Sarfaraz Ahmed
-
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్‌కోచ్‌గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో క్వెట్టా గ్లాడియేటర్స్ 5 మ్యాచ్‌ల తర్వాత ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గ్లాడియేటర్స్.. 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. గ్లాడియేటర్స్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (56 బంతుల్లో 86; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన అర్ధసెంచరీతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. గప్తిల్‌కు మరో ఎండ్ నుంచి ఎవరి సపోర్ట్ లేనప్పటికీ, ఒంటరి పోరాటంచేసి తన జట్టును గెలిపించుకున్నాడు. గప్తిల్‌కు సర్ఫరాజ్ అహ్మద్ (29), మహ్మద్ నవాజ్ (15), డ్వేన్ ప్రిటోరియస్ (10 నాటౌట్) నుంచి ఓ మోస్తరు మద్దతు లభించింది. కరాచీ బౌలర్లలో తబ్రేజ్ షంషి 2 వికెట్లు పడగొట్టగా.. ఆమెర్ యామిన్, ముహ్మద్ మూసా, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు కరాచీ ఇన్నింగ్స్‌లో రొస్సింగ్టన్ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఇమాద్ వసీం (30 నాటౌట్), ఆమెర్ యామిన్ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నసీం షా, ఐమల్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నవాజ్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 7) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పెషావర్ జల్మీ-లాహోర్ ఖలందర్స్ తలపడనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇస్లామాబాద్-ముల్తాన్ సుల్తాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్‌లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్‌తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Pakistan Super League (@thepsl) -
Irani Cup 2023: స్టార్ క్రికెటర్‌కు దక్కని చోటు.. కారణం ఏంటంటే..?
ముంబై స్టార్ క్రికెటర్, అప్ కమింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌కు దేశవాలీ ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఇరానీ కప్‌లో ఆడే అవకాశం లభించలేదు. మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సర్ఫరాజ్ సారధ్యం వహించాల్సి ఉండింది. అయితే చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సెలెక్టర్లు సర్ఫరాజ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. సర్ఫరాజ్ గైర్హాజరీలో మయాంక్ అగర్వాల్ రెస్ట్ ఆఫ్ ఇండియా పగ్గాలు చేపడతాడు. డీవై పాటిల్ టీ20 కప్ సందర్భంగా సర్ఫరాజ్‌కు గాయమైనట్లు సమాచారం. కాగా, సర్ఫరాజ్ గతకొంతకాలంగా జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇతను దేశవాలీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నా.. సెలెక్టర్లు ప్రతిసారి మొండిచెయ్యే చూపిస్తున్నారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధిస్తున్నప్పటికీ.. ఈ ముంబై ఆటగాడిపై సెలెక్టర్లు కనికరం చూపించడం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఒకానొక దశలో సహనం కోల్పోయి సెలెక్టర్లు, బీసీసీఐపై విరుచుకుపడ్డాడు. సెలక్టర్లు తనను మోసం చేశారంటూ వాపోయాడు. ఇదిలా ఉంటే, దేశవాలీ కెరీర్లో ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 79.65 సగటున 13 శతకాల సాయంతో 3505 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 92.66 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు సాధించాడు. రెస్టాఫ్ ఇండియా : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ సేథ్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్ -
150 కి.మీ వేగంతో సూపర్ డెలివరీ.. దెబ్బకు కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. ముల్తాన్ బౌలర్ల దాటికి కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. ముల్తాన్ బౌలర్లలో పేసర్ ఇహ్సానుల్లా ఐదు వికెట్లతో గ్లాడియేటర్స్ విన్ను విరచగా.. సామీన్ గుల్, అబ్బాస్ అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించారు. అదే విధంగా గ్లాడియటర్స్ బ్యాటర్లలో జాసన్ రాయ్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో రిలీ రుసౌ 78 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇహ్సానుల్లా సూపర్ డెలివరీ.. ఇక ఈ మ్యాచ్‌లో ముల్తాన్ పేసర్ ఇహ్సానుల్లా సంచలన బంతితో మెరిశాడు. ఓ అద్భుతమైన బంతితో గ్లాడియేటర్స్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఇహ్సానుల్లా క్లీన్ బౌల్డ్ చేశాడు. 150.3 కి.మీ వేగంతో వేసిన బంతికి సర్ఫరాజ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతి నేరుగా వెళ్లి స్టంప్సను గిరాటేసింది. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇక ఇహ్సానుల్లా దెబ్బకు సర్ఫరాజ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్, సూర్యకుమార్‌కు నో ఛాన్స్! -
బాబర్ ఆజమ్‌పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నాయకత్వ మార్పు చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజమ్‌ను దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్‌కు పట్టం కట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు పాక్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వెటరన్ వికెట్‌కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ కెప్టెన్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్ మసూద్‌కు కెప్టెన్సీ అప్పగించినా.. టెస్ట్‌ల్లో మాత్రం సర్ఫరాజ్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంపై నజీం నేథీ నేతృత్వంలోని పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాక్ మాజీలు, ఆ దేశ క్రికెట్ విశ్లేషకులేమో మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం. ఏదిఏమైనప్పటికీ పీసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాక్ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమిపాలైన పాక్.. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయిన పాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై వేటు అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, పీసీబీ కొద్దికాలం క్రితమే బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తొలుత అధ్యక్షుడు రమీజ్ రజాపై వేటు వేసి నజీం సేథికి బాధ్యతలు అప్పగించిన పీసీబీ.. ఇటీవలే షాహిద్ అఫ్రిదిని జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. -
సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీ.. ‘చేసింది చాలు.. ఇక నాటకాలు ఆపు!’
సర్ఫరాజ్ అహ్మద్ (35).. దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా జట్టులోకి వచ్చాడు. మూడో టెస్టులో అద్భుత శతకం సాధించిన ఈ పాక్ మాజీ కెప్టెన్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 86, 53 పరుగులు చేసిన సర్ఫరాజ్.. చివరిదైన రెండో టెస్టులోనూ గొప్ప ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 118 (176 బంతులు, 9 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. దీంతో పాక్ 0-0తో రెండో టెస్టును, సిరీస్‌ను కాపాడుకోగలిగింది. ఇక సిరీస్‌లో 335 పరుగులు చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకోవడం విశేషం. ఈ క్రమంలో జట్టు సభ్యులు, పాక్ క్రికెట్ అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. సెంచరీ అనంతరం పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, ఓపెనర్ ఇమాముల్ హక్, ఇతర సభ్యులు సర్ఫరాజ్‌కు స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు. కెరీర్ ముగిసిపోతుందనుకున్న సమయంలో జట్టులోకి రావడం, అద్భుతంగా రాణించి సెంచరీ కూడా చేయడంతో సర్ఫరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని భార్య కన్నీరు పెట్టుకుంది. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో సేవలందించిన ఆటగాడిని మీ చెత్త రాజకీయాలకు బలిచేశారు. నాలుగేళ్లుగా జట్టుకు దూరం పెట్టి.. వాటర్మాన్లాగా మార్చి ఘోరంగా అవమానించారు. సర్ఫరాజ్ కుటుంబం కన్నీటికి కారణమయ్యారు. ఇప్పుడు యాక్షన్‌లోకి దిగి తుప్పు రేగ్గొట్టేసరికి శభాష్! అంటూ కీర్తిస్తున్నారు. నాటకాలు ఆపు. ఇక చాలు!’ అంటూ స్టాండింగ్ ఓవేషన్ ఫోటో షేర్ చేసి బాబర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. (చదవండి: శివమ్ మావి కళ్లు చెదిరే క్యాచ్.. హార్దిక్ షాకింగ్ రియాక్షన్ వైరల్) ట్విస్టు ఏంటంటే? అయితే, సదరు నెటిజన్ చేసిన ట్వీట్ ఒక ఎత్తయితే, ఆ పోస్టును సర్ఫరాజ్ లైక్ చేశాడు. దీంతో అప్పటికే వైరల్‌గా మారిన ట్వీట్.. ఈ దెబ్బతో హాట్ టాపిక్ అయింది. అయితే, బాబర్ అభిమానులు కొందరు ఈ చర్యను తప్పుబట్టారు. అపార్థాలతో అనర్థమేనని కామెంట్లు చేశారు. దీంతో సర్ఫరాజ్ తన పొరపాటును తెలుసుకుని ఆ ట్వీట్‌కు లైక్‌ను తొలగించాడు. ఇదిలాఉండగా 2019, జనవరిలో సర్ఫరాజ్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాక్ నిష్క్రమణ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. (చదవండి: నేను గనుక సూర్యకి బౌలింగ్ చేసే ఉంటేనా: హార్దిక్ పాండ్యా) KAPTAAANNNNN https://t.co/tciugffgf5 pic.twitter.com/u8aetEUx83 — Outsider. (@shayaannn) January 7, 2023 -
నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు కదా! రమీజ్ రాజాకు సర్ఫరాజ్ కౌంటర్!
Pakistan vs New Zealand, 2nd Test: ‘‘షాహిద్ భాయ్ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే నన్ను పిలిచి.. నువ్వు ఈ మ్యాచ్ ఆడుబోతున్నావు అని చెప్పాడు. ప్రాక్టీసు చేస్తున్న సమయంలో బాబర్ ఆజం కూడా ఇదే మాట అన్నాడు. నేను షాహిద్ భాయ్‌తో గతంలో ఆడాను.. తనకు నా గురించి తెలుసు’’ అని పాకిస్తాన్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేశాడు సర్ఫరాజ్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా రమీజ్ రాజా స్థానంలో నజీమ్ సేతీ నియామకంతో పాటు చీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన తర్వాత జరిగిన తొలి సిరీస్ ఇది. నిరూపించుకున్నాడు ఈ క్రమంలో వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై వేటు వేసి 35 ఏళ్ల సర్ఫరాజ్‌కు ఆడే అవకాశం ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సర్ఫరాజ్ మాత్రం తనకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు (86, 53) బాదిన ఈ వికెట్ కీపర్.. రెండో మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో(78, 118) మెరిశాడు. ఈ రెండు మ్యాచ్‌లలో పాక్‌ను గట్టెక్కించి ఓటమి నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలపై సర్ఫరాజ్‌కు ప్రశ్న ఎదురైంది. కివీస్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో.. ‘‘ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయిందని రమీజ్ రాజా అన్నాడు. అయితే, వచ్చీ రాగానే.. డేరింగ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిది నీకు ఛాన్స్ ఇచ్చాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సర్ఫరాజ్’’ అని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. రమీజ్ రాజా పేరు ప్రస్తావించకుండానే.. ‘‘దేశవాళీ క్రికెట్లో రాణించాను. సరైన వ్యక్తుల మార్గదర్శనం, మీడియా ప్రోత్సాహం.. నా కుటుంబం, శ్రేయోభిలాషుల మద్దతుతో ఇక్కడి దాకా వచ్చాను’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. రమీజ్ రాజా తన గురించి మాట్లాడిన మాటలకు ఆటతోనే సమాధానం చెప్పానని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. షాహిద్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆఖరి వరకు ఉత్కంఠ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ఉత్కంఠభరిత మలుపులు తిరిగి చివరకు ‘డ్రా’గా ముగిసింది. ఒక దశలో పాక్ ఓటమి ఖాయమనిపించి, ఆపై గెలుపు అవకాశం చిక్కినా వాడుకోలేకపోగా... పేలవ బౌలింగ్‌తో చివరకు కివీస్ ‘డ్రా’తో సంతృప్తి పడాల్సి వచ్చింది. 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 0/2తో ఆట కొనసాగించిన పాక్ శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (176 బంతుల్లో 118; 9 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ సాధించగా...షాన్ మసూద్ (35), సౌద్ షకీల్ (32), ఆగా సల్మాన్ (30) అండగా నిలిచారు. ఒక దశలో 80 పరుగుల వద్దే పాక్ 5 వికెట్లు కోల్పోయింది. అయితే సర్ఫరాజ్, షకీల్ ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. సల్మాన్‌తో కూడా సర్ఫరాజ్ వేగంగా 70 పరుగులు జత చేశాడు. చివరి 15 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సి ఉండగా... తక్కువ వ్యవధిలో 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంపై గురి పెట్టింది. అయితే 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సర్ఫరాజ్ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి వికెట్ తీస్తే కివీస్ గెలుపు అందుకునే అవకాశం ఉండగా...చివరి జోడి నసీమ్ షా (15 నాటౌట్), అబ్రార్ (7 నాటౌట్) వికెట్ పడకుండా 21 బంతులు జాగ్రత్తగా ఆడారు. మిగిలిన 3 ఓవర్లలో పాక్‌కు 15 పరుగులు అవసరం కాగా... వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో రెండు టెస్టుల సిరీస్ 0–0తో డ్రాగా ముగిసింది. చదవండి: ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! Sarfaraz Ahmed’s press conference following the drawn Test in Karachi.#PAKvNZ | #TayyariKiwiHai https://t.co/oSRFkM3L2k — Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023 -
ఎనిమిదేళ్ల తర్వాత తొలి సెంచరీ.. పాక్ ఆటగాడి సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా!
నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అదరగొడుతున్నాడు. కివీస్‌తో స్వదేశంలో జరిగిన మొదటి టెస్టులో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ అహ్మద్.. తాజాగా రెండో టెస్టులో కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 118 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఇది సర్ఫరాజ్‌కు ఎనిమిదేళ్ల తర్వాత తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇక సెంచరీ సాధించిన వెంటనే సర్ఫరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. గాల్లోకి ఎగురుతూ, గ్రౌండ్‌కు పంచ్ చేస్తూ తన సెంచరీ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ కూడా డ్రాగా ముగిసింది. 319 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ విజయానికి 15 పరుగులు అవరసమవ్వగా.. వెలుతురులేమి కారణంగా ఆఖరి రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 9 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కూడా తమ విజయానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. This moment 💚 Sarfaraz delivers on his home ground 👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/LoIPI9HrcG — Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023 చదవండి: Rishabh Pant: బ్రదర్ అంటూ వార్నర్ భావోద్వేగం.. ఫొటో వైరల్ -
సౌద్ షకీల్ శతకం.. కివీస్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్
PAK VS NZ 2nd Test 3rd Day: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తుంది. సౌద్ షకీల్ (336 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) టెస్ట్‌ల్లో తన తొలి శతకంతో రెచ్చిపోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. షకీల్‌కు జతగా ఇమామ్ ఉల్ హాక్ (83), వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (78) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఘా సల్మాన్ (41) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే (122) సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్ (71), టామ్ బ్లండల్ (51), మ్యాట్ హెన్రీ (68) అర్ధశతకాలతో రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో సత్తా చాటగా.. నసీమ్ షా, అఘా సల్మాన్ 3 వికెట్లతో రాణించారు. కాగా, సప్పగా సాగుతున్న ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేశారని విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వరుస పరాభవాలను తప్పించుకునేందుకు ఈ సిరీస్ కోసం నిర్జీవమైన పిచ్‌లు తయారు చేసింది. ఇంగ్లండ్ చేతిలో పాక్ 0-3 తేడాతో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. -
క్రికెట్ రూల్స్ బ్రేక్ చేసిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మొదలైన తొలి టెస్టు మూడోరోజు ఆటలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. జ్వరం కారణంగా బాబర్ ఆజం మూడోరోజు మైదానంలోకి రాలేదు. దీంతో బాబర్ ఆజం స్థానంలో స్టాండిన్ కెప్టెన్‌గా సీనియర్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించాడు. ఇక బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా అడుగుపెట్టాడు. మ్యాచ్‌లో పలుసార్లు ఆటగాళ్లను ఫీల్డింగ్ మారుస్తూ కెప్టెన్‌గా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది.. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్ టెస్టుల్లో వైస్‌కెప్టెన్‌గా ఉన్నప్పటికి కివీస్‌తో తొలి టెస్టుకు రిజ్వాన్ స్థానంలో సీనియర్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. అతనే వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు స్టాండిన్ కెప్టెన్సీ తీసుకున్నాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా అడుగుపెట్టి కాసేపు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించి రిజ్వాన్ చర్య నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి క్రికెట్లో చట్టాలు తెచ్చే ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్) రూల్స్ ఏం చెబతున్నాయంటే.. మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన ఏ ఆటగాడైనా సరే కెప్టెన్సీ లేదా బౌలింగ్ చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే అంపైర్ అనుమతితో వికెట్ కీపింగ్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది(అదీ అంపైర్ అనుమతి ఇస్తేనే). ఇక క్రికెట్ పుస్తకాల్లో ఎంసీసీ పేర్కొన్న రూల్ 24.1.2 కూడా ఇదే చెబుతుంది. అయితే ఈ నిబంధనను రిజ్వాన్‌తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గాలికొదిలేసినట్లు కనిపించింది. ఇదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పీసీబీ కావాలనే నిబంధనను గాలికొదిలేసిందా లేక మరిచిపోయిందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కాసేపటికే డెవన్ కాన్వే రివ్యూ విషయంలో కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ డీఆర్ఎస్కు వెళ్లాడు. అయితే రివ్యూకు వెళ్లడానికి ముందు రిజ్వాన్‌తో చర్చించి డీఆర్ఎస్కు అప్పీల్ చేయడం కన్ఫూజన్‌కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ రివ్యూ పాక్‌కు ఫలితం తెచ్చిపెట్టడంతో ఈ విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇక తొలి టెస్టులో న్యూజిలాండ్ పాక్ జట్టుకు ధీటుగా బదులిస్తుంది. బాబర్ ఆజం, అగా సల్మాన్‌లు సెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 408 పరుగులతో ఆడుతుంది. కేన్ విలియమ్సన్ 85 పరుగులతో , టామ్ బ్లండెల్ 41 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డెవన్ కాన్వే 92 పరుగులు చేసి ఔటయ్యాడు. Rewarded for the tight lines maintained this morning ☝️ Excellent review 👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/jejexv1v7n — Pakistan Cricket (@TheRealPCB) December 28, 2022 చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. -
'రీఎంట్రీ కదా.. హార్ట్‌బీట్ కొలిస్తే మీటర్ పగిలేదేమో!'
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తన ఎంపిక సరైనదేనని చాటుతూ రీఎంట్రీ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో అతను 86 పరుగులు చేశాడు. అయితే క్రీజులో ఉన్నప్పుడు తన గుండె చాలా వేగంగా కొట్టుకుందని అతను అన్నాడు. ''నేను మొదటి మూడు బంతులు ఎదుర్కొన్నప్పుడు నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుందంటే.. ఆ సమయంలో నా హార్ట్‌బీట్‌ను కొలిస్తే, ఆ మీటర్ పగిలిపోయి ఉండేదేమో’ అని అతను మ్యాచ్ అనంతరం సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఇదేమి నాకు తొలి టెస్టు మ్యాచ్ కాదు. అయినా సరే ఎందుకో చాలా టెన్షన్‌గా అనిపించింది. బాబర్ మాట్లాడడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడుతుందని అనుకుంటున్నా'' అని సర్ఫరాజ్ అన్నాడు. వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది. కెప్టెన్ బాబర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 196 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. పాకిస్థాన్ భారీ స్కోర్‌కు బాటలు వేసిన సర్ఫరాజ్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 153 బంతుల్లో 86 రన్స్ చేసిన అతను ఎజాజ్ పటేల్ వేసిన 86వ ఓవర్లో అవుటయ్యాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 49 టెస్టులు, 117 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
Pak Vs NZ: బాబర్ ఆజం అజేయ శతకం, సత్తా చాటిన సర్ఫరాజ్
Pakistan vs New Zealand, 1st Test Day 1: సొంతగడ్డపై ఇటీవలే ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టుకు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మెరుగైన ఆరంభం లభించింది. సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (277 బంతుల్లో 161 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించగా, దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (153 బంతుల్లో ) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్‌కు టెస్టుల్లో ఇది 9వ సెంచరీ. ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 110/4 కాగా...ఐదో వికెట్‌కు 196 పరుగులు జోడించి బాబర్, సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్, ఎజాజ్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా వైస్ కెప్టెన్ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్ అహ్మద్‌కు తుది జట్టులో చోటు ఇవ్వడంపై చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిదిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఈ మేరకు విలువైన ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటడం విశేషం. చదవండి: IPL 2023: అన్న త్యాగం వల్లే ఇలా కోటీశ్వరుడిగా.. నాన్నను మిస్ అవుతున్నా! వాళ్లతో కలిసి ఆడతా Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే Pak VS NZ: కివీస్‌తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి Performing on his Test return 🙌 🗣️ @SarfarazA_54 opens up about his comeback and the remarkable partnership with @babarazam258 #PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/GdhPg8drZP — Pakistan Cricket (@TheRealPCB) December 26, 2022 -
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. పాక్ సీనియర్ ఆటగాడు ఎంట్రీ!
టీ20 ప్రపంచకప్-2022 రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టు.. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ హోం సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ జట్టు బాబర్ సేనతో టెస్టుల్లో తలపడనుంది. ఇక ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. ఇక గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ ఆటగాడు సర్ఫరాజ్ అహ్మద్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. సర్ఫరాజ్ చివరిసారిగా 2019లో పాకిస్తాన్ తరపున టెస్టుల్లో ఆడాడు. అదే విధంగా స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో స్పీడ్‌స్టర్ హారీస్ రౌఫ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో టెస్టులకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ అలీ, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, నౌమాన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాన్ మసూద్, జాహిద్ మెహమూద్ 🚨 Our 18-player squad for the three-Test series against England 🚨#PAKvENG pic.twitter.com/NOXoTMPYDx — Pakistan Cricket (@TheRealPCB) November 21, 2022 చదవండి: Ind Vs Ban: టీమిండియా అంటే ఆ మాత్రం ఉండాలి! వాళ్లు రాణిస్తేనే..! కనీసం 300 స్కోరు చేసి -
‘భారత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్‌దే విజయం! ఎందుకంటే.. మాకు’
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆసియా కప్-2022లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా పాక్‌తో తలపడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఇదే వేదికలో పాక్ చేతిలో ఓటమి చెందిన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. కాగా దాయాదుల పోరుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మాజీలు, క్రికెట్ నిపుణులు విజేతను ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ కోవలో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా చేరాడు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ మళ్లీ విజయం సాధిస్తుందని అహ్మద్ జోస్యం చెప్పాడు. భారత్‌పై మాదే మళ్లీ విజయం ! అహ్మద్ స్పోర్ట్స్ పాక్ టీవీతో మాట్లాడుతూ.. "మెగా టోర్నీల్లో ఏ జట్టు అయినా తమ తొలి మ్యాచ్‌ను విజయంతో ఆరంభించాలని భావిస్తుంది. ఆసియాకప్‌లో భాగంగా మా జట్టు తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో మేము పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాము. ఎందుకంటే మేము గతేడాది ఇదే వేదికపై భారత్‌ను మట్టికరిపించాం. యూఏఈలో పరిస్ధితులు పాకిస్తాన్‌కు బాగా తెలుసు. గతంలో మేము ఇక్కడ పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు అనేక ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడాము. కాబట్టి ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తాం. ఇక భారత ఆటగాళ్లకు కూడా ఇక్కడ ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. కానీ వాళ్ల కంటే యూఏఈ పిచ్‌లపై ఆడిన అనుభవం మాకే ఎక్కువ ఉంది" అని పేర్కొన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత అభిమానులు ‘‘అంతలేదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దులే. జట్టులో చోటే లేదు కానీ.. ప్రగల్భాలు పలుకుతున్నావా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా సర్ఫరాజ్ అహ్మద్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. అతడు చివరగా పాక్ తరపున 2021 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్-శ్రీలంక ఢీ ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్- శ్రీలంక తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీలో మెత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే భారత్,పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. ఇక మరో స్థానం కోసం క్వాలిఫియంగ్ రౌండ్లో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ తలపడనున్నాయి. అదే విధంగా ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్,పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ తమ జట్లను ప్రకటించాయి. చదవండి: IND vs PAK: మ్యాచ్‌కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్ -
కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ తన ఐదేళ్ల కొడుకు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. సర్ఫరాజ్ అహ్మద్ తన కొడుకు ఐదేళ్ల జూనియర్ సర్ఫరాజ్‌తో కలిసి ఒక గల్లీ క్రికెట్లో పాల్గొన్నాడు. తాను సరదాగా బ్యాటింగ్ చేయగా.. కొడుకు బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ కొడుకు ఒక పర్ఫెక్ట్ యార్కర్ సంధించగా.. సర్ఫరాజ్ అహ్మద్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తన కుమారుడివైపు ఒక లుక్ ఇచ్చిన సర్ఫరాజ్ చిరునవ్వుతో తన కొడుకును మెచ్చుకున్నాడు. ఐదేళ్ల అబ్దుల్లా(సర్పారజ్ అహ్మద్ కొడుకు) ఇప్పటికే లోకల్ క్రికెట్ అకాడమీలో క్రికెటర్‌గా రూపుదిద్దుకుంటున్నాడు. కాగా గతంలో ఇక్కడి రాజకీయాలతో విసిగిపోయానని.. అది క్రికెట్‌కు కూడా పాకిందని.. తన కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లో క్రికెటర్‌ను కానివ్వను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి తాజాగా తనను క్లీన్‌బౌల్డ్ చేసిన కుమారుడిని భవిష్యత్తులో స్టార్ క్రికెటర్‌గా మారుస్తాడేమో చూడాలి. ఇక సర్ఫరాజ్ అహ్మద్‌కు పాకిస్తాన్ టీంలో అంతగా అవకాశాలు రావడం లేదు. దీనికి ఒక కారణం ఉంది. వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ అహ్మద్ మంచి బ్యాటర్ కూడా. అయితే మహ్మద్ రిజ్వాన్ రూపంలో పాక్‌కు మంచి యంగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దొరికాడు. ప్రస్తుతం రిజ్వాన్ అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దీంతో సర్ఫరాజ్ అహ్మద్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. సర్ఫరాజ్ చివరిసారి పాక్ తరపున 2021 ఏప్రిల్‌లో సౌతాఫ్రికాతో ఆడాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్ 2017లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలుచుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ట్రోపీని దక్కించుకుంది. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 49 టెస్టుల్లో 2657 పరుగులు, 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టి20ల్లో 818 పరుగులు సాధించాడు. Shabash Beta Abba ki he wicket he ura di 👏👏🔥 @SarfarazA_54 pic.twitter.com/rpvdxcNUVv — Thakur (@hassam_sajjad) June 20, 2022 చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' కామెంటరీ ప్యానెల్ ఇదే.. మరో క్రికెట్ జట్టును తలపిస్తుందిగా! -
పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు
3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ హైదర్ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్‌తో హైదర్ అలీకి చోటు లేదు. అజమ్ ఖాన్, మహ్మద్ హస్నైన్ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఫఖర్ జమాన్‌ను కుష్దిల్ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్ టి20 కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ ముహముద్ వసీమ్ పేర్కొన్నారు. ''ఈ ముగ్గురు నేషనల్ టి20 కప్‌లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్ ఖాన్, కుష్దిల్ షా, హస్నైన్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు
కరాచీ: జట్టును ముందుండి నడిపించడంలో పాక్ మాజీ సారధి సర్ఫరాజ్ అహ్మద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టైల్ ఒకేలా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్టైల్ వాళ్లిద్దరికి పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. జూన్ 9 నుంచి ప్రారంభంకానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొనేందుకు పాక్ చేరుకున్న డుప్లెసిస్.. శనివారం పాక్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. పీఎస్ఎల్లో సర్ఫరాజ్ సారథ్యంలోని క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న డుప్లెసిస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ధోనీ, సర్ఫరాజ్‌ల కెప్టెన్సీలను పోల్చే క్రమంలో కోహ్లీ సారథ్యం గురించి ఆయన మాట్లాడుతూ.. సర్ఫరాజ్ కూడా కోహ్లీలాగే మైదానంలో దూకుడుగా ఉంటాడని, ప్రతి ఒక్క ఆటగాడితో క్రమం తప్పకుండా మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటాడని, ముఖ్యంగా బౌలర్లతో ప్రతి బంతికి ముందు, తర్వాత సంభాషిస్తాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో ధోనీ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుందని, ఆయన మైదానంలో కూల్‌గా, రిజర్వ్డ్గా ఉంటాడని, సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ తరవాతే ఎవరైనా అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. అయితే జట్టును నడిపించడంలో ఎవరి శైలి వారికుంటుందని, ఈ విషయంలో ఒకరితో ఒకరిని పోల్చలేమని ఆయన పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తనకు వివిధ కెప్టెన్లతో కలిసి ఆడాలని ఉంటుందని, వాళ్లంతా తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలని ఉంటుందని ఈ దక్షిణాఫ్రికా మాజీ సారథి తెలిపాడు. తనకు మొదటి నుంచి కెప్టెన్సీ అంటే మక్కువని, దక్షిణాఫ్రికా జట్టుకు సారధ్యం వహించడం ద్వారా తన కల నెరవేరిందని వెల్లడించాడు. సర్ఫరాజ్ సారథ్యంలో ఆడటాన్ని ఆస్వాధిస్తానని, అవసరమైతే అతనికి సలహాలు, సూచనలు చేస్తానని తెలిపాడు. ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే తరఫున ఆడిన ఫాఫ్.. 7 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఐపీఎల్ అర్ధంతరంగా రద్దు కావడంతో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. చదవండి: అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోను.. -
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు
కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథులు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతోపాటు పేసర్ మొహ్మమ్మద్ అమీర్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో వీరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్ నేషనల్ టి20 కప్‌లో రాణించిన సెంట్రల్ పంజాబ్ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్‌కు మొదటిసారి సీనియర్ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్ ద్వయం హసన్ అలీ, నసీమ్ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ను నియమించిన పీసీబీ... వైస్ కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది భారత్‌లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు. -
సర్ఫరాజ్ ఈజ్ బ్యాక్
కరాచీ: గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తాచాటిన పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ హైదర్ అలీ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆగస్టులో ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి పాకిస్తాన్ జట్టులో హైదర్ అలీ చోటు దక్కించుకున్నాడు. ఇక నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టులో సొహైల్ ఖాన్‌కు అవకాశం దక్కింది. మరొకవైపు గతేడాది అక్టోబర్‌లో పాక్ తరఫున చివరిసారి కనిపించిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ రీఎంట్రీ ఖాయమైంది. ఇంగ్లండ్‌కు వెళ్లే 29 మందితో కూడిన పాక్ జట్టులో సర్ఫరాజ్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. (ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్) ఇక పాకిస్తాన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేశారు. అటు టెస్టు క్రికెట్‌కు ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకేసారి పీసీబీ సెలక్టర్లు జట్టును ప్రకటించారు.గత పీసీబీ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన పేసర్ వహాబ్ రియాజ్‌కు మరొకసారి అవకాశం ఇచ్చారు. కాగా, మహ్మద్ అమిర్, హారిస్ సొహైల్‌లు ఇంగ్లండ్ పర్యటనకు దూరం కానున్నారు. అమిర్ భార్య ఆగస్టులో ప్రసవించే అవకాశం ఉండటంతో అతను ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు. టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి, కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్న అమిర్.. పీసీబీ అనుమతితో ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు.(‘సొహైల్.. నా రక్తం మరిగేలా చేశాడు’) -
సర్ఫరాజ్‌కు డిమోషన్..!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ క్రమేపీ తన ఉనికిని కోల్పోతున్నాడు. గతేడాది నవంబర్‌లో అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా మూడు ఫార్మాట్ల నుంచి తొలగించబడ్డ సర్ఫరాజ్.. తాజాగా మరింత కిందకి పడిపోయినట్లు తెలుస్తోంది. 2020-21 సీజన్‌కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉ్నన కొత్త కాంట్రాక్ట్ జాబితాలో సర్ఫరాజ్‌కు సి కేటగిరీ కేటాయించినట్లు తెలుస్తోంది.. గతంలో కెప్టెన్‌గా చేసిన సమయంలో ‘ ఏ’ కేటగిరీలో ఉన్న సర్ఫరాజ్‌కు ‘సి’తో సరిపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో 19 క్రికెటర్లకు మాత్రమే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ 32 మందికి చోటు కల్పిస్తూ వచ్చిన పీసీబీ వారిని 19కి కుదించింది. తాజాగా వారికే తిరిగా చోటు కల్పించడానికి సిద్ధమైన పీసీబీ.. 2017 చాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ అయిన సర్ఫరాజ్‌కు ‘సి’తో సరిపెడితే చాలని భావిస్తోంది. ('పాంటింగ్ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం') గతంలో సర్పరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ‘ఎ’ కేటగిరీని దక్కించుకున్నాడు. బాబర్ అజామ్, యాసిర్ షాలతో కలిసి సర్ఫరాజ్ కొంతకాలం ‘ఎ’ కాంట్రాక్ట్ విభాగంలో కొనసాగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా లేని సర్ఫరాజ్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే అతనికి ‘సి’ కేటాగిరీ కేటాయించినట్లు పీసీబీ వర్గాల సమాచారం. అదే సమయంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించడానికి కూడా పీసీబీ సిద్ధమైంది. ప్రస్తుత పీసీబీ నిబంధనల ప్రకారం ’ఏ’ కేటగిరీలో ఉన్న ఆటగాడికి టెస్టు మ్యాచ్ ఫీజు రూ. 7, 62,300 ఉండగా, బి కేటగిరీలో ఉన్న ఆటగాడికి రూ. 6,65,280 గా ఉంది. ఇక సి కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5, 68, 260 గా ఉంది. గతేడాది చివర్లో శ్రీలంకతో జరిగిన స్వదేశీ సిరీస్ తర్వాత సర్ఫరాజ్ మళ్లీ పాకిస్తాన్ తరఫున ఆడలేదు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన గత వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్ స్టేజ్‌కు వెళ్లకుండానే నిష్క్రమించింది. దానిలో భాగంగా ప్రక్షాళన చేపట్టిన పీసీబీ.. ముందుగా కెప్టెన్ సర్ఫరాజ్‌ను కోచ్ మికీ ఆర్థర్‌లకు ఉద్వాసన పలికింది. సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తొలగించినా ఆటగాడిగా మాత్రం ఉంచింది. అయితే కెప్టెన్సీ భారం తగ్గినా సర్ఫరాజ్ ఆటలో మార్పు రాకపోవడంతో అతన్ని ఆటగాడిగా తప్పించింది. మళ్లీ సర్ఫరాజ్‌కు చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్న పీసీబీ.. కనీసం సి కేటగిరిలో ఉంచినట్లు సమాచారం.(ధావన్ ఒక ఇడియట్.. స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
సర్ఫరాజ్‌కు పీసీబీ షాక్!
కరాచీ: గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ వన్డే కెప్టెన్సీ హోదాలో మాత్రం కొనసాగుతూ వస్తున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. గతేడాది అక్టోబర్‌లో సర్ఫరాజ్‌ను టెస్టు కెప్టెన్సీ, టీ20 కెప్టెన్సీ పదవుల నుంచి తొలగించిన పీసీబీ.. అజహర్ అలీకీ టెస్టు కెప్టెన్ పదవి కట్టబెట్టగా, బాబర్ అజామ్‌కు టీ20 సారథ్య బాధ్యతలను అప్పగించింది. అయితే పాకిస్తాన్‌కు వన్డే సిరీస్‌లు లేకపోవడంతో అప్పట్లో ఆ ఫార్మాట్ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌నే కొనసాగిస్తున్నామని పీసీబీ పేర్కొంది. అయితే ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో ఏకైక వన్డే జరుగుతుండటంతో సర్ఫరాజ్‌కు మొత్తంగా ఉద్వాసన పలకాలనే యోచనలో ఉంది పీసీబీ. ప్లేయర్‌గా కూడా ఆ మ్యాచ్‌లో సర్ఫరాజ్ చోటు ఇవ్వడానికి సుముఖంగా లేని పీసీబీ సెలక్టర్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా ఎవర్ని చేయాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. (ఇక్కడ చదవండి: సర్ఫరాజ్ ఇక దేశవాళీ ఆడుకో: ఇమ్రాన్) ఈ రేసులో ముందు వరుసలో ఉన్న పేరు బాబర్ అజామ్. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్న అజామ్‌నే వన్డే ఫార్మాట్‌కు కూడా కెప్టెన్‌గా చేయాలని పీసీబీ ఇప్పటికే ప్రణాళికలు చేసింది. అయితే సర్ఫరాజ్‌ను పక్కకు పెడుతున్నారనే వార్తల నేపథ్యంలో విమర్శలు మొదలయ్యాయి. గతేడాది వరుసగా ఆరు వన్డే మ్యాచ్‌ల్లో విజయాలు అందించిన సర్ఫరాజ్‌కు ఉద్వాసన చెప్పడం మంచి నిర్ణయం కాదని ఆ దేశీ మాజీలు అంటున్నారు. 2017లో సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాకుండా అతనే నేతృత్వంలోని టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ టాప్కు చేరుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇది సర్ఫరాజ్‌కు జరిగిన నష్టంగానే చూడాలని పాకిస్తాన్ మాజీ చీఫ్ సెలక్టర్ మొహిసిన్ ఖాన్ తెలిపారు. అతను కీపర్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ప్లేయర్‌గా అన్యాయం చేస్తున్నారన్నాడు. -
ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ప్రభుత్వం కీలకమైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పదవిని కట్టబెట్టింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇప్పటివరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చూస్తుండగా, ఆయన్ను తప్పించి ఆ విభాగాన్ని సర్ఫరాజ్‌కు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సర్ఫరాజ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల వ్యయం విషయంలో తనకు వ్యతిరేకంగా సర్ఫరాజ్ బీజే పీ ఎంపీ బండి సంజయ్‌తో కలసి కుట్ర చేశారని జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. దీనిపై ఆయన సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశా రు. ఈ వివాదం తర్వాత సర్ఫరాజ్‌కు కీలకమైన ఎక్సై జ్ శాఖ పోస్టు లభించడం గమనార్హం. రెవెన్యూ కార్యదర్శిగా ‘బుసాని’ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్ బుసాని వెంకటేశ్వర్లు ను రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఎ.అశోక్‌ను డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్ కె.శశాంక కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
సర్ఫరాజ్ ఇక దేశవాళీ ఆడుకో: ఇమ్రాన్
కరాచీ: ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్‌కు చేరుకుండా నిష్క్రమించడంతో ఆ మెగాటోర్నీలో ఆ దేశ కెప్టెన్‌గా వ్యవహరించిన సర్ఫారాజ్ అహ్మద్‌పై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఇటీవల సర్ఫరాజ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తొలగిస్తూ పీసీబీ నిర్ణయం కూడా తీసుకుంది. మరొకవైపు ఆసీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కూడా సర్ఫరాజ్‌కు అవకాశం దక్కలేదు. దీన్ని ఉదహరిస్తూనే సర్పరాజ్ అహ్మద్‌ను దేశవాళీ క్రికెట్ ఆడుకోమంటూ ఆ దేశ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సలహా ఇచ్చారు.వరల్డ్‌కప్‌లో పాక్ పేలవ ప్రదర్శన తర్వాత తమ క్రికెట్ జట్టు ఎలా ఉండాలో తానే నిర్దేస్తానంటూ ఇమ్రాన్ ఆ సమయంలోనే పేర్కొన్నాడు. ఇప్పుడు అదే పనిలో ఇమ్రాన్ నిమగ్నమయ్యారు. ముందుగా సర్ఫరాజ్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలో ఇమ్రాన్ సూచించాడు. జాతీయ జట్టులో కొనసాగుతున్నప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్న సర్పరాజ్‌ను ముందుగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడమంటూ ఇమ్రాన్ హితబోధ చేశారు.‘ ఇక సర్ఫరాజ్ దేశవాళీ మ్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. టీ20 ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగాడి ఫామ్‌ను అంచనా వేయలేం. టెస్టు క్రికెట్ కానీ, వన్డే క్రికెట్లో కానీ ఒక ఆటగాడి ప్రదర్శన బయటకు వస్తుంది. ముందుగా సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ చేయాలి. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన అవసరం. నువ్వు ఘనంగా పాకిస్తాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తావనే అనుకుంటున్నా’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.ఇక పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన మిస్బావుల్ హక్‌పై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ క్రికెట్ కోచ్‌గా మిస్బావుల్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. అతనొక అత్యుత్తమ ఆటగాడు కావడంతో ప్రస్తుత జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శనకు కూడా మెరుగవుతుందన్నారు. -
కలెక్టర్‌తో బండి సంజయ్ ఫోన్‌కాల్.. వైరల్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో జరిపిన సంభాషణ దాదాపు ఏడాది తరువాత రచ్చకెక్కింది. ఆ ఎన్నికల్లో కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా కమలాకర్ పరిమితికి మించి ఖర్చు చేశారని కోర్టును ఆశ్రయించిన సంజయ్.. కలెక్టర్ సహకారం కోరినట్లుగా లీకైన ఆడియోలో ఉంది. కలెక్టర్ స్పష్టత లేని తెలుగులో మాట్లాడగా, సంజయ్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. గంగుల పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసిన అంశం, దానికి సంబంధించిన పత్రాల సమర్పణ వంటి విషయాలే చర్చకు వచ్చినట్లుగా ఉంది. టేప్‌లో 1.30 నిమిషాల సంభాషణ ఉంది. ఈ లీకైన ఆడియో టేపుపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించారు. తనను ఎన్నికల్లో ఓడించేందుకు మొదట కుట్ర చేశారని, అది సాధ్యం కాకపోవడంతో గెలిచిన తరువాత డిస్క్వాలిఫై చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బండి సంజయ్ కలెక్టర్‌తో కలసి కుట్ర చేశారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కలెక్టర్ తనపై ఓడిపోయిన అభ్యర్థికి సహకరించే విధంగా ఫోన్లో మాట్లాడటాన్ని తప్పు పట్టారు. ఈ ఆడియో టేపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి కమలాకర్ పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేశారని కోర్టును ఆశ్రయించినట్లు బండి సంజయ్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున లీకైన ఆడియో టేప్ గురించి తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. సంజయ్‌తో జరిగిన సంభాషణకు లీకైన ఆడియో టేప్‌కు సంబంధం లేదని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. ఎనిమిది నిమిషాల తమ సంభాషణను కటింగ్, మిక్సింగ్ ద్వారా 1.30 నిమిషాలకు కుదించి వైరల్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఒరిజినల్ ఆడియో టేప్‌ను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. మల్లికార్జున్ ఫోన్ నుంచే ఆడియో లీక్? కలెక్టర్, ఎంపీ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. సంజయ్ వాడే ఫోన్లో వాట్సాప్‌గానీ, వాయిస్ రికార్డర్ ఆప్షన్ గానీ ఉండదు. కలెక్టర్ ఫోన్ నుంచి ఆడియో లీకయ్యే అవకాశం లేదు. దీనిపై విచారిస్తే .. ఫోన్ సంభాషణలో కలెక్టర్ మాట్లాడుతూ ‘మీ నంబర్ నాకు మెసేజ్ చేస్తే సేవ్ చేస్తా.. వాట్సాప్ పంపిస్తా’అని చెప్పగా, తనకు వాట్సా ప్ లేదని సంజయ్ చెప్పారు. దాంతో కలెక్టర్ ‘నేను మల్లికార్జున్‌కు చేస్తా. ఆయన మీకు చూపిస్తారు’అని అంటారు. దీన్ని బట్టి సంజయ్.. మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ నుంచి మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. మల్లికార్జున్ ప్రస్తుతం ఓ పత్రికకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పత్రిక (ప్రస్తుతం మూతపడింది)కు విలేకరిగా వ్యవహరించారు. ఆయన ఫోన్ నుంచే సంజయ్ మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని కలెక్టర్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. తానెవరి ఫోన్ నుంచి కలెక్టర్‌తో మాట్లాడలేదని, తన ఫోన్‌తోనే మాట్లాడినట్లు సంజయ్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. కలెక్టర్ తన విధులను అపహాస్యం చేశారు: గంగుల ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్‌ల మధ్య ఫోన్ సంభాషణపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కొంతమంది అధికారులు, నాయకులు కలసి తనను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న కలెక్టర్ ప్రభుత్వ ఆంతరంగిక అంశాలను బయట వ్యక్తులకు చెప్పడం సరికాదన్నారు. కుట్రలు, కుతంత్రాల మధ్య ఎంపీ సంజయ్ ఉన్నారని..ప్రజల మధ్య తానున్నానని స్పష్టం చేశారు. ఈ ఆడియో వంద ప్రశ్నలకు సమాధానం చెప్తుందని, ప్రజా దీవెనలు లేకపోతే ఎప్పుడో బలయ్యే వాడినన్నారు. ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ లీకులకు పాల్పడితే ప్రజలకు ప్రజాస్వా మ్యం మీద నమ్మకం పోతుందన్నారు. అది 8 నిమిషాల సంభాషణ: కలెక్టర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు విడుదలైన 2018 డిసెంబర్ 11 తరువాత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన బండి సంజయ్ నాతో మాట్లాడారు. సంజయ్ వేరే వ్యక్తి ఫోన్ నుంచి 8 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు గెలిచిన కమలాకర్ సమర్పించే ఎన్నికల ఖర్చును తగ్గించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారేమోనని సంజయ్ అనుమానం వ్యక్తం చేస్తే, అలాంటిదేమీ ఉండదని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పాను. చాలా విషయాలపై సంజయ్ మాట్లాడితే, రిటర్నింగ్ అధికారిగా ఆయన అనుమానాలు నివృత్తి చేశాను. రాజ్యాంగబద్ధ హోదాలో దానికి కట్టుబడే మాట్లాడాను. నేను సంజయ్‌తో ఎనిమిది నిమిషాలు మాట్లాడగా, లీకైనట్లు చెపుతున్న ఆడియో కాల్ 1.30 నిమిషాలే ఉంది. ఎనిమిది నిమిషాల కాల్లో కట్, పేస్ట్ విధానం ద్వారా ఎవరో వాళ్లకు అవసరమైన సంభాషణను మిక్స్ చేసి ఆడియోగా రూపొందించి, వైరల్ చేశారు. గతంలోనే నాకు ఒకరు 8 నిమిషాల ఆడియో టేప్ పంపించారు. అది ప్రభుత్వానికి సమర్పిస్తా. మీడియాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. తాను సంజయ్‌తో కలసి కుట్ర చేశానని మంత్రి గంగుల వ్యాఖ్యానించడం బాధాకరమని, ఆ ఆడియో టేపులో సంజయ్‌ను ఫోన్ నంబర్ పంపించమని చెప్పడం స్పష్టంగా తెలుస్తుందని, ఫోన్ నంబరే లేని వ్యక్తితో కలసి కుట్రలు ఎలా పన్నుతానని చెప్పారు.