-
మోజు తీర్చుకుని మొహం చాటేసిన టీడీపీ నేత..
తాడిపత్రి/రూరల్: యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని మోజు తీర్చుకున్నాక మొహం చాటేశాడో టీడీపీ కౌన్సిలర్. పెళ్లి చేసుకోమని నిలదీస్తే బాధితురాలిపైనే దాడి చేశాడు. దీంతో ఆమె సోమవారం అనంతపురం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సూచన మేరకు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలల క్రితం వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. యువతిని ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి తనకు తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు. అనంతరం ఆమెతో సహజీవనం చేశాడు. యువతి రెండు సార్లు గర్భం దాల్చగా, ఇప్పుడే పిల్లలు ఎందుకు అంటూ అబార్షన్లు కూడా చేయించాడు. ఇటీవల యువతికి అనుమానమొచ్చి మల్లికార్జున సెల్‌ఫోన్ పరిశీలించగా, వాట్సాప్‌లో మరో మహిళతో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. దీనిపై మల్లికార్జున ప్రశ్నిస్తే కొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మల్లికార్జునతో సంబంధం పెట్టుకున్న మహిళ కూడా రంగంలోకి దిగింది. తను మల్లికార్జునతో తీయించుకున్న ఫొటోలను బాధిత యువతి సెల్‌ఫోన్‌కు పంపింది. వారం క్రితం మళ్లీ యువతి ఇంటికి వచ్చిన మల్లికార్జున మాయమాటలు చెప్పి రెండు రోజులు గడిపాడు. వివాహం చేసుకోమని ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు చెబితే భూమిపైనే లేకుండా చేస్తానంటూ బెదిరించాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనతోనే జీవితం అంటూ చెప్పాడు. దీంతో ఆమె మల్లికార్జున ఇంటికి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వివరించింది. సర్దిచెప్పాల్సిన వారు కూడా దౌర్జన్యం చేశారు. యువతిని కొట్టి పంపించారు. దీంతో యువతి కుమిలికుమిలి ఏడ్చింది. తెలిసిన వారి సూచన మేరకు సోమవారం అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గోడు వెళ్లబోసుకుంది. ఆయన సూచన మేరకు తాడిపత్రి పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనలాంటి వారి జీవితాలతో ఆటలాడుతున్న మల్లికార్జునపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. -
పెళ్లి పేరుతో సీరియల్ నటి మోసం
సీతంపేట : అత్తారింటికి దారేది, పలుకే బంగారమాయే సీరియల్ ఫేం అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యామ్‌కుమార్ ఆరోపించాడు. పెళ్లికి ముందే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుందన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సోమవారం శ్యామ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మ్యాట్రిమోనియల్ ద్వారా పెద్దలు సంబంధం కుదర్చడంతో 2023 సెప్టెంబర్ 6న విశాఖలో ఐశ్వర్యతో తనకు పెళ్లి జరిగిందని తెలిపారు. అక్టోబర్ 7న హైదరాబాద్‌లో ఐశ్వర్య ఇంటికి వెళ్లామని, అయితే ఆ ఇంట్లో ఆమె స్నేహితుడు డ్రింక్ చేస్తూ కనిపించాడన్నారు. దీంతో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. మరుసటి రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణం రమేతో ఐశ్వర్య ఉండటం చూశానని, నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని ఐశ్వర్య తల్లిదండ్రులు తనను బలవంతంగా విశాఖ పంపేశారని వెల్లడించాడు. ఆ తర్వాత కరణం రమేష్ తనకు ఫోన్ చేసి ఐశ్వర్యకు విడాకులు ఇవ్వాలని, లేదంటే గొడవలు జరుగుతాయని హెచ్చరించాడన్నారు. విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళితే.. కట్నం కోసం తన కుటుంబం వేధిస్తున్నట్టు పెందుర్తి పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తిరిగి తన కుటుంబంపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని శ్యామ్‌కుమార్ కోరాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగారని ఆరోపించాడు. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి ఖర్చులకు తామే డబ్బులు ఇచ్చామని తెలిపాడు. మీడియా సమావేశంలో శ్యామ్‌కుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది. ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ సోషల్ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్యాయంగా పలకరించేది.. మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. – అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి జీవితంలో మర్చిపోలేనంటూ.. మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా. – షేక్ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి -
జనసేన మహిళా నేతపై దాడి
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్‌ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నట్టు సమాచారం. -
సోషల్ మాఫియా c/o టీడీపీ - జనసేన
మేలు చేసిన సీఎం, ఎమ్మెల్యేలను మెచ్ఛుకోవడమే ఆమె చేసిన పాపం. చాన్నాళ్ళ కు ఓ గూడు దొరికిందన్న సంతోషాన్ని మిగల్చకుండా సోషల్ మీడియా ముసుగులో టీడీపీ- జనసేన రాబందులు వాలిపోయాయి. ట్రోల్స్ తో పీక్కు తిన్నాయి. అవమానాలు తట్టుకోలేక ఆ మహిళ ఆఖరుకు ఉసురు తీసుకోవడమే మేలు అనుకుంది. రైలు చక్రాల కింద నలిగి పోయింది. సాక్షి, గుంటూరు: టీడీపీ, జనసేన వేధింపులు ఓ మహిళ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలో ఇంటి స్థలం గురించి మాట్లాడిన మహిళను మానసికంగా హింసించి ఆమె చావుకు యమపాశంగా మారాయి. ఇళ్ల పట్టా వచ్చిందన్న ఆనందంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లను మెచ్చుకుంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడటమే ఆ మహిళ పాలిట శాపమైంది. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ టీడీపీ, జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా అవమాన భారం తట్టుకోలేక రైలు కింపడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గుల్టి గీతాంజలి దేవి(29) గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతున్నారు. తెనాలిలోని ఇస్లాంపేటలో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తెకు నాలుగు సార్లు ‘అమ్మ ఒడి’ వచ్చింది. ఈమెకు ఇటీవల జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. ఈనెల 4వ తేదీన కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంది. ఆ తర్వాత తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకుంది. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని, స్వంత ఇళ్లు అనేది అందరి కల అని, ఇళ్ల స్థలం పొందడం ద్వారా తన కల నెరవేరిందంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. తన పిల్లలకు అమ్మ ఒడి కూడా వస్తోందని, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మళ్లీ గెలిపించుకోవడం తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలను కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలు వివరీతంగా ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టారు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన గీతాంజలి రెండు రోజుల క్రితం తెనాలి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం తుదిశ్వాస విడిచింది. అయితే ఒక బీసీ మహిళ.. కేవలం ఇళ్ల పట్టా వచ్చిందన్న తన ఆనందాన్ని పంచుకోవడమే ఆమె చేసిన తప్పా అంటూ పలువురు ప్రశ్నిస్తుండగా టిడిపి సోషల్ మీడియానే దారుణమైన ట్రోల్స్ చేసి ఆమెను బలితీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మాఫీయా కేరాఫ్ ‘టీడీపీ - జనసేన’ ‘వాలంటీర్లు మాకు బీడీ కట్ట తెచ్చి పెడతారా, ఓయి వాలంటీర్ నాకు కండోమ్ తెచ్చిపెడతావా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన విషప్రచారంతో చేస్తున్న సేవలో కూడా హేళన ఎదుర్కొని మనస్తాపంతో మొన్న వాలంటీర్ నవీన చనిపోతే.. నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్ నేర్చుకున్న నిరుపేద మేఘన అనే బాలిక తెలుగుదేశం, జనసేన చేసిన ట్రోల్స్‌తో మానసిక వేదనకు గురైంది. నేడు ప్రభుత్వం నుంచి లబ్ది పొందాను అంటూ ధైర్యంగా చెప్పిన పాపానికి తెలుగుదేశం, జనసేన ట్రోల్ పేజీల మాఫీయా వేదింపులకి గీతాంజలి ప్రాణాలు తీసుకుంది. తమ రాజకీయ స్వలాభం కోసం, అసత్యాలను ప్రచారం చేస్తూ, అది తప్పు అని చెప్పిన సామాన్యులపై దుషణలకు దిగే సోషల్ మాఫీయాలను కోట్లు వెచ్చింది పెంచి పోషిస్తున్న తెలుగుదేశం జనసేన మాఫీయాని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది.’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...కోపంతో తండ్రి...
కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కందుల వంశీ, అదే గ్రామానికి చెందిన అత్తి శ్రావణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి శ్రావణి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో... వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహంతో వంశీ ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి శ్రావణిని ఎత్తుకెళ్లారు. -
టీడీపీ, జనసేన రౌడీమూకల విధ్వంసకాండ
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టావారిపాలెంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు విధ్వంసం సృష్టించారు. మద్యం తాగి గొడ్డళ్లు, ఇనుపరాడ్లు చేతపట్టుకుని అర్ధరాత్రి వేళ వైఎస్సార్సీపీకి చెందినవారి బైక్‌లను ధ్వంసం చేశారు. పుట్టావారిపాలెంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు రౌడీలు మద్యం తాగి శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గొడ్డళ్లు, ఇనుప రాడ్లు పట్టుకుని వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి హల్చల్ చేశారు. ఇళ్ల ముందు నిలిపిన 20 బైకులను ధ్వంసం చేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రౌడీలు తమ బైక్‌లను వదిలి పారిపోయారు. గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి 11 బైక్‌లు, ఇనుపరాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ దురాగతానికి పాల్పడిన రౌడీమూకలను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ పైనం ఏడుకొండలరెడ్డి, స్థానిక సర్పంచ్ మొగలిపువ్వు కోటేశ్వరరావు పోలీసులను కోరారు. -
విశాఖలో నకిలీ ఎస్ఐల ఘరానా మోసం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): పోలీసు ఎస్సైల వేషమేసి, పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. బాధితుల కథనం ప్రకారం.. మోసాలతోనే బతికే హనుమంతు రమేష్ (47) అడవివరంలోని ఆర్ఆర్ టవర్స్‌లో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా ఇటీవల మరో ప్రియరాలితో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు. హనుమంతు, ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్సైల గెటప్‌లో రావడంతో వారంతా నమ్మేశారు. దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దండుకొని మాయమయ్యారు. హైదరాబాద్‌లో అదుపులోకి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్ సూచనలతో టాస్‌్కఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్ ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిద్దరినీ గురువారం సాయంత్రం టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
టీడీపీ నేత బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో టీడీపీ నేత కబ్జాచేసిన పెన్నా పొరంబోకు భూములను బుధవారం అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 30 ఎకరాలు ఆక్రమించి దాదాపు 1,400 ప్లాట్లు వేసిన ఆ నేత ఇప్పటికే కొన్ని అమ్మి రూ.15 కోట్లు సొమ్ముచేసుకున్నారు. మిగిలిన ప్లాట్లను పేదలకు పంచుతున్నానంటూ చీటీలు పంపిణీ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వచ్చిన రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు.. పోలీసుల సహకారంతో ఆ భూమిని స్వా«దీనం చేసుకుని జేసీబీతో హద్దురాళ్లను తొలగించారు. కోడూరుపాడుకు చెందిన టీడీపీ నేత కోడూరు కమలాకర్‌రెడ్డి గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 550, 411, 435, 538, 39, 40లోని 30 ఎకరాల పెన్నా పొరంబోకు స్థలంపై కన్నేశారు. దీన్లో కొంత భూమిని గతంలో దళితులకు డి–ఫారం పట్టాగా పంపిణీ చేశారు. వారు ఆ భూముల్ని సాగుచేసుకుంటున్నారు. ఇక్కడ ఎకరా ధర రూ.రెండుకోట్ల వరకు ఉంది. ఈ మొత్తం భూమిని ఆక్రమించిన కమలాకర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తానని గత ఏడాది అందరినీ నమ్మించారు. రోడ్లు ఏర్పాటుచేసి దాదాపు 1,400 ప్లాట్లతో లే అవుట్ వేశారు. కొన్ని ప్లాట్లను రూ.రెండులక్షల నుంచి రూ.నాలుగు లక్షలకు విక్రయించి దాదాపు రూ.15 కోట్లు సొమ్ము చేసుకున్నారు. తాజాగా మిగిలిన ప్లాట్లను పేదలకు పంపిణీ చేస్తానంటూ చీటీలు అందజేశారు. చీటీలు అందుకున్నవారిలో ఆయన అనుచరులు, వారి సంబందీకులే 300 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారుల ఆందోళన పెన్నా పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేశారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వస్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఆక్రమణదారులపై చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ నేత వద్ద రూ.నాలుగు లక్షలకు ప్లాట్లను కొనుగోలు చేశామని, తమ పరిస్థితి ఏమిటంటూ అక్కడ పదిమంది ఆందోళన చేశారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసే హక్కు ఎవరికీలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో వారు వెనుదిరిగారు. -
భర్త చెంపపై కొట్టడంతో భార్య మృతి
కొవ్వూరు: డ్వాకా రుణ వాయిదా చెల్లింపు విషయంపై తగదా పడి భార్యను భర్త చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సండ్ర వీరబాబు, భార్య లావణ్య సాయి దీపిక(30)తో డ్వాక్రాలో తీసుకున్న రుణం చెల్లింపు విషయంపై వారం నుంచి తగదా పడుతున్నాడు. మంగళవారం ఉదయం వాయిదా డబ్బులు ఇవ్వాలని భార్య మరోసారి అడగడంతో కోపోద్రిక్తుడైన వీరబాబు ఆమెను చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే పడి మృతి చెందినట్లు స్ధానికులు చెబుతున్నారు. ఈ విషయం వీరబాబు అత్తమామలకు ఫోన్ చేసి జరిగిన ఘటనకు గురించి తెలిపాడు. వీరబాబుకి, లావణ్యకి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు వీరబాబే లావణ్యను హత్య చేశాడని ఆరోపించారు. పెళ్లి అయినప్పటి నుంచి వీరబాబు తన కుమార్తెను సక్రమంగా చూసుకోలేదని, ఎన్నో బాధలు పెట్టారని తల్లి బడేటి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. డీఎస్పీ కె.సీహెచ్ రామరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు అని తెలుస్తోంది. ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్‌కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు. -
వారు ప్రేమికులే
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని కటికి రహదారి కరకవలస గ్రామ సమీపంలోని ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన యువతీ యువకులు ప్రేమికుల జంట అని, ఇద్దరూ మైనర్లని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట గ్రామానికి చెందినవారు. మృతుల వద్ద దొరికిన వివరాలు, వారి స్వస్థలంలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా వారి ఆచూకీని సేకరించారు. మృతులను చైతన్య (17), జ్యోతి (14)లుగా గుర్తించారు. యువతి 9వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ గత మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారం రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి, ఆదివారం అనంతగిరి మండలం కటికి జలపాతాన్ని సందర్శించి, సాయంత్రం ఓ చెట్టు వద్ద ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలకు సోమవారం అరకు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఈనాడు ఒత్తిళ్లతో మహిళా ఉద్యోగి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది. ఆదివారం సరదాగా గడిపి.. ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
నారాయణ ‘నల్ల’ పుట్ట!
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్‌స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్‌స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఎన్‌స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్‌స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్‌స్పై నిర్వాకాలు ఇవిగో.. నిధులు మళ్లించేందుకే.. నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు. అమరావతి భూ దందా.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్‌స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్‌స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్‌స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్‌స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్‌లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు. ఓ వ్యాపార సంస్థ ఎన్‌స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్‌స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్‌స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు. నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్‌స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 కోట్ల పన్నుల ఎగవేత లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్‌స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్‌ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే!
సాక్షి, అమరావతి: ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే హత్య చేయించి ఉండొచ్చు. ఈ హత్య వెనుకనున్న ఏదో విషయాన్ని దాచిపెట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. వివేకం సార్ రెండో పెళ్లితో ఆ ఇంట్లో తలెత్తిన ఆస్తి గొడవలకు ఆయన హత్యకు ఏదైనా సంబంధం ఉందా.. అనిపిస్తోంది. కూతురు, అల్లుడు, పెద్ద బావమరిదే ఈ దారుణానికి తెగించి ఉండొచ్చు’.. అని వైఎస్ వివేకానందరెడ్డి పీఏగా చేసిన ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ‘వివేకానందరెడ్డి రాసిన లెటర్ పోలీసులకు వెంటనే ఇచ్చేసి ఉంటే దర్యాప్తు సక్రమంగా సాగేది. కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎందుకు చెప్పారు? ఈ కేసుతో సంబంధంలేని ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల పేర్లు చెప్పాలని నన్ను ఎందుకు బెదిరించారు? నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని సునీత ఎందుకు అన్నారని కూడా ఆయన వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకానందరెడ్డిని పాశవికంగా హత్య చేశానన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం ఏమిటీ? అతను చెప్పే కట్టుకథలను పట్టుకుని సీబీఐ దర్యాప్తు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చివరివరకు కూడా వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే కృషిచేశారని ఆయన స్పష్టంచేశారు. వివేకాకు పీఏగా దాదాపు 37ఏళ్ల పాటు పనిచేసిన కృష్ణారెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తునిగా గుర్తింపు పొందారు. ఆయన కుటుంబ వ్యవహారాలతో సహా అన్ని విషయాలు సమగ్రంగా తెలిసిన వ్యక్తి. 2019, మార్చి 15 ఉదయం వివేకానందరెడ్డి మృతిచెందిన విషయాన్ని కృష్ణారెడ్డే మొదటగా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు, తరువాత సీబీఐ అధికారుల చేతిలో చిత్రహింసలకు గురైన బాధితుడు కూడా కృష్ణారెడ్డే. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలను సమీపం నుంచి పరిశీలిస్తున్న కీలకవ్యక్తి అయిన కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సాక్షి: 2019, మార్చి 15న ఏ సమయంలో మీరు వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లారు? కృష్ణారెడ్డి: రోజూ వెళ్లినట్లే ఆ రోజు కూడా ఉ.5.30కే వివేకం సార్ ఇంటికి వెళ్లాను. ఇంట్లో లైట్‌వేసి లేదు. అంటే సారు ఇంకా నిద్ర నుంచి లేవలేదని అనుకున్నా. బయట లైట్ దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉన్నా. కాసేపటి తరువాత సౌభాగ్యమ్మకు ఫోన్‌చేసి సార్ ఇంకా నిద్ర లేవలేదు.. మీరు ఫోన్‌చేసి నిద్ర లేపుతారా అని అడిగాను. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి ఉంటారు.. కాసేపు నిద్రపోనీ అని ఆమె చెప్పారు. కాసేపటికే వంట మనిషి లక్ష్మమ్మను ఆమె కొడుకు ప్రకాశ్ తన బైక్ మీద తీసుకొచ్చాడు. ఆలస్యమైంది కిటికీ వద్దకు వెళ్లి సారును నిద్రలేపు అని చెప్పాను. ఆ సమయంలో వాచ్మెన్ రంగన్న మెయిన్ డోర్ ముందర నిద్రపోతూ ఉన్నాడు. లక్ష్మమ్మ వచ్చేసరికి రంగన్న నిద్రలేచి ఉత్తరం వైపు ఉన్న పార్కు వైపు వెళ్లాడు. ఇంతలో ‘సార్ పడిపోయాడు’ అని అరుచుకుంటూ రంగన్న వచ్చాడు. మేము ఆ వైపు పరిగెత్తి వెళ్లాం. ఇంటికి ఉత్తరం వైపు ఉన్న తలుపు తెరచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే సార్ హాల్లోగానీ బెడ్రూమ్లోగానీ లేరు. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. బాత్రూమ్లో చూస్తే వివేకం సార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. నేను సార్ చేయిపట్టుకుని నాడి చూశాను. నాడి కొట్టుకోవడంలేదు. ఆయన చనిపోయారని నిర్ధారించుకున్నా. సాక్షి: ఆ వెంటనే మీరు ఏం చేశారు? కృష్ణారెడ్డి: నేను వెంటనే సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. బావ మనకు లేరు.. ఎవరో ఏదో చేశారు. రక్తపు మడుగులో ఉన్నారు. తల మీద గాయం ఉంది అని చెప్పాను. సరే అని ఆయన ఫోన్ పెట్టేశారు. నేను 6.15కు కాల్ చేశాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాతో 47 సెకన్లు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆ తరువాత సార్ పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డికి కాల్ చేశాను. కానీ, ఆయన ఫోన్ కలవలేదు. నాకు సౌభాగ్యమ్మ ఫోన్ నుంచి కాల్ వచి్చంది. నేను మేడంకు కూడా విషయం చెప్పాను. సాక్షి: ఆ తరువాత ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నేను, ప్రకాశ్ అక్కడ ఉండగా వీల్ చెయిర్ దగ్గర లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివాను. తన మాజీ డ్రైవర్ తనను చంపినట్లు వివేకం సార్ ఆ లెటర్లో రాసి ఉంది. ఇంతలో సౌభాగ్యమ్మ నాకు ఫోన్ చేశారు. అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ ఇమ్మన్నాను. ఆమె ఆయనకు ఫోన్ ఇస్తే ఆ లెటర్లో రాసింది చదివి వినిపించాను. ఆ లెటర్‌ను దాచిపెట్టు. ఎవరికి చెప్పొద్దు.. అని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. లెటర్ గురించి పోలీసులకు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాను. ఏం ఇబ్బంది అవ్వదు.. మేం చూసుకుంటాం.. ఆ లెటర్ జాగ్రత్తగా దాచిపెట్టు అని ఆయన చెప్పారు. దాంతో ఆ లెటర్ విషయం పోలీసులకుగానీ ఎవరికీగానీ చెప్పలేదు. వంట మనిషి లక్ష్మమ్మ కొడుకు ప్రకాశ్‌కు ఆ లెటర్ ఇచ్చి మా ఇంట్లో ఇచ్చి రమ్మన్నాను. ఇంతలో రాజశేఖరరెడ్డి మళ్లీ నాకు ఫోన్ చేశారు. అప్పటికే సీఐ శంకరయ్య వచ్చారని చెప్పాను. ఆయన నా ఫోన్‌తో సీఐ శంకరయ్యతో మాట్లాడారు. తరువాత శంకరయ్య చెప్పినట్లుగా పోలీసు కంప్లైంట్ ఇవ్వమని రాజశేఖరరెడ్డి నాతో చెప్పారు. నేను అలానే చేశాను. సాక్షి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చేసి ఉంటే ఈ కేసు దర్యాప్తు వేరే విధంగా ఉండేది కదా? కృష్ణారెడ్డి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చి ఉంటే కేసు దర్యాప్తు సరైన విధంగా జరిగేది. కానీ, నాకు ఇష్టంలేకపోయినా రాజశేఖరరెడ్డి చెప్పడంతోనే ఆ లెటర్‌ను దాచి ఉంచాల్సి వచి్చంది. సాక్షి: మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు? కృష్ణారెడ్డి: నన్ను పోలీసులు ఎందుకు అరెస్టుచేశారో నాకే తెలీదు. లెటర్ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి చెప్పాడు. పోలీసులతో ఇబ్బంది వస్తుందని చెప్పినా తాను చూసుకుంటానని లెటర్ దాచి పెట్టమన్నాడు. టీడీపీ ప్రభుత్వం ఒత్తిడో.. వీళ్లు వాళ్లూ లాలూచీ అయి కృష్ణారెడ్డిని అరెస్టుచేయిస్తే సరిపోతుందని అనుకున్నారో తెలీదు. సాక్షి: మిమ్మల్ని అరెస్టు చేశాక ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నన్ను అదేరోజు సాయంత్రం పోలీసులు అరెస్టుచేసి డీటీసీలో 13 రోజులపాటు ఉంచారు. బాగా కొట్టారు. రాజశేఖర్‌రెడ్డి చేశాడా.. శివశంకర్‌రెడ్డి చేసి ఉంటాడా చెప్పు అని తీవ్రంగా కొట్టారు. నాకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సాక్షి: పోలీసులకు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద అనుమానం కలిగిందా? కృష్ణారెడ్డి: పోలీసులు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డినే అనుమానించారు. వివేకం సార్‌ను ఆయనే హత్య చేయించి ఉంటాడా అని అడిగారు. నాకేమీ తెలీదని చెప్పాను. పోలీసులు కొట్టడంతో దాదాపు ఏడాదిపాటు నా చేతితో ఏమీ పట్టుకోలేకపోయాను. సాక్షి: లెటర్‌ను దాచి పెట్టమన్న రాజశేఖర్‌రెడ్డిని ఎందుకు ప్రశి్నంచరు అని మీరు పోలీసులను అడగలేదా? కృష్ణారెడ్డి: పోలీసులు నన్ను కొడుతూ ఉంటే నేనేం మాట్లాడను. నా మాట వాళ్లు వినిపించుకుంటే కదా. సాక్షి: రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు? కృష్ణారెడ్డి: ఎందుకు విచారించలేదో మరి. సీబీఐ వాళ్లకు కూడా అదే విషయం చెప్పాను. కానీ, వాళ్లు కూడా పట్టించుకోలేదు. వాళ్ల మధ్య ఏం ఒప్పందం ఉందో తెలీదు. సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించారనే ఆరోపణ కూడా ఉంది కదా? కృష్ణారెడ్డి: సీఐ శంకరయ్య పక్కనే నేనున్నా. ఆయన్ని ఎవరూ బెదిరించనే లేదు. సాక్షి: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తరువాత ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పమని మీ మీద ఒత్తిడి వచి్చందా? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని రాంసింగ్ నన్ను బాగా వేధించారు. వాళ్లిద్దరూ నన్ను బెదిరించారని చెప్పమన్నారు. అలాంటిదేమీ లేదని నేను చెప్పడంతో నన్ను బాగా కొట్టారు. ఉన్నది ఉన్నట్లు చెబుతాగానీ అబద్ధం చెప్పనని నేను అంటే మరింత గట్టిగా కొట్టేవారు. కొట్టినా చంపినా నాకు తెలిసింది ఇంతే అని చెప్పాను. సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లను ఇరికించాలని సీబీఐ అధికారి రాంసింగ్ ఎందుకు భావించారు? కృష్ణారెడ్డి: సునీత, రాజశేఖరరెడ్డితో రాంసింగ్ ఏం కమిట్ అయ్యారో.. వాళ్లద్దరి పేర్లు చెప్పాలనే వేధించారు. సాక్షి: సీబీఐ అధికారి రాంసింగ్ మీతో ఎలా వ్యవహరించారు? కృష్ణారెడ్డి: ఒకరోజు రాంసింగ్ ఫోన్‌చేశారు. తాము చెప్పినట్లు విన్నారు కాబట్టే రంగన్న, దస్తగిరిలను రక్షించాం. నేను కూడా చెప్పినట్లు వింటే రక్షిస్తామన్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌కు నా పిల్లలతో రమ్మని చెప్పారు. ఆ విషయాన్ని రాజశేఖర్‌రెడ్డికి చెబితే రాంసింగ్ చెప్పినట్లు చేయమన్నారు. మా ఇద్దరు కొడుకులతో సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌కు వెళ్లాం. వాళ్లు చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పెద్దపెద్ద వాళ్లనే జైలుకు పంపాం.. నువ్వెంత అని అన్నారు. నాకు తెలిసిందే చెబుతా తప్పా మీరు చెప్పమన్నట్లు అబద్ధం చెప్పలేనని నేను అన్నా. దాంతో కర్ర తీసుకుని నా కొడుకుల ముందే దాదాపు 20 సార్లు తీవ్రంగా కొట్టారు. సాక్షి: మీ అబ్బాయి పెళ్లిని చెడగొట్టారు అంటారు.. కృష్ణారెడ్డి: మేం సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్ నుంచి ఇంటికి వచి్చన మర్నాడే మా అబ్బాయికి సంబంధం కుదిరిన వారి నుంచి ఫోన్ వచి్చంది. పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. నా మీద కేసు ఉంది.. నేను జైలుకు వెళ్లాను.. మా ఆస్తులన్నీ తీసేసుకుంటామని సునీత, రాజశేఖర్‌రెడ్డి వారికి ఫోన్‌చేసి చెప్పారట. వాళ్లను హైదరాబాద్ పిలిపించుకుని మరీ బెదిరించి పెళ్లి సంబంధం రద్దుచేసుకునేలా చేశారు. వాళ్లు చెప్పినట్లు వినాలని నన్ను ఒప్పించేందుకు సునీత, రాజశేఖర్‌రెడ్డి అలా చేశారు. ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం కుదురుతుందని నేను వారికి లొంగలేదు. సాక్షి: మీరు రాంసింగ్ మీద ఫిర్యాదు చేశారు కదా? కృష్ణారెడ్డి: నేను ఎంతమందితో చిత్రవధలకు గురయ్యేది. టీడీపీ ప్రభుత్వంలో ముందు పోలీసులు కొట్టారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని బెదిరించారు. మా అబ్బాయి పెళ్లి సంబంధం చెడగొట్టారు. సీబీఐ అధికారి రాంసింగ్ నన్ను కడపలో కొట్టారు. ఢిల్లీ పిలిపించుకుని గొడ్డును బాదినట్లు కొట్టారు. ఇక ఎంతమందితో దెబ్బలు తినాలి.. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలని కోరాను. పులివెందుల కోర్టులో కూడా పిటిషన్ వేశాను. సాక్షి: వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పారని ఒక ఆరోపణ వచి్చంది. ఆయన అలా చెప్పారా? కృష్ణారెడ్డి: ఆ మాటే వినలేదు. అసలు ఆ విషయం ఎలా బయటకు వచి్చందో కూడా నాకు తెలీదు. సాక్షి: దస్తగిరి ఎలాంటి వ్యక్తి? కృష్ణారెడ్డి: దస్తగిరి డ్రైవర్‌గా ఉండేవాడు. ప్రవర్తన సరిగా లేదని తీసేశారు. వివేకం సార్‌ను ముసలోడా అనేవాడు. డ్యాన్స్ చేసేవాడు.. వెక్కిరించేవాడు. దాంతో సౌభాగ్యమ్మ అతనిని పని నుంచి తీసేశారు. అతని ఇంట్లో వాళ్లు వచ్చి బాధపడితే సౌభాగ్యమ్మను ఒప్పించి మళ్లీ పనిలో పెట్టించాను. కానీ, ఆ తరువాత దస్తగిరి మరింత మారిపోయాడు. వివేకం సార్ షమీమ్ ఇంటికి వెళ్లాలంటే ఇతనే డ్రైవర్. దాంతో దస్తగిరికే ఆయన ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. దస్తగిరి డబ్బు మనిషి. సాక్షి: హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను చెరిపేయాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి మీతో చెప్పారని కొందరు ఆరోపిస్తున్నారు? దీనిపై ఏమంటారు? కృష్ణారెడ్డి: అసలు వివేకం సార్ మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి తీసుకువచి్చనప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి అక్కడ లేనేలేరు. అక్కడ సాక్ష్యాలను చెరిపి వేయించింది ఎర్ర గంగిరెడ్డే. ఎంపీ అవినాశ్‌రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అక్కడ తుడిపించి వేసింది గంగిరెడ్డే. అక్కడున్న అందరూ అది చూశారు. సాక్షి: సీబీఐ అధికారులు పిలిస్తే మీరు ఢిల్లీ వెళ్లారు కదా.. అక్కడ ఏం జరిగింది? కృష్ణారెడ్డి: సీఐబీ అధికారులు నోటీసు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పే వెళ్లాను. నన్ను ఢిల్లీలో నెలరోజులు ఉంచి తీవ్రంగా వేధించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని అక్కడ కూడా రాంసింగే వేధించారు. నాకు తెలిసింది ఇప్పటికే చెప్పాను. లెటర్ దాచి పెట్టడమే నేను చేసిన తప్పు.. అది కూడా రాజశేఖర్‌రెడ్డి చెబితేనే చేశాను.. అంతకుమించి నాకేమీ తెలీదని చెప్పాను. దాంతో వాళ్లు నన్ను కొట్టేవారు. రోజూ రాత్రి సునీత, రాజశేఖర్‌రెడ్డి ఫోన్ చేసేవారు. నన్ను తీవ్రంగా కొడుతున్నారని వారికి నేను చెప్పేవాడిని.. నెల రోజులవుతోందని చెప్పినా వారు పట్టించుకోలేదు. సాక్షి: మామా అల్లుళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? కృష్ణారెడ్డి: నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద వివేకం సార్‌కు మంచి అభిప్రాయంలేదు. అల్లుడు కాబట్టి తప్పదు కదా. ఆయన మీద సార్ తరచూ కోప్పడేవారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ, అల్లుడి మీద సార్ గట్టిగా అరుస్తూ ఉండేవారు. వివేకం సార్ రెండో భార్య షమీమ్ విషయంలోనే వాళ్ల మధ్య గొడవలు జరిగేవి. సాక్షి: వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవా? కృష్ణారెడ్డి: షమీమ్ అనే ఆవిడను వివేకం సార్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఒకరోజు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కలిసి వివేకం సార్‌తో గొడవ పడ్డారు. తాను షమీమ్‌ను పెళ్లి చేసుకోవడమే కాదు ఆమెతో తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని సార్ చెప్పారు. ఆ ఇద్దరి బాధ్యతతోపాటు ఆమెకున్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేయడం కూడా తన బాధ్యతేనని అన్నారు. సాక్షి: సునీత ఎందుకు అంతగా కేకలు వేశారు? కృష్ణారెడ్డి: నా మీద సునీత కోపంతో అరుస్తూ ఉంటే రాజశేఖర్‌రెడ్డి ఆమెను సముదాయించేందుకు యత్నించారు. ‘ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుంది’ అని సునీత ఆయనతో అంది. నాకేమీ అర్థం కాలేదు. వివేకం సార్ హత్యలో వీళ్ల పాత్ర ఉందేమోనని మొదటిసారి అనిపించింది. అంటే నాతో అబద్ధం చెప్పించి వేరెవరినో నాశనం చేయాలని సునీత భావిస్తోందని అర్థమైంది. సాక్షి: వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారు? మీతో ఎందుకు అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థంకావడంలేదు. నాతో ఒక అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారంటే.. దాని వెనుక వాళ్లకేదో ఉద్దేశం ఉండే ఉంటుంది. ఎవర్నో కాపాడేందుకు.. ఏదో నిజాన్ని దాచేందుకే వాళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ అధికారి రాంసింగ్ కూడా నాతో అబద్ధాలు చెప్పాలని ఎందుకు పట్టుబట్టారో తెలీడంలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా సాగితేనే వాస్తవాలు బయటకొస్తాయి. కానీ, సీబీఐ తీరు సక్రమంగాలేదు. అదే బాధేస్తోంది. సాక్షి: చివరగా.. వివేకా హత్య గురించి ఏమంటారు? కృష్ణారెడ్డి: జరుగుతున్నదంతా చూస్తే.. సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిల మీదే అనుమానం కలుగుతోంది. వీళ్లే వివేకం సార్‌ను ఏమైనా చేసి మరొకరి మీద నింద వేయాలని చూస్తున్నారా అనిపిస్తోంది. ఆస్తి గొడవలు, షమీమ్ విషయం.. ఆస్తి వేరొకరికి పోతుందనే చేశారా అనిపిస్తోంది. ఎందుకంటే అబద్ధం చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిజం చెప్పాలని అంటారు. కానీ, అబద్ధం చెప్పమని వీళ్లు ఎందుకు అంటున్నారన్నది చూడాలి. అందుకే వివేకం సార్‌ను వీళ్లే ఏమైనా చేశారనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు పోతారని కూడా సునీత నా ముందే అంది. -
1.81 కోట్లు సీజ్.. నారాయణ అల్లుడు పునీత్‌పై కేసు
సాక్షి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు నమోదు అయ్యింది. అంతేకాదు ఈ కేసు విచారణలో భాగంగా బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కోటికి పైగా నగదు సైతం సీజ్ చేశారు. ఈ సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘‘ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం.. . పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్స్పైర్ మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీఆర్ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం. ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్స్పైర్ సొసైటీ ఉంది. అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు. అలాగే.. నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు’’ అని ఎస్పీ వివరించారు. -
చంద్రబాబు డైరెక్షన్.. నర్రెడ్డి సునీత యాక్షన్
'మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన తీరు, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని వారికి, చివరికి పార్టీ ఆఫీస్ అటెండర్ స్థాయి ఉండే నేతలకు సైతం ఆమె ధన్యవాదాలు తెలియచేసిన వైనం, అలాగే ఆ మీడియా సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేవలం టీడీపీకి ఉపయోగపడే ప్రశ్నలు వేసిన పద్ధతి.. ఇవన్నీ గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. సునీత కేవలం తన తండ్రి హత్య కేసు గురించి కన్నా, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతోనే మాట్లాడారని తేలిపోతుంది. ఈనాడు పత్రికలో సునీత మీడియా సమావేశం వార్తను ఒక పేజీన్నర ప్రచురించారు. ఆ మొత్తం చదివితే ఆమె తెలివితక్కువగా చేసిన ప్రకటనలను ఎడిట్ చేసి పాఠకులను మోసం చేశారన్న సంగతి అర్ధం చేసుకోవచ్చు.' తన తండ్రి హత్య జరిగిన తర్వాత సునీత మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చెబుతున్న అంశాలకు మధ్య ఎంతో తేడాను మనం గమనించవచ్చు. సునీత ఒక రాజకీయ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడుతున్నట్టు వినగానే మనకు అర్థమవుతుంది. వివేకా హత్య కేసు ఇప్పటికే తెలంగాణలోని సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. దీనిలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రితో పాటు మరికొందరు జైలులో ఉన్నారు. సీబీఐ చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఇక జరగవలసింది కోర్టు విచారణ మాత్రమే. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమి సంబంధం ఉంది? తనవద్ద ఆధారాలు లేవంటూ చెబుతూనే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విచారణ జరపాలని కోరడం వింత విడ్డూరంగా కనిపిస్తోంది. ఎవరైనా ఒక మాట చెబితే అందులో విశ్వసనీయత ఉండాలి. ఒక చిత్తశుద్ది ఉండాలి. కానీ సునీత మాత్రం ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొందరు చూపుతున్న ప్రలోభాలకు లొంగి, వారు మాట్లాడమన్నట్లు మాట్లాడుతూ, వారు చెప్పినట్లు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఆమెకు తన తండ్రి ప్రతిష్ట కన్నా, తనకు, తన భర్తకు ఏదో రాజకీయ పదవి కోసం పాకులాడుతున్నారన్న సందేహం వస్తుంది. అంతేకాక వివేకా హత్య కేసులో రెండో కోణంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవిత రహస్యాలను బహిర్గతం అవుతున్నా ఆమె ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు! తన తండ్రితో ఐదేళ్లుగా అంతగా సునీతకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు. అది నిజమా? కాదా? తండ్రి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారన్నది వాస్తవమా? కాదా? వారికి పుట్టిన బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా సునీత అడ్డుపడే యత్నం చేశారన్నది కరెక్టా? కాదా? వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా! ఆ రోజుల్లో ఏ మాత్రం ఆధారం దొరికినా ఎంపీ అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టేవారు కదా! అప్పుడు ఎందుకు అలా చేయలేకపోయారో చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేసిన ఆమె ఎందుకు వారితో రాజీపడిపోయారు? అసలు వివేకాను తానే హత్య చేశానని చెబుతున్న దస్తగిరిని మాత్రం సునీత ఎందుకు రక్షిస్తున్నారు? అతనికి బెయిల్ వచ్చేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? వివేకాను చంపినవారినే తన వద్ద పెట్టుకుని, ఇంకెవరిపైనో ఆరోపణలు చేయడం రాజకీయం కాకుండా ఉంటుందా? ఆమె తండ్రిపట్ల ఏ మాత్రం అభిమానం ఉన్నా ఇలా చేయగలుగుతారా? తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లయినా విచారణ ఎందుకు పూర్తి కాలేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనే ఆమె దుర్బుద్ధి కనబడుతోంది. ఆమె కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని లేదా సీబీఐని కదా అడగాల్సింది? లేదా హత్య జరిగిన సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును విచారణ ఎందుకు పూర్తి కాలేదని అడగాలి కదా! హంతకులు పాలకులుగా ఉండరాదని ఆమె అంటున్నారు. అది నిజమే. అందుకే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రజలు ఓడించారని అనుకోవాలి కదా! పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ తన అన్నకు ఓటు వేయవద్దని అంటున్నారంటేనే ఆమె ఎజెండా తెలిసిపోతుంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆమె గానీ, ఆమె కుటుంబం కానీ ఏదో ఆశించి ఉండాలి. అది నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడి ఉండకపోవచ్చు. ఆ కోపంతో టీడీపీ రాజకీయ ట్రాప్‌లోకి వెళ్లి, ఆ పార్టీ వారు సమకూర్చిన లాయర్ల సహకారంతో రకరకాల పిటిషన్లు వేసి ఇన్నాళ్లు సునీత కథ నడిపించారనిపిస్తుంది. వివేకా రాసిన లేఖను సునీత, ఆమె భర్త ఎందుకు దాచి ఉంచారు? బయటపెట్టొద్దని ముందే ఎందుకు హెచ్చరించారు.? ఈ విషయాలను కూడా సునీత ఎప్పుడూ బయటపెట్టలేదు. ఈమె మాదిరే సొంత చెల్లెలు షర్మిల కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి ఏదో ఆశించిందని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించలేదని, తత్ఫలితంగానే ఆమె కూడా ఇదే రీతిలో రోడ్డెక్కి రాజకీయం చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం అంగీకరించాలి. తన చెల్లెళ్లను వదలుకోవడానికి అయినా వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధపడ్డారు తప్ప, ప్రజా ధనాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోలేదన్న విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ప్రతినిధులు హాజరై వారికి కావాల్సిన ప్రశ్నలు వేసినట్లు ఇట్టే కనిపెట్టేయవచ్చు. వాటిలో కొన్నింటిని గమనించండి.. మీ నాన్న హత్య కేసులో నిందితులను రక్షించడానికే వైఎస్ జగన్ పరిమితం అయ్యారు. ఇందులో ఆయన పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారా? అవినాశ్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సీబీఐ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? హత్యకు ఏ ఆయుధం ఉపయోగించింది? జగనే ఎలా చెప్పగలిగారని అనుకుంటున్నారు? అవినాశ్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తుంటుందో వాటినే ప్రశ్నలుగా మలిచి ఈ మీడియా ప్రతినిధులు వేశారంటేనే వీరందరి రాజకీయ లక్ష్యం తెలుసుకోవచ్చు. అదే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజుతో సహా పలువురు చోటా, మోటా టీడీపీ లీడర్లకు సైతం సునీత కృతజ్ఞతలు చెబితే, దానిని మాత్రం ఈనాడులో ఎడిట్ చేశారు. ఆ పాయింట్ వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని ఈనాడు రామోజీరావు భావించడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఏతావాతా వీటన్నిటిని గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్కీములు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయుధాలుగా మార్చుకుని ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుంటే, చంద్రబాబు మాత్రం తన ఆయుధాలుగా పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, రఘురామకృష్ణరాజు, లాయర్లను మార్చుకుని కోర్టుల ద్వారా యుద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రక్రియలో సునీత కూడా ఒక భాగమే అని తేలడం లేదూ!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రాఫిసి: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
సాక్షి,హైదరాబాద్: రాఫిసి(రామోజీఫిల్మ్‌సిటీ)లో ఈనాడు ఉద్యోగిని సాయికుమారి అనుమానస్పదంగా మరణించారు. రాఫిసిలోని ఈనాడు కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి కింద పడి సాయికుమారి చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన సాయికుమారి ఈనాడు కార్యాలయం కాల్సెంటర్లో ఉద్యోగిని. సాయికుమారి భర్త కూడా ఈనాడు సంస్థల్లోనే పనిచేస్తున్నారు. సాయికుమారికి ఇద్దరు పిల్లలు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళది ఆత్మహత్యా కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమారి కుటుంబం పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది కాలంగా వీపరీతమైన పని ఒత్తిడి కారణంగా మనోవేదనకు గురైనట్టు సమాచారం. కొందరు రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ) ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు మరణించిన మహిళా ఉద్యోగి పేరు సాయికుమారి అని తెలిసింది. ఈనాడు కార్యాలయంలోని కాల్ సెంటర్లో సాయికుమారి పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఉదయం ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ పైనుంచి పడి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి మృతికి గల కారణాలపై ఇతర ఉద్యోగులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రాఫిసి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరిగిన ఓ ఘటన కూడా చర్చనీయాంశమయింది. ఘనంగా ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పుకునే రామోజీ ఫిలిం సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్రేన్ వైర్ తెగిపోయింది. ఈ ఘటనలో వెస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్‌షా మరణించగా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. రాఫిసిలో ఏం జరిగినా.. మీడియాను గానీ ఇతరులను గానీ లోపలికి అనుమతించరని స్థానికులు చెబుతున్నారు. అక్కడ యాజమాన్యం వారిచ్చే సమాచారమే తప్ప .. ఏదీ బయటకు రానివ్వరన్న విమర్శలున్నాయి. ఇదీ చదవండి.. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య -
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
దస్తగిరి చెప్పేవన్ని అబద్ధాలే
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి.. ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు. దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. -
వైఎస్ వివేకాను చంపిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత... హత్య జరిగాక రెండు నెలలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడిని ప్రశ్నించనే లేదు. అంతే కాదు.. హత్య చేశానని, తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తనే గొడ్డలితో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడైపోయాడు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాశ్రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తర్వాత ఓడిపోవటంతో బీజేపీలోకి ఫిరాయించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్లు... చేయించిన వాళ్లు... దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు... అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకెళుతున్నారు. కుట్రలో భాగంగానే... చంద్రబాబు అనుకూల తోక పత్రికకు అధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మూడు రోజుల కిందట నర్రెడ్డి సునీతతో సహా చంద్రబాబును కలిశారు. కడప ఎంపీగా సునీతను పోటీకి దింపటంపై అక్కడ చర్చ జరిగింది. చివరకు సునీతను పోటీ చేయించని పక్షంలో ఆమె చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రచారమంటే... నియోజకవర్గంలో తిరగటం మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు కూడా. అందులో భాగమే ఢిల్లీలో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్. దానికి కొనసాగింపే శనివారం ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోవటం. ఇదంతా ఒక స్కెచ్. సూత్రధారి చంద్రబాబు. పాత్రధారులు సునీత నుంచి దస్తగిరి, బీటెక్ రవి వరకూ ఎందరో!!. వివేకా హత్యతో లాభమెవరికి? జాతీయ, అంతర్జాతీయ నేర పరిశోధన ప్రమాణాలు చెప్పేదొకటే.. ఒక నేరం వల్ల ఎవరికి లాభం ఉంటుందో వారే దోషులు, కుట్రదారులు. అలా చూసినప్పుడు వివేకా హత్యతో లాభమెవరికి? ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? ఈ కోణంలో పరిశీలించినప్పుడు వచ్చే సమాధానాలు రెండే. వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి పంతం పట్టారు. కాకపోతే షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు. సునీత నర్రెడ్డి ? ఆస్తి మొత్తం మాకే దక్కాలి.... వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్‌లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్‌కు మాట ఇచ్చారు. దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. షమీమ్‌తో సునీత గొడవ పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు. తన ఆస్తిలో షమీమ్‌కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు. అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!. మరి హత్య చేయించిందెవరో కనుక్కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? మాటమార్చి... చంద్రబాబు గూటిలోకి తన తండ్రి వివేకా హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. 2019 మార్చి 21న హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఇవన్నీ చెప్పిన సునీత... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆమె పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. చంద్రబాబు? రాజకీయ లబ్ధికి ఇదే అదను.. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజానికి కడప జిల్లాలోను, పులివెందులలోను టీడీపీకి ప్రధాన అడ్డంకి వైఎస్ వివేకా. ఆయన అడ్డు తొలగింది. వైఎస్సార్సీపీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని దీనిలో ఇరికించి దుష్ప్రచారం సాగిస్తే... కడప జిల్లాలో తాము పాగా వేయొచ్చనేది బాబు దురాలోచన. అందుకే... మార్చి 15న వివేకా హత్య విషయం బయటకు వచ్చిన తరవాత బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సొంత మనిషి అయిన అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రంగంలోకి దింపారు. ఆయన అందరినీ ప్రభావితం చేస్తూ దర్యాప్తును ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. నిజానికి ఈ హత్య విషయంలో సునీత లక్ష్యం ఒక్కటే. హత్య వెనుకనున్న తన భర్త, బావగార్ల పేర్లు బయటకు రాకుండా ఉండటం. బాబు లక్ష్యమేమో తన ప్రత్యర్థులను ఇరికించటం. అందుకే ఈ విజాతి ధ్రువాలు రెండూ ఆకర్షించుకుని... ఒకరి లక్ష్యానికి మరొకరు సాయంగా నిలిచారని... రానురాను కుట్రను మరింత లోతుల్లోకి తీసుకెళుతున్నారని ఈ వ్యవహారాన్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు చెప్పే మాట. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సందేహాలు రేకెత్తించేలా పచ్చ మీడియా ద్వారా అభూతకల్పనలతో దుష్ప్రచారం చేయటం... హత్య వెనుక ఉన్న కుట్రదారుల పాత్ర బయటకురాకుండా కేసును సంక్లిష్టంగా మార్చటం... ఇవన్నీ ఇందులో భాగంగానే జరిగిపోయాయి. చంద్రబాబు గ్యాంగ్‌కు కృతజ్ఞతలతో.. మీ సునీత బహుశా... నాలుగేళ్లుగా తాము సాగిస్తున్న కుట్రను మరింత పదునెక్కించాలనుకున్నారో, ఇకపై ముందుకు వెళ్లాలంటే ముసుగు తీయక తప్పదని భావించారో గానీ... సునీత ముసుగు తీశారు. రెండ్రోజుల కిందట ఢిల్లీలో బాబు స్క్రిప్టును చదువుతూ... ఆఖరికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా కృతజ్ఞతలు చెప్పారంటే టీడీపీ ఏ స్థాయిలో సునీతకు సహకరించిందో... ఈ కుట్ర ఎంత లోతైనదో తెలియకమానదు. వైఎస్సార్సీపీ టికెట్టుపై గెలిచి... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అత్యంత పరుషపదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభి... సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అత్యంత వివాదాస్పదుడిగా మారిన టీడీపీ నేత, పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్.. తమ పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నారాయణ... బీజేపీలో ఉంటూ బాబు ఎజెండాను అమలు చేస్తున్న సీఎం రమేశ్... బాబు లాయరు సిద్ధార్థ లూథ్రా... నిరపరాధులను హింసించి, వేధించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్... సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా... వీళ్లందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు. అంటే తాను ఆ పచ్చ ముఠాలో సభ్యురాలినేనని విస్పష్టంగా ప్రకటించారు. విశేషమేంటంటే వీళ్లందరిలో ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అది... తమ వృత్తులు, పార్టీలకు అతీతంగా చంద్ర బాబు కోసం పనిచేయటం. వైఎస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించటం. అది చాలదూ... సునీత పాత్రను బయటపెట్టడానికి!!. ఇంకా వివేకా ఎవరెవరికి అడ్డంకిగా ఉన్నారు? ఆయన హత్యతో ఏ పాత్ర«ధారికి ఎలాంటి లాభం? ఇవన్నీ ఒకసారి చూద్దాం... ఆదినారాయణ రెడ్డి? గుండెపోటు అని మొదట చెప్పింది ఈయనే... వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియా సాక్షిగా బయటకు చెప్పింది నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేకా మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనక అలా జరిగి ఉండొచ్చని తాను కూడా అన్నానని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. శివప్రకాశ్ రెడ్డి ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పటంతో... ఆయన తన వాహనాన్ని నిలిపేసి, వెనక్కు తిరిగి వివేకా ఇంటికి వచ్చారు. మరి గుండెపోటు అని ప్రచారం చేయాల్సిందిగా శివప్రకాశ్‌రెడ్డికి చెప్పిందెవరు? ఆదినారాయణ రెడ్డికి ఆయనే అడ్డంకి... 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి... టీడీపీకి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవటానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆది నారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు గురయ్యారు. వివేకా హత్య ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే కదా? నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ? లేఖను దాచి... గుండెపోటని ప్రచారం చేసి వివేకా హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిది కీలకపాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేకా తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా... అది మామూలు మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలిసిపోతుంది. అలాంటి లేఖను ఆ రోజు (2019, మార్చి 15) ఉదయం 6.10 గంటలలోపే వివేకా పీఏ కృష్ణారెడ్డి చూశారు. ఆ విషయాన్ని వెంటనే సునీత భర్త రాజశేఖరరెడ్డికి ఫోన్లో చెప్పారు. ‘మేం వచ్చే వరకు ఆ లేఖను గానీ, వివేకా సెల్‌ఫోన్‌ను గానీ ఎవరికీ ఇవ్వవద్దు. పోలీసులకు కూడా చెప్పొద్దు’ అని వారు పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆ లేఖను గనక వెంటనే పోలీసులకు ఇవ్వమని వారు చెప్పి ఉంటే... మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. వివేకాది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు. పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటంతో... వ్యవహారం మొత్తం వారు ప్లాన్ చేసినట్టే సాగింది. బీటెక్ రవి... ? వివేకా ఉంటే ఇక అంతే.. పులివెందుల నియోజకవర్గంలో కనీసస్థాయిలోనైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చనేది ఆయన పన్నాగం. కానీ వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వర రెడ్డి(ఈయనకు వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కూడా. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిచ్చేదే. రామ్‌సింగ్? చంద్రబాబు చేతిలో పావు... వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సిద్ధహస్తుడో వివేకా కేసులో సీబీఐ తీరే నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నిశితమైన దర్యాప్తు జరిగి దోషులు బయటపడాలని మొదటి నుంచీ భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... కేసును సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించాలని సునీత కోరగానే సరేనన్నారు. సీబీఐకి అప్పగించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే ముందస్తు కుట్రతో బీజేపీలోకి పంపిన తన మనుషులు సీఎం రమేశ్, సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలెట్టారు. సీబీఐ దర్యాప్తు అధికారిగా నియమితుడైన రామ్‌సింగ్ వివాదాస్పద వ్యవహార శైలే అందుకు తార్కాణం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన ఆయన ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కేసును పక్కదారి పట్టించారు. దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి బెదిరించి... ప్రలోభాలకు గురిచేసి అప్రూవర్‌గా మార్చారు. తాము అనుకున్నది అతని అప్రూవర్ వాంగ్మూలంగా నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డిని, మరికొందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. తాను చెప్పిందే చెప్పాలని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ జిల్లాలో పలువురిని అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయడంతో వారి కుటుంబాలు బెంబేలెత్తిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామ్‌సింగ్ స్వయంగా అసత్య ఆరోపణలు చేశారు. కడపలో తాను కార్లో వెళ్తుంటే ఆగంతకులు వచ్చి హత్య చేస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆయన కారుపై ఎలాంటి దాడి జరగలేదని... ఎవరూ బెదిరించలేదని నిర్ధారణ అయ్యింది. అనేక ఫిర్యాదులు రావటంతో ఇంతటి వివాదాస్పదుడైన రామ్సింగ్ను న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోమ్ శాఖ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి? రాజకీయ వారసత్వం మాకే దక్కాలి.. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వంపై ఆయన అల్లుడు, చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి కన్నేశారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వంగా తమకే పదవులు దక్కాలని భావించారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్‌తో తనకు కలిగిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దాంతో రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కంగుతిన్నారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించారు. వారిద్దరికి భయపడి ఆమె పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉండేవారు. అంటే వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం తమకే దక్కాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారన్నది సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు హత్యకు గురయ్యారు. దస్తగిరి? హత్య చేసి... హైడ్రామా తండ్రిని చంపినవారిపై ఎవరికైనా కోపం, కక్ష ఉంటాయి. కానీ వివేకానందరెడ్డిని ఎంత పాశవికంగా హత్య చేసిందీ వెల్లడించిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం విస్మయం కలిగించేదే. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయ్యింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... వెనుక ఎవరున్నారన్నది కీలకం. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి...ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇక దస్తగిరి చేస్తున్న దుష్ప్రచారాన్ని పదే పదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!. సెల్ఫోన్లో డేటా డిలీట్ చేశారెందుకు? ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి వివేకా రాసిన లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందజేశారు. వారు ఆ సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ‘‘ఆ రోజు ఉదయం పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి గాయాలతో వివేకా బాత్రూమ్లో పడి ఉన్నారని చెప్పారు. మా నాన్నకు గతంలో కూడా గుండె సమస్య ఉన్నందున బాత్రూమ్లో పడి తలకు బలమైన గాయం అయి ఉండొచ్చని భావించా. అందుకే పోలీసులకు అలాగే ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డితో చెప్పా’’ అని సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. లేఖను చూశాకైనా... వివేకా మృతదేహాన్ని చూశాకైనా ఒక డాక్టరైన సునీతకు ఎలాంటి అనుమానమూ రాలేదంటే ఏమనుకోవాలి? ఉద్దేశపూర్వకంగా నిజాలు దాటిపెట్టారని భావించనవసరం లేదా? తండ్రిని ఓడించినా... సునీతకు ఇష్టులే వివేకానందరెడ్డిని 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు దొంగదెబ్బ తీసి ఓడించారు. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వివేకాను కుట్రతో ఓడించారు. అక్రమాలకు పాల్పడి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సర్వంతామై వ్యవహరించారు. కానీ ఆ ముగ్గురూ సునీతకు, ఆమె భర్త, బావగారికిçప్పుడు అత్యంత సన్నిహితులైపోవటమే విచిత్రం. – సాక్షి, అమరావతి -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్‌ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్‌ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్‌ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్‌ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్‌ను ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్‌లు కంటెయినర్‌ను పరిశీలించి 13 బ్యాగ్‌లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు. -
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది. -
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు.