు న్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొలుసు పార్థ సార«థిని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైందన్నారు. ఇప్పటికైనా నాలుగు దఫాలుగా జరిగిన అర్జీలన్నీ ఏ మేరకు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘జన్మభూమి–మాఊరు’కార్యక్రమంలో ప్రభుత్వం ఖర్చుతో టీడీపీకి ప్రచారం చేసుకుంటున్నారని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలలో ఏ మేరకు నెరవేర్చారో యాక్షన్ టేకన్ రిపోర్టు (ఏటీఆర్)ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పుస్తకాలు ప్రగతికి సోపానం : ఉమ్మారెడ్డి
సాక్షి, విజయవాడ : స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రాజకీయవేత్తలను మూడు కేటగిరీలుగా చూడొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడారు. మొదటి కేటగిరీలో స్వతంత్రం కోసం అన్ని త్యాగాలు చేసి, తర్వాత ఎన్నికల్లో నిలబడి గెలిచిన వారు ఉన్నారని చెప్పారు. వీరికి ప్రజల్లో అపారమైన గౌరవం ఉందని తెలిపారు. రెండోతరం కొంతమేర డబ్బుతో రాజకీయం చేయడం ప్రారంభించారని అన్నారు. ఇక మూడోతరం పూర్తిగా డబ్బు రాజకీయాలతో పెద్ద ఎత్తున వచ్చిందని అన్నారు. వీరికి మొదటితరం గురించి తెలియదని, వారి ఆదర్శాలు కూడా తెలియవని చెప్పారు. ఈ తరానికి చెందిన వాళ్లు అసలు పుస్తకాలు కూడా చదవరని తెలిపారు. పుస్తక పఠనం తగ్గడం వల్ల మానవ విలువలు తగ్గడం మొదలైందని అన్నారు. పుస్తకాలకు వెలకట్టలేమని చెప్పారు. డాక్టర్ చదవాల్సిన తాను కారల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ చదివి ప్రేరణకు గురైనట్లు వెల్లడించారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎకనామిక్స్‌ను ఎంచుకున్నట్లు చెప్పారు. పుస్తకాలు, విద్య జీవితాలను మార్చేస్తాయని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ రాసిన పుస్తకాలు తనలో ఆలోచనలు కలిగించినట్లు చెప్పారు. -
మార్పే ఆ మరణాలకు జవాబు
విద్యార్థులు రాణించాలంటే స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛగా ఆలోచించగలిగే వాతావరణం పాఠశాలల్లో రావాలి. సందేహాలను ధైర్యంగా చెప్పి నివృత్తి చేసుకోగల చొరవను విద్యార్థులలో కల్పించే బాధ్యత టీచర్లదే! కానీ కార్పొరేట్ విద్యావిధానంలో టీచర్లు మరబొమ్మల్లా, రోబోలుగా మారిపోయారు. ఎక్కువ మార్కులు సాధించగలిగేటట్లు విద్యార్థులను తీర్చిదిద్దడమే కర్తవ్యంగా భావిస్తున్నారు. అది వారి తప్పు కాదు. మన విద్యావిధానంలోని లోపంతో టీచర్లపై పనిభారం, ఒత్తిడి పెరిగాయి. దానినే విద్యార్థుల మీదకు బదలాయిస్తున్నారు. దేశానికీ, కుటుంబానికీ ఆశాజ్యోతులుగా నిలవాల్సిన భావి భారతపౌరులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడడం తెలుగు రాష్ట్రాలలో అంతకంతకూ పెరిగిపోతున్నది. విద్యావనంలో నేల రాలుతున్న పసిమొగ్గల సంఖ్య ఏయేటి కాయేడు పెరుగుతూ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వాన్ని నిరూపిస్తున్నది. ఈ అక్టోబర్ ఒక్క మాసంలోనే పదుల సంఖ్యలో కార్పొరేట్ కళాశాలల విద్యాకుసుమాలు నేల రాలిపోయాయి. ఈ పరిణామం పౌర సమాజాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్నది. ఈ అవాంఛనీయ ధోరణి గురించి పత్రికలు సంపాదకీయాలు రాశాయి. చానళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. విద్యావేత్తలతో, మానసిక నిపుణులతో గంటల కొద్దీ చర్చా గోష్టులు జరిపాయి. అయితే ఏం జరిగింది? ఏం ఒరిగింది? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ఆత్మహత్యల పరంపరను నిరోధించడానికీ, విద్యార్థులలో మనో నిబ్బరం నింపడానికీ తీసుకొన్న చర్యలేమిటి? అని ప్రశ్నించుకుంటే నిర్దిష్టమైన జవాబులు దొరకవు. ఒక విధంగా ప్రభుత్వాల స్పందన నామమాత్రమని, ఇంకా చెప్పాలంటే పూజ్యమనే చెప్పాలి. విద్యార్థుల ఆత్మహత్యలు కొత్త విషాదమేమీ కాదు. జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశంలో గంటకో విద్యార్థి వంతున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నమోదు కాని దుర్ఘటనలను కూడా పరిగణనలోకి తీసుకొంటే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్లను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎం.పి.సి., బై.పి.సి. అభ్యసించే విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. ఇది ప్రభుత్వాలకు తెలుసు. ఈ రెండు కోర్సులను, ఎంట్రెన్స్‌లకు అనుగుణంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలే బోధిస్తాయని గట్టి నమ్మకం. ఈ కళాశాలలకు చెందిన విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి మరొక వాస్తవం. దీనిని కూడా ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించాయి. కానీ ఈ పరిస్థితిని మార్చడానికి గతంలో నియమించిన నీరదారెడ్డి కమిటీ, చక్రపాణి కమిటీ అందించిన నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ కమిటీలు కార్పొరేట్ విద్యాసంస్థలలోని స్థితిగతుల మీద విచారణ జరిపాయి. ఆత్మహత్యల వెనుక కారణాలను వివరిస్తూ, కార్పొరేట్ కళాశాలలు విరామం లేకుండా నిర్వహించే తరగతులూ, పరీక్షలూ విద్యార్థులపై ఎంత తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయో వెల్లడించాయి. వాటి అమానవీయ చర్యలకు ముగుతాడు వేయడానికి ఇంకొన్ని కమిటీలు కూడా విలువైన సూచనలు చేసిన మాట నిజం. ఇవి ఇచ్చిన సిఫార్సులు కొన్ని పరిమితులకు లోబడినవే! అయినా వీటిని పూర్తిగా అమలు చేస్తే కొన్ని ప్రయోజనాలైనా ఉంటాయి. ఆత్మహత్యలు తగ్గుతాయి. కాని, విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయకుండా కార్పొరేట్ కాలేజీ లను నియంత్రించే చర్యలు చేపట్టడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒనగూడుతాయా? అన్నదే ప్రశ్న. ప్రపంచంలో ఏం జరుగుతోంది? ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భారతదేశ ర్యాంకింగ్ మెరుగుపడిం దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబరపడిపోతున్నాయి. కానీ కీలకమైన విద్య, వైద్య రంగాలలో మన స్ధానం ఎక్కడ? అభివృద్ధి చెందిన దేశాలలో విద్యావ్యవస్థ ఎలా ఉంది? అందులోని మంచిని మనం స్వీకరించగలమా? అన్న ఆలోచనలు మన పాలకులు చేయరు. పెట్టుబడులను ఆకర్షించే పని పేరుతో ప్రత్యేక విమానాలలో మందీమార్బలంతో దేశదేశాలకు పాలకులు వెళుతున్నారు. కానీ సింగపూర్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలలో అమలు జరుగుతున్న అద్భుత విద్యావ్యవస్థను, ఉన్నత విద్యా ప్రమాణాలను అధ్యయనం చేయడానికి ఎందుకు వెళ్ళరు? కనీసం నిపుణుల బృందాలను ఎందుకు పంపించరు? ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పడానికి విద్యపై పెడుతున్న ఖర్చులో మన దేశానిది 63వ స్థానం. యువతకు సామర్థ్యం ఉంది కనుకనే అంతర్జాతీయ ప్రతిభా పాటవాలు కలిగిన 118 దేశాల జాబితాలో భారత్ 92 వ స్థానంలో అయినా నిలిచింది. అంతర్జాతీయ ప్రతిభా పాటవాలు గలిగిన టీచర్లను దీర్ఘకాలం పాటు ఇక్కడ పనిచేయించుకోలేకపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. సింగపూర్, జపాన్ వంటి దేశాలలో భారతీయ విద్యావేత్తలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారన్నది కఠోర వాస్తవం! ప్రాథమిక స్ధాయిలోనే పునాది విద్యావ్యవస్ధలో సమూల మార్పు పునాది స్థాయి నుంచే పడాలి. ‘విద్యలో సమానత్వం’ అనే విధానంతో ఫిన్లాండ్ చేపట్టిన సమూల మార్పులు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. డే కేర్ సెంటర్లు (పసిపిల్లల పగటిపూట సంరక్షణ కేంద్రాలు), నర్సరీ మొదలుకొని 9 సంవత్సరాల పాటు విద్యార్థులకు పూర్తి సబ్సిడీ భోజనంతో పాటు చదువును కూడా ప్రభుత్వమే అంది స్తోంది. చదువంటే ఉల్లాసమైన ప్రక్రియగా పిల్లలు భావించే విధంగా క్లాస్ టీచింగ్‌ను వినూత్నంగా రూపొందించుకున్నారు. టీచర్లకు అత్యధిక గౌరవం, జీతభత్యాలు ఇచ్చే దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్ ముందు వరుసలో ఉన్నాయి. భావిపౌరులను తీర్చిదిద్దుతున్నామన్న స్పృహ, చిత్తశుద్ధి అక్కడి టీచర్లలో కనపడుతుంది. ఫలితంగానే విద్యా సూచికల్లో (ఎడ్యుకేషన్ ఇండెక్స్), యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ ఇండెక్స్‌లలో సింగపూర్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, తైవాన్, జపాన్, హాంకాంగ్‌లు ముందు వరసల్లో నిలుస్తున్నాయి. విద్యను ప్రోత్సహించే తీరిదేనా? సమూల మార్పులు చేపట్టాలంటే విద్యా సంస్థలకు తగినన్ని ‘నిధులు’ కావాలి. కేంద్ర, రాష్ట్రాలు ప్రవేశపెట్టే బడ్జెట్లలో ఏటా 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించినట్లయితే ఆశిస్తున్న మార్పులూ, ఫలితాలూ క్రమేపీ సాధించడానికి వెసులుబాటు కలుగుతుంది. కానీ, ఏటేటా బడ్జెట్ పరిమాణం పెరుగుతున్నట్లు కనిపించినప్పటికీ వార్షిక బడ్జెట్లలో కేటాయింపులు 14% మించడంలేదు. మంచినీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బల్లలు, భవన సముదాయాలు, ఆటస్థలాలు వంటివి లేని పాఠశాలలే ఇక్కడ అత్యధికం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేని కారణంగానే ఆర్థికంగా భారమే అయినా, తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో 29 జారీ చేసి 5,000 పాఠశాలలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇదే నిర్లక్ష్య విధానం ప్రభుత్వ స్కూళ్ల పట్ల మరి కొంతకాలం కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవడానికి మరెంతో కాలం పట్టదు. ఆ పరిస్థితి దాపురిస్తే పేదవారి విద్యావకాశాలు గగనకుసుమాలే! పదవ తరగతి వరకు కింద పడుతూ మీద పడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చూడాలన్న ఆశతో కార్పొరేట్ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పాఠాలు నూరిపోస్తున్నారు. కేవలం విద్యా సంస్థల మధ్య నెలకొన్న స్వార్ధపూరిత ఆధిపత్య పోటీ కారణంగా, విద్యార్థులను సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారే తప్ప పిల్లల బాగోగుల కోసం కాదనేది నగ్నసత్యం. పిల్లల ఉన్నత ర్యాంకులే అందరి లక్ష్యం. ఈ క్రమంలో పాఠాలు బట్టీ వేయించడమే పరమార్థంగా ఎంచుకున్నారు. విద్యార్థికి పాఠం అర్థ మైందా, లేదా అన్నది కాదు. వివిధ నేప«థ్యాల నుంచి వచ్చే విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో పదవ తరగతి వరకు చదువుకొని ఇంటర్లో ఇంగ్లిష్ మాధ్యమంలోకి వచ్చే సరికి గందరగోళానికి గురవుతున్నారు. వారి సమస్యను పరిష్కరించేవారు, సబ్జెక్టును అర్థమయ్యేలా బోధించేవారు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతి రోజూ నిర్వహిస్తున్న పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకొనే విద్యార్థులందరినీ వేరే ప్రత్యేక సెక్షన్లకు మార్చే పద్ధతి కొందరు విద్యార్థులను ఆత్మన్యూనతా భావానికి గురిచేసి, ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఫలితంగానే మరణమే శరణ్యమనే స్ధితికి దిగజారుతున్నారు. ఈ సంస్కృతి మారాలి విద్యార్థులు రాణించాలంటే, సృజన పెంపొందాలంటే వారికి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛగా ఆలోచించగలిగే వాతావరణం పాఠశాలల్లో రావాలి. సందేహాలను ధైర్యంగా చెప్పి నివృత్తి చేసుకోగల చొరవను విద్యార్థులలో కల్పించే బాధ్యత టీచర్లదే! కానీ కార్పొరేట్ విద్యావిధానంలో టీచర్లు మరబొమ్మల్లా, రోబోలుగా మారిపోయారు. ఎక్కువ మార్కులు సాధించగలిగేటట్లు విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నారు. అది వారి తప్పు కూడా కాదు. మన విద్యావిధానంలోని లోపంతో టీచర్లపై పనిభారం, ఒత్తిడి పెరిగాయి. దానినే విద్యార్థుల మీదకు బదలాయిస్తున్నారు. పిల్లలతో ఇష్టం లేని కోర్సులను చేయించడం తల్లిదండ్రుల తప్పు. తమ ఇష్టాలను పిల్లలపై రుద్దే తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు రావాలి. హైదరాబాద్ బండ్లగూడ లోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఓ తండ్రి తన కూతుర్ని హాస్టల్ రూమ్‌లో దింపి, ఫీజు కడుతున్న సమయంలోనే హాస్టల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల ఆత్మహత్యలకు వేర్వేరు కారణాలు, పేర్లు ఉండవచ్చు. కానీ, అవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు, తల్లిదండ్రుల అవగాహనా లోపం వల్లనే. విద్యావ్యవస్థలు సమూల మార్పుల్ని ప్రాథమిక స్థాయి నుంచి చేపట్టకుండా అసలు రుగ్మత ఎక్కడుందో గ్రహించకుండా, గ్రహించినట్లు నటించినా సమస్య పరి ష్కారం కాదు. ప్రాథమిక విద్య మొదలు ఉన్నత, సాంకేతిక విద్యావ్యవస్థల వరకు ప్రక్షాళన జరగాలి. అభివృద్ధి చెందిన దేశాలలోని ఆకాశహర్మ్యాలను చూసొచ్చి, వాటిని ఇక్కడ కూడా నిర్మించి ప్రపంచస్థాయి రాజధానులను మరిపించాలని తహతహలాడటంతోనే సమాజం ముందుకు సాగిపోదు. విద్యా, వైద్య రంగాలలో అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలలో అమలు జరుగుతున్న మంచి విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయగలిగితేనే, విద్యలో సమానత్వం సాధించగలిగితేనే విద్యార్థులలోని న్యూనతా భావాలను అరికట్టగలం, అవాంఛనీయ సంఘటనలకు పరిష్కారం చూపగలం. - డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
సరికొత్త చరిత్రకు ‘ప్రజా సంకల్పం’
ప్రజల వద్దకే, ప్రజల మధ్యకే వెళ్లి.. అన్ని అంశాలు వారికే నివేదించి, వారినే తీర్పు ఇవ్వమని కోరడమే ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యం. ఇది ప్రజలలో చైతన్యాన్ని పెంచే యాత్ర. మాట తప్పి, విలువలను పాతర వేసిన వారిని, ప్రజాకోర్టులో నిలదీసే యాత్ర. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ప్రజలవద్దకు వెళ్ళడమే ప్రజా జీవితంలో మిగిలిన ఏకైక మార్గం. ఆ కారణంతోనే వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నవంబర్ 6 నుంచి ‘‘ప్రజా సంకల్ప యాత్ర’’ చేపట్టారు. వై.ఎస్.జగన్ చేస్తున్న ఈ యాత్ర సహజంగానే అధికార తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో అలజడి రేపుతోంది. 2012లో కాంగ్రెస్ పార్టీని వీడి.. కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపినా అంగీకరించకుండా, నమ్మిన సిద్ధాంతం కోసం, రాజ కీయ విలువలకు కట్టుబడి ఉండాలన్న ఏకైక సంకల్పంతో బయటకు వచ్చి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. దరి మిలా ఆయనపై అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. ‘‘క్విడ్‌ప్రోకో’’కు పాల్పడ్డారంటూ కేసులు వేశారు. కొన్ని కేసులలో తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయింది. దేశ న్యాయవ్యవస్థ చరి త్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 20 నెలల పాటు ముద్దాయికి జైలు శిక్ష విధించి బెయిల్ కూడా నిరాకరించింది. ఒక్క తన విషయంలోనే ఇంత కక్షపూరితంగా వ్యవస్థలు ప్రవర్తిం చినా జగన్ కుంగిపోలేదు, రాజీ బాట పట్టలేదు. ప్రజల్ని నమ్ముకొని పట్టుదలగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఓటమితో వై.ఎస్.జగన్ కృంగిపోలేదు. తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందన్న చేదు వాస్తవం ప్రజానీకం గుర్తించకపోలేదు. అయితే, మోదీ ప్రభావం, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ చేసిన అలవికాని హామీలు, పవన్‌కల్యాణ్ జనసేన మద్దతు, టీడీపీ, బీజేపీ జతకట్టి కూటమి ఏర్పాటు వంటి అంశాలు వారికి అనుకూలంగా దోహదం చేశాయి. అయినా సరే టీడీపీ ఎన్నికల ముందు చేసిన హామీలపై నిలదీయడం ప్రారంభించారు వైఎస్ జగన్. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ యువతకు భృతి, దశలవారీ మద్యపాన నిషేధం, ఫీజుల రీయింబర్స్మెంట్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మొదలైన అనేకానేక హామీలపై పిల్లిమొగ్గలు వేసిన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు. ప్రధానంగా.. విభజిత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ‘సంజీవని’లా పనికొచ్చే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’, ‘పోలవరంకు జాతీయ హోదా’ కల్పించి కేంద్రమే మొత్తం ఖర్చు భరించి 2018 నాటికల్లా పూర్తి చేసే హామీలపై దశలవారీగా ఉద్యమాలు చేశారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన 3 లక్షల కోట్ల అవినీతికి ఆధారాలు చూపుతూ పుస్తకం ప్రచురించి జాతీయ పార్టీ నేతలముందు, కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు ఉంచారు. రైతులు, మహిళలు, యువత తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు అనేక ‘దీక్షలు’ నిర్వహించి ప్రజలలో ధైర్యాన్ని నింపారు. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికి చంద్రబాబు చేయని యత్నం లేదు. వాటిలో ప్రధానమైంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫిరాయిం పుల్ని ప్రోత్సహించారు. నలుగురు ఫిరాయింపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో... క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయిం చారు. రాజ్యాంగ విలువల్ని పరిరక్షించాల్సిన గవర్నరే అధికార టీడీపీ సాగించిన వికృత రాజకీయ క్రీడలో భాగస్వామికావడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, రాజ్యాంగస్ఫూర్తికి అవమానం. అసెంబ్లీ బులెటిన్‌లో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పటికి వైఎస్సార్సీపీ జాబితాలోనే ఉన్నట్లు ప్రింటు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పెద్దలు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు. ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగత స్వార్థంకోసం, అధికారం కోసం రాజ్యాంగ విలువలను పాతర వేశారు. ఫిరాయింపుల కంపుతో నిండిన సభలో కూర్చొని.. ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన పెద్దలు, వారి పార్టీ నేతలు ప్రవచించే ధర్మపన్నాలను, వల్లించే నీతి వాక్యాలను కళ్ళప్పగించి వింటూ కూర్చోవాలా? అందుకే నవంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలలో పాల్గొనకూడదని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకొంది. గత మూడున్నరేళ్ళుగా సభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా సాక్షాత్తు మంత్రులు, సీని యర్ సభ్యులు దుర్భాషలాడారు. రాయడానికి వీలులేని భాష ఉపయోగించారు. గౌరవ సభాధ్యక్షులు సభలో నిమిత్తమాత్రులుగా మిగిలిపోవడంతో, అధికారపక్ష సభ్యులు శాసన సభను ఓ క్రీడా మైదానంగా మలచుకున్నారు. ఇన్ని అవమానాలను ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఓపిగ్గా భరిం చారు. తమ బొమ్మ పెట్టుకొని, తమ పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యుల్లో కొందరు.. ప్రలోభాలకు లోనై ట్రెజరీ బెంచీల్లో కూర్చొని అనకూడని మాటలతో రెచ్చిపోయినా సంయమనం పాటించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడిపోయి.. ‘ప్రత్యేక హోదా’ హక్కును వదులుకొన్న ‘తెలుగుదేశం’పై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నమ్మి మోసపోయామన్న ఆవేదన ప్రతి వర్గంలో కనిపిస్తుంది. మాటలకు చేతలకు పొంతన లేదని.. అవినీతి విషయంలో హద్దులే లేవని ప్రజలు క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. ఆర్థిక బలంతో, అధికార దుర్వినియోగంతో, పోల్ మేనేజ్మెంట్తో, ఓటర్ల మేనేజ్మెంట్తో మరోసారి ఎన్నికల్లో గెలవడానికి సర్వ హంగులు సమకూర్చుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రద్వారా ప్రజల వద్దకే... ప్రజల మధ్యకే... వెళుతున్నారు. అన్ని విషయాలు వారితోనే నివేదిస్తారు, వారినే తీర్పు ఇవ్వమని అభ్యర్థిస్తారు. మాట తప్పిన వారిని, మోసం చేసిన వారిని, విలువలను పాతర వేసిన వారిని, ప్రజాకోర్టులోనే నిలదీస్తామని నివేదిస్తారు. ఆయన తలపెట్టిన ‘‘ప్రజా సంకల్ప యాత్ర’’ ప్రజలలో చైతన్యాన్ని పెంచుతుంది. డా‘‘ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికలకు ముందు సాగించిన ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర ఏవిధంగానైతే చరిత్ర సృష్టించిందో.. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర సరి కొత్త చరిత్ర సృష్టికి శ్రీకారం చుట్టడం తథ్యం! డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
మహిళా బిల్లు గట్టెక్కేనా?
విశ్లేషణ జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం లభించకపోతే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అనలేం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధి మెరుగ్గా ఉంటున్నాయి. మహిళా ప్రతినిధు లున్న గ్రామాల్లో మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, బాలికా విద్య, అంగన్వాడీలు మొదలైనవి మెరుగ్గా పనిచేస్తున్నట్లు రుజువైంది. ఈ మార్పు జాతీయ స్థాయిలో ప్రతిఫలించాలంటే.. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం నిర్ణయాత్మక స్థాయికి పెరగడం అవసరం. ఎన్నికలు సమీపిస్తే చాలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అంశాలు తెరపైకి వస్తుంటాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ముందుగానే, 2018 నవంబర్‌లో జరుగవచ్చని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి రానున్న పార్లమెంటు సమావేశాలను కుదిపివేసేలా ఉంది. ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే ఆ పార్టీ మహిళా బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది మహిళల సంతకాలను సేకరించే పనిలో ఉంది. పంచాయతీలు, పురపాలక సంఘాల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించామని చాటుకుం టున్న కాంగ్రెస్... మహిళా బిల్లు ఆమోదం పొందితే అది కూడా తమ ఘన తేనని చెప్పుకోవచ్చని తాపత్రయపడుతున్నది. అధికార బీజేపీ గత మూడేళ్లుగా ఈ బిల్లుపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకాలు లేకున్నా, దాన్ని పట్టాలకెక్కించాలన్న సంకల్పం ఆ పార్టీలో కనపడటం లేదు. ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే దాన్ని పక్కన పెడితే ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ లభి స్తుంది. అంటే పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం ఇప్పుడున్న దానికి (12%) దాదాపు 3 రెట్లు పెరుగుతుంది. అయితే, ఈ బిల్లు చట్టంగా రూపొందడం అంత సులువేమీ కాదు. లేకపోతే రెండు దశాబ్దాల క్రితమే అది జరిగి ఉండేది. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని అనిపించుకోవడం కోసమే కొన్ని పార్టీలు మహిళల హక్కులు, వారి సమానత్వం గురించి ఉపన్యాసాలు, మొక్కుబడి ప్రకటనలు చేస్తున్నాయి. ఆచరణలో అందుకు ఎలాంటి చొరవనూ చూపటం లేదు. మహిళా బిల్లుపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మధ్య, ప్రధానంగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న ప్రధాన పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి. రెండు దశాబ్దాలైనా ఎక్కడి గొంగళి అక్కడే రెండు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉన్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసాయిదాను 1996లో దేవేగౌడ ప్రధానిగా ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రండ్ ప్రభుత్వం లోక్‌సభలో చర్చకు పెట్టింది. ఆ సందర్భంగా సభలోని వివిధ రాజకీయ పక్షాల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. ఏకాభిప్రాయం కుదరక, అది వీగిపోయింది. తదుపరి, ఈ బిల్లును చర్చకు పెట్టిన ప్రతి సందర్భంలోనూ సభలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఆనవాయితీగా మారింది. 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం సభలో బిల్లును ప్రవేశపెట్టారు. కానీ, ఆర్జేడీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు బిల్లు కాపీలను స్పీకర్ వద్ద నుంచి లాక్కొని చించివేశారు. ఆ తదుపరి 1999, 2002, 2003లలో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం మొండి చెయ్యి చూపడం సాగింది. చివరకు 2010 మార్చి, 9న కేంద్ర, రాష్ట్రాల చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 15 ఏళ్ల పాటూ ఈ చట్టం అమలులో ఉన్న తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న నిబంధనను బిల్లు ముసాయిదాలో చేర్చారు. అయినా, రాజ్యసభ ఆమోదం పొంది 17 ఏళ్లు గడిచినా లోక్‌సభ ఆమోదానికి అది నోచుకోవడం లేదు. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల మద్దతున్నా మహిళా బిల్లు గట్టెక్కక పోవడానికి కారణం లోక్‌సభలో పురుషాధిక్య భావజాలంలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని పార్టీల వైఖరి అనేది విస్తృత జనాభిప్రాయం. ఈ రిజర్వేషన్లలో ఉపకోటా ఉండాలని ఓబీసీలు, ముస్లిం మైనార్టీ వర్గాలు పట్టుబడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకున్న రిజర్వేషన్ల దామాషా ప్రకా రమే ఆ వర్గాల మహిళలకు ఈ 33 శాతంలో 22.5 శాతం రిజర్వేషన్లు లభి స్తాయి. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు 27%, ముస్లిం మైనార్టీలకు 10% రిజర్వేషన్లను కల్పించాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. అందుకు మరి కొన్ని పార్టీలు అంగీకరించడం లేదు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఇక, దేశంలోని ఓబీసీల జనాభా లెక్కల వివరాలు 1935 నాటివే తప్ప, మరెలాంటి ఆధారపడదగిన సమాచారం లేదు. పైగా ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే సాంఘిక హోదా లేదు. పలు రాష్ట్రాలు.. బీసీ కులాల జనాభా లెక్కలను నేటికీ తయారు చేయలేకపోయాయి. మహిళలకు ఇచ్చే 33% రిజర్వేషన్లు ఉన్నత రాజకీయ వర్గాల కుటుంబాల నుంచి వచ్చే మహిళలకే ఉపయోగపడుతుందని కొందరి అభ్యంతరం. ఉప కోటా సాధ్య పడకపోయినా, మహిళా రిజర్వేషన్లను ఉన్నత వర్గాల వారే మొదట ఉపయోగించుకోగలిగినా, ఆ పరిస్థితి కొనసాగదు. కనుక, ఉప కోటా సాకుతో మహిళా బిల్లునే అడ్డగించడంలో ఔచిత్యం కనపడదు. సంకీర్ణ ధర్మం కాంగ్రెస్ మార్కు సాకు 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాలు పదేళ్లు అధికారాన్ని చెలాయించాయి. పలు తర్జన భర్జనల తదుపరి యూపీఏ–2 ఈ బిల్లును 2010లో రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదాన్ని సంపాదించింది. అయినా అది లోక్‌సభ ఆమోదాన్ని పొందలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యమేనని చెప్పాలి. తమది సంకీర్ణ ప్రభుత్వం కనుక, భాగస్వామ్య పార్టీల మద్దతును కూడగట్టలేకపోయామని కాంగ్రెస్ సాకును వెతుక్కొంది. ప్రభుత్వం పడిపోయినా ఫరవాలేదని అదే ప్రభుత్వం వివాదాస్ప దమైన 123 నిబంధనతో సహా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చు కుంది. ఆ పట్టుదలను మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో అది చూపలేకపోయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ల బెదిరింపులకు లొంగి కాంగ్రెస్ దాన్ని అటకెక్కించింది. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంటున్న ప్రస్తుత తరుణంలో కూడా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 12.15%కు పరిమితం కావడం.. మహిళల పట్ల చూపుతున్న వివక్షకు అద్దం పడుతున్నది. 1957లో లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 4.45% కాగా, దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత 2014 నాటికి లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 12.15%కు (543 సభ్యుల సభలో 66 మంది) పెరిగింది. చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం విషయంలో 193 దేశాల జాబితాలో మన దేశం 148వ స్థానంలో ఉన్నదని చెప్పుకోవడం సిగ్గుచేటు. 18 ఆసియా దేశాలనే చూసినా ఈ విషయంలో మనది 13వ స్థానం, 8 సార్క్ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నాం. మన కంటే ఎంతో వెనుకబడ్డ ఆఫ్రికన్ దేశం రూవాండా చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం 64%, నేపాల్‌లో 29%, చివరకు ఆఫ్ఘనిస్థాన్‌లో సైతం 28% ఉండటం విశేషం. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నదని భావించే పాకిస్తాన్ 20%తో మన కంటే ముందుండటం గమనార్హం. పాక్ తన జాతీయ అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది. పాలనా స్వభావమే మార్చగల మహిళా ప్రాతినిధ్యం జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం లేకపోతే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అనలేం. అన్ని స్థాయిల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మానవాభివృద్ధి సూచిక, సామాజికాభివృద్ధి మెరుగ్గా ఉన్నదని యునెస్కో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తాజా గణాంకాల ప్రకారం మానవాభివృద్ధి సూచికలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, తాగునీరు, పౌష్టికాహార లోపం తదితర సమస్యల పీడి తులలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం మానవ, సామాజికాభివృద్ధి పెంపొందడానికి దారి తీస్తుంది. మహిళా ప్రతినిధులున్న గ్రామాల్లో మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, బాలికా విద్య, అంగన్వాడీలు, పొదుపు సంఘాలు, డ్వాక్రా సంస్థలు మొదలైనవి మెరుగ్గా పనిచేస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. గ్రామీణ భారతంలో కనపడుతున్న ఈ మార్పు అన్ని స్థాయిల్లో ప్రతిఫలించాలంటే.. పరిపాలనా బాధ్యతల్లో మహిళా ప్రాతి నిధ్యాన్ని జాతీయ స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్యలను పరిష్కరించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడంలో మహిళలు మగవారికి తీసిపోరని కార్పొరేట్ కంపెనీల అనుభవం చెబుతోంది. బాధ్యతగా పనిచేయడంలో పురుషుల కంటే మహిళలే ముందుంటున్నారు. రాజకీయ పార్టీల వైఖరి మారాలి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే రాజకీయ పార్టీల వైఖ రిలో మార్పు రావాల్సిందే. ప్రధాన రాజకీయ పక్షాలు, పార్టీ కమిటీలలో, శాసనసభ, లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు 33% వాటాను అందించగలిగితే, అదే గొప్ప సామాజిక, ఆర్థిక మార్పునకు నాంది కాగలుగుతుంది. కానీ, మహిళలకు 20% పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా ఏ పార్టీ ముందుకు రావడం లేదు. 2014 ఎన్నికల్లో ఆరు ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు 9% సీట్లు మాత్రమే కేటాయించాయి. ఈ పరిస్థితి మారడానికి ప్రతి రాజకీయపార్టీ మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేయాలని ఇటీవల పౌర సమాజం డిమాండు చేస్తోంది. దీన్ని చట్ట రూపంగా తేవాలంటే పార్లమెంటు ఆమోదం అవసరం. కాబట్టి రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు నిర్దిష్ట కోటాను ప్రకటించి మహిళా సాధికారత పట్ల తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలన్నది చాలా కాలంగా మేధావులు, పౌర సమాజం చేస్తున్న సూచన. 2010లో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెచ్చి.. కాంగ్రెస్‌పార్టీని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందిన బీజేపీకి నేడు లోక్‌సభలో తగిన సంఖ్యాబలం ఉంది. కాంగ్రెస్‌పార్టీ, వామపక్ష పార్టీలు కలిసి వస్తామంటున్నాయి. మహిళా బిల్లును ఆమోదిస్తామన్న తమ ఎన్నికల హామీని నిలబెట్టుకొనే అవకాశం నేడు బీజేపీకి ఉంది. 2004లో, 2009లో, 2014 ఎన్నికల్లో బీజేపీ చెబుతూ వచ్చింది. ఆ మాటల్లోని చిత్తశుద్ధిని, నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అనువైన పరిస్థితీ ఉంది, సమయమూ ఆసన్న మైంది. మాట నిలుపుకోవాల్సినది బీజేపీ, ఆ పార్టీ ప్రధాని మోదీలే. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
‘మత్తు’... ఓ మారణహోమం
విశ్లేషణ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో నిషిద్ధ డ్రగ్స్ చలామణిలాంటి సమస్యలను పరిష్కరించ డానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలి. నిజానికి అలాంటి మాఫియా ఆట కట్టించడానికి కఠినమైన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్‌స్టాన్సెస్,1985 (ఎస్డీపీఎస్) లాంటి పదునైన చట్టాలు మనకున్నాయి. కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకోవడంతోనే మాదక ద్రవ్యాల విషవలయం బలహీనపడదు. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. తెలుగునాట మాదకద్రవ్యాల వినియోగం, వ్యాపారం చాప కింద నీరులా విస్తరించాయి. అమెరికా తదితర విదేశాల నుంచి అతిపెద్ద ‘డార్క్ నెట్వర్క్’తో, ఇంటిదొంగల సహకారంతో మత్తు పదార్థాలు సినిమా, ఐ.టి. సహా అనేక రంగాల్లోకి ప్రవేశించాయి. ఇటీవల పలువురు సినీ ప్రముఖులను విచారించడం సంచలనం సృష్టించింది. పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ తదితర నిఘా వ్యవస్థల కళ్లు గప్పి, ఎల్లలుదాటి మత్తు పదార్థాలు యథేచ్ఛగా దిగుమతి కావడం, వాటి సరఫరా వెనుక సాదాసీదా నేరగాళ్లతోపాటు అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉండటం ప్రభుత్వాలకు పెనుసవాలుగా మారింది. ‘మత్తు’కు బానిసలు యువతీ యువకులు, పాఠశాల విద్యార్థులు సైతం ఈ మాదకద్రవ్యాలకు బానిసలు కావడం చూస్తే ఈ ‘మత్తు’ ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో మత్తుమందు కలిపి అమ్ముతున్నారు. గంజాయి కలిపిన చాక్లెట్లు నిజామాబాద్ లాంటి జిల్లాల్లో పట్టుబడ్డాయి. ఐదు రూపాయలకు లభిస్తుండటంతో పేదలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. చెత్త ఏరుకొనే వీధి బాలలు, యువకులు సైతం మార్కెట్లో తేలిగ్గా దొరికే ‘వైట్నర్’ వాడుతూ మత్తులో మునిగి తేలుతున్నారన్న వార్తలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. అంటే వారివారి సామాజిక, ఆర్థిక స్థాయి, పరిస్థితులననుసరించి యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే డ్రగ్స్‌కు బానిసలైన విద్యార్థుల సంఖ్య ఇటీవల వందల నుంచి వేలకు చేరింది. నేడు ప్రతి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఆదాయంలో సగటున 12.22% ఖర్చు చేస్తున్నారు. అధిక ఫీజులు చెల్లిస్తున్నంత మాత్రాన తమ పిల్లల చదువులు, బాగోగుల బాధ్యతను విద్యా సంస్థల యాజమాన్యాలకే వదిలిపెట్టడం సరి కాదు. పిల్లల దైనందిన వ్యవహారాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరం. విద్యా సంస్థలు కూడా నిబద్ధతతో వ్యవహరించాలి. బహుముఖ వ్యూహం అవసరం మాదక ద్రవ్యాల సమస్య జటిలమైనది. దీనిని బహుముఖ వ్యూహంతోనే ఎదుర్కోవాలి. ముఖ్యంగా లభ్యతను నియంత్రించాలి. కానీ నేడు భారత్ మత్తుపదార్థాలకు అతిపెద్ద మార్కెట్‌గా రూపొందింది. పాకిస్తాన్ నుంచి చాలాకాలంగా రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలకు విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. సుదీర్ఘమైన మన దేశ సరిహద్దు డ్రగ్స్ మాఫియాకు అనుకూలంగా మారింది. భూ, జలమార్గాల ద్వారా, గస్తీదళాల కన్నుగప్పి డ్రగ్స్‌ను చేరవేస్తున్నట్లు చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు ధృవీకరించాయి. నిజానికి మత్తు పదార్ధాలను పంపి, భారత యువతను నిర్వీర్యం చేయాలన్న కుట్రపూరిత వ్యూహం పాకిస్తాన్‌ది. పంజాబ్‌లో నిషిద్ధ మాదక ద్రవ్యాల వాడకం దశాబ్దకాలంగా విపరీ తంగా పెరిగింది. ఆ రాష్ట్రంలో సామాన్యులు జరుపుకునే వేడుకలలో కూడా డ్రగ్స్‌ను చాక్లెట్ల రూపంలో అందజేస్తారని వార్తలు ఉన్నాయి. మద్యం, మాదక ద్రవ్యాలతో కూడిన విందులంటే పంజాబ్‌లో హోదాకు చిహ్నంగా పరిగణిస్తారు. అక్కడ డ్రగ్స్ మాఫియా వ్యాపార సామ్రాజ్య విలువ రూ. 60,000 కోట్లు అని అంచనా! పంజాబ్‌తో పోలిస్తే హరియాణాలో అవి కొంతవరకూ తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ‘హుక్కా’ను బహిరంగంగా వాడుతున్నారు. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే ‘రేవ్ పార్టీ’లు దేశ రాజధాని శివారు ప్రాంతాల్లో జరుగుతున్నట్లు ఎన్నోసార్లు వెల్లడైంది. రాజస్తాన్ సంపన్న వర్గాల పిల్లల్లో 20% మంది డ్రగ్స్‌కి బానిసలైనట్లు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేర్కొం టున్నాయి. ప్రపంచ సమస్యగా డ్రగ్స్ నిషిద్ధ మత్తుపదార్థాల సమస్య అనేక దేశాలను పట్టిపీడిస్తున్నది. ఐక్యరాజ్యసమితికి చెందిన మాదకద్రవ్యాల నేరాల లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మత్తుమందు వినియోగదారుల సంఖ్య కొన్ని కోట్లకు పెరిగింది. అంతర్జాతీయంగా ‘హెరాయిన్’వాడకం నాలుగు వందల టన్నులకు మించి ఉన్నదని ‘మాదక ద్రవ్యాల ప్రపంచ అధ్యయన నివేదిక (వరల్డ్ డ్రగ్ రిపోర్టు)’ స్పష్టం చేసింది. గత ఏడాది ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రొడ్రిగో డుటెర్టే అనే అభ్యర్థి తనను అధ్యక్షునిగా ఎన్నుకొంటే మత్తు పదార్ధాలను సేవించేవారిని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వమే అంతమొందించే చట్టాన్ని చేస్తానంటూ హామీ ఇచ్చి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తన హామీని సమర్ధించుకొంటూ, తమ దేశ మానవ వనరులను కాపాడుకోవడానికి అంతకుమించిన మార్గం లేదని పేర్కొన్న రొడ్రిగోనే అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చూస్తే ఫిలిప్పీన్స్ ప్రజలు ఆ సమస్యతో ఎంతగా విసిగిపోయారో అర్థమవుతుంది. భారత్‌లో ‘హెరాయిన్’ వినియోగం గతంలో 20 టన్నులు. ఇప్పుడు అది ఐదారు రెట్లకు పెరిగినట్లు అంచనా. దశాబ్దం క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం భారత్‌లో మత్తు పదార్థాలు సేవిస్తున్న వారి సంఖ్య 9 కోట్లు దాటింది. కొన్ని రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెన్త్నె శివార్లలో రూ. 71 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల్ని పట్టుకొన్నారు. 2016 అక్టోబర్‌లో ఉదయ్‌పూర్‌లోని ఓ పరిశ్రమ నుంచి డీఆర్ఐ స్వాధీనపరచుకొన్న 23.5 టన్నుల నిషేధిత మండ్రాక్స్ మాత్రల విలువ రూ. 3,000 కోట్లు! ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మత్తు పదార్థాల నియంత్రణకు తగిన వ్యవస్థను పటిష్టపర్చకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రత్యేకమైన మత్తుపదార్ధాల నియంత్రణ వ్యవస్థే లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విభాగం ఒకటి హైదరాబాద్‌లో ఉన్నా, నామమాత్రంగా ఇద్దరు ముగ్గురు సిబ్బందితో నడుస్తున్నది. ఈ వాతావరణాన్ని స్మగ్లర్స్ తమకు అనుకూలంగా మలుచుకొంటున్నారు. అలాగని మత్తు పదార్థాల నియంత్రణ వ్యవస్థలు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయని అనడానికి లేదు. మత్తు పదార్థాల సరఫరా, విక్రయాలకు సంబంధించి దేశంలో ఏటా 40 వేల మందికి పైగా అదుపులోకి తీసుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. కొందరికి శిక్షలు కూడా పడుతున్నాయి. కానీ, ఆ శిక్షలు పూర్తి చేసుకొని వచ్చి అదే వ్యాపారంలో కొనసాగుతూ, మళ్లీ మళ్లీ పట్టుబడిన సందర్భాలు లేకపోలేదు. ప్రమాదం అంచున తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, వాడకం ఎక్కువైంది. వాస్తవ పరిస్థితిని మీడియా ఎక్కువ చేసి చూపించడం వల్ల నగరానికున్న బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందని కొందరు పసలేని వాదన చేస్తున్నారు. వార్తలను దాచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. హైదరాబాద్‌లోగానీ, మిగతా ప్రాంతాల్లోగానీ డ్రగ్స్ వాడకం పెరగడం అన్నది ఒక్కరోజులో జరిగింది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుడు 3,580 కిలోల గంజాయి, నాలుగు కిలోల ‘‘అల్ఫాజోమ్’’ పట్టుబడ్డాయి. నిజానికి మద్యం కూడా మత్తు పదార్థామే! కానీ మద్యపానాన్ని ఆదాయం కోసం పాలకులే పెంచిపోషిస్తున్నారు. మద్యపానం వల్ల జరుగుతున్న అరిష్టం అంతా ఇంతా కాదు. అనేక నేరాలకు, ప్రమాదాలకు, కుటుంబ కలహాలకు, అత్యాచారాలకు మద్యపానమే కారణం. ఒకపక్క మద్యం తాగమని ప్రోత్సహిస్తూ మరోపక్క తాగి వాహనాన్ని నడిపితే శిక్షలంటూ ప్రభుత్వాలు ద్వంద్వవైఖరిని అవలంబిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇక ధూమపానం విషయంలో చట్టాలు కోకొల్లలు. కానీ, వాటి అమలు నామమాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందికి పైగా ధూమపానంలో మునిగి తేలుతున్నారని ఎన్నో నివేదికలు వెల్లడించాయి. సిగరెట్లలో కూడా మాదక ద్రవ్యాలను నింపుతున్నారు. చట్టాలతో పరిష్కారం అవుతుందా? మత్తు పదార్ధాలకు పిల్లలు బానిసలైపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టులో దాఖలు చేసిన సందర్భంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకొనేది’ అని స్పష్టం చేసింది. దేశంలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న మాదక ద్రవ్యాల ముప్పు నుంచి భావి భారతపౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు తెలియజేయడమే కాకుండా అందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆదేశించింది. మత్తు పదార్థాలకు బానిసలైన వారి గణాంకాలను రూపొందించాలనీ, మాదక ద్రవ్యాల మాఫియాపై ఉక్కు పాదాన్ని మోపడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో నిషిద్ధ డ్రగ్స్ చలామణిలాంటి సమస్యలను పరిష్కరించడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలి. నిజానికి అలాంటి మాఫియా ఆట కట్టించడానికి కఠినమైన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్‌స్టాన్సెస్,1985 (ఎస్డీపీఎస్) లాంటి పదునైన చట్టాలు మనకున్నాయి. కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకోవడంతోనే మాదక ద్రవ్యాల విషవలయం బలహీనపడదు. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. ముఖ్యంగా మత్తు పదార్థల వల్ల సంభవించే అనర్థాలను తెలియజెప్పగలగాలి. మద్యం, మత్తు పదార్ధాలు మనిషి జీర్ణాశయం, కాలేయం, గుండె, మెదడు వంటి శరీర భాగాలను వేగంగా దెబ్బ తీసి మరణానికి చేరువ చేస్తాయని వైద్యులు చేస్తున్న హెచ్చరికలను ప్రచారాంశాలుగా మార్చాలి. మత్తు పదార్థాలు సృష్టించే మారణ హోమం నుంచి జాతిని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రాధాన్యత కావాలి! దానిని అత్యంత ముఖ్యమైన సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలను భాగస్వాములను చేసి మారణహోమం సృష్టించే మత్తు పదార్థాల అక్రమ రవాణా పంపిణీ, వాడకం వంటి వాటిని సమూలంగా నిర్మూలించాలి. వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మొబైల్ : 99890 24579 -
వైఎస్సార్ సీపీ యాక్షన్ ప్లాన్
-
నమ్మకమిస్తున్న ‘నవరత్నాలు’
విశ్లేషణ ప్రజానీకంలో విశ్వసనీయత కలిగిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు తండ్రి నుంచి పుణికి పుచ్చుకొన్న విశిష్ట లక్షణాలలో ప్రజల ఈతిబాధల పట్ల సానుభూతి, ఇచ్చిన హామీల నుంచి వెనుదిరగకపోవడం వంటివి ఉన్నాయి. అమరావతి ప్లీనరీలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ప్రజల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని చేసినవి. రాష్ట్రంలో నిరాశా నిస్పృహలు నెలకొన్న నేపథ్యంలో జగన్ 9 ప్రధాన వాగ్దానాలు చేయడం సముచితం, సమంజసమంటూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి పునాది– విస్తృత ‘చర్చ’. అది హేతుబద్ధమైన అంశాలను ఆవిష్కరిస్తుంది. వాస్తవాలను వెలికి తీస్తుంది. పరిష్కారాలను చూపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ‘చర్చ’ మొత్తం గుంటూరు వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తొమ్మిది అంశాలతో ప్రకటించిన ముందస్తు మినీ మేనిఫెస్టో చుట్టూ తిరుగుతోంది. ‘నవరత్నాలుగా’ అభివర్ణిస్తున్న ఆ హామీల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చకు తెర తీయడం ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ తన రాజకీయ గోతిని తానే తవ్వుకొన్నట్లయింది. ఎందుకంటే, 2014లో తెలుగుదేశంపార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు 3 ఏళ్లు గడిచినా, ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు. రాష్ట్రానికి సంజీవనిలా ఉపయోగపడే ‘ప్రత్యేక హోదా’ హామీకి కూడా మంగళం పాడేశారు. రైల్వేజోన్ జాడ కానరాదు. పోలవరం ప్రాజెక్టు కేంద్రానిదో, రాష్ట్రానిదో అంతుబట్టదు. 2014లోనే కాదు, ఎన్టీఆర్ నుంచి పార్టీని హస్తగతం చేసుకొన్నప్పటి నుంచి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, హామీలను నిలబెట్టుకొన్న దాఖలాలు కానరావు. కానీ నేడు తన పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత ఇచ్చిన వాగ్దానాలను ఆయన విమర్శించడం విడ్డూరం. చిత్తశుద్ధి ముఖ్యం ‘సాయం చేయడానికి ప్రభుత్వం చేతిలో డబ్బు కంటే నాయకత్వానికి మంచి మనసు ఉండటం ముఖ్యం’అన్నది ఒక నానుడి. మనసున్న రాజకీయవేత్తలే పేదల కష్టాలు తెలుసుకోగలుగుతారు. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మనసున్న నేతలు ఎన్టీఆర్, డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌కు ప్రీతిపాత్రమైన కిలో రెండు రూపాయల బియ్యం పథకానికి నిర్వచనం మార్చారు. అనతికాలంలోనే బియ్యం ధరను రెండు రూపాయల నుంచి ఐదున్నరకు పెంచేశారు. ఇందుకు పార్టీ వేదికలపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసినా పెడచెవినపెట్టారు. పేద మహిళలు పోరాడి సాధించుకున్న సంపూర్ణ మద్య నిషేధానికి చంద్రబాబు గండి కొట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే మద్యం పారాల్సిందేనని ఓ వింత వాదన లేవనెత్తి ఎన్టీఆర్ ఆశయాన్ని నీరుగార్చేశారు. 1999లో ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం అనే పదానికి కూడా అర్థాన్ని మార్చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో యూజర్ చార్జీలు విధించారు. 2000 నుంచి 2003 వరకూ రాష్ట్రంలో వరుస కరువులు ఏర్పడి ప్రజలు తల్లడిల్లిపోయారు. పంటలకు ఒక్క తడికి కూడా నీరు లేక పంటలు ఎండిపోతుంటే లక్షల సంఖ్యలో రైతులు వలసలు పోతూ, వందల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడుతుంటే, కనీన కనికరం లేకుండా భారీగా విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేశారు. ఆనాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రాంత రైతులు పడుతున్న కష్టాలను చూసి రైతుల ఆత్మహత్యలను నివారించడానికి బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసే మెట్టప్రాంత రైతులకైనా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ‘లేఖ’రాస్తే, ఆయనను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించారు. ఫలితంగానే కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్లి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాటి నేత డా. రాజశేఖరరెడ్డి తాము అధికారంలోకి వస్తే వ్యవసాయరంగానికి ‘ఉచిత విద్యుత్’ఇస్తామని హామీ ఇచ్చారు. పెంచిన విద్యుత్ చార్జీలను ‘రోల్‌బ్యాక్’ చేయాలనే డిమాండ్‌తో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైఎస్ఆర్ ఆధ్వర్యంలో సాగిన దీక్షా శిబిరాలను ప్రభుత్వం అడ్డుకొన్న ఉదంతాన్ని ప్రజలు మర్చిపోలేదు. పెంచిన చార్జీలు తగ్గించాలంటూ హైదరాబాద్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీని అడ్డుకొని, పోలీసులు ఉద్యమకారులపై కాల్పులు జరపడంతో ఇరువురు మరణించారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఉచిత విద్యుత్ ఇస్తే మంచిదని పార్టీ నేతలు హితవు చెప్పారు. కానీ, వారిని చులకన చేస్తూ.. ‘మీ మైండ్‌సెట్ మారాలి. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అంటూ నోళ్లు మూయించిన చరిత్ర చంద్రబాబునాయుడిది. 2003 లో వైఎస్సార్ చేసిన చరిత్రాత్మక పాదయాత్ర అంతటా ‘అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం’ అంటూ ఇచ్చిన హామీ ఓ బూటకమని చిత్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నాలు జరిగాయి. అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ (ఏఐసీసీ) ఆనాడు తమ జాతీయ విధానంగా ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకమంటూ చేసిన తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించింది. అయినా, వైఎస్సార్ మాత్రం రైతుల ఆత్మహత్యలు పెద్దఎత్తున జరుగుతున్న దృష్ట్యా ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాల్సిందేనని అధిష్టానాన్ని ఒప్పించగలిగారు. ఉచిత విద్యుత్ ఏవిధంగా ఇవ్వవచ్చునో ఆయన వివరించిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఉచిత విద్యుత్ హామీని చేర్చినప్పటికీ ప్రజలు దానినొక ప్రహసనంగానే చూశారు. వామపక్షాలు, టీఆర్ఎస్తో కలసి తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసిన మహాకూటమిని ప్రజలు తిరస్కరించారు. చరిత్ర పునరావృతం విశ్వసనీయత కోల్పోయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టి నరేంద్ర మోదీ గాలిలో, జనసేన పవన్‌కల్యాణ్ అందించిన సహకారంతో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో 2014లో అధికారంలోకి రాగలిగింది. తెలుగుదేశం ఇచ్చిన హామీల అమలుపై ఎన్నికల కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం’ అంటూ అఫిడవిట్ సమర్పించి ఆ పార్టీ ప్రజలను నమ్మించగలిగిందన్నది సుస్పష్టం. కానీ అధికారంలోకి వచ్చాక ఏ హామీని నెరవేర్చగలిగారు? తొలి సంతకాలు అంటూ ఆర్భాటంగా చేసిన 5 ఫైళ్లు ఏమయ్యాయి? నిబంధనల పుణ్యమా అని రైతుల సంపూర్ణ రుణమాఫీ కుంచించుకు పోయింది. చివరకు రూ. 24 వేల కోట్లు ఇస్తామని, రూ. 10 వేల కోట్లు లోపునకు పరిమితమైనారు. అది రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీలక్కూడా సరిపోదనేది నగ్నసత్యం. బెల్ట్‌షాపుల రద్దు, దశల వారీ మద్య నిషేధం హామీ ఏమైనాయి? సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన 500 మీటర్లలోపు ఉండే మద్యం దుకాణాలను తరలించకుండా ఏకంగా ఆ రహదారుల్ని పట్టణ రహదారులుగా నోటిఫై చేయడానికి ఒడిగట్టింది ప్రభుత్వం. ప్రత్యేక హోదా, స్థానిక సంస్థలకు నిధులు, విధుల బదలాయింపు, రాజ్యాంగేతర, అప్రజాస్వామిక ‘జన్మభూమి’ ఆవిర్భావంతో జరుగుతున్న అక్రమాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీల్లో ఏవైనా నెరవేరాయా? నేరవేర్చామని చెబుతున్న కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ వంటి సంస్థలు ఎప్పుడు మొదలైనాయి? జీవన ప్రమాణాలు పెంచే పథకాలు ప్రజానీకంలో విశ్వసనీయత కలిగిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన కుమారుడు జగన్‌కు తండ్రి నుంచి పుణికి పుచ్చుకొన్న విశిష్ట లక్షణాలలో ప్రజల ఈతిబాధల పట్ల సానుభూతి, ఇచ్చిన హామీల నుంచి వెనుదిరగకపోవడం వంటివి ఉన్నాయి. అమరావతి ప్లీనరీలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ప్రజల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని చేసినవి. తెలుగుదేశం పాలనలో రైతాంగం, మహిళలు, నిరుద్యోగ యువత, బడుగు, బలహీన వర్గాల ఆశలు అడియాసలైన నేపథ్యంలో జగన్ 9 ప్రధాన వాగ్దానాలు చేయ డం సముచితం, సమంజసమని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘వైఎస్సార్సీపీ భరోసా’ పథకం వల్ల చిన్న సన్నకారు రైతులు ఒక్కొక్కరికి రూ. 50,000 అందుతుంది. కనీస మద్దతు ధరలు లేక, పెట్టుబడులు లేక వ్యవసాయం చేయలేని రైతాంగానికి అది గొప్ప ఊరట. డ్వాక్రా మహిళలకు ‘వైఎస్సార్సీపీ ఆసరా’ పథకం నిజమైన ఆసరాయే. 3 దశల్లో మద్య నిషేధం ఆలోచన సత్ఫలితాలిచ్చే అవకాశం ఉంది. ‘అమ్మ ఒడి’ పథకంతో పేద కుటుంబాల చిన్నారులు విద్యాపరంగా తమ కాళ్లమీద తాము నిలబడగలిగే శక్తిని సంపాదించగలరు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వైఎస్ మరణానంతరం చతికిలపడ్డాయి. సాగునీటి రంగంలో నీటి కంటే ముందు అవినీతి పారుతోంది. రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులకు సంబంధించి న్యాయమైన హక్కులు సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన అలసత్వం, వైఫల్యం వల్ల నీటి వనరుల సాధనలో వెనుకబడిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్న తండ్రి కల నెరవేరాలంటే వైఎస్ జగన్ ‘జలయజ్ఞం’ను ప్రజల అవసరాలు, వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదికగా పునర్వ్యవస్థీకరించాలి. వైఎస్ తను ముఖ్యమంత్రిగా ఉండగా సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 80 లక్షల ఇళ్లను నిర్మించి సంతృప్తస్థాయి (శాట్యురేటెడ్ లెవల్) సాధించాలన్న ఆయన కలను సాకారం చేయాలంటే మరో 25 లక్షల ఇండ్ల నిర్మాణం జరగాలి. పేదల ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలిచిన ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యమయింది. ప్రజల చెంతకు మళ్లీ ప్రజా వైద్యం చేరాలనేదే వైఎస్సార్సీపీ ఆకాంక్ష. 2019లో జరగబోయే ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చే నైతిక స్థాయి ప్రధాన ప్రతిపక్షనేతగా ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉంది. విశ్వసనీయతకు, నమ్మక ద్రోహానికి మధ్య జరిగే సంఘర్షణలో ప్రజలు నిస్సందేహంగా విశ్వసనీయతకే పట్టం గడతారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారి త్రక ఆవశ్యకత! ‘అన్న వస్తాడు.. నవరత్నాలు అందిస్తాడు.. మంచి రోజులు రానున్నాయి’ అనేదే ఈనాటి ప్రజాచర్చ. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వైఎస్సా ర్సీపీ తన ప్లీనరీ ద్వారా ప్రజల్లో కల్పించగలిగింది. అందుకే రాష్ట్ర ప్రజల ఆలోచనా విధానం మారింది. చంద్రబాబు పట్ల భ్రమలు వీడిపోయే సందర్భం వచ్చింది. వైఎస్సార్సీపీ ప్లీనరీ తర్వాత ప్రజాభిప్రాయం పూర్తిగా వాస్తవి కతకు దగ్గరైందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. తమ అన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు. ‘అన్న వస్తున్నాడు’ అన్న పదమే ప్రజల నోళ్లలో పలుకుతోంది. మంచి రోజులు దగ్గరలో ఉన్నాయన్న ఆశ పెరుగుతోంది. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
పార్టీ అధ్యక్షుని ఎన్నిక ప్రకటించిన ఉమ్మారెడ్డి
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది. ఎన్నికల అధికారిగా సీనియర్ నేత, ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు...పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను విడుదల చేశారు. ఇవాళ నామినేషన్ల స్వీకరణతో పాటు సాయంత్రం తుది జాబితా ప్రకటన చేస్తామన్నారు. అలాగే రేపు (ఆదివారం) సాయంత్రం జాతీయ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వెల్లడించనున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. సర్వమత ప్రార్థనలు కాగా అంతకు ముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. పార్టీ ప్రతినిధులతో ప్రమాణం పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులతో ప్రమాణం చేయించారు. -
'వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు'
-
జులై 8,9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ ప్లీనరీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ప్లీనరీకి సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పన్నెండు ఎకరాల స్థలంలో భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. 'జాతీయ స్థాయి ప్లీనరీకి దాదాపు 30వేల మంది ప్రతినిధులు వస్తారు. మూడు అంచెల్లో ఈ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించాం. ప్లీనరీ నిర్వహణ కోసం మొత్తం 18 కమిటీలు ఏర్పాటుచేశాం. భోజన ఏర్పాట్లు, తీర్మానాలు, సభ నిర్వాహణ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, మీడియా, కల్చరల్, రవాణా, పార్కింగ్ వంటివాటి నిర్వహణకు ఈ 18 కమిటీలు పనిచేస్తాయి. ప్లీనరీ తొలిరోజు(జులై 8)న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాం. ప్లీనరీ రెండో రోజు(జూలై 9)న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు గ్రామీణ స్థాయి నేతలకే ఎక్కువ తెలుస్తాయి. అందుకే జిల్లా స్థాయి ప్లీనరీలు, నియోజవర్గ స్థాయి ప్లీనరీలు విజయవంతమయ్యాయి. ఆయా ప్లీనరీల్లో తీర్మనాలు మాకు ఎప్పటికప్పుడు అందుతునే ఉన్నాయి. వాటి ప్రాతిపదికనే జాతీయ ప్లీనరీలో చర్చిస్తాం. దశ దిశ కోల్పోయిన వ్యవసాయం, ప్రజా సంక్షేమం, మహిళా, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ సమస్యలు, డ్వాక్రా మహిళలు వారి ఇబ్బందులు, ఎన్నికల హామీల వైఫల్యం, ప్రత్యేక హోదా అంశం, మానవ వనరులు, ఇసుక మాఫియా, మద్యం టెండర్ల అవకతవకలు, రాజధాని భూ సేకరణపై జరుగుతున్న అక్రమాలులాంటి ఎన్నో అంశాలు ప్లీనరీలో చర్చిస్తాం' అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. -
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం ఘటన
హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం క్వారీ ఘటన చోటుచేసుకుందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. -
బాబు పాలనలో డొల్లతనం రుజువైంది
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతల హత్యల వంటి దుర్మార్గాలతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతో కాలం పరిపాలన సాగించలేదని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష నేతలను వేధించేది చాలక ఇంకా ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను హతమార్చడం దారుణమని, ఇలాంటి దురాగతాలను ప్రజలు చూస్తూ సహిస్తారనుకోవడం పొరబాటేనని ఆయన అన్నారు. నారాయణరెడ్డి హత్య కేసు విచారణ, నిందితులను పట్టుకోవడంలో పోలీసు అధికారులు తమ నిష్పాక్షికతను నిరూపించుకోవాలని, టీడీపీ ప్రభుత్వం కూడా నిష్పాక్షికంగా దోషులకు శిక్ష పడేలా వ్యవహరించాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో డొల్లతనం ఈ హత్యతో రుజువైందని ఆయన అన్నారు. -
‘నిరాయుధులను చేసి హత్య చేయిస్తున్నారు’
-
‘నిరాయుధులను చేసి హత్య చేయిస్తున్నారు’
కర్నూలు/హైదరాబాద్: చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్సార్ సీపీ నేతల హత్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ సీపీ నాయకుల గన్మెన్లను తొలగిస్తున్నారని అన్నారు. నిరాయుధులను చేసి తర్వాత వైఎస్సార్ సీపీ నేతలను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నారాయణ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
రాజన్న క్యాంటీన్: భోజనం@రూ.4
అమరావతి: అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తన సొంత ఖర్చుతో పేదలకు భోజనం పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కేను ఆయన అభినందించారు. ఆదివారం తన నియోజకవర్గం మంగళగిరిలో రాజన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. కేవలం రూ.4లతో సాంబారు అన్నం, పెరుగన్నం, కోడిగుడ్డుతో మీల్స్‌ను అందిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటిపండు, ఒడియాలను భోజనంలో ఇస్తారు. ప్రభుత్వం చేయలేని పనిని ఒక ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో చేయడం హర్షణీయమని ఉమ్మారెడ్డి అన్నారు. -
ఈవీఎంలలో టెక్నాలజీ అప్డేట్ చేయాలి
-
విజయవాడలో వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఈసారి విజయవాడ వేదిక కానుంది. జూలై 8,9 తేదీల్లో విజయవాడలో పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నట్లు ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన శుక్రవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...జూన్ 19,20,21 తేదీల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతాయన్నారు. ఆ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉంటాయన్నారు. ఇక మే చివరివారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, రెండోదశలో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ అంశాలపై కులంకుషంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. -
మిర్చికి మద్దతు ధర అమలు ఏదీ?
సాక్షి, హైదరాబాద్ : మిర్చి ధరపై కేంద్రం చేసిన ప్రకటన రాష్ట్రంలో ఎక్కడా అమలు జరగడం లేదని, ఈ పంట కొనుగోళ్లపై కేంద్రం షరతులు విధించడం ఏమిటని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల జీవితాలంటే ఇంత ఆషామాషీగా ఉందా? అని ప్రశ్నించారు.బాబుకు చెందిన హెరిటేజ్ షాపులో 200 గ్రాముల మిర్చి ధర రూ.44లుగా ఉందని ఆ ప్రకారం క్వింటాలు ధర రూ.22 వేలు అవుతుందని చెప్పారు. కానీ మార్కెట్లో రైతులకు ఇస్తున్నది క్వింటాలుకు కేవలం రూ.4 వేలు మాత్రమేనని తెలిపారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువు..
హైదరాబాద్ : మిర్చిపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అమలు జరగడం లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మిర్చి కొనుగోళ్లపై కేంద్రం అనేక షరతులు పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రం ధరపై స్పష్టత లేదని మార్కెటింగ్ కమిషనర్ చెబుతున్నారని, ఒకవేళ పంట కొనుగోళ్లు చేసినా స్టోరేజీ చేయడానికి గోడౌన్లు ఖాళీ లేవని చెబుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువైందని ఆయన అన్నారు. రైతుల జీవితాలంటే ఇంత ఆషామాషీగా ఉందా అని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ స్టోర్‌లో 200 గ్రాముల మిర్చికి రూ.44 వసూలు చేస్తున్నారని, ఆ లెక్కన క్వింటాల్ ధరరూ.22వేలు అవుతుందన్నారు. అదే రైతుకిస్తున్నది రూ.4వేలు అని, హెరిటేజ్‌లో అమ్ముతున్నది రూ.22వేలా? అని సూటిగా ప్రశ్నించారు. ఇక రిలయన్స్ దుకాణాల్లో 200 గ్రాముల మిర్చి రూ.71 ...దాని ప్రకారం క్వింటాల్ ధర రూ.35వేలు అవుతుందన్నారు. దేశంలో రోజుకు 34మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి, అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఉమ్మారెడ్డి అన్నారు. మిర్చి క్వింటాల్‌కు రూ.10వేలు చొప్పున కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువు..
-
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా..
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన ఉమ్మారెడ్డి సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై అలుపెరగని పోరా టం చేస్తానని, వైఎస్సార్సీపీ అధినే త వైఎస్ జగన్ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరు స్తానని శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎంపికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వివిధ చట్ట సభల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశానన్నారు. శుక్రవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ సమక్షంలో ఉమ్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించిన జగన్‌కు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు ఉమ్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
-
ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అయితే ఆయన పదవీకాలం ముగియడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కూడా ఎవరూ ఎన్నిక కాలేదు. దాంతో ప్రతిపక్ష నాయకుడిని ఎంచుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. సీనియర్ నాయకుడైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: ఉమ్మారెడ్డి
విజయవాడ: ప్రజాస్వామ్యానికి అంబేడ్కర్ అత్యంత విశిష్టతను ఆపాదిస్తే.. నేడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే స్థానంలో ఉన్న వారు వ్యవహరిస్తున్న తీరు భాధకరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన గురువారం మాట్లాడుతూ.. ఒక పార్టీ లో గెలిచిన వారిని మరో పార్టీలో చేర్పించుకోవడం రాజ్యాంగబద్దమా..? ఆనాడు తలసాని పార్టీ మారితే విమర్శలు చేసిన చంద్రబాబు... ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. -
‘అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తాం’
-
‘అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తాం’
అమరావతి: కొత్త శాసనసభలోనైనా ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మూడేళ్లుగా శాసనసభ సమావేశాలు సజావుగా నిర్వహించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన వెలగపూడిలో అసెంబ్లీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అంశంపై చర్చకు పట్టుబడతామని పునరుద్ఘాటించారు. అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తామని చెప్పారు. క రువుతో రాష్ట్రం అల్లాడుతోందని, రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను 14 రోజులకు కుదించాలనుకోవడం సరికాదన్నారు. ఏడాదికి 80 నుంచి 100 పాటు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత కూడా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్రతిపక్షం చేసే విమర్శలను ప్రభుత్వం సలహాలుగా భావించాలని, ఎదురుదాడి చేస్తే మంచిది కాదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. -
రిసీవ్ చేసుకోకుండా, రివర్స్ కేసులా?
విజయవాడ: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఎవరిని కాపాడేందుకు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పినట్లు వినే సంఘాలుగా పోలీస్, ఐఏఎస్ సంఘాలు మారితే వాటి విశ్వసనీయత పోతుందని ఆయన గురువారమిక్కడ అన్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేతను ఆర్డీవో స్థాయి అధికారి రిసీవ్ చేసుకోవాలని, అలా చేయకపోగా, రివర్స్ కేసులు పెడుతున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు మల్లాది విష్ణు, శివాజీ, సుంకర పద్మ డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఐఏఎస్‌లు, పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. -
ఉమ్మారెడ్డితో మనసులో మాట
-
హైకోర్టును ఆశ్రయించడమంటే తప్పు ఒప్పుకున్నట్లే
సీఎంపై ఉమ్మారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై ఏసీబీ విచారణ జరపరాదని హైకోర్టును ఆశ్రయించడంద్వారా సీఎం చంద్రబాబు తాను తప్పు చేశానని సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్లయిందని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పిటిషన్ వేశారంటేనే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడిన స్వరం తనదేనని చంద్రబాబే నిర్ధారించుకున్నట్లయిందన్నారు. ఉమ్మారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గురువారం హడావుడిగా లంచ్‌మోషన్‌ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడాన్నిబట్టి దీనిపై ఆయనెంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోందన్నారు. ఈ కేసు సాంకేతికంగా నిలబడదని, చంద్రబాబు స్వరపరీక్షకోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేటపుడు ఏసీబీ అనుమతి తీసుకోలేదని, అసలిది ఏసీబీ పరిధిలోకే రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోనిది కనుక ఏసీబీ విచారణను నిలిపేయాలని రెండురోజులుగా కొన్ని పత్రికల్లో లీకులొస్తున్నాయన్నారు. గతంలో కూడా చంద్రబాబు ఏ విచారణా జరక్కుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఉమ్మారెడ్డి అంటూ.. ఏలేరు కుంభకోణంలో ఏవిధంగానైతే విచారణ జరక్కుండా స్టే తెచ్చుకున్నారో, ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ అలాగే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ హైకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. ప్రత్యేక హోదా చర్చలేమిటో వెల్లడించాలి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే స్నేహపూర్వకంగానే విడిపోతామని చంద్రబాబు బీజేపీకి అల్టిమేటం ఇచ్చినట్లుగా పత్రికల్లో రెండురోజులుగా లీకులొస్తున్నాయని, ఈ వ్యవహారాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. -
తప్పు చేసినట్లు చంద్రబాబే ఒప్పుకున్నారు
-
వచ్చే నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ ఎనిమిదో సమావేశాలు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ సమావేశ మందిరంలో సమావేశాలు జరుగుతాయి. ప్రారంభానికి సంబంధించి శుక్రవారం శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల పార్లమెంటు జీఎస్టీ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమలుచేసేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా పూర్తిచేస్తారు. మూడు రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నా తొలి రోజున జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశాల్లో సభ ఎన్నిరోజులు నిర్వహించేది నిర్ణయిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు కూడా అసెంబ్లీ సమావే శాలను కనీసం మూడు నుంచి నాలుగు వారాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, కృష్ణా పుష్కరాలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, దళితులపై దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మండలి సమావేశాలు ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు పబ్లిక్‌గార్డెన్స్‌లోని సమావేశ మందిరంలో ప్రారంభమవుతాయి. తొలుత సమావేశాలను ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావ తిలో నిర్వహించాలని భావించారు. అక్కడ ఏర్పాట్లు పూర్తి కాకపోవటంతో హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. -
తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలని చూస్తోందన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికే ఈ సమావేశాలని ప్రభుత్వం మాట్లాడటం దురదృష్టకరమని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు అనేక కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. కీలకమైన ప్రజా సమస్యలు చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన సూచించారు. కాగా శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమవుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలు నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. -
తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలా?
-
'అందుకే విజయ సాయిరెడ్డిని పోటీలో నిలిపాం'
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ బలం తమకుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పోటీలో నిలిపినట్టు ఆయన వెల్లడించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు రాజకీయాలపై కూడా ఫిర్యాదు చేశారు. సరిపోయేంత బలం ఉండబట్టే తాము రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఉమ్మారెడ్డి తెలిపారు. బలం లేకుండా పోటీ చేస్తే తెలంగాణలో ఏంజరిగిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. నాలుగో అభ్యర్థికి సరిపోయేంత బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయడం అనైతికమన్నారు. ఒక అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే..ఎక్కువ బలం వైఎస్ఆర్ సీపీకి ఉందన్నారు. -
వరుస కరువులు.. నేర్వని పాఠాలు
రాయలసీమలో 1960లలో ఏర్పడిన కరువును తలచుకుని ఏపీ ప్రజా నీకం నేటికీ భయంతో వణుకుతుంటారు. గంజి కేంద్రాలతో ప్రజలను ఆకలి చావుల నుంచి తప్పించిన ఆ రోజులను ఏ ఒక్కరూ మర్చిపోలేరు. ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో 14 రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. బీటలు వారిన పొలాలు, నెర్రెలిచ్చిన నేలలు.. నూతుల్లో నీళ్లు ఆవిరైపో యాయి. భూగర్భ జలాలు ఇంకి బోర్లు ఎండిపోయాయి. బిందెడు నీళ్ల కోసం చంటి పిల్లల్ని చంకన వేసుకుని మండుటెండల్లో కిలోమీటర్ల మేర ‘క్యూ’లలో నిలు చున్న మహిళలు.. ప్రాణాధారమైన నీళ్లు లేక అల్లా డుతున్న జనం.. గ్రామీణ ప్రాంతాల్లో మరణమృ దంగం మ్రోగుతోంది అతి భయానకంగా! రెండు వరుస కరువులు సంభవించడం సుమారు రెండు దశాబ్దాల తర్వాత దేశంలో ఇదే ప్రథమం. కరువు తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఉంది. ఏపీలో తీవ్ర వర్షాభా వంతో ఏర్పడిన కరువు కారణంగా భూగర్భ జలాలు.. రెండున్నర మీటర్ల మేర పడిపోయాయి. 13 జిల్లాల్లో ఉన్న 17,366 గ్రామాలు; 97 మున్సిపాలిటీలు; 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. 359 మండలాల్లో కరువు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. అంతకు మించిన కరువు తీవ్రత సర్వత్రా కనిపిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సాధారణ సాగు విస్తీర్ణంలో 70% మేర మాత్రమే పంటలు వేశారు. 5 లక్షలహెక్టార్లలో అసలు పంటలు వేయలేదు. కృష్ణా డెల్టాలో వేసిన పంటలు సగం మేర ఎండిపోయాయి. పట్టిసీమ నుంచి నీరు అందుతుందని ప్రభుత్వం చెప్పడంతో.. ఆ మాటలు విశ్వసించి.. రైతులు అప్పు చేసి మరీ మళ్లీ విత్తుకున్నారు. కానీ.. అవి కూడా ఎండిపోయాయి. కరువులో ప్రజల్ని, రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికార యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తు న్నది. పశుగ్రాసం, మంచినీరు అందించే చర్యలు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం పనులు సగటున 47 రోజులు మాత్రమే జరిగాయి. ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఇచ్చే వాటాను 60% నుంచి 40%కి తగ్గించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామి అయినప్పటికీ.. కరువులో తగిన నిధులను తెచ్చు కోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం కూడా ఆధ్రప్రదేశ్ పట్ల సవతి ప్రేమ చూపడం ఆశ్చర్యం. కరువు మండలాల్లో పునరావాస చర్య లకు రూ. 2 వేల కోట్లు తక్షణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే.. కేంద్రం కేవలం రూ. 433.77 కోట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రంలో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితుల్ని కేంద్రానికి నివేదించి నిధులు రాబట్టడంలో రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు తగిన చొరవ చూపకపోవడం రాష్ట్రానికి శాపంగా మారింది. గత కొన్ని దశాబ్దాలలో కనీవినీ ఎరుగకుండా ఏర్పడిన కరువు పరిస్థితుల్లో.. ప్రజలకు భరోసా కల్పించ డంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కరువు ప్రాంతాల్లో ‘మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం’ పనులను 150 రోజులకు పెంచారు. కానీ, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 50 రోజుల సగటు మించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 100 రోజుల పనిని చేసిన కుటుంబాల సంఖ్య 8%. తెలంగాణలో అది 7.3% గా ఉంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, ఏడాదికి 150 రోజులకు తక్కువ కాకుండా పథకాన్ని అమలు చేయాలని ఆందోళ నలు చేసిన రాజకీయ పార్టీలు.. అధికారం చేపట్టాక వాటిని విస్మరించాయి. అంతేకాక ఇంతకు ముందు నమోదైన 52 రోజుల సగటును కూడా సాధించలేక పోవడం వారి వైఫల్యానికి పరాకాష్ట. వేసవిలో వచ్చే నీటి కొరత యావత్ ప్రపం చాన్ని పట్టిపీడిస్తోంది. ‘నీరు’ అరుదైన వనరుగా మారి ప్రజల నీటి అవసరాలు తీర్చడం ప్రభుత్వా లకు అతి పెద్ద సవాల్‌గా మారింది. 20 దశాబ్దంలో ‘చమురు’ ప్రపంచంలో అరుదైన వనరుగా మారితే.. 21 దశాబ్దంలో ‘నీరు’.. ఆ స్థానాన్ని ఆక్ర మించింది. ‘నీటి వనరుల సంరక్షణ యాజమాన్య పద్ధతులు’పై వినూత్న విధానాలను రూపొందిం చిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు రాజేంద్రసింగ్ ‘‘దేశంలో మనకు రిజర్వ్ పోలీసు ఉంది. రిజర్వ్ ఆర్మీ ఉంది. కాని దురదృష్టవశాత్తు రిజర్వ్ వాటర్ లేదు’’.. అని నీటిని అందుబాటులో ఉంచుకోవడం ఎంత అవసరమో తెలియజెప్పారు. విచక్షణారహితంగా భూగర్భజలాల్ని తోడివే యడం వలన భూగర్బజల మట్టాలు పడిపోతు న్నాయి. నిజానికి, భారత్‌లో లభించే తలసరి నీటి పరిమాణం.. ఇతర దేశాల కంటే ఎక్కువే అయిన ప్పటికీ.. నీటి సంరక్షణ చర్యలు లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని పరిష్కరించా లంటే.. గంగ, యమున వంటి నదులను దక్షిణాది నదులతో అనుసంధానం చేయడం తప్పనిసరి. సమీప భవిష్యత్తులో నదుల అనుసంధాన ప్రక్రియ మొదలవుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. నీటి పొదుపు, వర్షపునీటి సం రక్షణ, నీటి పునరుత్పాదకత, కరువు పరిస్థితులకు ముందస్తు సంసిద్ధత మొదలైన చర్యల్ని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి. భారీ సాగునీటి ప్రాజెక్టుల తోపాటు చెరువులు, కుంటలు, ఇంకుడు గుంటలు, చెక్ డ్యాంలు, వాటర్ షెడ్లు వంటి చిన్న నీటి వన రుల అభివృద్ధిపై దృష్టి సారించి అందులో ప్రజల్ని భాగస్వాములను చేయాలి. కరువు బారిన పడే రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు తదితర సహాయం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ బ్యాంకులు ఉదారంగా వ్యవహరించగలగాలి. కరువు నివారణకు ముం దస్తుగా తీసుకునే చర్యల్లో చిత్తశుద్ధి ఉంటే కరువును సమర్థవంతంగా ఎదుర్కోవడం అసాధ్యం కాదని అనేక దేశాలు నిరూపిస్తున్నాయి. వాటి స్ఫూర్తిని తీసుకోగలిగితే ఇక్కడా మంచి ఫలితాలు సాధించవచ్చు. వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు మొబైల్: 99890 24579 - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు