Steve Waugh
-
ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. భారత్ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా స్మిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుఅతడి కంటే ముందు.. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఈ ఫీట్ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.ఖవాజా డబుల్ ధమాకాఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన ట్రవిస్ హెడ్ ధనాధన్ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్ చేశాడు.స్మిత్ రికార్డు సెంచరీమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్ చేసిన స్మిత్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.సెంచరీల పరంగా రెండోస్థానంలోకి‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 33, టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లి 81 శతకాలతో టాప్(Active Cricketers)లో ఉండగా.. రూట్ 52, రోహిత్ శర్మ 48, స్మిత్ 47 సెంచరీలతో టాప్-4లో నిలిచారు.ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో ఖవాజా(232), స్మిత్(141)లతో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్, స్టీవ్ స్మిత్👉ఇండియా- ముగ్గురు- సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్👉ఇంగ్లండ్- ఇద్దరు- అలిస్టర్ కుక్, జో రూట్👉శ్రీలంక- ఇద్దరు- కుమార్ సంగక్కర, మహేళ జయవర్దనే👉వెస్టిండీస్- ఇద్దరు- బ్రియన్ లారా, శివ్‌నరైన్ చందర్‌పాల్👉పాకిస్తాన్- ఒక్కరు- యూనిస్ ఖాన్👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్ కలిస్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
‘టెస్టు క్రికెట్‌ను చంపేస్తారా?’: మౌనం వీడిన సౌతాఫ్రికా బోర్డు
Cricket South Africa Weakened Team For New Zealand Tests 2024: టెస్టు క్రికెట్‌ను అవమానించేలా వ్యవహరించారంటూ తమపై వస్తున్న విమర్శలపై సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్పందించింది. తమకు సంప్రదాయ క్రికెట్‌పై అపార గౌరవం ఉందని స్పష్టం చేసింది. మూడు ఫార్మాట్లలోనూ తమకు టెస్టులపైనే అమితమైన ప్రేమ ఉందని తెలిపింది. కాగా న్యూజిలాండ్‌తో ఫిబ్రవరిలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ అనామక జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పటిష్ట కివీస్‌తో పోరుకు 14 మంది సభ్యులతో కూడిన ప్రొటిస్ జట్టులో కేవలం ఏడుగురు క్యాప్డ్ ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ఇద్దరు టీమిండియాతో బాక్సింగ్ డే టెస్టులో ఆడారు. వీరు కాక.. మిగతా వాళ్లంతా కొత్తవారే! సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ప్రధాన ఆటగాళ్లు బిజీ కానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ టూర్‌కు ఇలా కొత్త వాళ్లతో కూడిన జట్టును పంపేందుకు సిద్ధమైంది ప్రొటిస్ బోర్డు. మండిపడ్డ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా.. టెస్టు క్రికెట్‌ను అంతం చేసే కుట్ర జరుగుతోందంటూ సౌతాఫ్రికా క్రికెట్‌పై మండిపడ్డాడు. తానే గనుక న్యూజిలాండ్ స్థానంలో ఉంటే ఈ సిరీస్‌ను రద్దు చేయించేవాడినని ఘాటు విమర్శలు చేశాడు. సౌతాఫ్రికాకు సంప్రదాయ క్రికెట్ కంటే ఫ్రాంఛైజీ క్రికెట్ ముఖ్యమై పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఐసీసీ సహా బీసీసీఐ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు జోక్యం చేసుకుని టెస్టు క్రికెట్ చచ్చిపోకుండా చూడాలని స్టీవ్ వా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ ప్రాధాన్యం గురించి కీలక వ్యాఖ్యలు చేయగా.. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం టెస్టు క్రికెట్ ఐసీయూ మీద ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. మాకు టెస్టు క్రికెట్ అంటే అమితమైన ప్రేమ ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలపై స్పందించిన సౌతాఫ్రికా క్రికెట్.. ‘‘న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టు గురించి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటన ఇది. వచ్చే నెలలో న్యూజిలాండ్‌కు వెళ్లనున్న మా జట్టు గురించి అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, అభిమానులకు ఒక విషయం స్పష్టం చేయాలని కోరుకుంటున్నాం. టెస్టు ఫార్మాట్ మీద మాకు అపారమైన గౌరవమర్యాదలు ఉన్నాయి. సంప్రదాయ క్రికెట్‌పై మాకు అమితమైన ప్రేమ ఉంది. నిజానికి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్ వాయిదా వేయాలని మేము భావించాం. కానీ కుదరలేదు. ఈ సిరీస్‌పై నిర్ణయానికి వచ్చే ముందే సౌతాఫ్రికా టీ20 లీగ్ నిర్వాహకులకు మాట ఇచ్చాం. అందుకే ఇలా చేయకతప్పడం లేదు. ఇదొక్కటి మినహా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్లో సౌతాఫ్రికా మ్యాచ్‌లకు ఎటువంటి ఆటంకం కలుగబోదు’’ అని సీఎస్ఏ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా టీ20 లీగ్ కోసం సౌతాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్ విషయంలో మార్పులు చేయాలనుకోవడం ఇది రెండోసారి. టీ20 లీగ్ సజావుగా సాగేందుకు వీలుగా గతంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకోవాలని ప్రొటిస్ బోర్డు భావించింది. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023కి అర్హత సాధించాలంటే తప్పక ఆడాల్సిన ఈ సిరీస్ విషయంలో అడ్జస్ట్మెంట్లు చేసుకుంది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి కేప్‌టౌన్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది. CSA BOARD STATEMENT ON SA SQUAD FOR THE NEW ZEALAND TOUR 🇿🇦🇳🇿 Cricket South Africa notes the concerns about the composition of the Test squad that will be travelling to New Zealand later this month🏏 We reassure the fans that CSA has the utmost respect for the Test format as… pic.twitter.com/bdUmMmf0qY — Proteas Men (@ProteasMenCSA) January 2, 2024 -
టెస్ట్ క్రికెట్‌ను చంపే కుట్ర జరుగుతుంది..!
ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాసులు కురిపించే లీగ్ (SA20) కోసం క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చంపే కుట్ర చేస్తుందని సంచలన ఆరోపణలు చేశాడు. ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్‌తో కూడిన జట్టును న్యూజిలాండ్‌కు పంపిస్తూ క్రికెట్ సౌతాఫ్రికా న్యూజిలాండ్ క్రికెట్‌ను అవమానపరిచిందని మండిపడ్డాడు. స్వదేశంలో జరిగే లీగ్‌పై అంత మమకారం ఉన్నప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌ను మొత్తంగా రద్దు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చులకన చేసిందని, వాళ్లకు దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెట్టే ఎక్కువైందని తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్‌ను చులకన చేస్తూ క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పనిని చూసిచూడనట్లు వ్యవహరించినందుకు ఐసీసీ సహా బీసీసీఐపై కూడా మండిపడ్డాడు. ఐసీసీ, బీసీసీఐ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు టెస్ట్ క్రికెట్ పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చాడు. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చులకన చేసేటువంటి చర్యలకు పాల్పడటం ఇది తొలిసారి కాదని, గతంలోనూ ఆ దేశ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం ఆస్ట్రేలియాకు ద్వితియ శ్రేణి జట్టును పంపించిందని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్ లాంటి దేశాలు సైతం ఇదే రీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. ఇలాంటి చర్యలు టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశాడు. మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ వా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా సీనియర్లను కాదని అనామక జట్టును న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో. -
న్యూజిలాండ్‌కు ఇది అవమానమే.. ఆఖరికి పాక్ కూడా అలాగే: స్టీవ్ వా
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) తీరును ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా తప్పుబట్టాడు. జాతీయ జట్టు కంటే వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్ ఎక్కువైపోయిందంటూ మండిపడ్డాడు. తనే గనుక న్యూజిలాండ్ క్రికెట్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా సౌతాఫ్రికా జట్టు యాజమాన్యానికి తగిన విధంగా బుద్ధి చెప్పేవాడినంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా న్యూజిలాండ్‌తో ఫిబ్రరిలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా ఇటీవల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోని 14 మంది సభ్యుల్లో దాదాపు అందరూ కొత్త వారే. కెప్టెన్ నీల్ బ్రాండ్ కూడా పెద్దగా పరిచయం లేని పేరు. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనున్న నేపథ్యంలో బోర్డు ఈ మేరకు అనామక ఆటగాళ్లను కివీస్ పర్యటనకు పంపేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై స్పందించిన ఆసీస్ మాజీ క్రికెటర్ స్టీవ్ వా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి సహా బీసీసీఐ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌కు చరమగీతం పాడేలా చర్యలకు పూనుకుంటున్న సౌతాఫ్రికా క్రికెట్‌ను హెచ్చరించాల్సిన అవసరం మీకు లేదా అంటూ ప్రశ్నించాడు. ‘‘సౌతాఫ్రికాకు టెస్టు గురించి పట్టదు. భవిష్యత్తులో తమ ఆటగాళ్లు కేవలం సొంతగడ్డపై జరిగే లీగ్ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తారని సంకేతాలు ఇస్తోంది. ఒకవేళ నేనే గనుక న్యూజిలాండ్ స్థానంలో ఉండి ఉంటే.. ఈ సిరీస్‌ను రద్దు చేయించేవాడిని. అసలు కివీస్ జట్టు ఈ అనామక టీమ్‌తో ఆడేందుకు ఎందుకు ఒప్పుకుందో తెలియడం లేదు. న్యూజిలాండ్ క్రికెట్ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించినా వాళ్లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. టెస్టు క్రికెట్ అంతం కాబోతోందనడానికి ఇలాంటివి సంకేతాలు. ఐసీసీతో పాటు ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఏం చేస్తున్నాయి? వాళ్లు ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలి. చరిత్ర, సంప్రదాయానికి ఎంతో కొంత విలువ ఉంటుంది కదా? కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే.. సర్ డాన్ బ్రాడ్‌మన్, గ్రేస్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ వంటి దిగ్గజాల లెగసీని కొనసాగించేవారెవరు? టెస్టు క్రికెట్ ఫీజుల విషయంలో ఆయా బోర్డులు ఆటగాళ్ల పట్ల వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. అందుకే చాలా మంది ఆటగాల్లు టీ10, టీ20 లీగ్‌ల వైపు చూస్తున్నారు’’ అని సిడ్నీ హెరాల్డ్‌తో స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు కూడా ఇలాంటి ధోరణినే అవలంబిస్తూ.. అనామక జట్లను విదేశీ పర్యటనలకు పంపిస్తున్నాయని స్టీవ్ వా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ కారణంగా జాతీయ జట్టు టూర్లపై ప్రభావం పడటం ఇది రెండోసారి. గతేడాది టీ20 లీగ్ కారణంగా తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రద్దు చేసుకోవాలని భావించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు లేకుండానే సిరీస్‌ను ముగించేసింది. ఇక సౌతాఫ్రికా ప్రస్తుతం సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. బాక్సిండే టెస్టులో భారత జట్టును చిత్తు చేసిన ప్రొటిస్ బుధవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. చదవండి: ILT20 2024: మరో టీ20 లీగ్‌లో ఎంట్రీ.. దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ -
టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ శతకంతో మెరిశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ 169 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా స్మిత్‌కు తన టెస్టు కెరీర్లో ఇది 32వ శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అత్యధిక సెంచరీల విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వాతో(32 టెస్టు సెంచరీలు) కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. జాక్ కలీస్(45 సెంచరీలు) రెండో స్థానంలో, రికీ పాంటింగ్(41 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన క్రికెటర్లలో స్మిత్.. స్టీవ్ వాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుత తరంలో టెస్టుల్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు స్మిత్వే కావడం విశేషం. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్ చరిత్ర సృష్టించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో ఆడుతున్న స్మిత్ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో ఒత్తిడికి గురయ్యాడు. మరోవైపు ఆసీస్ కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో స్మిత్ సెంచరీ చేస్తాడా అన్న అనుమానం వచ్చింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక ఎండ్‌లో నిలబడి స్మిత్ సెంచరీ అయ్యేలా చూశాడు. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిది. స్మిత్ 110 పరుగులు, పాట్ కమిన్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez — Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023 A fine innings comes to an end for Steve Smith 🤝 https://t.co/gywkuUUD3T pic.twitter.com/Bxn4vbbRg5 — England Cricket (@englandcricket) June 29, 2023 In 2010 - Steve Smith made his Test debut at Lord's & batted at 8. In 2023 - Steve Smith completed his 32nd Test hundred at Lord's. One of the Greatest turn-arounds in cricket history. pic.twitter.com/UjjS9cc9Oy — Johns. (@CricCrazyJohns) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ హ్యాట్రిక్ సెంచరీ.. వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడా! -
బుల్లెట్ కంటే వేగంగా దూసుకొచ్చింది
జహీర్ ఖాన్.. టీమిండియా బౌలింగ్ దళానికి దశాబ్దానికి పైగా నాయకత్వం వహించాడు. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్ 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17 టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో జహీర్ పాత్ర కూడా చాలా ఉంది. ఆ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లాడిన జహీర్ 21 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జహీర్ 2006 నుంచి 2014 వరకు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా వ్యవహరించాడు. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) తాజాగా ఐసీసీ జహీర్ ఖాన్‌కు సంబంధించి త్రో బ్యాక్ థర్స్డే పేరిట ఒక వీడియోనూ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ .. టీమిండియా బౌలింగ్ కొనసాగుతుంది. అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా క్రీజులో ఉన్నాడు... బంతి టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్ చేతిలో ఉంది. జహీర్ వేసిన బంతి బులెట్ వేగంతో దూసుకొచ్చి వికెట్లను గిరాటేయడంతో స్టీవా దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఆ వేగం ఎంత అంటే.. బంతి దాటికి మూడు వికెట్లు చెల్లాచెదురయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఏ టోర్నీలో జరిగింది.. ఏ సంవత్సరం జరిగిందో చెప్పాలంటూ క్యాప్షన్ జత చేసింది. చాలా మంది నెటిజన్లు ఆ మ్యాచ్ 2000వ సంవత్సరం.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో జరిగిందని కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోపీలో క్వార్టర్ ఫైనల్లో ఆసీస్, టీమిండియా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 46.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. పాంటింగ్ 46, మైఖెల్ బెవన్ 42 పరుగులు చేయగా.. మిగతవారు విఫలం కావడంతో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కాగా ఫైనల్లో కివీస్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ టోర్నీ ద్వారానే జహీర్ ఖాన్‌తో పాటు డాషింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. #ThrowbackThursday ➜ When a young Zaheer Khan went through the gate of an experienced Steve Waugh! What a peach 🔥 Can you guess this game and year? 😉 pic.twitter.com/BQfGlr0FAR — ICC (@ICC) December 31, 2020 -
కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది
ఆస్ట్రేలియాతో జరుగబోయే సిరీస్‌లోని మొదటి టెస్ట్ తర్వాత మిగతా సిరీస్ మొత్తానికి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌కోహ్లి దూరం కావడం ఒకింతా ఆశ్చర్యం, నిరాశకు గురిచేశాయనిఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా పేర్కొన్నాడు. ఒక వైపు కరోనాతో నష్టాల్లో ఉన్న బ్రాడ్ కాస్ట్లకు విరాట్ సిరీస్ మధ్యలో వైదొలగడం ఎదురుదెబ్బేనని అభిప్రాయపడ్డాడు. అతని గైర్హాజరుతో ప్రతిష్టాత్మక బోర్డర్- గవాస్కర్ సిరీస్ వెలితిగా ఉండబోతుందన్నారు. కోహ్లి భార్య అనుష్కశర్మ జనవరిలో మొదటి సంతానానికి జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విరాట్‌కి డిసెంబర్ 17 మొదలయ్యే అడిలైడ్ టెస్ట్ తర్వాత భారత్ వెళ్లడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవా మట్లాడుతూ.. భారత జట్టులో కోహ్లి లేకపోవడంతో ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశాలు మెరుగయ్యాయన్నాడు. ‘ఈ సిరీస్ అతని కెరీర్లో లో మంచి సీరీస్‌గా మిగిలిపోగదు. కానీ కొన్నిసందర్భాల్లో కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. విరాట్ ఆడకపోతే సిరీస్ ఏమీ ఆగిపోదు.. కానీ ఆడితే బాగుంటుందన్నారు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ కానీ స్మిత్ లేనపుడు భారత్ గెలిచినట్లు ఆస్ట్రేలియా గెలిస్తే అలానే ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన ఇలాంటి సిరీస్ లో బలమైన ప్రత్యర్థితో తలపడితేనే బాగుంటుంద’ని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా విరాట్ సేవలు కోల్పోతున్నప్పటికీ భారత జట్టుకు స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ జట్టులో చేరనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. బూమ్రా, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉండటంతో ఎప్పటికీ బలమైన ప్రత్యర్థే. సిరీస్ రసవత్తరంగా ఉంటుందని’ స్టీవా జోస్యం చెప్పారు. క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక ముఖ్య కార్యనిర్వాహక అధికారి నిక్ హక్లీ సిడ్ని రెడియోతో మాట్లాడుతూ.. విరాట్ నిర్ణయంపై స్పందించారు. ఇటువంటివి సాధారణంగా జరుతాయని తెలిపారు. భారత క్రికెట్ జట్టు ఈ వారమే ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. 2 వారాల క్వారంటైన్ ముగిసిన తర్వాత నవంబర్ 17న వన్డే మ్యాచ్‌తో సిరీస్‌ని ప్రారంభించనుంది. కోహ్లి తొలి మూడు వన్డే, టీ-ట్వంటీ మ్యాచ్‌లకు కోహ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు. 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్‌కి ప్రాతినిధ్యం వహించిన తర్వాత భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నాడు. 2వ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26న మెల్‌బొర్న్‌లో, మూడవది జనవరి 7 న సిడ్నిలో, 4వది జనవరి 15 న బ్రిస్బేన్ లో జరుగనున్నవి. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసాంతం కఠిన బయో బబుల్ వాతావరణంలో జరుగనున్నది. . -
'టీమిండియాపై స్లెడ్జింగ్ ఈసారి కష్టమే'
సిడ్నీ : ఆసీస్ అంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతంలోనూ చాలా సార్లు ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడి మానసికంగా వారిపై విజయం సాధించేవారు. 2000వ సంవత్సరం నుంచి 2012 వరకు ఆసీస్ తిరుగులేని జట్టుగా ఉన్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కవ్వింపు చర్యలకు పాల్పడి సగం విజయాలు సాధించేవారు. ఆండ్రూ సైమండ్స్- హర్బజన్ మంకీగేట్ వివాదం ఇలాంటి కోవకు చెందినదే. గత దశాబ్ద కాలంలో ఆసీస్ ఆటగాళ్లలో స్లెడ్జింగ్ విపరీతంగా ఉన్నా ఈ మధ్యన కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. (చదవండి : అందుకే ముంబై అలా చెలరేగిపోతోంది) ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా సుధీర్ఘ పర్యటనలో భాగంగా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కాగా నవంబర్ 27 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా స్లెడ్జింగ్ అంశాన్ని మరోసారి ప్రస్థావనకు తెచ్చాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టీవా పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'ఈసారి కోహ్లి సేనపై స్లెడ్జింగ్ కాస్త కష్టమే అని చెప్పొచ్చు. భారత ఆటగాళ్లపై స్లెడ్జింగ్ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. అలాంటి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు దిగితే వారికి బూస్ట్‌నిచ్చి సిరీస్‌లో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆసీస్ ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. టీమిండియాను వదిలేయండి.. వారి ఆటను ఆడనివ్వండి..దయచేసి ఎవరు స్లెడ్జింగ్‌కు పాల్పడొద్దు. ఇక కోహ్లి విషయానికి వస్తే ఆసీస్ సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే వరల్డ్ కాస్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి నిజానికి ఆసీస్ పర్యటనపై కసితో ఉన్నాడు. 2018-19 ఇండియా పర్యటనలో స్మిత్.. కోహ్లిలు ఒకరినొకరు పోటీపడగా.. అందులో స్మిత్ పైచేయి సాధించాడు. ఆ సిరీస్‌లో స్మిత్ మూడు సెంచరీలు చేయగా.. కోహ్లి పెద్దగా రాణించలేకపోయాడు. నెంబర్‌వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లి ఆ పేరును నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.అని స్టీవా తెలిపాడు. కాగా 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోపిని టీమిండియా నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. -
‘ఔట్ చేయడానికో, గాయపరచడానికో తెలీదు’
మెల్బోర్న్: వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్‌తో జరిగిన ఒకనాటి పోరు గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మరొకసారి గుర్తు చేసుకున్నాడు. 1995లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జమైకాలో జరిగిన టెస్టు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆంబ్రోస్‌తో ఫైట్‌ను స్టీవ్ వా వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ వా డబుల్ సెంచరీ సాధించి ఒక అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో కెరీర్‌కు బాటలు వేసుకోగా, ఆంబ్రోస్ లాంటి బౌలర్‌ను ఎదురొడ్డి నిలవడం సవాల్‌గా అనిపించిందన్నాడు. ‘ రెండు టెస్టులు ముగిసే సరికే సిరీస్ సమంగా ఉండటంతో మూడో టెస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరి టెస్టు కోసం మార్క్ టేలర్ నేతృత్వంలోని మా జట్టు జమైకాకు వెళ్లింది. ఆ మ్యాచ్‌కు ముందు అప్పటి కోచ్ బాబ్ సింప్సన్ మాటలు మాలో ప్రేరణ కల్గించాయి. కానీ సమావేశం మధ్యలో నేను దూరంగా వెళ్లిపోయా. (‘ఆ ఇద్దరే సిరీస్ స్వరూపాన్ని మార్చేశారు’) నేను ఏదో చేయాలనిపించింది. సాధ్యమైనంత ఎక్కువ స్కోరు సాధించాలి అనుకున్నా. అందుకోసం పోరాటం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నా. కానీ ఆంబ్రోస్ వంటి బౌలర్‌ను ఆడటంపై గురి పెట్టా. ఆంబ్రోస్ ఒక గొప్ప బౌలర్. అతని గురించి చెప్పడానికి మాటలు చాలవు. అసాధారణ బౌలర్. ఒక గొప్ప ప్రత్యర్థి. అతని నుంచి బంతులు దారుణంగా ఉంటాయి. స్లెడ్జింగ్ కంటే అతని బంతులే ప్రమాదం. అతను ఏమి ఆలోచిస్తున్నాడో మనకు తెలీదు. నన్ను ఔట్ చేసేందుకు బంతులు వేస్తున్నాడా.. లేక గాయపరిచేందుకు వేస్తున్నాడా అనేది తెలీదు. వర్ణించడానికి వీలుకాని ప్రత్యర్థి ఆంబ్రోస్. ఇక నా ఇన్నింగ్స్ విషయానికొస్తే వెస్టిండీస్‌తో ఆ ఇన్నింగ్స్ నన్ను ప్లేయర్‌గా నిలబెట్టింది. ఆది బాబ్ సింప్సన్ క్రెడిట్. కానీ అది అతనికి దక్కదని తెలుసు. మమ్మల్ని కూర్చోబెట్టి మీలో ఒకరు భారీ సెంచరీ చేయాలి అని చెప్పిన మాటలు నన్ను ఆలోచింప చేశాయి. అదే లక్ష్యంతో బరిలోకి దిగి డబుల్ సెంచరీ చేశా’ అని స్కై స్పోర్ట్స్ యూట్యూబ్ వీడియో ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ అథర్టన్‌తో విండీస్‌తో విషయాలను స్టీవ్ వా షేర్ చేసుకున్నాడు. మూడో టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులు చేయగా, విండీస్ 265 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. దాంతో మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా ఆసీస్ 2-1తో గెలుచుకుంది. (233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) -
స్టీవ్ వా మోస్ట్ సెల్ఫిష్: వార్న్
మెల్బోర్న్: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై సుతి మెత్తని విమర్శలు చేసిన షేన్ వార్న్.. తాజాగా మరో మాజీ కెప్టెన్ స్టీవ్‌పై కూడా కామెంట్స్ చేశాడు. లాక్డౌన్ కారణంగా క్రికెటర్లంతో ఇళ్లకే పరిమితమై సోషల్ మీడియాలో ముచ్చటించే క్రమంలో గతాన్ని తవ్వి మరీ వెలిక్కి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్న్ బదులిచ్చాడు. అది స్టీవ్ వా గురించి అడగ్గా అతనొక స్వార్థ క్రికెటర్ అంటూ సంచలన వ్యాక్యలు చేశాడు. ఇక్కడ తానేమీ స్టీవ్ వా అంటే ద్వేషం లేదని, కేవలం అతను మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నానన్నాడు. (ఆ బ్యాట్‌ను అఫ్రిది సొంతం చేసుకున్నాడు..) అతను అత్యధిక రనౌట్లలో భాగమైన గణాంకాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నాడు. స్టీవ్ వా తన బ్యాటింగ్‌తో ఆసీస్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ఆసీస్‌కు ఒక వరల్డ్‌కప్‌ను కూడా సాధించి పెట్టిన ఘనత కూడా స్టీవ్ వాది. కానీ, ఒక్క చెత్త రికార్డు కూడా స్టీవా పేరిట ఉంది. అది రనౌట్లలో భాగమైన రికార్డు. స్టీవ్ వా ఓవరాల్‌గా 104 సార్లు రనౌట్లలో భాగమైతే, అందులో 73 సార్లు తన సహచర బ్యాటింగ్ పార్టనర్లనే ఔట్ అయ్యారు. దీన్ని ఉద్దేశిస్తూనే ఒక ప్రశ్నను వార్న్‌ను అడగ్గా అందుకు సమాధానంగా స్టీవ్ వా కచ్చితంగా స్వార్థ క్రికెటరే అని పేర్కొన్నాడు. తాను ఆడిన క్రికెటర్లలో స్టీవ్ వానే మోస్ట్ సెల్ఫిష్ అని అన్నాడు. కొన్ని రోజుల క్రితం 2005 యాషెస్ సిరీస్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టు గురించి మాట్లాడుతూ ఆనాటి మ్యాచ్‌లో తమ ఓటమికి రికీ పాంటింగ్ తీసుకున్న నిర్ణయమే కారణమన్నాడు. బ్యాటింగ్ అనుకూలించే వికెట్‌పై టాస్ గెలిచిన పాంటింగ్ బౌలింగ్ ఎంచుకోవడం అతి పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. ఆ నిర్ణయం ఇంగ్లండ్‌కు మేలు చేయడంతోనే తాము రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యామన్నాడు. ('సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్') -
నన్ను మీ నాన్న అన్న మాటలే.. నీకు ఇచ్చేశా!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌గా పార్థివ్ పటేల్‌కు దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కలేదనే చెప్పాలి. అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా తనలో టాలెంట్ ఉన్నా అడపా దడపా అవకాశాలు రావడం ఒకటైతే, ధోని పుట్టిన శకంలోనే పార్థీవ్ కూడా ఉండటం శాపంగా మారింది. ఇది విషయాన్ని పార్థివ్ పటేల్ గతంలోనే చెప్పాడు కూడా. తాను ధోని పుట్టిన శకంలో పుట్టిన కారణంగా భారత జట్టులో సాధ్యమైనన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయానని పార్ధివ్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇది తన దురదృష్టంగా పార్ధివ్ అభివర్ణించుకున్నాడు. అయితే మాటకు మాటకు పంచ్‌కు పంచ్ ఇవ్వడంలో పార్ధివ్ ఎక్కడా తగ్గడు. అయితే తాను ఆసీస్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా వ్యాఖ్యలకు గతేడాది కౌంటర్ ఇచ్చినట్లు పార్ధివ్ తెలిపాడు. 2019లో సిడ్నీలో జరిగిన టెస్టు ద్వారా స్టీవ్ మాటల్ని అతనికే అప్పచెప్పినట్లు పార్థివ్ పేర్కొన్నాడు. అదేంటి స్టీవ్ వా ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించగా, మరి పార్థివ్ స్లెడ్జ్ చేయడం ఏమిటా అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. 2003-04 సీజన్లో సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ స్టీవ్ వాకు చివరిది. ఆ మ్యాచ్‌లో టీమిండియా కీపర్‌గా ఉన్న పార్థివ్ పటేల్.. స్టీవ్ వా స్లెడ్జ్ చేయబోయాడు. ('ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు') దాంతో స్టీవ్ వా కాస్త కూల్‌గానే పార్ధివ్‌కు చురకలంటించాడు. ‘‘నేను క్రికెట్ బ్యాట్ పట్టేటప్పటికి నువ్వు నేపీస్ వేసుకుంటున్నట్లు ఉన్నావ్.. సీనియర్ అనే గౌరవాన్ని ఇచ్చి స్లెడ్జ్ చేస్తే బాగుంటుంది’’ అని పార్థివ్‌కు స్టీవ్ వా హితబోధ చేశాడు. అయితే ఆ మాటల్ని మరిచిపోలేని పార్ధివ్.. గత సంవత్సరం అదే సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా తిరిగి ఇచ్చేశాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ వా కుమారుడు ఆస్టిన్ వా సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా ఉన్నాడు. అలా ఆస్టిన్ ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన క్రమంలో అతని దగ్గరకె వెళ్లి.. ‘‘ నేను టెస్టుల్లో అరంగేట్రం చేసేటప్పటికి నువ్వు నేపీస్లో ఉండి ఉంటావ్. ఇది మీ నాన్న స్టీవ్ వా నన్ను అన్నమాటలు.. మీ నాన్నకు చెప్పు. ఆ మాటల్ని తిరిగి ఇచ్చేశానని చెప్పు’అని ఆస్టిన్ను ఆట పట్టించిన విషయాన్ని పార్థివ్ తాజాగా షేర్ చేసుకున్నాడు. కౌ కార్నర్ క్రోనికల్స్ యూ ట్యూబ్ న్యూ సిరీస్‌లో భాగంగా చంద్రకాంత్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పార్థివ్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. -
ఆ జట్టు డామినేషన్ పీక్స్‌లో ఉంది.. కానీ
సిడ్నీ: టీమిండియా బౌలింగ్ యూనిట్‌పై ఆసీస్ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టు బౌలింగ్ ఆధిపత్యం పీక్స్‌లో ఉందని కొనియాడాడు. ప్రధానంగా భారత్ పేస్ బౌలర్లు చెలరేగిపోతున్న తీరును ప్రశంసించాడు. కానీ ఆ జట్టు బౌలింగ్ డామినేషన్ అనేది స్వదేశానికి పరిమితమై పోయిందనే విషయాన్ని ప్రస్తావించాడు‘ ప్రస్తుత టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ వరల్డ్‌లోనే అత్యుత్తమంగా ఉంది. ఆ జట్టు పేసర్లు విజృంభించి బౌలింగ్ చేస్తూ విజయాలు సాధించిపెడుతున్నారు. ఆ డామినేషన్ అనేది సొంత గడ్డపైనే కావడం కాస్త ఆందోళన పరిచే అంశం. ఈ విషయంలో ఆసీస్ బౌలర్లే ముందంజలో ఉన్నారు. మా పేస్ బౌలింగ్ ఎక్కడైనా సత్తాచాటగలదు. ఆసీస్-టీమిండియా జట్లలో భీకరమైన బౌలర్లు ఉన్నారు. టెస్టుల్లో 20 వికెట్లను సాధించే సత్తా ఇరు జట్ల బౌలర్లలోనూ ఉంది. (ఇక్కడ చదవండి: రాహుల్ 2.. కోహ్లి 10) కానీ భారత్ కంటే ఆసీస్ బౌలింగే బెటర్ అని చెప్పగలను. స్వదేశంలోనే విదేశాల్లోనూ రాణించే బౌలర్లు మా జట్టు సొంతం. ఇక్కడ టీమిండియా బౌలింగ్ ప్రతిభ స్వదేశానికి పరిమితమై పోతున్నట్లు కనబడుతోంది. ప్రత్యేకంగా భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ఆ పేసర్ల బౌలింగ్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఆసీస్ ఎంత ప్రమాదకరమో అదే తరహాలో భారత్‌లో టీమిండియా బౌలింగ్‌లో అద్భుతాలు చేస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వచ్చినప్పుడు మాత్రం మా జట్టు బౌలింగ్ యూనిట్ బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ వైవిధ్యం సూపర్. అయితే అతని బౌలింగ్‌ను కాస్త మార్చుకోవాలని చాలా మంది కోచ్‌లు చెబుతున్నారు. బౌలింగ్‌లో వేగం పెంచకపోతే బుమ్రా వికెట్లు తీయడం కష్టమని అంటున్నారు. అతన్ని సహజసిద్ధమైన బౌలింగ్ చేయనివ్వండి. అతని బౌలింగ్ యాక్షన్ అసాధారణం’ అని స్టీవ్ వా పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: డుప్లెసిస్ సంచలన నిర్ణయం) -
అందుకే మూల్యం చెల్లించుకున్నాడు: స్టీవ్ వా
మెల్బోర్న్: ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టచ్‌లోకి వచ్చాడనుకునే లోపే వికెట్ సమర్పించుకున్నాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించిన కోహ్లి.. ఆ మరుసటి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జంపా ఊరిస్తూ వేసిన బంతిని ఆడలా.. వద్దా అనే సందిగ్థంలో కోహ్లి వికెట్ ఇచ్చేశాడు. ఫలితంగా వన్డేల్లో, టీ20ల్లో కలిపి ఆరోసారి జంపాకు ఆరోసారి ఔటయ్యాడు కోహ్లి. ఇది ఈ రెండు ఫార్మాట్ల పరంగా ఒక బ్యాట్స్‌మన్‌ను అత్యధిక సార్లు జంపా ఔట్ చేసిన ఘనతగా నమోదైంది. జంపాకు ఆరుసార్లు కోహ్లి చిక్కితే, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, దాసున్ షనకా(శ్రీలంక)లు తలో మూడుసార్లు పెవిలియన్ చేరారు. అయితే కోహ్లి ఔట్ అవ్వడానికి కారణాన్ని ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘ ఎక్కువసార్లు జంపాకు ఔటైన కోహ్లి అతన్ని ఆచితూచి ఆడాల్సింది. కాకపోతే అతని బౌలింగ్‌లో దూకుడును ప్రదర్శించాడు. అసలు జంపాకు గౌరవం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. జంపా కూడా ప్రధాన బౌలరే అనే విషయాన్ని కోహ్లి మరిచాడు. నిజంగా జంపాను సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఆలోచనే ఉంటే కోహ్లి అలా బ్యాటింగ్ చేసి ఉండేవాడు. జంపా బౌలింగ్ వేసే సమయంలో కోహ్లి కాస్త నిర్లక్ష్యం వహించాడు. అందుకే మూల్యం చెల్లించుకున్నాడు’ అని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. -
'భారత్‌తో పోరు ఎప్పటికి రసవత్తరమే'
సిడ్నీ : 2020 ఏడాది చివర్లో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' భారత్, ఆస్ట్రేలియాలు ఆడే ఏ సిరీస్ అయిన ఆసక్తికరంగానే ఉంటుంది. ఇది ఒక సంప్రదాయంలా మారింది. ఇంకా 12 నెలలు టైం ఉన్నా ఇప్పుడే నాకు సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందనడంలో సందేహం లేదు. నేను ఆస్ట్రేలియాతో జరగనున్న గులాబి టెస్టుకోసం ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మా దేశంలో ఏ జట్టుకైనా డే- నైట్ టెస్టు ఆడడమంటే సవాల్ కిందే లెక్క. అయితే ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లను పరిశీలిస్తే మంచి రసవత్తర పోరు ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే భారత్‌తో సిరీస్ చిరకాలం గుర్తుండిపోనుంది. రెండు జట్లు ప్రస్తుతం కఠినమైన క్రికెట్ ఆడుతున్నాయి. స్మిత్, వార్నర్ బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత మా జట్టు వేగంగా ఫుంజుకుంది. అది ఎంతలా అంటే లబుషేన్ లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టుకు దొరికారు. ఆస్ట్రేలియా జట్టు 2019లో భారత్‌ను వారి సొంతగడ్డపైనే వన్డే, టీ20 సిరీస్‌లలో ఓడించి మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకోవడం అంత సులభం కాదు. భారత్‌కు వాటిని సాధించే స్వామర్థ్యం ఉంది. ఎలాంటి టోర్నీలైనా భారత్‌తో మా పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. టెస్టు చాంపియన్‌షిప్ టోర్నీ నుంచి నాలుగురోజుల టెస్టు మ్యాచ్‌లను ప్రవేశపెట్టనున్న ఐసీసీతో నేను విబేదిస్తున్నా. ఎందుకంటే నా దృష్టిలో ఐదు రోజుల మ్యాచ్‌లే గొప్పవిగా కనిపిస్తాయి. మనం ఐదు రోజుల టెస్టుల్లోనే ఎన్నో ఉత్కంఠబరితమైన మ్యాచుల్ని చూశాం. ఐసీసీ దానిని అలాగే వదిలేస్తే బాగుంటుదనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఐసీసీ దానిని ఎందుకు మార్చాలనుకుంటుందో అర్థం కావడం లేదని' స్టీవ్ వా పేర్కొన్నాడు. -
హార్దిక్‌ను ఏకంగా అతడితో పోల్చిన స్టీవ్ వా
లండన్ : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆటకు తాను మంత్ర ముగ్దుడిని అయ్యానని కొనియాడాడు. అంతేకాకుండా ఏకంగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ లాన్స్ క్లుసెనర్తో హార్దిక్‌ను పోల్చాడు. బలమైన ఆసీస్ బౌలింగ్‌లో కేవలం 27 బంతుల్లోనే 48 పరుగులు రాబట్టి టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి ఈ ఆల్‌రౌండర్ సహకరించాడని పేర్కొన్నాడు. ‘ఈ టోర్నీలో హార్దిక్ ఆటను చూస్తుంటే 1999 ప్రపంచకప్‌లో సఫారీ ఆల్‌రౌండర్ క్లుసెనర్ గుర్తుకొస్తున్నాడు. టీ20లు లేనిసమయంలోనే ధాటిగా ఆడేవాడు. ఎదుర్కొనే తొలి బంతి నుంచి చివరి బంతి వరకు హిట్టింగ్ చేయాలనే ఆడతారు ఇద్దరూ. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి జట్టు సారథి ఆత్మరక్షణలో పడతాడు. ప్రస్తుతం హార్దిక్ టైం నడుస్తోంది. ఇక టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక ఆటగాళ్లు రాణించారు. అది టీమిండియాకు శుభపరిణామం. కోహ్లి, ధోనిల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆసీస్ నిరుత్సాహపరిచింది.. టీమిండియాపై ఆసీస్ ఆటగాళ్లు ఆడిన తీరు నిరుత్సాహపరిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చాలా పొరపాట్లు చేశారు. వార్నర్, స్మిత్‌లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేస్తే బెటర్’అంటూ స్టీవ్ వా పేర్కొన్నాడు. ఇక 1999 ప్రపంచకప్‌లో క్లుసెనర్ 122.17 స్ట్రైక్‌రేట్‌తో 281 పరుగులు చేసి సఫారీ విజయాలలో కీలకపాత్ర పోషించాడని, టీ20లు లేని కాలంలోనే అంత స్ట్రైక్ రేట్ మెయింటేన్ చేయడం మామూలు విషయం కాదని స్టీవ్‌వా చెప్పుకొచ్చాడు. -
‘వారికి ఎంత పెద్ద మైదానాలైనా సరిపోవు’
నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో పోరుకు ముందు ఆస్ట్రేలియాను ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా హెచ్చరించాడు. విధ్వంసకర కరీబియన్ జట్టుతో ముప్పు పొంచి ఉందని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో స్టీవ్ వా ముందుగానే ఆసీస్‌ను జాగ్రత్తపడమని పేర్కొన్నాడు. ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేసిన అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు. ‘కంగారూలకు వెస్టిండీస్ అసలు సిసలు పరీక్ష పెట్టగలదు. ఆ జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లే. చక్కని బౌలింగ్ విభాగం ఉంది. కరీబియన్ జట్టును జాగ్రత్తగా గమనించాలి. ఎంతటి దుర్భేద్యమైన బౌలింగ్‌నైనా వారు తుత్తునియలు చేయగలరు. మ్యాచ్‌లు మలుపుతిప్పగలరు. వారి బ్యాటింగ్ విభాగం పుంజుకుంటే ఎంత పెద్ద మైదానాలైనా సరిపోవు. అమాంతం విరుచుకు పడగలరు. చాలా ఏళ్ల తర్వాత విండీస్ పేస్ విభాగంలో బలం కనిపిస్తోంది. టోర్నీలో ఏ జట్టైనా వారితో ఆడాలంటే భయపడుతోంది. అందుకే వారితో నాకౌట్ మ్యాచ్‌లో తలపడడం నాకిష్టం లేదు. కరీబియన్లు టోర్నీలో త్వరగా జోరందుకుంటే సులభంగా ట్రోఫీ గెలవగలరు’ అని స్టీవ్ వా అన్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో పాక్‌ను వెస్టిండీస్ చిత్తుగా ఓడించి మంచి జోష్ మీద ఉండగా, అఫ్గానిస్తాన్‌పై ఆసీస్ విజయం సాధించి శుభారంభం చేసింది. -
క్యాచ్ మిస్.. మ్యాచ్ పోయింది.. కప్పు పోయింది..
-
క్యాచ్ మిస్.. వరల్డ్‌కప్ గోవిందా..!
క్రికెట్ వరల్డ్‌కప్ సాధించాలన్న దక్షిణాఫ్రికా కల నేటికి కలగానే మిగిలిపోయింది. నిర్ణయాక మ్యాచుల్లో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటు. అయితే, 1999 వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో నిలిచిన ఆ జట్టును ఓ మిస్‌ఫీల్డ్ కొంపముంచింది. చెత్త ఫీల్డింగ్‌తో హర్షలే గిబ్స్ తన జట్టుకు తీరని వ్యథ మిగిల్చాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌వా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను జారవిడిచి అటు మ్యాచ్‌ను, ఇటు ప్రపంచప్ గెలుచుకునే సువర్ణ అవకాశాన్ని దూరం చేశాడు. ఒకవేళ ‘అత్యంత చెత్త క్యాచ్ మిస్’ అవార్డు ఏదైనా ఉంటే అది.. గిబ్స్కే ఇవ్వాల్సి ఉంటుందని నాటి చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాళ్లు. మ్యాచ్ పోయింది.. కప్పు పోయింది.. 1999 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అంచనాలకు తగినట్లే ఆడింది. సూపర్ సిక్స్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఇక దక్షిణాఫ్రికా పేస్ దళం అలెన్ డోనాల్డ్, షాన్ పొలాక్, స్టీవ్ ఎల్వర్థి, లాన్స్ క్లుజెనర్ ఆసీస్‌కు చెమటలు పట్టించారు. 12 ఓవర్లలో 48 పరుగులు చేసిన ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. క్రీజులో పాంటింగ్, స్టీవ్ వా ఆచితూచి ఆడుతున్నారు. ఒక్కో పరుగు జోడిస్తూ తమ జట్టుని విజయం వైపు తీసుకెళ్తున్నారు. ధాటిగా ఆడుతున్న స్టీవ్‌వా ప్రమాదకరంగా మారాడు. ఆసీస్ స్కోరు 30 ఓవర్లలో మూడు వికెట్లకు 149. ఈ జోడీని విడగొడితే దక్షిణాఫ్రికా గెలుపునకు దగ్గరైనట్లే. అయితే, మరుసటి ఓవర్లోనే ఆ జట్టుకు భారీ షాక్. 31 ఓవర్ చివరి బంతికి స్టీవ్‌వా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను హర్షలే గిబ్స్ జారవిడిచాడు. క్యాచ్ పట్టిన ఆనందంలో బంతిని పైకి ఎగరేద్దామనుకున్నాడు. పూర్తిగా ఒడిసిపట్టక మునుపే బంతిని గాల్లోకి ఎగరేసేందుకు యత్నించాడు. ఆ క్రమంలో బంతి చేజారింది. క్యాచ్ మిస్. మ్యాచ్ గోవిందా..! దొరికిన అవకాశాన్ని వినియోగించుకున్న స్టీవ్‌వా మిగతా బ్యాట్స్‌మెన్‌తో కలసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రెండు బంతులు మిగిలుండగానే 5వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక సెమీఫైనల్స్‌లో ఆసీస్‌తో మరోసారి తలపడిన దక్షిణాఫ్రికా మళ్లీ పరాజయం పాలైంది. సూపర్‌సిక్స్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్ మరోసారి దెబ్బకొట్టింది. టైగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చివరి బంతికి విజయం సాధించింది. ఫైనల్ చేరి పాకిస్తాన్‌ను సునాయాసంగా ఓడించి రెండోసారి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. సూపర్‌సిక్స్‌లో గెలవకపోయుంటే ఆసీస్ ఇంటిదారిపట్టేది. మిగతా జట్లతో పోల్చుకుంటే ఎంతో బలంగా ఉన్న సౌతాఫ్రికా కప్పును ముద్దాడేది. ఇక దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకపోవడం గమనార్హం. -
‘మమ్మల్ని ఓడించడం కోహ్లి సేనకు కష్టమే’
సిడ్నీ: తమ దేశ పర్యటనలో టీమిండియాకు అసలు సిసలు సవాల్ ఎదురుకాబోతుందని అంటున్నాడు ఆసీస్ మాజీ సారథి స్టీవ్ వా. ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా తమ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉన్న కారణంగా కోహ్లి సేనకు కఠిన పరీక్ష తప్పదన్ని పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించడమంటే సులభం కాదు. మా జట్టులో కొందరు ప్రధాన ఆటగాళ్లు దూరమైనప్పటికీ, ప్రస్తుత ప్రపంచ జట్లలో పోలిస్తే మా బౌలింగే అత్యంత బలంగా ఉందనేది వాస్తవం. మా పిచ్‌లు మా బౌలర్లకు కొట్టొచ్చిన పిండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు సాధించగల సామర్థ్యం మా బౌలర్ల సొంతం. ఒకవేళ మేము తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేస్తే చాలు.. మాపై గెలవడం కష్టంతో కూడుకున్న పని. ఈ ద్వైపాక్షిక సిరీస్ హోరీహోరీగా సాగినప్పటికీ మాదే పైచేయి అవుతుందని అనుకుంటున్నా’ అని స్టీవ్ తెలిపాడు. ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై స్టీవ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి ఒక అసాధారణ ఆటగాడిగా అభివర్ణించిన స్టీవ్ వా.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా తరహా ఆటగాడు కోహ్లి అని పేర్కొన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌కు రాబోయే భారత జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కోహ్లినే అత్యంత ప్రమాదకర ఆటగాడన్నాడు. మరొకవైపు గత 15 ఏళ్లలో తాను చూసిన అత్యుత్తమ భారత జట్టు ఇదేనన్న కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలతో మాత్రం వా ఏకీభవించలేదు. ఇదే అత్యుత్తమ భారత జట్టు అని తాను కచ్చితంగా చెప్పలేనన్నాడు. ఇక్కడ చదవండి: ఆసీస్-టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. -
అందుకే ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారు: స్టీవ్ వా
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్లో తరచు బాల్ ట్యాంపరింగ్ ఉదంతాలు వెలుగు చూడటానికి ఐసీసీ రూల్సే కారణమని అంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా. ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తారనే భయం లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో టెస్టులో ఆసీస్ క్రికెటర్లు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారన్నాడు. ఏదైనా తప్పు చేసినపుడు దానికి తగినట్లు శిక్షలుండాలి. లేకపోతే అది ఇలాగే చేయి దాటిపోతుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు వాస్తవంలో జీవించడం లేదన్నది నిజం. ఏం చేసినా కూడా కాపాడడానికి తమ చుట్టూ కొంతమంది ఉన్నారనే ధైర్యంతో వాళ్లున్నారు. స్టీవ్ స్మిత్ ఇంకా యువకుడే కాబట్టి తిరిగి క్రికెట్ ఆడగలడు. అయితే అతని చుట్టూ ఉన్న ప్రజలు బాల్ టాంపరింగ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఆ సవాలును ఎదుర్కోవడం అతనికి పెద్ద పరీక్ష. గతంలో మైదానంలో ఆటగాళ్లు గరుకు ప్రాంతంలో బంతిని కిందేసి కొట్టేవాళ్లు. అది తప్పని తెలిసినా కూడా ఆటగాళ్లు అలా చేశారు. అక్కడి నుంచే ఇదంతా మొదలైంది. గతంలో బంతిని ట్యాంపరింగ్ చేసిన కెప్టెన్లపై ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారు. అందుకే ట్యాంపరింగ్ అనేది చాలా మందికి అలవాటుగా మారిపోయింది’ అని స్టీవ్ వా విమర్శించాడు. -
నాకు భారీ మొత్తంలో లంచం ఆఫర్ చేశాడు: వార్న్
లండన్: ఇటీవల ఆసీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్వార్థపరడంటూ తన ఆత్మకథ ‘నో స్పిన్’లో పేర్కొన్న షేన్ వార్న్.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తన క్రికెట్ కెరీర్లో ప్రత్యర్థి జట్టు క్రికెటర్ ఒకరు భారీ మొత్తం లంచం ఇవ్వడానికి యత్నించిన విషయాన్ని వార్న్ వెల్లడించాడు. ప్రధానంగా క్రికెటర్లతో ఉన్న రిలేషన్‌షిప్స్‌తో పాటు తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు గురించి పేర్కొన్న వార్న్.. 1994-95 సీజన్లో పాకిస్తాన్‌తో కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సలీం మాలిక్ లంచాన్ని ఆఫర్ చేసినట్లు తెలిపాడు. తాను ఆఫ్ స్టంప్ బంతులు వేయాలని కోరిన మాలిక్, అందుకు దాదాపు రెండు లక్షల యూఎస్ డాలర్లను ఇవ్వబోయాడన్నాడు. మరొక సందర్భంలో ఒక బుకీ కూడా తనను కొనుగోలు చేయడానికి యత్నించాడన్నాడు. అతను శ్రీలంకకు చెందిన బుకీగా వార్న్ పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఐదువేల డాలర్లను తాను పొగొట్టుకున్నానని, దాన్ని సహచర క్రికెటర్ మార్క్ వా ఇవ్వబోతే వద్దనన్నాడు. ఇదిలా ఉంచితే, తన వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వార్న్ వివరించాడు. ‘ నా వైవాహిక జీవితం గురించి చెప్పుకోవాలంటే సిమోన్‌తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం ఒకటైతే, అటు తర్వాత ఎలిజిబెత్ హర్లీతో తెగతెంపులు. ఈ రెండే నా వివాహ జీవితంలో చవిచూసిన చేదు జ్ఞాపకాలు. వారితో విడిపోయినప్పటికీ ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నాం’ అని వార్న్ పేర్కొన్నాడు. చదవండి: స్టీవ్ వా స్వార్థపరుడు -
స్టీవ్ వా స్వార్థపరుడు
లండన్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాపై అతని మాజీ సహచరుడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. స్టీవ్ స్వార్థపరుడని వార్న్ తన ఆత్మకథ ‘నో స్పిన్’లో పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో అప్పటి తన కెప్టెన్‌తో ఎదురైన చేదు అనుభవాలను వార్న్ వివరించాడు. తనను అవమానకరంగా తప్పించేందుకు స్టీవ్ ప్రయత్నించాడని అందులో పేర్కొన్నాడు. 1999లో స్టీవ్ వా తనను తప్పించేందుకే నిర్ణయించుకున్నాడని చెప్పాడు. ‘వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం ఫామ్ సాకుతో నన్ను తప్పిస్తున్నట్లు వా చెప్పాడు. అప్పుడు నేను వైస్ కెప్టెన్‌ను. నా బౌలింగ్ కాస్త సాధారణంగా ఉంది. ఇదే అదనుగా కెప్టెన్ స్టీవ్ వా సెలక్షన్ మీటింగ్‌లో నన్ను తప్పించాల్సిందేనని పట్టుబట్టాడు. కోచ్ జెఫ్ మార్‡్ష, సెలక్టర్ అలెన్ బోర్డర్ వారించినా వినిపించుకోలేదు’ అని వార్న్ ఆ అనుభవాన్ని వివరించాడు. తన మెరుగైన ప్రదర్శనపై ఒక్కోసారి స్టీవ్ అసూయ చెందేవాడని ఈ ఆత్మకథలో పేర్కొన్నాడు. నాటి సహచరులు లాంగర్, హెడెన్, గిల్‌క్రిస్ట్‌లు కూడా తనను ఇరికించే ప్రయత్నం చేశారని వార్న్ తన పుస్తకంలో రాశాడు. ఆసీస్ క్రికెటర్లకు బ్యాగీ గ్రీన్ (టీమ్ క్యాప్) పెద్ద గౌరవం. వింబుల్డన్ మ్యాచ్‌కు నేను దానిని ధరించి వెళ్లేలా వారు ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. అదే చేస్తే బ్యాగీ గ్రీన్‌ను అవమానించినట్లుగా మళ్లీ నాపై దుష్ప్రచారం చేసేలా అది వారికి ఉపయోగపడేది’ అని వార్న్ చెప్పాడు. స్టీవ్‌వా సారథ్యంలో ఆడిన 38 టెస్టుల్లో 26.57 సగటుతో 175 వికెట్లు తీసిన వార్న్... 1999 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
'మా సత్తా ఏమిటో అక్కడ తెలుస్తుంది'
మోంటేకార్లో (మొనాకో): స్వదేశంలో మంచి రికార్డు ఉన్న తమ జట్టు అసలు సత్తా ఏమిటో దక్షిణాఫ్రికా పర్యటనలో తేలనుందని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా పేర్కొన్నాడు. ప్రస్తుత ఆసీస్ జట్టు విదేశాల్లో నిరూపించుకోవడానికి సఫారీ పర్యటన ఒక అవకాశమన్నాడు. మేమే ఎలా ఉన్నమనేది దక్షిణాఫ్రికాలో తేలిపోతుందన్నాడు. 2018 లారెస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్టీవ్ వా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా పర్యటన అనేది కచ్చితంగా ఆసీస్‌కు ఒక పరీక్షలాంటిదేనన్నాడు. స్వదేశంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తాచాటే స్మిత్ సేనకు సఫారీలతో సిరీస్‌లో సవాల్ తప్పదన్నాడు. ఒకవేళ ఇక్కడ రాణిస్తే మాత్రం మిగతా విదేశీ పర్యటనల కూడా ఆసీస్‌కు సానుకూలంగా ఉంటాయని స్టీవ్ వా విశ్లేషించాడు. ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్‌లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ల్లో ఒక్క అపజయం కూడా లేకుండా టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ సాధించిన తర్వాత ఆసీస్‌కు ఇదే తొలి పర్యటన. -
వరుస పెట్టి నో బాల్ ఇస్తు మురళీని అవమానించారు
-
'మైదానంలో మురళీని అవమానించారు'
మెల్బోర్న్: టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్. శ్రీలంకకు చెందిన మురళీ తన టెస్టు కెరీర్లో 800 వికెట్లు సాధించి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మురళీ కెరీర్‌ను చాలాకాలం వెంటాడి నిద్రలేకుండా చేసింది మాత్రం అతని బౌలింగ్ యాక్షన్. ఎంతలా అంటే మురళీ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని బౌలింగ్ మాత్రమే చర్చ నడిచేంతగా. ఒకానొక సందర్బంలో మురళీ మోచేతి(ఎల్బో)ని వంచే క్రమంలో అది నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ అతని బౌలింగ్‌ను నిషేధించిన పని చేశాడు అంపైర్ హెయిర్. ఆస్ట్రేలియాతో ఎంసీజేలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మురళీ బౌలింగ్‌ను తప్పుబడుతూ వరుస పెట్టి నో బాల్ ఇచ్చాడు. దాంతో మురళీ కెరీర్ అయోమయంలో పడింది. కాగా, లంక కెప్టెన్ అర్జున రణతుంగతో పాటు పలువురు వ్యాఖ్యాతలు సైతం మురళీ అండగా నిలవడంతో అతని బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకునే అవకాశం దొరికింది. దానిలో భాగంగా ఐసీసీ నుంచి బౌలింగ్‌లో క్లీన్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఆపై అత్యధిక టెస్టు వికెట్లను తన పేరిట లిఖించుకున్న క్రికెటర్ మురళీ. కాగా, తాజాగా మురళీ బౌలింగ్ యాక్షన్‌పై తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా స్పందించాడు. 'మురళీ బౌలింగ్ కు శిలువ వేసేంత పని చేశారు. అతన్ని మైదానంలో చాలా దారుణంగా అవమానించారు. నా వరకూ అయితే ఒక ఆటగాడికి దక్కే గౌరవం మురళీకి దక్కలేదు. టెస్టు మ్యాచ్‌కు ముందు ఎప్పుడూ మురళీ గురించే చర్చ. మురళీ బౌలింగ్ చేసేటప్పుడు మోచేతిలో వంపు రావడానికి కారణం అతని శారీరక స్థితే. అతను అలా పుట్టాడు కాబట్టే బౌలింగ్ యాక్షన్ అలా ఉండేది. మురళీ శైలిలో వేరేవారు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ మురళీ కావాలని బౌలింగ్‌ను అలా చేస్తే చాలా మంది అతన్ని కాపీ కొట్టేవారు కాదా. ఆ బౌలింగ్ యాక్షన్‌ను ఇప్పటివరకూ ఎవరూ అనుకరించలేదంటే మురళీ బౌలింగ్ విభిన్నమైదని లెక్క. నా దృష్టిలో మురళీ బౌలింగ్ కచ్చితంగా ప్రత్యేకమైనదే' అని స్టీవ్ తెలిపాడు. -
ప్రత్యర్థి హేళన.. ద్రావిడ్ సమాధానం ఎలాగంటే...
సాక్షి, స్పోర్ట్స్ : అది 2001 ఈడెన్ గార్డెన్ మైదానం. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. భారత్ కేవలం 171 రన్స్‌కే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. ఆటగాళ్ల పేలమైన ఫామ్.. పైగా 274 పరుగులతో వెనుకబడి ఉంది. మ్యాచ్ పోయినట్లేనని అంతా నిరుత్సాహాంలో ఉన్నారు. కానీ, లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్.. ఆపై బంతితో హర్భజన్ సింగ్ చేసిన మ్యాజిక్ భారత్ ను విజయతీరాలకు చేర్చింది. అనూహ్యమైన ఆ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతంగా క్రికెట్ పండితులు అభివర్ణిస్తుంటారు. ఇక మ్యాచ్‌లో ద్రావిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటగాళ్లంతా పెవిలియన్ కు క్యూ కట్టిన క్రమంలో ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ద్రావిడ్ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో మరీ దారుణమైన ప్రదర్శన ఆయన ఇచ్చారు. అందుకే ఆయన్ని ఆరోస్థానంలో బరిలోకి పంపారు. అప్పుడు ఆసీస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ వా స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఏం ద్రావిడ్.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానం.. తర్వాత ఏంటి? 12వ స్థానమా? అంటూ హేళన చేశాడు. కానీ, ద్రావిడ్ మాత్రం అవేం పట్టనట్లు క్రీజులోకి వెళ్లిపోయాడు. లక్ష్మణ్ కు జత కలిసిన ద్రావిడ్.. ఆట స్వరూపమే మారిపోయింది. బౌలర్లు ఎందరు మారుతున్నా... చెమట చిందించినా లాభం లేకపోయింది. ద్రావిడ్-లక్ష్మణ్ ద్వయం చితకబాదుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఇద్దరూ ఓ ఆటాడేసుకున్నారు. వీరోచిత బ్యాటింగ్ కారణంగా 376 పరుగుల భాగస్వామ్యంతో భారత్ 657 పరుగులు చేసింది. ఆపై భజ్జీ మాయాజాలంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలటంతో 171 పరుగుల చరిత్రాత్మక విజయం సాధించింది. తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్రావిడ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ సమయంలో నా ఫామ్ నిజంగా బాగోలేదు. మైదానంలోకి వెళ్లేముందు వా మాటలు నా చెవిని తాకాయి. కానీ, నా దృష్టిని మరలించలేకపోయాయి. అప్పుడు నేను ఆలోచించింది ఒక్కటే. గతం, భవిష్యత్ రెండూ ఇప్పుడు నా చేతుల్లో లేవు. ప్రస్తుతం నా ముందు ఉన్నది ఒక్కటే. వీలైనన్నీ బంతిని ఎదుర్కోవటం... పరుగులు సాధించటం. ఈ క్రమంలో లక్ష్మణ్ తో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నా. జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చూడాలి తప్ప.. వెనకడుగు వేసేందుకు యత్నించకూడదు. ’’ అని ద్రావిడ్ సభికులను ఉద్దేశించి పేర్కొన్నారు. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ (281) చిరస్మరణీయ ఇన్నింగ్స్ గడచిన అర్ధ శతాబ్దపు అత్యుత్తమ ప్రదర్శనగా గౌరవం కూడా అందుకుంది. -
స్టీవ్ ‘వా’రసుడొచ్చాడు
సిడ్నీ: ఆస్ట్రేలియా విఖ్యాత క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా వారసుడు క్రికెట్లోకి వచ్చాడు. ఈ దిగ్గజ కెప్టెన్ కుమారుడైన ఆస్టిన్ వా శుక్రవారం ప్రకటించిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల ఆస్టిన్ వా దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్‌వేల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్లుగా అతను అండర్–17 స్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అతను జాతీయ అండర్–17 టోర్నీలో న్యూ సౌత్‌వేల్స్ తరఫున అత్యధిక పరుగులు (372 పరుగులు) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జూనియర్ ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టును ఎంపిక చేశారు. వచ్చే నెల న్యూజిలాండ్‌లో అండర్–19 ప్రపంచకప్ జరగనుంది. భారత సంతతికి చెందిన ఓపెనర్ 18 ఏళ్ల జాసన్ సంగ సారథ్యం వహించే ఈ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ కుమారుడు విల్ సదర్లాండ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ జట్టుకు మాజీ పేసర్ రియాన్ హారిస్ కోచ్. ఈ జూనియర్ మెగా ఈవెంట్లో గ్రూప్ ‘బి’లో ఉన్న ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో భారత్ (జనవరి 14న)తో తలపడుతుంది. జట్టు: జాసన్ సంగ (కెప్టెన్), విల్ సదర్లాండ్ (వైస్ కెప్టెన్), జేవియర్, బ్రియాంట్, ఎడ్వర్డ్స్, ఇవాన్స్, ఫ్రీమాన్, హ్యాడ్లీ, బాక్స్టెర్, నాథన్, జొనాథన్ మెర్లో, రాల్స్టన్, ఉప్పల్, ఆస్టిన్ వా, లాయిడ్ పోప్. -
స్మిత్.. కెమెరాలు కనిపెడతాయి జాగ్రత్త!
సిడ్నీ: త్వరలో స్వదేశంలో ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా పలు సూచనలు చేశాడు. ప్రధానంగా ఆ సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తన శారీరక భాషలో కానీ, మాటల ద్వారా కానీ స్టీవ్ స్మిత్ ఏమాత్రం సహనాన్నికోల్పోకుండా హుందాగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ' యాషెస్ ఎప్పుడూ ప్రతిష్టాత్మకమే. ఇదొక హై ఓల్టేజ్ సిరీస్. యాషెస్ సిరీస్ లో ఆసీస్ ఆటగాళ్లు వారి వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ స్మిత్ తన ఎమోషన్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కెమెరాలు నిన్నే కనిపెడతాయి. ఒక ఆసీస్ కెప్టెన్ గా నువ్వు ఫీల్డ్ లో ఎలా ఉంటున్నావన్నది కెమెరాలు వాచ్ చేస్తూనే ఉంటాయి. మనల్ని మనం తక్కువ చేసుకునే అవకాశం కెమెరాలకు దయచేసి ఇవ్వొద్దు. నీ ప్రతీ కదిలిక బిగ్ స్క్రీన్ పై రిప్లేలో ఐదు నిమిషాలు పాటు జట్టు మొత్తం చూస్తుంది. అటు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ జాగ్రత్తగా ఉండు. ప్రధానంగా ఫీల్డర్లు క్యాచ్ లు జారవిడిచినప్పుడు కానీ, బౌలర్లు బాగా బౌలింగ్ చేయలేనప్పుడు కానీ ఎక్కువ ఎమోషన్ కావొద్దు. ఫీల్డ్ లో నిన్ను నీవు అంచనా వేసుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమం. ఇదే నీకు నేనిచ్చే సలహా' అని స్టీవ్ వా పేర్కొన్నాడు. వచ్చే నెల 23 వ తేదీ నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ ఆరంభం కానుంది. -
అతను లేకుండా గెలవలేరు: స్టీవ్ వా
సిడ్నీ:వచ్చే నెలలో జరిగే యాషెస్ సిరీస్ కు సంబంధించి ఆస్ట్రేలియా అప్పుడే మాటల యుద్ధం మొదలు పెట్టేసింది. తమ మాటల ద్వారానే ప్రత్యర్థినే సాధ్యమైనంత వరకూ వెనక్కునెట్టేసే ఆసీస్.. ప్రతిష్టాత్మక యాషెస్ లో తలపడే ఇంగ్లండ్ పై సరికొత్త స్లెడ్జింగ్ కు తెరలేపింది. ప్రధానంగా యాషెస్ కు వెళ్లే ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఎంపిక చేయకపోవడాన్ని ఆసీస్ మాజీలు ప్రత్యేక టార్గెట్ గా పెట్టుకున్నారు. స్టోక్స్ లేకపోతే యాషెస్ గెలవలేరంటూ ఇటీవల ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ అభిప్రాయపడగా.. తాజాగా అతని సరసన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా చేరిపోయాడు. 'స్టోక్స్ లేకుండా యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ గెలవలేదు. అతను యాషెస్ లో లేకపోతే ఇంగ్లండ్ ఆ సిరీస్ గెలిచే ప్రసక్తే ఉండదు. ఆ సమయానికి స్టోక్స్ వస్తాడనే నేను అనుకుంటున్నా. ఏదో రకంగా స్టోక్స్ ను ఆసీస్ కు పంపడానికి ఇంగ్లండ్ సెలక్టర్లు కృషి చేస్తారు. ఎందుకంటే అతనొక అత్యుత్తమ ఆటగాడు కాబట్టి. ఒకవేళ యాషెస్ కు చివరి నిమిషంలో స్టోక్స్ కనుక పంపిస్తే అంతకంటే అవమానం ఒకటి ఉండదు'అని స్టీవ్ వా పేర్కొన్నాడు. స్టోక్స్ ను వేధించండి : మిచెల్ స్టార్క్ -
వారె‘వా’ స్టీవ్...
► అనాథ ఆఖరి కోరిక నెరవేర్చిన ఆసీస్ మాజీ కెప్టెన్ ► అస్థికలు గంగా నదిలో నిమజ్జనం వారణాసి: ఆటగాడిగా మైదానంలో దూకుడుకు మారుపేరుగా నిలిచిన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా అనేక సంవత్సరాలుగా కోల్‌కతాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వంలో కూడా చాలా ముందున్నానంటూ నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి తనలోని మంచి మనిషిని బయట పెట్టారు. వ్యక్తిగతంగా ఎలాంటి బంధం, సంబంధం లేకపోయినా తన దేశానికి చెందిన ఒక అనాథ ఆఖరి కోరికను నెరవేర్చారు. ఇటీవలే మరణించిన సిడ్నీకి చెందిన 58 ఏళ్ల షూ షైనర్ (బూట్ పాలిష్ చేసే వ్యక్తి) బ్రియాన్ రుడ్ అస్థికలను అతని కోరిక ప్రకారం స్టీవ్‌వా స్వయంగా గంగానదిలో నిమజ్జనం చేశారు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ భారత్‌లోనే ఉన్న స్టీవ్ అస్థికల నిమజ్జనం కోసం వారణాసికి వెళ్లడం విశేషం. సహచర ఆస్ట్రేలియన్ కోసం తాను చేసిన పని చాలా సంతృప్తినిచ్చినట్లు స్టీవ్ వా వ్యాఖ్యానించారు. ‘బ్రియాన్ అస్థికలు ఇక్కడి నీటిలో కలపడం గౌరవంగా భావిస్తున్నా. అతని జీవితం చాలా కఠినంగా గడిచింది. అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. గంగా నదిలో తన అస్థికలు నిమజ్జనం చేయాలనేది అతని చివరి కోరిక. దానిని నెరవేర్చడం సంతృప్తిగా ఉంది’ అని వా వ్యాఖ్యానించారు. అందరికీ అభిమానం: రోడ్డు పక్కన బూట్ పాలిష్ చేసుకునే వ్యక్తి అంటే సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ బ్రియాన్ రుడ్ చనిపోయిన రోజు ఆస్ట్రేలియా మీడియా మొత్తం దానిని ప్రముఖ వార్తగా ప్రచురించింది. సిడ్నీలో అతను ఉదయం ఒక చోట, సాయంత్రం మరో చోట పాలిష్ చేస్తుంటాడు. మూడు నెలల వయసులో తల్లిదండ్రులకు దూరమైన అతను ఏడేళ్ల వరకు అనాథాశ్రమంలో పెరిగాడు. కొన్నేళ్ల పాటు చిన్నాచితక పనులతో కాలం గడిపిన అతను ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. చివరకు ఒక ఫాదర్ చేరదీయడంతో బతికిపోయి షూ పాలిష్‌నే వృత్తిగా మార్చుకున్నాడు. పనితో పాటు తన మాట, పాటలతో ఆకట్టుకునే అతనంటే సిడ్నీ నగరవాసులందరికీ అభిమానం. అయితే తన పనితో తప్ప ఎప్పుడూ కూడా అయాచితంగా డబ్బులు తీసుకునేందుకు అంగీకరించలేదు. తన చివరి కోరిక కూడా అతను ఆ ఫాదర్‌కే చెప్పాడు. అయితే దానిని ఎలా నెరవేర్చాలోనని ఆయన సంశయ పడుతున్న దశలో స్టీవ్ వాకి ఈ విషయం తెలిసింది. తన కంపెనీ సీఈని అక్కడికి పంపించి అస్థికలను తెప్పించుకున్న స్టీవ్‌వా వాటిని భారత్‌కు తన వెంట తీసుకొచ్చారు. -
‘బౌలింగ్ బ్రాడ్‌మన్’ అశ్విన్
మొనాకో: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల జల్లు కురిపించాడు. అశ్విన్‌ను ఏకంగా బ్యాటింగ్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తూ ‘డాన్ బ్రాడ్‌మన్ ఆఫ్ బౌలింగ్’ అని కితాబిచ్చాడు. ‘బ్యాటింగ్‌లో డాన్ బ్రాడ్‌మన్ ఎలాగో బౌలింగ్‌లో అశ్విన్ అంతటివాడు. ప్రస్తుతం అతని బౌలింగ్ అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే అతని గణాంకాలు అసాధారణంగా ఉన్నాయి. అతను మరిన్ని రికార్డులను కొల్లగొడతాడు. అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కొంటేనే ఆసీస్‌కు గెలుపు అవకాశాలుంటాయి’ అని స్టీవ్‌వా అభిప్రాయపడ్డారు. మరోవైపు కోహ్లి నాయకత్వంలో భారత కుర్రాళ్లు ఏమైనా సాధించగలమనే నమ్మకంతో ముందుకు దూసుకెళుతున్నారన్న స్టీవ్ వా...గత రెండేళ్లుగా భారత్ ఆట చూస్తుంటే వారిని సొంత గడ్డపై ఓడించడం చాలా కష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గంగూలీవి ‘తెలివితక్కువ’ వ్యాఖ్యలు... కోహ్లిసేన చేతిలో ఆస్ట్రేలియా 4–0తో వైట్‌వాష్ అవుతుందన్న గంగూలీ మాటలను వా కొట్టిపారేశారు. ఆసీస్ బలమైన జట్టని ఈ సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీనిస్తుందని స్టీవ్ వా పేర్కొన్నారు. ‘గంగూలీ మాటలు ముమ్మాటికీ నిజం కావు. మా ఆటగాళ్ల గురించి మీకు ఎక్కువగా తెలియదు. ఇది మాకు మేలు చేసే అంశం. ఈ సిరీస్‌లో తొలి టెస్టును ఆసీస్ గెలిస్తే... ఇక మా జట్టును ఆపలేరు. అలా కాకుండా రెండు టెస్టులు ఓడిన తర్వాత కూడా మేము పుంజుకోగలం. మా సామర్థ్యం అలాంటిది. మా జట్టులోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సౌరవ్ వ్యాఖ్యల్లో మితిమీరిన ఆశావాదం కన్పిస్తోంది’ అని వా అన్నారు. -
ఐపీఎల్ వల్లే మా జట్టు విఫలం: స్టీవ్ వా
సిడ్నీ: టెస్ట్, వన్డే క్రికెట్ ను కొన్నేళ్లపాటు ఎలాంటి ఇబ్బందులే లేకుండా ఏలిన దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా ప్రస్తుతం తడబడుతోంది. వరుస సిరీస్ లలో ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలవడమే కాదు ఏకంగా వైట్ వైష్ అవుతుంది. ఆస్ట్రేలియా ఓట్టు ఓటమికి కారణాలపై దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా భిన్నంగా స్పందించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి పోయిందని, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కూడా ఆసీస్ వైఫల్యానికి కారణమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో ఆడటం, ఆ వెంటనే తీరికలేని సిరీస్ షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు అలసటతో పాటు ఒత్తిడికి గురువతున్నారని చెప్పాడు. రెండు నెలల కిందట లంక గడ్డపై వారి చేతిలో మూడు టెస్టుల సిరీస్ లో 3-0తో వట్ వాష్ అయింది. కొన్ని రోజుల కిందట దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ లో ఏకంగా 5-0తో దారుణ వైఫల్యాన్ని మూటకట్టుకుంది. వచ్చే ఏడాది ఆసీస్ జట్టు భారత్ లో పర్యటించనుంది. వాస్తవానికి తనతో పాటు అంతకంటే ముందు తరం క్రికెటర్లు క్లబ్ క్రికెట్ కూడా ఆడారని గుర్తుచేశాడు. ప్రస్తుత క్రికెట్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, బీజీ షెడ్యూల్స్ వల్ల ప్లేయర్లు గాయాలపాలయ్యే అవకాశాలు అధికమని స్టీవ్ వా వివరించాడు. -
'ఆ బాధ్యత సీనియర్ క్రికెటర్లదే'
మెల్బోర్న్:సాంప్రదాయ టెస్టు క్రికెట్‌ను బ్రతికించాల్సిన బాధ్యత సీనియర్ క్రికెటర్లేదేనని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్సష్టం చేశాడు. కొన్నాళ్లపాటు ట్వంటీ 20 ఫార్మెట్‌ను పక్కకు పెట్టి టెస్టు క్రికెట్‌కు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లదేనన్నాడు. 'ట్వంటీ 20 ఫార్మాట్ కు పెరుగుతున్న ఆదరణతో ఆటగాళ్లు లాభపడుతున్నారు. ఈ ఫార్మాట్లో ఆటగాళ్ల ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువగా కనబడుతున్నాయి. దాంతో టెస్టు క్రికెట్ అనేది మరుగున పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టెస్టు క్రికెట్‌కు అండగా నిలవాల్సిన అవసరం సీనియర్ ఆటగాళ్లపైనే ఉంది. ప్రతీ దేశంలో ఎవరికి వారే స్వచ్ఛందంగా టెస్టు క్రికెట్‌ను కాపాడతారని ఆశిస్తున్నా'అని స్టీవ్ వా తెలిపాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడూ టెస్టుల్లో భాగమైన బ్యాగీ గ్రీన్ క్యాప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారని, దేశం కోసం ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని వా అన్నాడు. అయితే పలుదేశాల్లో టెస్టు క్రికెట్ ఆందోళనకరంగానే ఉందన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌లో టెస్టు క్రికెట్ పరిస్థితిని వా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. టీ 20 క్రికెట్ ట్రోఫీని గెలిచిన వెస్టిండీస్.. టెస్టుల్లో మాత్రం నాణ్యమైన క్రికెట్ ఆడటంలో వెనుకబడిపోయిందన్నాడు. -
క్రికెటర్లు డబ్బుకే ప్రాముఖ్యతిస్తున్నారు..
బెర్లిన్: టి20 క్రికెట్ లీగ్‌ల రాకతో ఆటగాళ్ల దృక్పథంలో గణనీయ మార్పు కనిపిస్తోందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా తెలిపారు. ఇందులో ఎక్కువ డబ్బు కనిపిస్తుండడంతో జాతీయ జట్లకు ఆడడం కన్నా లీగ్‌ల్లో ఆడేందుకే వారు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ఆయా జట్లు తమ మూడు ఫార్మాట్లలో సమతూకాన్ని సాధించలేకపోతున్నాయని అన్నారు. అయితే భారత్, ఆసీస్, ఇంగ్లండ్ జట్లకు ఈ సమస్య పెద్దగా లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టి20 క్రికెట్‌ను అటకెక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు. టెస్టు క్రికెట్టే నంబర్‌వన్ అని స్పష్టం చేశారు. తమ దేశంలో టెస్టులకు కూడా స్టేడియాలు నిండుతాయని గుర్తుచేశారు. -
'కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తప్పవు'
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన విమర్శలపై ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందించాడు. 1999లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో వార్న్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడానికి జట్టు ప్రయోజనాలే కారణమని, కెప్టెన్‌గా తన బాధ్యతలను నిర్వర్తించానని, కఠిన నిర్ణయాలు తప్పవని ఆనాటి సంఘటనను స్టీవ్ వా వెల్లడించాడు. స్టీవ్ వా స్వార్థపరుడని, తాను ఆడిన క్రికెటర్లలో అతనే అత్యంత స్వార్థపరుడంటూ వార్న్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై స్టీవ్ వా స్పందిస్తూ.. ఓ సమాధానంతో వార్న్ వ్యాఖ్యలను ఖండించలేనని అన్నాడు. తుది జట్టు నుంచి వార్న్‌ను తొలగించాలన్నది కఠిన నిర్ణయమని, అయితే కెప్టెన్‌గా తన విధులను నిర్వర్తించానని చెప్పాడు. వార్నే కాదు ఏ ఆటగాడినయినా తొలగించాలన్నది సులభం కాదని, జట్టు ప్రయోజనాల రీత్యా తప్పదని అన్నాడు. -
మాజీ కెప్టెన్ పై తీవ్ర విమర్శలు
మెల్ బోర్న్: ప్రపంచ స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్ తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ జట్టు మాజీ క్రికెటర్ స్టీవ్ వా అత్యంత స్వార్థపరుడని విమర్శించాడు. తాను క్రికెట్ ఆడిన సమయంలో, తాను చూసిన మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అంటూ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవా వా పై విరుచుకుపడ్డాడు. అతడిని తాను ఇష్టపడకపోవటానికి ఎన్నో కారణాలున్నాయని 'ఐ యామ్ ఏ సెలబ్రిటీ' కార్యక్రమానికి హాజరైన వార్న్ వివరించాడు. 1999లో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ కు తనను స్టీవ్ దూరం చేశాడని.. ఆ సిరీస్ లో అప్పటికే ఆసీస్ వెనుకంజలో ఉంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో తనకు చోటివ్వలేదని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ సమయంలో తాను కెప్టెన్ అని కూడా చూడకుండా జట్టు నుంచి తప్పించాడని ఆరోపించాడు. భుజాలెగరేశాను: షేన్ వార్న్ 'ఆ సమయంలో తాను చాలా నిరాశచెందినప్పటికీ.. పదేళ్ల తర్వాత గర్వంగా భుజాలెగరవేశాను. ఎక్కడ మేం టెస్ట్ మ్యాచ్ గెలవాల్సి ఉన్నదో, అక్కడే ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాను. నన్ను జట్టు నుంచి తప్పించిన అంటిగ్వా టెస్టులో కొలిన్ మిల్లర్ స్థానం దక్కించుకున్నాడు. చివరికి 176 పరుగుల విజయంతో వెస్టిండీస్ తో 2-2 ఫలితంతో సిరీస్ డ్రా అయింది' అని స్పిన్నర్ వార్న్ వివరించాడు. ఏది ఏమైతేనేం స్టీవ్ వా ను వ్యతిరేకించడానికి చాలా కారణాలున్నాయంటూ స్పిన్ దిగ్గజం వార్న్ పునరుద్ఘాటించాడు. -
ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాలి
షాంఘై: యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్‌వా అన్నారు. కోహ్లీ తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనూహ్యంగా గత డిసెంబర్లో ధోని భారత టెస్టు క్రికెట్ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని స్వీకరించిన విరాట్ ఆధ్వర్యంలో ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా మరొకటి ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన స్టీవా.. 'కోహ్లీ ఇప్పటికే పరిణతి చెందాడు. అయితే ఈ ప్రపంచ కప్‌లో కొన్ని విషయాలు అతడిని కాస్తంత డిస్ట్రబ్ చేశాయి. వ్యక్తిగతం కావొచ్చు.. మరేవైనా కావొచ్చు.. అతడు కొంత అసహనంగా, చిరాకుగా, భావోద్వేగాలు ఎక్కువగా బయటపెట్టినట్లు కనిపించాడు. నాయకత్వం విషయంలో ధోని మంచి సమర్థుడు. ఎవరు ఏమన్నా అతడు పెద్దగా పట్టించుకోడు. స్పందించడు. అలాంటి ధోని తప్పకుండా కోహ్లీకి ఒక మంచి రోల్ మోడల్ కాగలడు. అందుకే ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది' అని స్టీవా చెప్పాడు. -
సచిన్ ఆధునిక బ్రాడ్‌మన్
సిడ్నీ: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత బ్రాడ్‌మన్ ఫౌండేషన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో పాటు సచిన్‌ను ఈ గౌరవంతో సత్కరించారు. బుధవారం ఇక్కడ జరిగిన ప్రత్యేక డిన్నర్ కార్యక్రమంలో బ్రాడ్‌మన్ ఫౌండేషన్... సచిన్, స్టీవ్‌వా పేర్లను ఆనర్స్ బోర్డులో చేర్చింది. ఈ సందర్భంగా ఎస్సీజీ ఎలెవన్, బ్రాడ్‌మన్ ఎలెవన్ జట్టు సభ్యులు ఇద్దరు దిగ్గజాలకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం విశేషం. పదహారేళ్ల క్రితం బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాల గురించి కూడా సచిన్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో బ్రాడ్‌మన్‌తో తమకు ఉన్న అనుబంధంపై మాట్లాడిన మాస్టర్, వా తాము కలిసి ఆడిన రోజుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా స్టీవ్‌వా ఆఖరి టెస్టులో సచిన్ 241 పరుగులు చేయడం, డీప్ స్క్వేర్ లెగ్‌లో సచిన్ పట్టిన క్యాచ్‌తో వా వీడ్కోలు పలకడంవంటివి వారు చెప్పుకున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ సమర్థంగా, క్రీడా స్ఫూర్తితో ఆడగల స్టీవ్‌వా చాంపియన్ క్రికెటర్ అని సచిన్ అభివర్ణించగా... సచిన్‌పై వా ప్రశంసలు కురిపించాడు. ‘అదో అద్భుతమైన ఇన్నింగ్స్. అతని జోరు చూస్తే కనీసం అజేయంగా 400 పరుగులు చేస్తాడని అనిపించింది. బ్రాడ్‌మన్ పేరుతో ఏ రకంగానైనా నా పేరు జత కలవడం గొప్ప గౌరవం. అదీ ఈ రోజు ఆధునిక బ్రాడ్‌మన్ సచిన్‌తో కలిసి గౌరవాన్ని అందుకోవడాన్ని మించింది ఏముంటుంది’ అని స్టీవ్‌వా వ్యాఖ్యానించాడు. -
డీఆర్ఎస్ సరైందే : స్టీవ్‌వా
కోల్‌కతా: టాస్కు ఆలస్యంగా వస్తూ ఆటను అవమానిస్తాడని సౌరవ్ గంగూలీని ఇటీవలే విమర్శించిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌వా... దాదా సొంత నగరానికి వెళ్లి అతడిపై ప్రశంసలు కురిపించారు. అతనో అద్భుతమైన క్రికెటర్ అని కొనియాడారు. ‘సౌరవ్ ఒక గొప్ప కెప్టెన్ అని ఈ కోల్‌కతాలో మీకందరికీ తెలుసు. భారత జట్టుకు అతను తెగింపును నేర్పాడు’ అని వా వ్యాఖ్యానించారు. అయితే ధోనితో పోలిక గురించి ప్రశ్నించగా, ఇద్దరూ భిన్నమైన, చక్కటి కెప్టెన్లని ఆయన చెప్పారు. త్వరలో 200వ టెస్టు ఆడబోతున్న సచిన్‌కు వా అభినందనలు తెలిపారు. అది ఇతరులకు సాధ్యం కాని గొప్ప ఘనత అని కొనియాడారు. మరో వైపు 2001 చెన్నై టెస్టులో జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం గురించి ప్రశ్నించగా...తాను గతం గురించి ఆలోచించనని స్పష్టం చేశారు. డీఆర్ఎస్ సరైందే...: వివాదాస్పదంగా మారినా...అంపైర్ సమీక్ష పద్ధతికే తన ఓటు అని స్టీవ్ వా వెల్లడించాడు. ‘ఆసీస్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చినా జట్టు వైఫల్యానికి అది కారణం కాదు. డీఆర్ఎస్ మంచి పద్ధతి అని గతంలో చాలా సార్లు చెప్పాను. అంపైరింగ్ అంత బలంగా లేదనేది వాస్తవమే అయినా ఎక్కువగా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇందులో అవకాశముంది’ అని ఈ దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు. దానిని వ్యతిరేకించేందుకు భారత్‌కు తగిన కారణమే ఉండొచ్చన్న వా...భవిష్యత్తులో ఆటగాళ్లతో పాటు మీడియా కూడా అంగీకరించే టెక్నాలజీ వచ్చే అవకాశం కూడా ఉందని జోస్యం చెప్పారు. -
సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్: స్టీవ్ వా
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు.గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిలలో ఎవరూ గొప్ప కెప్టెన్లు అని పోల్చమనగా 'ఇద్దరు మంచి కెప్టెన్లే' అని స్టీవ్ వా అన్నాడు కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉదయన్ సేవాసంస్థ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో స్టీవ్ వా మాట్లాడారు. కోల్ కతాకు 25 కిల్లో మీటర్ల దూరంలో ఉన్న బరాక్ పూర్ లోని ఉదయన్ నిర్వహణలో స్టీవ్ వా ప్రధాన నిర్వహకుడిగా సేవలందిస్తున్నారు. ఉదయన్ పిల్లలు స్టీవ్ వాను స్టీవ్ దా లేదా స్టీవ్ అంకుల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1998 లో కొల్ కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఉదయన్ కు ఆర్ధికంగా తోడ్పాటును అందిస్తున్నారు. అప్పటి నుంచి ఉదయన్ కు తన సోదరుడు మార్క్, కుటుంబంతో కలిసి ఉదయన్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు. -
సౌరవ్ గంగూలీ గ్రేట్ కెప్టెన్: స్టీవ్ వా
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టును పటిష్టం తీర్చి దిద్దడంలో గంగూలీ పాత్ర అమోఘమని స్టీవ్ వా అన్నాడు. భారత జట్టులో గంగూలీ 'గ్రేట్ కెప్టెన్' అని వ్యాఖ్యానించారు. భారత జట్టును గొప్ప జట్టుగా తీర్చిదిద్దిన ఘనత గంగూలీదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిలలో ఎవరూ గొప్ప కెప్టెన్లు అని పోల్చమనగా 'ఇద్దరు మంచి కెప్టెన్లే' అని స్టీవ్ వా అన్నాడు. అయితే ఇద్దరు కూడి విభిన్నమైన కెప్టెన్లు అని తెలిపాడు. ప్రస్తుత జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఓ అద్బుతమైన ఫలితాలు వస్తాయని అన్నాడు. ఒకవేళ 2-2 తో సిరీస్ సమానమైతే ఇరు జట్లకు కఠిన పరీక్షగా మారవచ్చు అని తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఆటుపోట్లను ఎదుర్కొంటున్న మైఖెల్ క్లార్క్ కు స్టీవ్ వా బాసటగా నిలిచాడు. ఆసీస్ జట్టులో యువకుల టాలెంట్ కు కొరత లేదని, త్వరలోనే అద్బుతమైన జట్టుగా అవతరిస్తుందని.. అందుకు కొంత సమయం పడుతుంది అని అన్నాడు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉదయన్ సేవాసంస్థ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో స్టీవ్ మాట్లాడారు. కోల్ కతాకు 25 కిల్లో మీటర్ల దూరంలో ఉన్న బరాక్ పూర్ లోని ఉదయన్ నిర్వహణలో స్టీవ్ వా ప్రధాన నిర్వహకుడిగా సేవలందిస్తున్నారు. ఉదయన్ పిల్లలు స్టీవ్ వాను స్టీవ్ దా లేదా స్టీవ్ అంకుల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1998 లో కొల్ కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఉదయన్ కు ఆర్ధికంగా తోడ్పాటును అందిస్తున్నారు. అప్పటి నుంచి ఉదయన్ కు తన సోదరుడు మార్క్, కుటుంబంతో కలిసి ఉదయన్ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు.