Shivraj Singh Chouhan
-
చిరిగిన సీటు ఇస్తారా..?ఎయిర్ఇండియాపై మంత్రి ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టిన చౌహాన్ తర్వాత దానిని డిలీట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.ఎయిర్ఇండియా ప్రయాణికులను మోసం చేస్తోంది.ఇటీవల తాను భోపాల్ నుంచి ఢిల్లీ రావడం కోసం ఎయిర్ఇండియా విమానం ఏఐ436లో ఒక సీటు బుక్ చేసుకున్నాను.తీరా విమానం ఎక్కి చూస్తే ఆ సీటు చినిగిపోయి కిందకు నొక్కుకొనిపోయి ఉంది. ఈ విషయమై విమానం సిబ్బందిని అడిగితే ఈ సమస్య ఇప్పటికే మేనేజ్మెంట్ దృష్టిలో ఉందని, ఆ సీటు ఎవరికీ విక్రయించొద్దని సమాచారమిచ్చినట్లు చెప్పారు’అని శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు.ఈ వ్యవహారంపై ఎయిర్ఇండియా సంస్థ వెంటనే స్పందించింది. మంత్రి చౌహాన్‌కు క్షమాపణలు చెప్పింది.కాగా ఎయిర్ఇండియా విమానయాన సంస్థ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది. ఈ సంస్థను టాటా గ్రూపు టేక్ఓవర్ చేసి ప్రస్తుతం నిర్వహిస్తోంది. తమ ఆధ్వర్యంలో నడిచే మరో విమానయాన సంస్థ ఎయిర్ విస్తారాను కూడా టాటాలు ఇటీవలే ఎయిర్ఇండియాలో విలీనం చేశారు. -
‘గూడు’ కట్టుకున్న నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: సొంత గూడు లేని గ్రామీణ పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను కక్ష కట్టి రద్దు చేయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు కేంద్రం నుంచి గ్రామీణ పేదలకు ఇళ్ల కేటాయింపులు చేయించడంలో సైతం ఘోరంగా విఫలమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202425)లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ(పీఎంఏవైజి) కింద కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలకు 84.37 లక్షల ఇళ్లు కేటాయించింది. ఇందులో 35.58 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 684 ఇళ్లు కేటాయించి.. 505 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ విషయాన్ని లోక్‌సభ సాక్షిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి ఇంత తక్కువ సంఖ్యలో పేదలకు ఇళ్ల కేటాయింపులు, మంజూరైన దాఖలాల్లేవు. ఆఖరికి చిన్న రాష్ట్రమైన మణిపూర్ కూడా 7,000 ఇళ్లను దక్కించుకోగా.. ఆ మాత్రం కూడా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సాధించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ గ్రామీణ పేదలకు ఇళ్లు మంజూరు చేయించుకోలేని దుస్థితిలో ఉండటం గమనార్హం. భారీగా నష్టపోయిన పేదలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేయడంతో పాటు వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధించడమే లక్ష్యంగా రెడ్‌బుక్ పాలనపైనే దృష్టి సారించింది తప్ప పేదలకు మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పేదలకు ఇంటి స్థలాలను కేటాయించి లబ్ధిదారుల వివరాలన్నీ ఆన్లైన్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది.అర్హత, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఇళ్లు కేటాయిస్తుంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పేదల ఇళ్లకు సంబంధించి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో దేశంలోని 17 రాష్ట్రాలు లక్షలు, వేల సంఖ్యలో కేంద్రం నుంచి ఇళ్ల కేటాయింపులు దక్కించుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం వందల ఇళ్లతోనే సరిపెట్టుకుంది. దీంతో లక్షల సంఖ్యలో పేదలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలో31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు.. 22 లక్షల ఇళ్లునవరత్నాలుపేదలందరికీ ఇళ్లు పథకం కింద గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికిపైగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. మొత్తంగా దాదాపు 22 లక్షల ఇళ్లు. ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి.. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గత ఐదేళ్లలో సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు సీఎం జగన్ అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం అందించారు.ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు ఇస్తూ మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. ఇంతలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఈ ఇళ్లు పూర్తయితే జగన్‌కు మంచి పేరొస్తుందని.. ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తోంది. కాలనీల పేర్లు మార్చేస్తోంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్మాణం చేపట్టని స్థలాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని ప్రకటించింది. వచ్చే నెల తర్వాత పూర్తి చేసుకున్న ఇళ్లకు బిల్లులు కూడా ఇవ్వం అని తేల్చి చెప్పింది. ప్రభుత్వ దుర్మార్గ చర్యలతో ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
బురద గోతిలో దిగబడిన శివరాజ్‌సింగ్ కారు
బహరగోరా: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ నేపధ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తరచూ జార్ఖండ్‌లో పర్యటనలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన జార్ఖండ్‌లోని బహరగోరా చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బురద గుంతలో కూరుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన భద్రతా సిబ్బంది కారు చుట్టూ నిలబడి, కారును గొయ్యి నుంచి బయటకు తీయడాన్ని చూడవచ్చు. #WATCH | Jharkhand | Union Minister Shivraj Singh Chouhan's car today got stuck in a muddy pothole amid rains today in Baharagora where he was for a public rally pic.twitter.com/ZYrZanee9K— ANI (@ANI) September 23, 2024ఇంతటి వర్షం మధ్యనే బహారగోరాలో జరిగిన బహిరంగ సభలో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘మేఘాలు గర్జిస్తున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాతావరణాన్ని చూస్తుంటే జార్ఖండ్‌లో చీకటి పోతుందని, సూర్యుడు ఉదయిస్తాడని, కమలం వికసిస్తుందని, మార్పు వస్తుందని నేను చెప్పగలను. జార్ఖండ్‌లోని మట్టిని, ఆడబిడ్డలను కాపాడుకుంటామని భారతీయ జనతా పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను’ అని అన్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
వ్యవసాయ విజయాలకు పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఆగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పథకం అమల్లో అంకితభావం, విజయాలకు గుర్తింపుగా తెలంగాణకు అవార్డును అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌కు అవార్డును ప్రదానం చేశారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ అమల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన రాష్ట్రంగా తెలంగాణను గుర్తించారు.కాగా ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.2,836 కోట్ల మేర ప్రయోజనం లభించింది, ఈ నిధులతో 2,199 ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు నెలకొల్పామని రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో నెలకొలి్పన యూనిట్లలో ప్రధానంగా 1,322 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, 785 గిడ్డంగులు, 163 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 101 పోస్ట్–హార్వెస్ట్ సౌకర్యాలున్నాయి. వీటిద్వారా రాష్ట్ర రైతులు మెరు గైన వసతులతో అధిక ఆదాయం పొందుతున్నా రని రఘునందన్ రావు తెలిపారు. ఈ స్కీమ్ కింద అత్యుత్తమ పనితీరున్న జిల్లాలుగా నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట గుర్తింపు పొందాయి. ఈ స్కీమ్ కింద రైతులకు 3% వడ్డీ సబ్సిడీ లభిస్తోంది. తద్వా రా రైతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి తీసుకునే రుణాలపై 6% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల రుణం వరకు వేరే హామీ అవసరం లేదు. -
కేంద్రం ఆదుకోవాలి... తక్షణ సాయం అందించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరద బీభత్సంతో అపారనష్టం వాటిల్లిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు. సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచి్చన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్, బండి సంజయ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమయ్యారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తోపాటు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు.మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణసాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర కలి్పంచండి: తుమ్మల విన్నపం ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహాన్కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు. తెలంగాణలో కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫారి్మంగ్‌ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చౌహాన్ త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నిబంధనలను సడలించాలి విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లు కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పారీ్టలు, రాజకీయాలకు తావులేదని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. -
రాజకీయాలకు కాదు..రైతుల కోసం వచ్చాం
కూసుమంచి: ‘భారీగా వరదలు వచ్చాయి.. రైతులు ఎంతో నష్ట పోయారు. ఈ నష్టాన్ని కళ్లారా చూశాను. రైతులను ఆదుకునేందుకే నేనూ, హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీ వద్దకు వచ్చామే తప్ప రాజకీయాల కోసం కాదు’ అని కేంద్ర వ్యవసా యశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు శుక్రవారం కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఖమ్మం జిల్లాకు వచ్చారు. ముందుగా ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాక.. కూసుమంచి మండలానికి చేరుకున్నారు.అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి జాతీయరహదారి గుండా వెళుతూ పాలేరువాగు వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పాలేరు వద్ద ఎడమకాల్వకు పడిన గండి, నర్సింహులగూడెం వద్ద దెబ్బతిన్న వరిని పరిశీలించి నష్టంపై ఆరా తీశారు. ఆ తర్వాత నవోదయ విద్యాలయంలో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వరద నష్టంపై ఆయా జిల్లాల అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.నేనూ రైతునే..వరదలకు వరి, మిర్చి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఏరియల్ సర్వే ద్వారా గమనించానని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. తాను రైతునేనని, రైతుల కష్టా లు తెలుసునని చెప్పారు. వందేళ్లలో ఇవే భారీ వర దలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగా.. వాస్తవాన్ని చూసి చలించిపోయానన్నారు. ఒక్క పంటలే కాకుండా ఇళ్లు, వస్తువులు దెబ్బతినగా జంతు వులు మృత్యువాత పడ్డాయని, రైతులు ఈ వరదల్లో పంటలనే కాదు, వారి జీవనాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రైతులకు ఎలా మేలు చేయా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, అందుకే ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపో వాల్సి వచ్చిందని మంత్రి చౌహాన్ తెలిపారు.రైతు కన్నీరు.. ఓదార్చిన కేంద్ర మంత్రినవోదయ విద్యాలయంలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన రైతు హలావత్ వెంకన్న హిందీలో మాట్లాడారు. వరదలతో తాము సర్వస్వం కోల్పోయామని, ఆశలన్నీ గల్లంతయ్యాయని కన్నీరు పెడుతూ కేంద్రమంత్రి చౌహాన్ కాళ్లపై పడబోగా ఆయన రైతును పైకి లేపి ఓదార్చారు. ‘మీ బాధలు కళ్లారా చూశాను.. కంటనీరు రానివ్వం’ అని భరోసా కల్పించారు. పర్యటన అనంతరం నాయ కన్‌గూడెం టోల్‌ప్లాజా నుంచి కేంద్ర మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒకే హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు. -
ఢిల్లీకి మారిన శివరాజ్ సింగ్ చౌహన్.. కుమారుడికి లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీకి మకాం మార్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ సీఎం హస్తీనాకు షిఫ్ట్ అయ్యారు.అయితే చౌహన్ నిర్ణయంతో ఆయన కుమారుడు కార్తీకే సింగ్ చౌహన్ రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బుధ్నీఅసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చౌహన్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మోరెనా నుంచి పోటీ గెలుపొందారు. ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బుధ్నీ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఇక్కడి నుంచి ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు కార్తీకే బరిలో దిగనున్నట్లు సమాచారం. -
ఆ ముగ్గురు రాజకీయ జోకర్లు.. మాజీ సీఎం సెటైర్లు
బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్, శివసేన నేతలను జోకర్లుగా అభివర్ణించారు. ఆ ముగ్గురు రాజకీయ జోకర్లుకాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడా, శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోకర్లని, వాళ్లని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇలా చేస్తూనే ఉంటారు. ప్రజలు వాటిని ఎంటర్టైన్గా భావిస్తారని తెలిపారు. ఎవరూ సీరియస్‌గా తీసుకోరువారి స్థాయి కంటే దిగజారి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో రాజకీయ జోకర్లుగా మారారు. అయ్యర్, పిట్రోడా, రౌత్‌లను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు అని చౌహాన్ వ్యాఖ్యానించారు. 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ‘ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు మేధోపరంగా దివాళా తీశారు. ఇది మునుపటి బలహీనమైన యూపీఏ ప్రభుత్వం కాదని, 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం’ అని ఇదే విషయాన్ని అయ్యర్ గమనించాలి చౌహాన్ సూచించారు.భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్‌మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చౌహాన్.. ‘భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి బాటలు వేశారని అన్నారు. అదే సమయంలో దేశానికి ఇబ్బంది కలిగించే ఎవరినీ విడిచిపెట్టరని హెచ్చరించారు.ప్రపంచ దేశాలకు భారత్ విశ్వ గురువు ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం విశ్వ గురువుగా మారుతుంది. ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాంగ్రెస్ మరో ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడవలసి ఉంటుంది. కానీ అలా చేయడానికి తగినంత మంది సభ్యులు ఉండరు’ అని చౌహాన్ నొక్కాణించారు. -
లోక్‌సభ బరిలో మాజీ సీఎం.. అక్కడి నుంచే పోటీ?
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు సాధించాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి 370కు పైగా సీట్లను గెలుస్తుందని ఇటీవల ఆయన ప్రకటించారు. మరోవైపు విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల పంపకాల చర్చలు ఇంకా ఖరారు కాలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. అయితే బీజేపీ కాంగ్రెస్‌లు ఇంకా ఎవరి పేరును ప్రకటించలేదు. కాగా తాజాగా మీడియాకు అందిన సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని విదిశ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విదిశ జిల్లా జనాభా దాదాపు 14.5 లక్షలు. ఇక్కడ 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1989 నుంచి ఇక్కడ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి చెందిన రమాకాంత్ భార్గవ విదిశ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయనకు టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిపై రమాకాంత్ భార్గవ విజయం సాధించారు. ఈ స్థానంలో మొత్తం 12,50,244 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థికి 3,49,938 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రమాకాంత్ భార్గవకు 8,53,022 ఓట్లు దక్కాయి. మధ్యప్రదేశ్‌లోని ఇతర స్థానాల మాదిరిగానే విదిశలో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎవరిని బరిలోకి దింపుతాయో అధికారికంగా ఇంకా నిర్ణయం వెల్లడికాలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ విషయానికొస్తే విదిశ అతని సొంత జిల్లా. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన విదిశ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఆయనకు విదిశ టిక్కెట్ ఇవ్వనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆశించడం కంటే చనిపోవడం మేలు: మాజీ సీఎం శివరాజ్ సింగ్
భోపాల్: సీఎం పదవి నుంచి దిగిపోయినవేళ మధ్యప్రదేశ్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం బాధ్యతలు చేపట్టనుండగా, మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి తనకు ఏదో ఒక పదవి కావాలని అధిష్టానాన్ని కోరుకోవడం కంటే చనిపోవడం మేలని పేర్కొన్నారు. అలా తాను అడగలేనని చెప్పారు. తన ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త సీఎం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయంలో ఆయనకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మహిళా కార్యకర్తలు కొందరు కంటనీరు పెట్టుకోవడం, శివరాజ్‌సింగ్ భావోద్వేగానికి గురైనట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 📌 Women Supporters get Emotional while meeting Outgoing Madhya Pradesh CM Shivraj Singh Chouhan. #TNI #Insight #PiN #Politics #MadhyaPradesh #Women #ShivrajSinghChouhan pic.twitter.com/8KDwHOwnHw — The News Insight (TNI) (@TNITweet) December 12, 2023 బీజేపీ అనూహ్య నిర్ణయం.. మరోవైపు.. మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపారు. One tight slap to Congress handles pic.twitter.com/gj6myS7mM8 — Rishi Bagree (@rishibagree) December 12, 2023 కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలు మాత్రమే పాటిస్తానని వెల్లడించారు. తానొక పార్టీ కార్యకర్తను మాత్రమేనని పేర్కొన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 230 స్థానాలకు గాను 163 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లను సాధించగా.. ఈ సారి ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత తగ్గింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా సమష్టిగా ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ముఖచిత్రంగా చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్‌కు కాకుండా వేరే వ్యక్తిగా సీఎం పదవి ఇస్తారని పుకార్లు పుట్టాయి. అటు.. శివరాజ్ సింగ్నే సీఎం గా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవిపై తాజాగా శివరాజ్ సింగ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్ -
Madhya Pradesh: ఆసక్తికర పరిణామం.. సీఎంను కలిసిన పీసీసీ చీఫ్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మాజీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ కలిశారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి సోమవారం వచ్చిన కమల్‌నాథ్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్.. కమల్‌నాథ్‌ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సొంత చేసుకుంది. 230 స్థానాలకు గానూ ఏకంగా 163 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాగా కమల్‌నాథ్ సారధ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. #WATCH | Madhya Pradesh | State Congress president Kamal Nath meets Chief Minister Shivraj Singh Chouhan at his residence in Bhopal. The party registered a thumping majority in the state election, winning 163 of the total 230 seats. pic.twitter.com/CSTFecTjKC — ANI (@ANI) December 4, 2023 -
వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు
భోపాల్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి మాట్లాడటంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీకి ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా గౌరవం లేదన్నారు. మధ్యప్రదేశ్‌కు ఆమె వినోదం కోసమే వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలను ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్ భావించడం లేదు. నటన, జై– వీరూ లేదా ప్రధాని మోదీపై సినిమా తీయడమే ఎన్నికల అంశమని అనుకుంటున్నారా అని ప్రియాంకా గాంధీని అడగాలనుకుంటున్నా. ఎన్నికలను ఆమె తమాషా అనుకుంటున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’అని పేర్కొన్నారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు. గురువారం దటియా నియోజకవర్గంలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక.. సీఎం చౌహాన్‌ను ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అభివర్ణించారు. ఆయన అమితాబ్‌ను సైతం మించిపోయేవారన్నారు. అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడల్లా కమెడియన్లా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సైతం ఆమె వదల్లేదు. ప్రతిపక్షంలో ఉండగా తనను వేధించారని చెప్పుకుని మోదీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనపై మేరే నామ్ పేరుతో సినిమా కూడా తీయొచ్చని ప్రియాంక అన్నారు. -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సరికొత్త హామీ.. ‘సీఎం రైజ్’ స్కూళ్లు
Madhya Pradesh Elections: మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగనుండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సరికొత్త హామీ ఇచ్చారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సాగర్ జిల్లాలో ప్రచార ర్యాలీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ స్కూల్‌కు వచ్చి వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత బస్సుతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ‘రాష్ట్రంలోని ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తాం. ఇక్కడ లైబ్రరీ, ల్యాబ్‌లు, స్మార్ట్ క్టాస్రూమ్లతో పాటు విద్యార్థులను స్కూల్‌కి తీసుకొచ్చి, ఇంటికి చేర్చేందుకు బస్సులు ఉంటాయి. ఇవన్నీ ఉచితమే’ అని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రకటన చేశారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. కాగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1990 నుంచి ఆయన ఇక్కడ ఐదు పర్యాయాలు పోటీ చేసి గెలుపొందారు. -
50 శాతం కమీషన్ల పాలన : కమల్‌నాథ్
నర్సింగాపూర్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ పాలనలో 50 శాతం కమీషన్ల రాజ్యం నడుస్తోందంటూ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఆరోపించారు. చౌహాన్ అవినీతి పాలన రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేసిందన్నారు. బుధవారం నర్సింగాపూర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో యువత, రైతులు, అన్ని సామాజిక వర్గాల భవిష్యత్తును బీజేపీ పాలన సర్వనాశనం చేసిందన్నారు. కేవలం బీజేపీ నేతలు, అధికార పెద్దలు మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు. 18 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి వ్యవస్థ వంటివన్నీ పూర్తిగా పట్టాలు తప్పాయన్నారు. అబద్ధపు పథకాలను ప్రకటించనిదే చౌహాన్‌కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. -
సీఎం శివరాజ్‌సింగ్ భావోద్వేగం.. బీజేపీని గెలిపిస్తారా? అంటూ..
భోపాల్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రచారంలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిండోరిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ ప్రజలను కోరారు. తాను మంచి ప్రభుత్వాన్నే నడుపుతున్నానా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా? ఈ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీనే విజయం సాధించాలని ఆశిస్తున్నారా?. ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగాలని కోరుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇక, సీఎం శివరాజ్‌సింగ్ అడిగిన ప్రశ్నలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. అనంతరం పోటీ చేసేందుకు తాము ప్రజల అనుమతి తీసుకుంటామని సీఎం విలేకరులతో తెలిపారు. అంతకుముందు కూడా.. కొన్ని సమావేశాల్లో సీఎం చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. సొంత నియోజకవర్గం బుధ్నిలో తనను ఎన్నికల్లో పోటీ చేయమంటారా అని ప్రజలను అడిగిన విషయం తెలిసిందే. మరోవైపు.. మధ్యప్రదేశ్ పర్యటనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ధార్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎంపై శివరాజ్ సింగ్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ.. సీఎం గురించి మాట్లాడేందుకు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. సీఎం పేరు ప్రస్తావించకుండానే ఓట్లు అడుగుతున్నారని అన్నారు. దీని బట్టి వచ్చే ఎన్నికల్లో సీఎం ఓటమి చవిచూడడం ఖాయమని ప్రియాంక ఎద్దేవా చేశారు. -
మీరొక డమ్మీ సీఎం.. అందుకే పక్కన పెట్టేశారు
భోపాల్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మన రాష్ట్రం ఎప్పుడు వచ్చినా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడంతో ప్రధానికి మీ విషయం అర్థమైందని మీరు ముఖ్యమంత్రే కానీ డమ్మీ ముఖ్యమంత్రి అని అన్నారు. డమ్మీ సీఎం.. ఈరోజు 'జన ఆశీర్వాద యాత్ర' ముగింపు సందర్బంగా ప్రధాని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్న నేపథ్యంలో ఎక్కడా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ఉనికి కనిపించడంలేదని చెబుతూ ఆయనొక అబద్దాలు కోరు అని ప్రధానికి అర్థమైందని అందుకే ప్రచార కార్యక్రమంలో ఈయన లేకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకొచ్చారు. మీరు ముఖ్యమంత్రే కానీ అసలు ముఖ్యమంత్రి కాదని అందుకే బీజేపీ నేత అమిత్ షా ఎన్నికలు పూర్తైన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామన్నట్టు గుర్తు చేశారు. అన్నీ అబద్దాలే.. మీరు అబద్ధాలతో ప్రధానిని చాలా ఇబ్బంది పెట్టారని రైతుల ఆదాయం రెట్టింపయ్యిందని మీరు చెబితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రైతుల ఆదాయం గణనీయంగా తగ్గినట్లు ఆయనకు తెలిసిపోయిందని పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గాయని మీరు చెప్పినవి కూడా అబద్ధాలేనని ఆయనకు తెలిసిపోయిందన్నారు. ప్రధానికి అర్ధమైపోయింది.. అన్నిటినీ మించి ప్రధాని బుందేల్‌ఖండ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బుందేల్‌ఖండ్‌పై నిర్లక్ష్య వైఖరితో వ్యవహారించిందని ఏకంగా ప్రధానితోనే చెప్పించారు. కానీ కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రూ.7,600 కోట్లు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇలా నోటికొచ్చిన అబద్దాలు చెప్పడం వల్లనే ప్రధాని సీఎంను పక్కన పెట్టేశారని అన్నారు. ఇది కూడా చదవండి: ‘మామూలు రైళ్లకే రంగులేసి వందేభారత్‌గా దోపిడీ’ -
మూత్రవిసర్జన ఘటన.. ఊహించని ట్విస్ట్
ఇవాళ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. సంతోషం.. కానీ కొన్నాళ్ల పోయాక ఈ ఘటన నుంచి మీడియా, పోలీసులు, ప్రజలందరి దృష్టి మళ్లిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి.. భయంతో బతకాల్సిందేనా?.. అంటూ తన పూరి గుడిసె ముందు కూర్చుని కళ్లలో భయంతో ప్రశ్నిస్తున్నాడు 35 ఏళ్ల దశ్మత్ రావత్. మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న హేయనీయమైన ఘటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుబ్రి గ్రామానికి చెందిన గిరిజనుడైన దశ్మత్ రావత్‌పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేయడం.. ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారం రేపగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడి ఇంటికి సంబంధించి కొంత పోర్షన్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ బుల్డోజర్ కూల్చేయించింది. ప్రవేశ్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టింది కూడా. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ కోరడంతో ఈ ఘటన ఇంకా హైలెట్ చర్చగా మారింది. అయితే ఈ ఘటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విడిచిపెట్టాలంటూ దశ్మత్ రావత్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ‘జరిగిందేదో జరిగింది. అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఇకనైనా అతన్ని క్షమించి వదిలిపెట్టాలి అని మీడియా ద్వారా రావత్ ప్రభుత్వాన్ని కోరాడు. అతను చేసింది తప్పే కదా అని మీడియా అడగ్గా.. ‘‘అవునూ.. అతను చేసింది ముమ్మాటికీ తప్పే. అది నేనూ ఒప్పుకుంటా. అతను మా ఊరి పూజారి. అందుకే అతన్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రావత్ చెబుతున్నాడు. పైగా ఆ ఘటన ఈ మధ్య జరిగింది కాదని.. ఎప్పుడో 2020లో జరిగిందని చెప్పాడను. అది 2020లో. ఓ రాత్రిపూట పదిగంటల సమయంలో ఓ దుకాణం వద్ద నేను కూర్చున్నా. అతను నా దగ్గరకు వచ్చి నాపై మూత్రం పోశాడు. ఆ సమయంలో నేను అతని ముఖం కూడా చూడలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. తన తప్పు తాను తెలుసుకున్నాడతను. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటోంది ఒక్కటే.. అతన్ని విడిచిపెట్టి మా ఊరికి మంచి రోడ్డు వేయమని అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడతను. ఇప్పుడంటే ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మీడియా తనకు ధైర్యం చెబుతుందని, కొన్నాళ్లకు అందరూ విషయం మర్చిపోయిన తర్వాత వాళ్లు మామీద కక్ష సాధిస్తే ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేశాడు. తాము, తమ పిల్లలు సంతోషంగా ఉండాలంటే మాకు ఎవరితో గొడవలు వద్దని అన్నాడు. అందుకే జరిగిందేదో జరిగింది నిందితుడిని వదిలేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపాడు. మరోవైపు రోజు 100, 200 రూపాయలు సంపాదిస్తేనేగానీ తమ కుటుంబం గడవదని.. అలాంటిది ఊరిలో ఎవరితో తమకు శత్రుత్వం వద్దని భార్య ఆశా సైతం వాపోతోంది. ऐसे पापी दुनिया में बहुत हैं मुख्यमंत्री शिवराज सिंह चौहान किसका _ किसका पैर धोएंगे !#ArrestGoluGurjar#GoluGurjar #MPNews #SidhiUrineCase #SidhiMP #Gwalior #शिवराज pic.twitter.com/vdkrDzO890 — Viral Notebook (@NotebookVi42149) July 8, 2023 ఇదిలా ఉంటే.. మూత్ర విసర్జన ఘటన పెనుదుమారం రేపడం వెనుక రాజకీయ విమర్శలు కారణం అయ్యాయి. నిందితుడు బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ కాంగ్రెస్.. కాదు కాంగ్రెస్‌వి ఉత్త ఆరోపణలే అని బీజేపీ పరస్పరం విమర్శించుకున్నాయి. ఇక బాధితుడు రావత్ కాళ్లను సీఎం చౌహాన్ కడగడాన్ని కూడా కాంగ్రెస్ డ్రామాగా అభివర్ణించింది. ప్రభుత్వంపై బ్రహ్మణ సంఘాల మండిపాటు నిందితుడు శుక్లా ఇంటి పోర్షన్‌ను అక్రమ భాగమంటూ కూల్చివేయడంపై బ్రహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శుక్లా చేసింది పాపపు పనే అయినప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులను శికక్షించాల్సిన అవసరం ఏముందంటూ నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద ప్రవేశ్ శుక్లాపై కఠినమైన నేరారోపణలు నమోదు అయ్యాయి. आदिवासी व्यक्ति की सरकार से अपील गांव के ब्राह्मण हैं छोड़ दीजिए जो हुआ सो हुआ...#news #news14today #news #ShivrajSinghChouhan #mutrakand #aadiwasi pic.twitter.com/La1cijtI1b — NEWS14TODAY (@news14_today) July 8, 2023 -
MP Urination Incident: ఘోరం... దారుణం!
కొన్ని ఉదంతాలు మనల్ని విషాదంలో ముంచెత్తుతాయి. మనం మనుషులుగానే మనుగడ సాగిస్తు న్నామా, సమాజం ఇంత అమానుషంగా మారిందా అనే ఆందోళన కలిగిస్తాయి. మధ్యప్రదేశ్‌లో ప్రవేశ్ శుక్లా అనే దుండగుడు ఆదివాసీపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం అటువంటిదే. అసలు ఊహకు కూడా అందని రీతిలో శుక్లా ఇలా రెచ్చిపోవడానికి కారణమేమిటి? మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉదంతం విషయంలో చకచకా కదిలింది. వెనువెంటనే ఆ దుండగుడిని కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించింది. అతను నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసింది. ఆదివాసీకి రూ. 6.5 ల„ý లు పరిహారంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు...ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుణ్ణి తన నివాసానికి పిలిపించుకొని అతని కాళ్లు కడిగి తలపై జల్లు కున్నారు. దుండగుడు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంవల్ల తమపై ఆ మచ్చ పడుతుందన్న భయంతో ప్రభుత్వం వేగంగా కదిలివుండొచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఉదంతంపై ఇంకా నిరసలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఏదైనా ఉదంతం చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వాలు తక్షణం స్పందించటం, కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవటం, బాధితులకు రక్షణ కల్పించటం సాధారణ ప్రజలకు భరోసానిస్తుంది. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ప్రవేశ్ శుక్లా వంటి దుండగులు ఈ సమాజంలో నాగరిక వేషంలో ఎలా మనుగడ సాగించగలుగుతున్నారు? రాజకీయ పార్టీల్లోకి ఎలా చొరబడగలుగుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించకపోతే ఇవి పదే పదే పునరావృతమవుతూనే ఉంటాయి. దళితులనూ, ఆదివాసీలనూ, అట్టడుగు కులాల వారినీ అకారణంగా అవమానించటం, వారిని అత్యంత హీనంగా చూడటం మన దేశంలో కొత్తగాదు. తాజా ఉదంతం వీడియో సాక్షిగా బయటికొచ్చింది కనుక ఇంతగా స్పందన వచ్చింది. ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలింది. కానీ చట్టానికి దొరక్కుండా, సాక్ష్యాలకు చిక్కకుండా నిత్యం సాగుతున్న దుండగాల మాటేమిటి? ఈ ఉదంతంపై నిరసనల హోరు ప్రారంభమైన రోజే సర్వోన్నత న్యాయస్థానం విశ్వవిద్యాలయాల పర్యవేక్షణను చూస్తున్న యూజీసీకి కీలకమైన ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యాలయాల్లో వివక్షకు తావులేకుండా చేయటానికి ఇంతవరకూ తీసుకున్న, తీసుకోబోతున్న చర్యలేమిటో చెప్పా లని కోరింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ వివక్షకు బలై ప్రాణం తీసుకున్న రోహిత్ వేముల తల్లి, ముంబైలో వైద్య విద్యలో పీజీ చేస్తూ తోటి విద్యార్థినుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఆదివాసీ యువతి పాయల్ తాడ్వి తల్లి దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. వారి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గత ఏడాది కాలంలో మూడు ఉన్నత శ్రేణి సంస్థల్లో ముగ్గురు విద్యార్థులు కులోన్మాదుల హింస భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వైనాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి ఉదంతాలప్పుడు విద్యాసంస్థల నిర్వాహకులు తమ సంస్థల్లో వివక్ష లేనేలేదని బుకాయించారు. వారికి వత్తాసు పలికిన విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. సరిగ్గా గ్రామ స్థాయి నుంచి ఉన్నత శ్రేణి విద్యాసంస్థల వరకూ నిత్యం వినబడే ఇలాంటి బుకాయింపులే మన సమాజంలో ఆధిపత్య కులాల హింసకు లైసెన్సునిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ యధేచ్ఛగా కొనసాగుతూనే ఉన్న రెండు గ్లాసుల వ్యవస్థ, మహానగరాలనుకునేచోట అపార్ట్మెంట్లలో పనివాళ్ల పట్ల చూపే వివక్ష... అట్టడుగు కులాలవారికీ, మైనారిటీలకూ ఇళ్లు అద్దెకు దొరక్క పోవటం వంటివి ఈ హింసను అడుగడుగునా చాటుతూనే ఉన్నాయి. వాటిని సరిచేయటానికి పూనుకోవాల్సిన వ్యవస్థలు చాలా సందర్భాల్లో రాజీపడుతున్నాయి. పైకి ఎంతో గౌరవప్రదంగా కనబడే వ్యక్తులే ఈ వివక్షకు బాధ్యులవుతుండటం చేదు నిజం. ఎంతో గొడవ జరిగి, పెను వివాదమైతే తప్ప చర్యలకు సిద్ధపడటం లేదు. అసలు పట్టించుకోకపోవటం వేరు...అతిగా పట్టించుకోవటం వేరు. పర్వేశ్ శుక్లాను కఠినమైన చట్టంకింద అరెస్టు చేశారు. మంచిదే. ఆదివాసీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిపై జల్లుకున్నారు. పాలకుడిగా మానసిక వేదనకు లోనయి ఈ పని చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ దుండగుడి నివాసం కూల్చేయటం ఎలాంటి చర్య? తప్పు చేసిన ఏ వ్యక్తయినా చట్టం ముందు సమానమేనని, వారిపై కఠిన చర్య తీసుకుంటామని సందేశం పంప డానికి బదులు, తాము ఏం చేస్తే అదే చట్టమనే ధోరణి ప్రదర్శించటం ఎలాంటి సంకేతాలిస్తుంది? శివరాజ్ సింగ్ చౌహాన్ ఆలోచించాలి. అట్టడుగు కులాలవారిపై ఆధిపత్య కులాల హింసను అంతమొందించటంలో, మహిళలపై నిత్యం సాగే అమానుషత్వాన్ని అరికట్టడంలో మన సమాజం పదే పదే విఫలమవుతున్న తీరు ఆందోళన కలిగించే అంశం. 2002లో గుజరాత్ అగ్నిగుండమైనప్పుడు బిల్కిస్ బానో అనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యావజ్జీవ శిక్ష పడిన 11మంది నేరస్తులను నిరుడు విడుదల చేయటం, దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నా ఇంకా అతీ గతీ లేకపోవటం అందరూ గమని స్తూనే ఉన్నారు. అటువంటప్పుడు మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఆఖరులో ఎన్నికలు వస్తున్నందువల్లే శివరాజ్ సింగ్ సర్కారు వేగంగా స్పందించిందన్న విపక్షాల విమర్శలను కొట్టిపారేయగలమా? ఏదేమైనా చట్ట ప్రకారం వ్యవహరించటంలోనే, సంయమనం పాటించటంలోనే ప్రభుత్వాల సమర్థత వెల్లడవుతుంది. అది ప్రజాస్వామిక సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది. -
మూత్ర విసర్జన ఘటన: గిరిజన యువకుని కాళ్లు కడిగిన సీఎం శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్‌లోని సిధి గిరిజన యువకునిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించిన పోలీసులు.. బుధవారం అతన్ని అరెస్టు చేశారు. తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడుడైన గిరిజన యువకుడి పాదాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కడిగారు. దశమత్ రావత్‌ను సీఎం గురువారం భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అతన్ని ఓ కుర్చీలో కూర్చొబెట్టి సీఎం కింద కూర్చున్నారు. దళితుడి రెండు కాళ్లను ప్లేట్లో ఉంచి అతని పాదాలను నీళ్లతో కడిగారు శివరాజ్ సింగ్ చౌహన్. అనంతరం అతనికి బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువతో సన్మానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు తినిపించి కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత.. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మూత్ర విసర్జన వీడియో చూసి తన మనసుకు బాధనిపించిందన్నారు.ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలు తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. అంతకుముందు ఈ ఘటనలో నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని సీఎం వెల్లడించారు. मेरे संज्ञान में सीधी जिले का एक वायरल वीडियो आया है... मैंने प्रशासन को निर्देश दिए हैं कि अपराधी को गिरफ्तार कर कड़ी से कड़ी कार्रवाई कर एनएसए भी लगाया जाए। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 4, 2023 మరోవైపు నిందితుడు ప్రవేశ్ శుక్లా బీజేపీకి చెందినవాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ దళిత, గిరిజన ద్వేషానికి ఈ ఉదంతం అద్దం పడుతోందని కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా దుయ్యబట్టారు. బీజేపీ హయాంలో వారిపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయని రాహుల్ ఆరోపించారు. అయితే ఆ వ్యక్తితో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. దీనిపై విచారణకు నలుగురు వ్యక్తుల కమిటీ వేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించడం విశేషం. ఈ చర్య హీనమైనదని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. #WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat. CM tells him, "...I was pained to see that video. I apologise to you.… pic.twitter.com/5il2c3QATP — ANI (@ANI) July 6, 2023 -
Shocking: వధువులకు ఇచ్చిన మేకప్ కిట్లలో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక వివాహ పథకం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గతంలో వివాహానికి ముందు కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లిలో వధువులకు అందించే మేకప్ కిట్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు అందజేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకం కింద సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా 296 జంటలు ఒకటయ్యాయి. కాగా కొత్తగా పెళ్లైన వధువులకు ఈ పథకం కింద అందించిన మేకప్ కిట్ బాక్స్‌లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. మేకప్ కిట్ తెరిచి చూసిన వధువులు వాటిలో కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో సీఎం చౌహాన్నపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై జిల్లా అధికారి భుర్సింగ్ రావత్ స్పందించారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక మందులను పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత తమది కాదని. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ వీటిని అందజేసే అవకాశం ఉందన్నారు. తాము కేవలం ముఖ్యమంత్రి కన్యా వివాహ/నిఖా యోజన కింద లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి రూ.49,000ని ట్రాన్స్ఫర్ చేస్తామని, పెళ్లి సమయంలో ఆహారం, వాటర్, టెంట్, వాటికి సంబంధించిరూ. 6000 వేలు అందిస్తామని తెలిపారు. అయితే పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముంటుందో తమకు తెలీదని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2006 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళలకు పెళ్లికి సాయం అందించాలనే నేపథ్యంలో దీనిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వధువు కుటుంబానికి ప్రభుత్వం రూ.55,000 వేల అందిస్తుంది. చదవండి: Protesting Wrestlers: పతకాలు విసిరేస్తాం! నిరహార దీక్షకు దిగుతాం! Shamelessness at its peak in @ChouhanShivraj’s Govt : The @BJP4India government of #MadhyaPradesh has distributed #condoms and #contraceptivepills in the make-up boxes given under the #KanyaVivahYojana. Do you have any shame left, #CM Ji❓ pic.twitter.com/Cz8WRIGgcl — MD Kareem (@MDKareemWadi) May 30, 2023 -
సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి!
భోపాల్: ఓ తండ్రి ఏడాది వయసున్న తన బాబుని సీఎం ప్రసంగిస్తుండగా వేదికపైకి విసిరేశాడు. ఈ చర్య అక్కడున్న ప్రజలను అవాక్కయ్యేలా చేసింది. ఈ విపరీత చర్యకు అతనిపై మొదట ఆగ్రహం వ్యక్తం చేసినా.. చివరికి దీని వెనుక కారణం తెలుసుకుని అతని బాధని అర్థం చేసుకున్నారు. ఆ తండ్రి ఎందుకు ఇలా చేశాడంటే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఖేష్ పటేల్ సాగర్‌లోని కేస్లీ తహసీల్‌లోని సహజ్‌పూర్ గ్రామ నివాసి. అతను తన భార్య నేహా, ఏడాది వయసున్న కుమారుడితో నివసిస్తున్నాడు. తన కుమారుడికి 3 నెలల వయస్సు ఉన్నప్పుడే వైద్యులు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించి అందుకు బాగా ఖర్చు అవుతుందని చెప్పారు. తనకు అంత స్థోమత లేకపోయినా ఇప్పటి వరకు తన కుమారుడి వైద్యం కోసం రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. అయితే డాక్టర్ సర్జరీ చేయించాలని అందుకు మరో 3.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడే సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ సభకు వచ్చారు. అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రిని సహాయం చేయాలని కోరుందుకు ముకేశ్, నేహా కూడా వెళ్లారు. అయితే సీఎంని కలవడానికి వారికి అనుమతి దొరకలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ముకేశ్.. ముఖ్యమంత్రి స్టేజ్‌పై ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా తన బిడ్డను వేదికపైకి విసిరేశాడు. భద్రతా సిబ్బంది బాబును కాపాడి, తల్లికి అప్పగించారు. మొదట అతనిపై కోపడినప్పటికీ.. చివరికి చిన్నారి సమస్యను తెలుసుకున్న సీఎం బాబుకు వైద్యసహాయం అందించాలని స్థానిక కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన
బోఫాల్: బీజేపీ ఫైర్‌బ్రాండ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్ అయోధ్య నగర్‌లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్ షాప్ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్‌తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్ సర్కార్‌ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక.. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని.. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో పైలట్ ఇలా చేశారు. హెలికాప్టర్ మనావర్ నుంచి ధార్ వెళ్తుండగా సమస్య రావడంతో తిరిగి మనావర్కే వచ్చింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈమేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ నిలిచిపోవడంతో సీఎం రోడ్డు మార్గం ద్వారా బస్సులోనే ధార్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. సాంకేతిక కారణాలు తలెత్తిన ఈ హెలికాప్టర్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందింది. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
జోడో యాత్రలో వివాదాస్పద కంప్యూటర్ బాబా.. బదులివ్వాలన్న బీజేపీ
అగర్‌మాల్వా(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శనివారం వివాదాస్పద గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో మహుదియా గ్రామం వద్ద శనివారం ఆయన రాహుల్‌తో కలిసి నడిచారు. ఇండోర్ సమీపంలోని తన ఆశ్రమంలోని అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై చేయి చేసుకున్న కేసులో నాందేవ్ 2020లో అరెస్టయ్యారు. అలాంటి పలు కేసులున్న, జైలుకు వెళ్లొచ్చిన నిందితునితో రాహుల్‌తో కలిసి నడవడమేంటని బీజేపీ నిలదీసింది. అయితే, దేశ క్షేమం కోసం చేపట్టిన యాత్రలోకి సాధువులతో సహా అందరూ ఆహ్వానితులేనని కాంగ్రెస్ బదులిచ్చింది. అయితే ఈ కంప్యూటర్ బాబాకు 2018లో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సహాయ మంత్రి హోదాతో కూడిన పదవి కట్టబెట్టింది! అనంతరం బీజేపీతో పొసగక ఆయన కాంగ్రెస్ పంచన చేరారు. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్‌ను శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనే ప్రభుత్వోద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. -
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
నందిగామ: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని హార్ట్ఫుల్నెస్ కేంద్రం, కాన్హా శాంతి వనాన్ని (రామచంద్రమిషన్) ఆయన సతీమణి సుద్నాసింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. గురూజీ కమ్లేష్ పటేల్(దాజీ)తో కలిసి ధ్యానం చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ధ్యానం చేస్తే ఆనందమయ జీవితాన్ని గడుపుతారన్నారు. మురికి నీటి నుంచి విడిపోయి కమలం వికసించినట్లు జీవితం ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు. ధ్యానంతో అనేక రుగ్మతలు, ఒత్తిళ్లు దూరం అవుతాయని తెలిపారు. కాన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేసి కమ్లేష్ పటేల్ బీడు భూములను హరిత వనంలా మార్చారని అభినందించారు. కాన్హా శాంతి వనంలో టిష్యూ కల్చర్ ఎంతగానో ఆకర్షించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని శుష్క భూములను సైతం హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గురూజీ కమ్లేష్ పటేల్ మాట్లాడుతూ.. ఆనందం కావాలంటే శాంతి కావాలని, అది ధ్యానంతోనే వస్తుందని అన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయమని కమ్లేష్ పటేల్ అన్నారు. వీటిని అరికట్టేందుకు రూపొందించిన ‘నషా ముక్తి’యాప్‌తో పాటు ‘అవును.. మీరు దీన్ని చేయగలరు’(ఎస్.. యూకెన్ డూ ఇట్) అనే పుస్తకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ పోలీస్ జావ్రా 24వ బెటాలియన్‌లో 6 హెక్టార్లలోని బంజరు భూమిలో 25 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌గా హార్ట్ఫుల్నెస్ కేంద్రం అభివృద్ధి చేసిందని గురూజీ గుర్తుచేశారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లు, సబ్ సెంటర్లలో గ్రూప్ మెడిటేషన్ల ద్వారా మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వేలాది మంది మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలిపారు. అనంతరం సీఎం దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అభ్యాసీలు పాల్గొన్నారు. -
చీతా ప్రాజెక్టు: చీతాలను వదిలిన ప్రధాని మోదీ
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మరో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. చీతా ప్రాజక్టులో భాగంగా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను శనివారం ఉదయం ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేం. సుమారు 74 ఏళ్ల తర్వాత అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. మొత్తం ఎనిమిది చీతాలను ప్రత్యేక పరిస్థితుల నడుమ భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని నమీబియా పరిస్థితులకు దగ్గరగా ఉండే షియోపూర్ ప్రాంతంలో కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా మోదీ వెంట ఉన్నారు. మోదీ స్వయంగా వాటిని ఫొటోలు తీస్తూ కనిపించారు. Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/dtW01xzElV — ANI (@ANI) September 17, 2022 చీతా ప్రాజెక్టులో భాగంగా.. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో బోయింగ్ విమానంలో వాటిని శనివారం గ్వాలియర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆ విమానానికి స్వాగతం పలికారు. ఆపై ఆ చీతాలను వైమానిక విమానంలో కునో నేషనల్ పారర్క్కు తరలించారు. మూడు మగ, ఐదు ఆడ చీతాలతో జనాభా పెంచే ప్రయత్నం చేయనుంది ప్రభుత్వం. -
సీఎంకు చల్లటి చాయ్.. అధికారికి నోటీసులు
భోపాల్: ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రొటోకాల్ ఉల్లంఘన పేరిట జారీ అయిన ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రికి అందించిన టీ బాగోలేదని, పైగా చల్లగా ఉందంటూ మధ్యప్రదేశ్‌లో ఓ కిందిస్థాయి అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కాన్హౌ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఉన్నతాధికారుల ఆరోపణ. ఈ మేరకు ఛాతర్పూర్ జిల్లా రాజ్‌నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(ఎస్డీఎం) డీపీ ద్వివేది.. రాకేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సోమవారం ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు టిఫిన్‌తో పాటు టీ అందించారు అధికారులు. అయితే టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్‌కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
పోలీసుల అరాచకం.. జర్నలిస్టును అర్ధనగ్నంగా..
భోపాల్: జర్నలిస్టు సహా మరికొంత మందిని పోలీసు స్టేషన్లో అర్ధ నగ్నంగా నిలుచోబెట్టిన ఫొటో వైరల్ మారింది. ఓ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాడనే నెపంతో పోలీసులు వారిని చితకబాది, బట్టలు విప్పించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సిధి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా, అతని కుమారుడు గురుదత్ శుక్లాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారనే నెపంతో నీరజ్ కుందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్‌కు నిరసనగా, బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నిరసనలకు దిగారు. ఈ నిరసనను కవర్ చేసేందుకు స్థాసని జర్నలిస్టు, యూ ట్యూబర్ కనిష్క తివారీ తన కెమెరామెన్తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిరసనకారులతో సహా జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్లో వారిని కొట్టి, దుర్భాషలాడారని, అర్ధ నగ్నంగా నిలుచోబెట్టారని తివారీ చెప్పారు. పోలీసులు తమను ఏప్రిల్ 2న రాత్రి 8 గంటలకు అదుపులోకి తీసుకొని ఏప్రిల్ 3 సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారని తివారీ ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఎమ్మెల్యేపై ఎందుకు కథనాలు రాస్తున్నారని ప్రశ్నించారని తెలిపాడు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు ఇచా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. పోలీసు స్టేషన్ వ్యవహారం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. ఈ విషయం కాస్తా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన సీఎం.. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. -
మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ రికార్డు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(63) చరిత్ర సృష్టించారు. గురువారంతో సుదీర్ఘ కాలం సీఎంగా కొనసాగిన బీజేపీ నేతగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ ఘనత ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ పేరిట ఉంది. రమణ్ సింగ్ మూడు పర్యాయాలు వరసగా సీఎం పదవిని అధిష్టించి 15 ఏళ్ల 10 రోజులపాటు కొనసాగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటిసారిగా 2005 నవంబర్‌లో సీఎం అయ్యారు. 2008, 2013 ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. -
భారత్‌ను విశ్వగురుగా మార్చాలి
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను ‘విశ్వగురు’గా మార్చే కృషిని ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్సంఘ్చాలక్ డా.మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందువుల హితమే దేశ హితమని, మిగతా అనవసర కొట్లాటలు, కుమ్ములాటల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. మనకు దేనికీ లోటు లేకపోయినా, మనకంటే తెల్లచర్మం వారికి తామేదో గొప్ప అనే అహంకారం వెల్లడి కావడం అప్పుడప్పుడు చూస్తుంటామన్నారు. బుధవారం ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ప్రవచన మందిరంలో ప్రసంగిం చారు. ‘వెయ్యేళ్లకు పైగా విదేశీయుల పాÔశవిక అత్యాచారాలు, భరించినా ఆనాడే సమానత్వాన్ని సాధించాం. మన పరంపర నేర్పినదాని ఆధారంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించొచ్చు. భాష, ప్రాంతం తేడాలెన్ని ఉన్నా మనమంతా ఒక్కటే. ఎవరికి వారు తమ మేలు చూసుకుంటూనే ఇతరుల మేలు కూడా చూడాలి. దీనికి సంబంధించిన ఆచరణను క్రమంగా మొదలుపెట్టాలి’ అని భాగవత్ చెప్పారు. విభిన్నవర్గాల ఆచార్యులు, సంత్ లు కూడా అఖిల భారతస్థాయిలో సమావేశమై సమాజం మేలుకు ఏం చేస్తే బావుంటుందనే దానిపై సమాలోచనలు జరపాలన్నారు. దేశంలో మధ్యభాగంగా ఉన్న భాగ్యనగరంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సరైన సమయంలో జరిగింద న్నారు. ఇది దేశభాగ్యమని, భాగ్యనగరంపేరు సార్థకమైందన్నారు. హిందుత్వమే జాతిహితం: శివరాజ్ హిందుత్వమే దేశ హితమని, సనాతనధర్మం, పరంపరతో ముందుకు సాగాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. వివిధ భావాల కలబోత రామానుజాచార్యులు అని అన్నారు. సామాన్యులు, ధనికులు, బీసీలు, ఓబీసీలు, దళి తులు, మహాదళితులు అనే భేదభావాలన్నీ సమా ప్తం కావాలన్నారు. శ్రీరామనగర ప్రాంగణాన్ని దేశ యువత సందర్శించి దేశ భావధారకు అనుగుణంగా వారి ఆలోచనాధోరణి మారితే అంతకంటే అద్భుతం మరొకటి ఉండదన్నారు. యావత్ ప్రపంచానికి సమతా సందేశాన్ని ఇవ్వడానికే శ్రీరామానుజాచార్యుల వెయ్యోజయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామని చినజీయర్ స్వామి చెప్పారు. 1927లో బీఆర్ అంబేడ్కర్ తన పత్రిక భారత్‌లో.. వెయ్యేళ్ల క్రితమే సమతను చేసి చూపించిన రామానుజాచార్యుల గురించి రాశారన్నారు. సమస్త మానవాళికి ఐశ్వర్యం సిద్ధించాలనే సంకల్పంతో శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగంలో భాగంగా ఏడోరోజు పూజలు నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 1,035 యజ్ఞకుండాల్లో ఐదువేల మంది రుత్వికులు çహోమ కార్యక్రమాలు నిర్వహించారు. మహాయాగంలో లక్ష్మీనారాయణ ఇష్టిని నిర్వహించారు. చిన్నారులకు విద్యాభివృద్ధి, పెద్దలకు మానసిక ప్రశాంతత కోసం హయగ్రీవ ఇష్టి నిర్వహించారు. -
సాక్షి కార్టూన్ 05-02-2022
ఆయనలా అన్నారు! అప్పటి నుండి ఆఫీసుకు ఇలానే వస్తున్నారు! -
చినజీయర్ ఆశ్రమానికి మధ్యప్రదేశ్ సీఎం
శంషాబాద్ రూరల్: శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రుత్వికులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు ఆశ్రమంలో స్వామికి నమస్కరించి కానుకలు అందజేశారు. వచ్చే నెల 2 నుంచి జరగనున్న సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను స్వామి ఆశీర్వదించి, ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. -
కొత్త పొద్దు పొడుస్తుంది: శివరాజ్‌సింగ్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని, రాత్రి చీకట్లు తొలగి కొత్త సూర్యోదయం అవుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ధర్మయుద్ధంలో టీఆర్ఎస్ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ సంఘర్షణ పోరాటాన్ని ప్రకటించడానికే తాను ఇక్కడకు వచ్చానన్నారు. ఇటీవల అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అభినందన కార్యక్రమం శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన శివరాజ్‌సింగ్ మాట్లాడారు. ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారు సీఎం కేసీఆర్ భయకంపితులై ఉన్నారని, ఇంతగా భయపడే పిరికి సీఎంను తానెక్కడా చూడలేదని చౌహాన్ పేర్కొన్నారు. ‘ప్రజలు, ఉద్యోగులు, ప్రతిపక్షాలు, ఇతర వర్గాల ప్రజలు ఏవైనా సమస్యలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వాలు సమాధానాలివ్వడం సంప్రదాయం. భయపడే వారే ప్రశ్నించే వారిని జైల్లో పెడతారు. అదే తెలంగాణలో జరుగుతోంది..’అని అన్నారు. ఇక్కడ సమస్యలపై ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని విమర్శించారు. శ్రీకృష్ణుడు కూడా జైల్లోనే జన్మించి లోకకంఠకుడైన కంసుడిని అంతమొందించాడని, అదేవిధంగా ఇక్కడా కేసీఆర్ పాలన అంతమౌతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ప్రజలే జైలుకు పంపిస్తారు బీజేపీ అంటే తినే బిర్యానీ కాదని, రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించే వరకు పార్టీ విశ్రమించే ప్రసక్తే లేదని శివరాజ్‌సింగ్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ తదితర హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమాధానాలు చెప్పకపోతే ప్రజలే కేసీఆర్‌ను జైలుకు పంపిస్తారన్నారు. ‘కేసీఆర్.. తెలంగాణ గడ్డపైకి వచ్చాను. నీ పాపాలు, రాక్షస పాలనను అంతమొందించడానికి, ఇక్కడ బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే వచ్చాను..’అని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. -
రాష్ట్రంలో థర్డ్ వేవ్.. వెల్లడించిన మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్, కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల పెరుగుతున్న కమ్రంలో.. రాష్ట్రంలో కోవిడ్ థర్డ్‌వేవ్ వచ్చిందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారీగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగితే.. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొక తప్పదని ఇప్పటికే నిపుణులు హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొక తప్పదని సీఎం అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనాపై పోరాడాగలమని శివరాజ్ సింగ్ చెప్పారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతుందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భోపాల్, ఇండోర్ నగరాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 124 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరమైన ఇండోర్‌లో 62 కేసులు, భోపాల్‌లో 27 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం
భోపాల్: డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాయక్ జితేంద్ర కుమార్ వర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం ధామండ గ్రామంలో జితేంద్ర కుమార్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చౌహాన్ నివాళులర్పించారు. అనంతరం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమర్ షహీద్ జితేంద్ర కుమార్ జీ ధమందాకే కాదు.. యావత్ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను' అని అన్నారు. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) అనంతరం తన ట్విటర్ ఖాతాలో.. 'హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు జితేంద్ర కుమార్ జీకి నేను నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. అమరవీరుని భార్య, కుమార్తె సునీతను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటాం. అతని పేరు మీద ఒక పాఠశాలకు 'అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయ' అని పేరు పెట్టడం జరుగుతుంది. ధమండ గ్రామంలో సైనికుని జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించబడుతుంది అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. చదవండి: (గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్‌వేవ్ తప్పించుకోలేమా?) కాగా, సెహోర్ జిల్లాకు చెందిన వర్మ అంత్యక్రియలు పూర్వీకుల గ్రామమైన ధమండాలో నిర్వహించారు. కార్యక్రమం మొత్తం అతని సోదరుడు దగ్గరుండి నిర్వహించాడు. ఆ సమయంలో వర్మ తండ్రి, 13 నెలల కొడుకు కూడా అక్కడే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు
భోపాల్: గిరిజన యోధుల సంస్మరణార్థం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్‌ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. కార్యక్రమంలో భాగంగా మోదీ రాష్ట్ర రాజధానిలో సుమారు 4 గంటల పాటు ఉండనున్నారు. ఈ క్రమంలో ప్రధాని 4 గంటల పర్యటన కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 23 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నది. దీనిలో సుమారు 15 కోట్ల రూపాయలను రవాణా కోసమే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. జంబోరి మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమం కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి జనాలను తరలించనున్నారు. (చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..) మధ్యప్రదేశ్ ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం జన్‌జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న మోదీ.. ఈ వేదిక మీదుగా దేశంలో తొలిసారి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. జంబోరి మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుదిక్కుల నుంచి సుమారు 2 లక్షల మంది గిరిజనులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యక్రమం జరగనున్న వేదిక మొత్తాన్ని గిరిజన యోధుల చిత్రాలతో అలంకరించనున్నారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి 300 మంది కళాకారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. (చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!) కార్యక్రమం కోసం 52 జిల్లాల నుంచి వచ్చే ప్రజల రవాణా, ఆహారం, వసతి కోసం ప్రభుత్వం 12 కోట్ల రూపాయలకు కేటాయించింది. అతిథులు కూర్చునే వేదిక కోసం ప్రత్యేకంగా ఐదు గోపురాలు, గుడారాల నిర్మాణం, ఇతర అలంకరణ, ప్రచారానికి గాను 9 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ వీటిలో 29 గెలిచింది. 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది. అయితే 2018లో 47 స్థానాల్లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శివరాజ్‌సింగ్ చౌహాన్ భారీ ఎత్తున గిరిజనుల యోధుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి: ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు సార్.. మా ఊరే లేదంటున్నారు -
పెళ్లయి 3 నెలలు: యాసిడ్ తాగించిన భర్త.. సీఎంకు ఫిర్యాదు
గ్వాలియర్ (మధ్యప్రదేశ్): పెళ్లయి మూడు నెలలు కూడా కాలేదు అదనపు కట్నం వేధింపులు తీవ్రమయ్యాయి. భర్తతో పాటు వదిన కూడా హింసించడం మొదలుపెట్టింది. వారి ఆగడాలు శ్రుతిమించి ఆ నవ వధువుపై క్రూరంగా ప్రవర్తించారు. వారిద్దరూ కలిసి ఆ అబల నోటిలో యాసిడ్ పోశారు. అనంతరం అగ్గి పెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరి మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె జీర్ణాశయం మొత్తం దెబ్బతింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్‌లోని డబ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో యువతికి (25) ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా కట్నం తీసుకురావాలని ఆమెపై నిత్యం వేధిస్తున్నారు. భర్త శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. అతడికి తోడుగా అతడి సోదరి కూడా చేరి ఆమెకు నరకం చూపించారు. జూన్ 3వ తేదీన వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఆ యువతిని తీవ్రంగా కొట్టి భర్త, వదిన కలిసి యాసిడ్ తాగించారు. అంతటితో ఊరుకోకుండా అగ్గి పెట్టారు. వాటి దెబ్బకు ఆమె తాళలేక అరుపులు, కేకలు వేసి నరకం అనుభవించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో నరకయాతన అనుభవిస్తూ జీవిస్తోంది. యాసిడ్ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. కడుపు ముందరి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో వైద్యులు అతికష్టంగా ఆమెకు తినిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, సభ్యురాలు ప్రమీలా గుప్తా బాధితురాలిని పరామర్శించారు. జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సహించలేకపోయారు. వెంటనే ఆమె వివరాలు, ఫొటోలను తీసుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు తెలుపుతూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదై నెల దాటినా ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదని గుర్తుచేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి దీనస్థితిని ముఖ్యమంత్రికి లేఖలో వివరించారు. दिल्ली महिला आयोग की अध्यक्षा @SwatiJaiHind और मेंबर @promilagupta24 ने दिल्ली के एलएनजेपी अस्पताल पहुंचकर ग्वालियर की एसिड अटैक सर्वाइवर से मुलाकात की। https://t.co/bv7yg8xopK pic.twitter.com/vGmLWGcV39 — Delhi Commission for Women - DCW (@DCWDelhi) July 20, 2021 -
ఆసుపత్రిలో మాజీ సీఎం: క్ష్రీణించిన ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కమల్‌నాథ్ ఆరోగ్యం క్షీణిచిందని కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు కాంగ్రస్ నేతలు కమల్ నాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్‌నాథ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కమల్ నాథ్‌పై గత నెల( మే 24న) కేసు నమోంది. కరోనా వాస్తవ లెక్కలను వెల్లడించాలన్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, దేశద్రేహి అంటున్నారని కమల్‌నాథ్ బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. మరోవైపు చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్న కమల్ నాథ్‌కు హనీ ట్రాప్ కేసులో సిట్ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. पूर्व मुख्यमंत्री श्री कमलनाथ जी के अस्वस्थ होने की सूचना मिली है। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें। @OfficeOfKNath — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 9, 2021 -
ఆ 4 రాష్ట్రాల్లో ఉచితంగా టీకా..
భోపాల్: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. కోవిడ్ కట్టడి కోసం క్రేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ప్రజలందరికి ఉచితంగా టీకా వేస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలు ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ జాబితాలో చేరాయి. మధ్యప్రదేశ్‌లో 18ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా వాక్సిన్ అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. मध्यप्रदेश में 18 वर्ष से अधिक आयु के सभी प्रदेशवासियों को #CovidVaccine का निःशुल्क टीका लगाया जाएगा: मुख्यमंत्री श्री @ChouhanShivraj #MPFightsCorona pic.twitter.com/PlYHoe2BsW — CMO Madhya Pradesh (@CMMadhyaPradesh) April 21, 2021 ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. 18ఏళ్లు పైబడిన వారందరి టీకా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ వెల్లడించారు. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాక వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరారు. छत्तीसगढ़ में 18 वर्ष से अधिक उम्र के लोगों को कोरोना वैक्सीन का भुगतान राज्य सरकार करेगी। अपने नागरिकों की जीवन रक्षा के लिए हम हर संभव कदम उठाएंगे। केंद्र सरकार से अनुरोध है कि वह पर्याप्त संख्या में वैक्सीन की उपलब्धता सुनिश्चित करे। — Bhupesh Baghel (@bhupeshbaghel) April 21, 2021 వ్యాక్సిన్ కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం గత సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీకా తయారీదారులు... 50 శాతం ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి అనుమతి కల్పించింది. అంతేగాక, 18ఏళ్ల పైబడిన వారందరూ మే 1 నుంచి టీకాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సీరమ్ సంస్థ కొవిషీల్డ్ టీకా ధరలను నేడు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు 400 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయల చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది. చదవండి: కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం -
ఆ పట్టణం పేరు మారుస్తాం: సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ పట్టణం హోషంగాబాద్ పేరును మార్చనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ సిటీకి నర్మదాపురంగా నామకరణం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు పేర్కొన్నారు. నర్మద జయంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘హోషంగాబాద్ పేరు మార్చాలా, వద్దా?’’ అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ఇందుకు బదులుగా కచ్చితంగా మార్చాల్సిందే అంటూ సమాధానం రాగా. ఏ పేరు అయితే బాగుంటుందో సూచించాలంటూ ఆయన కోరారు. హోషింగాబాద్ను నర్మదాపురంగా వ్యవహరిస్తే బాగుంటుందంటూ ప్రజలు బదులిచ్చారు. ఇందుకు సరేనన్న ముఖ్యమంత్రి, నర్మదా నదిని కాపాడుకుందామని, నదీ తీరంలో సిమెంటు, కాంక్రీటు కట్టడాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా హోషంగాబాద్ పేరు మార్పు ప్రకటనపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రోటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పటాకులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఇదొక చారిత్రాత్మక క్షణం. మధ్యప్రదేశ్‌కు నర్మదా నది జీవనాడి వంటిది. హోషింగ్ షా ఆక్రమణతో హోషింగాబాద్ అనే పేరు స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు తల్లి నర్మద పేరుతో పట్టణాన్ని పిలుచుకునే సమయం ఆసన్నమైంది. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ద్రవోల్బణం, ఇంధన ధరల పెంపు వంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ సర్కారు ఇలాంటి ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మండిపడ్డారు. ‘‘మొఘల్ పాలకుల పేర్లతో ముడిపడిన పట్టణాల పేర్లను మాత్రమే బీజేపీ పాలకులు మారుస్తారు. బ్రిటీష్ రూలర్ల పేరుతో ఉన్న మింటో హాల్(విధాన సభ పాత భవనం) పేరు మాత్రం ఎందుకు మార్చడం లేదు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలకు బదులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి’’అని హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లు మార్పు! ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణం అలహాబాద్ పేరును ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గతంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎలాంటి చట్టబద్దమైన ఇబ్బందులు తలెత్తని పరిస్థితుల్లో గుజరాత్ పట్టణం అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మారుస్తామంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ గతంలో ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వ వ్యవహార శైలిపై విమర్శలు ఎక్కుపెడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చదవండి: సంతృప్తికర సమాధానాలు ఇవ్వండి: జడ్జి లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు! -
నాడు యూపీ.. నేడు మధ్యప్రదేశ్
భోపాల్ : వివాదాస్పద లవ్ జిహాద్ బిల్లుకు మరో రాష్ట్రం ఆమోదముద్ర వేసింది. బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బిల్లుకు కేబినెట్ఆమోదం తెలిపిన అనంతరం హోంమంత్రి నాథూరాం మిశ్రా వివరాలను వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సమాజిక వర్గాలకు చెందిన యువతులను బలవంతంగా మతమార్పడి చేయించి వివాహం చేసుకుంటే పదేళ్లపాటు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయాల జరిమానా విధించే విధంగా బిల్లు రూపొందించామని తెలిపారు. అలాగే ఇతర వర్గాలకు చెందిన యువతను చట్ట విరుద్ధంగా మత మార్పిడి చేసి వివాహం చేసుకుంటే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50 వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. (‘లవ్ జిహాద్’ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు) ఒకవేళ యువతీ, యువకులు ఇష్టపూరితంగా వివాహం చేసుకోవాలి అనుకుంటే మతమార్పడి కోసం రెండు నెలల ముందుగా జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ విధంగా చేయకుండా వివాహం చేసుకుంటే దానిని చట్ట విరుద్ధమైన వివాహం గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మధ్యప్రదేశ్ కంటే ముందుగా మతమార్పిడి వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యూపీ అనంతరం ఇలాంటి చట్టాన్ని రూపొందించిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. మరోవైపు ఇలాంటి చట్టాలను రూపొందించడటంపై దేశ వ్యాప్తంగా పలువర్గాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
10 అడుగుల గోతిలో పాతేస్తా: సీఎం వార్నింగ్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా మాఫియా గ్యాంగ్‌లు, గుండాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన మూడ్ అసలే బాగోలేదని, రాష్ట్రంలో మాఫియాగాళ్లు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు ఆపకుంటే పది అడుగుల గోతిలో పాతిపెడతానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ‘మామా ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లకపోతే.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా 10 అడుగుల గోతిలో పాతి పెడతా’అని ట్విటర్ వేదికగా సీఎం చౌహన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు సమస్యలు లేకుండా ఉన్నప్పుడే అది గుడ్ గవర్నెన్స్ అవుతుందని, అలాంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మారుస్తామని ఆయన పేర్కొన్నారు. చట్టాలను గౌరవించే పౌరుల పట్ల రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పువ్వు మాదిరిగా సున్నితంగా వ్యవహరిస్తుందని, రాక్షసంగా ప్రవర్తించేవారి పట్ల పిడుగులు వర్షం కురిపిస్తుందని అన్నారు. డ్రగ్స్ పెడ్లర్, భూ దందా, చిట్ ఫండ్ మాఫియా, గూండాలు ఇలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో పాతుకుని ఉన్న డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టడానికి కేంద్ర సంస్థలతో మంతనాలు జరుపుతున్నామని తెలిపారు. ఇక నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సూచనల మేరకు డ్రగ్స్ మాఫియాపై చర్యల కోసం డిసెంబర్ 15 నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సీఎం చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందని ఎన్సీబీ తెలిపింది. ముఖ్యంగా మాల్వా, మహాకోషల్ ప్రాంతాల్లో డ్రగ్స్ దందా అధికంగా సాగుతోందని వెల్లడించింది. -
లవ్ జిహాద్: ‘అలాంటి వారిని నాశనం చేస్తాం’
భోపాల్: లవ్ జిహాద్ ప్రస్తుతం ఈ పదం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన సంగతి తెలసిందే. తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరనుంది. లవ్ జిహాద్ పేరిట మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తాం అంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. మత మార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా రాష్ట్రం ముసాయిదా బిల్లును రూపొందించిన కొన్ని రోజులకే ఈ హెచ్చరిక వెలువడటం గమనార్హం. ఇక పెళ్లి పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతుల మతం మార్చే ఈ ప్రక్రియ పట్ల దేశవ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని కొందరు వాదిస్తుండగా.. ఈ తరహా పెళ్లిల్లు ప్రేమ వివాహాలు కదా.. మరి మతం మార్చుకోవడం ఎందుకు. ప్రేమకు అడ్డురాని మతం పెళ్లికి ఎలా అడ్డంకిగా మారుతుంది.. అమ్మాయే మతం మారాలా.. అబ్బాయి కన్వర్ట్ అయితే ఏం అవుతుంది అంటూ ప్రశ్నలు లేవనేత్తేవారు మరికొందరు. ఈ చర్చ ఎలా ఉన్నప్పటికి వివాహం పేరుతో మతం మారడానికి వీలు లేదంటున్నాయి పలు రాష్ట్రాలు. (చదవండి: ఆడ పిల్లల జీవితాలతో ఆటలు మానండి) ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాహం పేరిట మత బలవంతపు మతమార్పిడికి పాల్పడివారికి పదేళ్ల జైలు శిక్ష విధించేంలా ముసాయిదా బిల్లును రూపొందించింది. అయితే దీని మీద రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అసమ్మతి, అసహనం, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సీంఎ శివరాజ్ సింగ్ వీటిని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పైగా లవ్ జిహాద్ పేరిటి మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడితే.. నాశనం చేస్తాం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతి ఒక్కరిది.. అన్ని మతాలు, కులాలకు చెందినది. ఓ మతం, కులం, ప్రాంతం పట్ల ప్రభుత్వం పక్షపాతం చూపదు. కానీ మా కూతుళ్లుతో ఎవరైనా అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే.. ఊరుకోం. లవ్ జిహాద్ పేరిట ఎవరైనా మత మార్పిడి వంటి కుట్రలకు ప్లాన్ చేస్తే వారిని నాశనం చేస్తాం’ అంటూ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. (హిందూ యువతులను సిస్టర్స్‌గా భావించండి: ఎంపీ) ధర్మ స్వాంత్రాత బిల్లు 2020 ముసాయిదా చట్టం ప్రకారం వివాహం కోసం స్వచ్ఛందగా మతం మారాలని భావిస్తున్న వారు నెల రోజులు ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ తరహా కేసుల్లో సంరక్షకులు ఫిర్యాదు చేయవచ్చు.. ఇలాంటి వివాహాలను సులభతరం చేసే వారిని నిందితుడిగా పరిగణించడమే కాక జరిమానా విధిస్తారు. ఈ తరహా కార్యక్రమాలను ప్రొత్సాహించే సంస్థల నమోదును రద్దు చేస్తారు అని పేర్కొంది. ఇక ఇప్పటికే యూపీ లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిళ్లను నియంత్రించడం కోసం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
లాక్డౌన్ విధించే ఆలోచన లేదు: సీఎం
భోపాల్: రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. అయితే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా పాఠశాలలు, కళాశాలల మూసివేత కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శుక్రవారం సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం భోపాల్‌లో జరిగింది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా పకడ్భందీ చర్యలు తీసుకోడం కోసం జిల్లాల అధికారులు విపత్తు నిర్వహణ శాఖ వారితో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆదేశించారు. షాపుల నిర్వహణ సమయాన్ని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు నిర్ణయిస్తారని, రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన అన్నారు. ప్రజా రవాణాతో పాటు నిత్యావసర వస్తువుల రవాణా కొనసాతుందన్నారు. ఆర్ధిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడకుండా కరోనా వ్యాప్తిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలకు, కార్మికులకు ఎలాంటి నిబంధనలు ఉండవన్నారు. కోవిడ్ రక్షణ చర్యలు పాటిస్తూ వివాహ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, అయితే పరిమిత సంఖ్యలోనే బంధువులు హాజరవ్వాలని ప్రజలను కోరారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లను ఓపెన్ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి శివరాజ్ పేర్కొన్నారు. -
చినజీయర్ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్ సీఎం
శంషాబాద్ రూరల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మంగళవారం ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణంలో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్‌కు అహోబిల జీయర్ స్వామి, ఆశ్రమం సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం దివ్యసాకేతాలయంలో చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో జరిపిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్‌కు చినజీయర్ స్వామి తీర్థ ప్రసాదాలు, మంగళశాసనాలు అందజేశారు. ఆశ్రమం సమీపంలో జరుగుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం పనులను జీయర్‌స్వామితో కలసి చౌహాన్ పరిశీలించారు. -
నా బలం.. స్పూర్తి నువ్వే: సీఎం
భోపాల్: ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆనందంలో ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధ్నాను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ‘విజయం సాధించినందుకు అభినందనలు’ అంటూ సాధ్నా బుధవారం తెల్లవారుజామున ట్వీట్ చేశారు. తన భర్తకు స్వీట్ తినిపిస్తున్న ఫోటోను దీనికి జత చేశారు. ‘నీవేనా బలం, నా ప్రేరణకు మూలం నువ్వే. నా జీవితంలో ప్రతీ విజయంలో నీ సహకారం ఉంది. నీవు నాతో ఉంటే ఎల్లప్పుడు నాదే విజయం’ అంటూ భార్య ట్వీట్‌కు శివరాజ్ సింగ్ సమాధానమిచ్చారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఉప ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లకు గానూ 19 స్థానాల్లో గెలిచి, ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతిని 8 సీట్లకే పరిమితమైంది. 25 మంది శాసన సభ్యుల రాజీనామా, ముగ్గురు సభ్యుల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 28 శాసన సభ స్థానాలకు నవంబర్ 3న జరిగిన పోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం మొదలైన కౌంటింగ్ బుధవారం తెల్లవారు జామున ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో విజయాన్నిమధ్యప్రదేశ్ ప్రజల విజయంగా అభివర్ణించారు. అభివృద్ధికి, ప్రభుత్వంపై గల విశ్వాసానికి, ప్రజాసౌమ్యానికి ప్రతీకగా ఈ విజయాన్ని పేర్కొన్నారు. బీజేపీ పైగల విశ్వాసంతో ఓట్ల రూపంలో మధ్యప్రదేశ్ ప్రజలు దీవించారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిజ్ఞ చేశారు. (చదవండి: బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?) -
ఈవీఎంలతోనే బీజేపీ గట్టెక్కింది : దిగ్విజయ్ సింగ్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్ధానాలను బీజేపీ కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. కాషాయ పార్టీ విజయంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈవీఎంల మాయాజాలంతోనే బీజేపీకి భారీ విజయం దక్కిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. చిప్‌తో కూడిన ఎలాంటి మిషన్‌ను అయినా హ్యాక్ చేయవచ్చని వ్యాఖ్యానించారు. అగ్రదేశాలు సైతం బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. విపక్షాలు సాధించిన విజయాలు చూపుతూ ఈవీఎంల పనితీరును బీజేపీ సమర్ధించుకుంటోందని, ఈవీఎంలను ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే తారుమారు చేస్తారని తాను చెప్పగలనని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ప్రజలను వంచించారని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ మండిపడ్డారు. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకూ 9 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ మరో పదిస్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కేవలం ఒక స్ధానంలో విజయం సాధించిన కాంగ్రెస్ మరో ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. మొరెనా స్ధానంలో బీఎస్పీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు. కాగా తమ పార్టీ నేతల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చదవండి : ఉప ఎన్నికల్లో బీజేపీ హవా -
మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు
-
ఆమె ఓ ‘ఐటం’.. సీఎం మౌన వ్రతం
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాష్ట్ర మంత్రి ఇమర్తి దేవిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం రెండు గంటలపాటు మౌనవ్రత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. ‘మాజీ సీఎం వ్యాఖ్యలు ఆయన వంకర బుద్ధిని, నీచ మనస్తత్వాన్ని చూపిస్తున్నాయి. కమల్ నాథ్ వ్యాఖ్యలు కేవలం ఇమర్తి దేవికి మాత్రమే కాదు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రతి మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’ అంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ఇంతకు వివాదం ఏంటంటే ఆదివారం గ్వాలియర్ దాబ్రా పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మాజీ సీఎం కమల్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన తమ ప్రత్యర్థి ఇమర్తి దేవిని ఉద్దేశిస్తూ ‘ఐటం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీ తరఫున బరిలో ఓ సాధారణ వ్యక్తి నిలచారు.. కానీ అవతలి క్యాండెట్ ఓ ఐటం’ అంటూ కమల్‌నాథ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌహాన్, కమల్ నాథ్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘మీ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వక్ర బుద్ధి, నీచ మనస్తత్వం మరోసారి తెర మీదకు వచ్చింది. మీరు అవమానించింది ఇమర్తి దేవిని మాత్రమే కాదు.. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రతి సోదరిని. మహిళలతో గౌరవంతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు కమల్ నాథ్ జీ’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై ఆదివారం బీజేపీ ప్రతినిధి బృందం భోపాల్‌లో ఎన్నికల సంఘం అధికారులను కలుసుకుని నాథ్‌పై "మహిళలు, దళితులను అవమానించారని" ఫిర్యాదు చేశారు. (చదవండి: దళిత మహిళపై దాడి.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం) జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలైన ఇమార్తి దేవి, మరో 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. మార్చిలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. -
దళిత మహిళపై దాడి..
-
దళిత మహిళపై దాడి.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం
భోపాల్ : దళిత మహిళపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారని, బాధితురాలి కూతురు తమ తల్లినిపై దాడి చేయొద్దని వేడుకున్నా.. వదల్లేదని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ఓ వీడియోను ట్వీటర్లో షేర్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆడపడుచులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కమల్‌నాథ్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ మహిళపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఆమెను నెట్టేస్తూ తీవ్రంగా కొట్టాడు. ఊడిపోతున్న తన పంచెను సరిచేసుకుంటూ మరీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి కుమార్తె... తన తల్లిని విడిచిపెట్టాలంటూ గట్టిగా కేకలు పెట్టింది. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.(చదవండి : మనిషి పెరిగినా బుద్ధి పెరగకపోతే ఇంతే..) ఈవీడియోను కమల్‌నాథ్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘బేతుల్ జిల్లాలోని శోభాపూర్ లో బీజేపీ నాయకులపై నిరసన వ్యక్తం చేసినందుకు ఒక దళిత మహిళ, ఆమె కుమార్తెపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగా దాడి చేశారని హిందీలో ట్వీట్ చేశారు. దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ నాయకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా దాడికి పాల్పడిన నేతలకు పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘శివరాజ్ జీ, మీ ప్రభుత్వంలో సోదరీమణులకు తరచూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తున్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని సదరు మహిళలకు, ఆమె కుమార్తెకు న్యాయం చేయాలి’అని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కమల్‌నాథ్ డిమాండ్ చేశారు. -
ఎన్ఆర్ఏపై మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం
భోపాల్ : జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) నిర్వహించే పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చే తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్ కానుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఎన్ఆర్ఏ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తూ గురువారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని శివరాజ్ చౌహాన్ స్వాగతించారు. యువతకు వారి ఎన్ఆర్ఏ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తూ దేశంలోనే మధ్యప్రదేశ్ అసాధారణ నిర్ణయం తీసుకున్న తొలిరాష్ట్రంగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు సైతం తమ యువతకు ఊరట కల్పిస్తూ ఈ దిశగా సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో తమ రాష్ట్ర యువతకే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే హక్కు కల్పించాలని తాము నిర్ణయించామని చెప్పారు. పలుమార్లు పరీక్షల నిర్వహణతో ప్రయాణాలు, ఇతరత్రా వ్యయం నుంచి ఎన్ఆర్ఏ ద్వారా ఊరట లభించిందని అన్నారు. ఇక దేశ యువత ఎస్ఎస్బీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ వంటి పలు పరీక్షలకు హాజరుకాకుండా కేవలం ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరైతే చాలని అన్నారు. ఇది అభ్యర్ధుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నియామక ప్రక్రియలో పారదర్శకత నెలకొనేందుకు దారితీస్తుందని అన్నారు. చదవండి : అదృష్టం అంటే అతనిదే.. రాత్రికి రాత్రే -
‘ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానికులకే’
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వంద శాతం రాష్ట్ర యువతకే అర్హత కల్పిస్తామని మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అయితే 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర యువతకే ప్రభుత్వ ఉద్యోగాలు అనే ప్రకటనను సీఎం చౌహాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా 10, 12వ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పథకాల అమలులో సింగిల్ డేటా బేస్‌లో(వివిధ పథకాలకు అర్హుల జాబితా) పొందు పరుస్తామని తెలిపారు. ఈ ప్రక్రియతో పథకాల లబ్డిదారులు ఒక సారి డేటా బేస్‌లో తమ పేరును నమోదు చేసుకుంటే అర్హత కలిగిన వివిధ పథకాలను పొందవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. చదవండి: సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు -
ప్లాస్మా దానం చేయనున్న మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్ : కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కోవిడ్-19 పేషెంట్ల చికిత్స కోసం తన ప్లాస్మాను దానం చేయనున్నట్లు శివరాజ్ సింగ్ ఆదివారం తెలిపారు. కాగా జూలై 25న చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వెంటనే ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందారు. అనంతరం 11 రోజుల తర్వాత ఆగష్టు 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన బట్టలు తానే ఉతుక్కుంటున్నానని వీడియో ద్వారా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న సీఎం చౌహాన్ ) కాగా రాష్ట్రంలోని కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ‘నేను ఇంతకుముందు కరోనా బారిన పడ్డాను. చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కరోనా వైరస్‌తో పోరాడటానికి యాంటీబాడీస్ నా శరీరంలో వృద్ధి చెంది ఉంటాయి. కావున నేను త్వరలో ప్లాస్మాను దానం చేస్తాను’ అని పేర్కొన్నారు. అయితే కరోనాను అంతం చేయడంలో శరీరంలోని రోగనిరోధకశక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను సేకరించి కరోనా బారిన పడిన వారికి అందించడం ద్వారా వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. ఇక మధ్యప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 39,000 వేలు దాటింది. -
కరోనా నుంచి కోలుకున్న సీఎం చౌహాన్
భోపాల్ : కరోనావైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. జూలై 25న ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సీఎం చౌహాన్ చికిత్స కోసం చిరాయు ఆస్పత్రిలో చేరారు. పదకొండు రోజుల చికిత్స అనంతరం ఆయన ఈరోజు డిశ్చార్జి అయ్యారు. ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. (చదవండి : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్) మరోవైపు సీఎం చౌహన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉన్నారని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ లోకేంద్ర పరాషర్ వెల్లడించారు. సీఎం చౌహాన్ డిశ్చార్జ్‌ను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ ట్వీట్ చేశారు. వైద్యులు సలహా మేరకు ఐసోలేషన్ నిబంధనలు పాటించాలని చౌహాన్‌కు సూచించారు. -
‘మోదీ నాయకత్వంలో రామ రాజ్యం వస్తుంది’
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగే రామమందిర నిర్మాణం మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని, శంకుస్థాపన వేడుక రోజున మట్టి దీపాలను వెలిగించాలని ప్రజలను కోరారు. ‘ అయోధ్య రామ మందిర నిర్మాణంతో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశానికి రామ రాజ్యం వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఆగస్టు 4 & 5 తేదీ రాత్రుల్లో ప్రజలందరూ వారి ఇళ్ళ వద్ద మట్టి దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. చదవండి: అయోధ్యలో కరోనా కలకలం అనేక మంది ప్రముఖులు, కనీసం 200 మంది అర్చకులు పాల్గొనే ఈ వేడుకలో ప్రధాని మోదీ రామ మందిరాని బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రామ మందిర కాంప్లెక్స్‌లో ఉన్న 14 మంది పోలీసు సిబ్బందికి, పూజరులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అలాగే ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన కొందరి ప్రముఖులకు, అదేవిధంగా హోం మంత్రి అమిషాతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఏదేమైనా, కరోనా నేపథ్యంలో అన్ని భద్రతా నియమాలను పాటిస్తూ, ప్రణాళిక ప్రకారం అన్ని ముందుకు సాగుతాయని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఇప్పుడు నిర్మిస్తున్న ఆలయం మొదట అనుకున్నదానికంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో, అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని నిర్మించడానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కొత్త మసీదును నిర్మించుకోవడానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రానికి ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా ప్రస్తుతం, ఉత్తర ప్రదేశ్‌లో 38,023 యాక్టివ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి. చదవండి: భారీగా ఆలయ నిర్మాణం -
మధ్యప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్
భోపాల్ : ప్రాణాంతక కరోనా వైరస్ దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్‌బారినపడగా.. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహన్‌కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా దేశంలో కరోనా బారినపడిన తొలి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కావడం గమనార్హం. -
దళిత దంపతులపై జులుం
-
కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో గురువారం కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్ అడిషనల్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గురువారం ఉదయం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రివర్గంలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు కావడం విశేషం. కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన సింధియా తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో తన వర్గీయులకు పదవులు దక్కించుకోవడంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో సింధియా వర్గంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రధుమాన్ సింగ్ తోమర్‌తో పాటు సిందియా అత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సింధియాలు ఉన్నారు. (ముగ్గురు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు) కమల్‌నాథ్‌తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్ విస్తరణ ఇన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్నది. దీనికి తోడు లాక్డౌన్ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా గురువారం 28 మంది మంత్రులు ప్రమాణం చేయడంతో శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో పూర్తి కేబినెట్ కొలువు దీరినట్లయింది. (కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా) -
మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో శివరాజ్‌సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి కేంద్ర నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుత గవర్నర్ లాల్జీటాండన్ అనారోగ్యం బారినపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనందీబేన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె గురువారం బాధ్యతలు స్పీకరించనున్నారు. అనంతరం మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. (మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల షాక్!) కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రిపదవి కోసం చాలామంది ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి కమల్‌నాథ్ సర్కార్ కూలిపోవడానికి కారణమైన జోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరిలో కేబినెట్ బెర్త్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది శాసనసభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మార్చి నెలలో కాంగ్రెస్ సర్కార్ పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఊహించని పరిణామాలతో అదే నెల 23న తిరుగుబాటు సభ్యుల మద్దతులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహన్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు కరోనా క్లిష్ట కాలంలోనూ మంత్రివర్గ విస్తరణ అవసరమా అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలకు దిగుతోంది. -
సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సంబంధించి ఎడిటెడ్ వీడియోను షేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై భోపాల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. (కరోనా భయం : ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య) సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఒక తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్ చేసినట్లు పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద దిగ్విజయ్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. లిక్కర్‌కు సంబంధించి మాట్లాడిన పాత వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారని, వీడియో శివారాజ్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని బీజేపీ పేర్కొంది. ‘బుదిన్నిలోని గిరిజనులను శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏజెంట్లు రూ.450కోట్లమేర మోసగించారు. ఆ సమయంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఆ సంఘటనపై చర్యలు తీసుకోకపోతే ఆయన ఇంటి ముందే నిరసన చేపడతానని లేఖ వ్రాశాను. ఇది బీజేపీని కలవరపరిచింది. వీడియోను ఎవరు ఎడిట్ చేశారో తనిఖీ చేయాల్సి ఉంది’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. (24 గంటల్లో 11,502 పాజిటివ్ కేసులు) -
‘మనుషులకే మానవ హక్కులు’
భోపాల్ : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ పలువురు రోడ్లమీదకు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్డౌన్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలను కోరింది. ఇక ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని నిరోధించేందుకు 21 రోజుల లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు. ‘ఇది కేవలం ఓ ట్వీట్ కాదు..గట్టి హెచ్చరిక..మానవ హక్కులు కేవలం మానవులకే ఉంటా’యని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతున్నా అక్కడక్కడా జనం నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు స్ధానికులకు పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్య బృందాలపై ఇండోర్‌లో కొందరు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు నిబంధనలను అతిక్రమించే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి కోరారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు చేపట్టాలని సూచించారు. చదవండి : పౌరులకు వీడియో సందేశం ఇవ్వనున్న మోదీ -
అమిత్ షా వ్యూహం.. బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం!
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష బీజేపీకి మార్గం సుగమమైంది. కమల్‌నాథ్ రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌కు విజ్ఞప్తి చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం లేదా ఆదివారమే గవర్నర్ లాల్జీ టాండన్‌తో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. (సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా) బీజేపీ సంబరాలు.. ఈ నేపథ్యంలో కమల్ సర్కార్ వెంటనే బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదానికి తెరపడింది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం లోగా అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని ధర్మాసనం స్పీకర్ ఎస్పీ ప్రజాపతిని ఆదేశించింది. ఈ క్రమంలోనే 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీంతో బలపరీక్షలో నెగ్గడం కష్టతరంగా భావించిన కమల్‌నాథ్.. దానికి ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో శివరాజ్ సింగ్ నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు విజయ సంకేతం చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కమళానికి లైన్ క్లియర్.. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం బీజేపీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆరుగురు మంత్రులతో పాటు 16 మంది శాసనసభ్యులు (మొత్తం 22) రాజీనామాతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 206కి చేరింది. వీరిలో కాంగ్రెస్‌కు 92 మంది, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఓ ఎస్పీ సభ్యుడు మొన్నటి వరకు కమల్నాథ సర్కార్‌కు మద్దతు ప్రకటించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో వారు బీజేపీ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సభలో 104 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. దీంతో బీజేపీకి ఉన్న సభ్యులతో సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. (స్పీకర్ కీలక నిర్ణయం: కమల్ రాజీనామా..!) కర్ణాటక వ్యూహాలే అమలు.. కాగా కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ అక్కడ ప్రయోగించిన వ్యూహాలనే మధ్యప్రదేశ్‌లోనూ అమలు చేసింది. ముందుగా అసంతృప్తులపై వలవేసిన బీజేపీ.. ఆ తరువాత పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలను ప్రభుత్వంపై ఉసిగొలిపేలా ఎత్తులు వేసింది. ఈ క్రమంలో అప్పటికే సీఎం కమల్‌నాథ్‌పై పీకల్లోతు కోపంతో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్యా సింధియాను బీజేపీలో చేర్చుకోవడంలో ఆ పార్టీ నేతలు విజయవంతం అయ్యారు. దీనికి అనుగుణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతో శివరాజ్‌సింగ్ చౌహాన్ చక్రం తిప్పారు. చివరికి కర్ణాటకలో చోటుచుసుకున్న పరిణామాలే మధ్యప్రదేశ్‌లోనూ రిపీటైయ్యాయి. అంతిమంగా బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం వచ్చి చేరబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు) -
కాంగ్రెస్ స్వయంకృతం
కాంగ్రెస్‌కు సాక్షాత్తూ అధిష్టానమే సమస్యగా మారిన వేళ మధ్యప్రదేశ్‌లోని ఆ పార్టీ విభాగంలో ఉన్నట్టుండి ముసలం బయల్దేరి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పుట్టి మునగడం ఎవరికీ ఆశ్చర్యం కలి గించదు. అక్కడేం జరుగుతోందో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని అయోమయంలో సారథులు కూరుకుపోయివుండగానే, కమల్‌నాథ్ కేబినెట్లోని ఆరుగురు మంత్రులతోసహా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు ఎగిరిపోయారు. ఈ సంఖ్య చూస్తుండగానే 21కి చేరింది. వారంతా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తామంటున్నారు. ఈ డ్రామాకు కథానాయకుడైన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌కు చెల్లుచీటీ ఇచ్చి బీజేపీవైపు అడుగులేస్తున్నారు. ఆ పార్టీ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నిక కావడం సింధియాకు ఇక రోజుల్లో పని. రాజీనామా సంగతి తెలిశాక, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటన చేసి పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ నాయకత్వం! ఏమైతేనేం 230మంది సభ్యులుండే అసెంబ్లీలో 114మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ బలం 93కి పడిపోయింది. మరో 30మంది కాషాయ తీర్థం తీసుకోవడానికి సంసిద్ధులవుతున్నారని బీజేపీ నేతలు చెప్పే మాటల్లో నిజమెంతోగానీ... ఈ దశలో స్పీకర్‌ది కీలకపాత్ర. మధ్యప్రదేశ్ డ్రామా ఎన్నాళ్లు కొనసాగాలో ఆయన చర్యలే నిర్దేశిస్తాయి. ఆ తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా లేక అర్ధాంతరంగా ఎన్నికలొస్తాయా అన్నది తేలుతుంది. ఇదంతా బీజేపీ కుట్రని ఎంపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆరోపిస్తున్నారు. కానీ ఈ పరిణామాలకు బీజేపీని నిందించి ప్రయోజనం లేదు. ఏమీ లేని గోవాలోనే పావులు కదిపి అధికారం చేజిక్కించుకోగలిగిన బీజేపీ... అధికారం అంచుల వరకూ వెళ్లి ఆగిపోయిన మధ్యప్రదేశ్‌లో మౌనంగా ఉంటుందనుకోవడం తెలివితక్కువతనం. గతవారం ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని హోటల్‌కు తరలించిన ఉదంతంలో ఎలాగోలా కాంగ్రెస్ పరువు కాపాడుకోగలిగింది. వారందరినీ వెనక్కు తీసుకు రాగలిగింది. ఈసారి మాత్రం పరిస్థితి చేయి దాటిపోయింది. మధ్యప్రదేశ్‌లో పార్టీ కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య, దిగ్విజయ్‌సింగ్ వర్గాలుగా చీలిపోయిందని, ఆ ఇద్దరూ ఏకమై జ్యోతిరాదిత్యను ఇరకాటంలోకి నెట్టారని పార్టీ సారథులకు తెలియందేమీ కాదు. కేబినెట్లో కీలక పదవులన్నీ కమల్‌నాథ్, దిగ్విజయ్ అనుచర ఎమ్మెల్యేలకే దక్కాయి. పర్యవసానంగా జ్యోతిరాదిత్యలో ఏర్పడ్డ అసంతృప్తిని పారదోలడానికి, ఆయన వర్గానికి కూడా తగిన అవకాశాలివ్వడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించలేదు. పైపెచ్చు సోనియా, రాహుల్‌గాంధీలను కలిసి తన గోడు వెళ్లబోసుకుందామని సింధియా చేసిన ప్రయత్నం ఫలించలేదు. పార్టీలో తాను సంతృప్తిగా లేనని సింధియా కొద్దికాలంనుంచి పరోక్షంగా చెబుతూనేవున్నారు. కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసి కశ్మీర్ పత్రిపత్తిని మార్చినప్పుడు పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యానించి ఆయన కలకలం సృష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీకి దూరంగానే వుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు... అధికారం ఉందా లేదా అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఇలా అంతఃకలహాలతో సతమతమవుతోంది. వాస్తవానికిది కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన పాత తరం నేతలకూ, పార్టీ కోసం శ్రమిస్తూ అందులో తమ భవిష్యత్తును వెదుక్కుంటున్న యువతరానికీ మధ్య సాగుతున్న సంకుల సమరం. చుట్టూ చేరిన వందిమాగధుల బృందగానం తప్ప మరేమీ వినడానికి ఇచ్చగించని అధినేత్రి సోనియాగాంధీకి ఈ యువతరమంటే మొదటినుంచీ అనేకానేక శంకలు. సొంతంగా ఆలోచించేవారన్నా, స్వతంత్రంగా ఎదుగుతారనుకున్నా వారిని దూరం పెట్టడం ఆమె ఒక విధానంగా మార్చుకున్నారు. పార్టీలో యువతరానికి ప్రాధాన్యమిస్తానని, వారసత్వాన్ని పక్కనబెట్టి పనిచేయడం ఒక్కటే ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పిన రాహుల్‌గాంధీ పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, అడుగడుగునా తల్లి జోక్యం పెరగడం చూశాక చాన్నాళ్లక్రితమే కాడి పారేశారు. అడపా దడపా మీడియానుద్దేశించి మాట్లాడటం తప్ప పార్టీలో జరిగే ఏ విషయాలు తనకు పట్టనట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వర్గంగా ముద్రపడి, కేవలం అందువల్లనే నిరాదరణకు గురవుతున్న నేతలకు వేరే ప్రత్యామ్నాయం ఏముంటుంది? ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్యకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి, ఫలితాల తర్వాత ఆయనకే పట్టం గడతామన్న అభిప్రాయం కలిగించిన కాంగ్రెస్...అటుపై ఆ యువ నాయకుడిని పక్కకు నెట్టి కమల్‌నాథ్‌ని పీఠం ఎక్కించింది. మధ్యప్రదేశ్‌నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యే అవకాశం వుండగా, ఖచ్చితంగా వస్తుందనుకున్న ఒక్క సీటుకూ దిగ్విజయ్‌సింగ్ కాచుక్కూర్చున్నారు. ఆయనకు అది దక్కకుండా చేయడానికి ప్రియాంకగాంధీ పోటీ చేయాలన్న డిమాండు ఈమధ్యే బయల్దేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన జ్యోతిరాదిత్య ప్రస్తుత పరిస్థితుల్లో తనకు రాజ్యసభ అవకాశం రావడం అసాధ్యమని గ్రహించివుంటారు. ఈ పార్టీలో తనకు రాజకీయంగా భవిష్యత్తు లేదన్న నిర్ణయానికొచ్చివుంటారు. రాజస్తాన్‌లోనూ సచిన్ పైలెట్‌కు ఇలాంటి పరిస్థితే వుంది. అధికారం లేకుండా బతకలేనని జ్యోతిరాదిత్య నిరూపించారని, అలాంటి నేతలు ఎవరైనా పార్టీని వదిలిపోవచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చేసిన వ్యాఖ్యానం ఎవరినుద్దేశించి చేసిందో సచిన్ పైలెట్ గ్రహించకపోరు. మధ్యప్రదేశ్ డ్రామా పూర్తయ్యాక రాజస్థాన్‌లో అది మొదలైనా ఆశ్చర్యం లేదు. కనీసం ఈ దశలోనైనా కాంగ్రెస్ అధినాయకత్వం మేల్కొనకపోతే, జనంలో పలుకుబడివున్న నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి దానికి జవసత్వాలు కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకపోతే పార్టీ కనుమరుగు కావడం ఖాయం. -
మధ్యప్రదేశ్ సంక్షోభంలో మరో ట్విస్ట్
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. తాజా సంక్షోభం నేపథ్యంలోనే ఎస్పీ ఎమ్మెల్యే రాజేష్ శుక్లా, బీఎస్పీ ఎమ్మెల్యే రాజీవ్ కుషావా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని వారిని చౌహాన్ కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్యేలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు నలుగురు స్వతంత్ర శాసన సభ్యులతో కూడా బీజేపీ నేతలు మంతనాలు ప్రారంభించారు. తమకి మద్దతు ఇస్తే కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇస్తామనే ఆఫర్‌ను వారి ముందు ఉంచినట్టు సమాచారం. తాజా పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టింది. (రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!) ఇక కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 20 ఎమ్మెల్యేలు తమ రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండటంతో వారందరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంకు గవర్నర్ టాండన్ లేఖ రాశారు. గవర్నర్ లేఖపై స్పందించిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వారిని ఇప్పటికే మంత్రిపదవుల నుంచి తొలగించినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య సింధియా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పుతున్నారు. మంగళవారం సాయంత్రం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. -
'మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు'
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ ప్రభుత్వంలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లి హర్యానాలోని ఒక హోటల్లో నిర్భందించారని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి జితూ పట్వారీ పేర్కొన్నారు. 'మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మంత్రులు నరోత్తం మిశ్రా, భూపేంద్ర సింగ్, రామ్‌పాల్ సింగ్ సహా మరికొంత మంది సీనియర్ బీజేపీ నేతలు కలిసి మా పార్టీకి చెందిన నలుగురు, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు, సమాజ్‌వాది నుంచి ఒకరు, మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను హర్యానాలోని ఒక హోటల్‌కు తరలించారు. కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు.తీసుకెళ్లొద్దని చెప్పినా వినకుండా మమ్మల్ని హోటల్‌కు తరలించారని ఒక ఎమ్మెల్యే మాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారిని వెంటనే వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.ఇప్పటికే నలుగురు తిరిగొచ్చారు' అని పట్వారీ పేర్కొన్నారు. (ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45కోట్లు) అంతకుముందు మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. అధికార కూటమిలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారని ఆరోపించారు. కుట్రలో భాగంగా బారీ మొత్తంలో నగదు ఇవ్వజూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు హరియాణాలోని హోటల్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడి పోలీసులు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. (ప్రధాని మోదీకి ఎంపీ ముఖ్యమంత్రి సవాల్!) కాగా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. మధ్యప్రదేశ్‌లో మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వేస్తుందని, తమకు ఫ్రీ మనీ వస్తోందని ఎమ్మెల్యేలు తనతో చెబుతున్నారని ఆయన అన్నారు. ఎవరు పార్టీలో నుంచి వెళ్లిపోయినా మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంలేదని కమల్‌నాథ్ పేర్కొన్నారు. #WATCH Haryana: Madhya Pradesh Ministers&Congress leaders Jitu Patwari&Jaivardhan Singh leave from ITC Resort in Gurugram's Manesar,taking suspended BSP MLA Ramabai with them.8 MLAs from MP are reportedly being held against their will by BJP at the hotel,Ramabai being one of them pic.twitter.com/VUivVHsaA4 — ANI (@ANI) March 3, 2020 -
ఆయన శరణార్థులకు 'దేవుడు': మాజీ సీఎం
జైపూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీలతో దేశం అట్టుడుకుతుంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని భారత్‌కు తరలివచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే చట్టంతో.. ప్రధాని మోదీ శరణార్థులకు దేవుడిలా మారారని అభివర్ణించారు. 'భగవంతుడు జీవితాన్ని ప్రసాదించాడు. తల్లి జన్మనిస్తే.. నరేంద్ర మోదీ మాత్రం పునర్జన్మను ఇచ్చారని' జైపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. Shivraj Singh Chouhan, BJP in Jaipur on #CitizenshipAmendmentAct: Narendra Modi inke liye bhagwan ban ke aaye hain jo pratadit the aur nark ki zindagi jee rahe the. Bhagwan ne jeewan diya, maa ne janam diya, lekin Narendra Modi ji ne fir se zindagi di hai. pic.twitter.com/mKnTryu6zb — ANI (@ANI) December 23, 2019 పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించి, భయాందోళనలకు గురిచేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఇక పౌరసత్వ సవరణ చట్టంపై సోనియా గాంధీ వైఖరిని తప్పుబట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు చట్టం అవ్వడానికి ముందే లోక్‌సభలో ప్రశ్నించి ఉంటే బావుండేదన్నారు. చట్టమైన తర్వాత వీడియో తీసి ప్రచారం చేయడం బాగాలేదన్నారు. తాజాగా జార్ఖండ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను గురించి ప్రశ్నించగా.. రాష్ట్రంలోని సమస్యలపై ఎన్నికలు జరుగుతాయని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. -
‘శ్వేత నీ లాంటి కుమార్తెలుండటం గర్వకారణం’
భోపాల్: ఖాకీల కరుకు గుండెల్లో కూడా మానవత్వం ఉంటుందని నిరూపిస్తున్న సంఘటనల్ని ఈ మధ్య కాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా పోలీసు అనాథ అయిన ఓ వృద్ధురాలికి బట్టలు తొడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వివరాలు.. కుటుంబ సభ్యులు వదిలేయడంతో.. ఆ తల్లి అనాథలా మారింది. ఆకలితో అలమటించే పేగులకు ఇంత ముద్ద దొరికితే అదే భాగ్యం అనుకునే ఆ తల్లి బట్టల గురించి ఆలోచించడం అత్యాశే అనుకుంది. ఈ క్రమంలో ఒంటి మీద సరైన బట్టలు లేక అవస్థ పడుతున్న ఆ తల్లిని చూసి శ్వేతా శుక్లా అనే మహిళా పోలీసు అధికారి హృదయం ద్రవించింది. దాంతో కొత్త బట్టలు, చెప్పుల తెచ్చి మరో ఉద్యోగిని సాయంతో ఆ ముసలమ్మకు తొడిగించింది. అధికారి ఆప్యాత చూసి ఆ ముసలి తల్లి కన్నీరు పెట్టుకుంది. ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించగా.. ‘నా కడుపున పుట్టిన వారికి నేను భారమయ్యాను. ఇలా ఒంటరిగా అనాథలా వదిలేశారు. ఏ తల్లి కన్న బిడ్డవో.. నా కోసం ఇంత ఆప్యాయంగా బట్టలు తెచ్చావు’ అంటూ శ్వేతను పట్టుకుని ఏడ్చింది ఆ వృద్ధురాలు. ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ‘శ్రద్ధా శుక్లా లాంటి కుమార్తెలను చూసి మధ్యప్రదేశ్ గర్విస్తోంది. కుమార్తెలు ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకుంటారు. ఇంటికి కొత్త కాంతిని తీసుకువస్తారు’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ‘మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.. చాలా గొప్ప పని చేశారు’ అంటూ నెటిజన్లు శ్వేతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఆ యువకుడి పరుగుకు క్రీడా మంత్రి ఫిదా!
భోపాల్: ఉసేన్ బోల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీల్డ్‌లో దిగాడంటే చిరుత కంటే వేగంగా దూసుకుపోతాడు ఈ జమైకా అథ్లెట్. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న బోల్ట్ అంటే చాలామంది అథ్లెట్లకు ఆదర్శం. కాగా, మనకు ఓ బోల్డ్ దొరికినట్లే కనబడుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్(19)కు పరుగు అంటే విపరీతమైన ఆసక్తి. అదే సమయంలో పరుగులో మంచి నైపుణ్యం కూడా ఉంది. ఇప్పుడు అతనే పరుగే ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లడం, అక్కడి నుంచి అది కాస్తా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు వరకూ వెళ్లడం జరిగాయి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన రామేశ్వర్ అనే యువకుడికి రన్నింగ్‌లో మంచి ప్రతిభ ఉంది. ఈ క్రమంలో అతడు కనీసం చెప్పులు కూడా లేకుండా 100మీటర్ల పరుగును 11 సెకన్లలో చేధించే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. దీంతో చౌహాన్ ఆ వీడియోను ట్విటర్లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌రిజుజుకి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘ భారత్‌లో వ్యక్తిగత నైపుణ్యానికి కొదవలేదు. వారికి సరైన వేదిక దొరికినప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. పరుగుపందెంలో ఈ యువకుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఒకవేళ మంచి సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే దేశానికి పేరు తీసుకురాగలడన్నా నమ్మకం ఉంది’ అని పేర్కొటూ రిజుజుకి ట్యాగ్ చేశారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్‌ను చూసిన కిరణ్‌రిజుజు ఫిదా అయిపోయారు. అందుకు కిరన్ రిజుజు స్పందిస్తూ.. ‘అతడిని ఎలాగైనా నా వద్దకు పంపించండి, తప్పకుండా అతడిని అథ్లెటిక్స్ అకాడమీలో చేర్పించి ఇంకా మెరుగయ్యేలా మంచి శిక్షణ ఇప్పిస్తా’ అని హామీ ఇచ్చారు. అతనికి మంచి శిక్షణ దొరికి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం. India is blessed with talented individuals. Provided with right opportunity & right platform, they'll come out with flying colours to create history! Urge @IndiaSports Min. @KirenRijiju ji to extend support to this aspiring athlete to advance his skills! Thanks to @govindtimes. pic.twitter.com/ZlTAnSf6WO — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 16, 2019 -
నెహ్రు ఓ క్రిమినల్ : చౌహాన్
భువనేశ్వర్ : బీజేపీ సీనియర్ నాయకులు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెహ్రు ఓ క్రిమినల్ అని విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌కు జరిగిన అన్యాయానికి నెహ్రునే కారణమని ఆరోపించారు. నెహ్రు తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే కశ్మీర్ పూర్తిగా భారత్ సొంతమయ్యేదని అన్నారు. ‘ భారత భద్రతా బలగాలు కశ్మీర్ నుంచి పాక్ గిరిజనులను వెళ్లగొడుతున్న సమయంలో నెహ్రు కాల్పుల విరమణను ప్రకటించి తొలి నేరానికి పాల్పడ్డారు. అందువల్ల 1/3 భూభాగం(పీవోకే) పాకిస్థాన్ చేతిలో ఉండిపోయింది. నెహ్రు ఇంకొద్ది రోజులు కాల్పుల విరమణ ప్రకటించి ఉండకపోతే కశ్మీర్ పూర్తిగా మన సొంతమయ్యేది. ఇక, జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని తీసుకురావడం ద్వారా నెహ్రు రెండో నేరం చేశారు. దీని ద్వారా ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది దేశానికి చేసిన అన్యాయం మాత్రమే కాదు నేరం కూడా’ అని శివరాజ్‌సింగ్ పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును తీసుకువచ్చింది. దీని ప్రకారం కశ్మీర్, లదాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నెహ్రు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. -
ఏపీలోనూ టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు
సాక్షి, అమరావతి/గుంటూరు: మొన్నటి ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయ భవిష్యత్తు లేదని.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలన్నది తమ పార్టీ జాతీయ నాయకత్వ లక్ష్యమని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిశీలన నిమిత్తం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం గుంటూరు, కృష్ణా జిల్లా గన్నవరంలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 25 లక్షల మందిని పార్టీ ప్రాథమిక సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా రూ.17 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని.. ఇప్పటికీ కేంద్రం ఆ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. హోదాకు బదులుగా ప్యాకేజీ తీసుకోవడానికి అంగీకరించిన చంద్రబాబు, కేంద్రం ఇస్తామన్న నిధులను నేరుగా విడుదల చేయాలని కోరారని.. కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తే అవి తమ జేబుల్లోకి మళ్లించుకోవాలన్నది వారి ఉద్దేశంగా చెప్పారు. కేంద్రం మాత్రం ప్యాకేజీగా ఇస్తామన్న నిధులను నేరుగా కాకుండా వివిధ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని చెప్పిందన్నారు. బీజేపీలో చేరడానికి ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. రాష్ట్రంలో 25 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చడం తమ లక్ష్యమని, అందులో ఎవరైనా ఉండొచ్చంటూ బదులిచ్చారు. పార్టీ ఏపీ ఇన్చార్జి రామ్ మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ లేదని, అమెరికాలో తానా సభల్లో మాత్రమే కనిపిస్తోందన్నారు. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, టీడీపీ గుంటూరు నగర మాజీ అధ్యక్షుడు చందు సాంబశివరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిద్దావెంకట్రావుతో పాటు పలువురు టీడీపీ నేతలు చౌహాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోదర్ పాల్గొన్నారు. -
‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఆదివారం గన్నవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆవరణలో చౌహాన్, జీవీఎల్ మొక్కలు నాటారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలిపారు. పేదల అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. టీడీపీ నుంచి అనేక మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చౌహాన్ మాట్లాడుతూ.. బీజేపీ జీరో స్థాయి నుంచి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ఏపీలో 25 లక్షల సభ్యత్వం తమ లక్ష్యమని తెలిపారు. బూత్ స్థాయి నుంచి బీజేపీ బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సేవ చేయాలనుకునే వారికి బీజేపీ పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడమే తప్ప.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని.. ప్యాకేజీకి అంగీకరించారని గుర్తుచేశారు. ప్యాకేజీకి అనుగుణంగా కేంద్రం అనేక రూపాలలో నిధులు ఇచ్చిందన్నారు. ఏపీకి రూ. 17వేల కోట్ల రూపాయలు ఇస్తే.. ఆ డబ్బులను చంద్రబాబు దారి మళ్లించి తన జేబులో వేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్టీని నడపలేకనే.. అధ్యక్ష పదవి నుంచి పారిపోయారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నకిలీ గాంధీలతో నిండిపోయిందన్నారు. -
కలెక్టర్‌కు మాజీ సీఎం వార్నింగ్
భోపాల్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం సహనం కోల్పోయారు. ఛింద్వారాలో తన హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడంతో ఆయన జిల్లా కలెక్టర్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం చౌహాన్ ఛింద్వారా జిల్లా ఉమ్రేత్లో పర్యటించాల్సి ఉంది. అందుకోసం చౌహాన్ హెలికాఫ్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు అక్కడికి వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం సాయంత్రం 5 గంటల లోపే ఆయన హెలికాఫ్టర్ ల్యాండింగ్ అనుమతి ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి లోనైనా చౌహాన్ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ మా హెలికాఫ్టర్లు ల్యాండ్ కాకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. నేను ఇతర రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నాను. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడ తలెత్తలేదు. నేను వారిని సాయంత్రం 6 గంటల వరకు అనుమతివ్వమని కోరాను. కానీ వారు అందుకు అంగీకరించలేదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడరాదు. ఓ తోలుబొమ్మ కలెక్టర్.. నేను తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలుసా’ అంటూ హెచ్చరించారు. మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యంత్రిగా పనిచేసిన చౌహాన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
‘దిగ్విజయ్ వర్సెస్ శివరాజ్ చౌహాన్’
భోపాల్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టున్న భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను బరిలో దింపడంతో ఆయనకు దీటైన అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పోటీలో నిలపాలని భావిస్తోంది. వీరిద్దరూ ప్రత్యర్ధులుగా తలపడితే ఇద్దరు మాజీ సీఎంల నడుమ బ్యాలెట్ పోరు ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి మాలెగావ్ పేలుళ్ల కేసులో అభియోగాలు ఎదుర్కొని ఇటీవలే న్యాయస్ధానం నుంచి ఊరట పొందిన సాధ్వి ప్రగ్య ఠాకూర్ ఆసక్తి కనబరుస్తున్నారు. భోపాల్ స్ధానాన్ని గత మూడు దశాబ్ధాలుగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. 1984లో చివరిసారిగా కాంగ్రెస్ నేత శంకర్ దయాళ్ శర్మ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. అప్పటినుంచి భోపాల్ బీజేపీ ఖాతాలోనే కొనసాగుతోంది. 1989 నుంచి బీజేపీకి చెందిన సుశీల్ చంద్ర వర్మ వరుసగా మూడుసార్లు భోపాల్ నుంచి ఎన్నికయ్యారు. 1999లో భోపాల్ నుంచి నెగ్గిన ఉమా భారతి సీఎం పగ్గాలు చేపట్టిన అనంరతం పార్లమెంట్ స్ధానం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం భోపాల్ నుంచి బీజేపీ సభ్యుడు అలోక్ సంజార్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్ బరిలో దిగడం, లోక్‌సభ పరిధిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో దీటైన అభ్యర్ధివైపే బీజేపీ మొగ్గుచూపుతోంది. భోపాల్ నుంచి పోటీ చేసేందుకు మేయర్ అలోక్ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి వీడీ శర్మలను పరిశీలిస్తున్న బీజేపీ దిగ్విజయ్ రాకతో దిగ్గజ నేతనే బరిలో దింపాలని యోచిస్తోంది. -
మధ్యప్రదేశ్ మాంత్రికుడు
సాక్షి వెబ్ ప్రత్యేకం : పదమూడేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరిన ఓ పాఠశాల విద్యార్థి తన అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, పట్టుదలతో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆయనే మూడుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్. భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన 2005 నుంచి 2018 డిసెంబర్ వరకు మధ్యప్రదేశ్ సీఎంగా కొనసాగారు. రాజకీయాల్లో విశేషమైన అనుభవమున్నా ప్రతి విషయాన్ని సున్నితంగా ఆలోచించే మనస్థత్వం చౌహాన్‌ది. వృత్తిరీత్యా ఆయనది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా మూడు సార్లు సీఎం పీఠం ఎక్కి ఔరా అనిపించారు. అంతేకాదు విదిశ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. లాడ్లీ లక్ష్మీ యోజన, కన్యాదాన్ యోజన, జననీ సురక్షా యోజన లాంటి పథకాలను ప్రవేశపెట్టి మధ్యప్రదేశ్ ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో బాబాలకు క్యాబినెట్ హోదా కల్పించి జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (తత్వశాస్త్రం) పట్టా అందుకున్నారు. రాజకీయ ప్రవేశం 1972లో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1975లో మధ్యప్రదేశ్‌లోని మోడల్ స్కూల్ స్టూడెంట్స్ యూనియన్‌కి మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1976-77 ప్రాంతంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమించినందుకు కొంతకాలం భోపాల్‌లో జైలుశిక్ష అనుభవించారు. మొదటిసారి 1990లో బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991లో పదో లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1997-98 మధ్యకాలంలో పార్టీ కీలక కమిటీల్లో సభ్యుడిగా, మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2000 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఛైర్మన్ ఆఫ్ హౌస్ కమిటీ (లోక్‌సభ), బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే చోటుచేసుకుంది. దీనిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాంద్సౌర్లో రైతులపై కాల్పులు జరిపి ఐదుగురు రైతుల మృతికి కారణమైయారన్న అప్రతిష్టను శివరాజ్‌సింగ్ మూటకట్టుకున్నారు. సంస్కరణలు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిని మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతులకు వడ్డీలేని రుణాలు, నీటి వనరుల పెంపు, రాయితీ ధరకు విద్యుత్ సరఫరా తదితర మార్గాల ద్వారా వ్యవసాయం వృద్ధి చెందేందుకు కృషి చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా దిగుబడి సాధించినందుకు గానూ వరుసగా నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘కృషి కర్మణ్’ అవార్డును అందుకున్నారు. మనిషి జీవన విధానంలో నదుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని చెబుతూ ‘నమామి దేవి నర్మదా’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. తన నిబద్ధత, నిరాడంబరతతో చాలా సులువుగా ప్రజల్లో కలిసి పనిచేసినందుకుగాను అందరి మన్ననలు అందుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన విధానం మెరుగు పరిచేందుకు సూర్యోదయ మానవతా సేవా బిరుదును అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ప్రేమ్‌సింగ్ చౌహాన్, సుందర్‌బాయ్ చౌహాన్ దంపతులకు 1959, మార్చి 5న శివరాజ్‌సింగ్ జన్మించారు. భార్య సుధాన్ సింగ్, కార్తికేయ, కునాల్ వీరిపిల్లలు. శివరాజ్ సింగ్‌ది వ్యవసాయ ఆధారిత కుటుంబం. -సురేష్ అల్లిక -
బీజేపీ ముఖ్య నేతతో సింధియా భేటీ
భోపాల్: మధ్యప్రదేశ్ తాజా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చౌహాన్ నివాసంలో సోమవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. ఇరువురు నేతలు 40 నిమిషాల పాటు రహస్యంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండేందుకు మొగ్గుచూపే సింధియా తన అనుచరుల కుటుంబ సభ్యులు ఇద్దరు చనిపోవడంతో పరామర్శించడానికి సోమవారం భోపాల్‌కు వచ్చారు. అక్కడ నుంచి ఆశ్చర్యకరంగా నేరుగా చౌహాన్ ఇంటికి వెళ్లారు. అయితే మర్యాదపూర్వకంగా కలుసుకున్నామని నేతలిద్దరూ చెప్పడం విశేషం. సమావేశం ముగిసిన తర్వాత కారు వరకు వచ్చి సింధియాను చౌహాన్ సాగనంపడం విశేషం. రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోతామని ఈ సందర్భంగా సింధియా చెప్పారు. ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. దావోస్‌కు వెళ్లిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం. చౌహాన్-సింధియా సమావేశంపై కాంగ్రెస్, బీజేపీ భిన్నంగా స్పందించాయి. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులకు చౌహాన్ సహకారం కోరేందుకే ఆయనతో సింధియా భేటీ అయ్యారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనాక్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. చౌహాన్‌ను సింధియా మర్వాదపూర్వకంగా కలిసినా కాంగ్రెస్ ఉలికిపడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ ఎద్దేవా చేశారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠం కోసం సింధియా ప్రయత్నించారు. సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌వైపు అధిష్టానం మొగ్గుచూపడంతో ఆయన సీఎం అయ్యారు. మరోవైపు శివరాజ్‌సింగ్ చౌహాన్ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీజేపీ ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. -
వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం
భోపాల్: మధ్యప్రదేశ్ సచివాలయంలో ‘వందేమాతరం’ ఆలపించకపోవడం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సచివాలయంలో ప్రతినెల మొదటి పని దినం రోజున వందేమాతర గేయాన్ని ఆలపించాలని అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, జనవరి 1వ తేదీన మాత్రం సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్.. వందేమాతరం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని.. అది దేశభక్తిగా ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం, దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్ మరచిపోరాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా క్యాబినేట్ మీటింగ్ ప్రారంభానికి ముందు కూడా వందేమాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో జనవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందేమాతర గేయాన్ని ఆలపిస్తానని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్.. వందేమాతర గేయం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మాట్లాడుతూ.. ఎస్సార్ మొహంతి మంగళవారం రోజున సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారని.. అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉండటం వల్ల వందేమాతరాన్ని ఆలపించే కార్యక్రమం నిర్వహించలేకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వందేమాతర గేయంపై బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందని నిలదీశారు. -
‘భయపడకండి.. పులి బతికే ఉంది’
భోపాల్ : ఎవరూ భయపడకండి.. పులి బతికే ఉంది అంటున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పులి బతికి ఉండటానికి.. చౌహాన్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఓడిపోయిన వారికి ధైర్యం చెబుతారు. కానీ చౌహాన్ మాత్రం వెరైటీగా ప్రజలకు ధైర్యం చెబుతూ తనను తాను పులిగా చిత్రికరించుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి బుధ్ని నియోజకవర్గంలో పర్యటించిన చౌహాన్ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఎవరు భయపడకండి.. మీకు ఏం కాదు. నేకు ఇక్కడే ఉన్నాను. పులి ఇంకా బతికే ఉందం’టూ సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’ సినిమా డైలాగ్‌లు చెప్పారు. అయితే ఇలా చమత్కారంగా మాట్లాడటం చౌహాన్‌కు కొత్తేం కాదు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘తుమ్ తో ఠహరే పర్దేసీ సాథ్ క్యా నిభాఓగే’ అంటూ పాత హిందీ సినిమా పాట పాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విదేశీయుడంటూ ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పూర్తి బాధ్యత తనదేనంటూ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
నేను ఇప్పటికీ మధ్యప్రదేశ్ సీఎంనే : చౌహాన్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఓటమిని హుందాగా అంగీకరిస్తూ సీఎం పదవికి శివరాజ్ సింగ్ రాజీనామా కూడా చేశారు. అయినప్పటికీ తాను మధ్య ప్రదేశ్ సీఎంనేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే తాను ప్రస్తుతం మధ్య ప్రదేశ్ చీఫ్ మినిస్టర్( సీఎం) కాదని, కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని పేర్కొన్నారు. తన ట్విటర్లోని బయోడేటాలో చీప్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్‌ను తొలగించి కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చేర్చారు. ‘ మధ్యప్రదేశ్ రాష్ట్రం నా గుడి, రాష్ట్ర ప్రజలు నా దేవుళ్లు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ ప్రజల కోసం తెరచే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ఎలాంటి సంశయం లేకుండా నా దగ్గరకు రావోచ్చు. ఎప్పటిలాగే మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తా’ అని ట్విటర్లో చౌహాన్ పేర్కొన్నారు. मध्यप्रदेश मेरा मंदिर हैं, और यहाँ की जनता मेरी भगवान। मेरे घर के दरवाज़े आज भी प्रदेश के हर नागरिक के लिए हमेशा खुले हैं, वो बिना कोई हिचकिचाहट मेरे पास आ सकते हैं, और मैं हमेशा की तरह उनकी यथासंभव मदद करता रहूँगा। — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) December 14, 2018 తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, అధికార బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు 116 స్థానాలు అవసరం కావడంతో ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) లతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.