సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గంగన్నపేటలో రెండ్రోజుల క్రితం రిటైర్డ్ ఏఎస్సై తాళ్లపల్లి శివరాజ్ దారుణ హత్యకు గురయ్యారు. గత కొన్నేళ్లుగా శివరాజ్ తమ్ముడు జయరాజ్ కుటుంబంతో ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం శివరాజ్ చర్చికి వెళ్తుండగా.. జయరాజ్ కొడుకు వివేక్‌తో ఘర్షణ పడుతూ రోడ్డు మీదకు వచ్చారు. వివేక్ చేతిలో ఉన్న కర్రతో శివరాజ్ తలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడు. దీంతో నిందితుని పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుని కుటుంబసభ్యులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment