Movies
-
సాయి పల్లవికి అనారోగ్యం.. బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని తండేల్(Thandel) సినిమా దర్శకుడు చందు మొండేటి తెలిపారు. అంతేకాదు ఆమెకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, అందుకే ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రాలేదని చెప్పాడు. అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి మినహా మిగతా యూనిట్ అంతా హాజరైంది. దీంతో నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈవెంట్‌కి రాకపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ చందునే క్లారిటీ ఇచ్చాడు.బెడ్ రెస్ట్‘సాయి పల్లవి కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోయింది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది’ అని చందూ మొండేటి తెలిపారు.ఆమీర్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్తండేల్ హిందీ ట్రైలర్‌ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్’ అన్నారు.నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది కీర్తి సురేశ్ (Keerthy Suresh). మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. గీతాంజలి సినిమాతో హీరోయిన్గా మారింది. నేను శైలజ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే బేబీ జాన్‌తో హిందీ బాక్సాఫీస్‌కు పరిచయమైంది.అంకుల్ అని పిలవొద్దుసౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న కీర్తిని ఓ హీరో పిలిచి మరీ తనను అంకుల్ అని పిలవొద్దని చెప్పాడట! ఇంతకీ ఆ హీరో ఎవరంటే మలయాళ నటుడు దిలీప్. 2002లో దిలీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం కుబేరన్. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేశ్. దిలీప్ కూతురిగా నటించిన కీర్తి.. తర్వాతికాలంలో అతడి ప్రేయసిగా నటించింది. రింగ్ మాస్టర్ (2014) మూవీలో దిలీప్ గర్ల్‌ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది. హీరోయిన్గా ఇది ఆమెకు రెండో సినిమా. రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్‌తో కీర్తి సురేశ్ఆయన కూతురిగా, ప్రేయసిగా..ఈ విషయాన్ని కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దిలీప్ (Dileep) సరసన హీరోయిన్గా నటించేందుకు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూనే ఉన్నాను. తనేమీ మారలేదు, అలాగే ఉన్నాడు. రింగ్ మాస్టర్ మూవీలో నేనే తన గర్ల్‌ఫ్రెండ్ అని తెలియగానే నన్ను పిలిచి ఓ మాట చెప్పారు. చిన్నప్పుడు అంకుల్ అని పిలిచేదాన్నని.. అలా మాత్రం పిలవొద్దని కోరాడు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమన్నాడు. నేను వెంటనే సరే చేట్ట అన్నాను. రింగ్‌మాస్టర్ నా మొదటి హిట్ సినిమా అని చెప్పుకొచ్చింది.పేరెంట్స్ సలహాపేరెంట్స్ మేనక-సురేశ్ కుమార్ గురించి చెప్తూ.. 'సినిమాల్లోకి వచ్చేస్తానన్నప్పుడు అమ్మానాన్న నాకు కొన్ని సలహాలిచ్చారు. సమయపాలన పాటించాలని అమ్మ చెప్పేది. తను సమయానికి సెట్లో ఉంటానని నేను కూడా దాన్ని అనుసరించాలని నొక్కి చెప్పింది. సెట్లో పనిచేసేవాళ్ల దగ్గరనుంచి డైరెక్టర్ వరకు అందరికీ ఒకేరకమైన గౌరవం ఇవ్వాలంది.అదే చాలా కష్టంఇండస్ట్రీలో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని అలాగే కాపాడుకోవాలని నాన్న చెప్పాడు. మా ఇంట్లోని వాళ్లందరూ మంచి విమర్శకులు. అమ్మానాన్న కంటే కూడా నా సోదరి నుంచి ప్రశంసలు అందుకోవడం అత్యంత కష్టతరమైన విషయం. నేనేంటో నిరూపించుకోవాలి, వాళ్ల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను' అని కీర్తి చెప్పుకొచ్చింది.చదవండి: క్యూట్ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్.. -
నిజాలు బయటకు రావాలి.. వారిని కఠినంగా శిక్షించాలి: సమంత
ర్యాగింగ్ భూతానికి ఓ కేరళ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన మిహిర్(15)(Mihir) అనే బాలుడు..తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న ఈ ఘటన చోటు చేసుకోకగా.. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత(Samantha) కూడా ఈ ఘటనపై స్పందిచింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాకయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈమేరకు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది స్వార్థం, ద్వేషం కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. వేధింపులు, ర్యాగింగ్ వంటికి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. వీటి వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడు. మన దగ్గర ఎన్నో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. లోలోనే కుమిలి పోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా.నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి’అని సమంత కోరింది. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి.. తన కుమారుడితో తోటి విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారని మిహిర్ తల్లి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మిహిర్‌ను తోటి విద్యార్థులు కొట్టారని, దుర్భాషలాడారని, అతడి చివరి రోజున ఊహించలేని అవమానాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్‌ను ఫ్లష్ చేసి తలని అందులో పెట్టారని, అవన్నీ భరించలేకనే తన క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.మిహిర్ మరణం తర్వాత కూడా వేధింపులు ఆగలేదని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.మ కుమారుడి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి బాధిత తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే మిహిర్ తల్లి ఆరోపణలను సదరు స్కూల్ యాజమాన్యం ఖండించింది. -
అభిమానితో సింగర్ ముద్దులాట.. ఈ వయసులో ఇదేం పని?
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఈయన ఏకంగా లిప్‌కిస్ ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.లైవ్ షోలో..తాజాగా వైరలవుతున్న వీడియోలో ఉదిత్.. స్టేజీపై లైవ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇంతలో ఓ మహిళా అభిమాని అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఫోటో తీసుకోవడంతో పాటు సింగర్ చెంపను ముద్దాడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఉదిత్.. ఏకంగా ఆమె పెదాల్ని ముద్దాడాడు. ఊహించని చర్యతో అభిమాని నోరెళ్లబెట్టింది. ఈ వయసులో ఇదేం పని?69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని జనాలు మండిపడుతున్నారు. కూతురి వయసున్నవారితో ఇలాగేనా ప్రవర్తించేంది? నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్.. ఛీ, ఇంత చీప్ అనుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మొదట ఆ అమ్మాయే తనంతట తానుగా సింగర్ దగ్గరకు వెళ్లిందని.. ఇందులో ఆమె తప్పు కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అటు సింగర్‌కు, ఇటు షోలో అతడి దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు సిగ్గు లేదని తిట్టిపోస్తున్నారు.ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. Can't believe veteran Singer Udit Narayan behaving so lewd in a live concerts show 😔 But my question is Who's more disgusting - Female Audiences or the Artist #UditNarayan? #shameless pic.twitter.com/W6epY8Nmr4— Filmi Woman (@FilmiWoman) February 1, 2025చదవండి: క్యూట్ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్.. -
మల్లన్న సేవలో సినీనటి మీనాక్షిచౌదరి, గోల్డ్‌మ్యాన్ విజయ్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీనటి మీనాక్షి చౌదరి, గోల్డ్‌మ్యాన్ కొండ విజయ్ శుక్రవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించిన మీనాక్షిచౌదరి శ్రీశైలం చేరుకుని మల్లన్నకు రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం రోప్‌వేలో పాతాళగంగకు చేరుకుని బోటింగ్‌లో షికారు చేశారు. హీరోయిన్ మీనాక్షిచౌదరిని చూసిన పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌మ్యాన్ కొండ విజయ్ శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. సుమారు 5 కేజీల బంగారు అభరణాలు ధరించి కొండ విజయ్ స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చారు. గోల్డ్‌మ్యాన్‌ను చూసేందుకు పలువురు భక్తులు పోటీపడ్డారు. -
క్యూట్ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పిల్లలు అర్హ (Allu Arha), అయాన్లకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అందులో పిల్లలిద్దరూ క్యూట్ గెటప్‌లో కనిపించారు. క్లాస్‌మేట్స్‌తో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. అర్హ, అయాన్ తమ స్కూల్ ఈవెంట్లో ఇలా వింత గెటప్‌తో డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. అర్హ ముందు వరుసలో ఉంటే అయాన్ మాత్రం వెనకాల నిల్చున్నాడు.పుష్ప 2తో కలెక్షన్ల ఊచకోతఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. రూ.1800 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. సునీల్, జగపతిబాబు, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాబన్నీ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్నట్లు తెలుస్తోంది. శివుడి కుమారుడు కార్తికేయుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అటు థియేటర్ యాజమాన్యంతోపాటు ఇటు అల్లు అర్జున్ను సైతం అరెస్ట్ చేశారు. దీనిపై బన్నీ కోర్టును ఆశ్రయించగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.చదవండి: గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్ విన్నర్ -
క్రేజీ సినిమా.. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పిన తుంబాడ్ పాత్రలు
కొన్ని సినిమాల్ని చూసినప్పుడు అద్భుతం అనకుండా ఉండలేం. అలాంటి కోవలోకే వస్తుంది తుంబాడ్. బాలీవుడ్ నటుడు సోమహ్ షా నటన సినిమాను మరింత రక్తికట్టించింది. ఇందులో ఆయన నటించడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు. తాజాగా ఇతడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీ పేరు క్రేజీ (Crazxy Movie). ఇందులో సోహమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శనివారం (ఫిబ్రరి 1న) ఈ క్రేజీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తుంబాడ్లోని ఫేమస్ క్యారెక్టర్లు హస్తర్, వినాయక్, బామ్మ పాత్రలతో విడుదల డేట్‌ను రివీల్ చేశారు. క్రేజీ సినిమాకు గిరీశ్ కోహ్లి దర్శకత్వం వహిస్తుండగా సోహమ్ షాతో పాటు ముకేశ్ షా, అమిత్ సురేశ్, ఆదేశ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తుంబాడ్ (2018) విషయానికి వస్తే.. హారర్ జానర్లో సెన్సేషన్ హిట్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Sohum Shah (@shah_sohum) చదవండి: 'మీ తిట్లు విన్నాక ఆ పని పూర్తి చేశా..' ఇంతకీ టైటిల్ అదేనా? -
గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్ విన్నర్
రైతుబిడ్డ బిగ్‌బాస్ ట్రోఫీ గెలవడం విశేషమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను తెలుగు బిగ్‌బాస్ షోలో పల్లవిప్రశాంత్ సాధించగా ఇటీవల కన్నడ బిగ్‌బాస్ షోలోనూ ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్ విజేతగా రైతుబిడ్డ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత (Hanumantha Lamani) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన అతడు అందరి మనసులు గెలుచుకుని బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును సైతం సొంతం చేసుకున్నాడు.గొర్రెలు మేపడమే ఇష్టంఅరకోటి అందుకున్న హనుమంత.. తనకు గొర్రెలు మేపడమే ఇష్టమని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. గొర్రెల్ని మేపడానికి వెళ్లడం నాకెంతో ఇష్టం. అప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పనిని వదిలేయలేను. బిగ్‌బాస్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌ను చాలా మిస్ అవుతున్నాను. భగవంతుడి ఆశీస్సులున్నాయిఅక్కడ ట్రోఫీ గెలిచానంటే అది నా గెలుపు మాత్రమే కాదు. కర్ణాటక ప్రజల విజయం. వారు ఓటేయడం వల్లే నేను గెలిచాను. అలాగే నేను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదాలు నాపై బలంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్లి పాటలు పాడేవాడిని. అందుకే ఈ రోజు నేనిక్కడున్నాను.ఎవర్ని తీసుకొస్తే వారినే..పెళ్లి విషయానికి వస్తే.. అమ్మానాన్న ఎవర్ని ఎంపిక చేస్తే వారినే వివాహం చేసుకుంటాను. నా పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హనుమంతు.. ఈ షో కంటే ముందు సంగీతంతో పరిచయం లేకపోయినా కన్నడ సరిగమప షో 15వ సీజన్లో పాల్గొన్నాడు. తన గాత్రంతో అందర్నీ మైమరిపించి షో రన్నరప్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by 🧿ಹನುಮಂತ ಲಮಾಣಿ🧿 (@hanumantha_lamani_official_) చదవండి: ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను -
'మీ తిట్లు విన్నాక ఆ పని పూర్తి చేశా..' ఇంతకీ టైటిల్ అదేనా?
ఏదైనా సినిమా ప్రకటిస్తే చాలు దాని టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు అభిమానులు. చిత్రయూనిట్ చెప్పేవరకు ఆగట్లేదు. టాప్ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)ని కూడా ఇలాగే విసిగిస్తున్నారట. విజయ్ దేవరకొండ 12వ సినిమా (#VD12) టైటిల్ చెప్తావా? లేదా? అని ఏకంగా బండబూతులు తిడుతున్నారట.తిట్టు భరించాక..ఈ విషయాన్ని నాగవంశీ సోషల్ మీడియాలో వెల్లడించాడు. మీ అందరి తిట్లు భరించాక.. నేను దర్శకుడు గౌతమ్‌ను చాలా హింస పెట్టాక ఎట్టకేలకు ఓ టైటిల్ ఫిక్స్ చేశాం. అదేంటో అతి త్వరలోనే ప్రకటిస్తాం అన్నాడు. అప్పటివరకు ఎదురుచూస్తూ ఉండండి అన్నాడు. అయితే ఆ సినిమా టైటిల్ సామ్రాజ్యం అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!పోలీసాఫీసర్‌గా విజయ్?విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. కల్కి 2898 ఏడీలో ముఖ్య పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది విజయ్ కెరీర్లో 12వ సినిమా. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా విడుదల ఆలస్యం కావచ్చని టాక్ వినిపిస్తోంది.#VD13 సినిమామరోవైపు విజయ్ తన పదమూడో సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారుపీరియాడిక్ మూవీలో విజయ్విజయ్ తన పద్నాలుగో సినిమాను శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో చేస్తున్నాడు. బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.చదవండి: వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? -
ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను
‘‘నేను 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే సినిమా రంగంలోని వారు ఎలా ఉంటారనే విషయం అప్పటికి నాకు తెలియదు. ఓ దర్శకుడు నా కాస్ట్యూమ్స్ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలకి బాధపడి, డిప్రెషన్లోకి వెళ్లాను’’ అని హీరోయిన్ ప్రియాంకా చోప్రా అన్నారు. ఇటీవల జరిగిన ఓ సమ్మిట్‌లో ΄పాల్గొన్న ప్రియాంకా చోప్రా కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘటనల గురించి మాట్లాడారు. ‘‘ఓ సినిమా షూటింగ్ కోసం సెట్‌కి వెళ్లాను.నాకు ఎలాంటి దుస్తులు కావాలో నా కాస్ట్యూమ్ డిజైనర్‌కు చెప్పండి అని డైరెక్టర్‌తో అన్నాను. నా ముందే నా కాస్ట్యూమ్ డిజైనర్‌కి ఫోన్ చేసిన ఆయన... ‘కథానాయిక లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. అందుకే ప్రియాంక దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.. తన లోదుస్తులు కనిపించాలి’ అంటూ పలుమార్లు ఆ పదాన్ని ఉపయోగించాడు.ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా, బాధగా అనిపించింది. దీంతో నేను డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆ డైరెక్టర్ నన్ను చిన్నచూపు చూస్తే ఆ సినిమా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత ఆ మూవీ చేయలేదు. ఇన్నేళ్ల నా కెరీర్లో ఇప్పటివరకు కూడా ఆ దర్శకుడితో పని చేయలేదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. -
యమ్మీ... యమ్మీ...
జనరల్‌గా డిన్నర్ లైట్‌గా తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. హీరోయిన్ ఇమాన్వీ కూడా ఇంచు మించు ఇదే టైప్. అయితే గురువారం డిన్నర్‌ని మాత్రం లైట్‌గా కాకుండా ఓ పట్టు పట్టారు. మరి... కళ్ల ముందు పదికి పైగా నోరూరించే వంటకాలు కనిపిస్తే లాగించకుండా ఉంటారా! అది కూడా హీరో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలాయె. ఆ విషయంలోకి వస్తే... ప్రభాస్ సరసన ఓ కథానాయికగా ఇమాన్వీ నటిస్తున్న ‘ఫౌజీ’ (పరిశీలనలో ఉన్న టైటిల్ అని సమాచారం) చిత్రం తాజా షెడ్యూల్ రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆరంభమైంది.ముందు ఇమాన్వీ ΄పాల్గొన్నారు. గురువారం నుంచి ప్రభాస్ కూడా ΄పాల్గొంటున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్న ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి గురువారం డిన్నర్‌కి తన ఇంటి నుంచి భోజనం తెప్పించారు. అవి ఆరగించి, ఆ వంటకాల వీడియో షేర్ చేసి, ‘‘ఈ యమ్మీ యమ్మీ... మంచితనానికి థ్యాంక్యూ ప్రభాస్’’ అని పేర్కొన్నారు ఇమాన్వీ. ఇక హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతోందని సమాచారం. -
వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: రాచరికంనటీనటులు: వరుణ్ సందేశ్,అప్సరా రాణి, విజయ్ శంకర్ తదితరులుడైరెక్టర్: సురేష్ లంకలపల్లినిర్మాత: ఈశ్వర్నిర్మాణ సంస్థ: చిల్ బ్రాస్ ఎంటర్టైన్మెంట్ఎడిటర్: జేపీసినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణసంగీతం: వెంగీవిడుదల తేదీ: 31 జనవరి 2025వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్తో ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం.రాచరికం కథేంటంటే..? 1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ కథ మొదలవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్ఎస్ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా తీశారంటే..దర్శకుడు సురేష్ లంకలపల్లి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసినట్టు అనిపించింది. అయికే కథ, కథనం ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగుతుంది. ఇక చాలా వరకు సీన్లు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం. రాచరికం మంచి పొలిటికల్ డ్రామాగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండటం, ఎమోషన్స్ కనెక్ట్ కావడం బాగా కలిసొచ్చింది.ఎవరెలా చేశారంటే..నటుడు వరుణ్ సందేశ్ తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ చిత్రంలోని వరుణ్ యాక్టింగ్ అంతా కూడా కొత్తగా అనిపించింది. ఆడియన్స్‌ను వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్సర రాణి మూడు విభిన్న షేడ్స్‌లో అందరినీ మెప్పించింది. హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్‌తో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ రోల్‌గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు. నిర్మాత ఈశ్వర్ ఆర్ఎస్ఎఫ్ లీడర్‌గా అసాధారణమైన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తనదైన నటనతో మరోసారి అలరించాడు. విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రాచీ ఠాకర్,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. వెంగీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'అమిర్ ఖాన్‌తో వెయ్యి కోట్ల సినిమా'.. తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ కామెంట్స్
అక్కినేని నాగచైతన్య తండేల్(Thandel Movie) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమిర్ ఖాన్(Amir Khan) గజిని (Ghajini)సినిమాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అప్పట్లో గజిని రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచిందన్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అమిర్ ఖాన్ మాతో ఛాలెంజ్ చేశారని గుర్తు చేసుకున్నారు. కచ్చితంగా వందకోట్లు రాబడుతుందని అన్నారని.. అందుకే మేం ప్రమోట్ చేసినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఇవాళ ముంబయిలో జరిగిన తండేల్ హిందీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అయితే ఈవెంట్లో అల్లు అరవింద్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అప్పుడు రూ.100 కోట్లు ఎక్కువని.. ఇప్పుడైతే రూ.1000 కోట్లు రాబట్టే సినిమా తీయాలనుందని ఆయన అన్నారు. అది గజిని-2 కూడా కావొచ్చని అరవింద్ నవ్వుతూ మాట్లాడారు. అయితే కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన గజిని చిత్రాన్ని హీందీలో రీమేక్ చేశారు. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన గజిని.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. మరోవైపు గజిని-2 కూడా ఉంటుందని గతంలో సూర్య హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల తెలుగులో ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా హిందీలోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్స్ట్ బ్యానర్లో బన్నీవాసు నిర్మించారు. -
'నా మనసుకు ఇంకా గాయం..' మహాకుంభమేళాలో పవిత్ర గౌడ
అభిమాని రేణుకాస్వామి హత్య కేసు నిందితులు హీరో దర్శన్ (Darshan), అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) ఆలయాల బాటపట్టారు. దైవభక్తిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా పవిత్రగౌడ మహాకుంభమేళాకు వెళ్లింది. మౌని అమావాస్య రోజు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆశీర్వాదం..ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళా (Mahakumbh 2025)లో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్ ఎనర్జీ నుంచి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను. హరహర మహాధేవ్ అని క్యాప్షన్ జోడించింది. ఒకరి కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ నెటిజన్లు నటిని తిట్టిపోస్తూనే ఉన్నారు. దీంతో ఆమె మరో పోస్ట్ పెట్టింది.మరింత బాధ, శోకం..మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. ఒకవేళ మొదట అన్యాయం విజయం సాధించినా చివరకు గెలిచేది మాత్రం మతమే! నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా సైట్స్‌కు థాంక్స్. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత బాధకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official)చదవండి: సన్యాసిగా మారిన హీరోయిన్‌పై బహిష్కరణ వేటు -
'పుష్ప కంటే కాటేరమ్మే నయం'.. ఆ విషయంలో నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతంలో ఎప్పుడులేని విధంగా పలు రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజ్ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్‌లో మొదటిస్థానంలో ఉంది.అయితే పుష్ప-2 తాజాగా ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుడా ఇటీవల అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కు కల్పించారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీలో పుష్ప-2 చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ రప్పా రప్పా గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. గాల్లో తేలుతూ అల్లు అర్జున్ ఫైట్ చేసిన సన్నివేశాలైతే ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.అయితే క్లైమాక్స్ సీన్‌పై ఒక పక్క ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ ఫైట్స్ సీక్వెన్స్‌ను ప్రభాస్ సలార్ మూవీ కాటేరమ్మ ఫైట్ సీన్‌తో పోలుస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఈ ఫైట్ సీన్‌ను కామెడీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది మాస్ హీరో సన్నివేశమా లేదా కామెడీ సన్నివేశమా? అని కామెంట్స్ చేస్తున్నారు. గాల్లోకి ఎగిరి ఫైట్ చేయడం చూస్తుంటే నవ్వడం ఆపుకోలేకపోయానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే నేను బట్టలు ఉతుక్కోవడం ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశారు.కాటేరమ్మ > రప్పా రప్పాపుష్ప-2 క్లైమాక్స్ ఫైట్ (రప్పా రప్పా) కంటే ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ చాలా బాగుందని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'రప్పా రప్పా' ఫైట్ సీన్ 'ఓవర్ ది టాప్' ప్రశంసించాడు. అయినప్పటికీ పుష్ప 2 క్లైమాక్స్ చాలా ఓవర్‌గా ఉంది. సలార్ కాటేరమ్మ సీన్ అదిరిపోయిందని తెలిపాడు. ఇది పుష్ప ఫైట్ కంటే కాటేరమ్మ సీక్వెన్స్‌కు ఎక్కువ రిపీట్స్ ఉన్నాయని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అల్లు అర్జున్ గొప్పగా చేసినప్పటికీ రప్పా రప్పా కంటే కాటేరమ్మ సీన్ ఎక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు.In my opinion,Pushpa 2 climax was more over the top.Salaar kaateramma scene was worth it.It has a greater number of repeats than rappa sequence of pushpa.It's what I really felt.Nonetheless, AA did a great job.But for me,Kaateramma > Rappa#Salaar #Pushpa2 https://t.co/9DnePiuTtA— Sandeep (@02Sandeepdyh) January 31, 2025 How to Watch Pushpa 2 Without Regretting It:1. Intro Scene: Skip it entirely and jump straight to his wake-up scene.2. Songs: Whenever a song pops up, just fast-forward to the next scene.3. Climax Fight (Rappa Rappa): Do yourself a favour. Skip it completely (highly…— 𝓚𝓻𝓲𝓼𝓱𝓪𝓿 (@haage_summane) January 31, 2025 -
'కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్' అంటోన్న విశ్వక్ సేన్.. ఈ మాస్ సాంగ్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) నటించిన తాజా చిత్రం లైలా(Laila). ఈ మూవీ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించునున్నారు మాస్ హీరో. ఈ సినిమాకు రామ్ నారయణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ మూవీలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది.ఈ నేపథ్యంలో లైలా మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓహో రత్తమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్‌కు పెంచల్ దాస్ లిరిక్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ మధుప్రియ, పెంచల్ దాస్ ఆలపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే మాస్ ఆడియన్స్‌ను తెగ ఊపేస్తోంది ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ ఎత్తుగడలో ఈ మధ్య బాగా వైరలైన 'కోయ్ కోయ్ కోడ్‌ని కోయ్' అనే లిరిక్స్ వాడడంతో ఈ సాంగ్ తెగ వైరలవుతోంది.లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్..ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు విశ్వక్ సేన్. ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే సోనూ మోడల్, లైలాగా అభిమానులను పలకరించనున్నాడు. ఇటీవలే లైలా మేకోవర్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డారో దాదాపు రెండు గంటల పాటు కష్టపడినట్లు వివరించారు. కాగా.. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Mass vibe shuruuu! 😎Here's the massiest folk number #OhoRathamma from #Laila 🔊🕺💥▶️ https://t.co/DC4OjBYYlmA @leon_james musical Sung by #PenchalDas and #MadhupriyaLyrics by #PenchalDasGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma… pic.twitter.com/kAZJDM4eCr— VishwakSen (@VishwakSenActor) January 31, 2025 -
సన్యాసిగా మారిన హీరోయిన్‌పై బహిష్కరణ వేటు
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta Kulkarni)కి షాక్ తగిలింది. ఆమెను కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరించారు. మహామండలేశ్వర్‌గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. మత పెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిన్నార్ అఖాడా వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ వెల్లడించారు. ఆమెకు ఏకంగా మహామండలేశ్వర్ హోదాను ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. మమతా కులకర్ణితో పాటు ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి (Laxmi Naarayan Tripathi)పైనా బహిష్కరణ విధించారు.ఇటీవలే సన్యాసం.. ఇంతలోనే..ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నార్ అఖాడా గురువు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాసం తీసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మహామండలేశ్వర్ హోదాను ఇచ్చారు. అలాగే ఆమె పేరును శ్రీయామై మమతానందగిరిగా మార్చారు. హీరోయిన్ను అఖాడాలో చేర్చుకోవడమే ఇబ్బందికరం అంటే తనకు ఆరంభంలోనే అంత పెద్ద హోదా ఎలా ఇస్తారని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.సడన్‌గా సన్యాసమేంటో? బిరుదేంటో?యోగా గురువు రాందేవ్ బాబా సైతం.. మహా పవిత్రమైన కుంభమేళాలో కొందరు వ్యక్తులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయినవారు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోవడంతో పాటు మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మమతా కులకర్ణితో పాటు గురువు లక్ష్మీనారాయణ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంపై లక్ష్మీనారాయణ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ దాస్ అఖాడా నుంచి బయటకు వెళ్లి కుటుంబంతో నివసిస్తున్నాడని, కావున ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు లేదని తెలిపారు.చదవండి: వీల్‌చైర్‌లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి. -
వీల్‌చైర్‌లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేతిలో అరడజను సినిమాలున్నాయి. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్న రష్మికకు ఇటీవల సడన్ బ్రేక్ పడింది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో గాయపడింది. ఇంకా ఆ గాయం నుంచి ఆమె కోలుకోలేకపోతోంది. ఓ పక్క గాయం తనను ఇబ్బందిపెడుతున్నా సరే పనికి మాత్రం విశ్రాంతి ఇవ్వనంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో జరిగిన ఛావా (Chhaava Movie) ఈవెంట్‌కు హాజరైంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్‌చైర్‌లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. ఆమె సహకారంతో అతడు.. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడాడు. అటు రష్మిక డెడికేషన్‌ను, ఇటు విక్కీ కౌశల్ మంచిగుణాన్ని అభిమానులు పొగడకుండా ఉండలేకపోతున్నారు. బిజీగా ఉన్నా, డేట్స్ కుదర్లేదంటూ ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టేవాళ్లే చాలామంది.. కానీ రష్మిక గాయంతో బాధపడుతున్నా సరే ఈవెంట్‌కు రావడం గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు.రష్మిక కెరీర్..‘చూసీ చూడంగానే నచ్చేశావే..’ అని రష్మికాను ఉద్దేశించి పాట పాడుకున్నారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా ఆకట్టుకుందామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ది గాళ్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీకి డైరెక్షన్ చేయనున్నాడు.సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ తనే హీరోయిన్. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ రష్మిక భాగమైంది.అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో ఈ బ్యూటీ హీరోయిన్గా చేసింది. ఛత్రపతి శివాజీ తనయుడు సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సాంబాజీని చావా (మరాఠీలో పులి బిడ్డ అని అర్థం) అని పిలుస్తారు. చావా మొదటి భార్య యేసుబాయ్గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. The dedication with which #RashmikaMandanna is promoting this movie will be remembered in the future, showing how serious she is about her work. Despite her current condition, she came to promote the movie in a wheelchair. I'm confident that the pairing of #VickyKaushal and… pic.twitter.com/E4aM1EQ19P— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 31, 2025చదవండి: శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య -
నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్‌తో పాటు తండేల్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ కథేంటంటే...శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK— Geetha Arts (@GeethaArts) January 31, 2025 -
ఓటీటీకి వచ్చేసిన త్రిష క్రైమ్ థ్రిల్లర్.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్‌లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
సైఫ్‌పై దాడి చేసింది అతడే..! గుర్తించిన అత్యాధునిక టెక్నాలజీ
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు.ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు. దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లామేనని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నిర్ధారించినట్లు వెల్లడించారు. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదన్న ప్రచారం నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ నిర్ధారణ కీలకంగా మారింది. కాగా,జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు నిందితుడు ముంబయి బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. దాడి అనంతరం నటుడి ఇంటిని పరిశీలించిన పోలీసుల బృందం అక్కడి నుంచి సుమారు 19 వేలిముద్రలను సేకరించింది. ఈ ఫింగర్ ప్రింట్స్లో ఏవీ నిందితుడు ఇస్లాం ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోవడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరిగడంతో దర్యాప్తుకు బ్రేక్ పడింది. నిజానికి సైఫ్ ఇంట్లోకి నిందితుడు ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని ఈ క్రమంలో అడ్డుకున్న సైఫ్‌తో తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. -
శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య
లవ్‌స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి మరోసారి జత కట్టిన మూవీ తండేల్ (Thandel Movie). కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా..వైజాగ్ తనకు స్పెషల్ అని.. అక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అన్నాడు. వైజాగ్ తనకు ఎంత క్లోజ్ అంటే వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే ఉందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చై.. వైజాగ్ రూలింగ్ పార్టీ గురించి మాట్లాడాడు. వైవాహిక జీవితం చాలా బాగుంది. ప్రస్తుతం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. మా పెళ్లయి కొన్ని నెలలే అవుతోంది. ఈ సమయంలో ఇద్దరం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మాకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకుంటున్నాం. (చదవండి: 93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!)అదే మమ్మల్ని ఒకటిగా..వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ ఉన్న సేమ్ లక్షణాల్లో ఇదీ ఒకటి. అలాగే సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. జీవితంపైనా మాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది. మాకు ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టం. భవిష్యత్తులో శోభిత, నేను ఒకే సినిమాలో కలిసి నటిస్తామా? లేదా? అన్నది నేనిప్పుడే చెప్పలేను. మంచి స్క్రిప్ట్ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాం అన్నాడు.గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పొరపచ్చాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. గతేడాది హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్ -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన హీరోహీరోయిన్లు లేని సినిమా
ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్"( Coffee With A Killer). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించిన ఈ చిత్రంలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ‘ఆహా’(AHA)లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ...‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ గ. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది. నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాం’అన్నారు.నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కొన్ని కథలో మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతుంది. చూసి ప్రేక్షకులంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ లోను ట్విస్టులు ఉంటాయి. డబ్బింగ్ కూడా ఎంతో బాగా వచ్చింది. ఆర్ బి గారితో పని చేయడమే కాదు ఆయన దగ్గర ఉండటం కూడా ఎంతో ఆనందకరం’ అన్నారు.టెంపర్ వంశీ మాట్లాడుతూ...‘ఆర్ పి గారు నన్ను ముఖ్య పాత్రలో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పగానే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నన్ను పెట్టి సినిమా తీయడం ఏంటి అని. ఆయన ఆలోచన చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎక్సైట్ గా అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆహలో ఈ చిత్రాన్ని చూడండి’అన్నారు. -
ఓటీటీకి మోస్ట్ వయొలెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో(Marco). ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా మలయాళంతో(Malayalam Movie) పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT) విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.మార్కో కథేంటంటే..?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్
దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మదగజరాజా. ఈ చిత్రంలో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్రం జనవరి 31 తెలుగులో విడుదలైంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేంటో తెలుసుకుందాం.గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి తర్వాత తన కోసం పూర్తిగా మారిపోయాడని తెలిపింది. నా కోసం ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారని పేర్కొంది. ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారని వెల్లడించింది. నా కోసం ఆయన తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నారని వివరించింది.ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ..'నికోలయ్‌తో పెళ్లి తర్వాత నా జీవితం ఏమీ మారలేదు. నాకోసం అతని జీవితాన్నే పూర్తిగా మార్చుకున్నాడు. నా కోసం ఆయనే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. అంతేకాదు తన పేరును నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నారు. నా కెరీర్ పరంగా ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనుకునేదాన్ని. కానీ నికోలయ్‌తో పరిచయం తర్వాత నా జీవితానికి అతనే సరైన భాగస్వామి అని అర్థమైంది. అలా పెద్దల అంగీకారంతో వివాహాబంధంలోకి అడుగుపెట్టాం' అని చెప్పింది. సినిమాల విషయానికొస్తే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వీరసింహారెడ్డి, కోట బొమ్మాళి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీలోనూ కీలకపాత్ర పోషించింది.పెళ్లి తర్వాత నా కోసం మా ఆయన చాలా మార్చుకున్నాడు - Actress #VaralaxmiSarathkumar#NicholaiSachdev #MadhaGajaRaja #TeluguFilmNagar pic.twitter.com/doquPrV0ft— Telugu FilmNagar (@telugufilmnagar) January 31, 2025